ఏర్పాట్లపై సమీక్షిస్తున్న ఎమ్మెల్సీ తలశిల, ఎమ్మెల్యే విష్ణు, కలెక్టర్ ఢిల్లీరావు, సీపీ రాణా తదితరులు
సాక్షి ప్రతినిధి, విజయవాడ: ఎన్టీఆర్ జిల్లా విజయవాడలోని ఇందిరాగాంధీ మునిసిపల్ స్టేడియం 75వ స్వాతంత్య్ర దినోత్సవాలకు ముస్తాబవుతోంది. ముఖ్యమంత్రి సీఎం వైఎస్ జగన్ కార్యక్రమాల కోఆర్డినేటర్, ఎమ్మెల్సీ తలశిల రఘురామ్, సెంట్రల్ ఎమ్మెల్యే మల్లాది విష్ణు, ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ ఎస్.ఢిల్లీరావు, నగర పోలీస్ కమిషనర్ టీకే రాణా, జాయింట్ కలెక్టర్ నుపూర్ అజయ్‌లు బుధవారం ఈ వేడుకల ఏర్పాట్లను పరిశీలించి పలు సూచనలు చేశారు.
తలశిల మాట్లాడుతూ వేడుకలను అత్యంత ఘనంగా నిర్వహించేందుకు సన్నాహాలు చేస్తున్నట్టు తెలిపారు. వీటిని తిలకించేందుకు ఈ ఏడాది సామాన్య ప్రజలకూ అనుమతిస్తున్నట్టు చెప్పారు. కలెక్టర్ మాట్లాడుతూ గవర్నర్ విశ్వభూషణ్ హరిచందన్, సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి, రాష్ట్ర మంత్రులు, ఉన్నతాధికారులు పాల్గొంటారన్నారు. ప్రభుత్వ అభివృద్ధి పథకాలపై 15 శకటాలను సిద్ధంగా ఉంచాలని అధికారులను ఆదేశించారు. స్టేడియం పరిసర ప్రాంతాల్లో ట్రాఫిక్ ఇబ్బందుల్లేకుండా చర్యలు తీసుకుంటున్నట్టు తెలిపారు. 600 మంది పోలీసులతో బందోబస్తు ఏర్పాటు చేస్తున్నామని వివరించారు.
Comments
Please login to add a commentAdd a comment