T20 World Cup 2021 Pak Vs Afg: Asif Ali Winning Celebrations Video Goes Viral - Sakshi
Sakshi News home page

T20 WC 2021: అచ్చం ధోనిలానే చేశాడు.. అతని స్టైల్‌లోనే మ్యాచ్‌ ముగించాడు..

Published Sat, Oct 30 2021 4:09 PM | Last Updated on Sat, Oct 30 2021 6:52 PM

T20 WC 2021 PAK Vs AFG: Asif Ali Refreshes Dhoni Gun Shot Celebration After Hitting Four Sixes - Sakshi

Asif Ali Refreshes Dhoni Gun Shot Celebration After Hitting Four Sixes Against Afghanistan: టీ20 ప్రపంచకప్‌-2021లో భాగంగా అక్టోబర్‌ 29న అఫ్గానిస్థాన్‌తో జరిగిన మ్యాచ్‌లో పాకిస్థాన్ 5 వికెట్ల తేడాతో సూపర్‌ విక్టరీ సాధించిన సంగతి తెలిసిందే. ఈ మ్యాచ్‌లో పాక్‌ విజయానంతరం ఓ ఆసక్తికర సన్నివేశం తారసపడింది. ఇన్నింగ్స్‌ 19వ ఓవర్‌లో నాలుగు సిక్సర్లు బాది పాక్‌కు అద్భుత విజయాన్నందించిన ఆసిఫ్‌ అలీ.. టీమిండియా మాజీ కెప్టెన్‌, ప్రస్తుతం మెంటార్‌ ఎంస్‌ ధోని తరహాలో విన్నింగ్‌ మూమెంట్‌ను సెలబ్రేట్‌ చేసుకుంటూ కనిపించాడు. ఈ మ్యాచ్‌ను ధోని స్టైల్‌లోనే ఫినిష్‌ చేసిన ఆసిఫ్‌.. అచ్చం అతనిలానే గన్‌ షాట్‌ సెలబ్రేషన్స్‌ చేసుకున్నాడు. 

గతంలో ధోని ఎప్పుడు విన్నింగ్ షాట్ కొట్టినా.. ఇలానే సెలబ్రేట్ చేసుకునేవాడు. బ్యాట్‌తో గ‌న్ ట్రిగ్గ‌ర్ నొక్కిన‌ట్లు ఫోజు ఇస్తూ సంద‌ర్భాన్ని ఎంజాయ్ చేసేవాడు. ఈ మ్యాచ్‌లో పాక్‌కు ఓట‌మి త‌ప్ప‌దనుకున్న స‌మ‌యంలో.. భారీ సిక్స‌ర్ల‌తో విరుచుకుపడిన ఆసిఫ్ అలీ కూడా ధోని త‌ర‌హాలోనే విజ‌యాన్ని సెల‌బ్రేట్ చేసుకున్నాడు. దీనికి సంబంధించిన ఇమేజస్‌ ప్రస్తుతం సోషల్‌మీడియాలో ట్రెండింగ్‌లో ఉన్నాయి. ఆసిఫ్ అలీ మరో ధోని.. అంటూ క్రికెట్‌ అభిమానులు కామెంట్లు చేస్తున్నారు. ఇదిలా ఉంటే, పాక్‌ ఈ మెగా టోర్నీలో ఆడిన మూడు మ్యాచ్‌ల్లో విజయాలు సాధించి సెమీస్‌ బెర్తును దాదాపుగా ఖరారు చేసుకుంది. తొలి మ్యాచ్‌లో టీమిండియాపై 10 వికెట్ల తేడాతో గెలుపొందిన పాక్‌.. తరువాతి మ్యాచ్‌లో న్యూజిలాండ్‌పై 5 వికెట్ల తేడాతో, తాజాగా అఫ్గాన్‌పై కూడా 5 వికెట్ల తేడాతో ఘన విజయాలు నమోదు చేసింది.   


చదవండి: కోహ్లి రికార్డును బ్రేక్‌ చేసిన బాబర్ ఆజమ్‌: కోహ్లిని వెంటాడుతున్న ఆజమ్‌ అంటూ..

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement