సాక్షి, ఖమ్మం : గ్రామంలో పారిశుద్ధ్య సమస్యలు లేకుండా రుద్రాక్షపల్లి గ్రామాన్ని సుందరంగా తీర్చిదిద్దాలని ఖమ్మం కలెక్టర్ ఆర్వీ కర్ణన్ ఆదేశించారు. సత్తుపల్లి మండలం రుద్రాక్షపల్లి గ్రామంలో 30 రోజుల్లో గ్రామాభివృద్ధి ప్రణాళిక కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. శ్మశాన వాటికకు స్థలం ఉందా? అని వీఆర్వోను ప్రశ్నించగా.. ఉందని వీఆర్వో సమాధానం చెప్పగా.. గ్రామస్తులు లేదని తెలిపారు. ఇలా గ్రామ సమస్యలను అడిగి తెలుసుకున్నారు.
‘ఏమ్మా పెన్షన్ డబ్బులు ఏం చేస్తున్నావు..’ అని కలెక్టర్ కర్ణన్ ఈ సందర్భంగా ఓ వృద్ధురాలిని ప్రశ్నించారు. దీంతో ఆమె.. గతంలో మద్యం సేవించే దానిని.. ఇప్పుడు మానేశానని, ఖర్చులకు, మందులకు వాడుకుంటున్నా అని సమాధానమిచ్చింది. దీంతో అందరూ ఒక్కసారిగా నవ్వుకున్నారు. ‘నీకు ఎంత వ్యవసాయ భూమి ఉందా?’ అని అడగగా.. తెలియదు.. నాకు చదువురాదు.. అని సమాధానం చెప్పింది. అలాగే ఓ విద్యార్థిని దగ్గరకు తీసుకొని ‘నీవు మంచిగా చదువుకొని భవిష్యత్‌తో మంచి ఉద్యోగం చేయాలని.. తల్లిదండ్రులను మంచిగా చూసుకో’ అని కలెక్టర్ సూచించారు
Comments
Please login to add a commentAdd a comment