augmented reality services
-
స్మార్ట్ఫోన్లకు ఎండ్‌కార్డ్...! వాటి స్థానంలో పవర్ఫుల్..!
స్మార్ట్‌ఫోన్..మన జీవితంలో ఒక భాగమైపోయింది. స్మార్ట్‌ఫోన్ లేకుండా ఒక క్షణం కూడా ఉండలేము. కాగా ప్రస్తుతం టెక్ దిగ్గజం యాపిల్ పనిచేస్తోన్న సరికొత్త టెక్నాలజీతో రాబోయే రోజుల్లో స్మార్ట్ఫోన్లకు ఎండ్ కార్డ్ పడే అవకాశం ఉందని నిపుణులు భావిస్తున్నారు. ఐఫోన్ల స్థానంలో ఏఆర్ హెడ్సెట్..! ఐఫోన్ 12 ప్రొతో లైడర్ టెక్నాలజీను యాపిల్ ఆవిష్కరించిన విషయం తెలిసిందే. దీంతో అగ్యుమెంటేగ్ రియాల్టీలో యాపిల్ ఒక అడుగు ముందుకేసింది. కాగా వచ్చే పదేళ్లలో ప్రపంచవ్యాప్తంగా ఐఫోన్లను పవర్ఫుల్ అగ్యుమెంటేడ్ రియాల్టీ హెడ్‌సెట్స్ రిప్లేస్ చేయనున్నట్లు తెలుస్తోంది. ఈ పవర్ఫుల్ హెడ్సెట్లను యాపిల్ 2022 చివరలో రిలీజ్ చేయనుంది. మ్యాక్ బుక్ వలె శక్తివంతమైనవిగా ఏఆర్ హెడ్సెట్ నిలిచే అవకాశం ఉందని యాపిల్ విశ్లేషకుడు మింగ్ చి కువో అభిప్రాయపడ్డారు. మ్యాక్ బుక్స్‌లోని ‘ఎమ్1’ పవర్ఫుల్ ప్రాసెసర్లను ఏఆర్ హెడ్సెట్లలో వినియోగించనున్నట్లు తెలుస్తోంది. దీంతో అత్యంత శక్తివంతమైన గాడ్జెట్స్గా ఏఆర్ హెడ్‌సెట్స్ నిలవనున్నాయి. స్మార్ట్ఫోన్లకు ది ఎండ్..! యాపిల్ లాంచ్ చేయనున్న హెడ్‌సెట్స్ అగ్యుమెంటెడ్, వర్చువల్ రియాల్టీలను సపోర్ట్ చేయనున్నాయి. ఈ ఏఆర్ హెడ్‌సెట్స్ అత్యంత శక్తివంతమైన ప్రాసెసింగ్ సామర్థ్యాన్ని కలిగి ఉంది. ఈ టెక్నాలజీతో రానున్న రోజుల్లో ఐఫోన్లనే కాకుండా స్మార్ట్ఫోన్లను రిప్లేస్ చేసే అవకాశం లేకపోలేదని మింగ్ చి కువో అభిప్రాయపడ్డారు. యాపిల్‌తో పాటుగా ఇతర స్మార్ట్‌ఫోన్ కంపెనీలు కూడా ఏఆర్ హెడ్‌సెట్స్‌ను రూపొందించే అవకాశం ఉందని మింగ్ పేర్కొన్నారు. చదవండి: బిజీ సీజన్లో 97 కోట్ల నష్టం.. అయినా చిరునవ్వు, నువ్వు సూపర్ బాసు -
సోషల్ మీడియాను మించిన డేంజర్!
Metaverse Dangerous Than Social Media: అఫ్కోర్స్.. కొత్తగా ఎలాంటి టెక్నాలజీ వచ్చినా నిపుణులు కొందరు ముందుగా చెప్పే మాట ఇదే. మెటావర్స్ విషయంలోనూ ఇప్పుడు ఇలాంటి అభిప్రాయమే వ్యక్తమవుతోంది. వర్చువల్రియాలిటీ (VR), అగుమెంటెడ్ రియాలిటీల(AR)ల సంకరణ కలయికగా రాబోతున్న ‘మెటావర్స్’ గురించి ఇప్పటి నుంచే విపరీతమైన చర్చ నడుస్తోంది. పైగా వర్చువల్ టెక్నాలజీపై టెక్ దిగ్గజాలు భారీగా ఖర్చు చేస్తుండడంతో.. సమీప భవిష్యత్తు మెటావర్స్దేనని అంచనాలు నెలకొన్నాయి. ఈ క్రమంలో ఫేస్బుక్ ముందడుగు వేసి కంపెనీ పేరునే ‘మెటా’గా మార్చేసుకోవడం తెలిసిందే. అయితే మెటావర్స్ అనేది సోషల్ మీడియా కంటే ప్రమాదకరమని అంటున్నారు అమెరికన్ కంప్యూటర్ సైంటిస్ట్ లూయిస్ రోసెన్‌బర్గ్. ఈయన ఎవరో కాదు.. ఫస్ట్ ఫిక్షనల్ ఏఆర్ (అగుమెంటెడ్ రియాలిటీ) వ్యవస్థను డెవలప్ చేసింది ఈయనే. సోషల్ మీడియా అనేది మన కళ్లకు కనిపించే వాస్తవాల్ని జల్లెడ పడుతుంది, మనం చూసే విధానాన్ని తప్పుదోవ పట్టిస్తుంది. కానీ, మెటావర్స్ అలాకాదు. సమూలంగా వాస్తవికతనే లేకుండా చేసే ప్రమాదం ఉంది. అంటే వాస్తవ ప్రపంచాన్నే మనిషికి దూరం చేస్తుందన్నమాట. ఈ సిద్ధాంతాన్ని అనుసరించి.. మెటావర్స్ మనిషికి మరింత ప్రమాదకరంగా మారే అవకాశం ఉందన్న అభిప్రాయం వ్యక్తం చేశారాయన. మెటావర్స్ అనేది ఒక సామాజిక, 3డీ వర్చువల్ ప్రపంచం. ఇక్కడ వ్యక్తిగతంగా కలిసి ఉండలేకపోయినప్పటికీ, ఇతర వ్యక్తులతో అద్భుతమైన అనుభవాలను పంచుకోవచ్చు. భౌతిక ప్రపంచంలో చేయలేని పనులను కలిసి చేయవచ్చు. ఇక 1992లో లూయిస్ రోజెన్బర్గ్ మొట్టమొదటి ఏఆర్ వ్యవస్థను అమెరికా వాయు సేన పైలట్ల శిక్షణ కోసం తయారు చేశాడు. చదవండి: జుకర్ బర్గ్‌పై మరో పిడుగు..!ఈ సారి మైక్రోసాఫ్ట్ రూపంలో..! -
సాలీడు పురుగులంటే భయమా? ఈ యాప్‌తో..
గాలి భయం, నేల భయం, నిప్పు భయం, నీరు భయం.. ఇలా మనిషికి అంతా భయంమయం. నల్లిని చూసినా, పిల్లిని చూసినా.. భయంతో, అసహ్యంతో కుంగిపోతుంటాడు. అయితే కొందరు ఆ భయాల్ని పొగొట్టుకునేందుకు రకరకాల థెరపీలను ఆశ్రయిస్తుంటారు. ఈ క్రమంలో సాలీడు పురుగులంటే భయపడేవాళ్ల కోసం ఓ యాప్‌ను రూపొందించారు స్విట్జర్లాండ్ సైంటిస్టులు. స్విట్జర్లాండ్ బాసెల్ యూనివర్సిటీ రీసెర్చర్లు ‘డబ్బ్‌డ్ ఫోబిస్’ పేరుతో ఓ కొత్త యాప్‌ను డెవలప్ చేశారు. ఇందులో అగ్మెంటెడ్ రియాలిటీ టెక్నాలజీతో రూపొందించిన సాలీడు పురుగుల బొమ్మలు డిస్ప్లే అవుతాయి. వీటి ద్వారా నిజమైన సాలీడు పురుగుల వల్ల కలిగే భయాన్ని దూరం చేసుకోవచ్చని రీసెర్చర్లు చెప్తున్నారు. సాలీడు పురుగుల వల్ల మనిషికి కలిగే భయాన్ని అరాచ్నోఫోబియా(అరాక్నోఫోబియా) అంటారు. దీని నుంచి బయటపడేందుకు చాలామంది మానసిక వైద్యులు, థెరపిస్టుల చుట్టూ తిరుగుతూ డబ్బు ఖర్చు చేస్తుంటారు. అయితే డబ్బ్‌డ్ ఫోబిస్ పూర్తిగా ఫ్రీ యాప్. అగుమెంటెడ్ రియాలిటీ 3డీ స్పైడర్ బొమ్మల వల్ల.. రియల్ లైఫ్ స్పైడర్లు ఎదురైనప్పుడు కలిగే భయాన్ని ఫేస్ చేయొచ్చు. మొత్తం పది లెవల్స్‌లో ఈ యాప్ ట్రీట్మెంట్(సెల్ఫ్) చేసుకోవచ్చు. రీసెంట్గా ఈ యాప్ వల్ల అరాచ్నోఫోబియా బయటపడ్డ కొందరి అభిప్రాయాల్ని ‘యాంగ్జైటీ డిజార్డర్స్’ అనే జర్నల్‌లో పబ్లిష్ చేశారు. వీళ్లంతా సుమారు రెండువారాలపాటు ఆరున్నర గంటలపాటు శిక్షణ తీసుకున్నారు. సంప్రదాయ పద్ధతిలో థెరపీ కంటే మెరుగైన ఫలితాలను ఇచ్చాయని రీసెర్చర్లు చెప్తున్నారు. అయితే ప్రస్తుతం ప్లేస్టోర్‌లో డమ్మీ ఫోబిస్ యాప్‌లు చాలానే ఉన్నాయి. కానీ, ఏఆర్ టెక్నాలజీ ఎక్స్‌పీరియన్స్‌తో కూడిన డబ్బ్‌డ్ ఫోబిస్ యాప్ రావడానికి కొంత టైం పడుతుందని చెప్తున్నారు. చదవండి: ఔరా.. అద్దాలలో ఈ స్మార్ట్ అద్దాలు వేరయా! -
అంతచిన్న కెమెరా.. పర్మిషన్ లేకుండా తీస్తే ఎలా?
Facebook Sunglass: ఫేస్బుక్ కొత్తగా తీసుకొచ్చిన స్మార్ట్ కళ్లజోడు విషయంలో ఊహించిందే జరుగుతోంది. కళ్లజోడుపై ఉన్న చిన్న కెమెరా గురించి పలువురు అనుమానాలు లేవనెత్తుతున్నారు. అవతలి వాళ్లను అనుమతులు లేకుండా ఫొటోలు, వీడియోలు తీసే విషయంపై అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నారు. ప్రముఖ కళ్లజోడు కంపెనీ రే-బాన్‌తో కలిసి ఫేస్బుక్ ‘రే బాన్ స్టోరీస్’ పేరిట స్మార్ట్ కళ్లజోడును మార్కెట్లోకి రిలీజ్ చేసిన విషయం తెలిసిందే. ఈ కళ్లజోడుకు పైభాగంలో చిన్న కెమెరా ఉంటుంది. దీని సాయంతో ఫొటోలు, షార్ట్ వీడియోలు తీయొచ్చని ఫేస్బుక్ ప్రకటించుకుంది కూడా. అయితే ఎదుటివారి అనుమతులు లేకుండా ఫొటోలు, వీడియోలు తీసే అవకాశం ఉన్నందున యూరోపియన్ యూనియన్ ప్రైవసీ రెగ్యులేటర్ అభ్యంతరాలు వ్యక్తం చేసింది. ఈ క్రమంలో ఐర్లాండ్ డాటా ప్రొటెక్షన్ కమిషన్(డీపీసీ) ఎదుట హాజరైన ఫేస్బుక్ ప్రతినిధులు.. కెమెరా పైభాగంలో ఉండే చిన్న ఎల్ఈడీ ఇండికేటర్ లైట్ గురించి వివరించారు. ఒకవేళ ఎదుటివాళ్లు ఫొటోగానీ, వీడియోగానీ తీస్తుంటే.. ఆ లైట్ ఆధారంగా గుర్తించొచ్చని ఫేస్బుక్ వివరణ ఇచ్చుకుంది. కానీ, డీపీసీ ఈ వివరణతో సంతృప్తి చెందనట్లు తెలుస్తోంది. కెమెరా చిన్నదిగా ఉండడం, పైగా ఆ లైట్ వెలుతురూ అంతగా లేకపోవడంపై డీపీసీ అభ్యంతరాలు లేవనెత్తినట్లు సమాచారం. ట్రబుల్ మేకర్ ఇటలీ ప్రైవసీ విభాగం ‘ది గరాంటే’.. ఇదివరకే ఈ స్మార్ట్కళ్లజోడు విషయంలో ప్రజల భద్రత గురించి ప్రశ్నలు లేవనెత్తింది. అయితే ఫేస్బుక్ రీజియన్ బేస్ ఐర్లాండ్‌లో ఉండడం వల్ల.. ఐర్లాండ్ డాటా ప్రొటెక్షన్ కమిషన్ విచారణ నడుస్తోంది. ఇక డీపీసీ తలనొప్పి ఫేస్‌బుక్‌కు కొత్తేం కాదు. ఫేస్బుక్ చాలాకాలం నుంచి తేవాలనుకుంటున్న ఫేషియల్ ట్యాగింగ్ ఫీచర్, డీపీసీ అభ్యంతరాల వల్లే వాయిదా పడుతోంది. అంతేకాదు వాట్సాప్ డాటాను మాతృక సంస్థ ఫేస్బుక్ పంచుకుంటోందన్న ఆరోపణలపై విచారణ కొనసాగుతోంది కూడా. ఇక ఫేస్బుక్, ఫేస్బుక్ బిజినెస్ వ్యవహరాలకు సంబంధించిన ఫిర్యాదులెన్నో డీపీసీ ముందు పెండింగ్‌లో ఉండగా.. ఈ మధ్యే ‘ట్రాన్సపరెన్సీ ఫెయిల్యూర్’ ఫిర్యాదు ఆధారంగా 267 డాలర్ల పెనాల్టీ సైతం విధించింది. వచ్చే ఏడాది మరొకటి అయితే ఈ ఫిర్యాదులపై ఫేస్బుక్ సానుకూలంగా స్పందించింది. అప్రమత్తత కారణంగా ఇలాంటి అనుమానాలు లేవనెత్తడం సహజమేనని, ఆ అనుమానాల్ని నివృత్తి చేస్తూ వివరణలు ఇస్తామని ఫేస్బుక్ ప్రతినిధి ఒకరు వెల్లడించారు. ఇక ఫేస్బుక్ ప్రస్తుతం విడుదల చేసిన కళ్లద్దాలు అగుమెంటెడ్ రియాలిటీ టెక్నాలజీ కాకుండానే మార్కెట్లోకి రిలీజ్ అయ్యింది. వచ్చే ఏడాదిలో ప్రమఖ కళ్లజోడు కంపెనీ లగ్జోట్టికా సహకారంతో ఏఆర్ సంబంధిత కళ్లద్దాల్ని తేనున్నట్లు ఫేస్బుక్ సీఈవో మార్క్ జుకర్‌బర్గ్ ఇదివరకే ప్రటించాడు కూడా. ఇక ప్రస్తుతం తెచ్చిన రే బాన్ స్టోరీస్ కళ్లజోడులో 5ఎంపీ కెమెరా ఉంది. 299 డాలర్లు(సుమారు 22 వేల రూపాయలు) ప్రారంభ ధర కాగా.. యూకేతో పాటు ఈయూ పరిధిలోని ఐర్లాండ్, ఇటలీలో అమ్ముతున్నారు. చదవండి: ఫోన్ మాట్లాడేందుకు కళ్లజోడు.. ఈ కంపెనీనే! -
ఫ్లిప్‌కార్ట్‌లో సరికొత్తగా షాపింగ్..ముందుగానే ఇంట్లో చూడొచ్చు..!
ప్రముఖ ఈ-కామర్స్ సంస్థ ఫ్లిప్‌కార్ట్ తన కస్టమర్లకు సరికొత్త షాపింగ్ అనుభూతిని అందించనుంది. ఆగ్మెంటెడ్ రియాలిటీతో ఫ్లిప్‌కార్ట్‌లోని ఆయా వస్తువులను కస్టమర్లు ముందుగానే తమ ఇంట్లో చూసుకునే సౌకర్యాన్ని ఏర్పాటుచేసింది. ఈ టెక్నాలజీతో కొనుగోలుదారులకు ఆయా వస్తువులపై మరింత అనుభూతిని పొందవచ్చునని ఫ్లిప్‌కార్ట్ ఒక ప్రకటనలో తెలిపింది. ఫ్లిప్‌కార్ట్ కెమెరా సహాయంతో ఆయా వస్తువుల 3డీ ఇమెజ్‌లను ఇంట్లో చూడొచ్చును. ఈ ఫీచర్‌తో ఫర్నిచర్, లగేజ్, పెద్ద ఉపకరణాల కొనుగోలు విషయంలో ఉపయోగకరంగా ఉండనుంది. వస్తువులను కొనుగోలు చేసే ముందు ఫ్లిప్‌కార్ట్ కెమెరా సహయంతో వస్తువుల పరిమాణం నిర్ధిష్ట స్థలంలో సరిపోతుందా లేదా అనే విషయాన్నికొనుగోలుదారులు సులువుగా అర్థం చేసుకోవడానికి వీలు పడనుంది. ఫ్లిప్‌కార్ట్ చీఫ్ ప్రొడక్ట్ అండ్ టెక్నాలజీ ఆఫీసర్ జయంద్రన్ వేణుగోపాల్ మాట్లాడుతూ..ఫ్లిప్‌కార్ట్‌లో కస్టమర్లకు మరింత షాపింగ్ అనుభూతిని కల్పించడానికి కంపెనీ పలు చర్యలను తీసుకుంటుందని పేర్కొన్నారు. ప్రస్తుతం ఫ్లిప్‌కార్ట్ తెచ్చిన ఈ కొత్త ఫీచర్‌తో, కస్టమర్ల తమ ఇంట్లో ఆయా వస్తువులను ఏఆర్ టెక్నాలజీ సాయంతో ముందుగానే చూసే సౌకర్యం కల్గుతుందని తెలిపారు. దీంతో కస్టమర్లు వస్తువులను కొనుగోలు చేయడానికి మరింత సులువుకానుంది. ఫ్లిప్‌కార్ట్ కెమెరాను ఎలా వాడాలంటే..! మీ స్మార్ట్‌ఫోన్ నుంచి ఫ్లిప్‌కార్ట్ యాప్‌ను ఓపెన్ చేయండి. మీరు కొనుగోలు చేయాలనుకున్న వస్తువుల కోసం సెర్చ్ చేయండి. ఆ వస్తువుపై క్లిక్ చేయండి. ఆయా వస్తువుకు ‘వ్యూ ఇన్ యూవర్ రూమ్’ ఆప్షన్‌పై క్లిక్ చేయండి. కొన్ని క్షణాల తరువాత వచ్చే ఏఆర్ కెమెరాను అలో చేయండి. తరువాత మీరు ఆ వస్తువును ఉంచదల్చుకున్న ప్రాంతంలో మీకు ఆ వస్తువు 3డీ చిత్రం కెమెరాలో కన్పిస్తోంది. -
వర్చువల్ రియాలిటీకి పెరుగుతున్న ఆదరణ
వీఆర్(వర్చువల్ రియాలిటీ) అనేది నిన్నటి వరకు గేమింగ్ ప్రియులకు ప్రియమైన మాట. ఇప్పుడు...వినోదానికి మాత్రమే కాదు విజ్ఞానానికి కూడా వీఆర్ కేరాఫ్ అడ్రస్ అయింది. క్లాస్‌రూమ్‌కు ప్రత్యామ్నాయంగా మారింది. సరికొత్త అవతారాలతో కొత్త ప్రపంచంలోకి తీసుకువెళుతుంది. కోవిడ్ పుణ్యమా అని ‘క్లాస్రూమ్’ మాయమైపోయింది. ఆన్లైన్ క్లాస్ దగ్గరైంది. ‘ఎంత ఆన్లైన్ అయితే మాత్రం ఏమిటీ? క్లాస్రూమ్ క్లాస్రూమే’ అనేవాళ్ల సంఖ్య పెరిగింది. ఈ నేపథ్యం లో వీఆర్(వర్చువల్ రియాలిటీ)కి ఆదరణ అంతకంతకూ పెరుగుతోంది. త్రీడి అవతార్లతో ‘నిజంగానే క్లాస్‌రూమ్‌లో ఉన్నాం’ అనే భావన కలిగిస్తుంది. వర్చువల్ రియాలిటీలో 20 సంవత్సరాల అనుభవం ఉన్న పుష్పక్ గత సంవత్సరం అక్టోబర్‌లో ప్రారంభించిన ‘నెక్ట్స్‌మీట్’కు మంచి స్పందన లభిస్తోంది. రియల్ టైమ్ ఇంటరాక్షన్‌ను దృష్టిలో పెట్టుకొని ఈ 3డి ప్లాట్‌ఫామ్‌కు రూపకల్పన చేశారు. ‘నెక్ట్స్‌మీట్’ తాజా వెర్షన్లో వర్చువల్ క్లాస్‌రూమ్స్, వర్చువల్ కాన్ఫరెన్స్, వర్చువల్ మీటింగ్స్, హెల్ప్‌డెస్క్, ప్రెజెంటేషన్ స్క్రీన్స్, వాకబుల్ త్రీడీ అవతార్... మొదలైన వెర్షన్లను ప్రవేశపెట్టారు. మనకు కరోనా వాసన సోక ముందుకే వర్చువల్ రియాలిటీ డ్రైవెన్ కంటెంట్‌తో చెన్నైలో మొదలైంది ‘డ్రీమ్ఎక్స్’ అనే టెక్-స్టార్టప్. ఇది ప్రధానంగా హెల్త్‌కేర్, ఎడ్యుకేషన్ రంగాలపై దృష్టి పెట్టింది. ఎడ్యుకేషన్ సెక్టర్లో వర్చువల్ ల్యాబ్స్, వర్చువల్ అండ్ ఆగ్మెంటెడ్ రియాలిటీ టూల్స్‌ను ప్రవేశపెట్టింది. స్టూడెంట్స్ ల్యాబ్ ఎక్స్పెరిమెంట్స్ కోసం సెల్ఫ్-లెర్నింగ్ పాకెట్ లైబ్రరీ, ఏఆర్ టెక్నాలజీ మ్యాగజైన్లను తీసుకువచ్చింది. వైద్యవిద్యార్థుల కోసం వీఆర్ హ్యూమన్ అనాటమీ అప్లికేషన్‌ను డెవలప్ చేసింది. విద్యార్థులు ప్రాక్టిస్ చేయడం కోసం ఏసీఎల్ఎస్ (అడ్వాన్స్డ్ కార్డియక్ లైఫ్ సపోర్ట్) లాంటి వీఆర్ సిమ్యులేటర్స్‌ను ప్రవేశపెట్టింది. ‘జూమ్’కు వీఆర్ వెర్షన్‌గా చెప్పే ‘స్పెషల్’కు అంతకంతకూ ఆదరణ పెరగుతోంది. ‘యువర్ రూమ్ ఈజ్ యువర్ మానిటర్-యువర్ హ్యాండ్స్ ఆర్ ది మౌస్’ అని నినదిస్తున్న ‘స్పెషల్’ వీఆర్, ఏఆర్‌ల సమ్మేళన వేదిక. మరోవైపు వీఆర్ బేస్డ్ సోషల్ ప్లాట్‌ఫామ్‌లు ప్రాచుర్యంలోకి వస్తున్నాయి. వీఆర్చాట్, ఆల్ట్స్పేస్వీఆర్, రెక్ రూమ్...మొదలైన వీఆర్ సోషల్ ప్లాట్‌ఫామ్స్ వర్చువల్ ఎన్విరాన్మెంట్లో స్నేహితులు లేదా అపరిచితులు చాట్ చేయడానికి, ఆటలు ఆడుకోవడానికి వేదికగా ఉన్నాయి. ఇక ‘ఫేస్బుక్ హరైజన్’ దగ్గరికి వద్దాం. ‘కేవలం వర్చువల్ ప్రపంచాన్ని శోధించడానికి మాత్రమే కాదు మీకు స్ఫూర్తిని ఇచ్చే, మీకు ఆసక్తికరమైన ఎన్నో కొత్త విషయాలతో మమేకం కావడానికి స్వాగతం పలుకుతున్నాం’ అంటోంది ఫేస్బుక్ హరైజన్. ఎక్స్ప్లోర్, ప్లే, క్రియేట్, టుగెదర్... అనే ట్యాగ్‌లైన్‌తో యువతరాన్ని ఆకట్టుకుంటున్న ‘ఫేస్బుక్ హరైజన్’ ప్రస్తుతం ఇన్విటీ వోన్లీ-బీటాగా ఉంది. కాలం మీద కాలనాగై నిలుచుంది కరోనా. అంతమాత్రాన భయంతో ఏదీ ఆగిపోదు. సాంకేతిక దన్నుతో కొత్త ప్రత్యామ్నాయాలు వస్తుంటాయి. దీనికి బలమైన ఉదాహణ వీఆర్ ట్రెండ్. పంచేంద్రియాలపై పట్టు! కోవిడ్ నేపథ్యంలో విద్యారంగలో వర్చువల్ రియాలిటీ(వీఆర్)కి ప్రాధాన్యత మరింత పెరిగిందని గణాంకాలు సూచిస్తున్నాయి. యూజర్ చూపు, వినికిడి...మొదలైన సెన్స్లపై తాజా వీఆర్ అప్లికేషన్లు కంట్రోల్ సాధించి కొత్త ప్రపంచంలోకి తీసుకువెళుతున్నాయి. రాబోయే అయిదేళ్లలో ఏఆర్(ఆగ్మెంటెడ్ రియాలిటీ), వీఆర్లు ట్రాన్స్ఫర్మెషన్ టెక్ ట్రెండ్స్‌గా ఉంటాయని నిపుణులు చెబుతున్నారు. చదవండి: Ducati: డుకాటీ నుంచి రెండు కొత్త బైకులు -
ఫేస్బుక్ మరో సంచలనం
సోషల్ మీడియా మార్కెట్ లో అగ్రగామిగా ఉన్న ఫేస్బుక్ త్వరలో మరో సంచలనం సృష్టించబోతోంది. 2019లో సిటిఆర్ఎల్-ల్యాబ్స్ స్టార్టప్ కంపెనీని ఫేస్బుక్ సొంతం చేసుకుంది. ఇప్పుడు ఈ స్టార్టప్ అభివృద్ధి చేసిన కొత్త ఆగ్మెంటెడ్ రియాలిటీ టెక్నాలజీతో పనిచేసే రిస్ట్‌బ్యాండ్ ఏ విధంగా పనిచేసేతుందో ఒక వీడియో రూపంలో వివరించింది. మానవ సూక్ష్మ నాడీ సంకేతాలతో ఎలక్ట్రోమియోగ్రఫీని ఉపయోగించే పనిచేసే రిస్ట్బ్యాండ్లను ఈ వీడియోలో చూపించింది. వర్చువల్ రూపంలో వస్తువులను జరపడం, ఎత్తడం, మెసేజ్ టైప్ చేయడం, స్వైప్ చేయడం, ఆటలు ఆడటం లేదా ఆర్చరీ సిమ్యులేటర్ వంటివి ఫేసుబుక్ త్వరలో తీసుకురాబోయే రిస్ట్‌బ్యాండ్ ద్వారా చేయవచ్చు. ఫేస్బుక్ బ్లాగ్ పోస్ట్ ప్రకారం.. ఫిజికల్ కీబోర్డులు కంటే ఎక్కువ వేగంతో ల్యాప్ లేదా టేబుల్ టాప్‌పై వర్చువల్ కీబోర్డ్‌ను ఉపయోగించి టైప్ చేయడానికి ఈ కొత్తరకం టెక్నాలజీ సహాయపడనున్నది. వీటన్నింటినీ నియంత్రించే రిస్ట్బ్యాండ్లు కూడా హాప్టిక్ ఫీడ్‌బ్యాక్‌ను కలిగి ఉంటాయి. ఇవి ఇప్పుడు ఉన్న సాధారణ స్మార్ట్ వాచ్ కంటే పది రేట్లు సమర్థవంతంగా పనిచేస్తాయని ఫేసుబుక్ పేర్కొంది. ఫేసుబుక్ రిస్ట్‌బ్యాండ్‌ల చేతికి పెట్టుకున్న తర్వాత బొటనవేలు, చూపుడు వేలిని కలిపి కీబోర్డులను, ఇతర వస్తువులను ఆపరేట్ చేయవచ్చు. రిస్ట్‌బ్యాండ్ విజువల్ సెన్సార్‌కు బదులుగా మీ చేతుల నరాల సంకేతాలను ట్రాక్ చేస్తుంది. 2020లో జరిగిన ఫేస్బుక్ కనెక్ట్ సమావేశం సందర్భంగా కొత్తగా రాబోయే ఏఆర్ స్మార్ట్ గ్లాసెస్‌ను కూడా తీసుకొస్తున్నట్లు సంస్థ ప్రకటించింది. ఈ రెండు కూడా న్యూరల్, ఏఐ, ఏఆర్ టెక్నాలజీ ఆధారంగా పనిచేయనున్నాయి. చదవండి: ఏప్రిల్‌లో బ్యాంకులకు 12 రోజులు సెలవు -
5జీతో మాట్లాడే ఏటిఎమ్ లు వచ్చేస్తున్నాయి
హైదరాబాద్: ఇప్పటి వరకు మనం సాధారణంగా నగదు ఉపసంహరించుకోవడం కోసం లేదా బ్యాంకు బ్యాలెన్స్ చెక్ చేసుకోవడం కోసం ఏటిఎమ్ దగ్గరికి వెళ్లి ఉంటాం. కానీ అదే వర్చువల్ బ్యాంక్ మేనేజర్‌తో మాట్లాడటం లేదా మీ కెవైసిని పూర్తి చేయడం కోసం ఏటిఎమ్ దగ్గరికి వెళ్తే ఎలా ఉంటుందో ఒక్కసారి ఆలోచించండి. ఇది సాధ్యం కాదు అని మీరు అనుకోవచ్చు. కానీ ఈ సైన్స్ ఫిక్షన్ ని నిజం చేయబోతుంది హైదరాబాద్ కు చెందిన ఇన్స్టిట్యూట్ ఫర్ డెవలప్మెంట్ & రీసెర్చ్ ఇన్ బ్యాంకింగ్ టెక్నాలజీ (ఐడిఆర్‌బిటి) సంస్థ.(చదవండి: వాట్సాప్‌లో కొత్త రకం మాల్వేర్!) ఆసక్తికర విషయం ఏమిటంటే, కొద్దీ రోజుల క్రితం ప్రముఖ టెలికాం ఆపరేటర్ భారతి ఎయిర్టెల్ హైదరాబాద్ నగరంలో ఒక ప్రైవేట్ నెట్వర్క్ సహాయంతో 5జీ సేవలను పరీక్షించి చూసారు. 5జీ కనెక్షన్‌తో 1జీబీ ఫైల్ డౌన్లోడ్ చేయడానికి 30 సెకన్ల మాత్రమే పట్టింది. "రాబోయే సరికొత్త టెక్నాలజీ 5జీ సహాయంతో ఎటిఎంలు ఒక బ్యాంక్ బ్రాంచ్‌గా పనిచేస్తాయి.. అలాగే ఎటిఎంలు 5జీ నెట్‌వర్క్‌లకు రిలేయింగ్ పాయింట్లుగా మారవచ్చ" అని ఐడిఆర్‌బిటి మాజీ డైరెక్టర్ ఎ.ఎస్.రామశాస్త్రి అన్నారు. ఇతని నాయకత్వంలోనే ఈ టెక్నాలజీపై ప్రయోగాలు మొదలయ్యాయి. 2022లో మాట్లాడే ఎటిఎంలు 2జీ, 3జీ లేదా 4జీ విషయానికి వస్తే భారతదేశం ఇతర దేశాలతో చాలా వెనుకబడి ఉండేది. కానీ ఇప్పుడు 5జీ టెక్నాలజీ విషయానికి వచ్చేసరికి ఇతరదేశాలతో పోటీ పడే స్థాయికి ఎదిగింది అని ఎ.ఎస్.రామశాస్త్రి అన్నారు. ఆర్బిఐ బ్యాంకింగ్, ఆర్థిక సేవల కోసం దేశంలో 5జీ సాంకేతికతను ఉపయోగించడం కోసం ప్రభుత్వం సెప్టెంబర్ 2020లో ఒక ఇన్స్టిట్యూట్ ఏర్పాటు చేసినట్లు పేర్కొన్నారు. బ్యాంకింగ్ రంగం ఈ సాంకేతికతకు ముందుగానే సిద్ధంగా ఉండాలని పరిశోధకులు, బ్యాంకర్లతో సహా 10 నుండి 12 మంది వ్యక్తుల బృందాన్ని ప్రభుత్వం ఏర్పాటు చేసినట్లు పేర్కొన్నారు. ఈ బృందం 5జీ టెక్నాలజీ ద్వారా బ్యాంకింగ్, ఆర్థిక రంగంలో రాబోయే మార్పులను ముందుగానే గ్రహించి దానికి తగ్గట్లుగా ఆగ్మెంటెడ్ రియాలిటీ, వర్చువల్ రియాలిటీ సాంకేతిక పరిజ్ఞానాన్ని అభివృద్ధి చేయడంపై దృష్టి సారించింది. ఇందులో ఎదురయ్యే సమస్యలను పరిష్కరించి దీనిని 2022 నాటికీ మార్కెట్ లో ప్రదర్శించాలని చూస్తున్నారు. ఈ 5జీ టెక్నాలజీ వల్ల ఆర్థిక రంగంలో చాలా మార్పులు సంభవిస్తాయని రామశాస్త్రి పేర్కొన్నారు. “గ్రామీణ ప్రాంతాల్లో, అధిక బ్యాండ్‌విడ్త్ లభించడం వల్ల వారు కూడా డిజిటల్ చెల్లింపుల వైపు మొగ్గుచూపుతారు. లావాదేవీల కూడా ఎటువంటి ఆటంకం లేకుండా పూర్తి చేయబడతాయి. కానీ వారు 5జీ టెక్నాలజీ ఉన్న గాడ్జెట్లు కొనగలరా లేదా బ్యాంకింగ్ ఉద్యోగులు వారి దగ్గరికి చేరువ చెయ్యాలా అని ఆలోచిస్తున్నామని" రామశాస్త్రి అన్నారు.(చదవండి: జియోపై ఎయిర్టెల్ పైచేయి) 5జీతో అవకతవకలకు అడ్డుకట్ట కొత్త సాంకేతికతలో తక్కువ జాప్యం, అధిక వేగం కారణంగా మొత్తం బ్యాంకింగ్ అనుభవాన్ని మెరుగుపరుస్తుందని వీరు భావిస్తున్నారు. 5జీతో పోలిస్తే 4జీలో ఉన్న 50 మిల్లీసెకన్ల కనీస జాప్యాన్ని ఒక మిల్లీ సెకన్లకు తగ్గించవచ్చు. డేటా వేగం 4జీ కన్నా 10 నుంచి 20రేట్లు వేగంగా ఉంటుంది. లావాదేవీల సమయంలో అంతరాన్ని మెరుగుపరచడం ద్వారా బ్యాంకింగ్ రంగం ఆర్ధిక పరిధిని మెరుగుపరచడంతో పాటు 5జీ బ్యాంకింగ్ కార్యకలాపాలను మరింత సురక్షితంగా చేస్తుంది. ఎందుకంటే సమయం ప్రాతిపదికన అవకతవకలు జరుగుతాయి. ప్రధానంగా స్టాక్ మార్కెట్ విషయంలో ఈ అవకతవకలు తగ్గించవచ్చు. 5జి టెక్నాలజీపై ఐడిఆర్‌బిటి విడుదల చేసిన శ్వేతపత్రం ప్రకారం.. 5జీ నెట్వర్క్ మిలియన్ల ఐవోటి పరికరాలను ఆపరేట్ చేయగలదు, అధిక డేటా వేగం కారణంగా మెషిన్-టు-మెషిన్(M2M) మధ్య కమ్యూనికేషన్ కూడా ప్రారంభించగలదు. ఇది ప్రస్తుత వ్యవస్థలను మరింత 'తెలివైనదిగా' చేయనుంది. కెపిఎంజి ఇండియా భాగస్వామి, డిజిటల్ కన్సల్టింగ్ హెడ్ అఖిలేష్ తుటేజా 5జీ టెక్నాలజీ సామర్థ్యాన్ని వివరించారు. ఐఒటి వాడకం, టచ్ లెస్ కారణంగా బ్యాంకింగ్‌లో చాలా మార్పులను చోటుచేసుకుంటాయి. 5జీ టెక్నాలజీ ఎటిఎంలు, బ్యాంక్ శాఖలు, పిఒఎస్లను ప్రభావితం చేయనున్నట్లు తెలిపారు. 2025 నాటికి 5జి టెక్నాలజీ ఆధారంగా పనిచేసే గాడ్జెట్లు ఎక్కువ సంఖ్యలో రాబోతున్నాయి అని ఆయన అన్నారు. కోవిడ్ -19, డీమోనిటైజేషన్ కారణంగా మొబైల్ బ్యాంకింగ్, డిజిటల్ చెల్లింపులు విపరీతంగా పెరిగినట్లు పేర్కొన్నారు. అన్నిటికంటే ముందు ఆర్థిక సేవ రంగంలో కస్టమర్ ఆన్‌బోర్డింగ్ ప్రక్రియ చాలా కీలకమైనదిగా పేర్కొన్నారు. -
గూగుల్ పాలీ సేవలు ఇక బంద్
ఏఆర్, వీఆర్ యానిమేషన్ డెవలపర్స్‌కి గూగుల్ షాకిచ్చింది. వర్చువల్ మరియు ఆగ్మెంటెడ్ రియాలిటీ ప్రాజెక్టులలో ఉపయోగించగల ఉచిత 3డీ యానిమేషన్ ఇమేజెస్ ను గూగుల్ పాలీ వెబ్సైట్ ద్వారా అందించేది. గూగుల్ గత మూడు సంవత్సరాలుగా 3డీ మోడల్ షేరింగ్ వెబ్సైట్ పాలీని నిర్వహిస్తుందని అనే విషయం ఎక్కువ శాతం మందికి తెలియకపోవచ్చు. వచ్చే ఏడాది పాలీ వెబ్సైట్ ని మూసివేస్తున్నట్లు గూగుల్ ప్రకటించింది. ఏప్రిల్ 30, 2021 నుండి పాలీ మూసివేయబడుతుంది. అప్పటి నుండి సైట్ ఇకపై క్రొత్త కంటెంట్‌ను అప్లోడ్ చేయడానికి వినియోగదారులను అనుమతించదు. జూన్ 30 నుండి పూర్తిగా నిలిపివేయబడుతుంది గూగుల్ తెలిపింది. 2021 జూన్ 30 తేదీలోపు పాలీ వెబ్సైట్లో ఉన్న తమ కంటెంట్ మొత్తాన్ని గూగుల్ టేక్అవుట్ ద్వారా డౌన్లోడ్ చేసుకోవాలని సూచించింది.(చదవండి: వాట్సాప్ యూజర్లకు షాకింగ్ న్యూస్) ‘‘ఈ ప్రయాణంలో మాతో పాటు నడిచిన ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు. మీకు అవసరమైన సేవలను అందించేందుకు పాలీ సరైన వేదికని నమ్మి మాపై విశ్వాసాన్ని ఉంచినందుకు కృతజ్ఞతలు. మీ సృజనాత్మకతను ఎంతో వినయంగా మాతో పంచుకున్నందుకు మేంఎంతో ఆనందిస్తున్నాం. ఇది మమ్మల్ని ఎంతో ఆశ్చార్యానికి, కొత్త అనుభూతికి గురిచేసింది ’’ అని గూగుల్ యూజర్స్‌కి పంపిన మెయిల్లో పేర్కొంది. కానీ, గూగుల్ ఎందుకు పాలీ సేవలను నిలిపివేస్తుందో తెలియజేయలేదు. -
హైదరాబాద్‌లో సీజీఎస్ నూతన కార్యాలయం
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: అమెరికాకు చెందిన సాంకేతిక రంగ కంపెనీ కంప్యూటర్ జనరేటెడ్ సొల్యూషన్స్ (సీజీఎస్) హైదరాబాద్‌లో నూతన కార్యాలయాన్ని ప్రారంభించింది. ప్రస్తుతం 500 మంది ఉద్యోగులున్నారు. ఏడాదిన్నరలో 800 మందికి, ఐదేళ్లలో 2 వేల మంది ఉద్యోగులను నియమించుకుంటామని ప్రెసిడెంట్ అండ్ సీఈఓ ఫిలిప్ ఫ్రైడ్మన్ తెలిపారు. త్వరలోనే ఈ సెంటర్లో సైబర్ సెక్యూరిటీ ఆపరేషన్ సెంటర్ (సీఎస్‌ఓఎస్)ను కూడా నెలకొల్పుతామని.. ఇందులో ఆగ్యుమేటెడ్ రియాలిటీ (ఏఐ) ఆధారిత సేవలందిస్తామని పేర్కొన్నారు. తెలంగాణ ఐటీ అండ్ ఇండస్ట్రీస్ ప్రిన్సిపల్ సెక్రటరీ జయేష్ రంజన్, సైయంట్ ఎగ్జిక్యూటివ్ చైర్మన్ బీవీఆర్ మోహన్ రెడ్డి, యూఎస్ కాన్సులేట్ జనరల్ జోయిల్ రీఫ్‌మన్, సీజీఎస్ ప్రెసిడెంట్ అండ్ సీఈఓ ఫిలిప్ ఫ్రైడ్మన్, సీజీఎస్ ఇండియా ఎండీ జీతు భట్టు గురువారం సీజీఎస్ హైదరాబాద్ నూతన కార్యాలయాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రస్తుతం ఈ సెంటర్ నుంచి మా కస్టమర్లకు ఆర్ అండ్ డీ, అప్లికేషన్ డెవలప్మెంట్, కస్టమర్‌కేర్ సెంటర్ సేవలను అందిస్తున్నామని, మైక్రో సాఫ్ట్, ఐబీఎం, డెల్, ఏటీఅండ్‌టీ, అవయ, తోషిబా, రెమాండ్స్ వంటి కంపెనీలు మా కస్టమర్లుగా ఉన్నారని పేర్కొన్నారు. దేశంలోని టాప్ టెక్నాలజీ కంపెనీ కాల్‌సెంటర్‌ను ఈ సెంటర్ నుంచే నిర్వహిస్తున్నామని చెప్పారు. సీజీఎస్ గ్లోబల్‌కు యూఎ స్, యూకే, కెనడా, ఇజ్రాయిల్, రొమానియా, దక్షిణాఫ్రికా వంటి దేశాల్లో కార్యాలయాలున్నాయి. 45 దేశాల్లో ఫ్యాషన్, అపెరల్, ఈ– కామర్స్, హెల్త్‌కేర్, రిటైల్ వంటి పరిశ్రమలకు ఎంటర్ప్రైజెస్ సొల్యూ షన్స్‌ను అందిస్తుంది. ప్రస్తు తం 8 వేల మంది ఉద్యోగులన్నారని.. ఈ ఏడాది ముగింపు నాటికి 10 వేల మందికి చేరుకుంటామని తెలిపారు. -
ఫేస్బుక్ ద్వారా మేకప్ ట్రై చేయండి..
మేకప్ లేకుండా ఈ కాలం యువత బయటికి వెళ్లడం చాలా అరుదు. చాలా మంది మేకప్ ఎలా వేసుకోవాలో తెలియక ఇబ్బందులు పడుతూ ఉంటారు. ఇక నుంచి ఫేస్బుక్ ద్వారా మేకప్‌ను ట్రై చేయొచ్చట. దీని కోసం ప్రముఖ సౌందర్య ఉత్పత్తుల సంస్థ లోరియల్, ఫేస్‌బుక్‌తో జతకట్టింది. అగ్మెంటెడ్ రియాల్టీ మేకప్ అనుభవాన్ని ప్రజలకు అందించడానికి లోరియల్, సోషల్ మీడియా దిగ్గజంతో భాగస్వామ్యం ఏర్పరుచుకున్నట్టు తెలిసింది. మోడీఫేస్ ద్వారా గ్లోబల్ కాస్మోటిక్ దిగ్గజం లోరియల్, ఫేస్‌బుక్‌తో కలిసి పనిచేయనుంది. మేబెల్లిన్, లోరియల్ పారిస్, ఎన్వైఎక్స్ ప్రొఫెషనల్ మేకప్, లాంకమ్, జార్జియో అర్మానీ, వైవ్స్ సెయింట్ లారెంట్, అర్బన్ డికే, షు ఉమూరా వంటి లోరియల్ ఉన్నతమైన బ్రాండ్లను వర్చువల్‌గా ట్రై చేసే అవకాశాన్ని ఫేస్బుక్ యూజర్లకు మోడీఫేస్ ఆఫర్ చేస్తుంది. ఈ నెల చివరి నుంచి ఈ ప్రాజెక్ట్ అమల్లోకి వస్తుందని తెలుస్తోంది. మీ ఫోటోను ఫేస్బుక్లో పోస్టు చేయాలి. ఆ అనంతరం బ్యూటీ ఉత్పత్తులతో, యాక్ససరీస్‌తో సైట్లోనే పలు షేడ్స్‌లో ట్రై చేసుకోవచ్చు. ఫేస్‌బుక్‌తో తాము దీర్ఘకాల భాగస్వామ్యాన్ని ఏర్పరుచుకోవడానికి ఇదొక కొత్త అడుగు అని లోరియల్ చీఫ్ డిజిటల్ ఆఫీసర్ లుబోమిరా రోచెట్ చెప్పారు. గత ఏడాది కాలంగా వర్చువల్ రియాల్టీ, అగ్మెంటెడ్ రియాల్టీ టెక్నాలజీలు బ్యూటీ పరిశ్రమలో ప్రముఖ పాత్ర పోషిస్తున్నాయని లోరియల్ చెప్పింది. -
ఆఫ్‌లైన్ స్టోర్‌ను మొబైల్లో చూసేయొచ్చు!
♦ రిటైల్ సంస్థలకు ఆగ్మెంటెడ్ రియాలిటీ సేవలు ♦ ఏఆర్‌లో ప్రపంచంలోనే తొలిసారి ‘ప్రేక్ష్’కు 2 పేటెంట్లు ♦ మిలియన్ డాలర్ల నిధుల సమీకరణపై దృష్టి ♦ ప్రేక్ష్ ఇన్నోవేషన్స్ కో-ఫౌండర్ సైకత్ సిన్హా హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: ఆన్లైన్, ఆఫ్‌లైన్... షాపింగ్‌లో ఈ రెండింటికీ ఉన్న ప్రధాన తేడా టచ్ అండ్ ఫీల్ మాత్రమే. దీన్ని ఆన్లైన్ షాపింగ్‌కు కూడా అన్వయిస్తే!! అంటే కంప్యూటర్ నుంచో... చేతిలోని సెల్‌ఫోన్ నుంచో నేరుగా స్టోరంతా చూస్తూ నచ్చిన వస్తువును ఎంచుకునే వీలుంటే...!! నిజానికి ‘ప్రేక్ష్ ఇన్నోవేషన్’ సంస్థ దీన్ని కూడా అందుబాటులోకి తెచ్చేసింది. ప్రపంచంలో రిటైల్ స్టోర్లకు ఆగ్మెంటెడ్ రియాలిటీ (ఏఆర్) సేవలందిస్తున్న ఏకైక సంస్థ ప్రేక్ష్ సేవల గురించి సంస్థ కో-ఫౌండర్ సైకత్ సిన్హా ‘సాక్షి స్టార్టప్ డైరీ’కి వివరించారు. ఆ వివరాలు ఇవీ... ‘‘నా స్నేహితులు ఎం.ఎ.కోదండరామ, సాత్విక్ మురళీధర్, శరత్‌లతో కలసి బెంగళూరు కేంద్రంగా గతేడాది జూన్‌లో ప్రేక్ష్ ఇన్నోవేషన్ సంస్థను ప్రారంభించాం. 9 నెలల పాటు టెక్నాలజీ, సాఫ్ట్వేర్ అభివృద్ధి కోసం శ్రమించాం. సుమారు కోటి రూపాయల పైనే పెట్టుబడి పెట్టాం. మా సంస్థ గురించి ఒక్క ముక్కలో చెప్పాలంటే... ఆఫ్‌లైన్ షాప్‌ను ఆన్లైన్లో మీ కళ్లముందు ఉంచుతాం. ప్రపంచంలోనే రిటైల్ రంగంలో ఏఆర్ సొల్యూషన్స్‌లో రెండు పేటెంట్లను దక్కించుకున్నది మేం మాత్రమే. చ.అ.ను బట్టి చార్జీలు.. షాప్ విస్తీర్ణం, వినియోగించే ఉత్పత్తులను బట్టి ఆఫ్‌లైన్ సంస్థల నుంచి ఛార్జీలు వసూలు చేస్తాం. చదరపు అడుగుకు ప్రారంభ ధర రూ.10. ఉదాహరణకు మీకు 1,000 చ.అ.ల్లో ఫర్నిచర్ షాపు ఉందనుకుందాం. ముందుగా ఫోటో షూట్ కోసం రూ.10 వేలు, ఆ తర్వాత సబ్స్క్రిప్షన్ కింద నెలకు రూ.25 వేలు చెల్లించాల్సి ఉంటుంది. ఆపైన ప్రతి కొనుగోలుపై కొంత కమీషన్ ఉంటుంది. అది ఉత్పత్తిని బట్టి 1 శాతం నుంచి మొదలవుతుంది. రిటైల్ చెయిన్స్ కస్టమర్లు.. ప్రస్తుతం వాల్‌మార్ట్, వ్యాన్హ్యూసెన్, మహీంద్రా అండ్ మహీంద్రా, బేబీ ఓయ్, వర్ణం, డెకోవిల్లా, మాయా ఆర్గానిక్, ఫ్యాబ్హోమ్, డ్యాష్స్క్వేర్.. వంటి కంపెనీలు మా కస్టమర్లుగా ఉన్నాయి. ప్రేక్ష్ను వినియోగించుకోవాలంటే ముందుగా సంబంధిత రిటైల్ సంస్థ సైట్లోకి వెళ్లాలి. అక్కడ వర్చువల్ స్టోర్ అనేది కనిపిస్తుంది. దాని మీద క్లిక్ చేయగానే మీకు కావాల్సిన ఉత్పత్తులను వర్చువల్ రియాల్టిలో నుంచి నేరుగా షాపులో తిరుగుతూ చూసినట్టుగా చూసుకోవచ్చు. కావాలంటే అక్కడి నుంచే కొనుగోలు చేయవచ్చు కూడా. ప్రేక్ష్ ఏఆర్ సేవల వల్ల ఆఫ్‌లైన్ స్టోర్లకు ఐడెంటిటీ వస్తుంది. బ్రాండింగ్ కూడా పెరుగుతుంది. అది కూడా ఎలాంటి విస్తరణ పెట్టుబడి అవసరం లేకుండానే. ఉదాహరణకు హైదరాబాద్‌లో ఉండే ఓ రిటైల్ చైన్ సంస్థ.. బెంగళూరుకు విస్తరించాలంటే స్టోర్ నిర్మాణం, స్థల సేకరణ, అనుమతులు వంటి వాటి కోసం పెద్ద మొత్తంలోనే పెట్టుబడి పెట్టాలి. పెపైచ్చు స్థానిక వర్తకుల నుంచి పోటీ ఎదుర్కోవాల్సి ఉంటుంది. కానీ, ప్రేక్ష్ ఏఆర్‌తో ఇవేవీ అవసరం లేకుండానే నేరుగా ఒకే స్టోర్ నుంచి ఆన్లైన్ ద్వారా దేశంలోని ఏ స్టోర్ లోని ఉత్పత్తులనైనా విక్రయించుకునే వీలుంటుంది. అంటే విస్తరణ నిమిత్తం చేసే పెట్టుబడంతా మిగిలినట్టేగా. మిలియన్ డాలర్ల నిధుల సమీకరణ.. టార్గెట్ ఇండియా అనే సంస్థ రిటైల్ పరిశ్రమలో నిర్వహించిన యాక్సలరేటర్ ప్రోగ్రాంలో దేశంలోని ఐదు ఉత్తమమైన స్టార్టప్‌లను ఎంపిక చేసింది. ఇందులో ప్రేక్ష్ ఒకటి. మిగతా నాలుగు మింట్ఎం, ఆన్క్యానీ విజన్, లేచల్, లాబోట్. ఈ నాలుగు స్టార్టప్‌లు 1.20 లక్షల డాలర్లు గెలుపొందాయి. ప్రస్తుతం మా సంస్థలో 20 మంది ఉద్యోగులున్నారు. ఈ ఏడాది ముగిసే నాటికి విమానాశ్రయాలు, హై ఎండ్ ఫ్యాషన్ స్టోర్స్, ఎడ్యుకేషన్ ఇనిస్టిట్యూట్లు, ఆతిథ్య రంగాలతో పాటూ ఆగ్నేయాసియా, నార్త్ అమెరికా దేశాలకూ విస్తరించాలని నిర్ణయించాం. ఇందుకోసం తొలిసారిగా నిధుల సమీకరణ చేస్తున్నాం. పలువురు ప్రైవేట్ ఇన్వెస్టర్లతో మాట్లాడుతున్నాం. మరో రెండు మూడు నెలల్లో సుమారు మిలియన్ డాలర్ల నిధులను సమీకరిస్తాం. అద్భుతమైన స్టార్టప్‌ల గురించి అందరికీ తెలియజేయాలనుకుంటే startups@sakshi.com కు మెయిల్ చేయండి...