Indira Gandhi Municipal Stadium
-
విజయవాడ: సెమీ క్రిస్మస్ వేడుకల్లో పాల్గొన్న సీఎం జగన్
సాక్షి, విజయవాడ: విజయవాడలోని ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో సెమీ క్రిస్మస్ వేడుకలు జరుగుతున్నాయి. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి హాజరయ్యారు. కాగా, ఏపీ ప్రభుత్వం ఆధ్వర్యంలో సెమీ క్రిస్మస్ వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. విజయవాడలో జరుగుతున్న వేడుకలకు సీఎం జగన్‌తో పాటు మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు హాజరయ్యారు. క్రిస్మస్ సందర్భంగా సీఎం జగన్ కేక్ కట్ చేశారు. ఈ సందర్భంగా సీఎం జగన్ మాట్లాడుతూ అందరికీ క్రిస్మస్ శుభాకాంక్షలు తెలిపారు. శత్రువుల పట్ల కూడా క్షమాగుణం కలిగి ఉండాలని ఏసుక్రీస్తు సందేశం ఇచ్చారు అని స్పష్టం చేశారు. అనంతరం, కొవ్వుత్తులు వెలిగించి పండుగ శుభాకాంక్షలు తెలియజేశారు. ఇక, ఇదే సమయంలో పలు రంగాల్లో విశేష కృషి చేసిన వారికి సీఎం జగన్ అవార్డులను ప్రదానం చేశారు. -
నేడు ఏపీఎన్జీవోల రాష్ట్ర మహా సభ
సాక్షి, అమరావతి: విజయవాడలోని ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో సోమవారం జరగనున్న ఏపీఎన్జీవో అసోసియేషన్ (ఆంధ్రప్రదేశ్ నాన్ గెజిటెడ్ అధికారుల సంఘం) 21 వ రాష్ట్ర మహా సభల్లో సీఎం వైఎస్ జగన్ పాల్గొననున్నారు. మధ్యాహ్నం 12.05 గంటలకు సీఎం తాడేపల్లి నివాసం నుంచి బయల్దేరి ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంకు చేరుకుంటారు. కార్యక్రమం అనంతరం మధ్యాహ్నం తాడేపల్లి నివాసానికి చేరుకుంటారు. మహాసభలను జయప్రదం చేయండి ఏపీ ఎన్జీవో సంఘం రాష్ట్ర మహాసభలను జయప్రదం చేయాలని ఆ సంఘం రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు బండి శ్రీనివాసరావు, కేవీ శివారెడ్డి ఉద్యోగులను కోరారు. మహా సభలు జరిగే విజయవాడ ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో ఆదివారం ఏర్పాట్లు పరిశీలించిన అనంతరం వారు మీడియాతో మాట్లాడుతూ.. 73 సంవత్సరాలు పైబడి రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల సమస్యల సాధనే పరమావధిగా ఎన్జీవో సంఘం పనిచేస్తోందన్నారు. -
అంటరానితనంపై యుద్ధం
అంటరానితనం అంటే ఫలానా వ్యక్తులు తాకటానికి వీల్లేదని భౌతికంగా దూరం పెట్టటం మాత్రమే కాదు.. వారికి అందాల్సిన సంక్షేమాన్ని అడ్డుకోవడం కూడా అంటరానితనమే.. అలాంటి రూపం మార్చుకున్న అంటరానితనంపై ఈ రోజు మనం యుద్ధం చేస్తున్నాం! పేదలు గెలిచేదాకా, వారి బతుకులు బాగుపడే వరకు ఇది కొనసాగుతుంది. – ముఖ్యమంత్రి వైఎస్ జగన్ సాక్షి, అమరావతి: రూపం మార్చుకున్న అంటరానితనం, పేద వర్గాలను అణచివేస్తున్న పెత్తందారీ భావజాలం ధోరణులపై ఈ నాలుగేళ్ల పాలనలో యుద్ధాన్ని ప్రకటించామని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి చెప్పారు. మంగళవారం 77వ స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా విజయవాడలోని ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో జాతీయ జెండాను ఆవిష్కరించిన సీఎం జగన్ సాయుధ దళాల గౌరవ వందనాన్ని స్వీకరించారు. మహనీయుల త్యాగనిరతి, స్వాతంత్య్ర సమర యోధుల బలి దానాలను గుర్తు చేస్తూ ప్రసంగించారు. స్వతంత్ర భారత దేశ చరిత్రలో మరే ప్రభుత్వం, రాష్ట్రం చేయని గొప్ప మార్పులు, గ్రామ స్వరాజ్యానికి అసలైన అర్ధాన్ని నాలుగేళ్లలోనే తెచ్చామని చెప్పారు. ‘76 ఏళ్ల ప్రయాణంలో మన దేశం, రాష్ట్రం ఎంతో పురోగమించాయని చెప్పేందుకు పలు ఉదాహరణలు కనిపిస్తాయి. ఆర్థిక వ్యవస్థకు మూలమైన వ్యవసాయం, పరిశ్రమలు, సేవలు లాంటి మూడు రంగాలలో ఎంతో ప్రగతి కనిపిస్తుంది. కానీ అదే సమయంలో ఈ వేగాన్ని అందుకోలేని, అందుకునే అవకాశాలు తగినంతగా లభించని కుటుంబాలు, వర్గాలు, సామాజిక వర్గాలు, ప్రాంతాలు ఈ ఏడు దశాబ్దాల ప్రయాణంలో ఇంకా వెనకబడే ఉన్నాయి’ అని పేర్కొన్నారు. సీఎం జగన్ తన ప్రసంగంలో ఇంకా ఏమన్నారంటే.. విజయవాడలో జరిగిన స్వాతంత్య్ర దినోత్సవ కార్యక్రమంలో జాతీయ జెండాకు సెల్యూట్ చేస్తున్న సీఎం వైఎస్ జగన్ రూపం మార్చుకున్న అంటరానితనం, పెత్తందారీ భావజాలం.. అంటరానితనం అంటే కేవలం భౌతికంగా దూరం పెట్టటం మాత్రమే కాదు! పేదలు ఏ బడిలో చదువుకుంటున్నారో ఆ గవర్నమెంట్ బడిని పాడు పెట్టడం! డబ్బున్న వారి పిల్లలకు ఒక మీడియం, పేదల పిల్లలకు మరో మీడియం అని వివక్ష పాటిస్తూ పేదబిడ్డలు తెలుగు మీడియంలోనే చదవాలని బరితెగించి వాదించటం కూడా అంటరానితనమే! పేదలు ఏ ఆసుపత్రుల్లో వైద్యం చేయించుకుంటున్నారో అక్కడ ఉచిత సేవలు అందకుండా చేయటం, పేదలు ఏ బస్సు ఎక్కుతున్నారో ఆ బస్సును ప్రైవేట్‌కు విక్రయించాలని చూడటం, పేదలు కోరుకునే చిన్నపాటి ఇంటి స్థలం, ఇంటిని వారికి ఇవ్వకుండా ఆత్మగౌరవాన్ని దెబ్బతీయటం, చివరికి కోర్టుల్లో రకరకాల కేసులు వేసి పేదలకు ఇళ్ల స్థలాలు, ఇళ్లు కట్టించి ఇవ్వటానికి వీల్లేదని అడ్డుకోవటం కూడా అంటరానితనమే! పౌర సేవలు ఏవి కావాలన్నా పేదలు, మధ్యతరగతి వర్గాల వారు కార్యాలయాలు, కమిటీల చుట్టూ తిరిగేలా వారి సహనాన్ని పరీక్షించటం, అవ్వాతాతలు పెన్షన్ అందుకోవాలన్నా, రైతన్నలకు ఎరువులు కావాలన్నా పొద్దున్నే లేచి పొడవాటి క్యూల్లో నిలబడి, చివరికి ఆ క్యూ లైన్లలో మనుషులు చనిపోతున్నా పాలకుల గుండెలు కరగకపోవటం... ఇవన్నీ రూపం మార్చుకున్న అంటరానితనం, పెత్తందారీ భావజాలంలో భాగాలే. స్వాతంత్య్రం వచ్చి 76 ఏళ్లు గడిచినా ఇప్పటికీ అలాగే మిగిలి ఉన్న, రూపం మార్చుకున్న అంటరానితనంపై యుద్ధం చేస్తున్న ప్రభుత్వం మనది. పేదలు గెలిచే వరకూ, వారి బతుకులు బాగుపడేవరకూ ఈ యుద్ధం కొనసాగుతుంది. అంబేడ్కర్ సాక్షిగా.. విజయవాడ నడిబొడ్డున వచ్చే నవంబర్ 26న రాజ్యాంగ ఆవిర్భావ దినోత్సవం రోజు మనం ఆవిష్కరించబోతున్న ఒక మహానుభావుడి ఆకాశమంత వ్యక్తిత్వం సాక్షిగా, మనందరికీ కర్తవ్యాన్ని గుర్తు చేస్తూ డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ చెప్పిన మాటలను మీ అందరి ముందు ఉంచుతున్నా. ‘‘భౌతికంగా ఒక మనిషికి సంకెళ్లు లేకపోయినా భావాలపరంగా స్వేచ్ఛ లేకుంటే స్వతంత్రంగా బతుకుతున్నట్లు కాదు. అతడు బానిసగా బతుకుతున్నట్టే. భావాల పరంగా అతడు ఖైదీనే’’ అని బాబా సాహెబ్ అంబేడ్కర్ చెప్పారు. ఒక మనిషి అస్తిత్వానికి మూలం, స్వేచ్ఛా స్వాతంత్య్రాలకు అర్థం ఏమిటంటే? ఆలోచనలు, భావాల పరంగా స్వాతంత్య్రం కలిగి ఉండటం. తన అభివృద్ధి, తన కుటుంబం అభివృద్ధికి అవకాశాలు ఉండటం. రాజకీయ, ఆర్థిక, సామాజిక, విద్యా స్వాతంత్య్రాలను వారు కలిగి ఉండటం. తరతరాల పెత్తందారీ సంకెళ్ల నుంచి పేదలు బయటపడి ఎదిగే వాతావరణం ఉండటం. పేద వర్గాలకు అటువంటి భావపరమైన, ఆలోచనల పరమైన స్వేచ్ఛ, స్వాతంత్య్రాలను కల్పించేందుకు త్రికరణ శుద్ధిగా కట్టుబడి ఉన్నాం. దుష్ట సంప్రదాయాన్ని తుదముట్టించాం ఎన్నికల సమయంలో ప్రకటించే మేనిఫెస్టోను ఆ త రువాత చెత్తబుట్టలో పడేసే దుష్ట సంప్రదాయాన్ని మనం తుదముట్టించాం. మేనిఫెస్టోను భగవద్గీత, బైబిల్, ఖురాన్‌గా భావిస్తూ ఇందులో ఇవి చెప్పాం.. ఇవి చేశాం.. 98.5% వాగ్దానాలను ఇప్పటికే అమలు చేశామని ప్రింట్ తీసి మరీ గడప గడపకూ వెళ్లి చూ పిస్తూ ప్రజల ఆశీస్సులు తీసుకుంటున్నాం. అర్హత ఉండి కూడా సకాలంలో దరఖాస్తు చేసుకోలేకపోవటం, వెరిఫికేషన్ సమయంలో అందుబాటులో లేక పోవటం, ఇతరత్రా మరే కారణాలతోనైనా సంక్షేమ పథకాలను అందుకోలేకపోయిన వారందరికీ మళ్లీ అవకాశం కల్పిస్తూ మిగిలిపోయిన వారికీ లబ్ధి చేకూరుస్తున్న ప్రభుత్వం దేశ చరిత్రలో మనది మాత్రమే. వికేంద్రీకరణ మన విధానం.. సామాజిక న్యాయం అన్నది కేవలం నినాదం కాదు.. అది అమలు చేయాల్సిన విధానమని నిరూపిస్తూ మంత్రి మండలిలో ఏకంగా 68 శాతం పదవులను ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాలకే ఇచ్చాం. ఐదుగురు ఉప ముఖ్యమంత్రుల్లో నలుగురు ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాల వారే. ఆలయ బోర్డులు మొదలు వ్యవసాయ మార్కెట్ కమిటీల వరకు అన్నింటా చట్టం చేసి మరీ ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు 50 శాతం పదవులు ఇచ్చిన తొలి ప్రభుత్వం మనదే. వికేంద్రీకరణను విధానంగా మార్చుకుని రాష్ట్రం ఏర్పడిన తరవాత మరో 13 కొత్త జిల్లాలను ఏర్పాటు చేశాం. రాజధానులను కూడా మూడు ప్రాంతాల హక్కుగా, రాష్ట్ర ప్రభుత్వ బాధ్యతగా వికేంద్రీకరణ చేయబోతున్న ప్రభుత్వం కూడా మనదే. ఏకంగా 15 వేలకు పైగా గ్రామ, వార్డు సచివాలయాలను ఏర్పాటు చేయటం ద్వారా వికేంద్రీకరణలో సరికొత్త అధ్యాయాన్ని ప్రారంభించింది కూడా మనందరి ప్రభుత్వమే. ప్రజల అవసరాలు, ప్రగతి లక్ష్యంగా.. గ్రామ సచివాలయాలు, వైఎస్సార్ అర్బీకేలు, ఇంగ్లిష్ మీడియం స్కూళ్లు, విలేజ్ క్లినిక్స్, బ్రాడ్ బ్యాండ్ సదుపాయంతో డిజిటల్ లైబ్రరీలు గ్రామాల్లో మన కళ్ల ఎదుటే నిర్మాణంలో ఉన్నాయి. గాంధీజీ కలలుగన్న గ్రామ స్వరాజ్యానికి ఇది నిదర్శనం. బర్త్ సర్టిఫికెట్, క్యాస్ట్ సర్టిఫికెట్, పెన్షన్, రేషన్, ప్రభుత్వ పథకాల కోసం కార్యాలయాల చుట్టూ తిరిగే దుస్థి తిని తొలగించి ఇంటివద్దే డెలివరీ చేసే సచివాల యాలు, వలంటీర్ వ్యవస్థను తెచ్చాం. ప్రభుత్వం ఖర్చు పెట్టే ప్రతి రూపాయిలో 15 పైసలు మాత్రమే లబ్ధిదారులైన ప్రజలకు చేరుతున్నాయని 38 ఏళ్ల క్రితం అప్పటి ప్రధాని చెప్పిన మాటలు ఇప్పటికీ ప్రచారంలో ఉన్నాయి. 50 నెలల్లో ఎలాంటి అవినీ తి, లంచాలు, వివక్షకు తావులేకుండా ఏకంగా రూ. 2.31 లక్షల కోట్లను అత్యంత పారదర్శకంగా పేద లకు అందించాం. డీబీటీతో నేరుగా ఖాతాల్లోకి జమ చేశాం. సంక్షేమ పథకాలన్నీ అక్కచెల్లెమ్మల బ్యాంకు ఖాతాలకే ట్రాన్స్ఫర్ చేస్తున్నాం. మహిళా సాధికా రతకు బాటలు వేశాం. సోషల్ ఆడిట్‌ను తప్పనిసరి చేసి పారదర్శకంగా లబ్ధి చేకూరుస్తున్నాం. -
పేదలు గెలిచి, వారి బతుకులు బాగుపడే వరకూ యుద్ధం: సీఎం జగన్
సాక్షి, విజయవాడ: మేనిఫెస్టోను పవిత్ర గ్రంథంగా తీసుకొని అన్ని హామీలను అమలు చేశామని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి తెలిపారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనార్టీ వర్గాలకు 68 శాతం మంత్రి పదవులు కల్పించినట్లు వెల్లడించారు.స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా విజయవాడలోని ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో జాతీయ జెండాను ఎగురవేసిన సీఎం జగన్. అనంతరం ప్రసంగించారు. శాసన సభ స్పీకర్‌గా బీసీ, శాసన మండలి చైర్మన్‌గా ఎస్సీని నియమించినట్లు చెప్పారు. 139 బీసీ కులాలకు 56 ప్రత్యేక కార్పొరేషన్లు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ప్రజాస్వామ్యానికి నిజమైన అర్థం నవరత్నాల పాలన ప్రజాస్వామ్యానికి నిజమైన అర్థం నవరత్నాల పాలన అని సీఎం జగన్ పేర్కొన్నారు. 99.05శాతం హామీలను అమలు చేశామని తెలిపారు. 50 నెలల్లో డీబీటీ ద్వారా రూ. 2.31 లక్షల కోట్ల లబ్ధి చేరుకగా.. 2 లక్షల 6 వేల 638 శాశ్వత ప్రభుత్వ ఉద్యోగాల భర్తీ చేసినట్లు పేర్కొన్నారు. పంట నష్టపోతే ఆ సీజన్లో పరిహారం అందిస్తున్నామన్నారు. ఆక్వా జోన్లలో ఉన్న రైతులకు రూపాయిన్నరకే విద్యుత్ ఇస్తున్నమని చెప్పారు. పాల రైతుల కోసం పాలవెల్లువ కార్యక్రమం తీసుకొచ్చామని.. పాల ధర లీటర్‌కు రూ. 10 నుంచి రూ. 22 వరకు పెంచినట్లు తెలిపారు. రాష్ట్రంలో కొత్తగా 4 పోర్టుల నిర్మాణం ప్రారంభమైనట్లు సీఎం తెలిపారు. భోగాపురం అంతార్జాతీయ విమానాశ్రయ పనులు కొనసాగుతున్నాయన్నారు. ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్‌లో వరసగా మూడేళ్లు ఏపీనే నంబర్ వన్‌గా నిలిచిందన్నారు. రాష్ట్రానికి రూ. 67,196 కోట్ల పెట్టుబడులు రాగా.. కొత్తగా 127 భారీ పరిశ్రమల ఏర్పాటు కానున్నట్లు తెలిపారు. గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్‌లో రూ. 13.42 లక్షల కోట్లకు ఎంవోయూలు చేసుకున్నామని, కొత్తగా ప్రారంభమైన ఎంఎఎస్‌ఎంఈ యూనిట్లు 2,00,995 అని చెప్పారు. చదవండి: పేదలకు ఇళ్లు ఇవ్వకూడదని అడ్డుకోవడమూ అంటరానితనమే: సీఎం జగన్ విద్యావ్యవస్థలో అనేక సంస్కరణలు విద్యావ్యవస్థలో అనేక సంస్కరణలు అమలు చేస్తున్నామని వైఎస్ జగన్ పేర్కొన్నారు. నాడు-నేడుతో 45 వేల ప్రభుత్వ బడుల రూపురేఖలు మారగా.. గవర్నమెంట్ స్కూళ్లలో ఇంగీష్ మీడియం అమలు చేస్తున్నట్లు తెలిపారు. 3వ తరగతి నుంచే సబ్జెక్ట్ టీచర్ విధానం.. ఎనిమిదో తరగతి పిల్లలకు ట్యాబ్‌లు అందజేస్తున్నామన్నారు. భోజనం, వసతి ఖర్చుల కోసం రూ.20 వేల వరకు వసతి దీవెన అందిస్తున్నామని.. రోజుకో మెనూతో పౌష్టికాహారంగా గోరుముద్ద అమలు చేస్తున్నామని చెప్పారు. డిగ్రీ స్థాయిలో 100 శాతం ఫీజు రీయింబర్స్మెంట్ ఇస్తున్నట్లు తెలిపారు. ట్రిపుల్ ఐటీల్లో పెండింగ్‌లో ఉన్న 3295 టీచింగ్ పోస్టుల భర్తీ చేసినట్లు పేర్కొన్నారు. అంటరానితనం మీద యుద్ధాన్ని ప్రకటించాం. పేదలు చదివే స్కూళ్లను పాడుబడేలా చేయడం అంటరానితనమేనన్నారు సీఎం జగన్. పేదలు ఇంగ్లీష్ మీడియాం చదువుకోవద్దని వాదించడం అంటరానితనమే, పేదలు వైద్యం చేయించుకునే ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఉచిత సేవలు అందకుండా చేయడం కూడా అంటరానితనమే, పేదలకు ఇళ్లు ఇవ్వకూడదని అడ్డుకోవడం కూడా అంటరానితనమే, పేదల సహనాన్ని పరీక్షించడం కూడా అంటరాని తనమే, పేదలు గెలిచే వరకూ, వారి బతుకులు బాగుపడే వరకూ యుద్ధంనని స్పష్టం చేశారు. 17 ప్రభుత్వ మెడికలు కాలేజీలు వైద్యశాఖలో ఏకంగా 53, 126 పోస్టుల భర్తీ చేసినట్లు వైఎస్ జగన్ వెల్లడించారు. రాష్ట్రంలో 17 ప్రభుత్వ మెడికలు కాలేజీలు నిర్మిస్తున్నామని, 108, 104 సేవల కోసం కొత్తగా 1514 వాహనాల కొనుగోలు చేసినట్లు చెప్పారు. చదవండి: Independence Day 2023: వచ్చే ఐదేళ్లలో మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా భారత్: ప్రధాని గ్రామాల్లో విలేజ్ క్లినిక్‌లు, డిజిటల్ లైబ్రరీలు స్వాతంత్ర్య సమరయోధుల బలిదానాన్ని గుర్తు చేస్తూ.. మన జాతీయ జెండా ఎగురుతోందని సీఎం జగన్ పేర్కొన్నారు. 76 ఏళ్ల ప్రయాణంలో దేశం ఎంతో పురోగమించిందని.. వ్యవసాయం, పరిశ్రమ, సేవారంగంలో ఎంతో ప్రగతి సాధించిందని తెలిపారు. రాష్ట్రంలో 50 నెలల్లో గ్రామ స్వరాజ్యానికి అర్థం తెచ్చామని చెప్పారు. గ్రామాల్లో విలేజ్ క్లినిక్‌లు, డిజిటల్ లైబ్రరీలు తెచ్చామని.. పౌర సేవల్ని ఇంటింటికి తీసుకెళ్లగలిగామని పేర్కొన్నారు. గ్రామ, వార్డు సచివాలయ వ్యవస్థను తెచ్చామన్నారు. లంచాలు, వివక్ష లేకుండా సంక్షేమ పథకాలు గతంలో ఏ ప్రభుత్వం అమలు చేయని మార్పులు తెచ్చామన్నారు సీఎం జగన్. సంక్షేమ పథకాలన్నీ అక్కచెల్లెమ్మల పేరు మీదే ఇస్తున్నామన్నారు. 2 లక్షల 31 వేల కోట్లను నేరుగా ప్రజలకు అందించామని.. ఎలాంటి లంచాలు, వివక్ష లేకుండా పేదలకు సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నట్లు చెప్పారు. గ్రామ సచివాలయాలు, ఆర్బీకే కేంద్రాలతో గ్రామ స్వరాజ్యానికి అర్థం తెచ్చామన్నారు. ఇప్పుడు ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ తిరిగే పరిస్థితి లేదని, అన్ని సేవలు ఇంటి వద్దకే అందిస్తున్నామని తెలిపారు. శరవేగంగా పోలవరం పనులు డివడిగా పోలవరం పనులు జరుగుతున్నాయని సీఎం తెలిపారు. 2025 జూన్ నాటికి పోలవరం ప్రాజెక్టు పూర్తి అవుతుందన్నారు. వెలిగొండలో మొదటి టన్నెల్ పూర్తి చేశామని.. రెండో టన్నెల్ పనులు త్వరలోనే పూర్తవుతాయని చెప్పారు. సామాజిక న్యాయం నినాదం కాదు.. దాన్ని అమలు చేసి చూపామని పేర్కొన్నారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనార్టీ వర్గాలకు ప్రాధాన్యత కల్పిచినట్లు చెప్పారు. వికేంద్రీకరణతో సరికొత్త అధ్యాయం అర్హులందరికీ పథకాలు అందించేందుకు ప్రయత్నిస్తున్నట్లు సీఎం చెప్పారు. రైతులకు పెట్టుబడి కోసం రైతు భరోసా అందిస్తున్నామని.. విత్తనం నుంచి అమ్మకం వరకూ రైతుకు అండగా నిలుస్తున్నామన్నారు. రైతు భరోసా కేంద్రాల ద్వారా రైతులకు అవసరమైన సేవలు అందిస్తూ, రైతులను ఆదుకునేందుకు పంటల బీమా అమలు చేస్తున్నామని చెప్పారు. వికేంద్రీకరణతో సరికొత్త అధ్యాయాన్ని ప్రారంభించామని.. కొత్తగా 13 జిల్లాలను ఏర్పాటు చేశామని తెలిపారు. 98.5 శాతం వాగ్దానాల అమలు పాలనలో ఏ ప్రభుత్వం చేయని మార్పులు తీసుకొచ్చామని సీఎం జగన్ పేర్కొన్నారు. 98.5 శాతం వాగ్దానాలను అమలు చేశామన్నారు. పాల వెల్లువ ద్వారా పాడి రైతులకు అదనంగా ఆదాయం వచ్చేలా చేశామని తెలిపారు. మూతపడిన చిత్తూరు డైరీకి జీవం పోశామని అన్నారు. భూవివాదాలకు పరిష్కారం కోసం సమగ్ర సర్వే చేపట్టామని చెప్పారు. 👉: (ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి) -
విజయవాడ: జాతీయ జెండా ఎగురవేసిన సీఎం జగన్ (ఫొటోలు)
-
పేదలకు ఇళ్లు ఇవ్వకూడదని అడ్డుకోవడమూ అంటరానితనమే: సీఎం జగన్
LIVE UPDATES: ► స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల సందర్భంగా ఏపీ పోలీసులకు మెడల్స్ ప్రదానం చేసిన సీఎం జగన్ ►అధికారులకు మెడల్స్ ప్రదానం చేసిన సీఎం జగన్ ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో సీఎం జగన్ ప్రసంగం ►రాష్ట్రంలో కొత్తగా 127 భారీ పరిశ్రమల ఏర్పాటు ►రాష్ట్రానికి వచ్చిన పెట్టబడులు రూ. 67, 196 కోట్లు ►గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్‌లో రూ. 13. 42 లక్షల కోట్లకు ఎంవోయూలు ►కొత్తగా ప్రారంభమైన ఎంఎస్ఎంఈ యూనిట్లు 2,00,995 ►శాశ్వత బీసీ కమిషన్‌ను నియమించిన తొలి రాష్ట్రంగా ఏపీ ►139 బీసీ కులాలకు 56 ప్రత్యేక కార్పోరేషన్లు ►50 నెలల్లో డీబీటీ ద్వారా రూ. 2.31 లక్షల కోట్ల లబ్ధి ►2 లక్షల 6 వేల 638 శాశ్వత ప్రభుత్వ ఉద్యోగాల భర్తీ ►రాష్ట్రంలో కొత్తగా 4 పోర్టుల నిర్మాణం ప్రారంభం ►భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయ పనులు కొనసాగుతున్నాయి ►ఈజ్ ఆఫ్ డూయింగ్బిజినెస్లో వరుసగా మూడేళ్లు మనమే నంబర్‌వన్ ►పేదలు చదివే స్కూళ్లను పాడుబడేలా చేయడం అంటరానితనమే ►పేదలు ఇంగ్లీష్ మీడియాం చదువుకోవద్దని వాదించడం అంటరానితనమే ►పేదలు వైద్యం చేయించుకునే ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఉచిత సేవలు అందకుండా చేయడం కూడా అంటరానితనమే ►మేనిఫెస్టోను పవిత్ర గ్రంథంగా తీసుకొని అన్ని హామీలను అమలు చేశాం ►విద్యావ్యవస్థలో పలు సంస్కరణలు అమలు చేస్తున్నాం ►నాడు-నేడుతో 45 వేల ప్రభుత్వ బడుల రూపురేఖలు మార్పు ►గవర్నమెంట్ స్కూళ్లలో ఇంగీష్ మీడియం అమలు ►3వ తరగతి నుంచే సబ్జెక్ట్ టీచర్ విధానం ►ఎనిమిదో తరగతి పిల్లలకు ట్యాబ్‌లు అందజేస్తున్నాం ►భోజనం, వసతి ఖర్చుల కోసం రూ.20 వేల వరకు వసతి దీవెన ►రోజుకో మెనూతో పౌష్టికాహారంగా గోరుముద్ద అందిస్తున్నాం ►డిగ్రీ స్థాయిలో 100 శాతం ఫీజు రీయింబర్సమెంట్ ►ట్రిపుల్ ఐటీల్లో పెండింగ్‌లో ఉన్న 3295 టీచింగ్ పోస్టుల భర్తీ ►వైద్యశాఖలో ఏకంగా 53, 126 పోస్టుల భర్తీ ►రాష్ట్రంలో 17 ప్రభుత్వ మెడికలు కాలేజీలు నిర్మిస్తున్నాం ►108, 104 సేవల కోసం కొత్తగా 1514 వాహనాల కొనుగోలు ►పేదలకు ఇళ్లు ఇవ్వకూడదని అడ్డుకోవడం కూడా అంటరానితనమే ►పేదల సహనాన్ని పరీక్షించడం కూడా అంటరాని తనమే. ►పేదలు గెలిచే వరకూ, వారి బతుకులు బాగుపడే వరకూ యుద్ధం ►పాలనలో ఏ ప్రభుత్వం చేయని మార్పులు తీసుకొచ్చాం ►98.5 శాతం వాగ్దానాలను అమలు చేశాం ►పాల వెల్లువ ద్వారా పాడి రైతులకు అదనంగా ఆదాయం వచ్చేలా చేశాం ►మూతపడిన చిత్తూరు డైరీకి జీవం పోశాం. ►భూవివాదాలకు పరిష్కారం కోసం సమగ్ర సర్వే చేపట్టాం ►వికేంద్రీకరణలో సరికొత్త అధ్యాయాన్ని ప్రారంభించాం ►వడివడిగా పోలవరం పనులు జరుగుతున్నాయి. ►2025 జూన్ నాటికి పోలవరం ప్రాజెక్టు పూర్తి ►వెలిగొండలో మొదటి టన్నెల్ పూర్తి చేశాం ►రెండో టన్నెల్ పనులు త్వరలోనే పూర్తవుతాయి. ►సామాజిక న్యాయం నినాదం కాదు.. దాన్ని అమలు చేసి చూపాం. ►ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనార్టీ వర్గాలకు ప్రాధాన్యత. ►వికేంద్రీకరణతో సరికొత్త అధ్యాయాన్ని ప్రారంభించాం. ►కొత్తగా 13 జిల్లాలను ఏర్పాటు చేశాం. ►అంటరానితనం మీద యుద్ధాన్ని ప్రకటించాం. ►అర్హులందరికీ పథకాలు అందించేందుకు ఏర్పాట్లు. ►రైతులకు పెట్టుబడి కోసం రైతు భరోసా అందిస్తున్నాం. ►విత్తనం నుంచి అమ్మకం వరకూ రైతుకు అండగా నిలుస్తున్నాం. ►రైతు భరోసా కేంద్రాల ద్వారా రైతులకు అవసరమైన సేవలు. ►రైతులను ఆదుకునేందుకు పంటల బీమా అమలు చేస్తున్నాం. ►గ్రామ సచివాలయాలు, ఆర్బీకే కేంద్రాలతో గ్రామ స్వరాజ్యానికి అర్థం తెచ్చాం. ►ఇప్పుడు ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ తిరిగే పరిస్థితి లేదు. ►అన్ని సేవలు ఇంటి వద్దకే అందిస్తున్నాం ►గతంలో ఏ ప్రభుత్వం అమలు చేయని మార్పులు తెచ్చాం ►సంక్షేమ పథకాలన్నీ అక్కచెల్లెమ్మల పేరు మీదే ఇస్తున్నాం. ►2 లక్షల 31 వేల కోట్లను నేరుగా ప్రజలకు అందించాం. ►ఎలాంటి లంచాలు, వివక్ష లేకుండా పేదలకు సంక్షేమ పథకాలు ►స్వాతంత్ర్య సమరయోధుల బలిదానాన్ని గుర్తు చేస్తూ.. మన జాతీయ జెండా ఎగురుతోంది: సీఎంజగన్ ►76 ఏళ్ల ప్రయాణంలో దేశం ఎంతో పురోగమించింది. ►వ్యవసాయం, పరిశ్రమ, సేవారంగంలో ఎంతో ప్రగతి సాధించింది. ►50 నెలల్లో గ్రామ స్వరాజ్యానికి అర్థం తెచ్చాం. ►గ్రామాల్లో విలేజ్ క్లినిక్‌లు, డిజిటల్ లైబ్రరీలు తెచ్చాం. ►పౌర సేవల్ని ఇంటింటికి తీసుకెళ్లగలిగాం. ►గ్రామ, వార్డు సచివాలయ వ్యవస్థను తెచ్చాం ►రాష్ట్రాభివృద్ధి, సంక్షేమాన్ని వివరిస్తూ శకటాల ప్రదర్శన ►పోలీసుల గౌరవ వందనం స్వీకరించిన సీఎం జగన్ ► ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో స్వాతంత్ర్య వేడుకలు ►జాతీయ జెండాను ఆవిష్కరించిన సీఎం జగన్ ►సాయుధ దళాల గౌరవ వందనం స్వీకరిస్తున్న సీఎం జగన్ ► కాసేపట్లో ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియానికి చేరుకోనున్న సీఎం జగన్. ►జాతీయ జెండాను ఎగురవేయనున్న సీఎం జగన్ ►రాష్ట్ర ప్రజలను ఉద్ధేశించి ప్రసంగించనున్నారు. ►రాష్ట్రాభివృద్ధి, సంక్షేమాన్ని వివరిస్తూ శకటాల ప్రదర్శన ►సాయంత్రం రాజ్‌భవన్‌లో ఎట్‌హోం కార్యక్రమం ►సాయంత్రం 5.30 ఎట్‌హోం కార్యక్రమంలో పాల్గొననున్న సీఎం జగన్ ►స్వాతంత్య్ర దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించేందుకు సిద్ధమైన రాష్ట్ర ప్రభుత్వం. ►విజయవాడలోని ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియం నిర్వహించనున్న ఈ వేడుకల్లో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి పాల్గొని జాతీయ జెండాను ఎగురవేసిన అనంతరం సాయుధ దళాల నుంచి ఆయన గౌరవ వందనం ►ఆ తర్వాత రాష్ట్ర ప్రజలను ఉద్దేశించి ప్రసంగిస్తారు సీఎం జగన్ ►ఈ సందర్భంగా శకటాలతో వివిధ శాఖలు ప్రదర్శన నిర్వహించనున్నాయి. -
విజయవాడ: 77వ స్వాతంత్ర దినోత్సవ వేడుకల ఏర్పాట్లు (ఫోటోలు)
-
Independence Day 2023: విజయవాడ ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో పోలీసుల రిహార్సల్స్ (ఫొటోలు)
-
పంద్రాగస్టుకు ఘనంగా ఏర్పాట్లు
సాక్షి, అమరావతి: వచ్చేనెల 15న విజయవాడలోని ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో నిర్వహించనున్న రాష్ట్రస్థాయి 77వ భారత స్వాతంత్య్ర వేడుకలను ఘనంగా నిర్వహించేందుకు విస్తృత ఏర్పాట్లుచేయాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి డా. కేఎస్ జవహర్‌రెడ్డి అధికారులను ఆదేశించారు. వీటికి సంబంధించి శుక్రవారం రాష్ట్ర సచివాలయంలో ఆయన సంబంధిత శాఖల అధికారులతో సమావేశమయ్యారు. ఆయన మాట్లాడుతూ.. స్వాతంత్య్ర దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించడంలో ఎలాంటి పొరపాట్లకు ఆస్కారం లేకుండా చూస్తూ విస్తృత ఏర్పాట్లుచేయాలన్నారు. అదేరోజు సాయంత్రం రాజ్‌భవన్‌లో ఎట్ హోం కార్యక్రమానికి కూడా ఏర్పాట్లుచేయాలని సీఎస్ వారిని ఆదేశించారు. మొత్తం ఏర్పాట్లన్నింటినీ ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్, విజయవాడ పోలీస్ కమిషనర్ పర్యవేక్షించాలన్నారు. ఇక రాష్ట్ర ప్రభుత్వం అమలుచేస్తున్న వివిధ సంక్షేమాభివృద్ధి పథకాలపై ప్రజల్లో విస్తృత అవగాహనకు ఆయా శాఖల వారీగా ప్రత్యేక శకటాల ప్రదర్శనను ఏర్పాటుచేయాలని జవహర్‌రెడ్డి ఆదేశించారు. ఈ వేడుకలకు హాజరయ్యే అతిథులందరికీ ప్రొటోకాల్ సహా తగిన ఏర్పాట్లు కూడా చేయాలన్నారు. రాజ్‌భవన్, హైకోర్టు, అసెంబ్లీ, సచివాలయం సహా ఇతర ప్రముఖ కార్యాలయాల భవనాలను విద్యుద్దీపాలతో అలంకరించాలని కూడా సీఎస్ సూచించారు. పోలీసు శాఖ విస్తృత బందోబస్తు.. మరోవైపు.. వీడియో లింక్ ద్వారా సమావేశంలో పాల్గొన్న డీజీపీ కేవీ రాజేంద్రనాథ్‌రెడ్డి మాట్లాడుతూ.. పోలీస్ శాఖ పరంగా విస్తృత బందోబస్తు, ట్రాఫిక్ నిర్వహణ తదితర అంశాలకు సంబంధించి అవసరమైన చర్యలు తీసుకుంటామన్నారు. ఈ ఏర్పాట్లన్నింటినీ విజయవాడ పోలీస్ కమిషనర్ కాంతిరాణా టాటా, ఏపీఎస్పీ అదనపు డీజీపీలు పూర్తిస్థాయిలో పర్యవేక్షిస్తారని చెప్పారు. రాష్ట్ర సమాచార పౌరసంబంధాల శాఖ కమిషనర్ టి.విజయకుమార్‌రెడ్డి మాట్లాడుతూ.. శకటాల ప్రదర్శనకు ఇప్పటివరకూ 13 శాఖలు ముందుకొచ్చాయని, పర్యాటక శాఖ శకటం కూడా ఏర్పాటుచేస్తే బాగుంటుందని ఆయన చెప్పారు. ఈ వేడుకలను ప్రజలందరూ తిలకించేందుకు వీలుగా స్క్రీన్లు ఏర్పాటుచేయడంతోపాటు ఆలిండియా రేడియో, దూరదర్శన్ సహా వివిధ చానాళ్ల ద్వారా ప్రత్యక్ష ప్రసారానికి ఏర్పాట్లుచేస్తున్నామన్నారు. ఇక వేడుకల అనంతరం ఆయా శకటాలను విజయవాడ నగరంలోని ఏలూరు రోడ్డు, బందరు రోడ్డులో తిప్పనున్నట్లు చెప్పారు. విద్యార్థులకు ప్రత్యేక బస్సులు.. అనంతరం.. ఎన్టీఅర్ జిల్లా కలెక్టర్ ఢిల్లీరావు మాట్లాడుతూ.. గత ఏడాది మాదిరిగానే ఈ ఏడాది కూడా వివిధ పాఠశాలలు, కళాశాలల విద్యార్థులు, ఎన్సీసీ, స్కౌట్స్ అండ్ గైడ్స్ విద్యార్థులు పాల్గొనేందుకు ప్రత్యేక బస్సులు ఏర్పాటుచేస్తున్నట్లు చెప్పారు. విజయవాడ పోలీస్ కమిషనర్ కాంతిరాణా టాటా, విజయవాడ మున్సిపల్ కమిషనర్ స్వప్నిల్ దినకర్ కూడా మాట్లాడారు. అంతకుముందు.. రాష్ట్ర ప్రొటోకాల్ విభాగం సంచాలకులు ఎం. బాలసుబ్రహ్మణ్యంరెడ్డి వివిధ శాఖలపరంగా చేపట్టాల్సిన ఏర్పాట్లపై పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా వివరించారు. ఈ సమావేశంలో ఆర్థికశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఎస్ఎస్ రావత్, ఆర్థికశాఖ ముఖ్య కార్యదర్శి (హెచ్ఆర్) చిరంజీవి చౌదరి, ఇతర అధికారులు పాల్గొన్నారు. -
యజ్ఞానికి ముస్తాబు
-
YS Jagan: బీసీలే వెన్నెముక
మహాకవి శ్రీశ్రీ మహా ప్రస్థానంలో చెప్పినట్టు.. కమ్మరి కొలిమి, కుమ్మరి చక్రం, జాలరి పగ్గం, సాలెల మగ్గం, గొడ్డలి, రంపం, కొడవలి, నాగలి ఇలా మన సహస్ర గ్రామీణ వృత్తుల సంగమం వేల సంవత్సరాలుగా మన కుటీర పరిశ్రమల సముదాయం మన బీసీ. నా మనసంతా బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ, నిరుపేద వర్గాల వారే. నా ఆచరణ కూడా మీరే. నా వెనకాల ఉన్న ఆ నలుగురూ కూడా మీరే. మీరిచ్చిన అధికారాన్ని మనసుతో మీ కోసం ఉపయోగించే విషయంలో మీ అన్న, మీ తమ్ముడు, మీ బిడ్డ అందరికంటే మిన్నగా ఉంటాడు. నా బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ, నిరుపేద వర్గాలకు ఇస్తున్న రాష్ట్ర బడ్జెట్‌ను వారికి అందనివ్వకుండా 40 ఏళ్లుగా అడ్డంగా తిని, బొజ్జలు బాగా పెంచిన దుష్ట చతుష్టయంతో మనం యుద్ధం చేయబోతున్నాం. ఇదే విషయాన్ని గడప గడప లోనూ చెప్పండి. మనందరి ప్రభుత్వం ద్వారా లబ్ధి కలిగి ఉంటేనే జగనన్నకు తోడుగా నిలవాలని అడగండి. – ముఖ్యమంత్రి వైఎస్ జగన్ జయహో బీసీ మహాసభ ప్రాంగణం నుంచి ‘సాక్షి’ ప్రత్యేక ప్రతినిధి: బీసీలు అంటే బ్యాక్ వర్డ్ క్లాసులు కాదు బ్యాక్ బోన్ క్లాస్‌లని చాటిచెబుతూ మూడున్నరేళ్లుగా అడుగులు ముందుకు వేస్తున్నామని వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఉద్ఘాటించారు. 2019 ఫిబ్రవరి 17న ఏలూరులో నిర్వహించిన బీసీ గర్జనలో బీసీలను సమాజానికి వెన్నెముక కులాలుగా తీర్చిదిద్దుతానని మాట ఇచ్చానని.. ఆ దిశగా ప్రతి అడుగూ వేస్తున్నానని గుర్తు చేశారు. ‘2014 ఎన్నికల్లో బీసీలకు చంద్రబాబు ఏకంగా 114 వాగ్దానాలు ఇచ్చి, అందులో 10 శాతం కూడా అమలు చేయకుండా దగా చేస్తే.. మేనిఫెస్టోలో ఇచ్చిన ప్రతిమాట నిలబెట్టుకున్న మా జగనన్న ప్రభుత్వానికి మేము ఇప్పుడు వెన్నెముక కులాలుగా మారామని, నేడు రాజ్యాధికారంలో మేమంతా భాగస్వాములమని ఆ చంద్రబాబుకు చెప్పండి’ అని పిలుపునిచ్చారు. విజయవాడలో ఇందిరా గాంధీ మున్సిపల్ స్టేడియంలో బుధవారం వైఎస్సార్సీపీ నిర్వహించిన జయహో బీసీ మహాసభలో సీఎం వైఎస్ జగన్ పాల్గొన్నారు. మహాత్మా జ్యోతిరావు పూలే, మహానేత వైఎస్ రాజశేఖరరెడ్డి విగ్రహాలకు పూలమాలలు వేసి.. ఘనంగా నివాళులు అర్పించారు. అనంతరం మహాసభకు వేలాదిగా కదలివచ్చిన బీసీ ప్రజాప్రతినిధులను ఉద్దేశించి ఆయన ప్రసంగించారు. రాష్ట్రంలో వార్డు మెంబర్ మొదలు ఎంపీ వరకు వివిధ పదవులకు ఎన్నికైన దాదాపు 85 వేల మంది బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ సోదరులు, అక్కచెల్లెమ్మలందరికీ నిండు మనస్సుతో చేతులు జోడించి పేరుపేరునా హృదయ పూర్వక కృతజ్ఞతలు తెలుపుతున్నానన్నారు. ఇవాళ ఇక్కడ కనిపిస్తున్న జన సంద్రం మన రాజకీయ సాధికారతకు నిదర్శనం అన్నారు. ‘మీ హృదయంలో జగన్.. జగన్ హృదయంలో మీరు.. ఇది ఎప్పటికీ మన అనుబంధం’ అని సగర్వంగా తెలియజేస్తున్నానని చెప్పారు. ఈ సభలో సీఎం జగన్ ఇంకా ఏమన్నారంటే.. విజయవాడలో జరిగిన జయహో బీసీ మహాసభ ప్రాంగణంలో ఓ భాగం బీసీలే నాగరికతకు పట్టుకొమ్మలు ► ఒకనాటి పారిశ్రామిక విప్లవం, ఆధునిక విద్యకు దూరం చేయడం, రాజకీయంగా న్యాయబద్ధమెన వాటా ఇవ్వకపోవడం వల్ల బీసీలు వెనుకబాటుకు గురయ్యారు. ఇలాంటి దుర్భర పరిస్థితుల్లో ఉన్న నా 139 బీసీ కులాల వారి కష్టాలను నా 3,648 కిలోమీటర్ల పాదయాత్రలో స్వయంగా చూశాను.. విన్నాను. వారి ఆశలను, ఆకాంక్షలను తెలుసుకుని, 2019 పిబ్రవరిలో ఏలూరులో బీసీ గర్జన నిర్వహించాం. ఆ రోజు ఇచ్చిన మాట మేరకు బీసీలను వెన్నెముక కులాలుగా మార్చాను. తోకలు కత్తిరిస్తామని చంద్రబాబుకు చెప్పండి ► బీసీలంటే ఇస్త్రీ పెట్టెలు, కుట్టు మిషన్లు, షేవింగ్ కిట్లు, పనిముట్లు కాదని చంద్రబాబుకు చెప్పండి. వ్యవసాయ రుణమాఫీ, డ్వాక్రా అక్కచెల్లెమ్మల రుణమాఫీ, ఫీజు రీయింబర్స్మెంట్.. కేజీ నుంచి పీజీ వరకు బీసీ పిల్లలందరికీ ఉచిత విద్య, కాలేజీ పిల్లలకు ఐప్యాడ్లు, బీసీ సబ్‌ప్లాన్ ద్వారా ఏటా రూ.10 వేల కోట్లు.. ఇలా ఎన్నో వాగ్దానాలు చేసి.. బీసీలందరికీ నిలువెత్తు ద్రోహం చేసిన ఆ చంద్రబాబు మోసాన్ని గుర్తు చేయండి. ► మత్స్యకారుల అంతు చూస్తానని, నాయి బ్రాహ్మణులను తోకలు కత్తిరిస్తానన్న బెదిరింపులను ఒక్కసారి అందరూ గుర్తుకు తెచ్చుకోండి. అయ్యా బాబూ.. మాకు తోకలు లేవు కానీ మీ తోకల్ని.. మీకు మొలిచిన కొమ్ముల్ని, మీకు కొమ్ము కాసేవారిని అందరినీ కత్తిరించే సామాజిక చైతన్యం మాకు ఉందని గట్టిగా చెప్పండి. వెన్నెముక కులాలుగా మార్చడమంటే ఇదీ.. ► మీ బిడ్డ జగన్ వయసు 49 ఏళ్లు. 45 ఏళ్లుగా రాజకీయాల్లో ఉన్న చంద్రబాబు 2024లో మన ప్రభుత్వం మీద ఒంటరి పోరాటం చేస్తానని మాత్రం చెప్పడం లేదు. ఎందుకు ఈనాడు, ఆంధ్రజ్యోతి, టీవీ 5, దత్తపుత్రుడి మీద ఆధారపడుతున్నారో తెలుసా? ఈ పెద్దమనిషి చేసింది చెప్పుకోవడానికి ఒక్కటంటే ఒక్క పథకం లేదు. ► చంద్రబాబు ప్రభుత్వం రూ.10 వేల కోట్లు బీసీ సబ్‌ప్లాన్‌కు కేటాయిస్తామని చెప్పింది. చివరకు 5 ఏళ్లలో కనీసం రూ.20 వేల కోట్లు కూడా ఖర్చు పెట్టలేదు. మనం బీసీ సబ్‌ప్లాన్‌కు ప్రతి ఏటా రూ.15 వేల కోట్లు, 5 సంవత్సరాలలో రూ.75 వేల కోట్లు ఖర్చు చేస్తామని చెప్పాం. ఈ మూడున్నరేళ్లలో బీసీలకు మాత్రమే, డీబీటీ, నాన్ డీబీటీ ద్వారా ఖర్చు చేసిన మొత్తం ఏకంగా రూ.1.63 లక్షల కోట్లు. ఇందులో డీబీటీ ద్వారా ఇచ్చిన సొమ్ము రూ.86 వేల కోట్లు. వెన్నెముక కులాలుగా మార్చడం అంటే ఇదీ. నవరత్నాలు.. సామాజిక సాధికారత ► నవరత్నాల్లో మొదటిది ఆర్థిక సాధికారత, డీబీటీ, నాన్ డీబీటీ పరంగా అడుగులు వేశాం. రెండోది రాజకీయ సాధికారత, దీనికి అద్దం పట్టే విధంగా పదవులు, నియామకాలు. ఈ రెండింటి ద్వారా సామాజిక సాధికారత దిశగా పయనించాం. మహిళా సాధికారత నాలుగో విషయం. రేపటి తరాల భవిష్యత్ నిర్ణయించే విద్యా సాధికారత ఐదోది. ► గత మూడున్నరేళ్లలో డీబీటీ, నాన్ డీబీటీ ద్వారా రూ.3,19,228 కోట్లు లబ్ధి చేకూర్చాం. ఇందులో మొత్తంగా నా బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ సోదరులు, అక్కచెల్లెమ్మలకు అందించింది అక్షరాలా రూ.2,50,358 కోట్లు. అంటే దాదాపు 80 శాతం. దోచుకుతిన్న చంద్రబాబు, ఎల్లో బ్రదర్స్, దత్తపుత్రుడు ► 2018–19లో చంద్రబాబు హయాంలో బడ్జెట్ ఎంత ఉందో.. మన అందరి ప్రభుత్వానిది కూడా దాదాపు అంతే బడ్జెట్. అప్పుడు అప్పుల పెరుగుదల రేట్ 19 శాతం ఉంటే ఇప్పుడు 15 శాతం మాత్రమే. అదే రాష్ట్రం అదే బడ్జెట్, మీ బిడ్డ ప్రభుత్వంలోనే తక్కువ. మరి అప్పుడు ఈ పథకాలు ఎందుకు లేవని ప్రతి ఒక్కరూ ఆలోచించాలి. కారణం అప్పట్లో ఆ బడ్జెట్‌ను చంద్రబాబు, ఈనాడు, ఆంధ్రజ్యోతి, టీవీ 5, దత్తపుత్రుడు.. మాత్రమే దోచుకో పంచుకో తినుకో (డీపీటీ) అనే పద్దతిలో తినేసే పరిస్థితి. ► ఈ రోజు మీ బిడ్డ పాలనలో మీ బిడ్డ బటన్ నొక్కుతున్నాడు ఆ డబ్బు నేరుగా మీ ఇంటికి వస్తుంది. ఎక్కడా లంచాలు, వివక్ష లేవు. ప్రతి ఇంట్లో చిరునవ్వులు ఇవ్వగలిగాం. ► మన దేశంలో బీసీలకు మేలు చేయడానికి 1980లో వచ్చిన మండల్ కమిషన్ నాటి నుంచి అనేక కమిషన్లు, కమిటీలు ఏర్పాటైనా ఎక్కడా విద్య, ఉద్యోగాల విషయంలో అనేక అవరోధాలు ఎదురయ్యాయి. అలాంటిది మన రాష్ట్రంలో మనందరి ప్రభుత్వం రాజకీయ సాధికారత విషయంలో చేతలతో ఒక విప్లవాన్ని తీసుకొచ్చింది. రాజకీయ సాధికారత అంటే ఇదీ.. ► మంత్రి మండలిలో మొదటి విడతలో 56 శాతం నా బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలకు స్థానం కల్పిస్తే.. రెండో విడతలో దానిని ఏకంగా 70 శాతానికి తీసుకెళ్లాం. ఐదుగురుకి ఉప ముఖ్యమంత్రులు పదవులు ఇస్తే అందులో నలుగురు ఈ వర్గాల వారే. 25 మంది మంత్రులలో 11 మంది ఈ రోజు బీసీలే ఉన్నారు. ► 2014 నుంచి 2019 వరకు చంద్రబాబు కనీసం ఒక్క బీసీని కూడా రాజ్యసభకు పంపిన పాపాన పోలేదు. మీ బిడ్డ రాజ్యసభకు 8 మందిని పంపితే అందులో నలుగురు మన బీసీలే. ► శాసనమండలిలో మన పార్టీ తరఫున 32 మంది ఎమ్మెల్సీలు ఉంటే అందులో 18 మంది నా బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలే. శాసనసభ స్పీకర్‌గా ఇదే వేదికపై ఉన్న తమ్మినేని సీతారామ్ బీసీ. శాసనమండలి చైర్మన్‌గా ఎస్సీ వర్గానికి చెందిన మోషేన్, డిప్యూటీ చైర్‌పర్సన్‌గా మైనార్టీ వర్గానికి చెందిన నా అక్కను ఆ స్థానంలో కూర్చొబెట్టాం. స్థానిక సంస్థలలో సింహభాగం వాటా ► స్థానిక సంస్థలకు మొత్తంగా 648 మండలాలకు ఎన్నికలు జరిగితే 637 మండలాల్లో వైఎస్సార్సీపీ జెండా ఎగరేసింది. అందులో ఒక్క బీసీలకు మాత్రమే 237 ఎంపీపీ పదవులలో కూర్చోబెట్టాం. అంటే 38 శాతం. ఇక ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలను కలుపుకుంటే 67% ఇవ్వగలిగాం. ► 13 జిల్లా పరిషత్ ఛైర్మన్ పదవులలో బీసీలకు 6 పదవులు అంటే 46 శాతం ఇచ్చాం. మొత్తంగా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాలకే 9 పదవులు అంటే 69 శాతం చైర్మన్ పదవులు. ► 14 నగర కార్పొరేషన్ మేయర్ పదవులలో వైఎస్సార్సీపీ జెండా ఎగరేస్తే.. బీసీలకు ఏకంగా 9 పదవులు అంటే 64 శాతం ఇచ్చాం. మొత్తంగా బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలను కలుపుకుంటే 14 కు గాను 12 పోస్టులు అంటే 86 శాతం మేయర్ పదవులు కట్టబెట్టాం. ► 87 మున్సిపాల్టీలకు గాను 84 చోట్ల వైఎస్సార్సీపీ జెండా ఎగరవేసింది. ఇందులో 44 మున్సిపల్ ఛైర్మన్లుగా బీసీలు.. 53% కనిపిస్తున్నారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలను కలుపుకుంటే 58 స్థానాల్లో 69 శాతంగా వీరే రాజ్యాన్ని పాలిస్తున్నారు. జయహో బీసీ అంటే ఇదీ.. ► 196 వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ల పదవుల్లో 76 అంటే 39 శాతం బీసీలకు ఇచ్చాం. మొత్తంగా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు 117 అంటే 60 శాతం ఇచ్చాం. ► వివిధ ప్రభుత్వ కార్పొరేషన్లలో 137 ఛైర్మన్ పదవులలో 53 పదవులు (39 శాతం) బీసీలకే ఇచ్చాం. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలను కలుపుకుంటే 79 అంటే 58 శాతం పదవులు ఇచ్చాం. వీటిలో 484 నామినేటెడ్ డైరెక్టర్ పదవులుంటే అందులో 201 బీసీలకు 41 శాతం ఇచ్చాం. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలను కలుపుకుంటే 280 అంటే 58 శాతం ఇచ్చాం. ► బీసీలకు ప్రత్యేకంగా 56 కార్పొరేషన్లు, ఎస్సీలకు ప్రత్యేకంగా 3 కార్పొరేషన్లు, ఎస్టీలకు 1 కార్పొరేషన్ ఏర్పాటు చేశాం. వీటిలో మరో 684 డైరెక్టర్ పదవులన్నీ వీరికే ఇచ్చాం. ఆలయ బోర్డులు, ఆలయ ఛైర్మన్ పదవులు తీసుకున్నా అందులో సగ భాగం బీసీ, ఎస్సీ, ఎస్టీలకే ఇచ్చాం. ► దాదాపుగా 7,006 ఆలయ బోర్డు మెంబర్ల పదవుల్లో 3,503 సగభాగం బీసీ, ఎస్సీ, ఎస్టీ వర్గాల వారే ఉన్నారు. ఇందులో బీసీలు ఒక్కరే 2,650 పదవుల్లో 38 శాతం ఉన్నారు. ఇది జయహో బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ అంటే. ఉద్యోగాలలోనూ అధిక శాతం వాటా ► గ్రామ, వార్డు సచివాలయాల్లో 1.30 లక్షల శాశ్వత ఉద్యోగాలిచ్చాం. ఇందులో 84% నా బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ తమ్ముళ్లు, చెల్లెళ్లు పనిచేస్తున్నారు. అప్పట్లో ఇంటికో ఉద్యోగం ఇస్తామని లేదంటే రూ.2 వేలు నిరుద్యోగ భృతి ఇస్తామని చంద్రబాబు వాగ్దానం చేసి, మోసం చేశారు. ► మన ప్రభుత్వంలో 54 వేల మంది ఆర్టీసీ ఉద్యోగులు ప్రభుత్వంలో రెగ్యులరైజ్ అయ్యారు. ఆరోగ్య రంగంలో 46 వేల పోస్టులు.. అవుట్ సోర్సింగ్ కార్పొరేషన్ (ఆప్కాస్ ) ద్వారా మరో లక్ష మందికి ఎటువంటి దళారులు లేకుండా, లంచాలిచ్చే పరిస్థితి లేకుండా, కమీషన్ ఇవ్వాల్సిన అవసరం లేకుండా మెరుగైన జీతాలు కల్పిస్తున్నాం. కాంట్రాక్ట్‌లో పని చేస్తున్న వారికి తొలిసారిగా మినిమమ్ టైం స్కేల్ తీసుకొచ్చాం. 2.60 లక్షల మంది తమ్ముళ్లు, చెల్లెళ్లు వలంటీర్ ఉద్యోగాలు చేస్తున్నారు. వీరిలో 83% నా బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలే. మొత్తంగా 6 లక్షల పై చిలుకు మంది చిరునవ్వుతో ఉద్యోగాలు చేస్తున్నారు. వారు ఏ సామాజిక న్యాయానికి ప్రతినిధులో? ► ప్రభుత్వ బడులన్నింటినీ నాడు–నేడుతో రూపురేఖలు మార్చుతున్నాం. బైలింగ్యువల్ బుక్స్, ఇంగ్లిష్ మీడియం, సీబీఎస్ఈ సిలబస్ తీసుకొచ్చాం. ఇన్ని చేస్తుంటే పెత్తందారీ చంద్రబాబు, ఈనాడు, ఆంధ్రజ్యోతి, టీవీ 5 మొత్తంగా ఎల్లోబ్రదర్స్ వారితో పాటు దత్తపుత్రుడికి బాధ కలుగుతోంది. వీరంతా ఏ సామాజిక న్యాయానికి ప్రతినిధులో అందరూ ఆలోచించాలి. ► పేదలకు ఇళ్ల స్ధలాలిస్తామంటే కోర్టులో కేసులు వేస్తారు. అమరావతిలో నా బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలకు ఇళ్ల పట్టాలిస్తామంటే.. సామాజిక సమతుల్యం దెబ్బతింటుందని కోర్టుల్లో కేసులు వేయిస్తారు. చివరకి ప్రాంతాల వారీగా వారి ఆత్మగౌరవాన్ని నిలబెట్టేలా 3 రాజధానులు చేస్తామని అంటే వీళ్లంతా అరిచి గీపెడుతున్నారు. వారు ఇలాగే పేదరికంలో మిగిలిపోవాలన్నది వారి ఆలోచన. వీళ్లను శాశ్వతంగా పేదరికంలోంచి ఎలా బయటకు తేవాలన్నది మీ బిడ్డ ప్రభుత్వం తాపత్రయం. మానవతావాదానికి ప్రతీక వైఎస్సార్సీపీ. మహిళా సాధికారత దిశగా.. ► ఏకంగా 30 లక్షల ఇళ్ల పట్టాలు అక్కచెల్లెమ్మలకు ఇచ్చాం. అందులో ఇప్పటికే 21.20 లక్షల ఇళ్లు కూడా నిర్మాణంలో ఉన్నాయి. ఆ 30 లక్షల ఇళ్ల పట్టాలలో నా బీసీ అక్కచెల్లెమ్మలకు 16,70,286 ఇళ్లు ఇవ్వగలిగాం. అంటే 56 శాతం బీసీ అక్కచెల్లెమ్మలకు ఇచ్చి మేలు చేశాం. ఇందులో బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీల అక్కచెల్లెమ్మలను కలుపుకుంటే.. 88 శాతం వీళ్లకే ఇళ్ల పట్టాలిచ్చాం. వీటిలో ఇళ్లు కట్టడం కూడా పూర్తయితే ప్రతి అక్కా, చెల్లెమ్మ చేతిలో రూ.5 లక్షల నుంచి 10 లక్షలు వారి చేతిలో పెట్టినట్లవుతుంది. రాష్ట్రం మొత్తంగా రూ.2..3 లక్షల కోట్లు వాళ్ల చేతుల్లో పెట్టినట్లవుతుంది. ► 79 లక్షల మంది పొదుపు సంఘాల అక్కచెల్లెమ్మలకు వైఎస్సార్ ఆసరా ద్వారా రూ.12,758 కోట్లు ఇచ్చాం. ఇందులో బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలకు రూ.9,294 కోట్లు.. అంటే 73%. రేపు జనవరిలో మరో రూ.6,379 కోట్లు వారి చేతుల్లో పెట్టబోతున్నాం. ► దాదాపు కోటి రెండు లక్షల మంది ఉన్న నా పొదుపు సంఘాల అక్కచెల్లెమ్మలకు సున్నా వడ్డీ రూపంలో రూ.3,615 కోట్లు ఇచ్చాం. అందులో బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ అక్కచెల్లెమ్మలకు రూ.2,803 కోట్లు ఇచ్చాం. అంటే 78 శాతం నిరుపేద అక్కచెల్లెమ్మల చేతుల్లో పెట్టగలిగాం. ► 45 నుంచి 60 ఏళ్ల వయస్సు మధ్యలో ఉన్న దాదాపు 26.40 లక్షల మంది ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ అక్కలకు, చెల్లెమ్మలకు వైయస్సార్ చేయూత పథకం ద్వారా రూ.14,110 కోట్లు ఇచ్చాం. ► జగనన్న అమ్మ ఒడి పథకం ద్వారా దాదాపు 44.50 లక్షల మంది చెల్లెమ్మలకు రూ.19,617 కోట్లు ఇచ్చాం. ఇందులో రూ.15,378 కోట్లు అంటే 78 శాతం బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ చెల్లెమ్మల చేతిలో పెట్టాం. మరో 25 లక్షల మంది పిల్లలకు, తల్లులకు మేలు చేస్తూ.. జగనన్న వసతి దీవెన, జగనన్న విద్యా దీవెన డబ్బులన్నీ ఆ తల్లుల ఖాతాల్లో జమ చేశాం. చెప్పినట్లుగా బీసీ డిక్లరేషన్ అమలు ► చరిత్రలో ఏ ప్రభుత్వం చేయని విధంగా 139 కులాల పేర్లతో 56 కార్పొరేషన్లు ఏర్పాటు చేశాం. శాశ్వత బీసీ కమిషన్‌ను దేశంలో తొలిసారిగా నియమించాం. నామినేటెడ్ పదవుల్లో 50 శాతం బీసీలు, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలకు రిజర్వేషన్లు కల్పిస్తూ చట్టం చేశాం. ► ఆలయ బోర్డులు మొదలు వ్యవసాయ మార్కెటింగ్ కమిటీల వరకు ఇతర నామినేటెడ్ పదవులన్నింటిలోనూ ఈ రోజు ఎక్కడ చూసినా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలే కనిపిస్తున్నారు. ఇవాళ ఇక్కడ కనిపిస్తున్న 85 వేల మందే ఇందుకు సాక్ష్యం. నామినేషన్ పనుల్లో కూడా 50 శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ చట్టం చేసి, అమలు చేస్తున్నాం. ► జగనన్న తోడు, జగనన్న చేదోడు ద్వారా షాపులు పెట్టుకుని సంప్రదాయ వృత్తులు చేసుకుంటున్న బీసీలకు, చిరు వ్యాపారులకు అండగా నిలిచాం. ఈ మూడున్నరేళ్లలో చేదోడు ద్వారా రూ.584 కోట్లు వారి చేతుల్లో పెట్టాం. జగనన్న తోడు ద్వారా రూ.2,059 కోట్లు సున్నా వడ్డీ రుణాలు అందించాం. తద్వారా దాదాపు 15 లక్షల కుటుంబాలు లబ్ధి పొందాయి. ► 45 ఏళ్లు నిండిన 26.40 లక్షల మంది నా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ అక్కచెల్లెమ్మల కోసం చేయూత పథకం ద్వారా మేలు చేస్తున్నాం. ఈ మూడున్నరేళ్లలో రూ.14,110 కోట్లు ఇవ్వడం ద్వారా వారి ఆర్థిక సాధికారతను బలోపేతం చేశాం. సన్నిధిగొల్లలకు తిరుమల ఆలయం తలుపులు తెరిచే సంప్రదాయ హక్కును పునరుద్ధరిస్తూ జీవో జారీ చేశాం. ► ఎంత పెద్ద చదువైనా సరే వంద శాతం ఫీజు రీయింబర్స్మెంట్ ఇస్తూ విద్యా దీవెన పథకాన్ని అమలు చేస్తున్నాం. గత ప్రభుత్వం మిగిల్చిన బకాయిలూ చెల్లించాం. ఈ మూడున్నరేళ్లలో రూ.9,052 కోట్లు ఖర్చు చేశాం. హాస్టల్ ఖర్చుల కోసం వసతి దీవెన కింద రూ.20 వేల వరకు ఇస్తున్నాం. ఈ మూడున్నరేళ్లలో ఈ పథకానికి రూ.3,349 కోట్లు వెచ్చించాం. ► చేపల వేట నిషేధ సమయంలో మత్స్యకారులకు ఇచ్చే భృతిని రూ.4 వేల నుంచి రూ.10 వేలకు పెంచాం. మత్స్యకార భరోసా పథకం ద్వారా రూ.418 కోట్లు అందించాం. సొంత మగ్గమున్న నేత కార్మికులకు ఏటా రూ.20 వేలు చొప్పున ఈ మూడున్నరేళ్లలో రూ.776 కోట్లు వారి చేతుల్లో పెట్టాం. -
పథకాలను కళ్లకు కట్టిన శకటాలు
సాక్షి, అమరావతి: విజయవాడలోని ఇందిరా గాంధీ మున్సిపల్ స్టేడియంలో 76వ భారత స్వాతంత్య్ర దినోత్సవాన్ని రాష్ట్ర ప్రభుత్వం సోమవారం ఘనంగా నిర్వహించింది. ఈ కార్యక్రమానికి సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి ముఖ్య అతిథిగా హాజరై జాతీయ జెండాను ఆవిష్కరించారు. అనంతరం ప్రత్యేకంగా అలంకరించిన వాహనంలో పరేడ్‌ను పరిశీలించారు. ఈ సందర్భంగా వేడుకలకు హాజరైన విద్యార్థులు, సాధారణ ప్రజానీకానికి ముఖ్యమంత్రి చిరునవ్వుతో అభివాదం చేస్తూ ముందుకు సాగారు. ఈ క్రమంలో కేరింతలు, నినాదాలతో చేతులు ఊపుతూ విద్యార్థులు, ప్రజలు సీఎంకు ప్రతిగా అభివాదం చేశారు. సాయుధ దళాల గౌరవ వందనాన్ని సీఎం జగన్ స్వీకరించారు. రెండో బహుమతి సాధించిన విద్యాశాఖ శకటం అబ్బురపరిచిన కవాతు ఈ వేడుకల్లో సాయుధ దళాల కవాతు చూపరులను అబ్బురపరిచింది. ఆద్యంతం నూతన ఉత్తేజాన్ని నింపింది. పల్నాడు జిల్లా అడ్మిన్ ఏఎస్పీ గరికపాటి బిందుమాధవ్ సాయుధ దళాల కవాతుకు నేతృత్వం వహించారు. ఏపీఎస్సీ 2వ బెటాలియన్ (కర్నూలు), 3వ బెటాలియన్ (కాకినాడ), 5వ బెటాలియన్ (విజయనగరం), 11వ బెటాలియన్ (కడప), 6వ బెటాలియన్ (మంగళగిరి), ఎన్సీసీ బాలబాలికలు, ఏపీ సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలలు, ఏపీ గిరిజన సంక్షేమ గురుకుల పాఠశాలలు, భారత్ స్కౌట్స్–గైడ్స్, రెడ్‌క్రాస్ సొసైటీ, ఏపీ సైనిక్ వెల్ఫేర్ శాఖ కంటిన్‌జెంట్లు కవాతులో పాల్గొన్నాయి. గురుకుల పాఠశాలలకు చెందిన బాలబాలికల కంటిన్‌జెంట్ల కవాతు చూపరులను ఆకట్టుకుంది. అలాగే, వివిధ ఏపీఎస్పీ బెటాలియన్లకు చెందిన కవాతు కూడా అలరించింది. ఆర్మ్డ్ విభాగం కవాతులో ఉత్తమ ప్రదర్శన కనబరిచిన ఏపీఎస్పీ 5వ బెటాలియన్ మొదటి బహుమతిని, 2వ బెటాలియన్ ద్వితీయ బహుమతిని దక్కించుకున్నాయి. రెడ్‌క్రాస్ సొసైటీ మొదటి, సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలల కంటిన్జెంట్ రెండో బహుమతి దక్కించుకున్నాయి. వీరికి సీఎం బహుమతులు అందజేశారు. మూడో బహుమతి పొందిన గృహనిర్మాణ శకటం సచివాలయాల శకటానికి మొదటి బహుమతి.. ఇక సీఎం వైఎస్ జగన్ సర్కార్ అమలుచేస్తున్న సంక్షేమ పథకాలు, కార్యక్రమాలను కళ్లకు కట్టినట్లుగా శకటాల ప్రదర్శన సాగింది. వివిధ ప్రభుత్వ శాఖలకు చెందిన 15 శకటాల ప్రదర్శనలు గడిచిన మూడేళ్లలో ప్రభుత్వం చేసిన సంక్షేమం, అభివృద్ధికి.. రాష్ట్ర ప్రగతికి అద్దంపట్టాయి. గ్రామ, వార్డు సచివాలయాల శాఖకు చెందిన ‘గడప గడపకు మన ప్రభుత్వం–ఇంటింటా సంక్షేమం’ శకటం మొదటి బహుమతిని కైవసం చేసుకుంది. విద్యాశాఖకు చెందిన మనబడి నాడు–నేడు శకటానికి రెండో బహుమతి, గృహ నిర్మాణ శాఖకు చెందిన నవరత్నాలు–పేదలందరికీ ఇళ్లు శకటానికి మూడో బహుమతి దక్కాయి. ఉత్తమ ప్రదర్శన కనబరిచిన శకటాల శాఖాధిపతులు, అధికారులకు సీఎం బహుమతులు అందజేశారు. ► మొదటి బహుమతి అందుకున్న సచివాలయాల శకటం గడిచిన మూడేళ్లలో సచివాలయాల వ్యవస్థ ద్వారా రాష్ట్రంలో వచ్చిన మార్పులను తెలియజేసింది. నెలనెలా ఒకటో తేదీ ఉదయాన్నే లబ్ధిదారుల గుమ్మం వద్దనే ఠంచన్‌గా వలంటీర్లు పింఛన్ల పంపిణీ, సచివాలయాల ద్వారా ప్రజలకు అందుతున్న వివిధ రకాల సేవలు కళ్లకు కట్టాయి. ► విద్యాశాఖ శకటం నాడు–నేడు ద్వారా విద్యా వ్యవస్థలో విప్లవాత్మక మార్పులు, సంస్కరణలతో కార్పొరేట్ స్థాయి హంగులతో ముస్తాబై ప్రభుత్వ పాఠశాల నమూనాతో ప్రత్యేకంగా ఆకట్టుకుంది. ► ఇక తృతీయ బహుమతి అందుకున్న గృహ నిర్మాణ శాఖ శకటం నవరత్నాలు–పేదలందరికీ ఇళ్లు పథకం ద్వారా రాష్ట్రంలో ఇళ్లులేని పేదలకు చేస్తున్న మేలును తెలియజేసింది. రాష్ట్రవ్యాప్తంగా 30 లక్షల మంది పేదలకు ఇళ్ల రూపంలో రాష్ట్ర ప్రభుత్వం ఏకంగా ఊళ్లను నిర్మిస్తున్న తీరును వివరించింది. ఈ వేడుకల్లో సీఎం సతీమణి భారతిరెడ్డి, రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి డాక్టర్ సమీర్‌శర్మ, డీజీపీ కేవీ రాజేంద్రనాథ్‌రెడ్డి, హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ బట్టు దేవానంద్, ఏపీ జ్యుడిషియల్ ప్రివ్యూ చైర్మన్ జస్టిస్ బి. శివశంకరరావు, ఏపీ ఉన్నత విద్య రెగ్యులేటరీ కమిషన్ చైర్మన్ జస్టిస్ వి. ఈశ్వరయ్య, శాసనసభ స్పీకర్ తమ్మినేని సీతారాం, శాసన మండలి చైర్మన్ మోషేన్‌రాజు, రాష్ట్ర మహిళా కమిషన్ చైర్పర్సన్ వాసిరెడ్డి పద్మ, పలువురు ఎంపీలు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు, ఇతర ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. -
CM YS Jagan: దశాబ్దాల ప్రశ్నలకు మూడేళ్లలో జవాబిచ్చాం
రాష్ట్రంలో ప్రతి కుటుంబం నిన్నటి కంటే నేడు.. నేటి కంటే రేపు.. రేపటి కంటే భవిష్యత్తులో బాగుండటమే అభివృద్ధి. అదే మన స్వతంత్రానికి అర్థమని నమ్మాం. ఎన్నికల వరకే రాజకీయాలు.. అధికారంలోకి వచ్చిన తరవాత అంతా మన ప్రజలే అని విశ్వసించాం. ప్రతి ఒక్క పథకంలోనూ శాచ్యురేషన్ విధానాన్ని అమలు చేశాం. ఎక్కడా కులం, మతం, వర్గం, ప్రాంతీయ భేదాలను చూడలేదు కాబట్టే లంచాలు, వివక్ష, కమీషన్లు లేకుండా రూ.1.65 లక్షల కోట్లు అర్హులందరి ఖాతాల్లోకి వెళ్లాయి. దేశ చరిత్రలో పారదర్శకంగా ఇంత డబ్బు లబ్ధిదారులకు చేరటం కనీవినీ ఎరుగనిది – ముఖ్యమంత్రి వైఎస్ జగన్ జెండా.. భారతీయుల గుండె ‘‘ఈ జెండా కేవలం దారాల కలనేత కాదు.. ఇది భిన్నత్వంలో ఏకత్వానికి, భారతీయతకు, దేశభక్తికి, దేశ స్వాతంత్య్ర పోరాటానికి, మనకు మన దేశంపై ఉన్న నిబద్ధతకు, ఈ దేశ భవిష్యత్తుకు ఉండాల్సిన చిత్తశుద్ధికి ప్రతీక. మన తెలుగువాడు పింగళి వెంకయ్య తయారు చేసిన ఈ జెండా.. ఇప్పుడు 141 కోట్ల భారతీయుల గుండె’’. స్వతంత్రానికి నిజమైన అర్థం ‘‘రాష్ట్రంలో ప్రతి కుటుంబం నిన్నటి కంటే నేడు.. నేటి కంటే రేపు.. రేపటి కంటే భవిష్యత్తులో బాగుండటమే అభివృద్ధి. అదే మన స్వతంత్రానికి అర్థమని నమ్మాం. ఎన్నికల వరకే రాజకీయాలు.. అధికారంలోకి వచ్చిన తరవాత అంతా మన ప్రజలే అని విశ్వసించాం. ప్రతి ఒక్క పథకంలోనూ శాచురేషన్ విధానాన్ని అమలు చేశాం. ఎక్కడా కులం, మతం, వర్గం, ప్రాంతీయ భేదాలను చూడలేదు. కాబట్టే ఎటువంటి లంచాలు, వివక్ష, కమీషన్లు లేకుండా రూ.1.65 లక్షల కోట్లు అర్హులందరి ఖాతాల్లోకి వెళ్లాయి. బహుశా భారతదేశ చరిత్రలో ఇంత పారదర్శకంగా ఇంత డబ్బు లబ్ధిదారులకు చేరటం కనీవినీ ఎరుగనిది’’. ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి సంక్షేమమే మానవ అభివృద్ధి ‘‘సంక్షేమ పథకాలను మానవ వనరులపై పెట్టుబడిగా భావించి ప్రతి రూపాయినీ కుటుంబాలను నిలబెట్టే, పేదరికం సంకెళ్లను తెంచే సాధనంగా పేదల చేతిలో ఉంచాం. ప్రతి పథకాన్నీ కూడా ప్రజల జీవన ప్రమాణాలను పెంచుతూ, సుస్థిర అభివృద్ధి లక్ష్యాలు(ఎస్డీజీ) సాధించేలా అమలు చేస్తున్నాం’’. –వైఎస్ జగన్మోహన్రెడ్డి, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి సాక్షి, అమరావతి: భారతదేశ స్వాతంత్ర్యానికి 75 ఏళ్ల చరిత్ర ఒకవైపు ఉంటే.. మరోవైపు ఇదే గడ్డపై సమ సమాజం కోసం, సామాజిక న్యాయం కోసం, చదువుకునే హక్కు, మహిళా సాధికారత, మనుషులుగా గుర్తింపు, దోపిడీకి గురికాకుండా జీవించే రక్షణల కోసం జరుగుతున్న పోరాటాలకు వందల, వేల ఏళ్ల చరిత్ర ఉందని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అన్నారు. ఇవన్నీ పరాయి దేశంపై చేసిన స్వాతంత్య్ర పోరాటాలు కావని, మన సమాజంలో జరుగుతున్న సామాజిక స్వాతంత్య్ర పోరాటాలని ఆయన చెప్పారు. ఏడు దశాబ్దాల్లో స్వతంత్ర దేశంగా భారత్ తిరుగులేని విజయాలను, అనేక రంగాల్లో అభివృద్ధిని సొంతం చేసుకున్నప్పటికీ ఎన్నో ప్రశ్నలు వెంటాడుతూనే ఉన్నాయన్నారు. వీటికి లభించిన సమాధానాల ప్రతీకే.. ఈ మూడేళ్ల రాష్ట్ర ప్రభుత్వ పాలనగా స్పష్టం చేశారు. రాష్ట్ర చరిత్రలో గానీ, దేశ చరిత్రలో గానీ ఏ ఒక్క ప్రభుత్వంలోనూ కనిపించనంతటి సామాజిక, ఆర్థిక, రాజకీయ విద్యా న్యాయాలను ప్రజలందరి ప్రభుత్వంలో చేసి చూపించామన్నారు. ఇంతటి విప్లవాత్మక మార్పులు ఒకరిద్దరు వ్యక్తులకో, కొంత మందికి ప్రయోజనం కల్పించేందుకు చేసినవి కావని.. ఇవన్నీ వ్యవస్థనే మార్చే మార్పులని ఉద్ఘాటించారు. వచ్చే కొన్ని దశాబ్దాల్లో వ్యవసాయ, విద్య, వైద్యం, గృహ నిర్మాణ రంగాన్ని, సామాజిక వర్గాలకు అందే రాజకీయ అధికారాన్ని నిర్ణయించే విధంగా ఉంటాయన్నారు. మహిళల అభివృద్ధి ప్రాధాన్యంగా 21వ శతాబ్దపు ఆధునిక భారతీయ మహిళ ఆంధ్రప్రదేశ్‌లోనే ఆవిర్భవించాలన్న లక్ష్యంతో మహిళా సాధికారతలో వేగంగా అడుగులు ముందుకు వేస్తున్నామన్నారు. రాజధాని స్థాయిలో పరిపాలన వికేంద్రీకరణే తమ విధానమని, ప్రాంతాల ఆకాంక్షలు, ప్రాంతీయ ఆత్మగౌరవానికి, అన్ని ప్రాంతాల మధ్య సమతౌల్యంతోపాటు పటిష్ట బంధానికి వికేంద్రీకరణే పునాదిగా నమ్ముతున్నామన్నారు. విజయవాడలోని ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో సోమవారం 76వ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలకు ముఖ్య అతిథిగా హాజరైన ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి జాతీయ జెండాను ఆవిష్కరించారు. అనంతరం సాయుధ దళాల గౌరవ వందనం స్వీకరించి ప్రభుత్వ సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలపై వివిధ ప్రభుత్వ విభాగాలు రూపొందించిన శకటాల ప్రదర్శనను తిలకించారు. అనంతరం రాష్ట్ర ప్రజలనుద్దేశించి ప్రసంగించారు. ఆ వివరాలు ఇవీ.. మతసామరస్యానికి ప్రతీక నేడు ఎగిరిన ఈ జాతీయ జెండా మన స్వాతంత్య్రానికి, గొప్పదైన మన ప్రజాస్వామ్యానికి ప్రతీక. ఇది దేశ ప్రజల సార్వభౌమాధికారానికి ప్రతీక. భారతదేశపు ఆత్మకు, మనందరి ఆత్మగౌరవానికి ప్రతీక. ఈ దేశం హిందూ, ఇస్లాం, క్రైస్తవం వంటి అనేక మతాలు, అనేక ధర్మాల సమ్మేళనం అని ఆ జెండా చెబుతుంది. మన జెండా మన సమరయోధుల త్యాగనిరతికి, మనం కోరుకునే సుస్థిర శాంతికి, ఈ దేశం పైరుపచ్చలతో కళకళలాడాలన్న భావనకు ప్రతీక. ఈ జెండా.. ప్రపంచంలోనే అతి పెద్ద ప్రజాస్వామ్యం గొప్పదనానికి ప్రతీక. స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలో పాల్గొన్న సీఎం సతీమణి వైఎస్ భారతి మన పోరాటం మహోన్నతం మన స్వాతంత్య్ర పోరాటం మహోన్నతం. ఈ ఏడాది మనం భారత స్వాతంత్ర్య వజ్రోత్సవాలను సంపూర్ణం చేసుకుంటున్న సమయం. ఒక జాతి యావత్తు పోరాడుతున్నా.. అంతటి పోరాటంలో కూడా చెక్కుచెదరని అత్యున్నత మానవతా విలువలకు నిలువెత్తు నిదర్శనం మన స్వాతంత్య్ర పోరాటం. ఇందులో వర్గాలు వేరైనా.. వాదాలు వేరైనా.. అతివాదమైనా, మితవాదమైనా, విప్లవ వాదమైనా.. గమ్యం ఒక్కటే, అది స్వతంత్రమే. అహింసే ఆయుధంగా, సత్యమే సాధనంగా సాగిన ఆ శాంతియుత పోరాటం... ఒక్క భారతదేశానికి మాత్రమే కాదు మొత్తంగా ప్రపంచ మానవాళికి మహోన్నత చరిత్రగా, తిరుగులేని స్ఫూర్తిగా కలకాలం నిలిచే ఉంటుంది. సంకల్ప విప్లవ సంగ్రామం స్వాతంత్య్రం నా జన్మహక్కు.. దాన్ని సాధించి తీరుతానన్న బాలగంగాధర తిలక్ సంకల్పానికి, ఏకంగా ప్రవాస ప్రభుత్వాన్నే ఏర్పాటు చేసి బ్రిటిష్ వారిపై యుద్ధం ప్రకటించిన ఆజాద్ హింద్ ఫౌజ్ అధినేత సుభాస్ చంద్రబోస్ సాహసానికి, జలియన్ వాలాబాగ్ మారణకాండకు బాధ్యుడైన జనరల్ డయ్యర్‌ను లండన్ నడివీధుల్లో శిక్షించిన ఉధంసింగ్ తెగువకు, దేశం కోసం ఉరికంబం ఎక్కిన సర్దార్ భగత్‌సింగ్ త్యాగానికి ప్రతీక మన స్వతంత్ర పోరాటం. జన సమూహాలే ఆయుధాలుగా.. మన సామాన్యుడి దేహం మీద వేసుకోడానికి నూలు పోగులు లేకున్నా.. మా దేశం మీద మీరు దేవతా వస్త్రాలు కప్పాం అంటే కుదరదన్న భావాలకు నిలువెత్తు రూపం గాంధీజీ. అణువణువూ స్వాతంత్య్ర కాంక్ష నిండిన జన సమూహాలే ఆయుధాలని.. అవి అణ్వాయుధాల కంటే శక్తిమంతమని నిరూపించిన మహాత్ముడు మన గాంధీజీ. మహాయోధుల త్యాగాలు, రక్తంతో తడిసిన పుణ్యభూమి భారతీయతకు ప్రతినిధులుగా నిలిచిన ఒక మౌలానా అబుల్ కలాం ఆజాద్, ఒక ఖాన్ అబ్దుల్ గఫర్‌ఖాన్, సైమన్ కమిషన్ రాక సందర్భంగా తుపాకులకు ఎదురొడ్డి నిలిచిన టంగుటూరి ప్రకాశం, మన్నెం వీరుడిగా ప్రాణాలే అర్పించిన అల్లూరి.. ఇలా వందలు వేల మహాయోధుల త్యాగాలు, భావాలతో, వారి స్వేదంతో–రక్తంతో తడిసి ఈ పుణ్యభూమి పునీతమయింది. ఆ పునాదులమీదే స్వతంత్ర దేశంగా ఇండియా అవతరించింది. వంద కోట్ల జెండాలు ఎగురుతున్నాయి 1857లో తొలి స్వతంత్ర సంగ్రామంగా సిపాయిల తిరుగుబాటు జరిగితే, 1885లో భారత జాతీయ కాంగ్రెస్ పుట్టిన నాటి నుంచి 1947లో దేశ స్వాతంత్య్రం వరకు 62 సంవత్సరాల కాలం జాతీయోద్యమం, స్వాతంత్య్ర పోరాటం జరిగింది. అంటే తొలి స్వాతంత్య్ర పోరాటానికి, ఆ తరవాత– మితవాద, అతివాద, విప్లవ వాద సమరాలకు 90 ఏళ్ల ఘన చరిత్ర ఉంది. ఈ పోరాటాల ఫలితంగా 1947 ఆగస్టు 15న మన ఎర్రకోటమీద మన పాలనలో మన తొలి జెండా ఎగిరింది. నేడు 75 ఏళ్ల తర్వాత ఈ రోజున.. కశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు 100 కోట్ల జెండాలు ఎగురుతున్నాయి. మానవ చరిత్రలోనే మహోన్నతమైన స్వతంత్ర పోరాటాన్ని స్మరించుకుంటూ దేశం ఈ రోజున ఆజాదీ కా అమృత్ మహోత్సవాన్ని జరుపుకుంటోంది. తిరుగులేని విజయాల భారత్ గత 75 ఏళ్లలో దేశంగా ఇండియా తిరుగులేని విజయాలను, అనేక రంగాల్లో అభివృద్ధిని సొంతం చేసుకుంది. స్వాతంత్య్రం వచ్చేనాటికి మన జనాభా కేవలం 35 కోట్లు అయితే ఈ రోజున అది మరో 106 కోట్లు పెరిగి ఏకంగా 141 కోట్లకు చేరింది. ఇంత అతి పెద్ద ప్రజాస్వామ్య దేశానికి కావాల్సిన ఆహారం, నీరు, దుస్తులు, విద్య, వైద్యం, పరిశ్రమ, సేవలు ఇలా ఏది తీసుకున్నా తయారు చేయటం, అందించటం, మిగతా ప్రపంచంతో పోటీపడి ప్రగతి సాధించటం.. ఇవన్నీ అతి పెద్ద సవాళ్లే. రైతన్నలకు దేశం సెల్యూట్ చేయాలి మన దేశంలో 1947లో అప్పుడున్న 35 కోట్ల ప్రజలకు సరిపడా ఆహార ధాన్యాలు లేని దుస్థితి. దాన్ని అధిగమించి.. ఈ రోజు ప్రపంచంలో ఏకంగా 150 దేశాలకు ఆహార ధాన్యాలను ఎగుమతి చేయగల పరిస్థితిని తీసుకొచ్చిన మన రైతన్నలకు మన దేశమంతా సెల్యూట్ చేయాలి. ఒకప్పుడు పీఎల్ 480 స్కీమ్ కింద గోధుమ నూకను మానవతా సహాయంగా అందుకున్న మన దేశం.. ఈ రోజున ఏకంగా ఏటా 70 లక్షల టన్నుల గోధుమను, ఏడాదికి 210 లక్షల టన్నుల బియ్యాన్ని ప్రపంచానికి ఎగుమతి చేస్తోంది. స్వాతంత్య్రం వచ్చే నాటికి కేవలం 18 శాతం వ్యవసాయ భూమికి నీటి సదుపాయాలుంటే ఇప్పుడు 49 శాతానికి పైగా భూమికి సాగునీరందుతోంది. అగ్ర దేశాలతో పోటీ 1947లో వంద మందికి కేవలం 12 శాతం అక్షరాస్యులు ఉంటే.. ఈ రోజున మన అక్షరాస్యత, తాజా సర్వేల ప్రకారం 77 శాతానికి పైగా ఉంది. స్మార్ట్ ఫోన్ల వినియోగంలో ప్రపంచంలోనే రెండో స్థానం మనది. స్వాతంత్య్రం వచ్చే నాటికి మన దేశంలో 99 శాతం ప్రజల ఇంటికి కరెంటు లేదు. ఈ రోజు... కరెంటు లేని ఇళ్లు.. దేశం మొత్తంలో కేవలం ఒక శాతం కంటే తక్కువే. చిన్న జ్వరం తగ్గే మాత్ర కావాలన్నా అప్పట్లో అన్నీ దిగుమతి అయిన ట్యాబ్లెట్లే ఉంటే.. ఈ రోజు ప్రపంచ ఫార్మా రంగంలో ఇండియా టాప్ 3 దేశాల్లో ఒకటి. అమెరికాలో వాడుతున్న ప్రతి మూడు ట్యాబ్లెట్లలో ఒకటి, మనల్ని పాలించిన బ్రిటన్‌లో ప్రజలు వాడుతున్న ప్రతి నాలుగు ట్యాబ్లెట్లలో ఒకటి ఇండియా తయారు చేసిందే. స్ఫూర్తిని నింపిన విజయాలు అంతరిక్ష రంగంలో ఇస్రో సాధిస్తున్న ఘన విజయాలు, ఎంతటి శత్రువునైనా ఎదుర్కొనేలా మన శాస్త్రవేత్తలు తయారు చేసిన శక్తిమంతమైన అణ్వాయుధాలు–క్షిపణులు, మన తేజస్ వంటి యుద్ధ విమానాల కొనుగోలుకు అమెరికా ఆసక్తి కనబరచటం మొదలు... ఎందరో ఇండియన్లు అమెరికన్ కంపెనీల సీఈవోలుగా ఎదగటం వరకు, అలాగే 190 సంవత్సరాలు మన దేశాన్ని తన చేతిలోకి తీసుకున్న బ్రిటన్‌కు.. ఒక భారతీయ సంతతి పౌరుడు ప్రధాని రేసులో నిలవటం, ఒక భారతీయ సంతతి మహిళ అమెరికా ఉపాధ్యక్ష పదవిలో ఉండటం వరకు ఇవన్నీ భారతీయులు గర్వించే అంశాలే. ఇవన్నీ మనకు కొండంత స్ఫూర్తిని నింపే విజయాలే. జెండా వందనం చేస్తున్న సీఎం జగన్. చిత్రంలో డీజీపీ రాజేంద్రనాథ్‌రెడ్డి నిండు మనసుతో దిద్దుబాట్లు స్వతంత్ర దేశంగా ఇండియా, అంతర్జాతీయంగా భారతీయులు సాధించిన విజయాలకు కొదవ లేదన్నది ఎంత వాస్తవమో.. దేశంగా ఇండియాకు వచ్చిన ఈ స్వాతంత్ర్యం వ్యక్తులుగా, కులాలుగా, ప్రాంతాలుగా, జెండర్‌గా తమకు పూర్తిగా అందలేదన్న భావన కొన్ని సమూహాల్లో, కొన్ని ప్రాంతాల్లో, అనేకమంది ప్రజల్లో నేటికీ ఉండిపోయిందన్నది కూడా అంతే వాస్తవం. దేశ స్వాతంత్ర్యానికి 75 ఏళ్ల చరిత్ర ఉంటే... వందలు, వేల ఏళ్లుగా ఎన్నో సంఘ సంస్కరణ, సమాన హక్కుల పోరాటాలు జరుగుతున్నాయి. ఇంకొన్ని అణచివేతల మీద తిరుగుబాట్లు.. ఇవన్నీ మనం మాట్లాడకపోయినా, మనం దాచేసినా దాగని సత్యాలు. ఇవన్నీ నిజానికి... మనం నిండు మనసుతో చేసుకోవాల్సిన దిద్దుబాట్లు. మాటలతో కాకుండా చేతలతో సమాధానాలు ఇవ్వాల్సిన అంశాలు. ఇలాంటి సమాధానాల అన్వేషణే ఆంధ్రప్రదేశ్‌లో మన మూడేళ్ల పాలన. దశాబ్దాల ప్రశ్నలకు సమాధానం ఆహారాన్ని పండించే రైతు అర్ధాకలితో ఉండటాన్ని, భవన నిర్మాణ కార్మికుల కుటుంబాలు తరతరాలుగా గుడిసెల్లో మాత్రమే జీవించటాన్ని, గవర్నమెంటు బడికి వెళ్లే పేదల పిల్లలు కేవలం తెలుగు మీడియంలోనే చదవక తప్పని పరిస్థితిని, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ కులాలు ఎప్పటికీ పనివాళ్లుగా మిగిలిపోవాలనే పెత్తందారీ పోకడల్ని, వైద్యం ఖర్చు భరించలేక, అమ్ముకునేందుకు ఏమీలేక.. అప్పటికే అప్పులపాలై నిస్సహాయంగా చనిపోవటాన్ని, చదువులకు అయ్యే ఖర్చు భరించలేక పిల్లల్ని చదువులు మాన్పించి పనిలో పెట్టాల్సివస్తే తల్లి హృదయం తల్లడిల్లటాన్ని, ఎస్సీల్లో 36 శాతం, ఎస్టీల్లో 51 శాతం నేటికీ నిరక్షరాస్యులుగానే మిగిలిపోవటాన్ని, కార్పొరేట్ విద్యా సంస్థలకోసం, అంతకంటే మెరుగైన టీచర్లు ఉన్న ప్రభుత్వ విద్యా వ్యవస్థను బలి పెట్టటాన్ని, మనలో సగం ఉన్న అక్కచెల్లెమ్మలకు, వారి వాటాగా సగం ఉద్యోగాలు, సగం పదవులు, చట్ట సభల్లో సగం స్థానాలు కేటాయించకపోవటాన్ని, కొన్ని సామాజిక వర్గాల వారికి అధికార పదవుల్లో, పరిపాలనలో ఏనాటికీ వాటా దక్కకపోవటాన్ని, సంపద కేంద్రీకరణ ధోరణులకు తోడుగా, అధికార కేంద్రాలన్నీ ఒకేచోట ఉండాలన్న వాదనల్ని, గ్రామాల్లో ప్రభుత్వ సేవల విస్తరణ చేయకుండా పల్లెల్ని, రైతుల్ని గాలికి వదిలేయటాన్ని, ప్రతి పనికీ లంచాలు, కమీషన్ల వ్యవస్థ ఏర్పడటాన్ని, ఎన్నికల్లో ఇచ్చిన వాగ్దానాలను నెరవేర్చకపోవటం ద్వారా రాజకీయ పార్టీలు ఆయా వర్గాలకు చేసిన నష్టాన్ని, ఇలాంటి దుర్మార్గాలన్నింటినీ, మన స్వతంత్ర దేశంలో... మన దేశం వాడే, మన రాష్ట్రం వాడే. మన ప్రజలకు అన్యాయం చేస్తే... దాన్నే పరిపాలన అంటాడని... ఇండిపెండెంట్‌గా ఉండాల్సిన మీడియా, తమ స్వార్థ ప్రయోజనాల కోసం దానికి భజన చేస్తుందని... మన స్వాతంత్య్ర సమర యోధులు, మన రాజ్యాంగ నిర్మాతలు ఏనాడైనా ఊహించారా? ఇవన్నీ మన ముందున్న ప్రశ్నలు. దశాబ్దాలుగా అనేక వర్గాల అనుభవాల నుంచి, ఆయా వర్గాలకు జరిగిన అన్యాయాల నుంచి పుట్టిన ఈ ప్రశ్నలకు.. మనందరి ప్రభుత్వంలో.. గత మూడేళ్ల పాలనతో సాధ్యమైనంత మేరకు శక్తి వంచన లేకుండా సమాధానం ఇవ్వగలిగామని సగర్వంగా తెలుపుతున్నాను. పౌర సేవల్లో విప్లవాత్మక మార్పులు మన గ్రామానికి, మన నగరానికి అందే పౌరసేవల్లో మార్పులు తీసుకువచ్చాం. ఒకటవ తేదీన సూర్యోదయానికి ముందే అవ్వాతాతలు, వికలాంగులు, వితంతువుల పింఛన్లు వారి తలుపు తట్టి చిరునవ్వుతో గుడ్ మార్నింగ్ చెప్పి మరీ ఒక్క రూపాయి కూడా లంచం తీసుకోకుండా 2.70 లక్షల మంది వలంటీర్లు ఇంటికి వచ్చి ఇచ్చి వెళ్లే వ్యవస్థ ఏర్పాటు చేశాం. ప్రతి 2000 మందికి పౌర సేవలందించేలా గ్రామ/వార్డు సచివాలయం, అక్కడి నుంచి నాలుగు అడుగులు వేస్తే రైతులకు విత్తనం నుంచి పంట అమ్మకం వరకు అన్ని విధాలా సహాయం చేసే రైతు భరోసా కేంద్రాలు, మరో నాలుగు అడుగుల్లో కనిపించే వైఎస్సార్ విలేజ్ క్లినిక్‌లు, ఇంకో నాలుగు అడుగులు వేస్తే కనిపించే ఇంగ్లిష్ మీడియం స్కూల్, మరో నాలుగు అడుగుల దూరంలోనే మీ గ్రామంలోనే నిర్మాణం కాబోతున్న డిజిటల్ గ్రంథాలయాలు, మరో నాలుగు అడుగుల దూరంలో ఇంగ్లిష్‌లో బోధించే ప్రీ ప్రైమరీలు, ఫౌండేషన్ స్కూళ్లు, ప్రతి మండలానికీ ఒక అధునాతన 108, ప్రతి మండలానికి రెండు పీహెచ్‌సీలు, ప్రతి పీహెచ్సీకీ ఒక అధునాతన 104.. అందులో ఇద్దరు డాక్టర్లను పెట్టి వారిని విలేజ్ క్లినిక్‌తో అనుసంధానించి అమలు కానున్న ఫ్యామిలీ డాక్టర్ కాన్సెప్ట్.. ఇవన్నీ గడచిన 75 ఏళ్లలో కాదు.. కేవలం ఈ మూడేళ్లలో మనం తీసుకొచ్చిన మార్పులు. పరిపాలన వికేంద్రీకరణే మా విధానం ప్రజలకు పరిపాలనను మరింత చేరువ చేస్తూ, పర్యవేక్షణను మెరుగుపరుçస్తూ.. గ్రామాలూ, నగరాల్లో మార్పులే కాక, గత ఏడాది వరకు కేవలం 13 జిల్లాలుంటే మరో 13 జిల్లాల ఏర్పాటు ద్వారా పరిపాలన వికేంద్రీకరణలో మరో అధ్యాయాన్ని ఆరంభించాం. రాజధాని స్థాయిలో పరిపాలన వికేంద్రీకరణే మా విధానం అని.. ప్రాంతీయ ఆకాంక్షలకు, ప్రాంతాల ఆత్మగౌరవానికి, అన్ని ప్రాంతాల మధ్య సమతౌల్యంతోపాటు పటిష్ట బంధానికి ఇదే పునాది అని గట్టిగా నమ్మి అడుగులు వేస్తున్నాం. ఇదీ.. మూడేళ్లలోనే మనందరి ప్రభుత్వం మనసు పెట్టి తీసుకువచ్చిన మార్పు. వ్యవసాయానికి రూ.1.27 లక్షల కోట్ల సాయం వైఎస్సార్ రైతు భరోసాతో ఏకంగా 52 లక్షల రైతు కుటుంబాలకు ఏటా రూ.13,500 చొప్పున సహాయం అందిస్తున్నాం. రైతు భరోసా కేంద్రాలను గ్రామస్థాయిలో తీసుకువచ్చి ఈ–క్రాప్ మొదలు, ఉచిత పంటల బీమా, ఏ సీజన్లో నష్టాన్ని ఆ సీజన్ ముగిసేలోగానే అంచనా వేసి ఇన్పుట్ సబ్సిడీ అందించటం, సున్నా వడ్డీ పంట రుణాలు, పగటిపూటే 9 గంటలు నాణ్యమైన ఉచిత విద్యుత్తు వంటివి అందిస్తూ మూడేళ్లలో రైతు ప్రభుత్వంగా రైతు సంక్షేమానికి మనం చేసిన ఖర్చు ఏకంగా రూ.83 వేల కోట్లు. ఇది కాకుండా ధాన్యం సేకరణకు మరో రూ. 44 వేల కోట్లకు పైగానే ఖర్చు చేసి గిట్టుబాటు ధర కల్పించాం. మొత్తంగా మూడేళ్లలో ఏకంగా రూ. 1.27 లక్షల కోట్లను వ్యవసాయంపై ఖర్చు చేశాం. దీని ఫలితంగా అంతకుముందు ఐదేళ్ల పాలనతో పోలిస్తే మన మూడేళ్ల పాలనలో ఆహార ధాన్యాల ఉత్పత్తి సగటున ఏటా 16 లక్షల టన్నులు పెరిగింది. ఇది మన ప్రభుత్వం వ్యవసాయంలో వేసిన ముందడుగు. అక్కచెల్లెమ్మలకు రూ.2–3 లక్షల కోట్ల ఆస్తి 75 ఏళ్ల స్వాతంత్య్రం తరవాత మూడేళ్ల క్రితం శాచురేషన్ పద్ధతిలో పేదలకు ఇళ్ల పట్టాలు ఇవ్వాలని మన ప్రభుత్వం దరఖాస్తులు ఆహ్వానించింది. ఇందులో ఏకంగా 31 లక్షల కుటుంబాలకు అంటే దాదాపు 1.25 కోట్ల జనాభాకు సొంత ఇల్లు లేదని తేలింది. వీరందరికీ ఇప్పటికే ఇళ్ళ పట్టాలు ఇచ్చాం. అది కూడా ఆ కుటుంబంలో అక్కచెల్లెమ్మల పేరు మీద రిజిస్టర్ చేశాం. ఇందులో 21 లక్షల ఇళ్లు వివిధ దశల్లో నిర్మాణంలో ఉన్నాయి. ఇవి పూర్తయితే ఒక్కో ఇంటి విలువ కనీసం రూ.7 లక్షల నుంచి రూ. 10 లక్షలు వేసుకుంటే.. 31 లక్షల మంది అక్కచెల్లెమ్మల చేతుల్లో అక్షరాలా దాదాపుగా రూ. 2 లక్షల కోట్ల నుంచి రూ.3 లక్షల కోట్ల సంపదను ఉంచుతున్నాం. ఇదీ రాష్ట్ర ప్రభుత్వం అక్కచెల్లెమ్మలకు ఇస్తున్న కానుక. పిల్లల చదువులతో పేదల తలరాతల మార్పు పిల్లల చదువులతోనే ఇంటింటా పేదల తలరాతలు మార్చాలని, వారి ఇంట వెలుగులు నింపాలనే మంచి సంకల్పంతో, రూపం మార్చుకున్న అంటరానితనాన్ని తుదముట్టించాలన్న నిశ్చయంతో.. నా ఎస్సీ, నా ఎస్టీ, నా బీసీ, నా మైనార్టీలు ఎప్పటికీ పనివాళ్లుగా మిగిలిపోవాలనే పెత్తందారీ పోకడల నడ్డివిరుస్తూ గవర్నమెంటు బడులన్నింటిలో ఇంగ్లి్ష్ మీడియంను అమలు చేయాలని నిర్ణయించాం. దీనితోపాటు పిల్లలను చదివించే తల్లులకు అండగా, తోడుగా నిలుస్తూ దేశంలోనే ఎక్కడా లేనివిధంగా జగనన్న అమ్మ ఒడి పథకాన్ని తొలిసారిగా అమలు చేస్తున్నాం. ఇవి కాకుండా వైఎస్సార్ సంపూర్ణ పోషణ, జగనన్న గోరుముద్ద, జగనన్న విద్యా కానుక, మనబడి–నాడు నేడు, సీబీఎస్ఈ సిలబస్, బైజూస్ సంస్థతో ఒప్పందం, 8వ తరగతి పిల్లలకు ట్యాబ్స్, జగనన్న విద్యా దీవెన, జగనన్న వసతి దీవెన.. ఇన్ని పథకాలతో విద్యారంగంలో తీసుకు వస్తున్న ప్రతి మార్పు వెనకా మన రాష్ట్రంలోని పిల్లలందరి భవిష్యత్తుపై మనందరి ప్రభుత్వం తీసుకున్న బాధ్యత కనిపిస్తుంది. ఇందుకోసం మూడేళ్లలో విద్యారంగంపై ఏకంగా రూ. 53 వేల కోట్లకు పైనే వ్యయం చేశాం. 95 శాతం ప్రజలకు ఆరోగ్యశ్రీతో భరోసా వార్షిక ఆదాయం రూ.5 లక్షలలోపు ఉన్నవారందరికీ వైఎస్సార్ ఆరోగ్యశ్రీ వర్తింపజేయటం ద్వారా 95 శాతం ప్రజలకు ఆరోగ్యశ్రీ ఇస్తున్నాం. రూ. వెయ్యి ఖర్చు దాటితే ఉచితంగా వైద్యం అందించాలన్న తపనతోనే 2,434 ప్రొసీజర్లను ఆరోగ్యశ్రీలో చేర్చాం. వీటిని ఈ నెలలోగా 3,133కు పెంచుతున్నాం. ఆపరేషన్ తర్వాత రోగులు కోలుకునే సమయంలో వారికి దన్నుగా నెలకు రూ.5 వేలు వైఎస్సార్ ఆరోగ్య ఆసరాగా ఇస్తున్నాం. ఎమర్జెన్సీలో ప్రాణాలు రక్షించే 108, 104 సేవలకు అర్థం చెపుతూ ఏకంగా 1,088 వాహనాల్ని ప్రతి మండలానికీ పంపాం. వీటిని మరింతగా పెంచుతూ మరో 432 వాహనాలను పంపనున్నాం. గ్రామగ్రామానా వైఎస్సార్ విలేజ్ క్లినిక్‌లు ఏర్పాటవుతున్నాయి. వీటితో పీహెచ్‌సీలు అనుసంధానమై గ్రామాల్లో ఫ్యామిలీ డాక్టర్ కాన్సెప్ట్‌కు బీజం పడనుంది. రాష్ట్రంలో ఇప్పటివరకు 11 టీచింగ్ ఆస్పత్రులు ఉంటే, కొత్తగా మరో 16 వైద్య బోధనాస్పత్రులను నిర్మిస్తున్నాం. గ్రామం నుంచి జిల్లా వరకు ఆసుపత్రుల రూపాన్ని, సేవల్ని, సదుపాయాల్ని మార్చేస్తూ.. జాతీయ ప్రమాణాలతో వైద్యాన్ని అందించటానికి వైద్య రంగంలో రూ.16వేల కోట్లతో నాడు–నేడు అమలు చేస్తున్నాం. ఈ ఒక్క రంగంలోనే అక్షరాలా 40 వేల కొత్త ఉద్యోగాలు ఇచ్చాం. మూడేళ్లలో 6.03 లక్షల మందికి ఉద్యోగాలు ఒకవైపు ప్రభుత్వ బడుల్ని, మరో వైపు ప్రభుత్వ ఆస్పత్రుల్ని మెరుగుపరచడమే కాకుండా ఈ మూడేళ్లలోనే మొత్తంగా 6.03 లక్షల మందికి ఉద్యోగాలు ఇచ్చాం. ఇందులో 1.84 లక్షల శాశ్వత ప్రభుత్వోద్యోగాలతోపాటు, 20 వేల కాంట్రాక్టు ఉద్యోగాలు, 4 లక్షల ఔట్ సోర్సింగ్ ఉద్యోగాలు కల్పించాం. వీరంతా మన కళ్ల ఎదుటే గ్రామ/వార్డు సచివాలయాల్లో, గ్రామాల్లో వలంటీర్లుగా, ఆర్టీసీలో, మారుతున్న ప్రభుత్వ ఆస్పత్రుల్లో కనిపిస్తారు. పారిశ్రామిక రంగానికి ఊతం దాదాపు నాలుగు దశాబ్దాల తరవాత ప్రభుత్వ రంగంలో మరో నాలుగు సీ పోర్టులు, 9 ఫిషింగ్ హార్బర్లు నిర్మిస్తున్నాం. సువిశాల సముద్ర తీరంలో ప్రతి 50 కిలోమీటర్లకు ఒక సీ పోర్టు, ఫిషింగ్ హార్బర్ ఉండేలా చర్యలు తీసుకుంటున్నాం. కుదేలైన ఎంఎస్ఎంఈ రంగాన్ని నిలబెడుతూ 10లక్షల మంది ఉపాధికి భరోసానిస్తూ అడుగులు ముందుకు వేస్తున్నాం. ఏపీ నుంచే 21వ శతాబ్దపు ఆధునిక మహిళ 21వ శతాబ్దపు ఆధునిక భారతీయ మహిళ ఆంధ్రప్రదేశ్‌లోనే ఆవిర్భవించాలన్న లక్ష్యంతో మహిళా సాధికారతలో దేశంలో ఏ ప్రభుత్వం వేయని అడుగులు వేస్తున్నాం. 44.5 లక్షల తల్లులకు, 85 లక్షల పిల్లలకు మంచి జరిగేలా మూడేళ్లలో జగనన్న అమ్మ ఒడి ద్వారా రూ.19,618 కోట్లు, వైఎస్సార్ ఆసరా ద్వారా 78.74 లక్షల డ్వాక్రా పొదుపు సంఘాల అక్కచెల్లెమ్మలకు రూ. 12,758 కోట్లు, వైఎస్సార్ సున్నా వడ్డీ ద్వారా కోటీ రెండు లక్షల మంది అక్కచెల్లెమ్మలకు రూ.3,615 కోట్లు అందించాం. వైఎస్సార్ చేయూత ద్వారా 24.96 లక్షల మంది 45–60 మధ్య వయసున్న నా ఎస్సీ, నా ఎస్టీ, నా బీసీ, నా మైనార్టీ అక్కచెల్లెమ్మలకు ఇప్పటికే రూ. 9,180 కోట్ల లబ్ధి చేకూర్చాం. వైఎస్సార్ కాపు నేస్తం ద్వారా మరో రూ. 1,492 కోట్లు, వైఎస్సార్ ఈబీసీ నేస్తం ద్వారా రూ.589 కోట్లతో తోడ్పాటునందించాం. ఈ సొమ్ముకు బ్యాంకుల ద్వారా మరింత రుణ సదుపాయంతో, ప్రముఖ కార్పొరేట్ సంస్థల భాగస్వామ్యంతో అక్కచెల్లెమ్మల ఆర్థిక స్వావలంబనకు చేయూత ఇస్తున్నాం. అక్కచెల్లెమ్మలకు దన్నుగా నిలిచాం అక్కచెల్లెమ్మలకు ఆలయ బోర్డుల నుంచి వ్యవసాయ మార్కెటింగ్ కమిటీల వరకు ప్రభుత్వ కార్పొరేషన్ల చైర్మన్లు, డైరెక్టర్ల వరకు ప్రతి ఒక్క రాజకీయ నియామకంలోనూ, నామినేషన్ కాంట్రాక్టుల్లోను 50 శాతం రిజర్వేషన్లు చట్టం చేసి మరీ అమలు చేసిన ప్రభుత్వం కూడా భారతదేశ చరిత్రలో మనం మాత్రమే. దిశ చట్టానికి రూప కల్పన, దిశ యాప్, దిశ పోలీస్ స్టేషన్ల ఏర్పాటు, ప్రత్యేక పబ్లిక్ ప్రాసిక్యూటర్ల నియామకం, ప్రతి రెండు వేల జనాభాకూ గ్రామంలోనే ఒక మహిళా పోలీస్ నియామకం.. ఇవన్నీ మహిళా రక్షణపరంగా మనందరి ప్రభుత్వం తీసుకున్న విప్లవాత్మక చర్యలు. సామాజిక న్యాయ చరిత్రలో సరికొత్త అధ్యాయం మొదటి విడత 56 శాతం, రెండో విడతలో 70 శాతం మంత్రిమండలి పదవులు ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలకు ఇచ్చాం. రెండు మంత్రివర్గాల్లోనూ ఐదుగురికి డిప్యూటీ సీఎం పదవులు ఇస్తే.. నాలుగు(80శాతం) నా ఎస్సీ, నా ఎస్టీ, నా బీసీ, నా మైనార్టీలకే అవకాశం కల్పించాం. శాసనసభ స్పీకర్‌గా ఒక బీసీ, శాసన మండలి చైర్మన్‌గా ఎస్సీని నియమించడమే కాకుండా శాసన మండలి డిప్యూటీ ౖచైర్పర్సన్గా మైనార్టీ అక్కకు స్థానం ఇచ్చి సామాజిక న్యాయ చరిత్రలో సరికొత్త అధ్యాయం సృష్టించాం. ఈ మూడేళ్లలో రాజ్యసభకు 8 మందిని పంపిస్తే అందులో నలుగురు బీసీలు, శాసన మండలికి అధికారపార్టీ నుంచి పంపిన 32 మందిలో 18 మంది ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాల వారే. పరిషత్ ఎన్నికల్లో 13కు 13 జిల్లా పరిషత్‌లను అధికారపార్టీ దక్కించుకుంటే వీటిలో చైర్పర్సన్ పదవుల్లో ఏకంగా తొమ్మిది (70శాతం) ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకే కేటాయించాం. నామినేటెడ్ పదవులు, నామినేటెడ్ పనుల్లో 50 శాతం ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకే రిజర్వేషన్లు కల్పిస్తూ చట్టం చేసి అమలు చేసిన తొలి ప్రభుత్వం కూడా మనదే. అందులోనూ 50 శాతం మహిళలకు రిజర్వేషన్ కల్పించిన మొదటి ప్రభుత్వం కూడా మనదే. వివిధ ప్రభుత్వ కార్పొరేషన్లలో 137 చైర్మన్ పదవుల్లో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు మొత్తం 58 శాతం పదవులు ఇచ్చాం. బీసీలకు ప్రత్యేకంగా 56 కార్పొరేషన్లు, ఎస్సీలకు 3 కార్పొరేషన్లు, ఎస్టీలకు ఒక కార్పొరేషన్‌ను నూతనంగా ఏర్పాటు చేశాం. వీటితోపాటు శాశ్వత ప్రాతిపదికన బీసీ కమిషన్‌ను నియమించిన ఘనత, 139 బీసీ కులాలకు సంబంధించి కొత్తగా 56 కార్పొరేషన్లు ఏర్పాటు చేసిన తొలి ప్రభుత్వం కూడా మనదే. మండల పరిషత్ చైర్మన్, ఎంపీటీసీ, జెడ్పీటీసీ, సర్పంచ్‌లు ఇలా ఎక్కడ చూసినా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలే ఎక్కువగా కనిపిస్తున్నారన్నది సత్యం. 95 శాతం హామీలు అమలు మేనిఫెస్టోను భగవద్గీత, ఖురాన్, బైబిల్‌గా భావించి మూడేళ్లలోనే 95 శాతం వాగ్దానాలు అమలు చేశాం. పేదవాడి ఆర్తిని, అవసరాన్ని దృష్టిలో పెట్టుకుని నిర్ణయాలు తీసుకున్నాం. ఈ దేశంలోని అత్యంత నిస్సహాయుడి కంటిలో నీరు తుడవటానికి మన ప్రభుత్వాలు, వాటి అధికారం ఉపయోగపడాలన్న మహాత్ముడి మాటల్ని తొలి స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలో తొలి ప్రధాని జవహర్లాల్ నెహ్రూ ఉటంకించారు. ఈ భావాలను మనసా వాచా కర్మణా.. త్రికరణ శుద్ధిగా అమలు చేస్తున్నాం. ప్రజాస్వామ్యానికి అర్థం చెబుతూ ప్రజలతోపాటు ప్రాంతాలకూ న్యాయం చేస్తూ గడపగడపకూ సంక్షేమం, అభివృద్ధి ఫలాలను అందిస్తూ మన సమాజంలో వెనుకబాటు, నిరక్షరాస్యత, సామాజిక అభద్రత, రాజకీయ అణచివేత, ఆర్థిక అవకాశాల లేమి వంటి ప్రతి అంశంపై సంపూర్ణమైన విజయం సాధించే దిశగా భావపరమైన పోరాటం కొనసాగుతుంది. గొప్పదైన ఈ దేశానికి, దేశ ప్రజలకు ప్రణామాలు సమర్పించుకుంటూ, దేవుడి ఆశీస్సులు, ప్రజలందరి చల్లని దీవెనలు మనందరి ప్రభుత్వానికీ కలకాలం ఉండాలి. ఈ కార్యక్రమానికి శాసనమండలి చైర్మన్ కె మోషేన్‌రాజు, శాసనసభ స్పీకర్ తమ్మినేని సీతారాం, రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సమీర్ శర్మ, డీజీపీ కేవీ రాజేంద్రనాథ్‌రెడ్డి, పలువురు ప్రజా ప్రతినిధులు, ఉన్నతాధికారులు హాజరయ్యారు. స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలకు ముఖ్యమంత్రి సతీమణి వైఎస్ భారతిరెడ్డి కూడా హాజరయ్యారు. -
ఇందిరా గాంధీ మునిసిపల్ స్టేడియం వద్ద పోలీస్ పెరేడ్ రిహార్సిల్ దృశ్యాలు
-
విజయవాడ : ఇందిరా గాంధీ మునిసిపల్ స్టేడియం వద్ద పోలీస్ పెరేడ్ రిహార్సిల్ దృశ్యాలు (ఫొటోలు)
-
పంద్రాగస్టు వేడుకలకు బెజవాడ ముస్తాబు
సాక్షి ప్రతినిధి, విజయవాడ: ఎన్టీఆర్ జిల్లా విజయవాడలోని ఇందిరాగాంధీ మునిసిపల్ స్టేడియం 75వ స్వాతంత్య్ర దినోత్సవాలకు ముస్తాబవుతోంది. ముఖ్యమంత్రి సీఎం వైఎస్ జగన్ కార్యక్రమాల కోఆర్డినేటర్, ఎమ్మెల్సీ తలశిల రఘురామ్, సెంట్రల్ ఎమ్మెల్యే మల్లాది విష్ణు, ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ ఎస్.ఢిల్లీరావు, నగర పోలీస్ కమిషనర్ టీకే రాణా, జాయింట్ కలెక్టర్ నుపూర్ అజయ్‌లు బుధవారం ఈ వేడుకల ఏర్పాట్లను పరిశీలించి పలు సూచనలు చేశారు. తలశిల మాట్లాడుతూ వేడుకలను అత్యంత ఘనంగా నిర్వహించేందుకు సన్నాహాలు చేస్తున్నట్టు తెలిపారు. వీటిని తిలకించేందుకు ఈ ఏడాది సామాన్య ప్రజలకూ అనుమతిస్తున్నట్టు చెప్పారు. కలెక్టర్ మాట్లాడుతూ గవర్నర్ విశ్వభూషణ్ హరిచందన్, సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి, రాష్ట్ర మంత్రులు, ఉన్నతాధికారులు పాల్గొంటారన్నారు. ప్రభుత్వ అభివృద్ధి పథకాలపై 15 శకటాలను సిద్ధంగా ఉంచాలని అధికారులను ఆదేశించారు. స్టేడియం పరిసర ప్రాంతాల్లో ట్రాఫిక్ ఇబ్బందుల్లేకుండా చర్యలు తీసుకుంటున్నట్టు తెలిపారు. 600 మంది పోలీసులతో బందోబస్తు ఏర్పాటు చేస్తున్నామని వివరించారు. -
ఇఫ్తార్ విందుకు సర్వం సిద్ధం
గాంధీనగర్ (విజయవాడ సెంట్రల్): పవిత్ర రంజూన్ మాసాన్ని పురస్కరించుకుని నేడు (బుధవారం) ఎన్టీఆర్ జిల్లా విజయవాడలోని ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో రాష్ట్ర ప్రభుత్వం తరఫున ఇవ్వనున్న ఇఫ్తార్ విందుకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. స్టేడియంలో ఏర్పాట్లను డిప్యూటీ సీఎం, మైనారిటీశాఖ మంత్రి అంజద్‌బాషా మంగళవారం ఎమ్మెల్సీలు తలశిల రఘురాం, ఎండీ రుహుల్లా, లేళ్ల అప్పిరెడ్డి, ఎమ్మెల్యేలు వెలంపల్లి శ్రీనివాసరావు, మల్లాది విష్ణు, కలెక్టర్ ఎస్.ఢిల్లీరావులతో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా అంజద్‌బాషా మాట్లాడుతూ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొనే ఈ ఇఫ్తార్ విందుకు ముస్లిం సోదరులు పెద్ద ఎత్తున పాల్గొని హాజరుకావాలని కోరారు. ఎనిమిది వేల మంది ముస్లిం సోదరులకు పాస్‌లు అందజేస్తామన్నారు. స్టేడియం వాటర్ ట్యాంక్ వైపు గేటు నుంచి సాధారణ ప్రజలకు, బందరు రోడ్డు వైపు ప్రధాన గేటు నుంచి వీఐపీలకు ప్రవేశం కల్పించినట్లు తెలిపారు. ఇఫ్తార్ విందు కోసం మైనారిటీ సోదరులకు రాష్ట్ర వ్యాప్తంగా రూ.80 లక్షలు మంజూరు చేసినట్లు చెప్పారు. ఎమ్మెల్యే వెలంపల్లి శ్రీనివాసరావు మాట్లాడుతూ విజయవాడ వన్‌టౌన్‌లో రూ.15 కోట్లతో నిర్మించిన ముసాఫిర్ ఖానాను సీఎం బుధవారం ప్రారంభిస్తారని తెలిపారు. నగరపాలక సంస్థ కమిషనర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్, సబ్ కలెక్టర్ జి.సూర్యసాయిప్రవీణ్ చంద్, వైఎస్సార్సీపీ విజయవాడ తూర్పు నియోజకవర్గ ఇన్చార్జి దేవినేని అవినాష్ పాల్గొన్నారు. -
హ్యాండ్‌బాల్ చాంపియన్ ఆంధ్రప్రదేశ్
విజయవాడ స్పోర్ట్స్: జాతీయ జూనియర్ బాలుర హ్యాండ్‌బాల్ చాంపియన్‌షిప్‌ను ఆంధ్రప్రదేశ్ కైవసం చేసుకుంది. విజయవాడ ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో సోమవారం సాయంత్రం హోరాహోరీగా జరిగిన ఫైనల్స్‌లో ఆంధ్రప్రదేశ్ 35–30 తేడాతో రాజస్తాన్‌పై విజయం సాధించింది. 40 నిమిషాల పోరులో తొలి అర్ధ భాగం ముగిసే సరికి రాజస్తాన్ 2 పాయింట్లు ముందంజలో ఉండగా... రెండో అర్ధ భాగంలో చెలరేగిన ఆంధ్రప్రదేశ్ చివరి వరకు ఆధిక్యాన్ని నిలబెట్టుకుంది. విజేతలకు ఆంధ్రప్రదేశ్ హ్యాండ్‌బాల్ అసోసియేషన్ చైర్మన్ మల్లాది విష్ణు, ఏపీ ఫైబర్‌నెట్ చైర్మన్ పి.గౌతంరెడ్డి, రాష్ట్ర హ్యాండ్‌బాల్ అసోసియేషన్ కార్యదర్శి పి.సత్యనారాయణరాజు ట్రోఫీలు అందజేశారు. -
గణతంత్ర వేడుకలకు ముస్తాబు
సాక్షి ప్రతినిధి, విజయవాడ: భారత గణతంత్ర వేడుకలకు విజయవాడలోని ఇందిరాగాంధీ మునిసిపల్ స్టేడియం ముస్తాబవుతోంది. రాష్ట్రస్థాయిలో జరిగే ఈ వేడుకలను ఘనంగా నిర్వహించేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. కోవిడ్ మార్గదర్శకాలకు అనుగుణంగా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఏర్పాట్లను ఎమ్మెల్సీ తలశిల రఘురామ్ వివిధ శాఖల అధికారులతో కలిసి సోమవారం పరిశీలించి సమీక్ష నిర్వహించారు. ప్రోటోకాల్ డైరెక్టర్ బాలసుబ్రహ్మణ్యం, కలెక్టర్ జె.నివాస్, జాయింట్ కలెక్టర్లు కె.మాధవీలత, మోహన్‌కుమార్, విజయవాడ సబ్ కలెక్టర్ జి.సూర్యసాయి ప్రవీణ్‌చంద్, విద్యుత్, సమాచార పౌర సంబంధాలు, రెవెన్యూ, పోలీస్ తదితర శాఖల అధికారులు సమీక్షలో పాల్గొన్నారు. పరేడ్‌కు సంబంధించిన రిహార్సల్స్‌ను మంగళవారం నిర్వహిస్తారు. ఈ కార్యక్రమానికి డీజీపీ గౌతంసవాంగ్, ఇతర శాఖల ఉన్నతాధికారులు హాజరవుతారు. కోవిడ్ మార్గదర్శకాలను అనుసరించి ఈ వేడుకలకు 200 మంది అతిథులను మాత్రమే ఆహ్వానిస్తున్నారు. 16 శకటాల ప్రదర్శన రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలను కళ్లకు కట్టినట్లుగా ప్రదర్శించేందుకు 16 శకటాలను సిద్ధం చేస్తున్నారు. ఇప్పటికే ఈ శకటాలను రాష్ట్ర సమాచార పౌర సంబంధాల కమిషనర్ టి.విజయకుమార్‌రెడ్డి పరిశీలించి పలు సూచనలు చేశారు. జాతీయ జెండా రంగులతో స్టేడియాన్ని అందంగా తీర్చిదిద్దారు. వేడుకల్లో గవర్నర్ విశ్వభూషణ్ హరిచందన్, ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి, రాష్ట్ర మంత్రులు, ఉన్నతాధికారులు పాల్గొంటారు. గణతంత్ర వేడుకలను దృష్టిలో ఉంచుకొని ట్రాఫిక్‌ను మళ్లిస్తున్నట్లు విజయవాడ నగర పోలీస్ కమిషనర్ టీకే రాణా తెలిపారు. -
ఏపీ అభివృద్ధిలో దూసుకెళ్లాలి: సీజేఐ జస్టిస్ ఎన్వీ రమణ ఆకాంక్ష
సాక్షి, అమరావతి/గుణదల (విజయవాడ తూర్పు): రాష్ట్ర ప్రజలంతా శాంతి సౌభాగ్యాలతో, ఆయురారోగ్యాలతో సుఖంగా జీవించాలని.. ఆంధ్రప్రదేశ్ మరింత అభివృద్ధి చెందాలని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ నూతలపాటి వెంకటరమణ ఆకాంక్షించారు. భారత ప్రధాన న్యాయమూర్తి (సీజేఐ) హోదాలో తొలిసారి జిల్లాకు వచ్చిన తనకు రాష్ట్ర ప్రభుత్వం తరఫున ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి తేనేటి విందుకు ఆహ్వానించటం సంతోషంగా ఉందని సీజేఐ అన్నారు. విజయవాడ ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో రాష్ట్ర ప్రభుత్వం జస్టిస్ ఎన్వీ రమణ గౌరవార్థం ఏర్పాటు చేసిన ‘హై టీ’ కార్యక్రమంలో సీజేఐ మాట్లాడారు. రాష్ట్ర ప్రభుత్వానికి, సీఎం జగన్‌కు తన తరఫున, తన కుటుంబం తరపున కృతజ్ఞతలు తెలిపారు. అదే విధంగా ప్రజలకు క్రిస్మస్ శుభాకాంక్షలు చెప్పారు. సీఎం వైఎస్ జగన్ మాట్లాడుతూ.. 1965 తర్వాత ఏపీ నుంచి తెలుగు వ్యక్తి సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ కావడం ఇదే తొలిసారన్నారు. ఇది తెలుగు జాతికి అత్యంత గర్వకారణమని, సీఎంగా తనకు ఎంతో సంతోషదాయకమన్నారు. సీజేఐ మరిన్ని శిఖరాలు అధిరోహించాలని ఆకాంక్షించారు. విజయవాడ ఇందిరాగాంధీ మునిసిపల్ స్టేడియంలో జరిగిన హై టీ కార్యక్రమంలో పాల్గొన్న జస్టిస్ ఎన్వీ రమణ సతీమణి శివమాల, సీఎం వైఎస్ జగన్ సతీమణి వైఎస్ భారతి తదితరులు సీజేఐకు సీఎం సాదర స్వాగతం అంతకుముందు.. జస్టిస్ ఎన్. వెంకట రమణకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్ పుష్పగుచ్ఛం ఇచ్చి సాదరంగా స్వాగతం పలికారు. సీజేఐ సతీమణి శివమాల, సీఎం సతీమణి వైఎస్ భారతి, ఇతర ప్రముఖుల్లో కొందరు సతీసమేతంగా ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. ప్రాంగణంలోకి జస్టిస్ ఎన్వీ రమణను సాదరంగా తోడ్కొని వచ్చిన సీఎం.. అక్కడ తన మంత్రివర్గ సహచరులు, పలువురు ప్రజా ప్రతినిధులు, ఉన్నతాధికారులను సీజేఐకు పరిచయం చేశారు. అలాగే జడ్జిలు, ఇతర న్యాయాధికారులను ఇరువురూ పలకరించారు. అనంతరం.. జస్టిస్ ఎన్వీ రమణను ముఖ్యమంత్రి శాలువాతో సత్కరించి శ్రీ వెంకటేశ్వరస్వామి ప్రతిమను బహూకరించారు. కార్యక్రమానికి హాజరైన సుప్రీంకోర్టు న్యాయమూర్తి జేకే మహేశ్వరి, ఏపీ హైకోర్టు సీజే ప్రశాంత్‌కుమార్ మిశ్రా, తెలంగాణ హైకోర్టు సీజే సతీష్‌చంద్ర శర్మ, రెండు రాష్ట్రాల హైకోర్టుల న్యాయమూర్తులను కూడా సీఎం సత్కరించి జ్ఞాపికలను అందజేశారు. ఈ కార్యక్రమంలో మంత్రులు పెద్దిరెడ్డి, బొత్స, కొడాలి నాని, కురసాల కన్నబాబు, పలువురు ఉన్నతాధికారులు, ప్రజాప్రతినిధులు, ఇతర ప్రముఖులు హాజరయ్యారు. జస్టిస్ ఎన్వీ రమణ సతీమణి శివమాలకు పుష్పగుచ్ఛం అందజేస్తున్న వైఎస్ భారతి జస్టిస్ ఎన్వీ రమణను కలిసిన ప్రముఖులు సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ నూతలపాటి వెంకట రమణను శనివారం పలువురు ప్రముఖులు మర్యాదపూర్వకంగా కలిశారు. కనకదుర్గ అమ్మవారి దర్శనానంతరం శనివారం ఉదయం వెంకటరమణ దంపతులు నోవోటెల్ హోటల్‌కు చేరుకున్నారు. అక్కడ తనను కలవడానికి వచ్చిన ప్రతి ఒక్కరిని జస్టిస్ వెంకటరమణ ఆప్యాయంగా పలకరించారు. న్యాయమూర్తులకు, న్యాయవాదులకు, జుడీషియల్ సిబ్బందికి తగిన సలహాలు ఇచ్చారు. ముందుగా డిప్యూటి సీఎం నారాయణస్వామి ఎన్వీ రమణను కలిసి పుష్పగుచ్ఛం అందించారు. జస్టిస్ ఎన్వీ రమణను కలిసిన వారిలో రహదారులు భవనాల శాఖ ప్రత్యేక కార్యదర్శి కృష్ణబాబు, జిల్లా కలెక్టర్ జె. నివాస్, పద్మశ్రీ అవార్డు గ్రహీత సంగీత కళాకారులు అన్నవరపు రామస్వామి, పర్యావరణవేత్త ప్రొఫెసర్ అజయ్ కాట్రగడ్డ, మాజీ కేంద్ర, రాష్ట్ర మంత్రులు కావూరి సాంబశివరావు,అచ్చెన్నాయుడు ఉన్నారు. -
రాష్ట్రంలో నేరగాళ్లు కొత్త రూపంలో వస్తున్నారు: సీఎం జగన్
-
నేడు పోలీస్ అమరవీరుల సంస్మరణ దినోత్సవం
సాక్షి, అమరావతి: విజయవాడ ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో గురువారం పోలీస్ అమరవీరుల సంస్మరణ దినోత్సవం జరగనుంది. ఈ కార్యక్రమానికి సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి హాజరు కానున్నారు. ఉదయం 8 గంటలకు స్టేడియం చేరుకుని పోలీసుల గౌరవ వందనం స్వీకరిస్తారు. తర్వాత అమరవీరులు పుస్తకాన్ని ముఖ్యమంత్రి ఆవిష్కరించనున్నారు. ప్రసంగం అనంతరం పోలీస్ అమర వీరులకు శ్రద్ధాంజలి ఘటించనున్నారు. అమరులైన పోలీసుల కుటుంబ సభ్యులకు సీఎం ఆర్థిక సాయం అందిస్తారు. కార్యక్రమం అనంతరం సీఎం జగన్ తాడేపల్లి నివాసానికి చేరుకుంటారు. -
స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలకు సర్వం సన్నద్ధం
సాక్షి, అమరావతి : రేపు (శనివారం ) జరగనున్న 74వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలకు విజయవాడలోని ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియం సర్వం సిద్ధమైంది. వర్షం కారణంగా వాతావరణ పరిస్థితులను సమర్థవంతంగా ఎదుర్కొనేలా యంత్రాంగం ఏర్పాట్లను పూర్తిచేసింది. స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా శనివారం ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి జాతీయ జెండాను ఎగురవేయనున్నారు. అనంతరం సాయుధ దళాల నుండి గౌరవ వందనం స్వీకరిస్తారు. తర్వాత రాష్ట్ర ప్రజలను ఉద్దేశించి ముఖ్యమంత్రి వైఎస్ జగన్ సందేశాన్నిస్తారు. ప్రదర్శన కోసం స్టేడియంలో 10 శకటాలను అధికారులు సిద్దం చేశారు. వీటి ద్వారా కోవిడ్ పరిస్థితులను ప్రభుత్వం ఎంత సమర్థవంతంగా ఎదుర్కొన్నది, కరోనా కట్టడి కోసం తీసుకున్న చర్యలు తదితర అంశాలను ప్రతిబింబిచేలాగా శకటాల ప్రదర్శన ఉండనుంది. (కరోనాను కట్టడి చేయగలిగాం) -
భారత రాజ్యాంగం అన్ని వర్గాల హక్కులకు రక్షణ
-
'అభివృద్ధి వికేంద్రీకరణ వల్లే అన్ని వర్గాలకు న్యాయం'
సాక్షి, విజయవాడ : భారత రాజ్యాంగం అన్ని వర్గాల హక్కులకు రక్షణగా నిలిచిందని, దేశంకోసం త్యాగం చేసిన అమరవీరులకు ఇవే మా ఘనమైన నివాళి అంటూ గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ పేర్కొన్నారు. గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని ఆదివారం ఉదయం విజయవాడలోని ఇందిరాగాంధీ స్టేడియంలో రాష్ట్ర గవర్నర్ బిశ్వభూషన్ హరిచందన్ జాతీయ జెండాను ఆవిష్కరించారు. అనంతరం ఆయన పోలీసుల గౌరవ వందనం స్వీకరించారు. గవర్నర్ మాట్లాడుతూ.. అభివృద్ధి వికేంద్రీకరణ వల్లే అన్ని వర్గాల ప్రజలకు న్యాయం జరుగుతుందని తెలిపారు. అన్ని ప్రాంతాల అభివృద్ధి కోసమే ప్రభుత్వం అభివృద్ధి వికేంద్రీకరణపై కేబినెట్లో నిర్ణయం తీసుకుందని వెల్లడించారు. ప్రభుత్వం విశాఖలో ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ ఏర్పాటు నిర్ణయం తీసుకోవడం మంచి పరిణామమని పేర్కొన్నారు. (జాతీయ జెండా ఆవిష్కరించిన గవర్నర్) నవరత్నాల ద్వారా రాష్ట్రంలోని అన్ని వర్గాల ప్రజల సంక్షేమం కోసం కృసి చేస్తుందన్నారు. గ్రామ వలంటీర్లు, గ్రామ సచివాలయాల ఏర్పాటు ద్వారా రాష్ట్రం ఆదర్శంగా నిలిచిందని తెలిపారు. ప్రసుతం గ్రామ సచివాలయల ద్వారా 500 రకాల సేవలు అందుతున్నాయని, వీటి ద్వారా రాష్ట్రంలోని నాలుగు లక్షల మందికి ఉద్యోగాలు లభించడం పట్ట హర్షం వ్యక్తం చేశారు. నవశకం ద్వారా అన్ని వర్గాల సంక్షేమ పథకాలకు లబ్ధిదారుల ఎంపిక పారదర్శకంగా జరగుతుందని తెలిపారు. రాష్ట్రంలో వైఎస్సార్ రైతు భరోసా పథకం ద్వారా రూ.13,500 ఆర్థిక సాయం అందిస్తున్నారని, రైతులకు గిట్టుబాటు ధర అందే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని, అలాగే ధరల స్థిరీకరణ కింద రూ.3వేలకోట్లు కేటాయించిందని పేర్కొన్నారు. రైతులకు 9 గంటల ఉచిత విద్యుత్‌తో పాటు, ఆక్వా రైతులకు విద్యుత్ యూనిట్ ధరల్లో రాయితీ అందజేస్తున్నట్లు విశ్వభూషణ్ వెల్లడించారు. రాష్ట్రంలో 100శాతం అక్షరాస్యత కోసం ప్రభుత్వం కృషి చేస్తుందని, విద్యకు పేదరికం అడ్డు కాకూడదని అమ్మొడి పథకం ప్రారంభించిదని గుర్తుచేశారు. ఈ పథకం కింద ప్రతి విద్యార్థి తల్లికి రూ.15 వేలు ఇస్తున్నట్లు తెలిపారు. అలాగే ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లీష్ మాద్యమాన్ని ప్రవేశపెడుతున్నట్లు, అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో తెలుగు సబ్జెక్టు తప్పనిసరిగా ఉంటుందని గవర్నర్ స్పష్టం చేశారు. మనబడి, నాడు-నేడు కార్యక్రమం ద్వారా పాఠశాలల అభివృద్ధికి ప్రభుత్వం కృషి చేస్తుందని, జగనన్న విద్యా కానుక ద్వారా 3 జతల యూనిఫామ్‌లు, పుస్తకాలు అందజేస్తున్నట్లు గవర్నర్ పేర్కొన్నారు. పేద వర్గాల ఉన్నత చదువుల కోసం ఫీజు రీయింబర్స్మెంట్, జగనన్న వసతి కార్యక్రమం ద్వారా పేద విద్యార్థులకు హాస్టల్ ఫీజులు చెల్లిస్తున్నట్లు వెల్లడించారు. వైఎస్సార్ ఆరోగ్య పథకాన్ని మరింత మెరుగుపరచనున్నట్లు , అందుకోసం పైలట్ ప్రాజెక్టుగా పశ్చిమ గోదావరి జిల్లాలో అన్ని రకాల వైద్య సేవలు అందజేయనున్నట్లు తెలిపారు. వైఎస్సార్ చేయూత పథకం ద్వారా డ్వాక్రా మహిళలకు ప్రభుత్వం రుణాలు అందజేస్తుందని, పరిశ్రమల్లో 75శాతం ఉద్యోగాలు స్థానికులకే కల్పిస్తామని గవర్నర్ పేర్కొన్నారు. నామినేటెడ్ పోస్టుల్లో 50శాతం మహిళలకు రిజర్వేషన్లు కల్పించనున్నట్లు గవర్నర్ హరిచందన్ వెల్లడించారు. -
ఉద్వేగానికి లోనైన వైఎస్ విజయమ్మ
-
ఘనంగా వైఎస్ జగన్ ప్రమాణ స్వీకారం
సాక్షి, విజయవాడ : ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా జననేత వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రమాణ స్వీకారోత్సవం ఘనంగా జరిగింది. గవర్నర్ నరసింహన్ వైఎస్ జగన్ చేత ముఖ్యమంత్రిగా ప్రమాణం చేయించారు. ఈ కార్యక్రమాన్ని ప్రత్యక్షంగా చూసేందుకు భారీగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అభిమానులు, కార్యకర్తలు ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియానికి తరలించారు. ప్రమాణ స్వీకారోత్సవాన్ని చూడటం కోసం విజయవాడ రాలేకపోయినవారు టీవీలో వీక్షించారు. వైఎస్ జగన్ ప్రమాణ స్వీకారం చేస్తున్న సమయంలో సభ ప్రాగంణం మొత్తం వైఎస్ జగన్ నినాదాలతో మారుమోగింది. వైఎస్ జగన్ ప్రమాణ స్వీకారానికి తెలంగాణ సీఎం కేసీఆర్, డీఎంకే అధినేత స్టాలిన్, పుదుచ్చేరి మంత్రి మల్లాడి కృష్ణారావు హాజరయ్యారు. మరోవైపు వైఎస్ జగన్ ముఖ్యమంత్రిగా బాధ్యతు చేపట్టడాన్ని పురస్కరించుకుని రాష్ట్రవ్యాప్తంగా అభిమానులు సంబరాలు చేసుకున్నారు. వైఎస్ జగన్ ప్రమాణ స్వీకారోత్సవానికి సంబంధించిన అప్డేట్స్.. గన్నవరం ఎయిర్‌పోర్టుకు బయలుదేరిన కేసీఆర్, స్టాలిన్ తెలంగాణ సీఎం కేసీఆర్, డీఎంకే అధినేత స్టాలిన్ తాడేపల్లి నుంచి గన్నవరం విమానాశ్రయానికి బయలుదేరారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రమాణ స్వీకారోత్సవానికి హాజరైన కేసీఆర్, స్టాలిన్లు ఆ కార్యక్రమం పూర్తయిన తరువాత తాడేపల్లిలో వైఎస్ జగన్ నివాసానికి వెళ్లిన సంగతి తెలిసిందే. కేసీఆర్, స్టాలిన్లకు వైఎస్ జగన్ విందు.. తన ప్రమాణ స్వీకారోత్సవానికి హాజరైన కేసీఆర్, స్టాలిన్లకు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అతిథి మర్యాదలు చేశారు. తన నివాసానికి వారిని ఆహ్వానించిన వైఎస్ జగన్.. వారికి విందు ఏర్పాటు చేశారు. వైఎస్ జగన్‌కు రాష్ట్రపతి అభినందనలు.. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన వైఎస్ జగన్మోహన్రెడ్డికి రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ అభినందనలు తెలిపారు. వైఎస్ జగన్ అభివృద్ధిలో ఆంధ్రప్రదేశ్‌ను ఉన్నత శిఖరాలకు చేర్చాలని ఆయన ఆకాక్షించారు. వైఎస్ జగన్ నివాసానికి కేసీఆర్, స్టాలిన్ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రమాణ స్వీకారోత్సవం ముగిసింది. అనంతరం వైఎస్ జగన్‌తో పాటు కేసీఆర్, స్టాలిన్లు తాడేపల్లిలోని ఆయన నివాసానికి చేరుకున్నారు. అక్కడ వారికి పుష్పగుచ్ఛాలు అందజేసిన వైఎస్ జగన్ వారిని సాదారంగా ఇంటిలోనికి ఆహ్వానించారు. కేసీఆర్ వెంట తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి, ఎంపీ సంతోష్‌కుమార్, తెలంగాణ మంత్రులు మహమూద్ అలీ, తలసాని శ్రీనివాస్‌యాదవ్‌లు కూడా అక్కడికి వెళ్లారు. ఉద్వేగానికి లోనైన వైఎస్ విజయమ్మ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ప్రమాణం చేసిన అనంతరం వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రసంగించారు. ‘నన్ను దీవించిన రాష్ట్ర ప్రజలందరికీ పేరుపేరునా హృదయపూర్వక కృతజ్ఞతలు. ఆశీర్వదించిన దేవునికి, పైనున్న నాన్నగారికి, నా పక్కనే ఉన్న నా తల్లికి పాధాభివందనం చేస్తున్నాన’ని తెలిపారు. ఈ సందర్బంగా ప్రజలకు అభివాదం చేసిన వైఎస్ విజయమ్మ.. కాసింత ఉద్వేగానికి లోనయ్యారు. తన తనయున్ని అక్కున చేర్చుకున్నారు. సంబంధిత వీడియో కోసం ఇక్కడ క్లిక్ చేయండి అవ్వతాతల పెన్షన్ పెంపుదలపై వైఎస్ జగన్ మొదటి సంతకం ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి.. అవ్వతాతల పెన్షన్ పెంపుదలపై తొలి సంతకం చేశారు. ప్రమాణ స్వీకారం అనంతరం ఆయన మాట్లాడుతూ.. వైఎస్సార్ పెన్షన్ కింద వృద్దుల పెన్షన్‌ను రూ. 2000 నుంచి రూ. 2250కి పెంచుతున్నట్టు ప్రకటించారు. ఇకపై వారి పెన్షన్‌ను ప్రతి ఏటా రూ. 250 పెంచుకుంటూ రూ. 3000 అందిస్తామని వెల్లడించారు. అదే విధంగా ప్రమాణ స్వీకారోత్సవానికి హాజరైన తెలంగాణ సీఎం కేసీఆర్, తమిళనాడు నేత, డీఎంకే అధ్యక్షుడు స్టాలిన్, ఇతర పెద్దలకు కృతఙ్ఞతలు తెలిపారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా హామీ ఇచ్చినట్లుగా నవరత్నాల్లోని ప్రతీ అంశాన్ని కులమత వర్గాలకు అతీతంగా ప్రతీ ఒక్కరికి అందేలా చూస్తామని పేర్కొన్నారు. జగన్ చరిత్రలో నిలిచిపోవాలి: కేసీఆర్ ప్రమాణ స్వీకార వేదికపై నుంచి ప్రసంగించిన కేసీఆర్.. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నవ యువ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి తన పక్షాన, తెలంగాణ ప్రభుత్వం, ప్రజల తరఫున హృదయపూర్వక అభినందనలు, ఆశీస్సులు తెలిపారు. రెండు తెలుగు రాష్ట్రాలు పరస్పరం సహకరించుకుంటూ అద్భుతమైన ఫలితాలు రాబట్టాలని ఆయన ఆకాక్షించారు. వైఎస్ జగన్ ఆధ్వర్యంలో గోదావరి జలాల సంపూర్ణ వినియోగం వంద శాతం జరిగి తీరాలని కేసీఆర్ అన్నారు. కృష్ణా జలాలను సమస్యలను పరిష్కరించుకుని ప్రతి నీటిబొట్టును సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. జగన్ వయసు చిన్నది, బాధ్యత పెద్దదని వ్యాఖ్యానించారు. ఏపీ ప్రజలు ఇచ్చిన అద్భుతమైన అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని తండ్రి పేరు నిలబెట్టాలని వైఎస్ జగన్‌కు సూచించారు. చరిత్రలో నిలిచిపోయేవిధంగా పేరు తెచ్చుకోవాలని ఆకాంక్షించారు. మూడు, నాలుగు టర్మ్‌ల వరకు వైఎస్ జగన్ పాలన కొనసాగాలని కేసీఆర్ కోరుకున్నారు. తండ్రి అడుగుజాడల్లో నడవాలని కోరుకుంటున్నాను : స్టాలిన్ వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రమాణ స్వీకార వేదికపై ప్రసంగించిన స్టాలిన్ ఆయనకు అభినందనలు తెలిపారు. వైఎస్ జగన్ తన తండ్రి దివంగత మహానేత వైఎస్సార్ అడుగుజాడల్లో నడవాలని కోరుకుంటున్నానని తెలిపారు. వేదికపై వైఎస్ జగన్‌కు మత పెద్దల అశీర్వచనాలు వైఎస్ జగన్ ప్రమాణ స్వీకార వేదికపై సర్వమత ప్రార్థనలు జరిగాయి. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన వైఎస్ జగన్మోహన్రెడ్డికి మత పెద్దలు అశీర్వచనాలు ఇచ్చారు. వైఎస్ జగన్‌కు కేసీఆర్, స్టాలిన్ అభినందనలు ఆంధ్రప్రదేవ్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన వైఎస్ జగన్మోహన్రెడ్డికి తెలంగాణ సీఎం కేసీఆర్, డీఎంకే అధినేత స్టాలిన్లు పుష్పగుచ్ఛాలు అందజేసి అభినందనలు తెలిపారు. ఈ సందర్భంగా స్టాలిన్ వైఎస్ జగన్‌ను శాలువతో సత్కరించారు. వైఎస్ జగన్ కుటుంబసభ్యులకు గవర్నర్ శుభాకాంక్షలు వైఎస్ జగన్ ముఖ్యమంత్రిగా ప్రమాణం చేసిన అనంతరం గవర్నర్ అక్కడి విచ్చేసిన ఆయన కుటుంబసభ్యులను అప్యాయంగా పలకరించారు. వారికి శుభాకాంక్షలు తెలిపారు. అంతేకాకుండా ప్రమాణ స్వీకారోత్సవానికి అథితులుగా వచ్చిన కేసీఆర్, స్టాలిన్లను కూడా గవర్నరు పలకరించారు. అనంతరం వైఎస్ జగన్ గవర్నర్‌కు వీడ్కోలు పలికారు. ముఖ్యమంత్రిగా ప్రమాణం చేసిన వైఎస్ జగన్ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్ ప్రమాణస్వీకారం చేశారు. తొలుత జాతీయ గీతంతో ప్రమాణ స్వీకారోత్సవ కార్యక్రమం ప్రారంభమైంది. ఆంధ్రప్రదేశ్ సీఎస్ ఎల్వీ సుబ్రహ్మణ్యం వైఎస్ జగన్‌ను ముఖ్యమంత్రిగా ప్రమాణం చేయాల్సిందిగా ఆహ్వానించారు. అనంతరం గవర్నర్ ఆయ చేత ప్రమాణ స్వీకారం చేయించారు. అనంతరం గవర్నర్ నూతన ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డికి పుష్పగుచ్ఛం అందజేసి శుభాభినందనలు తెలిపారు. ప్రమాణ స్వీకార ప్రాగంణానికి చేరుకున్న గవర్నర్ గవర్నర్ నరసింహన్ వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రమాణ స్వీకార సభా ప్రాగంణానికి చేరుకున్నారు. ప్రమాణ స్వీకార వేదికపైకి చేరుకున్న వైఎస్ జగన్ సభా ప్రాగంణానికి చేరుకున్న వైఎస్ జగన్ తొలుత ప్రత్యేక వాహనంలో స్టేడియంలో తిరుగుతూ ప్రజలకు అభివాదం చేశారు. అనంతరం ఆయన వేదికపైకి చేరుకున్నారు. సభా ప్రాంగణానికి చేరుకున్న కేసీఆర్, స్టాలిన్ కొద్దిసేపటి క్రితం విజయవాడ చేరుకున్న తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్.. ప్రమాణ స్వీకార వేదిక వద్దకు చేరుకున్నారు. కేసీఆర్ వెంట తెలంగాణ మంత్రి మహమూద్ అలీ, ఎంపీ సంతోష్‌లు ఉన్నారు. తెలంగాణ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అంతకు ముందే ప్రాంగణానికి చేరుకున్నారు. డీఎంకే అధినేత స్టాలిన్ కూడా ప్రమాణ స్వీకార వేదిక వద్దకు చేరుకున్నారు. వేదికపై కేసీఆర్, స్టాలిన్లు ఒకరినొకరు ఆలింగనం చేసుకున్నారు. ఇంటి నుంచి బయలుదేరిన వైఎస్ జగన్ జననేత వైఎస్ జగన్మోహన్రెడ్డి తాడేపల్లిలోని తన నివాసం నుంచి విజయవాడలోని ఇందిరా గాంధీ మున్సిపల్ స్టేడియానికి బయలుదేరారు. తన కుటుంబసభ్యులతో కలిసి ప్రత్యేక కాన్వాయ్‌లో వైఎస్ జగన్ ప్రమాణ స్వీకార ప్రాంగణానికి పయనమయ్యారు. వైఎస్ జగన్ వెంబడి వైఎస్ విజయమ్మ, వైఎస్ భారతి, షర్మిల ఉన్నారు. మధ్యాహ్నం 12.23 గంటలకు గవర్నర్ నరసింహన్ వైఎస్ జగన్ చేత ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయించనున్నారు. సంబంధిత వీడియో కోసం ఇక్కడ క్లిక్ చేయండి వేదిక వద్దకు కటుంబసమేతంగా కేవీపీ.. దివంగత మహానేత వైఎస్ రాజశేఖరరెడ్డి ఆప్త మిత్రుడు కేవీపీ రామచంద్రరావు తన కుటుంబ సభ్యులతో కలిసి వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రమాణ స్వీకారం జరిగే ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియానికి చేరుకున్నారు. వేదిక వద్దకు బయలుదేరిన వైఎస్ కుటుంబ సభ్యులు వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రమాణ స్వీకారోత్సవంలో పాల్గొనేందుకు వైఎస్ కుటుంబ సభ్యులు, బంధువులు ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియానికి బయలుదేరారు. విజయవాడ చేరుకున్న పుదుచ్చేరి మంత్రి మల్లాడి వైఎస్ జగన్మోహన్రెడ్ది ప్రమాణ స్వీకారోత్సవానికి హాజరుకావడానికి పుదుచ్చేరి ఆరోగ్య శాఖ మంత్రి మల్లాడి కృష్ణారావు విజయవాడకు చేరుకున్నారు. ఆయనకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తరఫున అధికారులు స్వాగతం పలికారు. ప్రముఖ చిత్రకారుడు బీఎస్వీ ప్రసాద్చే ప్రత్యేకంగా తయారు చేయించిన దివంగత మహానేత వైఎస్ రాజశేఖరరెడ్డి విగ్రహాలను ఆయన వైఎస్ జగన్‌కు అందజేయనున్నారు. ప్రమాణ స్వీకార మహోత్సవం అనంతరం మొదటగా కేసీఆర్, మల్లాడి, స్టాలిన్లు వైఎస్ జగన్‌ను సత్కరించనున్నారు. గన్నవరం ఎయిర్‌పోర్ట్‌కు చేరుకున్న స్టాలిన్.. వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రమాణ స్వీకారానికి హాజరు కావడం కోసం డీఎంకే అధినేత స్టాలిన్ గన్నవరం విమానశ్రయం చేరుకున్నారు. అక్కడ ఆయనకు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కరరెడ్డి స్వాగం పలికారు. సంబంధిత వీడియో కోసం ఇక్కడ క్లిక్ చేయండి ప్రమాణ స్వీకారోత్సవానికి వీలైనంత త్వరగా వెళ్లాలని అభిమానులు భావించడంతో ఉదయం నుంచే ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియం కిటకిటలాడుతోంది. స్టేడియం మొత్తం జగన్ నినాదాలతో మారుమోగుతుంది. ఎంపీలు, ఎమ్మెల్యేలు కూడా తమకు కేటాయించిన గ్యాలరీల్లోకి చేరుకుంటున్నారు. అలాగే తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్, డీఎంకే అధినేత స్టాలిన్, పుదుచ్చేరి మంత్రి మల్లాడి కృష్ణారావులతో పాటు పలు రాజకీయ పార్టీల ప్రముఖులు ఈ వేడుకకు హాజరుకానున్నారు. మరోవైపు తమ అభిమాన నాయకుడి ప్రమాణ స్వీకారోత్సవాన్ని చూడటానికి ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. విజయవాడ రాలేని వారు టీవీల్లో ఈ వేడుకను చూసేందుకు సిద్దమవుతున్నారు. ఉదయం నుంచే సామాన్య ప్రజలు ప్రమాణ స్వీకార వేదిక వద్దకు భారీగా చేరుకోవడంతో 8 గంటల వరకే గ్యాలరీలు నిండిపోయాయి. గ్యాలరీల్లో ఉన్నవారికి ఎటువంటి అసౌకర్యం కలగకుండా అధికారులు అన్ని రకాల ఏర్పాట్లు చేస్తున్నారు. స్టేడియం బయట కూడా ప్రమాణ స్వీకారాన్ని చూసేందుకు ఎల్ఈడీ స్క్రీన్లు ఏర్పాటు చేశారు. -
ప్రజలు సహకరించాలి
విజయవాడ: రాష్ట్ర ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టబోతున్న వైఎస్ జగన్ అభీష్టం మేరకు ప్రమాణ స్వీకారోత్సవ ఏర్పాట్లు నిరాడంబరంగా చేసినట్లు సీఎస్ ఎల్వీ సుబ్రహ్మణ్యం చెప్పారు. బుధవారం ఆయన విజయవాడలోని ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో ప్రమాణ స్వీకారోత్సవ ఏర్పాట్లను పరిశీలించారు. ఏర్పాట్లను సీఎస్‌కు కృష్ణా జిల్లా కలెక్టర్ ఏఎండీ ఇంతియాజ్ వివరించారు. సీఎస్ మీడియాతో మాట్లాడుతూ.. కాబోయే సీఎం అభిప్రాయం మేరకు ఏర్పాట్లు నిరాడంబరంగా చేపట్టామని, ప్రజలు దీన్ని అర్థం చేసుకుని సహకరించాలని కోరారు. సుమారు 30 వేల మంది వరకు స్టేడియంలో ప్రత్యక్షంగా ప్రమాణస్వీకారోత్సవాన్ని చూసేందుకు వీలుందని చెప్పారు. పాస్‌లు లేని వారు కూడా స్టేడియంలోకి వచ్చి చూడవచ్చన్నారు. స్టేడియంలోకి రాలేని వారు నిరుత్సాహ పడవద్దని, స్టేడియం బయట ఎల్ఈడీ స్క్రీన్లు ఏర్పాటు చేశామన్నారు. అన్ని చోట్ల మెడికల్ క్యాంపులు ఏర్పాటు చేశామని, వృద్ధులు, మహిళలు, పిల్లలు ఇబ్బంది పడకుండా చర్యలు తీసుకోవాలని ఆదేశించినట్లు చెప్పారు. విజయవాడలో ట్రాఫిక్ క్రమబద్ధీకరణకు చర్యలు తీసుకున్నట్లు చెప్పారు. రెండు వేదికలు ఏర్పాటు ప్రమాణ స్వీకారోత్సవ ప్రధాన వేదికతో పాటు మరో ఉపవేదిక ఏర్పాటు చేసున్నట్లు సీఎస్ చెప్పారు. ప్రధాన వేదికపై రాష్ట్ర గవర్నర్ నరసింహన్, సీఎంతో ప్రమాణం చేయిస్తారని.. మరో వేదికపై తెలంగాణ సీఎం కేసీఆర్, డీఎంకే చీఫ్ స్టాలిన్‌తో పాటు ఇతర ప్రధాన అతిథులు ఆసీనులవుతారని సీఎస్ తెలిపారు. -
వైఎస్ జగన్ ప్రమాణ స్వీకారోత్సవానికి.. ఏర్పాట్లు చకచకా
విజయవాడ/సాక్షి, అమరావతి/అమరావతి బ్యూరో : ముఖ్యమంత్రిగా ఈ నెల 30న జరగనున్న వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రమాణ స్వీకారోత్సవానికి ఏర్పాట్లు ఊపందుకున్నాయి. వచ్చే గురువారం మధ్యాహ్నం 12.23గంటలకు జరిగే ఈ కార్యక్రమం కోసం విజయవాడ ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో ఏర్పాట్లు ముమ్మరమయ్యాయి. స్టేడియంను సోమవారం లెవలింగ్ చేసి వాటరింగ్ చేశారు. భారీ వాటర్ ప్రూఫ్ టెంట్లు ఏర్పాటుచేస్తున్నారు. గ్యాలరీలు, బారికేడింగ్ పనులు యుద్ధప్రాతిపదికన జరుగుతున్నాయి. స్టేడియంతోపాటు నగరంలోని పలు ప్రధాన కూడళ్లలో ఎల్ఈడీ స్క్రీన్లు ఏర్పాటుచేస్తున్నారు. స్టేడియంకు వచ్చే రహదారులకు మరమ్మతులు వేగంగా జరుగుతున్నాయి. సిటీ కేబుల్‌తోపాటు అన్ని లోకల్ చానల్స్, ఇతర ప్రసార మాధ్యమాల ద్వారా ప్రమాణ స్వీకారోత్సవాన్ని ప్రసారం చేసేందుకు ప్రణాళికలు సిద్ధం చేశారు. స్టేడియంలో ఏఏ, ఏ1, ఏ2.. ఇలా వివిధ కేటగిరీల కింద మొత్తం 18రకాల గ్యాలరీలు, మీడియాకు ప్రత్యేకంగా ఒకటి ఏర్పాటుచేస్తున్నారు. ఒక్కో గ్యాలరీకి ఇద్దరు అధికారులను నియమించారు. గవర్నర్, జ్యుడీషియరీ, ఐఏఎస్‌లు, ఐపీఎస్‌లు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, వారి కుటుంబ సభ్యులకు వేర్వేరుగా గ్యాలరీలు ఏర్పాటుచేస్తున్నారు. వీరందరికీ కలిపి సాధారణ పరిపాలనా విభాగం నుంచి 11,500ల పాస్‌లు జారీచేయనున్నారు. స్టేడియంలో మిగిలిన గ్యాలరీల్లోకి సామాన్య ప్రజలను వేరే గేట్ ద్వారా అనుమతిస్తారు. ఈ 11,500 పాస్‌లు పోను.. సుమారు 15వేల నుంచి 20వేల మంది సామాన్య ప్రజలను సాధారణ గ్యాలరీలలోకి అనుమతిస్తారు. డీజీపీ, సీపీ ఏర్పాట్ల పరిశీలన కాగా, డీజీపీ ఆర్పీ ఠాకుర్, విజయవాడ నగర పోలీస్ కమిషనర్ ద్వారకా తిరుమలరావులు ప్రమాణ స్వీకారోత్సవ ఏర్పాట్లను సోమవారం స్వయంగా పరిశీలించారు. పలు అంశాలపై డీజీపీ కొన్ని సూచనలు చేశారు. మరోవైపు.. వైఎస్సార్సీపీ ఎమ్మెల్యేలు మల్లాది విష్ణు, వెలంపల్లి శ్రీనివాస్, జోగి రమేష్, శ్రీకాంత్‌రెడ్డి, పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తలశిల రఘురాం, రైతు విభాగం రాష్ట్ర అధ్యక్షుడు ఎంవీఎస్ నాగిరెడ్డి తదితర నేతలు కూడా ఏర్పాట్లను పరిశీలించి పలు సూచనలు చేశారు. ఎల్ఈడీ స్క్రీన్లు ఏర్పాటుచేసే ప్రాంతాలివే.. ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలోని ఫుట్‌బాల్ గ్రౌండ్, బెంజిసర్కిల్, ఎన్టీఆర్ సర్కిల్, స్వరాజ్య మైదానం, ఆర్టీసీ బస్టాండ్, బీఆర్టీఎస్ రోడ్డు, కేదారేశ్వరపేట, పంజా సెంటర్, స్వాతి రోడ్డు జంక్షన్, కాళేశ్వరరావు మార్కెట్, పైపులరోడ్డు, సింగ్‌నగర్ ఫ్లైఓవర్, డాబాకొట్లు సెంటర్, తుమ్మలపల్లి కళాక్షేత్రం, రైల్వేస్టేషన్, పాత గవర్నమెంట్ ఆస్పత్రి రోడ్డు, బెరంపార్కు, రామవరప్పాడు సెంటర్, సిద్దార్థ కాలేజి, కానూరు రోడ్డులలో ఎల్ఈడీ స్క్రీన్లు ఏర్పాటుచేయాలని నిర్ణయించారు. పార్కింగ్ ప్రదేశాలు ఇవే.. రాత్రి 8 గంటలకు డీజీ గౌతం సవాంగ్ వచ్చి ఏర్పాట్ల గురించి నగర సీపీ ద్వారకా తిరుమలరావును అడిగి తెలుసుకున్నారు. సవాంగ్‌తో పాటు కలెక్టర్ ఇంతియాజ్ అహ్మద్, ఏడీజీ కుమార విశ్వజిత్ వచ్చారు. ఎవరికీ ఎలాంటి ఇబ్బంది లేకుండా చూడాలని సవాంగ్ సూచించారు. స్టేడియంలో భద్రతా, పార్కింగ్ ఏర్పాట్లపై డీసీపీలు రాజకుమారి, హర్షవర్ధన్‌రాజు. రవిశంకర్‌రెడ్డిలకు పలు సూచనలు చేశారు. కాగా, రాష్ట్రం నలుమూలల నుంచి వచ్చే నాయకులకు సంబంధించిన వాహనాల పార్కింగ్‌కు ప్రత్యేకంగా స్థలాలను గుర్తించామని సీపీ తెలిపారు. అవి.. - హైదరాబాద్, చెన్నై, విశాఖ మార్గాల్లో వచ్చే వాహనాలు.. ఎక్కడికక్కడ శివారు ప్రాంతాల్లోనే ప్రత్యేక పార్కింగ్ ప్రదేశాలు ఏర్పాటుచేస్తున్నారు. - సీఎం కుటుంబ సభ్యులు, హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి, మాజీ సీఎంలు, అపాట్, ఆర్టీఐ కమిషనర్ల వాహనాలకు మాత్రమే ఇందిరాగాంధీ మైదానంలో పార్కింగ్ ఉంటుంది. - మండలి చైర్మన్, డిప్యూటీ చైర్మన్లతోపాటు వివిధ రాజకీయ పార్టీల అధ్యక్షులు, ఎంపీలు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు ఇతర ప్రముఖుల వాహనాలకు మాత్రం ఏఆర్ గ్రౌండ్లోనూ.. ఇతర ముఖ్య అధికారులు, పోలీసు, ఇతర అధికారుల వాహనాలను బిషప్ అజరయ్య స్కూల్, పీడబ్ల్యూడీ గ్రౌండ్స్‌ను కేటాయించనున్నామన్నారు. - మాజీ ఉన్నతాధికారుల వాహనాలకు ఆర్టీఏ ఆఫీస్ ప్రాంగణం కేటాయించారు. - ఏలూరు వైపు నుంచి వచ్చే వాహనాలు రామవరప్పాడు సమీపంలో.. హైదరాబాదు వైపు నుంచి వచ్చే వాహనాలు గొల్లపూడి సమీపంలో, మచిలీపట్నం వైపు నుంచి వచ్చే వాహనాలు కానూరు సమీపంలో, గుంటూరు వైపు నుంచి వచ్చే వాహనాలు కాజ టోల్‌గేటు సమీపంలో పార్కింగ్ చేసేలా ఏర్పాట్లుచేస్తామని తెలిపారు. సంబంధిత వీడియో కోసం ఇక్కడ క్లిక్ చేయండి ఎవరికీ ఇబ్బందుల్లేకుండా చూడండి : కలెక్టర్ మరోవైపు.. సీఎం ప్రమాణ స్వీకారోత్సవ ఏర్పాట్లకు సంబంధించి కృష్ణాజిల్లా కలెక్టర్ ఏఎండీ ఇంతియాజ్ క్యాంపు కార్యాలయంలో జిల్లాస్థాయి ఉన్నతాధికారులతో సోమవారం సమీక్ష జరిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కార్యక్రమానికి వచ్చే అతిథులు, ఆహ్వానితులు, ప్రజలకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా ఆయా శాఖల అధికారులు పనిచేసి కార్యక్రమాన్ని విజయవంతం చేయాలన్నారు. వీఐపీల ప్రొటోకాల్ విషయంలో ఎటువంటి లోటుపాట్లు లేకుండా చూడాలన్నారు. దాదాపు రెండు లక్షల మజ్జిగ, లస్సీ ప్యాకెట్లు పంపిణీ చేయాలని.. మంచినీరు సరఫరాలో ఎలాంటి లోటు రాకుండా చూడాలని ఆర్డబ్ల్యూఎస్, మున్సిపల్ అధికారులను కలెక్టర్ ఆదేశించారు. ట్రాఫిక్ సమస్య తలెత్తకుండా ప్రత్యేక చర్యలు తీసుకోవాలని, పార్కింగ్ ప్రదేశాలు అందరికీ తెలిసేలా సూచిక బోర్డులు ఏర్పాటుచేయాలని సూచించారు. సమావేశంలో జేసీ కృతికా శుక్లా, విజయవాడ సబ్‌కలెక్టర్ మిషాసింగ్, ప్రొటోకాల్ జేడీ అశోక్, జేసీ–2 పి.బాబూరావు, ప్రమాణ స్వీకారోత్సవ కో–ఆర్డినేషన్ కమిటీ ప్రతినిధి తలశిల రఘురాం, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు. -
వైఎస్ జగన్ ప్రమాణ స్వీకార వేదిక ఖరారు
సాక్షి, విజయవాడ : రాష్ట్ర ముఖ్యమంత్రిగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రమాణ స్వీకార కార్యక్రమానికి వేదిక ఖరారు అయింది. విజయవాడ ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో ఆయన ఈ నెల 30వ తేదీన ప్రమాణం చేయనున్నారు. ఈ మేరకు ప్రమాణ స్వీకార ఏర్పాట్లు చేయాల్సిందిగా రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎల్వీ సుబ్రహ్మణ్యం శనివారం అధికారులను ఆదేశించారు. పెద్ద సంఖ్యలో జనం హాజరయ్యే అవకాశం ఉండటంతో ఎవరికీ ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఏయే శాఖలు ఏర్పాట్లు చేయాలన్న దానిపై సీఎస్ దిశానిర్దేశం చేశారు. పోలీస్, మున్సిపల్, ప్రొటోకాల్, సమాచార తదితర 15 శాఖల ఉన్నతాధికారులు సమీక్ష జరిపారు. ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంను పరిశీలిస్తున్న కలెక్టర్ ఇంతియాజ్, మున్సిపల్ కమిషనర్ రామారావు మరోవైపు ప్రమాణ స్వీకార కార్యక్రమం ఏర్పాట్లుపై సీఎస్ ఇవాళ మధ్యాహ్నం అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సమీక్ష సమావేశానికి డీజీపీ ఆర్పీ ఠాకూర్, జీఏడీ అధికారులు హాజరు అయ్యారు. లా అండ్ ఆర్డర్ డీజీ రవిశంకర్ అయ్యనార్, విజయవాడ సిటీ కమిషనర్ ద్వారక తిరుమలరావు, ఇంటెలిజెన్స్ ఏడీజీ కుమార విశ్వజిత్, అగ్నిమాపక శాఖ డీజీ సత్యనారాయణ, ఏలూరు రేంజ్ డీఐజీ త్రివిక్రమ్ వర్మ, గుంటూరు జిల్లా కలెక్టర్ కోన శశిధర్, గుంటూరు జిల్లా రూరల్ ఎస్పీ రాజశేఖర బాబు, కృష్ణాజిల్లా కలెకర్ట్ ఇంతియాజ్, కృష్ణాజిల్లా ఎస్పీ సర్వశ్రేష్ట త్రిపాఠి, ఐఎస్‌డ్ల్యూ డీఐజీ రామకృష్ణ, ప్రకాశం జిల్లా కలెక్టర్ వినయ్ చంద్, స్పెషల్ సీఎస్ రమేష్, ఆర్అండ్బీ ప్రిన్సిపల్ సెక్రటరీ నిరబ్ కుమార్ ప్రసాద్, మైనార్టీ సెక్రటరీ రాంగోపాల్, కార్మికశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ జేవీఎస్ ప్రసాద్, మున్సిసిపల్ డిపార్ట్మెంట్ ప్రిన్సిపల్ సెక్రటరీ కరికాల వల్లవన్, ఐటీశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ విజయానంద్, పొలిటికల్ సెక్రటరీ నాగులప్లి శ్రీకాంత్, సీఆర్డీఏ కమిషనర్ చెరుకూరి శ్రీధర్, అసెంబ్లీ సెక్రటరీ విజయరాజ్తో పాటు సంబంధిత అధికారులు ఈ సమీక్షలో పాల్గొన్నారు. -
23 నుంచి కూచిపూడి నృత్య సమ్మేళనం
కూచిపూడి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర భాషా సాంస్కృతిక శాఖ, సిలికానాంధ్ర సంయు క్త ఆధ్వర్యంలో ఈ నెల 23 నుంచి 25వరకు 5వ అంతర్జాతీయ కూచిపూడి నృత్య సమ్మేళనం జరగనుందని సిలికానాంధ్ర వ్యవస్థాపక అధ్యక్షుడు కూచిబొట్ల ఆనంద్ తెలిపారు. సోమవారం కూచిపూడిలో ఆయన విలేకరులతో మాట్లాడారు. విజయవాడ ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో జరిగే ఈ సమ్మేళనంలో స్థానిక కూచిపూడి కళాకారులకు పెద్దపీట వేస్తామని వెల్లడించారు. 25వ తేదీన పదివేల మంది కళాకారులతో ఏకకాలంలో నాట్య ప్రదర్శన నిర్వహించనున్నట్లు చెప్పారు. -
ఏపీలో ఘనంగా గణతంత్ర వేడుకలు
హైదరాబాద్ : ఆంధ్రప్రదేశ్‌లో 67వ గణతంత్ర దినోత్సవ వేడుకలు మంగళవారం ఘనంగా జరిగాయి. విజయవాడలోని ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో జరిగిన గణతంత్ర వేడుకల్లో గవర్నర్ నరసింహన్ జాతీయ జెండాను గవర్నర్ ఆవిష్కరించారు. అనంతరం పోలీసుల గౌరవ వందనాన్ని నరసింహన్ స్వీకరించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యమంత్రి చంద్రబాబు, మంత్రులు, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఐవైఆర్ కృష్ణారావు, డీజీపీ జె.వి. రాముడుతోపాటు పలువురు ఉన్నతాధికారులు హాజరయ్యారు. ఈ వేడుకల్లో సైనిక కవాతు, ప్రభుత్వ శకటాలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. అలాగే హైదరాబాద్‌లోని ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ప్రాంగణంలో జాతీయ పతాకాన్ని స్పీకర్ కోడెల శివప్రసాద్ ఆవిష్కరంచారు. ఏపీ శాసనమండలి ప్రాంగణంలో ఛైర్మన్ చక్రపాణి ఆవిష్కరించారు. ఈ కార్యక్రమానికి అసెంబ్లీ శాసనమండలి సిబ్బంది హాజరయ్యారు. వివిధ జిల్లాల్లో గణతంత్ర దినోత్సవ వేడుకల వివరాలు... అనంతపురం జిల్లా: అనంతపురం : నగరంలోని పోలీస్ పరేడ్ గ్రౌండ్స్‌లో జరిగిన గణతంత్ర వేడుకల్లో జిల్లా కలెక్టర్ కోన శశిధర్ పాల్గొన్నారు. జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. అనంతరం జిల్లాలోని 163 మంది ప్రతిభావంతులకు కోన శశిధర్ మెమెంటోలు అందజేశారు. అలాగే గణతంత్ర వేడుకల్లో భాగంగా ఓపెన్ ఎయిర్ జైలు నుంచి 146 మంది ఖైదీలను విడుదల చేయనున్నారు. చిత్తూరు జిల్లా : చిత్తూరు : చిత్తూరు నగరంలోని పోలీస్ పరేడ్ గ్రౌండ్స్‌లో జరిగిన గణతంత్ర వేడుకల్లో జిల్లా కలెక్టర్ సిద్ధార్థ జైన్ పాల్గొన్నారు. గుంటూరు జిల్లా: గుంటూరు: నగరంలోని పరేడ్ గ్రౌండ్స్‌లో గణతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. జాతీయ జెండాను జిల్లా కలెక్టర్ కాంతిలాల్ దండే ఆవిష్కరించారు. ఈ కార్యక్రమానికి అర్బన్ ఎస్పీ త్రిపాఠి, రూరల్ ఎస్పీ నారాయణ నాయక్ హాజరయ్యారు. ప్రకాశం జిల్లా : ఒంగోలు : ఒంగోలు పోలీస్ గ్రౌండ్స్‌లో జరిగిన గణతంత్ర వేడుకల్లో జిల్లా కలెక్టర్ సుజాత శర్మ జాతీయ జెండా ఎగురవేశారు. ఈ కార్యక్రమంలో జిల్లాకు చెందిన ప్రజా ప్రతినిధులతోపాటు ఉన్నతాధికారులు హాజరయ్యారు. పశ్చిమగోదావరి జిల్లా : ఏలూరు : ఏలూరు పరేడ్ గ్రౌండ్స్‌లో గణతంత్ర దినోత్సవవేడుకలు ఘనంగా జరిగాయి. జాతీయ జెండాను జిల్లా కలెక్టర్ కె. భాస్కర్ ఎగురవేశారు. ఈ కార్యక్రమంలో ఎస్పీ భాస్కర్ భూషణ్, జాయింట్ కలెక్టర్ కోటేశ్వరరావుతోపాటు పలువురు ఉన్నతాధికారులు పాల్గొన్నారు. -
త్రివర్ణం.. సగర్వంగా
వైభవంగా నవ్యాంధ్రలో తొలి రిపబ్లిక్‌డే వేడుకలు జాతీయ జెండా ఆవిష్కరించిన గవర్నర్ నరసింహన్ సాయుధ పోలీసు బలగాల కవాతు ఆకట్టుకున్న ప్రభుత్వ శకటాలు నూతన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తొలిసారి జరిగిన గణతంత్ర వేడుకల్లో త్రివర్ణ పతాకం సగర్వంగా ఎగిరింది. గణతంత్ర భారతావనికి నగర వాసులు గుండెల నిండా దేశభక్తితో సెల్యూట్ చేశారు. అంగరంగ వైభవంగా నిర్వహించిన ఈ కార్యక్రమం కనులవిందు చేసింది. కార్యక్రమానికి వేదికైన ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియం ప్రాంగణం దేశభక్తితో పులకించింది. గవర్నర్, సీఎం సహా రాష్ర్ట ప్రముఖులు హాజరయ్యారు. విజయవాడ : నవ్యాంధ్రప్రదేశ్‌లో తొలిసారిగా సోమవారం నిర్వహించిన 66వ గణతంత్ర వేడుకలు అంగరంగ వైభవంగా జరిగాయి. ఈ చారిత్రాత్మక ఘట్టానికి నగరంలోని ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియం వేదికైంది. జాతీయ గీతాల ఆలపానతో ప్రాంగణమంతా దేశభక్తిని పెంపొందింపజేసింది. ఉదయం 7.42 గంటలకు రాష్ట్ర గవర్నర్ ఈఎస్ఎల్ నరసింహన్ సభా ప్రాంగణంలోకి వచ్చారు. ఆయనకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రులు కేఈ కృష్ణమూర్తి, నిమ్మకాయల చినరాజప్ప, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఐవైఆర్ కృష్ణారావు, డీజీపీ జేవీ రాముడు, ఇతర ప్రముఖులు ఘనంగా స్వాగతం పలికారు. రవాణా శాఖ ఏర్పాటుచేసిన ప్రత్యేక వాహనంలో గవర్నర్ స్టేడియమంతా తిరిగి అందరికీ అభివాదం చేశారు. గ్యాలరీలో కూర్చున్న విద్యార్థులు, అహూతులు తమ వద్దకు గవర్నరు వాహనం వచ్చినప్పుడు లేచి నిలబడి చప్పట్లు కొడుతూ హర్షాతిరేకాలను వ్యక్తంచేశారు. కదం తొక్కుతూ కవాతు.. ఈ వేడుకల్లో భాగంగా సాయుధ పోలీసు బలగాల కవాతు ఆద్యంతం అద్భుతంగా సాగింది. భారత సైనిక దళం, కేంద్రీయ రిజర్వు బృందం, ఏపీఎస్పీ రెండో బెటాలియన్(కర్నూలు), ఆరో బెటాలియన్(మంగళగిరి), 16వ బెటాలియన్(విశాఖపట్నం), పోలీస్ టాస్క్ఫోర్సు బ్రాండ్, ఎన్సీసీ బాలికల బృందం, ఎన్సీసీ బాలుర బృందం, భారత స్కౌట్స్ అండ్ గైడ్స్ బృందం, సాంఘిక సంక్షేమ, గురుకుల ఆశ్రమ పాఠశాల బృందం, రెడ్‌క్రాస్ విద్యార్థులు నిర్వహించిన కవాతు ఆహూతులను విశేషంగా ఆకట్టుకుంది. రంగురంగుల దుస్తుల్లో క్రమశిక్షణతో కవాతు చేసిన బృందాల నుంచి గవర్నర్ గౌరవ వందనం స్వీకరించారు. ఏపీఎస్పీ రెండో బెటాలియన్(కర్నూలు), మూడో బెటాలియన్(కాకినాడ), ఐదో బెటాలియన్(విజయనగరం), ఆరో బెటాలియన్(మంగళగిరి), తొమ్మిదో బెటాలియన్(వెంకటగిరి) 11వ బెటాలియన్(వైఎస్సార్ కడప జిల్లా) బృందాలు స్టేడియంలో బ్యాండ్ ప్రదర్శనలతో ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. కవాతు అనంతరం రాష్ట్ర అభివృద్ధి, సంక్షేమ రంగాలపై వివిధ శాఖలు ఏర్పాటుచేసిన అలంకృత శకటాలు ప్రాంగణమంతా తిరిగాయి. ఆయా శాఖల పనితీరు, విశ్లేషణ, అభివృద్ధి, సంక్షేమ ఫలాలు తదితర అంశాలను వివరిస్తూ రూపొందించిన శకటాలు ఆకట్టుకున్నాయి. తెలుగు, ఇంగ్లిష్‌లలో గవర్నర్ ప్రసంగం.. ఉదయం 8.22 గంటలకు గవర్నర్ నరసింహన్ తన ప్రసంగాన్ని ప్రారంభించి సుమారు అరగంటపాటు రాష్ట్ర ప్రజల్ని ఉద్దేశించి మాట్లాడారు. తొలుత తెలుగులో, ఆ తర్వాత ఇంగ్లిష్‌లో, చివరలో తిరిగి తెలుగులో గవర్నర్ చేసిన ప్రసంగం అందరినీ ఆకట్టుకుంది. రాష్ట్ర ప్రభుత్వం అనుసరిస్తున్న విధివిధానాలు, ప్రజల కోసం చేపడుతున్న సంక్షేమ కార్యక్రమాలు, రాబోయే రోజుల్లో ప్రభుత్వ విజన్ తదితర అంశాలను తన ప్రసంగంలో గవర్నర్ ప్రస్తావించారు. గవర్నర్ సతీమణి విమలా నరసింహన్ కూడా హాజరయ్యారు. రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఐవైఆర్ కృష్ణారావు సంప్రదాయ వస్త్రధారణతో ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. ఈ వేడుకల్లో శాసనమండలి చైర్మన్ చక్రపాణి, అసెంబ్లీ డెప్యుటీ స్పీకర్ మండలి బుద్ధప్రసాద్, రాష్ట్ర మంత్రులు యనమల రామకృష్ణుడు, పల్లె రఘునాథరెడ్డి, దేవినేని ఉమ, సీహెచ్ అయ్యన్నపాత్రుడు, కామినేని శ్రీనివాస్, కె.అచ్చెన్నాయుడు, రావెల కిషోర్‌బాబు, కొల్లు రవీంద్ర, ప్రత్తిపాటి పుల్లారావు, పి.నారాయణ, రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు కుటుంబరావు, అదనపు డీజీ(బెటాలియన్స్) గౌతమ్ సవాంగ్, కలెక్టర్ బాబు.ఎ. సీపీ ఏబీ వెంకటేశ్వరరావు, ప్రొటోకాల్ కార్యదర్శి ఎంకే మీనా, సమాచార శాఖ కమిషనర్ ఎన్వీ రమణారెడ్డి, వివిధ శాఖల అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. -
నిఘా నేత్రం మరిచారు!
సాక్షి, విజయవాడ బ్యూరో: నూతన రాజధాని ప్రాంతంలో తొలిసారిగా నిర్వహిస్తున్న గణతంత్ర వేడుకల్లో సరైన నిఘా లేకపోవటం కలవరపాటుకు గురి చేస్తోంది. రాజకీయ రాజధానిగా ఖ్యాతి గడించిన విజయవాడలో ఈ వేడుకలు సజావుగా సాగేందుకు అన్ని చర్యలు చేపట్టినా సీసీ కెమెరాల ఏర్పాటుపై శ్రద్ధ చూపలేదు. సమయం చాలనందున ఏర్పాటు చేయలేకపోయామని, కట్టుదిట్టమైన నిఘా ఉం టుందని పోలీసు అధికారులు చెబుతున్నారు. ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో జరిగే రిపబ్లిక్‌డే వేడుకల్లో పాల్గొనేందుకు సీఎం చంద్రబాబు, గవర్నర్ నరసింహన్ ఆదివారం రాత్రికే విజయవాడ చేరుకోనున్నారు. సోమవారం ఉదయం 7.15 గంటలకు ప్రారంభమ య్యే ఈ వేడుకలు దాదాపు రెండు గంటలకుపైగా కొనసాగనున్నాయి. మంత్రులు, ప్రజాప్రతినిధులతో పాటు ఉన్నతాధికారులు, వెయ్యి మందికిపైగా అతి ముఖ్యమైన అతిథులు, 600 మంది ముఖ్య అతిథులు హాజరుకానున్నారు. మరో 1500 మంది అతిథులు స్టేడియం లోపల ఆశీనులవుతారు. సుమారు 15వేల మందికిపైగా విద్యార్థులు, ప్రజలను స్టేడియం గ్యాలరీలోకి అనమతించనున్నారు. ఇంత పెద్ద ఎత్తున జరుగుతున్న కార్యక్రమంలో స్టేడియం ఆవరణలో కనీసం సీసీ కెమెరాలు కూడా లేవు. శనివారం నుంచి స్టేడియం ఆవరణలో అక్కడక్కడ వీటిని ఏర్పాటు చేస్తామని పోలీసులు చెబుతున్నారు. బస్టాండ్, రైల్వేస్టేషన్లతోపాటు బెంజి సర్కిల్, రమేష్ హాస్పిటల్, రామవరప్పాడు తదితర జంక్షన్లలో సీసీ కెమెరాలున్నా.. అవి ఎంత వరకు పనిచేస్తున్నాయన్నది అనుమానమే. భారీగా పోలీసుల మోహరింపు.. గణతంత్ర వేడుల సందర్భంగా మున్సిపల్ స్టేడియం వెలుపల ట్రాఫిక్ క్రమబద్ధీకరణకు పోలీసులు మోహరించారు. స్టేడియంలో శని వారం ఫుల్ డ్రెస్డ్ రిహార్సల్స్‌ను పరిశీలించిన డీజీపీ జేవీ రాముడు సంతృప్తి వ్యక్తంచేశారు. డీజీపీ నేతృత్వంలో నలుగురు ఐపీఎస్ అధికారుల పర్యవేక్షణలో బందోబస్తును కట్టుదిట్టం చేశారు. 14 మంది డీఎస్పీలు, 35 మంది సీఐలు, వంద మంది ఎస్సైలు, 150 మంది ఏఎస్ఐ, హెడ్‌కానిస్టేబుల్స్, వెయ్యి మందికిపైగా కానిస్టేబుళ్లు, హోంగార్డులు విధుల్లో నిమగ్నమయ్యారు. -
ఫుట్‌బాల్ కోర్టులో ఫుడ్‌కోర్టా..?
సీపీ నిర్ణయంపై క్రీడాకారుల ఆవేదన స్టేడియం భద్రత ఇక ప్రశ్నార్థకం! ఇందిరాగాంధీ మునిసిపల్ స్టేడియంలో ఇటీవల ప్రారంభించిన మిడ్నైట్ ఫుడ్‌కోర్టు.. స్టేడియం మనుగడనే ప్రశ్నిస్తోంది. రాత్రి 10 గంటల నుంచి తెల్లవారుజామున రెండింటి వరకు నగరవాసులకు అందుబాటులో ఉండేలా ఏర్పాటుచేసిన దీనిపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నారుు. అసలు ఫుట్‌బాల్ కోర్టులో ఫుడ్‌కోర్టు పెట్టడం ఏమిటని క్రీడాకారులు ప్రశ్నిస్తుంటే.. అర్ధరాత్రి వేళ నేరగాళ్లు, తీవ్రవాదులు దర్జాగా స్టేడియంలోకి ప్రవేశించే అవకాశం ఉందని కొంతమంది పోలీసులే చెబుతున్నారు. దీంతో సరికొత్త రాజధానిలో అత్యంత కీలకమైన ఇందిరాగాంధీ మునిసిపల్ స్టేడియం భద్రతపై నీలినీడలు కమ్ముకుంటున్నారుు. విజయవాడ స్పోర్ట్స్ : పోలీస్ కమిషనర్ ఎ.బి.వెంకటేశ్వరరావు ఇటీవలి కాలంలో నగరవాసులహితం కోరి వినూత్న నిర్ణయూలతో అటు జనాన్ని, ఇటు పాలకుల్ని ఆకట్టుకునే ప్రయత్నంలో బిజీ అరుుపోయూరంటే అతిశయోక్తి కాదు. కాబోయే రాజధాని ప్రాంత పరిరక్షణకు, నేరగాళ్లకు బ్రేకులు వేసేందుకు ‘ఆపరేషన్ నైట్ డామినేషన్’ మొదలుపెట్టి సిటీలో పోలీసుమార్క్ డామినేషన్‌ను ప్రదర్శించే ప్రయత్నం చేశారు. ఉన్నత న్యాయస్థానం స్టే ఇచ్చినా పండుగల సీజన్లో నేరాలు జరగకుండా అనధికారికంగానైనా ఈ ఆపరేషన్‌తో మంచి ఫలి తాలే వచ్చాయంటూ పోలీసు బాస్‌కు కితాబులొచ్చారుు. ఈ విషయూన్ని పక్కన పెడితే.. తాజాగా క్రీడాకారులు దేవాలయంగా భావించే ఇందిరాగాంధీ మునిసిపల్ స్టేడియంపై ఆయన తీసుకునే కొన్ని నిర్ణయూలు ఆశ్చర్యానికి గురిచేస్తున్నారుు. రాత్రిపూట జనజీవనాన్ని అడ్డుకోవటానికి తాము డామినేషన్ ప్రదర్శించడం లేదని, అర్ధరాత్రి అపరాత్రి లేకుండా తమ ఇలాకాలో జనం కోరింది కోరినట్టు ఆరగించేందుకు చక్కటి ఫుడ్ కోర్టులు ఏర్పాటు చేస్తున్నట్టు నిరూపించుకునే ప్రయత్నం చేశారు. మెట్రో కల్చర్‌లో భాగంగానే ఓపెన్ మిడ్నైట్ కోర్టు పెట్టాలన్న ఆలోచన రావడమే కాకుండా.. చక్కటి పాత పాటల మధ్య ఆహ్లాదకర వాతావరణంలో ఫుట్‌బాల్ కోర్టులో ‘మిడ్నైట్ ఫుడ్‌కోర్టు’ను ప్రారంభించేశారు. సెకండ్ షో సినిమా చూసుకుని ఇంటికి వెళ్తూ వేడి వేడి బిర్యానీలో రెండు లెగ్ పీసులు పట్టుబట్టే అవకాశం ఓపెన్‌గా, అధికారికంగా కల్పించినందుకు పోలీస్ బాస్‌ను అంతా తెగ పొగిడేస్తున్నారు. ఇదంతా నాణేనికి ఒకవైపే.. మరోవైపు అనేక ప్రశ్నలు.. క్రీడాకారుల ప్రశ్నలివీ.. ఈ ఫుడ్‌కోర్టును ఏకంగా ఫుట్‌బాల్ కోర్టులో ఏర్పాటు చేయడంతో క్రీడాలోకం నివ్వెరపోయింది. ‘ఇదోదే ఫుట్‌బాల్ కోర్టే కదా..’ అనే చులకన భావం స్టేడియం కస్టోడియన్లకు కలగడం తమను బాధిస్తోందని క్రీడావర్గాలు ఆవేదన వ్యక్తం చేస్తున్నాయి. నిత్యం స్టేడియం షాపింగ్ కాంప్లెక్స్ నుంచి వచ్చే డ్రెరుునేజీ మురుగునీరుకు మట్టిగుట్టలు అడ్డుపెట్టుకుని ఆడుకునే ఫుట్‌బాల్ క్రీడాకారులు మిడ్నైట్ ఫుడ్కోర్టుతో భవిష్యత్తులో ఎదురయ్యే ఇబ్బందులపై ఆందోళన చెందుతున్నారు. తెల్లారేసరికి ఫుడ్‌కోర్టు పెట్టిన ఆనవాళ్లు లేకుండా రోజూ శానిటేషన్ కచ్చితంగా నిర్వహిస్తామని చెబుతున్న మునిసిపల్ కమిషనర్ బదిలీ కాకుండా ఇక్కడే స్థిరంగా ఉంటారా? అని క్రీడాకారులు ప్రశ్నిస్తున్నారు. స్టేడియంలో దుర్గంధం వెదజల్లుతున్న బాత్రూమ్లను పట్టించుకోని శానిటేషన్ అధికారులు ఫుడ్‌కోర్టు విషయంలో ఎలా స్పందిస్తారంటున్నారు. చీకటి కార్యకలాపాలు జరగవన్న భరోసా ఉందా..? ఫుడ్‌కోర్టు పుణ్యమా అని అధికారికంగానే అర్ధరాత్రి స్టేడియంలోకి ప్రవేశించే వెసులుబాటు కల్పించినపుడు చీకటి కార్యకలాపాలు జరగవని గ్యారెంటీ ఏమిటన్నది క్రీడాకారుల మరో ప్రశ్న. రాత్రి రెండు గంటల వరకు ఫుడ్‌కోర్టుకు అనుమతి ఉన్నపుడు మందుబాబులు గ్యాలరీలోకి వెళ్లి కుర్చుంటామంటే అడ్డు చెప్పేదెవరు? ఇందుకు ఎవరు బాధ్యత తీసుకుంటారంటున్నారు. ఇప్పటికే నగరం నడిబొడ్డున ఉన్న ఈ స్టేడియం గోడలకు రంధ్రాలు పెట్టి లోపల ఉన్న క్రీడా సంఘాల కార్యాలయాల్లో ఏసీలు, విలువైన వస్తువులు, ఇతర సామగ్రిని అందినకాడికి దొంగిలిస్తున్నారు. ఈ నేపథ్యంలో రాజధాని నగరంలో కీలకమైన ప్రధాన స్టేడియాన్ని సీసీ కెమెరాల భద్రతల నడుమ చూడాల్సిన అధికారులు మిడ్నైట్ ఫుడ్‌కోర్టులకు నిలయం చేయడంపై ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. స్టేడియం భద్రత ఎంత? కాబోయే రాజధాని నగరం అనేక కీలక కార్యక్రమాలకు వేదిక కానుంది. ఇలాంటి సమయంలో మిడ్నైట్ ఫుడ్‌కోర్టులకు తరలివచ్చే అపరిచితులతో స్టేడియం భద్రతకు ముప్పుతప్పదనే విషయం పోలీసు బాస్‌కు తెలియంది కాదు గానీ, ఫుడ్‌కోర్టు ఏర్పాటు వెనుక దాగి ఉన్న ఆంతర్యం అర్థం కావడం లేదని పోలీసు వర్గాలే వ్యాఖ్యానిస్తున్నాయి. ఫుడ్‌కోర్టుకు వచ్చినోళ్లు కేవలం తినేసి వెళ్లిపోతారనుకుంటే పొరపాటే. రాత్రిపూట ఖాళీ ప్రదేశం దొరికిందని అక్కడే తిష్ట వేసే ప్రమాదం ఉంది. అసాంఘిక కార్యకలాపాలతో పాటు మలమూత్రాలు స్టేడియంలో విసర్జించి ఆ ప్రాంతాన్ని నాశనం చేసే అవకాశం ఉంది. ఇక.. ఉగ్రవాదులు, తీవ్రవాదులు రెక్కీ జరుపుకోవటానికి అవకాశం కల్పించినట్టేనని పోలీసు వర్గాలే వ్యాఖ్యానిస్తున్నాయి. అంతర్జాతీయ ఖ్యాతి పొందిన హైదరాబాద్ ఎల్బీ స్టేడియంలో ఇలాంటి తోపుడు బళ్ల మిడ్నైట్ ఫుడ్‌కోర్టులు లేవు. అక్కడ కూడా మెట్రో కల్చర్‌కు అనుగుణంగా ఫుడ్‌కోర్టులు ఉన్నాయి. కానీ, ఏ క్రీడా మైదానాన్ని వీటికి వేదికగా మార్చలేదు. -
స్టార్ క్రికెట్‌కు సర్వంసిద్ధం
హుద్‌హుద్ తుపాను బాధితుల సహాయార్థం నగరంలోని ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో ఆదివారం నిర్వహించనున్న సినీతారల క్రికెట్ మ్యాచ్‌కు అన్ని ఏర్పాట్లు పూర్తిచేశారు. ఈ మ్యాచ్‌లో శ్రీకాంత్, తరుణ్ జట్లు పోటీ పడనున్నాయి. విజయవాడ స్పోర్ట్స్ : హుదూద్ తుపాను బాధితుల సహాయార్థం టాలీవుడ్ క్రికెట్ అసోసియేషన్, శ్రీమిత్రా గ్రూపు సంయుక్త ఆధ్వర్యంలో ఇందిరగాంధీ మున్సిపల్ స్టేడియంలో ఆదివారం జరుగనున్న స్టార్ క్రికెట్ కప్‌కు సర్వం సిద్ధమైంది. సినీహీరో రామచరణ్‌తేజ ప్రత్యేక గౌరవ అతిథిగా హాజరయిన శ్రీమిత్ర చౌదరి తెలిపారు. ప్రత్యేక విమానంలో రామ్‌చరణ్‌తేజ ఆదివారం ఉదయం నగరానికి చేరుకుంటారని తెలిపారు. ప్రముఖ సినీనటులు, జబర్దస్త్ ఫేమ్ కామెడీ ఆర్టిస్టులు సందడి చేయనున్నారు. స్టేడియం మ్యాచ్‌కు కావల్సిన ఏర్పాట్లన్నీ పూర్తి చేశారు. ట్వంటీ20 క్రికెట్ మ్యాచ్‌తో పాటు సెలబ్రెటీలు తమ వలపులు ప్రదర్శించనున్నారు. డ్యాన్స్‌లు, కామెడీ షోలతో ప్రేక్షకులను అలరించనున్నారు. ప్రియమణి,రకుల్‌ప్రీత్‌సింగ్, అధ్హాశర్మ, రాశీఖన్నా, నికీషాపటేల్, సన్నిధి, సురభీ, నిఖితాదివ్య వంటి సెలబ్రెటీలు పాల్గొంటున్నారు. వీరితో పాటు ప్రముఖ సంగీత దర్శకుడు తమన్ విభావరి ఉంటుంది. హంసనందిని, ర జీనా, షాన్వీశ్రీవాస్తవ, కామ్నాజఠ్మలానీ డ్యాన్స్‌లతో యువతను ఉర్రూతలూగించనున్నారు. యాంకర్లు అనసూయ, రేష్మీలు, కామెడీ యాక్టర్లు వేణు, ధన్‌రాజ్, షకలక శంకర్, చమక్ చంద్రా, మిమిక్రీ ఆర్టిస్ట్ శివారెడ్డి పాల్గొంటున్నారు. శ్రీకాంత్ ఎలెవన్, తరుణ్ ఎలెవన్ జట్లుతలపడుతున్నాయి. వ్యాపారవేత్తలు, కార్పొరేట్ సంస్థలు తమ వస్తువులను ప్రమోట్ చేసుకునేందుకు ఏర్పాట్లు చేశారు. మ్యాచ్ ఉదయం 8గంటలకు ప్రారంభమవుతుంది. తరుణ్ ఎలెవన్ : తరుణ్(కెప్టెన్), నరేష్, నితిన్, ప్రిన్స్, విశ్వా, సందీప్‌కిషన్, రఘు, రాజీవ్‌కనగాల, అయ్యప్ప, సామ్రాట్, అజయ్, శర్వానంద్. శ్రీకాంత్ ఎలెవన్: శ్రీకాంత్( కెప్టెన్), నాని, నిఖిల్, అదర్శ్, సాయిధర్మతేజ, మనోజ్, నవీన్‌చంద్ర, సుధీర్, నందకిషోర్, ప్రభు, కార్తీక్, ఖయ్యూం, భూపాల్, సమీర్, శశాంక్ . -
అథ్లెటిక్స్.. అదుర్స్..
విజయవాడలోని ఇందిరాగాంధీ మునిసిపల్ స్టేడియంలో జరుగుతున్న జియో 30వ జాతీయ జూనియర్ అథ్లెటిక్స్ చాంపియన్‌షిప్ నువ్వానేనా.. అన్నట్టుగా సాగుతోంది. రెండోరోజైన గురువారం జరిగిన హర్డిల్స్, ట్రయథ్లాన్, రిలే పోటీలను ప్రేక్షకులు ఆసక్తిగా తిలకించారు. ఉదయం 6 గంటల నుంచే పోటీలు ప్రారంభమయ్యాయి. పోటీల నిర్వాహక కమిటీ చైర్మన్, నర్సారావుపేట ఎంపీ రాయపాటి సాంబశివరావు, ఎమ్మెల్యేలు గద్దె రామ్మోహన్, తంగిరాల సౌజన్య, రాష్ట్ర కార్మిక శాఖ ముఖ్య కార్యదర్శి రామాంజనేయులు విజేతలకు మెడల్స్ అందజేశారు. - విజయవాడ స్పోర్ట్స్ రేస్‌వాక్‌లో ప్రియాంక రికార్డు 30వ జాతీయ జూనియర్ అథ్లెటిక్స్ చాంపియన్‌షిప్‌లో రెండోరోజైన గురువారం జాతీయ రికార్డు నమోదైంది. ఉత్తరప్రదేశ్ (మీరట్)కు చెందిన ప్రియాంక గోస్వామి 10వేల మీటర్ల రేస్ వాక్‌లో 2010లో కుష్బీర్కౌర్ (పంజాబ్) నెలకొల్పిన 49:21:21 జాతీయ రికార్డును 49:16:51 టైమింగ్‌తో అధిగమించింది. తన సమీప ప్రత్యర్థి (రజత పతకం సాధించిన) భావనాజాత్ (రాజస్థాన్ 55:24:39)కు దాదాపు ఆరు నిమిషాల తేడాతో లక్ష్య దూరాన్ని చేరుకుని ప్రియాంక సరికొత్త రికార్డు సృష్టించింది. బెంగళూరులోని భారత క్రీడా ప్రాధికార సంస్థ (శాయ్) ఎక్సెలెన్సీ సెంటర్లో భారత అథ్లెట్లకు శిక్షణ ఇస్తున్న రష్యన్ కోచ్ అలెగ్జాండర్ వద్ద ప్రియాంక శిక్షణ పొందుతోంది. 2016 రియో ఒలింపిక్స్‌లో పాల్గొనాలనే లక్ష్యంతో కృషిచేస్తోంది. రెండోరోజు ఫలితాలు అండర్-20 బాలికల పదివేల మీటర్ల రేస్‌వాక్‌లో ప్రియాంక (ఉత్తరప్రదేశ్, 49:16:51 సెకన్లు), భావనాజత్ (రాజస్థాన్, 55:24:39), మేరీ మార్గరేట్ (కేరళ, 56:48:06) వరుసగా మొదటి మూడు స్థానాలు పొందారు. అండర్-18 బాలుర పదివేల మీటర్ల రేస్ వాక్‌లో మనీష్ (హర్యానా, 45:36:00), సునీల్ (హర్యానా, 45:38:20), ఏకనాథ్ (ఢిల్లీ, 45:52:30) అండర్-20 బాలికల ఐదువేల మీటర్ల రన్లో నేహ (మధ్య ప్రదేశ్, 17:47:98), పూలాన్పాల్ (అసోం, 17:51:56), మౌనికా యాదవ్ (ఉత్తరప్రదేశ్, 18:03:96) వరుసగా ప్రథమ, ద్వితీయ, తృతీయ స్థానాలు సాధించారు. అండర్-20 బాలుర ఐదువేల మీటర్ల రన్నింగ్‌లో శర్వాన్ కార్బ్ (హర్యానా, 14:48:56), రాజేంద్ర (మధ్య ప్రదేశ్, 14:53:78), హర్షద్ (ఢిల్లీ, 15:01:04) మొదటి మూడు స్థానాలు కైవసం చేసుకున్నారు. అండర్-18 బాలికల హైజంప్‌లో లిబియా షాజీ (కేరళ, 1.66 మీటర్లు), చేష్మా (కేరళ, 1.64 మీటర్లు), లైమాన్ నర్జారే (అసోం, 1.61 మీటర్లు) మొదటి మూడు స్థానాలు కైవసం చేసుకున్నారు. అండర్-16 బాలికల 500 గ్రాముల జావలిన్ త్రోలో సంజనా చౌదరి (రాజస్థాన్, 38.22 మీటర్లు), ఎన్.హేమామాలిని (తమిళనాడు, 37.43 మీటర్లు), రంజున్ పేగూ (అసోం, 37.18 మీటర్లు) మొదటి మూడు స్థానాలు పాందారు. అండర్-16 బాలుర ఐదు కేజీల హేమర్‌త్రోలో అశిష్ జాఖర్ (హర్యానా, 67.09 మీటర్లు), ద మినీత్ సింగ్ (పంజాబ్, 59.43 మీటర్లు), మీరజ్ ఆలీ (ఉత్తరప్రదేశ్, 58.66 మీటర్లు), అండర్-18 బాలుర ఐదు కేజీల హేమర్ త్రోలో ప్రదీప్‌కుమార్ (రాజస్థాన్, 70.03 మీటర్లు), సబీల్ అహ్మద్ (ఉత్తరప్రదేశ్, 66.71 మీటర్లు), వివేక్ సింగ్ (ఉత్తరప్రదేశ్, 60.94 మీటర్లు) మొదటి మూడు స్థానాలు పొందారు. పల్లెపల్లెలో క్రీడా పతాకం ఎగరాలి 2010 (ఢిల్లీ) కామన్వెల్ గే మ్స్, 2002 (బుసాన్), 2006 (దోహా), 2010 (చైనా), 2014 (కొరియా) ఏషియన్ గేమ్స్‌లో 4‘400 మీటర్ల భారత రిలే జట్టుకు కోచ్‌గా వ్యవహరించడమే కాదు క్రీడాకారులు స్వర్ణ పతకాలు సాధించడంలో కీలకపాత్ర పోషించిన శాయ్ (హైదరాబాద్) అథ్లెటిక్స్ కోచ్ నాగపూరి రమేష్. పేరొందిన ఆయన జాతీయ జూనియర్ అథ్లెటిక్స్ చాంప్‌లో పాల్గొనేందుకు ఇందిరాగాంధీ మునిసిపల్ స్టేడియూనికి వచ్చారు. ఈ సందర్భంగా కొద్దిసేపు ‘సాక్షి’తో మాట్లాడారు. - విజయవాడ స్పోర్ట్స్ కోస్తాతీరంలో క్రీడా ప్రతిభకు కొదవలేదు. పల్లె పల్లెకూ క్రీడా మైదానం ఉండేలా చూడాలి. అప్పుడే కొత్త రాష్ట్రంలో ఆరోగ్యమంతమైన సమాజం రూపుదిద్దుకుంటుంది. మెరికల్లాంటి యువత పుట్టుకొస్తుంది. మండలానికి ఒక రీజినల్ స్పోర్ట్స్ స్కూల్, జిల్లాకు ఒక ప్రధాన స్పోర్ట్స్ స్కూల్, రాజధానిలో సెంటర్ ఆఫ్ ఎక్సలెన్సీ స్పోర్ట్స్ స్కూల్ ఉండాలి. ప్రతి స్టేడియంలో సింథటిక్స్ ట్రాక్ ఏర్పాటుచేయూలి. యువత పెడదారి పట్టి తీవ్రవాదులుగా మారితే వారిని అణిచి వేయడానికి వేల కోట్ల రూపాయలను ప్రభుత్వం ఖర్చుచేస్తోంది. ఆ ఖర్చు క్రీడల కోసం వినియోగిస్తే యువత పెడదారి పట్టకుండా ఉంటుంది. హ ర్యానా ప్రభుత్వం కొత్తగా ఒక పథకాన్ని ప్రవేశపెట్టింది. శారీరక శక్తి సామర్థ్యం పాసైన బాలబాలికలకు రూ.5వేల చొప్పున స్కాలర్షిప్లు అందజేస్తోంది. విద్య, ఉద్యోగాల్లో క్రీడాకారులకు రెండు శాతం స్పోర్ట్స్ కోటా ఉండాలి. విద్యలో కేరళ మాదిరిగా బోనస్ మార్కులు ఇవ్వాలి. అభధ్రతా భావం లేని పర్మినెంట్ కోచ్‌లు ఉండాలి. ఏటా క్రీడాకారులతో పాటు కోచ్‌లకు, సంబంధిత సిబ్బందికి అవార్డులు ఇవ్వాలి. అథ్లెటిక్స్.. క్రీడల్లో తల్లి లాంటింది. మన అథ్లెట్ల శక్తి సామర్థ్యాలు పెంచేందుకు ప్రభుత్వంతో పాటు కార్పొరేట్ సంస్థలు ముందుకురావాలి. అప్పుడే కొత్త రాష్ర్ట శక్తి సామర్థ్యాలు, కీర్తి ప్రతిష్టలు పెరుగుతారుు. -
నేటి నుంచి విజయవాడలో జాతీయ జూనియర్ అథ్లెటిక్స్
విజయవాడ స్పోర్ట్స్: జాతీయ జూనియర్ అథ్లెటిక్స్ చాంపియన్‌షిప్ బుధవారం నుంచి విజయవాడలోని ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియం లో జరుగుతాయి. 26 రాష్ట్రాల నుంచి సుమారు 3వేల మంది జూనియర్ బాలబాలికలు బరిలోకి దిగుతున్నారు. 30వ తేదీ వరకు 150 ఈవెంట్లలో పోటీలు జరుగుతాయి. జూనియర్ ఏషియాడ్, జూనియర్ కామన్వెల్త్ మీట్లకు ఈ పోటీల ద్వారా అథ్లెట్లను ఎంపిక చేస్తారు. -
జవాన్ల కంటే పోలీసులు గొప్పవాళ్లు
విజయవాడ: ప్రజల ఆస్తులు, మహిళల రక్షణకు పోలీసులు అహర్నిశలు కష్టపడుతున్నారని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తెలిపారు. నగరంలోని ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలోమంగళవారం పోలీసు అమరవీరుల సంస్మరణ దినోత్సవం ఘనంగా జరిగింది. ఈ సందర్భంగా ముఖ్య అతిథిగా హాజరైన చంద్రబాబునాయుడు మాట్లాడుతూ... పోలీసుల విధి నిర్వహాణలో విపరీతమైన పని భారం పడుతుందని... ఆ భారాన్ని తగ్గించేందుకు తమ ప్రభుత్వం ప్రయత్నిస్తుందని చెప్పారు. దేశం కోసం పోరాడిన జవాన్ల కంటే పోలీసులు గొప్పవాళ్ల అని అన్నారు. పోలీసుల గౌరవాన్ని పెంచేలా ప్రభుత్వం పని చేస్తుందన్నారు. దేశంలో పెత్తనం చేయాలని పోలీసు వ్యవస్థను బ్రిటీష్ వారు తీసుకువచ్చారని చంద్రబాబు గుర్తు చేశారు. బ్రిటీష్ వారి ప్రవర్తన వల్ల ప్రజలకు ఇప్పటికీ పోలీసులపై నమ్మకం కలగని పరిస్థితి నెలకొందని అన్నారు. ప్రజల విశ్వాసాన్ని పెంచేలా పని చేయాలని చంద్రబాబు ఈ సందర్భంగా పోలీసులకు సూచించారు. పోలీసులు ఆధునిక పరిజ్ఞానాన్ని వినియోగించాలని అన్నారు. ఈ కార్యక్రమంలో ఏపీ డీజీపీ జేవీ రాముడు మాట్లాడుతూ... రాష్ట్రంలో గత పదేళ్ల కాలంలో 152 మంది పోలీసులు అమరులయ్యారని తెలిపారు. దేశవ్యాప్తంగా గత పదేళ్ల కాలంలో 7 వేల మంది పోలీసులు మరణించారని తెలిపారు. ఈ కార్యక్రమానికి ఉప ముఖ్యమంత్రి, హోంశాఖ మంత్రి ఎన్. చినరాజప్ప, ఇతర రాష్ట్ర మంత్రులు, ఎంపీలతోపాటు పోలీసు శాఖ ఉన్నతాధికారులు పాల్గొన్నారు. -
సీఎం పర్యటనపై కలెక్టర్ కసరత్తు
విజయవాడ : జిల్లాలోని పలు కార్యక్రమాలకు 21న హాజరుకానున్న సీఎం చంద్రబాబు పర్యటనపై కలెక్టర్ ఎం.రఘునందన్‌రావు కసరత్తు చేశారు. ఆదివారం క్యాంపు కార్యాలయంలో అధికారులతో సమావేశమయ్యారు. ముఖ్యమంత్రి పాల్గొనే పలు కార్యక్రమాలను పగడ్బందీగా నిర్వహించాలని అధికారులను ఆదేశించారు. సీఎం పర్యటనలో భాగంగా విజయవాడలో పోలీసు సంస్మరణ దినోత్సవం, ఇతర కార్యక్రమాలలో పాల్గొనే అవకాశం ఉందన్నారు. ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో, పోలీసు పేరెడ్ గ్రౌండ్లో పాల్గొని, అనంతరం పోలీసు కంట్రోల్ రూంను ప్రారంభిస్తారని చెప్పారు. రైతు సాధికారిత సంస్థను గన్నవరంలోని ఎన్టీఆర్ పశువుల కళాశాల ఆవరణలో ప్రారంభిస్తారు. ఈ పర్యటన సందర్భంగా గన్నవరంలో నిర్వహించే కార్యక్రమాలకు చెందిన రూట్ మ్యాప్‌ను సిద్ధం చేయాలని అధికారులను ఆదేశించారు. సదస్సుకు హాజరయ్యే రైతులు వచ్చే వాహనాల పార్కింగ్ తదితర అంశాలపై ముందస్తుగా ప్రణాళికలు సిద్ధం చేసుకోవాలన్నారు. సభా ప్రాంగణంలో ఎగ్జిబిషన్‌ను ఏర్పాటు చేయాలని సూచించారు. సదస్సుకు హాజరయ్యే రైతులకు తాగునీటి వసతి కల్పించాలని మున్సిపల్ అధికారులను ఆదేశించారు. వ్యవసాయశాఖ జెడీ దామోదర నాయుడు, అడిషనల్ జాయింట్ కలెక్టర్ బి.ఎల్. చెన్నకేశవరావు, వ్యవసాయశాఖ జేడీ వి.నరసింహులు, మార్కెటింగ్ జేడీ కె. శ్రీనివాసరావు, సమాచారశాఖ డీపీఆర్వో కె.సదారావు, విజయవాడ, గన్నవరం తహశీల్దార్లు శివరావు, మాధురి, మున్సిపల్ ఇరిగేషన్ అధికారులు పాల్గొన్నారు. -
తాత చెప్పినట్టే దేశ దిమ్మరినయ్యూ
కేంద్ర మంత్రి ఎం.వెంకయ్య నాయుడు విజయవాడ స్పోర్ట్స్, న్యూస్‌లైన్ : ‘ఓరే బాబూ నీ అరి కాలిపై చక్రం ఉందిరా. దేశ దిమ్మరివవుతావు. అని చాలా చిన్న వయస్సులోనే మా తాత చెప్పారు. అలాగే ఆ నాడు ఆయన చెప్పిన ప్రకారమే దేశదిమ్మరినయ్యూ. దేశమంతా తిరిగి ప్రజలకు సేవ చేయడానికే దేశ దిమ్మరినయ్యా’ అని అన్నారు కేంద్ర పట్టణాభివృద్థి శాఖ మంత్రి ఎం.వెంకయ్యనాయుడు. చంద్రబాబు ప్రమాణాస్వీకారోత్సవానికి హాజరయ్యేందుకు నగరంలోని గేట్‌వే హోటల్లో దిగిన కేంద్ర మంత్రి వెంకయ్యనాయడు ఆదివారం ఉదయం ఆరున్నర గంటలకు ఇందిరాగాంధీ మునిసిపల్ స్టేడియంలో కొద్దిసేపు వాకింగ్ చే శారు. ఈ సందర్భంగా విలేకరులతో మాట్లాడుతూ నడక శారీరక, మానసిక ఆరోగ్యాన్ని పెంపొందిస్తుందన్నారు. చేసే పని మంచిదైతే మానసిక ప్రశాంతత లభిస్తుందన్నారు. తాను రోజూ ఇంటిలో అందుబాటులో ఉన్న డ్రైవర్‌తో, కుక్‌తో ఎవరితోనైనా కలిసి షటిల్ బ్యాడ్మింటన్ ఆడుతుంటానన్నారు. తనకిష్టమైన షటిల్ బ్యాడ్మింటన్ ఆడిన తరువాత హుషారుగా, ప్రశాంతంగా ఉంటుందన్నారు. దేశంలో ప్రతి ఒక్కరూ వాకింగ్, సైక్లింగ్ చేసే సంస్కృతి పెరగాలన్నారు. ఇందుకోసమే పట్టణాభివృద్ధిలో భాగంగా దేశంలో కొత్తగా ఏర్పాటు చేయనున్న స్మార్ట్ సిటీలు, మెట్రో సిటీల్లో రోడ్లపై వాకింగ్, సైక్లింగ్ ట్రాక్‌లు ఏర్పాటు చేస్తామన్నారు. సీమాంధ్ర నగరాల్లో వేసే రోడ్లపై వాకింగ్, సైక్లింగ్ ట్రాక్‌లు ఏర్పాటు చేస్తామన్నారు. ఐజీఎంసీ స్టేడియంలో అనుకోని అతిథిగా కాషాయ రంగు టీ షర్ట్, లోయర్‌తో సాదాసీదాగా వచ్చిన కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడుకు స్టేడియంలో వార్మ్ప్ చేస్తున్న టెన్నిస్ ఆడే చిన్నారులు ‘గుడ్ మార్నింగ్ సార్’ అంటూ స్వాగతం పలికారు. ఇందుకు వెంకయ్యనాయడు తనైదైనశైలిలో ‘మనం భారతీయులం. గుడ్ మార్నింగ్ కాదు నమస్తే అనాలి. మమ్మీ, డాడీ కాదు అమ్మా, నాన్న అని పిలవాలి’ అని సూచించారు. టెన్నిస్ చిన్నారులతో పాటు క్రికెట్ ప్రాక్టీస్ చేస్తున్న మహిళా క్రికెటర్లకు కుశల ప్రశ్నలువేశారు. స్టేడియంలో వాకర్స్ అసోసియేషన్ సభ్యులు కూడా వెంకయ్యనాయుడుతో కరచలనం చేసి శుభాకాంక్షలు తెలిపారు. ఎన్నికల ముందు ఒక సారి స్టేడియంలో వాకింగ్ చేసేం దుకు వచ్చానని, మళ్లీ ఇప్పుడు వచ్చినట్లు గుర్తు చేసుకున్నారు. సింథటిక్ రన్నింగ్ ట్రాక్ ఏర్పాటుకు కృషి స్టేడియంలో సింథటిక్ రన్నింగ్ ట్రాక్ ఏర్పాటు విషయాన్ని ‘న్యూస్‌లైన్’ వెంకయ్య నాయుడు దృష్టికి తీసుకెళ్లగా ఆయన సానుకూలంగా స్పందించారు. కేంద్ర ప్రభుత్వ నిధులతో సింథటిక్ ట్రాక్ ఏర్పాటు చేయాల్సి ఉందని, ఇందుకు సంబంధించిన ప్రతిపాదనలు కేంద్రం వద్ద ఉన్నాయని వివరించగా వెంకయ్యనాయుడు వెంటనే తన పీఏను పిలిచి ఢిల్లీ వెళ్లగానే సంబంధిత మంత్రితో మాట్లాడేందుకు ఏర్పాటు చేయాలని ఆదేశించారు. వాకింగ్ అనంతరం స్టేడియం నుంచి బందరు రోడ్డుపై నడుచుకుంటూనే తాను బస చేసిన హోటల్ గేట్‌వేకు చేరుకున్నారు. -
ఆర్చరీలో హ్యాట్రిక్‌తో అదరగొట్టిన ఆణిముత్యం
విజయవాడ స్పోర్ట్స్, న్యూస్‌లైన్ : ఇందిరాగాంధీ మునిసిపల్ స్టేడియంలో జరుగుతున్న చెరుకూరి లెనిన్-ఓల్గా స్మారక 6వ మినీ జాతీయ ఆర్చరీ పోటీలలో ఓల్గా ఆర్చరీ అకాడమీకి చెందిన ఆర్చర్ కె.జ్యోత్స్న మరోసారి సత్తాచాటింది. కాంపౌండ్ బాలికల విభాగం, వ్యక్తిగత ఒలింపిక్ రౌండ్లో వరుసగా మూడో ఏడాది స్వర్ణపతకం సాధించింది. శుక్రవారం జరిగిన ఈ పోటీలో 139 పాయింట్లు సాధించింది. సమీప ప్రత్యర్థిపై 15 పాయింట్లు ఆధిక్యంతో విజయం అందుకుంది. రెండో రోజు ఫలితాలు.. కాంపౌండ్ విభాగం బాలుర వ్యక్తిగత ఒలింపిక్ రౌండ్లో మైనేని చరిత్ రజత పతకం కైవసం చేసుకున్నాడు. కాగా క్వాలిఫయింగ్ రౌండ్లో టాపర్‌గా నిలిచిన (ఓల్గా) ఆర్చర్ మహేష్ ఒలింపిక్ రౌండ్లో క్వార్టర్ ఫైనల్లో ఓటమి చవిచూశాడు. మరో పూల్ నుంచి దూసుకువచ్చిన మైనేని చరిత్ సెమీస్‌లో జార్ఖండ్ ఆర్చర్‌పై గెలుపొంది, మహారాష్ట్ర ఆర్చర్‌పై ఫైనల్లో ఓడిపోయాడు. రికర్వు విభాగంలో మహారాష్ట్ర ఆర్చర్లు సత్తా చాటగా, 30 మీటర్లు, 20 మీటర్ల విభాగం రెండింటిలోనూ బొమ్మదేవర ధీరజ్ స్వర్ణపతకాలు గెలుపొందాడు. బాలుర రికర్వు 50 మీటర్ల విభాగంలో మహారాష్ట్రకు చెందిన యష్‌దీప్ బోగే, అషతోష్బడే, అలోక్ గౌరవ్, 40 మీటర్ల విభాగంలో యష్‌దీప్ భోగే (మహారాష్ట్ర), సురయ్జముదా(జార్ఖండ్), అషతోష్ బడే (జార్ఖండ్), 30 మీటర్ల విభాగంలో బి.ధీరజ్(ఏపీ), యష్‌దీప్ భోగే(మహారాష్ట్ర), సురాయ్ జముదా (జార్ఖండ్), 20 మీటర్ల విభాగంలో బి.ధీరజ్(ఏపీ), సీహెచ్.రిష్కేష్ సింగ్(మణిపూర్), యషదీప్భోగే (మహారాష్ట్ర) వరుసగా మొదటి మూడు స్థానాలు కైవసం చేసుకున్నారు. బాలికల రికర్వు 50 మీటర్ల విభాగంలో మధురా, ఉన్నాటి రవి (మహారాష్ట్ర), బీఎం రిత్విక (ఏపీ), 40 మీటర్ల విభాగంలో కెతికీ జాదవ్ , ఉన్నాటి రవి, మధురా(మహారాష్ట్ర), 30 మీటర్ల విభాగంలో ఉన్నాటి రవి, రాధాశర్మ(ఢిల్లీ), వై.రోషిణీ దేవి(మణీపూర్), 20 మీటర్ల విభాగంలో ఆర్.రోషిణీదేవి (మణీపూర్), రాధాశర్మ(ఢిల్లీ), కెట్కిజాదవ్ (మహారాష్ట్ర) వరుసగా మొదటి మూడు స్థానాలు కైవసం చేసుకున్నారు. ఇండియన్ రౌండ్ బౌ 30 మీటర్ల బాలికల విభాగంలో బి.నవ్యశ్రీ(ఏపీ) స్వర్ణపతకం సాధించగా, సిజాసబరిన్(అసోం), కోమలిక బారీ (జార్ఖండ్), 20 మీటర్ల విభాగంలో బంకీరా, కోమలిక బారీ’(జార్ఖండ్), జ్యోతి (హర్యానా) వరుసగా మొదటి మూడు స్థానాల్లో నిలిచారు. శనివారం కాంపౌండ్ మిక్సిడ్ రౌండ్, రికర్వు ఒలింపిక్ రౌండ్ పోటీలు జరుగనున్నాయి. కాగా, మ్యాచ్‌లు అనంతరం ఆట విడుపు కోసం ఏర్పాటు చేసి డీజే కార్యక్రమంలో ఆర్చర్లు సందడిచేశారు. -
సత్తా చాటిన రాష్ట్ర ఆర్చర్లు
విజయవాడ స్పోర్ట్స్, న్యూస్‌లైన్: మినీ జాతీయ ఆర్చరీ చాంపియన్‌షిప్ (అండర్-14)లో రాష్ట్ర ఆర్చర్లు సత్తా చూపుతున్నారు. స్థానిక ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో గురువారం చెరుకూరి లెనిన్-ఓల్గా స్మారక 6వ మినీ జాతీయ ఆర్చరీ చాంపియన్‌షిప్ ప్రారంభమైంది. తొలి రోజు కాంపౌండ్, ఇండియన్ రౌండ్ బౌ విభాగాల్లో ఈవెంట్లు నిర్వహించారు. కాంపౌండ్ క్వాలిఫయింగ్ రౌండ్ బాలికల విభాగంలో డిఫెండింగ్ చాంపియన్ కె.జ్యోత్స్న 720 పాయింట్లకు 641 పాయింట్లు సాధించి విజేతగా నిలిచింది. కె.అక్షయ 7వ స్థానంలో, ఎస్డీ రిఫాత్ 10వ స్థానంలో నిలిచారు. బాలుర విభాగంలో కె.మహేష్ (632 పాయింట్లు)కు మొదటి స్థానం దక్కింది. ఎం.చరిత్ ఐదవ స్థానంలో, కె.వెంకటాద్రి 8వ స్థానంలో, డి.రోహిత్ మణివర్మ 12వ స్థానంలో నిలిచారు. -
శరణు శరణు.. భవానీ!
విజయవాడ స్పోర్ట్స్, న్యూస్‌లైన్: స్థానిక ఇందిరాగాంధీ మునిసిపల్ స్టేడియంలో రెండు రోజులు జరిగిన ఏపీ స్టేట్ పైకా పోటీలు ఆదివారం ముగిశాయి. గ్రామీణ ఆర్చరీ(ఇండియన్ బౌ) పోటీలు బాలికల విభాగంలో కృష్ణా జట్టు టీమ్ చాంపియన్‌షిప్‌ను కైవసం చేసుకుంది. మహిళా టెన్నిస్ టోర్నీలో టీమ్ చాంపియన్‌షిప్‌ను హైదరాబాద్ జట్టు కైవసం చేసుకుంది. రంగారెడ్డి, విశాఖపట్నం జిల్లాలు ద్వితీయ, తృతీయ, కృష్ణా జట్టు చతుర్థస్థానాల్లో నిలిచాయి. పైకా గ్రామీణ ఆర్చరీ(ఇండియన్ బౌ) పోటీల్లో నిజామాబాద్, రంగారెడ్డి ద్వితీయ, తృతీయ స్థానాలు దక్కించుకున్నాయి. బాలుర విభాగంలో విశాఖపట్నం జట్టు టీమ్ చాంపియన్‌గా నిలువగా, రంగారెడ్డి, ఖమ్మం జిల్లా జట్లు వరుసగా ద్వితీయ, తృతీయ స్థానాలను కైవసం చేసుకున్నాయి. టెన్నిస్ టీమ్ ఈ వెంట్లో హైదరాబాద్ జట్టు 3-0 తేడాతో రంగారెడ్డి జిల్లా జట్టుపై విజయం సాధించింది. ఫైనల్స్‌లో అనూష(హైదరాబాద్) 9-1 తేడాతో సాయినిఖిత(రంగారెడ్డి)పై, అలేఖ్య(హైదరాబాద్) 9-6 తేడాతో శైలజా(రంగారెడ్డి)పై, డబుల్స్‌లో అనూష, సింధు(హైదరాబాద్) జోడీ 9-6 తేడాతో సాయినిఖిత, సహజా(రంగారెడ్డి) జోడీపై విజయం సాధించారు. ఆర్చరీలో టీమ్ చాంపియన్‌షిప్‌ను కైవసం చేసుకున్న విశాఖపట్నం జట్టు 1442 పాయింట్లు సాధించింది. ఇందులో వరుసగా 50 మీటర్లు, 30 మీటర్ల డిస్టెన్స్ విభాగంలో ప్రథమ స్థానం పొందిన విశాఖపట్నం జట్టులో ఎస్.రమేష్ 254, 293 పాయింట్లు, ఎ.బాబురావు 201, 260, జి.మహేష్‌బాబు 203, 231, ద్వితీయ స్థానంలో నిలిచిన రంగారెడ్డి జట్టులో పి.నూతన్‌కుమార్ 231, 236, ఎ.గణేష్ 188, 270, పి.వంశి 185, 200, ఎన్.అశోక్ 85, 125, తృతీయ స్థానం సాధించిన ఖమ్మం జట్టులో పి.నగేష్ 250, 275, కె.నవీన్ 217, 226, టి.కల్యాణ్ 123, 149 పాయింట్లు పొందారు. బాలికల విభాగంలో... టీమ్ చాంపియన్‌షిప్ సాధించిన కృష్ణా జట్టు 955 పాయింట్లు సాధించింది. ఇందులో వరుసగా 50, 30 మీటర్ల డిస్టెన్స్‌లో పి.జయవినీల 91, 244, ఎ.శ్వేత 142, 183, ఎస్.ఎస్.భవాని 77, 218, ద్వితీయ స్థానంలో నిలిచిన నిజామాబాద్ జట్టులో బి.నవ్యశ్రీ 197, 262, పి.గాయత్రి 161, 158, ఎం.కీర్తన 24, 58, తృతీయ స్థానం పొందిన రంగారెడ్డి జట్టులో బి.కావ్య 158, 159, ఎ.ప్రియాంక 17, 109, ఎస్డీ అఫ్రీన్ 5, 57 పాయింట్లు సాధించారు. క్రీడలు ఆత్మవిశ్వాసాన్ని పెంపొందిస్తాయి చదువుతో పాటు క్రీడల్లో రాణించడం ద్వారా ద్వారా ఆత్మవిశ్వాసం పెంపొందుతుందని విజయవాడ సబ్‌కలెక్టర్ దాసరి హరిచందన అన్నారు. ఏపీ స్టేట్ పైకా మహిళా టెన్నిస్ టోర్నీ, ఆర్చరీ పోటీల ముగింపు కార్యక్రమానికి ఆమె ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న విద్యార్థుల్లో క్రీడా నైపుణ్యాన్ని వెలికితీసేందుకు పైకా క్రీడలు దోహదం చేస్తాయన్నారు. స్పోర్ట్స్ రీజినల్ డెప్యూటీ డెరైక్టర్ జి.చిన్నయ్య మాట్లాడుతూ, జిల్లా ఒలింపిక్ సంఘం కార్యదర్శి కె.పి.రావు మాట్లాడుతూ విద్యార్థులు క్రీడల్లో రాణించి ఆయా జిల్లాలకు పేరుప్రఖ్యాతలు తీసుకురావాలన్నారు. డీఎస్డీవో పి.రామకృష్ణ, ఆర్చరీ అసోసియేషన్ కార్యదర్శి చెరుకూరి సత్యనారాయణ, టెన్నిస్ అసోసియేషన్ కార్యదర్శి డాక్టర్ కె.పట్టాభిరామయ్య, కృష్ణా యూనివర్సిటీ స్పోర్ట్స్‌బోర్డు కార్యదర్శి డాక్టర్ ఎన్.శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు.