స్మార్ట్‌ఫోన్..మన జీవితంలో ఒక భాగమైపోయింది. స్మార్ట్‌ఫోన్ లేకుండా ఒక క్షణం కూడా ఉండలేము. కాగా ప్రస్తుతం టెక్ దిగ్గజం యాపిల్ పనిచేస్తోన్న సరికొత్త టెక్నాలజీతో రాబోయే రోజుల్లో స్మార్ట్‌ఫోన్లకు ఎండ్ కార్డ్ పడే అవకాశం ఉందని నిపుణులు భావిస్తున్నారు.
ఐఫోన్ల స్థానంలో ఏఆర్ హెడ్‌సెట్..!
ఐఫోన్ 12 ప్రొతో లైడర్ టెక్నాలజీను యాపిల్ ఆవిష్కరించిన విషయం తెలిసిందే. దీంతో అగ్యుమెంటేగ్ రియాల్టీలో యాపిల్ ఒక అడుగు ముందుకేసింది. కాగా వచ్చే పదేళ్లలో ప్రపంచవ్యాప్తంగా ఐఫోన్లను పవర్‌ఫుల్ అగ్యుమెంటేడ్ రియాల్టీ హెడ్‌సెట్స్ రిప్లేస్ చేయనున్నట్లు తెలుస్తోంది. ఈ పవర్‌ఫుల్ హెడ్‌సెట్లను యాపిల్ 2022 చివరలో రిలీజ్ చేయనుంది.
మ్యాక్ బుక్ వలె శక్తివంతమైనవిగా ఏఆర్ హెడ్‌సెట్ నిలిచే అవకాశం ఉందని యాపిల్ విశ్లేషకుడు మింగ్ చి కువో అభిప్రాయపడ్డారు. మ్యాక్ బుక్స్‌లోని ‘ఎమ్1’ పవర్‌ఫుల్ ప్రాసెసర్లను ఏఆర్ హెడ్‌సెట్లలో వినియోగించనున్నట్లు తెలుస్తోంది. దీంతో అత్యంత శక్తివంతమైన గాడ్జెట్స్‌గా ఏఆర్ హెడ్‌సెట్స్ నిలవనున్నాయి.
స్మార్ట్‌ఫోన్లకు ది ఎండ్..!
యాపిల్ లాంచ్ చేయనున్న హెడ్‌సెట్స్ అగ్యుమెంటెడ్, వర్చువల్ రియాల్టీలను సపోర్ట్ చేయనున్నాయి. ఈ ఏఆర్ హెడ్‌సెట్స్ అత్యంత శక్తివంతమైన ప్రాసెసింగ్ సామర్థ్యాన్ని కలిగి ఉంది. ఈ టెక్నాలజీతో రానున్న రోజుల్లో ఐఫోన్లనే కాకుండా స్మార్ట్‌ఫోన్లను రిప్లేస్ చేసే అవకాశం లేకపోలేదని మింగ్ చి కువో అభిప్రాయపడ్డారు. యాపిల్‌తో పాటుగా ఇతర స్మార్ట్‌ఫోన్ కంపెనీలు కూడా ఏఆర్ హెడ్‌సెట్స్‌ను రూపొందించే అవకాశం ఉందని మింగ్ పేర్కొన్నారు.
చదవండి: బిజీ సీజన్‌లో 97 కోట్ల నష్టం.. అయినా చిరునవ్వు, నువ్వు సూపర్ బాసు
Comments
Please login to add a commentAdd a comment