వాషింగ్టన్: అమెరికాలో కాల్ సెంటర్ స్కాంలో ఓ భారతీయుడు, భారత సంతతికి చెందిన మరో వ్యక్తి తమ నేరాన్ని అంగీకరించారు. గత ఏప్రిల్, జూన్‌లో ఇదే స్కాంలో భారత్‌కు చెందిన పలువురిపై విచారణ జరగగా తాజాగా మోంటూ బారోథ్, నీలేశ్ పాండ్యాలు మనీలాండరింగ్‌కు పాల్పడినట్లు ఒప్పుకున్నారు.
యూఎస్ ఫెడరల్ బ్యూరో అధికారులు తెలిపిన వివరాల ప్రకారం.. నిందితులు గుజరాత్‌లోని అహ్మదాబాద్ కేంద్రంగా ఓ కాల్ సెంటర్‌ను ఏర్పాటు చేశారు. దీనిలో పనిచేసే టెలీ కాలర్లు తాము అమెరికా రెవెన్యూ, ఇమిగ్రేషన్, పౌర సేవల అధికారులుగా పరిచయం చేసుకుంటూ బాధితులకు కాల్స్ చేసి అడిగిన డబ్బులు ఇవ్వకపోతే అరెస్టు, దేశ బహిష్కరణ, తదితర శిక్షలు విధిస్తామని బెదిరించారు. దీంతో బాధితులు వివిధ రూపాల్లో డబ్బులు పంపగా నిందితులు వాటిని వివిధ మార్గాల్లో భారత బ్యాంకులకు తరలించారు.
కాల్ సెంటర్ స్కాంలో భారతీయులు
Published Fri, Jul 21 2017 10:23 AM | Last Updated on Tue, Aug 14 2018 3:18 PM
Advertisement