నేడు ఏపీఎన్జీవోల రాష్ట్ర మహా సభ | APNGOs State Maha Sabha On 21st August | Sakshi
Sakshi News home page

నేడు ఏపీఎన్జీవోల రాష్ట్ర మహా సభ

Published Mon, Aug 21 2023 4:48 AM | Last Updated on Mon, Aug 21 2023 7:40 AM

APNGOs State Maha Sabha On 21st August - Sakshi

సాక్షి, అమరావతి: విజయవాడలోని ఇందిరాగాంధీ మున్సిపల్‌ స్టేడియంలో సోమవారం జరగనున్న ఏపీఎన్జీవో అసోసియేషన్‌ (ఆంధ్రప్రదేశ్‌ నాన్‌ గెజిటెడ్‌ అధికారుల సంఘం) 21 వ రాష్ట్ర మహా సభల్లో సీఎం వైఎస్‌ జగన్‌ పాల్గొననున్నారు. మధ్యాహ్నం 12.05 గంటలకు సీఎం తాడేపల్లి నివాసం నుంచి బయల్దేరి ఇందిరాగాంధీ మున్సిపల్‌ స్టేడియంకు చేరుకుంటారు. కార్యక్రమం అనంతరం మధ్యాహ్నం తాడేపల్లి నివాసానికి చేరుకుంటారు.

మహాసభలను జయప్రదం చేయండి
ఏపీ ఎన్జీవో సంఘం రాష్ట్ర మహాసభ­లను జయప్రదం చేయాలని ఆ సంఘం రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు బండి శ్రీనివాసరావు, కేవీ శివారెడ్డి ఉద్యోగులను కోరారు. మహా సభలు జరిగే విజయవాడ ఇందిరాగాంధీ మున్సిపల్‌ స్టేడియంలో ఆదివారం ఏర్పాట్లు పరిశీలించిన అనంతరం వారు మీడియాతో మాట్లాడుతూ.. 73 సంవత్సరాలు పైబడి రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల సమస్యల సాధనే పరమావధిగా ఎన్జీవో సంఘం పనిచేస్తోందన్నారు.   

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement