మేకప్ లేకుండా ఈ కాలం యువత బయటికి వెళ్లడం చాలా అరుదు. చాలా మంది మేకప్ ఎలా వేసుకోవాలో తెలియక ఇబ్బందులు పడుతూ ఉంటారు. ఇక నుంచి ఫేస్‌బుక్ ద్వారా మేకప్‌ను ట్రై చేయొచ్చట. దీని కోసం ప్రముఖ సౌందర్య ఉత్పత్తుల సంస్థ లోరియల్, ఫేస్‌బుక్‌తో జతకట్టింది. అగ్‌మెంటెడ్ రియాల్టీ మేకప్ అనుభవాన్ని ప్రజలకు అందించడానికి లోరియల్, సోషల్ మీడియా దిగ్గజంతో భాగస్వామ్యం ఏర్పరుచుకున్నట్టు తెలిసింది. మోడీఫేస్ ద్వారా గ్లోబల్ కాస్మోటిక్ దిగ్గజం లోరియల్, ఫేస్‌బుక్‌తో కలిసి పనిచేయనుంది.
మేబెల్లిన్, లోరియల్ పారిస్, ఎన్‌వైఎక్స్ ప్రొఫెషనల్ మేకప్, లాంకమ్, జార్జియో అర్మానీ, వైవ్స్ సెయింట్ లారెంట్, అర్బన్ డికే, షు ఉమూరా వంటి లోరియల్ ఉన్నతమైన బ్రాండ్లను వర్చువల్‌గా ట్రై చేసే అవకాశాన్ని ఫేస్‌బుక్ యూజర్లకు మోడీఫేస్ ఆఫర్ చేస్తుంది. ఈ నెల చివరి నుంచి ఈ ప్రాజెక్ట్ అమల్లోకి వస్తుందని తెలుస్తోంది. మీ ఫోటోను ఫేస్‌బుక్‌లో పోస్టు చేయాలి. ఆ అనంతరం బ్యూటీ ఉత్పత్తులతో, యాక్ససరీస్‌తో సైట్‌లోనే పలు షేడ్స్‌లో ట్రై చేసుకోవచ్చు. ఫేస్‌బుక్‌తో తాము దీర్ఘకాల భాగస్వామ్యాన్ని ఏర్పరుచుకోవడానికి ఇదొక కొత్త అడుగు అని లోరియల్ చీఫ్ డిజిటల్ ఆఫీసర్ లుబోమిరా రోచెట్ చెప్పారు. గత ఏడాది కాలంగా వర్చువల్ రియాల్టీ, అగ్‌మెంటెడ్ రియాల్టీ టెక్నాలజీలు బ్యూటీ పరిశ్రమలో ప్రముఖ పాత్ర పోషిస్తున్నాయని లోరియల్ చెప్పింది.
Comments
Please login to add a commentAdd a comment