Independence Day celebrations
-
గోల్కొండ కోటపై ఘనంగా పంద్రాగష్టు పండుగ (ఫొటోలు)
-
...అలా పంచుకున్నారు!
1947. బ్రిటిష్ వలస పాలన నుంచి మనకు విముక్తి లభించిన ఏడాది. అఖండ భారతదేశం రెండుగా చీలిన ఏడాది కూడా. ఒక రాష్ట్ర విభజన జరిగితేనే ఆస్తులు, అప్పులు తదితరాల పంపకం ఓ పట్టాన తేలదు. అలాంటి దేశ విభజన అంటే మాటలా? అది కూడా అత్యంత ద్వేషపూరిత వాతావరణంలో జరిగిన భారత్, పాకిస్తాన్ విభజన గురించైతే ఇక చెప్పేదేముంటుంది! ఆస్తులు, అప్పులు మొదలుకుని సైన్యం, సాంస్కృతిక సంపద దాకా అన్నీ రెండు దేశాల మధ్యా సజావుగా పంపకమయ్యేలా చూసేందుకు నాటి పెద్దలంతా కలిసి భారీ యజ్ఞమే చేయాల్సి వచి్చంది. రేపు దేశమంతా 78వ స్వాతంత్య్ర దిన వేడుకలు జరుపుకోనున్న నేపథ్యంలో దేశ విభజన జరిగిన తీరుతెన్నులపై ఫోకస్... ముందుగానే కమిటీ విభజన సజావుగా సాగేలా చూసేందుకు స్వాతంత్య్రానికి ముందే 1947 జూన్ 16న ‘పంజాబ్ పారి్టషన్ కమిటీ’ ఏర్పాటైంది. తర్వాత దీన్ని విభజన మండలి (పారి్టషన్ కౌన్సిల్)గా మార్చారు. ఆస్తులు, అప్పులతో పాటు సైన్యం, ఉన్నతాధికారులు మొదలుకుని కార్యాలయ సామగ్రి, ఫరి్నచర్ దాకా అన్నింటినీ సజావుగా పంచడం దీని బాధ్యత. కమిటీలో భారత్ తరఫున కాంగ్రెస్ నేతలు సర్దార్ వల్లబ్బాయ్ పటేల్, బాబూ రాజేంద్రప్రసాద్; పాక్ తరఫున ఆలిండియా ముస్లిం లీగ్ నేతలు మహ్మదాలీ జిన్నా, లియాకత్ అలీ ఖాన్ ఉన్నారు. ఇంతటి బృహత్కార్యాన్ని కేవలం 70 రోజుల్లో ముగించాల్సిన గురుతర బాధ్యత కమిటీ భుజస్కంధాలపై పడింది! హాస్యాస్పదంగా భౌగోళిక విభజన! దేశ విభజనలో తొట్టతొలుత తెరపైకొచి్చన అంశం భౌగోళిక విభజన. ఈ బాధ్యతను బ్రిటిష్ న్యాయవాది సర్ సిరిల్ రాడ్‌క్లిఫ్‌కు అప్పగించారు. ఆ మహానుభావుడు హడావుడిగా కేవలం నాలుగే వారాల్లో పని ముగించానని అనిపించాడట. బ్రిటిష్ ఇండియా మ్యాప్‌ను ముందు పెట్టుకుని, తనకు తోచినట్టుగా గీత గీసి ‘ఇదే సరిహద్దు రేఖ’ అని నిర్ధారించినట్టు చెబుతారు. దాన్నే రాడ్‌క్లిఫ్ రేఖగా పిలుస్తారు. ముస్లిం సిపాయిలే కావాలన్న పాక్...కమిటీ ఎదుర్కొన్న అతి పెద్ద సవాళ్లలో సాయుధ బలగాల పంపిణీ ఒకటి. చర్చోపచర్చల తర్వాత దాదాపు మూడింట రెండొంతుల సైన్యం భారత్‌కు, ఒక వంతు పాక్‌కు చెందాలని నిర్ణయించారు. ఆ లెక్కన 2.6 లక్షల బలగాలు భారత్‌కు దక్కాయి. పాక్‌కు వెళ్లిన 1.4 లక్షల మంది సైనికుల్లో అత్యధికులు ముస్లింలే ఉండేలా జాగ్రత్త తీసుకున్నారు. తమ వంతుకు వచి్చన కొద్ది మంది హిందూ సైనికులను కూడా పాక్ వీలైనంత వరకూ వెనక్కిచ్చి బదులుగా ముస్లిం సిపాయిలనే తీసుకుంది. సైనిక పంపకాలను పర్యవేక్షించిన బ్రిటిష్ సైనికాధికారుల్లో జనరల్ సర్ రాబర్ట్ లాక్హార్ట్ భారత్‌కు, జనరల్ సర్ ఫ్రాంక్ మెసెర్వీ పాక్‌కు తొలిసైన్యాధ్యక్షులయ్యారు!...బగ్గీ భారత్‌కే! భారత్, పాక్ మధ్య పురాతన వస్తువులు, కళాఖండాల పంపకం ఓ పట్టాన తేలలేదు. మరీ ముఖ్యంగా బంగారు తాపడంతో కూడిన వైస్రాయ్ అందాల గుర్రపు బగ్గీ తమకే కావాలని ఇరు దేశాలూ పట్టుబట్టాయి. దాంతో చివరికేం చేశారో తెలుసా? టాస్ వేశారు! అందులో భారత్ నెగ్గి బగ్గీని అట్టిపెట్టుకుంది!80:20 నిష్పత్తిలో చరాస్తులు ఆఫీస్ ఫర్నిచర్, స్టేషనరీ వంటి చరాస్తులన్నింటినీ భారత్, పాక్ మధ్య 80:20 నిష్పత్తిలో పంచారు. చివరికి ఇదే నిష్పత్తిలో కరెంటు బల్బులను కూడా వదలకుండా పంచుకున్నారు! ఆస్తులు, అప్పులు ఆస్తులు, అప్పుల పంపకంపై కమిటీ తీవ్రంగా మల్లగుల్లాలు పడింది. చివరికి బ్రిటిíÙండియా తాలూకు ఆస్తులు, అప్పుల్లో 17.5 శాతం పాక్‌కు చెందాలని తేల్చారు. దీనికి తోడు అదనంగా కొంత నగదు చెల్లించాల్సిందేనంటూ పాక్ భీషి్మంచుకుంది. అందుకు పటేల్ ససేమిరా అన్నారు. కశీ్మర్ పూర్తిగా భారత్‌కే చెందుతుందంటూ ఒప్పందంపై సంతకం చేస్తేనే నగదు సంగతి చూస్తామని కుండబద్దలు కొట్టారు. కానీ గాంధీ మాత్రం ఒప్పందం మేరకు పాక్‌కు డబ్బు చెల్లించాల్సిందేనంటూ ఏకంగా నిరాహార దీక్షకు దిగారు. దాంతో పటేల్ వద్దని మొత్తుకుంటున్నా 1947 జనవరి 20వ తేదీనే నెహ్రూ తాత్కాలిక సర్కారు పాక్‌కు రూ.20 కోట్లు చెల్లించింది. కానీ కశీ్మర్‌పై పాక్ దురాక్రమణ నేపథ్యంలో మరో రూ.75 కోట్ల చెల్లింపును నిలిపేసింది.ఇప్పటికీ ఒకరికొకరు బాకీనే! అప్పటికి చలామణిలో ఉన్న కరెన్సీ నోట్లు, నాణేలు 1948 మార్చి 31 దాకా ఇరు దేశాల్లోనూ చెల్లేలా ఒప్పందం జరిగింది. కానీ ఐదేళ్ల దాకా రెండు కరెన్సీలూ అక్కడా, ఇక్కడా చెలామణీ అవుతూ వచ్చాయి. ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా నగదు పంపకాల గోల ఇప్పటికీ తేలలేదు! రూ.300 కోట్ల ‘విభజన ముందటి మొత్తం’ పాక్ బాకీ ఉందని భారత్ అంటోంది. 2022–23 కేంద్ర ఆర్థిక సర్వేలో కూడా ఈ మొత్తాన్ని పేర్కొనడం విశేషం. కానీ భారతే తనకు రూ.560 కోట్లు బాకీ అన్నది పాక్ వాదన!జోయ్‌మొనీ, ద ఎలిఫెంట్! జంతువులను కూడా రెండు దేశాలూ పంచేసుకున్నాయి. ఈ క్రమంలో జోయ్‌మొనీ అనే ఏనుగు పంపకం ప్రహసనాన్ని తలపించింది. దాన్ని పాక్‌కు (తూర్పు బెంగాల్‌కు, అంటే నేటి బంగ్లాదేశ్‌కు) ఇచ్చేయాలని నిర్ణయం జరిగింది. దాని విలువ ఓ రైలు బోగీతో సమానమని లెక్కగట్టారు. అలా ఓ రైలు బోగీ భారత్‌కు దక్కాలన్నది ఒప్పందం. కానీ విభజన వేళ జోయ్‌మొనీ మాల్డాలో ఉండిపోయింది. ఆ ప్రాంతం భారత్ (పశి్చమబెంగాల్) వాటాకు వచ్చింది. దాంతో అది భారత్‌కే మిగిలిపోయింది.కొసమెరుపుభారత్, పాక్ విభజన ‘పగిలిన గుడ్లను తిరిగి అతికించడ’మంత అసాధ్యమంటూ అప్పట్లో ఓ ప్రఖ్యాత కాలమిస్టు పెదవి విరిచారు. అంతటి అసాధ్య కార్యం ఎట్టకేలకు సుసాధ్యమైంది! – సాక్షి, నేషనల్ డెస్క్ -
9 నుంచి 15 వరకు ‘హర్ ఘర్ తిరంగా’
సాక్షి, న్యూఢిల్లీ: ‘హర్ ఘర్ తిరంగా’ప్రచారంలో భాగంగా ఈ నెల 9 నుంచి 15వ తేదీ వరకు ప్రతీ ఒక్కరూ తమ ఇళ్ల వద్ద త్రివర్ణ పతాకాన్ని ఎగురవేయాలని కేంద్ర హోం మంత్రి అమిత్ షా ప్రజలకు విజ్ఞప్తి చేశారు. అంతేగాక ప్రజలు త్రివర్ణ పతాకంతో దిగిన సెలీ్ఫలను ‘హర్ ఘర్ తిరంగా’వెబ్సైట్లో అప్లోడ్ చేయాలని శనివారం ఆయన ‘ఎక్స్’లో కోరారు. ప్రధాని మోదీ ప్రారంభించిన హర్ ఘర్ తిరంగా ప్రచారం రెండేళ్లలో జాతీయ ఉద్యమంగా మారిందని అమిత్ షా పేర్కొన్నారు. -
జాతీయ పతాకాన్ని ఆవిష్కరించిన మంత్రి ఆదిమూలపు సురేష్
-
హైదరాబాద్ బొల్లారంలోని ఆర్మీ పబ్లిక్ స్కూల్ లో వేడుకలు
-
CM Jagan: గౌరవం చేతల్లోనూ..
సాక్షి, కృష్ణా: ఎదుటివారిని వాళ్ల వాళ్ల అర్హతను బట్టి గౌరవించడం, ప్రేమించడం ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డికి ఉన్న ప్రత్యేకత. మాటల్లోనే కాదు.. ఒక్కోసారి చేతల్లోనూ అది చూపిస్తుంటారాయన. అందుకోసం తన స్థాయిని పక్కనపెట్టి మరీ ఆయన ఓ మెట్టు కిందకు దిగుతుంటారు కూడా. తాజాగా.. మంగళవారం ఉదయం విజయవాడలో జరిగిన 77వ స్వాతంత్ర దినోత్సవ వేడుకల్లో ఆసక్తికర దృశ్యం ఒకటి చోటు చేసుకుంది. రాష్ట్ర ప్రభుత్వం తరపున సీఎం జగన్ పలువురు పోలీసు సిబ్బందికి పోలీస్ మెడల్స్ ప్రదానం చేశారు. ఈ క్రమంలో ఓ పోలీస్ అధికారికి మెడల్ కిందపడిపోయింది. అది గమనించకుండా ఆయన వెళ్లిపోసాగాడు. అయితే.. సీఎం జగన్ అది గమనించి ఆయన్ని ఆపారు. కిందకు దిగి ఆపి మరీ ఆ పోలీసుకు మెడల్‌ను తీసి మళ్లీ ఆ అధికారి గుండెలకు అంటించారు. ప్రస్తుతం ఈ వీడియో జగనన్న అభిమానుల నుంచి విపరీతంగా వైరల్ అవుతోంది. -
‘దేశభక్తి కలిగిన పార్టీ వైఎస్సార్సీపీ’
సాక్షి, గుంటూరు: దేశ సరిహద్దుల్లో సైనికులు ఎంతో కష్టపడి పనిచేస్తున్నారని, దేశంలోని ప్రతి పౌరుడూ సైనికుల్లా దేశభక్తి కలిగి ఉండాలని వైఎస్సార్సీపీ రాజ్యసభ సభ్యులు విజయసాయిరెడ్డి అభిప్రాయపడ్డారు. తాడేపల్లిలో వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో 77వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్లో పాల్గొని జెండా ఎగరేశారాయన. అనంతరం విజయసాయిరెడ్డి మాట్లాడుతూ, ప్రతి రాజకీయ పార్టీ కూడా దేశభక్తితో ఉండాలన్నారు. కానీ, దేశంలో కొన్ని రాజకీయ పార్టీలు కుయుక్తులు, కుతంత్రాలతో పనిచేస్తున్నాయన్నారు. అయితే దేశభక్తి కలిగిన పార్టీ వైఎస్సార్సీపీ అని, దేశ సమగ్రత, సౌరభౌమత్వాన్ని సీఎం జగన్ కాపాడుతున్నారు. దేశ సమగ్రతకు సంబంధించిన అంశాల్లో ఇటు అసెంబ్లీలోనైనా, పార్లమెంటులోనైనా వైఎస్సార్సీపీ ముందు ఉంటుందని ఎంపీ విజయసాయిరెడ్డి అన్నారు. చదవండి: పేదలు గెలిచి, వారి బతుకులు బాగుపడే వరకూ యుద్ధం: సీఎం జగన్ -
నేడు జెండా ఎగరేస్తాం! జనవరి 26న ఆవిష్కరిస్తాం! ఏంటీ తేడా అంటే..
నేడు జెండా ఎగరేయడానికి జనవరి 26 నాడు జెండా ఆవిష్కరించడానికి మధ్య చాలా వ్యత్యాసం ఉంది. ఎందుకిలా? ఈ రోజు ప్రధాని న్యూఢిల్లీలో ఎర్రకోట వద్ద జెండా ఎగరేస్తే..జనవరి 26న మాత్రం రాష్ట్రపతి జెండా ఆవిష్కరిస్తారు. నేడు జెండా ఎగరేసాం అంటాం. మరీ గణతంత్ర దినోత్సవం రోజున మాత్రం జెండా ఆవిష్కరిస్తున్నాం అని అంటాం ఎందుకని? వాటి మధ్య ఉన్న తేడా ఏంటంటే.. ఆగస్టు 15, 1947న స్వేచ్ఛావాయువులు పీల్చుతూ భారతదేశం స్వాతంత్య్రం పొందింది. అందుకే, ప్రతి ఏటా ఈ తేదీన స్వాతంత్య్ర దినోత్సవాన్ని జరుపుకుంటున్నాం. ఈ తేదీన దేశవ్యాప్తంగా జెండా ఎగురవేసి సాంస్కృతిక కార్యక్రమాలను నిర్వహిస్తారు... అలాగే 1950 జనవరి 26న దేశంలో రాజ్యాంగం అమలులోకి రావడంతో.. ప్రతి ఏటా ఈ తేదీని గణతంత్ర దినోత్సవంగా జరుపుకుంటున్నాం.ఈ రోజున దేశవ్యాప్తంగా త్రివర్ణ పతాకాన్ని ఆవిష్కరించి ఘనంగా గణతంత్ర దినోత్సవాన్ని నిర్వహించుకుంటాం. అయితే ఆగస్టు 15న జెండా ఎగరవేయడానికి.. జనవరి 26న జెండా ఆవిష్కరించడానికి మధ్య చిన్న తేడా ఉంది. ఆ తేడా ఏంటంటే.. ప్రతి సంవత్సరం ఆగస్టు 15న దేశ ప్రధాని న్యూఢిల్లీలోని ఎర్రకోటలో జాతీయ జెండాను ఎగురవేస్తారు. ఆగస్ట్ 15 రోజున, జాతీయ పతాకాన్ని స్తంభం దిగువన కడతారు. బ్రిటిష్ పాలన నుంచి భారతదేశం స్వాతంత్య్రాన్ని పొందిందని సూచించడానికి త్రివర్ణ పతాకాన్ని పైకి లాగుతారు. మొదటి స్వాతంత్య్ర దినోత్సవం రోజున బ్రిటిష్ దేశ జెండాను దింపుతూ మన దేశ జెండాను పైకి ఎగురవేశారు. స్వాతంత్య్రం వచ్చిందని తెలియజేయడానికి ఇలా త్రివర్ణ పతాకాన్ని పైకి లాగి ఎగురవేస్తారు. ఇది కొత్త దేశ ఆవిర్భావానికి ప్రతీకగా నిలుస్తుంది. ఇక గణతంత్ర దినోత్సవం జనవరి 26 నాడు మాత్రం రాష్ట్రపతి జెండాను ఆవిష్కరిస్తారు. జనవరి 26న గణతంత్ర దినోత్సవం సందర్భంగా త్రివర్ణ పతాకాన్ని పైభాగంలో కట్టి, పైకి లాగకుండా విప్పుతారు... కాబట్టి దీన్ని జెండా ఆవిష్కరించడం అంటున్నాం. దీని అర్థం ఇప్పటికే దేశం స్వతంత్రంగా ఉందని తెలియజేయడం. అంతేగాదు ఈ రెండు తేదీలలో జెండాను రెపరెపలాడిస్తారు. ( గమనిక: ఇక్కడ జనవరి 26 నాడు జెండాను ముందుగానే కర్ర/పోల్ కి పైన కట్టి ఉంచుతాము కనుక ఆగస్ట్ 15 లాగా జెండాను కింది నుండి పైకి లాగము అనేది గమనించాలి ). నేడు ప్రధాని.. ఆ రోజు రాష్ట్రపతి చేయడానికి ప్రధాన కారణం దేశ పౌరుల ప్రతినిధి, భారత పార్లమెంటుకు ప్రజలచే నేరుగా ఎన్నికైన దేశ ప్రధాని స్వాతంత్య్ర దినోత్సవం రోజున జండా ఎగురవేయడానికి.. గణతంత్ర దినోత్సవం రోజున రాష్ట్రపతి జెండాను ఆవిష్కరించడానికి ఒక కారణం ఉంది. స్వాతంత్య్రం వచ్చిన సమయం నాటికి భారత రాజ్యాంగం అమలులోకి రాలేదు. అప్పటికి రాజ్యాంగ అధిపతి అయిన రాష్ట్రపతి పదవి చేపట్టలేదు. దీంతో రాజ్యాంగం అమల్లోకి వచ్చిన జనవరి 26వ తేదీన రాజ్యాంగ అధిపతి అయిన రాష్ట్రపతి రిపబ్లిక్ డే నాడు మహోన్నత జెండాను ఆవిష్కరిస్తారు. అయితే ఇక్కడ గమనించాల్సిన వ్యత్యాసం ఏమిటంటే.. స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా ప్రధానమంత్రి జెండాను ఎగురవేస్తారు(Flag Hoisting). గణతంత్ర దినోత్సవం నాడు రాష్ట్రపతి జెండాను ఆవిష్కరిస్తారు(Flag Unfurling). (చదవండి: అక్కడ మాత్రం అర్థరాత్రే.. స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు జరుపుకుంటారు) -
అమెరికా, చైనా తర్వాత భారతదేశమే: ప్రధాని మోదీ
న్యూఢిల్లీ: భారత దేశ 77వ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల్లో భాగంగా ఈరోజు ప్రధాని నరేంద్ర మోదీ ఎర్రకోటపై మువ్వన్నెల జెండాను ఎగురవేశారు. ఈ కార్యక్రమానికి త్రివిధ దళాధిపతులు, క్యాబినెట్ మంత్రులు, రాజకీయ నాయకులు, అధికారులతో పాటు వివిధ రంగాలకు చెందిన ముఖ్య అతిధులు హాజరయ్యారు. వరుసగా పదోసారి ఎర్రకోటపై జాతీయ జెండాను ఆవిష్కరించిన ప్రధాని నరేంద్ర మోదీ కార్యక్రమం ప్రారంభానికి ముందు రాజ్ ఘాట్ వద్ద స్వాతంత్య్ర సమరయోధలకు నివాళులు అర్పించారు. వచ్చే సార్వత్రిక ఎన్నికల ముందు జరుగుతున్న స్వాతంత్య్ర వేడుకల కావడంతో జాతినుద్దేశించి ప్రధాని చేసిన ప్రసంగంలో కొన్ని కీలక అంశాలను ప్రస్తావించారు. #WATCH | PM Narendra Modi says, "...I firmly believe that when the country will celebrate 100 years of freedom in 2047, the country would be a developed India. I say this on the basis of the capability of my country and available resources...But the need of the hour is to fight… pic.twitter.com/IbODcqlW6b — ANI (@ANI) August 15, 2023 దేశ ప్రజలందరికి స్వాతంత్య్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలిపిన ప్రధాని మొదటగా మణిపూర్ అంశాన్ని ప్రస్తావిస్తూ దేశం మణిపూర్ ప్రజలకు అండగా ఉంటుందన్నారు. ఈశాన్య రాష్ట్రంలో శాంతిని నెలకొల్పేందుకు కృషి చేస్తున్నామని తెలిపారు. ఇప్పుడిప్పుడే మణిపూర్‌లో పరిస్థితులు మెరుగుపడుతున్నాయని అన్నారు. ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య దేశమైన భారత్ దేశం స్వాతంత్య్రం కోసం ఎందరో మహానుభావులు ప్రాణ త్యాగం చేశారు. వారందరి త్యాగఫలమే ఈ స్వాతంత్య్రం. ఈ సందర్బంగా ప్రపంచ దేశాలు భారత దేశం వైపు చూస్తున్నాయని గడిచిన పదేళ్లలో భారత్ ఎంతో వేగంగా అభివృద్ధి చెందిందన్నారు. #WATCH | PM Modi speaks on dynastic politics during his Independence Day speech "Today, 'parivarvaad' and appeasement has destroyed our country. How can a political party have only one family in charge? For them their life mantra is- party of the family, by the family and for… pic.twitter.com/xxmumTCc4Z — ANI (@ANI) August 15, 2023 ఈ పదేళ్లలో భారత దేశ గొప్పతనాన్ని ప్రపంచం గుర్తిస్తోంది. శాటిలైట్ రంగంలో దూసుకుపోతున్నాం, రాబోయే కాలాన్ని సైన్స్ అండ్ టెక్నాలజీ శాసిస్తోంది. 30 ఏళ్ల లోపు యువతే భారత్‌కు దిశానిర్దేశం చేయాలి. సాంకేతికంగానే కాదు వ్యవసాయ రంగంలోనూ దేశం చాలా అభివృద్ధి చెందుతోందని అన్నారు. నారీ శక్తి, యువశక్తి భారత్‌కు బలమని భారత్‌లో యువశక్తి ఎంతో అద్భుతంగా ఉందని అన్నారు. డెమోగ్రఫీ, డెమోక్రసీ, బయోడైవర్సిటీ ఈ మూడు అంశాలు భారత దేశానికి ఎంతో ముఖ్యమైనవి. టెక్నాలజీ విషయంలో భారత్ ఎంతో మెరుగుపడి డిజిటల్ ఇండియా దిశగా భారత్ దూసుకెళ్తోన్నట్లు తెలిపారు. క్రీడా రంగంలో సైతం యువత ప్రపంచ పాఠం మీద తన సత్తా చాటుతోంది. అలాగే సాంకేతికంగా స్టార్టప్స్ రంగంలో భారత్ టాప్-3లో ఉంది. ఇక ఈ ఏడాది జరగబోయే ప్రతిష్టాత్మక జీ-20 సమావేశానికి ఆతిధ్యమిచే అరుదైన అవకాశం భారత్‌కు లభించిందని అన్నారు. #WATCH | PM Narendra Modi says, "In 2019, on the basis of performance, you blessed me once again...The next five years are for unprecedented development. The biggest golden moment to realise the dream of 2047 is the coming five years. The next time, on 15th August, from this Red… pic.twitter.com/PtwL73Sahg — ANI (@ANI) August 15, 2023 కేవలం అవినీతి రాక్షసి వలననే దేశం వెనక్కు వెళ్లిందని అందుకే ప్రజలు సుస్థిరమైన అవినీతిరహిత ప్రభుత్వాన్ని కోరుకుంటున్నారు. సుస్థిర ప్రభుత్వంతోనే అభివృద్ధి జరుగుతుందని ప్రజలు విశ్వసిస్తున్నారన్నారు. పేద, మధ్య తరగతి వర్గాల అభివృద్ధికి ప్రభుత్వం ఎనలేని కృషి చేసిందని.. పీఎం సహాయనిధి పథకం ద్వారా 50 వేల కోట్లు ఖర్చు చేశామన్నారు. సైన్యంలో వన్ ర్యాంక్-వన్ పెన్షన్ అమలు చేస్తూ ప్రజలకు అవినీతి రహిత పాలన అందిస్తున్నామని దేశ ఆర్థిక వ్యవస్త బాగుంటేనే దేశం బాగుంటుందని రూ. 4 లక్షల కోట్లతో పేదలకు ఇళ్లు నిర్మించామని రూ. 140 కోట్ల భారతీయుల ఆకాంక్షలను నెరవేర్చినట్లు తెలిపారు. #WATCH | ..."Chalta chalata kaal chakra, Amrit kaal ka bhaal chakra, sabke sapne apne sapne, panpe sapne saare, dheer chale veer chale, chale yuva humare, neeti sahi reeti naayi, gati sahi raah nayi, chuno chunauti seena taan, jag mein badhao desh ka naam..." PM Modi on 77th… pic.twitter.com/o6KUmBe0Mt — ANI (@ANI) August 15, 2023 కరోనా లాంటి అక్షిత సమయంలో ప్రభుత్వం ప్రజలకు అండగా నిలిచిందని అన్నారు. కరోనా మనకు ఎన్నో పాఠాలను నేర్పింది. కరోనా సంక్షోభం తర్వాత ప్రపంచానికి భారత దేశం దిక్సూచిగా మారింది. కరోనా సమయంలో ఎన్నో కఠిన సవాళ్లను ఎదుర్కొని ముందుకెళ్లాం ప్రపంచాన్ని మార్చడంలో భారత్ నిర్ణయాత్మక పాత్ర పోషిస్తోందని అన్నారు. భిన్నత్వంలో ఏకత్వమే భారత్ బలమని ప్రతి నిర్ణయంలో దేశ ప్రగతికే మొదటి ప్రాధాన్యత ఇస్తున్నామన్నారు. దేశంలో సుస్థిరమైన, శక్తివంతమైన ప్రభుత్వం ఉంది. గత పదేళ్లలో ఎన్నో కీలక సంస్కరణలు తీసుకురావడంతో అన్ని రంగాల్లో దేశం ముందుకు వెళ్తోందన్నారు. ఇక వైద్య రంగానికి వస్తే జన ఔషధితో ప్రజలందరికీ చౌకగా మందులు అందజేస్తున్నామని, అందుకు వీలుగా జన ఔషధి కేంద్రాల సంఖ్య 10 వేల నుంచి 25 వేలకు పెంచామన్నారు. జన్‌ధన్ ఖాతాలో పేదల బతుకుల్లో వెలుగులు నింపామని తెలిపారు. #WATCH | ..."Chalta chalata kaal chakra, Amrit kaal ka bhaal chakra, sabke sapne apne sapne, panpe sapne saare, dheer chale veer chale, chale yuva humare, neeti sahi reeti naayi, gati sahi raah nayi, chuno chunauti seena taan, jag mein badhao desh ka naam..." PM Modi on 77th… pic.twitter.com/o6KUmBe0Mt — ANI (@ANI) August 15, 2023 మారుమూల గ్రామాలకు విద్యుత్ సదుపాయం కల్పించామన్నారు. దేశ ప్రజలందరికీ ఇంటర్నెట్ను అందుబాలోకి తీసుకువచ్చామని వచ్చే ఐదేళ్లలో మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా భారత్ అవతరిస్తుందని ఆర్థిక వ్యవస్థలో అమెరికా, చైనా తర్వాత భారత దేశమే ఉంటుందని భారత్ అభివృద్ధిపై నాకు పూర్తి విశ్వాసం ఉందని చెబుతూ ప్రసంగాన్ని ముగించారు. ఇది కూడా చదవండి: అందరికీ స్వాతంత్య్ర దినోత్సవ శుభాకాంక్షలు: ప్రధాని మోదీ -
న్యూజెర్సీలో ఘనంగా స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు!
అమెరికాలోని న్యూజెర్సీలో భారత స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఇండియన్ బిజినెస్ అసోసియేషన్ ఆధ్వర్యంలో భారీ ఎత్తున ఇండియా డే పరేడ్ నిర్వహించారు. ఓక్ ట్రీ రోడ్ లోని ఎడిసన్ టు ఇసేలిన్ ఏరియాలో ఇండియా డే పరేడ్ వైభవంగా కొనసాగింది. ఈ వేడుకలకు గ్రాండ్ మార్షల్‌గా ప్రముఖ నటి మిల్కీ బ్యూటీ తమన్నా భాటియా హాజరయ్యారు. తమన్నా ఇటువంటి పరేడ్ కార్యక్రమంలో పాల్గొనడం తొలిసారి కావడం విశేషం. ఇక న్యూజెర్సీ గవర్నర్ ఫిల్ మర్ఫీతో పాటు పలువురు ప్రముఖులు ముఖ్య అతిథులుగా హాజరై.. శుభాకాంక్షలు తెలిపారు. ఇండియా పరేడ్ డే కార్యక్రమంలో భాగంగా అమెరికాలోని ప్రవాస భారతీయులంతా న్యూజెర్సీలోని ఓక్ ట్రీ రోడ్ కు చేరుకున్నారు. మువ్వన్నెల జెండాను చేతబూని వందేమాతరం, భారతమాతకి జై అంటూ నినాదాలు చేశారు. పలువురు చిన్నారులు భారతమాత వేషాధరణలో.. స్వాత్రంత్య యోధుల గెటప్పులలో ఆకట్టుకున్నారు. ఒకరికొకరు స్వాత్రంత్య దినోత్సవ శుభాకాంక్షలు చెప్పుకున్నారు. పరేడ్ లో భాగంగా భారతీయ సంస్కృతి సంప్రదాయాలు ఉట్టిపడేలా పలు శకటాలను ప్రదర్శించారు. భారీ జాతీయ జెండాలతో ర్యాలీ నిర్వహించారు. ఇక న్యూజెర్సీ ప్రాంతం మినీ ఇండియాగా మారిందా అనేలా అక్కడి వాతావరణం కనిపించింది. న్యూజెర్సీలోని ఓక్ ట్రీ రోడ్ లో జరిగిన ఇండియా డే పరేడ్ కార్యక్రమం విజయవంతం అవటం పట్ల నిర్వహకులతో పాటు ప్రవాసులు హర్షం వ్యక్తం చేశారు. (చదవండి: -
రూ.99,999 వరకు రుణమాఫీ క్లియర్
సాక్షి, హైదరాబాద్: స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా రైతులకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త చెప్పింది. ఇచ్చిన హామీ మేరకు రూ.99,999 లోపు ఉన్న పంట రుణాలన్నింటినీ మాఫీ చేస్తున్నట్టు ప్రకటించింది. ఈ మేరకు సదరు రైతుల రుణాలున్న బ్యాంకుల్లో తక్షణమే సొమ్ము జమ చేయాలని సీఎం కేసీఆర్ సోమవారం ఆర్థికశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావును ఆదేశించారు. ఈ మేరకు ఆర్థిక శాఖ సోమవారం రూ.5,809.78 కోట్ల విడుదలకు ఉత్తర్వులు జారీ చేసింది. ఆర్థిక ఇబ్బందులతో జాప్యమైనా.. 2018 ఎన్నికల సమయంలో రైతులకు రూ.లక్ష వరకు పంట రుణాలను మాఫీ చేస్తామని సీఎం కేసీఆర్ హామీ ఇచ్చారు. ఆ ఎన్నికల్లో గెలిచి అధికారంలోకి రాగానే విడతల వారీగా రుణమాఫీ చేయనున్నట్టు ప్రకటించారు. అయితే దీని అమల్లో జాప్యం జరిగింది. కరోనా మహమ్మారి విజృంభణ, లాక్డౌన్లతో ఆర్థిక ఇబ్బందులు తలెత్తడం, పెద్ద నోట్ల రద్దు ప్రభావంతో దేశవ్యాప్తంగా రాష్ట్రాల ఆర్థిక పరిస్థితి దిగజారి రుణమాఫీ ప్రక్రియ ఆలస్యమవుతోందని సీఎం కేసీఆర్ స్వయంగా ప్రకటించారు. ఇటీవల ఆర్థిక పరిస్థితి మెరుగుపడిన నేపథ్యంలో ఇచ్చిన హామీ మేరకు రుణమాఫీ ప్రక్రియ మొదలుపెడుతున్నట్టు చెప్పారు. 45 రోజుల కార్యాచరణతో ఆగస్టు 2న సీఎం కేసీఆర్ సమీక్ష నిర్వహించి రుణమాఫీ ప్రక్రియ చేపట్టాలని ఆదేశించారు. వెంటనే ఆర్థిక మంత్రి హరీశ్‌రావు, ఆ శాఖ ఉన్నతాధికారులు కసరత్తు చేసి.. 45 రోజుల కార్యాచరణ రూపొందించారు. సెపె్టంబర్ 15వ తేదీ నాటికి మొత్తం రుణాలను మాఫీ చేయాలని నిర్ణయించారు. అయితే ఇంతకు ముందే తొలి విడతగా 5,42,609 మంది రైతులకు సంబంధించి రూ.1,207.37 కోట్లను ప్రభుత్వం విడుదల చేసింది. దీంతో రెండో విడతగా.. ఆగస్టు 3, 4, 11 తేదీల్లో కలిపి 1,76,878 మంది రైతులకు సంబంధించి రూ. 736.27 కోట్లను బ్యాంకుల్లో జమ చేసింది. తాజాగా 9,02,843 మంది రైతులకు సంబంధించి రూ.99,999 వరకు ఉన్న రుణాలను మాఫీ చేశారు. మొత్తంగా ఇప్పటివరకు 16,66,899 మంది రైతుల రుణాలకు సంబంధించి రూ.7,753.43 కోట్లను విడుదల చేశారు. రాష్ట్రంలో రైతు రాజ్యం తెలంగాణ రాష్ట్రం రైతు సంక్షేమానికి కట్టుబడి ఉందని రుణమాఫీతో మరోసారి రుజువైందని సీఎం కేసీఆర్ పేర్కొన్నారు. 2014లోనూ రైతుల రుణమాఫీ చేశామని, 35,32,000 మంది రైతులకు లబ్ధి చేకూరిందని చెప్పారు. దేశంలో ఎక్కడా లేనివిధంగా సాగునీటి వసతుల కల్పనలో భాగంగా.. మిషన్ కాకతీయ కింద 35వేల చెరువుల పునరుద్ధరణ, కాళేశ్వరం వంటి బహుళార్థ సాధక ప్రాజెక్టుల నిర్మాణం చేపట్టిందని వివరించారు. సకాలంలో ఎరువులు, విత్తనాలు అందించడం, నకిలీ విత్తనాల తయారీ, సరఫరాదారులపై పీడీ చట్టం ప్రయోగించి జైళ్లకు పంపడం, రైతులు పండించిన ప్రతి గింజను కొనుగోలు చేయడం, మార్కెటింగ్ సౌకర్యాలు కల్పించడం వంటివాటితో రైతులకు ప్రభుత్వం అండగా నిలిచిందని తెలిపారు. రుణమాఫీకి సంబంధించి సీఎం కేసీఆర్ నిర్ణయం, ఈ సందర్భంగా ఆయన పేర్కొన్న అంశాలతో సీఎం కార్యాలయం ప్రకటన విడుదల చేసింది. రైతు బంధు, బీమా, ఉచిత విద్యుత్‌తో.. దుఃఖంతో ఉన్న రైతు కుటుంబాలను ఆదుకోవాలన్న లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం రైతు బీమాను అమలు చేస్తోందని, రైతు ఏ కారణంతో మరణించినా వారి కుటుంబానికి రూ.5 లక్షల ఆర్థిక సాయం అందుతోందని సీఎం కేసీఆర్ పేర్కొన్నారు. ఇప్పటివరకు మరణించిన రైతులకు రూ.5,402.55 కోట్లు పరిహారంగా అందినట్టు వివరించారు. ఇక రాష్ట్రంలో 27.49 లక్షల వ్యవసాయ కనెక్షన్లకు ఉచిత విద్యుత్ అందిస్తూ పంటల సాగుకు అండగా నిలిచామని.. గత తొమ్మిదేళ్లలో ఉచిత విద్యుత్ కోసం ప్రభుత్వం రూ.96,288 కోట్లను భరించిందని గుర్తు చేశారు. రాష్ట్రంలో 65 లక్షల మంది రైతులకు ‘రైతుబంధు’తో ప్రత్యక్ష ప్రయోజనం కలుగత్తోందని.. ఎకరానికి ఏటా రూ.10వేల చొప్పున.. ఇప్పటివరకు 11 విడతల్లో రూ.71,552 కోట్లను రైతులకు అందించామని తెలిపారు. -
హోం మంత్రి పతకానికి ధనుంజయుడు ఎంపిక
పశ్చిమ గోదావరి: కేంద్ర హోం శాఖ ఏటా స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల సమయంలో ఇచ్చే కేంద్ర హోం మంత్రి పతకానికి జంగారెడ్డిగూడెం డీఎస్పీ ఎం.ధనుంజయుడు ఎంపికయ్యారు. 2023 సంవత్సరానికి అత్యుత్తమ నేరపరిశోధన చేసిన రాష్ట్రానికి చెందిన ఐదురుగు పోలీసు అధికారులు ఈ పతకానికి ఎంపిక కాగా వారిలో ఒకరు ధనుంజయుడు. నేర పరిశోధనల్లో ఉన్నత ప్రమాణాల్ని ప్రోత్సహించడం కోసం 2018 నుంచి పోలీసు అధికారులకు కేంద్ర హోం శాఖ ఈ పతకాలు అందిస్తోంది. 2020లో ప్రకాశం జిల్లా ఒంగోలులో దిశ డీఎస్పీగా ధనుంజయుడు పని చేస్తున్న సమయంలో రెండు కీలకమైన కేసులను చేధించడంలో విశేష కృషిచేశారు. ఈ నేపథ్యంలో ఆయనకు ఈ పతకం అందిస్తున్నారు. ఎస్సై నుంచి డీఎస్పీ వరకూ బాపట్ల జిల్లా చీరాల మండలం చీపురుపాలెం ధనుంజయుడి స్వగ్రామం. చీరాలలో బీఎస్సీ డిగ్రీ, ఉస్మానియా యూనివర్సిటీలో ఎల్ఎల్బీ పట్టా పొందారు. 1991లో ఎస్సైగా డీటీసీలో శిక్షణ పొందారు. గుంటూరు జోన్ నుంచి ఎంపికై న ఈయన నెల్లూరు జిల్లాలో ప్రాక్టికల్ ట్రైనింగ్ పూర్తి చేశారు. నెల్లూరు జిల్లాలోని ఉదయగిరి తాలూకా సీతారామపురం పోలీస్‌స్టేషన్‌కు ఎస్సైగా నియమితులయ్యారు. ఆ తరువాత ఉదయగిరి, కావలి టూటౌన్, సంగం, ఆత్మకూరు పోలీస్స్టేషన్లలో ఎస్సై పనిచేశారు. నాయుడుపేట పోలీస్‌స్టేషన్‌పై దాడి జరగడంతో ఆ సమయంలో ధనుంజయుడిని అక్కడికి పంపారు. ఆ తరువాతి కాలంలో నెల్లూరు త్రీ టౌన్‌కు బదిలీ అయ్యారు. సీఐగా పదోన్నతి చెంది విజయవాడలో సీఐడీ విభాగంలో ఆరు సంవత్సరాలు పనిచేశారు. అనంతరం మూడేళ్లు విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్లో పనిచేశారు. 2014లో డీఎస్పీగా పదోన్నతి పొంది కృష్ణా జిల్లా ఇంటిలిజెన్స్ డీఎస్పీగా ఐదేళ్లు పనిచేశారు. అలాగే విశాఖ ట్రాఫిక్ ఏసీపీగా 10 నెలలు పనిచేశారు. సాంకేతిక ఆధారాలతో కేసుల నిరూపణలో ప్రతిభ 2020లో ప్రకాశం జిల్లా ఒంగోలు దిశ డీఎస్పీగా రెండేళ్లపాటు పనిచేశారు. ఈ సమయంలోనే రెండు కీలకమైన కేసులు చేధించడంలో కీలకంగా పనిచేశారు. గిద్దలూరు మండలం అంబవరంలో ఏడేళ్ల చిన్నారిపై ఒక వ్యక్తి అత్యాచారం చేసి హత్యచేశాడు. ఈ కేసును ధనుంజయుడు చాలెంజింగ్ తీసుకున్నారు. కేసును లోతుగా దర్యాప్తు చేసి నిందితుడికి శిక్ష పడేలా సాక్ష్యాధారాలు సమర్పించారు. దీంతో నిందితుడికి గత జనవరిలో కోర్టు ఉరిశిక్ష విధించింది. అలాగే కందుకూరులో 15 ఏళ్ల బాలికను నిర్భంధించి వ్యభిచారం కూపంలోకి నెట్టారు. వారం రోజుల పాటు బాలికపై 25 మంది అత్యాచారానికి పాల్పడ్డారు. ఈ కేసును కూడా చాలెంజింగ్‌గా తీసుకుని సెల్‌ఫోన్, ఫోన్‌పే ఆధారంగా నిందితులను గుర్తించారు. 25 మంది ఆ వారం రోజుల పాటు వినియోగించిన కండోమ్‌లు డీఎస్పీ స్వాధీనం చేసుకుని డీఎన్ఏ పరీక్షలకు పంపారు. మేజిస్ట్రేట్ సమక్షంలో బాలికతో ఐడెంటిఫికేషన్ పెరేడ్ ఏర్పాటు చేశారు. దీంతో 25 మందిని బాలిక గుర్తించింది. అన్ని ఆధారాలతో ఈ కేసును నిరూపించారు. ఈ కేసును చేధించడంలో సాంకేతిక ప్రమాణాలు పాటించారు. ఈ రెండు కేసులు చేధించడంలో డీఎస్పీ విజయం సాధించారు. దీంతో ఈ ఏడాది ఏప్రిల్, మే నెలల్లో ప్రకాశం జిల్లా ఎస్పీ.. డీజీపీ ద్వారా వీటి వివరాలను కేంద్రానికి పంపారు. నేర పరిశోధనలో అత్యుత్తమ సేవలను గుర్తించిన కేంద్రం ధనుంజయుడిని కేంద్ర హోం మంత్రి పతకానికి ఎంపిక చేసింది. ప్రకాశం జిల్లా నుంచి ఆయన తాడేపల్లి సిట్‌కు డీఎస్పీగా బదిలీ అయ్యారు. అక్కడ కూడా అత్యంత ప్రతిభ కనబర్చి స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్లో రూ.250 కోట్ల దుర్వినియోగాన్ని వెలికి తీశారు. ప్రస్తుతం ఈ కేసు ఇంకా దర్యాప్తులో ఉంది. ఇటీవల బదిలీల్లో భాగంగా మే నెలలో జంగారెడ్డిగూడెం డీఎస్పీగా బదిలీపై వచ్చారు. -
mann ki baat: ‘మేరీ మాటీ.. మేరీ దేశ్’
న్యూఢిల్లీ: మన అమర జవాన్లను, దేశం కోసం ప్రాణత్యాగం చేసిన పౌరులను గౌరవించుకోవడానికి స్వాతంత్య్ర దినోత్సవం(ఆగస్టు 15) వరకూ దేశవ్యాప్తంగా మేరీ మాటీ.. మేరీ దేశ్ (నా మట్టి.. నా దేశం) పేరిట ప్రత్యేక కార్యక్రమం నిర్వహించనున్నట్లు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రకటించారు. వారి జ్ఞాపకార్థం ప్రతి గ్రామ పంచాయతీలో స్మారకాలు ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. ఆదివారం ‘మన్ కీ బాత్’లో దేశ ప్రజలను ఉద్దేశించి ప్రధాని మోదీ మాట్లాడారు. మేరీ మాటీ.. మేరీ దేశ్ కార్యక్రమంలో భాగంగా అమృత్ కలశ్ యాత్ర చేపట్టనున్నట్లు తెలిపారు. దేశమంతటా వివిధ ప్రాంతాల నుంచి 7,500 కలశాల్లో పవిత్ర మట్టిని, దాంతోపాటు మొక్కలను దేశ రాజధాని ఢిల్లీకి తీసుకురానున్నట్లు వెల్లడించారు. ఆ పవిత్ర మట్టితో ఢిల్లీలోని జాతీయ యుద్ధ స్మారకం సమీపంలో ‘అమృత్ వాటిక’ను నిర్మించబోతున్నట్లు చెప్పారు. అక్కడే మొక్కలను నాటనున్నట్లు వివరించారు. ఈ అమృత్ వాటిక ‘ఏక్ భారత్.. శ్రేష్ట్ భారత్’కు ఒక గొప్ప చిహ్నం అవుతుందని స్పష్టం చేశారు. మోదీ ఇంకా ఏం మాట్లాడారంటే... ప్రతి ఇంటిపై త్రివర్ణ పతాకం ఎగురవేయాలి ‘‘ఆజాదీ కా అమృత్ మహోత్సవ్‌లో భాగంగా ఇప్పటికే 2 లక్షలకుపైగా కార్యక్రమాలు నిర్వహించుకున్నాం. అమృత్ మహోత్సవ్ నినాదం అంతటా ప్రతిధ్వనిస్తోంది. గత ఏడాది ఘర్ ఘర్ తిరంగా కార్యక్రమం కోసం దేశమంతా ఒక్కతాటిపైకి వచి్చంది. ప్రజలంతా తమ ఇళ్లపై త్రివర్ణ పతాకాలు ఎగరేశారు. ఆ సంప్రదాయాన్ని ఈ ఏడాది కూడా కొనసాగించాలని విజ్ఞప్తి చేస్తున్నా. ఇలాంటి ప్రయత్నాలతో మన బాధ్యతలను మనం గుర్తించగలుగుతాం. దేశ స్వాతంత్య్రం కోసం జరిగిన బలిదానాలను స్మరించుకుంటాం. స్వేచ్ఛా స్వాతంత్య్రాల విలువను గుర్తిస్తాం. అందుకే ప్రతి పౌరుడూ ఈ కార్యక్రమాల్లో పాలుపంచుకోవాలి. ప్రజల్లో సాంస్కృతి చైతన్యం ఇనుమడిస్తోంది. పుణ్య క్షేత్రాలను సందర్శించే యాత్రికుల సంఖ్య భారీగా పెరుగుతోంది. కాశీని ప్రతిఏటా 10 కోట్లకు పైగా యాత్రికులు సందర్శిస్తున్నారు. అయోధ్య, మథుర, ఉజ్జయిని లాంటి క్షేత్రాలను సందర్శించే భక్తుల సంఖ్య వేగంగా పెరుగుతోంది. దీనివల్ల లక్షలాది మంది పేదలకు ఉపాధి లభిస్తోంది. మరో 50,000 అమృత్ సరోవరాలు ఇటీవల దేశంలో భారీ వర్షాలు కురిశాయి. వరదలు ముంచెత్తాయి. పలు ప్రాంతాల్లో కొండచరియలు విరిగిపడ్డాయి. జనం చాలా ఇబ్బందులు ఎదుర్కొన్నాయి. ప్రకృతి విపత్తుల నుంచి కాపాడుకోవడానికి వారు కలిసికట్టుగా పని చేశారు. అలాగే జల సంరక్షణ కోసం జనం కృషి చేయడం సంతోషకరం. ఉత్తరప్రదేశ్‌లో ఒక్కరోజులో 30 లక్షల మొక్కలు నాటారు. జల సంరక్షణ కోసం దేశంలో ఇప్పటికే 60,000 అమృత్ సరోవరాలు నిర్మించారు. మాదక ద్రవ్యాలకు ప్రజలు దూరంగా ఉండాలని కోరుతున్నా. భవిష్యత్తు తరాలను కాపాడుకోవాంటే డ్రగ్స్‌ను దూరం పెట్టాల్సిందే. ఇందుకోసం 2020 ఆగస్టు 15న ‘నషా ముక్త్ భారత్ అభియాన్’ ప్రారంభించాం. 11 కోట్ల మందికిపైగా జనం ఈ అభియాన్‌తో అనుసంధానమయ్యారు. రూ.12,000 కోట్ల విలువైన 10 లక్షల కిలోల డ్రగ్స్‌ను అధికారులు ధ్వంసం చేశారు. ఇదొక విశిష్టమైన రికార్డు. మధ్యప్రదేశ్‌లోని బిచార్పూర్ అనే గిరిజన గ్రామం ఒకప్పుడు అక్రమ మద్యం, డ్రగ్స్‌కు అడ్డాగా ఉండేది. ఇప్పుడు ఆ గ్రామస్థులు వ్యసనాలు వదిలేశారు. ఫుట్‌బాల్ ఆటలో నిష్ణాతులుగా మారారు. మనసుంటే మార్గం ఉంటుంది’ అని మోదీ ఉద్ఘాటించారు. కళాఖండాలు తిరిగొచ్చాయి మన దేశానికి చెందిన వందలాది అరుదైన, ప్రాచీన కళాఖండాలు ఇటీవలే అమెరికా నుంచి తిరిగివచ్చాయి. అమెరికా వాటిని తిరిగి మనకు అప్పగించింది. దీనిపై సోషల్ మీడియాలో చాలా చర్చ జరిగింది. అమెరికా నుంచి వచ్చిన వాటిలో 2,500 నుంచి 250 ఏళ్ల క్రితం నాటికి కళాఖండాలు ఉన్నాయి. 2016, 2021లో అమెరికాలో పర్యటించా. మన కళాఖాండలను వెనక్కి తీసుకురావడానికి కృషి చేశా. -
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్‌కు అరుదైన గౌరవం..
-
ఎర్రకోట వీరుడు
మాటలతో కోటలు కడుతూ, మనసు గెలవడం సులభమేమీ కాదు. కానీ, చారిత్రక ఎర్ర కోట బురుజుపై నుంచి ప్రసంగించినప్పుడల్లా ప్రధాని మోదీ తన మాటల మోళీతో సామాన్యుల్ని మెప్పిస్తూనే ఉన్నారు. స్వతంత్ర భారత అమృతోత్సవ వేళ తాజాగా ప్రసంగిస్తూ శతవసంత భారతా వనికి గంభీర లక్ష్యం నిర్దేశించారు. 2047 కల్లా భారత్‌ను ‘అభివృద్ధి చెందిన దేశం’ చేయాలన్నారు. ‘దేశాభివృద్ధి, బానిసత్వ మూలాల్ని వదిలించుకోవడం, వారసత్వ వైభవ స్ఫురణ, సమైక్యత, బాధ్య తల నిర్వహణ’ అంటూ 5 ప్రతిజ్ఞల మహాసంకల్పమూ చెప్పారు. లక్ష్య సాధనకు స్పష్టమైన సర్కారీ ప్రణాళిక ఏమిటో చెప్పడం మాత్రం అలవాటుగానో, పొరపాటుగానో విస్మరించారు. పొరుగున పొంచి ఉన్న ముప్పు, అంతర్జాతీయ సమస్యల ప్రస్తావన చేయలేదు. రెండేళ్ళలో జరిగే ఎన్నికలను దృష్టిలో ఉంచుకొని, ప్రతిపక్షాలపై పరోక్ష విమర్శలు చేయడం మర్చిపోలేదు. అవినీతి, బంధుప్రీతి, వంశపాలనపై పోరాడేందుకు ఆశీస్సులు కావాలని షరా మామూలుగా అభ్యర్థించడమూ ఆపలేదు. 2017లో కేదార్నాథ్ పర్యటనప్పుడే 2022 నాటికి భారత్‌ను అభివృద్ధి చెందిన దేశంగా చేస్తా మని ప్రధాని సంకల్పం చెప్పారు. ఇప్పుడదే లక్ష్యాన్ని కొత్త కాలావధితో ప్రవచించారు. ఏది, ఎన్నిసార్లు చెప్పినా స్వభావసిద్ధ నాటకీయ హావభావ విన్యాసాలతో సామాన్యుల్ని ఆకట్టుకొనేలా చెప్పడం మోదీకి వెన్నతో పెట్టిన విద్య. వరుసగా తొమ్మిదో ఏట చారిత్రక ఎర్రకోటపై జెండా ఎగరేసి, సందేశమిచ్చిన ఆయన ఈసారి సంప్రదాయంగా చేసే ప్రత్యేక పథకాల ప్రకటనల జోలికి పోలేదు. స్వచ్ఛతా అభియాన్, జాతీయ విద్యావిధానం, కరోనా టీకాల లాంటి అంశాల్లో ప్రభుత్వ పురోగతినే పునశ్చరణ చేశారు. ఇటీవలి తన అలవాటుకు భిన్నంగా టెలీప్రాంప్టర్ లేకుండా 82 నిమిషాల సుదీర్ఘ ప్రసంగం చేశారు. ‘జై జవాన్, జై కిసాన్’కు గతంలో వాజ్‌పేయి ‘జై విజ్ఞాన్’ను జోడిస్తే, తాజాగా మోదీ ‘జై అనుసంధాన్’(నూత్న పరిశోధన)ను చేర్చారు. కొన్నేళ్ళుగా మాటలు ఎర్రకోట దాటాయే కానీ, చేతలు సభా వేదికలైనా దాటట్లేదన్నది నిష్ఠుర సత్యం. 2022 కల్లా రైతుల ఆదాయం రెట్టింపు చేస్తామని 2017లోనే మాట ఇచ్చారు. విదేశాల్లోని నల్లధనం వెలికి తెచ్చి, ఇంటింటికీ రూ. 15 లక్షలు పంచడమే తరువాయని ఊరించారు. అమృతో త్సవం నాటికి అందరికీ ఇళ్ళు వచ్చేస్తాయని ఊహల్లో ఊరేగించారు. తీరా అన్నీ నీటి మీద రాతల య్యాయి. ఉచితాలన్నీ అనుచితాలంటూ, ప్రజాసంక్షేమ పథకాలపై ముద్ర వేసే ప్రయత్నం చేస్తున్న వారు కొత్తగా ఏవో ఒరగబెడతారనుకోలేం. కానీ ‘అవినీతి, బంధుప్రీతి, చీకటిబజారు... అలము కున్న ఈ దేశం ఎటు దిగజారు’ అంటూ దశాబ్దాల క్రితం కవి వ్యక్తం చేసిన ఆవేదననే నేటికీ వల్లె వేస్తుంటే, ఎవరిపైనో నెపం మోపుతుంటే ఏమనాలి? దేశంలో ఏ మంచి జరిగినా గత 8 ఏళ్ళ లోనే జరిగినట్టూ, ప్రతి చెడుకూ ఆ మునుపటి 67 ఏళ్ళే కారణమన్నట్టు ఎన్నాళ్ళు నమ్మబలుకుతారు? కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం విశేష ప్రగతికి దోహదపడిందంటూ ఎర్రకోటపై అనేక అంశాల్ని ప్రస్తావించారు. వాటిలో కొన్ని సత్యశోధనకు నిలవట్లేదు. ‘పర్యావరణంపై భారత కృషి ఫలితాలి స్తోంది. అడవుల విస్తీర్ణం, పులులు, ఆసియా సింహాల సంఖ్య పెరగడం ఆనందాన్నిస్తోంది’ అంటూ చెప్పుకున్న గొప్పల్లో నిజం కొంతే! దేశ భూభాగంలో మూడోవంతులో అడవులను విస్తరింపజేస్తా మన్న పాలకులు సాధించింది స్వల్పమే. అటవీ విస్తీర్ణం 24.6 శాతానికి పెరిగిందని ప్రభుత్వ లెక్క. 2002 – 2021 మధ్య భారత్‌లో చెట్ల విస్తీర్ణం 19 శాతం మేర తగ్గిందని నాసా, గూగుల్ వగైరాల సమాచారమంతా క్రోడీకరించే ‘గ్లోబల్ ఫారెస్ట్ వాచ్’ మాట. పర్యావరణ విధానానికి వస్తే – బొగ్గు మీదే అతిగా ఆధారపడే మన దేశం అమెరికా, చైనాల తర్వాత అధిక కర్బన ఉద్గార దేశాల్లో ఒకటి. అలాగే, రక్షణ రంగంలో స్వావలంబన సాధించేందుకు భారత సంస్థలను ప్రోత్సహిస్తున్నామ న్నారు. దేశీయ రక్షణ ఉత్పత్తుల ప్రోత్సాహం బీజేపీ హయాంలో జరిగింది. కానీ, విదేశాల నుంచి భారీగా ఆయుధాల కొనుగోలులో ఇప్పటికీ మనం ముందున్నాం. 2017 – 2021 మధ్య ప్రపంచ ఆయుధ దిగుమతుల్లో 11 శాతం వాటా మనదే. దేశంలో పులులు, సింహాల సంఖ్య పెరిగిన మాట నిజమైనా, జాతీయ చిహ్నంలో సరికొత్త ఉగ్రనరసింహం దేనికి ప్రతీకంటే జవాబివ్వడం కష్టం. స్వాతంత్య్ర కాలపు ‘స్వదేశీ’, నేటికి ‘స్వావలంబన’ (ఆత్మనిర్భరత)గా రూపాంతరమైనా నేతన్న ఖద్దరును కాదని జెండాలు సైతం దిగుమతి చేసుకొనే దుఃస్థితి ఏమిటి? విదేశీ బొమ్మలు వద్దంటు న్నారని సంబరంగా చెబుతున్నవారు విదేశీ తయారీ జాతీయజెండాల వైపు మొగ్గడమేమిటి? అవినీతి, ఆశ్రితపక్షపాతం, ఆత్మనిర్భర భారత్ మోదీ ప్రసంగాల్లో నిత్యం దొర్లే మాటలు. నారీ శక్తి ప్రస్తావనా నిత్యం చేస్తున్నదే! ఆచరణలో చేసిందేమిటంటే ప్రశ్నార్థకమే! అవినీతిపై యుద్ధం మాటకొస్తే – 2015 మొదలు 2017, 2018, 2019... ఇలా ఏటా ఆ మాట మోదీ తన ప్రసంగంలో చెబుతూనే ఉన్నారు. ప్రసంగ పాఠాలే అందుకు సాక్ష్యం. ప్రతిపక్షపాలిత బెంగాల్లో బయటపడ్డ గుట్టలకొద్దీ నోట్లకట్టల్ని ఎవరూ సమర్థించరు కానీ, కాషాయ జెండా కప్పుకోగానే పచ్చి అవినీతి పరులు సైతం పరిశుద్ధులైపోతున్న ఉదాహరణలే అవినీతిపై పోరాటస్ఫూర్తిని ప్రశ్నిస్తున్నాయి. సమై క్యతను ప్రవచిస్తున్న పార్టీలు భిన్నభాషలు, సంస్కృతులు, కులాలు, మతాలున్న దేశంలో రకరకాల ప్రాతిపదికన మనుషుల్ని విడదీస్తూ, మనసుల్ని ఎలా దగ్గరచేయగలవు? వాగాడంబరం కట్టిపెట్టి, ఆచరణలోకి దిగాలి. స్వతంత్ర భారత శతమాన లక్ష్యం చేరాలంటే అన్నిటికన్నా ఆ ప్రతిజ్ఞ ముఖ్యం! -
జెండా పండుగలో విషాదం
యశవంతపుర: జెండా పండుగ వేళ పలుచోట్ల విషాదాలు చోటుచేసుకున్నాయి. గుండెపోటుతో ఒకరు, జెండా కడుతూ కిందపడి మరొకరు ప్రాణాలు విడిచారు. దక్షిణ కన్నడ జిల్లా కడబ తాలూకా కుట్రుపాడి గ్రామ పంచాయతి ఆఫీసులో సోమవారం ఉదయం జెండాను ఎగురవేస్తుండగా మాజీ జవాన్ గుండెపోటుతో కుప్పకూలిపోయాడు. మాజీ జవాన్ గంగాధర గౌడను ఈ కార్యక్రమానికి అతిథిగా ఆహ్వానించారు. అతిథి ప్రసంగిస్తుండగా గంగాధరగౌడ కిందపడిపోయాడు. ఆస్పత్రికి తరలిస్తుండగా కన్నుమూశాడు. సంఘటన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. జారిపడి గాయాలతో టెక్కీ మృతి హర్ ఘర్ తిరంగాలో భాగంగా ఇంటిపై జెండా కడుతూ కిందపడి టెక్కీ చనిపోయాడు. ఈ ఘటన బెంగళూరు హెణ్ణూరు పోలీసుస్టేషన్ పరిధిలో జరిగింది. దక్షిణకన్నడ జిల్లా సుళ్యకు చెందిన విశ్వాస్‌కుమార్ భట్ (33) బెంగళూరులో టెక్కీగా పని చేస్తున్నాడు. హెచ్బీఆర్ లేఔట్ ఐదో బ్లాక్‌లో భార్య వైశాలితో కలిసి రెండేళ్ల నుంచి నివాసం ఉంటున్నారు. ఆదివారం ఇంటి మీద పతాకాన్ని కడుతూ అదుపుతప్పి కిందపడడంతో తీవ్ర గాయాలయ్యాయి. స్థానికులు ఆస్పత్రికి తరలించగా చికిత్స పోందుతూ సోమవారం మృతి చెందాడు. (చదవండి: కాల్చేస్తాం, జరిమానా కట్టేస్తాం ) -
Indian Flag: ప్రపంచాన మెరిసిన త్రివర్ణం
బీజింగ్/సింగపూర్/అమెరికా: ప్రపంచ దేశాల్లో త్రివర్ణ పతాకం రెపరెపలాడింది. వివిధ దేశాల్లో నివసిస్తున్న ప్రవాస భారతీయులు భారత స్వాతంత్య్ర దినోత్సవాలను ఆనందోత్సాహాల మధ్య ఘనంగా నిర్వహించుకున్నారు. చైనాలో భారత రాయబారి ప్రదీప్ రావత్ వేడుకల్లో పాల్గొన్నారు. భారత ఎంబసీలో జాతీయ జెండాను ఎగురవేశారు. చైనాలోని భారతీయులు అధిక సంఖ్యలో విచ్చేసి, సాంస్కృతి కార్యక్రమాలు నిర్వహించారు. భారత నావికా దళానికి చెందిన నిఘా నౌక ‘ఐఎన్ఎస్ సరయూ’ బ్యాండ్ సిబ్బంది సింగపూర్‌లో భారత రాయబార కార్యాలయంలో దేశభక్తి గేయాలు ఆలపించారు. కెనడా, బంగ్లాదేశ్, నేపాల్, ఇజ్రాయెల్ తదితర దేశాల్లోను భారత స్వాతంత్య్ర దినోత్సవాలు నిర్వహించారు. అమెరికాలోని బోస్టన్‌లో ‘ఇండియా డే’ పరేడ్ సందర్భంగా 220 అడుగుల ఎత్తున ఎగురవేసిన భారత జాతీయ జెండా ప్రజలను ఆకట్టుకుంది. భారత్‌కు శుభాకాంక్షల వెల్లువ స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా భారత్‌కు ప్రపంచదేశాల అధినేతల నుంచి శుభాకాంక్షలు వెల్లువెత్తాయి. అమెరికా అధ్యక్షుడు బైడెన్, ఫ్రాన్స్ అధ్యక్షుడు మాక్రాన్ తదితరులు భారత్‌కు అభినందనలు తెలియజేశారు. ‘సత్యం, అహింసా అని గాంధీజీ ఇచ్చిన సందేశం విలువైనది. ప్రపంచ సవాళ్లను ఎదుర్కొనేందుకు భారత్, అమెరికా ప్రజల శాంతిభద్రతల కోసం ఇరుదేశాలూ కలిసికట్టుగా పనిచేయాలి’ అని బైడెన్ సందేశమిచ్చారు. ఆస్ట్రేలియా ప్రధాని అల్బానీస్, ఆస్ట్రేలియా రక్షణ శాఖ మంత్రి రిచర్డ్ మార్లెస్, మాల్దీవుల అధ్యక్షుడు ఇబ్రహీం మొహమ్మద్, సోలిహ్, సింగపూర్ విదేశాంగ మంత్రి వివియన్ బాలకృష్ణన్ తదితర ప్రముఖులు భారత ప్రజలకు స్వాతంత్య్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. ఇదీ చదవండి: వివాదంలో బ్రిటన్ ప్రధాని అభ్యర్థి రిషి సునాక్! -
మా తుఝే సలాం
-
పోలీసులకు సేవా పతకాల ప్రదానం (ఫోటోలు)
-
స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలను ఘనంగా జరుపుకున్న టీమిండియా
Team India Celebrates Independence Day In Harare: 3 వన్డేల సిరీస్ కోసం జింబాబ్వేలో పర్యటిస్తున్న టీమిండియా.. 75వ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలను అక్కడే ఘనంగా జరుపుకుంది. జట్టు సభ్యులతో పాటు కోచింగ్, సహాయక సిబ్బంది అంతా ఈ వేడుకల్లో పాల్గొన్నారు. రెగ్యులర్ కోచ్ రాహుల్ ద్రవిడ్ గైర్హాజరీలో ఈ సిరీస్‌కు కోచ్‌గా వ్యవహరిస్తున్న నేషనల్ క్రికెట్ అకాడమీ (ఎన్సీఏ) డైరెక్టర్ వీవీఎస్ లక్ష్మణ్ ఆధ్వర్యంలో వేడుకలు జరిగాయి. కేఎల్ రాహుల్ నాయకత్వంలో టీమిండియా సభ్యులు జాతీయ జెండాను ఆవిష్కరించారు. అనంతరం భారత బృంద సభ్యులంతా జాతీయ జెండా ముందు నిల్చొని ఫోటోలు దిగారు. ఇదిలా ఉంటే, జింబాబ్వే పర్యటనలో టీమిండియా ఈ నెల (ఆగస్ట్) 18, 20, 22 తేదీల్లో మూడు వన్డేలు ఆడనున్న విషయం తెలిసిందే. ఈ పర్యటన ముగిసిన అనంతరం టీమిండియా నేరుగా యూఏఈ వెళ్లి ఆసియా కప్‌లో పాల్గొంటుంది. ఈ మెగా ఈవెంట్లో భాగంగా టీమిండియా ఈనెల 28న తమ తొలి మ్యాచ్‌లో చిరకాల ప్రత్యర్ధి దాయాది పాకిస్థాన్‌తో తలపడనుంది. చదవండి: 'విండీస్ సిరీస్‌లో అతడు అదరగొట్టాడు.. అయినప్పటికీ ఓపెనర్‌గా నో ఛాన్స్' -
డిజిటల్ దేశభక్తి: మువ్వన్నెల జెండా సెల్ఫీలతో రికార్డు బద్ధలు!
ఢిల్లీ: కోట్లాదిమంది పౌరులు తమ దేశభక్తిని డిజిటల్ రూపంలోనూ చూపించారు. తాము ఎగరేసిన త్రివర్ణ పతాకంతో కలిసి సెల్ఫీలు, ఫొటోలు దిగి హర్ ఘర్ తిరంగా వెబ్‌సైట్‌కు పంపాలని ఇటీవల కేంద్ర సాంస్కృతిక శాఖ పిలుపునిచ్చింది. ఈ పిలుపునకు స్పందన అనూహ్యరీతిలో వచ్చింది. ఏకంగా ఐదు కోట్లకుపైగా పౌరులు త్రివర్ణ పతాక సెల్ఫీలను ‘హర్ ఘర్ తిరంగా’ వెబ్సైట్లోకి అప్లోడ్ చేశారని సాంస్కృతిక శాఖ సోమవారం పేర్కొంది. ‘ఇళ్ల వద్ద జెండావిష్కరణ జరపాలంటూ ప్రధాని మోదీ ఇచ్చిన పిలుపునకు వచ్చిన స్పందన అనుపమానం. కోటానుకోట్ల స్వీయచిత్రాలతో వెబ్సైట్ నిండిపోతోంది. సోమవారం సాయంత్రం నాలుగింటికే ఐదు కోట్ల మార్క్ దాటాం’ అని పౌరులను అభినందించింది. మంగళవారం ఉదయం కూడా వెబ్సైట్లోకి ఫోటోలు అప్లోడ్ అవుతుండడం విశేషం. సాధారణంగా అధిక జనాభా ఉన్న(రెండో దేశం) భారత్ నుంచి.. ప్రపంచ స్థాయిలోనే ఇదొక కొత్త రికార్డు అయ్యి ఉంటుందని సాంస్కృతిక శాఖ అంచనా వేస్తోంది. ఇదీ చదవండి: స్వాతంత్ర వేడుకల్లో గాంధీ ఎందుకు పాల్గొనలేదో తెలుసా? -
పోలీసులకు సేవా పతకాల ప్రదానం
సాక్షి, అమరావతి: విధి నిర్వహణలో విశిష్ట సేవలు, ధైర్య సాహసాలు ప్రదర్శించిన పలువురు రాష్ట్ర పోలీసులకు సోమవారం సీఎం జగన్ పతకాలను ప్రదానం చేశారు. 76వ స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా విజయవాడ ఇందిరాగాంధీ స్టేడియంలో జరిగిన కార్యక్రమంలో 2020–21 సేవా పతకాలను గ్రహీతలు అందుకున్నారు. వారి వివరాలు.. ప్రెసిడెంట్ పోలీస్ మెడల్ (పీపీఎం)–2020 ► కేవీ రాజేంద్రనాథ్‌రెడ్డి, రాష్ట్ర డీజీపీ ► డాక్టర్ ఎ.రవిశంకర్, ఏడీజీపీ, శాంతిభద్రతలు ► కుమార్ విశ్వజిత్, ఏడీజీపీ, రైల్వే ► కె. సుధాకర్, డీఎస్పీ, ఇంటెలిజెన్స్ ► ఎం.శ్రీనివాసరావు, ఏఆర్ఎస్ఐ, ఏసీబీ, విజయవాడ పోలీస్ మెడల్–2021 ► జి. గిరీష్‌కుమార్, అసిస్టెంట్ కమాండో, గ్రేహౌండ్స్ ఇండియన్ పోలీస్ మెడల్ (ఐపీఎం)–2020, 2021 ► పీహెచ్‌డి రామకృష్ణ, డీఐజీ, ఏసీబీ ► ఎస్. వరదరాజు, రిటైర్డ్ ఎస్పీ ► ఆర్. విజయ్‌పాల్, రిటైర్డ్ ఏఎస్పీ, సీఐడీ ► ఎ. జోషి, ఏఎస్పీ, ఐఎస్‌డబ్ల్యూ, విజయవాడ ► ఎల్వీ శ్రీనివాసరావు, రిటైర్డ్ ఏఎస్పీ ► ఎన్. వెంకటరామిరెడ్డి, రిటైర్డ్ ఏఎస్పీ ► ఎంకేఎస్. రాధాకృష్ణ, అడిషనల్ కమాండెంట్, పీటీసీ, తిరుపతి ► ఈ. సత్యసాయిప్రసాద్, అడిషనల్ కమాండెంట్, ఆరో బెటాలియన్, మంగళగిరి ► సీహెచ్‌వీఏ రామకృష్ణ, అడిషనల్ కమాండెంట్, ఐదో బెటాలియన్, ఏపీఎస్పీ ► కే ఈశ్వరరెడ్డి, ఏఎస్పీ, విజిలెన్స్ ► ఎం. భాస్కర్‌రావు, రిటైర్డ్ డీఎస్పీ, సీఐడీ ► జి. వెంకటరమణమూర్తి, ఏసీపీ విజయవాడ ► జి. విజయ్‌కుమార్, డీఎస్పీ కమ్యూనికేషన్స్ ► ఎం. మహేశ్‌బాబు, రిటైర్డ్ అడిషనల్ కమాండెంట్ ► వై. శ్యామ్సుందరం, సీఐ పీటీసీ, తిరుపతి ► కె. జాన్మోషెస్ చిరంజీవి, ఆర్ఐ, విజయవాడ ► ఎన్. నారాయణమూర్తి, ఎస్ఐ, శ్రీకాకుళం ► ఎస్. శ్రీనివాసులు, ఎస్ఐ, ఏసీబీ తిరుపతి ► వి. నేతాజి, ఎస్ఐ, శ్రీకాకుళం ► ఎస్ఎస్ కుమారి, ఎస్ఐ, ఒంగోలు ► ఎన్. గౌరిశంకరుడు, ఆర్ఎస్సై, నెల్లూరు ► వై. శశిభూషణ్‌రావు, ఆర్ఎస్సై, ఏపీఎస్పీ ఐదో బెటాలియన్ ► పి.విక్టోరియా రాణి, ఎస్సై విశాఖపట్నం రూరల్ ► కెఎన్ కేశవన్, ఏఎస్సై, చిత్తూరు ► బి. సురేశ్‌బాబు, ఏఎస్సై, నెల్లూరు ► జె. నూర్ అహ్మద్‌బాషా, ఏఎస్సై, చిత్తూరు ► జె. విశ్వనాథం, ఏఆర్ఎస్సై, ఇంటెలిజెన్స్ ► కె. వాకలయ్య, ఏఆర్ఎస్సై, మచిలీపట్నం ► ఎం. వెంకటేశ్వరరావు, ఆర్ఎస్సై, విజయవాడ ► జె. శ్రీనివాసులు, ఏఆర్ఎస్సై, అనంతపురం ► ఎస్. రామచరణయ్య, ఏఆర్ఎస్సై, అనంతపురం ► వైకుంఠేశ్వరరావు, ఏఆర్ఎస్సై, 6వ బెటాలియన్ ఏపీఎస్పీ ► వై. చంద్రశేఖర్, హెడ్ కానిస్టేబుల్, ఒంగోలు ► పి.విజయభాస్కర్, హెడ్ కానిస్టేబుల్, విజయవాడ ► ఎన్.రామకృష్ణరాజు, ఆర్‌హెచ్‌సీ, విజయనగరం ► సీహెచ్. రంగారావు, హెచ్‌సీ, ఏసీబీ, విజయవాడ ► కె.గురువయ్య బాబు, ఏఆర్‌హెచ్‌సీ, విశాఖపట్నం ► ఎ.సూర్యనారాయణరెడ్డి, ఏఆర్‌హెచ్‌సీ, విజయవాడ ► డి. మౌలాలి, ఏఆర్‌హెచ్‌సీ, విజయవాడ ► ఎం. జనార్థన్, హెచ్‌సీ, ఆక్టోపస్ ► వై. నాగేశ్వరరెడ్డి, ఏఆర్‌హెచ్‌సీ, విజయవాడ ► జి. రమణ, కానిస్టేబుల్, కర్నూల్ ► ఎన్. సూర్యనారాయణ, ఆర్పీసీ, విజయవాడ ► ఎంవి సత్యనారాయణరాజు, కానిస్టేబుల్, విశాఖపట్నం స్వాతంత్య్ర దినోత్సవ కవాతులో మొదటి బహుమతి అందజేస్తున్న సీఎం వైఎస్ జగన్ ప్రెసిడెంట్ ఫైర్ సర్వీసెస్ మెడల్–2020 ► లేట్ కె. జయరామ్ నాయక్ ఫైర్ సర్వీసెస్ మెడల్ ► ఎం. భూపాల్‌రెడ్డి, రీజనల్ ఫైర్ ఆఫీసర్ ► వి. శ్రీనివాసరెడ్డి, జిల్లా అగ్నిమాపక అధికారి, అనంతపురం ► సీహెచ్ కృపవరం, జిల్లా అగ్నిమాపక అధికారి, విశాఖపట్నం ► బి. వీరభద్రరావు, అసిస్టెంట్ డీఎఫ్ఓ, శ్రీకాకుళం ► బి. గొల్లడు, రిటైర్డ్ లీడింగ్ ఫైర్‌మ్యాన్ ముఖ్యమంత్రి శౌర్య పతకాలు : ఏపీ అవతరణ దినోత్సవం–2021 ► జి. నాగశంకర్, కానిస్టేబుల్, గ్రేహౌండ్స్ ► జి. ప్రసాద్, కానిస్టేబుల్, గ్రేహౌండ్స్ ► బి. రమేశ్, ఆర్ఎస్ఐ, గ్రేహౌండ్స్ ► ఎం. శ్రీనివాసరావు, కానిస్టేబుల్, గ్రేహౌండ్స్ ► ఎస్. సురేశ్, కానిస్టేబుల్, గ్రేహౌండ్స్ ► జిఎస్ రామారావు, ఆర్ఐ, గ్రేహౌండ్స్ ► కె. జగదీష్, హెడ్ కానిస్టేబుల్, గ్రేహౌండ్స్ ► డి. గోవిందబాబు, కానిస్టేబుల్, గ్రేహౌండ్స్ ► జె. ఈశ్వరరావు, ఆర్ఎస్ఐ, గ్రేహౌండ్స్ ► పి. పెంచల ప్రసాద్, కానిస్టేబుల్, గ్రేహౌండ్స్ ► డి. నాగేంద్ర, ఎస్ఐ, గ్రేహౌండ్స్ -
CM YS Jagan: దశాబ్దాల ప్రశ్నలకు మూడేళ్లలో జవాబిచ్చాం
రాష్ట్రంలో ప్రతి కుటుంబం నిన్నటి కంటే నేడు.. నేటి కంటే రేపు.. రేపటి కంటే భవిష్యత్తులో బాగుండటమే అభివృద్ధి. అదే మన స్వతంత్రానికి అర్థమని నమ్మాం. ఎన్నికల వరకే రాజకీయాలు.. అధికారంలోకి వచ్చిన తరవాత అంతా మన ప్రజలే అని విశ్వసించాం. ప్రతి ఒక్క పథకంలోనూ శాచ్యురేషన్ విధానాన్ని అమలు చేశాం. ఎక్కడా కులం, మతం, వర్గం, ప్రాంతీయ భేదాలను చూడలేదు కాబట్టే లంచాలు, వివక్ష, కమీషన్లు లేకుండా రూ.1.65 లక్షల కోట్లు అర్హులందరి ఖాతాల్లోకి వెళ్లాయి. దేశ చరిత్రలో పారదర్శకంగా ఇంత డబ్బు లబ్ధిదారులకు చేరటం కనీవినీ ఎరుగనిది – ముఖ్యమంత్రి వైఎస్ జగన్ జెండా.. భారతీయుల గుండె ‘‘ఈ జెండా కేవలం దారాల కలనేత కాదు.. ఇది భిన్నత్వంలో ఏకత్వానికి, భారతీయతకు, దేశభక్తికి, దేశ స్వాతంత్య్ర పోరాటానికి, మనకు మన దేశంపై ఉన్న నిబద్ధతకు, ఈ దేశ భవిష్యత్తుకు ఉండాల్సిన చిత్తశుద్ధికి ప్రతీక. మన తెలుగువాడు పింగళి వెంకయ్య తయారు చేసిన ఈ జెండా.. ఇప్పుడు 141 కోట్ల భారతీయుల గుండె’’. స్వతంత్రానికి నిజమైన అర్థం ‘‘రాష్ట్రంలో ప్రతి కుటుంబం నిన్నటి కంటే నేడు.. నేటి కంటే రేపు.. రేపటి కంటే భవిష్యత్తులో బాగుండటమే అభివృద్ధి. అదే మన స్వతంత్రానికి అర్థమని నమ్మాం. ఎన్నికల వరకే రాజకీయాలు.. అధికారంలోకి వచ్చిన తరవాత అంతా మన ప్రజలే అని విశ్వసించాం. ప్రతి ఒక్క పథకంలోనూ శాచురేషన్ విధానాన్ని అమలు చేశాం. ఎక్కడా కులం, మతం, వర్గం, ప్రాంతీయ భేదాలను చూడలేదు. కాబట్టే ఎటువంటి లంచాలు, వివక్ష, కమీషన్లు లేకుండా రూ.1.65 లక్షల కోట్లు అర్హులందరి ఖాతాల్లోకి వెళ్లాయి. బహుశా భారతదేశ చరిత్రలో ఇంత పారదర్శకంగా ఇంత డబ్బు లబ్ధిదారులకు చేరటం కనీవినీ ఎరుగనిది’’. ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి సంక్షేమమే మానవ అభివృద్ధి ‘‘సంక్షేమ పథకాలను మానవ వనరులపై పెట్టుబడిగా భావించి ప్రతి రూపాయినీ కుటుంబాలను నిలబెట్టే, పేదరికం సంకెళ్లను తెంచే సాధనంగా పేదల చేతిలో ఉంచాం. ప్రతి పథకాన్నీ కూడా ప్రజల జీవన ప్రమాణాలను పెంచుతూ, సుస్థిర అభివృద్ధి లక్ష్యాలు(ఎస్డీజీ) సాధించేలా అమలు చేస్తున్నాం’’. –వైఎస్ జగన్మోహన్రెడ్డి, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి సాక్షి, అమరావతి: భారతదేశ స్వాతంత్ర్యానికి 75 ఏళ్ల చరిత్ర ఒకవైపు ఉంటే.. మరోవైపు ఇదే గడ్డపై సమ సమాజం కోసం, సామాజిక న్యాయం కోసం, చదువుకునే హక్కు, మహిళా సాధికారత, మనుషులుగా గుర్తింపు, దోపిడీకి గురికాకుండా జీవించే రక్షణల కోసం జరుగుతున్న పోరాటాలకు వందల, వేల ఏళ్ల చరిత్ర ఉందని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అన్నారు. ఇవన్నీ పరాయి దేశంపై చేసిన స్వాతంత్య్ర పోరాటాలు కావని, మన సమాజంలో జరుగుతున్న సామాజిక స్వాతంత్య్ర పోరాటాలని ఆయన చెప్పారు. ఏడు దశాబ్దాల్లో స్వతంత్ర దేశంగా భారత్ తిరుగులేని విజయాలను, అనేక రంగాల్లో అభివృద్ధిని సొంతం చేసుకున్నప్పటికీ ఎన్నో ప్రశ్నలు వెంటాడుతూనే ఉన్నాయన్నారు. వీటికి లభించిన సమాధానాల ప్రతీకే.. ఈ మూడేళ్ల రాష్ట్ర ప్రభుత్వ పాలనగా స్పష్టం చేశారు. రాష్ట్ర చరిత్రలో గానీ, దేశ చరిత్రలో గానీ ఏ ఒక్క ప్రభుత్వంలోనూ కనిపించనంతటి సామాజిక, ఆర్థిక, రాజకీయ విద్యా న్యాయాలను ప్రజలందరి ప్రభుత్వంలో చేసి చూపించామన్నారు. ఇంతటి విప్లవాత్మక మార్పులు ఒకరిద్దరు వ్యక్తులకో, కొంత మందికి ప్రయోజనం కల్పించేందుకు చేసినవి కావని.. ఇవన్నీ వ్యవస్థనే మార్చే మార్పులని ఉద్ఘాటించారు. వచ్చే కొన్ని దశాబ్దాల్లో వ్యవసాయ, విద్య, వైద్యం, గృహ నిర్మాణ రంగాన్ని, సామాజిక వర్గాలకు అందే రాజకీయ అధికారాన్ని నిర్ణయించే విధంగా ఉంటాయన్నారు. మహిళల అభివృద్ధి ప్రాధాన్యంగా 21వ శతాబ్దపు ఆధునిక భారతీయ మహిళ ఆంధ్రప్రదేశ్‌లోనే ఆవిర్భవించాలన్న లక్ష్యంతో మహిళా సాధికారతలో వేగంగా అడుగులు ముందుకు వేస్తున్నామన్నారు. రాజధాని స్థాయిలో పరిపాలన వికేంద్రీకరణే తమ విధానమని, ప్రాంతాల ఆకాంక్షలు, ప్రాంతీయ ఆత్మగౌరవానికి, అన్ని ప్రాంతాల మధ్య సమతౌల్యంతోపాటు పటిష్ట బంధానికి వికేంద్రీకరణే పునాదిగా నమ్ముతున్నామన్నారు. విజయవాడలోని ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో సోమవారం 76వ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలకు ముఖ్య అతిథిగా హాజరైన ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి జాతీయ జెండాను ఆవిష్కరించారు. అనంతరం సాయుధ దళాల గౌరవ వందనం స్వీకరించి ప్రభుత్వ సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలపై వివిధ ప్రభుత్వ విభాగాలు రూపొందించిన శకటాల ప్రదర్శనను తిలకించారు. అనంతరం రాష్ట్ర ప్రజలనుద్దేశించి ప్రసంగించారు. ఆ వివరాలు ఇవీ.. మతసామరస్యానికి ప్రతీక నేడు ఎగిరిన ఈ జాతీయ జెండా మన స్వాతంత్య్రానికి, గొప్పదైన మన ప్రజాస్వామ్యానికి ప్రతీక. ఇది దేశ ప్రజల సార్వభౌమాధికారానికి ప్రతీక. భారతదేశపు ఆత్మకు, మనందరి ఆత్మగౌరవానికి ప్రతీక. ఈ దేశం హిందూ, ఇస్లాం, క్రైస్తవం వంటి అనేక మతాలు, అనేక ధర్మాల సమ్మేళనం అని ఆ జెండా చెబుతుంది. మన జెండా మన సమరయోధుల త్యాగనిరతికి, మనం కోరుకునే సుస్థిర శాంతికి, ఈ దేశం పైరుపచ్చలతో కళకళలాడాలన్న భావనకు ప్రతీక. ఈ జెండా.. ప్రపంచంలోనే అతి పెద్ద ప్రజాస్వామ్యం గొప్పదనానికి ప్రతీక. స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలో పాల్గొన్న సీఎం సతీమణి వైఎస్ భారతి మన పోరాటం మహోన్నతం మన స్వాతంత్య్ర పోరాటం మహోన్నతం. ఈ ఏడాది మనం భారత స్వాతంత్ర్య వజ్రోత్సవాలను సంపూర్ణం చేసుకుంటున్న సమయం. ఒక జాతి యావత్తు పోరాడుతున్నా.. అంతటి పోరాటంలో కూడా చెక్కుచెదరని అత్యున్నత మానవతా విలువలకు నిలువెత్తు నిదర్శనం మన స్వాతంత్య్ర పోరాటం. ఇందులో వర్గాలు వేరైనా.. వాదాలు వేరైనా.. అతివాదమైనా, మితవాదమైనా, విప్లవ వాదమైనా.. గమ్యం ఒక్కటే, అది స్వతంత్రమే. అహింసే ఆయుధంగా, సత్యమే సాధనంగా సాగిన ఆ శాంతియుత పోరాటం... ఒక్క భారతదేశానికి మాత్రమే కాదు మొత్తంగా ప్రపంచ మానవాళికి మహోన్నత చరిత్రగా, తిరుగులేని స్ఫూర్తిగా కలకాలం నిలిచే ఉంటుంది. సంకల్ప విప్లవ సంగ్రామం స్వాతంత్య్రం నా జన్మహక్కు.. దాన్ని సాధించి తీరుతానన్న బాలగంగాధర తిలక్ సంకల్పానికి, ఏకంగా ప్రవాస ప్రభుత్వాన్నే ఏర్పాటు చేసి బ్రిటిష్ వారిపై యుద్ధం ప్రకటించిన ఆజాద్ హింద్ ఫౌజ్ అధినేత సుభాస్ చంద్రబోస్ సాహసానికి, జలియన్ వాలాబాగ్ మారణకాండకు బాధ్యుడైన జనరల్ డయ్యర్‌ను లండన్ నడివీధుల్లో శిక్షించిన ఉధంసింగ్ తెగువకు, దేశం కోసం ఉరికంబం ఎక్కిన సర్దార్ భగత్‌సింగ్ త్యాగానికి ప్రతీక మన స్వతంత్ర పోరాటం. జన సమూహాలే ఆయుధాలుగా.. మన సామాన్యుడి దేహం మీద వేసుకోడానికి నూలు పోగులు లేకున్నా.. మా దేశం మీద మీరు దేవతా వస్త్రాలు కప్పాం అంటే కుదరదన్న భావాలకు నిలువెత్తు రూపం గాంధీజీ. అణువణువూ స్వాతంత్య్ర కాంక్ష నిండిన జన సమూహాలే ఆయుధాలని.. అవి అణ్వాయుధాల కంటే శక్తిమంతమని నిరూపించిన మహాత్ముడు మన గాంధీజీ. మహాయోధుల త్యాగాలు, రక్తంతో తడిసిన పుణ్యభూమి భారతీయతకు ప్రతినిధులుగా నిలిచిన ఒక మౌలానా అబుల్ కలాం ఆజాద్, ఒక ఖాన్ అబ్దుల్ గఫర్‌ఖాన్, సైమన్ కమిషన్ రాక సందర్భంగా తుపాకులకు ఎదురొడ్డి నిలిచిన టంగుటూరి ప్రకాశం, మన్నెం వీరుడిగా ప్రాణాలే అర్పించిన అల్లూరి.. ఇలా వందలు వేల మహాయోధుల త్యాగాలు, భావాలతో, వారి స్వేదంతో–రక్తంతో తడిసి ఈ పుణ్యభూమి పునీతమయింది. ఆ పునాదులమీదే స్వతంత్ర దేశంగా ఇండియా అవతరించింది. వంద కోట్ల జెండాలు ఎగురుతున్నాయి 1857లో తొలి స్వతంత్ర సంగ్రామంగా సిపాయిల తిరుగుబాటు జరిగితే, 1885లో భారత జాతీయ కాంగ్రెస్ పుట్టిన నాటి నుంచి 1947లో దేశ స్వాతంత్య్రం వరకు 62 సంవత్సరాల కాలం జాతీయోద్యమం, స్వాతంత్య్ర పోరాటం జరిగింది. అంటే తొలి స్వాతంత్య్ర పోరాటానికి, ఆ తరవాత– మితవాద, అతివాద, విప్లవ వాద సమరాలకు 90 ఏళ్ల ఘన చరిత్ర ఉంది. ఈ పోరాటాల ఫలితంగా 1947 ఆగస్టు 15న మన ఎర్రకోటమీద మన పాలనలో మన తొలి జెండా ఎగిరింది. నేడు 75 ఏళ్ల తర్వాత ఈ రోజున.. కశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు 100 కోట్ల జెండాలు ఎగురుతున్నాయి. మానవ చరిత్రలోనే మహోన్నతమైన స్వతంత్ర పోరాటాన్ని స్మరించుకుంటూ దేశం ఈ రోజున ఆజాదీ కా అమృత్ మహోత్సవాన్ని జరుపుకుంటోంది. తిరుగులేని విజయాల భారత్ గత 75 ఏళ్లలో దేశంగా ఇండియా తిరుగులేని విజయాలను, అనేక రంగాల్లో అభివృద్ధిని సొంతం చేసుకుంది. స్వాతంత్య్రం వచ్చేనాటికి మన జనాభా కేవలం 35 కోట్లు అయితే ఈ రోజున అది మరో 106 కోట్లు పెరిగి ఏకంగా 141 కోట్లకు చేరింది. ఇంత అతి పెద్ద ప్రజాస్వామ్య దేశానికి కావాల్సిన ఆహారం, నీరు, దుస్తులు, విద్య, వైద్యం, పరిశ్రమ, సేవలు ఇలా ఏది తీసుకున్నా తయారు చేయటం, అందించటం, మిగతా ప్రపంచంతో పోటీపడి ప్రగతి సాధించటం.. ఇవన్నీ అతి పెద్ద సవాళ్లే. రైతన్నలకు దేశం సెల్యూట్ చేయాలి మన దేశంలో 1947లో అప్పుడున్న 35 కోట్ల ప్రజలకు సరిపడా ఆహార ధాన్యాలు లేని దుస్థితి. దాన్ని అధిగమించి.. ఈ రోజు ప్రపంచంలో ఏకంగా 150 దేశాలకు ఆహార ధాన్యాలను ఎగుమతి చేయగల పరిస్థితిని తీసుకొచ్చిన మన రైతన్నలకు మన దేశమంతా సెల్యూట్ చేయాలి. ఒకప్పుడు పీఎల్ 480 స్కీమ్ కింద గోధుమ నూకను మానవతా సహాయంగా అందుకున్న మన దేశం.. ఈ రోజున ఏకంగా ఏటా 70 లక్షల టన్నుల గోధుమను, ఏడాదికి 210 లక్షల టన్నుల బియ్యాన్ని ప్రపంచానికి ఎగుమతి చేస్తోంది. స్వాతంత్య్రం వచ్చే నాటికి కేవలం 18 శాతం వ్యవసాయ భూమికి నీటి సదుపాయాలుంటే ఇప్పుడు 49 శాతానికి పైగా భూమికి సాగునీరందుతోంది. అగ్ర దేశాలతో పోటీ 1947లో వంద మందికి కేవలం 12 శాతం అక్షరాస్యులు ఉంటే.. ఈ రోజున మన అక్షరాస్యత, తాజా సర్వేల ప్రకారం 77 శాతానికి పైగా ఉంది. స్మార్ట్ ఫోన్ల వినియోగంలో ప్రపంచంలోనే రెండో స్థానం మనది. స్వాతంత్య్రం వచ్చే నాటికి మన దేశంలో 99 శాతం ప్రజల ఇంటికి కరెంటు లేదు. ఈ రోజు... కరెంటు లేని ఇళ్లు.. దేశం మొత్తంలో కేవలం ఒక శాతం కంటే తక్కువే. చిన్న జ్వరం తగ్గే మాత్ర కావాలన్నా అప్పట్లో అన్నీ దిగుమతి అయిన ట్యాబ్లెట్లే ఉంటే.. ఈ రోజు ప్రపంచ ఫార్మా రంగంలో ఇండియా టాప్ 3 దేశాల్లో ఒకటి. అమెరికాలో వాడుతున్న ప్రతి మూడు ట్యాబ్లెట్లలో ఒకటి, మనల్ని పాలించిన బ్రిటన్‌లో ప్రజలు వాడుతున్న ప్రతి నాలుగు ట్యాబ్లెట్లలో ఒకటి ఇండియా తయారు చేసిందే. స్ఫూర్తిని నింపిన విజయాలు అంతరిక్ష రంగంలో ఇస్రో సాధిస్తున్న ఘన విజయాలు, ఎంతటి శత్రువునైనా ఎదుర్కొనేలా మన శాస్త్రవేత్తలు తయారు చేసిన శక్తిమంతమైన అణ్వాయుధాలు–క్షిపణులు, మన తేజస్ వంటి యుద్ధ విమానాల కొనుగోలుకు అమెరికా ఆసక్తి కనబరచటం మొదలు... ఎందరో ఇండియన్లు అమెరికన్ కంపెనీల సీఈవోలుగా ఎదగటం వరకు, అలాగే 190 సంవత్సరాలు మన దేశాన్ని తన చేతిలోకి తీసుకున్న బ్రిటన్‌కు.. ఒక భారతీయ సంతతి పౌరుడు ప్రధాని రేసులో నిలవటం, ఒక భారతీయ సంతతి మహిళ అమెరికా ఉపాధ్యక్ష పదవిలో ఉండటం వరకు ఇవన్నీ భారతీయులు గర్వించే అంశాలే. ఇవన్నీ మనకు కొండంత స్ఫూర్తిని నింపే విజయాలే. జెండా వందనం చేస్తున్న సీఎం జగన్. చిత్రంలో డీజీపీ రాజేంద్రనాథ్‌రెడ్డి నిండు మనసుతో దిద్దుబాట్లు స్వతంత్ర దేశంగా ఇండియా, అంతర్జాతీయంగా భారతీయులు సాధించిన విజయాలకు కొదవ లేదన్నది ఎంత వాస్తవమో.. దేశంగా ఇండియాకు వచ్చిన ఈ స్వాతంత్ర్యం వ్యక్తులుగా, కులాలుగా, ప్రాంతాలుగా, జెండర్‌గా తమకు పూర్తిగా అందలేదన్న భావన కొన్ని సమూహాల్లో, కొన్ని ప్రాంతాల్లో, అనేకమంది ప్రజల్లో నేటికీ ఉండిపోయిందన్నది కూడా అంతే వాస్తవం. దేశ స్వాతంత్ర్యానికి 75 ఏళ్ల చరిత్ర ఉంటే... వందలు, వేల ఏళ్లుగా ఎన్నో సంఘ సంస్కరణ, సమాన హక్కుల పోరాటాలు జరుగుతున్నాయి. ఇంకొన్ని అణచివేతల మీద తిరుగుబాట్లు.. ఇవన్నీ మనం మాట్లాడకపోయినా, మనం దాచేసినా దాగని సత్యాలు. ఇవన్నీ నిజానికి... మనం నిండు మనసుతో చేసుకోవాల్సిన దిద్దుబాట్లు. మాటలతో కాకుండా చేతలతో సమాధానాలు ఇవ్వాల్సిన అంశాలు. ఇలాంటి సమాధానాల అన్వేషణే ఆంధ్రప్రదేశ్‌లో మన మూడేళ్ల పాలన. దశాబ్దాల ప్రశ్నలకు సమాధానం ఆహారాన్ని పండించే రైతు అర్ధాకలితో ఉండటాన్ని, భవన నిర్మాణ కార్మికుల కుటుంబాలు తరతరాలుగా గుడిసెల్లో మాత్రమే జీవించటాన్ని, గవర్నమెంటు బడికి వెళ్లే పేదల పిల్లలు కేవలం తెలుగు మీడియంలోనే చదవక తప్పని పరిస్థితిని, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ కులాలు ఎప్పటికీ పనివాళ్లుగా మిగిలిపోవాలనే పెత్తందారీ పోకడల్ని, వైద్యం ఖర్చు భరించలేక, అమ్ముకునేందుకు ఏమీలేక.. అప్పటికే అప్పులపాలై నిస్సహాయంగా చనిపోవటాన్ని, చదువులకు అయ్యే ఖర్చు భరించలేక పిల్లల్ని చదువులు మాన్పించి పనిలో పెట్టాల్సివస్తే తల్లి హృదయం తల్లడిల్లటాన్ని, ఎస్సీల్లో 36 శాతం, ఎస్టీల్లో 51 శాతం నేటికీ నిరక్షరాస్యులుగానే మిగిలిపోవటాన్ని, కార్పొరేట్ విద్యా సంస్థలకోసం, అంతకంటే మెరుగైన టీచర్లు ఉన్న ప్రభుత్వ విద్యా వ్యవస్థను బలి పెట్టటాన్ని, మనలో సగం ఉన్న అక్కచెల్లెమ్మలకు, వారి వాటాగా సగం ఉద్యోగాలు, సగం పదవులు, చట్ట సభల్లో సగం స్థానాలు కేటాయించకపోవటాన్ని, కొన్ని సామాజిక వర్గాల వారికి అధికార పదవుల్లో, పరిపాలనలో ఏనాటికీ వాటా దక్కకపోవటాన్ని, సంపద కేంద్రీకరణ ధోరణులకు తోడుగా, అధికార కేంద్రాలన్నీ ఒకేచోట ఉండాలన్న వాదనల్ని, గ్రామాల్లో ప్రభుత్వ సేవల విస్తరణ చేయకుండా పల్లెల్ని, రైతుల్ని గాలికి వదిలేయటాన్ని, ప్రతి పనికీ లంచాలు, కమీషన్ల వ్యవస్థ ఏర్పడటాన్ని, ఎన్నికల్లో ఇచ్చిన వాగ్దానాలను నెరవేర్చకపోవటం ద్వారా రాజకీయ పార్టీలు ఆయా వర్గాలకు చేసిన నష్టాన్ని, ఇలాంటి దుర్మార్గాలన్నింటినీ, మన స్వతంత్ర దేశంలో... మన దేశం వాడే, మన రాష్ట్రం వాడే. మన ప్రజలకు అన్యాయం చేస్తే... దాన్నే పరిపాలన అంటాడని... ఇండిపెండెంట్‌గా ఉండాల్సిన మీడియా, తమ స్వార్థ ప్రయోజనాల కోసం దానికి భజన చేస్తుందని... మన స్వాతంత్య్ర సమర యోధులు, మన రాజ్యాంగ నిర్మాతలు ఏనాడైనా ఊహించారా? ఇవన్నీ మన ముందున్న ప్రశ్నలు. దశాబ్దాలుగా అనేక వర్గాల అనుభవాల నుంచి, ఆయా వర్గాలకు జరిగిన అన్యాయాల నుంచి పుట్టిన ఈ ప్రశ్నలకు.. మనందరి ప్రభుత్వంలో.. గత మూడేళ్ల పాలనతో సాధ్యమైనంత మేరకు శక్తి వంచన లేకుండా సమాధానం ఇవ్వగలిగామని సగర్వంగా తెలుపుతున్నాను. పౌర సేవల్లో విప్లవాత్మక మార్పులు మన గ్రామానికి, మన నగరానికి అందే పౌరసేవల్లో మార్పులు తీసుకువచ్చాం. ఒకటవ తేదీన సూర్యోదయానికి ముందే అవ్వాతాతలు, వికలాంగులు, వితంతువుల పింఛన్లు వారి తలుపు తట్టి చిరునవ్వుతో గుడ్ మార్నింగ్ చెప్పి మరీ ఒక్క రూపాయి కూడా లంచం తీసుకోకుండా 2.70 లక్షల మంది వలంటీర్లు ఇంటికి వచ్చి ఇచ్చి వెళ్లే వ్యవస్థ ఏర్పాటు చేశాం. ప్రతి 2000 మందికి పౌర సేవలందించేలా గ్రామ/వార్డు సచివాలయం, అక్కడి నుంచి నాలుగు అడుగులు వేస్తే రైతులకు విత్తనం నుంచి పంట అమ్మకం వరకు అన్ని విధాలా సహాయం చేసే రైతు భరోసా కేంద్రాలు, మరో నాలుగు అడుగుల్లో కనిపించే వైఎస్సార్ విలేజ్ క్లినిక్‌లు, ఇంకో నాలుగు అడుగులు వేస్తే కనిపించే ఇంగ్లిష్ మీడియం స్కూల్, మరో నాలుగు అడుగుల దూరంలోనే మీ గ్రామంలోనే నిర్మాణం కాబోతున్న డిజిటల్ గ్రంథాలయాలు, మరో నాలుగు అడుగుల దూరంలో ఇంగ్లిష్‌లో బోధించే ప్రీ ప్రైమరీలు, ఫౌండేషన్ స్కూళ్లు, ప్రతి మండలానికీ ఒక అధునాతన 108, ప్రతి మండలానికి రెండు పీహెచ్‌సీలు, ప్రతి పీహెచ్సీకీ ఒక అధునాతన 104.. అందులో ఇద్దరు డాక్టర్లను పెట్టి వారిని విలేజ్ క్లినిక్‌తో అనుసంధానించి అమలు కానున్న ఫ్యామిలీ డాక్టర్ కాన్సెప్ట్.. ఇవన్నీ గడచిన 75 ఏళ్లలో కాదు.. కేవలం ఈ మూడేళ్లలో మనం తీసుకొచ్చిన మార్పులు. పరిపాలన వికేంద్రీకరణే మా విధానం ప్రజలకు పరిపాలనను మరింత చేరువ చేస్తూ, పర్యవేక్షణను మెరుగుపరుçస్తూ.. గ్రామాలూ, నగరాల్లో మార్పులే కాక, గత ఏడాది వరకు కేవలం 13 జిల్లాలుంటే మరో 13 జిల్లాల ఏర్పాటు ద్వారా పరిపాలన వికేంద్రీకరణలో మరో అధ్యాయాన్ని ఆరంభించాం. రాజధాని స్థాయిలో పరిపాలన వికేంద్రీకరణే మా విధానం అని.. ప్రాంతీయ ఆకాంక్షలకు, ప్రాంతాల ఆత్మగౌరవానికి, అన్ని ప్రాంతాల మధ్య సమతౌల్యంతోపాటు పటిష్ట బంధానికి ఇదే పునాది అని గట్టిగా నమ్మి అడుగులు వేస్తున్నాం. ఇదీ.. మూడేళ్లలోనే మనందరి ప్రభుత్వం మనసు పెట్టి తీసుకువచ్చిన మార్పు. వ్యవసాయానికి రూ.1.27 లక్షల కోట్ల సాయం వైఎస్సార్ రైతు భరోసాతో ఏకంగా 52 లక్షల రైతు కుటుంబాలకు ఏటా రూ.13,500 చొప్పున సహాయం అందిస్తున్నాం. రైతు భరోసా కేంద్రాలను గ్రామస్థాయిలో తీసుకువచ్చి ఈ–క్రాప్ మొదలు, ఉచిత పంటల బీమా, ఏ సీజన్లో నష్టాన్ని ఆ సీజన్ ముగిసేలోగానే అంచనా వేసి ఇన్పుట్ సబ్సిడీ అందించటం, సున్నా వడ్డీ పంట రుణాలు, పగటిపూటే 9 గంటలు నాణ్యమైన ఉచిత విద్యుత్తు వంటివి అందిస్తూ మూడేళ్లలో రైతు ప్రభుత్వంగా రైతు సంక్షేమానికి మనం చేసిన ఖర్చు ఏకంగా రూ.83 వేల కోట్లు. ఇది కాకుండా ధాన్యం సేకరణకు మరో రూ. 44 వేల కోట్లకు పైగానే ఖర్చు చేసి గిట్టుబాటు ధర కల్పించాం. మొత్తంగా మూడేళ్లలో ఏకంగా రూ. 1.27 లక్షల కోట్లను వ్యవసాయంపై ఖర్చు చేశాం. దీని ఫలితంగా అంతకుముందు ఐదేళ్ల పాలనతో పోలిస్తే మన మూడేళ్ల పాలనలో ఆహార ధాన్యాల ఉత్పత్తి సగటున ఏటా 16 లక్షల టన్నులు పెరిగింది. ఇది మన ప్రభుత్వం వ్యవసాయంలో వేసిన ముందడుగు. అక్కచెల్లెమ్మలకు రూ.2–3 లక్షల కోట్ల ఆస్తి 75 ఏళ్ల స్వాతంత్య్రం తరవాత మూడేళ్ల క్రితం శాచురేషన్ పద్ధతిలో పేదలకు ఇళ్ల పట్టాలు ఇవ్వాలని మన ప్రభుత్వం దరఖాస్తులు ఆహ్వానించింది. ఇందులో ఏకంగా 31 లక్షల కుటుంబాలకు అంటే దాదాపు 1.25 కోట్ల జనాభాకు సొంత ఇల్లు లేదని తేలింది. వీరందరికీ ఇప్పటికే ఇళ్ళ పట్టాలు ఇచ్చాం. అది కూడా ఆ కుటుంబంలో అక్కచెల్లెమ్మల పేరు మీద రిజిస్టర్ చేశాం. ఇందులో 21 లక్షల ఇళ్లు వివిధ దశల్లో నిర్మాణంలో ఉన్నాయి. ఇవి పూర్తయితే ఒక్కో ఇంటి విలువ కనీసం రూ.7 లక్షల నుంచి రూ. 10 లక్షలు వేసుకుంటే.. 31 లక్షల మంది అక్కచెల్లెమ్మల చేతుల్లో అక్షరాలా దాదాపుగా రూ. 2 లక్షల కోట్ల నుంచి రూ.3 లక్షల కోట్ల సంపదను ఉంచుతున్నాం. ఇదీ రాష్ట్ర ప్రభుత్వం అక్కచెల్లెమ్మలకు ఇస్తున్న కానుక. పిల్లల చదువులతో పేదల తలరాతల మార్పు పిల్లల చదువులతోనే ఇంటింటా పేదల తలరాతలు మార్చాలని, వారి ఇంట వెలుగులు నింపాలనే మంచి సంకల్పంతో, రూపం మార్చుకున్న అంటరానితనాన్ని తుదముట్టించాలన్న నిశ్చయంతో.. నా ఎస్సీ, నా ఎస్టీ, నా బీసీ, నా మైనార్టీలు ఎప్పటికీ పనివాళ్లుగా మిగిలిపోవాలనే పెత్తందారీ పోకడల నడ్డివిరుస్తూ గవర్నమెంటు బడులన్నింటిలో ఇంగ్లి్ష్ మీడియంను అమలు చేయాలని నిర్ణయించాం. దీనితోపాటు పిల్లలను చదివించే తల్లులకు అండగా, తోడుగా నిలుస్తూ దేశంలోనే ఎక్కడా లేనివిధంగా జగనన్న అమ్మ ఒడి పథకాన్ని తొలిసారిగా అమలు చేస్తున్నాం. ఇవి కాకుండా వైఎస్సార్ సంపూర్ణ పోషణ, జగనన్న గోరుముద్ద, జగనన్న విద్యా కానుక, మనబడి–నాడు నేడు, సీబీఎస్ఈ సిలబస్, బైజూస్ సంస్థతో ఒప్పందం, 8వ తరగతి పిల్లలకు ట్యాబ్స్, జగనన్న విద్యా దీవెన, జగనన్న వసతి దీవెన.. ఇన్ని పథకాలతో విద్యారంగంలో తీసుకు వస్తున్న ప్రతి మార్పు వెనకా మన రాష్ట్రంలోని పిల్లలందరి భవిష్యత్తుపై మనందరి ప్రభుత్వం తీసుకున్న బాధ్యత కనిపిస్తుంది. ఇందుకోసం మూడేళ్లలో విద్యారంగంపై ఏకంగా రూ. 53 వేల కోట్లకు పైనే వ్యయం చేశాం. 95 శాతం ప్రజలకు ఆరోగ్యశ్రీతో భరోసా వార్షిక ఆదాయం రూ.5 లక్షలలోపు ఉన్నవారందరికీ వైఎస్సార్ ఆరోగ్యశ్రీ వర్తింపజేయటం ద్వారా 95 శాతం ప్రజలకు ఆరోగ్యశ్రీ ఇస్తున్నాం. రూ. వెయ్యి ఖర్చు దాటితే ఉచితంగా వైద్యం అందించాలన్న తపనతోనే 2,434 ప్రొసీజర్లను ఆరోగ్యశ్రీలో చేర్చాం. వీటిని ఈ నెలలోగా 3,133కు పెంచుతున్నాం. ఆపరేషన్ తర్వాత రోగులు కోలుకునే సమయంలో వారికి దన్నుగా నెలకు రూ.5 వేలు వైఎస్సార్ ఆరోగ్య ఆసరాగా ఇస్తున్నాం. ఎమర్జెన్సీలో ప్రాణాలు రక్షించే 108, 104 సేవలకు అర్థం చెపుతూ ఏకంగా 1,088 వాహనాల్ని ప్రతి మండలానికీ పంపాం. వీటిని మరింతగా పెంచుతూ మరో 432 వాహనాలను పంపనున్నాం. గ్రామగ్రామానా వైఎస్సార్ విలేజ్ క్లినిక్‌లు ఏర్పాటవుతున్నాయి. వీటితో పీహెచ్‌సీలు అనుసంధానమై గ్రామాల్లో ఫ్యామిలీ డాక్టర్ కాన్సెప్ట్‌కు బీజం పడనుంది. రాష్ట్రంలో ఇప్పటివరకు 11 టీచింగ్ ఆస్పత్రులు ఉంటే, కొత్తగా మరో 16 వైద్య బోధనాస్పత్రులను నిర్మిస్తున్నాం. గ్రామం నుంచి జిల్లా వరకు ఆసుపత్రుల రూపాన్ని, సేవల్ని, సదుపాయాల్ని మార్చేస్తూ.. జాతీయ ప్రమాణాలతో వైద్యాన్ని అందించటానికి వైద్య రంగంలో రూ.16వేల కోట్లతో నాడు–నేడు అమలు చేస్తున్నాం. ఈ ఒక్క రంగంలోనే అక్షరాలా 40 వేల కొత్త ఉద్యోగాలు ఇచ్చాం. మూడేళ్లలో 6.03 లక్షల మందికి ఉద్యోగాలు ఒకవైపు ప్రభుత్వ బడుల్ని, మరో వైపు ప్రభుత్వ ఆస్పత్రుల్ని మెరుగుపరచడమే కాకుండా ఈ మూడేళ్లలోనే మొత్తంగా 6.03 లక్షల మందికి ఉద్యోగాలు ఇచ్చాం. ఇందులో 1.84 లక్షల శాశ్వత ప్రభుత్వోద్యోగాలతోపాటు, 20 వేల కాంట్రాక్టు ఉద్యోగాలు, 4 లక్షల ఔట్ సోర్సింగ్ ఉద్యోగాలు కల్పించాం. వీరంతా మన కళ్ల ఎదుటే గ్రామ/వార్డు సచివాలయాల్లో, గ్రామాల్లో వలంటీర్లుగా, ఆర్టీసీలో, మారుతున్న ప్రభుత్వ ఆస్పత్రుల్లో కనిపిస్తారు. పారిశ్రామిక రంగానికి ఊతం దాదాపు నాలుగు దశాబ్దాల తరవాత ప్రభుత్వ రంగంలో మరో నాలుగు సీ పోర్టులు, 9 ఫిషింగ్ హార్బర్లు నిర్మిస్తున్నాం. సువిశాల సముద్ర తీరంలో ప్రతి 50 కిలోమీటర్లకు ఒక సీ పోర్టు, ఫిషింగ్ హార్బర్ ఉండేలా చర్యలు తీసుకుంటున్నాం. కుదేలైన ఎంఎస్ఎంఈ రంగాన్ని నిలబెడుతూ 10లక్షల మంది ఉపాధికి భరోసానిస్తూ అడుగులు ముందుకు వేస్తున్నాం. ఏపీ నుంచే 21వ శతాబ్దపు ఆధునిక మహిళ 21వ శతాబ్దపు ఆధునిక భారతీయ మహిళ ఆంధ్రప్రదేశ్‌లోనే ఆవిర్భవించాలన్న లక్ష్యంతో మహిళా సాధికారతలో దేశంలో ఏ ప్రభుత్వం వేయని అడుగులు వేస్తున్నాం. 44.5 లక్షల తల్లులకు, 85 లక్షల పిల్లలకు మంచి జరిగేలా మూడేళ్లలో జగనన్న అమ్మ ఒడి ద్వారా రూ.19,618 కోట్లు, వైఎస్సార్ ఆసరా ద్వారా 78.74 లక్షల డ్వాక్రా పొదుపు సంఘాల అక్కచెల్లెమ్మలకు రూ. 12,758 కోట్లు, వైఎస్సార్ సున్నా వడ్డీ ద్వారా కోటీ రెండు లక్షల మంది అక్కచెల్లెమ్మలకు రూ.3,615 కోట్లు అందించాం. వైఎస్సార్ చేయూత ద్వారా 24.96 లక్షల మంది 45–60 మధ్య వయసున్న నా ఎస్సీ, నా ఎస్టీ, నా బీసీ, నా మైనార్టీ అక్కచెల్లెమ్మలకు ఇప్పటికే రూ. 9,180 కోట్ల లబ్ధి చేకూర్చాం. వైఎస్సార్ కాపు నేస్తం ద్వారా మరో రూ. 1,492 కోట్లు, వైఎస్సార్ ఈబీసీ నేస్తం ద్వారా రూ.589 కోట్లతో తోడ్పాటునందించాం. ఈ సొమ్ముకు బ్యాంకుల ద్వారా మరింత రుణ సదుపాయంతో, ప్రముఖ కార్పొరేట్ సంస్థల భాగస్వామ్యంతో అక్కచెల్లెమ్మల ఆర్థిక స్వావలంబనకు చేయూత ఇస్తున్నాం. అక్కచెల్లెమ్మలకు దన్నుగా నిలిచాం అక్కచెల్లెమ్మలకు ఆలయ బోర్డుల నుంచి వ్యవసాయ మార్కెటింగ్ కమిటీల వరకు ప్రభుత్వ కార్పొరేషన్ల చైర్మన్లు, డైరెక్టర్ల వరకు ప్రతి ఒక్క రాజకీయ నియామకంలోనూ, నామినేషన్ కాంట్రాక్టుల్లోను 50 శాతం రిజర్వేషన్లు చట్టం చేసి మరీ అమలు చేసిన ప్రభుత్వం కూడా భారతదేశ చరిత్రలో మనం మాత్రమే. దిశ చట్టానికి రూప కల్పన, దిశ యాప్, దిశ పోలీస్ స్టేషన్ల ఏర్పాటు, ప్రత్యేక పబ్లిక్ ప్రాసిక్యూటర్ల నియామకం, ప్రతి రెండు వేల జనాభాకూ గ్రామంలోనే ఒక మహిళా పోలీస్ నియామకం.. ఇవన్నీ మహిళా రక్షణపరంగా మనందరి ప్రభుత్వం తీసుకున్న విప్లవాత్మక చర్యలు. సామాజిక న్యాయ చరిత్రలో సరికొత్త అధ్యాయం మొదటి విడత 56 శాతం, రెండో విడతలో 70 శాతం మంత్రిమండలి పదవులు ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలకు ఇచ్చాం. రెండు మంత్రివర్గాల్లోనూ ఐదుగురికి డిప్యూటీ సీఎం పదవులు ఇస్తే.. నాలుగు(80శాతం) నా ఎస్సీ, నా ఎస్టీ, నా బీసీ, నా మైనార్టీలకే అవకాశం కల్పించాం. శాసనసభ స్పీకర్‌గా ఒక బీసీ, శాసన మండలి చైర్మన్‌గా ఎస్సీని నియమించడమే కాకుండా శాసన మండలి డిప్యూటీ ౖచైర్పర్సన్గా మైనార్టీ అక్కకు స్థానం ఇచ్చి సామాజిక న్యాయ చరిత్రలో సరికొత్త అధ్యాయం సృష్టించాం. ఈ మూడేళ్లలో రాజ్యసభకు 8 మందిని పంపిస్తే అందులో నలుగురు బీసీలు, శాసన మండలికి అధికారపార్టీ నుంచి పంపిన 32 మందిలో 18 మంది ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాల వారే. పరిషత్ ఎన్నికల్లో 13కు 13 జిల్లా పరిషత్‌లను అధికారపార్టీ దక్కించుకుంటే వీటిలో చైర్పర్సన్ పదవుల్లో ఏకంగా తొమ్మిది (70శాతం) ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకే కేటాయించాం. నామినేటెడ్ పదవులు, నామినేటెడ్ పనుల్లో 50 శాతం ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకే రిజర్వేషన్లు కల్పిస్తూ చట్టం చేసి అమలు చేసిన తొలి ప్రభుత్వం కూడా మనదే. అందులోనూ 50 శాతం మహిళలకు రిజర్వేషన్ కల్పించిన మొదటి ప్రభుత్వం కూడా మనదే. వివిధ ప్రభుత్వ కార్పొరేషన్లలో 137 చైర్మన్ పదవుల్లో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు మొత్తం 58 శాతం పదవులు ఇచ్చాం. బీసీలకు ప్రత్యేకంగా 56 కార్పొరేషన్లు, ఎస్సీలకు 3 కార్పొరేషన్లు, ఎస్టీలకు ఒక కార్పొరేషన్‌ను నూతనంగా ఏర్పాటు చేశాం. వీటితోపాటు శాశ్వత ప్రాతిపదికన బీసీ కమిషన్‌ను నియమించిన ఘనత, 139 బీసీ కులాలకు సంబంధించి కొత్తగా 56 కార్పొరేషన్లు ఏర్పాటు చేసిన తొలి ప్రభుత్వం కూడా మనదే. మండల పరిషత్ చైర్మన్, ఎంపీటీసీ, జెడ్పీటీసీ, సర్పంచ్‌లు ఇలా ఎక్కడ చూసినా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలే ఎక్కువగా కనిపిస్తున్నారన్నది సత్యం. 95 శాతం హామీలు అమలు మేనిఫెస్టోను భగవద్గీత, ఖురాన్, బైబిల్‌గా భావించి మూడేళ్లలోనే 95 శాతం వాగ్దానాలు అమలు చేశాం. పేదవాడి ఆర్తిని, అవసరాన్ని దృష్టిలో పెట్టుకుని నిర్ణయాలు తీసుకున్నాం. ఈ దేశంలోని అత్యంత నిస్సహాయుడి కంటిలో నీరు తుడవటానికి మన ప్రభుత్వాలు, వాటి అధికారం ఉపయోగపడాలన్న మహాత్ముడి మాటల్ని తొలి స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలో తొలి ప్రధాని జవహర్లాల్ నెహ్రూ ఉటంకించారు. ఈ భావాలను మనసా వాచా కర్మణా.. త్రికరణ శుద్ధిగా అమలు చేస్తున్నాం. ప్రజాస్వామ్యానికి అర్థం చెబుతూ ప్రజలతోపాటు ప్రాంతాలకూ న్యాయం చేస్తూ గడపగడపకూ సంక్షేమం, అభివృద్ధి ఫలాలను అందిస్తూ మన సమాజంలో వెనుకబాటు, నిరక్షరాస్యత, సామాజిక అభద్రత, రాజకీయ అణచివేత, ఆర్థిక అవకాశాల లేమి వంటి ప్రతి అంశంపై సంపూర్ణమైన విజయం సాధించే దిశగా భావపరమైన పోరాటం కొనసాగుతుంది. గొప్పదైన ఈ దేశానికి, దేశ ప్రజలకు ప్రణామాలు సమర్పించుకుంటూ, దేవుడి ఆశీస్సులు, ప్రజలందరి చల్లని దీవెనలు మనందరి ప్రభుత్వానికీ కలకాలం ఉండాలి. ఈ కార్యక్రమానికి శాసనమండలి చైర్మన్ కె మోషేన్‌రాజు, శాసనసభ స్పీకర్ తమ్మినేని సీతారాం, రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సమీర్ శర్మ, డీజీపీ కేవీ రాజేంద్రనాథ్‌రెడ్డి, పలువురు ప్రజా ప్రతినిధులు, ఉన్నతాధికారులు హాజరయ్యారు. స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలకు ముఖ్యమంత్రి సతీమణి వైఎస్ భారతిరెడ్డి కూడా హాజరయ్యారు. -
సుసంపన్న భారతం.. పాతికేళ్ల లక్ష్యం.. పంచ ప్రతిజ్ఞలతో సాకారం
న్యూఢిల్లీ: అమృతోత్సవ సంబరాల్లో ఆసేతుహిమాచలం తడిసి ముద్దయింది. ఏ ఇంటిపై చూసినా త్రివర్ణ పతాక రెపరెపలే కన్పించాయి. ఎక్కడ చూసినా స్వాతంత్య్ర స్ఫూర్తి వెల్లివిరిసింది. 76వ స్వాతంత్య్ర దినాన్ని సోమవారం దేశమంతా ఘనంగా జరుపుకుంది. ఢిల్లీలో ఎర్రకోటపై ప్రధాని, రాష్ట్రాల రాజధానుల్లో ముఖ్యమంత్రులు జెండా ఎగురవేశారు. ప్రభుత్వ, ప్రైవేటు కార్యాలయాలు, విద్యా సంస్థలు సర్వత్రా మువ్వన్నెల జెండా సగర్వంగా ఎగిరింది. చిన్నా పెద్దా అంతా ఉత్సవాల్లో పాల్గొని జోష్ పెంచారు. జెండాలు చేబూని ర్యాలీలు, ప్రదర్శనలతో అలరించారు. వలస పాలనను అంతం చేసేందుకు అమర వీరులు చేసిన అపూర్వ త్యాగాలను మనసారా స్మరించుకున్నారు. దేశాభివృద్ధికి, జాతి నిర్మాణానికి పునరంకితమవుతామంటూ ప్రతిజ్ఞ చేశారు. భారత నౌకా దళం ఆరు ఖండాల్లో పంద్రాగస్టు వేడుకలు జరిపి దేశవాసుల్లో ఉత్సాహాన్ని మరింత పెంచింది. ‘అమృతోత్సవ భారతం ఇక అతి పెద్ద లక్ష్యాలనే నిర్దేశించుకోవాలి. రానున్న పాతికేళ్లలో అభివృద్ధి చెందిన దేశంగా ఎదిగేందుకు సంకల్పించుకోవాలి’ అని ప్రధాని నరేంద్ర మోదీ ఆకాంక్షించారు. ఇందుకు పంచ ప్రతిజ్ఞలు చేసుకుందామంటూ పిలుపునిచ్చారు. ‘మన ఘన వారసత్వం, తిరుగులేని ఐక్యతా శక్తి, సమగ్రత పట్ల గర్వపడదాం. ప్రధాని, ముఖ్యమంత్రులు మొదలుకుని సామాన్యుల దాకా పూర్తి చిత్తశుద్ధితో బాధ్యతలను నెరవేరుద్దాం. తద్వారా వందేళ్ల వేడుకల నాటికి భారత్‌ను అభివృద్ధి చెందిన దేశంగా తీర్చిదిద్దుకుందాం’’ అని ప్రజలను కోరారు. ‘‘అవినీతి, బంధుప్రీతి జాతిని పట్టి పీడిస్తున్నాయి. వారసత్వ పోకడలు దేశం ముందున్న మరో అతి పెద్ద సవాలు. రాజకీయాలతో పాటు అన్ని రంగాల్లోనూ తిష్ట వేసిన ఈ అతి పెద్ద జాఢ్యాల బారినుంచి దేశాన్ని విముక్తం చేయాల్సిన సమయమిదే’ అన్నారు. 76వ స్వాతంత్య్ర దినం సందర్భంగా సోమవారం ఉదయం ఢిల్లీలోని చారిత్రక ఎర్రకోటపై మోదీ త్రివర్ణ పతాకాన్ని ఎగురవేశారు. ఈ సందర్భంగా సంప్రదాయ కుర్తా, చుడీదార్, బ్లూ జాకెట్, త్రివర్ణాల మేళవింపుతో కూడిన అందమైన తలపాగా ధరించారు. అనంతరం పూర్తిగా దేశీయంగా తయారు చేసిన ఏటీఏజీఎస్ శతఘ్నుల ‘21 గన్ సెల్యూట్’ నడుమ జాతీయ జెండాకు వందనం చేశారు. ప్రధానిగా పంద్రాగస్టున ఆయన పతాకావిష్కరణ చేయడం ఇది వరుసగా తొమ్మిదోసారి. అనంతరం గాంధీ మొదలుకుని అల్లూరి దాకా దేశ స్వాతంత్య్రం కోసం పోరాడిన యోధులందరికీ పేరుపేరునా ఘన నివాళులర్పించారు. తర్వాత జాతినుద్దేశించి 82 నిమిషాల పాటు ప్రసంగించారు. గత ప్రసంగాల్లా ఈసారి కొత్త పథకాలేవీ ప్రధాని ప్రకటించలేదు. దోచిందంతా కక్కిస్తాం ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ వంటి కేంద్ర దర్యాప్తు సంస్థలను రాజకీయ కక్షసాధింపు కోసం కేంద్రం వాడుకుంటోందన్న విపక్షాల విమర్శలను మోదీ తిప్పికొట్టారు. ‘ఒకవైపు దేశంలో కోట్లాది మందికి తలదాచుకునే నీడ లేదు. మరోవైపు కొందరు మాత్రం దాచుకోవడానికి ఎంతటి చోటూ చాలనంతగా అక్రమార్జనకు పాల్పడ్డ తీరును ప్రజలంతా ఇటీవల కళ్లారా చూశారు’ అంటూ విపక్ష నేతలు తదితరుల నివాసాలపై ఈడీ, ఐటీ దాడుల్లో భారీ నగదు బయట పడుతుండటాన్ని ప్రస్తావించారు. ‘అవినీతిని సంపూర్ణంగా ద్వేషిస్తే తప్ప ఇలాంటి ధోరణి మారదు. అవినీతిని, అవినీతిపరులను సమాజమంతా అసహ్యించుకోవాలి’ అని పిలుపునిచ్చారు. ‘గత ఎనిమిదేళ్లలో రూ.2 లక్షల కోట్ల నల్ల ధనాన్ని వెలికితీసి ప్రత్యక్ష పథకాల ద్వారా నగదు రూపేణా బదిలీ చేసి దేశాభివృద్ధికి పెట్టుబడిగా పెట్టాం. బ్యాంకులను దోచి దేశం వీడి పారిపోయిన వారిని వెనక్కు రప్పించే పనిలో ఉన్నాం. వారి ఆస్తులను ఇప్పటికే జప్తు చేశాం. దేశాన్ని దోచుకున్న వాళ్లనుంచి అంతకంతా కక్కించి తీరతాం. అందుకు రంగం సిద్ధం చేస్తున్నాం. వాళ్లెంత పెద్దవాళ్లయినా సరే, తప్పించుకోలేరు’’ అని హెచ్చరించారు. ‘దేశ నైపుణ్యానికి, సామర్థ్యానికి బంధుప్రీతి తీరని హాని చేస్తోంది. దేశ ఉజ్వల భవిత కోసం దీనికి అడ్డుకట్ట వేయాల్సిందే. దీన్ని నా ప్రజాస్వామిక, రాజ్యాంగపరమైన బాధ్యతగా కూడా భావిస్తా. రాజకీయాల్లో కూడా వారసత్వాలు దేశ సామర్థ్యాన్ని ఎంతగానో కుంగదీశాయి. వారసత్వ రాజకీయాలకు పాల్పడే వారికి కుటుంబ క్షేమమే పరమావధి. దేశ సంక్షేమం అసలే పట్టదు’’ అంటూ దుయ్యబట్టారు. రాజకీయాలను, వ్యవస్థలను పరిశుభ్రం చేసి దేశాన్ని ముందుకు తీసుకెళ్లేందుకు ప్రజలంతా తనతో చేతులు కలపాలన్నారు. అలసత్వం అసలే వద్దు స్వాతంత్య్రం సిద్ధించిన ఈ 75 ఏళ్లలో ఎంతో సాధించేశామన్న అలసత్వానికి అస్సలు తావీయొద్దని ప్రధాని అన్నారు. ‘‘మన వ్యక్తిగత కలలను, ఆకాంక్షలను, సామాజిక లక్ష్యాలను నెరవేర్చుకునేందుకు వచ్చే పాతికేళ్ల కాలం సువర్ణావకాశం. స్వతంత్య్ర యోధుల కలలను సాకారం చేసేందుకు కంకణబద్ధులవుదాం. స్వాతంత్య్ర ఫలాలను, అధికార ప్రయోజనాలను చిట్టచివరి నిరుపేదకు కూడా సంపూర్ణంగా అందించాలన్న మహాత్ముని ఆకాంక్షను నెరవేర్చేందుకు నేను కట్టుబడ్డా’’ అని చెప్పారు. సమాఖ్య భావనకే పెద్దపీట బీజేపీ ప్రభుత్వం రాష్ట్రాలను బలహీన పరుస్తోందన్న విమర్శలను మోదీ తిప్పికొట్టారు. ‘‘కేంద్ర రాష్ట్రాలు కలసికట్టుగా పని చేయాలనే సహకారాత్మక సమాఖ్య భావనను, ‘టీమిండియా’ స్ఫూర్తిని నేను సంపూర్ణంగా నమ్ముతానన్నారు. కేంద్రంలో కాంగ్రెస్ అధికారంలో ఉన్న సమయంలో గుజరాత్ సీఎంగా దాన్ని ఆచరణలో చూపించా’’నని చెప్పారు. దేశాన్ని కలసికట్టుగా అభివృద్ధి చేద్దామని విపక్షాలకు పిలుపునిచ్చారు. ఈ విషయంలో పోటీపడదామని సూచించారు. త్వరలో 5జీ సేవలు ఇది టెక్నాలజీ దశాబ్ది. ఈ రంగంలో సర్వతోముఖాభివృద్ధి సాధిస్తూ ప్రపంచ సారథిగా ఎదుగుతున్నాం. 5జీ మొబైల్ సేవలు అందుబాటులోకి రానున్నాయి. ఊరూరికీ ఆప్టికల్ ఫైబర్ కేబుల్, కామన్ సర్వీసెస్ సెంటర్లు అందనున్నాయి. కొత్త పారిశ్రామిక వృద్ధి విప్లవం మారుమూలల్లోంచే రానుంది. విద్య, వైద్య సేవల్లో డిజిటల్ మాధ్యమం విప్లవాత్మక మార్పులు తేనుంది. పరిశోధన, నవకల్పనలే అజెండాగా ‘జై అనుసంధాన్’కు సమయమిదే. ప్రపంచ డిజిటల్ పేమెంట్లలో 40 శాతం వాటా మనదే. యూపీఐల విస్తృతే అందుకు కారణం. మిషన్ హైడ్రోజన్, సౌర శక్తిని అందిపుచ్చుకోవడం తదితరాల ద్వారా ఇంధన రంగంలో స్వావలంబన సాధిద్దాం. క్రమశిక్షణ, జవాబుదారీతనమే విజయానికి మూలసూత్రాలు. సేంద్రియ సాగుకు జై కొడదాం. రక్షణరంగం సూపర్ మేకిన్ ఇండియా, ఆత్మనిర్భరత లక్ష్యాల సాధనకు రక్షణ బలగాలు ఎంతగానో పాటుపడుతున్నాయి. ఫలితంగా బ్రహ్మోస్ వంటి సూపర్సోనిక్ క్షిపణులను దేశీయంగా తయారు చేసి ఎగుమతి చేసే స్థాయికి చేరాం. ఇందుకు మన సైనికులకు మనస్ఫూర్తిగా అభినందనలు. ఎలక్టాన్రిక్ వస్తువులు మొదలుకుని అత్యాధునిక క్షిపణుల దాకా తయారు చేసే హబ్‌గా భారత్ మారుతోంది. విదేశీ బొమ్మలొద్దని, దేశీయ ఆట బొమ్మలతోనే ఆడుకుంటామని తమ పిల్లలంటున్నారని ఎంతోమంది తల్లిదండ్రులు చెబుతుంటే విని పులకించిపోతున్నా. ఆ ఐదారేళ్ల చిన్నారులకు నా సెల్యూట్. ఆత్మనిర్భర్ భారత్ స్ఫూర్తికిది తిరుగులేని సంకేతం. మహిళలే వృద్ధికి మూలం ప్రజాస్వామ్యాలన్నింటికీ మాతృక మన దేశమే. భిన్నత్వంలో ఏకత్వమే మన మూల బలం. అంతటి కీలకమైన ఐక్యతను సాధించాలంటే లింగ సమానత్వం అత్యంత కీలకం. మహిళలను అవమానించే ధోరణి మనలో అప్పుడప్పుడూ తొంగి చూస్తుండటం దురదృష్టకరం. ఈ జాఢ్యాన్ని మనలోంచి పూర్తిగా పారదోలుతామంటూ ప్రతినబూనుదాం. మాటల్లో గానీ, చేతల్లో గానీ మహిళల ఔన్నత్యాన్ని కించపరచొద్దు. కొడుకును, కూతురినీ సమానంగా చూడటం ద్వారా ఇందుకు ఇంట్లోనే పునాది పడాలి. ఎందుకంటే మన కుటుంబ వ్యవస్థ ప్రపంచానికే ఆదర్శం. స్త్రీలను గౌరవించడం మన దేశ వృద్ధికి ముఖ్యమైన మూల స్తంభమని గుర్తుంచుకోవాలి. మెరిసిన ఎర్రకోట పంద్రాగస్టు వేడుకల సందర్భంగా మువ్వన్నెల అలంకరణలతో ఎర్రకోట మెరిసిపోయింది. స్వాతంత్య్ర పోరాటంలోని కీలక ఘట్టాలకు సంబంధించిన చిత్రాలు కోట గోడలపై కనువిందు చేశాయి. కోట ప్రాంగణం, పరిసరాల్లో అత్యంత కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు. చదవండి: సంక్షేమ తెలంగాణం.. ఎన్నో పథకాల్లో దేశానికే ఆదర్శం -
త్వరలో ఆర్టీసీ ఉద్యోగులకు డీఏ
సాక్షి, హైదరాబాద్: ఆర్టీసీ కార్మికులకు యాజమాన్యం పద్రాగస్టు రోజున తీపి కబురు చెప్పింది. పెండింగ్‌లో ఉన్న డీఏను త్వరలో అందజేయనున్నట్లు ఆర్టీసీ చైర్మన్ బాజిరెడ్డి గోవర్ధన్‌రెడ్డి తెలిపారు. సోమవారం బస్‌భవన్‌లో జరిగిన స్వాతంత్య్ర దినోత్సవంలో ఆయన ఈ విషయాన్ని వెల్లడించారు. సెప్టెంబర్ నెల జీతభత్యాలతో పాటు డీఏను కూడా అందజేయనున్నట్లు పేర్కొన్నారు. ఉద్యోగులకు చెల్లించవలసిన రూ.వెయ్యి కోట్ల బకాయీలను కూడా అందజేయనున్నట్లు చెప్పారు. స్వాతంత్య్ర వజ్రోత్సవాలను బస్‌భవన్‌లో ఘనంగా నిర్వహించారు. సంస్థ ఎండీ సజ్జనార్, ఉన్నతాధికారులు, ఉద్యోగులు, కండక్టర్లు, డ్రైవర్లు ఈ వేడుకలలో పాల్గొన్నారు. గ్రేటర్లో అల్బియాన్ బస్సు.. డెక్కన్ క్వీన్‌గా పేరొందిన 1932 నాటి అల్బియాన్ బస్సును హైదరా బాద్‌లోని ప్రధాన రోడ్లపై ప్రదర్శించనున్నట్లు చైర్మన్ బాజిరెడ్డి తెలిపారు. అలాగే ఈ బస్సు విశేషాలను ముఖ్యమంత్రి కేసీఆర్, మంత్రి కేటీఆర్‌లకు తెలియజేయనున్నట్లు చెప్పారు. మరోవైపు ఆర్టీసీలో బీడబ్ల్యూఎస్ పథకం ద్వారా ఉద్యోగాలను భర్తీ చేయనున్నట్లు ఆయన వివరించారు. త్వరలో 300 ఎలక్ట్రిక్ బస్సులను ప్రవేశపెట్టనున్నట్లు తెలిపారు. ఘన సన్మానం.. ఈ వేడుకలలో భాగంగా నిజాం ప్రభుత్వ రోడ్డు రవాణా విభాగంలో పని చేసిన నరసింహ (97), ఎం.సత్తయ్య (92)లను ఆర్టీసీ ఘనంగా సన్మానించింది. తమను గుర్తించి సన్మానించడంపై వారు సంతోషం వ్యక్తం చేశారు. ఇది ఆర్టీసీ నుంచి లభించిన గొప్ప గౌరవంగా భావిస్తున్నట్లు పేర్కొన్నారు.