ప్రముఖ పారిశ్రామిక దిగ్గజం ఇన్ఫోసిస్ నారాయణ మూర్తి భార్య 'సుధామూర్తి' (Sudha Murthy) గురించి దాదాపు తెలియని వారు ఉండరు అంటే ఏ మాత్రం అతిశయోక్తి కాదు. ఎన్నో సామజిక కార్యక్రమాలు చేస్తూ ఎంతోమందికి రోల్ మోడల్‌గా నిలిచిన ఈ ఆదర్శమూర్తి ఇప్పుడు ఎలా ఉంటారనేది అందరికి తెలుసు. అయితే చదువుకునే వయసులో ఎలా ఉండేదో ఇక్కడ చూడవచ్చు.
సుధామూర్తి 1974లో బెంగుళూరులోని ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ నుంచి కంప్యూటర్ సైన్స్ పూర్తి చేసి అప్పటి కర్ణాటక ముఖ్యమంత్రి నుంచి గోల్డ్ మెడల్ కూడా పొందింది. 150 మంది విద్యార్థులలో ఈమె ఒక్కరే మహిళ కావడం గమనార్హం. అప్పట్లో ఎన్నో ఆటంకాలను సైతం ఎదుర్కోగలిగిన ధీశాలి.
మహిళల హక్కుల కోసం పాటుపడి అప్పట్లో ఏకంగా జేఆర్‌డీ టాటాకు లేఖ రాసింది. ఈ రోజు టాటా కంపెనీలో మహిళలు పనిచేస్తున్నారంటే దాని వెనుక సుధామూర్తి హస్తం ఉండటమే. ఇప్పటికే కళ, సంస్కృతి, ప్రజా పరిశుభ్రత, ఆరోగ్య సంరక్షణ, పేదరికం తగ్గింపు, మహిళా సాధికారత వంటి అనేక రంగాల్లో తనదైన రీతిలో సామజిక ఈమె సేవ చేసింది.
ఇదీ చదవండి: ఎంతమంది ఉద్యోగాలు పోయినా వీరు చాలా సేఫ్.. జీతాలు కోట్లలో!
సుధామూర్తి హార్వర్డ్ యూనివర్శిటీలో మూర్తి క్లాసికల్ లైబ్రరీ ఆఫ్ ఇండియాను స్థాపించింది. అనేక అనాథాశ్రమాలను స్థాపించింది, గ్రామీణాభివృద్ధి ప్రయత్నాలలో పాల్గొంది, అన్ని కర్ణాటక ప్రభుత్వ పాఠశాలలకు కంప్యూటర్ అండ్ లైబ్రరీ మౌలిక సదుపాయాలను అందించాలనే ఉద్యమానికి మద్దతు ఇచ్చింది. నిరాడంబరమైన సేవను గుర్తించిన భారత ప్రభుత్వం ఈమెకు పద్మ భూషణ్ అవార్డుతో సన్మానించింది.
Comments
Please login to add a commentAdd a comment