Viral Pic
-
‘గూగుల్ తప్పు’.. నమ్మి వెళ్లారో.. అంతే! ఫొటో వైరల్
కొత్త ప్రాంతానికి వెళ్లినప్పుడు గతంలో పేపర్ మ్యాప్‌లను ఉపయోగించడమో లేదా స్థానికులను అడగడం ద్వారానో సరైన దారులను గుర్తించేవారు. అయితే సాంకేతికత పెరిగి యాపిల్ మ్యాప్స్ (Apple Maps), గూగుల్ మ్యాప్స్ (Google Maps) వంటి నావిగేషన్ యాప్‌లు అందుబాటులోకి రావడంతో ఈ ప్రక్రియను సులభతరం చేసింది. అయితే ఎంత లేదన్నా ఈ యాప్‌లు కొన్ని సమయాల్లో అవిశ్వసనీయంగా ఉంటాయి. మార్గాలు, ప్రయాణ ప్రణాళికలను ప్లాన్ చేయడంలో పనికొచ్చేవే అయినప్పటికీ ఒక్కోసారి తప్పుదారి పట్టిస్తుంటాయి. అలాంటి ఒక సంఘటన ఇటీవల సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. కర్ణాటకలోని కొడగు జిల్లాలో స్థానికులు గూగుల్ నావిగేషన్ పొరపాటు గురించి ప్రయాణికులను హెచ్చరించే తాత్కాలిక సైన్‌బోర్డ్‌ను ఏర్పాటు చేశారు. ఆ ప్రదేశంలో గూగుల్ నావిగేషన్‌ను అనుసరించవద్దని, క్లబ్ మహీంద్రా రిసార్ట్‌కు చేరుకోవడానికి వేరే మార్గంలో వెళ్లాలని సైన్‌బోర్డ్‌లో ప్రయాణికులకు సూచించారు. దీనికి సంబంధించిన ఫొటోను కొడగు కనెక్ట్ అనే పేరుతో ఉన్న ‘ఎక్స్’ (ట్విటర్) హ్యాండిల్ ద్వారా షేర్ చేశారు. “గూగుల్ తప్పు. ఈ రోడ్డు క్లబ్ మహీంద్రాకి వెళ్లదు” అంటూ ఆ సైన్ బోర్డులో ఉంది. ఫొటో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. గూగుల్ నావిగేషన్ తప్పుదారి పట్టించడంతో తాము కూడా ఇబ్బందులు ఎదుర్కొన్నట్లు పలువురు యూజర్లు తమ అనుభవాలను పంచుకున్నారు. Somewhere in Kodagu. @GoogleIndia pic.twitter.com/IkSQ9VybW1 — Kodagu Connect (@KodaguConnect) March 14, 2024 -
గూగుల్ సీఈఓ మరీ ఇంత సింపుల్గానా.. ఫోటో వైరల్!
భారతదేశం నుంచి వెళ్లి ప్రపంచమే గర్వించే స్థాయికి ఎదిగిన గూగుల్ సీఈఓ 'సుందర్ పిచాయ్' (Sundar Pichai) గురించి ప్రత్యేకంగా పరిచయమే అవసరం లేదు. ఎక్కువ జీతం తీసుకునే సీఈఓల జాబితాలో ఒకడైన ఈయన చాలా ఆడంబరంగా ఉంటారని చాలామంది ఊహించి ఉంటారు. కానీ తాజాగా విడుదలైన ఫోటో మీ ఆలోచనలను తారుమారు చేస్తుంది. మరింత సమాచారం ఈ కథనంలో తెలుసుకుందాం. బెంగళూరుకు చెందిన 'సిద్ పురి' ఇటీవలే శాన్ఫ్రాన్సిస్కో వెళ్లారు. అక్కడ ఉదయం వాకింగ్ చేసే సమయంలో సుందర్ పిచాయ్ పెద్దగా సెక్యూరిటీ లేకుండానే కనిపించారు. అప్పుడు సిద్ ఫోటో తీసుకోవచ్చా.. అని అడిగిన వెంటనే ఒప్పుకున్నాడు. ఈ ఫోటోలు ఆ వ్యక్తి తన సోషల్ మీడియాలో ఖాతాల్లో పోస్ట్ చేసాడు. ఇదీ చదవండి: ప్రపంచ కుబేరుల జాబితాలో 'రతన్ టాటా' ఎందుకు లేరు - కారణం ఇదే! ఈ ఫోటోలలో గమించినట్లతే.. సుందర్ పిచాయ్ చాలా సింపుల్‌గా బ్లూ జీన్స్, జాకెట్, బ్లాక్ సన్ గ్లాసెస్ పెట్టుకున్నాడు. ఈ ఫోటోని ఇప్పటికి 6 లక్షల కంటే ఎక్కువమంది వీక్షించారు. 4000 కంటే ఎక్కువ లైకులు వచ్చాయి. కొంతమంది నెటిజన్లు తమదైన రీతిలో కామెంట్స్ కూడా చేస్తున్నారు. ఇదీ చదవండి: భారత్‌లో ఐఫోన్ మేనియా.. ఎమ్ఆర్పీ కంటే ఎక్కువ ధరతో.. ఒక నెటిజన్ అక్కడ సెక్యూరిటీ ఎవరూ లేరా? అని అడిగాడు. దీనికి ఒక్క సెక్యూరిటీ ఉన్నాడు, అతడే ఫోటో తీసాడని సిద్ రిప్లై ఇచ్చాడు. మరి కొందరు అంత పెద్ద కంపెనీకి సీఈఓ అయినా చాలా సాధారణంగా ఉండటం చూస్తే.. చాలా ఆనందంగా ఉందన్నారు. ఎలాంటి సెక్యూరిటీ లేకుండా బయట తిరగటం కొంత ఆందోళన కలిగిస్తుందని ఒక నెటిజన్ పేర్కొన్నాడు. go to SF they said, no one prepared me to just run into Sundar Pichai on the street. pic.twitter.com/BJitwCw0EE — Sid Puri (@PuriSid) September 25, 2023 -
టాటా కంపెనీలో మొదటి మహిళా ఇంజినీర్ - ఎవరో చెప్పుకోండి చూద్దాం!
ప్రముఖ పారిశ్రామిక దిగ్గజం ఇన్ఫోసిస్ నారాయణ మూర్తి భార్య 'సుధామూర్తి' (Sudha Murthy) గురించి దాదాపు తెలియని వారు ఉండరు అంటే ఏ మాత్రం అతిశయోక్తి కాదు. ఎన్నో సామజిక కార్యక్రమాలు చేస్తూ ఎంతోమందికి రోల్ మోడల్‌గా నిలిచిన ఈ ఆదర్శమూర్తి ఇప్పుడు ఎలా ఉంటారనేది అందరికి తెలుసు. అయితే చదువుకునే వయసులో ఎలా ఉండేదో ఇక్కడ చూడవచ్చు. సుధామూర్తి 1974లో బెంగుళూరులోని ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ నుంచి కంప్యూటర్ సైన్స్ పూర్తి చేసి అప్పటి కర్ణాటక ముఖ్యమంత్రి నుంచి గోల్డ్ మెడల్ కూడా పొందింది. 150 మంది విద్యార్థులలో ఈమె ఒక్కరే మహిళ కావడం గమనార్హం. అప్పట్లో ఎన్నో ఆటంకాలను సైతం ఎదుర్కోగలిగిన ధీశాలి. మహిళల హక్కుల కోసం పాటుపడి అప్పట్లో ఏకంగా జేఆర్డీ టాటాకు లేఖ రాసింది. ఈ రోజు టాటా కంపెనీలో మహిళలు పనిచేస్తున్నారంటే దాని వెనుక సుధామూర్తి హస్తం ఉండటమే. ఇప్పటికే కళ, సంస్కృతి, ప్రజా పరిశుభ్రత, ఆరోగ్య సంరక్షణ, పేదరికం తగ్గింపు, మహిళా సాధికారత వంటి అనేక రంగాల్లో తనదైన రీతిలో సామజిక ఈమె సేవ చేసింది. ఇదీ చదవండి: ఎంతమంది ఉద్యోగాలు పోయినా వీరు చాలా సేఫ్.. జీతాలు కోట్లలో! సుధామూర్తి హార్వర్డ్ యూనివర్శిటీలో మూర్తి క్లాసికల్ లైబ్రరీ ఆఫ్ ఇండియాను స్థాపించింది. అనేక అనాథాశ్రమాలను స్థాపించింది, గ్రామీణాభివృద్ధి ప్రయత్నాలలో పాల్గొంది, అన్ని కర్ణాటక ప్రభుత్వ పాఠశాలలకు కంప్యూటర్ అండ్ లైబ్రరీ మౌలిక సదుపాయాలను అందించాలనే ఉద్యమానికి మద్దతు ఇచ్చింది. నిరాడంబరమైన సేవను గుర్తించిన భారత ప్రభుత్వం ఈమెకు పద్మ భూషణ్ అవార్డుతో సన్మానించింది. -
ఎవరో తెలుసా? ఈయన ఎంతోమందికి రోల్ మోడల్!
Childhood Photo: దేశీయ వాహన తయారీ దిగ్గజం 'మహీంద్రా అండ్ మహీంద్రా' కంపెనీ గురించి తెలిసిన ప్రతి ఒక్కరికీ 'ఆనంద్ మహీంద్రా' గురించి తెలిసే ఉంటుంది. ప్రముఖ పారిశ్రామిక వేత్త అయినప్పటికీ.. ట్విటర్ వేదికగా ఎప్పటికప్పుడు ఆసక్తికరమైన ఎన్నెన్నో విషయాలను పోస్ట్ చేస్తూ ఉంటారు. నేడు ఆనంద్ మహీంద్రా ఎలా ఉంటారనేది దాదాపు అందరికి తెలుసు. కానీ చిన్నప్పుడు ఎలా ఉండేవాడో బహుశా చాలామందికి తెలియకపోవచ్చు. ఇప్పటికి అందుబాటులో ఉన్న కొన్ని ఫోటోల ప్రకారం, ఆనంద్ మహీంద్రా చిన్ననాడు ఎలా ఉండేవారో తెలుస్తోంది. ఈ చిత్రంలో మీరు గమనించినట్లయితే ఆనంద్ మహీంద్రా గిటార్ వాయిస్తూ ఉండటం చూడవచ్చు. ఇదీ చదవండి: 40 సెకన్లకు ఓ కారు.. వినటానికి వింతగా ఉన్నా ఇది నిజం! వీడియో చూడండి 1973లో విడుదలైన ఒక మలయాళీ సినిమా పాటను పాడుతున్నట్లు తెలుస్తోంది. ఇందులో బ్రిటీష్ కుటుంబానికి చెందిన పిల్లలు కూడా ఉన్నట్లు సమాచారం. యువకుడుగా ఉన్నప్పుడు ఫోటో కూడా మీరు ఇక్కడ గమనించవచ్చు. ప్రస్తుతం ఆరుపదుల వయసు దాటినా చాలా హుందాగా.. ఎంతోమందికి ఆదర్శంగా నిలిచాడు. -
రతన్ టాటా ఎమోషనల్ పోస్ట్! మొదటి సారి ఇలా రిక్వెస్ట్ చేస్తూ..
రతన్ టాటా గురించి భారతదేశంలో మాత్రమే కాదు, ప్రపంచంలోని చాలా దేశాలకు బాగా తెలుసు. కేవలం దిగ్గజ పారిశ్రామిక వేత్తగా మాత్రమే కాకుండా.. దేశం కోసం తనదైన రీతిలో సేవ చేస్తూ.. ఎంతో మందికి స్ఫూర్తిగా నిలిచిన వ్యక్తిగా కూడా. ఈయన ఇటీవల ఇన్స్టాగ్రామ్, ట్విట్టర్ వంటి సోషల్ మీడియా హ్యాండిల్స్ ద్వారా ఒక పోస్ట్ చేసాడు. ఇది సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. దీని గురించి మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం. రతన్ టాటా పోస్ట్.. వర్షాకాలం మొదలైంది, వర్షాలు భారీగా కురుస్తున్న వేళ వాహనదారులు హడావిడిగా వాహనాలు నడుపుతూ ఉంటారు. అయితే కొంత మంది చేసే చిన్న తప్పిదాలు చాలా పెద్ద ప్రమాదానికి దారి తీస్తుంది. వర్షం పడే సమయంలో మూగజీవాలు వాహనాల కింద ఉండే అవకాశం ఉంటుంది. కావున వాహనాలను తీసేటప్పుడు తప్పకుండా కింద ఏమైనా ఉన్నాయా అని గమనించండి, లేకుంటే అవి తీవ్రంగా గాయపడి అవకాశం ఉంటుందని, కావున వాటికి ఆశ్రయం కల్పిస్తే చాలా గొప్పగా ఉంటుందని సోషల్ మీడియా వేదికగా రతన్ టాటా విజ్ఞప్తి చేశారు. (ఇదీ చదవండి: రైల్వే స్టేషన్లో ఇంత తక్కువ ధరకు రూమ్ లభిస్తుందని తెలుసా! ఎలా బుక్ చేసుకోవాలంటే?) Now that the monsoons are here, a lot of stray cats and dogs take shelter under our cars. It is important to check under our car before we turn it on and accelerate to avoid injuries to stray animals taking shelter. They can be seriously injured, handicapped and even killed if we… pic.twitter.com/BH4iHJJyhp — Ratan N. Tata (@RNTata2000) July 4, 2023 ఈ పోస్ట్ ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొట్టేస్తుంది. నిజానికి రతన్ టాటా ఇలాంటి అభ్యర్థన చేయడం ఇదే మొదటిసారి. మూగ జీవులకు రక్షణ కల్పించాలనే ఉద్దేశ్యంతో ఈ పోస్ట్ చేశారు. దీన్ని బట్టి చూస్తే ఈయనకు మూగ జీవాల పట్ల ఎంత ప్రేమ ఉందొ మనకు ఇట్టె అర్థమైపోతుంది. (ఇదీ చదవండి: అత్త ఐడియా కోడలి వ్యాపారం.. కళ్ళు తిరిగే సంపాదన, విదేశాల్లో కూడా యమ డిమాండ్!) రతన్ టాటా పెంపుడు శునకాల్లో ఒకటైన టిటోకి ఆరోగ్యం బాగాలేకపోవడం వల్ల 2018 లండన్‌లోని బకింగ్‌హామ్ ప్యాలస్‌లో అప్పటి ప్రిన్స్ చార్లెస్ నుంచి అందుకునే పురస్కారానికి కూడా వెళ్ళలేదు. జంతువులంటే ఆయనకు ఎంత ప్రేమ ఉందో ఈ ఒక్క ఉదాహరణ చాలు. -
Trending Pic: విండీస్ యోధుడి ముఖం చినబోయిన వేళ..!
వరల్డ్‌కప్ క్వాలిఫయర్స్ 2023లో నిన్న (జూన్ 26) జరిగిన గ్రూప్-ఏ మ్యాచ్‌లో టూ టైమ్ వరల్డ్ ఛాంపియన్ వెస్టిండీస్‌పై పసికూన నెదర్లాండ్స్ సంచలన విజయం సాధించిన విషయం తెలిసిందే. ఈ మ్యాచ్‌లో ఓడిన విండీస్ సూపర్ సిక్స్‌కు చేరినప్పటికీ.. వరల్డ్‌కప్-2023కు అర్హత సాధించే అవకాశాలను మాత్రం సంక్లిష్టం చేసుకుంది. సూపర్ సిక్స్‌లో విండీస్ ఆడాల్సిన 3 మ్యాచ్‌ల్లో గెలిచినా వరల్డ్‌కప్‌కు అర్హత సాధించడ కష్టమే. ప్రస్తుత పరిస్థితులను బట్టి చూస్తే జింబాబ్వే, శ్రీలంకలకు వరల్డ్‌కప్ బెర్త్ దొరకడం ఖాయమని తెలుస్తుంది. కాగా, నెదర్లాండ్స్ చేతిలో ఓటమి అనంతరం యావత్ వెస్టిండీస్ బృందంలో బాధ కొట్టొచ్చినట్లు స్పష్టంగా కనిపించింది. డ్రెస్సింగ్ రూమ్‌లో కోచ్ కార్ల్ హూపర్తో పాటు ఆటగాళ్లంతా దాదాపుగా కన్నీరు పెట్టుకున్నంత పని చేశారు. ఒకప్పుడు ప్రపంచ క్రికెట్‌ను శాసించిన మాకు ఇదేం గతి అన్నట్లు వారు వ్యవహరించారు. వీరందరి బాధ కంటే ఓ విండీస్ యోధుడి ముఖంలో కనిపించిన నిరాశ, నిర్వేదం చూపరులకు చాలా బాధ కలిగించింది. మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు ప్రజంటేషన్ సందర్భంగా విండీస్ మాజీ ప్లేయర్ కార్లోస్ బ్రాత్‌వైట్ ముఖంలో కనిపించిన ఎక్స్ప్రెషన్.. యావత్ విండీస్ అభిమానుల బాధను ప్రతిబింబించింది. లోగాన్ వాన్ బీక్కు అవార్డు బహుకరిస్తున్న సమయంలో బ్రాత్‌వైట్ ముఖం చాలా చిన్నబోయినట్లు కనిపించింది. అతని ముఖం విండీస్ ఓటమి తాలూక బాధ కొట్టొచ్చినట్లు కనపడింది. ఈ పిక్ ప్రస్తుతం నెట్టింట ట్రెండింగ్‌లో ఉంది. ఈ పిక్ చూసి క్రికెట్ అభిమానులు విండీస్‌పై జాలి చూపిస్తున్నారు. ఒకప్పుడు ప్రపంచ క్రికెట్‌ను శాసించిన జట్టుకు ఈ దుస్థితి ఏంటని బాధపడుతున్నారు. కాగా, కార్లోస్ బ్రాత్‌వైట్ 2016లో విండీస్ రెండో సారి టీ20 వరల్డ్‌కప్ సాధించడంలో కీలకపాత్ర పోషించాడు. ఆ టోర్నీ ఫైనల్లో బ్రాత్‌వైట్.. బెన్ స్టోక్స్ వేసిన ఆఖరి ఓవర్లో వరుసగా నాలుగు సిక్సర్లు బాది విండీస్‌ను జగజ్జేతగా నిలబెట్టాడు. -
ధోని, కోహ్లి అందమైన అమ్మాయిలుగా మారితే..?
ఎంఎస్ ధోని, విరాట్ కోహ్లీ ఉన్నట్టుండి అందమైన అమ్మాయిలుగా మారితే? ‘అదెట్లా సాధ్యమండీ’ అనే సౌండ్ రాకముందే– ‘ఇదిగో ఇట్లా’ అని ఆర్టిస్ట్ అబూ షాహిద్ ఏఐ టెక్నాలజీతో వారిని అందమైన అమ్మాయిలుగా మార్చాడు. పనిలో పనిగా ఈ ఇద్దరు క్రికెట్ దిగ్గజాలను షాహిద్ ముసలోళ్లుగా కూడా మార్చాడు. ఈ ఫొటోలు నెట్టింట హల్చల్ చేశాయి. ఈ పోస్ట్‌లను లైక్ చేస్తూ నెటిన్లు ‘కలయా నిజమా’ అంటూ కామెంట్లు చేశారు. ధోని, కోహ్లిలనే కాకుండా షాహిద్ మరికొంత మంది టీమిండియా క్రికెటర్లను కూడా అమ్మాయిలుగా మార్చాడు. శుభ్‌మన్ గిల్, యువరాజ్ సింగ్, గౌతమ్ గంభీర్, హార్ధిక్ పాండ్యా, శిఖర్ ధవన్, రిషబ్ పంత్.. ఇలా పలువురు స్టార్ క్రికెటర్లను షాహిద్ ఏఐ టెక్నాలజీతో అందమైన అమ్మాయిలుగా మార్చాడు. ఈ ఫోటోలు సైతం వైరల్ కావడంతో నెటిజన్లు ఒక్కొకరికి ఒక్కో అమ్మాయి పేరు పెట్టి తమ సరదా తీర్చుకున్నారు. షాహిద్ క్రికెట్ స్టార్లనే కాకుండా సినీ తారలను సైతం ఏఐ టెక్నాలజీతో అమ్మాయిలుగా మార్చాడు. ఆ ఫోటోలు కూడా నెట్టింట తెగ సందడి చేశాయి. -
ముఖంపై గాయాలతో కీర్తి సురేష్.. వైరలవుతోన్న ఫోటోలు
-
అరంగేట్రంలోనే అదరగొట్టిన విజయ్‌కుమార్.. పుత్రోత్సాహంతో పొంగిపోయిన తల్లి
ఢిల్లీ క్యాపటల్స్తో నిన్న జరిగిన మ్యాచ్‌లో కీలకమైన 3 వికెట్లు (4-0-20-3) పడగొట్టి తన జట్టు విజయంలో ప్రధాన పాత్ర పోషించిన రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు పేస్ బౌలర్ విజయ్‌కుమార్ వైశాఖ్‌పై సర్వత్రా ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి. ఆర్సీబీ తరఫున డెబ్యూ మ్యాచ్‌లో అత్యుత్తమ బౌలింగ్ గణాంకాలు నమోదు చేసిన వైశాఖ్.. డీసీ స్టార్ ప్లేయర్, ఆ జట్టు కెప్టెన్ డేవిడ్ వార్నర్ ఔట్ చేసి ఐపీఎల్ వికెట్ల ఖాతా తెరిచాడు. ఆ తర్వాత ఆల్‌రౌండర్లు అక్షర్ పటేల్, లలిత్ యాదవ్‌ల వికెట్లు తీసి ఢిల్లీ పతనాన్ని శాసించాడు. అరంగేట్రం మ్యాచ్‌లోనే అద్భుతమైన ప్రదర్శన కనబర్చి, రాత్రిరాత్రే స్టార్డమ్ తెచ్చుకున్న వైశాఖ్‌ను చూసి అతని తల్లి పుత్రోత్సాహంతో పరవశించిపోయింది. మ్యాచ్ అనంతరం కొడుకును చూడగానే ఆమె పట్టలేనంత ఆనందంతో బిడ్డను ముద్దాడింది. ఈ సన్నివేశాన్ని చూస్తూ పక్కనే ఉన్న తండ్రి మురిసిపోయాడు. 26 ఏళ్ల వైశాఖ్ తమ సొంత ప్రేక్షకుల ముందు తొలి మ్యాచ్‌లోనే విజృంభించడంతో అతని తల్లిదండ్రులు పట్టరాని ఆనందంతో ఉప్పొంగిపోయారు. వైశాఖ్ తల్లి అతన్ని ముద్దు పెట్టుకుంటున్న దృశ్యం ప్రస్తుతం సోషల్‌మీడియాలో చక్కర్లు కొడుతుంది. ఈ ఫోటోకు ఆర్సీబీ అభిమానులు పిక్చర్ ఆఫ్ ది డే అంటూ కామెంట్లు చేస్తున్నారు. కాగా, నిన్న (ఏప్రిల్ 15) ఢిల్లీ క్యాపిటల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో బ్యాటింగ్‌లో కోహ్లి (50), బౌలింగ్‌లో విజయ్‌కుమార్ వైశాఖ్ (3/20) రాణించడంతో ఆర్సీబీ 23 పరుగుల తేడాతో విజయం సాధించింది. ఈ సీజన్లో ఆర్సీబీకి ఇది రెండు వరుస పరాజయాల తర్వాత వచ్చిన విజయం (రెండవది). విజయ్‌కుమార్ వైశాఖ్ గురించి.. కర్ణాటకకు చెందిన విజయ్‌కుమార్ వైశాఖ్ 2020-21 సీజన్లో విజయ్‌హజారే ట్రోఫీలో కర్ణాటక తరఫున దేశవాలీ క్రికెట్లోకి అరంగేట్రం చేశాడు. ఆ తర్వాత సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీ ద్వారా టీ20 క్రికెట్లోకి ఎంట్రీ ఇచ్చాడు. వైశాఖ్.. కర్ణాటక తరఫున 2021-22 రంజీ ట్రోఫీ కూడా ఆడాడు. వైశాఖ్.. ఇప్పటివరకు 10 ఫస్ట్‌క్లాస్ మ్యాచ్‌ల్లో 38 వికెట్లు, 14 టీ20ల్లో 22 వికెట్లు, 7 లిస్ట్-ఏ మ్యాచ్‌ల్లో 11 వికెట్లు పడగొట్టాడు. ప్రస్తుత ఐపీఎల్ సీజన్ సందర్భంగా రజత్ పాటిదార్ గాయపడడంతో అతని స్థానంలో వైశాఖ్ ఆర్సీబీలోకి వచ్చాడు. -
అది మైండ్‌లో నుంచి పోవడం లేదు.. బయటపడలేకపోతున్నా: రష్మిక
రష్మిక మందన్న.. కన్నడ ఇండస్ట్రీలో సినీ కెరీర్ ప్రారంభించిన ఈ అమ్మడు, ‘ఛలో’ సినిమాతో టాలీవుడ్ ప్రేక్షకులను పలకరించింది. ఈ చిత్రం సూపర్ హిట్ టాక్ కావడంతో రష్మిక దశ తిరిగింది. వరుస ఆఫర్లు అందుకుని మంచి విజయాలతో దూసుకుపోతూ నేషనల్ క్రష్‌గా గుర్తింపు తెచ్చుకుంది. ప్రస్తుతం వరుస సినిమాలతో ఎంతో బిజీగా ఉన్నా.. సోషల్ మీడియాలో కూడా యాక్టివ్‌గా ఉంటూ తనకు సంబంధించిన అన్ని విషయాలను అభిమానులతో పంచుకుంటోంది. తాజాగా రష్మిక తన ఇన్‌స్టా ఖాతాలో కొన్ని ఫోటోలను షేర్ చేస్తూ తాను ఇంకా ఐపీఎల్ (IPL 2023) హ్యాంగోవర్ నుంచి బయట పడలేదని వెల్లడించింది. రష్మిక ఇప్పటికే సౌత్‌లో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది. గతేడాది విడుదలైన ‘పుష్ప ది రైజ్’ సినిమా బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లను రాబట్టడంతో పాటు పాన్ ఇండియా రేంజ్లో హిట్‌గా నిలిచింది. ఈ చిత్రం ముఖ్యంగా బాలీవుడ్లో ఊహించని కలెక్షన్లను అందుకుని ఆశ్చర్యపరిచిన సంగతి తెలిసిందే. ఇందులో హీరోయిన్గా నటించిన రష్మికకు కూడా జాతీయ స్థాయిలో గుర్తింపు రావడంతో ప్రస్తుతం అటు బీటౌన్‌లోనూ అవకాశాలను అందిపుచ్చుకుని జెట్ స్పీడ్‌లో దూసుకుపోతోంది ఈ భామ. ఇటీవల ఐపీఎల్ 2023 ప్రారంభోత్సవ కార్యక్రమంలో డ్యాన్స్ చేసి అందరిని అలరించింది రష్మిక. ఇందులో ఈ అమ్మడుతో పాటు తమన్నా కూడా పాల్గొన్న సంగతి తెలిసిందే. ఐపీఎల్ ప్రారంభోత్సవానికి సంబంధించిన ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేసిన ఈ భామ.. తాను ఈ ఐపీఎల్ వేడుక కార్యక్రమం మైండ్ నుంచి పోవడం లేదుని, అందులో నుంచి బయటపడలేకపోతున్నానని క్యాప్షన్ పెట్టింది. ఈ ఫోటోలతో పాటు భారత మాజీ కెప్టన్, సీఎస్కే సారథి మహేంద్ర సింగ్ ధోనితో కలిసి తీసుకున్న ఫోటోను కూడా షేర్ చేసింది. ప్రస్తుతం ఈ ఫోటోలు నెట్టింట వైరల్‌గా మారాయి. ఇక సినిమాల విషయానికి వస్తే.. ప్రస్తుతం రష్మిక అల్లు అర్జున్ హీరోగా సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న పుష్ప 2 సినిమా షూటింగ్ పనులలో బిజీగా ఉన్నారు. ఈ ప్రాజెక్ట్‌తో పాటు నితిన్ సరసన మరోసారి సందడి చేయబోతోంది. -
చీరకట్టులో తళుక్కుమన్న టీమిండియా కెప్టెన్
భారత మహిళా క్రికెట్ జట్టు సారధి హర్మన్‌ప్రీత్ కౌర్ కొత్త లుక్‌తో అదరగొట్టింది. ఎప్పుడూ స్పోర్ట్స్ డ్రెస్‌లో కనిపించే ఈ ఛాంపియన్ కెప్టెన్ కొత్తగా చీరకట్టులో కనిపించి అభిమానుల ఫ్యూజులు ఎగురగొట్టింది. భారతీయత ఉట్టిపడేలా చీరకట్టులో తళుక్కుమన్న హర్మన్‌ను చూసి నెటిజన్లు అవాక్కవుతున్నారు. ఈ ఫోటోను హర్మన్ స్వయంగా తన ఇన్‌స్టా ఖాతాలో పోస్ట్ చేయగా నెటిజన్ల నుంచి ఊహించని రెస్పాన్స్ వస్తుంది. View this post on Instagram A post shared by Harmanpreet Kaur (@imharmanpreet_kaur) కొందరు హర్మన్ ఫోటోను చూసి అచ్చం మళయాళ కుట్టిలా ఉందని అంటుంటే మరికొందరేమో బెంగాళీ భామ అని, తెలుగమ్మాయిలా కనిపిస్తుందని కామెంట్లు చేస్తున్నారు. మొత్తానికి ఈ పోస్ట్ చేసిన గంటల వ్యవధిలోనే లక్షల సంఖ్యలో లైక్స్ రావడంతో సోషల్‌మీడియాలో వైరలవుతోంది. ఇదిలా ఉంటే, ఇటీవలే ముగిసిన మహిళల ఐపీఎల్ (డబ్ల్యూపీఎల్) అరంగేట్రం సీజన్లో హర్మన్ నేతృత్వంలోని ముంబై ఇండియన్స్ మహిళల జట్టు ఛాంపియన్‌గా అవతరించిన విషయం తెలిసిందే. ఫైనల్లో ముంబై.. ఢిల్లీ క్యాపిటల్స్ వుమెన్ జట్టుపై 7 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించి టైటిల్ చేజిక్కించుకుంది. లీగ్ ప్రారంభం నుంచే హాట్ ఫేవరెట్‌గా మారిన హర్మన్ సేన, ఎలిమినేటర్‌లో యూపీ వారియర్జ్‌ను మట్టికరిపించి తుది పోరుకు అర్హత సాధించింది. ఫైనల్లో తొలుత బ్యాటింగ్ చేసిన ఢిల్లీ.. హేలీ మాథ్యూస్ (4-2-25-3), మేలీ కెర్ (4-0-18-2) అద్భుత ప్రదర్శన ధాటికి నిర్ణీత ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి 131 పరుగులు చేసింది. ఛేదనలో నాట్ సీవర్ బ్రంట్ (60 నాటౌట్), హర్మన్ (37) రాణించడంతో ముంబై 19.3 ఓవర్లలో 3 వికెట్లు కోల్పోయి విజయతీరాలకు చేరుకుంది. లీగ్ ఆధ్యాంతం అద్భుతంగా రాణించిన హర్మన్.. సీజన్లో అత్యధిక పరుగులు సాధించిన బ్యాటర్ల జాబితాలో నాలుగో స్థానంలో నిలిచింది. ఆరంభం ఎడిషన్‌లో మొత్తం 10 మ్యాచ్‌లు ఆడిన హర్మన్.. 40.41 సగటున, 135.10 స్ట్రయిక్ రేట్‌తో 281 పరుగులు చేసింది. ఇందులో 3 హాఫ్ సెంచరీలు ఉన్నాయి. -
IPL 2023: ధోని సిక్సర్లు; చెన్నై గెలుపు.. బిత్తరపోయిన గంభీర్! వైరల్
IPL 2023- CSK Vs LSG: ఐపీఎల్-2023లో చెన్నై సూపర్ కింగ్స్ చేతిలో లక్నో సూపర్ జెయింట్స్ ఓటమి నేపథ్యంలో గౌతం గంభీర్ ట్రోలింగ్ బారిన పడ్డాడు. రాహుల్ బృందంపై ధోని సేన గెలుపుతో మీమర్స్‌కు టార్గెట్ అయ్యాడు. కాగా చెపాక్ వేదికగా సోమవారం జరిగిన మ్యాచ్‌లో టాస్ గెలిచిన లక్నో కెప్టెన్ కేఎల్ రాహుల్ తొలుత బౌలింగ్ ఎంచుకున్నాడు. ఈ క్రమంలో సుదీర్ఘ విరామం తర్వాత సొంత మైదానంలో మ్యాచ్ ఆడిన చెన్నై బ్యాటర్లు దంచికొట్టారు. ఓపెనర్లు రుతురాజ్ గైక్వాడ్ హాఫ్ సెంచరీ, డెవాన్ కాన్వే మెరుగైన ఇన్నింగ్స్ కారణంగా నిర్ణీత 20 ఓవర్లలో ఏడు వికెట్లు నష్టపోయి 217 పరుగులు చేసింది సీఎస్కే. ఆరంభంలో అదరగొట్టిన లక్నో ఆఖరికి లక్ష్య ఛేదనకు దిగిన లక్నో ఆరంభంలో అదరగొట్టినా ఆఖరికి వచ్చే సరికి చేతులెత్తేసింది. చివరి బంతి వరకు ఉత్కంఠ రేపిన మ్యాచ్‌లో 12 పరుగుల తేడాతో ఓటమిని మూటగట్టుకుంది. తద్వారా ఈ సీజన్లో తొలి పరాజయం నమోదు చేసింది. ఇదిలా ఉంటే.. ఈ మ్యాచ్‌లో ధోని వరుసగా రెండు సిక్స్‌లు కొట్టడం హైలైట్‌గా నిలిచింది. ఈ నేపథ్యంలో లక్నో సూపర్ జెయింట్స్ మెంటార్, టీమిండియా మాజీ ఓపెనర్ గౌతం గంభీర్ ఎక్స్ప్రెషన్ వైరల్‌గా మారింది. డగౌట్లో నిరాశగా కూర్చున్న గంభీర్ ఫొటోలు షేర్ చేస్తూ మీమ్స్ సందడి చేస్తున్నారు నెటిజన్లు. ఐపీఎల్-2022లో చెన్నైపై లక్నో విజయం సందర్భంగా అమితానందంతో గంతులేసిన గంభీర్‌కు.. ఇప్పటి గంభీర్‌కు చాలా తేడా ఉంది కదా అంటూ ధోని ఫ్యాన్స్ ట్రోల్ చేస్తున్నారు. తగ్గేదేలే ఇక ఈ మ్యాచ్‌లో ధోని తమ జట్టు ఇన్నింగ్స్ ఆఖర్లో రెండు సిక్సర్లతో చెలరేగిన ఫొటోలు పంచుకుంటూ.. ‘‘ఇదీ తలైవా అంటే.. ఇప్పటికీ బ్యాటింగ్‌లో పవర్ ఏమాత్రం తగ్గలేదు’’ అని గంభీర్‌కు కౌంటర్ ఇస్తున్నారు. కాగా ధోనిని ఉద్దేశించి గంభీర్ పలు సందర్భాల్లో విమర్శలు చేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలోనే గంభీర్‌ను ట్రోల్ చేస్తున్నారు తలైవా ఫ్యాన్స్. చదవండి: CSK Vs LSG: చెత్త బౌలింగ్.. పేసర్లకు ధోని స్ట్రాంగ్ వార్నింగ్! ఇలాగే కొనసాగితే A treat for the Chennai crowd! 😍@msdhoni is BACK in Chennai & how 💥#TATAIPL | #CSKvLSG WATCH his incredible two sixes 🔽 pic.twitter.com/YFkOGqsFVT — IndianPremierLeague (@IPL) April 3, 2023 Hold Gautam Gambhir 😂💉 MS Dhoni & CSK showed him his levels. pic.twitter.com/GE0N5dV6KN — supremo ` (@hyperKohli) April 3, 2023 LET’S ALL LAUGH AT GAMBHIR 😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂 pic.twitter.com/dkdx90Q75H — ` (@rahulmsd_91) April 3, 2023 A memorable homecoming 😊 Consecutive fifties 👌 4️⃣-wicket haul 👍@Ruutu1331 and Moeen Ali sum up @ChennaiIPL's special win in Chennai 👏 👏 - By @RajalArora FULL INTERVIEW 🎥 🔽 #TATAIPL | #CSKvLSG https://t.co/K33OGYdydH pic.twitter.com/cP7Ml2bNfH — IndianPremierLeague (@IPL) April 4, 2023 -
కండల కాంతారావులా ధోని.. ఈ ఫిట్నెస్తో సిక్సర్లు కొడితే..!
మార్చి 31 నుంచి ప్రారంభంకానున్న ఐపీఎల్ 2023 సీజన్ కోసం చెన్నై సూపర్ కింగ్స్ సారధి మహేంద్ర సింగ్ ధోని చాలా రోజుల నుంచి కఠోరంగా శ్రమిస్తున్నాడు. సీఎస్కేను ఇప్పటికే నాలుగుసార్లు ఛాంపియన్‌గా నిలిపిన ఎంఎస్‌డి.. ఈ ఎడిషన్‌లో ఎలాగైనా టైటిల్ సాధించి, ఐపీఎల్ కెరీర్‌ను ఘనంగా ముగించాలని తపిస్తున్నాడు. ఈ క్రమంలో ధోని తన ఆటతీరుతో పాటు దేహాదారుడ్యాన్ని సైతం భారీగా మార్చుకున్నాడు. అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలికాక, కేవలం ఐపీఎల్‌కు మాత్రమే పరిమితమైన ధోని, కొద్ది రోజుల కిందటి వరకు ఫిట్‌నెస్‌పై ఎలాంటి కాన్సన్ట్రేషన్ పెట్టక బొద్దుగా తయరయ్యాడు. అయితే ఈసారి తన జట్టుకు ఎలాగైనా ఐపీఎల్ టైటిల్ అందించాలని దృడసంకల్పంతో ఉన్న ధోని.. తన బాడీ వెయిట్‌ను భారీగా తగ్గించుకోవడంతో పాటు 100 పర్సెంట్ ఫిట్‌గా తయారయ్యాడు. ఫిట్నెస్ అంటే స్లిమ్‌గా, సిక్స్ ప్యాక్ బాడీతో కాకుండా భారీగా కండలు పెంచి కండల కాంతారావును తలపిస్తున్నాడు. The biceps of MS Dhoni. pic.twitter.com/is7ltAfUi2 — Johns. (@CricCrazyJohns) March 15, 2023 పురులు తిరగిన ఈ కండలతో ప్రాక్టీస్ చేస్తున్న ధోని అవలీలగా భారీ సిక్సర్లు బాదుతున్నాడు. ఇది చూసి సీఎస్కే అభిమానలు తెగ సంబురపడిపోతున్నారు. ఓ పక్క రెజ్లర్‌ను తలపించే ధోని బాడీని చూడాలా లేక బరువెక్కిన కండలతో ధోని ఆడే మాన్స్టర్ షాట్లు చూడాలా అని తేల్చుకోలేకపోతున్నారు. ప్రాక్టీస్ సందర్భంగా పురులు తిరిగిన కండలతో ధోని భారీ షాట్ ఆడుతున్న ఓ దృశ్యం ప్రస్తుతం సోషల్‌మీడియాను షేక్ చేస్తుంది. “Nonchalant!” 🚁💥#WhistlePodu #Yellove 🦁💛 pic.twitter.com/glafNLF1gk — Chennai Super Kings (@ChennaiIPL) March 14, 2023 ధోని బన్ గాయా రెజ్లర్ అంటూ అభిమానులు నెట్టింట తెగ హడావుడి చేస్తున్నారు. 41 ఏళ్ల వయసులో ధోని కుర్రాళ్లకు సవాలుగా మారాడంటూ కామెంట్లు పెడుతున్నారు. రెండ్రోజుల కిందట ధోని ఆడిన ఓ భారీ షాట్‌కు సంబంధించిన వీడియోను ట్యాగ్ చేస్తూ ధనాధన్ ధోని ఈజ్ బ్యాక్ అని చర్చించుకుంటున్నారు. కాగా, ధోని నేతృత్వంలోని సీఎస్కే మార్చి 31న 16వ ఎడిషన్ తొలి మ్యాచ్‌లో డిఫెండింగ్ ఛాంపియన్స్ గుజరాత్ టైటాన్స్ ఢీకొట్టనున్న విషయం తెలిసిందే. గత కొన్ని సీజన్లుగా బ్యాటర్‌గా విఫలమవుతున్న ధోని చివరి సీజన్లోనైనా మెరుపులు మెరిపించాలని అభిమానులు ఆశిస్తున్నారు. గతేడాది దారుణమైన ప్రదర్శన కనబర్చి ఆఖరి నుంచి రెండో స్థానంలో నిలిచిన సీఎస్కే ఈ సీజన్లో ఎలాగైనా టైటిల్ సాధించాలని అభిమానులు పరితపిస్తున్నారు. మరోవైపు ఈ సీజన్లో సీఎస్కే కెప్టెన్‌గా బెన్ స్టోక్స్ పగ్గాలు చేపడతాడన్న ప్రచారం కూడా జరుగుతుంది. -
అనుష్క శెట్టికి ఏమైంది? ఇలా మారిపోయింది.. ఫోటోలు వైరల్
హీరోయిన్ అనుష్క శెట్టి కొంతకాలంగా ఇండస్ట్రీకి దూరంగా ఉంటున్నారు. సినిమా ఫంక్షన్లు సహా సోషల్ మీడియాలోనూ పెద్దగా యాక్టివ్‌గా కనిపించడం లేదు. బాహుబలి లాంటి అద్భుతమైన విజయం తర్వాత ఆమె వరుస సినిమాల్లో నటిస్తూ బిజీ అవుతుందనుకున్నారు. కానీ చాలా రోజులుగా అనుష్క బయట ఎక్కడా కనిపించడం లేదు. అయితే తాజాగా కుటుంబసభ్యులతో కలిసి బెంగళూరులో శివరాత్రి వేడుకలకు హాజరైంది.దీనికి సంబంధించిన ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. దాదాపు రెండేళ్ల తర్వాత అనుష్క బయట కనిపించడంతో ప్రస్తుతం ఈ ఫోటోలు నెట్టింట చక్కర్లు కొడుతున్నాయి. కాగా ఇందులో అనుష్క కాస్త బొద్దుగా కనిపిస్తున్నారు. ఇక కెరీర్ విషయానికి వస్తే.. ప్రస్తుతం ఆమె నవీన్ పొలిశెట్టికి జోడీగా ‘మిస్ శెట్టి, మిస్టర్ పోలిశెట్టి’ అనే సినిమాలో నటిస్తున్నారు.యూవీ క్రియేషన్స్ ఈ చిత్రాన్ని నిర్మిస్తుంది. -
బావా.. బ్యాక్సైడు దేఖో..! పో.. ఇక నీకు నాకు కటిఫ్..!
చూడు కొంగ బావా.. ముందు చూపు ఉండాలి.. కానీ.. అప్పుడప్పుడు వెనుక వైపు కూడా ఓ లుక్కేసుకోవాలి.. ఇప్పుడు చూడు ఏమైందో.. ఇంతకీ ఏమైంది.. ఏమో మరి.. ఈ ఫొటో తీసిన జీన్ జాక్వస్(ఫ్రాన్స్) ఆ విషయాన్ని చెప్పలేదు మరి.. కొంగను మింగేస్తున్నట్లు ఉన్న ఈ నీటి గుర్రం ఫొటో కామెడీ వైల్డ్ లైఫ్ ఫొటోగ్రఫీ 2022 అవార్డుల్లో ‘స్పెక్ట్రం ఫొటో క్రీచర్స్ ఆఫ్ ద ఎయిర్’ విభాగంలో మొదటి ప్రైజును గెలుచుకుంది.. ఏ విషయంలో గొడవొచ్చిందో తెలియదు గానీ.. ఇక నుంచి నీకు నాకు కచ్చి అని అనేసుకున్నాయి ఈ రెండు పెంగ్విన్లు.. ఆ సమయంలో అక్కడే ఉన్న జెన్నిఫర్ హాడ్లీ అనే ఫొటోగ్రాఫర్ ఈ సీన్‌ను క్లిక్‌మనిపించారు. రెండింటి మధ్య మళ్లీ ఫ్రెండ్షిప్ కోసం జెన్నిఫర్ ట్రై చేశారు గానీ.. వర్కవుట్ కాలేదట. అయితే, ఈ ఫొటో మాత్రం వర్కవుట్ అయింది. కామెడీ వైల్డ్ లైఫ్ ఫొటోగ్రఫీ పోటీల్లో పీపుల్స్ చాయిస్ అవార్డును కైవసం చేసుకుంది. -
కింగ్ కోహ్లిని కలిసిన పాక్ పేసర్లు.. హోరెత్తుతున్న సోషల్‌మీడియా
టీ20 వరల్డ్‌కప్-2022 సూపర్-12 గ్రూప్-2లో భాగంగా రేపు (అక్టోబర్ 30 టీమిండియా-దక్షిణాఫ్రికా జట్లు తలపడనున్నాయి. ఈ మ్యాచ్ కోసం రోహిత్ సేన మ్యాచ్ వేదిక అయిన పెర్త్‌కు ఇవాళ ఉదయమే చేరుకుంది. ఇదే వేదికపై రేపే పాకిస్తాన్-నెదర్లాండ్స్ మ్యాచ్ కూడా జరుగనుంది. పాక్ మ్యాచ్ భారతకాలమానం ప్రకారం మధ్యాహ్నం 12:30 గంటలకు ప్రారంభంకానుండగా.. టీమిండియా మ్యాచ్ సాయంత్రం 4:30 గంటలకు మొదలవుతుంది. గ్రూప్-2కు సంబంధించి పెర్త్ వేదికగా రేపు జరుగబోయే మ్యాచ్‌లు నాలుగు జట్లకు (భారత్, సౌతాఫ్రికా, పాకిస్తాన్, నెదర్లాండ్స్) కీలకం కావడంతో ఆయా జట్లన్నీ ప్రాక్టీస్‌లో తలమునకలై ఉన్నాయి. భారత్, పాక్ మ్యాచ్‌లు ఒకే వేదికపై ఒకదాని తర్వాత మరొకటి జరుగనుండటంతో స్టేడియం క్యాంటీన్ వద్ద ఇరు జట్ల ఆటగాళ్లు ఒకరికొకరు ఎదురెదురుపడ్డారు. ఈ సందర్భంగా పాక్ స్టార్ పేసర్లు హరీస్ రౌఫ్, షాహిన్ అఫ్రిదిలు.. టీమిండియా ఆటగాడు కింగ్ కోహ్లిని కలిసి కాసేపు ముచ్చటించారు. ఈ ముగ్గురు ఆప్యాయంగా ఒకరినొకరు పలకరించుకున్నారు. ఈ సమయంలో తీసిన ఫోటో ప్రస్తుతం నెట్టింట వైరలవుతోంది. నెటిజన్లు రకరకాల కామెంట్లతో సోషల్‌మీడియాను హోరెత్తిస్తున్నారు. ఈ ఫోటోను బేస్ చేసుకుని భారత అభిమానులు పాక్‌ను దారుణంగా ట్రోల్ చేస్తున్నారు. భయ్యా.. నీ వల్ల మా జిందగీ బర్బాద్ (నాశనం) అయ్యిందంటూ పాక్ పేస్ ద్వయం కోహ్లితో గోడు వెల్లబుచ్చుకుంటున్నట్లుందని కామెంట్లు చేస్తున్నారు. తదుపరి మ్యాచ్‌ల్లో ఎలా గెలవాలో చిట్కాలైన చెప్పు భయ్యా అంటూ పాకీలు ప్రాధేయపడుతున్నారని మరికొందరు కామెంట్లు చేస్తున్నారు. మీ ఖేల్ ఖతమైంది.. ఇక దుఖానం సర్దేయండి అంటూ కోహ్లి పాక్ బౌలర్లు చెబుతున్నాడని ఫన్నీ కామెంట్స్ చేస్తున్నారు. వారి మధ్య ఏం సంభాషణ జరిగిందో కానీ, భారత అభిమానులు మాత్రం రకరకాలుగా ఊహించుకుని పాక్‌ను ఆటాడేసుకుంటున్నారు. ఇదిలా ఉంటే, అక్టోబర్ 23న జరిగిన భారత్-పాక్ మ్యాచ్‌లో విరాట్ ఈ ఇద్దరు పాక్ బౌలర్లను ఉతికి ఆరేసిన విషయం తెలిసిందే. హరీస్ రౌఫ్ వేసిన 19వ ఓవర్లో కోహ్లి వరుసగా రెండు అద్భుతమైన సిక్సర్లు బాది మ్యాచ్‌ను భారత్‌వైపు తిప్పాడు. అప్పటి దాకా టీమిండియాను గడగడలాడించిన రౌఫ్.. కోహ్లి మహోగ్రరూపం చూసి నిశ్రేష్ఠుడయ్యాడు. అదే మ్యాచ్‌లో అఫ్రిదిని సైతం కోహ్లి ఓ ఆటాడుకున్నాడు. నరాలు తెగే ఉత్కంఠ నడుమ ఆఖరి బంతి వరకు సాగిన ఆ మ్యాచ్‌లో భారత్ 4 వికెట్ల తేడాతో విజయం సాధించింది. -
T20 WC: ఒకే ఫ్రేమ్‌లో 16 జట్ల కెప్టెన్లు.. ట్రోఫీకి అటు పక్కన కేన్ మామ, ఇటు పక్కన ఫించ్
T20 World Cup 2022: పొట్టి క్రికెట్ ప్రపంచకప్ సమరానికి సమయం ఆసన్నమైంది. ఆస్ట్రేలియా వేదికగా ఆదివారం(అక్టోబరు 16) వరల్డ్‌కప్ ఎనిమిదో ఎడిషన్ ఆరంభం కానుంది. క్వాలిఫైయర్స్‌లో భాగంగా శ్రీలంక- నమీబియా జట్ల మధ్య జిలాంగ్లోని కార్డీనియా పార్క్ స్టేడియం వేదికగా టీ20 ప్రపంచకప్- 2022 టోర్నీకి తెరలేవనుంది. ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి ఈ నేపథ్యంలో టోర్నీలో పాల్గొనబోయే జట్లు ఆసీస్‌కు చేరుకున్నాయి. ఈ క్రమంలో ‘కెప్టెన్స్ డే’ కార్యక్రమంలో 16 జట్ల కెప్టెన్లు పాల్గొన్నారు. ఈ ఐసీసీ ఈవెంట్, మెగా సమరానికి తాము సన్నద్ధమవుతున్న తీరు గురించి మాట్లాడారు. PC: ICC Twitter ట్రోఫీతో కెప్టెన్లు! ఈ సందర్భంగా ఇండియా(రోహిత్ శర్మ), ఆస్ట్రేలియా(ఆరోన్ ఫించ్), ఇంగ్లండ్(జోస్ బట్లర్), పాకిస్తాన్(బాబర్ ఆజం), అఫ్గనిస్తాన్(మహ్మద్ నబీ), శ్రీలంక(దసున్ షనక), న్యూజిలాండ్(కేన్ విలియమ్సన్), బంగ్లాదేశ్(షకీబ్ అల్ హసన్), వెస్టిండీస్(నికోలస్ పూరన్), సౌతాఫ్రికా(తెంబా బవుమా), జింబాబ్వే(క్రెయిగ్ ఎర్విన్), నమీబియా(గెర్హార్డ్ ఎరాస్మస్), ఐర్లాండ్(ఆండ్రూ బల్బిర్నీ), స్కాట్లాండ్(రిచర్డ్ బెరింగ్టన్), నెదర్లాండ్స్(స్కాట్ ఎడ్వర్డ్స్), యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్(సీపీ రిజ్వాన్) కెప్టెన్లు ట్రోఫీతో ఫొటోకు ఫోజులిచ్చారు. All the 16 captains in one frame 📸 🤩#NewCoverPic | #T20WorldCup pic.twitter.com/WJXtu0JEvx — ICC (@ICC) October 15, 2022 ఇందుకు సంబంధించిన ఫొటోను ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్ సోషల్ మీడియాలో పంచుకుంది. ‘‘ఒకే ఫ్రేమ్‌లో 16 జట్ల కెప్టెన్లు’’ అంటూ ట్వీట్ చేసింది. అదే విధంగా సారథులంతా ఒకేచోట చేరి తీసుకున్న సెల్ఫీని సైతం షేర్ చేసింది. ఇదిలా ఉంటే.. అక్టోబరు 22న ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ జట్ల మధ్య పోరుతో సూపర్-12 దశ ఆరంభం కానుంది. ఆ మరుసటి రోజే హైవోల్టేజ్ మ్యాచ్ ఇండియా వర్సెస్ పాకిస్తాన్‌కు మెల్బోర్న్ క్రికెట్ గ్రౌండ్(ఎంసీజీ) ఆతిథ్యం ఇవ్వనుంది. ఇక నవంబరు 13న ఫైనల్ మ్యాచ్‌కు సైతం ఎంసీజీ వేదిక కానుంది. Selfie time 😁🤳#T20WorldCup pic.twitter.com/snMOzdPMq3 — ICC (@ICC) October 15, 2022 చదవండి: T20 WC 2022: జట్లు, పాయింట్ల కేటాయింపు విధానం, షెడ్యూల్, లైవ్ స్ట్రీమింగ్.. ఇతర పూర్తి వివరాలు Mitchell Starc-Buttler: 'నేనేమి దీప్తిని కాదు.. అలా చేయడానికి' -
Shubman Gill: సారాతో దుబాయ్‌లో శుబ్‌మన్ గిల్ డిన్నర్.. ఫొటో వైరల్!
Shubman Gill- Sara Ali Khan: కెరీర్లో ప్రస్తుతం అత్యుత్తమ దశలో ఉన్నాడు టీమిండియా క్రికెటర్ శుబ్‌మన్ గిల్. ఇటీవల జరిగిన వెస్టిండీస్, జింబాబ్వే వన్డే సిరీస్‌లలో ఓపెనర్‌గా.. వన్‌డౌన్ బ్యాటర్‌గా అద్భుత ప్రదర్శన కనబరిచాడు. ముఖ్యంగా జింబాబ్వే పర్యటనలో భాగంగా మూడో వన్డే సందర్భంగా కెరీర్లో తొలి శతకం నమోదు చేశాడు. జట్టును గెలిపించడంతో పాటుగా వ్యక్తిగతంగానూ టీమిండియా దిగ్గజం సచిన్ టెండుల్కర్, రోహిత్ శర్మ రికార్డులు బద్దలు కొట్టాడు. ఇక 22 ఏళ్ల గిల్ వ్యక్తిగత జీవితం విషయానికొస్తే.. సచిన్ తనయ సారా టెండుల్కర్తో డేటింగ్లో ఉన్నాడంటూ గతంలో వదంతులు వ్యాపించిన విషయం తెలిసిందే. వీరిద్దరూ సోషల్ మీడియాలో ఒకరినొకరు ఫాలో అవుతూ ఒకరి పోస్టులకు మరొకరు కామెంట్లు పెట్టడంతో ఈ వార్తలు పుట్టుకొచ్చాయి. ఆ సారాతో బ్రేకప్.. ఇప్పుడు ఈ సారాతో.. అయితే, కొన్నాళ్ల క్రితం.. దేవతలతో ప్రేమలో పడకూడదంటూ గిల్ ఇన్‌స్టాలో ఓ పోస్టు షేర్ చేయడంతో ఈ జంట బ్రేకప్ చెప్పుకొందంటూ గాసిప్ రాయుళ్లు మరోసారి తమ ఇష్టారీతిన కథనాలు అల్లేశారు. కెరీర్లో తొలి సెంచరీ చేయడం సహా.. సచిన్ రికార్డును గిల్ బద్దలు కొట్టిన తరుణంలో సారా నుంచి విషెస్ వస్తాయని ఊహించామని.. అయితే, విడిపోయిన కారణంగానే ఆమె.. గిల్ విజయంపై స్పందించలేదని మరికొందరు నెటిజన్లు తమదైన శైలిలో కామెంట్లు చేశారు. ఒకరినొకరు అన్‌ఫాలో చేసుకున్నారని.. ఇక వీరిద్దరి ప్రేమకథకు ఎండ్‌కార్డ్ పడిందనడానికి ఇదే నిదర్శనమని పేర్కొన్నారు. దీంతో సారా పేరు మరోసారి సోషల్ మీడియాలో ట్రెండ్ అయింది. ఇదిలా ఉంటే.. తాజాగా సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్న ఓ ఫొటో గిల్ అభిమానుల దృష్టిని ఆకర్షించింది. ఇందులో శుబ్‌మన్ గిల్.. బాలీవుడ్ నటి సారా అలీఖాన్‌తో దుబాయ్‌లోని రెస్టారెంట్లో డిన్నర్‌కు వచ్చినట్లుగా కనిపిస్తోంది. టిక్‌టాక్ యూజర్ వీడియోతో.. ఓ టిక్‌టాక్ యూజర్ బస్తియాన్లో సారా అలీ ఖాన్‌ను చూశానంటూ 12 సెకన్ల నిడివి గల వీడియోను షేర్ చేసింది. ఇక ఇందులో సారాతో ఉన్నది గిల్ అంటూ కొంతమంది కామెంట్లు చేస్తున్నారు. ఈ టీమిండియా బ్యాటర్ ఇప్పుడు 27 ఏళ్ల సారా అలీఖాన్‌తో డేటింగ్ చేస్తున్నాడా ఏంటి అంటూ కథనాలు అల్లేస్తున్నారు. ఏంటో సారా అనే పేరు గల వాళ్లే గిల్‌కు ఎందుకు నచ్చుతారో అంటూ కొంటెగా కామెంట్లు చేస్తున్నారు. ఇక భారత క్రికెట్ రంగానికి, బాలీవుడ్‌కి విడదీయరాని బంధం ఉందన్న విషయం తెలిసిందే. చాలా మంది క్రికెటర్లు.. బాలీవుడ్ నటీమణులతో ప్రేమలో పడి పెళ్లి కూడా చేసుకున్నారు. మొదటితరం క్రికెటర్ మన్సూర్ అలీఖాన్ పటౌడీ.. షర్మిలా ఠాగూర్‌ను పెళ్లాడారు. ఆ దంపతులు కొడుకు సైఫ్ అలీఖాన్ కూతురే సారా. అమృతా సింగ్‌తో సైఫ్‌నకు కలిగిన మొదటి సంతానం. ఇక అమృతా సైతం.. సైఫ్ కంటే ముందు టీమిండియా మాజీ ఆటగాడు రవిశాస్త్రితో ప్రేమలో పడిందన్న వార్తలు వచ్చాయి. చదవండి: T20 World Cup 2022: టీమిండియాకు గుడ్ న్యూస్.. స్టార్ బౌలర్ వచ్చేస్తున్నాడు! KL Rahul Wedding: టీమిండియా వైస్ కెప్టెన్ పెళ్లి ఆమెతోనే! ధ్రువీకరించిన ‘మామగారు’.. కానీ ట్విస్ట్ ఏంటంటే! Shubman gill date sara ali khan ko kar eha tha aur hum kisi aur hi sara ko lapet rhe the🥲#Shubmangill #CricketTwitter pic.twitter.com/oEAAXqXgOz — Arun (@ArunTuThikHoGya) August 29, 2022 -
బాలీవుడ్ నటి లగ్జరీ కారు, దర్జా పోజు వైరల్
సాక్షి, ముంబై: బాలీవుడ్ నటులు,లగ్జరీ కార్లును సొంతం చేసుకోవడం చాలాకామన్. తాజాగా లంచ్‌బాక్స్ నటి ఈ లిస్ట్‌లో చేరింది. బాలీవుడ్ నటి నిమ్రత్ కౌర్ తాజాగా లగ్జరీకారును కొనుగోలు చేసింది. కొత్త కారుకు సంబంధించిన ఫోటోను తన ఇన్స్టాగ్రామ్ హ్యాండిల్లో పోస్ట్ చేసింది. "వెల్కమ్ హోమ్ మై బ్లాక్ బీస్ట్" అంటూ ఒక పిక్నుషేర్ చేసింది. కొత్త కారు కొన్నందుకు ఫ్యాన్స్ అభినందనలతో ముంచెత్తుతున్నారు. ప్రస్తుతం కౌర్ పిక్ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. అంతేకాదు కొత్త రేంజ్ రోవర్లో ముంబైలోని మాడాక్ ఫిల్మ్స్ ఆఫీసుకు వచ్చిన వీడియో ఒకటి ఆన్లైన్లో సర్క్యులేట్ అవుతోంది. ఐదో తరం రేంజ్ రోవర్ కారు భారతదేశంలో కంపెనీ విడుదల చేసినంది. నటి నిమ్రత్ కొన్న రేంజర్ రోవర్ ఎస్యూవీ ధర 2.38 కోట్లకు పై మాటేనని అంచనా . నిమ్రత్‌కౌర్ అభిషేక్ బచ్చన్ ,యామీ గౌతమ్‌లతో కలిసి నటించిన దాస్విలో కనిపించింది. ఈ మూవీలో అభిషేక్ ఆన్ స్క్రీన్ భార్య బిమ్లా దేవి పాత్రలో నటించింది. దాస్వీ కంటే ముందు 2016లో అక్షయ్ కుమార్ ఎయిర్‌లిఫ్ట్‌లో నటించింది. ఒక హిందీ వెబ్ సిరీస్ ది టెస్ట్ కేస్‌లో కూడా కౌర్ యాక్ట్ చేసింది. కాగా కొత్త రేంజ్ రోవర్ స్టాండర్డ్ , లాంగ్-వీల్‌బేస్ బాడీ డిజైన్లలో ఐదు సీట్లతో అందుబాటులో ఉంది. కొత్త రేంజ్ రోవర్ హైబ్రిడ్ ధరలు రూ. 2.61 కోట్లు నుండి ప్రారంభం. గత నెలలో కారు డెలివరీలు ప్రారంభమయ్యాయి. ఈ కారు పెట్రోల్ , డీజిల్ వెర్షన్లలో, 25 ట్రిమ్స్‌లో లభ్యం. -
అల్లు అర్జున్ భార్య ఫోటోషూట్‌పై నిహారిక కామెంట్
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ భార్య స్నేహారెడ్డికి సోషల్‌మీడియాలో ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. స్టార్ హీరోల సతీమణుల్లో స్నేహారెడ్డికి ప్రత్యేక గుర్తింపు ఉంది. ఇన్‌స్టాలో 8.3 మిలియన్ ఫాలోవర్స్‌తో సోషల్ మీడియాలో దుమ్మురేపుతుంది. బన్నీకి సంబంధించిన అప్డేట్స్తో పాటు వారి పిల్లలకు సంబంధించిన క్యూట్ వీడియోలను స్నేహారెడ్డి తన ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేస్తుంటుంది. సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉండే స్నేహారెడ్డి మంచి ఫిట్నెస్ మెయింటైన్ చేస్తూ ఫోటోలను అభిమానులతో షేర్ చేస్తుంటుంది. అయితే తాజాగా ఆమె ఇన్‌స్టాలో షేర్ చేసిన ఓ ఫోటో ఇప్పుడు నెట్టింట తెగ వైరల్ అవుతుంది. బ్లాక్ కలర్ డ్రెస్‌లో సూపర్ స్టైలిష్ లుక్‌లో కనపిస్తుందామె. ఇక ఈ ఫోటోపై నిహారిక, సుష్మిత కొణిదెల సహా పలువురు నెటిజన్లు సైతం సూపర్ హాట్ అంటూ కామెంట్స్ చేస్తున్నారు. హీరోయిన్‌కు ఏ మాత్రం తీసుపోకుండా ఉన్నారంటూ పలువురు అభిప్రాయపడుతున్నారు. ప్రస్తుతం స్నేహారెడ్డి షేర్ చేసిన ఈ ఫోటోలు నెట్టింట వైరల్‌గా మారాయి. View this post on Instagram A post shared by Allu Sneha Reddy (@allusnehareddy) -
ఆకాశంలో ‘గులాబీ’ మాయతో హడలెత్తిన జనం.. ఏలియన్స్ పనేనా?
కాన్బెర్రా: ఆకాశం ఏ రంగులో ఉంటుందంటే నీలం అంటూ టక్కున చెప్పేస్తారు. కానీ.. ఆకాశంలో కొద్ది ప్రాంతం గులాబీ రంగులోకి మారితే ఆశ్చర్యమే కాదు.. ఏదో జరుగుతోందనే భయం కూడా కలుగుతుంది. సినిమాల్లో చూపించినట్లుగా ఆకాశం నుంచి ఎవరో భూమిపైకి వస్తున్నప్పు ఏర్పడిన మాదిరిగా ఉంటే.. అది మరింత భయాన్ని పెంచుతుంది. అలాంటి అనుభూతే ఆస్ట్రేలియాలోని మిల్దురా ప్రజలకు ఎదురైంది. గత బుధవారం సాయంత్రం వేళ ఆ ప్రాంతంలో ఒక్కసారిగా ఆకాశం లేత గులాబీ రంగులోకి మారిపోయింది. కొందరు దానిని అద్భుతం అంటూ వర్ణించగా.. కొందరు గ్రహాంతర వాసుల పనేనుంటూ భయాందోళనలకు గురయ్యారు. గులాబీ రంగులోకి మారిన ఆకాశం ఫోటోలు సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారాయి. గులాబీ రంగు కనిపించిన ప్రాంతం మధ్యలో భూమిని నుంచే కాంతి ప్రసారమవుతున్నట్లు కనిపిస్తోంది. దీంతో భూమిపైన ఉన్న దాని నుంచే ఆ కాంతి వెలువడుతోందని, దాని ద్వారానే ఆకాశం గులాబీ రంగులోకి మారిపోయిందని పలువులు విశ్లేషించారు. మరోవైపు.. దీనిపై కొందరు నెటిజన్లు జోకులు పేల్చారు. అది ఏలియన్స్ సృష్టిగా కొందరు పేర్కొనగా.. మరికొందరు మాహా అద్భుతం అంటూ తెలిపారు. గులాబీ రంగుకు కారణమదే.. అయితే.. ఆకాశంలో ఏర్పడిన గులాబీ రంగుకు కారణం ఆ ప్రాంతంలో ఓ ఫార్మాసిటికల్ సంస్థ సాగు చేస్తున్న గంజాయి మొక్కలేనని తేల్చారు. ‘మా సంస్థలో కొత్త సాగు ప్రాంతం కోసం ప్రయోగాలు చేస్తున్న క్రమంలో ఆకాశంలోకి కాంతి ప్రసరణ జరగటం స్థానికులు గమనించారు. అది సోలార్ ఫ్లేర్ లేదా ఇంటర్ డైమెన్షనల్ పోర్టల్ కాదని మేము నమ్మకంగా చెప్పగలం.’ అని ట్విట్టర్ వేదికగా తెలిపింది ఫార్మా సంస్థ. గంజాయి మొక్కలు ఎదిగేందుకు వివిధ రకాల కాంతి అవసరమవుతుందని, పూలు పూసే సమయంలో ఎర్ర లైట్ ఉపయోగించాలని తెలిపారు ఫార్మా సంస్థ సీఈవో పీటర్ క్రాక్. కొత్త సాంకేతికతను ఈ ఏడాదే తీసుకొచ్చామని, ఎల్ఈడీ లైట్లు ఏర్పాటు చేసినట్లు చెప్పారు. ఆకాశంలో అద్భుత దృశ్యం ఏర్పడటం సంతోషంగా ఉందని పేర్కొన్నారు. An eerie pink glow lit up over Mildura - https://t.co/5vUMebCsDb pic.twitter.com/q2mxsSpWXz — Cann Group (@Cann_Group) July 22, 2022 ఇదీ చదవండి: Sri Lanka: శ్రీలంకలో మళ్లీ ఉద్రిక్తత.. నిరసనలపై కొత్త అధ్యక్షుడి ఉక్కుపాదం! -
మహిళా క్రికెటర్‌తో సచిన్ తనయుడు.. వైరలవుతున్న ఫొటోలు
క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ తనయుడు, ముంబై ఇండియన్స్ యువ క్రికెటర్ అర్జన్ టెండూల్కర్ మరోసారి వార్తల్లో నిలిచాడు. ఇంగ్లండ్ మహిళా క్రికెటర్ డేనియల్ వ్యాట్‌తో అతను సన్నిహితంగా ఉన్న ఫొటో ప్రస్తుతం నెట్టింట వైరలవుతుంది. ఈ ఫోటోల్లో అర్జున్.. వ్యాట్‌తో కాస్త చనువుగా ఉన్నట్లు కనిపించడంతో నెటిజన్లు రకరకాలుగా స్పందిస్తున్నారు. కొందరు.. సచిన్ తనయుడు ఇంగ్లీష్ పిల్ల బుట్టలో పడ్డాడా అన్న సందేహాలు వ్యక్తం చేస్తున్నారు. మరికొందరేమో విషయం తెలీకుండా తప్పుగా కామెంట్లు చేస్తున్న వారికి చురకలంటిస్తున్నారు. మొత్తానికి ఈ ఫోటో ప్రస్తుతం నెట్టింట హాట్ టాపిక్‌గా మారింది. ఇదిలా ఉంటే, ఇంగ్లండ్ మహిళా జట్టు ఆల్‌రౌండర్ అయిన వ్యాట్ అర్జున్ తండ్రి సచిన్‌కు వీరాభిమాని. తండ్రి తనయులు ఎప్పుడు లార్డ్స్ మైదానానికి వచ్చినా ఆమె వారిని తప్పకుండా కలిసేది. 2009 నుంచి సచిన్, అర్జున్‌లతో తనకు పరిచయం ఉందని వ్యాట్ గతంలో పలు సందర్భాల్లో పేర్కొంది. 31 ఏళ్ల వ్యాట్ ఇంగ్లండ్ తరఫున 93 వన్డేలు, 124 టీ20 ఆడింది. వ్యాట్.. తన కెరీర్లో మొత్తం 4 సెంచరీలు, 12 హాఫ్ సెంచరీల సాయంతో 3400కు పైగా పరుగులు సాధించింది. హాఫ్ స్పిన్ బౌలర్ అయిన వ్యాట్ రెండు ఫార్మాట్లలో కలిపి 73 వికెట్లు పడగొట్టింది. చదవండి: అతన్ని ఓపెనర్‌గా పంపండి.. సెహ్వాగ్‌లా సక్సెస్ అవుతాడు..! -
డెవాన్ కాన్వే ప్రీ వెడ్డింగ్ పార్టీ.. పంచ కట్టుతో రచ్చరచ్చ చేసిన సీఎస్కే ప్లేయర్లు
Devon Conway Pre Wedding Party: ఐపీఎల్ 2022 సీజన్లో వరుస పరాజయాలతో సతమతమవుతున్న చెన్నై సూపర్ కింగ్స్ జట్టు రేపు (ఏప్రిల్ 21)ముంబైతో జరుగబోయే కీ ఫైట్‌కు ముందు ఓ ముఖ్యమైన ఈవెంట్లో పాల్గొంది. జట్టు కీలక సభ్యుడు, విదేశీ ఆటగాడు (న్యూజిలాండ్) డెవాన్ కాన్వే ప్రీ వెడ్డింగ్ పార్టీలో చెన్నై ఆటగాళ్లు రచ్చరచ్చ చేశారు. ముంబైలోని ట్రైడెంట్ హోటల్లో సీఎస్కే యాజమాన్యం ఆధ్వర్యంలో జరిగిన ఈ పార్టీలో కాన్వే సహా సీఎస్కే బృంద సభ్యులంతా తమిళ సంప్రదాయ పంచ కట్టుతో మెరిశారు. Devonum Deviyum! 💛 Happy Whistles for the soon-to-be's! Wishing all the best to Kim & Conway for a beautiful life forever!#WhistlePodu #Yellove 🦁 pic.twitter.com/yPJe5DBQQK — Chennai Super Kings (@ChennaiIPL) April 18, 2022 Maple & Machis! 📸 that go straight into the Yellove Album! 😍#SuperFam #WhistlePodu #Yellove 🦁💛 pic.twitter.com/qUAKbrCpYu — Chennai Super Kings (@ChennaiIPL) April 19, 2022 📹 Colourful Kaatchis from the last night kondattam! 😎💛#SuperFam #WhistlePodu #Yellove 🦁 pic.twitter.com/hoJWgpzEbx — Chennai Super Kings (@ChennaiIPL) April 19, 2022 ఈ వేడుకలో కాన్వే సహా జట్టు కోచ్ స్టీఫెన్ ఫ్లెమింగ్, మాజీ, ప్రస్తుత కెప్టెన్లు ధోని, జడేజా, మొయిన్ అలీ, బ్రావో, రుతురాజ్ గైక్వాడ్, ఉతప్ప, అంబటి రాయుడు ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. సహచరుడి ప్రీ వెడ్డింగ్ ఈవెంట్‌కు సీఎస్కే ప్లేయర్లు కుటుంబ సభ్యులతో హాజరయ్యారు. ఈ వేడుకకు కాన్వే ఫియాన్సి కిమ్ వాట్సన్ వర్చువల్‌గా హాజరైంది. న్యూజిలాండ్‌లో ఉన్న కిమ్ పసుపురంగు పట్టు చీరలో మెరిసిపోయింది. కాన్వే, కిమ్ ఇద్దరు వర్చువల్‌గా సంభాషించుకుంటుండగా.. సహచర సభ్యులు చప్పట్లతో ఇద్దరినీ విష్ చేశారు. Maapilai with Thol Kodukkum thozhans! 💛#WeddingWhistles #YelloveIsInTheAir #WhistlePodu 🦁💛 https://t.co/v3boCGSb5A pic.twitter.com/AzDvpHgH5Y — Chennai Super Kings (@ChennaiIPL) April 18, 2022 Sivapu Manjal Pachai - Part 2! 😃#SuperFam #WhistlePodu #Yellove 🦁💛 pic.twitter.com/eyf0K0Ky9N — Chennai Super Kings (@ChennaiIPL) April 19, 2022 అనంతరం కేక్ కట్టింగ్, ఆలింగనాలతో పార్టీ సందడి సందడిగా సాగింది. ఈ ఈవెంట్‌కు సంబంధించిన ఫోటోలు, వీడియోలను సీఎస్కే యాజమాన్యం ట్విటర్లో పోస్ట్ చేయగా ప్రస్తుతం వైరలవుతున్నాయి. కాగా, డెవాన్ కాన్వే-కిమ్ వాట్సన్ 2020లో ఎంగేజ్మెంట్ చేసుకున్నారు. ఈ ఏడాది వారు పెళ్లి పీటలు ఎక్కనున్నారు. ఇదిలా ఉంటే, సీఎస్కే.. తమ తదుపరి మ్యాచ్‌లో తమ కంటే దారుణమైన ప్రదర్శన కనబరుస్తున్న ముంబై ఇండియన్స్‌తో తలపడనుంది. ఈ సీజన్లో సీఎస్కే ఇప్పటివరకు ఆడిన 6 మ్యాచ్‌ల్లో 5 ఓటములను చవిచూడగా, ముంబై.. ఆడిన ఆరింటిలో ఓటమిపాలై పాయింట్ల పట్టికలో చివరి స్థానంలో నిలిచింది. Conway Kudumbathaar! 🤳Selfie with the Maapillai Side!#WeddingWhistles #YelloveIsInTheAir #WhistlePodu 🦁💛 pic.twitter.com/h4ngrhXMtB — Chennai Super Kings (@ChennaiIPL) April 18, 2022 Pudhu Maapillai ku Hip Hip Hoorayy! 🥳 When the Superfam came together to celebrate Conway’s pre wedding 💍#WeddingWhistles #YelloveIsInTheAir #WhistlePodu 🦁💛 pic.twitter.com/UCa7xQSB5v — Chennai Super Kings (@ChennaiIPL) April 18, 2022 Now showing - Kim & Conway Wedding Cassette 📼! 📹👉 https://t.co/oYBPQHs25f!#WeddingWhistles #Yellove 🦁💛 pic.twitter.com/pTLdQgTa5n — Chennai Super Kings (@ChennaiIPL) April 19, 2022 చదవండి: RCB VS LSG: కోహ్లి గోల్డెన్ డక్ ఎక్స్‌ప్రెషన్‌పై ఆసక్తికర ట్వీట్ చేసిన సజ్జనార్ var request = 'https://www.sakshi.com/knowwidget/kwstr_4141448520.json'; $.ajaxPrefilter( function (request) { if (request.crossDomain && jQuery.support.cors) { var http = (window.location.protocol === 'http:' ? 'http:' : 'https:'); request.url = http + '//cors-anywhere.herokuapp.com/' + request.url; } }); $.get( request,function (response){ if(response == ''){ $('#frameId').hide(); }else{ $('#frameId').show(); } }); -
ఈ ఫోటోలో విరాట్ కోహ్లి ఎక్కడున్నాడో గుర్తు పట్టండి..!
టీమిండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లికి సంబంధించిన ఫోటో ఒకటి ప్రస్తుతం నెట్టింట హల్చల్ చేస్తుంది. కోహ్లినే స్వయంగా ట్విటర్లో షేర్ చేసిన ఈ చిత్రానికి నెటిజన్ల నుంచి విపరీతమైన రెస్పాన్స్ వస్తుంది. నిమిషాల వ్యవధిలో లక్షల కొద్దీ లైకులు, వేలల్లో కామెంట్లు వచ్చాయి. ఇంతకీ ఈ ఫోటోలో స్పెషల్ ఎంటని అనుకుంటున్నారా.. ? ఈ ఫోటోపై ఓసారి లుక్కేస్తే అది మీకే అర్ధమవుతుంది. Find the odd one out. pic.twitter.com/cJCpNGmQfP — Virat Kohli (@imVkohli) February 20, 2022 విరాట్ కోహ్లిలా అచ్చుగుద్దినట్లు ఉన్న 10 మంది ఈ ఫోటో ఉన్నారు. వీరిలో తాను ఎక్కడున్నానో కనుక్కోవాలంటూ కోహ్లి సవాల్ విసిరాడు. ఈ ఫోటో చూసిన చాలామందికి వీరిలో అసలు రియల్ కోహ్లి ఉన్నాడా అన్న డౌట్ వస్తుంది. అంతలా ఈ ఫోటో నెటిజన్లను తికమకపెడుతుంది. ఈ ఫోటోలో అసలైన విరాట్ కోహ్లిని కనుక్కునేందుకు నెటిజన్లు విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ ఫోటోను కోహ్లి ఎందుకు షేర్ చేశాడో తెలీదు కానీ.. అభిమానుల బుర్రలకు మాత్రం భలే పని పెట్టాడు. What You See What I See pic.twitter.com/q17dqgAJEl — Nishita Sarma ॐ (@MyLoveVirat18) February 20, 2022 Found The iPhone Among Vivo Phones! 🤩 pic.twitter.com/NHgu9GPqwr — Prathamesh Avachare (@onlyprathamesh) February 20, 2022 చదవండి: IPL 2022: వేలంలో ఎవరూ కొనలేదు.. కనీసం విదేశీ లీగ్‌లు ఆడే అనుమతైనా ఇవ్వండి..! -
రైతుగా మారిన టీమిండియా మాజీ కెప్టెన్..
Dhoni Farming Mustard Crop: టీమిండియా మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోని రైతుగా మారాడు. ఇదేదో సరదా కోసం చేసిన పని అనుకుంటే పొరపాటే. అతను నిజంగానే పూర్తి స్థాయి రైతుగా మారి పంటలు పండిస్తున్నాడు. అంతర పంట పద్ధతిలో ఆవాలను సాగు చేస్తున్నాడు. దీంతో పాటు క్యాబేజీ, అల్లం, క్యాప్సికమ్ వంటి అనేక రకాల కూరగాయలు, స్ట్రాబెర్రీలు కూడా పండిస్తున్నాడు. ఇటీవల పంటను పరిశీలించేందుకు వ్యవసాయ క్షేత్రానికి వెళ్లిన ధోని, అతని సాగు సలహాదారుడు రోషన్‌తో కలిసి సెల్ఫీకి పోజిచ్చాడు. ఈ ఫొటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరలవుతున్నాయి. Latest pictures of Mahi in Mustard field at his farmhouse. 🤩❤️#MSDhoni • #Dhoni • #WhistlePodu pic.twitter.com/owSA57ccEO— Nithish Msdian (@thebrainofmsd) January 16, 2022 ధోనికి కూరగాయాలంటే అమితంగా ఇష్టమని, రాంచీ వచ్చిన ప్రతిసారి తాను పండించిన కూరగాయలు మాత్రమే తింటాడని రోషన్ తెలిపాడు. ఇదిలా ఉంటే, ధోని.. ఐపీఎల్ మినహా క్రికెట్లోని అన్ని ఫార్మాట్లకు గుడ్‌బై చెప్పిన సంగతి తెలిసిందే. ఐపీఎల్ 2022లో భాగంగా అతన్ని చెన్నై సూపర్ కింగ్స్ జట్టు 12 కోట్లు వెచ్చించి మరోసారి రిటైన్ చేసుకుంది. వయో భారం రిత్యా అతను.. ఈ ఏడాది ఐపీఎల్‌కు కూడా వీడ్కోలు పలికే అవకాశం ఉందని తెలుస్తోంది. చెన్నై సూపర్ కింగ్స్ జట్టు ధోనితో పాటు రుతురాజ్ గైక్వాడ్, మొయిన్ అలీలను రిటైన్ చేసుకుంది. చదవండి: "మ్యాచ్ ఫిక్సింగ్ నేరం కాదు.." హైకోర్టు సంచలన తీర్పు -
రోహిత్ శర్మ న్యూ లుక్.. భార్య రితికా ఫన్నీ కామెంట్
ముంబై: గాయం కారణంగా దక్షిణాఫ్రికాతో సిరీస్‌కు దూరంగా ఉన్న టీమిండియా పరిమిత ఓవర్ల సారధి రోహిత్ శర్మ.. ప్రస్తుతం దొరికిన ఖాళీ సమయాన్ని సద్వినియోగం చేసుకున్నాడు. బరువు తగ్గడంతో పాటు న్యూ లుక్‌తో అదరగొట్టాడు. గత కొంత కాలంగా జాతీయ క్రికెట్ అకాడమీ రిహాబిటేషన్‌లో గడుపుతున్న రోహిత్.. బాగా సన్నబడిపోయి, క్లీన్ షేవ్‌తో కనిపించాడు. న్యూ లుక్కు సంబంధించిన ఫోటోను అతనే స్వయంగా సోషల్ మీడియాలో షేర్ చేశాడు. View this post on Instagram A post shared by Rohit Sharma (@rohitsharma45) ఇందులో అతను దేనివైపో తీక్షణంగా చూస్తున్నట్టు ఫోజ్ పెట్టాడు. ప్రస్తుతం ఈ ఫోటో సోషల్‌మీడియాలో వైరలవుతోంది. రోహిత్ లుక్‌పై అభిమానులు, టీమిండియా క్రికెటర్లతో పాటు అతని భార్య రితికా సజ్దే కూడా స్పందించింది. క్లీన్ షేవ్‌తో రోహిత్ యంగ్‌గా మారిపోయాడని అభిమానులు, సహచర క్రికెటర్లు అంటుండగా.. భార్య రితికా మాత్రం ఫన్నీ కామెంట్ చేసింది. "వై సో బ్రూడీ(అసంతృప్తితో ఆలోచించడం)" అంటూ రాసుకొచ్చింది. రోహిత్ న్యూ లుక్‌పై రితిక చేసిన కామెంట్ ప్రస్తుతం నెట్టింట వైరలవుతోంది. చదవండి: Gambhir On KL Rahul: వికెట్ కీపర్ ఎప్పటికీ ఓపెనింగ్ బ్యాటర్ కాలేడు.. -
హర్భజన్‌తో ఉన్న ఆ ఇద్దరు పాక్ క్రికెటర్లు ఎవరు..?
క్రికెట్లో అవకాశాలు సన్నగిల్లాక సోషల్‌మీడియాలో యాక్టివ్‌గా ఉంటున్న టీమిండియా వెటరన్ స్పిన్నర్ హర్భజన్ సింగ్.. తాజాగా నెటిజన్లకు ఓ పరీక్ష పెట్టాడు. 1997-98 దక్షిణాఫ్రికాలో జరిగిన అండర్-19 ప్రపంచ కప్‌కు సంబంధించిన ఓ ఫొటోను ట్విటర్లో పోస్ట్ చేస్తూ.. అందులో తనతో ఉన్న ఇద్దరు పాక్ క్రికెటర్లు ఎవరో కనుక్కోవాలంటూ నెటిజన్లను కోరాడు. Pehchano to maaane.. U-19 World Cup days 1998/99 pic.twitter.com/2iawM1dSUK — Harbhajan Turbanator (@harbhajan_singh) December 10, 2021 ఈ ఫోటోలో భజ్జీని సులువుగా గుర్తుపడుతున్న నెటిజన్లు.. అతని పక్కన ఉన్న ఇద్దరిని మాత్రం పోల్చుకోలేకపోతున్నారు. నెటిజన్లకు సవాలుగా మారిన ఈ ఫోటో ప్రస్తుతం సోషల్‌మీడియా చక్కర్లు కొడుతోంది. ఇందులో భజ్జీ పక్కనున్న వాళ్లను గుర్తుపట్టాలంటూ అభిమానులు గ్రూపుల్లో షేర్ చేస్తున్నారు. ఆ ఇద్దరిని కొందరు సరిగ్గా గెస్ చేయగలుగుతున్నా.. చాలా వరకు విఫలమవుతున్నారు. ఇదిలా ఉంటే, భజ్జీ పక్కన షర్ట్ లేకుండా ఉన్నది నాటి పాక్ ఆటగాడు, ప్రస్తుతం దక్షిణాఫ్రికాకు ఆడుతున్న ఇమ్రాన్ తాహిర్ కాగా, మరొకరు పాక్ మాజీ ఆటగాడు హసన్ రాజా. వీరిద్దరు పాక్ అండర్-19 జట్టుకు ప్రాతినిధ్యం వహించారు. వీరిలో హసన్ రాజా పాక్ తరఫున 7 టెస్ట్‌లు, 16 వన్డేలు ఆడగా.. పాక్‌లోనే పుట్టిన ఇమ్రాన్ తాహిర్ మాత్రం తన కుటుంబం దక్షిణాఫ్రికాకు వలస వెళ్లడంతో ఆ దేశ జాతీయ జట్టుకు ప్రాతినిధ్యం వహించాడు. ఇక 1997-98 అండర్-19 ప్రపంచకప్ విషయానికొస్తే.. ఆ టోర్నీలో భారత్, పాక్ జట్ల మధ్య డర్బన్ వేదికగా జరిగిన లీగ్ మ్యాచ్‌లో టీమిండియా పాక్‌పై 5 వికెట్ల తేడాతో విజయం సాధించింది. ఆ మ్యాచ్‌లో 7 ఓవర్లు వేసిన భజ్జీ.. కీలకమైన షోయబ్ మాలిక్ వికెట్ తీశాడు. చదవండి: ‘యే బిడ్డా.. ఇది నా అడ్డా..’ అంటున్న డేవిడ్ భాయ్, కౌంటరిచ్చిన కోహ్లి -
నేను బలవంతురాలిని.. ఎప్పటికీ వదిలిపెట్టను: సమంత
Samantha Says Iam Strong In Note Post After Split With Naga Chaitanya: సమంత సోషల్ మీడియాలో చాలా యాక్టివ్‌గా ఉంటుందన్న సంగతి తెలిసిందే. అయితే ఇటీవలి కాలంలో ఆమె షేర్ చేస్తున్న పోస్టులు తెగ వైరల్ అవుతున్నాయి. నాగ చైతన్యతో విడాకులకు కొన్ని రోజుల ముందు నుంచి మై మమ్మా సెయిడ్(మా అమ్మ చెప్పింది)అంటూ వరుస పోస్టులు షేర్ చేసిన సమంత తాజాగా మరో ఫోటోను షేర్ చేసింది.చదవండి: అప్పుడే మనిషి నిజస్వరూపం బయటపడుతుంది: సమంత 'ఎన్ని కష్టాలు ఎదురైనా జీవితంలో మళ్లీ నిలబడేంత సత్తా ఉంది. నేను బలవంతురాలిని. ఇతరులకు నేను పర్ఫెక్ట్ కాకపోవచ్చు. కానీ నాకు నేను పర్ఫెక్ట్. నేను ప్రేమిస్తున్నాను. ఈ విపత్కర పరిస్థితుల్లోంచి నేను విజయం సాధిస్తాను. నేను మనిషిని. నేను యోధురాలిని మా అమ్మ చెప్పింది' అంటూ సమంత తన ఇన్స్టాగ్రామ్ స్టోరీలో షేర్ రాసుకొచ్చింది. ప్రస్తుతం సామ్ షేర్ చేసిన ఈ పోస్ట్ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది. చైతూ విడాకుల అనంతరం సమంత బాగా కుంగిపోయిందని, ఆమె ఇన్‌స్టా పోస్టుల్లో ఏదో తెలియని బాధ కనిపిస్తుందంటూ కొందరు నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. చదవండి:నాగచైతన్యతో కలిసి ఉన్న ఫోటోలను డిలీట్ చేసిన సమంత కొన్నిసార్లు కలపడం కంటే వదిలేయడమే బెటర్: సామ్ ఆసక్తికర వీడియో -
అచ్చం ధోనిలానే చేశాడు.. అతని స్టైల్లోనే మ్యాచ్ ముగించాడు..
Asif Ali Refreshes Dhoni Gun Shot Celebration After Hitting Four Sixes Against Afghanistan: టీ20 ప్రపంచకప్-2021లో భాగంగా అక్టోబర్ 29న అఫ్గానిస్థాన్‌తో జరిగిన మ్యాచ్‌లో పాకిస్థాన్ 5 వికెట్ల తేడాతో సూపర్ విక్టరీ సాధించిన సంగతి తెలిసిందే. ఈ మ్యాచ్‌లో పాక్ విజయానంతరం ఓ ఆసక్తికర సన్నివేశం తారసపడింది. ఇన్నింగ్స్ 19వ ఓవర్లో నాలుగు సిక్సర్లు బాది పాక్‌కు అద్భుత విజయాన్నందించిన ఆసిఫ్ అలీ.. టీమిండియా మాజీ కెప్టెన్, ప్రస్తుతం మెంటార్ ఎంస్ ధోని తరహాలో విన్నింగ్ మూమెంట్‌ను సెలబ్రేట్ చేసుకుంటూ కనిపించాడు. ఈ మ్యాచ్‌ను ధోని స్టైల్లోనే ఫినిష్ చేసిన ఆసిఫ్.. అచ్చం అతనిలానే గన్ షాట్ సెలబ్రేషన్స్ చేసుకున్నాడు. #PakvsAfg #Dhoni #AsifAli #Dubai #WorldT20 #T20WC #RememberTheNameAsifAli pic.twitter.com/oVtn43Bkd0 — Zeeshan Ali Rizvi (@zshalyrizvi) October 29, 2021 గతంలో ధోని ఎప్పుడు విన్నింగ్ షాట్ కొట్టినా.. ఇలానే సెలబ్రేట్ చేసుకునేవాడు. బ్యాట్‌తో గన్ ట్రిగ్గర్ నొక్కినట్లు ఫోజు ఇస్తూ సందర్భాన్ని ఎంజాయ్ చేసేవాడు. ఈ మ్యాచ్‌లో పాక్‌కు ఓటమి తప్పదనుకున్న సమయంలో.. భారీ సిక్సర్లతో విరుచుకుపడిన ఆసిఫ్ అలీ కూడా ధోని తరహాలోనే విజయాన్ని సెలబ్రేట్ చేసుకున్నాడు. దీనికి సంబంధించిన ఇమేజస్ ప్రస్తుతం సోషల్‌మీడియాలో ట్రెండింగ్‌లో ఉన్నాయి. ఆసిఫ్ అలీ మరో ధోని.. అంటూ క్రికెట్ అభిమానులు కామెంట్లు చేస్తున్నారు. ఇదిలా ఉంటే, పాక్ ఈ మెగా టోర్నీలో ఆడిన మూడు మ్యాచ్‌ల్లో విజయాలు సాధించి సెమీస్ బెర్తును దాదాపుగా ఖరారు చేసుకుంది. తొలి మ్యాచ్‌లో టీమిండియాపై 10 వికెట్ల తేడాతో గెలుపొందిన పాక్.. తరువాతి మ్యాచ్‌లో న్యూజిలాండ్‌పై 5 వికెట్ల తేడాతో, తాజాగా అఫ్గాన్‌పై కూడా 5 వికెట్ల తేడాతో ఘన విజయాలు నమోదు చేసింది. Close enough #AsifAli#PAKvAFG #T20WorldCup #Pak #Afganisthan pic.twitter.com/bKyNHsQF9Q — Bhanu Kumar Jha (@BhanuKumarJha) October 29, 2021 చదవండి: కోహ్లి రికార్డును బ్రేక్ చేసిన బాబర్ ఆజమ్: కోహ్లిని వెంటాడుతున్న ఆజమ్ అంటూ.. -
మరోసారి వార్తల్లో నిలిచిన సమంత స్టైలిస్ట్ ప్రీతమ్ జుకల్కర్
Samantha Foreign Tour With Preetham Jukalker And Sadhana Singh: సమంత ప్రస్తుతం వెకేషన్లపై ఎక్కువగా దృష్టి పెట్టింది. నాగచైతన్యతో విడిపోయిన అనంతరం సమంత బాగా కుంగిపోయిందని ఆమె సన్నిహితులు తెలిపారు. దీంతో బాధలోంచి బయటపడేందుకు క్లోజ్‌ఫ్రెండ్స్‌తో ఎక్కువగా సమయాన్ని గడుపుతుందని సమాచారం. విడాకుల ప్రకటనకు కొద్ది రోజుల ముందు కూడా సామ్ తిరుపతి, శ్రీకాశహస్తి దైవ దర్శనాలకు వెళ్లిన సామ్..ఇటీవలె స్నేహితురాలు శిల్పారెడ్డితో కలిసి చార్ధామ్ యాత్రను సందర్శించిన సంగతి తెలిసిందే. చదవండి: నా కొడుకులకు అలాంటివి చేయొద్దని చెప్తా : నాగార్జున తాజాగా సమంత మరో వెకేషన్ ట్రిప్‌కు వెళ్లింది. తన పర్సనల్ డిజైనర్, స్టైలిస్ట్ ప్రీతమ్ జుకల్కర్, మేకప్ ఆర్టిస్ట్ సాధనా సింగ్‌లతో కలిసి సామ్ దుబాయ్‌కు పయనమైంది. దీనికి సంబంధించిన ఫోటోను సమంత తన ఇన్స్టాగ్రామ్ స్టోరీలో షేర్ చేస్తూ.. ఫారిన్‌కు వెళ్తున్నాం అని పేర్కొంది. దీంతో ప్రీతమ్ పేరు మరోసారి నెట్టింట వైరల్‌గా మారింది. ఇది వరకే తనపై వస్తున్న రూమర్స్‌కు ప్రీతమ్ ఖండించిన సంగతి తెలిసిందే. సమంత తనకు అక్కలాంటిదని, ఈ విషయం నాగ చైతన్యకు కూడా తెలుసని పేర్కొన్నాడు. కాగా చైతూతో విడాకుల అనంతరం సమంత ఇటీవలె బ్యాక్ టూ బ్యాక్ సినిమాలు ప్రకటించింది. వచ్చే నెలలో ఈ సినిమాలు సెట్స్‌పైకి వెళ్లనున్నాయి. చదవండి: సమంత పోస్టుకు కామెంట్ చేసిన వెంకటేశ్ కూతురు ఫారెన్ అమ్మాయితో రెండో పెళ్లి.. స్పందించిన మంచు మనోజ్ అందుకే పూరి జగన్నాథ్ భార్య అంటే ఇష్టం: ప్రభాస్ -
మందు గ్లాస్‌తో పూరికి బర్త్‌డే విషెస్ తెలిపిన చార్మీ
Charmi Kaur Birthday Wishes To Director Puri Jagannadh: డైనమిక్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ పుట్టినరోజు సందర్భంగా చార్మీ ఆయనకు స్పెషల్ బర్త్‌డే విషెస్‌ను తెలియజేసేంది. 'నాకెంతో ఇష్టమైన వ్యక్తికి హ్యాపీ బర్త్‌డే. మీరు నాపై ఉంచిన నమ్మకానికి ధన్యవాదాలు. మీరు గర్వపడేలా ఆ నమ్మకాన్ని ఎప్పుడూ నిలబెట్టుకుంటానని ఆశిస్తున్నాను' అంటూ మందు గ్లాసు పట్టుకొని పూరితో కలిసి ఉన్న ఓ ఫోటోను షేర్ చేసింది. ఇందులో పూరి జగన్నాథ్ కుర్చీలో కూర్చొని ఉండగా, చార్మీ మందు గ్లాసుతో దర్శనమిచ్చింది. హీరోయిన్గా గుడ్‌బై చెప్పిన చార్మీ ప్రస్తుతం పూరి జగన్నాథ్‌తో కలిసి పూరి కనెక్ట్స్ పేరుతో సినిమాలు చేస్తుంది. ఇప్పుడు విజయ్ దేవరకొండ హీరోగా 'లైగర్' సినిమాను తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రంలో అనన్య పాండే హీరోయిన్గా నటిస్తోంది. పూరీ కనెక్ట్స్, ధర్మ ప్రొడెక్షన్స్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాయి. విజయ్ ఈ చిత్రంలో బాక్సర్‌గా అలరించబోతున్న సంగతి తెలిసిందే. తెలుగు,హిందీ, తమిళం, కన్నడలో ఒకేసారి సెప్టెంబర్ 29న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది. Happy birthday to my most favourite human 🤩 the trust and belief u have over me , I hope I live upto it always n keep making u feel proud 🤗#purijagannadh #hbdpurijagannadh 💕@puriconnects pic.twitter.com/7Aq9U4KA2a — Charmme Kaur (@Charmmeofficial) September 27, 2021 -
గర్ల్‌ఫ్రెండ్‌తో ఆసీస్ స్టార్ ఆల్‌రౌండర్ నిశ్చితార్థం
సిడ్నీ: ఆస్ట్రేలియా స్టార్ ఆల్‌రౌండర్ మిచెల్ మార్ష్.. తన ఇష్ట సఖి, చిరకాల ప్రేయసి గ్రెటా మాక్‌తో ఎంగేజ్మెంట్ చేసుకున్నాడు. కాబోయే భార్యతో కలిసి తీసుకున్న సెల్ఫీని తన ఇన్‌స్టా ఖాతాలో షేర్ చేస్తూ విషయాన్ని పంచుకున్నాడు. ఓ బీచ్ పక్కన దిగినట్టుగా ఉన్న ఈ ఫొటోలో గ్రెటా తన నిశ్చితార్థం ఉంగారాన్ని చూపిస్తోంది. ఈ ఫొటోను షేర్ చేసిన వెంటనే అభిమానులు శుభాకాంక్షలతో హోరెత్తించారు. కాగా, మార్ష్‌కు ఈ సీజన్ వ్యక్తిగతంగా, క్రికెట్ పరంగా బాగా కలిసొచ్చింది. కొద్ది రోజుల కిందట విండీస్‌తో జరిగిన 5 టీ20ల సిరీస్‌లో అతను సూపర్ పెర్ఫార్మెన్స్తో అదరగొట్టాడు. మూడు హాఫ్ సెంచరీలు సహా పలు కీలక వికెట్లు పడగొట్టాడు. ఈ సిరీస్‌ను ఆసీస్ 1-4తో కోల్పోయినటప్పటికీ.. మార్ష ప్రదర్శన ఆసీస్ సెలక్టర్లను ఆకట్టుకుంది. దీంతో అతనికి టీ20 ప్రపంచకప్ జట్టులో చోటు దక్కింది. కాగా, యూఏఈ వేదికగా అక్టోబరు 17 నుంచి ఐసీసీ టీ20 ప్రపంచకప్ ప్రారంభంకానున్న సంగతి తెలిసిందే. చదవండి: 'వాతి కమింగ్' పాటకు అదిరిపోయే స్టెప్పులేసిన శ్రేయస్ అయ్యర్.. -
క్రికెట్ మ్యాచ్‌లో అత్యద్భుత దృశ్యం.. అఫ్గాన్, తాలిబన్ జెండాలతో..?
కాబూల్: అగస్ట్ 15న అఫ్గానిస్తాన్‌ను తాలిబన్లు ఆక్రమించుకున్న తర్వాత తొలిసారిగా జరిగిన క్రికెట్ మ్యాచ్ సందర్భంగా ఓ అత్యద్భుత దృశ్యం ఆవిష్కృతమైంది. పీస్ డిఫెండర్స్, పీస్ హీరోస్ జట్ల మధ్య జరిగిన ఈ మ్యాచ్‌లో అఫ్గాన్ జాతీయ జట్టుకు ప్రాతినిధ్యం వహించిన చాలామంది క్రికెటర్లు పాల్గొన్నారు. దీంతో మ్యాచ్ చూసేందుకు స్టేడియంలోకి జనం పోటెత్తారు. మ్యాచ్ సందర్భంగా ప్రేక్షకులు తాలిబన్, అఫ్గాన్ జెండాలను పక్క పక్కనే ఉంచి ఊపడం ప్రపంచవ్యాప్తంగా అందరి దృష్టిని ఆకర్శించింది. తామంతా ఐక్యంగా ఉన్నామని చాటేందుకే ప్రజలు ఇలా జెండాల ప్రదర్శన చేశారని తాలిబన్ అధికారులు పేర్కొనడం గమనార్హం. తాలిబన్ల ఆధిపత్య ప్రాంతమైన చమన్ ఉజురి సమీపంలోని స్టేడియంలో జరిగిన ఈ మ్యాచ్‌కు దాదాపు 4 వేల మంది ప్రేక్షకులు హాజరు కాగా, వారిలో మహిళలు లేకపోవడం గమనార్హం. సాధారణ ప్రేక్షకుల కంటే తాలిబన్లే ఈ మ్యాచ్‌ను ఆసక్తిగా తిలకించడం విశేషం. ఈ మ్యాచ్‌లో పీస్ డిఫెండర్స్ జట్టు 62 పరుగుల తేడాతో విజయం సాధించినట్టు ఆఫ్ఘన్ క్రికెట్ బోర్డు సీఈవో హమీద్ షిన్వరి తెలిపారు. కాగా, తాలిబన్లు దేశాన్ని వశం చేసుకున్న తర్వాత క్రీడలు, కళలు, సాంస్కృతిక కార్యక్రమాలపై ఉక్కుపాదం మోపుతారన్న వార్తలు వినిపించాయి. అయితే, ఇప్పుడీ మ్యాచ్ జరగడంపై అందరూ ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. తాలిబన్లు క్రికెట్‌కు ఆమోదం తెలపడం శుభసూచకమని, తాలిబన్లలో మార్పుకు ఇది నాంది అని తాలిబన్ సానుభూతిపరులు చెప్పుకుంటున్నారు. చదవండి: కోహ్లీ సరికొత్త రికార్డు.. క్రికెట్లో అనుకుంటే పొరపాటే..! -
అభిమాన హీరోని కలుసుకున్న నీరజ్ చోప్రా
ముంబై: టోక్యో ఒలింపిక్స్ స్వర్ణ పతక విజేత నీరజ్ చోప్రా బుధవారం తన అభిమాన హీరో రణ్‌దీప్ హుడాని పుణేలోని ఆర్మీ స్పోర్ట్స్ ఇనిస్టిట్యూట్‌లో కలుసుకున్నాడు. ఈ సందర్భంగా వారిద్దరూ కలిసి దిగిన ఫొటోను రణ్‌దీప్ హుడా తన ఇన్‌స్టా ఖాతాలో షేర్ చేస్తూ.. నీరజ్‌ను ఆకాశానికెత్తాడు. కాగా, నీరజ్2018 ఆసియా క్రీడల్లో విజయం సాధించిన అనంతరం మీ బయోపిక్‌లో ఏ హీరో నటిస్తే బాగుంటుందని మీడియా ప్రశ్నించగా.. రణ్‌దీప్ హుడా అయితే బాగుంటుందని చెప్పిన విషయం తెలిసిందే. నీరజ్, హూడా ఇద్దరూ హర్యానా రాష్ట్రానికే చెందిన వారే కావడం, అలాగే ఇద్దరికీ క్రీడలంటే అమితమైన ఆసక్తి ఉండడంతో వారి మధ్య స్నేహం బలపడింది. कसुत्ता मानस !! नयुए धूम्मा सा ठाणदा रह 😎👊🏽👊🏽 Where does one go from the top? Very few face this question and even fewer have the answers. Upon meeting you, I deeply feel that you do brother @Neeraj_chopra1 🤗 pic.twitter.com/C4SUGbJdEb — Randeep Hooda (@RandeepHooda) August 25, 2021 ఇదిలా ఉంటే, నీరజ్ ఒలింపిక్స్‌లో స్వర్ణం గెలిచాక ఓ జాతీయ మీడియాకి ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. ఇంగీష్, పంజాబీ, హిందీ భాషల్లో సినిమాలు చూస్తానని, తన ఫేవరెట్ హీరో రణ్‌దీప్ అని, అతను నటించిన 'లాల్‌రంగ్' అంటే చాలా ఇష్టమని చెప్పుకొచ్చాడు. లాల్‌రంగ్ సినిమా మొత్తం హరియాణా యాసలో ఉండటంతో అది బాగా నచ్చిందని, అలాగే రణదీప్ నటించిన 'సర్బజీత్', 'హైవే' తనను చాలా ఆకట్టుకున్నాయని పేర్కొన్నాడు. చదవండి: ఫైనల్‌కు ముందు నీరజ్ జావెలిన్‌ను ఆ పాకిస్తానీ ఎందుకు తీసుకెళ్లాడు? -
పంత్ 'బుద్ధిమంతుడు' పోస్ట్‌పై టీమిండియా క్రికెటర్ల సెటైర్లు
లీడ్స్: టీమిండియా అల్లరి పిల్లగాళ్లలో ముఖ్యుడైన రిషబ్ పంత్.. తన ఇటీవలి ఇన్‌స్టా పోస్ట్ కారణంగా విపరీతంగా ట్రోలింగ్‌కు గురయ్యాడు. ఆ పోస్ట్‌పై స్పందించిన సహచర టీమిండియా సభ్యులు పంత్‌ను ఓ ఆట ఆడుకున్నారు. వివారాల్లోకి వెళితే.. ఇంగ్లండ్‌తో లార్డ్స్ టెస్ట్ అనంతరం టీమిండియా వికెట్‌కీపర్ రిషబ్ పంత్.. ఇన్స్టాగ్రామ్ వేదికగా ఓ ఫొటోను షేర్ చేశాడు. ఆ ఫొటోలో రంగురంగుల హుడీ, షార్ట్‌తో పాటు రెండు కలర్ల (ఎరుపు, నీలం) సాక్సులు ధరించి కాస్త విచిత్రంగా కనిపించిన పంత్.. 'క్లాస్‌లో అందరికంటే బుద్ధిమంతుడు' అంటూ హిందీలో కాప్షన్ జోడించాడు. నవ్వుతున్న ఎమోజీలను ఫొటోకు జత చేశాడు. View this post on Instagram A post shared by Rishabh Pant (@rishabpant) దీంతో అది కాస్త నెట్టింట వైరల్ అయ్యింది. ఈ ఫోటోకు నెటిజన్లు నుంచి విపరీతమైన రెస్పాన్స్ వస్తుంది. పంత్ పోస్ట్‌పై పలువురు టీమిండియా క్రికెటర్లు సైతం స్పందించారు. జోకులు వేయొద్దంటూ పంత్‌ను ఓ రేంజ్లో ఆటాడుకున్నారు. పంత్ ఐపీఎల్ జట్టు సహచరుడు అక్షర్ పటేల్ స్పందిస్తూ.. ఆ ఫొటోను తానే తీశానని తెలియజేసేలా.. 'బుద్ధిమంతుడివి నువ్వు కాదు.. ఆ ఫొటో తీసిన వ్యక్తి' అంటూ కామెంట్ చేశాడు. అక్షర్ పటేల్ కామెంట్‌పై మరో ఢిల్లీ క్యాపిటల్ సభ్యుడు ఇషాంత్ శర్మ సెటైర్ వేశాడు. మీరిద్దరూ అమాయకులా? అన్నట్లు కామెంట్ పెట్టాడు. ఈ క్రికెటర్ల సంభాషణ చూసిన నెటిజన్లు తెగ నవ్వుకుంటున్నారు. పంత్.. బుద్ధిమంతుడేంటి అని కొందరు ఆశ్చర్యం వ్యక్తం చేస్తుంటే.. ఇలాంటి ఎన్ని ఘోరాలు చూడాల్సి వస్తుందోనని మరికొందరు రియాక్ట్ అవుతున్నారు. ఇదిలా ఉంటే, లార్డ్స్ టెస్ట్‌లో చిరస్మరణీయ విజయం నమోదు చేయడంతో ఇంగ్లండ్‌తో ఐదు టెస్ట్‌ల సిరీస్‌లో టీమిండియా 1-0తో ఆధిక్యంలోకి వెళ్లింది. రేపటి నుంచి ఇరు జట్ల మధ్య లీడ్స్ వేదికగా మూడో టెస్ట్ ప్రారంభంకానుంది. చదవండి: టీమిండియా తదుపరి కోచ్ అతడేనా? -
ఈ టీమిండియా క్రికెటర్లు ఫ్యాట్‌గా ఉంటే ఎలా ఉండేవారో ఓ లుక్కేయండి..!
న్యూఢిల్లీ: టీమిండియా క్రికెటర్లకు సంబంధించిన ఓ ఇన్‌స్టా పోస్ట్ సోషల్ మీడియాలో వైరలవుతోంది. ఆ పోస్ట్‌లో ఉన్న భారత ఆటగాళ్ల ఫొటోలు అభిమానులను తెగ ఆకట్టుకుంటున్నాయి. ముఖ్యంగా టీమిండియా టాప్ క్రికెటర్లు విరాట్ కోహ్లి, రోహిత్ శర్మ, రిషబ్ పంత్ ఫొటోలను చూసి ఫ్యాన్స్ నవ్వు ఆపుకోలేకపోతున్నారు. ఇంతకీ ఆ ఫొటోల్లో ఏముందో తెలుసుకోవాలంటే ఆ ఇన్‌స్టా పోస్ట్‌పై ఓ లుక్కేయండి. టీమిండియా క్రికెటర్లు ఫిట్నెస్ కోల్పోయి ఫ్యాట్‌గా మారితే ఎలా ఉంటారో ఊహించుకుని ఓ అభిమాని సరదాగా ఫొటో షాప్ ఫిల్టర్ సాయంతో వారి ముఖ కవళికలను మార్చాడు. View this post on Instagram A post shared by OFFICIAL BCCI 🔵 (@_official_bcci_) దీంతో ఫిట్‌గా ఉండే మన క్రికెటర్లు 30 ఏళ్లు దాటిన తర్వాత సాధారణ ప్రజలు పొట్టలేసుకుని, ఎలా అన్‌ఫిట్‌గా ఉంటారో అలా కనిపించారు. ముఖాలు వాచి పోయి అంకుల్స్‌ను తలపిస్తున్నారు. ఈ ఫొటోలను చూసి అభిమానులు తెగ నవ్వుకుంటున్నారు. ఎప్పుడూ ఫిట్‌గా కనిపించే మన క్రికెటర్లకు ఏంటీ దుస్థితి అని కామెంట్లు పెడుతున్నారు. కొందరైతే ఏదో ఒక రోజు మనోళ్లు ఇలానే తయారవుతారని గుసగుసలాడుకుంటున్నారు. ప్రస్తుతం ఈ ఫొటోలు నెట్టింట హల్చల్ చేస్తున్నాయి. ఇదిలా ఉంటే, ప్రస్తుతం ఇంగ్లండ్ పర్యటనలో ఉన్న భారత జట్టు.. ఆతిథ్య దేశంతో ఐదు టెస్ట్‌ల సిరీస్ ఆడుతుంది. ఇప్పటికే టీమిండియా రెండో టెస్ట్‌లో చిరస్మరణీయవిజయం సాధించి 1-0తో ఆధిక్యంలో నిలిచింది. లీడ్స్ వేదికగా బుధవారం నుంచి ప్రారంభమయ్యే మూడో టెస్ట్ కోసం ఇరు జట్లు సమాయత్తం అవుతున్నాయి. హెడింగ్లే స్టేడియంలో మనోళ్లు ఆదివారం జరిగిన తొలి ప్రాక్టీస్ సెషన్లో పాల్గొన్నారు. కెప్టెన్ కోహ్లి, రోహిత్ శర్మ, రహానే, కేఎల్ రాహుల్, పంత్‌తో పాటు పేసర్లు షమీ, బుమ్రా, స్పిన్నర్లు అశ్విన్, జడేజా నెట్స్‌లో చమటోడ్చారు. చదవండి: మీకు మేమున్నాం, చెలరేగి ఆడండి.. అఫ్గాన్ క్రికెటర్లకు తాలిబన్ల భరోసా -
వైరల్: కొడుక్కు సెల్యూట్ చేసిన తల్లి, నెటిజన్లు ఫిదా
గాంధీనగర్: పిల్లలు జీవితంలో ఉన్నత శిఖరాలను అధిరోహిస్తే.. సహజంగానే తల్లిదండ్రుల ఆనందానికి అవధులుండవు. అయితే, పిల్లలను తమే గౌరవించాల్సిన ఉన్నత స్థితికి వారు చేరుకుంటే తల్లిదండ్రులకు పట్టపగ్గాలు ఉండవని ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు. ఇలా ఈ మధ్యకాలంలో ఉద్యోగరిత్యా కొడుకును తండ్రి గౌరవించడం, ఉన్నతాధికారి అయిన కుమార్తెకు తండ్రి సెల్యూట్ చేయడం వంటి సన్నివేశాలను మనం చూసాం. అయితే ఇప్పుడు మనం చూడబోయే ఓ చిత్రంలో కన్నతల్లి.. ఉన్నతాధికారి అయిన కొడుకుకు సెల్యూట్ చేస్తూ మురిసిపోతుంటుంది. చదవండి: భారత ఎంబసీల్లో తాలిబన్ల సోదాలు వివరాల్లోకి వెళితే.. గుజరాత్‌లోకి అరవల్లి ప్రాంత డీఎస్పీకి (పోలీస్ శాఖ).. స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా ఓ మహిళా ఏఎస్సై సెల్యూట్ చేస్తుంది. ఇందులో విశేషం ఏముందని అనుకుంటున్నారా. అక్కడ పరస్పరం సెల్యూట్ చేసుకున్న వారు తల్లి కొడుకు కావడమే విశేషం. ఈ సందర్భంగా తల్లి మురిసిపోతూ, కళ్ల నిండా ఆనందంతో కొడుకుకు సెల్యూట్ చేస్తున్న దృశ్యం హైలైట్‌గా నిలిచింది. ఈ అపురూప దృశ్యాన్ని గుజరాత్ పబ్లిక్ సర్వీస్ కమీషన్ చైర్మన్ దినేశ్ దాస ట్వీట్ చేయడంతో సోషల్‌మీడియాలో వైరల్‌గా మారింది. మనస్సుకు హత్తుకునే ఈ ఫోటోకు నెటిజన్లు ఫిదా అవుతున్నారు. అమ్మ కళ్లల్లో అసలుసిసలైన ఆనందాన్ని చూడాల్సిందే అంటూ కామెంట్లు చేస్తున్నారు. చదవండి: తండ్రితో పెళ్లికూతురు హుషారైన స్టెప్పులు.. ఫిదా అవ్వాల్సిందే -
మంత్రి గారు మాస్క్ ముఖానికి పెట్టుకోవాలి, అక్కడ కాదు..!
డెహ్రాడూన్: కరోనా మూడో దశ ముప్పు పొంచి ఉన్న నేపథ్యంలో ప్రతి ఒక్కరూ మాస్క్ తప్పనిసరిగా ధరించాలంటూ ఆరోగ్య నిపుణులు పదే పదే హెచ్చరిస్తున్నారు. కానీ, చాలా మంది ఆ మాటలను పెడచెవిన పెట్టి మాస్క్‌ల వాడకానికి మంగళం పాడుతున్నారు. సాధారణ ప్రజల పరిస్థితి ఇలా ఉంటే.. పదిమందికీ చెప్పాల్సిన మంత్రులు మరింత నిర్లక్ష్యంగా వ్యవహరిస్తూ కరోనా వ్యాప్తికి కారకులవుతున్నారు. ఉత్తరాఖండ్‌కు చెందిన ఓ మంత్రి అయితే మాస్క్‌ను ముఖానికి కాకుంగా కాలి బొటన వేలికి తగిలించి ఓ ముఖ్యమైన భేటీలో దర్శనమిచ్చారు. సదరు మంత్రి గారి నిర్వాకానికి సంబంధించిన ఫోటో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. వివరాల్లోకి వెళితే.. ఉత్తరాఖండ్‌లో బీజేపీకి చెందిన ఐదుగురు నేతలు ఓ సమావేశంలో పాల్గొన్నారు. అందులో ముగ్గురు రాష్ట్ర మంత్రులు కూడా ఉన్నారు. అయితే వీరిలో ఏ ఒక్కరికీ మాస్క్‌లు లేవు. వీరిలో యతీశ్వరానంద్ అనే మంత్రి అయితే మాస్క్‌ను ఏకంగా కాలి బొటన వేలికి తగిలించి సమావేశంలో పాల్గొనడం చర్చనీయాంశంగా మారింది. ఈ ఫొటోను ఉత్తరాఖండ్ కాంగ్రెస్ అధికార ప్రతినిధి గరిమా దాసౌని ట్విటర్లో పోస్టు చేశారు. ''ఇదీ అధికార భాజపా మంత్రుల పరిస్థితి. వీరంతా మాస్క్‌లు పెట్టుకోని వారిని శిక్షించమని చెబుతారు'' అంటూ విమర్శించారు. మాస్క్ పెట్టుకోవడానికి ఏది సరైన చోటో ఉత్తరాఖండ్ మంత్రిని అడిగి తెలుసుకోండి అంటూ ఆప్ నేత దీప్ ప్రకాశ్ పంత్ కామెంట్ చేశారు. దీనిపై ప్రస్తుతం విపక్షాల నుంచి తీవ్రస్థాయిలో విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. -
టెన్నిస్ దిగ్గజంతో ఖడ్గం బ్యూటీ డేటింగ్..?
ముంబై: 1996 అట్లాంటా ఒలింపిక్స్ కాంస్య పతక విజేత, 18 గ్రాండ్‌స్లామ్‌ల విజేత(డబుల్స్, మిక్స్డ్ డబుల్స్), భారత టెన్నిస్ దిగ్గజం లియాండర్ పేస్(48).. ఖడ్గం సినిమా బ్యూటీ కిమ్ శర్మతో డేటింగ్లో ఉన్నాడని గత కొంతకాలంగా ప్రచారం నడుస్తోంది. ఈ నేపథ్యంలో ఆ వార్తలను నిజం చేస్తూ.. వీరి జోడీ గోవా బీచ్‌లో చెట్టాపట్టాలేసుకుని విహరిస్తూ ఫోటోలకు పోజులిచ్చింది. అయితే వీరిద్దరూ ఇలా కెమెరా కంటికి చిక్కడం ఇది తొలిసారేమీ కాదు. గతంలోనూ చాలా సందర్భాల్లో వీరు దగ్గరగా కలిసి దిగిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. తాజా గోవా పర్యటనకు సంబంధించిన ఫోటోలను వారు బస చేసిన హోటల్ యాజమాన్యమే సోషల్ మీడియాలో పోస్ట్ చేయడం విశేషం. View this post on Instagram A post shared by Pousada By The Beach (@pousadabythebeachgoa) కాగా, 2007లో కిమ్ శర్మ.. టీమిండియా మాజీ క్రికెటర్, సిక్సర్ల వీరుడు యువ్రాజ్సింగ్తో ప్రేమాయణం సాగించింది. అయితే, వీరిద్దరికి పొసగకపోవడంతో కొద్దికాలంలోనే విడిపోయారు. ఆతర్వాత యువీ.. హేజిల్ కీచ్‌ను పెళ్లి చేసుకోగా, కిమ్ 2010లో కెన్యాకు చెందిన వ్యాపారవేత్తను మనువాడింది. అయితే, 2016లో అతని నుంచి కూడా విడాకులు తీసుకున్న ఈ 40 ఏళ్ల ఢిల్లీ భామ.. ఆతర్వాత నటుడు హర్షవర్ధన్ రాణేతో ప్రేమాయణం సాగించింది. View this post on Instagram A post shared by Pousada By The Beach (@pousadabythebeachgoa) ఆతర్వాత ఏమైందో తెలీదు కానీ ప్రస్తుతం ఆమె పేస్‌తో డేటింగ్లో ఉన్నట్లు తెలుస్తోంది. మరోవైపు, పేస్ సైతం చాలా మందితో ఎఫైర్లు నడిపాడు. ఇటీవలి కాలంలో అతను ప్రముఖ మోడల్ రియా పిళ్ళైతో సహజీవనం చేస్తున్నట్లు వెల్లడించాడు. వీరికి ఓ కుమార్తె కూడా జన్మించింది. ప్రస్తుతానికైతే పేస్, కిమ్ జంట చెట్టాపట్టాలేసుకుని తిరుగుతుంది. కాగా, కిమ్.. కృష్ణవంశీ పాపులర్ సినిమా ఖడ్గంలో 'ముసుగు వేయొద్దు మనసు మీద'.. అలాగే మగధీరలో 'ఏం పిల్లడో' పాటల ద్వారా టాలీవుడ్ భారీ ప్రేక్షకాధరణ పొందింది. View this post on Instagram A post shared by The Project Café Ahmedabad (@theprojectcafeahd) -
న్యూలుక్లో ధోనీ అదుర్స్.. సరదాగా స్నేహితులతో అలా..!
రాంచీ: కరోనా మహమ్మారి కారణంగా టీమిండియా మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోనీ గత రెండేళ్లుగా ఎక్కువ శాతం రాంచీలోని తన ఫామ్ హౌస్‌కే పరిమితం అయ్యాడు. అక్కడే సేంద్రీయ వ్యవసాయం చేస్తూ కుటుంబంతో సరదాగా సమయం గడుపుతున్నాడు. ఇక ఐపీఎల్ 2021 వాయిదా పడడంతో దొరికిన ఖాళీ సమయాన్ని కుటుంబ సభ్యులు, స్నేహితులతో కలిసి కాలక్షేపం చేస్తున్నాడు. ఇటీవలే హిమాచల్ ప్రదేశ్ టూర్ ముగించుకుని స్వస్థలానికి చేరుకున్న మాహీ.. రాంచీలోని తన స్నేహితులను కలిశాడు. వారితో కలిసి కార్ గ్యారేజ్‌లో భోజనం చేస్తూ సరదాగా టైంపాస్ చేశాడు. గ్యారేజ్‌లో ఉండే ఓ బల్లపై భోజనం పెట్టుకుని, స్నేహితులతో కబుర్లు చెప్పుకుంటూ విందు ఆరగించాడు. వారి వెనక పాతకాలం నాటి రోల్స్ రాయిస్ కారు ఒకటుంది. దానిని ఓ వ్యక్తి రిపేర్ చేస్తున్నాడు. View this post on Instagram A post shared by MS Dhoni / Mahi7781 🔵 (@ms.dhoni.sr07) ప్రస్తుతం ఈ ఫొటో సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది. నెరిసిన గడ్డంతో ధోనీ నవ్వుతూ ఈ ఫొటోలో కనిపిస్తున్నాడు. సాధారణ వ్యక్తిలా ధోనీ భోజనం చేసిన విధానం అందరిని ఆకట్టుకుంటుంది. న్యూ లుక్‌లో ధోనీ అదుర్స్ అంటూ నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. క్రికెట్ చరిత్రలో తనకుంటూ ఓ ప్రత్యేకమైన స్థానాన్ని ఏర్పరచుకున్న ధోనీ.. అలా సింపుల్‌గా ఉండటంపై నెటిజన్లు ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. అతని సింప్లిసిటీకి ఫిదా అవుతున్నారు. స్టార్ క్రికెటర్ హోదాను పక్కకు పెట్టి స్నేహితులతో సరదాగా కాలక్షేపం చేయడాన్ని అభినంధిస్తున్నారు. ఇదిలా ఉంటే, ఐపీఎల్ 2021లోని మిగిలిన మ్యాచ్‌లు సెప్టెంబర్ నెలలో యూఏఈలో ప్రారంభం కానున్నాయి. ఇప్పటి వరకు జరిగిన మ్యాచ్‌ల్లో ధోనీ సారథ్యంలోని చెన్నై సూపర్ కింగ్స్ జట్టు ఏడు మ్యాచ్‌ల్లో ఐదు విజయాలతో పాయింట్ల పట్టికలో రెండో స్థానంలో నిలిచింది. View this post on Instagram A post shared by MS Dhoni / Mahi7781 🔵 (@ms.dhoni.sr07) -
ఆదిలాబాద్: ఒకేసారి ఇద్దరు యువతులను పెళ్లాడిన వరుడు
ఆదిలాబాద్: జిల్లాలో ఆసక్తికర ఘటన చోటుచేసుకుంది. ఒకే పందిరి కింద ఇద్దరు యువతులకు తాళి కట్టాడో వరుడు. పెళ్లికుమార్తెలు ఇద్దరూ వరసకు అక్కాచెల్లెళ్లు కావడం గమనార్హం. జూన్ 14న జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. వివరాలు... ఉట్నూర్ మండలంలోని ఘనపూర్ గ్రామానికి చెందిన అర్జున్ బీఈడీ పూర్తిచేశాడు. ప్రస్తుతం పోటీ పరీక్షలకు సన్నద్ధం అవుతున్నాడు. కాగా మేనత్త కుమార్తె ఉషా రాణితో అతడు ప్రేమలో పడ్డాడు. అయితే, ఆమెతో ప్రేమ బంధం కొనసాగిస్తూనే, మరో మేనత్త కూతురు సురేఖపై కూడా ఇష్టం పెంచుకున్నాడు. సదరు యువతులు ఇద్దరూ కూడా ఒకరికి తెలియకుండా మరొకరు అర్జున్ను ప్రేమిస్తూనే ఉన్నారు. ఈ క్రమంలో అతడికి పెళ్లి చేయాలని తల్లిదండ్రులు భావించగా.. అసలు విషయం బయటపడింది. తాను ఇద్దరినీ పెళ్లాడతానని అర్జున్ తన తల్లిదండ్రులకు చెప్పాడు. ఇక ఈ విషయంపై అభిప్రాయం కోరగా ఆ యువతులు బావనే పెళ్లి చేసుకుంటామని స్పష్టం చేశారు. దీంతో మూడు కుటుంబాల పెద్దలు చర్చించి, ఒకే మండపంలో అర్జున్‌కు ఉషా రాణి, సురేఖలతో వివాహం జరిపించారు. ఈ ఘటన గురించి స్థానిక ఎంపీపీ పండ్రా జయవంతరావు ఏఎన్ఐతో మాట్లాడుతూ.. గిరిజన సంప్రదాయంలో ఇలాంటి పెళ్లిళ్లు సాధారణమే అని పేర్కొన్నారు. ‘‘వాళ్లిద్దరూ అతడిని పెళ్లి చేసుకునేందుకు తమకేమీ అభ్యంతరం లేదని చెప్పారు. కాబట్టి ఎలాంటి ఆటంకం లేకుండా తంతు ముగిసింది. ఇక్కడ ఇవన్నీ సహజమే’’ అని చెప్పుకొచ్చారు. ఈ వేడుకకు సంబంధించిన ఫొటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. చదవండి: కాసేపట్లో పెళ్లి కూతురి మెడలో తాళి.. ఆపాలంటూ పోలీసుల ఎంట్రీ -
హైదరాబాద్ ఎయిర్‌పోర్టులో ప్రభాస్.. వైరలవుతోన్న ఫోటోలు
సుజిత్ డైరెక్షన్లో తెరకెక్కిన సాహో' డిజాస్టర్ తర్వాత సినిమాల వేగం పెంచాడు స్టైలిష్‌స్టార్ ప్రభాస్. ఊపిరి సలపనంతా బిజీగా మారాడు. మరో రెండు, మూడేళ్లు ఖాళీ లేకుండా రాధేశ్యామ్, సలార్, ఆదిపురుష్, నాగ్ అశ్విన్ దర్శకత్వంలో పాన్ ఇండియా మూవీ.. ఇలా బోలేడు ప్రాజెక్టులు ప్రభాస్ చేతిలో ఉన్నాయి. రాధాకృష్ణ రూపొందిస్తున్న రాధే శ్యామ్ జూలై 3న విడుదల కానుంది. ఇందులో హీరోయిన్గా చేస్తున్న బుట్టబొమ్మ పూజా హెగ్డేకు కరోనా సోకడంతో ఈ సినిమా వర్క్ ఆగిపోయింది. ఇక సలార్, ఆదిపురుష్ చిత్రీకరణ దశలో ఉండగా, నాగ్ అశ్విన్ చిత్రం ప్రీ ప్రొడక్షన్ స్టేజ్‌లో ఉంది. ఇటీవల ప్రభాస్ తన వ్యక్తిగత మేకప్ ఆర్టిస్ట్‌కు కరోనా సోకడంతో హోం ఐసోలేషన్లోకి వెళ్లిపోయిన విషయం తెలిసిందే. హీరోతోపాటు రాధే శ్యామ్ యూనిట్ మొత్తం క్వారంటైన్లోకి వెళ్లారు. అయితే ప్రభాస్‌కు కరోనా వచ్చిందేమో నని, రాధేశ్యామ్ షూటింగ్ నిలిచిపోయిందని డార్లింగ్ అభిమానులంతా తెగ కంగారు పడిపోయారు. కానీ తాజాగా ప్రభాస్ హైదరాబాద్ ఎయిర్ పోర్టులో కెమెరా కంటికి చిక్కాడు. ముఖానికి తెలుపు రంగు మాస్క్, షర్ట్, క్యాప్, కళ్లద్దాలతో స్టైలిష్‌గా కనిపిస్తున్నాడు. కాస్త బక్కచిక్కిన ప్రభాస్ కొత్త లుక్ క్యాజువల్ డ్రెస్‌లో దర్శనమిచ్చాడు. దీంతో ప్రభాస్‌కు ఏమీ కాలేదని ఆయన ఫ్యాన్స్ ఊపిరి పీల్చుకుంటున్నారు. ప్రస్తుతం ఈ ఫోటోలు నెట్టింట్లో వైరల్‌గా మారాయి. చదవండి: ఐసోలేషన్లోకి ప్రభాస్.. రాధేశ్యామ్ షూటింగ్‌కు బ్రేక్! -
రియా కొత్త ఫొటో వైరల్.. మండిపడుతున్న నెటిజన్లు
ముంబై: దివంగత నటుడు సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ మృతి కేసు, బాలీవుడ్ డ్రగ్ వ్యవహరంలో ప్రధాన నిందితురాలైన రియా చక్రవర్తి గత నెల బెయిల్‌పై విడుదలైన సంగతి తెలిసిందే. అయితే బయటకు వచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకూ ఆమె మీడియాకు ఎదురుపడలేదు. ఈ క్రమంలో ఇటీవల ఓ బర్త్‌డే పార్టీకి హాజరైన రియా ఫొటో నెట్టింటా హల్చల్ చేస్తోంది. రోడీస్ ఫేం రాజీవ్ లక్ష్మన్ కుమారుడి మొదటి బర్త్‌డే పార్టీకి ఇటీవల రియా హజరయ్యారు. ఈ సందర్భంగా రియాతో కలిసి సన్నిహితంగా దిగిన ఓ ఫొటోను రాజీవ్‌తో తన సోషల్ మీడియా ఖాతాలో పోస్టు చేశాడు. ‘మై ఫ్రెండ్ ’అంటూ పోస్టు చేసిన ఈ ఫొటో రియా రాజీవ్‌ను హగ్ చేసుకుని కెమెరాకు నవ్వుతూ ఫొజ్ ఇచ్చారు. దీంతో అతనితో అత్యంత సన్నిహితంగా ఉండటమే కాక సంతోషంతో నవ్వుతూ కనిపించిన రియాపై నెటిజన్లు విమర్శలు గుప్పించడంతో రాజీవ్ ఈ పోస్టును డిలీట్ చేశాడు. (చదవండి: సుశాంత్ కేసు: రూ. 2.5 కోట్ల డ్రగ్స్ స్వాధీనం) దీంతో చాలా రోజుల తర్వాత రియా మళ్లీ వార్తల్లో నిలిచారు. సుశాంత్ మృతి కేసులో వెలుగు చూసిన బాలీవుడ్ డ్రగ్ వ్యవహరంలో నార్కోటిక్ కంట్రోల్ బ్యూరో గతేడాది సెప్టెంబర్‌లో రియాను అరెస్టు చేసిన విషయం తెలిసిందే. దాదాపు నెల రోజుల జైలు జీవితం అనంతరం అక్టోబర్‌లో ఆమె బెయిల్‌పై విడుదలయ్యారు. ఇక బయటకు రాగానే కేరీర్‌పై దృష్టి పెట్టిన రియా తిరిగి సినిమాల్లో నటించనున్నట్లు దర్శకుడు రూమి జాఫరీ ఇటీవల ఓ ఇంటర్వ్యూలో వెల్లడించారు. ‘రియా 2021 నుంచి షూటింగ్లో పాల్గొననున్నారని, ప్రస్తుతం ఆమె చేతిలో ‘సోనాలి కేబుల్’, ‘జలేబీ’, ‘మేరే డాడ్‌కి మారుతి’ వంటి ప్రాజెక్టులు ఉన్నట్లు ఆయన తెలిపారు. (చదవండి: ‘అందుకే రియా, సుశాంత్ ఇంటిని వీడింది’) -
ఫోటో షూట్.. మరోరకం ట్రెండింగా..?
ఇప్పుడు పెళ్లిల్లంటే చాలు ఛలో ఫోటో షూట్ అంటుంది నేటి యువత. ఒకప్పుడు ఇలాంటి ఆనవాయితీ లేకపోయినా ప్రస్తుత జనరేషన్లో, ప్రతి ఒక్కరూ తమకు నచ్చిన విధంగా వెడ్డింగ్ షూట్ చేయించుకుంటున్నారు. ఆ చిత్రాలను, వీడియోలను కేవలం వారి వరకే పరిమితం చేసుకోకుండా సోషల్ మీడియాలో అప్లోడ్ చేయడం అలవాటుగా మారింది. ఈ ఫోటోషూట్ కూడా కొన్ని జంటలు రొటీన్‌గా భావిస్తున్నాయి. అందుకే విభిన్నవేషధారణల్లో దిగిన అనేక ఫోటోలను దిగుతూ అందరి చూపు వారిపై పడేలా చేసుకుంటున్నారు. ఇలాంటి తరహానే ప్రయత్నించింది ఓ పెళ్లి జంట. ఎవరో తమపై దాడి జరిపినట్లు కనిపించే విధంగా, ముఖానికి రక్తం అంటినట్లుండే మేకప్‌తో తమ వెడ్డింగ్ షూట్ చేయించుకున్నారు. వాటిని సోషల్ మీడియాలో చూసిన ప్రతి ఒక్కరూ వారికి ఏదో ప్రమాదం జరిగిందనే అనుకునేలా ఉన్నాయి అవి. సరిగ్గా చూస్తేనే కానీ అర్థం కానీ ఆ ఫోటోలను చూసిన నెటిజన్లు కొందరు మరో రకం ట్రెండ్ అని పొగిడితే, మరికొందరు పిచ్చికి పరాకాష్టంటే ఇదేనని కామెంట్ చేస్తున్నారు. ప్రస్తుతం ఈ జంట ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. ఇక కొన్ని నెలల క్రితం ఒక కేరళ జంట కాస్త విభిన్నంగా ప్రయత్నించిన వెడ్డింగ్ షూట్ హల్చల్ చేసిన విషయం తెలిసిందే. -
‘మున్నాభాయ్’ వైరల్ పిక్ : షాక్‌లో ఫ్యాన్స్
సాక్షి,ముంబై : ఊపిరితిత్తుల క్యాన్సర్‌తో బాధపడుతున్న బాలీవుడ్ నటుడు సంజయ్ దత్ (61) ఫొటో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఎయిర్‌పోర్టులో ఓ అభిమాని ఆయనతో తీసుకున్న ఫొటో చూసి ఫ్యాన్స్ షాక్ అవుతున్నారు. ఆ ఫొటోలో సంజయ్‌దత్ చాలా బలహీనంగా కనిపిస్తున్నారు. దీంతో సంజయ్ ఆరోగ్యంపై అభిమానులు ఆందోళన చెందుతున్నారు. ‘మున్నాభాయ్ ఎంబీబీస్’ త్వరగా కోలుకోవాలంటూ సోషల్ మీడియాలో ఆకాంక్షిస్తున్నారు. తన ఆరోగ్యం బాగా లేదని చికిత్స నిమిత్తం కొంత కాలం విరామం తీసుకుంటున్నట్టు ఆగస్టు 11న సంజయ్ ట్వీట్ చేశారు. నాలుగో దశ ఊపిరితిత్తుల కేన్సర్‌తో బాధపడుతున్న ఆయన ముంబైలో తొలి దశ కీమోథెరపీని పూర్తి చేసుకున్నారు. అనంతరం భార్య మాన్యతో కలిసి దుబాయ్‌లో ఉంటున్న పిల్లలతో కొన్ని రోజులు గడిపిన సంజయ్ ఇటీవల ముంబైకి తిరిగి వచ్చారు. ఆయనకు రెండో దశ కీమోథెరపీ త్వరలోనే ప్రారంభం కానుందని సమాచారం. (దుబాయ్‌లో సంజయ్ దత్ ఫ్యామిలీ..) He looks so different gosh.... lost so much weight?? Uff... so sad. #SanjayDutt pic.twitter.com/7Fimr7KWAP — IkraaaShahRukh💕 (@Ikra4SRK) October 3, 2020 -
లేట్‌నైట్‌లో హీరోహీరోయిన్లు.. ఫోటోలు హల్చల్
అర్ధరాత్రి హీరోహీరోయిన్లు ముచ్చటించుకుంటున్న ఫోటోలు హాట్ టాపిక్‌గా మారాయి. బాలీవుడ్ యూత్ స్టార్ రణ్‌బీర్ కపూర్, హీరోయిన్ అలియాభట్‌లు కలిసి ఉన్న ఫోటోలు ఇప్పుడు వైరల్ అవుతున్నాయి. కరణ్ జోహర్ ‘బ్రహ్మస్త్ర’ ప్రాజెక్టులో వీరిద్దరూ కలిసి నటిస్తుండగా.. గత కొంత కాలంగా డేటింగ్ చేస్తున్నారంటూ కథనాలు చక్కర్లు కొడుతున్న విషయం తెలిసిందే. తాజాగా ఓ ఇంటర్వ్యూలో రణ్‌బీర్ మాట్లాడుతూ.. ‘నేనెప్పుడు సింగిల్‌గా ఉండను. ఇప్పుడూ అంతే’ అంటూ అలియాతో ఉన్న రిలేషన్ గురించి పరోక్షంగా స్పందించాడు. ఈ నేపథ్యంలో వీళ్లిద్దరి బంధం గురించి రకరకాల కథనాలు వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే వీళ్లిద్దరూ ఇలా ఒకే చోట.. అది కూడా రాత్రి పూట కావటం మీడియాలో చర్చనీయాంశంగా మారింది. మీడియా అత్యుత్సాహం... వీళ్లిద్దరి తాజా కలయికపై బాలీవుడ్ మీడియా ఛానెళ్లు విపరీతమైన అర్థాలతో కథనాలను ప్రచురించాయి. అయితే సంజు సక్సెస్‌ను ఎంజాయ్ చేస్తున్న రణ్‌బీర్.. శుక్రవారం రాత్రి అలియా ఇంట్లో పార్టీ చేసుకున్నారు. ఈ ఈవెంట్లో రణ్‌బీర్-అలియాతోపాటు దర్శకదిగ్గజం-అలియా తండ్రి మహేష్ భట్ కూడా పాల్గొన్నారు. అయినప్పటికీ బాల్కనీలో ఉన్న వీళ్లిద్దరి ఫోటోలను మాత్రమే హైలెట్ చేస్తూ కథనాలతో మీడియా ఛానెళ్లు అత్యుత్సాహం ప్రదర్శించాయి. -
అవ్వకు బువ్వపెట్టి.. ఆశ్రమంలో చేర్పించాడు
సాక్షి, హైదరాబాద్: అది నగరంలోని అత్యంత రద్దీ ప్రాంతాల్లో ఒకటైన కూకట్పల్లి జేఎన్టీయూ సిగ్నల్.. జనం ఎవరి సోయిలో వాళ్లు.. రోడ్డు పక్కనే ఒక అవ్వ.. పెట్టే దిక్కులేక చాన్నాళ్ల నుంచి తిండి తిననట్లు బక్కచిక్కిన శరీరం.. ఎటు పోవాలో, ఏం చెయ్యాలో తెలియని బిత్తరచూపులు! అటుగా వచ్చిన హోంగార్డు ఒకరు ఆ అవ్వను చూసి చలించిపోయాడు. పక్కనున్న టిఫిన్ సెంటర్ నుంచి ఆహారం తీసుకొచ్చి ఓపికగా అవ్వకు తినిపించాడు. అంతేనా, అధికారుల సాయంతో అవ్వను ఆశ్రమంలో చేర్పించాడు. అతని పేరు బి.గోపాల్. కూకట్పల్లి ట్రాఫిక్ పోలీస్ స్టేషన్లో హోంగార్డు. ఉద్యోగరీత్యా అతని స్థాయి చిన్నదే అయినా, ఉన్నత వ్యక్తిత్వం అతని సొంతం. అందుకే ఉన్నతాధికారుల నుంచి సామాన్యపౌరుల దాకా అందరూ అతన్ని అభినందిస్తున్నారు. తెలంగాణ డీజీపీకి పీఆర్వో భార్గవి పోస్ట్ చేసిన ఈ ఫొటోలు వైరల్ అయ్యాయి. ఆ వృద్ధురాలిని చర్లపల్లిలో జైళ్ల శాఖ ఆధ్వర్యంలో నడుస్తోన్న ఆనందాశ్రమానికి తరలించినట్లు భార్గవి తెలిపారు. -
హార్ట్ టచింగ్ ఫొటో.. వైరల్
కళ్లముందే సాటి మనిషి కష్టాల్లో ఉంటే పట్టించుకోకుండా మన పనుల్లో నిమగ్నమవుతాం. ప్రాణాలు పోతున్నా గుడ్లప్పగించి చూస్తాం తప్పితే ఆపన్నహస్తం అందించం. కానీ మూగజీవాలు అలా కాదు. సాటి జంతువుకు కష్టమొస్తే అండగా నిలబడతాయి. మేమున్నామంటూ అండగా నిలుస్తాయి. ఇలాంటి ఘటనకు సంబంధించిన హార్ట్ టచింగ్ ఫొటో ఒకటి సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది. బ్రెజిల్‌కు చెందిన సులెన్ షుమలొయ్ఫెల్ అనే జర్నలిస్టు ఈ ఫొటోను తన ఫేస్బుక్ పేజీలో పోస్ట్ చేశారు. ఆమెను పెళ్లి చేసుకోబోయే వ్యక్తి ఈ ఫొటో తీశారు. గతేడాది వీరిద్దరూ ఎనిమిది నెలల వయసున్న లానా అనే కుక్క పిల్లను తెచ్చుకున్నారు. బాగా చలిగా ఉండడంతో రెండు వారాల తర్వాత దాని కోసం ప్రత్యేకంగా దళసరిగా ఉన్న బ్లాంకెట్ కొన్నారు. తర్వాతి రోజు ఉదయం లేచి చూసిన సులెన్ పియాన్స్కు ఊహకు అందని దృశ్యం కనపడింది. బ్లాంకెట్‌కు ఒక చివర లానా, మరోవైపున వీధి కుక్క పడుకునివుండడం చూసి ఆయన ఆశ్చర్యపోయారు. ఒక దుప్పటిని రెండు మూగజీవాలు పంచుకుని చలిని జయించిన తీరును చూసి ఆయన చలించిపోయారు. తనకోసం తెచ్చిన దుప్పటిని సాటి కుక్కకు పంచిన లానాను అభినందనపూర్వకంగా చూశారు. వెంటనే ఈ దృశ్యాన్ని తన కెమెరాలో బంధించారు. ఈ ఫోటోను ఫేస్బుక్లో పోస్టు చేయగా 45 వేల మందిపైగా స్పందించారు. 26 వేల సార్లు షేర్ చేశారు. లానా లాంటి మంచి మనసున్న కుక్కను తన జీవితంలో ఎప్పుడు చూడలేదని సులెన్ పొంగిపోతున్నారు. లానాలోని మరో కోణాన్ని తమకు పరిచయం చేసిన వీధి కుక్కకు రోజు ఆహారం, మంచినీళ్లు అందిస్తున్నట్టు చెప్పారు. త్వరలోనే దానికి కూడా మంచి గూడు ఏర్పాటు చేస్తామన్నారు.