Indian-American
-
నాన్సీపై సైకత్ పోటీ
వాషింగ్టన్: అమెరికా హౌస్ మాజీ స్పీకర్, 21వసారి కాంగ్రెస్‌కు పోటీ పడుతున్న నాన్సీ పెలోసీ(85)కి భారత సంతతికి చెందిన యువ రాజకీయ నేత నుంచి అనూహ్యంగా గట్టి పోటీ ఎదురవనుంది. శాన్ఫ్రాన్సిస్కో కంగ్రెషనల్ స్థానానికి డెమోక్రాటిక్ పార్టీ తరఫున పెలోసీపై పోటీ చేయనున్నట్లు సైకత్ చక్రవర్తి ప్రకటించారు. పురుషాధిక్యత కలిగిన అమెరికా రాజకీయాల్లో దాదాపు నాలుగు దశాబ్దాలుగా తిరుగులేని నాయకురాలిగా పెలోసీ కొనసాగుతున్నారు. 2026 నవంబర్‌లో జరిగే ఎన్నికకు మళ్లీ ఎన్నికయ్యేందుకు ఆమె ఇప్పటికే ప్రయత్నాలు ప్రారంభించారు. అయితే, ఆమె ఈ విషయాన్ని బహిరంగంగా ప్రకటించలేదు. ప్రతినిధుల సభలో సభ్యురాలిగా 2027 జనవరి వరకు పెలోసీ కొనసాగుతారు. ఈ పదవికి 2026 నవంబర్‌లో ఎన్నిక జరగనుంది. అదే సమయంలో డెమోక్రాటిక్ ప్రైమరీకి 2026 ఆరంభంలో ఎన్నిక నిర్వహిస్తారు.శాన్ఫ్రాన్సిస్కో డెమోక్రాట్లకు కంచుకోట వంటిది. ప్రైమరీలో గెలుపొందిన వారే భవిష్యత్తులో ప్రతినిధుల సభకు ఎన్నికయ్యే అవకాశాలెక్కువ. ‘నాన్సీ పెలోసీ మరోసారి పోటీ చేయనున్నారని తెలిస్తే చాలా మంది ఆశ్చర్యపోవడం ఖాయం. కానీ, ఇది ఆమెకు 21వ సారి. 45 ఏళ్ల క్రితం ఆమె రాజకీయాల్లోకి ప్రవేశించినప్పటి అమెరికాకు ఇప్పటికి ఎంతో తేడా ఉంది. డెమోక్రాటిక్ పార్టీ కొత్త నాయకత్వాన్ని కోరుకుంటోందన్నది సుస్పష్టం. అధ్యక్షుడు ట్రంప్, ఎలాన్ మస్క్ ల పాలన చూసి ప్రజలు ప్రత్నామ్నాయం కోరుకుంటున్నారు. అందుకే నాన్సీ పెలోసీపై ఈసారి బరిలోకి దిగాలనుకుంటున్నా’అని సైకత్ గురువారం ‘ఎక్స్’లో పేర్కొన్నారు. పెద్దపెద్ద దాతలిచ్చే విరాళాల కంటే ఓటర్లతో మమేకం అయ్యేందుకు కృషి చేస్తానన్నారు. ఎవరీ సైకత్ చక్రవర్తి? 1986లో టెక్సాస్‌లో బెంగాలీ కుటుంబంలో జని్మంచిన సైకత్ హార్వర్డ్ యూనివర్సిటీ నుంచి 2007లో కంప్యూటర్ సైన్స్ డిగ్రీ చేశారు. సాఫ్ట్వేర్ ఇంజినీర్‌గా సిలికాన్ వ్యాలీలో కొంతకాలం పనిచేశారు. 2015లో సెనేటర్ బెర్నీ శాండర్స్ అధ్యక్ష ప్రచార కమిటీలో సేవలందించారు. దీంతోపాటు రాజకీయ సలహాదారుగా డెమోక్రాటిక్ పారీ్టకి చెందిన అలెగ్జాండ్రియా ఒకాసియో– కార్టెజ్‌కు చీఫ్ ఆఫ్ స్టాఫ్‌గా గతంలో వ్యవహరించారు. 2018లో కాంగ్రెస్‌కు పిన్న వయస్సులోనే గెలిచిన మహిళగా ఆమె చరిత్ర సృష్టించారు. ఆమె గెలుపులో సైకత్ కీలకంగా ఉన్నారు. శాన్ఫ్రాన్సిస్కో నుంచి నాలుగు దశాబ్దాలుగా ప్రాతినిథ్యం వహిస్తున్న నాన్సీ వయోభారంతోపాటు ఆరోగ్య సమస్యలు వెన్నాడుతున్నాయి. ఈ నేపథ్యంలో యువ రాజకీయ కెరటం సైకత్ రంగ ప్రవేశం నాన్సీ పెలోసీపై ఒత్తిడి పెంచనుంది.అమెరికా చరిత్రలోనే హౌస్ స్పీకర్‌గా ఎన్నికైన తొలి మహిళ నాన్సీ పెలోసీ. కాంగ్రెస్ ప్రతినిధిగా సుదీర్ఘకాలంలో ఎందరో అధ్యక్షులు తీసుకువచి్చన చట్టాలకు మద్దతివ్వడం లేదా తిరస్కరించడంలో ఎంతో కీలకంగా వ్యవహరించారు. అమెరికా అధ్యక్ష ఉపాధ్యక్షుల తర్వాత మూడో శక్తివంతమైన పదవి హౌస్ స్పీకర్. -
చంద్రికకు గ్రామీ
న్యూఢిల్లీ: భారత సంతతికి చెందిన అమెరికన్ గాయని, వ్యాపారవేత్త చంద్రికా టాండన్ గ్రామీ అవార్డు గెలుచుకున్నారు. బెస్ట్ న్యూ ఏజ్ కేటగిరీలో చంద్రిక రూపొందించిన ఆల్బం ‘త్రివేణి’తో ఆమెకీ గుర్తింపు దక్కింది. లాస్ ఏంజెలెస్‌లోని క్రిప్టో డాట్ కామ్ అరెనాలో ఆదివారం గ్రామీ 67వ ఎడిషన్ ఉత్సవం జరిగింది. ‘ఈ గుర్తింపుతో సంగీతమంటే ప్రేమ అనే విషయం మరోసారి రుజువైంది. సంగీతం మనందరి జీవితాల్లో వెలుగులు ప్రసరింపజేస్తుంది. విషాద వేళల్లోనూ సంతోషాన్ని, ఆనందాన్ని నింపుతుంది’అని ఆమె ఇన్‌స్టాలో పేర్కొన్నారు. చంద్రికా టాండన్ ప్రముఖ బిజినెస్ లీడర్, పెప్సికో సీఈవో ఇంద్రా నూయీకి స్వయానా తోబుట్టువు కావడం విశేషం. చెన్నైలో పుట్టిపెరిగిన చంద్రికా టాండన్ 2009లో ‘సౌల్ కాల్’అనే ఆల్బమ్‌కుగాను మొట్టమొదటి గ్రామీ గెలుచుకున్నారు. చంద్రికా టాండన్, కెల్లర్మన్, మట్సుమొటోలతో కలిసి రూపొందించిన త్రివేణి ఆల్బమ్ 2024 ఆగస్ట్‌లో విడుదలైంది. -
వైట్ హౌస్ డిప్యూటీ ప్రెస్ సెక్రటరీగా కుష్ దేశాయ్
వాషింగ్టన్: అమెరికా అధ్యక్ష భవనం వైట్ హౌస్ డిప్యూటీ ప్రెస్ సెక్రటరీగా భారత సంతతికి చెందిన కుష్ దేశాయ్‌ని అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ నియమించారు. ఈ మేరకు శుక్రవారం వైట్‌హౌస్ ఒక ప్రకటన చేసింది. కుష్ గతంలో, అయోవా రిపబ్లికన్ పార్టీ కమ్యూనికేషన్స్ డైరెక్టర్‌గాను ,2024 రిపబ్లికన్ నేషనల్ కన్వెన్షన్‌కు డిప్యూటీ కమ్యూనికేషన్స్ డైరెక్టర్‌గాను బాధ్యతలు నిర్వర్తించారు. పెన్సిల్వేనియా వంటి కీలక రాష్ట్రాలకు ఎన్నికల సమయంలో రిపబ్లికన్ పార్టీ తరఫున కమ్యూనికేషన్స్ డైరెక్టర్‌గా పనిచేశారు. ఈయన సారథ్యం వహించిన ఏడు రాష్ట్రాల్లో ట్రంప్ ఘన విజయం సాధించడం గమనార్హం. వైట్ హౌస్ కమ్యూనికేషన్స్ వ్యవహారాలను డిప్యూటీ వైట్ హౌస్ చీఫ్ ఆఫ్ స్టాఫ్, కేబినెట్ సెక్రటరీ టేలర్ బుడోవిక్ చూస్తున్నారు.వైట్ హౌస్ ప్రెస్ సెక్రటరీగా కరోలిన్ లీవిట్ ఇప్పటికే నియమితులయ్యారు. -
అమెరికా ఏఐ సలహాదారుగా శ్రీరామ్ కృష్ణన్
వాషింగ్టన్: భారత సంతతికి చెందిన అమెరికన్ పారిశ్రామికవేత్త, మస్క్ సహాయకుడు శ్రీరామ్ కృష్ణన్ వైట్‌హౌస్ బృందంలో చేరారు. మైక్రోసాఫ్ట్ మాజీ ఉద్యోగి అయిన శ్రీరామ్ కృష్ణన్‌ను ఆఫీస్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ పాలసీలో కృత్రిమ మేధ విధానాలపై సీనియర్ సలహాదారుగా నియమిస్తున్నట్లు అమెరికా అధ్యక్షుడిగా ఎన్నికైన డోనాల్డ్ ట్రంప్ ఆదివారం ప్రకటించారు. కృత్రిమ మేధ విధానాన్ని రూపొందించడంలో, సమన్వయం చేయడంలో శ్రీరామ్ కృష్ణన్ సహాయపడతారని, డేవిడ్ సాక్స్‌తో కలిసి పనిచేస్తారని ట్రంప్ తన సోషల్ మీడియా వేదిక ట్రూత్ సోషల్‌లో ప్రకటించారు. ట్రంప్ ప్రకటనపై కృష్ణన్ స్పందించారు. ‘మన దేశానికి సేవ చేయడం, కృత్రిమ మేధలో అమెరికా నాయకత్వాన్ని కొనసాగించడం గౌరవంగా భావిస్తున్నా. ఈ అవకాశం ఇచి్చనందుకు డోనాల్డ్ ట్రంప్‌కు దన్యవాదాలు’అని ట్వీట్ చేశారు. తమిళనాడు నుంచి... శ్రీరామ్ కృష్ణన్ తమిళనాడులోని ఎస్ఆర్ఎం వల్లియమ్మై ఇంజనీరింగ్ కళాశాలలో చదివారు. మైక్రోసాఫ్ట్, ఫేస్బుక్, స్నాప్‌చాట్, ట్విట్టర్లలో పనిచేశారు. ఇటీవలే ఆండ్రీసెన్ హోరోవిట్జ్ (ఎ 16 జెడ్)లో సాధారణ భాగస్వామిగా చేరారు. ఫేస్బుక్లో మొబైల్ యాప్ అడ్వర్టైజింగ్ వేదికను విస్తరించడంలో కీలకంగా వ్యవహరించారు. ఎలన్‌మస్క్ ట్విట్టర్‌ను (ఇప్పుడు ఎక్స్)ను స్వాధీనం చేసుకున్నప్పుడు కీలకంగా పనిచేసిన కృష్ణన్ ఆయనతో సన్నిహిత సంబంధాలను కలిగి ఉన్నారు. ఆ తరువాత ఆండ్రీసెన్ హోరోవిట్జ్ (ఎ 16జెడ్)లో సాధారణ భాగస్వామి అయ్యారు. -
తెలియనితనంలో ఉండే బలం ప్రతిఘటనే!
నోరు మూయించి పెత్తనం చేసే పాలకులు నోరు మూసుకుని బతికే ΄పౌరులు చరిత్ర నిండా ఉంటారు. కాని నోరు మూసుకొని ఉండటం చేతగాక అన్యాయాన్ని చూస్తూ ఉండలేక గొంతెత్తి గర్జించేవాళ్లు చరిత్రలో నిలబడిపోతారు. మన దేశ మూలాలున్న హార్వర్డ్ యూనివర్సిటీ విద్యార్థిని శ్రుతి కుమార్– ఆ ప్రతిష్టాత్మక ్రపాంగణంలో గాజా మీద ఇజ్రాయిల్ చేస్తున్న పాశవిక దాడులకు వ్యతిరేకంగా నోరు విప్పింది. ప్రపంచవ్యాప్త ప్రశంసలు పొందింది. వెనుకంజ వేయని మానవత్వం చాటిన శ్రుతి కుమార్ పరిచయం, నేపథ్యం.హార్వర్డ్ యూనివర్సిటీ తన విద్యార్థుల గురించి సరిగ్గా అధ్యయనం చేసినట్టు లేదు. చేసి ఉంటే బహుశా శ్రుతి కుమార్‌కు ఆ యూనివర్సిటీ గ్రాడ్యుయేషన్ వేదిక మీద మాట్లాడే అవకాశం ఇచ్చి ఉండేది కాదు. ప్రస్తుతం అమెరికా వ్యాప్తంగా యూనివర్సిటీల్లో గ్రాడ్యుయేషన్ సెరెమొనీలు జరుగుతున్నాయి. తల్లిదండ్రులు, బంధుమిత్రులు విశేషంగా హాజరయ్యి వేదిక మీద పట్టా అందుకుంటున్న తమ పిల్లలను హర్షధ్వానాలతో ఉత్సాహపరుస్తారు. హార్వర్డ్ యూనివర్శిటీలో ప్రతి ఏటా ఈ సెర్మనీలో పట్టా పొందుతున్న ముగ్గురు విద్యార్థులను ఎంపిక చేసి వారికి ప్రసంగించే అవకాశం ఇస్తారు. ఈసారి ప్రసంగం చేసే అవకాశం శ్రుతి కుమార్‌కు వచ్చింది. అక్కడే ఆమెకు గొంతెత్తే అవకాశం లభించింది.నిరసనల నేపథ్యంఅక్టోబర్ 7, 2023న హమాస్ సంస్థ ఇజ్రాయిల్ మీద దాడి చేసి 1400 ఇజ్రాయిలీల మరణానికి కారణం కావడంతో బదులు తీర్చుకోవడానికి రంగంలో దిగిన ఇజ్రాయిల్ నేటికీ ఆగని బాంబుల వర్షం కురిపిస్తూ ఉంది. ఇప్పటికి 35,000 మంది పాలస్తీనియన్లు మృతి చెందగా వీరిలో కనీసం ఇరవై వేల మంది స్త్రీలు, పసి పిల్లలు. ఈ దాడులు మొదలైనప్పటి నుంచి అమెరికా యూనివర్సిటీల్లో నిరసనలు మొదలైనా ఇజ్రాయిల్ మరింత దుర్మార్గంగా గాజాలోని ఆస్పత్రుల పై, స్కూళ్లపై దాడులు చేస్తుండటంతో ఇక విద్యార్థులు ఆగలేకపోయారు. ఏప్రిల్ నుంచి అమెరికా విశ్వవిద్యాలయాలు ‘యాంటీ ఇజ్రాయిల్’ నిరసనలతో హోరెత్తాయి. యూనివర్సిటీలు దిక్కుతోచక పోలీసులను ఆశ్రయిస్తే ఇప్పటికి 900 మంది విద్యార్థులు అరెస్ట్ అయ్యారు. వారిలో ఒక భారతీయ విద్యార్థిని కూడా ఉంది. అమెరికా యూనివర్సిటీలు తమ దగ్గర పోగయ్యే ఫండ్స్‌ను ఇజ్రాయిల్‌కు వంత పాడే బహుళ జాతి వ్యాపార సంస్థల్లో పెట్టుబడులు పెట్టడం మానేయాలని, ఆ డబ్బును వెనక్కు తీసుకోవాలనేది విద్యార్థుల ప్రధాన డిమాండ్. అంతే కాదు టెల్ అవివ్ (ఇజ్రాయిల్) యూనివర్సిటీతో కోర్సుల ఆదాన ప్రదానాలు చేసుకోవడం బంద్ చేయాలని కూడా డిమాండ్. ఏప్రిల్ 18న ఇదే విషయంలో హార్వర్డ్ యూనివర్సిటీలో భారీ నిరసన జరిగింది. విద్యార్థులు ఏకంగా మూడు చోట్ల పాలస్తీనా జెండాను ఎగురవేశారు. దాంతో యూనివర్సిటీ కన్నెర్ర చేసి ‘వయొలేషన్ ఆఫ్ యూనివర్సిటీ పాలసీ’ కింద 13 మంది విద్యార్థులను గ్రాడ్యుయేట్లు కాకుండా శిక్షించింది. అదే యూనివర్సిటీలో గ్రాడ్యుయేషన్ పూర్తి చేసిన శ్రుతి కుమార్ ఈ అంశం మీద నిరసన వ్యక్తం చేసేందుకు గ్రాడ్యుయేషన్ సెర్మనీని ఎంచుకుంది.ఆమె ఒక టోర్నడోబీభత్సమైన పిడుగుపాట్లకూ, టోర్నడోలకు పేరు పెట్టిన నెబ్రాస్కా (అమెరికా) రాష్ట్రంలో పుట్టిన కన్నడ మూలాలున్న అమ్మాయి శృతి కుమార్. అక్కడ విస్తారంగా సాగు చేసే జొన్నరైతుకు పెద్ద కూతురు ఆమె. చదువుతో పాటు ఆట, పాట, మాటలో కూడా ఆసక్తి చూపింది. మంచి వక్త. ‘నేషనల్ స్పీచ్ అండ్ డిబేట్ –2019’లో పాల్గొని ఐదవ ర్యాంకులో నిలిచింది. 2020లో ‘వాయిస్ ఆఫ్ డెమొక్రసీ’ పోటీలో మొదటి విజేతగా నిలిచి 30 వేల డాలర్లు గెలుచుకుంది. అంతేకాదు తన చదువుకు స్పాన్సర్ని కూడా. యోగాలో దిట్ట. ముందు నుంచి అన్యాయాల, అపసవ్యతల మీద వ్యతిరేకత తెలిపే అలవాటున్న శ్రుతి కుమార్‌కు హార్వర్డ్ అవకాశం ఇవ్వడంతో ఆ యూనివర్సిటీనే హెచ్చరించి ఖంగు తినిపించింది.తెలియనితనపు బలంహార్వర్డ్ గ్రాడ్యుయేషన్ సెర్మనీలో శ్రుతి కుమార్ తన ప్రసంగానికి పెట్టుకున్న పేరు ‘తెలియనితనంలో ఉండే బలం’. ఆమె తన ప్రసంగం చేస్తూ ‘ప్రపంచంలో ఆర్గనైజ్డ్గా జరుగుతున్న అన్యాయాల గురించి అన్నీ తెలిసి నోరు మెదపని వారి కంటే ఏమీ తెలియకనే అది అన్యాయమనే కేవలం గ్రహింపుతో బరిలోకి దిగి ఎదిరించే నాలాంటి విద్యార్థులకు ఉండే బలం పెద్దది’ అని అంది. ‘పసిపిల్లల వంటి అమాయకత్వంతో కొత్త జన్మెత్తి అన్యాయాలను ప్రతిఘటించడానికి ముందుకు రావాలనే’ అర్థంలో శ్రుతి కుమార్ మాట్లాడి హర్షధ్వానాలు అందుకుంది. ‘మన విశ్వవిద్యాలయ ్రపాంగణంలో భావ ప్రకటనా స్వేచ్చపట్ల వ్యక్తమైన అసహనాన్ని చూసి నేను చాలా నిరాశకు గురవుతున్నాను. 13 మంది విద్యార్థులను గ్రాడ్యుయేట్లు కాకుండా ఆపారు. దీనిని వ్యతిరేకిస్తూ పదిహేను వందల మంది విద్యార్థులం, ఐదు వందల మంది అధ్యాపకులం ఖండించాం. విశ్వవిద్యాలయ యాజమాన్యానికి అభ్యర్థనలు పంపాం. అయినా సరే వినలేదు. హార్వర్డ్, మా మాటలు నీకు వినబడుతున్నాయా? హార్వర్డ్, మా మాటలు వింటున్నావా?’ అని శ్రుతి గర్జించింది. ‘ఇప్పుడు గాజాలో జరుగుతున్న ఘటనల మీద క్యాంపస్ మొత్తంగా దుఃఖం, అనిశ్చితి, అశాంతి చూస్తున్నాను. సరిగ్గా ఇప్పుడే ఇటువంటి క్షణంలోనే తెలియనితనపు శక్తి కీలకమైన దవుతుంది’ అందామె.పర్యవసానాలను గురించి వెరవక శ్రుతి ఈ ప్రసంగం చేసింది. యూనివర్సిటీకి తాను ఇచ్చిన ప్రసంగం పేజీలలో లేనిదాన్ని మధ్యలో ఇమిడ్చి ధైర్యంగా మాట్లాడింది. నిజం చె΄్పాలంటే శ్రుతి అన్ని దేశాల విద్యార్థులకు, ప్రజలకు పిలుపునిస్తోంది. అన్నీ తెలిసి ఊరికే ఉండటం కన్నా, ఏమీ తెలియకనే ‘అన్యాయం’ అనిపించినప్పుడు వెంటనే గొంతెత్తాలని సందేశం ఇస్తోంది.ఆమె ప్రసంగంలో కొంత‘నేడు ఈ ఉత్సవం మనకు తెలిసినదాని కోసం చేస్తున్నారు. మనకు ఏం తెలుసో దానిని ప్రశంసిస్తున్నారు. కాని తెలియనితనపు బలం ఒకటుంటుంది. నేనిక్కడికి (హార్వర్డ్) వచ్చేవరకూ ‘విజ్ఞానశాస్త్ర చరిత్ర’ అనే పాఠ్యాంశం ఉన్నదనేదే నాకు తెలియదు. ఇదిగో ఇప్పుడు ఇక్కడ ఆ శాఖ నుంచి నేను గ్రాడ్యుయేట్ నయ్యాను. చరిత్రంటే మనకు తెలిసిన కథల గురించి ఎంత చదవాలో... తెలియని కథల గురించి కూడా అంత చదవాలని ఇక్కడే తెలుసుకున్నాను’(మరికొంతసేపు మాట్లాడి తన దుస్తులలో నుంచి చిన్న కాగితం తీసి ప్రధాన ప్రసంగానికి విరామం ఇచ్చి ఇలా మాట్లాడింది) ‘నా నాల్గవ సంవత్సరం చదువులో యూనివర్సిటీలో మా భావ ప్రకటనా స్వేచ్ఛ, మా నిరసన ప్రదర్శనా స్వేచ్ఛ నేరాలుగా మారిపోయాయి. నేనిక్కడ ఇవాళ మీ ముందు నిలబడి నా సహ విద్యార్థులైన పదమూడు మంది అండర్ గ్రాడ్యుయేట్ విద్యార్థులను గుర్తు చేసుకోవాలి. ఆ పదమూడు మంది అండర్ గ్రాడ్యుయేట్లు ఇవాళ పట్టభద్రులు కాలేకపోతున్నారు. మన విశ్వవిద్యాలయంలో భావ ప్రకటనా స్వేచ్ఛ పట్ల వ్యక్తమైన అసహనం ఫలితం ఇది. దీనికి నేను చాలా నిరాశæ చెందుతున్నాను. పదిహేను వందల మంది విద్యార్థులం, ఐదువందల మంది అధ్యాపకులం ఈ అసహనాన్ని ఖండించాం. యాజమాన్యానికి అభ్యర్థనలు పంపాం. విద్యార్థులు మాట్లాడినా అధ్యాపకులు మాట్లాడినా అదంతా ఈ క్యాంపస్‌లో స్వేచ్ఛ గురించే. ΄పౌరహక్కుల గురించే. హార్వర్డ్... మా మాటలు నీకు వినబడుతున్నాయా? హార్వర్డ్... మా మాటలు వింటున్నావా?’(అని మళ్లీ ప్రధాన ఉపన్యాసంలోకి వచ్చింది) ‘ఒక జాతి అయిన కారణాన తనను లక్ష్యంగా చేసి దాడులకు గురి చేయడం అంటే ఏమిటో బహుశా మనకు తెలియదు. హింసా, మృత్యువూ మన కళ్లలోకి కళ్లు పెట్టి చూడడం అంటే ఏమిటో బహుశా మనకు తెలియదు. మనకు తెలియవలసిన అవసరం కూడా లేదు. మనం కూడగట్టి మాట్లాడటం అనేది మనకు తెలిసి ఉన్న విషయాల గురించే కానక్కరలేదు. మనకు తెలియనిదాని గుండా కూడా ప్రయాణించాలి’ అందామె.ప్రసంగం చివర ఎమిలీ డికిన్సన్ కవితా వాక్యాన్ని కోట్ చేసింది. ‘ప్రభాతం ఎప్పుడొస్తుందో తెలియదు. అందుకే ప్రతి తలుపూ తెరిచి పెడతాను’. -
ఈ భారత సంతతి సీఈవో వేతనం రూ.1,260 కోట్లు!
ప్రపంచ వ్యాప్తంగా పలు దేశాల్లో అత్యధిక వేతనాలు పొందుతున్న సీఈవోల్లో భారత సంతతికి చెందినవారి సంఖ్య క్రమంగా పెరుగుతోంది. పాలో ఆల్టో నెట్వర్క్స్ సీఈఓ, భారత సంతతికి చెందిన నికేశ్ అరోరా 2023లో అమెరికాలో అత్యధిక వేతనం పొందిన సీఈవోగా రెండో స్థానంలో నిలిచారు.బ్రాడ్‌కామ్ సీఈవో హాక్ టాన్ 162 మిలియన్ డాలర్ల వేతనంతో అగ్రస్థానంలో ఉండగా రెండో స్థానంలో ఉన్న నికేశ్ అరోరా వేతనం 151.43 మిలియన్ డాలర్లు (సుమారు రూ.1,260 కోట్లు). వాల్ స్ట్రీట్ జర్నల్ ప్రచురించిన విశ్లేషణ ప్రకారం.. అత్యధిక వేతనం పొందిన టాప్ 500 సీఈవోలలో 17 మంది భారతీయ సంతతి వ్యక్తులు ఉన్నారు.అడోబ్‌కు చెందిన శంతను నారాయణ్ అత్యధిక వేతనం పొందుతున్న భారతీయ సంతతికి చెందిన సీఈవోగా రెండవ స్థానంలో ఉన్నారు. మొత్తం మీద 11వ ర్యాంక్‌ను పొందారు. నారాయణ్ వేతనం 44.93 మిలియన్ డాలర్లు. ఇక మెటా సీఈవో మార్క్ జుకర్‌బర్గ్ 24.40 మిలియన్ డాలర్ల వేతనం పొందగా ఆల్ఫాబెట్ సీఈవో భారత్‌లో జన్మించిన సుందర్ పిచాయ్ 8.80 మిలియన్ డాలర్లు వార్షిక వేతనం అందుకున్నారు.ఢిల్లీ ఎయిర్ ఫోర్స్ పబ్లిక్ స్కూల్లో చదువుకున్న నికేశ్ అరోరా మొట్టమొదటిసారిగా గూగుల్‌లో చీఫ్ బిజినెస్ ఆఫీసర్‌గా అంతర్జాతీయ దృష్టిని ఆకర్షించారు. 2014లో సాఫ్ట్‌బ్యాంక్‌కు నాయకత్వం వహించారు. సైబర్ సెక్యూరిటీ కంపెనీ అయిన పాలో ఆల్టో నెట్వర్క్స్కు 2018 నుంచి నాయకత్వం వహిస్తున్నారు. ఆయన వేతనం ముఖ్యంగా షేర్లు, ఈక్విటీ అవార్డులతో కూడి ఉంటుంది. -
అమెరికాలోని ఓ రహదారికి భారత సంతతి పోలీస్ పేరు!
భారత సంతతి వ్యక్తికి అరుదైన గౌరవం లభించింది. యూఎస్‌లోని ఓ రహదారికి అతడి పేరుని పెట్టిమరీ గౌరవించింది. ఇంతకీ ఎవరా వ్యక్తి ఎందుకంతా గౌరవం ఇచ్చిందంటే.. అమెరికాలోని కాలిఫోర్నియాలో 34 ఏళ్ల రోనిల్ సింగ్ అనే భారత సంతతి వ్యక్తి న్యూమాన్ పోలీస్ డిపార్ట్మెంట్లో పోలీస్ అధికారిగా విధులు నిర్వర్తిస్తున్నాడు. అయితే ఒకరోజు అతను విధినిర్వహణలో భాగంగా ఒక రాత్రి ఓవర్ టైం చేయాల్సి వచ్చింది. సరిగా 2018 డిసెంబర్ 26న క్రిస్మస్ రాత్రి ఓ రహదారి వద్ద గస్తీ కాస్తున్నారు. ఇంతలో ఓ వ్యక్తి కారులో తాగుతూ వచ్చి విచక్షణరహితంగా కాల్పులు చేస్తున్నాడు. ఆ కాల్పుల్లో రోనిల్ సింగ్ మృతి చెందాడు. విధి నిర్వహణలో భాగంగా ఇతురల భద్రత విషయమై జీవితాన్ని ఫణంగా పెట్టాడు సింగ్. అయితే అతడు చనిపోయేనాటికి కొడుకు ఆర్నవ్ కేవలం 5 నెలల పసివాడు. ఇలా విధినిర్వహణలో ప్రాణాలు కోల్పోయిన ఆ వ్యక్తిని గౌరవించేలా ఓ రహదారికి అతని పేరు పెట్టి అంకితం ఇవ్వాలని నిర్ణయించారు. కానీ అములులోకి రాలేదు. ఎట్టకేలకు సింగ్ న్యూమాన్ పోలీస్ డిపార్ట్మెంట్ ఇచ్చిన వాగ్దానాన్ని నెరవేర్చడమే గాక అమలయ్యేలా చేసింది. ఆ కాలిఫోర్నియా రాష్ట్ర సెనేటర్ మేరి అల్వరాడో గిల్ యూఎస్ ప్రతినిధి డువార్టే, అసెంబ్లీ సభ్యుడు జువాన్ అలానిస్ సెప్టెంబర్ 2న హైవే 33 స్టుహ్ర్ రోడ్ ప్రారంభోత్సవ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి "కార్పోరల్ రోనిల్ సింగ్ మోమోరియల్ హైవే" అని నామకరణం చేసి మరీ సైన్ బోర్డు పెట్టారు. ఆ రహదారికి అతడి పేరుని పెట్టి అత్యున్నతంగా గౌరవించింది. ఈ కార్యక్రమంలో సింగ్ భార్య అనామిక, కొడుకు ఆర్నవ్ , ఇతర కుటుంబ సభ్యులు న్యూమాన్ పోలీస్ డిపార్ట్మెంట్లోని సింగ్ సహోద్యోగులు తదితరలు పాల్గొన్నారు. సింగ్ కొడుకు ఆర్నవ్ ఆ బోర్డు వెనకాల ఐ లవ్ యు పప్పా! అని రాశాడు. కాగా, రోనిల్ సింగ్ నేపథ్యం వచ్చేసరికి అతడు ఫిజీలో జన్మించి మోడెస్లో పోలీస్‌డిపార్ట్‌మెంట్‌లో వాలంటీర్‌గా లా ఎన్ఫోర్స్మెంట్ వృత్తిని ప్రారంభించాడు. తర్వాత టర్లాక్ పోలీస్ డిపార్ట్మెంటల్లో క్యాడెట్ జంతు సేవా అధికారిగా కూడా విధులు నిర్వర్తించాడు. ఇక సింగ్ చనిపోయిన ఒక ఏడాది తర్వాత పోలీసులు నిందితుడిని మెక్సికన్ జాతీయుడైన పాలో విర్జెన్ మెన్డోజాగా గుర్తించి అరెస్టు చేశారు. అతడికి పెరోల్ లేకుండా జీవితఖైదు శిక్ష విధించింది కోర్టు. అలాగే అతడిని తప్పించాలని చూసిన అతడి సోదరుడు కాన్రాడో విర్జెన్ మెన్డోజాకు 21 నెలల జైలు శిక్ష పడింది. -
‘నేను గెలిస్తే ఆ పదవి మస్క్‌కే’.. రిపబ్లికన్ అభ్యర్థి వివేక్ రామస్వామి
అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో తాను గెలిచి యూఎస్ అధ్యక్షుడిగా ఎన్నికైతే తనకు సలహాదారుగా ఎలాన్ మస్క్ (Elon Musk)ను కోరుకుంటానని రిపబ్లికన్ పార్టీ ప్రెసిడెంట్ అభ్యర్థి భారతీయ-అమెరికన్ వివేక్ రామస్వామి (Vivek Ramaswamy) పేర్కొన్నారు. లోవాలోని టౌన్ హాల్లో రామస్వామి మాట్లాడుతూ తన సంభావ్య అధ్యక్ష పదవికి సలహాదారులుగా ఎవరు కావాలనుకుంటున్నారని అడిగిన ప్రశ్నకు బదులుగా ఈ వ్యాఖ్యలు చేసినట్లు ఎన్బీసీ న్యూస్ నివేదించింది. ట్విటర్ (ప్రస్తుతం ‘ఎక్స్’)ని స్వాధీనం చేసుకున్న తర్వాత గత సంవత్సరం ఆ సంస్థ నుంచి భారీ సంఖ్యలో ఉద్యోగులను తొలగించిన విషయం తెలిసిందే. అయితే ఈ తొలగింపు చర్యను వివేక్ రామస్వామి మెచ్చుకోవడం అప్పట్లో చర్చనీయాంశమైంది. ‘ఎలాన్ మస్క్ ఇటీవల చాలా మెరుగవడం సంతోషంగా ఉంది. నాకు అతన్ని కీలక సలహాదారుగా కోరుకుంటున్నా. ఎందుకంటే అతను ట్విటర్లో 75 శాతం మందిని తొలగించాడు’ అని రామస్వామి పేర్కొన్నట్లుగా ఎన్బీసీ న్యూస్ కథనం వివరించింది. గతంలో ఫ్లోరిడా గవర్నర్ రాన్ డిసాంటిస్‌కు మద్దతు తెలిపిన ఎలాన్ మస్క్ ఇటీవల వికేక్ రామస్వామిని ఆశాజనక అభ్యర్థిగా భివిస్తున్నట్లు చెప్పాడు. రిపబ్లికన్ పార్టీ అధ్యక్ష అభ్యర్థిగా అత్యంత పిన్న వయస్కుడైన రామస్వామి.. దక్షిణ కరోలినా మాజీ గవర్నర్ నిక్కీ హేలీ తర్వాత రిపబ్లికన్ పార్టీ నామినేషన్ కోసం పోటీ పడుతున్న మరో ఇండియన్-అమెరికన్. ప్రభుత్వంలో విద్యా శాఖ, ఫెడరల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్, బ్యూరో ఆఫ్ ఆల్కహాల్, టొబాకో, ఫైర్ ఆర్మ్స్, ఎక్స్ప్లోసివ్స్ను మూసివేయాలని తాను కోరుకుంటున్నట్లు రామస్వామి పేర్కొన్నట్లుగా ఎన్బీసీ నివేదిక వివరించింది. 38 ఏళ్ల వివేక్ రామస్వామి 40 ఏళ్లలోపు అత్యంత సంపన్న అమెరికన్లలో ఒకరు. యేల్ నుంచి న్యాయ పట్టా పొందే ముందు హార్వర్డ్‌లో జీవశాస్త్రాన్ని అభ్యసించారు. ఫోర్బ్స్ ప్రకారం, కొంతకాలం బిలియనీర్‌గా ఉన్న ఆయన సంపద స్టాక్ మార్కెట్ తిరోగమనంతో 950 మిలియన్ డాలర్లకు పడిపోయింది. -
అమెరికాలో కొత్త చరిత్ర సృష్టించిన తెలుగు మహిళ
వాషింగ్టన్: తెలుగు మహిళ కాట్రగడ్డ అరుణ మిల్లర్ (58) అమెరికాలో చరిత్ర సృష్టించారు. దేశంలో జరుగుతున్న మధ్యంతర ఎన్నికల్లో మేరీలాండ్ రాష్ట్ర లెఫ్టినెంట్ గవర్నర్‌గా ఎన్నికయ్యారు. ఈ ఘనత సాధించిన తొలి ఇండియన్ అమెరికన్‌గా రికార్డుకెక్కారు. డెమొక్రాటిక్ పార్టీ తరఫున అరుణ రికార్డు మెజార్టీతో గెలిచారు. రిపబ్లికన్ పార్టీ అనుకూల వర్గాలూ ఆమెకే మద్దతివ్వడంతో గెలుపు సులభమైంది. అమెరికాలో రాష్ట్రస్థాయిలో గవర్నర్ తర్వాత లెఫ్టినెంట్ గవర్నర్ పదవి అత్యంత కీలకం. రవాణా ఇంజనీర్‌గా సేవలు కాట్రగడ్డ అరుణ మిల్లర్ స్వస్థలం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఉమ్మడి కృష్ణా జిల్లాలోని పెదపారుపూడి మండలం వెంట్రప్రగడ గ్రామం. ఆమె 1964 నవంబర్ 6న జన్మించారు. తల్లిదండ్రులు, సోదరుడు, సోదరితో కలిసి 1972లో అమెరికా చేరుకున్నారు. తండ్రి కాట్రగడ్డ వెంకటరామారావు ఐబీఎం సంస్థలో మెకానికల్ ఇంజనీర్‌గా పనిచేశారు. న్యూయార్క్‌లో ప్రాథమిక విద్య అనంతరం అరుణ ‘మిస్సౌరీ యూనివర్సిటీ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ’లో సివిల్ ఇంజనీరింగ్‌లో డిగ్రీ పూర్తిచేశారు. 1990లో మేరీల్యాండ్‌లోని మాంట్గొమెరీ కౌంటీకి మారారు. అక్కడే తన కళాశాల మిత్రుడు డేవిడ్ మిల్లర్‌ను వివాహం చేసుకున్నారు. వారికి ముగ్గురు కుమార్తెలు మీనా, క్లోయి, సాషా ఉన్నారు. అరుణ ట్రాన్స్‌పోర్టేషన్ ఇంజనీర్‌గా పనిచేశారు. 2000లో అమెరికా పౌరసత్వం లభించింది. 2010 నుంచి 2018 దాకా మేరీల్యాండ్ హౌస్ ఆఫ్ డెలిగేట్స్‌లో డిస్ట్రిక్ట్ 15కి ప్రాతినిధ్యం వహించారు. 2018లో అమెరికా పార్లమెంట్(కాంగ్రెస్)కు పోటీపడి ఓడారు. ‘‘మేరీల్యాండ్‌ను అత్యున్నత స్థానంలో నిలబెట్టడానికి నావంతు కృషి చేస్తా. భిన్నత్వంలో ఏకత్వాన్ని ప్రదర్శిస్తూ నన్ను గెలిపించి, ప్రజాస్వామ్య వ్యవస్థలో చిన్న రాష్ట్రం కూడా అద్భుతం సృష్టిస్తుందని ఈ ఎన్నికతో ప్రజలు నిరూపించారు’’ అని అరుణ మిల్లర్ చెప్పారు. రిపబ్లికన్ల ఆధిక్యం మధ్యంతర ఎన్నికల్లో ప్రతిపక్ష రిపబ్లికన్లు స్వల్ప ఆధిక్యం కనబరుస్తున్నారు. మొత్తం 435 స్థానాలున్న ప్రతినిధుల సభలో కడపలి వార్తలు అందే సమయానికి 202 స్థానాలు గెలుచుకున్నారు. అధికార డెమొక్రటిక్ పార్టీకి 184 స్థానాలు దక్కాయి. మ్యాజిక్ ఫిగర్ 218 సీట్లు. సెనేట్‌లో 35 స్థానాలకు ఎన్నికలు జరగ్గా రిపబ్లికన్లు 19 , డెమొక్రాట్లు 12 సీట్లు నెగ్గారు. కడపటి వార్తలందేసరికి ఈ రెండు పార్టీలకూ సెనేట్‌లో చెరో 48 సీట్లున్నాయి. 36 గవర్నర్ పదవుల్లో రిపబ్లికన్లకు 16, డెమొక్రాట్లకు 15 దక్కాయి. ఐదింటి ఫలితాలు రావాల్సి ఉంది. ఐదుగురు భారత అమెరికన్ల విజయం వాషింగ్టన్: అమెరికా మధ్యంతర ఎన్నికల్లో ప్రతినిధుల సభకు ఐదుగురు భారత–అమెరికన్లు ఎన్నికయ్యారు. వీరంతా అధికార డెమొక్రాటిక్ పార్టీ తరఫున నెగ్గడం విశేషం. వివిధ రాష్ట్రాల్లో కాంగ్రెషనల్ జిల్లాల నుంచి రాజా కృష్ణమూర్తి, రో ఖన్నా, అమీ బేరా, ప్రమీలా జయపాల్, థానేదార్ ప్రతినిధుల సభలో అడుగు పెట్టనున్నారు. -
విడాకులు తీసుకునేందుకు ప్లాన్ చేస్తోందని...కోడలిని హతమార్చిన మామ
శాన్ ఫ్రాన్సిస్కో: 74 ఏళ్ల భారత సంతతి వ్యక్తి తన కోడలిని తుపాకితో కాల్చి చంపాడు. ఈ ఘటన అమెరికాలోని కాలిఫోర్నియాలో చోటు చేసుకుంది. సదరు వ్యక్తి సితాల్ సింగ్ దోసాంజ్గా పోలీసులు గుర్తించారు. సౌత్శాన్ జోస్పార్కింగ్లోని వాల్‌మార్ట్ వద్ద ఆమె శవమై కనిపించిందని తెలిపారు. బాధితురాలు గురుప్రీత్ కౌర్ దోసంజ్గా గుర్తించినట్లు తెలిపారు. నిందితుడు సితాల్ సింగ్ విచారణలో ఆమె తన కొడుకు నుంచి విడాకులు తీసుకునేందుకు ప్లాన్ చేస్తుండటంతో కోపంతో షూట్ చేసి చంపేశానని చెప్పాడు. అంతేగాదు భాధితురాలు ఫోన్లో తన మామా తనను చంపడం కోసం వెతుకుతున్నాడంటూ భయపడినట్లు ఆమె మేనమామ పోలీసులకు చెప్పాడు. ఆమె తన ఆఫీస్‌లో విరామ సమయంలో బయటకు వచ్చి తనకు కాల్ చేసిందని, అదే సమయంలో తన మామా తన కారు వద్దకు వస్తున్నాడంటూ భయపడుతూ చెప్పిందని తెలిపాడు. ఆ తర్వాత కొద్దిసేపటికే కాల్ డిస్ కనక్డ్ అయ్యిందని వివరించాడు. సుమారు ఐదు గంటల తర్వాత బాధితురాలి సహోద్యోగురాలు ఆమె తన కారులోనే చనిపోయి ఉన్నట్లు గుర్తించిందని తెలిపాడు. గురుప్రీత్ ఆమె భర్త, మామ గారితో కలిసి ఫ్రెస్నోలో ఉంటోందని బాధితురాలి మేనమామ చెప్పాడు. ఐతే ఆమె తన భర్త నుంచి విడాకులు తీసుకోవాలనుకుంటున్నట్లు కూడా చెప్పాడు. ఈ మేరకు నిందితుడు సితాల్ సింగ్‌ని ఆయన నివాసంలోనే అదుపులోకి తీసుకుని అరెస్టు చేసినట్లు పోలీసులు తెలిపారు. ఆయన ఇంటి నుంచి క్యాలిబర్ బెరెట్టా పిస్టల్‌ను కూడా స్వాధీనం చేసకున్నట్లు పేర్కొన్నారు. అలాగే బాధితురాలిని చివరిసారిగా ఆమె డ్రైవ్ చేస్తుంటే కలిసింది సితాల్ సింగ్ అని విచారణలో తేలినట్లు పోలీసులు తెలిపారు. నిందితుడిని శాన్‌జోస్ జైలుకి తరలించినట్లు తెలిపారు. అతనిని నవంబర్14న కోర్టు ముందు హాజరుపరచనున్నట్లు పేర్కొన్నారు పోలీసులు. (చదవండి: రావణుడి తలలు దహనం కాలేదని షోకాజ్ నోటీసులు, గుమస్తాపై వేటు) -
సందర్భం: నెట్వర్కింగ్ క్వీన్..జయశ్రీ ఉల్లాల్
‘భవిష్యత్ అనేది మూసిపెట్టిన పెట్టెలాంటిది. అందులో నీ కోసం ఎన్నో అద్భుతాలు ఎదురు చూస్తుంటాయి’ అనే ఆంగ్ల సినిమా డైలాగ్‌ను గుర్తు తెచ్చుకుంటే ‘అవును. నిజమే’ అని చాలా సందర్భాలలో అనిపిస్తుంది. ఫోర్బ్స్ ‘అమెరికాస్ రిచెస్ట్ సెల్ఫ్‌మేడ్ ఉమెన్’ జాబితాలో చోటు సాధించిన జయశ్రీ ఉల్లాల్ విజయాలను చూస్తే ఆ డైలాగ్‌లోని సత్యం మరింత బలపడుతుంది. ఊహకు కూడా అందని అద్భుతాలు ఆమె జీవితంలో జరిగాయి... లండన్‌లో పుట్టిన జయశ్రీ దిల్లీలో పెరిగింది. శాన్ఫ్రాన్సిస్కో స్టేట్ యూనివర్శిటీలో ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్, శాంటా క్లారా యూనివర్శిటీలో ఇంజనీరింగ్ మేనేజ్మెంట్ చేసింది. కాలిఫోర్నియా కేంద్రంగా పనిచేసే నెట్వర్కింగ్ హార్డ్‌వేర్, నెట్వర్కింగ్ సాఫ్ట్వేర్ కంపెనీ ‘సిస్కో’లో చేరింది. ‘అలా జరుగుతుందనుకోలేదు’ అని గతాన్ని గుర్తు చేసుకుంటుంది జయశ్రీ. ఆ కంపెనీలో ఆమె కాంట్రాక్ట్ రెండు సంవత్సరాలే. అయితే పదిహేను సంవత్సరాలు ఆ కంపెనీతో కలిసి నడిచింది. కంపెనీ సీయివో జాన్ చాంబర్, తన బాస్ మారియో మజోలా విలువైన ప్రోత్సాహం తో ‘జీరో’ స్థానంలో ఉన్న కంపెనీని లాభాల బాటలోకి తీసుకువెళ్లడంలో కీలక పాత్ర పోషించింది. సీనియర్ వైస్ ప్రెసిడెంట్ స్థాయికి చేరింది. ‘ఈ స్థాయికి వస్తాను అని ఎప్పుడూ అనుకోలేదు’ అంటుంది వినమ్రంగా జయశ్రీ. నిజమే మరీ, అది నల్లేరు మీద నడకలాంటి ప్రయాణం కాదు. రెండు ముక్కల్లో చెప్పాలంటే కత్తి మీద సాము. తన తెలివితేటలు, వ్యూహాలు, దార్శనికతను ఏకం చేసి కంపెనీకి శక్తి ఇచ్చింది. తనలోని ‘శక్తి’ని కంపెనీ గుర్తించేలా చేసుకుంది. మూడు దశాబ్దాల నెట్వర్కింగ్ అనుభవం ఉన్న జయశ్రీ ఎంట్రప్రెన్యూర్ ఆఫ్ ది ఇయర్ (2015), వరల్డ్స్ బెస్ట్ సీయివో (2018) అవార్డ్లు అందుకుంది. ‘టెక్ల్యాండ్ అనేది పురుషుల ప్రపంచం అనే భావన ఉంది’ అనే సందేహానికి జయశ్రీ స్పందన: ‘నెట్వర్కింగ్ ఇండస్ట్రీ ప్రతిభావంతుల కోసం వెయ్యికళ్లతో ఎదురుచూస్తుంటుంది. ఈ నేపథ్యంలో లింగ వివక్షకు చోటు ఉండదు అని నమ్ముతున్నాను. అయితే, వృత్తిని, కుటుంబజీవితాన్ని సమన్వయం చేసుకోవడమే అసలైన సవాలు. ‘సిస్కో’లో పనిచేసే కాలంలో కొన్ని నెలల పాటు ప్రసూతి సెలవులు తీసుకుంది. ఆ సమయంలో డోలాయమాన స్థితిలో ఉండిపోయింది. ‘ఒక బిడ్డకు తల్లిగా ఉండిపోవాలా? తిరిగి ఉద్యోగంలో చేరాలా?’ ‘ఇంటికే పరిమితమై మాతృత్వాన్ని ఆస్వాదించాలి’ అని కొన్నిసార్లు...‘మళ్లీ ఉద్యోగం చేయాల్సిందే. నేను సాధించాల్సింది ఎంతో ఉంది’ అని కొన్నిసార్లు అనిపించేది. అయితే కుటుంబసభ్యులు, సన్నిహితుల సలహాతో ఒక బిడ్డకు తల్లిగా మాతృత్వాన్ని ఆస్వాదిస్తూనే, మరోవైపు కెరీర్లో దూసుకుపోయింది. జయశ్రీ భర్త సెమికండక్టర్–ఇండస్ట్రీలో హైటెక్ ఎగ్జిక్యూటివ్. అలా అని ఇంట్లో సాంకేతిక కబుర్లు మాత్రమే వినిపిస్తాయి అనుకోవద్దు. దంపతులిద్దరూ ఇద్దరు కూతుళ్లతో సరదా సరదాగా గడుపుతారు. బాలీవుడ్ సినిమాలు తెగ చూస్తారు. హాయిగా పాటలు పాడుకుంటారు. వీటి ద్వారా వృత్తికి, వ్యక్తిగత జీవితానికి మధ్య స్పష్టమైన విభజన రేఖను ఏర్పాటు చేసుకోగలిగారు. ప్రస్తుతం కంప్యూటర్ నెట్వర్కింగ్ సంస్థ ‘అరిస్టా’కు ప్రెసిడెంట్‌గా... సీయీవోగా విధులు నిర్వహిస్తున్న జయశ్రీ, ఆ సంస్థను శక్తిమంతం చేయడం ద్వారా తనలోని ప్రతిభను మరోసారి నిరూపించుకుంది. ఆహారం, కుటుంబ విలువలు, సంస్కృతి పరంగా తనను తాను భారతీయురాలిగా చెప్పుకునే జయశ్రీ బిజినెస్ ఫిలాసఫీకి సంబంధించిన ఆలోచనా విధానంలో మాత్రం తాను ‘గ్లోబల్ సిటిజన్’ అంటుంది. ‘నెట్వర్కింగ్ ఇండస్ట్రీ ప్రతిభావంతుల కోసం వెయ్యికళ్లతో ఎదురు చూస్తుంటుంది. ఈ నేపథ్యంలో లింగ వివక్షకు చోటు ఉండదు అని నమ్ముతున్నాను. అయితే, వృత్తిని, కుటుంబ జీవితాన్ని సమన్వయం చేసుకోవడమే అసలైన సవాలు. -
హుర్రే... మన గొంతుకి గ్రామీ
‘చిట్టి చిలకమ్మా అమ్మ కొట్టిందా’ అని మన తల్లులు పాడుతారు పిల్లలతో. ‘చిట్టి కన్నయ్యా... లోకం చూస్తావా’ అని పాడింది ఫాల్గుణి షా తన కొడుకుతో. పిల్లలు ఒక్కోసారి ప్రశ్నలను సంధిస్తారు. వాటికి సమాధారాలు ఇదిగో ఇలా అవార్డులను కూడా తెచ్చి పెడతాయి. ‘అమ్మా.. నా క్లాస్‌లో అందరూ ఒకేలా ఎందుకు లేరు’ అని ఫాల్గుణి షా చిన్నారి కొడుకు అడిగాడు. దానికి జవాబుగా ఆమె ఒక మ్యూజిక్ ఆల్బమే చేసింది. గ్రామీ గెలుచుకుంది. ఇది ఒక కొడుకు తల్లికి గెలిచి ఇచ్చిన అవార్డు. ఒక తల్లి తన కొడుకు కోసం గెలుచుకున్న అవార్డు. అమెరికాలో చదువుకుంటున్న తొమ్మిదేళ్ల నిషాద్ ఒకరోజు స్కూల్ నుంచి వచ్చి వాళ్ల అమ్మను ‘అమ్మా... స్కూల్లో ఎందుకు అందరూ ఒకేలా ఎందుకు లేరు? రంగూ రూపం, అలవాట్లు వేరే వేరేగా ఎందుకున్నాయి?’ అని అడిగాడు. ఆ ప్రశ్నకు తల్లి...‘వేరే వేరేగా ఉండి కలిసి ఉండటమే ప్రపంచమంటే. ఇప్పుడు నీ దగ్గర చాలా రకాల పెన్సిల్స్ ఉన్నాయి. కాని అవన్నీ ఒక పెన్సిల్ బాక్స్‌లో ఇముడుతాయి కదా. అలాగే మనుషులు కూడా కలిసి కట్టుగా ఉంటారు’ అని జవాబు చెప్పింది. కాని సంతృప్తి కలగలేదు. ఇలాంటి ప్రశ్నను ఎందరో పసివాళ్లు తమ తల్లులను అడుగుతూ ఉండొచ్చు. వారికి అందరు తల్లులూ జవాబు చెప్పకపోవచ్చు. వారిని తాను చేరాలి. పాట రూపంలో చేరాలి అనుకుంది. వెంటనే ‘ఏ కలర్‌ఫుల్ వరల్డ్’ పేరుతో ఆల్బమ్ చేసి విడుదల చేసింది. ఇది గ్రామీ మెచ్చడంతో ఏకంగా గ్రామీ అవార్డు వరించింది ఆ తల్లిని. ఆ తల్లి మరెవరో కాదు.. భారత సంతతికి చెందిన ఫాల్గుణి షా. ముంబై గాయని ప్రస్తుతం అమెరికాలో నివసిస్తోన్న ఫాల్గుణి షా... ముంబైలోని జుహులో ఓ సంగీత కుటుంబంలో పుట్టింది. ఇంట్లో సంగీత వాతావరణం ఉండడం, ఫాల్గుణి తల్లి ఆల్ ఇండియా రేడియోలో సంగీత విద్వాంసురాలిగా పనిచేస్తుండంతో చిన్న వయసు నుంచే ఫాల్గుణికి సంగీతం మీద విపరీతమైన ఆసక్తి ఏర్పడింది. రేడియోలో వస్తోన్న పాటలను ఎంతో ఇష్టంగా వినేది. ఈ ఇష్టమే సంగీతం నేర్చుకునేలా చేసింది. ప్రముఖ గుజరాతీ గాయకులు కౌముది మున్షి, ఉదయ్ మజుందార్‌ల దగ్గర గుజరాతీ జానపద సంగీతం, గజల్స్‌తోపాటు టుమ్రి కూడా నేర్చుకుంది ఫాల్గుణి. తరువాత సారంగీ మ్యాస్ట్రో సుల్తాన్ ఖాన్ వద్ద హిందుస్థాని సంగీతాన్ని నేర్చుకుంది. సంప్రదాయ గాయకుడు కిశోరి అమేన్ కర్ వద్ద జైపూర్ సంప్రదాయ సంగీతం నేర్చుకుంది. రెండుసార్లు గ్రామీకెళ్లిన ఫాలు సంగీతం నేర్చుకుంటూ పెరిగిన ఫాల్గుణి కరిష్మా బ్యాండ్ నడుపుతోన్న గౌరవ్ షాను పెళ్లి చేసుకుంది. 2000 సంవత్సరంలో అమెరికా వెళ్లింది. అక్కడ కరిష్మా బ్యాండ్‌లో గాయకురాలుగా చేరింది. ‘ఫాలు’ అనే స్టేజ్ పేరుతో పాటలు పాడుతూ 2007లో ఫాల్గుణి తొలి ఆల్బమ్‌ను విడుదల చేసింది. తరువాత 2013లో ‘ఫోరస్ రోడ్’ పేరిట మరో ఆల్బమ్‌ను విడుదల చేసింది. ఈ ఆల్బమ్ తొలిసారి గ్రామీకి షార్ట్ లిస్ట్ అయినప్పటికీ నామినేషన్ కు ఎంపిక కాలేదు. తరువాత 2019లో ‘ఫాలూస్ బజార్’ పేరిట విడుదలైన ఆల్బమ్ మరోసారి గ్రామీకి నామినేట్ అయ్యింది. రెండుసార్లు బెస్ట్ చిల్డ్రన్ ్స మ్యూజిక్ ఆల్బమ్ కేటగిరిలో గ్రామీ అవార్డుకు నామినేట్ అయిన తొలి భారత సంతతికి చెందిన వ్యక్తిగా ఫాల్గుణి నిలిచింది. గ్రామీ అవార్డు రానప్పటికీ ఫాల్గుణి సంగీతానికి అంతర్జాతీయ గుర్తింపు లభించింది. ఈ గుర్తింపుతోనే గత కొన్నేళ్లుగా అమెరికన్ కంపోజర్ ఫిలిఫ్ గ్లాస్, అమెరికన్ మ్యుజీషియన్ సెల్లిస్ట్ యోయో మా, ఏఆర్ రెహ్మాన్ లతో కలిసి పని చేస్తోంది. ఏఆర్ రెహ్మాన్ కు ఆస్కార్‌ను తెచ్చిన ‘స్లమ్‌డాగ్ మిలీనియర్’ సినిమాకు రెహ్మాన్ తో కలసి ఫాల్గుణి పని చేసింది. ఏ కలర్‌ఫుల్ వరల్డ్ పాటల రచయిత, గాయనిగా రాణిస్తోన్న ఫాల్గుణి ఆల్బమ్స్‌లో ఎక్కువగా భారతీయ సంప్రదాయ సంగీతానికి వెస్ట్రన్ బీట్ జోడించి సమకాలిన అంశాల పాటలు ఉంటాయి. ఫాల్గుణి తొమ్మిదేళ్ల కొడుకు నిషాద్ న్యూయార్క్ సిటీలోని ఓ స్కూల్లో చదువుతున్నాడు. ఆ స్కూల్లో వివిధ దేశాలు, ప్రాంతాలకు చెందిన విద్యార్థులు ఉన్నారు. రోజూ వాళ్లను దగ్గర నుంచి చూస్తోన్న నిషాద్ ఒకరోజు....‘‘అమ్మా మా స్కూల్లో కొంతమంది నల్లగా, మరికొంతమంది తెల్లగా, ఇంకొంత మంది చామనఛాయగా ఉన్నారు. వారి ఆహారపు అలవాట్లు, ఇష్టాలు అన్నీ విభిన్నంగా ఉన్నాయి. అంతా ఒక దగ్గరే ఎలా చదువుతున్నారు?’’ అని ఫాల్గుణిని అడిగాడు. ఈ ప్రశ్నకు సమాధానంగా...‘‘ బొమ్మలకు రంగులు నింపే రంగురంగుల కలర్ పెన్సిళ్లు, క్రేయాన్ ్స .. ఒక్కొక్కటి ఒక్కోలా ఉన్నప్పటికీ అన్నీ ఒకే బాక్సులోనే ఉంటాయి. అదేవిధంగా ప్రపంచంలో విభిన్న సంస్కృతీ సంప్రదాయాలు, రూపురేఖలు, నలుపు, తెలుపు, ఎరుపు, చామనఛాయ రంగులు, ఆహారపు అలవాట్లు వేరుగా ఉన్నప్పటికీ ఈ ప్రపంచం లో అంతా శాంతియుతంగా జీవించడం అనేది కూడా క్రేయాన్ ్స బాక్స్లాంటిదే ’’ అని వివరించింది. ఈ వివరణ ఫాల్గునికి నచ్చడంతో ఈ థీమ్‌తో భారతీయ సంప్రదాయ సంగీతానికి వెస్ట్రన్ బీట్స్ జోడించి ‘కలర్‌ఫుల్ వరల్డ్ పేరిట (క్రెయాన్ ్స ఆర్ వండర్ ఫుల్)’ ఆల్బమ్? రూపొందించింది. ప్రస్తుతం ఈ ఆల్బమే ఫాల్గుణికి గ్రామీ అవార్డు తెచ్పిపెట్టింది. ఏ విషయాన్ని అయినా తేలిగ్గా తీసిపారేయకుండా కాస్త విభిన్నంగా, లోతుగా ఆలోచిస్తే ప్రపంచం మెచ్చేలా కనెక్ట్ కావచ్చుననడానికి ఫాల్గుణి జీవితమే ఉదాహరణగా నిలుస్తోంది. -
తనను చెంప దెబ్బలు కొట్టడానికి మహిళను పనిలో పెట్టుకున్న ఓనర్!
భారతీయ-అమెరికన్ మనేష్ సేథి తనని చెంపదెబ్బ కొట్టడానికి ఒక మహిళను నియమించుకున్న కథనం ఇప్పుడు మళ్లీ ఇంటర్నెట్లో ట్రెండ్ అవుతుంది. ఈ పోస్టుకు ప్రపంచ దిగ్గజ పారిశ్రామికవేత్తలలో ఒకరైన బిలియనీర్ ఎలోన్ మస్క్ స్పందిస్తూ రెండు ఫైర్ ఏమోజీలను పోస్టు చేశారు. అసలు విషయానికి వస్తే.. వేరబుల్ డివైసెస్ బ్రాండ్ పావ్ లోక్ వ్యవస్థాపకుడు మనేష్ సేథి. తను పనివేళల్లో ఎక్కువ శాతం ఫేస్బుక్ వినియోగిస్తుండేవాడు. దీనివల్ల అతని కంపెనీ మీద ఎక్కువ ప్రభావం పడింది. ఈ సమస్యను ఎలాగైనా అధిగమించడం కోసం ఒక ఆలోచన చేశాడు. తాను పనిచేస్తున్న వేళలో ఫేస్బుక్ వినియోగించిన ప్రతిసారీ అతని ముఖంపై చెంపదెబ్బ కొట్టడానికి ఒక మహిళను నియమించుకున్నాడు. దీనికోసం యుఎస్ క్లాసిఫైడ్ అడ్వర్టైజ్ మెంట్స్ వెబ్ సైట్ క్రెయిగ్స్లిస్ట్ లో ఒక ప్రకటన ఇచ్చాడు. "నేను పనివేళల్లో సమయాన్ని వృధాచేసినప్పుడు మీరు నాపై అరవాలి లేదా అవసరమైతే నన్ను చెంపదెబ్బ కొట్టండి" అని అతను 2012లో ఒక ప్రకటనలో పేర్కొన్నాడు. ఈ ఉద్యోగం కోసం ఎంపికైన వారికి గంటకు $8 డాలర్లు ఇస్తాను అన్నాడు. కారా అనే మహిళా ఈ ఉద్యోగంలో సెలెక్ట్ అయ్యింది. స్లాపర్ కారాను నియమించిన తర్వాత మంచి ఫలితాలను వచ్చినట్లు మనేష్ సేథి తెలిపాడు. The story of Maneesh Sethi, the computer programmer who hired a woman to slap him in the face every time he used Facebook, resulting in massive productivity increase [read more: https://t.co/Q5fKjYtFSo] pic.twitter.com/d8pnt3Jd8k — Massimo (@Rainmaker1973) November 10, 2021 "సాదారణంగా నా సగటు ఉత్పాదకత 35-40% ఉండేది. కానీ, స్లాపర్ కారా నా పక్కన కూర్చున్నప్పుడు నా ఉత్పాదకత 98%కి పెరిగింది" అని అతను ఒక బ్లాగులో రాశాడు. ఈ స్టోరీ ఇప్పుడది కాదు. ఈ సంఘటన 2012లో జరిగింది. మళ్లీ ఈ పోస్టు ఇటీవల ఇంటర్నెట్లో ఎక్కువగా ట్రెండ్ అవుతుంది. ట్రెండ్ అవుతున్న పోస్టుపై టెస్లా సీఈఓ ఎలోన్ మస్క్ స్పందిస్తూ రెండు ఫైర్ ఏమోజీలను పోస్టు చేశారు. దీంతో మరింత ఎక్కువగా ట్రెండ్ అవుతుంది. మీరు కూడా ఈ వీడియోను ఒకసారి చూడండి. -
వైట్‌హౌస్ స్టాఫ్ సెక్రటరీగా నీరా టాండన్
వాషింగ్టన్: భారత సంతతి అమెరికన్ నీరా టాండన్ (51)కు అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ కీలక బాధ్యతలు అప్పగించారు. ఇప్పటికే సీని యర్ అడ్వైజర్ హోదాలో ఉన్న ఆమెను వైట్‌హౌస్ స్టాఫ్ సెక్రటరీగా నియమించినట్లు వైట్‌హౌస్ వర్గాలను ఉటంకిస్తూ మీడియా తెలిపింది. అధ్యక్ష భవనం స్టాఫ్ సెక్రటరీగా అధికార యంత్రాంగం, ఫెడరల్ ప్రభుత్వం నుంచి అధ్యక్షుడికి అందే అన్ని రకాల ఫైళ్ల బాధ్యతలను నీరా టాండన్ పర్యవేక్షించాల్సి ఉంటుంది. వైట్‌హౌస్ చీఫ్ ఆఫ్ స్టాఫ్ రాన్ క్లెయిన్కు ఆమె తన విభాగం తరఫున నివేదికలను అందజేస్తారు. అందుకే, వైట్‌హౌస్‌కు సంబంధించి ఈ పోస్టును అత్యంత కీలకమైనదిగా భావిస్తారు. ఈ నియామకానికి సెనేట్ ఆమోదం అవసరం లేదు. జో బైడెన్ 8 నెలల క్రితం వైట్‌హౌస్ ఆఫీస్ ఆఫ్ మేనేజ్మెంట్, బడ్జెట్ డైరెక్టర్ పదవికి ఆమెను నామినేట్ చేయగా రిపబ్లికన్ సెనేటర్లు వ్యతిరేకించారు. దీంతో, ఆమె తన నామినేషన్‌ను ఉపసంహరించుకున్నారు. -
నాసా ఇంటెర్న్.. ఇష్ట దైవాలు
‘నాసా’ ఇంటెర్న్‌గా శిక్షణ పొందుతున్న భారత సంతతి అమెరికన్ ప్రతిమా రాయ్ నాసా లోగో ఉన్న షర్ట్ వేసుకుని, తన డెస్క్‌టాప్ వెనుక హైందవ దేవతల విగ్రహాలు కనిపించేలా తీయించుకున్న ఫొటో ఇంటర్నెట్ను ఇప్పుడు మంత్రముగ్ధం చేస్తోంది. నిజానికి ఆ ఫొటోను ఆమె షేర్ చేయలేదు. కొత్త అభ్యర్థుల కోసం దరఖాస్తులు ఆహ్వానించే ప్రకటనకు నాసా ఉపయోగించిన నలుగురు ఇంటెర్న్ ఫొటోలలో ఈ ఫొటో కూడా ఉంది. ‘మా దగ్గర శిక్షణ పొందదలచిన ఔత్సాహిక వ్యోమగాములకు గడువు తేదీ దగ్గర పడింది’ అని గుర్తు చేస్తూ ఈ నెల 10 న నాసా ఆ ఫొటోలను ట్విట్టర్లో అప్లోడ్ చేసింది. వాటిల్లో ఒకటైన ప్రతిమ ఫొటో భారతీయ సంస్కృతీ సంప్రదాయాలకు ప్రతీకగా ఉంది. అదే సమయంలో శాస్త్ర విజ్ఞాన పరిశోధనలకు సంకేతంగా ఆమె వేసుకున్న షర్ట్ ప్రతిఫలిస్తోంది. ఈ వైరుధ్యంపై నెటిజన్లు మొదట ప్రతికూలంగా స్పందించినప్పటికీ.. మెల్లిమెల్లిగా ప్రతిమకు మద్దతు లభించడం ఆరంభమైంది. సైన్స్‌కు, విశ్వాసాలకు పొంతన ఏమిటి అనే ప్రశ్న కన్నా.. ఒక దేశ సంస్కృతిని ప్రతిబింబిస్తూ ప్రతిమ ఫొటో చక్కగా ఉన్నదన్న సమర్థింపులే ఎక్కువగా పోస్ట్ అవుతున్నాయి. అలా ఫొటో తీయించుకున్న ప్రతిమకు, ఆ ఫొటోనే ఏరి కోరి షేర్ చేసిన నాసాకు ప్రశంసలు లభిస్తున్నాయి. -
బైడెన్ సీనియర్ సలహాదారుగా నీరా
వాషింగ్టన్: భారతీయ–అమెరికన్, విధాన నిపుణురాలు నీరా టాండన్(50)కు అగ్రరాజ్యం అమెరికాలో కీలక పదవి దక్కింది. అధ్యక్షుడు బైడెన్‌కు ఆమె సీనియర్ సలహాదారుగా నియమితులయ్యారు. నీరా రెండు నెలల క్రితమే డైరెక్టర్ ఆఫ్ ద వైట్‌హౌస్ ఆఫీస్ ఆఫ్ మేనేజ్మెంట్ అండ్ బడ్జెట్(ఓఎంబీ) పదవికి నామినేట్ అయ్యారు. అయితే ప్రతిపక్ష రిపబ్లికన్ పార్టీ సెనేటర్లు వ్యతిరేకించడంతో తన నామినేషన్‌ను ఉపసంహరించుకున్నారు. అయినప్పటికీ బైడెన్ తన ప్రభుత్వంలో ఆమె సేవలు అవసరమని భావించారు. దాంతో మరో కీలక పదవి దక్కింది. అధ్యక్షుడి సీనియర్ సలహాదారుగా నీరా బాధ్యతలు నిర్వర్తించబోతున్నారు. యూఎస్ డిజిటల్ సర్వీసు, కేర్ యాక్ట్ వ్యవహారాలను పర్యవేక్షించనున్నట్లు సమాచారం. నీరా ప్రస్తుతం సెంటర్ ఫర్ అమెరికన్ ప్రోగ్రెస్ అధ్యక్షురాలు, ముఖ్య కార్యనిర్వహణాధికారిగా (సీఈఓ) పనిచేస్తున్నారు. సమాజాభివృద్ధి కోసం సంస్థ కృషి చేస్తోంది. సోషల్ మీడియాలో చురుగ్గా వ్యవహరించే నీరా టాండన్ గతంలో పలువురు రాజకీయ నాయకులపై విమర్శనాస్త్రాలు ఎక్కుపెట్టారు. యూఎస్ హెల్త్ డిపార్డ్మెంట్ అండ్ హ్యూమన్ సర్వీసెస్ సీనియర్ అడ్వైజర్‌గానూ సేవలందించారు. బరాక్ ఒబామా ప్రభుత్వం తీసుకొచ్చిన అఫర్డబుల్ కేర్ యాక్ట్ విధివిధానాలను ఖరారు చేయడానికి అమెరికా పార్లమెంట్‌తో కలిసి పనిచేశారు. ఒబామా, బైడెన్ అధ్యక్ష పదవికి పోటీ చేసినప్పుడు వారి తరపున విస్తృతంగా ప్రచారం చేశారు. -
అమెరికాలో తెలుగు జడ్జిమెంట్
ట్రంప్ నోటి వెంట తెలుగు పేరు.. ఒక్కసారిగా కరోనా లాక్డౌన్ దిగులు పోయి ఉత్సాహం పొంగింది.. ఆ పేరు... సరితా కోమటిరెడ్డి.. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఆమెను ఫెడరల్ కోర్టు జడ్జిగా నియమించారు. ఇప్పుడు ఆమె న్యూయార్క్ ఈస్టర్న్ డిస్ట్రిక్ట్ కోర్ట్ జడ్జి. అమెరికాలోని తెలుగు సంతతికి చెందిన మహిళ సాధించిన ఈ గౌరవం కరోనా తెచ్చిన నిరాశను మరిపించింది.. ఉత్సాహాన్ని పంచింది.. సరిత తలిదండ్రుల స్వస్థలం తెలంగాణలోని నల్లగొండ జిల్లా చిట్యాల. తల్లి గీతారెడ్డి రుమటాలజిస్ట్. తండ్రి హనుమంత్ రెడ్డి కార్డియాలజిస్ట్. అమెరికాలో స్థిరపడ్డారు. సరిత పుట్టి పెరిగింది అమెరికాలోనే. చిన్నప్పటి నుంచి ఆమె ప్రతిభ గల విద్యార్థినే. బీఏ డిగ్రీలోనూ హార్వర్డ్ లా స్కూల్ నుంచి న్యాయశాస్త్రంలోనూ డిస్టింక్షన్ సాధించింది. లాయర్‌గా కొలంబియా సర్క్యూట్ అప్పీల్స్ కోర్ట్ జడ్జి బ్రెట్ కెవనా దగ్గర అసిస్టెంట్‌గా ప్రాక్టీస్ మొదలుపెట్టింది. ఆ తర్వాత అమెరికాలోని అతి పెద్ద చమురు ఉత్పత్తి కంపెనీ అయిన ‘బీపీ డీప్‌వాటర్ హారిజన్ ఆయిల్ స్పిల్ అండ్ ఆఫ్‌షోర్ డ్రిల్లింగ్’పై ఏర్పాటు చేసిన జాతీయ కమిషన్‌లో న్యాయసలహాదారుగా పనిచేసింది. 2018లో ‘ఇంటర్నేషనల్ నార్కోటిక్స్ అండ్ మనీ లాండరింగ్’ డిప్యూ్యటీ చీఫ్‌గా, కంప్యూటర్ హ్యాకింగ్ అండ్ ఇంటలెక్చువల్ ప్రాపర్టీ కోఆర్డినేటర్‌గానూ ఉన్నారు. న్యూయార్క్ ఈస్టర్న్ డిస్ట్రిక్ట్ కోర్ట్ జడ్జిగా నియామకానికి ముందువరకూ న్యూయార్క్ ఈస్టర్న్ డిస్ట్రిక్ట్ కోర్టులోని అమెరికా అటర్నీ ఆఫీస్ జనరల్ క్రైమ్స్ విభాగానికి డిప్యూటీ చీఫ్‌గా పనిచేశారు. కొలంబియా లా స్కూల్లో న్యాయశాస్త్రం బోధిస్తున్నారు. సరితా తొలి బాస్ అయిన జడ్జి బ్రెట్ కెవనా సిఫారసు మేరకే సరితను న్యూయార్క్ ఈస్టర్న్ డిస్ట్రిక్ట్ కోర్ట్ జడ్జిగా నియమించారు డొనాల్డ్ ట్రంప్. అయితే ఈ నియామకం ఫిబ్రవరిలోనే జరగాల్సింది. కరోనా మహమ్మారి వల్ల వాయిదా పడి ఇప్పుడు సాధ్యమైంది. ఒకవైపు భారతీయుల అమెరికా వీసాల పట్ల కఠినంగా ఉంటూనే ఇంకోవైపు భారత సంతతి ప్రతిభను ఆస్థానంలో చేర్చుకుంటున్నాడు ట్రంప్. అమెరికా అధ్యక్షుడిగా ఎన్నికైనప్పటి నుంచి ఇప్పటిదాకా భారత సంతతికి చెందిన మహిళలకు కీలకపదవులు ఇచ్చి భారతీయ మహిళల ప్రజ్ఞాపాటవాల పట్ల తనకున్న గౌరవాన్ని ఇలా చాటుకున్నాడు. -
‘గాప్’ సీఈవోగా సోనియా సింగాల్
పెప్సీకో సీఈవో ఇంద్రా నూయీ తర్వాత అంతటి ఘనతను మరో భారత సంతతి మహిళ సాధించారు. భారత సంతతి అమెరికన్ మహిళల్లోనే అత్యున్నత హోదా సాధించారు. ఆమే సోనియా సింగాల్(49). ఫార్చూన్500 కంపెనీల్లో 186వ స్థానంలో ఉన్న ప్రముఖ దుస్తుల తయారీ సంస్థ ‘గాప్ ఇంక్’కు ఆమె సీఈవో అయ్యారు. ఈ కంపెనీ ఆదాయం ఏడాదికి 18 బిలియన్ డాలర్లు. అమెరికాసహా విదేశాల్లో 3,727 స్టోర్లు ఉన్న ఈ సంస్థలో 1.35 లక్షల మంది ఉద్యోగులు పనిచేస్తున్నారు. అంతకుముందు ఈమె సన్ మైక్రోసిస్టమ్స్, ఫోర్డ్ మోటార్స్‌లో 15 ఏళ్లపాటు పనిచేశారు. గాప్ ఇంక్‌లో 2004లో చేరిన ఈమె గ్రూప్‌లోని ఓల్డ్ నేవీ సీఈవోగా, గాప్ ఇంక్ యూరప్ ఎండీగా ఉన్నారు. అమెరికాలో ముగ్గురు శ్వేత జాతి నాయకుల మధ్య ఎన్నికల ప్రచారంలో భాగంగా భిన్నత్వం, లింగ సమానత్వంపై జోరుగా చర్చ సాగుతున్న సమయంలో ఈ నియామకం చోటుచేసుకోవడం ప్రాధాన్యం సంతరించుకుంది. ఫార్చూన్500 కంపెనీల్లో ఎన్నడూ లేని విధంగా అత్యధికంగా 33 మంది మహిళలు ప్రస్తుతం సీఈవోలుగా ఉన్నారు. వలస వచ్చిన కుటుంబాల నుంచి మహిళలు సీఈవో స్థాయికి ఎదగడం అరుదు. భారత్‌లో పుట్టిన సోనియా కుటుంబం.. ఆమె చిన్నతనంలో కెనడాకు తర్వాత అమెరికాకు వెళ్లింది. సోనియా కెట్టరింగ్ వర్సిటీ నుంచి మెకానికల్ ఇంజినీరింగ్‌లో డిగ్రీ, స్టాన్ఫోర్డ్ వర్సిటీ నుంచి మాస్టర్స్ డిగ్రీ పొందారు. -
నోబెల్ విజేత గుంటూరు వచ్చారు!
సాక్షి ప్రతినిధి, అమరావతి బ్యూరో: ఆర్థిక శాస్త్రంలో నోబెల్ బహుమతి విజేత అభిజిత్ బెనర్జీ పరిశోధనల కోసం గతంలో గుంటూరులో పర్యటించిన విషయం వెలుగులోకి వచ్చింది. 2006 అక్టోబరులో ‘ది ఎకనమిక్ లైవ్స్ ఆఫ్ ది పూర్’ పేరిట ప్రచురించిన పరిశోధనా పత్రంలో గుంటూరులో పేద మహిళల జీవన స్థితిగతులను పరిశీలించినట్లు పేర్కొన్నారు. రోజుకు ఒక డాలర్ కంటే తక్కువ సంపాదనతో బతుకీడుస్తున్న వారి జీవన స్థితిగతులను అధ్యయనం చేసి, పేదరికాన్ని జయించగలిగే మార్గాలను అన్వేషించడానికి వీలుగా 13 దేశాల్లో డేటాను ఆయన తన సహచర పరిశోధకురాలు ఎస్తేర్ డఫ్లోతో కలిసి సేకరించారు. అందులో ఏమని రాశారంటే.. ‘ఉదయం 9 గంటలకు పేదరికం తాండవిస్తున్న వీధికి వెళ్లాం. తమ ఇళ్ల ముందు మహిళలు దోసెలు వేసి విక్రయిస్తున్న దృశ్యం కనిపించింది. ప్రతి ఆరో ఇంటివద్ద ఇది కనిపించింది. ఒక్కో దోసె రూ. 1కి విక్రయిస్తున్నారు. ఒక గంట తర్వాత మళ్లీ ఆ వీధిలో వెనక్కి వచ్చాం. దోసెలు వేస్తున్న వారంతా కట్టేసి వెళ్లిపోయారు. ఇంట్లో ఉన్న ఒక మహిళతో మాట్లాడితే... దోసెలు అమ్మిన తర్వాత రోజంతా ఖాళీగా ఉండకుండా మరో పని చేస్తాం. నేను చీరలు విక్రయిస్తాను అని తెలిపారు. ఒకే పని చేసి, దాంట్లోనే నైపుణ్యం, అనుభవం సంపాదిస్తే మెరుగైన సంపాదన ఉంటుంది కదా? అని అడిగిన ప్రశ్నలకు మహిళల నుంచి వచ్చిన సమాధానాలు వివిధ రకాలుగా ఉన్నాయి. దోసెల పని అయిన తర్వాత రోజంతా ఖాళీగా ఉండటం ఎందుకని మరో పనిచేస్తున్నామని కొందరు చెప్పారు. ఒకే పని(వ్యాపారం) చేస్తే నష్టభయం ఉంటుందని, రెండు–మూడు రకాల పనులు చేయడం వల్ల నష్టభయం తక్కువగా ఉంటుందని మరి కొందరు చెప్పారు. ‘దోసెలు వేయడం వల్ల పెద్దగా లాభం రావడం లేదని గమనించాం. దోసెలు తయారీకి ఉపయోగించే పొయ్యి, ఇతర వస్తువులన్నీ ఇంట్లోవే. అందువల్ల పెట్టుబడి అవసరం లేదు. నష్టమూ తక్కువే. అందుకే ఎక్కువ మంది ఈ పనిచేస్తున్నారు’ అని పరిశోధనాపత్రంలో పేర్కొన్నారు. తాము హైదరాబాద్‌ను కూడా సందర్శించినట్లు పరిశోధనా పత్రంలో పేర్కొన్నారు. (చదవండి: పేదరికంపై పోరుకు నోబెల్) -
అభిజిత్‌కు నోబెల్
-
పేదరికంపై పోరుకు నోబెల్
స్టాక్‌హోమ్: ప్రపంచవ్యాప్తంగా పేదరికాన్ని నిర్మూలించడానికి వినూత్న కోణంలో పరిశోధనలు చేసి ఆర్థిక రంగంలో విప్లవాత్మక మార్పుల్ని తెచ్చినందుకు ప్రవాస భారతీయుడు అభిజిత్ బెనర్జీకి అర్థశాస్త్రంలో నోబెల్ పురస్కారం వరించింది. ఈ ఏడాది ఆర్థిక నోబెల్ పురస్కారాన్ని ముగ్గురికి ప్రకటించారు. అభిజిత్, ఆయన భార్య ఎస్తర్ డఫ్లో, మరో అమెరికన్ ఆర్థికవేత్త మైకేల్ క్రెమెర్‌లు సంయుక్తంగా ఈ అవార్డును అందుకోనున్నారు. భార్యతో కలిసి ఒక ప్రవాస భారతీయుడు అర్థశాస్త్రంలో నోబెల్‌ను దక్కించుకోవడం ఒక విశేషమైతే, ఆర్థిక శాస్త్రంలో నోబెల్ పురస్కారాన్ని పొందిన రెండో మహిళ డఫ్లో. ఈ పురస్కారం కింద తొమ్మిది లక్షల 18 వేల అమెరికా డాలర్ల నగదు, ఒక బంగారు పతకం, డిప్లొమా అందిస్తారు. అమెరికన్ ఆర్థికవేత్త మైకేల్ క్రెమెర్ పురస్కారం కింద వచ్చే నగదు బహుమానాన్ని ముగ్గురు ఆర్థికవేత్తలు సమానంగా పంచుకుంటారు. ‘‘వీరు చేసిన పరిశోధనలు, ప్రతిపాదనలతో ప్రపంచవ్యాప్తంగా పేదరికాన్ని సమర్థమంతంగా ఎదుర్కొంటున్నాం. కేవలం రెండు దశాబ్దాల్లోనే ఆర్థిక రంగంలో స్పష్టమైన మార్పుల్ని , అభివృద్ధిని చూడగలుగుతున్నాం. అధ్యయనాలు చేయడానికి ఇప్పుడు ఈ రంగమే అత్యంత కీలకంగా ఉంది. ఎందరో అధ్యయనకారు లు ఈ ముగ్గురు అడుగుజాడల్లోనే నడుస్తూ పేదరికాన్ని పారద్రోలడానికి శక్తిమంతమైన ప్రతిపాదనలు చేస్తున్నారు’’ అని నోబె ల్ పురస్కారాన్ని ప్రకటించిన రాయల్ స్వీడిష్ అకాడమీ ఆఫ్ సైన్సెస్ ప్రకటించింది. వినూత్న ధోరణితో వీరు చేసిన అధ్యయనాలు పేదరికం నిర్మూలనకు పరిష్కార మార్గాలను చూపించిందని కొనియాడింది. ప్రధాని అభినందనలు: ఆర్థిక నోబెల్‌కు ఎంపికైన ప్రవాస భారతీయుడు అభిజిత్ బెనర్జీకి ప్రధాని మోదీ అభినందనలు తెలిపారు. పేదరిక నిర్మూలనలో బెనర్జీ గణనీయ కృషి చేశారన్నారు. ఏపీ సీఎం జగన్ అభినందనలు సాక్షి, అమరావతి: ఆర్థిక శాస్త్రంలో నోబెల్ బహుమతిని ఎస్తర్ డఫ్లో, మైఖేల్ క్రెమెర్‌తో కలిసి సంయుక్తంగా గెలుచుకున్నందుకు అభిజిత్ బెనర్జీకి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ట్విట్టర్లో అభినందనలు తెలిపారు. ప్రపంచంలోని పేదరికాన్ని నిర్మూలించడంలో వారు చేసిన కృషిని ఆయన కొనియాడారు. భారత్ పుంజుకునే పరిస్థితి లేదు: అభిజిత్ కోల్‌కతా/న్యూయార్క్: భారత ఆర్థిక వ్యవస్థ పరిస్థితి అంత ఆశాజనకంగా ఏమీ లేదని అభిజిత్ బెనర్జీ వ్యాఖ్యానించారు. భారత ఆర్థిక వ్యవస్థ అస్థిరంగా ఉందన్న బెనర్జీ.. మళ్లీ పుంజుకునే అవకాశాలు కూడా కనుచూపు మేరలో కనిపించడం లేదని అమెరికాలోని ఒక న్యూస్ చానల్‌తో అన్నారు. మళ్లీ నిద్రపోయా..: ‘నోబెల్ పురస్కారం ప్రకటించారన్న సమాచారం తెల్లవారు జామున ఒక ఫోన్‌కాల్ ద్వారా తెలిసింది. నేను ఉదయమే నిద్రలేచే వ్యక్తిని కాదు. అందుకే ఆ వార్త విన్న తరువాత మళ్లీ పడుకున్నాను. కానీ, వరస ఫోన్‌కాల్స్‌తో ఎక్కువసేపు నిద్ర పోలేకపోయాను’ అని బెనర్జీ వివరించారు. భార్యకు తనకు కలిపి నోబెల్ రావడంపై స్పందిస్తూ. ‘అది మరింత స్పెషల్’ అన్నారు. దంపతులిద్దరికీ నోబెల్ రావడం గతంలో ఐదు పర్యాయాలు జరిగింది. నోబెల్ భారతీయం ► రవీంద్రనాథ్ ఠాగూర్ (సాహిత్యం, 1913) ► సీవీ రామన్ (భౌతికశాస్త్రం, 1930) ► హర గోవింద్ ఖురానా (ఇండియన్ అమెరికన్), వైద్యం, 1968 ► మదర్ థెరిసా (శాంతి పురస్కారం, 1979) ► సుబ్రహ్మణ్యన్ చంద్రశేఖర్ (ఇండియన్ అమెరికన్), భౌతికశాస్త్రం, 1983 ► అమర్త్యసేన్ (ఆర్థికశాస్త్రం, 1998) ► వెంకటరామన్ రామకృష్ణన్, (రసాయనశాస్త్రం, 2009) ► కైలాస్ సత్యార్థి (శాంతి పురస్కారం, 2014) ► అభిజిత్ బెనర్జీ (ఇండియన్ అమెరికన్), ఆర్థికశాస్త్రం, 2019 కోల్‌కతా వాసి పశ్చిమబెంగాల్‌కు చెందిన ఆర్థికవేత్తలు ప్రొఫెసర్ నిర్మల, దీపక్ బెనర్జీలకు కోల్‌కతాలో 1961లో అభిజిత్ బెనర్జీ జన్మించారు. ఆయన విద్యాభ్యాసం అంతా భారత్‌లోనే సాగింది. కోల్‌కతా ప్రెసిడెన్సీ కాలేజీలో డిగ్రీ చేశారు. ఉన్నతాభ్యాసం కోసం అమెరికా వెళ్లి 1988లో హార్వర్డ్ యూనివర్సిటీ నుంచి ఆర్థికశాస్త్రంలో పీహెచ్డీ చేశారు. 2003లో ఎస్తర్ డఫ్లోతో కలిసి అబ్దుల్ లతీఫ్ జమీల్ పోవర్టీ యాక్షన్ ల్యాబ్ (జే–పాల్)ను స్థాపించారు. ప్రస్తుతం ప్రతిష్టాత్మక మాసాచూసెట్స్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (ఎంఐటీ)లో ఆర్థికశాస్త్రంలో ప్రొఫెసర్‌గా పనిచేస్తున్నారు. 2015 తర్వాత అభివృద్ధి ఎజెండా అనే అంశంలో ఐక్యరాజ్య సమితి ఏర్పాటు చేసిన హైలెవల్ ప్యానెల్ ఆఫ్ ఎమినెంట్ పర్సన్స్‌లో కూడా అభిజిత్ పనిచేశారు. ఫ్రాన్స్‌కు చెందిన ఎస్తర్ డఫ్లో ఎంఐటీ నుంచి ఆర్థిక శాస్త్రంలో పీహెచ్డీ చేశారు. విద్య, ఆరోగ్యం, ఆర్థికం, పర్యావరణం, పరిపాలన వంటి పలు రంగాల్లో పనిచేశారు. ప్రస్తుతం ఎంఐటీలో ప్రొఫెసర్‌గా ఉన్న ఆమె తనకు వచ్చిన ఈ అవార్డు ద్వారా మహిళా లోకం స్ఫూర్తి పొంది ఆర్థిక రంగంలో అద్భుతాలు చేయాలని పిలుపునిచ్చారు. 47 ఏళ్ల వయసుకే అవార్డు దక్కించుకొని అతి చిన్న వయస్కురాలిగా రికార్డు సృష్టించారు. పురస్కారం పొందిన మరో ఆర్థికవేత్త 54 ఏళ్ల వయసున్న క్రెమర్ హార్వర్డ్ వర్సిటీలో ప్రొఫెసర్‌గా ఉన్నారు. సూటి ప్రశ్నలు సంధిస్తూ.. అభిజిత్ బెనర్జీది మొదట్నుంచి సూటిగా ప్రశ్నలు వేసే తత్వం. వాటికి తగిన సమాధానాలు దొరికేవరకు ఆయన విస్తృతంగా అధ్యయనం చేసేవారు. ఇలాంటి వినూత్న ధోరణిని అవలంబించడం వల్లే ఆయనకు నోబెల్ పురస్కారం అంది వచ్చింది. ఒక ఆర్థికవేత్తగా అభిజిత్ ఎన్నో ఆర్టికల్స్ రాశారు. కొన్ని డాక్యుమెంటరీలు తీశారు. పలు పుస్తకాలు కూడా రచించారు. వాటిలో భార్య డఫ్లోతో కలిసి రచించిన పూర్ ఎకనామిక్స్ అనే పుస్తకం విశేషంగా గుర్తింపు పొందింది. 17 భాషల్లోకి అనువాదమైంది. 2011లో ఫైనాన్షియల్ టైమ్స్, గోల్డ్‌మ్యాన్ సాచ్స్ బిజినెస్ బుక్ ఆఫ్ ది ఇయర్ అవార్డుల్ని గెలుచుకుంది. ► మొరాకోలో ఒక వ్యక్తికి కడుపు నిండా తిండి లేకపోయినా టీవీ కొనుక్కోవాల్సిన అవసరం ఏమిటి ? ► దారిద్య్ర ప్రాంతాల్లో చిన్నారులు పాఠశాలలకు వెళ్లినా వారికి చదువు నేర్చుకోవడం ఎందుకు కష్టంగా మారుతోంది ? ► గంపెడు మంది పిల్లలు ఉంటే నిరుపేదలుగా మారుతారా ? వంటి ప్రశ్నలకు సమాధానాలు దొరకడం దుర్లభం. చిత్తశుద్ధితో వీటికి సమాధానాలు దొరికే మార్గాలను వెతకాలి అని బెనర్జీ ఆ పుస్తకంలో పేర్కొన్నారు. -
మిస్ ఇండియా ‘వరల్డ్‌వైడ్’గా శ్రీ సైనీ
వాషింగ్టన్: మిస్ ఇండియా వరల్డ్‌వైడ్ కిరీటం భారతీయ అమెరికన్ యువతి శ్రీ సైనీ(22)కి దక్కింది. న్యూజెర్సీలోని ఫోర్డ్స్ సిటీలో శనివారం జరిగిన 27వ ప్రపంచ పోటీల్లో 17 దేశాల్లోని భారతీయ సంతతికి చెందిన యువతులు పాల్గొన్నారు. ఆస్ట్రేలియాకు చెందిన సాక్షి సిన్హా, బ్రిటన్‌కు చెందిన అనూషా సరీన్ మొదటి, రెండో రన్నర్ అప్స్‌గా ఎంపికయ్యారు. శ్రీ సైనీకి 12 ఏళ్ల వయస్సులోనే గుండె చికిత్స జరిగింది. ఆరోగ్య కారణాల రీత్యా డ్యాన్స్ చేయవద్దని వైద్యులు హెచ్చరించారు. అయినప్పటికీ ఆమె మనోనిబ్బరం కోల్పోలేదు. -
డీసీ సర్క్యూట్ కోర్టు జడ్జిగా భారతీయురాలు!
వాషింగ్టన్: డీసీ సర్క్యూట్ కోర్ట్ ఆఫ్ అప్పీల్స్‌కు జస్టిస్ బ్రెట్ కెవెనా స్థానంలో భారతీయ–అమెరికన్ న్యాయవాది నియోమి రావు (45)ను అధ్యక్షుడు ట్రంప్ నామినేట్ చేశారు. వాషింగ్టన్లో వైట్‌హౌస్‌లో మంగళవారం భారతీయ–అమెరికన్ ఉన్నతాధికారులు, అమెరికాలో భారత రాయబారి నవతేజ్ సర్నాతో కలిసి దీపావళి వేడుకల్లో పాల్గొన్న సందర్భంగా ఆయన ఈ ప్రకటన చేశారు. అమెరికాలో సుప్రీంకోర్టు తర్వాత రెండో ఉన్నత న్యాయస్థానం డీసీ సర్క్యూట్ కోర్ట్ ఆఫ్ అప్పీల్స్. తనను జడ్జిగా నామినేట్ చేసి తనపై విశ్వాసముంచినందుకు ట్రంప్‌కు నియోమిరావు కృతజ్ఞతలు తెలిపారు. సెనెట్ ఆమోదిస్తే డీసీ సర్క్యూట్లో కోర్టులో ఆమె రెండో భారతీయ అమెరికన్ జడ్జి అవుతారు. కాగా ‘శ్రమజీవులైన భారతీయులు, ఇతర ఆసియన్ సంతతి ప్రజలు అమెరికాను వేర్వేరు రంగాల్లో సుసంపన్నం చేస్తున్నారు. ఇది అమెరికా చేసుకున్న అదృష్టం’ అని వైట్‌హౌస్‌లో దీపావళి వేడుకల్లో ట్రంప్ అన్నారు. భారత్, అమెరికాల మధ్య సత్సంబంధాలు ప్రపంచశాంతి, శ్రేయస్సు, స్వేచ్ఛకు రక్షణ కవచంలా మారుతాయన్నారు. -
సిలికాన్ వ్యాలీలో ఇండో- అమెరికన్ అరెస్ట్
వాషింగ్టన్ : హెచ్-1 బీ వీసాల మోసానికి పాల్పడుతున్న ఇండో- అమెరికన్‌ను సిలికాన్ వ్యాలీలో అరెస్టు చేసినట్లు పోలీసులు తెలిపారు. అమెరికా లేబర్ డిపార్ట్మెంట్, హోంలాండ్ సెక్యూరిటీ విభాగానికి తప్పుడు పత్రాలు సమర్పించి విదేశీయులకు బోగస్ వీసాలు అందించిన కేసులో అతడిని అదుపులోకి తీసుకున్నట్లు వెల్లడించారు. ఈ క్రమంలో శుక్రవారం అతడిని మెజిస్ట్రేట్ ముందు ప్రవేశపెట్టినట్లు పేర్కొన్నారు. వివరాలు.. భారత్‌కు చెందిన కిషోర్ కుమార్ కవురు(46) నాలుగు కన్సల్టెన్సీ సంస్థలకు యజమానిగా ఉన్నాడు. త్వరితగతిన వీసాలు జారీ చేస్తామంటూ విదేశీయులకు గాలం వేసేశాడు. వారి నుంచి పెద్ద మొత్తంలో డబ్బులు వసూలు చేసి బోగస్ వీసాలు అంటగట్టాడు. ఇందుకోసం ప్రత్యేకంగా ఓ టీమ్‌ను కూడా తయారు చేసుకున్నాడు. కాగా వీసా ఫ్రాఢ్ నేరంలో అతడికి 10 ఏళ్ల జైలు శిక్షతో పాటు, 2.5 లక్షల డాలర్ల జరిమానా కూడా విధించారు. -
అమెరికాలో భారత సంతతి మహిళకు అరుదైన గౌరవం
-
నిక్కీ అడుగులు ఎటువైపు ?
ఐక్యరాజ్య సమితిలో అమెరికా రాయబారి, భారతీయ అమెరికన్ నిక్కీ హేలీ ఆకస్మికంగా రాజీనామా చేయడం పలు ఊహాగానాలకు దారి తీస్తోంది. అమెరికాలో మధ్యంతర ఎన్నికలకు నెలరోజుల ముందు ఆమె రాజీనామా చేయడం ట్రంప్ సర్కార్‌కి దెబ్బేనన్న భావన వ్యక్తమవుతోంది. రాజీనామా అనంతరం ప్రెస్ మీట్లో నిక్కీ హేలీ ట్రంప్‌ను పల్లెత్తు మాట అనలేదు. పైపెచ్చు 2020 అధ్యక్ష ఎన్నికల్లో ఆయనకే తాను మద్దతు పలుకుతానని స్పష్టం చేశారు. వచ్చే అధ్యక్ష ఎన్నికల్లో నిక్కీ హేలీ పోటీపడతారన్న ఊహాగానాలకు ఆమె తెరదించుతూ తాను ట్రంప్ తరఫున ప్రచారం చేస్తానని మాత్రమే ఆమె వెల్లడించారు. అధ్యక్ష ఎన్నికల్లో ఆమె పోటీ పడినా, లేకపోయినా ట్రంప్‌కు రాజకీయంగా ముప్పుగా మారుతారన్న విశ్లేషణలైతే వినిపిస్తున్నాయి. రాజకీయ అడుగులు ఎటు ? నిక్కీ హేలీ అమెరికా రాజకీయాల్లో తనకంటూ సొంతంగా ఒక గుర్తింపును తెచ్చుకున్నారు. భారత వలసదారుల కుటుంబంలో పుట్టి, మైనార్టీగా ఉన్నప్పటికీ 2010లో దక్షిణ కేరొలినాకు తొలి మహిళా గవర్నర్‌గా ఎన్నికయ్యారు. అతి పిన్న వయసులోనే గవర్నర్ పదవిని చేపట్టిన మహిళగా రికార్డు సృష్టించారు. 2014లో తిరిగి గవర్నర్ పదవి చేపట్టారు. ట్రంప్ ప్రభుత్వంలో చేరేవరకు గవర్నర్‌గానే ఉన్నారు. అమెరికా రాయబారిగా ఆమె అనుసరించిన విదేశీ విధానం విమర్శకుల ప్రశసంల్ని సైతం పొందింది . ట్రంప్ ప్రభుత్వంలో రాజకీయ చాతుర్యాన్ని ప్రదర్శిస్తూ వైట్‌హౌస్‌తో వ్యవహారాల్లో విచక్షణ చూపిస్తూ, అమెరికా విదేశాంగ విధానానికి ఒక గుర్తింపు తెచ్చిన మహిళగా పేరు సంపాదించారు.‘‘రిపబ్లికన్ పార్టీలో నిక్కీ హేలీ ఒక రైజింగ్ స్టార్. అలాంటివారు ఎప్పటికైనా ట్రంప్‌కి ముప్పుగానే మారతారు’’ అని రిపబ్లికన్ పార్టీ వ్యూహకర్త మైక్ ముర్ఫీ అభిప్రాయపడ్డారు. రిపబ్లికన్‌పార్టీ అభ్యర్థుల ప్రచార వ్యూహకర్తగా పనిచేసిన క్రిస్టిన్మాథ్యూస్ కూడా హేలీ తన సొంత ప్రయోజనాల కోసమే రాయబారి పదవికి రాజీనామా చేసినట్టు అంచనా వేశారు. ‘‘హేలీ అద్భుతమైన పనితీరుని కనబరిచారు. ఆమెకున్న పేరుప్రతిష్టలను పెంచుకున్నారు. ట్రంప్ పాలనాయంత్రాంగంలో హేలీలాంటి వ్యక్తి మరొకరు కనిపించరు. భవిష్యత్ రాజకీయ కోసమే ఆమె పదవి నుంచి తప్పుకున్నారు’’అని మాథ్యూస్ వ్యాఖ్యానించారు.. డెమొక్రాట్లు కూడా హేలీ పనితీరుని అభినందించిన సందర్భాలు ఉన్నాయి. రాజకీయంగా ఆమె అడుగులు ఎటు వైపు వేస్తారన్న చర్చ డెమొక్రాటిక్ పార్టీలోకూడా సాగుతోంది. ట్రంప్‌తో ఢీ కొనాలంటే 2020లో అధ్యక్ష బరిలోకి దిగాలని, 2024 వరకు వేచి చూస్తే ఇప్పుడున్న పేరుని హేలీ కాపాడుకోవడం కష్టమన్న అభిప్రాయమూ వినిపిస్తోంది. గత ఎన్నికల్లో ట్రంప్‌తో ఢీ అంటే ఢీ గత అధ్యక్ష ఎన్నికల ప్రచారంలో నిక్కీ హేలీ ట్రంప్‌కు మద్దతు ఇవ్వలేదు. ఫ్లోరిడా సెనేటర్ మార్కో రూబియోకు మద్దతుగా నిలవడమే కాదు, ట్రంప్‌ను తరచూ విమర్శించే వారు. ఆయన మాటల్ని తిప్పికొడుతూ ఉండేవారు. అయినప్పటికీ హేలీ సొంత రాష్ట్రంలోని ప్రైమరీ ఎన్నికల్లో ట్రంప్ గెలిచారు. ట్రంప్ అధ్యక్షుడయ్యాక లైంగిక ఆరోపణలు వచ్చిన సమయంలో కూడా ఆమె బాధితుల పక్షానే మాట్లాడారు. ట్రంప్ ప్రభుత్వంలో చేరిన తర్వాత కూడా హేలీ ట్రంప్‌కు వ్యతిరేకమనే ఆరోపణలు కూడా వచ్చాయి. ట్రంప్ వ్యవహారశైలిపై ఆరోపణలు గుప్పిస్తూ న్యూయార్క్ టైమ్స్ పత్రికలో పేరు లేకుండా ప్రచురితమైన∙వ్యాసం నిక్కీ హేలీ రాసినదేనన్న ప్రచారం కూడా జరిగింది. కానీ ఆమె దానిని ఖండిస్తూ అధ్యక్షుడిని సవాల్చేయాల్సి వస్తే నేరుగానే చేస్తానని చెప్పుకున్నారు. ఇలా మొదట్నుంచి ట్రంప్‌ను వ్యతిరేకిస్తూ వస్తున్న హేలీ భవిష్యత్‌లో కూడా రాజకీయంగా ఢీ కొడతారన్న అభిప్రాయమైతే వినిపిస్తోంది. అమెరికా రాయబారి పదవికి నిక్కీ హేలీ రాజీనామా -
‘అమెరికా డ్రగ్స్ నియంత్రణ’ చీఫ్‌గా భారతీయుడు
వాషింగ్టన్: అమెరికా ప్రభుత్వంలో మరో భారత సంతతి న్యాయ వాదికి కీలక పదవి దక్కింది. మాదక ద్రవ్యాల రవాణా, వాడకం కట్టడికి కృషి చేస్తున్న డ్రగ్ ఎన్ఫోర్స్మెంట్ ఏజెన్సీ నూతన యాక్టింగ్ అడ్మినిస్ట్రేటర్‌గా ఇండో–అమెరికన్ ఉత్తమ్ ధిల్లాన్ ఎంపికయ్యారు. ఇటీవలే ఆ పదవి నుంచి విరమణ పొందిన రాబర్ట్ ప్యాటర్సన్ స్థానంలో ఆయన మంగళవారం బాధ్యతలు చేపట్టారు. గతంలో ధిల్లాన్ శ్వేతసౌధంలో అధ్యక్షుడు ట్రంప్‌కు డిప్యూటీ కౌన్సెల్, డిప్యూటీ అసిస్టెంట్‌గా పనిచేశారు. న్యాయ విభాగం, హోంల్యాండ్ సెక్యూరిటీ, కాంగ్రెస్‌లలో వేర్వేరు హోదాల్లో విధులు నిర్వర్తించారు. ఉన్నత స్థాయిలో డ్రగ్స్ అక్రమ రవాణాదారులకు వ్యతిరేకంగా వాదించారు. 2006లో డిపార్ట్ మెంట్ ఆఫ్ హోంల్యాండ్ సెక్యూరిటీ (డీహెచ్ఎస్)లోని కౌంటర్ నార్కోటిక్స్ కార్యాలయానికి తొలి డైరెక్టర్‌గా నియమితులయ్యారు. ఆ హోదాలో నార్కో టిక్స్ సమస్య పరిష్కారానికి కీలక వ్యూహాలు రూపొందించారు. -
కాల్ సెంటర్ స్కాంలో భారతీయులు
వాషింగ్టన్: అమెరికాలో కాల్ సెంటర్ స్కాంలో ఓ భారతీయుడు, భారత సంతతికి చెందిన మరో వ్యక్తి తమ నేరాన్ని అంగీకరించారు. గత ఏప్రిల్, జూన్‌లో ఇదే స్కాంలో భారత్‌కు చెందిన పలువురిపై విచారణ జరగగా తాజాగా మోంటూ బారోథ్, నీలేశ్ పాండ్యాలు మనీలాండరింగ్‌కు పాల్పడినట్లు ఒప్పుకున్నారు. యూఎస్ ఫెడరల్ బ్యూరో అధికారులు తెలిపిన వివరాల ప్రకారం.. నిందితులు గుజరాత్‌లోని అహ్మదాబాద్ కేంద్రంగా ఓ కాల్ సెంటర్‌ను ఏర్పాటు చేశారు. దీనిలో పనిచేసే టెలీ కాలర్లు తాము అమెరికా రెవెన్యూ, ఇమిగ్రేషన్, పౌర సేవల అధికారులుగా పరిచయం చేసుకుంటూ బాధితులకు కాల్స్ చేసి అడిగిన డబ్బులు ఇవ్వకపోతే అరెస్టు, దేశ బహిష్కరణ, తదితర శిక్షలు విధిస్తామని బెదిరించారు. దీంతో బాధితులు వివిధ రూపాల్లో డబ్బులు పంపగా నిందితులు వాటిని వివిధ మార్గాల్లో భారత బ్యాంకులకు తరలించారు. -
మోసం కేసులో భారత–అమెరికన్‌కు జైలు
న్యూయార్క్: అమెరికాలోని ఫ్లోరిడాకు చెందిన నవీన్ శంకర్ సుబ్రమణ్యం గ్జేవియర్ (44) అనే భారత–అమెరికన్‌కు మోసం కేసులో అమెరికా కోర్టు 15 ఏళ్ల జైలు శిక్ష విధించింది. ఫ్లోరిడాలోని ఎసెక్స్ హోల్డింగ్స్ సంస్థకు మాజీ సీఈవో అయిన నవీన్ శంకర్ ఈ సంస్థ ద్వారానే దాదాపు 100 మంది పెట్టుబడిదారులను మోసం చేసినట్లు వెల్లడైంది. మొదటి స్కీమ్‌లో వీరిలో కొందరి నుంచి 33 మిలియన్ డాలర్ల (దాదాపు రూ.213 కోట్లు)ను సేకరించి చిలీలోని ఇనుప గనుల్లో పెట్టుబడి పెట్టినట్లు.. రెండో స్కీమ్‌లో దాదాపు 1.2 మిలియన్ డాలర్ల (దాదాపు రూ.7.75 కోట్లు)ను దక్షిణ కరోలినాలోని ఎకానమిక్ డెవలప్మెండ్ ఫండ్‌లో పెట్టినట్లు నవీన్ నమ్మించారు. అనుమానం వచ్చి కొందరు నిలదీయగా కొత్త పెట్టుబడిదారులను ఆహ్వానించి వారి వద్ద సేకరించిన దాన్ని కొందరు పాతవారికిచ్చేశాడు. జనవరిలో ఈ కేసుకు సంబంధించి విచారణ పూర్తవగా నవీన్ శంకర్ దోషిగా తేలటంతో మియామీ కోర్టు 15 ఏళ్ల జైలు శిక్ష విధించింది. -
తల్లిని హత్య చేసిన భారతీయ అమెరికన్
వాషింగ్టన్: ఏడాది క్రితం కన్న తల్లిని హత్య చేసిన కేసులో 17 ఏళ్ల భారతీయ అమెరికన్ యువకుడిని నార్త్ కరోలినా పోలీసులు అరెస్టు చేశారు. డ్యూక్ మెడికల్ సెంటర్లో పని చేసే నళిని తెల్లప్రోలు (51)ను తన కుమారుడు ఆర్నావ్ ఉప్పలపాటి 2015 డిసెంబర్ 17న గొంతునులిమి, ప్లాస్టిక్ బ్యాగ్ ద్వారా ఊపిరి ఆడకుండా చేసి హత్య చేశాడు. అయితే ఆర్నావ్ మాత్రం తాను స్కూల్ నుంచి వచ్చే సరికి తన తల్లి మృతదేహం కారు వెనుక సీటులో ఉందని అప్పట్లో వాంగ్మూలం ఇచ్చాడు. శవపరీక్షలో ఆమెను కొట్టి, గొంతునులిమి చంపినట్లు తేలింది. దీనిపై వివిధ కోణాల్లో దర్యాప్తు జరిపిన పోలీసులు కుమారుడే హత్య చేశాడని నిర్ధారించి అరెస్టు చేశారు. నేరం నిరూపితమైతే నిందితుడికి పెరోల్ లేకుండా జీవిత ఖైదు పడే అవకాశం ఉంది. ఈ ఘటన షాక్‌కు గురిచేసిందని నార్త్ కరోలినా తెలుగు అసోసియేషన్ పేర్కొంది. -
అమెరికాలో ఎన్నారై సూపర్ మార్కెట్‌కు నిప్పు!
ప్లోరిడా: అగ్రరాజ్యంలో జాత్యంహకార దాడులు ఆగడం లేదు. కూఛిబొట్ల, పటేల్ ఘటనలను మరవకముందు తాజాగా ఫ్లోరిడాలో భారతీయ సంతతికి చెందిన వ్యక్తుల స్టోర్‌పై ఓ వ్యక్తి దాడికి ప్రయత్నించాడు. దానిని కాల్చివేసేందుకు ప్రయత్నం చేశాడు. అయితే, ఆ స్టోర్ భారత సంతతి పౌరులదని తనకు తెలియదని, అరబ్ ముస్లింలది అని అనుకున్నానని చెప్పినట్లు తెలుస్తోంది. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వలసలను అడ్డుకునేందుకు చట్టాన్ని తీసుకొచ్చినప్పటి నుంచి తొలుత దాడులు భారతీయులపైనే ఎక్కువవుతున్నాయి. పోలీసుల కథనం ప్రకారం.. రిచర్డ్ లాయిడ్ అనే 64 ఏళ్ల వ్యక్తి దర్జాగా దుకాణానికి నిప్పుపెట్టి చేతులు వెనక్కి పెట్టుకొని అది తగులబడుతుంటే నవ్వుతూ నిల్చున్నాడు. తమ దేశంలో అరబ్ దేశాలకు చెందిన ముస్లిలు అస్సలు ఉండొద్దనేది తన కోరిక అని, అందుకే దుకాణాన్ని తగులబెట్టేందుకు ప్రయత్నించానని చెప్పాడు. తనను అరెస్టు చేసుకోవచ్చంటూ పోలీసులకు స్వయంగా చెప్పాడు. ఇతడి వ్యాఖ్యలపై స్థానిక అధికారులు విచారం వ్యక్తం చేశారు. దాడికి పాల్పడిన వ్యక్తిని అరెస్టు చేసి జైలుకు తరలించారు. భారతీయ సంతతి ప్రాసిక్యూటర్ తొలగింపు అత్యున్నతస్థాయి ఫెడరల్ ప్రాసిక్యూటర్ ఒకరిని ట్రంప్ ప్రభుత్వం తొలగించింది. భారతీయ సంతతికి చెందిన ప్రీత్ బరార్ను బలవంతంగా తొలగించింది. ‘నేను రాజీనామా చేయడానికి తిరస్కరించాను. ట్రంప్ వర్గం నాపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. దీంతో నాకు ఎటువంటి సమాచారం అందజేయకుండానే పదవి నుంచి తొలగించారు. అమెరికా అటార్నీగా పనిచేయడాన్ని నేను గౌరవంగా భావిస్తాను. తాను పోస్టులో కొనసాగుతానని ఎన్నికల తర్వాత ట్రంప్‌ను కలిసి చెప్పారు. అప్పట్లో ఆయన దీనికి అంగీకరించారు’ అని ఆయన ట్వీట్ చేశారు. బరాక్ ఒబామా నియమించిన ప్రాసిక్యూటర్లను శుక్రవారం ట్రంప్ సర్కారు తొలగించింది. మూకుమ్మడిగా ప్రాసిక్యూటర్లను తొలగించడంపై తీవ్ర విమర్శలు చెలరేగాయి. అలీ కుమారుడికి మళ్లీ అవమానం విఖ్యాత బాక్సర్ మహ్మద్ అలీ కుమారుడు అలీ జూనియర్‌ను అధికారులు మరోసారి ఎయిర్‌పోర్టులో అడ్డుకొని చాలాపుపు ప్రశ్నించారు. అలీ బుధవారం వాషింగ్టన్ ఎయిర్‌పోర్టుకు రాగా అధికారులు దాదాపు 20 నిమిషాలపాటు ప్రశ్నించారు. అలీ తన పాస్‌పోర్ట్, డ్రైవింగ్ లైసెన్సు చూపాకే ఫోర్ట్ ఫ్లోరిడా విమానం ఎక్కడానికి అనుమతించారు. గత నెల ఏడున కూడా అలీ తన తల్లి ఖలీలా కమాచో అలీతోపాటు జమైకా నుంచి ఫోర్ట్ లాడెర్డేల్ ఎయిర్‌పోర్టుకు చేరుకోగా, తనిఖీల పేరుతో అధికారులు వారిని నిర్బంధించారు. అయితే అలీ ధరించిన ఆభరణాల గురించి స్కానర్ల నుంచి అలారం రావడంతో ఆయనను ఆపాల్సి వచ్చిందని అధికారులు వివరణ ఇచ్చారు. తాము ముస్లింలు కావడంతో వల్లే అధికారులు ప్రశ్నించారని అలీ, ఆయన తల్లి గతంలో ఆరోపించారు. ట్రావెల్ బ్యాన్‌ను వ్యతిరేకించిన నిపుణులు వాషింగ్టన్: సవరించిన ప్రయాణ నిషేధ ఉత్తర్వులపై విదేశాంగ నిపుణులు మండిపడుతున్నారు. అసలైన ఉత్తర్వులు కంటే ఈ తాజా ఉత్తర్వులు అమెరికా జాతీయ భద్రతను, ప్రయోజనాలను దెబ్బతీస్తాయని 130 మందికి పైగా విదేశాంగ నిపుణులు పేర్కొంటున్నారు. ఐసిస్ బాధితులు, ఆ ఉగ్రవాద సంస్థతో తలపడుతున్న ముస్లింలకు ఈ ఉత్తర్వులు తప్పుడు సంకేతాలిస్తాయని, ఇస్లాంతో అమెరికా యుద్ధం చేస్తోందనే తప్పుడు ప్రచారానికి ఊతమిస్తుందని చెప్పారు. ముస్లిం శరణార్థులను, ప్రయాణికులను అనుమతించడంద్వారా ఉగ్రవాదులు చేసే అబద్ధపు ప్రచారానికి కళ్లెం వేయొవచ్చని ఆ విదేశాంగ నిపుణులందరకూ కలసి రాసిన లేఖలో పేర్కొన్నారు. ఆ లేఖను విదేశాంగ మంత్రి రెక్స్ టిల్లెర్సన్, రక్షణ మంత్రి జేమ్స్ మేటిస్, అటార్నీ జనరల్, జాతీయ భద్రత చీఫ్‌లకు పంపారు. ఈ లేఖ రాసిన వారిలో గతంలో డెమోక్రటిక్, రిపబ్లికన్ ప్రభుత్వాల హయాంలో పనిచేసిన అధికారులు ఉన్నారు. -
విద్యాప్రచారం కోసం భారత సంతతి బాలిక
వాషింగ్టన్: అమెరికాలో విద్యా ప్రచారం కోసం భారత సంతతి బాలిక శ్వేతాప్రభాకరన్ ఎంపికయ్యారు. ఒబామా సతీమణి మిచెల్ ఒబామా ఏర్పాటు చేసిన ‘బెటర్ మేక్ రూమ్’కు అడ్వైజరీ బోర్డు సభ్యురాలిగా శ్వేత సేవలందిస్తారు. బెటర్ మేక్ రూమ్ అనే సంస్థ యువతను ఇంజనీరింగ్ విద్యవైపు మళ్లించేందుకు కృషిచేస్తోంది. మొత్తం 17 మందిని ఇందుకోసం ఎంపికచేయగా అందులో శ్వేత ఒకరు. ఇందులో 12 మంది హైస్కూల్ విద్యార్థులు ఉంటే, ఐదుగురు కాలేజీ విద్యార్థులు ఉన్నారు. అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా లక్ష్యాలను నేరవెర్చేందుకుగాను బెటర్ మేక్ రూమ్ అనే సంస్థను మిచెల్ బబామా స్థాపించారు. అమెరికాలోని మారుమూల ప్రాంతాల్లో విద్యావ్యాప్తికి కృషి చేస్తూనే యువ ఇంజనీర్లను, శాస్త్రవేత్తలను తయారుచేసేందుకు ఈ సంస్థ కృషి చేస్తుంది. శ్వేత తల్లిదండ్రులు తమిళనాడులోని తిరునవెళ్లికి చెందినవారు. 1998లో అమెరికా వెళ్లి స్థిరపడ్డారు. బెటర్ మేక్ రూమ్ స్టూడెంట్ అడ్వైజరీ బోర్డులో సభ్యులుగా ఎంపిక చేసినందుకు చాలా ఆనందంగా ఉందని శ్వేత అన్నారు. భరతనాట్యంలో 2015 సంవత్సరానికిగాను వైట్‌హౌజ్ నుంచి బహుమతి కూడా గెలుచుకున్నారు శ్వేత. అంతేకాదు ఇంటర్నేషనల్ లిటరసీ అసోసియేషన్–2016కు కూడా ఎంపికయ్యారు. -
ట్రంప్ కేబినెట్లో బాబీ!
వాషింగ్టన్: అమెరికా అధ్యక్షుడిగా విజయం సాధించిన ట్రంప్ కేబినెట్లో భారతీయ అమెరికన్ బాబీ జిందాల్‌కు స్థానం లభించనుందని మీడియా పేర్కొంటోంది. జిందాల్ లూసియానా గవర్నర్‌గా రెండు సార్లు పనిచేయడం తెలిసిందే. ట్రంప్ కేబినెట్లో జిందాల్‌కు స్థానం దక్కితే.. ఆ పదవి పొందిన తొలి భారతీయ అమెరికన్‌గా రికార్డులకెక్కుతారు. అంతేకాకుండా యూఎస్ కాంగ్రెస్‌కు ఎన్నికరుున రెండవ అమెరికన్ అవుతారు.బెన్ కార్సన్‌తో కలసి జిందాల్‌ను ఆరోగ్య కార్యదర్శిగా నియమించే అవకాశం ఉన్నట్లు వాల్ స్ట్రీట్ జర్నల్ పేర్కొంది. వీరిద్దరూ రిపబ్లికన్ పార్టీ తరఫున దేశాధ్యక్ష ఎన్నికలకు పోటీపడడం తెలిసిందే. సుప్రీం జడ్జీల నామినీల్లో అముల్! అమెరికా సుప్రీంకోర్టు జడ్జి పదవి కోసంట్రంప్ తయారుచేసుకున్న జాబితాలో భార తీయ అమెరికన్ జడ్జి అముల్ థాపర్(47) చోటు దక్కించుకున్నారు. ముగ్గురు సుప్రీం జడ్జీల ఎంపిక కోసం 21 మందితో కూడిన ఈ జాబితాలో అముల్ గట్టి అభ్యర్థి. -
అమెరికాలో ఎన్నారైకు జైలు
వాషింగ్టన్: మోసం కేసులో భారత సంతతికి చెందిన తార్సెమ్ సింగ్ అనే వ్యక్తికి అమెరికా కోర్టు జైలు శిక్ష విధించింది. వర్జినియాలోని ఫెయిర్ ఫాక్స్ లో నివాసముంటున్న 61 ఏళ్ల తార్సెమ్ సింగ్ వ్యాపారం పేరుతో 6 మిలియన్ డాలర్ల మోసానికి పాల్పడ్డాడు. 2000-2009 మధ్య కాలంలో తార్సెమ్ సింగ్, అతడి భార్య నిర్మాణ కంపెనీ పెట్టి పలు కాంట్రాక్టులు దక్కించుకుని మోసం చేశారు. ఈ కేసులో గతేడాది డిసెంబర్లో కొలంబియా డిస్ట్రిక్ట్ కోర్టు అతడిని దోషిగా నిర్ధారించింది. ఇప్పుడు శిక్ష ఖరారు చేసింది. అతడికి 15 నెలల కారాగార శిక్షతో పాటు 25 వేల డాలర్ల జరిమానా విధించింది. 119,165 డాలర్లు తిరిగి చెల్లించాలని న్యాయస్థానం ఆదేశించింది. జైలు నుంచి విడుదలైన తర్వాత మూడేళ్ల పాటు అతడిని కనిపెట్టి చూస్తుండాలని పోలీసులకు సూచించింది. శిక్ష ముగిసిన తర్వాత సమాజసేవ చేయాలని తార్సెమ్ సింగ్ ను కోర్టు ఆదేశించింది. -
కాలిఫోర్నియా యూనివర్సిటీకి భారతీయుడి భారీ విరాళం
వాషింగ్టన్: భారత సంతతికి చెందిన భౌతికశాస్త్రవేత్త మణి భూమిక్.. కాలిఫోర్నియా యూనివర్సిటీకి 11 మిలియన్ డాలర్లను(సుమారు రూ. 74 కోట్లు) విరాళంగా ఇచ్చారు. ప్రకృతి సూత్రాల పరిశోధన కోసం కాలిఫోర్నియా యూనివర్సిటీ ప్రత్యేకంగా ఓ కేంద్రాన్ని ఏర్పాటు చేస్తోంది. దీనికోసం భూమిక్ ఈ భారీ విరాళాన్ని అందజేశారు. యూనివర్సిటీ చరిత్రలో ఇదే అతిపెద్ద విరాళమని ఛాన్సలర్ గినే బ్లాక్ తెలిపారు. ప్రపంచంలోనే ప్రఖ్యాతిగాంచిన పరిశోధన కేంద్రం ‘భూమిక్ ఇన్స్టిట్యూట్ ఫర్ థిరీటికల్ ఫిజిక్స్’ను మణి భూమిక్ నిర్వహిస్తున్నారు. కంటికి వాడే లేజర్ చికిత్స అభివృద్ధి చేయడంలో భూమిక్‌ది కీలక పాత్ర. పశ్చిమబెంగాల్లోని ఓమారుమూల గ్రామంలో ఆయనకు ఆరుగురు తోబుట్టువులు ఉన్నారు. చిన్నప్పుడు పూరి గుడిసెలో పెరిగిన భూమిక్ నాలుగు మైళ్లు నడిచి స్కూల్‌కు వెళ్లేవాడు. 1958లో కోల్‌కతా యూనివర్సిటీలో పీజీ, ఖరగ్‌పూర్ నుంచి ఐఐటీ భౌతికశాస్త్రంలో డాక్టరేట్ అందుకున్నారు. 1959లో 3 డాలర్లతో అమెరికాకు వెళ్లిన భూమిక్ 1961లో జిరాక్స్ ఎలక్ట్రో ఆప్టికల్ సిస్టమ్‌లో లేజర్ సైంటిస్టుగా చేరాడు. 2011లో భారత ప్రభుత్వం మణి భూమిక్‌ను పద్మశ్రీ అవార్డుతో సత్కరించింది. -
నేషనల్ జియోగ్రాఫిక్ పోటీలో దుమ్మురేపారు
నేషనల్ జియోగ్రాఫిక్ బీ కాంపిటీషన్ లో భారతీయ అమెరికన్ విద్యార్థులు స్వీప్ చేశారు. తమ అత్యుత్తమ ప్రతిభ కనబర్చి మొదటి స్థానంతో పాటు, రెండు మూడు స్థానాలను కైవసం చేసుకున్నారు. నేషనల్ జియోగ్రాఫిక్ ప్రధాన కార్యాలయం లో జరిగిన 28వ వార్షిక పోటీలో ఫ్లోరిడా కు చెందిన ఆరవ తరగతి విద్యార్థి రిషీ ఫస్ట్ ప్లేస్ కొట్టేసి ప్రతిష్టాత్మక బహుమతిని గెల్చుకున్నాడు. తన సమీప ఇండో అమెరికన్ విద్యార్థులపై పై చేయి సాధించి ఈ భారీ బహుమతిని సొంతం చేసుకున్నాడు. కేరళకు చెందిన రిషీ నాయర్ (12) ఈ ప్రిస్టీజియస్ అవార్డును దక్కించుకున్నాడు. దీనికి గాను 33 లక్షల ప్రైజ్ మనీని (యాభైవేల అమెరికన్ డాలర్లు) స్కాలర్ షిప్ గా నాయర్ కు అందించనుంది. దీంతో పాటు నేషనల్ జియోగ్రాఫిక్ సొసైటీలో జీవితకాల సభ్యత్వం కూడా లభించనుంది. హోరా హోరీగా నడిచిన పోటీలో పసిఫిక్ మహాసముద్రం ద్వీపసముదాయంలో వేల్స్ లాంటి వన్యప్రాణి సంరక్షణ కోసం సాంక్చురీ ఏర్పాటు చేసిన 'గాలా పగోస్ దీవి' పేరు చెప్పి నాయర్ ఈ విజయం సాధించాడు. మరో ఇద్దరు భారతజాతి అమెరికన్ విద్యార్థులు మసాచు సెట్స్ నుంచి సాకేత్ జొన్నలగడ్డ రెండవస్థానంలో, అలబామా కు చెందిన కపిల్ నాథన్ మూడవ స్థానంలో నిలిచారు. కాగా గత ఏడాది కరన్ మీనన్ ఈ పోటీలో విజేతగా నిలువగా... ఇండియన్ అమెరికన్ విద్యార్థులకు వరుసగా ఇది అయిదవ విజయం. గత కొన్నేళ్లుగా ఈ పోటీలో భారతసంతతికి చెందిన అమెరికన్ విద్యార్థులు వరుసగా విజయం సాధిస్తుండడం విశేషం. -
ట్రంప్..నోరు మూసుకో!
వాషింగ్టన్: అమెరికా అధ్యక్ష రేసులో డెమోక్రటిక్ పార్టీ తరఫున ముందున్న హిల్లరీ క్లింటన్, రిపబ్లికన్ పార్టీ అభ్యర్థి డోనాల్డ్ ట్రంప్ పై నిప్పులు చెరిగారు. భారత్ లాంటి దేశాలపై విమర్శలు చేడయం ట్రంప్ అహంకారాన్ని బయట పెడుతున్నాయని పేర్కొన్నారు. కొన్ని మతాలు, జాతులను కించపరిచేలా వ్యాఖ్యలు చేయడం ఇకనైనా మానుకోవాలని సూచించారు. అమెరికాలో ఉన్న భారతీయులను ట్రంప్ టార్గెట్ చేసుకుని వ్యాఖ్యలు చేయడం ఇతర దేశస్థులపై అతడికి ఉన్న అభిప్రాయాన్ని సూచిస్తుందని క్లింటన్ ప్రచారానికి సారథ్యం వహించిన జాన్ పొడెస్టా అన్నారు. విదేశాలపై అనవసరంగా తప్పుడు విమర్శలు, ఆరోపణలు చేయడం కంటే నోరు మూసుకుని ఉండటం ఉత్తమమని హిల్లరీ అభిప్రాయపడ్డారు. ప్రతి దేశానికి స్నేహితులు, కొన్ని తత్సంబంధాలు అవసరమని ట్రంప్ వ్యాఖ్యల వల్ల అంతర్జాతీయంగా అమెరికాకే నష్టం వాటిల్లే అవకాశం ఉందని మేరీల్యాండ్ లో సభ అనంతరం హిల్లరీ చెప్పారు. ఇండియన్స్ మాట్లాడేది ఫేక్ ఇంగ్లీష్ అంటూ కామెంట్లు చేయడంపై డెమోక్రటిక్ పార్టీ తీవ్రంగా మండిపడింది. ఈ వ్యాఖ్యలు తనను ఉద్దేశించి చేసినవేనని క్లింటన్ ప్రచారంలో కీలక వ్యక్తి అయిన ఫ్రాంక్ ఇస్లామ్ పేర్కొన్నారు. -
అమెరికాలో ఇండో-అమెరికన్ మహిళ హత్య
శాన్ఫ్రాన్సిస్కో: అమెరికాలోని కాలిఫోర్నియాలో ఓ ఇండో అమెరికన్ మహిళ దారుణ హత్యకు గురైంది. శాన్ జోన్‌లోని ఇండిగో ఓక్ లేన్‌లో నివాసముంటున్న 48 ఏళ్ల సోనియా నల్లాన్ ను ఆమె భర్త జేమ్స్ నల్లన్ అత్యంత కిరాతకంగా హత్య చేశాడు. ఈ దుర్ఘటన శనివారం జరిగినట్లు తెలుస్తుంది. మృతురాలు సోనియా నల్లాన్ ఎంకోర్ సెమీ కండక్టర్స్ అనే కంపెనీలో పనిచేస్తోంది. 63 ఏళ్ల ఆమె భర్త జేమ్స్ నల్లన్ కూడా ఇండో అమెరికన్ నే. వీరికి ఇద్దరు కుమారులు ఉన్నారు. నిందితున్ని పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. హత్యకు గల కారణాలు తెలియాల్సి ఉందని పోలీస్ ఉన్నతాధికారులు తెలిపారు. -
ఆ సిక్కు నటుడికి ఎయిర్ లైన్స్ క్షమాపణ
న్యూయార్క్: ఎయిర్ పోర్టులో అవమానానికి గురైన సిక్కు నటుడు, డిజైనర్ అయిన ఇండో-అమెరికన్ వారిస్ అహ్లువాలియాకు ఎరోమెక్సికో క్షమాపణలు చెప్పింది. రెండు రోజుల క్రితం మెక్సికో ఎయిర్ పోర్టులో తలపాగా విప్పని కారణంగా సిక్కు నటుడిని ఫ్లైట్ ఎక్కనివ్వలేదు. ఈ విషయమై అతనికి కలిగిన అసౌకర్యానికి ఆ అధికారులు విచారం వ్యక్తం చేస్తూ క్షమించమని కోరారు. ఎయిర్ పోర్ట్ సిబ్బంది ప్రయాణికులతో ఎలా వ్యవహరించాలన్న దానిపై కాస్త స్పష్టత తీసుకొచ్చారు. ప్రయాణికుల మత విశ్వాసాలను గౌరవించాలని, అన్ని మతాల వారిని ఒకేతీరుగా చూడాలని ఎరో మెక్సికో అధికారిక ప్రకటన విడుదల చేసింది. సెక్యూరిటీ అంశాలపై జాగ్రత్తగా ఉన్నప్పటికీ ప్రయాణికులను అగౌరవపరచరాదని సిబ్బందికి సూచించింది. న్యూయార్క్ కు వెళ్లాలని ఎయిర్ పోర్టుకు వచ్చాడు. తమ సాంప్రదాయంలో భాగమైన తలపాగాను తొలగించాలని ఎయిర్ పోర్ట్ సిబ్బంది అతడిపై ఒత్తిడి తీసుకొచ్చారు. ఇందుకు అహ్లువాలియా నిరాకరించాడు. దీంతో ఆగ్రహించిన అధికారులు అతడిని విమానం నుంచి దింపేశారు. మెక్సికో కస్టమర్ సర్వీస్ డెస్క్ ముందు తన బోర్డింగ్ పాస్ చేతిలో పట్టుకుని చూపిస్తూ ఓ ఫొటో దిగి మంగళవారం పోస్ట్ చేశాడు. న్యూయార్క్ ఫ్యాషన్ వీక్ లో కచ్చితంగా పాల్గొనాలని, తాను లేకపోతే షో మొదలవ్వదని వివరించినా అధికారులు పట్టించుకోలేదు. తాజాగా ఎరోమెక్సికో ప్రయాణికులతో ప్రవర్తించాల్సిన అంశాలపై కొన్ని ప్రకటనలు జారీచేస్తూ నటుడు వారిస్ అహ్లువాలియాకు క్షమాపణలు తెలిపారు. -
సిక్కు నటుడికి చేదు అనుభవం
మెక్సికో: సిక్కు జాతీయుడికి మెక్సికో ఎయిర్ పోర్టులో చేదు అనుభవం ఎదురైంది. నటుడు, డిజైనర్ అయిన ఇండో-అమెరికన్ వారిస్ అహ్లువాలియాను మెక్సికో ఫ్లైట్ సిబ్బంది మంగళవారం ఉదయం అడ్డుకున్నారు. ఆ నటుడు మెక్సికో నుంచి న్యూయార్క్ కు వెళ్లాలని ఎయిర్ పోర్టుకు వచ్చాడు. అయితే, తమ సాంప్రదాయంలో భాగమైన తలపాగాను తొలగించాలని ఎయిర్ పోర్ట్ సిబ్బంది అతడిపై ఒత్తిడి తీసుకొచ్చారు. ఇందుకు అహ్లువాలియా నిరాకరించాడు. దీంతో ఆగ్రహించిన అధికారులు అతడిని విమానం నుంచి దింపేశారు. ఈ విషయాలను తన ఇన్స్టాగ్రామ్ ఖాతాలో రాసుకొచ్చాడు. మెక్సికో కస్టమర్ సర్వీస్ డెస్క్ ముందు తన బోర్డింగ్ పాస్ చేతిలో పట్టుకుని చూపిస్తూ ఓ ఫొటో దిగి పోస్ట్ చేశాడు. న్యూయార్క్ ఫ్యాషన్ వీక్ లో పాల్గొనడానికి సిద్ధమైన సిక్కు వ్యక్తి ఎయిర్ పోర్ట్ అధికారుల నుంచి జాత్యహంకారానికి గురయ్యాడు. తాను లేకపోతే న్యూయార్క్ లో ఫ్యాషన్ షో మొదలవ్వదని వివరించినా అధికారులు పట్టించుకోలేదు. యూఎస్ ట్రాన్స్ పోర్ట్ అధికారులు సెక్యూరిటీ నిమిత్తం కొన్ని రూల్స్ పాటించాలని సోమవారం తమకు ఆదేశాలు వచ్చాయని మెక్సికన్ ఎయిర్ లైన్స్ వెల్లడించింది. అతడికి కలిగిన అసౌకర్యానికి తాము చింతిస్తున్నామని... ప్రయాణికుల మత విశ్వాసాలను పక్కనబెట్టి నిబంధనలు పాటించడమే తమ బాధ్యత అని ఎయిర్ లైన్స్ అధికారులు వివరించారు. -
ఏడీబీ ఈడీగా భారత సంతతి మహిళ
వాషింగ్టన్ : భారత సంతతికి చెందిన మహిళ స్వాతి దండేకర్ ఏసియా అభివృద్ధి బ్యాంకు(ఏడీబీ) ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్‌గా నియమితులయ్యారు. అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా ఇండో-అమెరికన్ స్వాతిని ఏడీబీ ఈడీగా నియమిస్తున్నట్లు ప్రకటించారు. 2003లో అమెరికా దిగువ సభకు ఎన్నికైన తొలి వ్యక్తిగా ఆమె రికార్డు నెలకొల్పిన విషయం అందరికీ విదితమే. ఆమెతో సహా మరికొంత మందిని ఏడీబీ కార్యవర్గంలో చేరారు. అమెరికా ఎదుర్కొంటున్న సవాళ్లను నూతన అధికారులు తమ విధి నిర్వహణతో ఛేదిస్తారని అధ్యక్షుడు ఒబామా పేర్కొన్నారు. వీరితో కలిసి పనిచేస్తూ మరింత ముందుకు వెళ్తామని ఆశాభావాన్ని వ్యక్తం చేశారు. స్వాతి దండేకర్ గతంలో 2003-2009 మధ్య దిగువ సభ సభ్యురాలిగా, దిగువ సభ సెనెట్ సభ్యురాలిగా 2009-2011 కాలంలో విధులు నిర్వర్తించారు. భారత్ లోని నాగపూర్ విశ్వవిద్యాలయం నుంచి సైన్స్ గ్రూపులో బ్యాచిలర్ డిగ్రీ, ముంబై వర్సిటీ నుంచి పోస్ట్ గ్రాడ్యుయేట్ పట్టా అందుకున్నారు. -
టెక్సాస్ యూనివర్శిటీలో అశోక్‌కి కీలక పదవి
వాషింగ్టన్ : బోర్డ్ ఆఫ్ రీజెంట్స్ ఆఫ్ ది యూనివర్శిటీ ఆఫ్ నార్త్ టెక్సాస్‌లో సభ్యునిగా అశోక్ మగోను టెక్సాస్ గవర్నర్ గ్రెగ్ అబ్బొట్ నియమించారు. ఈ మేరకు అబ్బొట్ సోమవారం ఉత్తర్వులు జారీ చేశారు. 2021, మే 22వ తేదీ వరకు అశోక్ సభ్యునిగా కొనసాగుతారని ఆ ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. అశోక్ గ్రేటర్ డల్లాస్ ఇండో అమెరికన్ ఛాంబర్స్‌కు వ్యవస్థాపక ఛైర్మన్‌గా ఉన్నారు. భారత ప్రభుత్వం నుంచి 2014లో పద్మశ్రీ పురస్కారం అందుకున్నారు. అశోక్ ఢిల్లీ యూనివర్శిటీ నుంచి డిగ్రీ పట్టా అందుకున్నారు. ఆ తర్వాత డల్లాస్‌లోని టెక్సాస్ యూనివర్శిటీ నుంచి ఎంబీఏ పట్టా తీసుకున్నారు. -
ఆ ఎన్నారై టాప్ పెయిడ్ కమెడియన్!
వాషింగ్టన్: ప్రముఖ ఇండియన్-అమెరికన్ కమెడియన్ అజిజ్ అన్సారీ తొలిసారి ఫోర్బ్స్ జాబితాలో చోటు సంపాదించారు. 2015 సంవత్సరంలో అత్యధిక వేతనం పొందిన కమెడియన్‌గా ఫోర్బ్స్ జాబితాలో ఆయనకు ఆరోస్థానం లభించింది. ఎన్బీసీ చానెల్లో ప్రసారమయ్యే 'పార్క్స్ అండ్ రియాక్షన్' కార్యక్రమంలో టామ్ హవర్ఫోర్డ్గా విశేష ప్రేక్షకాదరణ పొందిన ఆయన ఈ ఏడాది 9.5 మిలియన్ డాలర్ల సంపద ఆర్జించారని ఆ పత్రిక తెలిపింది. చాలామంది సెలబ్రిటీల మాదిరిగానే అన్సారీ ప్రస్థానం నాటకరంగం నుంచి టీవీ, పుస్తక రచన వరకు సాగిందని పేర్కొంది. అన్సారీ రచించిన 'మోడ్రన్ రొమాన్స్' పుస్తకం ఆయనను మరో మెట్టు ఎక్కించింది. ప్రస్తుత మిలినీయంలో డేటింగ్, ప్రేమ వంటి అంశాలపై సామాజిక అధ్యయనం తరహాలో సాగిన ఈ రచన ఆయనకు ఆరోస్థానం కట్టబెట్టింది. 36 మిలియన్ డాలర్ల ఆర్జనతో జెర్రీ సీన్ఫెల్డ్ ఈ జాబితాలో టాప్ కమెడియన్‌గా నిలిచారు. 28.2 మిలియన్ డాలర్ల సంపదతో కెవిన్ హర్ట్, 21.5 మిలియన్ డాలర్ల సంపదతో టెర్రీ ఫాటర్ రెండు, మూడో స్థానాల్లో నిలిచారు. టెలివిజన్ కామెడీ బిజినెస్‌లో కొన్ని దశాబ్దాల నుంచి మహిళలు వెనుకంజలో ఉండటంతో వారికి ఈ జాబితాలో చోటులభించలేదని ఫోర్బ్స్ మ్యాగజీన్ పేర్కొంది. -
పెద్దావిడ్ని కొట్టి హింసించినందుకు..
వాషింగ్టన్: మతిమరుపుతో బాధపడుతున్న వృద్ధురాలి పట్ల అనుచితంగా ప్రవర్తించిన ఓ నర్సు ఇబ్బందుల్లో పడింది. అమెరికాలోని ఇల్లినోయిస్ లోని క్లెరిమాంట్ హెల్త్ అండ్ రిహాబిలిటేషన్ మెడకల్ సెంటర్లో ఈ సంఘటన చోటు చేసుకుంది. భారత సంతతికి చెందిన అమెరికన్ నర్సు హన్సమతి సింగ్(47).. 92 ఏళ్ల వృద్ధురాలిని దుర్భాష లాడింది. అంతేకాదు పెద్దావిడని కూడా చూడకుండా చెంపమీద వాతలు తేలేలా కొట్టింది. ముక్కు కింద గోళ్లు గీసుకుపోవడంతో ఎర్రని వాతలు తేలాయి. ఆమెకు ఆహారం తినిపించే సమయంలో కొట్టి, వేధించింది. బాధితురాలు ఈ విషయాలను పోలీసులకు వివరించింది. పెద్దావిడ దవడపై నర్సు వేలి గోళ్ల గుర్తులు వాతల్లో స్పష్టంగా కనిపిస్తున్నాయని పోలీసులు ధ్రువీకరించారు. ఈ కేసులో ఈ సాక్ష్యం చాలంటూ నర్సును అరెస్ట్ చేశారు. సుమారు లక్షా ముప్పయి వేల రూపాయలు జరిమానా ను చెల్లించిన తరువాతనే ఆమెను విడుదల చేశారు. అయితే వృద్ధురాలి ఆరోపణలను నర్సు ఖండించింది. లో బ్లడ్ షుగర్ వ్యాధితో బాధపడుతున్నందువల్ల ఆమెకు బలవంతంగా తినిపించాల్సి వచ్చందని, ఆ సందర్భంగా గాయమైన విషయాన్ని తాను గమనించలేదని తెలిపింది. అంతే తప్ప తాను కొట్టి హింసించలేదని వాదించింది. మరోవైపు వృద్ధురాలి పట్ల అమానుషంగా ప్రవర్తించిన సదరు నర్సును విధుల నుంచి తప్పించనున్నట్టు హెల్త్ సెంటర్ డైరెక్టర్ తెలిపారు. -
సునీతా విశ్వనాథ్ కు వైట్ హౌస్ పురస్కారం
వాషింగ్టన్: పర్యావరణ పరిరక్షణ కోసం సేవలందించేవారికి అమెరికా అధ్యక్ష భవనం వైట్ హౌస్ అందించే ‘చాంపియన్ ఆఫ్ చేంజ్’ పురస్కారానికి భారత సంతతి అమెరికన్ సునీతా విశ్వనాథ్ ఎంపికయ్యారు. సునీత సహా 12 మంది ఈ పురస్కారానికి ఎంపికయ్యారు. 30 ఏళ్లుగా సునీత మహిళా సంఘాలు, మానవ హక్కుల సంస్థలతో కలసి పర్యావరణ పరిరక్షణకు కృషి చేస్తున్నారని, పర్యావరణ పరిరక్షణలో హిందువులను భాగస్వాములను చేసినందుకుగానూ ఆమెను చాంపియన్ ఆఫ్ చేంజ్ పురస్కారానికి ఎంపిక చేసినట్టు వైట్‌హౌస్ పేర్కొంది. చెన్నైలో జన్మించిన సునీత అమెరికాలో స్థిరపడ్డారు. సాధనా, ఫ్రంట్ లైన్ ఉమెన్స్ హ్యూమన్ రైట్స్ ఆర్గనైజేషన్, ఉమెన్ ఫర్ ఆఫ్ఘాన్ ఉమెన్ తదితర సంస్థల్లో ఆమె క్రియాశీల సభ్యురాలు. -
హంతకుడి ఆచూకీ చెబితే రూ.12 లక్షలు
కాలిఫోర్నియా: భారతీయ అమెరికన్ ప్రవీణ్ పటేల్(62) హత్య కేసును ఛేదించేందుకు లాస్ ఏంజెలెస్ పోలీసులు ప్రయత్నిస్తున్నారు. హంతకుడికి సంబంధించిన సమాచారం అందిస్తే సుమారు రూ.12 లక్షలు నజరానా ఇస్తామని పోలీసులు ప్రకటించారు. శాండిమాస్ ప్రాంతంలో శాండ్ విచ్ షాపు నడుపుతున్న ప్రవీణ్ పటేల్ జూన్ 2న హత్యకు గురయ్యారు. దుకాణంలో దొంగతనానికి వచ్చి దుండగుడు పటేల్ ను తుపాకీతో కాల్చి చంపాడు. హత్య జరిగిన సమయంలో సెక్యురిటీ కెమెరాలు పనిచేయకపోవడంతో హంతకుడిని పట్టుకోవడం పోలీసులకు సవాల్ గా మారింది. హంతకుడు తెలుపు వర్ణంలో ఉన్నాడని, అతడి వయసు 20 ఏళ్లు ఉంటుందని పోలీసులు తెలిపారు. సుమారు ఆరు అడుగుల పొడవు ఉన్నాడని వెల్లడించారు. హత్య జరిగిన సమయంలో అతడు బేస్ బాల్ టోపీ, బ్లాక్ టీషర్ట్ ధరించివున్నాడని తెలిపారు. అతడికి సంబంధించిన సమాచారం అందించిన వారికి రూ.12 లక్షల నగదు బహుమతి ఇస్తామని పోలీసులు ప్రకటించారు. -
సిలికాన్ వ్యాలీలో పోటీకి ఖన్నా సై
వాషింగ్టన్: యువ భారత-అమెరికన్ రోహిత్ ఖన్నా(రొ ఖన్నా) మరోసారి అమెరికా ఎన్నికల బరిలో దిగేందుకు సిద్ధమవుతున్నారు. కాలిఫోర్నియాలోని సిలికాన్ వ్యాలీ నుంచి ప్రతినిధుల సభకు డెమొక్రాటిక్ పార్టీ తరపున పోటీ చేయనున్నట్టు ఆయన ప్రకటించారు. 2016 ఎన్నికల్లో ఇక్కడి నుండి బరిలోకి దిగాలని నిర్ణయించుకున్నట్టు తెలిపారు. 2014 ఎన్నికల్లో సిలికాన్ వ్యాలీ నుంచి పోటీ చేయాలని భావించినా స్వల్ప తేడాతో అవకాశం కోల్పోయారు. పోటీ బిడ్ లో డెమొక్రాటిక్ పార్టీ సీనియర్ నాయకుడు మైక్ హొండా చేతిలో స్వల్ప తేడాతో ఓడిపోయారు. మరోసారి తన అదృష్టాన్ని పరీక్షించుకునేందుకు ఖన్నా రెడీ అవుతున్నారు. మైక్ హొండా కూడా మళ్లీ సిలీకాన్ వ్యాలీ నుంచి పోటీ చేసేందుకు సిద్ధమవుతున్నారు. ఈసారి ప్రతినిధుల సభకు పోటీ చేసే అవకాశం ఎవరికీ దక్కుతుందో చూడాలి. -
'నేను అమెరికన్‌ను మాత్రమే'
వాషింగ్టన్: లూసియానా రాష్ట్ర గవర్నర్, భారతీయ అమెరికన్ బాబీ జిందాల్ వ్యాఖ్యలు సంచలనం సృష్టించాయి. తాను ఇండో-అమెరికన్‌ను కాదని.. అమెరికన్‌ను మాత్రమే అని ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు. 'నా తల్లిదండ్రులు అమెరికన్లుగా మారడానికే అమెరికాకి వచ్చారు... కానీ భారతీయ-అమెరికన్‌గా ఉండడానికి కాదు' అని బాబీ జిందాల్ అన్నారు. అమెరికన్లుగా మారడానికే ఇక్కడకు వచ్చామని అమ్మానాన్నలు సోదరుడితో పాటూ తకు చెప్పేవాళ్లని ఆయన పేర్కొన్నారు. భారతీయుడని పిలిపించుకోవాలంటే భారత్‌లోనే ఉండేవాడినన్నారు. అధిక అవకాశాలతో పాటు స్వేచ్ఛ దొరుకుతుందనే నాలుగు దశాబ్దాల కిందట అమెరికాకు వలస వచ్చినట్లు చెప్పారు. వలసవాదులను అందరితోపాటు సమానంగా గౌరవించాలని, అలా చేస్తే దేశాన్ని మరింత పటిష్టం చేయడంతో పాటు స్వేచ్ఛను కాపాడిన వాళ్లం అవుతామని బాబీ జిందాల్ పేర్కొన్నారు. మరోవైపు లండన్‌లోని హెన్రీ జాక్సన్ సొసైటీలో వచ్చే సోమవారం ఆయన ప్రసంగించనున్నారు. కాగా అక్కడ పాల్గొనబోయే మొదటి భారతీయ-అమెరికన్ అని గవర్నర్ కార్యాలయం అధికారులు తెలిపారు. -
అమెరికాలో మరో భారతీయుడికి ఉన్నత పదవి
వాషింగ్టన్: అమెరికాలో భారతీయుల మేథో సత్తాకు నిదర్శనంగా మరో వ్యక్తి ఉన్నత పదవికి ఎంపికయ్యారు. తులనాత్మక రాజ్యాంగ న్యాయశాస్త్రంలో నిపుణుడైన సుజిత్ చౌదరి(44) కాలిఫోర్నియా యూనివర్సిటీ (బెర్క్లే)లోని స్కూల్ ఆఫ్ లా డీన్‌గా నియమితులయ్యారు. ఆయన ప్రస్తుతం న్యూయార్క్ యూనివర్సిటీ స్కూల్ ఆఫ్ లా ప్రొఫెసర్‌గా పనిచేస్తున్నారు. ఈ నూతన పదవీ బాధ్యతలను సుజిత్ చౌదరి జూలై 1 నుంచి ఐదేళ్ల పాటు నిర్వహిస్తారు. ఈ మేరకు కాలిఫోర్నియా యూనివర్సిటీ ఎగ్జిక్యూటివ్ వైస్ చాన్స్‌లర్ క్లౌడే స్టీలే ఒక ప్రకటన జారీ చేశారు. సుజిత్ చౌదరి న్యాయశాస్త్రంపై పలు పుస్తకాలు రచించారు. తొలుత న్యూయార్క్ విశ్వవిద్యాలయంలో అసోసియేట్ డీన్‌గా చేరిన చౌదరి ఆ తరువాత టొరంటో విశ్వవిద్యాలయంలోని లా స్కూల్లో ఫ్రొఫెసర్ అయ్యారు. -
ఎస్-పీ ప్రెసిడెంట్‌గా భారతీయుడు
న్యూయార్క్: అతి పెద్ద రేటింగ్ సంస్థ స్టాండర్డ్ అండ్ పూర్స్ (ఎస్అండ్పీ) రేటింగ్ సర్వీసెస్‌కి ప్రవాస భారతీయుడు నీరజ్ సహాయ్ ప్రెసిడెంట్‌గా నియమితులయ్యారు. వచ్చే ఏడాది జనవరి 6 నుంచి ఆయన బాధ్యతలు స్వీకరిస్తారు. ఎస్అండ్పీ మాతృ సంస్థ మెక్‌గ్రా హిల్ ఫైనాన్షియల్ ఈ విషయాలు వెల్లడించింది. సహాయ్ (56) ప్రస్తుతం సిటీగ్రూప్‌లో సెక్యూరిటీస్ అండ్ ఫండ్ సర్వీసెస్ వ్యాపార విభాగానికి హెడ్‌గా పని చేస్తున్నారు. యూనివర్సిటీ ఆఫ్ ఢిల్లీలో ఆయన ఎకనామిక్స్‌లో మాస్టర్స్ చేశారు. కెరియర్ ప్రారంభంలో సిటీ గ్రూప్ భారత కార్యకలాపాల్లోనూ సహాయ్ కీలక పాత్ర పోషించారు. అమెరికాలో సిటీ గ్రూప్‌లో పలు హోదాల్లో ఆయన పనిచేశారు. సిటీగ్రూప్‌లో 2002 నుంచి 2005 దాకా గ్లోబల్ ట్రాన్సాక్షన్ సర్వీసెస్ విభాగానికి సహాయ్ సీఎఫ్‌వోగా పనిచేశా రు. ఎస్అండ్పీ ప్రస్తుత ప్రెసిడెంట్ డగ్లస్ పీటర్సన్.. మాతృ సంస్థ సీఈవోగా ఇటీవలే బాధ్యతలు చేపట్టారు. ఆయన స్థానంలో సహాయ్ నియమితులయ్యారు. ఎస్అండ్పీని మరింత పటిష్టంగా తీర్చిదిద్దేందుకు కృషి చేస్తానని ఈ సందర్భంగా సహాయ్ చెప్పారు. మెక్‌గ్రా హిల్ ఫైనాన్షియల్‌లో భాగమైన ఎస్అండ్పీ.. ప్రభుత్వ, కార్పొరేట్ల డెట్‌కి సంబంధించి 10 లక్షల పైగా క్రెడిట్ రేటింగ్స్‌ను ఇస్తోంది.