ఏఆర్, వీఆర్ యానిమేషన్ డెవలపర్స్‌కి గూగుల్ షాకిచ్చింది. వర్చువల్ మరియు ఆగ్మెంటెడ్ రియాలిటీ ప్రాజెక్టులలో ఉపయోగించగల ఉచిత 3డీ యానిమేషన్ ఇమేజెస్ ను గూగుల్ పాలీ వెబ్‌సైట్ ద్వారా అందించేది. గూగుల్ గత మూడు సంవత్సరాలుగా 3డీ మోడల్ షేరింగ్ వెబ్‌సైట్ పాలీని నిర్వహిస్తుందని అనే విషయం ఎక్కువ శాతం మందికి తెలియకపోవచ్చు. వచ్చే ఏడాది పాలీ వెబ్‌సైట్ ని మూసివేస్తున్నట్లు గూగుల్ ప్రకటించింది. ఏప్రిల్ 30, 2021 నుండి పాలీ మూసివేయబడుతుంది. అప్పటి నుండి సైట్ ఇకపై క్రొత్త కంటెంట్‌ను అప్‌లోడ్ చేయడానికి వినియోగదారులను అనుమతించదు. జూన్ 30 నుండి పూర్తిగా నిలిపివేయబడుతుంది గూగుల్ తెలిపింది. 2021 జూన్ 30 తేదీలోపు పాలీ వెబ్‌సైట్‌లో ఉన్న తమ కంటెంట్ మొత్తాన్ని గూగుల్ టేక్‌అవుట్ ద్వారా డౌన్‌లోడ్ చేసుకోవాలని సూచించింది.(చదవండి: వాట్సాప్ యూజర్లకు షాకింగ్ న్యూస్)
‘‘ఈ ప్రయాణంలో మాతో పాటు నడిచిన ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు. మీకు అవసరమైన సేవలను అందించేందుకు పాలీ సరైన వేదికని నమ్మి మాపై విశ్వాసాన్ని ఉంచినందుకు కృతజ్ఞతలు. మీ సృజనాత్మకతను ఎంతో వినయంగా మాతో పంచుకున్నందుకు మేంఎంతో ఆనందిస్తున్నాం. ఇది మమ్మల్ని ఎంతో ఆశ్చార్యానికి, కొత్త అనుభూతికి గురిచేసింది ’’ అని గూగుల్ యూజర్స్‌కి పంపిన మెయిల్‌లో పేర్కొంది. కానీ, గూగుల్ ఎందుకు పాలీ సేవలను నిలిపివేస్తుందో తెలియజేయలేదు.
Comments
Please login to add a commentAdd a comment