LOreal company
-
ఒక్క రోజులోనే రూ.57 వేల కోట్లు మటాష్.. అయినా ఆవిడే ప్రపంచంలో రిచెస్ట్!
ఫ్రెంచ్ వ్యాపారవేత్త 'ఫ్రాంకోయిస్ బెటెన్‌కోర్ట్ మేయర్స్' (Francoise Bettencourt Meyers) ఇటీవల 100 బిలియన్ డాలర్ల సంపద కలిగిన మహిళగా బ్లూమ్‌బెర్గ్ బిలియనీర్స్ జాబితాలో చేరింది. తాత స్థాపించిన బ్యూటీ ప్రొడక్ట్స్ సామ్రాజ్యంలో అరుదైన ఘనత సాధించిన ఈమె ఇటీవల ఒక్క రోజులోనే ఏకంగా 6.9 బిలియన్ డాలర్ల నష్టాన్ని చవి చూసింది. అంటే భారతీయ కరెన్సీ ప్రకారం సుమారు రూ.57267.9 కోట్లు నష్టపోయిందన్నమాట. ఫోర్బ్స్ రియల్-టైమ్ బిలియనీర్ ట్రాకర్ ప్రకారం, ఇప్పటి వరకు ఒక్క రోజులో ఇంత పెద్ద మొత్తం ఏ బిలినీయర్ కూడా నష్టాన్ని చూడలేదని స్పష్టం చేసింది. ఇంత మొత్తంలో నష్టాన్ని చవి చూయినప్పటికీ.. ప్రపంచంలోనే అత్యంత సంపన్న మహిళగా కొనసాగుతోంది. క్షీణత తర్వాత ఆమె ప్రస్తుత నికర విలువ 80.5 బిలియన్ డాలర్లు. 2008 నుంచి ''ఎల్'ఓరియల్'' (L'Oreal) షేర్స్ ఎప్పుడూ తగ్గలేదని, నిన్న (శుక్రవారం) మాత్రమే కంపెనీ షేర్స్ ఏకంగా 7.5 శాతం తగ్గడం వల్ల వేలకోట్లు నష్టాన్ని చూడాల్సి వచ్చిందని సమాచారం. కంపెనీ బోర్డు వైస్-ఛైర్‌పర్సన్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్న బెటెన్‌కోర్ట్ మేయర్స్ L'Orealలో దాదాపు 35 శాతం వాటాను కలిగి ఉన్నట్లు తెలుస్తోంది. 2017లో మేయర్స్ తల్లి 'లిలియన్ బెటెన్‌కోర్ట్' మరణించిన తరువాత కుటుంబ వారసురాలిగా సంస్థలో అడుగుపెట్టింది. ఆ తరువాత తనదైన రీతిలో కంపెనీ పురోగతికి పాటుపడుతూ.. ఫ్రాన్స్‌లో అత్యంత ధనిక మహిళల జాబితాలో ఒకరుగా ఉన్నారు. ఇదీ చదవండి: దిగ్గజ కంపెనీ కీలక నిర్ణయం - వేలాది ఉద్యోగులు ఇంటికి.. 1909లో బెటెన్‌కోర్ట్ మేయర్స్ తాత 'యూజీన్ షుల్లెర్' (Eugene Schueller) ప్రారంభంలో హెయిర్ కలర్ ఉత్పత్తి చేసి విక్రయించడానికి సంస్థ స్థాపించారు. అదే నేడు మేయర్స్ సారథ్యంలో వేలకోట్ల కంపెనీగా అవతరించింది. బెటెన్‌కోర్ట్ మేయర్స్‌ను ప్రపంచంలో అత్యంత ధనిక మహిళగా నిలిచేలా చేసింది. -
ప్రపంచంలోకెల్లా సంపన్నురాలు.. ‘లో రియాల్’ వైస్ ప్రెసిడెంట్ రికార్డు
న్యూఢిల్లీ: కాస్మటిక్స్ దిగ్గజం లో రియాల్ వ్యాపార సామ్రాజ్య వారసురాలు ఫ్రాంకోయిస్ బెటెన్‌కోర్ట్ మేయర్స్ ప్రపంచంలో అత్యంత సంపన్న మహిళగా చరిత్ర సృష్టించారు. అలాగే ఏకంగా 100 బిలియన్ డాలర్ల పై చిలుకు సంపదను ఆర్జించిన తొలి మహిళగా కూడా ఆమె నిలిచారు. అంతేగాక ప్రపంచ కుబేరుల జాబితాలో ముకేశ్ అంబానీ, గౌతం అదానీ, అమానికో ఓర్టెగా వంటి వ్యాపార దిగ్గజాలను వెనక్కు నెడుతూ 12వ స్థానానికి ఎగబాకారని బ్లూంబర్గ్ బిలియనీర్ల ఇండెక్స్ ప్రకటించింది. 70 ఏళ్ల మేయర్స్ 268 బిలియన్ డాలర్ల విలువైన లో రియాల్ వ్యాపార సామ్రాజ్యానికి వైస్ ప్రెసిడెంట్ హోదాలో ఉన్నారు. ఆమె కుటుంబానికి కంపెనీలో 35 శాతం దాకా వాటాలున్నాయి. 2017లో మేయర్స్ తల్లి మరణానంతరం అపారమైన ఆస్తి, కంపెనీ వాటాలు ఆమెకు వారసత్వంగా దక్కాయి. తాజాగా కంపెనీ వాటాల విలువ ఒక్కసారిగా చుక్కలనంటడంతో మేయర్స్ సంపద బిలియన్ డాలర్ల మార్కును దాటేసింది. మీడియాకు దూరంగా రోజూ గంటల తరబడి పియానో వాయిస్తూ గడుపుతుంటారామె. -
ప్రపంచంలో అత్యంత సంపన్న మహిళ.. ఆమెనేనా?
ప్రముఖ ఫ్రెంచ్ వ్యాపారవేత్త 'ఫ్రాంకోయిస్ బెటెన్‌కోర్ట్ మేయర్స్' (Francoise Bettencourt Meyers) ఇటీవల 100 బిలియన్ డాలర్ల సంపద కలిగిన మహిళగా బ్లూమ్‌బెర్గ్ బిలియనీర్స్ జాబితాలో చేరింది. తాత స్థాపించిన బ్యూటీ ప్రొడక్ట్స్ సామ్రాజ్యంలో అరుదైన ఘనత సాధించిన ఈమె గురించి మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం. బ్లూమ్‌బెర్గ్ బిలియనీర్స్ ఇండెక్స్ ప్రకారం, ఆమె తాత స్థాపించిన ''ఎల్'ఓరియల్'' (L'Oreal) షేర్స్ భారీగా పెరగడంతో ఆమె సంపద 2023 డిసెంబర్ 28 నాటికి 100.2 బిలియన్లకు చేరింది. ప్రస్తుతం ఈమె ప్రపంచంలోని 12వ అత్యంత సంపన్న వ్యక్తిగా నిలిచింది. కంపెనీ బోర్డు వైస్-ఛైర్‌పర్సన్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్న బెటెన్‌కోర్ట్ మేయర్స్ L'Orealలో దాదాపు 35 శాతం వాటాను కలిగి ఉన్నట్లు తెలుస్తోంది. లాక్డౌన్ సమయంలో కంపెనీ విక్రయాలు కొంత మందగించినప్పటికీ.. మహమ్మారి తగ్గుముఖం పట్టాక అమ్మకాల వేగం బాగా పెరిగింది. 2017లో బెటెన్‌కోర్ట్ మేయర్స్ తల్లి 'లిలియన్ బెటెన్‌కోర్ట్' మరణించిన తరువాత కుటుంబ వారసురాలిగా సంస్థలో అడుగుపెట్టింది. ఆ తరువాత తనదైన రీతిలో కంపెనీ పురోగతికి పాటుపడుతూ.. ఫ్రాన్స్‌లో అత్యంత ధనిక మహిళల జాబితాలో ఒకరుగా నిలిచింది. ఇదీ చదవండి: అయోధ్య రామాలయ ప్రారంభోత్సవం.. రూ.50000 కోట్ల వ్యాపారం! బెటెన్‌కోర్ట్ మేయర్స్ ప్రముఖ వ్యాపారవేత్త అయినప్పటికి పెద్దగా ఆడంబరమైన జీవితాన్ని కోరుకోదని తెలుస్తోంది. ఈమె ఫైవ్ వ్యాల్యూ స్టడీ ఆఫ్ ది బైబిల్ (Five volume study of the Bible), గ్రీకు దేవతల వంశావళి అనే రెండు పుస్తకాలూ రాశారు. ఈమె ప్రతిరోజు పియానో వాయించడం పట్ల కూడా ఎక్కువ ఆసక్తి ఉన్నట్లు సమాచారం. -
యూనిలీవర్ బాటలోనే లోరియల్ కూడా..
న్యూఢిల్లీ: పోలీసుల కస్టడీలో చనిపోయిన నల్లజాతి వ్యక్తి జార్జ్ ఫ్లాయిడ్ మృతికి వ్యతిరేకంగా అమెరికాలో ప్రారంభమైన నిరసనల సెగ ప్రపంచ ప్రసిద్ధ సౌందర్య ఉత్పత్తుల సంస్థలకు తగిలింది. ఈ నేపథ్యంలో హిందూస్తాన్ యూనిలీవర్ కంపెనీ తన ‘ఫెయిర్ అండ్ లవ్లీ’ ఫెయిర్‌నెస్ క్రీం పేరులో నుంచి ‘ఫెయిర్’ పదాన్ని తొలగిస్తున్నట్లు ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో మరో ప్రసిద్ధ సౌందర్య ఉత్పత్తుల సంస్థ లోరియల్ కూడా యూనిలీవర్ బాటలోనే పయనిస్తుంది. ఈ క్రమంలో చర్మ సౌందర్యాన్ని పెంచే తమ ఉత్పత్తుల ప్యాక్‌ల మీద ‘వైట్, ఫెయిర్, లైట్’ పదాలను తొలగిస్తున్నట్లు ప్రకటించింది. ఈ మేరకు సంస్థ మహిళా ప్రతినిధి ఒక ప్రకటన విడుదల చేశారు. (ఇక ‘ఫెయిర్’కు గుడ్‌బై..) ఆసియా, ఆఫ్రికన్, కరేబియన్ దేశాలలో తెల్లని మేనిఛాయే సౌందర్యానికి ప్రామాణికమనే భావన ఏన్నో ఏళ్లుగా పాతుకు పోయింది. దీన్ని దృష్టిలో పెట్టుకుని యూనిలీవర్, లోరియల్ కంపెనీలు స్కిన్ వైట్నింగ్ క్రీములను ఉత్పత్తి చేస్తాయి. ఈ విషయంలో గ్లోబల్ మార్కెట్లో ఈ కంపెనీల ఉత్పత్తులకు ఎంతో డిమాండ్ ఉన్నది. లోరియల్ ఉత్పత్తులలో గార్నియర్ స్కిన్ నేచురల్స్ వైట్, కంప్లీట్ మల్టీ యాక్షన్ ఫెయిర్‌నెస్ క్రీమ్స్ ఉన్నాయి. మరో కంపెనీ జాన్సన్ అండ్ జాన్సన్ ఇప్పటికే ఆసియా, మధ్యప్రాచ్య దేశాలలో విక్రయించే తన స్కిన్ వైటనింగ్ క్రీమ్స్ న్యూట్రోజెనా, క్లీన్ అండ్ క్లియర్ ఉత్పత్తులను అమ్మడం మానేస్తున్నట్లు ప్రకటించిన సంగతి తెలిసిందే. -
ఫేస్బుక్ ద్వారా మేకప్ ట్రై చేయండి..
మేకప్ లేకుండా ఈ కాలం యువత బయటికి వెళ్లడం చాలా అరుదు. చాలా మంది మేకప్ ఎలా వేసుకోవాలో తెలియక ఇబ్బందులు పడుతూ ఉంటారు. ఇక నుంచి ఫేస్బుక్ ద్వారా మేకప్‌ను ట్రై చేయొచ్చట. దీని కోసం ప్రముఖ సౌందర్య ఉత్పత్తుల సంస్థ లోరియల్, ఫేస్‌బుక్‌తో జతకట్టింది. అగ్మెంటెడ్ రియాల్టీ మేకప్ అనుభవాన్ని ప్రజలకు అందించడానికి లోరియల్, సోషల్ మీడియా దిగ్గజంతో భాగస్వామ్యం ఏర్పరుచుకున్నట్టు తెలిసింది. మోడీఫేస్ ద్వారా గ్లోబల్ కాస్మోటిక్ దిగ్గజం లోరియల్, ఫేస్‌బుక్‌తో కలిసి పనిచేయనుంది. మేబెల్లిన్, లోరియల్ పారిస్, ఎన్వైఎక్స్ ప్రొఫెషనల్ మేకప్, లాంకమ్, జార్జియో అర్మానీ, వైవ్స్ సెయింట్ లారెంట్, అర్బన్ డికే, షు ఉమూరా వంటి లోరియల్ ఉన్నతమైన బ్రాండ్లను వర్చువల్‌గా ట్రై చేసే అవకాశాన్ని ఫేస్బుక్ యూజర్లకు మోడీఫేస్ ఆఫర్ చేస్తుంది. ఈ నెల చివరి నుంచి ఈ ప్రాజెక్ట్ అమల్లోకి వస్తుందని తెలుస్తోంది. మీ ఫోటోను ఫేస్బుక్లో పోస్టు చేయాలి. ఆ అనంతరం బ్యూటీ ఉత్పత్తులతో, యాక్ససరీస్‌తో సైట్లోనే పలు షేడ్స్‌లో ట్రై చేసుకోవచ్చు. ఫేస్‌బుక్‌తో తాము దీర్ఘకాల భాగస్వామ్యాన్ని ఏర్పరుచుకోవడానికి ఇదొక కొత్త అడుగు అని లోరియల్ చీఫ్ డిజిటల్ ఆఫీసర్ లుబోమిరా రోచెట్ చెప్పారు. గత ఏడాది కాలంగా వర్చువల్ రియాల్టీ, అగ్మెంటెడ్ రియాల్టీ టెక్నాలజీలు బ్యూటీ పరిశ్రమలో ప్రముఖ పాత్ర పోషిస్తున్నాయని లోరియల్ చెప్పింది. -
ప్రపంచపు అత్యంత ధనిక మహిళ మృతి
ప్రపంచంలో అత్యంత ధనిక మహిళ లిలియానే బెటెన్‌కోర్టు(94) కన్నుమూశారు. గురువారం ఆమె తుదిశ్వాస విడిచినట్టు కుటుంబసభ్యులు తెలిపారు. ప్రపంచంలో ప్రముఖ కాస్మోటిక్ కంపెనీ లోరియల్‌కు ఆమె వారసురాలు. కంపెనీ వ్యవస్థాపకుడు యూజీన్ షుల్లెర్‌కు బెటెన్‌కోర్టు కూతురు. ఫోర్బ్స్, బ్లూమ్‌బర్గ్ బిలినీయర్ ఇండెక్స్‌లలో బెటెన్‌కోర్టు ప్రపంచంలో అత్యంత ధనిక మహిళగా పేరు దక్కించుకున్నారు. ఆమె నికర సంపద సుమారు 44 బిలియన్ డాలర్లు ఉంటుంది. అంటే మన దేశీయ కరెన్సీ ప్రకారం రూ.2,85,980 కోట్లకు పైననే. ప్రస్తుతం బెటెన్‌కోర్టు కుటుంబానికి లోరియల్ గ్రూప్‌లో 33 శాతం వాటా ఉంది. లిలియానే 1922లో పారిస్‌లో జన్మించారు. 15 ఏళ్ల వయసులో తన కుటుంబ వ్యాపారంలో అప్రెంటిస్ చేశారు. 1957లో లోరియల్ కంపెనీకి అధినేత్రి అయ్యారు. ఈ కాస్మోటిక్ దిగ్గజ కంపెనీలో ఎంతో చురుకుగా పనిచేస్తూ... 2012 వరకు ఆమె కంపెనీ బోర్డులోనే పనిచేశారు. 89ఏళ్ల వయసులో ఆమె తన పదవి నుంచి దిగిపోయారు. తన కూతురుతో నెలకొన్న న్యాయ వివాద నేపథ్యంలో ఆమె తన మనవడికి లోరియల్ సంస్థ బాధ్యతలు అప్పజెప్పారు. 1950లో ఫ్రెంచ్ రాజకీయవేత్త ఆండ్రె బెటెన్‌కోర్టును వివాహమాడిన ఆమె, 1960, 70లలో ఫ్రెంచ్ కేబినెట్లో మంత్రిగా కూడా పనిచేశారు.