IPL 2023, CSK Vs LSG: Gautam Gambhir Reaction To MS Dhoni Back To Back Sixes, Pic Viral - Sakshi
Sakshi News home page

Gautam Gambhir- MS Dhoni: ధోని సిక్సర్లు; చెన్నై గెలుపు.. బిత్తరపోయిన గంభీర్‌! ఫొటో వైరల్‌

Published Tue, Apr 4 2023 10:41 AM | Last Updated on Tue, Apr 4 2023 11:52 AM

IPL 2023: Dhoni Powerfull Sixes Gambhir Reacion Viral CSK Beat LSG - Sakshi

గంభీర్‌- ధోని (Photo Credit: Starsports/IPL)

IPL 2023- CSK Vs LSG: ఐపీఎల్‌-2023లో చెన్నై సూపర్‌ కింగ్స్‌ చేతిలో లక్నో సూపర్‌ జెయింట్స్‌ ఓటమి నేపథ్యంలో గౌతం గంభీర్‌ ట్రోలింగ్‌ బారిన పడ్డాడు. రాహుల్‌ బృందంపై ధోని సేన గెలుపుతో మీమర్స్‌కు టార్గెట్‌ అయ్యాడు. కాగా చెపాక్‌ వేదికగా సోమవారం జరిగిన మ్యాచ్‌లో టాస్‌ గెలిచిన లక్నో కెప్టెన్‌ కేఎల్‌ రాహుల్‌ తొలుత బౌలింగ్‌ ఎంచుకున్నాడు.

ఈ క్రమంలో సుదీర్ఘ విరామం తర్వాత సొంత మైదానంలో మ్యాచ్‌ ఆడిన చెన్నై బ్యాటర్లు దంచికొట్టారు. ఓపెనర్లు రుతురాజ్‌ గైక్వాడ్‌ హాఫ్‌ సెంచరీ, డెవాన్‌ కాన్వే మెరుగైన ఇన్నింగ్స్‌ కారణంగా నిర్ణీత 20  ఓవర్లలో ఏడు వికెట్లు నష్టపోయి 217 పరుగులు చేసింది సీఎస్‌కే.

ఆరంభంలో అదరగొట్టిన లక్నో ఆఖరికి
లక్ష్య ఛేదనకు దిగిన లక్నో ఆరంభంలో అదరగొట్టినా ఆఖరికి వచ్చే సరికి చేతులెత్తేసింది. చివరి బంతి వరకు ఉత్కంఠ రేపిన మ్యాచ్‌లో 12 పరుగుల తేడాతో ఓటమిని మూటగట్టుకుంది. తద్వారా ఈ సీజన్‌లో తొలి పరాజయం నమోదు చేసింది.

ఇదిలా ఉంటే.. ఈ మ్యాచ్‌లో ధోని వరుసగా రెండు సిక్స్‌లు కొట్టడం హైలైట్‌గా నిలిచింది. ఈ నేపథ్యంలో లక్నో సూపర్‌ జెయింట్స్‌ మెంటార్‌, టీమిండియా మాజీ ఓపెనర్‌ గౌతం గంభీర్‌ ఎక్స్‌ప్రెషన్‌ వైరల్‌గా మారింది. డగౌట్‌లో నిరాశగా కూర్చున్న గంభీర్‌ ఫొటోలు షేర్‌ చేస్తూ మీమ్స్‌ సందడి చేస్తున్నారు నెటిజన్లు.  ఐపీఎల్‌-2022లో చెన్నైపై లక్నో విజయం సందర్భంగా అమితానందంతో గంతులేసిన గంభీర్‌కు.. ఇప్పటి గంభీర్‌కు చాలా తేడా ఉంది కదా అంటూ ధోని ఫ్యాన్స్‌ ట్రోల్‌ చేస్తున్నారు.

తగ్గేదేలే
ఇక ఈ మ్యాచ్‌లో ధోని తమ జట్టు ఇన్నింగ్స్‌ ఆఖర్లో రెండు సిక్సర్లతో చెలరేగిన ఫొటోలు పంచుకుంటూ.. ‘‘ఇదీ తలైవా అంటే.. ఇప్పటికీ బ్యాటింగ్‌లో పవర్‌ ఏమాత్రం తగ్గలేదు’’ అని గంభీర్‌కు కౌంటర్‌ ఇస్తున్నారు. కాగా ధోనిని ఉద్దేశించి గంభీర్‌ పలు సందర్భాల్లో విమర్శలు చేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలోనే గంభీర్‌ను ట్రోల్‌ చేస్తున్నారు తలైవా ఫ్యాన్స్‌.

చదవండి: CSK Vs LSG: చెత్త బౌలింగ్‌.. పేసర్లకు ధోని స్ట్రాంగ్‌ వార్నింగ్‌! ఇలాగే కొనసాగితే

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement