ప్రముఖ ఫ్రెంచ్ వ్యాపారవేత్త 'ఫ్రాంకోయిస్ బెటెన్‌కోర్ట్ మేయర్స్' (Francoise Bettencourt Meyers) ఇటీవల 100 బిలియన్ డాలర్ల సంపద కలిగిన మహిళగా బ్లూమ్‌బెర్గ్ బిలియనీర్స్ జాబితాలో చేరింది. తాత స్థాపించిన బ్యూటీ ప్రొడక్ట్స్ సామ్రాజ్యంలో అరుదైన ఘనత సాధించిన ఈమె గురించి మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం.
బ్లూమ్‌బెర్గ్ బిలియనీర్స్ ఇండెక్స్ ప్రకారం, ఆమె తాత స్థాపించిన ''ఎల్'ఓరియల్'' (L'Oreal) షేర్స్ భారీగా పెరగడంతో ఆమె సంపద 2023 డిసెంబర్ 28 నాటికి 100.2 బిలియన్లకు చేరింది. ప్రస్తుతం ఈమె ప్రపంచంలోని 12వ అత్యంత సంపన్న వ్యక్తిగా నిలిచింది.
కంపెనీ బోర్డు వైస్-ఛైర్‌పర్సన్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్న బెటెన్‌కోర్ట్ మేయర్స్ L'Orealలో దాదాపు 35 శాతం వాటాను కలిగి ఉన్నట్లు తెలుస్తోంది. లాక్‌డౌన్ సమయంలో కంపెనీ విక్రయాలు కొంత మందగించినప్పటికీ.. మహమ్మారి తగ్గుముఖం పట్టాక అమ్మకాల వేగం బాగా పెరిగింది.
2017లో బెటెన్‌కోర్ట్ మేయర్స్ తల్లి 'లిలియన్ బెటెన్‌కోర్ట్' మరణించిన తరువాత కుటుంబ వారసురాలిగా సంస్థలో అడుగుపెట్టింది. ఆ తరువాత తనదైన రీతిలో కంపెనీ పురోగతికి పాటుపడుతూ.. ఫ్రాన్స్‌లో అత్యంత ధనిక మహిళల జాబితాలో ఒకరుగా నిలిచింది.
ఇదీ చదవండి: అయోధ్య రామాలయ ప్రారంభోత్సవం.. రూ.50000 కోట్ల వ్యాపారం!
బెటెన్‌కోర్ట్ మేయర్స్ ప్రముఖ వ్యాపారవేత్త అయినప్పటికి పెద్దగా ఆడంబరమైన జీవితాన్ని కోరుకోదని తెలుస్తోంది. ఈమె ఫైవ్ వ్యాల్యూ స్టడీ ఆఫ్ ది బైబిల్ (Five volume study of the Bible), గ్రీకు దేవతల వంశావళి అనే రెండు పుస్తకాలూ రాశారు. ఈమె ప్రతిరోజు పియానో వాయించడం పట్ల కూడా ఎక్కువ ఆసక్తి ఉన్నట్లు సమాచారం.
Comments
Please login to add a commentAdd a comment