స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలకు సర్వం సన్నద్ధం | Vijayawada Illuminated On Eve Of 74th Independence Day Celebrations | Sakshi
Sakshi News home page

జాతీయ జెండాను ఎగురవేయనున్న సీఎం వైస్‌ జగన్‌

Published Fri, Aug 14 2020 8:37 PM | Last Updated on Fri, Aug 14 2020 8:49 PM

Vijayawada Illuminated On Eve Of 74th Independence Day Celebrations  - Sakshi

సాక్షి, అమరావతి :  రేపు (శ‌నివారం ) జ‌ర‌గ‌నున్న 74వ స్వాతంత్ర్య దినోత్స‌వ వేడుక‌ల‌కు విజయవాడలోని ఇందిరాగాంధీ మున్సిపల్‌ స్టేడియం స‌ర్వం సిద్ధ‌మైంది. వర్షం కారణంగా వాతావరణ పరిస్థితులను సమర్థవంతంగా ఎదుర్కొనేలా  యంత్రాంగం ఏర్పాట్లను పూర్తిచేసింది. స్వాతంత్ర్య దినోత్స‌వం సందర్భంగా శనివారం ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి జాతీయ జెండాను ఎగురవేయనున్నారు. అనంతరం సాయుధ దళాల నుండి గౌరవ వందనం స్వీకరిస్తారు. తర్వాత రాష్ట్ర ప్రజలను ఉద్దేశించి ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ సందేశాన్నిస్తారు. ప్రదర్శన కోసం స్టేడియంలో 10 శకటాలను అధికారులు సిద్దం చేశారు. వీటి ద్వారా కోవిడ్ ప‌రిస్థితుల‌ను ప్రభుత్వం ఎంత సమర్థవంతంగా ఎదుర్కొన్నది,  క‌రోనా క‌ట్ట‌డి కోసం  తీసుకున్న చర్యలు తదితర అంశాల‌ను  ప్రతిబింబిచేలాగా శకటాల ప్రదర్శన ఉండ‌నుంది. (కరోనాను కట్టడి చేయగలిగాం)

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement