Dhoni Farming Mustard Crop: టీమిండియా మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోని రైతుగా మారాడు. ఇదేదో సరదా కోసం చేసిన పని అనుకుంటే పొరపాటే. అతను నిజంగానే పూర్తి స్థాయి రైతుగా మారి పంటలు పండిస్తున్నాడు. అంతర పంట పద్ధతిలో ఆవాలను సాగు చేస్తున్నాడు. దీంతో పాటు క్యాబేజీ, అల్లం, క్యాప్సికమ్ వంటి అనేక రకాల కూరగాయలు, స్ట్రాబెర్రీలు కూడా పండిస్తున్నాడు. ఇటీవల పంటను పరిశీలించేందుకు వ్యవసాయ క్షేత్రానికి వెళ్లిన ధోని, అతని సాగు సలహాదారుడు రోషన్‌తో కలిసి సెల్ఫీకి పోజిచ్చాడు. ఈ ఫొటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరలవుతున్నాయి.
Latest pictures of Mahi in Mustard field at his farmhouse. 🤩❤️#MSDhoni • #Dhoni • #WhistlePodu pic.twitter.com/owSA57ccEO
— Nithish Msdian (@thebrainofmsd) January 16, 2022
ధోనికి కూరగాయాలంటే అమితంగా ఇష్టమని, రాంచీ వచ్చిన ప్రతిసారి తాను పండించిన కూరగాయలు మాత్రమే తింటాడని రోషన్ తెలిపాడు. ఇదిలా ఉంటే, ధోని.. ఐపీఎల్ మినహా క్రికెట్‌లోని అన్ని ఫార్మాట్లకు గుడ్‌బై చెప్పిన సంగతి తెలిసిందే. ఐపీఎల్ 2022లో భాగంగా అతన్ని చెన్నై సూపర్ కింగ్స్ జట్టు 12 కోట్లు వెచ్చించి మరోసారి రిటైన్ చేసుకుంది. వయో భారం రిత్యా అతను.. ఈ ఏడాది ఐపీఎల్‌కు కూడా వీడ్కోలు పలికే అవకాశం ఉందని తెలుస్తోంది. చెన్నై సూపర్ కింగ్స్ జట్టు ధోనితో పాటు రుతురాజ్ గైక్వాడ్, మొయిన్ అలీలను రిటైన్ చేసుకుంది.
చదవండి: "మ్యాచ్ ఫిక్సింగ్ నేరం కాదు.." హైకోర్టు సంచలన తీర్పు
Comments
Please login to add a commentAdd a comment