సాక్షి, హైదరాబాద్: తమ ఆదేశాలను సకాలంలో అమలు చేయడంలో నిర్లక్ష్యంగా వ్యవహరించిన ఖమ్మం జిల్లా కలెక్టర్ ఆర్‌వీ కర్ణన్ తీరుపై హైకోర్టు ఆగ్రహం వ్యక్తంచేసింది. కోర్టుధిక్కరణ పిటిషన్ దాఖలు చేసిన తర్వాత తమ ఆదేశాలను అమలు చేశారని మండిపడింది. నిర్లక్ష్యంగా వ్యవహరించిన కర్ణన్‌కు రూ.500 జరిమానా విధించింది. ఈమొత్తాన్ని ఆయన జీతం నుంచి వసూలు చేయాలని స్పష్టం చేసింది. ఈ తీర్పును ప్రభుత్వ ప్రధాన కార్యదర్శితోపాటు అన్ని శాఖల ముఖ్య కార్యదర్శులకు పంపాలని ఆదేశించింది. ఈ మేరకు న్యాయమూర్తి జస్టిస్ చల్లా కోదండరామ్ ఇటీవల తీర్పునిచ్చారు.
పెనుబల్లి తహసీల్దార్ తప్పుడు రికార్డులు సృష్టించారని, వీటి ఆధారంగా గ్రామీణ వికాస బ్యాంకు అధికారులకు అక్రమార్కులకు క్రాప్ లోన్లు మంజూరు చేస్తున్నారని, ఈ వ్యవహారంపై చర్యలు తీసుకోవాలంటూ అదే మండలానికి చెందిన కె.వెంకట్రామయ్య ఖమ్మం కలెక్టర్‌కు 2019 ఆగస్టు, సెప్టెంబర్, అక్టోబర్ నెలల్లో వినతిపత్రం అందించారు. ఈ పిటిషన్‌ను విచారించిన హైకోర్టు ఈ వ్యవహారంపై చర్య తీసుకోవాలని కలెక్టర్‌ను ఆదేశించింది. దాదాపు 10 నెలలు గడిచినా ఎటువంటి చర్యలు తీసుకోకపోవడం తో గతేడాది సెప్టెంబర్ 8న వెంకట్రామయ్య కోర్టు ధిక్కరణ పిటిషన్ దాఖలుచేశారు.
చదవండి: సీతక్కపై నాన్ బెయిల్ ఉపసంహరణ
Comments
Please login to add a commentAdd a comment