భారత సంతతి వ్యక్తికి అరుదైన గౌరవం లభించింది. యూఎస్‌లోని ఓ రహదారికి అతడి పేరుని పెట్టిమరీ గౌరవించింది. ఇంతకీ ఎవరా వ్యక్తి ఎందుకంతా గౌరవం ఇచ్చిందంటే..
అమెరికాలోని కాలిఫోర్నియాలో 34 ఏళ్ల రోనిల్ సింగ్ అనే భారత సంతతి వ్యక్తి న్యూమాన్ పోలీస్ డిపార్ట్‌మెంట్‌లో పోలీస్ అధికారిగా విధులు నిర్వర్తిస్తున్నాడు. అయితే ఒకరోజు అతను విధినిర్వహణలో భాగంగా ఒక రాత్రి ఓవర్ టైం చేయాల్సి వచ్చింది. సరిగా 2018 డిసెంబర్ 26న క్రిస్మస్ రాత్రి ఓ రహదారి వద్ద గస్తీ కాస్తున్నారు. ఇంతలో ఓ వ్యక్తి కారులో తాగుతూ వచ్చి విచక్షణరహితంగా కాల్పులు చేస్తున్నాడు. ఆ కాల్పుల్లో రోనిల్ సింగ్ మృతి చెందాడు. విధి నిర్వహణలో భాగంగా ఇతురల భద్రత విషయమై జీవితాన్ని ఫణంగా పెట్టాడు సింగ్. అయితే అతడు చనిపోయేనాటికి కొడుకు ఆర్నవ్ కేవలం 5 నెలల పసివాడు.
ఇలా విధినిర్వహణలో ప్రాణాలు కోల్పోయిన ఆ వ్యక్తిని గౌరవించేలా ఓ రహదారికి అతని పేరు పెట్టి అంకితం ఇవ్వాలని నిర్ణయించారు. కానీ అములులోకి రాలేదు. ఎట్టకేలకు సింగ్ న్యూమాన్ పోలీస్ డిపార్ట్‌మెంట్ ఇచ్చిన వాగ్దానాన్ని నెరవేర్చడమే గాక అమలయ్యేలా చేసింది. ఆ కాలిఫోర్నియా రాష్ట్ర సెనేటర్ మేరి అల్వరాడో గిల్ యూఎస్ ప్రతినిధి డువార్టే, అసెంబ్లీ సభ్యుడు జువాన్ అలానిస్ సెప్టెంబర్ 2న హైవే 33 స్టుహ్ర్ రోడ్ ప్రారంభోత్సవ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి "కార్పోరల్ రోనిల్ సింగ్ మోమోరియల్ హైవే" అని నామకరణం చేసి మరీ సైన్ బోర్డు పెట్టారు. ఆ రహదారికి అతడి పేరుని పెట్టి అత్యున్నతంగా గౌరవించింది.
ఈ కార్యక్రమంలో సింగ్ భార్య అనామిక, కొడుకు ఆర్నవ్ , ఇతర కుటుంబ సభ్యులు న్యూమాన్ పోలీస్ డిపార్ట్‌మెంట్‌లోని సింగ్ సహోద్యోగులు తదితరలు పాల్గొన్నారు. సింగ్ కొడుకు ఆర్నవ్ ఆ బోర్డు వెనకాల ఐ లవ్ యు పప్పా! అని రాశాడు. కాగా, రోనిల్ సింగ్ నేపథ్యం వచ్చేసరికి అతడు ఫిజీలో జన్మించి మోడెస్లో పోలీస్‌డిపార్ట్‌మెంట్‌లో వాలంటీర్‌గా లా ఎన్‌ఫోర్స్‌మెంట్ వృత్తిని ప్రారంభించాడు. తర్వాత టర్లాక్ పోలీస్ డిపార్ట్‌మెంటల్‌లో క్యాడెట్ జంతు సేవా అధికారిగా కూడా విధులు నిర్వర్తించాడు. ఇక సింగ్ చనిపోయిన ఒక ఏడాది తర్వాత పోలీసులు నిందితుడిని మెక్సికన్ జాతీయుడైన పాలో విర్జెన్ మెన్డోజాగా గుర్తించి అరెస్టు చేశారు. అతడికి పెరోల్ లేకుండా జీవితఖైదు శిక్ష విధించింది కోర్టు. అలాగే అతడిని తప్పించాలని చూసిన అతడి సోదరుడు కాన్రాడో విర్జెన్ మెన్డోజాకు 21 నెలల జైలు శిక్ష పడింది.
Comments
Please login to add a commentAdd a comment