వీరిద్దరూ జిల్లా బాసులు. ఒకరు ఖమ్మం కలెక్టర్ ఆర్వీ కర్ణన్. మరొకరు నగర పోలీస్ కమిషనర్ తఫ్సీర్ ఇక్బాల్. వీరిద్దరు కాసేపు తమ హోదాను పక్కన పెట్టి చిన్న పిల్లల్లా మారిపోయారు. బ్యాటరీ బైక్‌లు నడిపి ముచ్చట తీర్చుకున్నారు. స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా గురువారం ఖమ్మం పోలీస్ పరేడ్ గ్రౌండ్‌లో నిర్వహించిన కార్యక్రమానికి పలు ఇంజనీరింగ్ కళాశాల విద్యార్థులు బ్యాటరీ బైక్‌లను రూపొందించి... ప్రదర్శన కోసం తీసుకువచ్చారు. వాటిని ఆసక‍్తిగా తిలకించిన కలెక్టర్, ఎస్పీ వాటిపై కాసేపు మైదానంలో కలయతిరిగారు. వీరు బైక్ నడపడాన్ని చూసి అక్కడున్న వారంతా ఆశ్చర్యపోయారు. ఈ దృశ్యాన్ని ఖమ్మం సాక్షి ఫోటో జర్నలిస్ట్ తన కెమెరాలో బంధించారు.
పేపర్ బేబీ....
ఇదేదో మోడ్రన్ ఫ్యాషన్ కాదు...ఫ్యాషన్ షో అంతకన్నా కాదు. ఈ చిన్నారి వేసుకున్న డ్రెస్‌ను చూసిన వారంతా వావ్ అన్నారు. భద్రాద్రి జిల్లా కొత్తగూడెంలో నిన్న జరిగిన స్వాతంత్ర్య వేడులకు బూర్గంపాడు పాఠశాలకు చెందిన సాలేహా న్యూస్‌పేపర్‌తో తయారు చేసిన డ్రెస్ ధరించి వచ్చింది. ఆ చిన్నారిని చూసి వారేవా పేపర్ డ్రస్ అంటూ మెచ్చుకున్నారు.
Comments
Please login to add a commentAdd a comment