Viral Image: Gujarat Woman ASI Son Becomes DSP, Salutes Each Other - Sakshi
Sakshi News home page

అమ్మ కళ్లల్లో ఆనందం: డీఎస్పీ కుమారుడికి సెల్యూట్‌ చేసిన ఏఎస్సై తల్లి

Published Fri, Aug 20 2021 7:26 PM | Last Updated on Sat, Aug 21 2021 1:54 PM

DSP Son And ASI Mom Salute Each Other In Viral Photo - Sakshi

గాంధీనగర్‌: పిల్లలు జీవితంలో ఉన్నత శిఖరాలను అధిరోహిస్తే.. సహజంగానే తల్లిదండ్రుల ఆనందానికి అవధులుండవు. అయితే, పిల్లలను తమే గౌరవించాల్సిన ఉన్నత స్థితికి వారు చేరుకుంటే తల్లిదండ్రులకు పట్టపగ్గాలు ఉండవని ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు. ఇలా ఈ మధ్యకాలంలో ఉద్యోగరిత్యా కొడుకును తండ్రి గౌరవించడం, ఉన్నతాధికారి అయిన కుమార్తెకు తండ్రి సెల్యూట్‌ చేయడం వంటి సన్నివేశాలను మనం చూసాం. అయితే ఇప్పుడు మనం చూడబోయే ఓ చిత్రంలో కన్నతల్లి.. ఉన్నతాధికారి అయిన కొడుకుకు సెల్యూట్‌ చేస్తూ మురిసిపోతుంటుంది.  చదవండి: భారత ఎంబసీల్లో తాలిబన్ల సోదాలు

వివరాల్లోకి వెళితే.. గుజరాత్‌లోకి అరవల్లి ప్రాంత డీఎస్పీకి (పోలీస్‌ శాఖ).. స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా ఓ మహిళా ఏఎస్సై సెల్యూట్‌ చేస్తుంది. ఇందులో విశేషం ఏముందని అనుకుంటున్నారా. అక్కడ పరస్పరం సెల్యూట్‌ చేసుకున్న వారు తల్లి కొడుకు కావడమే విశేషం. ఈ సందర్భంగా తల్లి మురిసిపోతూ, కళ్ల నిండా ఆనందంతో కొడుకుకు సెల్యూట్‌ చేస్తున్న దృశ్యం హైలైట్‌గా నిలిచింది. ఈ అపురూప దృశ్యాన్ని గుజరాత్‌ పబ్లిక్‌ సర్వీస్‌ కమీషన్‌ చైర్మన్‌ దినేశ్‌ దాస ట్వీట్‌ చేయడంతో సోషల్‌మీడియాలో వైరల్‌గా మారింది. మనస్సుకు హత్తుకునే ఈ ఫోటోకు నెటిజన్లు ఫిదా అవుతున్నారు. అమ్మ కళ్లల్లో అసలుసిసలైన ఆనందాన్ని చూడాల్సిందే అంటూ కామెంట్లు చేస్తున్నారు.      
చదవండి: తండ్రితో పెళ్లికూతురు హుషారైన స్టెప్పులు.. ఫిదా అవ్వాల్సిందే

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement