న్యూఢిల్లీ: భారత సంతతికి చెందిన అమెరికన్ గాయని, వ్యాపారవేత్త చంద్రికా టాండన్ గ్రామీ అవార్డు గెలుచుకున్నారు. బెస్ట్ న్యూ ఏజ్ కేటగిరీలో చంద్రిక రూపొందించిన ఆల్బం ‘త్రివేణి’తో ఆమెకీ గుర్తింపు దక్కింది. లాస్ ఏంజెలెస్‌లోని క్రిప్టో డాట్ కామ్ అరెనాలో ఆదివారం గ్రామీ 67వ ఎడిషన్ ఉత్సవం జరిగింది. ‘ఈ గుర్తింపుతో సంగీతమంటే ప్రేమ అనే విషయం మరోసారి రుజువైంది. సంగీతం మనందరి జీవితాల్లో వెలుగులు ప్రసరింపజేస్తుంది.
విషాద వేళల్లోనూ సంతోషాన్ని, ఆనందాన్ని నింపుతుంది’అని ఆమె ఇన్‌స్టాలో పేర్కొన్నారు. చంద్రికా టాండన్ ప్రముఖ బిజినెస్ లీడర్, పెప్సికో సీఈవో ఇంద్రా నూయీకి స్వయానా తోబుట్టువు కావడం విశేషం. చెన్నైలో పుట్టిపెరిగిన చంద్రికా టాండన్ 2009లో ‘సౌల్ కాల్’అనే ఆల్బమ్‌కుగాను మొట్టమొదటి గ్రామీ గెలుచుకున్నారు. చంద్రికా టాండన్, కెల్లర్‌మన్, మట్సుమొటోలతో కలిసి రూపొందించిన త్రివేణి ఆల్బమ్ 2024 ఆగస్ట్‌లో విడుదలైంది.
Comments
Please login to add a commentAdd a comment