Business Woman
-
అంబానీ అల్లుడితో సమానంగా బాధ్యతలు.. ఎవరీ నందిని?
భారతీయ కుబేరుడు ముఖేష్ అంబానీ.. తన కుమార్తె 'ఇషా అంబానీ'కి వ్యాపార రంగానికి చెందిన అజయ్ పిరమల్ కుమారుడు 'ఆనంద్ పిరమిల్'తో వివాహం జరిపించారు. ఫార్మాస్యూటికల్స్, ఫైనాన్షియల్ సర్వీసెస్, రియల్ ఎస్టేట్ వంటి రంగాల్లో దూసుకెళ్తున్న పిరమల్ వ్యాపార సామ్రాజ్యంలో 'నందిని పిరమల్' కీలకమైన వ్యక్తి. ఇంతకీ ఈమె ఎవరు? ఈమె నెట్‌వర్త్ ఎంత? అనే మరిన్ని ఆసక్తికర విషయాలను ఇక్కడ తెలుసుకుందాం.ఎవరీ నందిని పిరమల్?నందిని పిరమల్ అజయ్ పిరమల్ కుమార్తె. ఈమె పిరమల్ గ్రూప్ డైరెక్టర్ల బోర్డులో సభ్యురాలు. నందిని తన తల్లిదండ్రులు అజయ్, డాక్టర్ స్వాతి పిరమల్.. సోదరుడు ఆనంద్ పిరమల్‌తో కలిసి కంపెనీలో కీలక బాధ్యతలు నిర్వర్తిస్తోంది. ప్రస్తుతం పిరమల్ ఎంటర్ప్రైజెస్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్‌గా, పిరమల్ ఫార్మా చైర్‌పర్సన్‌గా ఉన్నారు. ఓవర్-ది-కౌంటర్ (OTC) వ్యాపార విభాగాన్ని పర్యవేక్షించడం ఆమె ప్రధాన పాత్ర వహిస్తోంది.నందిని పిరమల్ నాయకత్వంలో ఓటీసీ విభాగం భారతదేశంలో అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న వాటిలో ఒకటిగా మారింది. దీని అనేక ఉత్పత్తులు వాటి సంబంధిత విభాగాలలో అగ్రస్థానంలో ఉన్నాయి. అంతే కాకుండా ఆమె పిరమల్ గ్రూప్‌లో హ్యూమన్ రిసోర్సెస్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీకి అధిపతిగా ఉంది.2010లో నందిని కెరీర్లో ఒక ముఖ్యమైన మైలురాయి. ఆమె పిరమల్ గ్రూపుకు చెందిన దేశీయ ఫార్ములేషన్స్ వ్యాపారాన్ని అబాట్ లాబొరేటరీస్‌కు విక్రయించడంలో కీలక పాత్ర పోషించింది. 3.8 బిలియన్ డాలర్లు (సుమారు రూ. 31,638 కోట్లు) విలువైన ఈ డీల్ ఆ సమయంలో భారతీయ ఔషధ రంగంలో అతిపెద్ద లావాదేవీలలో ఒకటిగా నిలిచింది.కుటుంబ వ్యాపారంలోకి అడుగునందిని పిరమల్ కాలిఫోర్నియాలోని స్టాన్ఫోర్డ్ యూనివర్శిటీ గ్రాడ్యుయేట్ స్కూల్ ఆఫ్ బిజినెస్ నుంచి ఎంబీఏ పట్టా పొందారు. ఇంగ్లాండ్‌లోని ఆక్స్ఫర్డ్ విశ్వవిద్యాలయం నుంచి పాలిటిక్స్, ఫిలాసఫీ, ఆర్థిక శాస్త్రంలో బ్యాచిలర్స్ డిగ్రీ పొందింది. చదువు పూర్తయిన తరువాత మెకిన్సే & కంపెనీలో బిజినెస్ అనలిస్ట్‌గా పనిచేసింది. ఆ తరువాత 2006లో కుటుంబ వ్యాపారంలో అడుగుపెట్టింది.ఇదీ చదవండి: దీపావళి ఆఫర్: రూ. 699కే జియో 4జీ ఫోన్2009 మార్చిలో నందిని.. పీటర్ డీ యంగ్‌ను వివాహం చేసుకుంది. పీటర్ పిరమల్ గ్లోబల్ ఫార్మా సీఈఓ, ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్‌గా పనిచేస్తున్నారు. ఇతడు కూడా స్టాన్ఫోర్డ్ యూనివర్శిటీలోనే చదువుకున్నాడు. ఆ తరువాత మెకిన్సే & కంపెనీలో పనిచేసారు. నందిని పిరమల్ నెట్‌వర్త్ గురించి అధికారిక వివరాలు అందుబాటులో లేదు. కానీ ఈమె తండ్రి అజయ్ పిరమల్ నికర విలువ 2.8 బిలియన్ డాలర్లు (సుమారు రూ. 23,307 కోట్లు). 2023 ఆర్ధిక సంవత్సరంలో పిరమల్ గ్రూప్ రూ. 9087 కోట్ల ఆదాయాన్ని గడించింది. -
అందుకే లగ్జరీ కారు కొనలేదు: ఎడెల్వీస్ సీఈఓ
నెలకు లక్ష రూపాయలు సంపాదించేవారు కూడా ఓ ఖరీదైన కారు కొనేస్తున్నారు. అయితే కోట్ల రూపాయల డబ్బు ఉన్నప్పటికీ లగ్జరీ కారు కొనుగోలు చేయని వారు ఇప్పటికీ చాలామందే ఉన్నారు. ఈ కోవకు చెందిన వారిలో ఒకరు ఎడెల్వీస్ మ్యూచువల్ ఫండ్ సీఈఓ అండ్ ఎండీ 'రాధికా గుప్తా'.రాధికా గుప్తా ఎందుకు లగ్జరీ కారును కొనుగోలు చేయలేదు అనే ప్రశ్నకు ఓ ఇంటర్వ్యూలో సమాధానం ఇచ్చారు. బోనస్ పొందిన ప్రతిసారీ.. లగ్జరీ కారును కొనొచ్చు. కానీ కారు అనేది విలువ తగ్గిపోయే ఆస్తి. ఒక కారును కొనుగోలు చేసి మళ్ళీ విక్రయించాలంటే సుమారు 30 శాతం నష్టాన్ని చూడాల్సి వస్తుంది. కాబట్టి విలువ తగ్గిపోయే ఆస్తి మీద నేను పెట్టుబడి పెట్టను అని ఆమె వెల్లడించారు.ఇదీ చదవండి: రాత్రిని పగలుగా మార్చేయండిలా.. తాను జీవితంలో ఎన్నో ఒడిదుడుకులను ఎదుర్కొన్నట్లు పేర్కొన్నారు. ఎన్నో సంఘటనల ద్వారా పాఠాలు నేర్చుకున్నట్లు వివరించారు. 18 ఏళ్ల వయసులో కాలేజీ చదువు పూర్తయినప్పుడు.. చాలామంది మీ దగ్గర ఫ్యాన్సీ బ్యాగ్ లేదా అని అడిగారు. ఆ మాటలు నన్ను కొంత బాధించాయి. ఇప్పుడు కూడా ఎందుకు ఇన్నోవా ఉపయోగిస్తున్నావు? అని అడుగుతున్నారు. కానీ నా జీవితం.. నా ఇష్టం. ఎవరికీ సమాధానం చెప్పాల్సిన అవసరం నాకు లేదని స్పష్టం చేసారు. -
పెద్ద చదువు లేదు, ఉన్న ఇల్లమ్మేసింది, రూ.500 అప్పుతో..
బాగుపడాలంటే.. బాధ్యత ఉంటే చాలంటారు. చేసేపనిలో నిబద్దత కనపరిస్తే కొంత ఆలస్యమయినా సక్సెస్ సాధించవచ్చు. విజయం సాధించాలంటే ఉన్నత చదువులే తప్పనిసరి కాదని ఓ మహిళ నిరూపించింది. కోట్ల సామ్రాజ్యాన్ని స్థాపించి.. నేడు ఎంతోమందికి ఆదర్శంగా నిలిచింది. ఇంతకీ ఈమె ఎవరు? ఈమె సక్సెస్ స్టోరీ ఏంటనేది ఈ కథనంలో వివరంగా తెలుసుకుందాం..ఉత్తరప్రదేశ్‌లోని బులంద్‌షహర్‌కు చెందిన 'కృష్ణ యాదవ్' ఉన్నత చదువులు చదువుకోలేదు, పైగా ఆర్థిక పరిస్థితి కూడా అంతంత మాత్రంగానే ఉండేది. 1990లలో ఈమె భర్త వ్యాపారం దివాళా తీయడంతో తీవ్రమైన ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వచ్చింది. ఆ సమయంలో ఉన్న ఇంటిని అమ్మేయాల్సి వచ్చింది. ఆ తరువాత స్నేహితుల వద్ద 500 రూపాయలు అప్పు తీసుకుని బులంద్‌షహర్ వదిలి ఢిల్లీకి వెళ్లారు.ఢిల్లీకి వెళ్లిన తరువాత తన భర్తకు ఉద్యోగం లభించలేదు. ఆ తరువాత తన భర్త, ముగ్గురు పిల్లలతో కలిసి వ్యవసాయం చేసి కూరగాయలు పండించడం మొదలుపెట్టారు. సాగు చేసిన కూరగాయలను సరిగ్గా అమ్ముకోలేకపోయారు. ఆ తరువాత ఊరగాయలు తయారు చేసి విక్రయించాలని నిర్ణయించుకుని, దీనికోసం ఢిల్లీలోని ఉజ్వా గ్రామంలోని కృషి విజ్ఞాన కేంద్రంలో కృష్ణ యాదవ్ శిక్షణ తీసుకున్నారు.ఊరగాయలు తయారు చేయడానికి మొదట్లో రూ. 3000 పెట్టుబడి పెట్టారు. వీటిని ఆమె భర్త మొదట్లో రోడ్డు పక్కన విక్రయించడం ప్రారంభించారు. ఇదే క్రమంగా పెరిగి 'శ్రీ కృష్ణ పికిల్స్' సంస్థగా ఎదిగింది. ప్రస్తుతం వీరు 150 రకాల ఊరగాయలు విక్రయిస్తున్నట్లు సమాచారం.కృష్ణ యాదవ్ తాను ఎదగడమే కాకుండా.. ఎంతోమంది మహిళలకు ఉపాధి కల్పిస్తున్నారు. ప్రస్తుతం ఈమె టర్నోవర్ రూ.5 కోట్ల కంటే ఎక్కువని తెలుస్తోంది. వ్యాపార రంగంలో దినదిన ప్రవర్తమానం చెందిన కృష్ణ యాదవ్ కృషికి భారత భారత ప్రభుత్వ మహిళా, శిశు అభివృద్ధి మంత్రిత్వ శాఖ 2015లో నారీ శక్తీ సమ్మాన్ పురష్కారాన్ని న్యూఢిల్లీలోని రాష్ట్రపతి భవనంలో రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ చేతుల మీదుగా అందజేశారు. -
ఉద్యోగం నుంచి తీసేశారు.. ఏడుస్తూ కూర్చోలేదు.. కంపెనీ పెట్టి ఏకంగా..
ఓ లక్ష్యం ఉంటే.. దానివైపే అడుగులు వేస్తుంటే, తప్పకుండా సక్సెస్ నీ ముందు నిలబడుతుంది. విజయం అనేది చదవడానికి చిన్న పదమే కావొచ్చు, సొంతం చేసుకోవాలంటే నిరంతర కృషి, పట్టుదల అవసరం. ఇలాంటి కోవకు చెందిన వారిలో ఒకరు తొంభై రెండేళ్ల 'జోన్ పేడెన్' (Joan Payden). ఇంతకీ ఈమె ఎవరు? ఈమె సాధించిన విజయం ఏంటి? నెట్‌వర్త్ ఎంత అనే వివరాలు ఈ కథనంలో చూసేద్దాం..1931లో కనెక్టికట్‌లోని డెర్బీలో జన్మించిన పేడెన్ తన యుక్తవయస్సును ఇండోనేషియాలో గడిపారు. అయితే ట్రినిటీ కాలేజీలో గణితం, భౌతిక శాస్త్రంలో డ్యూయల్ డిగ్రీని పూర్తి చేశారు. డ్యూయెల్ డిగ్రీ చేయడం అనేది ఆ సమయంలో మహిళలకు అరుదైన విజయం. 1950లలో న్యూజెర్సీకి చెందిన చమురు శుద్ధి కర్మాగారాలను నిర్మించే కంపెనీలో ఇంజనీరింగ్‌లో చేరిన కొద్దిమంది మహిళల్లో ఈమె కూడా ఒకరు. అయితే కొన్ని అనివార్య కారణాల వల్ల ఉద్యోగం నుంచి తొలగించారు. ఇదే ఆమె జీవితాన్ని పెద్ద మలుపు తిప్పింది.ఉద్యోగం కోల్పోవడంతో.. పేడెన్ ఫైనాన్స్‌లో తన వృత్తిని ప్రారంభించారు. ఆ తరువాత మెర్రిల్ లించ్ అనే పెట్టుబడి నిర్వహణ సంస్థలో చేరింది. అప్పట్లో బాండ్, స్టాక్ మధ్య వ్యత్యాసం తెలియకపోవడంతో.. 25 శాతం తక్కువ సాలరీతో పనిచేయాల్సి వచ్చింది. ఆ తరువాత ఈమె స్కడర్, స్టీవెన్స్ & క్లార్క్ దృష్టిని ఆకర్శించారు. అక్కడే ఆమె మొదటి మహిళా భాగస్వామి అయింది. ఆ తరువాత సొంతంగా కంపెనీ స్థాపించడానికి ఒక మైలురాయిగా నిలిచింది.1983లో 52 సంవత్సరాల వయసులో పేడెన్ సహోద్యోగి సాండ్రా రైగెల్తో కలిసి పేడెన్ & రైగెల్ను స్థాపించారు. ఈ సంస్థ కేవలం ఆదాయం, ప్రపంచ మార్కెట్లను లక్ష్యంగా చేసుకుంది. కంపెనీ స్టార్ట్ చేసినప్పుడు క్లయింట్లను పొందలేనని భయపడినట్లు, ఆ సమస్య ఎదురవలేదని ఓ ఇంటర్వ్యూలో పేర్కొన్నారు.పేడెన్ కంపెనీ ప్రారంభించిన నాలుగు దశాబ్దాల తరువాత కంపెనీ సంపద సుమారు రూ.13 లక్షల కోట్లకు చేరింది. ప్రస్తుతం ఇది అతి పెద్ద ప్రైవేట్ మనీ మేనేజర్లలో ఒకటిగా మారింది. పేడెన్ ప్రస్తుతం లక్షల కోట్ల సంపద కలిగి ఉన్నప్పటికీ.. వినయంగా ఉండటమే కాకూండా.. దాతృత్వాలు కూడా చేస్తుంటారు. ఇప్పటికే ఈమె విద్యకు జంతు సంరక్షణ వంటి కారణాల కోసం లక్షలాది విరాళాలు ఇచ్చింది.ఫోర్బ్స్ ప్రకారం, తొంభై రెండు సంవత్సరాల వయస్సు గల జోన్ పేడెన్ నికర విలువ దాదాపు రూ. 58వేలకోట్లు. ప్రస్తుతం ఈమె అమెరికాలోని అత్యంత ధనవంతులైన సెల్ఫ్ మేడ్ మహిళల్లో ఒకరుగా.. కేవలం యూఎస్ఏలో మాత్రమే కాకుండా చాలా దేశాల్లోని మహిళకు ఆదర్శంగా నిలిచారు. -
Kirloskar Group: సగౌరవంగా... గౌరీ విజయం
గోల్డెన్ స్పూన్‌తో పుట్టిన గౌరీ కిర్లోస్కర్ తమ కుటుంబ వ్యాపార విజయాల వెలుగులో మాత్రమే కనిపించాలనుకోలేదు. ‘కొత్తగా నేను ఏమీ చేయకపోయినా జీవితం సాఫీగా సాగిపోతుంది’ అనుకోలేదు. ‘ఇంత పెద్ద వ్యాపార సామ్రాజ్యంలో నేను ఎక్కడ?’ అని ప్రశ్నించుకుంది. ఆ ప్రశ్నే ఆమెతో ఎన్నో ప్రయాణాలు చేయించింది. ప్రతి ప్రయాణంలో విలువైన పాఠాలు నేర్చుకునేలా చేసింది. తమ కుటుంబ వ్యాపార చరిత్రలో తనకంటూ కొన్ని పుటలు ఉండాలనుకుంది. ఆమె ప్రయత్నం, కష్టం ఫలించాయి. ఫిప్త్ జెనరేషన్ ఎంటర్‌ప్రెన్యూర్‌గా ప్రసిద్ధ వ్యాపార సామ్రాజ్యమైన ‘కిర్లోస్కర్’లోకి అడుగుపెట్టిన గౌరీ కిర్లోస్కర్ తనను తాను నిరూపించుకుంది. తమ వ్యాపార సామ్రాజ్యాన్ని మరింత విస్తరించింది.కుటుంబ వ్యాపారంలోకి అడుగు పెట్టినంత మాత్రానా ఎంటర్‌ప్రెన్యూర్‌గా వారిది నల్లేరు మీద నడక అనుకోవడానికి లేదు. తమను తాము నిరూపించుకొని ఫ్యామిలీ బిజినెస్‌కు మరింత బలాన్ని ఇచ్చేవారితో పాటు నిరూపించుకోలేక వెనుతిరిగేవారు కూడా ఉంటారు. గౌరీ కిర్లోస్కర్ మొదటి కోవకు చెందిన మహిళ.లండన్ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్ అండ్ పోలిటికల్ సైన్స్(ఎల్ఎస్ఈ)లో చదువుకుంది. అమెరికాలోని కార్నెగీ మెలన్ యూనివర్శిటీలో ఫైనాన్స్‌లో డిగ్రీ చేసింది.చదువు పూర్తి కాగానే తమ కుటుంబ వ్యాపారంలోకి అడుగు పెట్టి పెద్ద హోదాలో వెలిగిపోవచ్చు. అలా కాకుండా ఉద్యోగం చేయాలనుకుంది గౌరి.ఉద్యోగం చేయాలనుకోవడానికి కారణం... తనను తాను నిరూపించుకోవడం..ఇన్వెస్ట్మెంట్ బ్యాంకింగ్ అనలిస్ట్‌గా ఉద్యోగ ప్రస్థానాన్ని ్రపారంభించింది. ఆ తరువాత ‘పియర్సన్ కార్పొరేట్ ఫైనాన్స్’లో స్ట్రాటజీ గ్రూప్‌లో చేరింది. ఉద్యోగజీవితంలో విలువైన అనుభవాలను సొంతం చేసుకుంది. ఈ అనుభవాలు ఎంటర్‌ప్రెన్యూర్‌గా తన విజయాలకు బలమైన పునాదిగా నిలిచాయి.మన దేశానికి తిరిగివచ్చిన గౌరి కుటుంబ వ్యాపారంలోకి అడుగుపెట్టింది. ఇక అప్పటినుంచి ‘కిర్లోస్కర్ గ్రూప్’లో వ్యూహాత్మక విధానాలపై దృష్టి పెట్టింది. బోర్డ్ మెంబర్‌గా సమీక్ష సమావేశాల్లో చురుగ్గా పాల్గొనడం ఒక కోణం అయితే ఎనర్జీ సెక్టర్లో ఇన్వెస్ట్మెంట్ అవకాశాలను అన్వేషించడం మరో కోణం.‘ఆర్క్ ఫిన్ క్యాప్’కు సంబంధించి టీమ్ ఏర్పాటు, బిజినెస్ ΄్లానింగ్లో కీలకంగా వ్యవహరించింది.పుణెలో కంపెనీకి సంబంధించిన రియల్ ఎస్టేట్ బిజినెస్ ప్రధాన బాధ్యతను కూడా సమర్థవంతంగా నిర్వహించింది. ఇంటర్నేషనల్ ్రపాపర్టీ కన్సల్టెంట్స్తో కలిసి పనిచేసింది. హెచ్ఆర్, బ్రాండింగ్, కార్పొరేట్ కమ్యూనికేషన్స్‌లో తనదైన ముద్ర వేసింది. పర్యావరణ కోణంలో కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ (సీఎస్ఆర్)పై ప్రత్యేక దృష్టి పెట్టింది.గౌరీ నాయకత్వంలో కిర్లోస్కర్ ఆయిల్ ఇంజిన్స్ గణనీయమైన వృద్ధిని సాధించింది. ‘ఇది కుదరదు’ అనుకునే చోట ప్రత్యామ్నాయాలు అన్వేషించి విజయం సాధించే నైపుణ్యం గౌరీలోఉంది.‘మేము ఇంజిన్ మాన్యుఫాక్చరింగ్‌లోకి వచ్చినప్పుడు గ్లోబల్ కంపెనీలతో టై అప్ అయ్యే అవకాశం లేదు. ఒకవేళ ఉంటే టెక్నాలజీ ట్రాన్స్ఫర్ ద్వారా ఇంజిన్లను స్థానికంగానే తయారు చేసుకునే పరిస్థితి ఉండేది. ఇలాంటి అవకాశం లేకపోవడంతో సొంతంగా మాన్యుఫాక్చరింగ్ మొదలుపెట్టాం. సొంతంగా ఏదైనా చేయడం మొదలుపెట్టినప్పుడు మనదైన ఇంటెలెక్చువల్ ్రపాపర్టీ వృద్ధి చెందుతుంది’ అంటుంది గౌరీ.గౌరీ కంపెనీ బీ2బీ, బీ2సి, ఫైనాన్షియల్ సర్వీసెస్ అనే మూడు ప్రధానమైన బిజినెస్ సెగ్మెంట్లపై దృష్టి పెట్టింది. బీ2బీ బిజినెస్ ఇంటర్నల్ కంబాషన్ ఇంజిన్స్‌పై, బీ2సి బిజినెస్ వాటర్ మేనేజ్మెంట్ సొల్యూషన్స్, వ్యవసాయ సంబంధిత వ్యాపారాలపై దృష్టి పెడుతుంది. ఇక ‘అర్క’ గ్రూప్ అనేది ఫైనాన్షియల్ సర్వీసెస్ సెగ్మెంట్.స్థూలంగా చెప్పాలంటే...ఉన్నత విద్యాలయాల్లో చదువుకున్న చదువు, ప్రయాణంలో నేర్చుకున్న పాఠాలు, వ్యూహాత్మక దృక్పథం వ్యాపార ప్రపంచంలో గౌరీని ఉన్నత స్థానంలో నిలిపాయి. మూలాలకు తిరిగి రావడం అనేది గణనీయమైన వ్యాపార విజయానికి ఎలా దారితీస్తుందో చెప్పడానికి గౌరీ కిర్లోస్కర్ పేరును ప్రముఖంగా ప్రస్తావించవచ్చు.ఉత్సాహ బలంవ్యాపార ప్రపంచానికి అవతలి విషయానికి వస్తే... గౌరీ కిర్లోస్కర్‌కు యోగా చేయడం, స్క్వాష్, డైవింగ్ అంటే ఇష్టం. ప్రకృతి ప్రేమికురాలైన గౌరీకి తన కుటుంబ సభ్యులతో కలిసి కొత్త ప్రదేశాలకు వెళ్లడం అంటే ఇష్టం. ఎప్పటికప్పుడు సరికొత్త ట్రెండ్ల గురించి తెలుసుకోవడానికి సోషల్ మీడియాపై కూడా ఆసక్తి ప్రదర్శిస్తుంది. ఒక పుస్తకం చదివినప్పుడో, ఉపన్యాసం విన్నప్పుడో తనకు నచ్చిన వాక్యాన్ని, మాటను నోట్ చేసుకోవడం గౌరీకి ఇష్టం. ‘ఏ పని చేసినా ఉత్సాహంతో చేయాలి. ఉత్సాహమే అనంతమైన శక్తి’ అంటుంది గౌరీ కిర్లోస్కర్. -
ఉన్న ఉద్యోగం వదిలి.. రూ.8000 కోట్ల కంపెనీ స్థాపించి..
ధైర్యం, దృఢ సంకల్పం ఉంటే.. జీవితంలో అనుకున్న లక్ష్యాన్ని చేరుకోవచ్చని ఎంతోమంది నిరూపించారు. ఇలాంటి కోవకు చెందిన వారిలో ఒకరు 'మొబిక్విక్' (Mobikwik) కో ఫౌండర్ 'ఉపాసన టకు'. ఇంతకీ ఈమె ఎవరు? ఈమె మొబిక్విక్ ఎప్పుడు స్థాపించారు? నెట్‌వర్త్ ఎంత అనే మరిన్ని వివరాలు ఈ కథనంలో వివరంగా తెలుసుకుందాం.ఉపాసన టకు.. స్టాన్ఫోర్డ్ యూనివర్సిటీలో చదువుకున్నారు. చదువు పూర్తయిన తరువాత 17 సంవత్సరాలు విదేశాలలో పని చేశారు. సొంతంగా ఏదైనా సంస్థ స్థాపించాలనే ఉద్దేశ్యంతో అమెరికాలో చేస్తున్న ఉద్యోగాన్ని వదిలి భారతదేశానికి వచ్చేసారు.కుటుంబ పరిస్థితి, వ్యాపారంలో వచ్చే ఆటుపోట్ల గురించి తెలిసినప్పటికీ.. ధైర్యంగా నిర్ణయం తీసుకుని, ఆమె భర్త బిపిన్ ప్రీత్ సింగ్‌తో కలిసి మొబైల్ పేమెంట్ / డిజిటల్ వాలెట్ సంస్థ 'మొబిక్విక్'ను 2009లో స్థాపించారు. ఇది అతి తక్కువ కాలంలోనే అపూర్వ విజయాన్ని సొంతం చేసుకుంది. దీంతో కంపెనీ ప్రత్యర్థులకు సైతం గట్టి పోటీ ఇవ్వగలిగింది.మొబిక్విక్ సీఈఓగా ఉపాసన టకు బాధ్యతలు స్వీకరించి కంపెనీని లాభాల బాటలో పయనించేలా చేశారు. స్టాన్ఫోర్డ్ యూనివర్శిటీలో ఇంజనీరింగ్, మేనేజ్మెంట్ సైన్స్ & ఇంజనీరింగ్ పూర్తి చేసిన ఉపాసన సంస్థను ఉన్నత శిఖరాలకు చేరవేయడానికి కావాల్సిన ప్రయత్నాలను చేశారు.మొబిక్విక్ ప్రారంభించడానికి ముందే ఉపాసన.. పేపాల్, హెచ్ఎస్బీసీ సంస్థల్లో ప్రొడక్ట్ మేనేజర్‌గా చేశారు. ఈ అనుభవం మొబిక్విక్ ఎదుగుదలకు ఉపయోగపడింది. అమెరికాలో ఉద్యోగాన్ని వదిలి.. సొంతంగా సంస్థను స్థాపించిన ఉపాసన ఎంతోమంది యువ పారిశ్రామిక వేత్తలకు ఆదర్శంగా నిలిచారు.ఇదీ చదవండి: ఒకప్పుడు చెప్పులు కొనలేని స్థితి!.. నేడు రూ.3000 కోట్ల సామ్రాజ్యంఏదైనా పనిని ధైర్యంతో చేస్తే తప్పకుండా విజయం సాధించవచ్చని ఉపాసన టకు నిరూపించారు. మొబిక్విక్ అనేది చిన్న స్టార్టప్ నుంచి ఫిన్‌టెక్ పవర్‌హౌస్‌గా మారింది. నేడు ఈ సంస్థ రూ. 8000 కోట్ల ఆదాయంతో ముందుకు దూసుకెళ్తోంది. -
పారిశ్రామికవేత్తలుగా.. యువకెరటాలు!
ప్రపంచవ్యాప్తంగా ప్రతిష్టాత్మకమైన కార్టియర్ ఫెలోషిప్‌ను ఈ యేడాది ముగ్గురు భారతీయ మహిళలు దక్కించుకున్నారు. ఆ ముగ్గురూ ఢిల్లీ వాసి అయిన అక్షితా సచిదేవా, బెంగళూరు వాసులైన మాన్సీ జైన్, ఇరా గుహ లు. మన దేశం నుంచి వీరు మాత్రమే ఎంపిక అవడంలోని ప్రత్యేకత సామాజికంగా ప్రభావవంతమైన పారిశ్రామికవేత్తలుగా వీరికున్న గుర్తింపు.ప్రపంచంలోని అత్యంత కీలకమైన సవాళ్లను పరిష్కరిస్తున్న వేలాది మంది మహిళా పారిశ్రామికవేత్తలను గుర్తించి, వారిలో 33 మందిని ఎంపిక చేసిన కార్డియర్ ఉమెన్స్ ఇనిషియేటివ్ మీట్ ఇటీవల చైనాలో జరిగింది. ఇందులో ముగ్గురు యువ భారతీయ మహిళా వ్యాపారవేత్తలు తమ వ్యాపారాల ద్వారా ప్రభావ వంతమైన గుర్తింపు పొందారు.మాన్సీ జైన్..‘డిజిటల్పానీ’ అనే సాఫ్ట్వేర్ ల్యాట్ ఫారమ్ వ్యవస్థాపకురాలు మాన్సీ జైన్. ఇది మురుగునీటి శుద్ధి కార్యకలాపాలను నిర్వహించడానికి వీలు కల్పిస్తుంది. ఫలితంగా కలుషితమైన నీటిని సమర్థవంతంగా శుద్ధి చేయవచ్చు. తిరిగి ఉపయోగించుకోవచ్చు. డిజిటల్పానీ రోజుకు 90 మిలియన్ లీటర్ల నీటిని శుద్ధి చేయడంలో సహాయపడుతుంది. భారత దేశంలోని అగ్రశ్రేణి కంపెనీలలోని దాదాపు 50 యూనిట్లలోని నీటిలో అధిక నాణ్యత, అనుకూలమైన సౌకర్యాలుగా మార్చి తన శక్తిని నిరూపించింది. అక్షితా సచిదేవా..ఏఐ ఆధారిత సాంకేతికత ‘కిబో’ను ఉపయోగించి అంధత్వం ఉన్న వ్యక్తులకు సమగ్ర విద్య, ఉపాధినిప్రోత్సహించడానికి ట్రెస్టిల్ ల్యాబ్‌లను స్థాపించింది బెంగళూరుకు చెందిన అక్షితా సచిదేవా. 60 భాషల్లో ప్రింట్, హ్యాండ్ రైటింగ్, డిజిటల్ కంటెంట్‌ను డిజిటైజ్ చేస్తుంది, అనువదిస్తుంది, ఆడియోలోకి మారుస్తుంది. జూలై 2019 నుండి కిబో 650 సంస్థలను కలుపుకొని 25 దేశాలలో 1.5 లక్షల మందికి పైగా వ్యక్తులు సాధికారత సాధించేలా చేసింది. కంటెంట్‌ని అందరికీ అందుబాటులోకి తీసుకురావడానికి అక్షిత చేసిన కృషికి అనేక జాతీయ, అంతర్జాతీయ అవార్డులు వరించాయి.ఇరాగుహ..స్త్రీల పీరియడ్ సమస్యలను పరిష్కరించడానికి, ల్యాస్టిక్ శానిటరీ ప్యాడ్ల నుండి వ్యర్థ కాలుష్యాన్ని తగ్గించడానికి మెనుస్ట్రువల్ కప్‌ను రూపొందించి, పేటెంట్ రైట్స్ పొందింది ఇరాగుహ. సామాజిక కార్యక్రమాల ద్వారా గ్రామీణ కుటుంబాలలోని మహిళలు మెనుస్ట్రువల్ కప్‌ని ఉపయోగించడం ద్వారా మిలియన్ల డాలర్లను ఆదా చేసింది. అలాగే, లక్షల టన్నుల కంటే ఎక్కువ వ్యర్థాలను నివారించింది. వినూత్నమైన పీరియడ్ ట్రాకర్ యాప్‌ను అభివృద్ధి చేయడం ద్వారా కెనడా ప్రభుత్వం నుండి అవార్డును అందుకుంది.సామాజిక వ్యాపారవేత్తలుగా ఎదుగుతున్న ఈ ముగ్గురు యువపారిశ్రామికవేత్తలను ప్రోత్సహించడానికి తమ మద్దతును ప్రకటించింది కార్టియర్ ఫెలోషిప్. కోట్లాది మంది వీక్షకుల ముందు అవార్డులు అందుకున్న వారిలో ఈ ముగ్గురు ప్రత్యేకంగా నిలిచారు. తమ వ్యాపారాల ద్వారా సమాజంలో తీసుకు వస్తున్న మార్పులను పంచుకుని, అందరికీ ఆదర్శంగా నిలిచారు. -
Met Gala 2024: హైదరాబాదీ సుధారెడ్డి డైమండ్ నెక్లెస్ విశేషం ఏంటో తెలుసా?
ప్రతిష్టాత్మక మెట్ గాలా 2024లో భారతీయ బిలియనీర్ సుధారెడ్డి అత్యంత విలువైన ‘అమోర్ ఎటర్నో’డైమండ్ నెక్లెస్ ధరించి తళుక్కు మన్నారు. భారతీయ వ్యాపారవేత్త, మేఘా ఇంజినీరింగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ లిమి టెడ్ (ఎంఈఐఎల్) గ్రూప్ డైరెక్టర్ సుధారెడ్డి మెట్ గాలా 2024లో రెడ్‌కార్పెట్‌ను అలంకరించారు. ఈ వేదికగా భారతీయ సంస్కృతి ప్రతిబింబించేలా అద్భుతమైన దుస్తులతోపాటు 180 క్యారెట్ల డైమండ్ నెక్లెస్‌తో పాల్గొని అందరి చూపులను తన వైపు తిప్పుకున్నారు. ఈ నెక్లెస్, ఇతర అందమైన ఆభరణాల తయారీకి 100 గంటలు పట్టిందట. ముఖ్యంగా ఇందులో కృష్ణ, సుధ ప్రేమకు గుర్తుగా ప్రధాన భాగంలో నాలుగు పెద్ద, గుండె ఆకారంలో వజరాలను పొదిగారు. సింబాలిక్‌గా కుటుంబ వృక్షం కూడా ఉంది. అతిపెద్ద వజ్రం, 25 క్యారెట్ల కింగ్ ఆఫ్ హార్ట్స్, భర్త కృష్ణనుకు ప్రతీకగా, క్వీన్ ఆఫ్ హార్ట్స్, 20 క్యారెట్ల హార్ట్షేప్డ్ వజ్రంతో, సుధా రెడ్డిని సూచిస్తూ, ఇంకా ప్రిన్స్ ఆఫ్ నాలెడ్జ్ , ప్రిన్స్ ఆఫ్ ట్రెజర్స్ అని పిలువబడే రెండు 20-క్యారెట్ డైమండ్స్ కుమారులు ప్రణవ్,మానస్‌లను ప్రతిబింబిస్తూ దీన్ని తయారు చేశారు. ఇంకా 23 క్యారెట్ల యెల్లో డైమండ్ రింగ్, రెడ్డీస్ స్వరోవ్స్కీ, పూల చేతులు, బ్యాగ్ ఇలా అన్ని స్పెషల్ ఎట్రాక్షన్‌గా నిలిచాయి. ఈసందర్బంగా సుధారెడ్డి మాట్లాడుతూ రెడ్‌కార్పెట్‌పై నడిచి మన నగరానికి, దేశానికి గుర్తింపు తీసుకురావడం గర్వంగా ఉందని తెలిపారు. -
Vini Tandon Keni: చీర... నా రెండో గుర్తింపు
అప్పటివరకు గృహిణిగానే కాలం వెళ్లబుచ్చింది వినీ టాండన్ కెనీ. 53 ఏళ్ల వయసులో చీరకట్టు ద్వారా బిజినెస్ ఉమెన్‌గా మారింది. నేటి తరం అమ్మాయిలకు చీరకట్టు నేర్పించడానికి గోవాలో ప్రత్యేకంగా ‘శారీ స్పీక్’ స్టూడియోను ఏర్పాటు ద్వారా చేనేతకారులను ప్రోత్సహిస్తోంది. సోషల్ మీడియా ద్వారా ‘శారీ గ్రూప్’ ఏర్పాటు చేసి ఎంతోమంది మహిళలను ప్రభావితం చేస్తోంది. ‘చీర నా రెండో గుర్తింపు’ అంటున్న వినీ గురించి ... వినీ టాండన్ కెనీ ని పలకరిస్తే చాలు చీరల పట్ల తనకున్న ప్రేమను ఎంతో ఆనందంగా వ్యక్తపరుస్తుంది. ‘శారీ స్పీక్’ స్టూడియో వ్యవస్థాపకురాలుగా ఆమె ప్రయాణం నేటితరానికి కొత్త పాఠం. భార్య.. తల్లి... కోడలు.. శారీ ఇన్ఫ్లుయెన్సర్, కామిక్ కంటెంట్ సృష్టికర్త కూడా... ఇన్ని పాత్రలను చిరునవ్వుతో పోషించవచ్చుననడానికి వినీనే ఉదాహరణ. ‘నా కుటుంబమే నాకు బలం. ఉత్సాహం. మా కుటుంబ సభ్యులే నా ఫొటోలు, వీడియోలు తీస్తూ ఉంటారు. ఫేస్బుక్ గ్రూప్ ‘శారీ స్పీక్’ని క్రియేట్ చేసి రేపటికి ఏడేళ్లు పూర్తవుతాయి. ఈ గ్రూప్ కారణంగా చాలామంది మహిళల ఆలోచనల్లో చీర గురించిన నిర్వచనమే మారిపోయింది. ఖాళీ నుంచి మొదలైన ప్రయాణం... నేను పుట్టి పెరిగింది ఉత్తర్‌ప్రదేశ్‌లోని హర్దోయ్‌లో. మా నాన్నగారు మెరైన్ ఇంజనీర్ అవడంతో ఆయన ఉద్యోగరీత్యా వివిధ నగరాల్లో నివసించాం. నాన్నగారికి గోవాలో పోస్టింగ్ వచ్చినప్పుడు అక్కడ ప్రసాద్ కెనీతో నా పెళ్లి జరిగింది. అలా నేను గోవాలోనే ఉండిపోయాను. ఇద్దరు అబ్బాయిల పెంపకంలో ఎప్పుడూ తీరికలేకుండా ఉండేదాన్ని. పిల్లలు పెద్దవాళ్లై కాలేజీలకు వెళుతున్నప్పుడు నాలో ఏదో వెలితి ఏర్పడింది. ఏం చేయాలో అర్థం కాలేదు. అప్పుడు నా ఆసక్తుల వైపు దృష్టి సారించాను. మొదట సినిమా అభిమానుల కోసం ‘మూవీ స్పీక్’ పేరుతో ఫేస్బుక్ గ్రూప్‌ను క్రియేట్ చేశాను. ఆ తర్వాత వివిధ రకాల కళలు, కవులు .. మొదలైన గ్రూప్‌లను సృష్టించాను. అదే సమయంలో ‘శారీ స్పీక్’ బృందం కూడా ఏర్పాటయింది. అలా మొదలైంది... మా అమ్మ, అత్తగారు సౌకర్యం కోసం చీర నుంచి సల్వార్ కమీజ్‌కు మారినప్పుడు నాకెందుకో మనసు చివుక్కుమంది. ఈ విధంగా ఆలోచిస్తే అందరూ చీర కట్టుకోవడం మానేస్తారని అనిపించేది. దీంతో నేను చీర కట్టుకోవడం మొదలుపెట్టాను. నన్ను చీరలో చూసి, నా చుట్టూ ఉన్న ఆడవాళ్లు కూడా చీరలవైపు మొగ్గు చూపేవారు. చీరకట్టు ఫొటోలను సోషల్‌మీడియాలో పోస్ట్ చేసేదాన్ని. నాకు మంచి స్పందన రావడంతో వాళ్లూ పోస్ట్ చేయడం మొదలుపెట్టారు. చేనేత కారులే నా బ్రాండ్... మా చిన్నబ్బాయి సొంతంగా ఏదైనా బిజినెస్ స్టార్ట్ చేయమన్నప్పుడు శారీ ఐడియా గురించి చెప్పాను. స్టూడియో ఏర్పాటుకు తనే మద్దతుగా నిలిచాడు. దీంతో 53 ఏళ్ల వయసులో శారీ స్టూడియోతో వ్యాపారవేత్తను అయ్యాను. నా సొంత బ్రాండ్ అంటూ ఏమీ లేదు. దేశవ్యాప్తంగా ఉన్న నేత కార్మికుల నుంచి చేనేత చీరలను కొనుగోలు చేసి, సోషల్ మీడియాలో ప్రచారం చేస్తున్నాను. నా స్టూడియోలో 95 శాతం చేనేత చీరలే ఉంటాయి. ఇప్పుడు చీరలను ఇష్టపడే మహిళలు వాటిని కొనడానికి నా స్టూడియోకు రావడం మొదలుపెట్టారు. కొందరు చీర కట్టుకోవడం తమకు చేతకాదని, ఇంకొందరూ తమకు అసౌకర్యం అని చెబుతుంటారు. చీరకట్టుకోవడానికి ఐదు నిమిషాలు చాలు. ఇక అసౌకర్యం ఎందుకో నాకు అర్థం కాదు. ఈ సమస్యను పరిష్కరించడానికి నా స్టూడియోలో చీరకట్టుకు సులువైన టెక్నిక్స్ ఇస్తుంటాను. శారీ స్పీక్ స్టోరీలు... చీరకట్టు గురించి మాత్రమే కాదు వారి ఆనందం, అలాగే తమ మానసిక వేదనల నుంచి బయటపడే విధానాల గురించి చెప్పినప్పుడు వాటినీ సోషల్ మీడియా వేదికగా పంచుతుంటాను. బెంగళూరుకు చెందిన ఉషా అగర్వాల్ అనే మహిళ తన తల్లిదండ్రులిద్దరినీ కోల్పోయింది. కొన్ని రోజులకు నా పోస్ట్‌లను చూసి తనూ ప్రతి రోజూ కొత్త చీర కట్టుకొని, వాటిని పోస్ట్ చేసింది. ఆ మార్పుతో తన బాధ నుంచి కొద్ది రోజుల్లోనే బయటపడగలిగింది. ఆమె శారీ స్పీక్కి కృతజ్ఞతలు తెలిపింది. వెయ్యిమందిలో... ప్యాంటు నుండి సల్వార్ డ్రెస్సుల వరకు అన్నీ ధరిస్తాను. కానీ, నాకు అపారమైన నమ్మకాన్ని ఇచ్చేది శారీనే. చీర కట్టుకోగానే నా ముఖంలో చిరునవ్వు వచ్చేస్తుంది. నాతో చీర మాట్లాడుతున్నట్టే అనిపిస్తుంది. కిందటేడాది భారతీయ నేత కార్మికులకు సహాయం చేయడానికి యూకే రాయల్ ఆస్కాట్ హార్స్ రేస్‌లో సుమారు వెయ్యిమంది వరకు చీరలు ధరించారు. వారిలో నేనూ ఉన్నాను. మేం తమ దేశంలో చీర ధరించాలని నిర్ణయించుకున్నందుకు బ్రిటిషర్లు మా వేషధారణను చూసి ఎంతో ఆనందించామని చెప్పారు. అప్పుడు నాకు చాలా సంతోషమనిపించింది. లక్షా డెబ్భై వేల మంది సభ్యులు... శారీ స్పీక్ ఫేస్బుక్ అకౌంట్‌కి ప్రపంచం నలుమూలల నుండి లక్షా డెబ్భై వేల మంది సభ్యులు గా ఉన్నారు. ఈ గ్రూపులో మహిళలు మాత్రమే సభ్యులు. ఈ గ్రూప్ చీరలను మాత్రమే ప్రమోట్ చేస్తుంది. ఇన్నేళ్లుగా చీర నన్ను బిజీగా ఉంచింది. నిన్ను చూడగానే చీరలు కట్టుకోవడం మొదలు పెట్టామంటూ చాలా మంది మహిళలు నాకు మెసేజ్ చేస్తుంటారు. మీ వల్లే మాకు ప్రమోషన్ వచ్చిందని, మా అమ్మకాలు పెరిగాయని చేనేత కార్మికులు అంటున్నారు. ఇదంతా వింటే మరింత పనిచేయాలనే ధైర్యం వస్తుంది. ఈ నెల 14న మా గ్రూప్ ఎనిమిదో వార్షికోత్సవాన్ని జరపుకుంటున్నాం. ఈ సందర్భంగా మీరూ చీరలో ఆనందంగా విహరించండి’ అంటున్నారు వినీ టాండన్. -
మన నేలమీదే రాస్ప్బెర్రీ, బ్లాక్‌బెర్రీ, బ్లూ బెర్రీ: న్యాయవాది కియా సక్సెస్ స్టోరీ
విదేశీయుల వ్యాపా రహస్యం మార్కెట్ మాయాజాలం ఒకటి ఉంటుంది. ఒక ఉత్పత్తి మార్కెట్లోకి విడుదలయ్యే లోపు దాని గురించి ఒక సదభిప్రాయాన్ని కలిగించే ప్రచారం మొదలవుతుంది. ఆ ప్రమోషన్ ఆధారంగా సదరు ఉత్పత్తికి మార్కెట్లో విపరీతమైన డిమాండ్ పెరిగిపోతుంది. వాళ్ల బుట్టలో పడేవరకు మనకు ఆ మాయాజాలం అర్థం అయ్యేది కాదు. అర్థమయ్యేలోపు సదరు ఉత్పత్తిని వాడడానికి అలవాటు పడిపోయేవాళ్లం. ఆలా ఆయా ఉత్పత్తుల దిగుమతికి రహదారి పడుతుంటుంది. నిజానికి భారతదేశం నేల మీద పండని పంట ఉంటుందా అనుకుంది కేయా సాలోత్. అమెరికా, రష్యా, మెక్సికో, పోలండ్ దేశాల్లో పండే రాస్ప్బెర్రీ, బ్లాక్‌బెర్రీ, బ్లూ బెర్రీ, క్రాన్బెర్రీ... పంటలను మన నేల మీద పండించి చూపించాలనుకుంది. ఆ పంటలకు అనుగుణమైన ఉష్ణోగ్రతలను మెయింటెయిన్ చేసింది. మంచి దిగుబడిని సాధిస్తోంది. హై బుష్ కౌన్సిల్ ప్రకటన! ‘‘మన దేశం నుంచి ఇండియా దిగుమతి చేసుకున్న కూరగాయలు, పండ్ల విలువ ఏడాదికి ముప్పై శాతం చొప్పున తగ్గిపోతోంది. మనకిది ఏ మాత్రం అభిలషణీయమైన లావాదేవీ కానేరదు. ఇండియా మార్కెట్ అవసరాలను పెంచడానికి ప్రయత్నించడం వల్ల ప్రయోజనం కూడా ఉండదు. ఎందుకంటే ఇండియా తనంతట తానుగా ఈ పంటలను పండించుకుంటోంది. స్థానికంగా పండించుకోవడం వల్ల బయటి దేశాలనుంచి దిగుమతి చేసుకుంటే అయ్యే ఖర్చుతో పోలిస్తే చాలా తక్కువ ధరకు దొరుకు తున్నాయి’’ అని యూఎస్ హైబుష్ బ్లూ బెర్రీ కౌన్సిల్ ప్రతినిధి అభిప్రాయం వ్యక్తం చేశారు. ఈ పంటలను పండించడంలో కేయా సాలోత్, ఆమె బాటలో మరికొంత మంది చిన్నరైతులు విజయవంతమైనట్లు చెప్పడానికి ఈ ప్రకటనే నిదర్శనం. దిగుబడికి ముందే ఆర్డర్లు! ఇంతకీ కేయాసాలోత్ అనతికాలంలోనే సక్సెస్ సాధించడానికి ఆమెకు వ్యవసాయ నేపథ్యం ఏ మాత్రం లేదు. ఆమె ముంబయిలో పుట్టి పెరిగింది. న్యాయశాస్త్రం చదివి లాయర్‌గా ప్రాక్టీస్ చేసింది. తన జ్ఞానాన్ని క్లయింట్లను కాపాడడం కోసం వినియోగించడం కంటే అంతకంటే మెరుగైన కారణం కోసం పని చేస్తే బావుణ్నని కోరుకుంది. అప్పుడు ఆమె దృష్టి మనదేశంలోకి అమెరికా, రష్యా, పోలండ్, మెక్సికో, సెర్బియా వంటి శీతల దేశాల నుంచి మనదేశానికి వస్తున్న రాస్ప్బెర్రీ, బ్లూ బెర్రీల మీద కేంద్రీకృతమైంది. మనం తినడానికి ఇష్టపడుతున్న పండ్లను మనం పండించుకోలేమా అని ప్రయోగం మొదలు పెట్టింది. ఇందుకోసం ఆమె మహారాష్ట్రలో ఏ ప్రదేశమైతే ఈ పంటలకు అనువుగా ఉంటుందోనని అధ్యయనం చేసింది. ఈ పంటలు పండే దేశాలకు వెళ్లి వారు అనుసరిస్తున్న పద్ధతులను పరిశీలించింది. తిరిగి ఇండియాకి వచ్చి ఇరవై ఎకరాల పొలంలో వ్యవసాయం మొదలుపెట్టింది. ఎండ, వర్షాలను తట్టుకునే విధంగా తెల్లటి పై కప్పుతో షెడ్ వేసింది. మొదటగా మైక్రోగ్రీన్స్‌తో మార్కెట్లోకి ప్రవేశించింది. కొత్తిమీర, మెంతి ఆకు వంటి స్పల్పకాల పంటలను రసాయన ఎరువులు లేకుండా పండించి రెస్టారెంట్లకు సప్లయ్ చేయడంతో అనతికాలంలోనే 50 మంది క్లయింట్లు వచ్చారు. రాబోయే కాలంలో తమ పొలం నుంచి ఫలానా పంటలు అందుబాటులోకి వస్తాయని క్లయింట్లకు సమాచారం ఇవ్వడంతో ఆమెకు అడ్వాన్స్ బుకింగ్‌లు మొదలయ్యాయి. ఈ పండ్లు దిగుబడి సాధించేలోపు ఆమె మార్కెట్ వేదికను ఏర్పాటు చేసుకుందన్నమాట. రైతులందరూ వ్యవసాయం చేస్తారు. పంట పండించి కొనుగోలు దారుల కోసం ఎదురు చూస్తారు. దళారుల చేతిలో మోస పోతుంటారు. 32 ఏళ్ల కేయా సాలోత్ అనుసరించిన సక్సెస్ ఫార్ములా రైతులకు మార్గదర్శనం. -
Bharati Sumaria: చేదు అనుభవాలే తీపి విజయాలకు మెట్లు
జీవితంలో చెడు రోజులను ఎదుర్కోవడం ఎంతో కష్టంగా అనిపిస్తుంది. కానీ, మనలో దాగి ఉన్న ప్రతిభ, సామర్థ్యం, ధైర్యం గురించి మనల్ని మనం తెలుసుకునే సమయం ఇదే’ అంటుంది భారతీ సుమారియా. జీవించాలనే ఆశను కోల్పోయి అత్తవారింటి నుంచి ఖాళీ చేతులతో బయటకు వచ్చేసిన ఆమె నేడు ఏడాదికి నాలుగు కోట్ల బిజినెస్ టర్నోవర్‌కి చేరుకునేంతగా ఎదిగింది. ముంబైలో పదేళ్ల క్రితం టూత్‌బ్రష్, టిఫిన్‌బాక్స్, వాటర్ బాటిల్ .. వంటి చిన్న చిన్న నిత్యావసర వస్తువులను ఉత్పత్తి చేసే పనిని ప్రారంభించి, ఒంటరి పోరాటంతో ఎదిగిన భారతీ సుమారియా ధైర్యం ప్రతి ఒక్కరికీ పాఠం అవుతుంది. చేదు అనుభవాలే మనకు విజయవంతమైన మార్గానికి దారులు వేస్తాయి. దీనిని భారతీ సుమారియా చేసి చూపెట్టింది. సమస్యను సవాల్‌గా తీసుకొని ఎదిగిన వనితగా తనను తాను నిరూపించుకుంది. ఆ వివరాలు ఆమె మాటల్లోనే... ‘‘నేను ముంబైలోని భివాండి ప్రాంతంలో పుట్టాను. కొన్నేళ్లకు ములుండ్కి వెళ్లాం. మా కుటుంబం సాధారణ మధ్యతరగతికి చెందినదే. ఆడపిల్లలకు ఎన్నో ఆంక్షలు. పదో తరగతి వరకు మాత్రమే చదవగలిగాను. పెళ్లయ్యాక వంటింటిని నడపాలి కానీ, ఆడపిల్లను చదివించి ఏం లాభం అనే మనస్తత్వం ఉన్న కుటుంబంలో పెరిగాను. అలా నా ప్రపంచం కూడా కుటుంబానికే పరిమితం అయ్యింది. నాకేమీ చేయాలనే కోరిక ఉండేది కాదు. నా ప్రపంచంలో నేను సంతోషంగానే ఉన్నాను. సక్సెస్ సాధించిన స్త్రీని చూసినా, అలాంటి వారి గురించి విన్నా, చదివినా నేను ఏదైనా చేయగలనా అనే ఆలోచన నా మదిలో మెదిలేది. కానీ, నా మనసులోని భావాలను కుటుంబ సభ్యులకు చెప్పుకునే ధైర్యం ఉండేది కాదు. పెళ్లితో మారిన జీవితం.. ఆడపిల్లలకు పెళ్లే జీవిత లక్ష్యంగా ఉన్న రోజుల్లో 20ఏళ్ల వయసులో నాకు వివాహం చేశారు. మా అమ్మనాన్నలు చెప్పినట్టుగా నా భర్త సలహాలను అనుసరించాను. అత్తమామల బాధ్యతలను నెరవేర్చడంలో తీరిక లేకుండా గడిపాను. అత్తింటిలో అడుగుపెట్టినప్పుడు అదే నా ప్రపంచం అయ్యింది. అయితే, నా భర్త ఏ పనీ చేసేవాడు కాదు. నేను ఆర్థికంగా స్వతంత్రురాలిని కాదు. నాకు ఏం చేయాలో అర్థం కాలేదు. నాకు, నా పిల్లలకు నోటిలో నాలుగు వేళ్లూ పోక కనీసావసరాలు తీరక నా భర్త నాపై తన కోపాన్ని, చిరాకును ప్రదర్శించటం మొదలుపెట్టాడు. అప్పుడప్పుడూ చేయి కూడా చేసుకునేవాడు. ఇది నన్ను బాగా ప్రభావితం చేసింది. దీంతో నాకు ఆ ఇంట్లో ఉండటం కష్టంగా మారింది. మామగారు పనిచేసేవారు. కానీ, నా భర్త అస్సలు పనిచేసేవాడు కాదు. పిల్లల ఖర్చులు కూడా మామగారే భరించేవారు. 20 ఏళ్లు నా కోసం నేను ఎలాంటి షాపింగ్ చేయలేదు. మా అక్క బట్టలు నాకు ఇచ్చేది. వాటిని సంతోషంగా తీసుకునేదాన్ని. అత్తింట్లో రోజు రోజుకీ నా పరిస్థితి దిగజారడం మొదలయ్యింది. అమ్మ నా పరిస్థితి గమనించి పుట్టింటికి తీసుకువచ్చింది. ఆ సమయంలో నేను చాలా నిస్సహాయంగా ఉన్నాను. జీవించాలనే కోరికను కూడా కోల్పోయాను. డిప్రెషన్‌కు గురయ్యాను. ఏం చేయాలో అర్థం కాక గంటల తరబడి మౌనంగా కూర్చునేదాన్ని. పిల్లల భవిష్యత్తు ఏమవుతుందో కూడా నాకు తెలియదు. ఆరు లక్షల రూపాయలతో.. దీపావళికి, పుట్టిన రోజుకి నాన్న డబ్బులు ఇస్తుండేవారు. ఆ డబ్బు కూడా మా అత్తింట్లో ఖర్చయిపోయేది. దీంతో నాకు డబ్బు ఇవ్వకుండా డిపాజిట్ చేయమని, భవిష్యత్తులో ఉపయోగపడుతుందని చెప్పాను. అత్తింటి నుంచి బయటకు వచ్చాక ఏం చేయలేని పరిస్థితిలో నాన్న నాకోసం డిపాజిట్ చేసిన డబ్బు ఆరు లక్షలకు పెరిగిందని తెలిసింది. 2005లో ఆ ఆరు లక్షల రూపాయలతో 300 అడుగల విస్తీర్ణంలో ఉన్న ఓ ప్లేస్ అద్దెకు తీసుకొని టూత్‌బ్రష్, టిఫిన్‌బాక్స్, వాటర్‌బాటిల్ వంటి చిన్న చిన్న నిత్యావసర వస్తువులను తయారుచేసే పనిని ప్రారంభించాను. నా వ్యాపారాన్ని ముందుకు తీసుకెళ్లేందుకు పగలు రాత్రి కష్టపడ్డాను. త్వరలోనే సిప్లా, బిస్లరీ వంటి పెద్ద బ్రాండ్ల నుండి ఆర్డర్లను పొందడం ప్రారంభించాను. ఈ రోజు నా ఫ్యాక్టరీ లక్షా ఇరవై వేల అడుగుల విస్తీర్ణంలో విస్తరించింది. భయం బలంగా మారింది ఎప్పుడూ పని కోసం ఇల్లు వదిలి వెళ్లలేదు. కానీ నాకు పని తప్ప వేరే మార్గం కనిపించలేదు. నా పిల్లలకు మంచి భవిష్యత్తు ఇవ్వాలని భావించి, రాత్రింబగళ్లు కష్టపడి పనిచేయడం మొదలుపెట్టాను. చెడు సమయాలు నన్ను నేను తెలుసుకునేలా చేశాయి. నా సామర్థ్యాలను తెలుసుకునే అవకాశం కల్పించింది. ఈ రోజు వెనక్కి తిరిగి చూసుకుంటే ఇదంతా ఎలా చేయగలిగాను అనే ఆశ్చర్యం కలుగుతుంది. ఎంతగా సహించానో అంతగా కష్టాలు పెరిగాయి. నాకు దేవుడి మీద అపారమైన నమ్మకం ఉంది. భగవంతుడు నా బలాన్ని గ్రహించి విజయపథంలో ముందుకు తీసుకెళ్లేందుకు చుట్టూ అలాంటి వాతావరణం సృష్టించాడని అనిపించింది. నా పురోభివృద్ధికి నా భర్త కోపం, తగాదాలే కారణమయ్యాయి. దాని వల్లనే నేను ఇదంతా చేయగలిగాను. పిల్లలే నా ప్రపంచం భార్యగా దృఢంగా ఉండలేకపోయినా పిల్లల కోసం ఎట్టి పరిస్థితుల్లోనూ అలిసిపోవడానికి, వదులుకోవడానికి సిద్ధంగా లేనని నన్ను నేను బలంగా తయారుచేసుకున్నాను. జీవించాలనే కోరిక కూడా కోల్పోయిన ఆ భారతి ఈమేనా అని అందరూ ఆశ్చర్యపోయారు. నా పిల్లల మంచి భవిష్యత్తు కోసం నేను కృష్టి చేయాల్సిందే అని గట్టిగా అనుకున్నాను. నేను నా పని మొదలుపెట్టినప్పుడు పిల్లలు నాకు పూర్తిగా మద్దతు ఇచ్చారు. అప్పట్లో నా కూతురు ఎనిమిదో తరగతి, కొడుకులిద్దరూ ఐదో తరగతి చదువుతున్నారు. నా కూతురు తన చదువుతో పాటు తన తమ్ముళ్లనూ చూసుకుంటుంది. నేను ఇంటికి వెళ్లడం లేట్ అయితే ఆమే స్వయంగా వంట చేసి, తమ్ముళ్లకు పెట్టి, తినిపించి, నిద్రపుచ్చేది. పిల్లలను తండ్రి నుంచి దూరం చేయలేదు ఎప్పుడూ పిల్లలను వారి తండ్రి నుంచి కానీ, వారి కుటుంబం నుంచి కానీ దూరం చేయలేదు. పిల్లలు తల్లిదండ్రులిద్దరి ప్రేమను పొందాలని నమ్ముతాను. భార్యాభర్తల మధ్య తగాదాల వల్ల పిల్లలు బాధపడకూడదు. పెళ్లయిన పాతికేళ్ల తర్వాత నా పిల్లలు వారి పూర్వీకుల ఇంట్లో ఉండకూడదని నిర్ణయించుకున్నారు. అక్కడ నుంచి మా ఇంటికి మారిపోయాం. నా పోరాటం నా పిల్లలను కూడా బలపరిచినందుకు సంతోషంగా ఉంది’’ అని వివరిస్తుంది భారతీ సుమారియా. మహిళలకు మద్దతు లభించాలి కష్టాల్లో ఉన్నప్పుడు ఎవరూ ఆదుకోకపోవడమే ఆడవాళ్లకున్న పెద్ద సమస్య. వాళ్ల అమ్మ ఇల్లు గానీ, అత్తమామల ఇల్లు గానీ తమ సొంతమని భావించరు. తల్లిదండ్రుల నుంచి ఆదరణ లభించక చాలా మంది మహిళలు ఆత్మహత్యకు పాల్పడుతున్నారు. ఆసరా దొరికితే ఎంతోమంది ఆడపిల్లల ప్రాణాలు తీసుకోకుండా జీవించగలుగుతారు. ఈ విషయంలో నేను అదృష్టవంతురాలిని. నా పరిస్థితి చూసి మా తల్లిదండ్రులు నన్ను సొంతంగా వ్యాపారం చేయమని ప్రోత్సహించారు. నాన్న 3వ తరగతి వరకు మాత్రమే చదివారు. ముంబైలో బట్టల షాప్ పెట్టుకొని, మమ్మల్ని పోషించారు. మేం నలుగురం అక్కచెల్లెళ్లం. మా పెంపకం బాధ్యత అమ్మ తీసుకుంది. ఇంటిని చూసుకోవడంతో పాటు చుట్టుపక్కలవారితో ఎప్పుడూ కలుపుకోలుగా ఉండేది. ఇప్పుడు కూడా మా చుట్టుపక్కల వాళ్లకు సహాయం చేయడానికి అమ్మ ఎప్పుడూ సిద్ధంగా ఉంటుంది. -
'ఇల్లాలిగా, బిజినెస్ విమెన్‌గా సరిలేరామెకు'! దటీజ్ నీతా!
అందిరిలానే ఓ సాధారణ అమ్మాయి నీతా. అనుకోకుండా ఓ సంపన్న కుటంబం తమ కోడలిగా చేసుకుంటానని ముందుకొచ్చింది. అందరిలా ఎగిరి గంతేయ్యలేదు. ఇద్దరి మనసులు కలిసాకే పెళ్లి చేసుకుంటానని చెప్పింది. ఆఖరికి కోడలిగా అడుగుపెట్టిన తన ఉద్యోగం మాత్రం వదిలేయనని తెగేసి చెప్పింది. నిజానికి ఆమె గొప్పింటి కోడలిగా రాజభోగాలు అనుభవిస్తూ ధర్జాగా కాలుపై కాలు వేసుకుని కూర్చొవచ్చు అందుకు ఆమె అంగీకరించలేదు. తనకంటూ ఒక ప్రత్యేకమైన ముద్ర ఉండాలనుకుంది. కేవలం ముఖేష్ అంబానీ వైఫ్ నీతాగా గుర్తింపు కంటే తన ఆత్మగౌరవంతో ఆర్జించుకన్న గుర్తింపుకే ప్రాధాన్యత ఇచ్చింది. ఆ విలక్షణమే అమెను పవర్ ఫుల్ విమెన్‌గా ఫోర్బ్స్ మ్యాగజైన్లో చోటు దక్కేలా చేసింది. పైగా సక్సెస్ఫుల్ విమెన్‌కి అసలైన నిర్వచనంగా నిలిచింది నీతా అంబానీ. ముంబైలో స్థిరపడిన గుజరాతీ కుటుంబం నీతాది. ఆమె కామర్స్‌లో డిగ్రీ చేశారు. భరత నాట్యంలో కూడా ప్రావీణ్యం ఉంది. ఒకరోజు ఎప్పటిలానే ప్రదర్శన ఇచ్చి ఇచ్చారు. అది ధీరుబాయ్ అంబానీ కుటుంబం కంటపడింది. ఆమె నృత్య ప్రదర్శన, చలాకీతనం ధీరుబాయ్ దంపతులకు ఎంతాగనో నచ్చింది. తమ పెద్ద కుమారుడికి ఆమెను ఇచ్చి పెళ్లి చేస్తే బాగుంటుందని అనుకున్నారు. అప్పటికే అంబానీలకు పెద్ద ధనవంతుల కుటుంబమని మంచి ఫేమ్ ఉంది. అయితే ఈ విషయం నీతా చెవిన పడింది. కానీ ఆమె ఎగిరి గంతెయ్యలేదు. పైగా తమ ఇరువురి అభిప్రాయాలు కలిస్తేనే పెళ్లి చేసుకుంటానని ధైర్యంగా చెప్పింది. ఇక పెళ్లయ్యాక కూడా తాను చేసే టీచర్ ఉద్యోగాన్ని కంటిన్యూ చేస్తానని షరతు కూడా విధించింది. అయితే అప్పుడూ ఆమె జీతం రూ. 800/-. అయినా ఇప్పుడూ అంబానీ కోడలివి అది ఏ పాటిదన్న ససమేరా అంది. పైగా అది తన ఆత్మగౌరవం అని తేల్చి చెప్పింది. ఓ తల్లిగా పిల్లలను.. ఆమె పిల్లల విషయంలో చాలా కఠినంగా వ్యవహరించేవారేమె. తన పిల్లలను మధ్య తరగతి పిల్లల్లానే పెంచేవారట. అయితే ప్రతి శుక్రవారం పిల్లలకు కొనుక్కోవడానికి రూ.5/- ఇచ్చేవారట. ఒకరోజు చిన్న కొడుకు అనంత్ నువ్వు రూ. 5లే తెచ్చుకుంటున్నావ్.. అంబానీ కొడుకువేనా అని స్నేహితులు హేళన చేస్తున్నారని మారం చేశాడు. ఆ ఘటన నీతాను కదిలించినా చిన్నపిల్లలకు ఎక్కువ డబ్బులు ఇవ్వకూడదన్న ఉద్దేశ్యంతో సర్ది చెప్పి పంపించారట. అలాగే వారిపై ఆంక్షలు విధించేవారట. స్వేచ్ఛగా వారి నిర్ణయాలు తీసుకుని కెరియర్లో రాణించేలా చేసేవారట. సమానత్వానికే పెద్ద పీట.. ఎవ్వరైనా మీకు ఇద్దరు వారసులు కదా అని అడిగితే కాదు ముగ్గురు అని సవరించేవారట నీతా. అంతేగాదు తన కూతురు ఇషా అంబానీని నువ్వు ఎవ్వరికీ తీసిపోవంటూ కూతురిని వ్యాపారం రంగంలో ప్రోత్సహించారు నీతా. అదుకే ఇషా విజయవంతంగా వ్యాపారాన్ని నిర్వహిస్తోంది. ఆఖిరికి అనంత్ అంబానీ బరువు విషయంలో ఎంతగా ఇబ్బంది పడ్డాడో, హేళనలకు గురయ్యేవాడో పలు ఇంటర్యూల్లో ఆయనే స్వయంగా చెప్పుకొచ్చారు. అందుకోసం ఆమె అతని తోపాటు యోగా, వ్యాయామాలు చేసి 90 కేజీలు బరువున్న ఆమె కాస్త 50 కేజీలకు వచ్చి కొడుకుకి ఆదర్శంగా నిలిచి చూపించింది. అయితే అనంత్ కూడా దాన్ని స్ఫూర్తిగా తీసుకుని బరువు తగ్గి చూపించాడు. అయితే అనారోగ్యం కారణంగా మళ్లీ అనూహ్యంగా చాలా బరువు పెరిగిపోవడం జరిగింది. ఆ సమయంలో మరింతగా బాధపడుతున్న అనంత్‌కి తనలో ఉన్న లోపాలను చూడొద్దని, సానుకూలతలనే చూడమని చూపింది. అందువల్లే ముగ్గురు పిల్లలు కూడా 'అమ్మే మా ధైర్యం' అని పలు ఇంటర్యూల్లో ముక్త కంఠంతో చెప్పారు. తొలి మహిళా బోర్డు సభ్యురాలు ఆమె.. ఇల్లు, పిల్లలే జీవితం అనుకోలేదు. ధీరూభాయ్ అంబానీ స్కూల్ ప్రారంభించి దేశంలో ప్రముఖ స్కూళ్లలో ఒకటిగా నిలిపారు. కుటుంబ వ్యాపారం రిలయన్స్ ఇండస్ట్రీస్‌లోకి అడుగుపెట్టి తొలి మహిళా బోర్డు సభ్యురాలయ్యారు. అప్పుడే కీలక పదవుల్లో మహిళా ప్రాధాన్యంపై చర్చలు ప్రారంభమయ్యాయి. ఐపీఎల్ ‘ముంబయి ఇండియన్స్’ సహా ఎన్నో వెంచర్లు ప్రారంభించి, విజయం సాధించారు. కళలంటే ప్రాణం. వాటిని ప్రోత్సహించడానికి ‘స్వదేశీ మార్ట్’, ‘జియో వరల్డ్ సెంటర్’, ‘నీతా ముకేష్ అంబానీ కల్చరల్ సెంటర్’ వంటివీ ప్రారంభించారు. తాజాగా రియలన్స్ ‘డిస్నీ ఇండియాను’ విలీనం చేసుకునే పనిలో ఉంది. దానికి ఛైర్పర్సన్ కూడా నీతానే!. ఇలా కెరీర్ పరంగాను సక్సెస్‌ఫుల్‌గా దూసుకుపోయారామె. ఈ విజయాలే ఆమెను పవర్ఫుల్ బిజినెస్ విమెన్’గా ఫోర్బ్స్ జాబితాలో నిలచేలా చేసింది. ఎన్నెన్నో పురస్కారాలను అందుకునేలా చేసింది. సేవలోనూ ముందుటారామె.. తన మూలాలను ఎప్పుడూ మర్చిపోలేదు నీతా. అందుకే 1997 జామ్‌నగర్‌లో రిలయన్స్ రిఫైనరీలో చేసే ఉద్యోగుల కోసం కాలనీ నిర్మించారు. 17వేలమంది కోసం నిర్మించిన దానిలో లక్ష మొక్కలు నాటించారు. అంతేకాదు రిలయన్స్ ఫౌండేషన్ ప్రారంభించి మారుమూల గ్రామాలు, పట్టణాల్లో విద్య, ఆరోగ్యం, కళల అభివృద్ధికి కృషి చేశారు. ‘ఎడ్యుకేషన్ అండ్ స్పోర్ట్స్ ఫర్ ఆల్’ ద్వారా లక్ష మంది చిన్నారులను విద్య, ఆటలకు చేరువ చేశారు. బ్రెయిలీ లిపిలో న్యూస్‌పేపర్, ఉచిత కంటి ఆపరేషన్లు... వంటి ఎన్నో సేవ కార్యక్రమాలు చేశారు. అలాగే హర్ సర్కిల్’ పేరుతో మహిళా సాధికారతకు ఎంతగానో కృషిచేశారు. (చదవండి: లావుగా ఉన్నావంటూ బిడ్డతో సహా భార్యను వదిలేశాడు..కానీ ఆమె..!) -
కోట్లు సంపాదిస్తున్న 'అనమ్ మీర్జా'.. ఆస్తి ఎంతంటే?
భారత టెన్నిస్ స్టార్ సానియా మీర్జా గురించి తెలిసిన చాలా మందికి ఈమె సోదరి 'అనమ్ మీర్జా' గురించి తెలిసి ఉండకపోవచ్చు. కానీ ఈమె 330 కోట్ల రూపాయల సామ్రాజ్యానికి అధినేత!.. ఆనం మీర్జా గురించి మరిన్ని వివరాలు ఈ కథనంలో చూసేద్దాం.. సానియా మీర్జా మాదిరిగా కాకుండా భిన్నమైన మార్గాన్ని ఎంచుకుని వ్యాపార రంగంలో ముందుకు సాగుతున్న అనమ్ మీర్జా మాస్ కమ్యూనికేషన్ అండ్ మీడియా స్టడీస్ పూర్తి చేసి వివిధ జాతీయ ఛానెల్‌లలో ఇంటర్న్‌గా జర్నలిజంలో తన వృత్తిని ప్రారంభించింది. ఉద్యోగం చేస్తున్న రోజుల్లోనే ఈమెకు సొంతంగా ఏదైనా ప్రారభించాలనే ఆకాంక్ష ఎక్కువగా ఉండేది. ఈ కారణంగానే 2013లో ఔత్సాహిక జర్నలిస్టుల కోసం 'ఇంక్ టు చేంజ్' అనే వెబ్సైట్ ప్రారంభించింది. 2014లో అక్బర్ రషీద్‌తో వివాహం జరిగిన తరువాత ఆమె తన ఫ్యాషన్ లేబుల్ 'ది లేబుల్ బజార్'ని ప్రారంభించింది. 2022లో అనమ్ మీర్జా భారతదేశపు అతిపెద్ద రంజాన్ ఎక్స్పో, దావత్-ఎ-రంజాన్‌ను స్థాపించింది. అనమ్ మీర్జా తన భర్త అక్బర్ రషీద్‌తో విడిపోయిన తరువాత భారత మాజీ కెప్టెన్ & రాజకీయ నాయకుడు మహ్మద్ అజారుద్దీన్ కుమారుడు 'మహ్మద్ అసదుద్దీన్'ను వివాహం చేసుకుంది. వీరికి 'దువా' అనే పాప కూడా ఉంది. ఈ పాప పేరు మీద అనమ్ మీర్జా 2023లో మరో ఫ్యాషన్ లేబుల్ ప్రారంభించింది. మహ్మద్ అసదుద్దీన్ తండ్రి బాటలోనే నడిచి బ్యాటర్‌గా మారారు, కానీ అయన క్రికెట్ కెరీర్ సజావుగా ముందుకు సాగలేదు. దీంతో క్రికెట్ వదిలిపెట్టారు. అసదుద్దీన్ క్రికెటర్ కాక ముందే న్యాయవాది. ఇదీ చదవండి: జూన్ 4 నుంచి 'గూగుల్ పే' బంద్!.. మరో యాప్‌లోనే అన్నీ.. అనమ్ మీర్జా వ్యాపారాలు మాత్రమే కాకుండా 1,25,000 కంటే ఎక్కువ మంది ఫాలోవర్లతో ఒక యూట్యూబ్ ఛానల్ ఉంది. దీని ద్వారా కూడా బాటుగా సంపాదిస్తోంది. వ్యాపార రంగంలో తనదైన రీతిలో దూసుకెళ్తున్న అనమ్ మీర్జా నికర విలువ 40 మిలియన్ డాలర్ల వరకు ఉంటుందని సమాచారం. అంటే భారతీయ కరెన్సీ ప్రకారం ఈమె ఆస్తుల విలువ రూ.331 కోట్లకంటే ఎక్కువ. -
కూతురికి అరుదైన గౌరవం - ఆనందంలో ముకేశ్ అంబానీ..
రిలయన్స్ గ్రూప్ రిటైల్ వెంచర్ 'రిలయన్స్ రిటైల్'కు నాయకత్వం వహిస్తున్న 'ఇషా అంబానీ' (Isha Ambani), జియో ఫైనాన్షియల్ సర్వీసెస్ బోర్డులో కూడా నాన్-ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్‌గా ఉన్నారు. వ్యాపార రంగంలో దూసుకెళ్తున్న ఆమెను ఇటీవల 'మహారాష్ట్రియన్ ఆఫ్ ది ఇయర్ 2024' అవార్డు వరించింది. రిలయన్స్ రిటైల్ వ్యాపారం అభివృద్ధి చెందడంతో 'ఇషా అంబానీ' పాత్ర అనన్యసామాన్యం. ఈమెకు ఫిబ్రవరి 15న ఓ వార్తాపత్రిక వార్షిక కార్యక్రమంలో 2024 సంవత్సరపు మహారాష్ట్ర ప్రత్యేక అవార్డును గెలుచుకుంది. అవార్డు గెలుచుకున్న సందర్భంలో ఇషా అంబానీ మాట్లాడుతూ.. మహారాష్ట్ర కేవలం మాకు ఉంటున్న ప్రదేశం (ఇల్లు) మాత్రమే కాదు, ఇది మాకు కర్మభూమి. మా తాత 'కలలు కనడానికి ధైర్యం చేయండి, వాటిని సాధించడం నేర్చుకోండి' అని చెప్పేవారు, ఆ మాటలనే అనుసరిస్తూ నా తల్లిదండ్రులు నన్ను పెంచారు. మా నాన్న కష్టపడి ఎలా పనిచేయాలో చూపించి, ఎంతోమందికి ఆదర్శమయ్యారు. అవార్డు అందుకున్న సందర్భంగా ఆమె రిలయన్స్ కుటుంబానికి కృతజ్ఞతలు తెలుపుతూ, ఈ అవార్డు మొత్తం రిలయన్స్ కుటుంబానికి చెందినదిని వెల్లడించింది. యేల్ యూనివర్శిటీ నుంచి గ్రాడ్యుయేట్ పూర్తి చేసిన ఇషా ఇప్పుడు రిలయన్స్ రిటైల్‌ను ప్రపంచ వ్యాప్తంగా విస్తరించడంతో ప్రధాన పాత్ర పోషిస్తోంది. ఈమె ఇప్పటికే ఫోర్బ్స్ ఇండియా లీడర్షిప్ అవార్డ్స్ 2023లో GenNext ఎంటర్ప్రెన్యూర్ అవార్డును కూడా అందుకుంది. ఇదీ చదవండి: హ్యాండ్సమ్గా కనిపిస్తున్న ఈ కుర్రాడే.. నేడు భారత్ గర్వించదగ్గ వ్యక్తి -
20 ఏళ్లకే క్యాన్సర్.. 33 ఏళ్లకు రూ.420 కోట్లు - ఎవరీ కనికా టేక్రీవాల్..
ఒకప్పుడు వంటింటికి మాత్రమే పరిమితమైన మహిళలు ఈ రోజు ఆకాశంలో సగం అన్నట్టు అన్ని రంగాల్లోనూ దూసుకెళ్తున్నారు. కేవలం ఉద్యోగాలకు మాత్రమే పరిమితం కాకుండా పారిశ్రామిక వేత్తలుగా వ్యాపార సామ్రాజ్యాలను సృష్టిస్తున్నారు. ఇలాంటి కోవకు చెందిన వారిలో ఒకరు 'కనికా టేక్రీవాల్'. ఇంతకీ ఈమె ఎవరు? ఈమె సృష్టించిన సామ్రాజ్యం ఏమిటి అనే మరిన్ని వివరాలు ఈ కథనంలో చూసేద్దాం.. 1990లో భోపాల్‌లోని మార్వాడీ కుటుంబంలో జన్మించిన కనికా టేక్రీవాల్.. స్కూల్ ఏజికేషన్ మొత్తం లారెన్స్, లవ్‌డేల్ పాఠశాలల్లో పూర్తి చేసి, కోవెంట్రీ యూనివర్సిటీలో గ్రాడ్యుయేషన్ పూర్తి చేసింది. చదువు పూర్తయిన తరువాత 2012లో జెట్‌సెట్‌గో (JetSetGo) సంస్థ స్థాపించి అతి తక్కువ సమయంలో సక్సెస్ సాధించి.. అతి చిన్న వయసులోనే కంపెనీని సక్సెస్‌పుల్‌గా నడిపిస్తూ.. ఎంతోమందికి ఆదర్శంగా నిలిచింది. చదువుకునే రోజుల్లో క్యాన్సర్ భారిన పడిన కనికా టేక్రీవాల్ ఆ సమయంలో తనను తాను మోటివేట్ చేసుకోవడానికి మంచి బుక్స్ చదివింది. క్యాన్సర్ వ్యాధితో పోరాడి మళ్ళీ సైక్లింగ్ ట్రాక్‌లో పడిన 'లాన్స్ ఆర్మ్‌స్ట్రాంగ్' (Lance Armstrong) జీవితాన్ని ఆదర్శంగా తీసుకుని తనకు తానే ధైర్యం తెచ్చుకుని జెట్‌సెట్‌గో స్టార్ట్ చేసింది. 2012లో కంపెనీ ప్రారంభించిన తరువాత దేశంలోనే గుర్తింపు పొందిన సంస్థగా ఎదిగి 6000 విమానాలను విజయవంతంగా నడుపుతూ ఏవియేషన్ స్టార్టప్ రంగంలో తనదైన ముద్ర వేసింది. ఇందులో చార్టడ్ ఫ్లైట్స్, హెలికాఫ్టర్ కూడా ఉన్నట్లు సమాచారం. నేడు వ్యాపార రంగంలో తనదైన రీతిలో ఎదుగుతూ.. 33 సంవత్సరాల వయసులో 10 సొంత ప్రైవేట్ జెట్లను కలిగి.. సుమారు రూ. 420 కోట్లకు అధినేతగా నిలిచింది. ఇదీ చదవండి: మస్క్, జుకర్‌బర్గ్ ఎలాంటి వారంటే! చెన్నై నుంచి వెళ్లిన తరువాత.. 20 సంవత్సరాల వయసులో క్యాన్సర్ భారిన పడి రెండేళ్ల కాలంలో కోలుకుని, సంస్థ ప్రారంభించి, ఎంతోమందికి ఉద్యోగాలు కల్పిస్తూ.. 33 ఏళ్ల వయసులో రూ. 420 కోట్లు సంపాదించగలిగిందంటే.. దాని వెనుక కనికా టేక్రీవాల్ కృషి అన్యన్య సామాన్యమనే చెప్పాలి. ఇది ఎంతోమంది యువతకు మార్గదర్శం కావాలి. -
రూ.లక్ష కోట్లకు పైగా విరాళం - ఈమె బ్యాగ్రౌండ్ తెలిస్తే షాకవుతారు!
చాలా మంది ధనవంతులు డబ్బు కూడబెట్టే కొద్దీ ఇంకా పోగు చేయాలి, ఇంకా గొప్పవాళ్ళైపోవాలి అని ఆలోచించడం సర్వ సాధారణం. అయితే కొందరు మాత్రమే వారికున్నదాంట్లో చాలా వరకు పేదలకు లేదా మంచి పనులను భారీగా విరాళం అందిస్తారు. ఇలాంటి కోవకు చెందిన అతి తక్కువ మందిలో 'మెకెంజీ స్కాట్' (MacKenzie Scott) ఒకరు. ఇంతకీ ఈమె ఎవరు? ఇప్పటి వరకు ఎంత దానం ఇచ్చింది? బ్యాగ్రౌండ్ ఏంటి అనే మరిన్ని వివరాలు వివరంగా తెలుసుకుందాం. అమెరికాకు చెందిన ప్రముఖ నవలా రచయిత్రి అయిన 'మెకెంజీ స్కాట్' ఇప్పటి వరకు సుమారు రూ.1,19,522 కోట్లకుపైగా విరాళంగా ఇచ్చింది. అంతే కాకుండా తాను బ్రతికి ఉండే వరకు, తనకు వచ్చే ఆదాయంలో సగానికి పైగా విరాళంగా ఇస్తానని ప్రతిజ్ఞ కూడా చేసినట్లు సమాచారం. నిజానికి ఈమె (మెకెంజీ స్కాట్) అమెజాన్ వ్యవస్థాపకుడు జెఫ్ బెజోస్ మాజీ భార్య. 1993లో ఈమె జెఫ్ బెజోస్‌ను పెళ్లి చేసుకుంది. కొన్ని అనివార్య కారణాల వల్ల 2019లో విడాకులు తీసుకున్నారు. ఆ సమయంలో ఆమెకు భరణంగా అందిన డబ్బు కారణంగానే ప్రపంచంలోని అత్యంత ధనిక మహిళలలో ఒకరుగా నిలిచారు. 1907లో కాలిఫోర్నియాలో జన్మించిన మెకెంజీ స్కాట్ ఆరు సంవత్సరాల వయసులోనే కథలు రాయడం మొదలుపెట్టింది. చిన్నతనంలోనే 'ది బుక్ వార్మ్' అనే 142 పేజీల బుక్ రాసినట్లు, అది వరదల్లో కొట్టుకుపోయినట్లు సమాచారం. స్కాట్ ప్రిన్స్టన్ యూనివర్సిటీ నుంచి బ్యాచిలర్ డిగ్రీ (ఇంగ్లీష్) పూర్తి చేసింది. అంతే కాకుండా ఈమె సాహిత్యంలో నోబెల్ గ్రహీత 'టోని మోరిసన్' వద్ద చదువుకుంది. మెకెంజీ స్కాట్ చదువు పూర్తయిన తరువాత న్యూయార్క్ నగరంలోని ఓ కంపెనీలో పనిచేసింది, ఆ సంస్థలోనే జెఫ్ బెజోస్ కూడా పనిచేశారు. ఆ సమయంలో ఆ ఇద్దరి మధ్య ఏర్పడిన పరిచయమే ప్రేమగా మారి 1993లో పెళ్లి చేసుకున్నారు. ఆ తరువాత అమెజాన్ స్థాపించి ఇద్దరూ దానిని బాగా అభివృద్ధి చేసారు. ఇదీ చదవండి: ఉద్యోగులకు అవి ఇవ్వలేకపోయాను!.. ఇన్ఫోసిస్ నారాయణ మూర్తి 2019లో మెకెంజీ స్కాట్, జెఫ్ బెజోస్‌తో విడాకులు తీసుకున్న తరువాత రూ. 2,53,600 కోట్ల విలువైన స్టాక్స్ అందుకుంది. ప్రస్తుతం ఈమె విద్య, ఆరోగ్యం, సామజిక న్యాయం, పర్యావరణం వంటి వివిధ అంశాలకు మద్దతు పలుకుతూ వేలకోట్ల రూపాయలు విరాళంగా అందిస్తూ ప్రపంచంలో ఎక్కువ విరాళాలు అందించినవారి జాబితాలో ఒకరుగా నిలిచింది. -
ఒక్క రోజులోనే రూ.57 వేల కోట్లు మటాష్.. అయినా ఆవిడే ప్రపంచంలో రిచెస్ట్!
ఫ్రెంచ్ వ్యాపారవేత్త 'ఫ్రాంకోయిస్ బెటెన్‌కోర్ట్ మేయర్స్' (Francoise Bettencourt Meyers) ఇటీవల 100 బిలియన్ డాలర్ల సంపద కలిగిన మహిళగా బ్లూమ్‌బెర్గ్ బిలియనీర్స్ జాబితాలో చేరింది. తాత స్థాపించిన బ్యూటీ ప్రొడక్ట్స్ సామ్రాజ్యంలో అరుదైన ఘనత సాధించిన ఈమె ఇటీవల ఒక్క రోజులోనే ఏకంగా 6.9 బిలియన్ డాలర్ల నష్టాన్ని చవి చూసింది. అంటే భారతీయ కరెన్సీ ప్రకారం సుమారు రూ.57267.9 కోట్లు నష్టపోయిందన్నమాట. ఫోర్బ్స్ రియల్-టైమ్ బిలియనీర్ ట్రాకర్ ప్రకారం, ఇప్పటి వరకు ఒక్క రోజులో ఇంత పెద్ద మొత్తం ఏ బిలినీయర్ కూడా నష్టాన్ని చూడలేదని స్పష్టం చేసింది. ఇంత మొత్తంలో నష్టాన్ని చవి చూయినప్పటికీ.. ప్రపంచంలోనే అత్యంత సంపన్న మహిళగా కొనసాగుతోంది. క్షీణత తర్వాత ఆమె ప్రస్తుత నికర విలువ 80.5 బిలియన్ డాలర్లు. 2008 నుంచి ''ఎల్'ఓరియల్'' (L'Oreal) షేర్స్ ఎప్పుడూ తగ్గలేదని, నిన్న (శుక్రవారం) మాత్రమే కంపెనీ షేర్స్ ఏకంగా 7.5 శాతం తగ్గడం వల్ల వేలకోట్లు నష్టాన్ని చూడాల్సి వచ్చిందని సమాచారం. కంపెనీ బోర్డు వైస్-ఛైర్‌పర్సన్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్న బెటెన్‌కోర్ట్ మేయర్స్ L'Orealలో దాదాపు 35 శాతం వాటాను కలిగి ఉన్నట్లు తెలుస్తోంది. 2017లో మేయర్స్ తల్లి 'లిలియన్ బెటెన్‌కోర్ట్' మరణించిన తరువాత కుటుంబ వారసురాలిగా సంస్థలో అడుగుపెట్టింది. ఆ తరువాత తనదైన రీతిలో కంపెనీ పురోగతికి పాటుపడుతూ.. ఫ్రాన్స్‌లో అత్యంత ధనిక మహిళల జాబితాలో ఒకరుగా ఉన్నారు. ఇదీ చదవండి: దిగ్గజ కంపెనీ కీలక నిర్ణయం - వేలాది ఉద్యోగులు ఇంటికి.. 1909లో బెటెన్‌కోర్ట్ మేయర్స్ తాత 'యూజీన్ షుల్లెర్' (Eugene Schueller) ప్రారంభంలో హెయిర్ కలర్ ఉత్పత్తి చేసి విక్రయించడానికి సంస్థ స్థాపించారు. అదే నేడు మేయర్స్ సారథ్యంలో వేలకోట్ల కంపెనీగా అవతరించింది. బెటెన్‌కోర్ట్ మేయర్స్‌ను ప్రపంచంలో అత్యంత ధనిక మహిళగా నిలిచేలా చేసింది. -
MR Jyothy: తండ్రి మెచ్చిన తనయ
ఎంబీఏ చేసిన ఎంఆర్ జ్యోతి వ్యాపార పాఠాలను కళాశాలలో కంటే తండ్రి రామచంద్రన్ అడుగు జాడల్లో నుంచే ఎక్కువగా నేర్చుకుంది. అయిదువేల రూపాయల పెట్టుబడితో ప్రారంభించిన ‘జ్యోతి ల్యాబ్స్’ను వేల కోట్ల టర్నోవర్‌కి తీసుకువెళ్లాడు ఎంపీ రామచంద్రన్. ఎండీగా బాధ్యతలు స్వీకరించిన జ్యోతి కంపెనీని మరోస్థాయికి తీసుకువెళుతోంది. ‘తండ్రి మెచ్చిన తనయ’ అనిపించుకుంది... తండ్రి అయిదు వేల రూపాయల పెట్టుబడితో వ్యాపారం మొదలు పెట్టినప్పుడు జ్యోతి వయసు అయిదు సంవత్సరాలు. త్రిసూర్ (కేరళ)లోని మధ్యతరగతి కుటుంబంలో పుట్టిన తండ్రి వ్యాపారాన్ని ముందుకు తీసుకువెళ్లడానికి ఎంత కష్టపడ్డాడో జ్యోతికి కళ్లకు కట్టినట్లుగా గుర్తుంది. అదృష్టాన్ని కాకుండా కష్టాన్నే నమ్ముకున్న తండ్రి ఇటుకా ఇటుకా పేర్చి కంపెనీని బలోపేతం చేశాడు. సెలవు అంటూ లేకుండా వారానికి ఏడు రోజులూ పనిచేసేవాడు. ప్రాడక్ట్స్ లోడింగ్ నుంచి పత్రికలకు ఇచ్చే అడ్వరైజ్మెంట్ల వరకు అన్నీ దగ్గరుండి చూసుకునేవాడు. సింగిల్ ప్రాడక్ట్ ‘ఉజాల’తో మొదలైన కన్జ్యూమర్ గూడ్స్ కంపెనీ ‘జ్యోతి ల్యాబ్స్’ ఇక వెనక్కి తిరిగి చూసుకోవాల్సిన అవసరం లేకుండా పోయింది. కంపెనీ మొదలు పెట్టిన కొత్తలో ఆరుగురు మహిళల బృందం ఇంటింటికీ తిరిగి ‘ఉజాల’ అమ్మేవారు. కట్ చేస్తే... 2005లో కంపెనీ మార్కెటింగ్ విభాగంలో చేరింది జ్యోతి. ఆ తరువాత చీఫ్ మార్కెటింగ్ ఆఫీసర్‌గా పనిచేసింది. 2020లో కంపెనీ ఎండీగా బాధ్యతలు స్వీకరించింది. బాధ్యతలు చేపట్టడానికి ముందు తరువాత అనే విషయాకి వస్తే ఎండీగా కంపెనీ ఆదాయాన్ని పెంచింది. నలభై సంవత్సరాలు పూర్తి చేసుకున్న కంపెనీని మరో స్థాయికి తీసుకువెళ్లడానికి రెండో తరం ఎంటర్ ప్రెన్యూర్ అయిన జ్యోతి నిర్మాణాత్మకమైన ప్రణాళికలు సిద్ధం చేసుకుంది. మార్కెట్లో ఎదురవుతున్న సవాళ్ల నుంచి ప్రాడక్ట్ ఇన్నోవేషన్స్. అడ్వర్టైజింగ్ ప్లాన్స్ వరకు ఎన్నో విషయాలపై దృష్టి పెట్టింది. కంపెనీ ప్రధాన ఆధారం... ఫ్యాబ్రిక్ కేర్, డిష్ వాషింగ్ ప్రాడక్ట్స్. ఈ నేపథ్యంలో పర్సనల్ కేర్ సెగ్మెంట్ మీద ప్రత్యేక దృష్టి పెట్టింది జ్యోతి. గత సంవత్సరం కంపెనీ మార్గో సోప్ మూడు వేరియంట్స్‌ను లాంచ్ చేసింది. పర్సనల్ కేర్‌కు సంబంధించి ఇతర విభాగాలను కూడా విస్తరించడానికి ప్రణాళికలు సిద్ధం చేసుకుంది కంపెనీ. బహుళజాతి సంస్థల నుంచి పోటీ తట్టుకొని మార్కెట్లో ఛాలెంజర్ బ్రాండ్‌గా నిలవడం అంత తేలిక కాదు. అందుకు ఎంతో ఆత్మవిశ్వాసం కావాలి. ‘ఇక తిరుగులేదు’ అంటూ ఆ ఆత్మవిశ్వాసం ఎక్కువైతే మార్కెట్లో ఒక్కో మెట్టు కిందకు దిగక తప్పదు. అందుకే ఆత్మవిశ్వాసం, అతివిశ్వాసానికి మధ్య స్పష్టమైన విభజన రేఖ గీసుకుంది జ్యోతి. గతంలోలాగా భవిష్యత్ ఉండకపోవచ్చు. భారీ సవాళ్లు ఎదురు కావచ్చు. జ్యోతి వాటిని ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉంది. దార్శనిక దృష్టితో ఎప్పటికప్పుడు ఆలోచిస్తుంది. కంపెనీకి సంబంధించి మార్కెటింగ్ విభాగంలో చేరిన కొత్తలో తండ్రితో కలిసి దేశవ్యాప్తంగా డిస్టిబ్యూటర్లు, రిటైలర్లు, స్టేక్‌హోల్డర్స్‌కు సంబంధించి ఎన్నో మీటింగ్‌లలో పాల్గొంది. ప్రతి మీటింగ్ ఒక పాఠశాలగా మారి తనకు ఎన్నో విలువైన పాఠాలు నేర్పింది. ‘గతమెంతో ఘనకీర్తి’ అని గతంలోనే ఉండిపోకుండా ‘ట్యూన్ విత్ ది చేంజింగ్ టైమ్స్’ అంటున్న జ్యోతి కొత్త టెక్నాలజీని పరిచయం చేయడం (ఉదా: రియల్–టైమ్ డేటాను ఉపయోగించడం) ఆటోమేటింగ్ ప్రాసెస్, ఓపెన్ డోర్ కల్చర్ వరకు ఎన్నో ఆధునిక విషయాలకు ప్రాధాన్యత ఇస్తూ కాలంతో గొంతు కలుపుతూనే ఉంది. గెలుపుదారిలో కొత్త ఉత్సాహంతో ప్రయాణిస్తూనే ఉంది. -
Ajitha Challa: కాఫీ విత్ అజిత
మనలో చాలా మందికి కొన్ని ఇష్టమైన ఆసక్తులు ఉంటాయి. వాటిని వ్యాపకంగా మార్చుకుంటారు కొందరు. వ్యాపారంగా కూడా మార్చుకోవచ్చు అని నిరూపించి చూపుతున్నారు హైదరాబాద్ వాసి అజిత చల్లా. నిద్రలేస్తూనే ఫిల్టర్ కాఫీ రుచిని ఆస్వాదించకుండా ఆ రోజు గడవదనే అజిత దేశీ విదేశీ కాఫీ రుచులను కరఫా పేరుతో నగరవాసులకు పరిచయం చేస్తున్నారు. కాఫీ ఫ్లేవర్స్ గురించి మాట్లాడుతూ ఉంటే ఎనిమిదేళ్ల తన కాఫీ జర్నీని ఇలా ఆనందంగా మన ముందుంచారు. ‘‘మా ఇంట్లో నా చిన్నప్పటి నుంచి ఉదయం లేస్తూనే ఒక దృశ్యాన్ని చూస్తూ, నేనూ ఆస్వాదిస్తూ పెరిగాను. అదే, ఉదయాన్నే ఫిల్టర్ కాఫీతో రోజును మొదలుపెట్టడం. రాత్రి నిద్రపోయేటప్పుడు కాఫీ ఇచ్చినా కాదనను. అలాంటి ఇష్టం ఏ ఊరు వెళ్లినా నా రోజువారీ ప్లాన్‌లో సరైన కాఫీ కోసం అన్వేషణ సాగుతూనే ఉండేది. కుటుంబం నేర్పిన పాఠం నేను పుట్టి పెరిగింది విజయవాడ. ఇంజినీరింగ్ పూర్తిచేశాను. ఉద్యోగినిగా కన్నా బిజినెస్ ఉమన్‌గా నన్ను నేను ప్రూవ్ చేసుకోవాలని ఉండేది. మా నాన్న కన్స్ట్రక్షన్ బిజినెస్‌లో ఉన్నారు. నాకు అది సూట్ కాదనిపించింది. పెళ్లయ్యాక హైదరాబాద్ రావడం, మా అత్తింటి వారు ఇన్స్టంట్ కాఫీ ఎక్స్పోర్ట్ బిజినెస్‌లో ఉండటంతో నా ఆసక్తికి కొంచెం ఊతం వచ్చి ఉంటుంది. కాకపోతే ఎనిమిదేళ్ల క్రితం వరకు ఆ విషయం నాకు స్ఫురణకు రాలేదు. ఎక్కడకు వెళ్లినా కాఫీ గురించి వెతుక్కోవడం. కాఫీ రుచి గురించి మా వాళ్లతో మాట్లాడటం తరచూ జరుగుతుండేది. టూర్స్‌కి విదేశాలకు వెళ్లినా అక్కడ కూడా వివిధ రకాల కాఫీలు టేస్ట్ చేసే నా అలవాటను మానేదాన్ని కాదు. ఓ రెండేళ్ల క్రితం స్వయంగా ఏదైనా వ్యాపారం చేయాలనే ఆలోచన చేస్తున్నప్పుడు నా చేతిలో ఉన్న కాఫీ కప్పు నాకు సమాధానంలా అనిపించింది. నేనెప్పుడూ ఫిల్టర్ కాఫీనే తాగేదాన్ని. పాలు, బెల్లం, డికాషన్ కలిపి చేసే ఆ కాఫీ నాకు చాలా ఇష్టమైనది. కానీ, మరొకరు ఇంకో రుచికరమైన కాఫీ కోసం అన్వేషించవచ్చు. మనకు తెలిసి కాఫీ అంటే చిరుచేదుగా ఉంటుందని చాలామంది మైండ్‌లో ఉంటుంది. కానీ, ఆ మాత్రం చేదు కూడా లేకుండా కాఫీని పరిచయం చేయచ్చు అని చాలా ప్రయోగాలు చేశాను. కాంబినేషన్స్ మారుతున్నకొద్దీ కాఫీ రుచి ఎలా మారుతుందో తెలుసుకుంటూ వచ్చాను. ఏది బెస్ట్ అని ఒక్క మాటలో చెప్పలేం. రోస్ట్ చేయడం, గ్రైండ్ చే సే విధానాన్ని బట్టి రుచిలో మార్పు వస్తుంటుంది. బ్లాక్ కాఫీలోనే పదుల సంఖ్యలో వెరైటీలు ఉన్నాయి. వాటిలో ఆరింటిని మేం పరిచయం చేస్తున్నాం. మరో పది దేశ విదేశీ కాఫీలు టేస్ట్ చేయచ్చు. ప్రాజెక్ట్ వర్క్ కాఫీ ఆలోచనను మా కుటుంబ సభ్యుల ముందుంచినప్పుడు వారి నుంచి సపోర్ట్ రావడంతో నేననుకున్న కల నా ముందుకు వచ్చింది. వ్యాపారం ఆలోచన వచ్చాక రెండేళ్లుగా చాలా కసరత్తులు చేశాను. కాఫీ గింజలు ఎక్కడెక్కడి నుంచి తెప్పించాలి, వాటిని ఏ పద్ధతిలో రోస్ట్ చేయాలి, కాఫీకి అనుబంధంగా ఎలాంటి ఫుడ్ ఉంటే బాగుంటుంది, మిషనరీ ఏంటి... ఇలా ఒక పెద్ద ప్రాజెక్ట్ వర్క్ ప్రిపరేషన్ మొదలుపెట్టాను. ఆ ప్రయత్నానికి ఫ్రెంచ్ కాఫీ అండ్ టీ కెటిల్ పేరు ‘కరఫా’ అనేది ఫైనల్ అయ్యింది. ప్రత్యేకంగా.. మొదట ఇండియన్, వియత్నాం కాఫీ రుచులతో ప్రారంభించి, ఆ తర్వాత నుంచి భిన్న రుచులతో కొత్తదనాన్ని తీసుకు రావడానికి ప్రయత్నిస్తున్నాం. కెనడియన్, కొలంబియన్, ఇథోపియన్, ఇండియన్.. దేనికదే ప్రత్యేకత. మెక్సికన్లు దాల్చినచెక్క వేసుకొని కాఫీ తాగుతారు. ఇథోపియన్లు కాఫీతో పాటు పాప్ కార్న్ తీసుకుంటారు. వాళ్లలాగే మనమూ చేస్తే నచ్చకపోవచ్చు, కానీ, వాటి మీద ప్రయోగాలు చేస్తూ మనవారి టేస్ట్‌కు తగ్గట్టు ఇక్కడి కాఫీ ప్రియులకు నచ్చినట్టు పరిచయం చేయడానికి నిత్యం ప్రయత్నిస్తూనే ఉంటాం. అలాగే, వియత్నాంతో పాటు ఇంకొన్ని దేశాల్లో కాఫీ తోటలు వాటంతటవే పెరుగుతాయి. మన దగ్గర ఒక నిర్మాణాత్మకంగా పెంచుతారు. అక్కడి వాతావరణ పరిస్థితుల్లో పెరిగిన కాఫీ గింజలకి, ఇక్కడికి తేడా ఉంటుంది. అందుకే, ఈ కాఫీ టేస్ట్ మాత్రమే బాగుంటుందని చెప్పలేం. అన్నీ టేస్ట్ చేయాల్సిందే. కాఫీతో పాటు... ఫుడ్ కూడా ఉంటుంది. కాఫీ సేవిస్తూ తినడానికి ఇష్టపడే ఐటమ్స్ ఏమేం ఉంటాయో వాటన్నింటినీ పరిచయం చేస్తున్నాం. కొందరికి బ్రేక్ ఫాస్ట్తోనూ, లంచ్ టైమ్ మీల్స్తోనూ కాఫీ తాగే అలవాటు ఉంటుంది. దానిని కూడా ఇక్కడ అదే మెనూగా అందిస్తున్నాం. ప్రతి ఆలోచనా కాఫీతో పాటు కాఫీ చుట్టూతానే ఉంటుంది. ఇదంతా బ్యాలెన్స్డ్గా ఉండేలా చూసుకుంటున్నాం. ఈ రోజు వాతావరణం చల్లగా ఉంటే ఒక రకమైన కాఫీ తాగాలనిపిస్తుంది. మరుసటి రోజు ఎండగా ఉంటే ఇంకోరకం కాఫీ తాగాలని ఉంటుంది. ఎవరు రెగ్యులర్‌గా తాగే కాఫీ వాళ్లకు బాగా నచ్చుతుంది. మిగతా వాళ్లకు ఆ ఫ్లేవర్ నచ్చకపోవచ్చు. అలాగే, ఎప్పటికప్పుడు డిఫరెంట్ టేస్ట్ ట్రై చేయాలనే ఆసక్తి గలవారుంటారు. అందుకే, భిన్నరకాల రుచులతో కాఫీలను పరిచయం చేస్తూ నేనూ ఈ కాఫీ ప్రపంచంలో మమేకం అవుతున్నాను’ అని వివరించారు అజిత. – నిర్మలారెడ్డి -
రూ.8300 కోట్ల సామ్రాజ్యంగా మారిన ఒక్క ఆలోచన..
ఉన్నత చదువులు చదువుకున్న చాలా మంది ఉద్యోగాల కోసం మాత్రమే కాకుండా.. కొత్త మార్గాలను అన్వేషిస్తూ, వ్యాపార రంగంలోకి అడుగులు వేస్తున్నారు. ఇలాంటి కోవకు చెందిన వారిలో ఒకరు సునీర, ఆమె సోదరుడు సాల్ రెహ్మెతుల్ల. ఇంతకీ వీరు ఎవరు, వీరు చేస్తున్న వ్యాపారం ఏంటి, సంస్థ విలువ ఎంత అనే మరిన్ని వివరాలు ఇక్కడ చూసేద్దాం.. ఫ్లోరిడాలో నివసిస్తున్న 'సునీర' జన్మస్థలం పాకిస్తాన్. కరాచీలో పుట్టిన ఈమె ఫ్లోరిడా యూనివర్సిటీ గ్రాడ్యుయేషన్ పూర్తి చేసిన తర్వాత, ఫస్ట్ డేటాతో ఉద్యోగ జీవితాన్ని ప్రారంభించింది. ఉద్యోగం చేస్తున్న సమయంలో ఏదైనా కొత్తగా చేయాలని ఆలోచించి తమ్ముడు రెహ్మెతుల్లతో కలిసి 2014లో స్టాక్స్ (Stax) ప్రారంభించింది. స్టాక్స్ అనేది ఇతర ప్లాట్‌ఫామ్‌ల మాదిరిగానే విక్రయాల శాతం మాదిరిగా కాకుండా నెలవారీ సబ్స్క్రిప్షన్ ప్రాతిపదికన చార్జెస్ వసూలు చేసే ఆల్ ఇన్ వన్ పేమెంట్ ప్లాట్‌ఫామ్. ఈ ప్లాట్‌ఫామ్ అభివృద్ధి కోసం ఈమె సుమారు 12 బ్యాంకులను సంప్రదించింది. అయినా ఫలితం లేకుండా పోయింది. సునీర తన ఆలోచనలను తల్లిదండ్రులతో పంచుకుంది, వారు ఆమె ఆలోచనపై పని చేయమని ప్రోత్సహించారు. నెలవారీ చందా ప్రాతిపదికన వసూలు చేసే ప్లాట్‌ఫారమ్‌లో వారు కూడా పని చేయడం ప్రారంభించారు. ఆ తరువాత ఆమె ఓర్లాండోకు వెళ్లి తన ఆలోచనను మరింత విస్తరించింది. సునీర, రెహ్మెతుల్ల చేస్తున్న ఈ తరహా బిజినెస్ అభివృద్ధి చెందుతున్న సమయంలో వారి స్టాక్‌ను కొనుగోలు చేయడానికి రూ. 145 కోట్ల డీల్ ఆఫర్ వచ్చింది. దీనిని వారు సున్నితంగా తిరస్కరించారు. ఆ తరువాత తోబుట్టువులిద్దరూ తమ ఉద్యోగాలను వదిలిపెట్టి స్టాక్‌లోనే పూర్తిగా పనిచేయడం ప్రారంభించారు. దీంతో వారికి ఆర్ధిక సమస్యలు ఎదురయ్యాయి. ఇదీ చదవండి: సమీపిస్తున్న గడువు.. ఫాస్ట్‌ట్యాగ్ కేవైసీ ఇలా అప్డేట్ చేసుకోండి ఆర్థిక సమస్యలను అధిగమించడానికి వారిరువురు.. కుటుంబం, స్నేహితుల నుంచి 50000 డాలర్లు అప్పుగా తీసుకుని, ఆ డబ్బుని కంపెనీలో పెట్టుబడి పెట్టారు. ప్రస్తుతం ఈ సంస్థలో ఏకంగా 300 మందికి పైగా ఉద్యోగులు పనిచేస్తున్నట్లు, కంపెనీ విలువ.. ఫోర్బ్స్ ప్రకారం రూ.8,308 కోట్లని తెలుస్తోంది. -
ప్రపంచంలో అత్యంత సంపన్న మహిళ.. ఆమెనేనా?
ప్రముఖ ఫ్రెంచ్ వ్యాపారవేత్త 'ఫ్రాంకోయిస్ బెటెన్‌కోర్ట్ మేయర్స్' (Francoise Bettencourt Meyers) ఇటీవల 100 బిలియన్ డాలర్ల సంపద కలిగిన మహిళగా బ్లూమ్‌బెర్గ్ బిలియనీర్స్ జాబితాలో చేరింది. తాత స్థాపించిన బ్యూటీ ప్రొడక్ట్స్ సామ్రాజ్యంలో అరుదైన ఘనత సాధించిన ఈమె గురించి మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం. బ్లూమ్‌బెర్గ్ బిలియనీర్స్ ఇండెక్స్ ప్రకారం, ఆమె తాత స్థాపించిన ''ఎల్'ఓరియల్'' (L'Oreal) షేర్స్ భారీగా పెరగడంతో ఆమె సంపద 2023 డిసెంబర్ 28 నాటికి 100.2 బిలియన్లకు చేరింది. ప్రస్తుతం ఈమె ప్రపంచంలోని 12వ అత్యంత సంపన్న వ్యక్తిగా నిలిచింది. కంపెనీ బోర్డు వైస్-ఛైర్‌పర్సన్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్న బెటెన్‌కోర్ట్ మేయర్స్ L'Orealలో దాదాపు 35 శాతం వాటాను కలిగి ఉన్నట్లు తెలుస్తోంది. లాక్డౌన్ సమయంలో కంపెనీ విక్రయాలు కొంత మందగించినప్పటికీ.. మహమ్మారి తగ్గుముఖం పట్టాక అమ్మకాల వేగం బాగా పెరిగింది. 2017లో బెటెన్‌కోర్ట్ మేయర్స్ తల్లి 'లిలియన్ బెటెన్‌కోర్ట్' మరణించిన తరువాత కుటుంబ వారసురాలిగా సంస్థలో అడుగుపెట్టింది. ఆ తరువాత తనదైన రీతిలో కంపెనీ పురోగతికి పాటుపడుతూ.. ఫ్రాన్స్‌లో అత్యంత ధనిక మహిళల జాబితాలో ఒకరుగా నిలిచింది. ఇదీ చదవండి: అయోధ్య రామాలయ ప్రారంభోత్సవం.. రూ.50000 కోట్ల వ్యాపారం! బెటెన్‌కోర్ట్ మేయర్స్ ప్రముఖ వ్యాపారవేత్త అయినప్పటికి పెద్దగా ఆడంబరమైన జీవితాన్ని కోరుకోదని తెలుస్తోంది. ఈమె ఫైవ్ వ్యాల్యూ స్టడీ ఆఫ్ ది బైబిల్ (Five volume study of the Bible), గ్రీకు దేవతల వంశావళి అనే రెండు పుస్తకాలూ రాశారు. ఈమె ప్రతిరోజు పియానో వాయించడం పట్ల కూడా ఎక్కువ ఆసక్తి ఉన్నట్లు సమాచారం. -
ఇషితా సల్గావ్కర్ ఎవరు.. అంబానీతో సంబంధం ఏంటి?
భారతీయ దిగ్గజ వ్యాపారవేత్త, రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత 'ముఖేష్ అంబానీ' గురించి తెలిసిన చాలా మందికి, ఆయన మేనకోడలు 'ఇషితా సల్గావ్కర్' (Isheta Salgaocar) గురించి తెలియకపోవచ్చు. వ్యాపార రంగంలో తనదైన గుర్తింపు పొందిన ఈమె గురించి మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం. ఎవరీ ఇషితా సల్గావ్కర్? ఇషితా సల్గావ్కర్.. దీప్తి సల్గావ్కర్, దత్తరాజ్ సల్గావ్కర్ దంపతుల కుమార్తె. ఈమె స్వయానా ముకేశ్ అంబానీకి మేనకోడలు. ఎందుకంటే ఇషితా తల్లి 'దీప్తి సల్గావ్కర్' ధీరూభాయ్ అంబానీ కుమార్తె.. ముకేశ్ అంబానీ సోదరి. నిజానికి ముకేశ్ అంబానీ మేనకోడలుగా కాకుండా వ్యాపార కార్యకలాపాలు, దాతృత్వ కార్యక్రమాలతోనే సుపరిచితం అయింది. ఈమె 2016లో నీరవ్ మోదీ తమ్ముడు నీషాల్ మోదీని వివాహం చేసుకుంది. అయితే కొన్ని అనివార్య కారణాల వల్ల వీరిరువురు విడిపోయారు. ఆ తరువాత ఇషితా బిజినెస్ టైకూన్ లక్ష్మీ నివాస్ మిట్టల్ మేనల్లుడు 'అతుల్య మిట్టల్'తో ప్రేమలో పడింది. వీరిద్దరూ 2022లో వివాహం చేసుకున్నారు. అంబానీ కుటుంబంలోని తన బంధువుల మాదిరిగా కాకుండా.. ఇషితా చదువుకునే రోజుల నుంచి గొప్ప విజయాలను సాధించింది. ఈమె హార్వర్డ్ బిజినెస్ స్కూల్ గ్రాడ్యుయేట్ పూర్తి చేసిన తరువాత సల్గావ్కర్ కార్పొరేషన్ ప్రైవేట్ లిమిటెడ్‌లో కార్పొరేట్ డెవలప్మెంట్ వైస్ ప్రెసిడెంట్‌గా పనిచేస్తోంది. ఇదీ చదవండి: స్మార్ట్‌ఫోన్ కంపెనీ కొత్త ఎలక్ట్రిక్ కారు - సింగిల్ ఛార్జ్‌తో 800కిమీ రేంజ్ ఆమె తల్లి దీప్తి సల్గావ్కర్ మాదిరిగానే.. ఇషితా సల్గావ్కర్ దాతృత్వ కార్యకలాపాలలో ఎక్కువగా పాల్గొనేది. ఇప్పటికే అనేక విద్య, ఆరోగ్య సంరక్షణ సంబంధిత కార్యకలాపాలకు పెద్ద ఎత్తున సాయం కూడా చేసింది. ప్రస్తుతం ఇషితా నికర విలువ గురించి ఖచ్చితమైన సమాచారం అందుబాటులో లేదు, అయితే కొన్ని మీడియా కథనాల ప్రకారం ఈమె నికర విలువ కోట్ల రూపాయల్లో ఉంటుందని, వ్యాపార రంగంలో కూడా బాగా రాణిస్తున్నట్లు సమాచారం. -
సుధామూర్తి రాజకీయాల్లోకి వస్తుందా? ఇదిగో క్లారిటీ..
ఇన్ఫోసిస్ ఛైర్పర్సన్, ప్రముఖ రచయిత్రి 'సుధామూర్తి' (Sudha Murthy) ఇటీవల కొత్త పార్లమెంటు భవనాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా ఆమె విలేకరులతో మాట్లాడుతూ.. రాజకీయాల్లో వచ్చే అవకాశం ఉందా.. లేదా అనే విషయాన్ని గురించి స్పష్టం చేశారు. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం. సుధా మూర్తి కొత్త పార్లమెంట్ భవనాన్ని సందర్శించి, భవన నిర్మాణం చాలా అద్భుతంగా ఉందని.. కళ, సంస్కృతి, భారతీయ చరిత్ర మొత్తం ఉట్టిపడేలా ప్రతిదీ చాలా అందంగా ఉన్న ఈ నిర్మాణం గురించి చెప్పడానికి మాటలు చాలవని తెలిపింది. అంతే కాకుండా కొత్త పార్లమెంట్ భవనాన్ని సందర్శించడం తన కల అని.. ఆ కల ఇప్పటికి నిజమైందని విలేకరులతో వెల్లడించింది. ఈ సందర్భంగా విలేకరులు మీరు రాజకీయాల్లోకి వచ్చే అవకాశం ఉందా అని సుధా మూర్తిని ప్రశ్నించారు. విలేకరుల ప్రశ్నకు నవ్వుతూ ప్రస్తుతం చాలా సంతోషంగా ఉన్నానని.. రాజకీయాల్లో వచ్చే అవకాశం లేదని స్పష్టం చేసింది. దీనికి సంబంధించిన వీడియో కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇదీ చదవండి: ఆర్బీఐ ఖాతాలో మరో బ్యాంక్.. లైసెన్స్ క్యాన్సిల్ చేస్తూ ఉత్తర్వు సుధా మూర్తి ఇటీవల యూట్యూబ్‌లో 'సుధా అమ్మ' పేరుతో పిల్లల కోసం ఓ కొత్త యానిమేషన్ సిరీస్ ప్రారంభించింది. ఈ సందర్భంగా తన కోడలు గురించి ప్రస్తావిస్తూ అపర్ణ చాలా మంచిది, సమర్థవంతమైందిని స్పష్టం చేసింది. గత కొన్ని రోజులకు ముందు అపర్ణ పండండి మగబిడ్డకు జన్మనిచ్చింది. #WATCH | Delhi | As Sudha Murty visits the Parliament, she says, "It is so beautiful...No words to describe. I wanted to see this for a long time. It was a dream come true today. It is beautiful...It's art, culture, Indian history - everything is beautiful..." pic.twitter.com/P2kKp2Wj2o — ANI (@ANI) December 8, 2023 -
కోడలి గురించి 'సుధామూర్తి' మనసులో మాట - ఏం చెప్పిందంటే?
ప్రముఖ రచయిత్రి, విద్యావేత్త, ఇన్ఫోసిస్ ఫౌండేషన్ ఛైర్పర్సన్ 'సుధామార్తి' (Sudha Muthy) ఇటీవల తన కోడలు 'అపర్ణ కృష్ణన్' (Aparna Krishnan)తో ఎలా ఉంటుంది. కోడలి వల్ల ఏమైనా సమస్యలు ఉన్నాయా? అనే విషయాలను బయటపెట్టింది. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం. సూధామూర్తి కొడుకు రోహన్ మూర్తి మొదట్లో 'లక్ష్మీ వేణు'ను వివాహం చేసుకున్నాడు. కానీ వీరు ఎక్కువ రోజులు కలిసి ఉండలేక విడాకులు తీసుకున్నారు. ఆ తరువాత రోహన్ 'అపర్ణ క్రష్ణన్' అనే యువతిని రెండో వివాహం చేసుకున్నాడు కొడుకు పెళ్లిని చాలా సింపుల్‌గా చేసినప్పటికీ.. కోడలిని మాత్రం బాగా చూసుకుంటుందని.. అపర్ణ క్రష్ణన్ గతంలో స్వయంగా వెల్లడించింది. తన అత్తగారి గురించి ఎవరైనా అడిగితే.. నాకు ఆమె రోల్ మోడల్ అని, అంతే కాకుండా ప్రతి అత్తకు రోల్ మోడల్ అని చెబుతానని చెప్పింది. సుధామూర్తిని తన కోడలితో సంబంధం ఎలా ఉంటుంది అని అడిగితే, ఏ సమస్య లేదని చెబుతూ.. ఒకరినొకరు అపార్థం చేసుకోవడానికి చాలా సమయం కావాలని. నేను ఎప్పుడూ నా పనిలో బిజీగా ఉంటాను, ఆమె పనిలో ఆమె బిజీగా ఉంటుంది. అపర్ణ చాలా మంచిది, సమర్థవంతమైందిని స్పష్టం చేసింది. ఇదీ చదవండి: సెలవు తీసుకోకుండా పనిచేస్తా.. దిగ్గజాలను భయపెడుతున్న కొత్త 'సీఈఓ' సుధా మూర్తి ఇటీవల యూట్యూబ్‌లో 'సుధా అమ్మ' పేరుతో పిల్లల కోసం ఓ కొత్త యానిమేషన్ సిరీస్ ప్రారంభించింది. ఈ సందర్భంగా సుధామూర్తి 'కంటెంట్ నాదే కానీ ఇది అపర్ణ బేబీ'ది అని చెప్పింది. ఈ సిరీస్ ప్రారంభించడానికి కోడలి ఆలోచనే కారణమని కూడా వెల్లడించింది. -
నీతా అంబానీ కొత్త కారు - ధర తెలిస్తే అవాక్కవుతారు!
భారతదేశంలో అత్యంత ఖరీదైన కార్లను ఉపయోగించే సంపన్న కుటుంబాలలో 'ముఖేష్ అంబానీ' ఫ్యామిలీ ఒకటి. రోల్స్ రాయిస్, మెర్సిడెస్ బెంజ్, బీఎండబ్ల్యూ, ఫెరారీ, బెంట్లీ వంటి ఎక్స్పెన్సివ్ కార్లను కలిగిన ఉన్న వీరు తాజాగా మరో కాస్ట్లీ కారుని తమ గ్యారేజిలో చేర్చినట్లు తెలుస్తోంది. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం. వీడియోలో గమనించినట్లతే 'రోల్స్ రాయిస్' (Rolls Royce) కంపెనీకి చెందిన 'కల్లినన్ బ్లాక్ బ్యాడ్జ్' (Cullinan Black Badge) కారు ముంబై రోడ్లపై Z+ సెక్యూరిటీ కాన్వాయ్‌లో వెళ్లడం చూడవచ్చు. ఇది ముకేశ్ అంబానీ భార్య 'నీతా అంబానీ'కి చెందినట్లు, దీని ధర రూ.10 కోట్లు (ఆన్ రోడ్) వరకు ఉంటుందని సమాచారం. పెట్రా గోల్డ్ షేడ్‌లో కనిపించే ఈ కారు సాధారణ కార్లకంటే కూడా చాలా ఆకర్షణీయంగా ఉంది. 6.75 లీటర్ ట్విన్ టర్బో వి12 పెట్రోల్ ఇంజిన్ కలిగిన కల్లినన్ 5,000 ఆర్పీఎమ్ వద్ద 563 బీహెచ్పీ పవర్, 1600 ఆర్పీఎమ్ 850 న్యూటన్ మీటర్ టార్క్ ప్రొడ్యూస్ చేస్తుంది. ఈ కారు గరిష్ట వేగం గంటకు 250 కిమీ. ఇదీ చదవండి: ఆగని యుద్ధం.. పోయిన లక్షల ఉద్యోగాలు - ఐఎల్ఓ సంచలన రిపోర్ట్ రోల్స్ రాయిస్ కల్లినన్ బ్లాక్ బ్యాడ్జ్ మంచి డిజైన్, లేటెస్ట్ ఫీచర్స్ కలిగి వాహన వినియోగదారులకు చాలా అనుకూలంగా ఉంటుంది. ఈ కారు లోపల కొన్ని భాగాలు కార్బన్ ఫైబర్‌తో, లెదర్ అపోల్స్ట్రే బ్లాక్ కలర్ స్కీమ్ పొందుతుంది. ఇలాంటి కారు ఇప్పటికే బాలీవుడ్ బాద్షా షారూఖ్ ఖాన్ కూడా కొనుగోలు చేశారు.