khammam collector
-
కోర్టు ధిక్కరణ పిటిషన్ వేశాక విచారణ చేస్తారా?
సాక్షి, హైదరాబాద్: తమ ఆదేశాలను సకాలంలో అమలు చేయడంలో నిర్లక్ష్యంగా వ్యవహరించిన ఖమ్మం జిల్లా కలెక్టర్ ఆర్వీ కర్ణన్ తీరుపై హైకోర్టు ఆగ్రహం వ్యక్తంచేసింది. కోర్టుధిక్కరణ పిటిషన్ దాఖలు చేసిన తర్వాత తమ ఆదేశాలను అమలు చేశారని మండిపడింది. నిర్లక్ష్యంగా వ్యవహరించిన కర్ణన్‌కు రూ.500 జరిమానా విధించింది. ఈమొత్తాన్ని ఆయన జీతం నుంచి వసూలు చేయాలని స్పష్టం చేసింది. ఈ తీర్పును ప్రభుత్వ ప్రధాన కార్యదర్శితోపాటు అన్ని శాఖల ముఖ్య కార్యదర్శులకు పంపాలని ఆదేశించింది. ఈ మేరకు న్యాయమూర్తి జస్టిస్ చల్లా కోదండరామ్ ఇటీవల తీర్పునిచ్చారు. పెనుబల్లి తహసీల్దార్ తప్పుడు రికార్డులు సృష్టించారని, వీటి ఆధారంగా గ్రామీణ వికాస బ్యాంకు అధికారులకు అక్రమార్కులకు క్రాప్ లోన్లు మంజూరు చేస్తున్నారని, ఈ వ్యవహారంపై చర్యలు తీసుకోవాలంటూ అదే మండలానికి చెందిన కె.వెంకట్రామయ్య ఖమ్మం కలెక్టర్‌కు 2019 ఆగస్టు, సెప్టెంబర్, అక్టోబర్ నెలల్లో వినతిపత్రం అందించారు. ఈ పిటిషన్‌ను విచారించిన హైకోర్టు ఈ వ్యవహారంపై చర్య తీసుకోవాలని కలెక్టర్‌ను ఆదేశించింది. దాదాపు 10 నెలలు గడిచినా ఎటువంటి చర్యలు తీసుకోకపోవడం తో గతేడాది సెప్టెంబర్ 8న వెంకట్రామయ్య కోర్టు ధిక్కరణ పిటిషన్ దాఖలుచేశారు. చదవండి: సీతక్కపై నాన్ బెయిల్ ఉపసంహరణ -
మీకు అర్థమవుతోందా..!
కరోనా మహమ్మారి కారణంగా ఈ ఏడాది విద్యాసంవత్సరం ఆలస్యంగా ప్రారంభమైంది. మంగళవారం నుంచి విద్యార్థులకు ఆన్లైన్ తరగతులు షురువయ్యాయి. 3 నుంచి 10వ తరగతి వరకు, అలాగే ఇంటర్మీడియట్ విద్యార్థులకు ఆన్లైన్ తరగతులను జిల్లావ్యాప్తంగా నిర్వహించారు. టీ–శాట్, దూరదర్శన్ ద్వారా విద్యార్థులు ఆన్లైన్ తరగతులను వీక్షించారు. విద్యార్థులు పాఠాలు వింటున్నారా.. లేదా..? అనే విషయాన్ని పలు ప్రాంతాల్లో కలెక్టర్‌తో సహా అధ్యాపకులు, ఉపాధ్యాయులు పర్యవేక్షించారు. అంతేకాక.. ప్రభుత్వం కాంట్రాక్టు లెక్చరర్లను రెన్యువల్ చేయడంతో వారు కూడా విధుల్లో చేరారు. సాక్షి, ఖమ్మం: కోవిడ్–19 (కరోనా) ప్రభావం కారణంగా మార్చి 15వ తేదీ నుంచి పాఠశాలలు, కళాశాలలకు సెలవులు ప్రకటించారు. తర్వాత దేశవ్యాప్తంగా లాక్డౌన్ విధించారు. అయితే అన్‌లాక్ ప్రక్రియ ప్రారంభమైనప్పటికీ కరోనా వైరస్ ఉధృతి తగ్గలేదు. దీంతో రాష్ట్ర ప్రభుత్వం ఇటు పాఠశాలలు, అటు కళాశాలలు తెరిచేందుకు వేచి చూస్తూ వస్తోంది. నెలలు గడుస్తుండటంతో విద్యార్థులు విద్యాసంవత్సరం నష్టపోకూడదనే ఉద్దేశంతో ఆన్లైన్ తరగతులు నిర్వహించాలని నిర్ణయించింది. ఇందుకు అనుగుణంగా ఉపాధ్యాయులను గత నెల 27వ తేదీ నుంచే విధులకు హాజరు కావాలని ఆదేశించింది. అలాగే కళాశాలల్లో కూడా ఆన్లైన్ తరగతులకు సంబంధించి అన్ని ఏర్పాట్లు చేశారు. రెగ్యులర్ అధ్యాపకులు విధుల్లో చేరడంతోపాటు కాంట్రాక్టు లెక్చరర్లను కూడా విధుల్లోకి తీసుకున్నారు. దూరదర్శన్, టీ–శాట్ ద్వారా తరగతులు.. ఇళ్లలో నుంచే విద్యార్థులు దూరదర్శన్, టీ–శాట్ యాప్ ద్వారా ఆన్లైన్ తరగతులు వీక్షించారు. విద్యార్థులు టీ–శాట్ యాప్‌ను స్మార్ట్ ఫోన్లలో డౌన్లోడ్ చేసుకుని తరగతులు విన్నారు. గ్రామీణ ప్రాంతాల్లో ఎటువంటి సదుపాయం లేని విద్యార్థులకు గ్రామ పంచాయతీల్లో టీవీలను ఏర్పాటు చేసి ఆన్లైన్ తరగతులు వినే సదుపాయం కల్పిస్తారు. తొలిరోజు మంగళవారం 10వ తరగతి విద్యార్థులకు ఉదయం 10 గంటలకు తెలుగు, 10.30 గంటలకు ఫిజికల్ సైన్స్ బోధించారు. 7వ తరగతి విద్యార్థులకు 12 గంటలకు తెలుగు, 12.30 గంటలకు లెక్కల సబ్జెక్ట్‌ను బోధించారు. 6వ తరగతి విద్యార్థులకు 2 గంటలకు తెలుగు, 2.30 గంటలకు లెక్కలు, 8వ తరగతి విద్యార్థులకు 3.30 గంటలకు లెక్కలు, 9, 4వ తరగతి విద్యార్థులకు తెలుగు, 4.30 గంటలకు ఫిజికల్ సైన్స్ బోధించారు. ఇక ఇంటర్మీడియట్ విద్యార్థులకు ఉదయం 8 నుంచి 10 గంటల వరకు, సాయంత్రం 3 నుంచి 6 గంటల వరకు ఆన్లైన్ తరగతులు నిర్వహించారు. ఉపాధ్యాయులు, అధ్యాపకులు అందరూ విద్యార్థులు ఆన్లైన్ తరగతులు వినేలా పర్యవేక్షించారు. వాట్సాప్‌లో 30 నుంచి 40 మంది విద్యార్థులను గ్రూపుగా తయారు చేసి.. వారికి వాట్సాప్ ద్వారా ఏ సమయంలో.. ఏ తరగతి విద్యార్థులకు.. ఏ సబ్జెక్టు బోధిస్తారో తెలియజేశారు. అలాగే ఆన్లైన్లో విన్న తరగతులకు సంబంధించి ఏమైనా సందేహాలు ఉంటే వాటిని ఉపాధ్యాయులు, అధ్యాపకులకు ఫోన్ చేసి విద్యార్థులు నివృత్తి చేసుకోవాలని సూచించారు. కాగా.. రఘునాథపాలెం మండలం కోయచెలక, రేగులచెలక గ్రామాల్లో ఆన్లైన్ తరగతులను విద్యార్థుల ఇళ్లకు వెళ్లి కలెక్టర్ ఆర్వీ.కర్ణన్ ఆకస్మికంగా పరిశీలించారు. విద్యార్థుల హాజరు తప్పనిసరి: కలెక్టర్ కర్ణన్ రఘునాథపాలెం: ఆన్లైన్ తరగతులు వినే విద్యార్థుల హాజరును ప్రతి రోజూ తప్పక తీసుకోవాలని కలెక్టర్ ఆర్వీ.కర్ణన్ హెచ్ఎంలు, ఉపాధ్యాయులను ఆదేశించారు. కోయచెలక, రేగులచెలక గ్రామాల్లో విద్యార్థుల ఇళ్లకు వెళ్లి ఆన్లైన్ తరగతులను కలెక్టర్ మంగళవారం ఆకస్మికంగా పరిశీలించారు. విద్యార్థులు పాఠాలు వినేందుకు చేసిన ఏర్పాట్లను, పాఠాలు వింటున్న తీరును డీఈఓ మదన్మోహన్, ఎంఈఓ శ్రీనివాస్, హెచ్ఎం అనితాదేవితో కలిసి కలెక్టర్ పరిశీలించారు. విద్యార్థులు పాఠాలను శ్రద్ధగా వింటున్నారా.. లేదా.. అనే అంశాలపై ఎప్పటికప్పుడు పర్యవేక్షణ చేయాలన్నారు. ప్రతి హ్యాబిటేషన్‌కు ఒకరిని బాధ్యులుగా చేసి.. వారి పరిధిలో ఆన్లైన్ బోధన సక్రమంగా సాగే విధంగా చర్యలు చేపట్టాలన్నారు. విద్యార్థులు ఆన్లైన్ పాఠ్యాంశాలను శ్రద్ధగా వింటూ నోట్ చేసుకోవాలన్నారు. సందేహాలు ఉంటే సంబంధిత సబ్జెక్ట్ ఉపాధ్యాయుడికి ఫోన్ చేసి నివృత్తి చేసుకోవాలన్నారు. అన్ని సబ్జెక్ట్‌ల ఉపాధ్యాయుల సెల్ నంబర్లు ప్రతి విద్యార్థి వద్ద అందుబాటులో ఉంచాలని డీఈఓను ఆదేశించారు. ఉదయం 9 నుంచి సాయంత్రం 5 గంటల వరకు నిరంతరాయంగా విద్యుత్ సరఫరా ఉండేలా తగిన చర్యలు తీసుకోవాలని ఎంఈఓను ఆదేశించారు. డీటీహెచ్, స్థానిక కేబుల్ ఆపరేటర్లు తరగతుల ప్రసారానికి అంతరాయం లేకుండా చూడాలన్నారు. కార్యక్రమంలో మండల ప్రత్యేకాధికారి విజయకుమారి, ఎంపీడీఓ వి.ఆశోక్‌కుమార్, గ్రామ సర్పంచ్‌లు మాధంశెట్టి హరిప్రసాద్, రామారావు, ఉప సర్పంచ్‌లు పూర్ణచంద్రరావు, నున్నా వెంకటేశ్వర్లు, హెచ్ఎం అనిత, గ్రామ కార్యదర్శులు సంగీత, శృతి పాల్గొన్నారు. తరగతులు పర్యవేక్షించాం.. జిల్లాలోని జూనియర్ కళాశాలల్లో ఆన్లైన్ తరగతులు దూరదర్శన్, టీ–శాట్ యాప్ ద్వారా ప్రారంభమయ్యాయి. ఇటీవల అధ్యాపకులకు ఆన్లైన్ బోధనపై శిక్షణ ఇచ్చారు. దీంతో విద్యార్థుల ఆన్లైన్ తరగతులను అధ్యాపకులు పర్యవేక్షించారు. సందేహాలుంటే అధ్యాపకులను ఫోన్లో సంప్రదించి తెలుసుకోవచ్చు. – కె.రవిబాబు, ఇంటర్మీడియట్ విద్యాధికారి, ఖమ్మం -
ప్రణాళికతో బోధన జరగాలి
సాక్షి, ఖమ్మం: ప్రణాళిక ప్రకారం ఆన్లైన్ విద్యా బోధన చేపట్టాలని కలెక్టర్ ఆర్వీ.కర్ణన్ అధికారులను ఆదేశించారు. జిల్లా, మండల విద్యాధికారులు, తహసీల్దార్లు, ఎంపీడీఓలతో కలెక్టర్ సోమవారం వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లాలోని 1,329 ప్రభుత్వ పాఠశాలల్లో 3 నుంచి 10వ తరగతి వరకు 74,042 మంది విద్యార్థులకు ఆన్లైన్ బోధన అందేలా చూడాలన్నారు. డీటీహెచ్, టీవీ, సెల్ఫోన్లకు ఇంటర్నెట్ కనెక్షన్లను సమకూర్చుకోవాలన్నారు. విద్యార్థుల సంఖ్య ఎక్కువగా ఉన్న మండలాల్లో పాఠశాలలతోపాటు వసతి గృహాల విద్యార్థులకు సమగ్ర కార్యాచరణతో బోధన జరగాలన్నారు. పాఠశాల ఉపాధ్యాయులకు సంబంధించి సబ్జెక్టుల వారీగా టీచర్ల సెల్ నంబర్లు తప్పనిసరిగా విద్యార్థులకు అందుబాటులో ఉంచాలన్నారు. ఆన్లైన్ తరగతుల షెడ్యూల్‌ను ప్రతి పాఠశాల, గ్రామ పంచాయతీ నోటీస్ బోర్డుపై తప్పనిసరిగా ప్రదర్శించాలన్నారు. ప్రసార మాధ్యమాల సదుపాయం లేని వారి కోసం పాఠశాల, గ్రామ పంచాయతీల్లో టీవీలను సమకూర్చి సీనియర్ విద్యార్థులతో సమన్వయపర్చాలన్నారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వసతి గృహాల విద్యార్థుల కోసం తీసుకున్న చర్యలపై సూచనలు చేశారు. వీసీలో అదనపు కలెక్టర్ ఎన్.మధుసూదన్‌రావు, డీఈఓ మదన్మోహన్, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ సంక్షేమ శాఖాధికారులు సత్యనారాయణ, రమేష్ పాల్గొన్నారు. అలాగే కలెక్టరేట్లోని ప్రజ్ఞా సమావేశ మందిరంలో విద్యా, సంక్షేమ శాఖ అధికారులతో కలెక్టర్ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆన్లైన్ బోధనాంశాలపై సమీక్షించారు. అనంతరం కలెక్టర్ కర్ణన్ మాట్లాడుతూ నేటి నుంచి పాఠశాల విద్యార్థులకు దూరదర్శన్, టీ శాట్, ద్వారా చేపడుతున్న ఆన్లైన్ తరగతులను టైం టేబుల్ ప్రకారం ప్రధానోపాధ్యాయులు, సబ్జెక్ట్ టీచర్లు నిర్వహించాలన్నారు. విద్యార్థుల సంఖ్యనుబట్టి ప్రతి విద్యార్థి ఆన్లైన్ తరగతులకు హాజరయ్యేలా చూడాలన్నారు. సమావేశంలో అదనపు కలెక్టర్, కేఎంసీ కమిషనర్ అనురాగ్ జయంతి, డీఈఓ, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు. -
ఎంతో చూశా.. చేశా
సాక్షి, ఖమ్మం: చైతన్యవంతమైన ఖమ్మం జిల్లాలో పనిచేసిన ఈ కాలం మధురానుభూతిని, అనుభవాన్ని మిగిల్చిందని, జిల్లా ప్రజలు సౌమ్యులే కాకుండా మంచి అవగాహన కలిగిన వారని, అందువల్లే జిల్లాలో తన హయాంలో జరిగిన అన్ని రకాల ఎన్నికలను ప్రశాంతంగా నిర్వహించగలిగామని కలెక్టర్ ఆర్వీ.కర్ణన్ అభిప్రాయం వ్యక్తం చేశారు. జిల్లా అభివృద్ధిలో భాగస్వామినయ్యానని పూర్తి సంతృప్తి ఉందన్నారు. అన్ని రాజకీయ పార్టీల సహకారంతో ఎన్నికలను సమర్థవంతంగా నిర్వహించగలిగామని తెలిపారు. జిల్లా కలెక్టర్‌గా బాధ్యతలు స్వీకరించి ఈనెల 30వ తేదీ నాటికి 2 సంవత్సరాలు పూర్తి కానున్నాయి. ఈ సందర్భంగా జిల్లాలో జరుగుతున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలపై ‘సాక్షి ప్రతినిధి’కి ఇంటర్వ్యూ ఇచ్చారు. ఆ వివరాలు ఇలా.. వరుస ఎన్నికల నిర్వహణతో ఇబ్బంది పడ్డారా? కలెక్టర్‌గా 2018, ఆగస్టు 30వ తేదీన నేను బాధ్యతలు స్వీకరించిన కొద్ది రోజులకే శాసనసభ ఎన్నికలకు నోటిఫికేషన్ వచ్చింది. తర్వాత వరుసగా లోక్‌సభ, మున్సిపాలిటీ, సహకార సంఘాల ఎన్నికలను సైతం ప్రశాంతంగా నిర్వహించాం. ఈ ఎలక్షన్లు నాకు మంచి అనుభవాన్ని ఇవ్వడంతోపాటు జిల్లా ప్రజలకు చేరువ కావడానికి ఉపయోగపడ్డాయి. చైతన్యవంతమైన రాజకీయ జిల్లాగా పేరొందిన ఖమ్మంలో అన్ని రాజకీయ పక్షాలతోపాటు ప్రజలు పూర్తి సహకారం అందించారు. అందుకే..ఎక్కడా ఎలాంటి సంఘటనలు చోటు చేసుకోకుండా పూర్తిచేయగలిగాం. ఓటర్ల నమోదు, జాబితా ప్రక్షాళనపై మీ కృషి ఏ మేరకు ఫలించింది? కొత్త ఓటర్ల నమోదుపై దృష్టి సారించి 18 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరికీ ఓటు హక్కు లభించేలా చేసిన ప్రయత్నం జిల్లాలో మంచి ఫలితాలను ఇచ్చింది. నమోదు గణనీయంగా పెరిగింది. రెండు సంవత్సరాల నా పదవీ కాలంలో అనేక ఎన్నికలు నిర్వహించా. ఓటర్ల జాబితాపై దృష్టి సారించి..వేర్వేరు చోట్ల నమోదైన ఓటర్ల పేర్లను తొలగించి..ఒకేచోట ఓటు హక్కు ఉండేలా అన్ని రాజకీయ పార్టీల సహకారంతో పూర్తి చేశాం. కొత్త పరిశ్రమలు రానున్నాయా..? జిల్లాలో ఆయిల్‌పామ్ ఫ్యాక్టరీ ఏర్పాటుకు అవకాశాలున్నాయి. సుబాబుల్, జామాయిల్ పండించే రైతులు ఇప్పుడు ఆయిల్‌పామ్‌పై దృష్టి సారించడంతో ఫ్యాక్టరీ ఆవశ్యకత పెరిగింది. అనేక ప్రైవేట్ సంస్థలు ఆసక్తిగా ఉన్నట్లు సమాచారం ఉంది. పంటల నిల్వ చర్యలేంటి? జిల్లాలో పండించే పంటలను కోల్డ్ స్టోరేజీల్లో నిల్వ చేసుకునే అవకాశం ఇప్పటికే ఉంది. అయితే కోవిడ్ కారణంగా మిర్చి పంట ఇతర దేశాలకు ఎగుమతి చేసే అవకాశం లేక కోల్డ్ స్టోరేజీల్లో నిల్వ ఉంచారు. వచ్చే రెండు నెలల్లో స్థానిక మార్కెట్లోనే మిర్చికి మంచి ధర లభిస్తుందని వ్యవసాయ నిపుణులు చెబుతున్నారు. పండిన పంటలకు నిల్వ చేసే కోల్డ్ స్టోరేజీలు దాదాపు సరిపోయే అవకాశం ఉంది. భూ ప్రక్షాళన ఏ విధంగా కొనసాగుతోంది? దాదాపు పూర్తయింది. ప్రభుత్వం రైతులకు రైతుబంధు అందజేస్తోంది. వివిధ కారణాల వల్ల ఇంకా కొన్ని కేసులు పెండింగ్‌లో ఉన్నాయి. వాటి పరిష్కారంపై దృష్టి సారించాం. నియంత్రిత సాగు గురించి..? మంచి ఫలితాలను ఇస్తోంది. గత సంవత్సరం 90వేల ఎకరాల్లో మొక్కజొన్న పంట వేసిన రైతులు.. ఈసారి 900 ఎకరాలకే పరిమితవడం ఓ మంచి ఉదాహరణ. మార్కెట్లో డిమాండ్ ఉన్న పంటలను వేయాలని ప్రభుత్వం ఇచ్చిన పిలుపునకు జిల్లా రైతులు స్పందించిన తీరు ప్రశంసనీయం. ‘మిషన్ నారి’పై దృష్టి సారించారు కదా..? జిల్లాలో 19 సంవత్సరాలలోపు వయసు కలిగిన బాలికలకు మిషన్ నారి పథకం కింద వైద్య ఆరోగ్య శాఖలోని మహిళా సిబ్బందితో జిల్లా అంతటా పరీక్షలు నిర్వహించాం. రక్తహీనత ఉన్నవారిని గుర్తించి ప్రత్యేకంగా వైద్య సౌకర్యం కల్పించాం. ఆరోగ్యపరమైన ఇతర సమస్యలను గుర్తించి వారికి ఎప్పటికప్పుడు చికిత్స అందించాం. జిల్లా అభివృద్ధిలో మీ ప్రాధాన్యాలేంటి..? పూర్తి వ్యవసాయాధారిత జిల్లా. ఆలు, సోయాబీన్ మినహా అన్ని రకాల పంటలు పండించే సామర్థ్యం, నైపుణ్యం కలిగిన రైతులు ఉన్నారు. వారి నైపుణ్యానికి మరింత మెరుగులు దిద్దడానికి జిల్లా కలెక్టర్‌గా తొలి ప్రాధాన్యం వ్యవసాయ రంగానికి, మలి ప్రాధాన్యం వైద్య ఆరోగ్య రంగానికి ఇచ్చి ప్రధానంగా దృష్టి సారించా. దీంతో రైతులకు అనేక ప్రయోజనకరమైన కార్యక్రమాలు నిర్వహించడానికి అవకాశం లభించింది. జిల్లా ప్రభుత్వ ఆస్పత్రితోపాటు అన్ని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో వైద్య సేవలను మెరుగు పరిచేందుకు అనేక చర్యలు తీసుకున్నాం. ఖమ్మం ప్రభుత్వ ఆస్పత్రిలో 350 పడకలు నేను రావడానికి ముందు ఉండేవి. ఇప్పుడు వాటి సంఖ్య 520కు పెంచాం. 220 పడకలకు ఆక్సిజన్ సదుపాయం, 50 పడకలకు వెంటిలేటర్ సౌకర్యం కల్పించాం. ప్రభుత్వ ఆస్పత్రులపై జిల్లా ప్రజలకు నమ్మకం కలిగేలా సేవలు అందించడంతో ఇన్‌పేషెంట్, ఔట్పేషెంట్ల సంఖ్య గణనీయంగా పెరిగింది. రెండు అవార్డులతో ప్రోత్సాహం శాసనసభ ఎన్నికలను అత్యంత ప్రశాంతంగా నిర్వహించాం. ప్రతి నియోజకవర్గంలోనూ గతం కంటే పోలింగ్‌శాతం పెరగడాన్ని పరిగణనలోకి తీసుకున్న కేంద్ర ఎన్నికల కమిషన్ అవార్డు ప్రకటించడం నాకు మరింత ప్రోత్సాహాన్ని ఇచ్చింది. జిల్లా పరిషత్, గ్రామ పంచాయతీ, మండల పరిషత్ ఎన్నికలను పకడ్బందీగా, ప్రశాంతంగా నిర్వహించినందుకు రాష్ట్ర ఎన్నికల కమిషన్ సైతం అవార్డు అందించింది. -
అప్పుడు తాగా.. ఇప్పుడు మానేశా..
సాక్షి, ఖమ్మం : గ్రామంలో పారిశుద్ధ్య సమస్యలు లేకుండా రుద్రాక్షపల్లి గ్రామాన్ని సుందరంగా తీర్చిదిద్దాలని ఖమ్మం కలెక్టర్ ఆర్వీ కర్ణన్ ఆదేశించారు. సత్తుపల్లి మండలం రుద్రాక్షపల్లి గ్రామంలో 30 రోజుల్లో గ్రామాభివృద్ధి ప్రణాళిక కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. శ్మశాన వాటికకు స్థలం ఉందా? అని వీఆర్వోను ప్రశ్నించగా.. ఉందని వీఆర్వో సమాధానం చెప్పగా.. గ్రామస్తులు లేదని తెలిపారు. ఇలా గ్రామ సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ‘ఏమ్మా పెన్షన్ డబ్బులు ఏం చేస్తున్నావు..’ అని కలెక్టర్ కర్ణన్ ఈ సందర్భంగా ఓ వృద్ధురాలిని ప్రశ్నించారు. దీంతో ఆమె.. గతంలో మద్యం సేవించే దానిని.. ఇప్పుడు మానేశానని, ఖర్చులకు, మందులకు వాడుకుంటున్నా అని సమాధానమిచ్చింది. దీంతో అందరూ ఒక్కసారిగా నవ్వుకున్నారు. ‘నీకు ఎంత వ్యవసాయ భూమి ఉందా?’ అని అడగగా.. తెలియదు.. నాకు చదువురాదు.. అని సమాధానం చెప్పింది. అలాగే ఓ విద్యార్థిని దగ్గరకు తీసుకొని ‘నీవు మంచిగా చదువుకొని భవిష్యత్‌తో మంచి ఉద్యోగం చేయాలని.. తల్లిదండ్రులను మంచిగా చూసుకో’ అని కలెక్టర్ సూచించారు -
వీరిద్దరూ ‘భళే బాసులు’
వీరిద్దరూ జిల్లా బాసులు. ఒకరు ఖమ్మం కలెక్టర్ ఆర్వీ కర్ణన్. మరొకరు నగర పోలీస్ కమిషనర్ తఫ్సీర్ ఇక్బాల్. వీరిద్దరు కాసేపు తమ హోదాను పక్కన పెట్టి చిన్న పిల్లల్లా మారిపోయారు. బ్యాటరీ బైక్‌లు నడిపి ముచ్చట తీర్చుకున్నారు. స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా గురువారం ఖమ్మం పోలీస్ పరేడ్ గ్రౌండ్లో నిర్వహించిన కార్యక్రమానికి పలు ఇంజనీరింగ్ కళాశాల విద్యార్థులు బ్యాటరీ బైక్‌లను రూపొందించి... ప్రదర్శన కోసం తీసుకువచ్చారు. వాటిని ఆసక్తిగా తిలకించిన కలెక్టర్, ఎస్పీ వాటిపై కాసేపు మైదానంలో కలయతిరిగారు. వీరు బైక్ నడపడాన్ని చూసి అక్కడున్న వారంతా ఆశ్చర్యపోయారు. ఈ దృశ్యాన్ని ఖమ్మం సాక్షి ఫోటో జర్నలిస్ట్ తన కెమెరాలో బంధించారు. పేపర్ బేబీ.... ఇదేదో మోడ్రన్ ఫ్యాషన్ కాదు...ఫ్యాషన్ షో అంతకన్నా కాదు. ఈ చిన్నారి వేసుకున్న డ్రెస్‌ను చూసిన వారంతా వావ్ అన్నారు. భద్రాద్రి జిల్లా కొత్తగూడెంలో నిన్న జరిగిన స్వాతంత్ర్య వేడులకు బూర్గంపాడు పాఠశాలకు చెందిన సాలేహా న్యూస్‌పేపర్‌తో తయారు చేసిన డ్రెస్ ధరించి వచ్చింది. ఆ చిన్నారిని చూసి వారేవా పేపర్ డ్రస్ అంటూ మెచ్చుకున్నారు. -
పొలం గట్లపై కలెక్టర్ దంపతులు
సాక్షి, ఖమ్మం: జిల్లా కలెక్టర్ ఆర్వీ కర్ణన్, ఆయన సతీమణి జెడ్పీ సీఈవో ప్రియాంకతో కలిసి గురువారం పొలం గట్లపై కలియతిరిగారు. కామేపల్లి మండలం పొన్నెకల్లు-నెమలిపురి మధ్యలో ఉన్న బుగ్గవాగు చెక్ డ్యాం ఫీడర్ చానల్ పనులను ఆయన పరిశీలించారు. కట్టు కాలువ చూసేందుకు దారి లేకపోవడంతో పొలం గట్లపై కలెక్టర్ దంపతులు గంటసేపు నడిచి వెళ్లారు. వంతెన ఎక్కి వాగును దాటి... ఐటీడీఏ పీఓకు నీల్వాయివాగు కష్టాలు నీల్వాయివాగు కష్టాలు ఆదిలాబాద్ ఉమ్మడి జిల్లా ఐటీడీఏ ప్రాజెక్టు ఆఫీసర్ (పీఓ) కృష్ణ ఆదిత్యకు కూడా తప్పలేదు. వాగు దాటడానికి 28 గ్రామాల ప్రజలు అనుభవిస్తున్న నిత్య కష్టాలను ఆయన చవిచూశారు. గురువారం ఇతర అధికారులతో కలసి మండలంలో ఆకస్మిక తనిఖీకి వచ్చారు. మార్గమధ్యలో ఉన్న నీల్వాయివాగు వరకు తన వాహనంలో వచ్చారు. వాగు వద్ద తాత్కాలిక వంతెన కొట్టుకుపోగా వాగు దాటలేని పరిస్థితి. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షం.. వరద ఉధృతంగా ప్రవహిస్తోంది. వాగు నుంచి ఐదు కిలోమీటర్ల దూరంలో మండల కేంద్రం. అక్కడే మామిడి తోటల్లో వాహనాలను నిలిపేసి పక్కనే ఉన్న అసంపూర్తి హైలెవల్ వంతెన వద్దకు నడుచుకుంటూ వెళ్లారు. వంతెనకు ఇరువైపులా అప్రోచ్‌రోడ్డు నిర్మించలేదు. ప్రజలు ఎక్కేందుకు కొద్దిపాటి మట్టి పోయించారు. వాహనాలు, బైక్‌లు కూడా దాటలేవు. వర్షాలకు మట్టి తడిసి రాకపోకలతో బురదగా మారింది. చేసేదేమీలేక ప్యాంట్, చెప్పులు పట్టుకుని.. వర్షంలో తడుస్తూ మోకాలు లోతు బురదలో జారుతూ అతికష్టం మీద 10 మీటర్ల వంతెనపైకి ఎక్కారు. దిగేచోటా అతికష్టంగా.. దిగారు. ప్రధాన రహదారి వరకు బురదలో నడుచుకుంటూ వెళ్లారు. వాగు ఒడ్డున ఉన్న ప్రైవేట్ వాహనం అద్దెకు మాట్లాడుకుని మండల కేంద్రానికి వచ్చి వెళ్లారు. -
తహసీల్దార్ కార్యాలయంలో కలెక్టర్ ఆకస్మిక తనిఖీ
కారేపల్లి: సింగరేణి తహసీల్దార్ కార్యాలయాన్ని ఖమ్మం జిల్లా కలెక్టర్ అర్వీ కర్ణన్ బుధవారం ఆకస్మికంగా సందర్శించారు. కార్యాలయంలో తహసీల్దార్, ఆర్ఐ, వీఆర్వోలతో సమావేశమయ్యారు. మండలంలో రెవెన్యూ సమస్యలు, పట్టాదారు పాస్ పుస్తకాల జారీ, సాదాబైనామాల పరిస్థితి సమీక్షించారు. సమావేశం అనంతరం కార్యాలయం వెలుపలికి వచ్చిన కలెక్టర్‌కు బాధితులు భారీగా వినతులు సమర్పించారు. గిరిజనేతరులతో పాటు గిరిజనుల భూములకు పట్టాలు కావడం లేదని కలెక్టర్‌కు బాధితులు ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ఏజెన్సీ ప్రాంతం కావడంతో గిరిజనేతరులు 1970కు ముందు రెవెన్యూ రికార్డుల్లో ఉండాలని, గిరిజనులు ఏ సమయంలోనైనా రికార్డుల్లో ఉంటే వారికి పట్టాదారు పాస్ పుస్తకాలు ఇస్తామని తెలిపారు. వారసత్వ పట్టాలకు తప్పని సరిగా కుటుంబం అంతా కలిసి దరఖాస్తు చేసుకుంటే పరిశీలించి పట్టా కల్పిస్తారని చెప్పారు. పోడుదారుల బైఠాయింపు హక్కు ఉన్నా పోడును సాగు చేయనీయకుండా ఫారెస్టు అధికారులు ఇబ్బందులు పెడుతున్నారని, తమ సమస్యకు పరిష్కారం చూపాలంటూ పాటిమీదిగుంపునకు చెందిన పోడు మహిళా రైతులు తిరుగు ప్రయాణం అయిన కలెక్టర్ కారు ముందు బైఠాయించారు. సెక్యూరిటీ సిబ్బంది మహిళలను కలెక్టర్ వద్దకు తీసుకువెళ్లగా వారు తమ సమస్యను విన్నవించారు. హక్కు పత్రాలు ఉన్నాయని పత్రాలను కలెక్టర్‌కు చూపించారు. దీనిపై స్పందించిన కలెక్టర్ ఎఫ్‌బీఓపై ఫిర్యాదు చేయాలని సూచించారు. కలెక్టర్ దృష్టికి పలు సమస్యలు.. తహసీల్దార్ కార్యాలయానికి వచ్చిన కలెక్టర్‌కు పలు సమస్యలను సర్పంచ్, ప్రజా సంఘాల నాయకులు వివరించారు. కారేపల్లిలో ప్రభుత్వ భూమిని సర్వే చేయాలని, గుర్తించిన ప్రభుత్వ భూమిని ప్రభుత్వ కార్యాలయాలకు కేటాయించాలని సర్పంచ్ ఆదెర్ల స్రవంతి విన్నవించారు. పోడు సాగుదారుల సమస్యపై ఎల్‌హెచ్‌పీఎస్ రాష్ట్ర నాయకుడు అజ్మీర శివనాయక్ వినతిపత్రం సమర్పించారు. కారేపల్లిలోని పోలీస్ క్వార్టర్ ప్రాంత మినీ అంగన్వాడీ కేంద్రం భవనం నిర్మాణానికి నిధులు మంజూరయ్యాయని, దాని నిర్మాణానిక్రి పభుత్వ భూమి కేటాయించాలని సామాజిక కార్యకర్త ఇందుర్తి సురేందర్‌రెడ్డి, బీజేపీ నాయకుడు తురక నారాయణ వినతిపత్రం అందజేశారు. -
కలెక్టర్ ఆగ్రహం
అశ్వారావుపేటరూరల్: డీఆర్డీఓపై కలెక్టర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. మరుగుదొడ్ల నిర్మాణాల్లో వెనకబడ్డ పంచాయతీ వివరాలు అడగ్గా.. సరైన సమాధానం చెప్పకపోవడంతో అసంతృప్తి వ్యక్తం చేశారు. స్వచ్ఛ భారత్ ద్వారా నిర్మిస్తున్న మరుగుదొడ్ల నిర్మాణాలను పరిశీలించేందుకు శుక్రవారం కలెక్టర్ రజత్‌కుమార్ శైనీ ఆకస్మికంగా అశ్వారావుపేట మండలంలో పర్యటించారు. డీఆర్డీఓ జగత్‌కుమార్ రెడ్డి సూచన ప్రకారం మండలంలోని వేదాంతపురం గ్రామ పంచాయతీలో మరుగుదొడ్ల నిర్మాణాల ప్రగతి తెలుసుకునేందుకు గ్రామంలో పర్యటించారు. పంచాయతీకి ఎన్ని మరుగుదొడ్లు మంజూరయ్యాయని, ఎన్ని నిర్మించారని ప్రశ్నించారు. పంచాయతీకి 29 మరుగుదొడ్లు మంజూరు కాగా, వాటిలో 23 పూర్తి చేశామని, మరో 6 మరుగుదొడ్లు నిర్మాణ దశలో ఉన్నాయని డీఆర్డీఓ జగత్‌కుమార్‌రెడ్డి వివరించారు. ఈ క్రమంలో కలెక్టర్ జోక్యం చేసుకుని ‘నిర్మాణాల్లో ప్రగతి ఉన్న చోటకు తనను దేనికి తీసుకొచ్చారు..? నిర్మాణాల్లో వెనుకబడిన చోటకు తీసుకెళ్లకుండా ఇక్కడికి తీసుకొచ్చి ప్రయోజనం ఏమిటీ..? నా టైమ్ వేస్ట్ చేశావ్..? మీ వల్ల ఒక రోజు డిలే అయిపోయంది కదా.? ఇదేనా మీ పనితీరు.? అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. మరుగుదొడ్ల నిర్మాణాల్లో వెనుకబడిన పంచాయతీకి తీసుకెళ్లమని అడగ్గా.. సరైన సమాధానం చెప్పలేకపోవడంతో అసంతృప్తి వ్యక్తం చేశారు. గుమ్మడిపల్లి పంచాయతీ కార్యదర్శిపై మండిపాటు అనంతరం మండలంలోని గుమ్మడవల్లి గ్రామ పంచాయతీ నిర్మాణాల్లో వెనుకబడినట్లు తెలుసుకొని ఆ పంచాయతీలో పర్యటించారు. స్థానికులతో మాట్లాడుతుండగా గ్రామ కార్యదర్శి దొడ్డా ప్రసాద్ అక్కడికి వచ్చారు. మరుగుదొడ్ల నిర్మాణాలపై ప్రశ్నించగా సరైన సమాధానం చెప్పలేదు. దీనికితోడు మద్యం సేవించి ఉన్నాడు. ఈ విషయాన్ని గ్రహించిన కలెక్టర్ శైనీ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. తక్షణమే తహసీల్దార్ రాఘవరెడ్డిని పిలిచి కార్యదర్శిని ప్రభుత్వ ఆస్పత్రికి తీసుకెళ్లి వైద్య పరీక్షలు చేయించాలని పంపించారు. వైద్య పరీక్షల నివేదిక వచ్చిన తర్వాత కార్యదర్శిని సస్పెండ్ చేస్తానని కలెక్టర్ అన్నారు. గ్రామ పంచాయతీకి 231 మరుగుదొడ్లు మంజూరు కాగా, కేవలం 50 మాత్రమే పూర్తై, 181 మరుగుదొడ్లు పూర్తి కాకపోవడంపై అసంతృప్తి వ్యక్తం చేశారు. మంజూరైన మరుగుదొడ్ల నిర్మాణాలు పూర్తి కాకపోవడానికి గల కారణాలను గ్రామస్తులతో మాట్లాడి తెలుసుకున్నారు. మరుగుదొడ్ల నిర్మాణాలు పూర్తి చేసిన బిల్లులు రావడం లేదని, అందుకే చాలా మంది మంజూరైన నిర్మించుకోవడానికి ముందుకు రావడం లేదని స్థానికులు చెప్పారు. దీంతో కలెక్టర్ మాట్లాడుతూ..బిల్లుల చెల్లింపుల్లో ఎలాంటి జాప్యం ఉండదని, మీ గ్రామ పంచాయతీ ఖాతాలోనే రూ.10లక్షల నిధులు ఉన్నాయని, నిర్మాణాలను నిబంధనల ప్రకారం చేసుకుంటే మంజూరు అవుతాయన్నారు. మరుగుదొడ్ల నిర్మాణాల్లో దేశంలోనే జిల్లా వెనుకబడిందని, వచ్చే జూలై 31 నాటికి మరుగుదొడ్ల నిర్మాణాలు వంద శాతం పూర్తి చేసుకొని ఓడీఎఫ్ ప్రకటించుకోవాలన్నారు. అధికారులు మరుగుదొడ్ల నిర్మాణాలపై పూర్తి స్థాయిలో దృష్టి పెట్టాలని, లేని పక్షంలో చర్యలు తప్పవన్నారు. ఈ కార్యక్రమంలో తహసీల్దార్ వి.రాఘవరెడ్డి, ఎంపీడీఓ కె పాపారాణి, ఈవోపీఆర్డీ ఓంటేరు దేవరాజ్, సర్పంచ్‌లు శివశంకర ప్రసాద్, కొడిమి సీత, తాజా ఎంపీటీసీ సభ్యులు వల్లెపు తిరుపతిరావు, ఏపీఓ శ్రీను, ఈజీఎస్ జేఈ స్వామి ఉన్నారు. -
కొత్త కలెక్టర్‌గా లోకేష్ కుమార్
సాక్షి, రంగారెడ్డి జిల్లా ప్రతినిధి : జిల్లా నూతన కలెక్టర్‌గా డీఎస్ లోకేష్ కుమార్‌ను నియమిస్తూ ప్రభుత్వం మంగళవారం ఉత్తర్వులు జారీచేసింది. సుదీర్ఘకాలం మన జిల్లాలో కలెక్టర్‌గా పనిచేసిన ఎం.రఘునందన్‌రావు హైదరాబాద్‌కు బదిలీ అయ్యారు. లోకేష్ కుమార్ ప్రస్తుతం ఖమ్మం జిల్లా కలెక్టర్‌గా పనిచేస్తున్నారు. 2003 బ్యాచ్‌కు చెందిన ఈయన స్వస్థలం కర్ణాటక రాష్ట్రం. భార్య విజయేంద్ర కూడా ఐఏఎస్ అధికారే. ప్రస్తుతం ఆమె రాష్ట్ర మహిళా శిశు సంక్షేమ శాఖ డైరెక్టర్‌గా విధులు నిర్వర్తిస్తున్నారు. నూతన కలెక్టర్‌గా లోకేష్ కుమార్ రెండు రోజుల్లో బాధ్యతలు స్వీకరించనున్నట్లు సమాచారం. కాగా, 2015 జనవరి 12న జిల్లా కలెక్టర్‌గా బాధ్యతలు చేపట్టిన రఘునందన్‌రావు మూడున్నరేళ్లపాటు పనిచేశారు. జిల్లాలో అత్యధిక కాలం పనిచేసిన కలెక్టర్‌గా రికార్డు నెలకొల్పారు. ప్రభుత్వ విధానపర నిర్ణయాల్లోనూ ఆయన కీలక భూమిక పోషించారు. సంతృప్తితో వెళ్తున్నా.. హైదరాబాద్ కలెక్టర్‌గా పోస్టింగ్ పొందిన రఘునందన్‌రావు ఉన్నత విద్యాభ్యాసం కోసం వచ్చే జనవరిలో అమెరికాకు వెళ్లనున్నారు. మంగళవారం ఆయన ‘సాక్షి’తో మాట్లాడుతూ.. జిల్లాలో తాను సంతృప్తిగా పనిచేశానని చెప్పారు. ‘కలెక్టర్‌గా జిల్లాలో ఎన్నో కొత్త విషయాలు నేర్చుకున్నా. విలువైన ప్రభుత్వ భూములను కాపాడడం ఎనలేని సంతృప్తినిచ్చింది. సంక్షేమ పథకాలు, అభివృద్ధి పనులు పూర్తిస్థాయిలో చేపట్టాను. ప్రజాప్రతినిధులు, అధికారులు, మీడియా ప్రతినిధుల నుంచి మంచి సహకారం లభించింది. క్లిష్ట సమయాల్లో అండగా నిలిచారు’ అని రఘునందన్‌రావు తెలిపారు. -
ఖమ్మం కలెక్టర్‌గా మళ్లీ లోకేశ్‌కుమార్
హైదరాబాద్: ఖమ్మం జిల్లా కలెక్టర్‌గా లోకేశ్కుమార్ను తిరిగి నియమిస్తూ తెలంగాణ ప్రభుత్వం శనివారం ఉత్తర్వులు జారీ చేసింది. పాలేరు ఉప ఎన్నిక నేపథ్యంలో ఎన్నికల సంఘం లోకేశ్ కుమార్‌ను బదిలీ చేసిన విషయం విదితమే. ఈ ఉప ఎన్నిక పూర్తయ్యాయి...ఫలితాలు వెల్లువడ్డాయి. దీంతో లోకేశ్ కుమార్‌ను తిరిగి ఖమ్మం కలెక్టర్‌గా నియమితులయ్యారు. అయితే ఇప్పటి వరకు ఆ పదవిలో ఉన్న దానకిషోర్ తిరిగి హెచ్ఎంసడబ్యూఎస్ఎస్కు బదిలీ చేసింది. ఈ మేరకు తెలంగాణ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. -
ఖమ్మం కలెక్టర్, ఎస్పీపై సీఈసీ వేటు
♦ ఖమ్మం కలెక్టర్, ఎస్పీపై బదిలీ వేటు ♦ కాంగ్రెస్ ఫిర్యాదు నేపథ్యంలో చర్యలు చేపట్టిన ఎన్నికల సంఘం ♦ పాలేరు రిటర్నింగ్ ఆఫీసర్ కూడా తొలగింపు సాక్షి, హైదరాబాద్: పాలేరు ఉప ఎన్నికలో అధికారులు, పోలీసులు అధికార పార్టీకి అనుకూలంగా పనిచేస్తున్నారంటూ టీపీసీసీ చేసిన ఫిర్యాదుతో ఖమ్మం జిల్లా కలెక్టర్, జిల్లా ఎస్పీతోపాటు పాలేరు ఉప ఎన్నిక రిటర్నింగ్ అధికారిపై బదిలీ వేటు పడింది. వారిని ఆయా స్థానాల నుంచి తొలగించి, వేరే అధికారులను నియమించాలని కేంద్ర ఎన్నికల సంఘం (సీఈసీ) ఆదేశించింది. ఈ మేరకు వారిని బదిలీ చేసిన రాష్ట్ర ప్రభుత్వం.. సీఈసీ సూచనల మేరకు ఖమ్మం కలెక్టర్‌గా దానకిశోర్, ఎస్పీగా రమారాజేశ్వరి, రిటర్నింగ్ అధికారిగా బి.శంకర్లను నియమిస్తూ మంగళవారం రాత్రి ఉత్తర్వులు జారీ చేసింది. టీఆర్ఎస్ అధికార దుర్వినియోగం.. టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, ఎంపీ రేణుకా చౌదరి, పలువురు రాష్ట్ర నేతలు మంగళవారం ఢిల్లీలో ఎన్నికల ప్రధాన కమిషనర్ (సీఈసీ) నసీమ్ జైదీని కలిశారు. ప్లీనరీ పేరిట టీఆర్ఎస్ అధికార దుర్వినియోగానికి పాల్పడుతోందని ఫిర్యాదు చేశారు. తెలంగాణలో ప్రజాస్వామ్యం ప్రమాదంలో పడిందని, కేంద్ర బలగాలను రంగంలోకి దింపి ఎన్నికలు నిర్వహించాలని విజ్ఞప్తి చేశారు. దీనిపై వెంటనే స్పందించిన సీఈసీ... జిల్లా కలెక్టర్, ఎస్పీ, రిటర్నింగ్ అధికారిని బదిలీ చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. ఆయా స్థానాల్లో అధికారుల నియామకానికి పేర్లను సూచించాలని కోరింది. ఈ మేరకు ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ఎస్పీగా నియమించేందుకు ఐపీఎస్‌లు వై.ప్రకాశ్‌రెడ్డి, విక్రమ్‌జిత్‌సింగ్ దుగ్గల్, రమా రాజేశ్వరిల పేర్లతో కూడిన జాబితాను, కలెక్టర్‌గా నియమించేందుకు ఐఏఎస్‌లు రాహుల్ బొజ్జా, సందీప్ సుల్తానియా, దానకిశోర్‌ల పేర్లతో జాబితాను సీఈసీకి పంపించింది. వీరిలో సీఈసీ సూచనల మేరకు కలెక్టర్‌గా దానకిశోర్, ఎస్పీగా రమారాజేశ్వరి, రిటర్నింగ్ అధికారిగా బి.శంకర్లను నియమించింది. ఖమ్మం కలెక్టర్‌గా ఉన్న లోకేశ్‌కుమార్, ఎస్పీగా ఉన్న షానవాజ్ ఖాసీం, ఉప ఎన్నిక రిటర్నింగ్ అధికారిగా బాధ్యతలు నిర్వర్తిస్తున్న స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ (రైల్వేస్) సీహెచ్ గణేశ్‌లను బదిలీ చేసింది. ఖమ్మం కలెక్టర్‌గా నియామకమైన దానకిశోర్ ప్రస్తుతం మున్సిపల్ పాలన, పట్టణాభివృద్ధి శాఖ కమిషనర్‌గా, జలమండలి డెరైక్టర్‌గా... ఎస్పీగా నియామకమైన రమా రాజేశ్వరి రంగారెడ్డి జిల్లా ఎస్పీగా, బి.శంకర్ వరంగల్ డిప్యూటీ కలెక్టర్ గా ఉన్నారు. -
ఖమ్మం కలెక్టర్‌గా దానకిషోర్
ఖమ్మం: ఖమ్మం జిల్లాలోని పాలేరు నియోజకవర్గంలో ఉప ఎన్నిక నేపథ్యంలో తెలంగాణ పీసీసీ కేంద్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేసింది. దీంతో ముగ్గురు అధికారులను మంగళవారం కేంద్ర ఎన్నికల సంఘం బదిలీ చేసింది. ఖమ్మం జిల్లా కలెక్టర్‌గా దానకిశోర్ బాధ్యతలు చేపట్టనున్నారు. జిల్లా ఎస్పీగా రమా రాజేశ్వరి, పాలేరు ఉప ఎన్నిక రిటర్నింగ్ అధికారిగా డిప్యూటీ కలెక్టర్ శంకర్ లను నియమిస్తూ కేంద్ర ఎన్నికల సంఘం నిర్ణయం తీసుకుంది. -
'అభివృద్ధికి కలెక్టర్ సహకరించటం లేదు'
ఖమ్మం(అశ్వారావుపేట): ఖమ్మం జిల్లా అశ్వరావుపేట ఎమ్మెల్యే తాటి వెంకటేశ్వర్లు సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆయన ఆదివారం అశ్వారావుపేటలో జరిగిన ప్రపంచ ఆదివాసీ దినోత్సవ వేడుకల్లో పాల్గొని ప్రసంగించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ఆదివాసీల అభివృద్ధికి కలెక్టర్ సహకరించటం లేదని సంచలన వ్యాఖ్యలు చేశారు. గతంలో జిల్లాకు కలెక్టర్ గా పనిచేసిన వారు ఏజెన్సీ ప్రాంతంలో పర్యటించి అక్కడ సమస్యలు పరిష్కరించేవారని చెప్పారు. అయితే ప్రస్తుతం కలెక్టర్ కేవలం పట్టణాల్లో మాత్రమే పర్యటిస్తున్నారని అని వ్యాఖ్యనించారు.