Metaverse Dangerous Than Social Media: అఫ్‌కోర్స్.. కొత్తగా ఎలాంటి టెక్నాలజీ వచ్చినా నిపుణులు కొందరు ముందుగా చెప్పే మాట ఇదే. మెటావర్స్ విషయంలోనూ ఇప్పుడు ఇలాంటి అభిప్రాయమే వ్యక్తమవుతోంది. వర్చువల్‌రియాలిటీ (VR), అగుమెంటెడ్ రియాలిటీల(AR)ల సంకరణ కలయికగా రాబోతున్న ‘మెటావర్స్’ గురించి ఇప్పటి నుంచే విపరీతమైన చర్చ నడుస్తోంది. పైగా వర్చువల్ టెక్నాలజీపై టెక్ దిగ్గజాలు భారీగా ఖర్చు చేస్తుండడంతో.. సమీప భవిష్యత్తు మెటావర్స్‌దేనని అంచనాలు నెలకొన్నాయి. ఈ క్రమంలో ఫేస్‌బుక్ ముందడుగు వేసి కంపెనీ పేరునే ‘మెటా’గా మార్చేసుకోవడం తెలిసిందే.
అయితే మెటావర్స్ అనేది సోషల్ మీడియా కంటే ప్రమాదకరమని అంటున్నారు అమెరికన్ కంప్యూటర్ సైంటిస్ట్ లూయిస్ రోసెన్‌బర్గ్. ఈయన ఎవరో కాదు.. ఫస్ట్ ఫిక్షనల్ ఏఆర్ (అగుమెంటెడ్ రియాలిటీ) వ్యవస్థను డెవలప్ చేసింది ఈయనే. సోషల్ మీడియా అనేది మన కళ్లకు కనిపించే వాస్తవాల్ని జల్లెడ పడుతుంది, మనం చూసే విధానాన్ని తప్పుదోవ పట్టిస్తుంది. కానీ, మెటావర్స్ అలాకాదు. సమూలంగా వాస్తవికతనే లేకుండా చేసే ప్రమాదం ఉంది. అంటే వాస్తవ ప్రపంచాన్నే మనిషికి దూరం చేస్తుందన్నమాట. ఈ సిద్ధాంతాన్ని అనుసరించి.. మెటావర్స్ మనిషికి మరింత ప్రమాదకరంగా మారే అవకాశం ఉందన్న అభిప్రాయం వ్యక్తం చేశారాయన.
మెటావర్స్ అనేది ఒక సామాజిక, 3డీ వర్చువల్ ప్రపంచం. ఇక్కడ వ్యక్తిగతంగా కలిసి ఉండలేకపోయినప్పటికీ, ఇతర వ్యక్తులతో అద్భుతమైన అనుభవాలను పంచుకోవచ్చు. భౌతిక ప్రపంచంలో చేయలేని పనులను కలిసి చేయవచ్చు. ఇక 1992లో లూయిస్ రోజెన్‌బర్గ్ మొట్టమొదటి ఏఆర్ వ్యవస్థను అమెరికా వాయు సేన పైలట్ల శిక్షణ కోసం తయారు చేశాడు.
చదవండి: జుకర్ బర్గ్‌పై మరో పిడుగు..!ఈ సారి మైక్రోసాఫ్ట్ రూపంలో..!
Comments
Please login to add a commentAdd a comment