Rashmika Mandanna Shares IPL 2023 Event Pics On Social Media - Sakshi
Sakshi News home page

అది మైండ్‌లో నుంచి పోవడం లేదు.. బయటపడలేకపోతున్నా: రష్మిక

Published Fri, Apr 14 2023 3:17 PM | Last Updated on Fri, Apr 14 2023 4:02 PM

Rashmika Mandanna Shares Pic About Ipl 2023 Event Goes Viral - Sakshi

రష్మిక మందన్న.. కన్నడ ఇండస్ట్రీలో సినీ కెరీర్‌ ప్రారంభించిన ఈ అమ్మడు, ‘ఛలో’ సినిమాతో టాలీవుడ్‌ ప్రేక్షకులను పలకరించింది. ఈ చిత్రం సూపర్‌ హిట్‌ టాక్‌ కావడంతో రష్మిక దశ తిరిగింది. వరుస ఆఫర్లు అందుకుని మంచి విజయాలతో దూసుకుపోతూ నేషనల్‌ క్రష్‌గా గుర్తింపు తెచ్చుకుంది. ప్రస్తుతం వరుస సినిమాలతో ఎంతో బిజీగా ఉన్నా.. సోషల్ మీడియాలో కూడా యాక్టివ్‌గా ఉంటూ తనకు సంబంధించిన అన్ని విషయాలను అభిమానులతో పంచుకుంటోంది. తాజాగా రష్మిక తన ఇన్‌స్టా ఖాతాలో కొన్ని ఫోటోలను షేర్ చేస్తూ తాను ఇంకా ఐపీఎల్ (IPL 2023) హ్యాంగోవర్ నుంచి బయట పడలేదని వెల్లడించింది.

రష్మిక ఇప్పటికే సౌత్‌లో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది. గతేడాది విడుదలైన ‘పుష్ప ది రైజ్‌’ సినిమా బాక్సాఫీస్‌ వద్ద భారీ వసూళ్లను రాబట్టడంతో పాటు పాన్‌ ఇండియా రేంజ్‌లో హిట్‌గా నిలిచింది. ఈ చిత్రం ముఖ్యంగా బాలీవుడ్‌లో ఊహించని కలెక్షన్లను అందుకుని ఆశ్చర్యపరిచిన సంగతి తెలిసిందే. ఇందులో హీరోయిన్‌గా నటించిన రష్మికకు కూడా జాతీయ స్థాయిలో గుర్తింపు రావడంతో ప్రస్తుతం అటు బీటౌన్‌లోనూ అవకాశాలను అందిపుచ్చుకుని జెట్‌ స్పీడ్‌లో దూసుకుపోతోంది ఈ భామ.  


ఇటీవల ఐపీఎల్ 2023 ప్రారంభోత్సవ కార్యక్రమంలో డ్యాన్స్‌ చేసి అందరిని అలరించింది రష్మిక. ఇందులో ఈ అమ్మడుతో పాటు తమన్నా కూడా పాల్గొన్న సంగతి తెలిసిందే. ఐపీఎల్ ప్రారంభోత్సవానికి సంబంధించిన ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేసిన ఈ భామ.. తాను ఈ ఐపీఎల్ వేడుక కార్యక్రమం మైండ్‌ నుంచి పోవడం లేదుని, అందులో నుంచి బయటపడలేకపోతున్నానని క్యాప్షన్‌ పెట్టింది.

ఈ ఫోటోలతో పాటు భారత మాజీ కెప్టన్‌, సీఎస్‌కే  సారథి మహేంద్ర సింగ్‌ ధోనితో కలిసి తీసుకున్న ఫోటోను కూడా షేర్‌ చేసింది. ప్రస్తుతం ఈ ఫోటోలు నెట్టింట వైరల్‌గా మారాయి. ఇక సినిమాల విషయానికి వస్తే.. ప్రస్తుతం రష్మిక అల్లు అర్జున్ హీరోగా సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న పుష్ప 2 సినిమా షూటింగ్ పనులలో బిజీగా ఉన్నారు. ఈ ప్రాజెక్ట్‌తో పాటు నితిన్ సరసన మరోసారి సందడి చేయబోతోంది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement