క్రికెట్‌లో అవకాశాలు సన్నగిల్లాక సోషల్‌మీడియాలో యాక్టివ్‌గా ఉంటున్న టీమిండియా వెటరన్ స్పిన్నర్ హర్భజన్ సింగ్.. తాజాగా నెటిజన్లకు ఓ పరీక్ష పెట్టాడు. 1997-98 దక్షిణాఫ్రికాలో జరిగిన అండర్-19 ప్రపంచ కప్‌కు సంబంధించిన ఓ ఫొటోను ట్విటర్‌లో పోస్ట్ చేస్తూ.. అందులో తనతో ఉన్న ఇద్దరు పాక్ క్రికెటర్లు ఎవరో కనుక్కోవాలంటూ నెటిజన్లను కోరాడు.
Pehchano to maaane.. U-19 World Cup days 1998/99 pic.twitter.com/2iawM1dSUK
— Harbhajan Turbanator (@harbhajan_singh) December 10, 2021
ఈ ఫోటోలో భజ్జీని సులువుగా గుర్తుపడుతున్న నెటిజన్లు.. అతని పక్కన ఉన్న ఇద్దరిని మాత్రం పోల్చుకోలేకపోతున్నారు. నెటిజన్లకు సవాలుగా మారిన ఈ ఫోటో ప్రస్తుతం సోషల్‌మీడియా చక్కర్లు కొడుతోంది. ఇందులో భజ్జీ పక్కనున్న వాళ్లను గుర్తుపట్టాలంటూ అభిమానులు గ్రూపుల్లో షేర్ చేస్తున్నారు. ఆ ఇద్దరిని కొందరు సరిగ్గా గెస్ చేయగలుగుతున్నా.. చాలా వరకు విఫలమవుతున్నారు.
ఇదిలా ఉంటే, భజ్జీ పక్కన షర్ట్ లేకుండా ఉన్నది నాటి పాక్ ఆటగాడు, ప్రస్తుతం దక్షిణాఫ్రికాకు ఆడుతున్న ఇమ్రాన్ తాహిర్ కాగా, మరొకరు పాక్ మాజీ ఆటగాడు హసన్ రాజా. వీరిద్దరు పాక్ అండర్-19 జట్టుకు ప్రాతినిధ్యం వహించారు. వీరిలో హసన్ రాజా పాక్ తరఫున 7 టెస్ట్‌లు, 16 వన్డేలు ఆడగా.. పాక్‌లోనే పుట్టిన ఇమ్రాన్ తాహిర్ మాత్రం తన కుటుంబం దక్షిణాఫ్రికాకు వలస వెళ్లడంతో ఆ దేశ జాతీయ జట్టుకు ప్రాతినిధ్యం వహించాడు.
ఇక 1997-98 అండర్-19 ప్రపంచకప్ విషయానికొస్తే.. ఆ టోర్నీలో భారత్, పాక్ జట్ల మధ్య డర్బన్ వేదికగా జరిగిన లీగ్ మ్యాచ్‌లో టీమిండియా పాక్‌పై 5 వికెట్ల తేడాతో విజయం సాధించింది. ఆ మ్యాచ్‌లో 7 ఓవర్లు వేసిన భజ్జీ.. కీలకమైన షోయబ్ మాలిక్ వికెట్ తీశాడు.
చదవండి: ‘యే బిడ్డా.. ఇది నా అడ్డా..’ అంటున్న డేవిడ్ భాయ్, కౌంటరిచ్చిన కోహ్లి
Comments
Please login to add a commentAdd a comment