call centres
-
ఒకే ఏడాదిలో 1500 కోట్ల గంటలు వేచి ఉన్నారట!
భారతీయ వినియోగదారులు 2024లో తమ ఫిర్యాదులు తెలియజేయడానికి కస్టమర్ కేర్‌కు ఫోన్ చేసి 15 బిలియన్ గంటలు(1,500 కోట్లు) ఎదురు చూసినట్లు ‘ద సర్వీస్ నౌ’ నివేదిక తెలిపింది. టెక్నాలజీలో విప్లవాత్మక మార్పులు వస్తున్నా ఈ విభాగంలో వినియోగదారుల అంచనాలను భర్తీ చేయలేకపోతున్నట్లు పేర్కొంది. ఈ అంతరాలను పూడ్చడానికి అత్యాధునిక కృత్రిమ మేధ(ఏఐ) అవసరాన్ని ఈ నివేదిక నొక్కి చెబుతుంది.ఈ రిపోర్ట్ రూపొందించడానికి ద సర్వీస్ నౌ 5,000 మంది భారతీయ వినియోగదారులు, 204 కస్టమర్ సర్వీస్ ఏజెంట్లతో సర్వే నిర్వహించినట్లు తెలిపింది. నివేదికలోని అంశాల ప్రకారం.. ఏజెంట్లు కస్టమర్లకు చెందిన చాలా సమస్యలను 30 నిమిషాల్లో పరిష్కరిస్తారని నమ్ముతుండగా, వినియోగదారులు దీనికి సగటున 3.8 రోజులు పడుతుందని తెలిపారు. వీరు మెరుగైన సేవలు పొందడంలో ఏదైనా సమస్యలు ఎదురైతే అందుకు అనుగుణంగా చర్యలు తీసుకోవడానికి వెనుకాడడం లేదు. 89% మంది సరైన సర్వీసులు అందక మరొక బ్రాండ్‌కు మారుతామని చెప్పారు. 84% మంది ఆన్లైన్లో సర్వీసులకు సంబంధించి ప్రతికూల ఫీడ్‌బ్యాక్‌ను పోస్ట్ చేస్తామని చెప్పారు. 39% మంది కస్టమర్ సర్వీస్‌తో డీల్ చేయడానికి అసలు ఇష్టపడడంలేదు.టెలికమ్యూనికేషన్స్, రిటైల్, ఆర్థిక సేవల రంగాల్లోని కస్టమర్ల నుంచి దేశంలో అత్యధిక మొత్తంలో ఫిర్యాదులు అందుతున్నాయి. ప్రతి 10 మంది భారతీయుల్లో 9 మంది ఈ కేటగిరీల్లో సంస్థలతో సమస్యలను పరిష్కరించుకోవడానికి సమయం వెచ్చించారు. టెలికాంలో 4.3 గంటలు, రిటైల్‌లో 4.1 గంటలు, ఫైనాన్షియల్ సర్వీసెస్‌లో 4.2 గంటలు చొప్పున సగటున నాలుగు గంటలకు పైగా ఫిర్యాదులను పరిష్కరించడానికి వినియోగదారులు వెచ్చించారు.ఇదీ చదవండి: రూ.కోట్లు కోల్పోయిన వ్యాపారవేత్త.. ఏం జరిగిందంటే..ఈ సమస్యను అధిగమించేందుకు కంపెనీలు కస్టమర్ సపోర్ట్ ఆపరేషన్స్‌లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌ను ఇంటిగ్రేట్ చేసేందుకు పోటీ పడుతున్నాయి. ప్రిడిక్టివ్ సిఫార్సులు, వర్చువల్ ఏజెంట్ల నుంచి రియల్ టైమ్ కేస్ ట్రాకింగ్ వరకు ఏఐ వేగవంతమైన పరిష్కారాలు అందించే అవకాశం ఉందని భావిస్తున్నాయి. కృత్రిమ మేధ 24/7 సేవల లభ్యతను మెరుగుపరుస్తుందని సగం మంది భారతీయ వినియోగదారులు విశ్వసిస్తున్నప్పటికీ పారదర్శకత, సమర్థ సేవలపై ఆందోళనలు కొనసాగుతున్నాయి. 62% సంస్థలు మాత్రమే ఇంటిగ్రేటెడ్ ప్లాట్ ఫామ్‌లను ఉపయోగిస్తున్నాయని తెలిపాయి. టెలికాం దిగ్గజం బీటీ గ్రూప్ సర్వీస్ నౌ ప్లాట్‌ఫామ్ ద్వారా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌ను ఉపయోగించడం ద్వారా సమస్యను పరిష్కార సమయాన్ని 4.7 గంటల నుంచి నిమిషం కంటే తక్కువకు తగ్గించారు. -
పాకిస్థాన్‌లో అంతే.. ‘లూటీ చేయడానికి ఏమన్నా మిగిలాయా?’
ఇస్లామాబాద్ : పదుల సంఖ్యలో కార్పొరేట్ కంపెనీల కార్యకలాపాలతో రద్దీగా ఉండే ఏరియా. ఆ ప్రాంతానికి చెందిన కంపెనీల్లో ఉద్యోగులు కంప్యూటర్లతో కుస్తీలు పడుతుంటారు. అయితే, ఎప్పటిలాగే విధులు నిర్వహించేందుకు ఉద్యోగులు వచ్చారు.ఉద్యోగులు వచ్చిన రెండు గంటల తర్వాత పోలీసులు, దర్యాప్తు అధికారులు దాడులు చేశారు. పలువురిని అదుపులోకి తీసుకొని వెళ్లిపోయారు. ఈ దాడులపై సమాచారం అందుకున్న స్థానికులు ఆఫీసుల్లో చొరబడి లూఠీ చేశారు. చేతికి ఏది అందితే దాన్ని పట్టుకొని వెళ్లిపోయారు. దొంగిలిచ్చేందుకు వచ్చిన స్థానికులు సైతం లూటీ చేసేందుకు ఇంకా ఏమైనా దొరుకుతుందేమోనని ఆరా తీసిన దృశ్యాలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.పాకిస్థాన్(Pakistan)లోని ఇస్లామాబాద్ సెక్టార్ ఎఫ్-11లో ఉన్న ఓ నకిలీ కాల్ సెంటర్‌పై ఫెడరల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ (FIA) అధికారులు దాడులు చేశారు. 24 మందిని అదుపులోకి తీసుకుని వెళ్లిపోయారు. అయితే, చైనీయులు నడుపుతున్న కాల్ సెంటర్‌పై దాడులు జరిగాయన్న సమాచారం ఆ నోటా ఈనోటా పాకింది. అంతే సమాచారం అందుకున్న స్థానికులు ఆ కాల్ సెంటర్లో చొరబడ్డారు. చేతికి అందిన ల్యాప్‌టాప్‌లు, డెస్క్‌టాప్‌లు, మానిటర్లు, కీబోర్డులు, ఎక్స్‌టెన్సన్లు.. ఏదిపడితే అది ఎత్తుకెళ్లారు. ఫర్నీచర్, కట్లరీ సెట్లను కూడా లూటీ చేశారు. ఈ లూటీపై సమాచారం అందుకున్న మరి కొంతమంది ఫేక్ కాల్ సెంటర్‌కు వచ్చారు. తమకూ ఏదైనా దొరుకుతుందేమోనని ల్యాప్‌ట్యాప్స్‌ను చోరీ చేసిన వారిని ఆరా తీసిన దృశ్యాలు నెట్టింట్లో తెగ వైరల్ అవుతున్నాయి. ఇంకెందుకు ఆలస్యం మీరు కూడా ఈ వైరల్ అవుతున్న వీడియోల్ని చూసేయండి.Pakistanis have Looted Call Centre operated by Chinese in Islamabad; Hundreds of Laptop, electronic components along with furniture and cutlery stolen during holy month of Ramadan pic.twitter.com/z6vjwBRRsq— Megh Updates 🚨™ (@MeghUpdates) March 17, 2025 -
అక్రమ కాల్ సెంటర్లపై సీబీఐ దాడులు
-
కాల్ హోల్డ్‌లో పెట్టారా..? రూ.4.6 లక్షల కోట్లు నష్టం!
మీరెప్పుడైనా సమస్య పరిష్కారం కోసం కస్టమర్‌కేర్‌కు కాల్ చేశారా..? మన సమస్య చెప్పాకా చాలా వరకు కాల్ సెంటర్ సిబ్బంది ‘కాసేపు హోల్డ్‌లో ఉండండి’ అనడం గమనిస్తాం. అయితే 2023లో అలా కస్టమర్లను హోల్డ్‌లో ఉంచిన సమయం ఎంతో తెలుసా..? ఏకంగా 15 బిలియన్ గంటలు(1500 కోట్ల గంటలు). దాంతో శ్రామికశక్తి వల్ల కలిగిన ఆర్థిక నష్టం రూ.4.6 లక్షల కోట్లు. ఈమేరకు ‘సర్వీస్ నౌ’ అనే సంస్థ విడుదల చేసిన ‘కస్టమర్ ఎక్స్పీరియన్స్ ఇంటెలిజెన్స్ రిపోర్ట్ 2024’ ఆసక్తికర విషయాలు వెల్లడించింది.సర్వీస్‌నౌ సంస్థ 18 ఏళ్ల కంటే ఎక్కువ వయసు ఉన్న 4,500 మంది భారతీయులపై సర్వే నిర్వహించి ఈ నివేదిక రూపొందించింది. నివేదికలోని వివరాల ప్రకారం..2023లో కాల్‌సెంటర్‌కు ఫోన్ చేసిన సగటు వ్యక్తి 30.7 గంటలు హోల్డ్‌లో గడిపాడు. 2023లో అన్ని కాల్‌సెంటర్లు కలిపి 1500 కోట్ల గంటలు కస్టమర్లను హోల్డ్‌లో ఉంచాయి. అలా వినియోగదారుల శ్రామికశక్తి వల్ల కలిగిన ఆర్థిక నష్టం రూ.4.6 లక్షల కోట్లు. కాల్ కనెక్ట్ అవ్వకపోవడంతో వెయిటింగ్లో ఉన్నవారు 50% కంటే ఎక్కువే. తమ సమస్యలను మూడు రోజుల్లోగా పరిష్కరించకపోతే 66% మంది ఇతర కంపెనీ సర్వీసుల్లోకి మారడానికి సిద్ధంగా ఉన్నారు.సర్వీస్‌నౌ ఇండియా టెక్నాలజీ అండ్ బిజినెస్ సెంటర్ సీనియర్ వైస్ ప్రెసిడెంట్, ఎండీ సుమీత్ మాథుర్ మాట్లాడుతూ..‘కస్టమర్లకు సర్వీసు అందడంలో ఆలస్యం అవుతోంది. దాంతో 2024లో కంపెనీలు మూడింట రెండొంతుల మంది కస్టమర్లను కోల్పోయే ప్రమాదం ఉంది. ఇప్పటికే చాలామంది వినియోగదారులు చాట్బాట్లు, సెల్ఫ్-హెల్ప్ గైడ్ల వంటి ఏఐ సొల్యూషన్లపై ఆధారపడుతున్నారు. టెక్నాలజీ పెరగడంతో 62% మంది కస్టమర్లు కాల్సెంటర్లకు ఫోన్ చేయకుండా స్వయంగా సమస్యలను పరిష్కరించుకుంటున్నారు. దాదాపు 50% మంది వినియోగదారులకు టెక్నాలజీని ఉపయోగించి తమ సమస్యలను ఎలా పరిష్కరించుకోవాలో సరైన అవగాహన లేదు. కంపెనీ మేనేజ్మెంట్, సిబ్బంది మధ్య అంతర్గత కమ్యూనికేషన్ లోపించడంతో హోల్డింగ్ సమయం పెరుగుతుంది. సిబ్బందిలో నిర్ణయాధికారం లేకపోవడం ప్రధాన సమస్యగా ఉంది.ఇదీ చదవండి: ఉద్దేశపూర్వక ఎగవేతదారులపై కఠిన చర్యలుటెక్నాలజీ పెరుగుతున్న నేపథ్యంలో దాదాపు చాలామంది ప్రస్తుతం ఏఐ సొల్యూషన్స్‌పై ఆధారపడుతున్నారు. దానివల్ల కాల్సెంటర్లను ఆశ్రయించడం తగ్గింది. ఏదైనా అత్యవసరమైతే తప్పా వాటిని సంప్రదించడం లేదు. కాల్సెంటర్లకు కాల్ చేసే కస్టమర్ల సమస్యలను త్వరితగతిన పరిష్కరించాలని నివేదిక చెబుతుంది. హోల్డింగ్ సమయాన్ని తగ్గించాలని, అందుకు అనువుగా ఏఐ ఆధారిత సేవలను మరింత మెరుగుపరచాలని అధ్యయనం సూచిస్తుంది. -
టీడీపీ ఎగనామం: సర్వేల పేరుతో పనిచేయించుకొని డబ్బులు ఎగ్గొట్టిన టీడీపీ
-
ఏపీ స్ఫూర్తితో జాతీయ స్థాయిలో కిసాన్ స్టూడియో, కాల్ సెంటర్
సాక్షి, అమరావతి: క్షేత్రస్థాయిలో రైతులు ఎదుర్కొనే సమస్యల పరిష్కారం కోసం రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన ‘సమీకృత రైతు సమాచార కేంద్రం (ఐసీసీ కాల్ సెంటర్)’ దేశానికే ఆదర్శంగా నిలిచింది. ఏపీ స్ఫూర్తితో కేంద్ర ప్రభుత్వం జాతీయ స్థాయి లో కిసాన్ అవుట్‌బౌండ్ కాల్ సెంటర్‌తో పాటు కిసాన్ స్టూడియోలను అందుబాటులోకి తెచ్చింది. వీటిని కేంద్ర మంత్రి అర్జున్ ముండా బుధవారం జాతికి అంకితం చేశారు. ఇప్పటికే తెలంగాణ ఓ కాల్ సెంటర్ ఏర్పాటుచేయగా, రాజస్థాన్‌లోనూ ఏర్పాటుకు అక్కడి ప్రభుత్వం సన్నాహాలు చేస్తోంది. గన్నవరం ఐసీసీ కాల్ సెంటర్, ఆర్బీకే చానల్‌ను జాతీయ, అంతర్జాతీయ ప్రముఖులు పరిశీలించారు. వారిచ్చిన సూచనలతోనే కేంద్రం జాతీయ స్థాయిలో కాల్ సెంటర్, స్టూడియోలను కేంద్రం తీసు కొచ్చిందని వ్యవసాయ రంగ నిపుణులు చెబుతున్నారు. ఇదీ కేంద్ర కాల్ సెంటర్ ఈ కేంద్రం ద్వారా నిపుణులైన సిబ్బంది రైతుల సందేహాలను నివృత్తి చేస్తారు. సీనియర్ అధికారులు, మంత్రిత్వ శాఖ ప్రతినిధులు, శాస్త్రవేత్తలు ఇందులో ఉంటారు. వ్యవసాయ, అనుబంధ రంగాల సమగ్ర సమాచారాన్ని క్రోడీకరిస్తూ రైతులకు, ప్రభుత్వానికి మధ్య వారధిలా ఈ కాల్ సెంటర్‌ను తీర్చిదిద్దారు. ప్రధాన పంటలు సాగయ్యే ప్రాంతాల రైతులకు ఈ కాల్ సెంటర్ మార్గదర్శకంగా నిలుస్తుంది. రైతుల కు ఫోన్ చేసి పంటల స్థితిగతులు, అక్కడి సమస్యల పరిష్కారానికి చర్యలు చేపడతారు. వాటి తీవ్రతను బట్టి అధ్యయనం చేసేందుకు ప్రత్యేక బృందాలను ఆ ప్రాంతాలకు పంపిస్తారు. కేంద్ర వ్యవసాయ, రైతు సంక్షేమ కార్యక్రమాలు, పథకాలపై రైతుల సూచనలు తీసుకుని అమలు చేస్తారు. కార్పొరేట్ స్థాయిలో గన్నవరం ఐసీసీ కాల్ సెంటర్ ఏపీలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ప్రభుత్వం తీసుకొచ్చిన విప్లవాత్మక సంస్కరణల్లో భాగంగా నాలుగేళ్ల క్రితం ఐసీసీ కాల్ సెంటర్, ఆర్బీకే ఛానల్‌ను ఏర్పాటు చేశారు. కార్పొరేట్ స్థాయిలో అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో, 67 మంది సిబ్బందితో ఈ కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. ఈ సెంటర్ రైతులకు సాగులో, క్షేత్ర స్థాయిలో వారు ఎదుర్కొనే అన్ని సమస్యల పరిష్కారానికి చక్కని వేదికగా నిలిచింది. సమస్య తీవ్రతను బట్టి 24 గంటల్లో బృందాలను గ్రామాలకు పంపి రైతులకు అవసరమైన సలహాలు, సూచనలు ఇస్తూ రైతుల మన్నననలు చూరగొంది. ఛానల్ ద్వారా సీజన్లో పంటలవారీగా అభ్యుదయ రైతులు, శాస్త్రవేత్తలతో సలహాలు, సూచనలతో కూడిన వీడియోలతో పాటు ప్రత్యక్ష ప్రసారాలతో రైతులకు దగ్గరైంది. ఐసీసీ ద్వారా 8.26 లక్షల కాల్స్, 12,541 వాట్సప్ సందేహాలను నివృత్తి చేశారు. అలాగే ఆర్బీకే ఛానల్ ను 2.81 లక్షల మంది సబ్‌స్క్రైబ్ చేసుకోగా, 57.12 లక్షల మంది వీక్షించారు. వ్యవసాయ అను బంధ రంగాలకు చెందిన 1,698 వీడియోలను అప్లోడ్ చేసుకొన్నారు. ఐసీసీ సేవలను కేంద్ర వ్యవసాయ మంత్రిత్వ శాఖతో పాటు ఎన్నో రాష్ట్రాలు వాటి ప్రతినిధులను పంపి అధ్యయనం చేశాయి. బ్రిటిష్ హై కమిషనర్ గారేట్ వైన్ ఓనర్, యూఎన్వోకు చెందిన ఎఫ్ఏవో కంట్రీ హెడ్ చి చోరి, ఇథియోపియా దేశ వ్యవసాయ శాఖ మంత్రి మెలెస్ మెకోనెన్ ఐమెర్ వంటి ప్రముఖులు ఈ కేంద్రం పనితీరును ప్రశంసించారు. మన విధానాలు కేంద్రం అనుసరిస్తోంది సీఎం జగన్ రాష్ట్రంలో వ్యవసాయ రంగంలో విప్లవాత్మక మార్పులు తెచ్చారు. వైఎస్ జగన్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన పలు విధానాలను కేంద్రం అనుసరిస్తోంది. పలు రాష్ట్రాలు కూడా వాటిని ప్రవేశపెడుతున్నాయి. గన్నవరంలోని ఐసీసీ కాల్ సెంటర్ నాలుగేళ్లుగా రైతుల సేవలో తనదైన ముద్ర వేసుకుంది. జాతీయ, అంతర్జాతీయ స్థాయి ప్రముఖుల ప్రశంసలు అందుకుంది. ఏపీ స్ఫూర్తితో కేంద్రం కేసీసీను తీసుకురావడం నిజంగా గొప్ప విషయం. ఐసీసీ కాల్ సెంటర్‌ను మరింత పటిష్ట పరిచి సేవలను మరింత విస్తృతం చేస్తాం. – చేవూరు హరికిరణ్, స్పెషల్ కమిషనర్, వ్యవసాయ శాఖ -
కాల్చేస్తే ‘సరి’..
సాక్షి, అమరావతి: క్షేత్రస్థాయిలో అన్నదాతలు ఎదుర్కొనే ప్రతీ సమస్యకు చిటికెలో పరిష్కారం చూపిస్తోంది ‘సమీకృత రైతు సమాచార కేంద్రం’. రైతు సమస్యల పరిష్కారం కోసం మూడున్నరేళ్ల క్రితం రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటుచేసిన ఈ కేంద్రం ఇప్పుడు దేశానికే ఆదర్శంగా నిలుస్తోంది. ఒక్క ఫోన్‌కాల్ లేదా వాట్సప్ మెసేజ్ చేస్తే చాలు.. ఎలాంటి సమస్యకైనా వెంటనే సమాధానం దొరుకుతోంది. జాతీయ అంతర్జాతీయ ప్రశంసలు దక్కడమే కాదు అవార్డులు, రివార్డులు కూడా దక్కాయి. ఏపీ స్ఫూర్తితో ఇప్పటికే తెలంగాణలో కాల్ సెంటర్‌ను ఏర్పాటుచేయగా, రాజస్థాన్‌లో ఆచరణలోకి రాబోతోంది. మరికొన్ని రాష్ట్రాలు ఏపీ బాటలోనే సొంతంగా కాల్ సెంటర్ ఏర్పాటుచేసుకునేందుకు ఉత్సాహం చూపిస్తున్నాయి. చివరికి.. ఆఫ్రికన్ దేశం ఇథియోపియాలో కూడా ఏపీ తరహాలో కాల్ సెంటర్ ఏర్పాటు దిశగా అడుగులు వేస్తున్నారు. కార్పొరేట్ సంస్థలకు ధీటుగా నిర్వహణ గతంలో జాతీయ స్థాయిలో ఏర్పాటుచేసిన కిసాన్ కాల్ సెంటర్లు పలు రాష్ట్రాల్లో మొక్కుబడిగా పనిచేసేవి. ఈ కాల్ సెంటర్‌కు ఫోన్ కలవడమే గగనంగా ఉండేది. ఒకవేళ కలిసినా రికార్డు వాయిస్ ద్వారా సలహాలు, సూచనలు ఇవ్వడమే తప్ప రైతుల వెతలు వినే పరిస్థితి ఉండేది కాదు. దీంతో రైతులు పడరాని పాట్లు పడేవారు. ఈ పరిస్థితిని గుర్తించిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి రైతుల కోసం పూర్తిస్థాయిలో కాల్ సెంటర్‌ను ఏర్పాటుచేయాలని సంకల్పించారు. దీంతో.. ఆర్బీకేలతో పాటు విజయవాడ సమీపంలోని గన్నవరం వద్ద ఏర్పాటుచేసిన సమీకృత రైతు సమాచార కేంద్రం–ఐసీసీ కాల్ సెంటర్‌కు 2020 మే 30న శ్రీకారం చుట్టారు. కార్పొరేట్ స్టైల్లో తీర్చిదిద్దిన ఈ కాల్ సెంటర్లో ప్రత్యేకంగా శిక్షణ పొందిన 54 మందిని నియమించారు. వీరు ఉ.7 గంటల నుంచి రాత్రి 7గంటల వరకు రెండు షిఫ్ట్‌లలో సేవలందిస్తున్నారు. ఫోన్ చేయగానే రైతులు చెప్పిన సమస్యలను ఒపిగ్గా వినడమే కాదు.. అత్యంత గౌరవంగా, మర్యాదపూర్వకంగా బదులిస్తున్నారు. తమకు తెలిసినదైతే వెంటనే సమాచారం చెబుతారు. లేదంటే అక్కడే ఉన్న వ్యవసాయ, అనుబంధ రంగాలకు చెందిన నిపుణులు, శాస్త్రవేత్తలతో మాట్లాడిస్తారు. పంటకు సోకిన పురుగులు, తెగుళ్లకు చెందిన ఫొటోలను వాట్సప్‌లో పంపితే చాలు తగిన పరిష్కారం చూపుతున్నారు. రికార్డు స్థాయిలో సమస్యల పరిష్కారం ఇక కాల్ సెంటర్‌కు సగటున ప్రతీరోజూ 649 ఫోన్‌కాల్స్, 10 మెసేజ్‌లు చొప్పున ఇప్పటివరకు 7,78,878 ఫోన్‌కాల్స్, 11,725 వాట్సప్ మెసేజ్‌లు వచ్చాయి. వచ్చే ఫోన్ కాల్స్‌లో 80 శాతం వ్యవసాయ శాఖ, 17 శాతం ఉద్యాన శాఖకు సంబంధించిన సమస్యలు ఉంటుండగా, మిగిలిన 3 శాతం మత్స్య, పట్టు, మార్కెటింగ్, పశు సంవర్థక శాఖలకు సంబంధించినవి ఉంటున్నాయి. ఫోన్‌చేసిన వారిలో 90 శాతం మంది సంతృప్తి వ్యక్తంచేస్తున్నారు. బ్రిటీష్ హై కమిషనర్ గారేట్ వైన్ ఓనర్, నీతి ఆయోగ్ మెంబర్ రమేష్ చంద్, సీఏసీపీ కమిషన్ చైర్మన్ ప్రొ. విజయపాల్ శర్మ, ఐక్యరాజ్య సమితి అనుబంధ సంస్థయిన ఎఫ్ఏఓ కంట్రీ హెడ్ చిచోరి, ఇథియోపియా దేశ వ్యవసాయ శాఖమంత్రి మెలెస్ మెకోనెన్ ఐమెర్ వంటి ఎంతోమంది æప్రముఖులు కాల్‌సెంటర్ నిర్వహణా తీరును ప్రశంసించారు. 24 గంటల్లో క్షేత్రస్థాయి పరిశీలన.. ఇక సమస్య తీవ్రతను బట్టి సంబంధిత జిల్లాల్లోని జిల్లా వనరుల కేంద్రం (డీఆర్సీ) దృష్టికి తీసుకెళ్తారు. దగ్గరలోని పరిశోధనా కేంద్రాల శాస్త్రవేత్తలతో కలిసి డీఆర్సీ సిబ్బంది 24 గంటల్లో ఆ రైతు పొలాన్ని సందర్శిస్తారు. అప్పటివరకు వాడిన ఎరువులు, మందుల వివరాలు, సాగు పద్ధతులు తెలుసుకుంటారు. అవసరమనుకుంటే గ్రామంలోని రైతులందరినీ సమీపంలోని ఆర్బీకే వద్ద సమావేశపరిచి సామూహికంగా పాటించాల్సిన యాజమాన్య పద్ధతులపై అవగాహన కల్పిస్తారు. ఇలా ఒక్క ఫోన్‌కాల్‌తో సాగు సమస్యలే కాదు సరికొత్త సాగు విధానాలు, చీడపీడల నియంత్రణ, నివారణోపాయాలు, అధిక దిగుబడికి సలహాలు అందిస్తున్నారు. ఐసీసీ టోల్ ఫ్రీ నంబర్: 155251 వాట్సాప్ నంబర్లు: 8331056028, 8331056149, 8331056150, 8331056152, 8331056153, 8331056154 ఊరంతా మేలు జరిగింది నాలుగెకరాల్లో పత్తి వేశా. పంటకు సోకిన తలమాడు తెగులు గుర్తించి సెపె్టంబర్ 5న ఫోన్‌చేశా. ఆ మర్నాడే అధికారు లు, శాస్త్రవేత్తలు మా ఊరొచ్చారు. ఊ రంతా ఈ తెగులు ఉందని గమనించి ఆర్బీకే వద్ద రైతులందరిని సమావేశపరిచి పాటించాల్సిన యాజమాన్య పద్ధతులను చెప్పారు. నా పొలంలో గుర్తించిన గులాబి రంగు పురుగు నివారణకు సిఫార్సులు చేశారు. మందులు వాడడంవల్ల రైతులందరికీ మేలు జరిగింది. ఎకరానికి 9 క్వింటాళ్ల దిగుబడి వచ్చింది. – జక్కిరెడ్డి శ్రీనివాసరెడ్డి, దమ్మాలపాడు, పల్నాడు జిల్లా ఒక్క ఫోన్‌కాల్‌తో సమస్య దూరం మా గ్రామంలో దాదాపు వంద ఎకరాల్లో వరి సాగు చేశాం. పైరులో ఉల్లికోడు ఆశించింది. సెపె్టంబర్ 20న నేను గన్నవరం కాల్ సెంటర్‌కు ఫోన్‌చేశాను. వెంటనే కాకినాడ నుంచి డీఆర్సీ సిబ్బంది, శాస్త్రవేత్తలు గ్రామానికి వచ్చి పరిశీలించారు. సస్యరక్షణ చర్యలు సూచించారు. ఉల్లికోడును తట్టుకునే సురేఖ, దివ్య, శ్రీకాకుళం సన్నాలు వంటి రకాలను సాగుచేస్తే మంచిదని సూచించారు. ఒక్క ఫోన్‌తో మా సమస్యకు పరిష్కారం లభించడం ఎంతో సంతోషం. – శీలం చినబాబు, కోరంగి, కాకినాడ జిల్లా మంచి స్పందన వస్తోంది కాల్ సెంటర్ ద్వారా అందిస్తున్న సేవలకు రైతుల నుంచి మంచి స్పందన లభిస్తోంది. కాల్చేసిన వారిలో నూటికి 90 శాతం మంది సంతృప్తి వ్యక్తంచేస్తున్నారు. సంతృప్తి ఈ స్థాయిలో ఉండడం నిజంగా గొప్ప విషయం. కాల్ సెంటర్ సిబ్బంది కూడా చాలా ఓపిగ్గా వింటూ మర్యాదపూర్వకంగా సమాధానాలు చెబుతున్నారు. – వై. అనురాధ, నోడల్ ఆఫీసర్, ఐసీసీ కాల్ సెంటర్ కాల్ సెంటర్ బలోపేతానికి చర్యలు దేశంలో మరెక్కడా లేని విధంగా మన రైతు సమాచార కేంద్రం అద్భుతంగా పనిచేస్తోంది. కాల్ సెంటర్‌ను బలోపేతం చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వంతో కలిసి పనిచేసేందుకు హైదరాబాద్‌కు చెందిన బ్రేన్ ఎంటర్ప్రైజెస్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ ముందుకొచ్చింది. ఫోన్ రాగానే రైతుల సమస్యలన్నీ ఆటోమెటిక్‌గా సంబంధిత డీఆర్సీతో పాటు జిల్లా, మండల వ్యవసాయ శాఖాధికారులకు క్షణాల్లో చేరిపోతుంది. ఇందుకోసం ప్రత్యేకంగా యాప్‌ను కూడా డిజైన్ చేస్తున్నాం. – వల్లూరి శ్రీధర్, స్టేట్ కోఆర్డినేటర్, ఐïసీసీ కాల్ సెంటర్ -
బీజేపీ ప్రచార నిర్వహణకు 300 కాల్ సెంటర్లు
సాక్షి, న్యూఢిల్లీ: రానున్న లోక్‌సభ ఎన్నికల ప్రచార నిర్వహణకు బీజేపీ భారీగా ఏర్పాట్లు చేస్తోంది. దేశవ్యాప్తంగా క్షేత్రస్థాయిలో పార్టీని బలోపేతం చేయడం, ప్రచార అంశాలను రూపొందించడం, ఓటర్లను ఆకట్టుకునే కార్యక్రమాలు నిర్వహించడమే లక్ష్యాలుగా 300 కాల్ సెంటర్లు ఏర్పాటు చేస్తోంది. దేశాన్ని 10 జోన్లుగా విభజించించి, ప్రతి 27 అసెంబ్లీ నియోజకవర్గాలకు ఒకటి చొప్పున కాల్ సెంటర్‌ను నిర్వహించనుంది. ఇవి ఓటర్లకు నిత్యం ఫోన్ చేసి మేనిఫెస్టోను వివరిస్తాయని బీజేపీ కీలక నేత ఒకరు తెలిపారు. పది జోన్లకు ఒకరు చొప్పున ఇన్‌చార్జ్‌ల నియామకాలను పూర్తి చేసిన పార్టీ అధిష్టానం తెలంగాణ–ఆంధ్రప్రదేశ్ జోన్ ఇన్చార్జ్గా గుజరాత్ ఎమ్మెల్యే అమిత్ థాకర్‌ను నియమించింది. మధ్యప్రదేశ్–ఛత్తీస్‌గఢ్ జోన్‌కు బిహార్ బీజేపీ నేత దేవేశ్ కుమార్, ఉత్తరప్రదే శ్–ఉత్తరాఖండ్ ఇన్చార్జ్ గా ఢిల్లీ బీజేపీ ఉపాధ్యక్షు డు రాజీవ్ బబ్బర్‌ను నియమించారు. ఈ నేతలు కేంద్ర కార్యాలయంలోని ఐదుగురు ముఖ్యనేతలు, రాష్ట్రాల పరిధిలో కాల్‌సెంటర్ల ఇన్‌చార్జ్‌లను కలుపుకొని ప్రచారాన్ని పర్యవేక్షించనున్నారు. -
బ్రిటిష్ ఎయిర్వేస్ విస్తరణ
న్యూఢిల్లీ: విమానయాన రంగ దిగ్గజం బ్రిటిష్ ఎయిర్వేస్ దేశీయంగా విస్తరణ బాట పట్టింది. దాదాపు శతాబ్ద కాలంగా దేశానికి సరీ్వసులు నిర్వహిస్తున్న కంపెనీ తాజాగా ఢిల్లీ, ముంబైలకు మరిన్ని విమానాలను నడపనున్నట్లు పేర్కొంది. విస్తరణకు అవకాశముండటంతోపాటు.. కోవిడ్–19 తదుపరి పలు ప్రాంతాల నుంచి డిమాండు ఊపందుకోవడం ఇందుకు కారణమైనట్లు తెలియజేసింది. కొత్తగా అధికారిక కాల్ సెంటర్‌ను ఏర్పాటు చేసినట్లు కంపెనీ పేర్కొంది. దీనిలో పనిచేస్తున్న 1,700 మందితోపాటు మరో 300 మందికి ఉపాధి కలి్పంచినట్లు వెల్లడించింది. ఈ సందర్బంగా దేశీ అవకాశాలపై అత్యంత ఆశావహంగా ఉన్నట్లు చైర్మన్, సీఈవో సీన్ డోయల్ పేర్కొన్నారు. పలు ప్రాంతాల నుంచి సరీ్వసుల వృద్ధికి వీలున్నట్లు అభిప్రాయపడ్డారు. దీంతో కరోనా మహమ్మారికి ముందుస్థాయిలో ప్రస్తుతం వారానికి 56 విమానాలను నడుపుతున్నట్లు తెలియజేశారు. మెట్రో నగరాలకు ఢిల్లీ, ముంబై, చెన్నై, బెంగళూరు, హైదరాబాద్‌లను కలుపుతూ సరీ్వసులను నిర్వహిస్తున్నట్లు డోయల్ తెలియజేశారు. ఇటీవలి వరకూ 49 విమానాలను నడిపినట్లు వెల్లడించారు. రెండు దేశాల మధ్య ద్వైపాక్షిక ఎయిర్ సర్వీస్ ఒప్పందంలో భాగంగా ఢిల్లీ, ముంబైలకు విమాన సరీ్వసులను పెంచనున్నట్లు తెలియజేశారు. దేశీయంగా 2,000 మందికిపైగా ఉద్యోగులను కలిగి ఉన్నట్లు కంపెనీ చీఫ్ కస్టమర్ ఆఫీసర్ కేలమ్ లామింగ్ తెలియజేశారు. కంపెనీ ప్రపంచవ్యాప్తంగా మొత్తం 35,000 మంది సిబ్బందిని కలిగి ఉంది. -
కాల్ సెంటర్ స్కామ్ జరుగుతుందిలా! ఆదమరిస్తే..
Call Centre Scheme: రోజు రోజుకి ప్రపంచ వ్యాప్తంగా కాల్ సెంటర్ మోసాలు భారీగా జరుగుతున్నాయి. వీటిని నివారించడానికి సంబంధిత శాఖలు, అధికారులు ఎన్ని చర్యలు తీసుకుంటున్నప్పటికీ, మోసగాళ్లు కూడా ఎత్తుకి పైఎత్తు వేస్తున్నారు. ఇలాంటి సంఘటనలో గతంలో కోకొల్లలుగా జరిగాయి. తాజాగా మరో సంఘటన వెలుగులోకి వచ్చింది. దీని గురించి మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం. ట్విటర్ ద్వారా వెల్లడైన వీడియోలో మీరు గమనించినట్లతే కాల్ సెంటర్ అందులో పని చేసే ఉద్యోగులు స్పష్టంగా కనిపిస్తారు. ఇందులో ఒక ఉద్యోగి 'చర్చిల్' అనే వ్యక్తికి ఫోన్ చేసి మీ వాషింగ్ మిషన్ వారంటీ ముగిసిందని, వారంటీ పొడిగించడానికి కాల్ చేస్తున్న అంటూ మాట్లాడుతుంది. నిజానికి ముందుగానే పక్కా ప్రణాళిక ప్రకారం ఈ మోసాలు జరుగుతున్నట్లు వీడియోలో స్పష్టంగా తెలుస్తోంది. Making Life HELL For Scammers pic.twitter.com/hhPJ50EYVG — Insane Reality Leaks (@InsaneRealitys) June 28, 2023 కాల్ సెంటర్లో పనిచేస్తున్న ఉద్యోగులలో ఒక వ్యక్తి ల్యాప్ టాప్ ముందు ఉన్నట్లు, పక్కన ఉన్న మరో వ్యక్తి డ్యూయెల్ మానిటర్ సెటప్ కలిగి ఉండటం చూడవచ్చు. బహుశా వీరే ఆ కాల్ సెంటర్ నడిపిస్తున్నట్లు తెలుస్తోంది. వారు ముందుగానే కొంతమందిని సెలక్ట్ చేసుకుని వారికి ఫోన్స్ చేస్తున్నట్లు కూడా మీరు ఈ వీడియోలో గమనించవచ్చు. ఇలాంటి మోసాలు జరగటం ఇదే మొదటి సారి కాదు, దేశవ్యాప్తంగా ఎక్కడ చూసినా ఇలాంటి మోసాలు ఎక్కువైపోతున్నాయి. కొంత మంది వందల కోట్లు ఈ కాల్ సెంటర్ల ద్వారా స్కామ్ చేస్తున్నారు. బాగా చదువుకున్న వ్యక్తులు ఇలాంటి మోసాలకు పాల్పడుతున్నట్లు నివేదికలు చెబుతున్నాయి. మొత్తానికి మీకు తెలియని నెంబర్స్ నుంచి కాల్స్ వస్తే వారంటీలు, ఇతరత్రా కారణాలు చెప్పి మభ్య పెట్టాలని చూస్తే వాటికి స్పందించకపోవడం మంచిది. మళ్ళీ మళ్ళీ ఇలాంటి కాల్స్ వస్తే పోలీసులకు పిర్యాదు చేయవచ్చు. -
వినియోగదారులకు అండగా కాల్‌సెంటర్
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో వినియోగదారుల సాధికారతే ధ్యేయంగా.. వారికి ఎదురయ్యే సమస్యలను పరిష్కరించేందుకు 1967 టోల్‌ఫ్రీ నంబర్‌తో ఇంటిగ్రేటెడ్ కాల్‌సెంటర్ ఏర్పాటు చేసినట్టు పౌరసరఫరాలశాఖ కమిషనర్ హెచ్.అరుణ్‌కుమార్ గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. రేషన్ పంపిణీలో జాప్యం, నాణ్యత లోపాలు, బరువులో వ్యత్యాసం, ఎండీయూల నిర్లక్ష్యం, డీలర్లపై ఫిర్యాదులు, కొత్త బియ్యం కార్డుల మంజూరు, సభ్యుల విభజన, చేర్పులు, మార్పులు, కొత్తకార్డు అప్లికేషన్ స్థితి, ఒకే దేశం – ఒకే రేషన్, గ్యాస్ సిలిండర్ డోర్ డెలివరీ చేయకపోవడం, అదనపు రుసుము వసూలు, రశీదులు లేని వ్యవహారాలు, వస్తువులు ఎమ్మార్పీ కంటే ఎక్కువకు విక్రయించడం, పెట్రోల్, డీజిల్ నాణ్యత, పెట్రోబంకుల్లో కనీస సౌకర్యాల కొరత, ధాన్యం సేకరణలో ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా జరిగే ప్రతి వ్యవహారంపైనా ఈ కాల్‌సెంటర్‌కు ఫిర్యాదు చేయవచ్చని వివరించారు. ఆ ఫిర్యాదులను సంబంధిత శాఖలకు పంపించి సత్వరమే పరిష్కరిస్తామని తెలిపారు. రోజూ ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు అందుబాటులో ఉండే ఈ కాల్‌సెంటర్‌పై ప్రజలకు అవగాహన కల్పించేందుకు టోల్‌ఫ్రీ నంబర్‌ను బియ్యం పంపిణీచేసే ఎండీయూ వాహనాలపైన కూడా ముద్రించినట్లు తెలిపారు. ప్రతి మండలంలో మండల వినియోగదారుల సేవాకేంద్రాలను అందుబాటులోకి తెచ్చినట్లు పేర్కొన్నారు. ఈ కేంద్రాలకు డిప్యూటీ తహసీల్దార్లు ఇన్‌చార్జీలుగా వ్యవహరిస్తూ వినియోగదారులకు హక్కుల రక్షణ, సమస్యల పరిష్కారాలపై సూచనలు చేస్తారని తెలిపారు. -
AP: సత్వరమే ఫిర్యాదుల పరిష్కారం
సాక్షి, అమరావతి: ప్రభుత్వ వైద్య సేవల్లో ఏవైనా సమస్యలు తలెత్తితే ప్రజలు ఫిర్యాదు చేయడానికి వీలుగా ప్రవేశపెట్టిన 104 కాల్‌సెంటర్ చక్కగా పనిచేస్తోంది. సత్వరమే ఫిర్యాదులను పరిష్కరిస్తోంది. ఈ ఏడాది జూన్‌లో 104 కాల్ సెంటర్‌ను వైద్య శాఖ ఏర్పాటు చేయగా ఇప్పటివరకు 6,336 ఫిర్యాదులు అందాయి. ఇందులో 5,918 ఫిర్యాదులను నిర్దేశిత సమయంలోగా పరిష్కరించారు. మరో 235 ఫిర్యాదులు నిర్దేశిత సమయానికి కొంత ఆలస్యంగా పరిష్కారమయ్యాయి. కాల్సెంటర్లో 30 మంది సిబ్బంది 24/7 పనిచేస్తున్నారు. వీరు కాల్ సెంటర్‌కు వచ్చిన సమస్యలు, ఫిర్యాదులను ఎప్పటికప్పుడు పరిష్కరిస్తున్నారు. చదవండి: ఏపీ బడిబాటలో యూపీ ఐదు సేవలపై ఫిర్యాదులకు.. ప్రజలకు నాణ్యమైన వైద్య సేవలు అందించడానికి వైద్య రంగంపై రాష్ట్ర ప్రభుత్వం రూ.వేల కోట్లు ఖర్చు చేస్తోంది. అయితే ఒకటి రెండు చోట్ల అధికారుల ఉదాసీన వైఖరి, క్షేత్ర స్థాయి సిబ్బంది, ఆస్పత్రుల యాజమాన్యాల నిర్లక్ష్యంతో ప్రభుత్వ లక్ష్యానికి తూట్లు పడుతున్నాయి. ఈ నేపథ్యంలో ప్రభుత్వ వైద్య సేవలను పొందడంలో ఎక్కడైనా సమస్యలు, ఇబ్బందులు తలెత్తితే ప్రజలు ఫిర్యాదు చేయడానికి 104 ఫిర్యాదుల కాల్ సెంటర్‌ను అందుబాటులోకి తెచ్చారు. వైఎస్సార్ ఆరోగ్యశ్రీ–ఆరోగ్య ఆసరా, 104 మొబైల్ మెడికల్ యూనిట్స్ (ఎంఎంయూ), 108 అంబులెన్స్, వైఎస్సార్ తల్లీబిడ్డ ఎక్స్‌ప్రెస్, మహాప్రస్థానం ఈ ఐదు సేవలపై ఫిర్యాదులు స్వీకరించడం ప్రారంభించారు. కాల్ సెంటర్‌కు వచ్చిన ఫిర్యాదులను తీవ్రతను బట్టి ఎంత సమయంలోగా పరిష్కరించాలి.. పరిష్కరించడానికి బాధ్యులు ఎవరనే దానిపై స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్ (ఎస్వోపీ)ని రూపొందించారు. 104 కాల్ సెంటర్ సేవలను ప్రభుత్వాస్పత్రుల్లో వైద్యం, ఇతర సేవలపై ఫిర్యాదుల స్వీకారం దిశగా విస్తరించనున్నారు. ఈ మేరకు ప్రణాళిక సిద్ధం చేశారు. ఉన్నత స్థాయిలో పర్యవేక్షణ.. కాల్‌సెంటర్‌కు వచ్చే ప్రతి ఫిర్యాదు, వాటి పరిష్కారంపై డ్యాష్‌బోర్డ్ ద్వారా ఉన్నత స్థాయిలో పర్యవేక్షిస్తున్నారు. కాల్‌సెంటర్‌కు వచ్చిన ఫిర్యాదులను ఎస్‌వోపీలో నిర్దేశిత సమయంలోగా పరిష్కరించడానికి కృషి చేస్తున్నామని వైఎస్సార్ ఆరోగ్యశ్రీ డిప్యూటీ ఈవో మధుసూదన్‌రెడ్డి తెలిపారు. ఆరోగ్యశ్రీ ఆస్పత్రుల్లోని హెల్ప్ డెస్క్‌లు, 104 ఎంఎంయూ, 108 అంబులెన్స్, మహాప్రస్థానం వాహనాలపై ఫిర్యాదుల నంబర్‌ను ఏర్పాటు చేశామన్నారు. ప్రజలకు ఏవైనా సమస్యలు తలెత్తితే ఆ నంబర్‌కు ఫిర్యాదు చేయాలని సూచించారు. ఫిర్యాదులు ఇలా చేయొచ్చు.. ►ఐదు సేవల్లో ఏదైనా సమస్యపై ఫిర్యాదు చేయాలనుకుంటే తొలుత 104కు కాల్ చేయాలి. ►కాల్ చేసిన వెంటనే వైద్య సేవలపై ఫిర్యాదుల కోసం 1, సమాచారం కోసం 2 నొక్కాలని ఐవీఆర్ఎస్ సూచిస్తుంది. ►అప్పుడు ఫిర్యాదులు చేయాల్సినవారు 1 నొక్కాలి. ►అనంతరం కాల్ సెంటర్లోని ఎగ్జిక్యూటివ్ ఫిర్యాదు స్వీకరిస్తారు. -
హైదరాబాద్ లో నకిలీ కాల్ సెంటర్ గుట్టురట్టు
-
అవకాశాలు లేక కాల్సెంటర్లో పనిచేస్తున్న ప్రముఖ నటి
కరోనా కారణంగా ఆర్థికంగా ఎంతోమంది నష్టపోయారు. సినీ సెలబ్రిటీలు కూడా ఇందుకు మినహాయింపు కాదు. లాక్డౌన్ కారణంగా పనిలేక చేతిలో డబ్బులు లేక అవస్థలు పడినవారు, ఇప్పటికీ సరైన పని దొరక్క ఇబ్బందులు పడుతున్నవారున్నారు. తాజాగా బుల్లితెర నటి ఏక్తా శర్మ కాల్ సెంటర్లో పని చేస్తుంది. సినీ పరిశ్రమలో సరైన అవకాశాలు రాకపోవడంతో తనకున్న చదువు రీత్యా ఈ పని చేస్తున్నట్లు తెలిపింది. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో ఆమె మాట్లాడుతూ.. 'కరోనా కారణంగా జీవితం తలకిందులయ్యింది. అద్దె ఇంట్లో నివసిస్తున్నాను. ఇల్లు గడవడం కష్టంగా మారడంతో ఉన్న నగలు అమ్మేశా. అవకాశాలు రావడం లేదని ఏడుస్తూ ఇంట్లోనే కూర్చోలేను కదా అందుకే కాల్ సెంటర్లో పనిచేస్తున్నా. ఈ పని చేస్తున్నందుకు నాకేమీ తప్పనిపించడం లేదు. ప్రస్తుతం కోర్టులో నా కూతురి కస్టడీ కేసు నడుస్తుంది. ఎవరో వస్తారు.. ఏదో అద్భుతం జరుగుతుంది అని ఎదురు చూడలేను. అందుకే కాల్ సెంటర్లో పనిచేస్తూనే, ఆడిషన్స్ కూడా ఇస్తున్నా. త్వరలోనే నాకు మళ్లీ ఛాన్సులు వస్తాయని ఆశిస్తున్నా' అని పేర్కొంది. కాగా ఏక్తా డాడీ సంఝా కరో, కుసుమ్, క్యుంకీ సాస్ భీ కభీ బహు థీ, కామినీ-దామిని వంటి సీరియల్స్‌తో గుర్తింపు పొందిన ఏక్తా చివరగా 'బెప్నా ప్యార్' అనే టీవీ షోలో కనిపించింది. -
గ్రామీణ మహిళా ఎంట్రప్రెన్యూర్ల కోసం కాల్‌సెంటర్
న్యూఢిల్లీ: గ్రామీణ మహిళా ఎంట్రప్రెన్యూర్ల కోసం నాస్కామ్ ఫౌండేషన్, టెక్నాలజీ దిగ్గజం గూగుల్, స్వచ్ఛంద సంస్థ ఐఎస్ఏపీ కలిసి సంయుక్తంగా ’డిజివాణి కాల్‌సెంటర్’ ఏర్పాటు చేశాయి. హిమాచల్‌ప్రదేశ్, ఉత్తరాఖండ్, ఉత్తర్‌ప్రదేశ్ తదితర ఆరు రాష్ట్రాల్లో దీన్ని ప్రయోగాత్మకంగా అందుబాటులోకి తెచ్చినట్లు నాస్కామ్ ఫౌండేషన్ సీఈవో నిధి భాసిన్ తెలిపారు. ప్రాథమికంగా 20,000 మంది ఔత్సాహిక మహిళా వ్యాపారవేత్తలకు దీని ద్వారా సేవలు అందించాలని నిర్దేశించుకున్నట్లు వివరించారు. తమకు ఉపయోగపడే వివిధ పథకాలు, వ్యాపార వృద్ధికి సహాయపడే స్కీములు లేదా ఇతరత్రా సమాచారం మొదలైన వాటన్నింటి గురించి డిజివాణి ద్వారా తెలుసుకోవచ్చని భాసిన్ వివరించారు. దీనికి అవసరమైన నిధులను గూగుల్ సమకూరుస్తోందని, ఏడాది తర్వాత డిజివాణి సేవలను విస్తరించడంపై దృష్టి పెట్టనున్నామని పేర్కొన్నారు. ఇండియన్ సొసైటీ ఆఫ్ అగ్రిబిజినెస్ ప్రొఫెషనల్స్ (ఐఎస్ఏపీ)కి చెందిన ఢిల్లీ, లక్నో ఆఫీసుల్లో ఏర్పాటు చేసిన ఈ కాల్ సెంటర్లలో 19 మంది సిబ్బంది ఉన్నారు. -
వైద్య సేవల్లో లోపాలుంటే 104కు చెప్పండి
సాక్షి, అమరావతి: కరోనా వ్యాప్తి సమయంలో ఆపద్బాంధవిగా ప్రజలకు విశిష్ట సేవలందించిన 104 కాల్ సెంటర్ ద్వారా రాష్ట్ర ప్రభుత్వం మరో కీలక సేవను అందుబాటులోకి తీసుకురానుంది. ప్రభుత్వాస్పత్రుల్లో రోగులకు ఎదురయ్యే సమస్యలపై ఈ కాల్ సెంటర్‌కు ఫోన్‌చేసి ఫిర్యాదు చేసే వీలును కల్పించబోతోంది. ఇందుకోసం వైద్య, ఆరోగ్య శాఖ ప్రణాళిక రచిస్తోంది. ప్రభుత్వాస్పత్రులకు వచ్చే నిరుపేద, మధ్యతరగతి రోగులు చికిత్స అనంతరం సంతోషంగా ఇళ్లకు తిరిగి వెళ్లాలనే సంకల్పంతో సీఎం జగన్ అడుగులు వేస్తున్నారు. ఇందులో భాగంగా నాడు–నేడు కార్యక్రమానికి శ్రీకారం చుట్టి ప్రభుత్వాసుపత్రుల రూపురేఖలు మారుస్తున్నారు. ఈ కార్యక్రమానికి రూ.16వేల కోట్లకు పైగా భారీ నిధులను ప్రభుత్వం ఖర్చుచేస్తోంది. ప్రభుత్వాసుపత్రుల్లో వైద్యులు, వైద్యసిబ్బంది కొరతకు తావులేకుండా చేస్తోంది. 2019 నుంచి ఇప్పటివరకు వైద్య శాఖలో 39వేల పోస్టుల భర్తీ చేపట్టింది. అవసరమైన మౌలిక వసతులనూ సమకూరుస్తోంది. ఇంత చేస్తున్నప్పటికీ ఇటీవల పలు ప్రభుత్వాస్పత్రుల్లో రోగులు ఇబ్బందులకు గురైన ఘటనలు వెలుగుచూశాయి. దీంతో అలాంటి ఘటనలు పునరావృతం కాకుండా ఆసుపత్రుల్లో రోగులకు ఎదురయ్యే ఇబ్బందులు, సమస్యలను ఎప్పటికప్పుడు తెలుసుకుని వాటిని పరిష్కరించాలని అధికారులు నిర్ణయించారు. ఈ క్రమంలో 104 టోల్ ఫ్రీ నంబర్ ద్వారా ఫిర్యాదులు స్వీకరించనున్నారు. కరోనా రోజుల్లో 12లక్షల మందికి సేవలు కరోనా కష్టకాలంలో 104 కాల్ సెంటర్ ద్వారా కోవిడ్‌కు సంబంధించిన సమాచారం, వైద్య పరీక్షలు, ఇతర సేవలన్నింటినీ ఈ కాల్ సెంటర్ ద్వారా ప్రజలకు అందించారు. 12 లక్షల మందికి పైగా ప్రజలు కాల్ సెంటర్‌కు ఫోన్‌చేసి కరోనా మూడు దశల్లో సేవలు పొందారు. ఫోన్‌చేస్తే కరోనా నిర్ధారణ పరీక్షలకు టోకెన్ రైజ్ చేయడం మొదలు, పాజిటివ్ అయితే ఆసుపత్రికి తరలించే అంబులెన్స్‌ను అందుబాటులోకి తీసుకురావడం, ఆసుపత్రిలో బెడ్‌ను సమకూర్చడం ఇలా అనేక రకాల సేవలు కాల్ సెంటర్ ద్వారా అందాయి. వారం రోజుల్లో బలోపేతం ప్రభుత్వాస్పత్రుల్లో ఎదురవుతున్న ఇబ్బందులపై ఫిర్యాదులు స్వీకరించేందుకు వీలుగా 104 కాల్ సెంటర్‌ను వారం రోజుల్లో బలోపేతం చేస్తాం. వైద్యులు, వైద్య సిబ్బంది అందుబాటులో లేకపోవడం.. సెక్యూరిటీ, శానిటేషన్, మహాప్రస్థానం, అంబులెన్స్ సహా ఇతర సేవల్లో ఇబ్బందులు ఎదురైతే రోగులు ఫిర్యాదు చేయడానికి వీలు కల్పిస్తాం. వచ్చిన ఫిర్యాదులను వెంటనే పరిష్కరించేలా చర్యలు చేపడతాం. రోగులు ఏ చిన్న ఇబ్బందికీ గురికాకూడదు అనేది ప్రభుత్వ ఉద్దేశం. అందుకనుగుణంగా అన్ని చర్యలు తీసుకుంటాం. – ఎం.టి. కృష్ణబాబు, వైద్య, ఆరోగ్య శాఖ ముఖ్య కార్యదర్శి -
పాడి కోసం ఇంటిగ్రేటెడ్ కాల్ సెంటర్
సాక్షి, అమరావతి: అన్నివేళలా అన్నదాతలకు అండగా నిలిచేందుకు గన్నవరంలోని ‘సమీకృత రైతు సమాచార కేంద్రం’ మాదిరిగానే పాడి రైతుల పరిష్కారం కోసం ప్రత్యేకంగా ఇంటిగ్రేటెడ్ కాల్ సెంటర్‌ను ప్రభుత్వం ఏర్పాటు చేస్తోంది. మారుమూల ప్రాంతాల్లోని మూగజీవాలకు మెరుగైన నాణ్యమైన వైద్య సేవలందించాలన్న సంకల్పంతో రూ.7.53 కోట్లతో దేశంలోనే తొలిసారి ఏర్పాటవుతున్న ఈ కాల్‌సెంటర్ నిర్వహణకు మార్గదర్శకాలను జారీచేస్తూ మంగళవారం ఉత్తర్వులు జారీ చేసింది. పశుసంవర్ధక శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఈ కాల్ సెంటర్ ద్వారా పాడిరైతులకు అవసరమైన సలహాలు, సూచనలతో పాటు టెలిమెడిసిన్ సేవలు కూడా అందిస్తారు. ఉదయం 9.00 నుంచి సాయంత్రం 6.00 గంటల వరకు ఈ కాల్ సెంటర్ పనిచేస్తుంది. -
ఇండియన్ కాల్సెంటర్లపై అమెరికాలో కేసు నమోదు
అమెరికన్ పౌరులను తప్పుదోవ పట్టించి ఆర్థిక నేరాలకు పాల్పడుతున్న భారతీయ కాల్ సెంటర్లపై అమెరికా అధికారులు కేసులు నమోదు చేశారు. ఈ వ్యవహరంలో మొత్తం ఆరు కాల్‌సెంటర్లు, వాటి డైరెక్టర్లపై అభియోగాలు నమోదు అయ్యాయి. అంతకు ముందు 2020 నవంబరులో ఓ కాల్ సెంటర్‌పై ఇదే తరహా నేరారోపణలు మోపారు. నార్తర్ డిస్ట్రిక్ట్ ఆఫ్ జార్జియా, యూఎస్ అటార్నీ ఆఫీసు తెలియజేసిన వివరాల ప్రకారం వాయిస్ ఓవర్ ఇంటర్నెట్ ప్రోటోకాల్ ఆధారంగా స్కామ్ కాల్స్ చేస్తూ అమెరికన్ పౌరులను తప్పుదోవ పట్టించి వారి దగ్గర నుంచి డబ్బులు కాజేశారు. ముఖ్యంగా సీనియర్ సిటిజన్స్ సేవ్సింగ్ నుంచి భారీ మొత్తంలో సొమ్ము పక్కదారి పట్టించారు. నవంబరులో నమోదైన కేసుకు సంబందించి 2015 నుంచి 2020 వరకు 20 మిలియన్ డాలర్లు తస్కరించారు. ఈ మేరకు 1.30 లక్షల స్కామ్ కాల్స్ చేశారు. తాజాగా అభియోగాలు నమోదైన కాల్ సెంటర్లు, డైరెక్టర్ల వివరాలు ఇలా ఉన్నాయి. - మను చావ్లా అండ్ అచీవర్స్ ఏ స్పిరిట్ ఆఫ్ బీపీవో సొల్యూషన్స్ ప్రైవేట్ లిమిటెడ్ - సుశీల్ సచ్దేవ, నితిన్ కుమార్ వద్వానీ, స్వర్ణదీప్‌సింగ్ ఆలియాస్ సవరన్ దీప్ కోహ్లీ (ఫిన్టాక్ గ్లోబల్) - దినేష్ మనోహర్ సచ్దేవ్ (గ్లోబల్ ఎంటర్ప్రైజెస్) - గజేసింగ్ రాథోడ్ (శివాయ్ కమ్యూనికేషన్స్ ప్రైవేట్ లిమిటెడ్) - సంకేత్ మోదీ (ఎస్ఎమ్ టెలికమ్యూనికేషన్స్ ప్రైవేట్ లిమిటెడ్) - రాజీవ్ సోలంకి ( టెక్నోమైండ్ ఇన్ఫో సొల్యూషన్స్) ఈ కాల్ సెంటర్ల నుంచి అమెరికన్ సిటిజన్స్‌కి స్కామ్ కాల్ చేస్తూ తాము ఇంటర్నల్ రెవిన్యూ సర్వీస్ నుంచి మాట్లాడుతున్నామని.. మీ సోషల్ సెక్యూరిటీ నంబర్ మీద పలు కేసులు నమోదు అయ్యాయని చెప్పి మాటాల్లో పెట్టేవారు. ఈ క్రమంలో వారి బ్యాంకు ఖాతా ఇతర వివరాలు సేకరించి డబ్బులు దోచుకునే వారు. ఈ తరహా కేసులు ఎక్కువైపోవడంతో అమెరికన్ పోలీసులు వీరిపై నిఘా పెట్టారు. చివరకు మోసాలకు పాల్పడుతున్నారనే అభియోగంపై ఆరు కంపెనీలపై కేసులు నమోదు చేశారు. వీటిపై విచారణ కొనసాగనుంది. గతంలో ఈ తరహా నేరాలకు పాల్పడిన అహ్మదాబాద్‌కి చెందిన కాల్‌సెంటర్ డైరెక్టర్‌కి 20 ఏళ్ల శిక్ష విధించాయి అమెరికన్ న్యాయస్థానాలు. చదవండి: గుజరాత్లో ఎన్నారై మాఫియా? అక్రమ రవాణాకు కోట్ల రూపాయల వసూలు -
సైబర్ క్రిమినల్స్ కేరాఫ్ రాజస్తాన్
రాజస్తాన్ రాష్ట్రం సైబర్ నేరగాళ్లకు కేరాఫ్ అడ్రస్‌గా మారుతోంది. ఆర్థికాంశాలతో ముడిపడిన ఈ నేరాలు చేస్తూ సిటీ సైబర్ క్రైమ్ పోలీసులకు చిక్కిన అంతర్రాష్ట్రీయుల్లో ఈ రాష్ట్రానికి చెందిన వారే అత్యధికంగా ఉన్నారు. గత ఏడాది సిటీ సైబర్ కాప్స్ అరెస్టు చేసిన బయటి రాష్ట్రాల వారిలో రాజస్తాన్ వాసులే 20 శాతం వరకు ఉన్నారు. ఈ కాలంలో నగర నేర పరిశోధన విభాగం (సీసీఎస్) ఆధీనంలోని సైబర్ క్రైమ్ పోలీసులు మొత్తం 344 మంది నిందితుల్ని అరెస్టు చేశారు. వీరిలో తెలంగాణకు చెందిన వారు 86 మంది ఉండగా.. మిగిలిన 258 మందిలో రాజస్తాన్ వాసుల సంఖ్య అత్యధికంగా 50 ఉన్నట్లు గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి. సిటీ సైబర్ క్రైమ్ పోలీసులు నిందితుల్ని అరెస్టు చేయడానికి మొత్తం 15 రాష్ట్రాల్లో ఆపరేషన్లు చేపట్టారు. సాక్షి, హైదరాబాద్: సైబర్ నేరాలను అధికారులు ప్రధానంగా రెండు రకాలుగా విభజిస్తారు. వివిధ రూపాల్లో బాధితుల నుంచి నగదును కాజేసే ఆర్థిక సంబంధమైనవి ఒకటైతే.. ఫేస్బుక్, వాట్సాప్ తదితర సామాజిక మాధ్యమాలను వినియోగించి ఎదుటి వారిని ఇబ్బంది పెట్టేవి మరోరకం. వీటిలో బాధితులకు ఆర్థిక నష్టం లేనప్పటికీ అశ్లీలం, అభ్యంతరకర అంశాలు ముడిపడి ఉంటాయి. సైబర్ నేరాలకు సంబంధించి అరెస్టు అవుతున్న స్థానికుల్లో (తెలంగాణ వాసులు) దాదాపు 99 శాతం ఈ కోవకు చెందిన నేరాలు చేసిన వారై ఉంటున్నారు. వ్యక్తిగత కక్ష, ప్రతీకారం, అసూయల నేపథ్యంలో ఎదుటి వారి ప్రతిష్టను దెబ్బతీయాలనే ఉద్దేశంతో కంప్యూటర్, సెల్ఫోన్లను వినియోగించి సైబర్ నేరాలకు పాల్పడుతున్నారు. ఇలా సైబర్ క్రైమ్ పోలీసులకు పట్టుబడుతున్న వారిలో ఎక్కువ మంది విద్యాధికులై ఉంటున్నారు. అడ్డంగా దోచేసే ఆర్థిక నేరగాళ్లు సైబర్ నేరాల్లో రెండో రకమైన ఆర్థిక సంబ«ంధ నేరాలు చేస్తున్న వారిలో వివిధ రాష్ట్రాలకు చెందిన వారు ఉంటున్నారు. గత ఏడాది జనవరి నుంచి డిసెంబర్ 20 వరకు సిటీ సైబర్ క్రైమ్ పోలీసులు అరెస్టు చేసిన బయటి రాష్ట్రాల వారిలో రాజస్తాన్ వాసులే ఎక్కువగా ఉన్నారు. వీళ్లు ఓఎల్ఎక్స్, ఫేస్బుక్ ద్వారా వస్తువులు విక్రయిస్తామని, ఖరీదు చేస్తామని ఎర వేసి బురిడీ కొట్టిస్తుంటారు. ఇటీవల కాలంలో నకిలీ ఫేస్బుక్ ఖాతాలు తెరిచి, ఫ్రెండ్ రిక్వెస్ట్‌లు పంపిస్తూ... ఆపై అందినకాడికి డబ్బు డిపాజిట్ చేయించుకుంటున్నారు. న్యూడ్ కాల్స్ చేయించి బ్లాక్ మెయిల్ చేయడమూ వీరి మోసాల్లో ఒక పంథా. ఇక ఇన్సూరెన్సులు, లాటరీలు, తక్కువ వడ్డీకి రుణాలు, వీసాల పేరు చెప్పి అందినకాడికి డబ్బు కాజేసే వారిలో ఢిల్లీకి చెందిన వారే ఎక్కువగా ఉంటున్నారు. న్యూఢిల్లీ, నోయిడా, గుర్గావ్‌లతో పాటు ఆ చుట్టు పక్కల ప్రాంతాల్లో ఈ సైబర్ నేరగాళ్ళు ప్రత్యేకంగా కాల్‌సెంటర్లు నిర్వహిస్తున్నారు. టెలీకాలర్లను ఏర్పాటు చేసుకుని దేశ వ్యాప్తంగా మోసాలకు పాల్పడుతున్నారు. నైజీరియన్లూ పెద్ద సంఖ్యలో... పెద్ద మొత్తాలతో ముడిపడి ఉన్న సైబర్ నేరాల్లో సూత్రధారులుగా ఉంటున్న వారిలో నైజీరియన్లు పెద్ద సంఖ్యలో ఉంటున్నారు. వీరితో పాటు సోయాలియా వంటి ఆఫ్రికన్ దేశాలకు చెందిన వారూ నిందితులుగా మారుతున్నారు. బిజినెస్, స్టడీ తదితర వీసాలపై భారత్‌కు వచ్చి నగరాల్లో నివసిస్తున్న ఈ నల్లజాతీయులు తేలిగ్గా డబ్బు సంపాదించడం కోసం సైబర్ నేరాలకు పాల్పడుతున్నారు. వీరికి స్థానికులు, ఇతర రాష్ట్రాలకు నుంచి వచ్చి ఆయా నగరాల్లో నివసిస్తున్న వారూ మనీమ్యూల్స్‌గా మారి సహకరిస్తున్నారు. అనేక కేసుల్లో మనీమ్యూల్స్‌గా ఉన్న వారు చిక్కుతున్నా.. సూత్రధారులు మాత్రం పరారీలో ఉంటున్నారు. ఓటీపీలతో జార్ఖండ్ నేరగాళ్ల టోపీ బ్యాంకు అధికారులమంటూ ఫోన్లు చేసి...డెబిట్/క్రెడిట్ కార్డులకు చెందిన వివరాలతో పాటు వన్ టైమ్ పాస్వర్డ్స్ (ఓటీపీ) సైతం సంగ్రహించి...అందినకాడికి దండుకునే నేరగాళ్లలో 95 శాతం మంది జార్ఖండ్‌లోని జమ్‌తార ప్రాంతానికి చెందిన వారే. ఆ జిల్లాలో ఉన్న ఏడు గ్రామాల్లోని యువతకు సైబర్ నేరాలే ప్రధాన ఆదాయవనరుగా మారాయి. కొన్నేళ్ల క్రితం వరకు దేశంలోని అనేక ప్రాంతాలకు వెళ్లి, అక్కడి కాల్ సెంటర్లలో పనిచేసి వచ్చిన జమ్‌తార యువత ఇప్పుడు ‘కాల్ సెంటర్లను’ఏర్పాటు చేసుకుని నేరాలకు పాల్పడుతోంది. డెబిట్ కార్డును ఆధార్‌తో లింకు చేయాలనో, క్రెడిట్ కార్డు వివరాలు అప్డేట్ చెయ్యాలనో చెప్తుంటారు. ఆపై ఓటీపీ సహా అన్ని వివరాలు తెలుసుకున్న తరవాత వారి ఖాతాలోని నగదును కొట్టేస్తున్నారు. -
ఢిల్లీ గ్యాంగ్.. లక్షలు వసూల్!
హిమాయత్‌నగర్: ఉద్యోగం ఇప్పిస్తామంటూ నిరుద్యోగులను మోసం చేస్తూ లక్షలు దండుకుంటున్న ముఠా గుట్టు రట్టయ్యింది. అక్రమంగా కాల్ సెంటర్ నడుపుతూ దగాకు పాల్పడుతున్న ఢిల్లీ గ్యాంగ్‌ను సిటీ సైబర్‌క్రైం పోలీసులు పట్టుకున్నారు. ఐదుగురు అమ్మాయిలు షైఫలీ, యోగిత, షాలుకుమారి, ప్రియ, శివానీ, ముగ్గురు అబ్బాయిలు రాజేష్‌సింగ్, అనుభవ్‌సింగ్, నఫీజ్‌ను ఢిల్లీలో అరెస్ట్ చేసి రిమాండ్‌కు పంపినట్లు సీసీఎస్ జాయింట్ సీపీ గజరావు భూపాల్ తెలిపారు. శనివారం సీసీఎస్ కార్యాలయంలో సైబర్‌క్రైం ఏసీపీ కేవీఎన్ ప్రసాద్‌తో కలసి ఆయన మీడియాతో మాట్లాడారు. హైదర్‌గూడకు చెందిన యువతి ఎయిర్‌హోస్టెస్ ఉద్యోగం కావాలంటూ ‘షైన్ డాట్‌కామ్’లో రెజ్యూమ్ అప్లోడ్ చేసింది. రెజ్యూమ్ని చూసిన ఢిల్లీ గ్యాంగ్ యువతితో ఫోన్లో మాట్లాడారు. కంపెనీ నిబంధనలు చెప్పి యువతి నుంచి రూ. 8,02,426 వసూలు చేశారు. అయినా ఉద్యోగం రాలేదు. డబ్బులు అడిగినా వెనక్కి ఇవ్వకపోవడంతో బాధితురాలు గత ఏడాది అక్టోబర్ 10న సిటీ సైబర్‌క్రైం పోలీసులకు ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసిన పోలీసులు తాజాగా వీరిని అరెస్ట్ చేశారు. వీరి నుంచి 26 సెల్ఫోన్లు, ల్యాప్‌టాప్, మొబైల్ ఫోన్‌ను స్వాధీనం చేసుకున్నారు. -
కొలంబో క్యాసినోలో శాశ్వత టేబుల్! .. ఉద్యోగాలు పోయిన వారే టార్గెట్
సాక్షి, హైదరాబాద్: తిరుమలగిరి కేంద్రంగా కాల్ సెంటర్ ఏర్పాటు చేసి భారీ కుంభకోణానికి పాల్పడే ప్రయత్నాల్లో గత వారం నార్త్‌జోన్ టాస్క్‌ఫోర్స్ పట్టుకున్న గోపీ కృష్ణ వ్యవహారాలు ఒక్కోటిగా వెలుగులోకి వస్తున్నాయి. ఇదే తరహా స్కామ్‌లు చేసిన చెన్నై పోలీసులకు మూడుసార్లు చిక్కిన ఇతగాడు విలాసాలు, జల్సాలకే భారీ మొత్తాలు ఖర్చు చేసినట్లు తేలింది. ఇతడి వ్యవహారాలను హైదరాబాద్ పోలీసులు లోతుగా ఆరా తీస్తున్నారు. దీనికోసం చెన్నై పోలీసులతో సంప్రదింపులు జరుపుతున్నారు. ►చెన్నైలోని భారతినగర్‌కు చెందిన గోపీ కృష్ణ ఆరేళ్ల నుంచి కాల్ సెంటర్ మోసాలు చేస్తున్నాడు. తొలినాళ్లల్లో స్కీముల పేరుతో స్కాములు చేశాడు. ఈ నేరాలకు సంబంధించి అక్కడి పోలీసులు 2015, 2016ల్లో అరెస్టు చేశారు. ►జైలు నుంచి బయటకు వచ్చిన ప్రతిసారి కొత్త ప్రాంతంలో, మరో పేరుతో తన దందా మొదలెట్టేవాడు. 2020లో చెన్నైలోని వలసరివక్కం కేంద్రంగానే మరో కాల్ సెంటర్ ఏర్పాటు చేశాడు. ►ప్రతి సందర్భంలోనూ తక్కువ జీతాలకు ఎక్కువ మంది టెలీకాలర్లను నియమించుకునే వాడు. ఇలా ఇప్పటి వరకు దాదాపు 400 మందిని తనకు అనుకూలంగా వినియోగించుకున్నాడు. చదవండి: (మహిళా టెక్కీ ఆత్మహత్య.. రెండేళ్ల క్రితమే వివాహం..) ►లాక్‌డౌన్‌తో ఉద్యోగాలు కోల్పోయిన వారిని ఆకర్షించేలా పలు ఇన్వెస్టిమెంట్ స్కీములు రూపొందించాడు. తమ వద్ద రూ.10 వేల నుంచి రూ.30 వేల వరకు పెట్టుబడి పెడితే ప్రతి రోజూ కనీసం రూ.200 వరకు రాబడి ఉంటుందని నమ్మించాడు. ఇలా మూడు సందర్భాల్లోనూ కలిపి దాదాపు 2 వేల మంది నుంచి రూ.40 కోట్ల వరకు వసూలు చేసి మోసం చేశాడు. 2020లో ఇతడిపై చెన్నై పోలీసులు గూండా యాక్ట్ ప్రయోగించి ఏడాది జైల్లో ఉంచారు. ►గతేడాది అరెస్టు చేసినప్పుడు ఇతడితో పాటు అనుచరుల నుంచి చెన్నై పోలీసులు బీఎండబ్ల్యూ, ఆడి, బెంజ్, హోండా తదితర కంపెనీలకు చెందిన 13 లగ్జరీ కార్లు స్వాధీనం చేసుకున్నారు. ►విలాసాలకు అలవాటు పడిన వీరంతా తరచూ థాయ్‌లాండ్, దుబాయ్, హాంగ్‌కాంగ్‌లకు వెళ్లి వారాల పాటు గడిపి వచ్చే వాళ్లు. శ్రీలంక రాజధాని కొలంబోలో ఉన్న ప్రముఖ క్యాసినోల్లో ఒకటైన బల్లీస్కు గోపీ రెగ్యులర్ కస్టమర్. ►ఆ క్యాసినోలో పేకాట ఆడటానికి వెళ్లే వాళ్లు టేబుల్ కోసం కొన్ని గంటలు, రద్దీ ఎక్కువ ఉంటే రోజులు ఎదురు చూడాలి. అయితే గోపీకి మాత్రం అందులో శాశ్వతంగా ఓ టేబుల్ ఉండేది. దీనికోసం ఇతడు రూ.కోటి ఖర్చు పెట్టినట్లు చెన్నై పోలీసులు గుర్తించారు. ►ఆఖరుసారిగా చెన్నై పోలీసులకు తిరుముల్లాయ్వోయల్ ప్రాంతంలో కాల్ సెంటర్ నిర్వహిస్తూ చిక్కాడు. మూడుసార్లు ఒకే తరహా నేరాలు చేస్తూ చిక్కడంతో ఇతడిపై అక్కడి పోలీసుల నిఘా పెరిగింది. ►దీంతో జైలు నుంచి వచ్చిన ఇతగాడు తిరుమలగిరికి మకాం మార్చాడు. యునైటెడ్ ఇండియా హెల్త్ ఆర్గనైజేషన్ పేరుతో కాల్ సెంటర్ ఏర్పాటు చేసి మోసాలకు శ్రీకారం చుట్టాడు. అతడి పథకం పారక ముందే టాస్క్‌ఫోర్స్ పోలీసులు గుర్తించి అరెస్టు చేశారు. -
ఉత్తుత్తి బ్యాంక్: ఓటీపీ చెప్పాడు.. క్షణాల్లోనే రూ.1,64,612 మాయం
సాక్షి, హైదరాబాద్: ‘ఓ వ్యక్తికి ఎస్బీఐ క్రెడిట్ కార్డ్ కస్టమర్ కేర్ నంబర్ +18601801290 నుంచి ఫోన్ వచ్చింది. మీ పాత క్రెడిట్ కార్డ్ గడువు ముగియనుంది. కొత్త కార్డ్ జారీ కోసం కాల్ చేస్తున్నామని చెప్పాడు. పాత కార్డ్ మీద ఉన్న 16 అంకెల నంబర్, సీవీవీ, కార్డు గడువు వివరాలను కోరాడు. కొత్త కార్డ్ యాక్టివేషన్ కోసం వచ్చిన ఓటీపీ చెప్పాలని సూచించాడు. అది చెప్పేసిన క్షణాల్లోనే సదరు ఉద్యోగి కార్డ్ నుంచి రూ.1,64,612 డెబిట్ అయ్యాయి. బాధితుడు తేరుకునేలోపే సైబర్ నేరస్తులు కార్డ్‌లోని మొత్తాన్ని కొట్టేశారు. దీంతో సైబరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులను ఆశ్రయించాడు’ కూపీ లాగితే.. కేసు నమోదు చేసుకొని రంగంలోకి దిగిన సైబరాబాద్ సైబర్ క్రైమ్ ఇన్స్పెక్టర్ శ్రీనివాస్... బాధితుడి ఫోన్‌కు ఎస్బీఐ క్రెడిట్ కార్డ్ కస్టమర్ కేర్ నంబర్‌తో ఎలా మోసం చేశారని కూపీ లాగారు. కస్టమర్ కేర్ నంబర్‌ను కాల్ స్పూఫింగ్ చేసి సైబర్ నేరస్తులు వల వేశారని పసిగట్టారు. కాల్ స్పూఫింగ్ అప్లికేషన్లను వినియోగిస్తూ 14 మందితో ఢిల్లీ ఉత్తమ్‌నగర్ కేంద్రంగా సాగిస్తున్న నకిలీ క్రెడిట్ కార్డ్ కాల్ సెంటర్ గుట్టు రట్టు చేశారు. ఈ ముఠాలో ప్రధాన సూత్రధారి ఢిల్లీవాసి నిఖిల్ మదన్‌కు కాల్ స్పూఫింగ్ అప్లికేషన్లను విక్రయించిన మోస్ట్ వాంటెడ్ సైబర్ నేరస్తుడు యూపీ మొరాదాబాద్‌కు చెందిన ఫర్మాన్ హుస్సేన్ కూడా ఉన్నాడు. కేసు వివరాలను గురువారం సైబరాబాద్ సీపీ స్టీఫెన్ రవీంద్ర వెల్లడించారు. ►ఫర్మాన్ హుస్సేన్‌కు టెక్నాలజీపై మంచి పట్టుండటంతో సొంతంగా ప్రోస్పోక్హెచ్డీ.కామ్, రౌండ్2హెల్.ఓఆర్జీ అనే రెండు కాల్ స్పూఫింగ్ వెబ్సైట్లను అభివృద్ధి చేశాడు. ఫర్మాన్ నుంచి మోసిఫ్, సిల్వర్ డైలర్, రౌండ్2హెల్, ఐటెల్ మొబైల్ డైలర్ అనే నాలుగు కాల్ స్పూఫింగ్ అప్లికేషన్ల తాలుకు పెయిడ్ సరీ్వస్‌లను బిహార్ సరన్‌కు చెందిన ముర్షీద్ ఆలం కొనుగోలు చేసి.. వాటిని ఉత్తమ్‌నగర్‌కు చెందిన నిఖిల్ మదన్‌కు విక్రయించాడు. ఇతను 14 మందితో కలిసి ఉత్తమ్‌నగర్‌లో ఎస్బీఐ నకిలీ క్రెడిట్ కార్డ్ కాల్ సెంటర్‌ను ఏర్పాటు చేశాడు. బ్యాంకింగ్ రంగంలో అనుభవం, మంచి పరిచయాలు ఉన్న నిఖిల్.. ఎస్బీఐ క్రెడిట్ కార్డ్ హోల్డర్ల పేరు, ఫోన్ నంబర్, చిరునామా తదితర వివరాలను డైరెక్ట్ సేల్ ఏజెంట్స్ (డీఎస్ఏ) నుంచి సేకరించారు. ►ఎస్బీఐ కస్టమర్ కేర్ నంబర్లు 18601801290, 01139020202 స్పూఫింగ్ చేసి కస్టమర్‌కు ఫోన్ చేయడం మొదలుపెట్టారు. క్రెడిట్ కార్డ్ పరిమితి పెంపు, బీమా సౌకర్యం కలి్పస్తామని, రివార్డ్ పాయింట్స్ పెంపు, కొత్త కార్డ్ జారీ చేస్తామని మాయమాటలు చెప్పి.. కస్టమర్ల నుంచి కార్డ్ వివరాలను సేకరిస్తారు. వీటిని ఉపయోగించి ఆన్లైన్ లావాదేవీలు నిర్వహిస్తారు. ►ప్రధాన నిందితుడు నిఖిల్ మదన్, ఫర్మాన్ హుస్సేన్, దీపాన్షు మదన్, పింకీ కుమారి, రోహిత్ మాథూర్, హితేష్ చోప్రా, వికాస్, సంజయ్ కుమార్, ప్రభాత్ కుమార్ సింగ్, సంక్షం రాజ్, అనూజ్ కుమార్, సమీర్ మిశ్రా, ముర్షిద్ ఆలం, గౌరవ్‌లను అరెస్ట్ చేశారు. ►ఏడాది కాలంగా ఈ నకిలీ కాల్ సెంటర్ దేశంలోని 33 వేల మందికి ఫోన్ చేయగా.. 14 వేల కాల్స్ గుర్తించారు. ఈ ముఠాపై 5 వేల వరకు కేసులు ఉన్నాయి. ఫర్మాన్ హుస్సేన్ మోస్ట్ వాంటెడ్ క్రిమినల్. తొలిసారిగా సైబరాబాద్ పోలీసులకు చిక్కాడు. 23 మందికి కాల్ స్పూఫింగ్ యాప్స్ విక్రయించాడు. రూ.3 కోట్లు కొట్టేసిన నకిలీ ఆర్బీఎల్ క్రెడిట్ కార్డ్ కాల్ సెంటర్ కేసులోనూ ప్రధాన నిందితుడు దీపక్ చౌదరి, విశాల్ కుమార్‌లకు మోసిప్, సిల్వర్ డైలర్ కాల్ స్పూఫింగ్ యాప్స్ విక్రయించాడు. -
ఎస్బీఐ బ్యాంకు పేరుతో నకిలీ కాల్ సెంటర్ గుట్టు రట్టు
సాక్షి, హైదరాబాద్: ఎస్బీఐ బ్యాంకు పేరుతో నకిలీ కాల్ సెంటర్ గుట్టుని రట్టు చేశారు హైదరాబాద్ పోలీసులు. వివరాల ప్రకారం.. కొందరు వ్యక్తులు ఢిల్లీ కేంద్రంగా నగరంలో ఎస్బిఐ బ్యాంకు పేరుతో నకిలీ కాల్ సెంటర్ నడుపుతున్నారు. ఈ సమాచారం తెలుసుకున్న సైబరాబాద్ సైబర్ క్రైం పోలీసులు దీనికి సంబంధించి 14 మందిని అరెస్ట్ చేశారు. అనంతరం కాల్ సెంటర్ ఖాతాల్లోని లక్షల రూపాయల నగదు నిలుపుదల చేశారు. విచారణలో ఈ ముఠా సభ్యులు దేశ వ్యాప్తంగా 209 కేసుల్లో నిందితులుగా ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. -
సికింద్రాబాద్ కేంద్రంగా కాల్ సెంటర్ స్కామ్
సాక్షి, హైదరాబాద్: అమెరికాతో పాటు ఇంగ్లాడ్, ఐర్లాండ్ దేశాల్లో ఉన్న వారిని టార్గెట్‌గా చేసుకుని, సికింద్రాబాద్ కేంద్రంగా సాగుతున్న కాల్ సెంటర్ స్కామ్‌ను హైదరాబాద్ పోలీసులు ఛేదించారు. సోమవారం రాత్రి సదరు బోగస్ కాల్ సెంటర్‌పై దాడి చేసిన ప్రత్యేక బృందాలు నిందితులను అదుపులోకి తీసుకున్నాయి. ఆయా దేశాలకు చెందిన కొన్ని వందల మంది వీళ్లు ట్యాక్సులు, క్రిమినల్ కేసుల పేరుతో బెదిరించి భారీగా డబ్బు గుంజినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. ఈ కోణంలోనే నిందితులను లోతుగా విచారిస్తున్న అధికారులు పరారీలో ఉన్న మరికొందరి కోసం గాలిస్తున్నారు. నగరవాసులతో కూడిన ఓ అంతరాష్ట్ర ముఠా సికింద్రాబాద్‌లో ఈ కాల్ సెంటర్ ఏర్పాటు చేసింది. వీళ్లు వివిధ మార్గాల్లో అమెరికా, ఇంగ్లాడ్, ఐర్లాండ్‌లో ఉన్న పన్ను చెల్లింపుదారుల వివరాలు సేకరించారు. వారికి ఈ కాల్ సెంటర్ నుంచి టెలికాలర్స్ ద్వారా వాయిస్ ఓవర్ ఇంటర్నెట్ ప్రొటోకాల్ (వీఓఐపీ) విధానంలో వారికి కాల్స్ చేయిస్తోంది. తాము రెవెన్యూ, కస్టమ్స్ విభాగాలకు చెందిన అధికారులుగా పరిచయం చేసుకుంటోంది. ఫలానా లావాదేవీలకు సంబంధించి పన్ను బకాయి ఉన్నారంటూ వారిని బెదిరిస్తోంది. ఆ మొత్తం పెనాల్టీతో సహా చెల్లించకపోతే క్రిమినల్ కేసులు నమోదు చేసి తదుపరి చర్యలు తీసుకుంటామని బెదరగొడుతున్నారు. చదవండి: (Hyderabad: అమ్ముతావా.. చస్తావా!) అక్కడి వారితో ఒప్పందాలు.. ►ఆయా దేశాల్లో రెవెన్యూ, కస్టమ్స్ విభాగాలకు సంబంధించిన కేసులు కఠినంగా ఉండటం వీరికి కలిసి వచ్చింది. ఈ కాల్స్‌కు భయపడిన ఆయా దేశీయులు సెటిల్ చేసుకుంటూ కొంత మొత్తం చెల్లించడానికి ముందుకు వస్తున్నారు. ►వీరితో డబ్బు బదిలీ చేయించుకోవడానికి అక్కడే ఉంటున్న వారితో ఒప్పందాలు చేసుకున్న కాల్ సెంటర్ నిర్వాహకులు వారి అకౌంట్ నెంబర్లు ఇస్తున్నారు. ►ఇలా ఇప్పటికే వందల మంది నుంచి భారీ మొత్తాలు ఆయా బ్యాంకు ఖాతాలకు వెళ్లాయి. ఈ మొత్తంలో తమ కమీషన్ మిగుల్చుకుంటున్న ఖాతాదారులు మిగిలింది హవాలా మార్గంలో ఇక్కడి సూత్రధారులకు పంపుతున్నారు. ►దీనిపై అమెరికన్ కాన్సులేట్‌కు సమాచారం అందింది. వారి ఫిర్యాదు మేరకు రంగంలోకి దిగిన బేగంపేట, టాస్క్‌ఫోర్స్ పోలీసులు సోమవారం రాత్రి కాల్ సెంటర్‌పై దాడి చేశారు. ►కొందరు టెలీకాలర్లతో పాటు నిర్వాహకులను అదుపులోకి తీసుకున్నారు. పరారీలో ఉన్న మరికొంత మంది నిందితులను పట్టుకునేందుకు వేట ముమ్మరం చేశారు. ►ఈ కేసును తదుపరి దర్యాప్తు నిమిత్తం సెంట్రల్ క్రైమ్ స్టేషన్ ఆధీనంలోని సైబర్ క్రైమ్ ఠాణాకు బదిలీ చేయనున్నారు. నిందితుల అరెస్టును నేడోరేపో నగర పోలీసు కమిషనర్ అధికారికంగా ప్రకటించే అవకాశం ఉంది. -
Covid 104 Call Centre: ఆపద్బాంధవి 104 కాల్ సెంటర్..
సాక్షి, అమరావతి: రాష్ట్ర ప్రభుత్వం కోవిడ్ సమయంలో ఏర్పాటు చేసిన 104 కాల్ సెంటర్ లక్షలాది మందికి సంజీవనిలా ఉపయోగపడింది. కోవిడ్ తీవ్ర వ్యాప్తి సమయంలో ప్రభుత్వాస్పత్రుల్లో మినహా ప్రైవేటు ఆస్పత్రులన్నీ ఔట్ పేషెంటు సేవలు మూసేసిన విషయం తెలిసిందే. ఈ సమయంలో ఫోన్ చేస్తే చాలు సేవలు అందేలా 104 కాల్ సెంటర్‌ను ఏర్పాటు చేయడమే కాక, భారీగా వైద్యులను నియమించారు. వీరు రోజూ వేలాదిమంది రోగులకు ఫోన్ ద్వారా వైద్య సలహాలు, సూచనలు అందించేవారు. ఇలా 104 కాల్‌సెంటర్ ద్వారా ఈనెల 24వ తేదీ నాటికి 11,69,805 మందికి వైద్యసేవలు అందించారు. కోవిడ్ సోకి హోం క్వారంటైన్ (ఇంట్లోనే ఉండి చికిత్స పొందేవారు)లో ఉన్న వారికి ఇతోధిక సేవలు అందాయి. ఇంట్లో చికిత్స పొందుతూ వైద్యుల సలహాలు, సూచనలు తీసుకున్న వారే 8.36 లక్షల మంది ఉన్నారు. ఇక వివిధ దశల్లో జరిగిన ఫీవర్ సర్వే ద్వారా కోవిడ్ లక్షణాలున్న వారికీ 104 కాల్‌సెంటర్ వైద్యులే వైద్యసహాయం చేశారు. ఇంట్లో చికిత్స పొందుతున్న వారికి ప్రభుత్వమే ఉచితంగా ఐసొలేషన్ కిట్లు అందించింది. ఇంత పెద్ద స్థాయిలో ఏ రాష్ట్రంలోనూ కోవిడ్ బాధితులు ఒక కాల్‌సెంటర్ ద్వారా వైద్యసేవలు పొందిన దాఖలాలు లేవని వైద్య నిపుణులు చెబుతున్నారు. -
AP: కాల్ సెంటర్ సేవలు భేష్
సాక్షి, అమరావతి: ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగిస్తూ సమీకృత రైతు సమాచార కేంద్రం ద్వారా రైతులకు అందిస్తోన్న సేవలు బాగున్నాయని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ముఖ్య సలహాదారు అజేయ కల్లం అన్నారు. మంగళవారం ఆయన గన్నవరంలోని ఇంటిగ్రేటెడ్ కాల్ సెంటర్‌ను సందర్శించారు. కాల్ సెంటర్ ద్వారా రైతులకు అందుతున్న సేవలను అడిగి తెలుసుకున్నారు. చదవండి: శ్రీశైలంలో విద్యుదుత్పత్తి చేయకపోతే కృష్ణా జలాలు వృథా రైతుల నుంచి రోజూ ఎన్ని కాల్స్ వస్తున్నాయి? వారి సమస్యల పరిష్కారానికి ఏ విధంగా కృషి చేస్తు న్నారు? తదితర విషయాలు తెలుసుకు న్నారు. కాల్ సెంటర్లో ఏర్పాటు చేసిన ఆర్బీకే చానల్‌ను సందర్శించి ప్రసారాలు, కార్యక్రమాల వివరాలను ఆరా తీశారు. రైతులకు మరింత ఉప యోగపడేలా ఈ సేవలను విస్తరించాలని సూచించారు. అజేయ కల్లం వెంట రాష్ట్ర మద్య విమోచన ప్రచార కమిటీ చైర్మన్ లక్ష్మణరెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
10 లక్షలమందికి ఫోన్లో వైద్యసేవలు
సాక్షి, అమరావతి: కోవిడ్ మహమ్మారి నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఏర్పాటు చేసిన 104 కాల్‌సెంటర్ బాధితులకు గొప్ప ఊరటనిచ్చింది. 2021 మే 1వ తేదీనుంచి 104 కాల్సెంటర్లో రిజిస్టర్ అయిన 5,523 మంది వైద్యులు ఇప్పటివరకు 10 లక్షలమంది బాధితులకు ఫోన్లో వైద్యసలహాలు, సూచనలు ఇచ్చారు. ఈ వైద్యుల్లో 1,132 మంది స్పెషలిస్టులు. వీళ్లు టెలీ కన్సల్టేషన్ కింద ఈనెల 21వ తేదీ నాటికి 10,16,760 మందికి వైద్యసేవలు అందించారు. సేవలు పొందిన వారిలో 7.20 లక్షల మంది ఇంట్లో చికిత్స తీసుకుంటున్న వారే ఉన్నారు. కోవిడ్ సమయంలో బయటకు వెళ్లలేక ఇబ్బందులున్న పరిస్థితుల్లో ఏ రాష్ట్రంలోను చేయని విధంగా ఏపీలో మాత్రమే 104 కాల్‌సెంటర్ నుంచి టెలీకన్సల్టెన్సీ ద్వారా వైద్యులు సేవలు అందించారు. -
ఎన్టీఆర్ భవన్ లీజును రద్దు చేయండి
సాక్షి, హైదరాబాద్: తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యాలయం ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్ లీజును రద్దు చేయాలంటూ ఆ భవన్లో పనిచేస్తున్న తెలంగాణ ప్రాంత ఉద్యోగుల పేరిట వెలువడిన ఓ లేఖ కలకలం సృష్టిస్తోంది. లీజు ప్రాతిపదికన ప్రభుత్వం నుంచి తీసుకున్న ఈ భవన్లో లీజు నిబంధనలకు విరుద్ధంగా ప్రైవేట్ కార్యకలాపాలు నిర్వహిస్తున్నారని, ఏకంగా కాల్ సెంటర్లకు భవన్‌లోని కొంత భాగాన్ని అద్దెకు ఇచ్చారని, వెంటనే పరిశీలించి లీజును రద్దు చేయాలని ముఖ్యమంత్రి కేసీఆర్‌ను కోరుతూ ఈ లేఖ రాశారు. ‘తెలంగాణ ఆత్మగౌరవ లేఖ’పేరిట టీడీపీ రాష్ట్ర కార్యాలయం లెటర్‌ప్యాడ్‌పై బుధవారం రాసిన ఈ లేఖ వివరాల్లోకి వెళితే.. ‘ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యాలయం అయిన ఎన్టీఆర్ భవన్లో 15 ఏళ్లుగా పనిచేస్తున్నాం. రాష్ట్రం విడిపోయిన తర్వాత కూడా ఇక్కడ ఆంధ్ర ప్రాంతం వారి పెత్తనం కొనసాగుతోంది. ట్రస్ట్ భవన్ నిర్వహణ అంతా ఆంధ్ర ప్రాంత ఉద్యోగుల చేతుల్లోనే ఉంది. తెలంగాణ నేతలకు పదవి తప్ప పవర్ ఉండదు. పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు ఎల్.రమణకు కూడా ఇక్కడ పనిచేస్తున్న ఉద్యోగులపై అజమాయిషీ ఉండదు. దశాబ్దాలుగా పనిచేస్తున్నా తమను ట్రస్ట్ భవన్ ఉద్యోగులుగా గుర్తించడం లేదు. పీఎఫ్, ఇన్సూరెన్స్ సౌకర్యాలు లేవు. కనీసం ఉద్యోగులకు గుర్తింపు కార్డు కూడా ఇవ్వకుండా నిర్దాక్షిణ్యంగా తీసివేసినా ఎలాంటి ఆధారాల్లేకుండా చేశారు. ఇన్నాళ్లు రాజకీయ అవసరాల కోసం ఉపయోగించుకున్న ఈ ట్రస్ట్ భవన్‌ను ఇప్పుడు పరిస్థితులు బాగాలేక పోవడంతో ఆర్థిక వనరుగా, వ్యాపార కేంద్రంగా ఉపయోగించుకుంటున్నారు. భవన్‌లోని పలు విభాగాలను చంద్రబాబు సిబ్బందికి వసతి గదులుగా వినియోగిస్తున్నారు. ప్రైవేట్ హోటల్, క్యాంటీన్ నడుస్తున్నాయి. ప్రైవేట్ కాల్‌సెంటర్‌కు అద్దెకు ఇచ్చారు. ట్రస్టు పేరుతో లీజుకు తీసుకున్న స్థలంలో వ్యాపార కార్యకలాపాలు నిర్వహించకూడదు. నిబంధనలకు విరుద్ధంగా నడుస్తున్న ట్రస్ట్ భవన్ లీజును రద్దు చేసి మాకు ఆ కార్యాలయంలోనే మెరుగైన వేతనాలతో పనిచేసే అవకాశం కల్పించాలి.’అని ఎన్టీఆర్ భవన్ తెలంగాణ ఉద్యోగుల పేరిట విజ్ఞప్తి చేయడం గమనార్హం. -
ప్రత్యేక టీం: మహిళలను వేధిస్తే ఇక తాట తీసుడే..
హైదరాబాద్: మహిళలపై వేధింపులు, ఎన్నారైల సమస్యలపై కృషి చేస్తున్న విమెన్ సేఫ్టీ వింగ్ మరో ముందడుగు వేసింది. గృహహింస, వరకట్న వేధింపుల్లో చిక్కుకున్న మహిళల కోసం విమెన్ విక్టిమ్స్ కాల్ సెంటర్‌ను త్వరలో ఏర్పాటు చేయనుంది. లక్డీకాపూల్‌లోని విమెన్ సేఫ్టీ వింగ్‌లో డొమెస్టిక్ వయొలెన్స్(డీవీసీ) కాల్ సెంటర్‌కు ఏర్పాట్లు జరుగుతున్నాయి. అడిషనల్ డీజీ స్వాతిలక్రా ఆధ్వర్యంలో డీఐజీ సుమతి కాల్‌సెంటర్ ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారు. 200 మంది సిబ్బందితో జూలై మొదటి వారంలో కాల్‌సెంటర్‌ను ప్రారంభించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. మూడుభాషల్లో టెలీకాలర్స్: లాక్డౌన్ కాలంలో గృహహింస కేసులు పెరిగిపోయాయి. ఏప్రిల్, మే నెలలో 14 వేలకుపైగా గృహహింసకు సంబంధించిన ఫిర్యాదులు వచ్చాయి. రాష్ట్రవ్యాప్తంగా ప్రతీనెల 1,800–2,000 కేసులు రిజిస్టర్ అవుతున్నాయి. ఈ కేసుల్లో బాధితులుగా ఉన్న వారికి విమెన్ విక్టిమ్ కాల్ సెంటర్ నుంచి కాల్ చేస్తారు. కేసు పురోగతి ఎలా ఉంది? దర్యాప్తు అధికారి (ఐవో) ఎలా వ్యవహరిస్తున్నారు? ఏమైనా ఇబ్బందులు ఉన్నాయా? తదితర విషయాలు కాల్ చేసి తెలుసుకుంటారు. తెలంగాణలో అనేక భాషల వారు నివసిస్తున్న నేపథ్యంలో తెలుగు, హిందీ, ఇంగ్లిష్ భాషల్లో టెలీకాలర్స్‌ను నియమించనున్నారు. ఐవో, బాధితులతో మాట్లాడి, డైలీ సిచ్యుయేషన్ రిపోర్ట్ (డీఎస్ఆర్)ను ఏరోజుకారోజు నమోదు చేస్తారు. ఎఫ్ఐఆర్, కౌన్సెలింగ్‌లో నిర్లక్ష్యంగా వ్యవహరించిన అధికారులను గుర్తిస్తారు. -
తొలిదశ తరహాలోనే సెకండ్‌వేవ్ కరోనా కట్టడికి కృషి
సాక్షి, విజయవాడ: దేశంలో కరోనా రెండోదశ తీవ్ర ఉపద్రవంలా మారిందని మంత్రి వెల్లంపల్లి ఆందోళన వ్యక్తం చేశారు. సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ముందు చూపుతోనే ఈ మహమ్మారిని సమర్థవంతంగా ఎదుర్కొంటున్నామని వెల్లంపల్లి అన్నారు. తొలిదశ తరహాలోనే సెకండ్‌వేవ్‌లో కరోనా కట్టడికి అన్నివిధాల చర్యలు చేపట్టామని వెల్లంపల్లి పేర్కొన్నారు. కరోనా బాధితులకు తక్షణ సేవలందించడం కోసం కమాండ్ కంట్రోల్ సదుపాయాన్ని బలోపేతం చేశామని స్పష్టం చేశారు. విజయవాడలో ఇప్పటికే 42 ఆస్పత్రుల్లో 3500 బెడ్లు సిద్ధం చేశామని.. అదేవిధంగా, కరోనా బాధితుల కోసం కోవిడ్ కేర్ సెంటర్లో 2500 ప్రత్యేక బెడ్లను ఏర్పాటు చేశామని మంత్రి వెల్లంపల్లి వెల్లడించారు. ప్రజలకు మెరుగైన వైద్యసేవలను అందించేందుకు వైఎస్సార్సీపీ ప్రభుత్వం ఎల్లవేళలా కృషిచేస్తుందని, మరే ఇతర రాష్ట్రాల్లో లేని విధంగా ప్రజలకు అన్నిరకాల సేవలందిస్తోందని తెలిపారు. చదవండి: కరోనా: ఏపీ సర్కార్ ప్రత్యేక ఆదేశాలు.. -
సమీకృత సమాచారం.. సమస్యలన్నీ దూరం
సాక్షి, అమరావతి: ఒక్క ఫోన్ కాల్.. వాట్సాప్‌లో చిన్న మెసేజ్.. అంతే.. క్షణాల్లో సమస్యలు, సందేహాలు తీరతాయి. వ్యవసాయ, దాని అనుబంధ రంగాల్లో సమస్యలు, సందేహాలు తీర్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన సమీకృత సమాచార కేంద్రం అద్భుత ఫలితాలనిస్తోంది. విజయవాడ కేంద్రంగా గతేడాది మేలో ఏర్పాటు చేసిన ఈ కేంద్రం క్షేత్రస్థాయిలో రైతులకు ఎంతో ఉపయోగపడుతోంది. క్లిష్ట పరిస్థితుల్లో పంటను కాపాడుకునే విషయంలో ఈ కేంద్రం ద్వారా శాస్త్రవేత్తలందించే సలహాలు, సూచనలు నిజంగా ఎంతో మేలుచేస్తున్నాయి. సమస్య తీవ్రతను బట్టి 24 గంటల్లోనే ఆయా ప్రాంతాలకు వెళ్లి ప్రయోగాత్మకంగా కూడా అవగాహన కల్పిస్తున్నారు. ఇక వైఎస్సార్ రైతు భరోసా, సున్నా వడ్డీ రుణాలు, పంటల బీమా, ఇన్పుట్ సబ్సిడీ, ఈ–క్రాప్, సాగునీరు, పంట కొనుగోళ్లు, మార్కెటింగ్ వంటి ఎన్నో సమస్యలపై వస్తున్న ఫోన్‌కాల్స్, వాట్సాప్ మెసేజ్‌లకు సంబంధిత శాఖల అధికారులు, నిపుణులు వెంటనే సమాధానమిస్తుండటంతో ఈ కేంద్రం అన్నదాతల మన్ననలందుకుంటోంది. రికార్డుస్థాయిలో సమస్యల పరిష్కారం వ్యవసాయశాఖకు అంతర్భాగంగా గత మే 30న ఏర్పాటైన ఈ కేంద్రంలో 67 మంది సిబ్బంది ఉదయం 7 గంటల నుంచి రాత్రి 7 గంటల వరకు నిర్విరామంగా సేవలందిస్తున్నారు. వ్యవసాయ, ఉద్యాన, మత్స్య, పశుసంవర్ధకశాఖలకు చెందిన విశేష అనుభవం కలిగిన ఆరుగురు శాస్త్రవేత్తలు రైతుల సందేహాలను ఎప్పటికప్పుడు నివృత్తి చేస్తున్నారు. ఈ కేంద్రానికి గతేడాది మే 30 నుంచి ఈ ఏడాది జనవరి 28వ తేదీ వరకు రోజుకు సగటున 600 నుంచి 700 చొప్పున ఫోన్ కాల్స్, మెసేజ్‌లు కలిపి 1,87,603 వచ్చాయి. వీటిలో 1,84,946 ఫోన్‌కాల్స్, 2,657 వాట్సాప్ మెసేజ్‌లు ఉన్నాయి. ఫోన్ కాల్స్, మెసేజ్‌లు కలిపి అత్యధికంగా డిసెంబర్లో 73,315 రాగా, అత్యల్పంగా మే/జూన్‌లో 7,316 వచ్చాయి. ఇక జూలైలో 20,033, ఆగస్టులో 9,914, సెప్టెంబర్‌లో 11,672, అక్టోబర్‌లో 16,136, నవంబర్‌లో 26,307, ఈనెలలో 28వ తేదీ (గురువారం) వరకు 22,910 కాల్స్, మెసేజ్‌లు వచ్చాయి. ఫోన్ చేసి చెప్పా అంతే.. మా గ్రామంలో రైతులందరికి వైఎస్సార్ రైతు భరోసా సొమ్ములు వచ్చాయి. నాకు మాత్రం పడలేదు. కాల్ సెంటర్‌కు ఫోన్‌చేసి చెప్పా. ఆధార్ లింక్ కాలేదని చెప్పి వాళ్లే ఇక్కడ అధికారులు, బ్యాంకు వాళ్లతో మాట్లాడి డబ్బులు పడేటట్టు చేశారు. గతనెలలో రూ.7,500 జమయ్యాయి. చాలా సంతోషంగా ఉంది. – చిరట్ల సూరిబాబు, సహపురం, పెదపూడి మండలం తూర్పు గోదావరి జిల్లా (ఫోన్: 9290384999) నారును కాపాడుకోగలిగా.. నేను ఎకరంలో ఉల్లి వేశా. విత్తనం వేసిన 25 రోజులకు దోమ పీల్చడంతో కొనలు ఎండిపోవడం మొదలైంది. కాల్ సెంటర్‌కు ఫోన్‌చేసి సమస్య చెప్పా. అక్కడున్న శాస్త్రవేత్తలు చెప్పిన సూచనలు పాటిస్తూ ఎసిఫేట్ 1.5 ఎం.ఎల్., ఫిప్రియోలిన్ 2 ఎం.ఎల్. పిచికారీ చేశా. దోమ చనిపోవడంతో నారు బతికింది. ప్రస్తుతం నారుమళ్లు పోసి నెలరోజులైంది. పంట బాగుంది. – జనార్ధన్, మైనపురం, గుంతకల్లు, అనంతపురం జిల్లా (ఫోన్: 8464977324) 90 శాతం పరిష్కరించగలిగాం సమీకృత సమాచార కేంద్రానికి మంచి స్పందన వస్తోంది. వచ్చిన ప్రతి కాల్‌ను అటెండ్ అవుతున్నాం. రైతులడిగే ప్రతి సమస్యను మా సిబ్బంది ఓపిగ్గా వినడమే కాదు వాటి పరిష్కారానికి చిత్తశుద్ధితో పనిచేస్తున్నాం. రోజూ వస్తున్న కాల్స్‌లో 90 శాతం సమస్యలకు పరిష్కార మార్గాలు చూపగలుగుతున్నాం. చాలా సంతోషంగా ఉంది. – డాక్టర్ శైలజ, సమీకృత సమాచార కేంద్రం ఇన్చార్జి -
అసభ్య, బూతు సందేశాలు పంపేది ఢిల్లీలోని సెంటర్లు
సాక్షి, హైదరాబాద్: తమ వద్ద అప్పు తీసుకుని సకాలంలో తీర్చలేకపోయిన డిఫాల్టర్స్‌ను వేధించడానికి అక్రమ మైక్రో ఫైనాన్సింగ్ యాప్స్ వేర్వేరు స్టేజ్ల్లో కాల్ సెంటర్లను ఏర్పాటు చేస్తున్నాయి. హైదరాబాద్ కేంద్రంగా ఏర్పాటు చేసిన స్టేజ్–1 కాల్ సెంటర్లలోని ఉద్యోగులు కేవలం రిమైండర్స్ మాత్రమే పంపిస్తుంటారు. గుర్గావ్లో ఉండే స్టేజ్–2 కాల్ సెంటర్లలోని వారు వేధింపు కాల్స్ చేయడం, సందేశాలు పంపడం చేస్తుంటాయి. ఢిల్లీ నేషనల్ క్యాపిటల్ రీజియన్ (ఎన్సీఆర్) కేంద్రంగా పనిచేసే స్టేజ్–3 సెంటర్ల నుంచి డిఫాల్టర్లతో పాటు వారి సంబంధీకులకు నకిలీ లీగల్ నోటీసులు, అభ్యంతరకర, అసభ్య సందేశాలు వెళ్తుంటాయి. ఈ యాప్స్ కేసులకు సంబంధించి సిటీ సైబ ర్ క్రైమ్ పోలీసులు హైదరాబాద్, గుర్గావ్ల్లోని కాల్ సెంటర్లపై దాడులు చేసి 11 మందిని అరెస్టు చేశారని నగర పోలీసు కమిషనర్ అంజనీకుమార్ మంగళవారం తెలిపారు. తన కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో పూర్తి వివరాలు వెల్లడించారు. ఉద్యోగులనే డైరెక్టర్లుగా.. కలర్ ప్రిడెక్షన్ తరహా మరికొన్ని గేమింగ్స్ యాప్స్ నిర్వహించిన చైనా కంపెనీలు వాటిలో డైరెక్టర్లుగా తమ దేశీయుల్ని నియమించుకున్నాయి. అయితే ఈ మైక్రో ఫైనాన్సింగ్ యాప్స్ దగ్గరకు వచ్చేసరికి వీటికి సంబంధించిన కాల్ సెంటర్లలో ఉద్యోగుల్నే డైరెక్టర్లుగా ఉంచుతున్నాయి. ఇండోనేసియా రాజధాని జకార్తా నుంచి వాట్సాప్ ద్వారా ఆదేశాలు పంపుతూ వీటిని రన్ చేస్తున్నాయి. గుర్గావ్లోని ఉద్యోగ్ విహార్‌లో ఉన్న 2, హైదరాబాద్‌లోని బేగంపేట, పంజగుట్టల్లోని 3 కాల్ సెంటర్లు 30 యాప్స్ కోసం పనిచేస్తున్నాయి. ఇవన్నీ లియోఫంగ్ టె క్నాలజీస్ ప్రైవేట్ లిమిటెడ్, హాట్‌ఫుల్ టెక్నాలజీస్ ప్రై.లి., పిన్ ప్రింట్ టెక్నాలజీస్ ప్రై.లి., నబ్లూమ్ టెక్నాలజీస్ ప్రైవేట్ లిమిటెడ్ పేర్లతో బెంగళూరులో రిజిస్టరైన సంస్థల అధీనంలో నడుస్తున్నాయి. పంజగుట్టలోని కాల్ సెంటర్లో హెచ్ఆర్ మేనేజర్‌గా పనిచేస్తున్న జీవన జ్యోతితో పాటు సెల్వరాజ్ సింగిలు లియోఫంగ్, హాట్ఫుల్లకు, రవికుమార్ మంగల, వెంకట్లు పిన్ ప్రింట్, నబ్లూమ్లకు డైరెక్టర్లుగా ఉన్నారు. (చదవండి: లోన్‌యాప్స్ కేసులో ఆసక్తికర విషయాలు) బెదిరింపులు.. బూతులతో.. అడ్డగోలు వడ్డీలు వసూలు చేస్తూ, డిఫాల్టర్లను అడ్డంగా వేధిస్తున్న అక్రమ మైక్రో ఫైనాన్సింగ్ యాప్స్ నిర్వాహకులు కాల్ సెంటర్ల ఉద్యోగుల ద్వారా వేస్తున్న వేషాలు అన్నీఇన్నీ కావు. బాధితుల్ని బెదిరించడానికి అన్ని ప్రయత్నాలు చేశారు. ఇటీవల నగరానికి చెందిన ఓ బాధితుడు వీరి వేధింపులు తట్టుకోలేక ఫిర్యాదు చేసేందుకు సిటీ సైబర్ క్రైమ్ ఠాణా వద్దకు వచ్చాడు. అదే సమయంలో సదరు యాప్‌కు చెందిన కాల్ సెంటర్ నుంచి డబ్బు కట్టాలని, లేదంటే ‘తీవ్ర పరిణామాలు’ ఉంటాయని వాట్సాప్‌లో సందేశం వచ్చింది. దీనికి సమాధానంగా బాధితుడు తాను సైబర్ క్రైమ్ ఠాణా వద్ద ఉన్నాననే దానికి సూచికంగా ఆ స్టేషన్ బోర్డును ఫొటో తీసి షేర్ చేశాడు. ఇది చూసిన కాల్ సెంటర్ ఉద్యోగి అత్యంత అభ్యంతరకరమైన వ్యాఖ్యలు చేస్తూ రెచ్చిపోయాడు. (చదవండి: ఆపరేషన్ ఫ్రం ‘చైనా’..!) వెనకున్నది చైనీయులే..! దాదాపు నాలుగైదు నెలల క్రితం ఏర్పాటైన ఈ కాల్ సెంటర్ల వెనుక చైనీయులే ఉన్నారు. అప్పట్లో హైదరాబాద్‌కు వచ్చిన చైనా జాతీయురాలు కాల్ సెంటర్లు ఏర్పాటు చేసి వెళ్లింది. అలాగే గుర్గావ్లోని సెంటర్లకు నేతృత్వం వహించిన మరో చైనీయుడి పాస్‌పోర్టు జిరాక్స్ కాపీ అధికారుల తనిఖీల్లో లభ్యమైంది. ఈ రెండింటితో పాటు ఇతర ఆధారాల నేపథ్యంలోనూ ఈ అక్రమ మైక్రో ఫైనాన్సింగ్ యాప్స్ వెనుక చైనా జాతీయుల ప్రమేయమున్నట్లు అధికారులు నిర్ణయించారు. హైదరాబాద్‌లోని కాల్ సెంటర్లలో 600 మంది, గుర్గావ్లోని వాటిల్లో 500 మంది టెలికాలర్స్‌గా ఉన్నారు. వీళ్లు కార్పొరేట్ ఆఫీసుల మాదిరిగా షిఫ్ట్‌ల వారీగా, 24 గంటలూ విధులు నిర్వర్తిస్తూ జకార్తా నుంచి వస్తున్న ఆదేశాల ప్రకారం నడుచుకుంటున్నారు. ఈ సంస్థల్లోని ఉద్యోగులు ప్రతి 2–3 నెలలకు మారిపోతుండటం వెనుక ఏమైనా కారణముందా? అన్నది దర్యాప్తు చేస్తున్నారు. రకరకాల ఖాతాల నుంచి లావాదేవీలు.. మైక్రో ఫైనాన్స్ యాప్స్ నిర్వాహకులు తమ ఆర్థిక లావాదేవీలూ తేలిగ్గా బయటపడకుండా వ్యూహాత్మకంగా వ్యవహరిస్తున్నారు. ఈ కాల్ సెంటర్లలో పనిచేసే వారికి నేరుగా జీతాలు చెల్లించట్లేదు. దీనికోసం ఓ ఔట్సోర్సింగ్ ఏజెన్సీని ఏర్పాటు చేశాయి. వారికి మరో థర్డ్ పార్టీ నుంచి యూఐపీ, నగదు రూపంలో డబ్బు పంపిస్తున్నారు. రకరకాల ఖాతాల నుంచి జరుగుతున్న ఈ లావాదేవీలను పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. సైబర్ క్రైమ్ పోలీసులు ప్రాథమికంగా 30 యాప్స్‌కు సంబంధించిన 10 బ్యాంక్ ఖాతాలు, 80 వ్యాలెట్స్ గుర్తించారు. వీటిలోకి నగదు రాకపోకల్ని అధ్యయనం చేస్తున్నారు. రిజర్వ్ బ్యాంకు అనుమతి లేకుండా కార్యకలాపాలు నడుపుతున్న ఈ సంస్థలు 20 నుంచి 50 శాతం వరకు వడ్డీ వసూలు చేస్తున్నాయి. ఇవన్నీ గూగుల్ ప్లే స్టోర్స్ నుంచి హోస్ట్ అవుతున్నాయి. గూగుల్ నిబంధనల ప్రకారం రీ పేమెంట్ పీరియడ్ 60 రోజులు. అయితే ఈ యాప్స్ మాత్రం వారం నుంచి పక్షం రోజుల్నే గడువుగా నిర్దేశించాయి. అందరూ నిందితులు కాదు.. ఈ యాప్స్ వేధింపులకు సంబంధించి సిటీలో 16 కేసులు నమోదు చేశారు. వీటికి సంబంధించి మంగళవారం గుర్గావ్, సిటీల్లోని కాల్ సెంటర్ల నుంచి బిందురాణి, జ్యోతి మాలిక్, అమిత్, రమణ్‌దీప్ సింగ్, ప్రభాకర్ ధంగ్వాల్, మధుబాబు సింగి, మనోజ్‌కుమార్ సింగి, మహేశ్ కుమార్ సింగి, తరుణ్, పవన్‌కుమార్, జీవన్ జ్యోతిలను అరెస్టు చేశారు. దాదాపు 700 ల్యాప్‌టాప్స్‌ను స్వాధీనం చేసుకుని విశ్లేషిస్తున్నారు.ఈ యాప్స్‌తో పాటు వాటి లావాదేవీలకు సంబంధించిన వ్యాలెట్స్ హోస్టింగ్‌కు సంబంధించి గూగుల్ సేవలు అందించే ఆల్ఫాబెట్ ఇంక్ సంస్థకు ఈ–మెయిల్ ద్వారా లేఖ రాశారు. వారిచ్చే సమాధానం ఆధారంగా ఈ వ్యవహారాల్లో సూత్రధారులపై స్పష్టత వచ్చే అవకాశముంది. మరోపక్క ఈ కాల్సెంటర్లలో పనిచేస్తున్న అందరూ నిందితులు కాదని.. ఎవరైతే అసభ్య సందేశాలు పంపి ఉంటారో వారినే అరెస్టు చేస్తామని సీసీఎస్ సంయుక్త పోలీసు కమిషనర్ అవినాశ్ మహంతి తెలిపారు. అక్రమ మైక్రో ఫైనాన్సింగ్ యాప్స్ నుంచి వేధింపులు ఎదురైతే ‘100’కు లేదా సైబర్ క్రైమ్ పోలీసుస్టేషన్లో లేదా స్థానిక పోలీసుస్టేషన్లో ఫిర్యాదు చేయాలని కొత్వాల్ అంజనీకుమార్ కోరారు. ఈ తరహా కేసులు దేశంలోనే తొలిసారని ఆయన పేర్కొన్నారు. ఈ అక్రమ దందాలో ఎవరూ చిక్కవద్దని సూచించారు. -
అమ్మాయిలతో కాల్‌సెంటర్..డేటింగ్ ముఠా అరెస్ట్
సాక్షి, హైదరాబాద్ : డేటింగ్ యాప్ పేరుతో 16 మంది అమ్మాయిలతో కాల్ సెంటర్ నిర్వహిస్తున్న ఇద్దరు వ్యక్తులను హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు అరెస్ట్ చేశారు. కోల్‌కతాలో ఉన్న కాల్ సెంటర్‌పై దాడి చేసి నిర్వాహకులను అదుపులోకి తీసుకున్నారు. అలాగే 16 మంది యువతులకు 41 సీఆర్పీ సెక్షన్ కింద నోటీసులు అందజేశారు. ఆనంద్కర్, బుద్దపాల్ అనే ఇద్దరు వ్యక్తులు ఈ కాల్ సెంటర్‌ను నిర్వహిస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. వీరిద్దరి అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. వీరు దేశ వ్యాప్తంగా మోసాలకు పాల్పడినట్లు పోలీసులు గుర్తించారు. నిందితులను నుంచి 2 ల్యాప్‌టాప్‌లు, 24 సెల్ఫోన్లు, 51 సిమ్ కార్డులను స్వాధీనం చేసుకున్నారు. -
ఫోన్ నంబర్స్ ఎక్కడ నుంచి సేకరిస్తున్నారంటే..
సాక్షి హైదరాబాద్: సుభాష్ అర్జంట్ పనిమీద కారు డ్రైవ్ చేసుకుంటూ వెళుతున్నాడు. అంతలో ఫోన్ రావడంతో ఎవరో అని లిఫ్ట్ చేశాడు. సార్.. అంటూ ఓ యువతి గొంతు అవతలినుంచి పలకరించింది. తెలిసిన వాళ్లేమో అని సమాధానమిస్తే.. నగర శివారులో ప్లాట్లు ఉన్నాయి.. తక్కువ ధరకు కొనుగోలు చేస్తారా అని అంటోంది. అసలే చీకాకులో ఉన్న అతను ఫోన్ కట్ చేశాడు. ఇలాంటి ఫోన్లు ఒక్క సుభాష్‌కే కాదు.. నగరంలో దాదాపు ప్రతి ఒక్కరినీ పలకరిస్తాయి. ఎందుకంటే షాపింగ్ చేసినపుడు ఫోన్ నెంబర్ ఇస్తాం కాబట్టి.. నగర జీవితం ఉదయం లేచింది మొదలు నిద్రపోయే వరకు బిజీగా ఉంటుంది. దీంతో పాటు ఫోన్ కూడా మనతోపాటు బిజీ అయిపోయింది. ఎప్పుడు.. ఎక్కడ ఉన్నా మొబైల్ ఉండాల్సిందే. కాల్స్ వస్తూనే ఉంటాయి. మనం మాట్లాడుతూనే ఉంటాం. అయితే ఇటీవల టెలీకాలర్ల నుంచి ఫోన్లు ఎక్కువగా రావడం నగరవాసులను ఆందోళనకు గురిచేస్తోంది. సార్.. అంటూ తీయటి గొంతుతో మాట్లాడటం.. సమయం వృథాచేయడం.. లోన్..క్రెడిట్‌కార్డ్ అంటూ మాట్లాడుతున్నారు. ఎక్కువగా యువతులే ఫోన్లు చేస్తుంటారు. రియల్ ఎస్టేట్ కంపెనీ, వివిధ బ్యాంకులు, క్రెడిట్ కార్డు కంపెనీలు.. మార్కెటింగ్ సంస్థల నుంచి కాల్స్ వస్తున్నాయి. వ్యక్తిగత రుణం కావాలా? క్రెడిట్ కార్డు కావాలా..సెల్‌ఫోన్ నెట్‌వర్క్‌లో మంచి ఆఫర్లు ఉన్నాయంటూ ఫోన్ కంపెనీల వారు. షేర్ మార్కెట్ ట్రేడింగ్స్కు టిప్స్ చెబుతామంటూ కొందరు, నగరానికి రెండు కిలోమీటర్ల దూరంలో వెంచర్ ఉందని, ప్లాట్ బుక్ చేసుకోమని ఇంకొందరు నిత్యం ఫోన్ చేస్తూనే ఉంటారు. కొత్త సిమ్ తీసుకున్నా... మార్కెటింగ్ కాల్స్‌కు తోడు నకిలీలు కూడా పుట్టుకొస్తున్నారు. బ్యాంకింగ్, సైబర్ నేరాలు, ఓటీపీ మోసాలు, క్రెడిట్ కార్డు, డెబిట్ కార్డు, వ్యక్తిగత రుణాల పేరిట జరుగుతున్న మోసాల గురించి తెలియని విషయం కాదు. ఇలాంటి వారి వేధింపులు భరించ లేక చాలామంది ఫోన్ నంబర్లు మార్చుతున్నారు. ఆ నంబర్లను కూడా టెలీకాలర్స్ సేకరంచి ఫోన్ చేస్తున్నారు. వారు అందరి ఫోన్ నంబర్లు ఎలా సేకరిస్తున్నారని చాలామంది ఆశ్చర్యపోతున్నారు. సెల్‌ఫోన్ కంపెనీలతోపాటు పలు మార్గాల ద్వారా ఫోన్ నంబర్లు సేకరిస్తున్నట్లు తెలిసింది. సాధారణ ప్రజల నుంచి పోలీసు ఉన్నతాధికారులు, ప్రజాప్రతినిధుల ఫోన్ నంబర్లను సైతం సేకరించి కాల్ చేస్తున్నారు. ఎప్పుడు పడితే అప్పుడు ముందే కరోనా కాలం జనం ఆర్థిక కష్టాల్లో ఉన్నారు. దీనికి తోడు అ వస్తువు కొనండి మంచి ఆఫర్ ఉంది. మీరు మా సంస్థలో పెట్టుబడి పెడితే అత్యధికంగా వడ్డీ లభిస్తుంది. అని కాల్స్‌తో ఇబ్బంది పెడుతున్నారు. ఎప్పుడు పడితే అప్పుడు ఇలాంటి కాల్స్ వస్తున్నాయని పలువురు చెబుతున్నారు. నిరంతరం కాల్స్ రావడంతో చాలామంది ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అడ్డుకట్ట ఎలా? ఇలా అడ్డూ అదుపు లేకుండా కాల్స్ వస్తుంటే.. ఏం చేయాలో దిక్కుతోచక మొబైల్ యూజర్లు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఎవరికి ఫిర్యాదు చేయాలో అర్థం కాక..ఏం చేయాలో తెలియక సతమతమవుతున్నారు. ఇటువంటి కాల్స్‌పై ప్రభుత్వం స్పందించి తగిన చర్యలు తీసుకోవాలని యూజర్లు కోరుతున్నారు. బ్లాక్ చేసినా... ట్రాయ్ (టెలిఫోన్ రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా) ఆదేశాల మేరకు మార్కెటింగ్ కాల్స్ వద్దనుకునే వారు డీఎన్డీ (డూనాట్ డిస్టర్బ్) ఆప్షన్ ఎంచుకునే వారు. అప్పట్లో మార్కెటింగ్ నంబర్లు వేరుగా కనిపించేవి. డీఎన్డీ ఎంచుకున్న తర్వాత కూడా టెలీకాలర్స్ మార్కెటింగ్ నంబర్స్ నుంచి కాకుండా వేరే ఫోన్ నంబర్ల నుంచి కాల్ చేసి వేధిస్తున్నారు. తరచూ ఫోన్లు వస్తున్నాయని ఆ నంబర్‌ను బ్లాక్ చేస్తే మరో నంబర్ నుంచి కాల్ చేస్తున్నారు. బ్లాక్ అయిన ఫోన్ నెంబర్లు స్పామ్ (రెడ్ కలర్)లో కనిపిస్తాయి. నంబర్స్ ఎక్కడ నుంచి సేకరిస్తున్నారంటే.. మనం రోజుల వారి షాపింగ్, ఆసుపత్రులకు, మెడికల్ షాపుల్లో కొనుగోలుచేస్తుంటాం. అప్పుడు బిల్లింగ్ సమయంలో మీ ఫోన్ నంబర్ అడిగి తీసుకుంటారు. ఇలా మనం తెలుసో తెలియకో మన నంబర్ చెబుతాం.ఫోన్ నంబర్ ఇవ్వలేమని చెబితే మీ వస్తువులు బిల్ చేయాలంటే సిస్టమ్‌లో నంబర్ ఎంటర్ చేయాలని, లేకపోతే బిల్ వీలుకాదని సమాధానం ఇస్తారు. తప్పనిసరి పరిస్థితుల్లో ఫోన్ నంబర్ ఇవ్వాల్సి వస్తుంది. ఇలా మీ నంబర్ ఇతరులకు వెళ్లిపోతుంది. పలు వ్యాపార సంస్థలు నెంబర్లు ఆయా మాల్స్,వ్యాపార సంస్థల నుంచి సేకరిస్తాయి. పలు సందర్భాల్లో మీకు ఫోన్ చేస్తున్న వ్యక్తి మీ వృత్తి, ఉద్యోగం గురించి కూడా చెబుతాడు. అంటే మీరు షాపింగ్ సమయంలో ఆ వివరాలు రాసిచ్చారన్నమాట. -
కష్టమొచ్చిందా.. కాల్ చేయండి
సాక్షి, సిటీబ్యూరో: లాక్డౌన్ కారణంగా ప్రజలు ఇబ్బందులు పడకుండా ఉండేందుకు, అవసరమైన సహాయాన్ని వెంటనే అందించేందుకు జీహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయంలో ఏర్పాటు చేసిన ‘కోవిడ్–19 కాల్ సెంటర్’ నిరంతరాయంగా పనిచేస్తోంది. ఆపదలో ఉన్నవారికి ఇది ఎంతో ఉపయోగపడుతోంది. ఈ సెంటర్‌ను మార్చి 22వ తేదీన ఏర్పాటు చేశారు. జీహెచ్ఎంసీ కాల్‌సెంటర్ నెంబర్(040–21 11 11 11)నే దీనికీ వినియోగిస్తున్నారు. కట్టడి సమయంలో అత్యవసరంగా ఆస్పత్రులకు వెళ్లాల్సిన వారితోపాటు ఆకలితో అలమటిస్తున్నవారు ఫోన్ చేసినా స్పందించి వెంటనే తగిన సహాయం అందిస్తున్నారు.ఇందుకుగాను దిగువ స్థాయి నుంచి ఉన్నతాధికారుల వరకుసమన్వయంతో పనిచేసే టీమ్‌లను ఏర్పాటు చేశారు. కంటైన్మెంట్ జోన్ల వారీగా, సర్కిళ్ల వారీగా కూడా తక్షణ చర్యలకు అవసరమైన ఏర్పాట్లు చేసేందుకు అడిషనల్ కమిషనర్లు, తదితర ఉన్నతాధికారులకు సర్కిళ్ల వారీగా బాధ్యతలప్పగించారు. ఆహారం, అంబులెన్సుల సదుపాయం నుంచి మొదలుకొని వలస కార్మికులకు ఆహారం, వసతి, రేషన్ బియ్యం అందకపోవడం తదితర ఫిర్యాదుల్ని సైతం స్వీకరిస్తున్నారు. ఫోన్ కాల్స్‌తో పాటు ట్విట్టర్ వంటి సామాజిక వేదికల ద్వారా అందే విజ్ఞప్తులను, ఈమెయిల్స్ ద్వారా జీహెచ్ఎంసీకి అందిన ఫిర్యాదులను పరిష్కరిస్తున్నారు. ఆపత్కాలంలో, తప్పనిసరిగా ఇతర ప్రాంతాలకు వెళ్లాల్సిన వారు సైతం కాల్‌సెంటర్‌కు ఫోన్ చేస్తున్నారు. అందే సమస్యలన్నింటినీ వెంటనే పరిష్కరించేందుకుగాను వివిధ విభాగాల అధికారులను కూడా కంట్రోల్‌రూమ్ ఫిర్యాదుల పరిష్కారంలో భాగస్వాముల్ని చేశారు. కంటైన్మెంట్ జోన్లో ఉన్న తమకు నిత్యావసరాలు అందడం లేదని, హోమ్క్వారంటైన్ పాటించడం లేరంటూ ఫిర్యాదులొచ్చినా స్థానికంగా ఉండే యంత్రాంగాన్ని వెంటనే అప్రమత్తం చేసి అందజేసేలా చర్యలు తీసుకుంటున్నారు. ఇందుకుగాను సంసిద్ధంగా ఉండే ఉద్యోగులు, వాలంటీర్లతోపాటు తగినన్ని వాహనాలను, అంబులెన్సులను వివిధ ప్రాంతాల్లో అందుబాటులో ఉంచారు. ఫిర్యాదులను పరిష్కరించడంతోపాటు, పరిష్కారమయ్యాక వారి స్పందనను కూడా తెలుసుకుంటున్నారు. కాల్సెంటర్లో.. జీహెచ్ఎంసీలోని వివిధ విభాగాలతోపాటు రెవెన్యూ, పౌరసరఫరాలు, వైద్య, ఆరోగ్యశాఖ, కార్మికశాఖ తదితర విభాగాలకు చెందిన అధికారులు కాల్సెంటర్లో అందుబాటులో ఉంటారు. వీరితోపాటు 104, 108 అంబులెన్స్ సర్వీసులకు సంబంధించిన అధికారులు కూడా ఉంటారు. కాల్స్ ఆధారంగా క్షేత్రస్థాయిలోని వారికి సూచనలిస్తారు. కాల్సెంటర్లో షిఫ్టుకు 20 మంది చొప్పున రోజుకు మూడు షిఫ్టులుగా 60 మంది 24 గంటల పాటు విధులు నిర్వహిస్తున్నారు. సత్వర సేవల కోసం క్షేత్రస్థాయిలో వివిధ ప్రాంతాల్లో 32 అంబులెన్సులు ఉంచారు. కంటైన్మెంట్ ప్రాంతాలకు సరుకుల రవాణా కోసం 30 వాహనాలను కూడా వినియోగిస్తున్నట్లు పేర్కొన్నారు. సేవలు ఇలా... ఫోన్ చేసిన వారి అవసరం, సంప్రదించాల్సిన ఫోన్‌నెంబర్, చిరునామా వంటి వివరాలను కంట్రోల్‌రూమ్ సిబ్బంది సేకరిస్తారు. క్షేత్రస్థాయిలో ఆ చిరునామాకు దగ్గరలో ఉన్న సంబంధిత ఉద్యోగి/వాలంటీర్‌కు ఎస్ఎంఎస్ ద్వారా సమాచారం వెళ్తుంది. అలాగే ఫోన్ చేసిన వారికి కూడా ఎస్ఎంఎస్ ద్వారా ఉద్యోగి/వాలంటీర్ ఫోన్‌నెంబర్ తెలుస్తుంది. ఎంత సమయంలో వారి అవసరం తీరుతుందో సుమారుగా తెలియజేస్తారు. భోజనం కావాలని ఫోన్లు వస్తే వారికి దగ్గర్లో ఉన్న అన్నపూర్ణ కేంద్రం చిరునామా తెలుపుతారు. కదలలేని వారికైతే మొబైల్ వాహనం ద్వారా చిరునామాకు ఫుడ్ ప్యాకెట్స్ అందజేస్తారు. పంపిణీ సందర్భంగా ఫొటోలు కూడా తీసుకుంటారు. వారి నుంచి ఫీడ్‌బ్యాక్ కూడా కోరతారు. ఇతర ప్రాంతాల నుంచి కూడా.. జీహెచ్ఎంసీ పరిధిలోని వారి కోసం ఈ కాల్‌సెంటర్‌ను అందుబాటులోకి తెచ్చిన ప్పటికీ వివిధ జిల్లాలు, రాష్ట్రాల నుంచి కూడా విజ్ఞప్తులు అందుతున్నాయి. ఫోన్లతోపాటు సామాజిక మాధ్యమాలు, మెయిల్స్ ద్వారా అందే విజ్ఞప్తుల్ని సైతం పరిశీలించి, పరిష్కరిస్తున్నట్లు సంబంధిత అధికారి పేర్కొన్నారు. వైద్యావసరాలు, ఇతరత్రా అవసరాల కోసం ఇతర జిల్లాలకు వెళ్లాల్సిన వారు, ఇతర రాష్ట్రాలకు వెళ్లాల్సిన వారు సైతం ఫోన్లు చేస్తున్నారు. తగిన పాస్‌లు ఇప్పించాల్సిందిగా కోరుతుండటంతో సంబంధిత అధికారుల ద్వారా వాటిని అందించే ఏర్పాట్లు చేస్తున్నారు. వినతులెన్నో.. వివిధ అవసరాల కోసం వచ్చే కాల్స్ క్రమేపీ పెరుగుతున్నాయి. రోజురోజుకూ దీని గురించి ఎక్కువమందికి తెలుసుండటంతో ఆహారం అవసరమైన వారు ఎక్కువగా కాల్ చేస్తున్నారు. సంబంధిత అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. తాజాగా సోమవారం సాయంత్రానికి వివిధ అంశాలకు సంబంధించి దాదాపు 570 కాల్స్ అందాయి. కాల్‌సెంటర్ ఏర్పాటైనప్పటి నుంచి ఇప్పటి వరకు అందిన కాల్స్ .. అంశాల వారీగా.. మొత్తం కాల్స్: 9269 కరోనాకు సంబంధించినవి: 576 అంబులెన్సు సదుపాయం కోసం: 274 రేషన్ కోసం : 805 అన్నపూర్ణ మొబైల్ క్యాంటీన్ కోసం(ఈనెల 9 నుంచి): 7483 ఫుడ్ ప్యాకెట్ల పంపిణీ: 3,42,000 మెయిల్స్ ద్వారా..రాష్ట్రంలో ఇతర జిల్లాలకు వెళ్లేందుకు : 32 ఇతర రాష్ట్రాలకు వెళ్లేందుకు : 57 రాష్ట్రంలో వైద్యావసరాల కోసం: 27 ఇతర రాష్ట్రాల్లో వైద్యావసరాల కోసం: 18 హోమ్ క్వారంటైన్ ఉల్లంఘనలు : 2 లాక్డౌన్ ఉల్లంఘనలు: 3 పారిశుధ్యానికి సంబంధించి: 20 అధిక ధరలకు సంబంధించి: 5 ట్టిట్టర్ ద్వారా అందిన విజ్ఞప్తులు: 110 విదేశీప్రయాణికుల నుంచి తీసుకున్న ఫీడ్‌బ్యాక్: 3885 కంటైన్మెంట్ జోన్ల నుంచి.. కంటైన్మెంట్ ప్రాంతాలనుంచి ఆహారం కావాలంటూ సోమవారం దిగువ ప్రాంతాలనుంచి ఫోన్స్ వచ్చాయి: మలక్‌పేట, సంతోష్‌నగర్, చార్మినార్, చాంద్రాయణగుట్ట, ఫలక్‌నుమా, రాజేంద్రనగర్, మెహదీపట్నం, ఖైరతాబాద్, కార్వాన్, జూబ్లీహిల్స్, గోషామహల్, ముషీరాబాద్, బేగంపేట, అంబర్‌పేట, యూసుఫ్‌గూడ, శేరిలింగంపల్లి, చందానగర్, ఆర్సీపురం, కూకట్పల్లి, కుత్బుల్లాపూర్, గాజుల రామారం, అల్వాల్, మల్కాజిగిరి, ఉప్పల్, సరూర్‌నగర్. -
సహాయపడదాం
కరోనా వల్ల ఏర్పడిన కష్ట కాలంలో వీలైనంత సహాయం అందించడానికి సినిమా స్టార్స్ ముందుకు వస్తున్నారు. కరోనాపై పోరాటాన్ని ముందుకు తీసుకెళ్తున్నారు. మలయాళ నటి నిఖిలా విమల్ కూడా తనకు తోచిన విధంగా సహాయం చేస్తున్నారు. కేరళలోని కన్నూర్ ప్రాంతంలో కోవిడ్ 19–కాల్ సెంటర్లో పని చేస్తున్నారామె. లాక్ డౌన్ కారణంగా అందరికీ నిత్యావసర వస్తువులు అందుతున్నాయా? లేదా? అని తెలుసుకోవడంతో పాటు ఏదైనా సమస్యలు వస్తే వాటిని పరిష్కరించడానికి ఈ కాల్ సెంటర్‌ను ఏర్పాటు చేశారు. ఏదైనా ఇబ్బంది, సందేహాలు ఉన్నవాళ్లు ఫోన్ చేసి సమాచారం తెలుసుకోవచ్చు, సహాయం పొందవచ్చు. ఈ కాల్ సెంటర్లో సిబ్బంది అవసరం ఉందని తెలిసి వాలంటీర్‌గా పని చేయాలనుకున్నారట నిఖిల. ప్రతి రోజూ ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు కాల్ సెంటర్లో పని చేస్తున్నారామె. తన వివరాలేవీ కాలర్కి తెలియకుండా పని చేసుకుంటూ వెళ్తున్నారట. ఈ కాల్ సెంటర్ చేరుకోవడానికి 20 కిలో మీటర్లు ప్రయాణిస్తున్నారట కూడా. ‘‘ఇలాంటి విపత్కర పరిస్థితుల్లో నా వంతు సహాయం చేయడం, అది ఉపయోగకరంగా ఉండడం సంతోషంగా ఉంది. ఇదో సరికొత్త అనుభూతి. అందరం కూడా ఏదో విధంగా సహాయపడటానికి ట్రై చేద్దాం’’ అన్నారు నిఖిలా విమల్. మోహన్ బాబు నటించిన ‘గాయత్రి’ సినిమాలో ఆయన కుమార్తె పాత్రలో నిఖిల నటించిన విషయం గుర్తుండే ఉంటుంది. -
‘కాల్‌సెంటర్’తో కాజేశారు!
సాక్షి, సిటీబ్యూరో: గూగుల్‌లో నకిలీ కాల్ సెంటర్ నెంబర్లు జోప్పించి, ఫోన్లు చేసిన వారిని నిండా ముంచుతున్న ముఠాకు చెందిన ఇద్దరిని సిటీ సైబర్ క్రైమ్ పోలీసులు అరెస్టు చేశారు. జార్ఖండ్‌లో పట్టుకున్న వీరిని అక్కడి కోర్టులో హాజరుపరిచి, పీటీ వారెంట్‌పై సిటీకి తీసుకువచ్చినట్లు సంయుక్త పోలీసు కమిషనర్ అవినాష్ మహంతి శుక్రవారం తెలిపారు. సికింద్రాబాద్ ప్రాంతానికి చెందిన అర్జున్‌సింగ్ లైమ్ రోడ్ యాప్‌లో వన్ ప్లస్ వన్ ఆఫర్ ఉండటంతో టీషర్ట్ ఆర్డర్ ఇచ్చారు. అయితే ఒక్క టీషర్టే రావడంతో ఆ సంస్థ కాల్ సెంటర్ నెంబర్ కోసం గూగుల్‌లో సెర్చ్ చేశారు. అందులో లభించిన ఓ నెంబర్‌కు కాల్ చేయగా... కట్ చేసిన అవతలి వ్యక్తి మరో నెంబర్ నుంచి సంప్రదించాడు. లైమ్‌రోడ్డు ప్రతినిధిగా పరిచయం చేసుకున్న అతడికి విషయం చెప్పగా మీ సమస్య పరిష్కారం కావడానికి మేము పంపే లింక్ తమ కేంద్ర కార్యాలయానికి చెందిన నెంబర్‌కు పంపాలంటూ చెప్పి ఆ నెంబర్ ఇచ్చారు. కొద్దిసేపటికి వచ్చిన లింకును అర్జున్ ఆ నెంబర్‌కు పంపాడు. ప్రాసెస్ పూర్తి కావడానికి అంటూ బాధితుడి నుంచి ఓటీపీ కూడా తీసుకున్నారు. దీంతో ఇతడి బ్యాంకు ఖాతా, సైబర్ నేరగాళ్ళ ఫోన్‌కు లింకు అయింది. దీనిసాయంతో వాళ్ళు రూ.37,288 కాజేశారు. బాధితుడు ఈ ఏడాది జనవరి మొదటి వారంలో సైబర్ క్రైమ్ ఏసీపీ కేవీఎం ప్రసాద్‌కు ఫిర్యాదు చేశారు. ఆయన ఆదేశాల మేరకు కేసు నమో దు చేసుకుని దర్యాప్తు చేసిన ఇన్స్పెక్టర్ డి.ప్రశాంత్ సాంకేతిక ఆధారాలను బట్టి జార్ఖండ్‌కు చెందిన మన్సూర్ అన్సారీ, అస్లం రజాలకు ఈ నేరంతో సంబంధం ఉన్నట్లు గుర్తించింది. అక్కడకు వెళ్ళిన ప్రత్యేక బృందం ఇద్దరినీ అరెస్టు చేసి తీసుకువచ్చింది. ఈ నిందితుల్లో ఒకరైన మన్సూర్ అన్సారీ జార్ఖండ్‌లోని పిప్రా గ్రామంలో మేస్త్రీగా పని చేస్తున్నాడు. అదనపు ఆదాయం కోసం అస్లం తదితరులతో కలిసి సైబర్ నేరాలకు పాల్పడుతున్నాడు. ఇలాంటి ముఠాలు అక్కడ అనేకం ఉన్నాయని అధికారులు చెప్తున్నారు. -
జొమాటో: రూ.146 కోసం 55 వేలు పోయాయి
సాక్షి, సిటీబ్యూరో: నగరంలోని యూసుఫ్‌గూడకు చెందిన యువకుడిని గూగుల్‌లోని నకిలీ కాల్ సెంటర్ ముంచేసింది. తనకు జొమాటో నుంచి రావాల్సిన రూ.146 కోసం ప్రయత్నిస్తే.. రూ.55 వేలు కోల్పోవాల్సి వచ్చింది. దీంతో ఆ యువకుడు సోమవారం సిటీ సైబర్ క్రైమ్ ఏసీపీ కేవీఎం ప్రసాద్‌ను కలిసి ఫిర్యాదు చేయడంతో కేసు నమోదైంది. వరంగల్‌కు చెందిన ఓ యువకుడు ప్రస్తుతం యూసుఫ్‌గూడలోని రెహ్మత్‌నగర్‌లో నివసిస్తూ సాఫ్ట్వేర్ సంస్థలో పని చేస్తున్నాడు. చికెన్ బిర్యానీ తినాలని భావించిన ఇతగాడు శనివారం ఫుడ్ డెలివరీ యాప్ జొమాటోలో ఆర్డర్ చేశాడు. తనకు చికెన్ బిర్యానీకి బదులుగా సాధారణ రైస్ పార్శిల్ వచ్చినట్లు గుర్తించాడు. వెంటనే ఈ విషయంపై ఫిర్యాదు చేయడానికి జొమాటో యాప్‌లో ఆ సంస్థ నంబర్ల కోసం వెతికాడు. అవి అందుబాటులో లేకపోవడంతో అవకాశం ఉన్న చాటింగ్ ద్వారా ఆ సంస్థకు ఫిర్యాదు చేశాడు. అంతటితో ఆగకుండా జొమాటో కాల్ సెంటర్ నంబర్ కోసం ప్రయత్నించాడు. అందులో ఉన్న ఓ నంబర్‌కు సంప్రదించిన బాధితుడు అవతలి వారు రెస్పాండ్ కాకపోవడంతో మిన్నకుండిపోయాడు. కొద్దిసేపటికి తాను ఫోన్ చేసిన నంబర్ నుంచి కాల్ బ్యాక్ రావడం.. ట్రూ కాలర్ యాప్ జొమాటో కాల్ సెంటర్ అంటూ చూపించడంతో స్పందించాడు. అవతలి వ్యక్తితో జరిగిన విషయం చెప్పి తనకు రూ.146 రిటర్న్ ఇవ్వాల్సిందిగా కోరాడు. బాధితుడు డబ్బును తన క్రెడిట్ కార్డు ద్వారా చెల్లించాడు. ఈ విషయాన్ని అతడి నుంచే తెలుసుకున్న మోసగాళ్లు ఆ కార్డుకు రిటర్న్ రావని, గూగుల్ పే ఉన్న ఫోన్ నంబర్ చెప్పాల్సిందిగా కోరారు. తాను ఇప్పుడు కాల్ చేస్తున్న నంబర్‌కు అది ఉందని బాధితుడు చెప్పాడు. దీంతో ఇతడికి యూపీఐ కోడ్ పంపిన సైబర్ నేరగాళ్లు దాన్ని తాము సూచించిన నంబర్‌కు పంపాలంటూ అలా చేయించుకున్నారు. ఆపై తొలుత బాధితుడి ఖాతా నుంచి రూ.1 చెల్లించేలా చేసి.. మీ గూగుల్ పే ఖాతా తమ వద్ద యాడ్ అయిందని, 24 గంటల్లో డబ్బు రిటర్న్ వస్తుందని చెప్పారు. ఆదివారం సాయంత్రం హఠాత్తుగా బాధితుడి గూగుల్‌పేతో లింకు అయి ఉన్న రెండు బ్యాంకు ఖాతాల నుంచి మొత్తం రూ.1.4 లక్షలు కట్ అయ్యాయి. ఈ లావాదేవీని గుర్తించిన అతడి బ్యాంకు అనుమానించింది. తక్షణం బాధితుడిని సంప్రదించి విషయం తెలుసుకుంది. ఆపై రూ.85 వేలు రిటర్న్ చేయగలిగింది. మిగిలిన రూ.55 వేలు మాత్రం నేరగాళ్ల పరమైంది. ఈ విషయం గుర్తించిన బాధితుడు తనను సంప్రదించిన నంబర్లకు కాల్ చేయడానికి ప్రయత్నించగా ఫలితం దక్కలేదు. దీంతో అతడు సోమవారం సిటీ సైబర్ క్రైమ్ ఏసీపీ కేవీఎం ప్రసాద్‌ను కలిసి ఫిర్యాదు చేశారు. ఆయన ఆదేశాల మేరకు కేసు నమోదు చేసుకున్న ఇన్స్పెక్టర్ జి.వెంకట్రామిరెడ్డి దర్యాప్తు ప్రారంభించారు. గూగుల్‌లో ఉన్న కాల్ సెంటర్ల నంబర్లలో చాలా నకిలీలు ఉంటున్నాయని, ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకుని అప్రమత్తంగా ఉండాలని ఆయన సూచించారు. -
కాల్ సెంటర్ మోసంలో భారతీయులకు జైలుశిక్ష
వాషింగ్టన్ : ‘కాల్ సెంటర్’ మోసానికి సంబంధించి అమెరికాలో ముగ్గురు భారతీయులు సహా ఎనిమిది మందికి సోమవారం స్థానిక కోర్టు జైలు శిక్ష విధించింది. భారత్ కేంద్రంగా జరిగిన ఈ మోసంలో 37 లక్షల డాలర్ల(రూ. 26.36 కోట్లు) మేర అమెరికన్లు నష్టపోయారు. జార్జియా రాష్ట్రంలో నివసించే మొహమ్మద్ కాజిమ్ మొమిన్, మొహమ్మద్ సోజబ్ మొమిన్, పాలక్కుమార్ పటేల్‌లకు కోర్టు ఆర్నెల్ల నుంచి నాలుగేళ్ల 9 నెలల వరకు వేర్వేరుగా జైలు శిక్ష విధించింది. భారత్‌లోని సహ కుట్రదారులతో కలిసి, అహ్మదాబాద్‌లోని కాల్‌సెంటర్లు కేంద్రంగా ఈ మోసానికి వారు పాల్పడ్డారని కోర్టు తేల్చింది. డేటా బ్రోకర్ల నుంచి సేకరించిన సమాచారం ఆధారంగా, కొందరిని గుర్తించి, వారికి ఇంటర్నల్ రెవెన్యూ సర్వీసెస్ ఉద్యోగులమని, కాల్ సెంటర్ల ద్వారా వీరు ఫోన్ చేసేవారు. ఆ తరువాత వారు ప్రభుత్వ పన్నులు, జరిమానాలు చెల్లించలేదని, వాటిని తక్షణమే చెల్లించకుంటే అరెస్ట్, జైలుశిక్ష తప్పదని బెదిరించి, డబ్బులు వసూలు చేసేవారు. -
‘14500’తో అక్రమార్కులకు హడల్!
గుంటూరు జిల్లా ప్రత్తిపాడు నియోజకవర్గంలోని మల్లవరం ప్రాంతంలో అక్రమంగా మద్యం అమ్ముతున్నారని నవంబర్ 18న టోల్‌ఫ్రీ నంబర్ ‘14500’కు ఓ మహిళ ఫోన్లో ఫిర్యాదు చేశారు. వెంటనే కాల్ సెంటర్ సిబ్బంది ఇచ్చిన సమాచారంతో ప్రత్తిపాడు సీఐ తన సిబ్బందితో వెళ్లి అక్రమంగా మద్యం అమ్ముతున్న దేవమ్మ అనే మహిళను పట్టుకుని కేసు నమోదుచేశారు. తూర్పు గోదావరి జిల్లా రావులపాలెం పక్కనున్న మరో గ్రామంలో కూల్‌డ్రింక్స్ షాపులో మద్యం అమ్ముతున్నారని ‘14500’కు ఫోన్ వచ్చింది. వెంటనే ఈ విషయం స్థానిక అధికారులకు తెలిపారు. వీరు అక్కడికెళ్లి తనిఖీ చేయగా మద్యం దొరకలేదు. అయితే, షాపు నిర్వాహకుడు గతంలో మద్యం అమ్మేవాడని విచారణలో బయటపడింది. దీంతో అతన్ని హెచ్చరించి వదిలేశారు. సాక్షి, అమరావతి : ..ఇవి మచ్చుకు రెండు ఉదాహరణలు మాత్రమే. గత నెల 18న టోల్ ఫ్రీ నంబరును ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ప్రారంభించినప్పటి నుంచి రాష్ట్రంలో మద్యం విషయంలో ఎక్కడ అక్రమాలు జరిగినా వెంటనే స్థానికుల నుంచి ‘14500’ కాల్ సెంటర్‌కు ఫిర్యాదులు వస్తున్నాయి. కాల్ సెంటర్ సిబ్బంది తక్షణమే సంబంధిత అధికారులకు తెలియజేయడం, వారు వెంటనే స్పందించడం చకచకా జరిగిపోతున్నాయి. దీంతో గతంలో విచ్చలవిడిగా బెల్ట్ షాపులు నిర్వహించిన వారు ఇప్పుడు అక్రమంగా మద్యం అమ్మాలంటే భయపడుతున్నారు. మద్యం, ఇసుక అక్రమ విక్రయాలు, ఎక్కడ జరిగినా ఈ టోల్‌ఫ్రీ నంబర్‌కు ఫోన్‌చేసి ఫిర్యాదు చేయాలన్న ముఖ్యమంత్రి పిలుపునకు జనం భారీగా స్పందించడమే ఇందుకు కారణం. ఎక్కడ అక్రమాలు జరిగినా నయాపైసా ఖర్చులేకుండా జనం ఉచిత ఫోన్‌కాల్ ద్వారా ఫిర్యాదులు చేస్తుండటంతో ఎక్కడ జైలుపాలు కావాల్సి వస్తుందోనన్న భయం అక్రమార్కుల్లో వెంటాడుతోంది. దీనివల్లే గ్రామాల్లో గతంలో అడుగడుగునా ఉన్న మద్యం బెల్ట్ షాపుల జాడ ఇప్పుడు పత్తా లేకుండాపోయింది. బెల్ట్ షాపులపైనే అధిక ఫిర్యాదులు మొత్తం 248 ఫిర్యాదులు రాగా అందులో 204 బెల్ట్ షాపులకు సంబంధించినవే కావడం గమనార్హం. మరో 25 ఫిర్యాదులు ఎమ్మార్పీ ఉల్లంఘనలకు సంబంధించినవి ఉన్నాయి. అలాగే, నిర్ణీత సమయం దాటి రాత్రిపూట అమ్ముతున్నారని ఏడు ఫిర్యాదులు వచ్చాయి. మిగిలినవి ఇతరత్రా ఫిర్యాదులు. కాగా, ఈ ఫిర్యాదుల్లో సింహభాగం మహిళల నుంచే వస్తున్నట్లు సమాచారం. -
లవ్ ఆర్ట్స్ పేరుతో కాల్ సెంటర్.. డేటింగ్ ఆఫర్స్
సాక్షి, సిటీబ్యూరో: ఎదుటివారి బలహీనతల్ని ఆసరాగా చేసుకుంటూ ఆన్లైన్లో డేటింగ్ సైట్ పేరుతో రిజిస్టర్ చేయడంతో పాటు ఫోన్‌కాల్స్ ద్వారానూ ఎర వేసి, బెదిరింపులకు పాల్పడి, అందినకాడికి దండుకుంటున్న ముఠా గుట్టును సిటీ సైబర్ క్రైమ్‌పోలీసులు రట్టు చేశారు. కోల్‌కతా కేంద్రంగా పని చేస్తున్న కాల్ సెంటర్‌పై దాడి చేసిన అధికారులు ముగ్గురిని అరెస్టు చేశారు. మరో 16 మంది నిందితులకు నోటీసులు జారీ చేసినట్లు సీసీఎస్ సంయుక్త పోలీసు కమిషనర్ అవినాష్ మహంతి సోమవారం తెలిపారు. పశ్చిమ బెంగాల్‌లోని కోల్‌కతాకు చెందిన సోమ రోక అక్కడ ‘లవ్ ఆర్ట్స్’ పేరుతో ఓ కాల్‌సెంటర్ ఏర్పాటు చేశారు. ఇందులో అర్నబ్‌సూర్ డెవలపర్‌గా, మహ్మద్ ఇమ్రాన్ జూనియర్ డెవలపర్‌గా పని చేస్తున్నారు. ఈ ముగ్గురు మరో 16 మంది యువతులను టెలీ కాలర్స్‌గా నియమించుకున్నారు. వీరికి నెలవారీ జీతాలు చెల్లిస్తూ ఫోన్లు చేయించడం, వచ్చిన కాల్స్‌ను రిసీవ్ చేసుకుని మాట్లాడటం వంటి బాధ్యతలు అప్పగించారు. వీరు పాటించాల్సిన అంశాలకు సంబంధించి ఓ స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్ (ఎస్ఓపీ) సైతం సోమ ఏర్పాటు చేసింది. వీళ్లు ఆన్లైన్ డేటింగ్ సర్వీస్ ఇస్తామంటూ ఇంటర్నెట్లో పొందుపరిచారు. దీంతో పాటు వివిధ మార్గాల్లో పలువురి సెల్‌ఫోన్ నెంబర్లు సంగ్రహించి కాల్స్ చేస్తున్నారు. ఈ ఫోన్లకు స్పందించిన వారితో పాటు ఆన్లైన్లో తమ నెంబర్లు చూసి కాల్ చేసిన వారితోనూ టెలీకాలర్స్ మాట్లాడతారు. తాము ఆన్లైన్లో డేటింగ్ సేవలు అందిస్తామంటూ చెప్తారు. అవతలి వ్యక్తులు ఆసక్తి చూపితే వారి నుంచి ప్రాథమికంగా రిజిస్ట్రేషన్ ఫీజుగా రూ.1025 ఆన్లైన్లో కట్టించుకుంటున్నారు. ఆపై తాము ప్లాటినం, గోల్డ్, సిల్వర్ పేర్లతో స్కీములు నిర్విహిస్తున్నామని చెప్తారు. రూ.3500 కట్టి సిల్వర్ స్కీమ్‌లో చేరితే యువతులతో చాటింగ్ చేసే అవకాశం, రూ.5500 కట్టి గోల్డ్‌లో చేరితో చాటింగ్‌తో పాటు ఫోన్‌కాల్స్, రూ.10,500 కట్టి ప్లాటినం స్కీములో సభ్యుడిగా మారితే ఆయా యువతుల్ని కలిసే అవకాశం కూడా ఉంటుందని ఎర వేస్తున్నారు. ఈ మొత్తాలు కట్టడానికి సిద్ధమైన వారికి బ్యాంకు ఖాతాల వివరాలు ఇచ్చి డబ్బు డిపాజిట్ చేయించుకుంటున్నారు. ఆపై టార్గెట్ చేసిన వ్యక్తి నుంచి ఫోన్ నెంబర్, ఈ–మెయిల్ ఐడీ, ఫొటో, చిరునామా అందించాలని కోరి...అలా చేస్తే మీరు నివసించే ప్రాంతానికి సమీపంలో ఉండే యువతి ఫోన్ నెంబర్లు ఇస్తామంటూ చెప్తున్నారు. స్కీముల్లో చేరి, డబ్బుకట్టి, కోరిన వివరాలు పంపిన వారికి కొన్ని ఫోన్ నెంబర్లు సైతం పంపిస్తున్నారు. వాస్తవానికి ఇవి తమ కాల్సెంటర్లో పని చేసే టెలీకాలర్ల వద్దే ఉంటాయి. ‘కస్టమర్లు’ ఫోన్/చాటింగ్ చేసినప్పుడు మాత్రం తమ వద్ద ఉన్న డేటా బేస్ ఆధారంగా వారు ఎక్కడి నుంచి చేస్తున్నారో తెలుసుకుంటారు. దీని ఆధారంగా తాము ఆ సమీపంలో ఉంటామని చెప్పి నమ్మించి మాట్లాడటం, చాటింగ్ చేయడం చేస్తూ పూర్తిగా బుట్టలో పడేస్తున్నారు. ఆపై మళ్లీ సంప్రదించే టెలీకాలర్లు ఈసారి తాము ఇన్కమ్, ఎంజాయ్ పేర్లతో రెండు గ్రూపులు ఏర్పాటు చేశామని చెప్తున్నారు. నిర్ణీత మొత్తం చెల్లించి వీటిలో చేరవచ్చని... ఇన్కమ్లో చేరితో అవతలి వ్యక్తుల్ని కలిసి అవకాశం ఉన్నప్పుడు వారి నుంచి డబ్బు సైతం తీసుకోవచ్చని, అలా వచ్చిన మొత్తంలో 20 శాతం తాము తీసుకుని 80 శాతం ఇస్తామని చెప్తున్నారు. ఎంజాయ్ గ్రూప్‌లో కేవలం ఎంజాయ్మెంట్ మాత్రమే ఉంటుందని నమ్మబలుకుతున్నారు. ఇదంతా అయ్యాక ఆ కాల్‌సెంటర్ నిర్వాహకులు అసలు కథ మొదలు పెడుతున్నారు. వీరే కస్టమర్ల వివరాలను వివిధ రకాలైన డేటింగ్ వెబ్‌సైట్స్‌లోకి అప్లోడ్ చేస్తున్నారు. ఇలా చేసిన తర్వాత కాల్‌సెంటర్ నుంచే తాము పోలీసులమని కస్టమర్లకు ఫోన్ చేస్తున్నారు. ఫలానా సైట్లో మీ పేరు రిజిస్టరై ఉందని, అది నేరం కావడంతో కేసు నమోదు చేశామని చెప్తున్నారు. అరెస్టు కాకుండా ఉండాలంటే డబ్బు చెల్లించాలంటూ రూ.లక్ష నుంచి రూ.2 లక్షల వరకు వసూలు చేస్తున్నారు. తమ బలహీనత బయటపడి పరువు పోతుందనే ఉద్దేశంతో అనేక మంది బాధితులు తాము మోసపోయామన్న విషయాన్నీ బయటకు చెప్పుకోవట్లేదు. ఈ పంథాలో సోమ అండ్ గ్యాంగ్ నగరానికి చెందిన ఒకరి నుంచి రూ.1.2 లక్షలు, మరొకరి నుంచి రూ.12 వేలు కాజేశారు. వీరి ఫిర్యాదుతో సైబర్ క్రైమ్ ఠాణాలో కేసులు నమోదయ్యాయి. దారుణంగా మోసాలు చేస్తున్న ఈ నేరగాళ్లను పట్టుకోవడానికి నిర్ణయించుకున్న అదనపు డీసీపీ కేసీఎస్ రఘువీర్ ప్రత్యేక బృందం ఏర్పాటు చేశారు. ఇన్స్పెక్టర్లు ఎన్.మోహన్‌రావు, గంగాధర్‌లతో కూడిన బృందం కోల్‌కతా వెళ్లి కాల్‌సెంటర్‌పై దాడి చేసింది. సోమ, అర్నబ్‌సూర్, ఇమ్రాన్‌లను అరెస్టు చేసింది. టెలీకాలర్స్‌గా పని చేస్తున్న మరో 16 మందికి నోటీసులు జారీ చేసింది. ఈ కాల్‌సెంటర్ టర్నోవర్ నెలకు రూ.50 లక్షల వరకు ఉందని, ఇలాంటి సెంటర్లు అక్కడ అనేకం ఉన్నాయని పోలీసులు చెప్తున్నారు. బాధితుల నుంచి డబ్బు డిపాజిట్ చేయించడానికి వీరు వినియోగిస్తున్న బ్యాంకు ఖాతాలు వేరే వారి పేర్లతో, బోగస్ వివరాలతో ఉంటున్నాయని చెప్తున్నారు. అరెస్టు చేసిన ముగ్గురు నిందితుల్నీ కోల్కతాలోకి కోర్టులో హాజరుపరిచిన సైబర్ క్రైమ్ పోలీసులు పీటీ వారెంట్‌పై సిటీకి తీసుకువచ్చి జ్యుడీషియల్ రిమాండ్‌కు తరలించారు. -
సమస్యల పరిష్కారం కోసం కాల్‌సెంటర్
సాక్షి, ధర్మవరం: అర్హులందరికీ సంక్షేమ పథకాలను అందజేయడం, అవినీతి నిర్మూలన కోసం ధర్మవరం ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకటరామిరెడ్డి నూతన ఒరవడికి శ్రీకారం చుట్టారు. సంక్షేమ పథకాలకు అర్హులకు అందించేందుకు కాల్‌సెంటర్‌ను ఏర్పాటు చేశారు. గురువారం స్థానిక ఎస్బీఐ కాలనీలోని తన నివాసంలో ఏర్పాటు చేసిన కాల్‌సెంటర్‌ను ఆయన ప్రారంభించారు. ధర్మవరం నియోజకవర్గ పరిధిలోని ప్రజలు ఏ సమస్య అయినా, ఏ సంక్షేమ పథకం అందకపోయినా 94931 56565 నంబర్‌ను ఫోన్ చేయవచ్చన్నారు. ఈ సందర్భంగా కేతిరెడ్డి మాట్లాడుతూ, తమ నాయకుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి స్ఫూర్తితో పారదర్శక పాలన, సంక్షేమ పథకాలు 100 శాతం అందించాలన్న తలంపుతో ముందుకు పోతున్నామన్నారు. ఇందులో భాగంగా కాల్‌సెంటర్ ఏర్పాటు చేసి ప్రజల సమస్యలను తక్షణమే పరిష్కరించేందుకు కృషి చేస్తున్నామన్నారు. సంక్షేమ పథకాలు అందించేందుకు ఎవరైనా లంచం అడిగినా, బెదిరించినా ఫోన్ చేసి ఫిర్యాదు చేయవచ్చన్నారు. -
రోజుకు 20 లక్షల మందికి ఫోన్ చేస్తున్నారట!
సాక్షి, అమరావతి: రియల్ టైమ్ గవర్నెన్స్ సొసైటీ(ఆర్టీజీఎస్) పేరుతో ప్రైవేట్ సంస్థ కార్వీకి ఖజానా నుంచి ప్రభుత్వం అడ్డగోలుగా నిధులు దోచిపెడుతోంది. పేరుకు మాత్రమే ఆర్టీజీఎస్.. కానీ, అది చేసేది కాల్‌సెంటర్ పని. ‘1100’ కాల్ సెంటర్ నిత్యం 24 గంటలూ పని చేస్తోందంటూ రాష్ట్ర ప్రభుత్వ పెద్దలు గొప్పలు చెప్పుకోవడంపై సర్వత్రా ఆశ్చర్యం వ్యక్తమవుతోంది. 24 గంటలు పనిచేయడానికి ఇదేమైనా పోలీసు స్టేషనా? లేక ఆసుపత్రా? అంటూ పలువురు ప్రశ్నిస్తున్నారు. 24 గంటలు పని అంటే రాత్రి 12 తరువాత కూడా ప్రజలు ఫోన్ చేసి, తమ సమస్యలు చెప్పుకుంటునాజ్నరా? కాల్ సెంటర్ సిబ్బంది అర్ధరాత్రి తరువాత కూడా ఫోన్ చేస్తే స్పందిస్తున్నారా? అన్న అనుమానాలు తలెత్తుతున్నాయి. అవన్నీ బోగస్ లెక్కలు జనం అర్ధరాత్రి తర్వాత కూడా ఫోన్లు చేస్తున్నారా? ఎవరి చెవిలో పువ్వులు పెడుతున్నారంటూ ఇటీవలి వరకు సీఎస్‌గా పనిచేసిన సీనియర్ ఐఏఎస్ అధికారి వ్యాఖ్యానించారు. రోజుకు 20 లక్షల మందికి ఫోన్ చేస్తున్నారని ఆర్టీజీఎస్ అధికారులు చెప్పడంపైనా ఆయన విస్మయం వ్యక్తం చేశారు. ఆర్టీజీఎస్ పనితీరు గొప్పగా ఉందంటూ అధికారులు వివరించగా, నీతి ఆయోగ్ వైస్ చైర్మన్ రాజీవ్ కుమార్ స్పందిస్తూ.. ప్రతిరోజూ లక్షల మంది ఫోన్లు చేయడం సాధ్యమేనా? థర్డ్‌పార్టీ ప్రమేయం లేకుండా మీకు మీరే సర్టిఫికెట్లు ఇచ్చుకోవడమేమిటని ప్రశ్నించారు. నామినేషన్‌పై నిధుల పందేరం ‘1100’ కాల్ సెంటర్ మూడు షిఫ్ట్‌ల్లో 24 గంటలూ పని చేస్తుందని అధికారులు అంటున్నారు. ఉదయం 7 నుంచి మధ్యాహ్నం 3 వరకు ఒక షిఫ్ట్, మధ్యాహ్నం 3 గంటల నుంచి రాత్రి 11వరకు మరో షిఫ్ట్, రాత్రి 11 గంటల నుంచి ఉదయం 7 వరకు మరో షిఫ్ట్‌లో ఈ కాల్ సెంటర్ పనిచేస్తోందని చెబుతున్నారు. అంటే రాత్రి 11 గంటల నుంచి ఉదయం 7 లోపు కాల్ సెంటర్ నుంచి ఫోన్లు చేస్తే ఎవరైనా స్పందిస్తారా? లేక ఎవరైనా రాత్రి 11 గంటల నుంచి ఉదయం 7 మధ్య కాల్ సెంటర్‌కు ఫోన్ చేస్తారా? అనేది మిలియన్ డాలర్ల ప్రశ్నగా మారింది. ఆర్టీజీఎస్ సేవల కోసం చంద్రబాబు సర్కారు కార్వీ సంస్థకు నామినేషన్‌పై ఇప్పటిదాకా రూ.295.38 కోట్లు దోచిపెట్టింది. గత రెండు ఆర్థిక సంవత్సరాల్లోనూ బడ్జెట్లో భారీగా నిధుల కేటాయింపులు చేశారు. ఆర్టీజీఎస్కు 2018–19 బడ్జెట్లో రూ.175 కోట్లు, ప్రస్తుత ఆర్థిక సంవత్సరం బడ్జెట్లోనూ రూ.175 కోట్లు కేటాయించారు. -
‘కాల్‌సెంటర్ల గుప్పిట్లో 14 లక్షల మంది డేటా’
సాక్షి, న్యూఢిల్లీ : ఎంబీఏ చదివిన ఓ యువకుడు 14 లక్షల మంది ఈకామర్స్ కస్టమర్ల డేటాను తస్కరించి మోసపూరిత కాల్సెంటర్లకు విక్రయించి సొమ్ముచేసుకున్న ఉదంతం వెలుగుచూసింది. ఈ హైటెక్ మోసగాడిని నోయిడాలోని తన కార్యాలయంలో పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కస్టమర్లను బురిడీ కొట్టించేందుకు ఏర్పాటైన మోసపూరిత కాల్సెంటర్లకు అక్రమంగా డేటాను విక్రయిస్తున్నాడనే ఆరోపణలపై నందన్ రావు పటేల్ అనే యువకుడిని పోలీసులు వలపన్ని పట్టుకున్నారు. డేటా చోరీపై కస్టమర్లతో పాటు పలు బ్యాంకులూ ఫిర్యాదు చేయడంతో అమిటీ యూనివర్సిటీలో ఎంబీఏ ఫైనల్ ఇయర్ చదువుతున్న బిహార్‌కు చెందిన నిందితుడిని అరెస్ట్ చేసి రెండు మొబైల్ ఫోన్లు, 14 లక్షల మంది కస్టమర్ల డేటాతో కూడిన ల్యాప్‌టాప్‌ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. కాగా తాను ఓ ఆన్లైన్ షాపింగ్ సైట్ ఉద్యోగుల సహకారంతో ఒక్కో కస్టమర్ డేటాను రూ 2-3కు సేకరించి నకిలీ కాల్సెంటర్లకు ఒక్కో కస్టమర్ డేటాను రూ 5-6కు విక్రయించేవాడినని నిందితుడు అంగీకరించాడని నోయిడా అడిషనల్ ఎస్పీ విశాల్ విక్రం సింగ్ వెల్లడించారు. -
‘రుణాల’ సూత్రధారి రాజేష్!
సాక్షి, సిటీబ్యూరో: ఫోన్‌కాల్స్ ద్వారా ఎర వేసి, తక్కువ వడ్డీకి రుణాలంటూ ఆశపెట్టి అందినకాడికి దండుకునే కాల్ సెంటర్ నేరాలను చెన్నై వాసి రాజేష్ సూత్రధారిగా తేలింది. అతడి నేతృత్వంలో సిటీలోని రెండు కాల్ సెంటర్లు పని చేస్తున్నట్లు సైబర్ క్రైమ్ పోలీసులు గుర్తించారు. ఎలైట్ కనెక్ట్ కేర్ ప్రైవేట్ లిమిటెడ్ పేరుతో, మహేంద్ర ఫైనాన్స్ ద్వారా రుణాలంటూ మోసాలు చేయడంతో ఇతడిపై గతంలో తమిళనాడులో కేసు నమోదైంది. ఆ కేసులో అరెస్టైన అతను బెయిల్‌పై బయటకు వచ్చి హైదరాబాద్‌ను టార్గెట్‌గా చేసుకున్నాడు. ప్రస్తుతం అజ్ఞాతంలోకి వెళ్లిపోయిన రాజేష్ కోసం సిటీ నుంచి వెళ్లిన రెండు ప్రత్యేక బృందాలు ముమ్మరంగా గాలిస్తున్నాయి. హైదరాబాద్‌లోని బంజారాహిల్స్, పంజాగుట్ట ప్రాంతాల్లో రెండు కాల్సెంటర్లను ఏర్పాటు చేసిన ఈ ముఠా 600 మంది నుంచి రూ. 25 కోట్లు కొల్లగొట్టిన విషయం తెలిసిందే. ఈ కేసులో సూత్రధారిగా భావిస్తున్న చెన్నైకి చెందిన రాజేష్ ఈ రెండు సెంటర్ల నిర్వాహణ బాధ్యతలను పర్యవేక్షిస్తున్నట్లు పోలీసుల విచారణలో తేలింది. రాజేష్‌తో పాటు మరో నలుగురిపై తమిళనాడులోని తిరుచ్చి పోలీస్‌స్టేషన్‌లో గత ఏడాది కేసు నమోదైంది, అప్పట్లో అరెస్టైన ఈ గ్యాంగ్ కొన్నాళ్ల పాటు జైల్లో ఉంది. ఆ ప్రాంతంతో పాటు చెన్నైలోనూ ఇదే తరహాలో మహేంద్ర ఫైనాన్స్ సంస్థ పేరుతో రుణాలు ఇప్పిస్తామంటూ అనేక మందికి ఫోన్లు చేయించి, వారి బ్యాంకు ఖాతా వివరాలను తెలుసుకొని, ఆయా ఖాతాల్లో ఉన్న డబ్బును కాజేశారు. తమిళనాడులో కాల్ సెంటర్ నిర్వహణకు వేరే రాష్ట్రానికి చెందిన సిమ్‌కార్డులను ఉపయోగించారు. ఇలా 8 నెలల పాటు తమిళనాడులోని చెన్నై, తిరుచ్చిల్లో కాల్‌సెంటర్లు నిర్వహించారు, అక్కడి పోలీసులకు ఫిర్యాదు అందడంతో అరెస్టైన రాజేష్ గ్యాంగ్ కొన్నాళ్ల పాటు జైల్లో ఉంది. బెయిల్‌పై బయటకు వచ్చిన తర్వాత తాత్కాలికంగా తమిళనాడులో దందాకు బ్రేక్ వేసింది. వారి దృష్టి హైదరాబాద్‌పై పడటంతో ఇక్కడ కాల్ సెంటర్లు ఏర్పాటు చేయాలని పథకం పన్నారు. బంజారాహిల్స్, పంజాగుట్టలోని కాల్సెంటర్లలో మేనేజర్లుగా పనిచేస్తున్న ఎ.ఆశకుమారీ, రంగస్వామి గోపి రాజేష్‌కు టచ్‌లో ఉంటూ టెలీ కాలర్స్‌తో చేయించేవారు. రాజేష్ చెన్నైలోనే ఉంటూ ఇక్కడి వ్యవహారాలను పర్యవేక్షించేవాడు. శనివారం ఈ రెండు కాల్సెంటర్లపై హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు దాడులు నిర్వహించి ఎనిమిది మందిని అరెస్టు చేయడంతో పాటు మరో 54 మందికి నోటీసులు ఇచ్చారు. ఈ విషయం తెలుసుకున్న రాజేష్ అండ్ కో సిటీ నుంచి సైబర్ క్రైమ్ పోలీసులు అక్కడికి చేరుకునేలోపే అజ్ఞాతంలోకి వెళ్లిపోయింది. ప్రస్తుతం తమిళనాడులో మకాం వేసిన రెండు ప్రత్యేక బృందాలు వీరి కోసం ముమ్మరంగా గాలిస్తున్నాయి. ఈ ముఠా గతంలో ఎక్కడకెక్కడ ఇలాంటి కాల్‌సెంటర్లు నిర్వహించింది? ఎంతమందిని మోసం చేశారు? నగదు ఎక్కడకు వెళ్లింది? తదితర విషయాలపై సైబర్ క్రైమ్ పోలీసులు దృష్టి పెట్టారు. బాధితుల డబ్బు మళ్లించుకుని వాలెట్స్ నుంచి వివరాలు వస్తే దీనిపై ఓ స్పష్టత వస్తుందని దర్యాప్తు అధికారులు చెబుతున్నారు. నగరంలోని రెండు కాల్‌సెంటర్స్‌లో పనిచేసే సిబ్బందికి రాజేష్ చెన్నై నుంచే సిమ్‌కార్డులను పంపేవాడు. ఈ ఫోన్ నెంబర్ నుంచి కాల్స్ అందుకునే బాధితులు అవి చెన్నై నుంచి వచ్చినట్లే భావించేవారు. రుణాలు కావాలా అంటూ ఫోన్ చేసినప్పుడు, ఎవరైనా తమకు అవసరమని చెప్పడంతోనే ఆనెంబర్లను వేరుగా రాసుకొని, లక్ష్యం పూర్తయ్యే వరకు ఆయా నెంబర్లను పదేపదే చేస్తుండేవారు. ఇందులో భాగంగానే ముందుగా వ్యక్తుల వివరాలు సేకరించి, ఆ తరువాత రుణం మంజూరైందని, మరో రెండు రోజులకు రుణాన్ని బ్యాంకు ఖాతాలో జమచేస్తున్నామని, అందుకు రెండు నెల వారీ వాయిదాలు అడ్వాన్స్‌గా చెల్లించాలని చెప్పి కొల్లగొట్టేస్తున్నారు. ఈ మధ్య కాలంలో బాధితుడు ఎవరైనా ఈ కాల్‌సెంటర్ నెంబర్‌కు ఫోన్ చేస్తే ఎత్తరు. ఈ రకమైన పక్కా ఆదేశాలు వీరికి రాజేష్ నుంచి అందేవి. హైదరాబాద్‌లో మకాం పెట్టిన ఈ గ్యాంగ్ ఎక్కువగా చుట్టుపక్కల ఉన్న గ్రామీణ ప్రాంతాల ప్రజలనే టార్గెట్‌గా చేసుకుందని సైబర్ క్రైమ్ పోలీసులు తెలిపారు. రాజేష్ దొరికితే ఈ స్కామ్‌లో అత్యంత కీలకమైన విషయాలు వెలుగులోకి వస్తాయని అధికారులు పేర్కొన్నారు. -
నకిలీ కాల్‌సెంటర్ గుట్టు రట్టు
నోయిడా: నకిలీ కాల్‌సెంటర్ ద్వారా అమెరికా పౌరులను మోసం చేసి కోట్లు సంపాదిస్తున్న ముఠా గుట్టును నోయిడా పోలీసులు గురువారం రాత్రి రట్టు చేసి, 126 మందిని అరెస్టు చేశారు. రూ. 20 లక్షల నగదు, 312 కంప్యూటర్లను కూడా పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అయితే ప్రధాన నిందితుడు మాత్రం ఇంకా దొరకలేదని చెప్పారు. కాల్ సెంటర్ నుంచి అమెరికా పౌరులకు ఈ ఉద్యోగులు ఫోన్ చేసి ‘మీ సామాజిక భద్రతా సంఖ్యలో లోపాలున్నాయి, కొంత జరిమానా కట్టి పరిస్థితిని చక్కదిద్దుకోండి, లేదంటే అరెస్ట్ తప్పదు’ అని బెదిరించారు. భయంతో వారంతా ‘ప్లే స్టోర్ కార్డ్’ల రూపంలో డబ్బు చెల్లించారు. సగటున ఈ కాల్ సెంటర్ ద్వారా ఒక రోజులో 50 వేల డాలర్లను వీరు అక్రమంగా సంపాదించారని పోలీసులు చెప్పారు. -
అమ్మాయిలను సమకూరుస్తామంటూ మోసాలు..
సాక్షి, హైదరాబాద్ : డేటింగ్ రాకెట్‌ను నిర్వహిస్తున్న ఐదుగురు బెంగాలీలను సైబర్‌క్రైం పోలీసులు మంగళవారం అరెస్టు చేశారు. నిందితులు టెలీకాలర్స్ పేరుతో యువతుల్ని జాబ్‌లో చేర్పించుకుని డేటింగ్ సైట్లను నిర్వహిసున్నారని సైబరాబాద్ కమిషనర్ వీసీ సజ్జనార్ తెలిపారు. భారీ స్థాయిలోకాల్ సెంటర్లు ఏర్పాటు చేసి డేటింగ్ రాకెట్ నడుపుతున్నారని వెల్లడించారు. ముఠా సూత్రధారి దేబశిష్ ముఖర్జీతో సహా ఫజుల్ హాక్, సందీప్ మిత్ర, యువతులు అనిత డెయ్, నీత శంకర్లను అరెస్టు చేశామని తెలిపారు. గెట్ యువర్ లేడీ, వరల్డ్ డేటింగ్, మై లవ్ పేర్లతో డేటింగ్ సైట్లు క్రియేట్ చేసి యువతుల్ని సమకూరుస్తామంటూ.. వేలకు వేలు డబ్బులు వసూలు చేసినట్టు గుర్తించామన్నారు. 20 కాల్ సెంటర్లను ఏర్పాటు చేసి అమాయకులను బురిడీ కొట్టించారని పోలీసులు తెలిపారు. కాల్ సెంటర్లకు సంబంధించిన మెటీరియల్ సీజ్ చేశామని తెలిపారు. అపరిచిత కాల్స్ పట్ల అప్రమత్తంగా ఉండాలని సైబర్ మోసాలకు బలికావద్దని ప్రజలకు కమిషనర్ సూచించారు. -
మరో భారీ కాల్ సెంటర్ స్కాం వెలుగులోకి
షికాగో: కోట్లాది రూపాయల కాల్ సెంటర్ల స్కాం సంచలనం రేపింది. భోపాల్‌లో నకిలీ కాల్ సెంటర్ కుంభకోణం ఒకటి తాజాగా వెలుగులోకి వచ్చింది. అహ్మదాబాద్‌లోని అయిదు కాల్ సెంటర్ ఆపరేటర్లు, మరో ఏడుగురు వ్యక్తులు 2వేలకు పైగా అమెరికన్లను నిలువునా ముంచేశారు. ఈ మేరకు అమెరికా న్యాయవిభాగం శుక్రవారం ఒక ప్రకటన జారీ చేసింది. ఏడుగురు భారతీయులతో సహా 15 మందిపై కేసు నమోదు చేసినట్టు తెలిపింది. 5.5 మిలియన్‌డాలర్ల మేర నష్టపోయినట్టు వెల్లడించింది. 2012 , 2016 మధ్యకాలంలో అంతర్గత రెవెన్యూ సర్వీస్ (ఐఆర్ఎస్) లేదా పే డే రుణాల పేరుతో బాధితులను మోసగించారని అటార్నీ బైయుంగ్ జే పాక్ తెలిపారు. అంతేకాదు రుణాలు చెల్లించకపోతే అరెస్టు, జైలు శిక్ష, పన్నుఎగవేత జరిమానాల పేరుతో బెదిరంపులకు పాల్పడ్డారని చెప్పారు. ఈ స్కామ్‌కు సంబంధించి అమెరికాలో ఏడుగుర్ని అరెస్ట్ చేశారు. ముఖ్యంగా ఎక్సలెంట్ సొల్యూషన్స్, ఏడీఎన్ ఇన్ఫోటెక్ ప్రైవేట్ లిమిటెడ్, ఇన్ఫోస్ బీపీవో సొల్యూషన్స్ ప్రైవేట్ లిమిటెడ్, అడోర్ ఇన్ఫోసోర్స్, సురిక్ బీపీవో సర్వీసెస్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థలు ఇందులో ఉన్నాయి. శైలేష్ కుమార్ శర్మ, దిలీప్ కుమార్ కొద్వాని, రాధీరాజ్ నటరాజన్, శుభం శర్మ, నీరవ్ జనక్‌భాయ్ పాంచల్, అతార్ పర్వేజ్ మన్సూరి, మొహమ్మద్ సమీర్, మొహమ్మద్ కజిమ్, మొహమ్మద్ సోజాబ్ మోమిన్, రోడ్రిగో లియోన్ కాస్టిల్లో, డెవిన్ బ్రాడ్ఫోర్డ్ పోప్, నికోలస్ అలెజాండర్ డీన్, డ్రూ కైల్ రికిన్స్, జాంట్జ్ పర్రిష్ మిల్లర్ నిందితులుగా ఉన్నారని పాక్ తెలిపారు. -
ఇక కాల్సెంటర్లలో ఆర్టిఫిషియల్ ఇంటలిజెన్స్..!
కాల్‌సెంటర్లలోనూ కృతిమమేథ (ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ఏఐ) వినియోగానికి రంగం సిద్ధమైంది. త్వరలోనే కాల్సెంటర్లలో వివిధ సేవలకు కృత్రిమమేథను ఉపయోగించబోతున్నారు. ‘కాంటాక్ట్ సెంటర్ ఏఐ’ అనే సాఫ్ట్వేర్ ద్వారా వినియోగదారుల నుంచి వచ్చే ఫోన్‌కాల్స్‌ను కాల్‌సెంటర్ ఉద్యోగుల అవసరం లేకుండానే వాటంతటవే మనుషుల మాదిరిగానే జవాబులిచ్చేలా సిద్ధం చేశారు. కాల్సెంటర్లలో విధులు మరింత సులభతరం చేయడంతో పాటు కొన్ని సేవల స్థానంలో ఉపయోగించేందుకు వీలుగా సిస్కో, జెనిసిస్, తదితర భాగస్వాములతో కలిసి కృతిమమేథ సాంకేతికతను తయారుచేస్తున్నట్లు గూగుల్సంస్థ ప్రకటించింది. కస్టమర్ అడిగిన ప్రశ్నకు లేదా కోరిన సమాచారానికి ఏఐ సరైన సమాధానాన్ని ఇవ్వలేని పక్షంలో దానికంతట అదే కాల్‌సెంటర్ ఉద్యోగికి ఫోన్ బదిలీ అవుతుందని గూగుల్ చీఫ్ సైంటిస్ట్ ఫీఫీ లీ తెలిపారు. కాల్సెంటర్లకు వచ్చే ఫోన్లను మొదట ఈ కృత్రిమమేథతో పనిచేసే ‘వర్చువల్ ఏజెంట్’ అందుకుంటుంది. తన వద్దనున్న సమాచారం మేరకు కస్టమర్ల ప్రశ్నలకు సమాధానం చెబుతుంది. తను సమాధానం చెప్పలేని పరిస్థితుల్లో దానంతట అదే ఫోన్‌కాల్‌ను కాల్‌సెంటర్ ఉద్యోగికి ట్రాన్స్ఫర్ చేస్తుంది. తరువాత కూడా కాల్‌సెంటర్ ఉద్యోగికి అవసరమైన సమాధానాలు, సమాచారాన్ని అందజేస్తూ కస్టమర్లను సంతృప్తి పరిచే ప్రయత్నం చేస్తుంది. అప్పటికప్పుడు తలెత్తే పరిస్థితులకు తగ్గట్టుగా ‘కాల్పనిక ఏజెంట్లు’, కాల్‌సెంటర్ ఉద్యోగులు తమ పాత్రలు పోషిస్తారు. తమ డేటా గోప్యత, నిర్వహణ విధానాలకు లోబడే దీనిని తయారుచేసినట్టు, చిల్లవ వ్యాపారం మొదలుకుని వ్యవసాయం, విద్య, ఆరోగ్యసేవలు ఇలా ప్రతి రంగం, ప్రతీ వ్యాపారానికి ఏఐ ద్వారా సాధికారతను అందించడమే తమ ధ్యేయమని లీ పేర్కొన్నారు. కృత్రిమ మేథ సాంకేతికతలో ఇప్పటికే పై చేయి సాధించిన, గూగుల్ కొత్త కొత్త టూల్స్ విడుదల చేస్తూ ఇతరరంగాలకు విస్తరిస్తోంది. ఏఐ అనేది ప్రస్తుతం సాంకేతిక ప్రపంచానికే పరిమితం కాలేదని, ప్రతీరంగంలోనూ నూతనత్వాన్ని ప్రవేశపెట్టి, వాటి ద్వారా ఆయా వ్యాపారాలు లాభపడేలా కొత్త కొత్త పరికరాలు సిద్ధం చేస్తున్నట్లు లీ వెల్లడించారు. ప్రస్తుతం కాల్‌సెంటర్ ఏఐ సాఫ్ట్‌వేర్‌ను తమ భాగస్వాముల ద్వారా ప్రయోగాత్మకంగా పరీక్షిస్తున్నట్టు, ఏవైనా సమస్యలు తలెత్తుతాయా అన్నది సరిచూసుకున్నాక దానిని అమల్లోకి తీసుకురానున్నట్టు ఆమె ప్రకటించారు. ఏఐ కారణంగా ఐటీలోని కొన్ని సాధారణ ఉద్యోగాలు తెరమరుగవుతాయని నిపుణులు చెబుతున్నారు. ఈ సాఫ్ట్‌వేర్‌తో కాల్‌సెంటర్ ఉద్యోగాలకూ ఎంతో కొంత మేర ముప్పు ఏర్పడుతుందనే చర్చ సాగుతోంది. -
భారత సంతతి వ్యక్తులకు జైలు
న్యూయార్క్: అమెరికాలో వేల మంది నుంచి కోట్ల డాలర్లను కాజేసిన కాల్‌సెంటర్ కుంభకోణం కేసులో 21 మంది భారత సంతతి వ్యక్తులకు కనిష్టంగా 4 ఏళ్ల నుంచి గరిష్టంగా 20 ఏళ్ల వరకు జైలు శిక్ష పడింది. శిక్షాకాలం పూర్తయిన తర్వాత 21 మందిలో చాలా మందిని అధికారులు భారత్‌కు పంపనున్నారు. ఇదే కేసులో గతంలోనూ ముగ్గురు భారతీయ నేరస్తులకు శిక్షపడగా, ఇటీవల మరో 21 మందికి కూడా శిక్షలు ఖరారయ్యాయి. ఈ సందర్భంగా అమెరికా అటార్నీ జనరల్ జెఫ్ సెసన్స్ మాట్లాడుతూ వృద్ధులను, అమాయకులను మోసగించే వారిపై పోరాటంలో ఇదో కీలక విజయమని పేర్కొన్నారు. ‘అమెరికాలోని వృద్ధులు, చట్టబద్ధంగా ఉంటున్న వలసదారులు జీవితమంతా కష్టపడి సంపాదించుకున్న డబ్బును కాజేయాలని చూసే మోసగాళ్లంతా ఒకటి గుర్తుంచుకోవాలి. ఇలాంటి మోసాలను అరికట్టేందుకు, నేరగాళ్లను జైళ్లలో పెట్టేందుకు అమెరికా ప్రభుత్వం తన సర్వ శక్తులనూ వినియోగిస్తుంది’ అని సెషన్స్ హెచ్చరించారు. ఈ కేసులో భారత్‌లో ఉంటున్న 32 మందిని కూడా నిందితులుగా చేర్చి, ఐదు కాల్సెంటర్లపై కేసులు నమోదు చేసినప్పటికీ వీరిని ఇంకా కోర్టులో ప్రవేశపెట్టలేదు. కుంభకోణం ఎలా జరిగింది? ఈ కుంభకోణం 2012 నుంచి 2016 మధ్య జరిగింది. ముందుగా నేరగాళ్లు డేటా బ్రోకర్ల ద్వారా అమెరికాలోని వ్యక్తుల సమాచారం సేకరిస్తారు. అందులో నుంచి వృద్ధులు, వలసదారుల ఫోన్ నంబర్లు వెతికిపట్టుకుని వారికి అహ్మదాబాద్‌లోని కాల్‌సెంటర్ల నుంచి ఫోన్ చేస్తారు. తాము యూఎస్సీఐఎస్ (అమెరికా పౌరసత్వ, వలస సేవల విభాగం) లేదా ఐఆర్ఎస్ (అంతర్గత ఆదాయ విభాగం) నుంచి ఫోన్ చేస్తున్నామని అవతలి వాళ్లను నమ్మిస్తారు. ఫోన్ చేసిన వ్యక్తి చెప్పే సమాచారమంతా నిజమే అయ్యుండటంతో బాధితులు నేరగాళ్ల మాటలు నమ్మేవారు. ఏవేవో కారణాలతో వారు ప్రభుత్వానికి కొంత డబ్బు బాకీ పడ్డారనీ, ఆ డబ్బు చెల్లించకపోతే జరిమానాలు వేస్తామనో, అరెస్టు చేస్తామనో, దేశం నుంచి బహిష్కరిస్తామనో చెప్పి వారిని భయభ్రాంతులకు గురిచేసేవారు. డబ్బు చెల్లించేందుకు ఒప్పుకున్న అమాయకుల నుంచి ఆన్లైన్ మనీ ట్రాన్స్ఫర్లు, ప్రీపెయిడ్ పేమెంట్ కార్డులు తదితరాల ద్వారా డబ్బు గుంజేవారు. తాము చెప్పిన ఖాతాలకు బాధితులు డబ్బు పంపిన వెంటనే అహ్మదాబాద్ కాల్సెంటర్లోని వాళ్లు అమెరికాలోని సహ నేరగాళ్లకు ఫోన్ చేస్తారు. వీలైనంత తొందరగా వాళ్లు ఆ డబ్బును వేరే బ్యాంకు ఖాతాల్లోకి మళ్లించేవారు. -
కాల్‌సెంటర్ ‘కాల్’కేయులు!
సాక్షి, హైదరాబాద్: ‘అచ్చం బ్యాంక్ నుంచి ఫోన్‌కాల్ వచ్చినట్లుగానే ఉంటుంది. అవతలి నుంచి మాట్లాడిన టెలికాలర్ క్రెడిట్ కార్డు వివరాలు అప్డేట్ చేస్తామంటూ చెప్పి.. ఖాతాదారుల నుంచి కార్డు వివరాలు, సీవీవీ తీసుకుంటారు. ఇలా వివరాలు చెబుతుండగానే జేశ్రీ డిస్ట్రిబ్యూటర్స్ బ్యాంక్ ఖాతాకు రూ. 8,500లు షాపింగ్ పేరిట బదిలీ అయ్యాయని ఎస్ఎంఎస్లు వస్తాయి. ఇలా 2 వేల మంది నుంచి రూ.5 కోట్లు కాజేశారు. హైదరాబాద్ కేంద్రంగా ఈ మోసాలు సాగుతుండటంతో రంగంలోకి దిగిన సైబరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు 30 మందిని అరెస్టు చేశారు. వీరి నుంచి రూ.80 లక్షల నగదుతో పాటు 2 ల్యాప్‌టాప్‌లు, 15 సెల్ఫోన్లు, ఎస్బీఐ క్రెడిట్ కార్డు ఖాతాదారుల డేటా, కారు స్వాధీనం చేసుకున్నారు. వీరిలో 8 మందిని కీలక నిందితులుగా నిర్ధారించారు. కేసు వివరాలను సైబరాబాద్ కమిషనరేట్ కార్యాలయంలో పోలీసు కమిషనర్ వీసీ సజ్జనార్ బుధవారం మీడియాకు వివరించారు. జీన్స్ వ్యాపారం నుంచి మోసాలవైపు... న్యూఢిల్లీకి చెందిన విజయ్‌కుమార్ శర్మ వీవోపీ పేరుతో జీన్స్ తయారీ వ్యాపారం నిర్వహిస్తూ తరచూ హైదరాబాద్ వచ్చి వెళ్లేవాడు. ఈ క్రమంలోనే గతేడాది జూలైలో సికింద్రాబాద్‌లోని రాంగోపాల్‌పేటలో జేశ్రీ డిస్ట్రిబ్యూటర్స్ పేరుతో వస్త్ర దుకాణం నిర్వహిస్తున్న సందీప్ బజాజ్‌తో పరిచయం ఏర్పడి స్నేహంగా మారింది. తను ఆర్థిక నష్టాల్లో కూరుకుపోయానంటూ విజయ్‌కు సందీప్ వివరించాడు. తాను ఎస్బీఐ క్రెడిట్ కార్డుల పేరుతో మోసపూరిత వ్యాపారం చేసి లక్షలు సంపాదించానని విజయ్ చెప్పడంతో సందీప్ కూడా ఆ వ్యాపారం చేయడానికి ఒప్పుకున్నాడు. ఒక్కరిని మోసగిస్తే రూ.800లు ఇన్సెంటివ్... సందీప్ పేరు మీద డబ్ల్యూడబ్ల్యూడబ్ల్యూ.జేశ్రీ.కామ్, డబ్ల్యూడబ్ల్యూడబ్ల్యూ.జీన్స్లైక్.కామ్‌లను విజయ్ రిజిస్టర్ చేశాడు. అలాగే లావాదేవీల కోసం సందీప్ 3 ఖాతాలను ఈ వెబ్సైట్లతో అనుసంధానం చేశాడు. అప్పటికే బ్యాంక్ ఖాతాదారులను మోసం చేసిన కేసులో గతేడాది ఢిల్లీ పోలీసులకు చిక్కిన విజయ్ కొత్త వ్యాపారం గురించి ఢిల్లీలోనే కాల్సెంటర్లలో పనిచేసిన అభిజిత్ శ్రీవాత్సవ్, అతని భార్య సీతాకుమారి, సోదరుడు అశుతోష్ శ్రీవాత్సవ్‌కు వివరించాడు. ఈ ముగ్గురు వేర్వేరుగా ఈ ఏడాది ఫిబ్రవరి చివరి వారం నుంచి కాల్సెంటర్లను 21 మందితో నిర్వహిస్తూ ఎస్బీఐ క్రెడిట్ కార్డు పాత డేటాబేస్ నుంచి ఖాతాదారుల వివరాలు తెలుసుకొని కాల్ చేయడం మొదలుపెట్టారు. కార్డు నంబర్, ఎక్స్పైరీ డేట్, సీవీవీ, ఓటీపీ నంబర్లు తెలుసుకొని మోసపూరిత లావాదేవీలను జేశ్రీ.కామ్ ఖాతాకు మళ్లించేవారు. ఇలా ఒక్కరి వద్ద నుంచి వివరాలు సేకరించిన టెలికాలర్‌కు రూ.800ల చొప్పున ఇన్సెంటివ్ ఇచ్చేవారు. సందీప్ బ్యాంక్ ఖాతాకు వచ్చిన డబ్బుల్లో తను 15 శాతం ఉంచుకొని మిగిలిన మొత్తాన్ని విజయ్, శ్రీవాత్సవ్ కుటుంబ సభ్యుల ఖాతాలకు బదిలీ చేసేవాడు. ఇలా దాదాపు రూ.5 కోట్ల మేర మోసం చేశారు. అసిస్టెంట్ మేనేజర్ ఫిర్యాదుతో రంగంలోకి... నగదు మాయంపై వందలాది కస్టమర్ల నుంచి ఫోన్‌కాల్స్ వస్తుండటంతో ఎస్బీఐ కార్డు అండ్ పేమెంట్ సర్వీసెస్ ప్రైవేట్ లిమిటెడ్ అసిస్టెంట్ మేనేజర్ మృదుల కొడూరి సైబరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులకు జూన్ 25న ఫిర్యాదు చేశారు. క్రైమ్స్ డీసీపీ జానకి షర్మిలా ఆదేశం మేరకు ఏసీపీ వై.శ్రీనివాస్‌కుమార్ నేతృత్వంలోని బృందం రంగంలోకి దిగి టెక్నికల్ డేటా సహకారంతో సందీప్‌ను కొంపల్లిలో అరెస్టు చేసింది. ఇతడిచ్చిన వివరాలతో ఢిల్లీలో విజయ్, అభిజిత్, సీత, అశుతోష్, ధరమ్‌రాజ్, రెహన్ ఖాన్, విపిన్‌కుమార్‌ను అరెస్టు చేశారు. వీరితో పాటు 22 మంది టెలికాలర్లను కూడా పట్టుకున్నారు. వీరందరినీ ఢిల్లీలోని టీస్ హజారిలో అదనపు ప్రధాన మెట్రోపాలిటన్ మేజిస్ట్రేట్ ముందు హాజరుపరిచారు. ఈ కేసులో కీలక నిందితులైన ఏడుగురిని ట్రాన్సిట్ వారంట్‌పై హైదరాబాద్‌కు తీసుకువచ్చేందుకు కోర్టు అనుమతినిచ్చింది. మిగిలిన 22 టెలికాలర్లను ఈ నెల 23న సైబరాబాద్ సైబర్ క్రైమ్ ఇన్స్పెక్టర్ ముందు హాజరుకావాలని ఆదేశించింది. అయితే ట్రాన్సిట్ వారంట్‌పై నగరానికి తీసుకొచ్చిన ఏడుగురితో పాటు నగరానికి చెందిన సందీప్‌ను కోర్టులో హాజరుపరిచి జ్యుడీషియల్ రిమాండ్‌కు తరలించారు. మరిన్ని వివరాలు రాబట్టేందుకు నిందితులను పోలీసు కస్టడీకి ఇవ్వాలంటూ న్యాయస్థానంలో పిటిషన్ వేస్తామని సజ్జనార్ తెలిపారు. స్వాధీనం చేసుకున్న సొమ్మును మీడియాకు చూపిస్తున్న సైబరాబాద్ సీపీ వీసీ సజ్జనార్ -
కోట్లాది కాల్ సెంటర్ ఉద్యోగాలు గోవిందా..??
సాక్షి, వెబ్ డెస్క్ : గూగుల్ సరికొత్త ఆవిష్కరణ కోట్లాది మంది ఉద్యోగుల పొట్టకొట్టనుందా?. ఈ ఏడాది జరిగిన డెవలపర్స్ కాన్ఫరెన్స్‌లో గూగుల్ ‘డూప్లెక్స్ ఏఐ కమ్యూనికేషన్’ సాంకేతికతను పరిచయం చేసింది. దీని ద్వారా వినియోగదారులు అపాయింట్మెంట్లను, రిజర్వేషన్లను చేసుకోవచ్చని గూగుల్ పేర్కొంది. మరికొన్ని నెలల్లో ఈ టెక్నాలజీని అందుబాటులోకి తీసుకొస్తామని తెలిపింది. అయితే, గూగుల్ డూప్లెక్స్ ఏఐ కమ్యూనికేషన్ ప్రపంచవ్యాప్తంగా కాల్ సెంటర్లలో పని చేస్తున్న ఉద్యోగుల పొట్టకొట్టబోతోందని రిపోర్టు ప్రస్తుతం టెక్నాలజీ ప్రపంచాన్ని కుదిపేస్తోంది. డూప్లెక్స్ ఏఐ ద్వారా వినియోగదారుల ఫిర్యాదులను పరిష్కరించొచ్చని, అచ్చం మనుషుల్లా మాట్లాడుతూ ఈ టెక్నాలజీ యూజర్లు సంతృప్తి పరుస్తుందని సమాచారం. ఇప్పటికే కొన్ని మల్టీనేషనల్ కంపెనీలు డూప్లెక్స్‌ను వారి వారి అప్లికేషన్స్‌కు ఎలా అన్వయించాలా అన్నదానిపై పరిశోధనలు చేస్తున్నట్లు తెలిసింది. కాగా డూప్లెక్స్ ద్వారా కాల్ సెంటర్ ఉద్యోగాలకు ఎసరు వస్తుందనే రిపోర్టులను గూగుల్ ఖండించింది. కేవలం అపాయింట్మెంట్స్, బుకింగ్స తదితర అవసరాలకు మాత్రమే డూప్లెక్స్ ఉపయోగపడుతుందని తేల్చి చెప్పింది. -
భారతీయ కాల్ సెంటర్లకు ముప్పు
వాషింగ్టన్: భారతీయ కాల్ సెంటర్లపై తీవ్ర ప్రతికూల ప్రభావం చూపే బిల్లును అమెరికన్ కాంగ్రెస్‌లో ప్రవేశపెట్టారు. అమెరికన్ కాల్ సెంటర్లను పరిరక్షించాలని డెమొక్రటిక్ సెనేటర్ షెర్రాడ్ బ్రౌన్ ఈ బిల్లులో ప్రతిపాదించారు. ఈ బిల్లు చట్టమైతే భారత్‌లోని కాల్ సెంటర్ ఉద్యోగాలు ప్రమాదంలో పడతాయి. ‘బై అమెరికన్, హైర్ అమెరికన్’ అన్న ట్రంప్ విధానంలో భాగంగా ఈ బిల్లు వచ్చింది. బిల్లు ప్రవేశపెట్టిన సందర్భంగా బ్రౌన్ మాట్లాడుతూ.. ‘చాలాకాలంగా అమెరికా వాణిజ్యం, పన్ను విధానం కార్పొరేట్ వ్యాపారాల్ని ప్రోత్సహించాయి. దీంతో ఓహియోలో వ్యాపార కార్యకలాపాలు మందగించాయి. అమెరికా నౌకల ఉత్పత్తి పరిశ్రమలు మెక్సికోలోని రైనోసాకు, చైనాలోని వుహాన్‌కు తరలిపోయాయి. కాల్ సెంటర్ ఉద్యోగాలు ఇతర దేశాలకు తరలిపోయాయి. ఓహియాలోనూ, దేశవ్యాప్తంగా ఉన్న పలు కాల్ సెంటర్లను చాలా కంపెనీలు భారత్ లేదా మెక్సికోకు తరలించాయి. ఈ ఔట్ సోర్సింగ్ ఉద్యోగాల వల్ల ఎందరో అమెరికన్లు ఉద్యోగాలు కోల్పోయార’న్నారు. బిల్లులో ముఖ్యాంశాలివీ... ♦ భారత్ వంటి దేశాల కాల్ సెంటర్ ఉద్యో గులు తామున్న ప్రాంతాన్ని వినియోగదారులకు కచ్చితంగా తెలపాలి. ♦ వినియోగ దారులకు తమ కాల్‌ను అమెరికాలో ఉన్న సర్వీస్ ఏజెంట్‌కు బదిలీ చేయమని అడిగే హక్కు ఉంటుంది. ♦ ఔట్ సోర్సింగ్ ఉద్యోగాలను విదేశీయులకు కాకుండా అమెరికన్లకు ఇచ్చే కంపెనీలకే ఫెడరల్ కాంట్రాక్టులు ఇచ్చే విషయంలో ప్రాధాన్యం. -
డేంజర్ జోన్లో ఆ ఉద్యోగాలు..
వాషింగ్టన్ : హెచ్1బీ వీసాల నియంత్రణ చేపట్టిన ట్రంప్ సర్కార్ తాజాగా కాల్‌సెంటర్ ఉద్యోగాలను అమెరికన్లకే కట్టబెట్టేలా అడుగులు వేస్తోంది. భారత్‌లో కాల్‌సెంటర్ ఉద్యోగాలు పెనుముప్పును ఎదుర్కోనున్నాయి. విదేశాల నుంచి కార్యకలాపాలు నిర్వహించే కాల్‌సెంటర్ ఉద్యోగులు తమ ప్రదేశాన్ని వెల్లడించడంతో పాటు అమెరికాలోని సర్వీస్ ఏజెంట్‌కు కాల్‌ను బదలాయించాలని కోరే హక్కు కస్టమర్‌కు కల్పించేలా ఓ బిల్లును కాంగ్రెస్ ఆమోదించింది. ఒహియో సెనేటర్ షెరుద్ బ్రౌన్ ఈ బిల్లును ప్రవేశపెట్టారు. కాల్‌సెంటర్ జాబ్స్‌ను అవుట్సోర్స్ చేసే కంపెనీల జాబితాను రూపొందించాలని, ఈ ఉద్యోగాలను విదేశాలకు అవుట్సోర్స్ చేయని అమెరికన్ కంపెనీలకే కాంట్రాక్టుల్లో ప్రాధాన్యత ఇవ్వాలని బిల్లు ప్రతిపాదిస్తోంది. అమెరికాలో కాల్‌సెంటర్ జాబ్స్ కనుమరుగయ్యాయి..ఒహియో సహా అమెరికా అంతటా తమ కాల్ సెంటర్లను మూసివేసిన కంపెనీలు భారత్, మెక్సికోకు తరలించాయని సెనేటర్ బ్రౌన్ ఆందోళన వ్యక్తం చేశారు. కాల్‌సెంటర్ ఉద్యోగుల సేవలను స్వీకరించాల్సి ఉందని, వారి జాబ్‌లను విదేశాలకు ఎగరేసుకుపోరాదని అన్నారు. కాగా ఈ బిల్లు చట్టరూపం దాల్చితే ముఖ్యంగా భారత్‌లో కాల్ సెంటర్ ఉద్యోగాలకు రిస్క్ పొంచి ఉందనే ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. -
పాఠశాల విద్యార్థుల కోసం కాల్‌సెంటర్
సాక్షి, హైదరాబాద్ : పరీక్షల సమయంలో ఒత్తిడిని జయించేందుకు, పరీక్షలపై సలహాలు, కెరీర్, ఇతర విద్యా సంబంధిత విషయాలను తెలుసుకునేందుకు పాఠశాల విద్యా శాఖ విద్యార్థుల కోసం కాల్‌సెంటర్‌ను ఏర్పాటు చేసింది. పాఠశాల విద్యా డైరెక్టరేట్‌లో ఏర్పాటు చేసిన ఈ కాల్‌సెంటర్‌కు (1800 425 7462) ఫోన్ చేసి విద్యార్థులు సలహాలు, సూచనలు పొందవచ్చని పాఠశాల విద్య డైరెక్టర్ కిషన్ వెల్లడించారు. ఈ సదుపాయం మార్చి 12వ తేదీన అందుబాటులోకి వస్తుం దన్నారు. విద్యార్థులే కాకుండా తమ పిల్లల సమస్యలపై తల్లిదండ్రులు కూడా ఉదయం 10:30 నుంచి సాయంత్రం 5 వరకు సంప్రదించవచ్చన్నారు. -
11వేల మంది అమెరికన్లకు శఠగోపం పెట్టిన కాల్‌సెంటర్
పూణెలో సంచలన విషయం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. సుమారు 11వేల మంది అమెరికన్లను మోసం చేసిన కాల్‌సెంటర్ బాగోతాన్ని పోలీసులు గుట్టురట్టు చేశారు. వివరాల్లోకి వెళ్తే పూణెకు చెందిన కాల్‌సెంటర్ చాలా కాలంగా పన్ను కట్టకుండా ఉన్నందుకు జరిమానా కట్టాలంటూ వేలాది మంది అమెరికన్లకు శఠగోపం పెట్టింది. అక్రమంగా కోట్లాది రూపాయలను వెనకేసుకుంది. విషయం పసిగట్టిన అమెరికా ఆదాయశాఖ, ఫెడరల్ ట్రేడ్ కమీషన్లు ఈ అక్రమ లావాదేవీలపై నిఘా ఉంచారు. లక్షలాది డాలర్లు పక్కదారి పట్టడంపై విచారణ చేపట్టిన అమెరికా బృందం పూణె కేంద్రంగా ఈ ఘరానా మోసం జరుగుతోందని గుర్తించారు. వెంటనే పూణె పోలీసులకు విషయం తెలిపారు. రంగంలోకి దిగిన పోలీసులు ఎటువంటి అనుమతులు లేకుండా ఉప్మర్కేట్, కోరేగాన్పార్క్ ప్రాంతంలో నిర్వహిస్తున్న ఓ బోగస్ కాల్ సెంటర్‌ను గుర్తించారు. అనంతరం దాడులు నిర్వహించారు. ఈ దాడుల్లో ముగ్గురు నిందితులను అదుపులోకి తీసుకున్నారు. మరికొందరు నిందితులు పరారీలో ఉన్నారు. బాధితల నుంచి సొమ్ము వసూలు చేయడానికి కాల్‌సెంటర్లు పలు అమెరికా సంస్థల పేరును ఉపయోగించుకొనేవారు. ఫోన్ చేసి ఆదాయపుపన్ను కట్టనందుకు జరిమానా చెల్లించాలంటూ బెదిరించేవారు. దీంతో బాధితులు 500 నుంచి 1000 డాలర్ల వరకూ కాల్‌సెంటర్ చెప్పిన ఖాతాల్లో జమచేసేవారు. ఈ కుంభకోణంపై స్పందించిన పోలీసులు కోట్లాది రూపాయలను మోసం చేసినట్లు గుర్తించారు. పరారీలో ఉన్న నిందితులను పట్టుకున్న అనంతరం పూర్తి వివరాలు వెల్లడిస్తామని పోలీసులు తెలిపారు. -
స్కూళ్లకు కాల్ సెంటర్
సాక్షి, హైదరాబాద్: విద్యాశాఖ హాస్టళ్లలో మౌలిక సదుపాయాలు లేవా..? వాటిని ఎవరికి చెప్పుకోవాలో తెలియక విద్యార్థులు అవస్థలు పడుతున్నారా? ఇకపై వారు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. ఒక్క ఫోన్ చేస్తే చాలు.. సమస్య పరిష్కారం అయ్యే వరకు అధికారులు విద్యార్థులకు అండగా నిలవనున్నారు. ముఖ్యంగా విద్యాశాఖ హాస్టళ్లలో ఉండి చదువుకుంటున్న బాలికలు ఎదుర్కొనే సమస్యలను పరిష్కరించేందుకు ప్రభుత్వం ప్రత్యేక చర్యలు చేపడుతోంది. కస్తూర్బాగాంధీ బాలికా విద్యాలయాలు, మోడల్ స్కూళ్లలోని బాలికల హాస్టళ్లతోపాటు విద్యాశాఖ గురుకులాల్లోని విద్యార్థుల సమస్యల పరిష్కారం కోసం ప్రత్యేకంగా కాల్ సెంటర్ ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. రాష్ట్రంలోని 706 హాస్టల్ వసతిగల విద్యా సంస్థల్లో ప్రత్యేక ఫోన్ సదుపాయాన్ని విద్యాశాఖ త్వరలోనే అందుబాటులోకి తేనుంది. కాల్ సెంటర్‌కు వచ్చిన ఫిర్యాదులను ఎప్పటికప్పుడు పరిష్కరించడం ద్వారా విద్యా సంస్థల్లోని దాదాపు లక్ష మంది బాలికలకు భరోసా కల్పించనుంది. వినడమే కాదు.. పరిష్కారంపైనా చర్యలు రాష్ట్రంలోని 485 కస్తూర్బాగాంధీ బాలికా విద్యాలయాలు (కేజీబీవీ), 192 మోడల్ స్కూళ్లు, మరో 29 గురుకుల పాఠశాలల్లో దాదాపు 1.3 లక్షల మంది విద్యార్థులు ఉన్నారు. ముఖ్యంగా కేజీబీవీలు, మోడల్ స్కూళ్ల హాస్టళ్లలోనే దాదాపు లక్ష మంది బాలికలు ఉన్నారు. వారంతా తమ హాస్టళ్లు, స్కూళ్లలో ఎదుర్కొనే ఎలాంటి సమస్యలైనా సరే ఫిర్యాదు చేసే అవకాశాన్ని విద్యాశాఖ త్వరలోనే అందుబాటులోకి తీసుకురానుంది. విద్యార్థులు చేసే ప్రతి ఫిర్యాదును రికార్డు చేసి అవి పరిష్కారమయ్యే వరకు నిరంతర సమీక్ష నిర్వహించనుంది. ఇందులో భాగంగా ఆయా విద్యా సంస్థల్లో ఏర్పాటు చేసే ఫోన్‌ను పాఠశాల విద్యా డైరెక్టరేట్‌లో ప్రత్యేకంగా ఏర్పాటు చేసే కాల్ సెంటర్‌కు అనుసంధానించనుంది. విద్యార్థి హాస్టల్లోని ఫోన్ రిసీవర్ తీసుకోగానే ఆ ఫోన్ నేరుగా కాల్ సెంటర్‌కు మాత్రమే వెళ్లేలా ప్రత్యేక సాఫ్ట్వేర్ రూపొందిస్తోంది. కాల్ సెంటర్ సిబ్బంది కాల్ రిసీవ్ చేసుకోవడమే కాదు.. దాన్ని సంబంధిత సెక్షన్ అధికారి, సంబంధిత విభాగం ఉన్నతాధికారికి, జిల్లా డీఈవోకు, పాఠశాల ప్రిన్సిపాల్‌కు, పాఠశాల విద్యా డైరెక్టర్‌కు మెసేజ్ రూపంలో పంపిస్తారు. ఇందుకోసం ప్రత్యేకంగా యాప్‌ను రూపొందించనున్నారు. మెసేజ్ రూపంలో వచ్చిన సమస్య పరిష్కారమైందా లేదా అన్నది అందులో అప్డేట్ చేస్తారు. ఆ తరువాత కాల్ సెంటర్ సిబ్బంది సమస్యల పరిష్కారంపై ర్యాండమ్‌గా విద్యార్థులకు ఫోన్ చేసి తెలుసుకొని నివేదికను డైరెక్టర్‌కు అందజేస్తారు. మరోవైపు విద్యార్థులు చేసే ఫిర్యాదులు రికార్డు అయ్యేలా కసరత్తు చేస్తున్నారు. కాల్ సెంటర్, ఎమర్జెన్సీ నంబర్లకే ఫోన్.. పాఠశాలల్లో ఏర్పాటు చేసే ఫోన్ నుంచి కాల్ సెంటర్‌కు, పోలీసు, ఆసుపత్రి, ఫైర్ వంటి ఎమర్జెన్సీ సర్వీసులకు మాత్రమే ఫోన్ వెళ్లే సదుపాయం అందుబాటులో ఉంచేలా ప్రోగ్రాం రూపొందిస్తున్నారు. దానివల్ల విద్యార్థులు ఫోన్‌ను తమ సమస్యలను తెలియజేసేందుకు మాత్రమే ఉపయోగించేలా ఏర్పాట్లు చేస్తున్నారు. కాల్‌సెంటర్ సదుపాయాన్ని జూన్ నుంచి అమల్లోకి తెచ్చేలా చర్యలు వేగవంతం చేసింది. పాఠశాలల వేళలు మినహా మిగతా సమయాల్లో కాల్ సెంటర్ పని చేసేలా ఏర్పాట్లు చేస్తున్నారు. ఉదయం 7 గంటల నుంచి 9 గంటల వరకు, సాయంత్రం 4 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు కాల్ సెంటర్ వేళలు ఉంటే బాగుంటుందని అధికారులు భావిస్తున్నారు. త్వరలోనే దీనిపై నిర్ణయం తీసుకోనున్నారు. -
కాల్ సెంటర్ స్కాంలో భారతీయులు
వాషింగ్టన్: అమెరికాలో కాల్ సెంటర్ స్కాంలో ఓ భారతీయుడు, భారత సంతతికి చెందిన మరో వ్యక్తి తమ నేరాన్ని అంగీకరించారు. గత ఏప్రిల్, జూన్‌లో ఇదే స్కాంలో భారత్‌కు చెందిన పలువురిపై విచారణ జరగగా తాజాగా మోంటూ బారోథ్, నీలేశ్ పాండ్యాలు మనీలాండరింగ్‌కు పాల్పడినట్లు ఒప్పుకున్నారు. యూఎస్ ఫెడరల్ బ్యూరో అధికారులు తెలిపిన వివరాల ప్రకారం.. నిందితులు గుజరాత్‌లోని అహ్మదాబాద్ కేంద్రంగా ఓ కాల్ సెంటర్‌ను ఏర్పాటు చేశారు. దీనిలో పనిచేసే టెలీ కాలర్లు తాము అమెరికా రెవెన్యూ, ఇమిగ్రేషన్, పౌర సేవల అధికారులుగా పరిచయం చేసుకుంటూ బాధితులకు కాల్స్ చేసి అడిగిన డబ్బులు ఇవ్వకపోతే అరెస్టు, దేశ బహిష్కరణ, తదితర శిక్షలు విధిస్తామని బెదిరించారు. దీంతో బాధితులు వివిధ రూపాల్లో డబ్బులు పంపగా నిందితులు వాటిని వివిధ మార్గాల్లో భారత బ్యాంకులకు తరలించారు. -
జీఎస్టీ విచారణల కోసం కాల్ సెంటర్లు
న్యూఢిల్లీ: జూలై 1 నుంచి అమలు కానున్న వస్తు, సేవల పన్ను (జీఎస్టీ)పై సందేహాల నివృత్తి కోసం రెండు కాల్ సెంటర్లను ఏర్పాటు చేస్తున్నారు. పన్ను చెల్లింపుదారుల కోసం ఒక కాల్ సెంటర్, పన్నుల విభాగాల్లో పనిచేస్తున్న అధికారుల కోసం మరో కాల్ సెంటర్‌ను జూన్ 25 నుంచి అందుబాటులోకి తెస్తామని జీఎస్టీ అమలుకు సాంకేతిక సహాయాన్ని అందిస్తున్న సంస్థ జీఎస్టీ నెట్వర్క్ వెల్లడించింది. ఇందుకోసం టెక్ దిగ్గజాలు ఇన్ఫోసిస్, టెక్ మహీంద్రాల సహాయం తీసుకుంటున్నామంది. పన్ను చెల్లింపుదారులకు జీఎస్టీలో నమోదు తదితర అంశాలపై ఏవైనా సందేహాలుంటే 0120–4888999 నంబరును సంప్రదించాలనీ, అలాగే అధికారులకు ఏవైనా సందేహాలుంటే 0124–4479900కు ఫోన్ చేయాలని జీఎస్టీఎన్ వెల్లడించింది. -
మరో భారీ కాల్ సెంటర్ గుట్టు రట్టు
థానే: మహారాష్ట్రలోని థానేలో భారీ నకిలీ కాల్ సెంటర్ రాకెట్ వెలుగులోకి వచ్చింది. థానే క్రైమ్ బ్రాంచ్ పోలీసులు స్థానిక బిపిఓపై దాడిచేయడంతో రాకెట్ గుట్టు రట్టయింది. అమెరికన్లే టార్గెట్‌గా అక్రమాలకు పాల్పడుతున్న కాల్ సెంటర వ్యవరం బట్టబయలైంది. ఈ నకిలీ కాల్ సెంటర్ల ద్వారా అమెరికన్ పౌరులకు భారీ లోన్ల పేరుతో ఎరవేసినట్టునట్టు జాయింట్ కమిషనర్ ఆఫ్ పోలీస్ మధుకర్ పాండే చెప్పారు. మధుకర్ పాండే అందించిన సమాచారం ప్రకారం గత రాత్రి జిల్లాలోని అంబర్‌నాథ్‌లోని ఆనంద్ నగర్ వద్ద మౌంట్ లాజిక్ సొల్యూషన్స్ సంస్థ పై పోలీసులు దాడులు నిర్వహించారు. ఈ దాడుల్లో కొంతమంది మహిళలతోపాటు, 25మందిని అదుపులోకి తీసుకున్నారు. 31 హార్డ్ డిస్క్‌లు మూడు ల్యాప్ టాప్‌లు, ఇతర అనేక డాక్యుమెంట్లను స్వాధీనం చేసుకున్నారు. కొలంబస్ బ్యాంక్‌నుంచి మాట్లాడుతున్నామని నమ్మబలికి, కమీషన్ ముట్టిన అనంతరం బాధితులకు మొఖం చాటేస్తున్నారని తెలిపారు. కాల్ సెంటర్‌కు ఇది 2015 నుంచి ఉనికిలోఉన్న ఈ కాల్ సెంటర్ ద్వారా యజమాని జయా గుంజాల్ నెలకు రూ. 7-8 లక్షలు సంపాదించినట్టు పోలీసులు గుర్తించారు. సిబ్బందికి అమెరికన్ యాసతో శిక్షణ ఇప్పించి మరీ దోపిడీకి పాల్పడుతున్నారని పోలిస్ సీనియర్ అధికారి చెప్పారు. ఈ వ్యవహారంపై శివాజీ నగర్ పోలీస్ స్టేషన్ లో ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ చట్టం, ఇండియన్ టెలిగ్రాఫ్ యాక్ట్ కింద కేసు నమోదు చేసినట్టు చెప్పారు. దర్యాప్తు కొనసాగుతోందన్నారు. కాగా గత ఏడాది, థానే జిల్లాలోని మీరా రోడ్డులో ఇదే తరహా కాల్ సెంటర్ రాకెట్‌ను ఛేదించామని, 75మందిని అరెస్ట్చేశామని పోలీసులు వెల్లడించారు. అప్పట్లో ఈ భారీ స్కాం దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. -
కోహ్లీ దగ్గర కారును కొని గర్ల్‌ఫ్రెండ్‌కి ఇచ్చి..
ముంబయి: గర్ల్‌ఫ్రెండ్‌కు దాదాపు రెండున్నర కోట్ల రూపాయల విలువ చేసే ఆడి కారు బహుమతిగా ఇచ్చిన ఓ వ్యక్తిని థానే పోలీసులు భారీ కుంభకోణం కేసులో అరెస్టు చేశారు. అతడు గిఫ్ట్‌గా ఇచ్చిన కారును స్వాధీనం చేసుకున్నారు. దుబాయి నుంచి బహిష్కరణకు గురై ప్రస్తుతం ముంబయిలో మకాం ఉంటున్న అతడిని కోట్ల విలువ చేసే కుంభకోణానికి పాల్పడినందుకు అరెస్టు చేశారు. వివరాల్లోకి వెళితే.. సాగర్ థక్కర్ అనే వ్యక్తి అలియాస్ షాగీ కలకలం సృష్టించిన కాల్ సెంటర్ స్కామ్‌లో మాస్టర్‌మైండ్‌గా ఉన్నాడు. ఇతడు పాల్పడిన కుంభకోణంలో బాధ్యులైన వారు ఎక్కువగా దక్షిణాసియా వాసులే ఉన్నారు. అది కూడా అమెరికాలో ఉంటున్న దక్షిణాసియా వారినే ఎక్కువగా మోసం చేశాడు. అమెరికా అధికారుల సమాచారం మేరకు 300మిలియన్ల డాలర్లను కొల్లగొట్టాడు. 2013నుంచి అతడు ఈ కుంభకోణానికి తెరతీయగా థానేలోని మిరా రోడ్డులో గత ఏడాది(2016) అక్టోబర్ 4న పోలీసులు నిర్వహించిన దాడులతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది. దీంతో అతడు రెండు రోజుల్లోనే దేశం విడిచి వెళ్లిపోయాడు. ఇటీవలె దుబాయ్ అతడిని దేశం నుంచి బహిష్కరించడంతో తాజాగా అతడిని పోలీసులు ముంబయి విమానాశ్రయంలో అదుపులోకి తీసుకున్నారు. థక్కర్ ముంబయిలో చాలా విలాసవంతమైన జీవితాన్ని గడిపేవాడు. ఇతడికి పెద్ద మొత్తంలో ప్రైవేటు సైన్యం కూడా ఉంది. పోలీసుల వివరాల ప్రకారం ఇటీవల ప్రముఖ క్రికెటర్ విరాట్ కోహ్లీ నుంచి ఆడి ఆర్8కారు రూ.2.5కోట్లకు కొనుగోలు చేసి తన ప్రేయసికి బహుమతిగా ఇచ్చాడు. అయితే, కారు అమ్మిన కోహ్లీకి అతడు మోసగాడని తెలియదని, ఆయన అమాయకుడని థానే పోలీసు చీఫ్ తెలిపారు. -
ఉద్యోగాల పేరుతో నిరుద్యోగులకు గాలం
-
కాల్ సెంటర్లో ‘కేటుగాళ్లు’
► వినియోగదారుల డేటా లీక్ చేస్తోంది బీపీవో ఉద్యోగులే ► దీని ఆధారంగానే స్వాహా చేస్తున్న ‘జమ్‌తార’గ్యాంగ్ ► కరంతాడ్ ద్వయం ఇళ్లల్లో జరిపిన సోదాల్లో ఆధారాలు లభ్యం ► కాల్ సెంటర్ ఉద్యోగులపై చర్యలకు సన్నాహాలు సాక్షి, హైదరాబాద్: జాతీయ బ్యాంకులు తమ ఖాతాదారులకు అవసరమైన సేవలందించడా నికి ఏర్పాటు చేసుకున్న కాల్ సెంటర్ల నుంచే కస్టమర్ల ‘డేటా’ లీక్ అవుతోంది. దీని ఆధారం గానే సైబర్ నేరగాళ్లు ఆయా వినియోగదా రులకు ఫోన్లు చేసి అందినకాడికి దండుకుం టున్నారు. సీసీఎస్ ఆధీనంలోని సైబర్ క్రైమ్ పోలీసులు ఇటీవల అరెస్టు చేసిన కరంతాడ్ ద్వయం కేసులో దీనికి సంబంధించిన కీలకా ధారాలు లభించాయి. ఫిర్యాదు వివరాలు చెప్పడంతో... నగరంలోని డీఆర్డీఏలో పనిచేసే ఓ సైంటిస్ట్ తన సమస్యపై ఎస్బీఐ కాల్ సెంటర్‌కు ఫిర్యా దు చేశారు. 24 గంటల్లోనే ఆయనకు ‘కాల్ సెంటర్’ నుంచి ఫోన్ వచ్చింది. ఫిర్యాదు పరి ష్కరించడానికి ఫోన్ చేశామని చెప్పిన నేరగా ళ్లు.. దానికోసం మరో బ్యాంకు ఖాతా వివరా లు కోరారు. దీంతో తనకు మరో బ్యాంక్‌లో ఉన్న ఖాతా వివరాలు చెప్పారు. ఇలా ఆ సైంటిస్ట్‌ను బుట్టలో వేసుకున్న సైబర్ గ్యాంగ్ ఆయన ఖాతా నుంచి రూ.1.09 లక్షలు కాజేసింది. దీనిపై సైంటిస్ట్ సైబర్ క్రైమ్ పోలీసులను ఆశ్రయించారు. సైంటిస్ట్ కేసు దర్యాప్తులో భాగంగా... ‘బ్యాంక్ కాల్స్’ పేరుతో రెచ్చిపోతున్న ఉదం తాలు ఇటీవల పెరిగిపోయాయి. ఈ నేర గాళ్లలో కొందరు జార్ఖండ్– పశ్చిమ బెంగాల్ మధ్య ఉన్న జమ్‌తార కేంద్రంగా దందాలు సాగిస్తున్నట్లు గుర్తించారు. వీరిని పట్టుకోవడా నికి అక్కడికి వెళ్లిన సైబర్ క్రైమ్ ఇన్స్పెక్టర్ ప్రసాద్ నేతృత్వంలోని ప్రత్యేక బృందం కరంతాడ్లో మనీష్బర్నవాల్, వికాస్కుమార్ రావణిని పట్టుకున్నారు. సైంటిస్ట్ ఖాతా నుంచి డబ్బు కాజేసింది వీరిద్దరే కావడంతో.. కాల్ సెంటర్‌కు ఫిర్యాదు చేసిన 24 గంటల్లోనే విషయం ఎలా తెలిసిందనేది ఆరా తీశారు. మరో కేసు నమోదుకు సన్నాహాలు... మనీష్, వికాస్‌ను లోతుగా విచారించగా.. తమకు బ్యాంక్ కస్టమర్ల సమాచారం కాల్ సెంటర్ నుంచే అందుతోందని అంగీకరించా రు. నష్టపోతున్న వారిలో ఎక్కువగా కొన్ని బ్యాంకుల వినియోగదారులు ఉండటానికీ ఇదే కారణమని పోలీసులు అంచనా వేస్తు న్నారు. ఈ అంశాన్ని పరిగణనలోకి తీసుకున్న అధికారులు సదరు కాల్ సెంటర్ పాత్రనూ కేసులో పొందుపరచాలని నిర్ణయించారు. కాల్ సెంటర్ ఉద్యోగుల్నీ నిందితులుగా చేర్చి అరెస్టు చేయడానికి రంగం సిద్ధం చేశారు. దీనిపై సైబర్ క్రైమ్ ఏసీపీ రఘువీర్ ‘సాక్షి’తో మాట్లాడుతూ.. ‘ఇక్కడ నమోదైన కేసుకు సంబంధించి వినియోగదారుడి సమాచారం మనీష్, వికాస్‌కు ఏ కాల్ సెంటర్ నుంచి అందిందనేది గుర్తించాలి. న్యాయస్థానం అనుమతితో నిందితుల్ని కస్టడీలోకి తీసుకుని ఈ కోణంలో విచారిస్తాం. వివరాలు వెలుగులోకి వచ్చిన తర్వాత చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటాం’అని చెప్పారు. సోదాల్లో దొరికిన ‘కోల్‌కతా నోటీసు’.. మనీష్, వికాస్ ఇళ్లల్లో సోదాలు చేసిన సైబర్ క్రైమ్ పోలీసులకు లభించిన కోల్‌కతా పోలీసుల నోటీసు ‘సమాచారం గుట్టు’ వీడడానికి కీలకమైంది. బెంగాల్‌ల్లో ఎస్బీఐ కాల్ సెంటర్‌ను ఇంటెల్ నెట్ గ్లోబెల్ సర్వీసె స్ బీపీవో సంస్థ నిర్వహిస్తోంది. ఇందులో పని చేసే విధాన్ దాస్ మరికొందరు ఉద్యోగులు సైబర్ నేరగాళ్లకు సహకరిస్తు న్నారు. కస్టమర్ల నుంచి వచ్చే ఫిర్యాదుల సమాచారాన్ని కమీషన్ తీసుకుని మనీష్, వికాస్‌కు అందిస్తున్నారు. ‘లీకేజ్’వ్యవహారా న్ని గతంలోనే గుర్తించిన బ్యాంకు.. కోల్‌కతా పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేశారు. దర్యాప్తులో భాగంగా మనీష్, వికాస్ పేర్లు వెలుగులోకి రావడంతో విచారణకు హాజరుకావాలని నోటీసులు జారీ చేశారు. ఇవే సైబర్ క్రైమ్ పోలీసులకు సోదాల్లో లభించాయి. -
మంగళం!
పాలకొండ రూరల్ : విద్యుత్ వినియోగదారులపై ప్రభుత్వం మరో భారం మోపింది. గతంలో వినియోగదారులు తమ సమస్యలను కాల్ సెంటర్ల ద్వారా ఫిర్యాదు చేసుకుంటే అక్కడి సిబ్బంది సమస్యను అధికారుల దృష్టికి తీసుకువెళ్లి దాని పరిష్కారానికి 24 గంటల్లో చర్యల్లో చేపట్టేవారు. దీనికి సంబంధించి ప్రత్యేక వ్యవస్థ(కాల్‌సెంటర్)ను ఏర్పాటు చేశారు. ప్రభుత్వం తాజాగా తీసుకున్న నిర్ణయంతో ఇకపై ఈ సేవలు దూరం కానున్నాయి. ఇప్పటికే యువత ఉద్యోగాల్లేక, నిరుద్యోగ భృతి కొరవడి ఇక్కట్లు పడుతున్న క్రమంలో ఒక్కొక్కొటిగా కాంట్రాక్ట్ ప్రాతిపదికన భృతి పొందుతున్న వారిపై చర్యలకు దిగడం విమర్శలకు తావిస్తుంది. అయితే కాల్ సెంటర్లలో ప్రస్తుతం పని చేస్తున్న సిబ్బందిని నిలిపి వేయక ప్రస్తుతానికి ప్రత్యామ్నాయం చూపించారు. నియోజకవర్గానికి ఒకటి... జిల్లాలో నియోజకవర్గానికి ఒకటి వంతున 10 సెంటర్ల పరిధిలో విద్యుత్ వినియోగదారులకు సేవలందించేవారు. ఈ సేవలను ఏడు భాగాలుగా విభజించారు. వాటిలో కేటగిరి-1లో సాధారణ గృహాల నూతన మీటర్లు, కేటగిరి రెండులో సాధారణ వ్యాపారాలు(దుకాణాలు), కుటీర పరిశ్రమలు వంటివి, మూడులో ఇండస్ట్రీయల్, నాలుగులో చేతివృత్తులు, ఐదులో వ్యవసాయం, ఆరులో గ్రామీణ పంచాయతీలు, ఏడులో దేవాలయాలు ఉన్నాయి. వీటన్నింటిలో ఏ చిన్న తరహా సమస్యలు తలెత్తిన కాల్ సెంటర్లకు వెళ్లి దరఖాస్తు చేసుకుంటే చాలు సమస్యలు పరిష్కారం అయ్యేవి. ఇప్పుడు ఈ తరహా సేవలను మీ-సేవా కేంద్రాలకు బదలారుుంచారు. ఈ నేపథ్యంలో 7 కేటగిరీల్లో ఉన్న వినియోగదారులు ఇక నూతన మీటర్లు, ట్రాన్సఫార్మర్లు, నూతన విద్యుత్ లైన్లు తదితర అవసరాలకు మీ-సేవా కేంద్రాలకు వెళ్లాల్సిందే! సమస్యలు ఇలా .... ఇకపై వినియోగదారులకు ఎప్పుడు ఏచిన్న సమస్య వచ్చినా అందుబాట్లో ఉన్న మీ-సేవా కేంద్రాలకు వెళ్లాలి. అక్కడ నిబంధనల మేరకు తమ ఫిర్యాదు తీవ్రతను బట్టి కొంత రుసుము వదిలించుకుని ఆన్లైన్లో ఫిర్యాదు నమోదు చేసుకోవాలి. అప్పుడు పరిష్కారం దొరుకుతుంది. అంతవరకు బాగానే ఉన్నా ఈ నూతన విధానంపై మీ-సేవా కేంద్ర నిర్వాహకులకు ఎటువంటి అవగాహనా లేదు. ఇప్పటి వరకు వీరికి ఎటువంటి శిక్షణ ఇచ్చినట్లు సమాచారం లేదు. దీంతో వినియోగదారు తమ సమస్యలు తెలిపేందుకు మీ-సేవకు వెళ్లినా ఫలితం లేక అవస్థలు పడుతున్నారు. మరోవైపు ఈ సేవలు అందించేందుకు మీ-సేవా కేంద్రాల నిర్వాహకులు ముందుకు రాకపోవటం కొసమెరుపు. -
అవినీతి ఫిర్యాదులకు ఒకే నంబర్!
న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా అవినీతిపై ఫిర్యాదులను స్వీకరించడానికి ఒకే ఫోన్ నంబరుతో నిరంతరాయంగా పనిచేసే కాల్ సెంటర్‌ను ఏర్పాటు చేయాలని సీబీఐ భావిస్తోంది. ఫిర్యాదును స్వీకరించిన అనంతరం అది కేంద్ర పరిధిలోకి వచ్చే సంస్థల్లో అవినీతికి సంబంధించినది అయితే సీబీఐ సొంతంగా విచారణ చేపడుతుంది. రాష్ట్ర విభాగాలకు చెందిన ఫిర్యాదు అయితే సంబంధిత రాష్ట్రంలోని అవినీతి నిరోధక విభాగాలకు చేరవేస్తుంది. అనంతరం వాటి పురోగతినీ తెలుసుకుంటూ ఉంటుంది. కేవలం ఫోన్లు మాత్రమే కాకుండా ఈ–మెయిళ్లు, సామాజిక మాధ్యమాల ద్వారా వచ్చే ఫిర్యాదులను కూడా ఇందులో స్వీకరిస్తారు. -
స్కాం చేసి కొన్న కారు కోహ్లీదే!
న్యూఢిల్లీ : కాల్ సెంటర్ స్కాంతో అమెరికన్ వాసుల కోట్ల రూపాయలు కొల్లగొట్టిన సాగర్ థక్కర్ అలియాస్ షాగీ, రూ.2.5 కోట్ల ఆడీ ఆర్8 కారును ఎవరి వద్ద నుంచి కొన్నాడో తెలుసా? భారత టెస్ట్ క్రికెట్‌కు సారథిగా వ్యవహరిస్తున్న విరాట్ కోహ్లి నుంచి ఈ కారును కొనుగోలు చేసినట్టు తెలిసింది. అక్రమ సంపాదనతో కొనుగోలు చేసిన ఈ కారును హర్యానాలో దాచిపెట్టినట్టు పోలీసులు తెలిపారు. ఆ కారును గురువారం అహ్మదాబాద్‌లో థానే పోలీసులు సీజ్ చేశారు. గత మేలో కోహ్లీ నుంచి థక్కర్ ఈ కారును కొనుగోలు చేశారని, అయితే సాగర్ పాల్పడుతున్న ఈ స్కాం గురించి కోహ్లీకి తెలియక అతనికి విక్రయించాడని థానే పోలీసు కమిషనర్ పరమ్ బిర్ సింగ్ తెలిపారు. కాల్ స్కాంలో కొల్లగొట్టిన డబ్బుతోనే ఈ ఆడీ ఆర్8 కారును కొనుగోలుచేశాడని పేర్కొన్నారు. విచారణ ప్రక్రియలో భాగంగా పలు ఆశ్చర్యకరమైన విషయాలు వెలుగులోకి వస్తున్నట్టు చెప్పారు. షాగికి హైఎండ్ కార్లంటే చాలా ఇష్టమని, తన అదృష్టాన్ని పరీక్షించుకోవడం కోసం విరాట్ కోహ్లీ నుంచి ఈ కారును కొన్నట్టు పోలీసులు పేర్కొన్నారు. అక్టోబర్4న ఈ స్కాం బయటపడింది. ముంబైలోని మిరా రోడ్లో ఏడంతుల భవనంలో కొంతకాలంగా కాల్ సెంటర్లు నడపుతూ విదేశీయులకు ఇన్కమ్ టాక్స్ ఆఫీసర్లమంటూ ఫోన్లు చేస్తూ వారి నుంచి వందల కోట్ల రూపాయలను దోచేసిన సంగతి తెలిసిందే. మొత్తం 6వేల మంది అమెరికన్లు తమ సంపాదనను భారీగా కోల్పోయారు. ఈ స్కాం ప్రధాన సూత్రధారి శగ్గిపై పోలీసులు విచారణ చేపట్టారు. ఫెడరల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేటివ్(ఎఫ్‌బీఐ) కూడా ఈ స్కాంపై విచారణ చేపడుతోంది.(చదవండి.... స్కాం చేసి.. గర్ల్‌ఫ్రెండుకు 2.5 కోట్ల కారు గిఫ్ట్) -
కాల్‌సెంటర్ స్కామ్ 2 వేల కోట్లపైనే
-
కాల్‌సెంటర్ స్కామ్ 2 వేల కోట్లపైనే
► అమెరికా హోంల్యాండ్ సెక్యూరిటీ వెల్లడి ► ఎఫ్‌బీఐ అదుపులో హైదరాబాదీ భోగవల్లి నరసింహ ► టెక్సాస్ రాష్ట్రం ఇర్వింగ్‌ను చిరునామాగా పేర్కొన్న భోగవల్లి ► ఐఆర్ఎస్ ఏజెంట్ల పేరిట బెదిరింపులు, ఆపై వసూళ్లు ► అతని ఖాతాల్లో కోట్లు జమచేసిన అమెరికన్లు ► నగదును భారత్‌కు బదిలీ చేశాడంటూ ఎఫ్‌బీఐ అభియోగాలు వాషింగ్టన్, డల్లాస్: భారత్ కేంద్రంగా సాగిన కాల్‌సెంటర్ కుంభకోణం విలువ రూ. 2 వేల కోట్లకు పైనేనని అమెరికా అధికారులు నిర్ధారించారు. ఐదు కాల్ సెంటర్లు వేలాది మంది అమెరికా పౌరులను మోసం చేసి ఈ మొత్తాన్ని అక్రమంగా వసూలు చేశాయని, దొంగిలించాయని అమెరికా హోంల్యాండ్ సెక్యూరిటీ సెక్రటరీ జే జాన్సన్ తెలిపారు. ఈ కేసులో ఇంతవరకూ అమెరికాలో 20 మంది అరెస్టు కాగా, అందులో భారతీయులే అధికంగా ఉన్నారని ఆయన వెల్లడించారు. హెచ్ గ్లోబల్, కాల్‌మంత్ర, వరల్డ్‌వైడ్ సొల్యూషన్స్, జోరియన్ కమ్యూనికేషన్స్, శర్మ బీపీవో సర్వీసెస్ పేరుతో కాల్‌సెంటర్ల నుంచి ఈ ఫోన్‌కాల్స్ వెళ్లాయని ఆయన పేర్కొన్నారు. ఇవన్నీ అహ్మదాబాద్ కేంద్రంగా పనిచేశాయి. మరోవైపు ఈ కుంభకోణంలో రోజుకో కొత్త అంశం వెలుగు చూస్తోంది. కీలక సూత్రధారుల్లో ఒకరైన హైదరాబాద్‌కు చెందిన భోగవల్లి నరసింహ(50)ను ఎఫ్‌బీఐ అధికారులు గురువారం అమెరికాలో అదుపులోకి తీసుకున్నారు. చట్టవ్యతిరేక కార్యకలాపాల ద్వారా నగదు కార్యకలాపాలు నిర్వహించాడంటూ ఎఫ్‌బీఐ అతనిపై కేసు నమోదు చేసి టెక్సాస్ రాష్ట్రం నార్తర్న్ జిల్లా మెజిస్ట్రేట్ న్యాయమూర్తి ముందు హాజరుపర్చింది. ఈ మేరకు నార్తర్న్ జిల్లా అటార్నీ శుక్రవారం ప్రకటన విడుదలచేశారు. ఎఫ్‌బీఐ వెల్లడించిన వివరాల మేరకు... అమెరికాకు చెందిన ఆదాయపు పన్ను వసూలు విభాగం ఐఆర్ఎస్(ఇంటర్నల్ రెవెన్యూ సర్వీస్) ఏజెంట్లుగా పేర్కొంటూ కొందరు వ్యక్తులు అమెరికాలో పలువురికి ఫోన్లు చేసి బెదిరించారు. పన్ను చెల్లింపుల్లో లొసుగులున్నాయని, అరెస్టు వారెంట్లు జారీ అయ్యాయంటూ భయపెట్టేవారు. జరిమానా చెల్లించకపోతే జైలుకు పంపుతామంటూ ఐఆర్ఎస్ పేరిట హెచ్చరించారు. మనియార్డర్లు, నగదును తాము పేర్కొన్న బ్యాంకు అకౌంట్లలో జమ చేయాలంటూ వందలాది మందిని మోసగించారు. ఈ బ్యాంకు ఖాతాల్లో కొన్నింటిని భోగవల్లి నియంత్రించేవాడని ఎఫ్‌బీఐ వెల్లడించింది. వెంటనే ఐఆర్ఎస్కు డబ్బు చెల్లించకపోతే... గంటల వ్యవధిలో అరెస్టు చేస్తామని హెచ్చరించి కోట్ల రూపాయలు వసూలు చేసి ఆ డబ్బును భోగవల్లి హవాలా మార్గంలో భారత్‌కు పంపేవాడు. మోసంలో మూడు ఖాతాల వినియోగం బ్యాంక్ ఆఫ్ అమెరికాకు చెందిన రెండు ఖాతాల్ని ఈ మోసంలో భోగవల్లి వినియోగించాడు. అందులో ఒకటి టెక్‌డైనమిక్స్ ఇండస్ట్రీస్ పేరిట, రెండోది టచ్‌స్టోన్ కమోడిటీస్ ఇండస్ట్రీస్ పేరిట ఉంది. భోగవల్లి వాడిన ఇతర ఖాతాల్లో టచ్‌స్టోన్ కమోడిటీస్ పేరిట ఉన్న సిటీ బ్యాంకు అకౌంట్ కూడా ఉంది. నవంబర్ 5, 2014– ఫిబ్రవరి 2, 2015 మధ్య దాదాపు 242 సార్లు భోగవల్లికి చెందిన బ్యాంక్ ఆఫ్ అమెరికా ఖాతాకు నగదు జమైనట్లు గుర్తించారు. వాటి మొత్తం విలువ రూ. 11.29 కోట్లు. ఈ మొత్తంలో 2,250 ప్రత్యేక మనియార్డర్లు కూడా ఉన్నాయి. అలాగే జనవరి 16, 2015–జనవరి 30, 2015 మధ్య దాదాపు 60 మనియార్డర్లు (రూ. 25.81 లక్షలు) మరో బ్యాంక్ ఆఫ్ అమెరికా ఖాతాలో జమయ్యాయి. నవంబర్ 4, 2014– ఫిబ్రవరి 5, 2015 మధ్యలో దాదాపు 128 మనియార్డర్లు (రూ.65.76 లక్షలు) సిటీ బ్యాంక్ ఖాతాకు చేరాయి. ఈ ఖాతాల్లో నగదును భోగవల్లి... తన నియంత్రణలోని ఇతర ఖాతాలకు బదిలీ చేసేవాడు. వాటిని ఖర్చుపెట్టడం లేదా భారత్‌తో పాటు ఇతర దేశాల్లో ఖాతాలకు బదిలీ చేసేవాడు. రెండు కంపెనీలకు అధినేతగా భోగవల్లి రికార్డుల ప్రకారం భోగవల్లి టెక్సాస్ రాష్ట్రంలోని ఇర్వింగ్ పట్టణం చిరునామాతో టచ్‌స్టోన్ కమోడిటీస్‌కు డైరక్టర్‌గా వ్యవహరిస్తున్నాడు. టచ్‌స్టోన్ కమోడిటీస్ ద్వారా ఎగుమతులు, దిగుమతులు వ్యాపారం చేస్తున్నట్లు వెబ్సైట్లో అతను పేర్కొన్నాడు. టెక్‌డైనమిక్స్ వెబ్సైట్ ప్రకారం... ఆ సంస్థకు అధ్యక్షుడు భోగవల్లే... టెక్నాలజీ, అవుట్సోర్సింగ్, కన్సల్టింగ్ సేవల్ని అందిస్తామంటూ అందులో పేర్కొన్నాడు. అందులోను ఇర్వింగ్ పట్టణం చిరునామానే ఇచ్చాడు. -
కాల్‌సెంటర్ స్కాం సూత్రధారి తెలుగువాడేనా?
పుణె కేంద్రంగా సాగిన కాల్‌సెంటర్ స్కాం మొత్తానికి సూత్రధారులు కొందరు అమెరికాలో ఉన్నారని నిన్నమొన్నటి వరకు చెప్పారు. ఇప్పుడు ఆ సూత్రధారుల్లో ఒకరైన భోగవల్లి నరసింహ (50)ని అమెరికా పోలీసులు అరెస్టుచేశారు. ఇంటర్నల్ రెవెన్యూ సర్వీస్ (ఐఆర్ఎస్) అధికారులుగా నటిస్తూ కొంతమంది అమెరికన్ పౌరులకు ఫోన్లు చేసి.. పన్ను ఎగవేతలకు పాల్పడినందుకు మీపై వారంట్లు పెండింగులో ఉన్నాయని, వెంటనే తాము చెప్పిన ఖాతాల్లోకి డబ్బు పంపకపోతే అరెస్టు తప్పదని బెదిరించి.. ఏడాది కాలంలోనే దాదాపు రూ. 500 కోట్ల వరకు వెనకేసుకున్నారు. ఇందుకోసం పుణెలో ఏకంగా ఏడంతస్థుల భవనాన్ని తీసుకుని, అందులో రోజుకు మూడు షిఫ్టులలో 24 గంటలు నడిచే కాల్ సెంటర్ ఒకదాన్ని ఏర్పాటు చేశారు. దీనంతటికీ భారతదేశంలో పనిచేసిన వ్యక్తి షాగర్ ఠక్కర్.. అలియాస్ షాగీ కాగా, అతడికి అమెరికాలో సహకరించినవాళ్లలో ప్రధానమైన వ్యక్తులలో ఒకరిగా భోగవల్లి నరసింహను గుర్తించారు. హైదరాబాద్‌కు చెందినట్లుగా చెబుతున్న నరసింహ మొదట్లో ఐబీఎంలో పనిచేసి, తర్వాత సొంతంగా టెక్‌డైనమిక్స్ అనే సంస్థను స్థాపించారు. నరసింహను అమెరికాలో అరెస్టుచేసి కోర్టులో ప్రవేశపెట్టారు. అమెరికా మేజిస్ట్రేట్ జడ్జి పాల్ డి స్టిక్నీ ఎదుట ప్రవేశపెట్టగా, తదుపరి విచారణ జరిగేవరకు పోలీసుల అదుపులో ఉంచాలని ఆదేశించారు. ఐఆర్ఎస్ ఏజెంట్లుగా తమను తాము చెప్పుకొన్న కొందరు.. అమెరికా పౌరులకు ఫోన్లు చేసేవారు. పన్నులు ఎగవేశారని, డబ్బు చెల్లించని పక్షంలో జైలుకు వెళ్లక తప్పదని.. మరి కొంత సేపట్లోనే సోదాలు జరగబోతున్నాయంటూ వాళ్లను భయపెట్టి.. వెంటనే ఖాతాల్లోకి డబ్బు వేయించుకునేవారు. భోగవల్లి నరసింహ తన పేరుమీద ఉన్న టెక్‌డైనమిక్స్ సంస్థ అకౌంటుతో పాటు టచ్‌స్టోన్ కమోడిటీస్ సంస్థ ఖాతాను కూడా ఉపయోగించారు. ఈ స్కాంలో మరికొన్ని ఖాతాలను కూడా ఉపయోగించారని, వాటిలో ఒకటి సిటీబ్యాంక్ అకౌంట్ అని పోలీసులు తెలిపారు. (కాల్‌సెంటర్ కేంద్రంగా.. రూ. 500 కోట్ల దోపిడీ!) 2014 నవంబర్ 5 నుంచి 2015 ఫిబ్రవరి 2వ తేదీ వరకు మొత్తం 242 సార్లు డబ్బులు డిపాజిట్ అయ్యాయని, వాటి మొత్తం విలువ సుమారు రూ. 11 కోట్లని చెప్పారు. బ్యాంక్ ఆఫ్ అమెరికా అకౌంటులో మరో రూ. 10 కోట్లు జమ చేయించుకున్నారు. ఇలా.. రకరకాల బ్యాంకు ఖాతాలతో ఇటు భారతదేశంలోను, అటు అమెరికాలోను కూడా వసూళ్లు సాగించారు. అమెరికాలో వసూలు చేసిన మొత్తాలను కూడా భారతదేశంలోని ఖాతాలకు మళ్లించేవారు. (23 ఏళ్లకే.. రూ. 500 కోట్లు కొట్టేశాడు!) నరసింహ ఏం చేసేవారు? ఇర్వింగ్‌లో ఉన్న టచ్‌స్టోన్ కమోడిటీస్‌లో భోగవల్లి నరసింహ డైరెక్టర్‌గా లిస్ట్ అయినట్లు రికార్డులను బట్టి తెలుస్తోంది. ఆ సంస్థ పేరున అకౌంటు తెరిచేటప్పుడు.. తమది ఎగుమతులు - దిగుమతుల సంస్థ అని ఆయన పేర్కొన్నారు. కంపెనీ వెబ్సైట్లో మాత్రం తమ కంపెనీ ఇనుప ఖనిజం, స్టీలు, చెక్ చిప్స్ లాంటి ఖరీదైన ఉత్పత్తులను సరఫరా చేస్తుందని పేర్కొన్నారు. సంస్థ సైట్లో మాత్రం భోగవల్లిని సంస్థ చైర్మన్‌గా పేర్కొన్నారు. టెక్‌డైనమిక్స్ ప్రెసిడెంటుగా కూడా భోగవల్లి నరసింహ లిస్ట్ అయినట్లు రికార్డులను బట్టి తెలుస్తోంది. ఈ సంస్థ టెక్నాలజీ, ఔట్సోర్సింగ్, కన్సల్టింగ్ అవసరాలు తీరుస్తుందని పేర్కొన్నారు. -
ఆ 61మందిలో ఎక్కువమంది భారతీయులే...
-
ఆ 61మందిలో ఎక్కువమంది భారతీయులే...
వాషింగ్టన్ : అహ్మదాబాద్ కేంద్రంగా సాగిన వందల కోట్ల కాల్ సెంటర్ కుంభకోణంలో 61మంది వ్యక్తులు, సంస్థలపై అమెరికా న్యాయశాఖ గురువారం అభియోగాలు నమోదు చేసింది. వీరిలో ఎక్కువమంది భారతీయులే. ఈ కేసుకు సంబంధించి అమెరికాలో 20మందిని నిన్న అరెస్ట్ చేశారు. వారిలో ఒకరిని ఇమిగ్రేషన్ అధికారులు కస్టడీలోకి తీసుకుని విచారణ జరుపుతున్నారు. కాగా అమెరికా న్యాయ విభాగం అభియోగాలు నమోదు చేసిన పలువురిని ఇటీవలే భారత్ అధికారులు అరెస్ట్ చేశారు. విచారణ కోసం వీరిని అమెరికాకు అప్పగించే అంశంపై చర్చలు సాగుతున్నాయి. కాగా గడిచిన ఏడాది కాలంలో అమెరికన్ పౌరులు దాదాపు రూ. 500 కోట్ల మేర దోపిడీకి గురయ్యారు. అది కూడా ఎక్కడి నుంచో తెలుసా.. భారతదేశంలోని ఒక కాల్ సెంటర్ నుంచి. కాల్ సెంటర్ల ఉద్యోగులు తమను తాము అమెరికా ఇంటర్నల్ రెవెన్యూ సర్వీస్ అధికారులుగా చెప్పుకొంటూ.. పన్నులు ఎగ్గొట్టినందుకు అరెస్టుచేస్తామని బెదిరించి, అలా చేయకుండా ఉండాలంటే 500 నుంచి 3000 డాలర్ల వరకు చెల్లించాలని బెదిరించేవారు. దాంతో దిక్కుతోచని ఆ పౌరులు వీళ్లు చెప్పిన ఖాతాలకు ఆ మొత్తాన్ని పంపేవాళ్లు. ఈ స్కాంపై అమెరికాకు చెందిన పలు ఏజెన్సీలు రంగంలోకి దిగాయి. అయితే కేవలం అమెరికాలోనే కాక.. ఇంగ్లండ్, ఆస్ట్రేలియా పౌరులు కూడా ఈ దోపిడీ బాధితులు కావచ్చని అంటున్నారు. (చదవండి...కాల్ సెంటర్ కేసులో ఐపీఎస్ కొడుకు?) -
కాల్ సెంటర్ కేసులో ఐపీఎస్ కొడుకు?
ముంబై: అమెరికా రెవెన్యూ అధికారులుగా మాట్లాడుతూ అక్కడి ప్రజలను మోసం చేస్తున్న థానే ‘కాల్‌సెంటర్ రాకెట్’కు సంబంధించిన విచారణలో కొత్త కోణం వెలుగులోకి వచ్చింది. ఆ రాకెట్ వెనక గుజరాత్‌కు చెందిన ఓ సీనియర్ ఐపీఎస్ అధికారి కుమారుడి హస్తం ఉందని పోలీసులు అనుమానిస్తున్నారు. మిరా రోడ్లో అక్రమంగా నడుపుతున్న ఏడు కాల్ సెంటర్లపై ఈ నెల తొలి వారంలో క్రైం బ్రాంచి పోలీసులు దాడి చేసి 70 మందిని అదుపులోకి తీసుకున్న విషయం తెలిసిందే. మరో 630మందిపై ఐపీసీ సెక్షన్ 384, 419,429 కింద కేసులు నమోదు చేశారు. అలాగే ఐటీ యాక్ట్, ఇండియన్ టెలిగ్రాఫ్ చట్టం కింద కేసులు నమోదు చేసినట్లు సమాచారం. కాగా ఈ కేసుకు సంబంధించి ఓ సీనియర్ అధికారి మాట్లాడుతూ.. అహ్మదాబాద్‌లో కాల్ సెంటర్లను ఓ సీనియర్ ఐపీఎస్ అధికారి కొడుకు నడిపిస్తున్నట్లు అనుమానిస్తున్నట్లు పేర్కొన్నారు. ఇందుకు సంబంధించిన సమాచారాన్ని అక్కడి పోలీసులకు అందించినట్లు చెప్పారు. అరెస్టయిన వారిని విచారించగా.. 2009 నుంచి ప్రహ్లాద్ నగర్లో అక్రమంగా కాల్‌సెంటర్లు నడిపిస్తున్నట్లు వెల్లడించారన్నారు. ఈ రాకెట్‌కు సంబంధించి అహ్మదాబాద్‌లోని మరో 5 కాల్ సెంటర్లపై ఇటీవల పోలీసులు దాడి చేశారు. అమెరికాలో కొంతమంది ఏజెంట్లను నియమించుకుని.. అక్కడ ఎవరెవరు పన్నులు ఎగ్గొడుతున్నారో జాబితా సేకరించి.. వాళ్లను బెదిరించడానికి షాగర్ ఠక్కర్.. అలియాస్ షాగీ అనే యువకుడు ఇక్కడ ప్రత్యేకంగా ఏడు అంతస్థుల భవనంలో ఒక కాల్‌సెంటర్ నియమించి అతి తక్కువ కాలంలోనే 500 కోట్ల రూపాయలు సంపాదించిన విషయం తెలిసిందే. ప్రస్తుతం షాగీ పరారీలో ఉన్నాడు. అతడి కోసం పోలీసులు గాలిస్తున్నారు. కాగా కాల్ సెంటర్ రాకెట్ మాస్టర్ మైండ్ జగదీశ్ని పోలీసులు గతరాత్రి ఎట్టకేలకు అరెస్ట్ చేశారు. -
స్కాం చేసి.. గర్ల్‌ఫ్రెండుకు 2.5 కోట్ల కారు గిఫ్ట్
ఎక్కడో మహారాష్ట్రలోని థానె ప్రాంతంలో ఉండి.. అమెరికాలో పన్ను ఎగ్గొట్టేవాళ్ల నుంచి 500 కోట్ల రూపాయలు నొక్కేసిన సాగర్ ఠక్కర్ అలియాస్ షాగీ (23) ఆ డబ్బుతో మంచి విలాసవంతమైన జీవితం ఆస్వాదించాడు. తన గర్ల్‌ఫ్రెండుకు రూ. 2.5 కోట్లు పెట్టి ఆడి ఆర్8 కారు పుట్టినరోజు బహుమతిగా కొనిచ్చాడు. ఈ విషయాన్ని థానె పోలీసులు తెలిపారు. షాగీ దగ్గర కూడా లెక్కలేనన్ని హై ఎండ్ కార్లు ఉన్నాయి. ఆడి ఆర్8 కారును అహ్మదాబాద్‌లో కొన్న తొలి వ్యక్తి ఇతడే. అయితే, అసలు ఇంత ఖరీదైన బహుమతి అందుకున్న అతడి గర్ల్ ఫ్రెండు ఎవరన్నది మాత్రం ఇంకా ఎవరికీ తెలియలేదు. ఆమె ఆనుపానులు కనిపెట్టి, కారును కూడా స్వాధీనం చేసుకోవాలని పోలీసులు ప్రయత్నిస్తున్నారు. షాగీ స్కూలు స్నేహితులలో కొందరిని అరెస్టు చేసి విచారించినప్పుడు ఈ విషయం తెలిసింది. ఈ బహుమతి గురించి షాగీ తరచు తమతో చెప్పేవాడని అంటున్నారు. థానె నుంచి అహ్మదాబాద్ వెళ్లిన తర్వాత సాగర్ ఠక్కర్ తన సోదరి రీమా ఠక్కర్తో కలిసి ఉండేవాడు. అమెరికాలో ఈ స్కాంకు మరో సూత్రధారి ఉన్నాడని.. అతడితో స్నేహం మొదలైన తర్వాతే స్కాం మొత్తం మొదలైందని పోలీసులు చెప్పారు. అమెరికాలో పన్ను ఎగ్గొట్టేవాళ్లకు సంబంధించిన వివరాలు తీసుకుని.. వాటిని సాగర్‌కు పంపేవాడు. వాటి ఆధారంగా ఇక్కడినుంచి అమెరికన్ పౌరులకు ఫోన్లు చేసి, బ్లాక్ మెయిల్ చేసి డబ్బులు దండుకునేవారు. సాగర్‌కు దుబాయ్‌లో కూడా భారీ ఎత్తున వ్యాపారం ఉన్నట్లు తెలుస్తోంది. ఇక్కడ దండుకున్న డబ్బులతోనే ఆ వ్యాపారం పెట్టాడంటున్నారు. థానెకు ఎఫ్‌బీఐ అధికారులు అమెరికా పౌరులే లక్ష్యంగా జరిగిన ఈ దోపిడీ వ్యవహారంపై విచారణ జరిపేందుకు ఎఫ్‌బీఐ నుంచి ఏడుగురు అధికారులు వస్తున్నారు. థానె పోలీసు కమిషనరేట్ వారికి పూర్తి సహాయ సహకారాలు అందిస్తుందని సీపీ పరమ్‌వీర్ సింగ్ చెప్పారు. అహ్మదబాద్ నుంచి ముంబైకి మనీలాండరింగ్ చేస్తున్న నలుగురు హవాలా ఆపరేటర్లను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వాళ్లను ఈ కేసులో సాక్షులుగా చేస్తామంటున్నారు. అమెరికాకు, అహ్మదాబాద్‌కు మధ్య ఎలాంటి లింకు ఉందో తేలుస్తామని చెబుతున్నారు. -
23 ఏళ్లకే.. రూ. 500 కోట్లు కొట్టేశాడు!
అమెరికాలో కొంతమంది ఏజెంట్లను నియమించుకుని.. అక్కడ ఎవరెవరు పన్నులు ఎగ్గొడుతున్నారో జాబితా సేకరించి.. వాళ్లను బెదిరించడానికి ఇక్కడ ప్రత్యేకంగా ఏడు అంతస్థుల భవనంలో ఒక కాల్‌సెంటర్ నియమించి అతి తక్కువ కాలంలోనే 500 కోట్ల రూపాయలు సంపాదించాడు. ఇంత చేసిన వ్యక్తి వయసు ఎంతో తెలుసా.. కేవలం 23 ఏళ్లు. అతడిపేరు షాగర్ ఠక్కర్.. అలియాస్ షాగీ. స్కాం బయటపడి ఇప్పటికే వారం రోజులు దాటినా ఈ కేసులో కీలక సూత్రధారి, పాత్రధారి అయిన షాగీ, అతడి సన్నిహిత మిత్రుడు తపష్ ఇప్పటివరకు దొరకలేదు. చాలా తక్కువ వయసులోనే అయినా ఠక్కర్ చాలా పెద్దమొత్తంలో వెనకేశాడని.. అది కూడా చాలా తక్కువ సమయంలోనే సంపాదించాడని కేసును దర్యాప్తు చేస్తున్న ఒక పోలీసు అధికారి తెలిపారు. భారతదేశంలోనే కూర్చుని ఎక్కడో అమెరికాలో ఉన్న ఆ దేశ పౌరులను దోచుకోవడం అంటే చిన్న విషయం కాదని ఆయన చెప్పారు. బహుశా అతడు ఇప్పటికే దేశం వదిలి పారిపోయి ఉంటాడని అనుమానం వ్యక్తం చేశారు. (చదవండి: కాల్‌సెంటర్ కేంద్రంగా.. రూ. 500 కోట్ల దోపిడీ!) ఠక్కర్‌కు చాలా పెద్దపెద్ద కార్లు ఉన్నాయని, అతడు చాలా ధనవంతుడని పోలీసుల అదుపులో ఉన్న నిందితులతో పాటు సాక్షులు కూడా చెప్పారు. ఠక్కర్ విలాసవంతమైన జీవనశైలిని ఉదాహరణగా చూపించి.. అతడిలా జీవితాన్ని ఆస్వాదించాలంటే మరింత కష్టపడి మరింత ఎక్కువ సంపాదించాలని కొందరు సీనియర్లు చెప్పేవారన్నారు. తమ కాల్ సెంటర్లలోని ఉద్యోగులందరి నంబర్లతో వాట్సప్ గ్రూపులు ఉండేవని, వాటిలోనే తమకు అమెరికా పౌరుల గురించిన సమాచారం అందేదని మరో ఉద్యోగి చెప్పారు. శిక్షణ కార్యక్రమాల ద్వారా వాళ్లకు నెలకు కేవలం రూ. 1.5 లక్షల డాలర్లు మాత్రమే వస్తే.. కింద ఉన్న ఫ్లోర్ల నుంచి నెలకు 5-7 లక్షల డాలర్లు వచ్చేవట. ఈ కేసు దర్యాప్తును పర్యవేక్షిస్తున్న థానె పోలీసులను అమెరికాకు చెందిన పలు దర్యాప్తు సంస్థలు కూడా సంప్రదిస్తున్నాయి. ఇరువర్గాలూ తమ వద్ద ఉన్న వివరాలను పంచుకుంటున్నాయి. కాల్‌సెంటర్ గుట్టును రట్టు చేసినా, మొత్తం స్కాంలో ఇది చాలా చిన్న భాగం మాత్రమేనని, దీని మూలాలు వెలికితీస్తే ఇంకా పెద్ద స్కాం బయటపడే అవకాశం ఉందని అంటున్నారు. అమెరికా రెవెన్యూ లేదా ఇమ్మిగ్రేషన్ అధికారులుగా తమను తాము పరిచయం చేసుకుంటూ ఫోన్లు చేసే కాల్ సెంటర్ ఉద్యోగులు.. పన్నులు కట్టనందుకు వాళ్లను బెదిరించి లక్షలాది డాలర్లు దండుకునేవారు. ఈ కేసులో ఇప్పటికి ఆ కాల్ సెంటర్ ఉద్యోగులలో 70 మందిని అరెస్టుచేయగా, మరో 630 మందికి నోటీసులు ఇచ్చారు. -
ముంబై గ్యాంగ్ ఎలా మాయ చేసిందంటే..
'సుమారు మూడు నెలల క్రితం నాకు ఓ ఫోన్‌కాల్ వచ్చింది. అందులో అవతలి వైపు మాట్లాడుతున్న వ్యక్తి.. మీరు పన్ను ఎగవేతకు పాల్పడ్డారు. మీ ఇంటికి మరికాసేపట్లో అరెస్ట్ వారెంట్‌తో పోలీసులు వస్తున్నారు. మీరు ఊచలు లెక్కబెట్టాల్సి ఉంటుందని చెప్పి అని భయానికి గురిచేశాడు. దీంతో ఆ సమయంలో ఇంట్లో ఒంటరిగా ఉన్న నేను కంగారుపడిపోయాను' అని కాలిఫోర్నియాలో ఉంటున్న వినోద్ వకిల్ అనే 75 ఏళ్ల వ్యక్తి తాను ముంబై కేటుగాళ్ల చేతిలో ఎలా మోసపోయాననే విషయం మీడియాకు వెల్లడించారు. తరువాత తమను తాము ఇంటర్నల్ రెవిన్యూ సర్వీస్‌కు చెందిన వ్యక్తులుగా చెప్పుకున్న మోసగాళ్లు.. 5000 డాలర్లు చెల్లిస్తే ఈ వ్యవహారాన్ని సెట్ చేస్తామని వకిల్కు హామీ ఇచ్చారు. ఫోన్లో మాట్లాడిన వ్యక్తి వెంటనే.. లోకల్ స్టోర్‌కు వెళ్లి క్యాష్ కార్డ్‌ను కొనమని చెప్పడంతో.. తాను వృద్దుడినని, ఇప్పటికిప్పుడు బయటకు వెళ్లడం కష్టమని వకిల్ అనగా.. కేటుగాళ్లు మరుక్షణంలో ఎల్లో క్యాబ్ బుక్ చేసి వకిల్ ఇంటిముందు ఉంచారు. వారుచెప్పినట్లే ఐ-ట్యూన్ క్యాష్ కార్డును కొనుగోలుచేసి దాని కోడ్‌ను ఫోన్లోని వ్యక్తులకు తెలిపాడు వకిల్. అనంతరం లాయర్ ఫీజు కోసం మరో 500 డాలర్లు వెంటనే కావాలని డిమాండ్ చేశారు. ఇప్పుడు తన దగ్గర ఆ డబ్బు లేదని చెప్పిన వకిల్.. జరిగిన విషయాన్ని తన కుమారుడితో చెప్పాడు. అనుమానం కలిగిన అతను ఆరెంజ్ కౌంటీ పోలీసులను సంప్రదించగా ఆ ప్రాంతంలో ఇలాంటి మోసాలు ఇప్పటికే చాలా జరిగాయని చెప్పడంతో అవాక్కయ్యారు. అమెరికాలోని ఇండియన్స్‌ను టార్గెట్ చేసుకొని ముంబై ముఠా సాగించిన నేరాలు ఇటీవల బట్టబయలైన విషయం తెలిసిందే. దీనికి సంబంధించిన బాధితులు ఇప్పుడు వివరాలు వెల్లడిస్తున్నారు. -
కాల్‌సెంటర్ కేంద్రంగా.. రూ. 500 కోట్ల దోపిడీ!
గడిచిన ఏడాది కాలంలో అమెరికన్ పౌరులు దాదాపు రూ. 500 కోట్ల మేర దోపిడీకి గురయ్యారు. అది కూడా ఎక్కడి నుంచో తెలుసా.. మన దేశంలోని ఒక కాల్ సెంటర్ నుంచి!! అవును.. థానెలోని మీరారోడ్డు కాల్‌సెంటర్ స్కాం వెల్లడిస్తున్న భయంకర వాస్తవమిది. ఇప్పటివరకు బయటపడింది కూడా చాలా చిన్నదే కావచ్చని, ఇందులో మరింత పెద్ద మొత్తం ఉండి ఉండొచ్చని పోలీసు కమిషనర్ పరమ్ వీర్ సింగ్ తెలిపారు. కేవలం అమెరికాలోనే కాక.. ఇంగ్లండ్, ఆస్ట్రేలియా పౌరులు కూడా ఈ దోపిడీ బాధితులు కావచ్చని అంటున్నారు. ఇప్పటివరకు ఈ కేసులో 70 మందిని అరెస్టు చేశారు. అక్రమ కాల్సెంటర్లకు చెందిన మరో 630 మంది ఉద్యోగులకు షోకాజ్ నోటీసులు జారీచేశారు. స్కాం ఎలా జరిగిందంటే... కాల్ సెంటర్ల ఉద్యోగులు తమను తాము అమెరికా ఇంటర్నల్ రెవెన్యూ సర్వీస్ అధికారులుగా చెప్పుకొంటూ.. పన్నులు ఎగ్గొట్టినందుకు అరెస్టుచేస్తామని బెదిరించి, అలా చేయకుండా ఉండాలంటే 500 నుంచి 3000 డాలర్ల వరకు చెల్లించాలని బెదిరించేవారు. దాంతో దిక్కుతోచని ఆ పౌరులు వీళ్లు చెప్పిన ఖాతాలకు ఆ మొత్తాన్ని పంపేవాళ్లు. ఈ స్కాంపై అమెరికాకు చెందిన పలు ఏజెన్సీలు రంగంలోకి దిగాయి. ఈ గ్యాంగు సభ్యుల్లో కొంతమంది అమెరికాలో కూడా ఉన్నారు. వాళ్లే అక్కడివాళ్ల వివరాలు ఇచ్చి వీళ్లకు సాయం చేసేవారని తెలిసింది. ముందుగానే పన్ను ఎగ్గొడుతున్న విషయం తెలుసుకుని వీళ్లు ఫోన్ చేసేవారు. ఒకేసారి ఏకంగా 10 వేల డాలర్లు డిమాండ్ చేసి.. చివరకు అవతలివాళ్ల సామర్థ్యాన్ని బట్టి ఎంతో అంతకు సెటిల్ చేసేవారు. ఎలా పట్టుబడ్డారు.. మూడు అక్రమ కాల్సెంటర్లపై థానె పోలీసులు అర్ధరాత్రి దాడి చేశారు. మీరా రోడ్డులోని ఏడు అంతస్తుల డెల్టా బిల్డింగులో రోజుకు మూడు షిఫ్టుల చొప్పున 24 గంటలూ నడిచే ఈ కాల్‌సెంటర్ల గుట్టు అప్పుడే బయటపడింది. కాల్ సెంటర్ల యజమానులు ఎలాగోలా తప్పుకొన్నారు. అయితే హైదర్ అలీ అయూబ్ మన్సూరీ అనే ఒక డైరెక్టర్‌ను మాత్రం పోలీసులు అరెస్టుచేశారు. అసలైన యజమానుల కోసం గాలింపు విస్తృతంగా సాగుతోంది. హరిఓం ఐటీపార్క్, యూనివర్సల్ ఔట్సోర్సింగ్ సర్వీస్, ఆస్వాల్ హౌస్ అనే ఈ మూడు కాల్ సెంటర్లలో ఒక్కోదాంట్లో రోజుకు దాదాపు కోటి నుంచి కోటిన్నర వరకు సంపాదిస్తున్నారు. ప్రాక్సీ సెర్వర్ నుంచి వాయిస్ ఓవర్ ఇంటర్నెట్ ప్రోటోకాల్ (వీఓఐపీ) కాల్ చేయడంతో ఎక్కడినుంచి చేస్తున్నారో ఎవరికీ తెలిసేది కాదు. తన ఇంటిమీద దాడి జరగకుండా ఉండేందుకు ఒక వ్యక్తి ఏకంగా 60వేల డాలర్లు సమర్పించుకున్నాడు. వీళ్ల దగ్గర నుంచి 852 హార్డ్ డిస్కులు, హై ఎండ్ సెర్వర్లు, డీవీఆర్లు, ల్యాప్‌టాప్‌లు, కోటి రూపాయల విలువైన పరికరాలు స్వాధీనం చేసుకున్నారు. మొత్తం ఏడు అంతస్తులలో పైదాంట్లో శిక్షణ ఇచ్చేవారు. మిగిలిన ఒక్కో ఫ్లోర్లో దాదాపు వంద వరకు ఇంటర్నెట్ కనెక్షన్లున్నాయి. -
చిన్న పట్టణాల్లో బీపీవో కాల్ సెంటర్లు
9వేల సీట్లకు ఎస్టీపీఐ అనుమతి న్యూఢిల్లీ: చిన్న పట్టణాల్లో బిజినెస్ ప్రాసెస్ అవుట్సోర్సింగ్ (బీపీవో) కేంద్రాలు మరిన్ని తెరుచుకోనున్నాయి. 9 వేల సీట్ల (ఉద్యోగుల) సామర్థ్యంతో కూడిన పలు బీపీవో కాల్ సెంటర్లను దేశవ్యాప్తంగా వివిధ పట్టణాల్లో ఏర్పాటు చేసేందుకు సాఫ్ట్వేర్ టెక్నాలజీ పార్క్స్ ఆఫ్ ఇండియా (ఎస్టీపీఐ) సూత్రప్రాయ ఆమోదం తెలిపింది. వారణాసి, సిలిగురి, పాట్నా, ఉన్నావో, అమరావతి, ధూలే, కటక్, ముజఫర్‌పూర్, దాల్సింగ్సరాయ్ తదితర పట్టణాల్లో బీపీవోలు రానున్నాయి. 18 రాష్ట్రాలు, రెండు కేంద్రపాలిత ప్రాంతాల్లోని 60 ప్రదేశాల్లో 50 కంపెనీలు బీపీవో కేంద్రాలను ఏర్పాటు చేయనున్నాయి. ఎలక్ట్రానిక్స్, ఐటీ శాఖ సంయుక్త కార్యదర్శి రాజీవ్‌కుమార్ మాట్లాడుతూ... ఎస్టీపీఐ 9,020 సీట్ల సామర్థ్యానికి సూత్రప్రాయ ఆమోదం తెలిపిందని, సోమవారం ప్రారంభమైన మూడో దశ బిడ్డింగ్ ద్వారా మరో 3,000 సీట్ల సామర్థ్యానికి అనుమతులు జారీ చేసే అవకాశం ఉందన్నారు. టీసీఎస్, అమేజాన్ తదితర పెద్ద కంపెనీలే బిడ్డింగ్‌లో పాల్గొంటున్నట్టు అధికారులు తెలిపారు. సోమవారం ఢిల్లీలో జరిగిన బీపీవో వర్క్‌షాప్ సందర్భంగా కేంద్ర ఐటీ, న్యాయ శాఖల మంత్రి రవిశంకర్ ప్రసాద్ విలేకరులతో మాట్లాడారు. తాను గతంలో బెంగళూరులో పర్యటించిన సమయంలో ఈశాన్య రాష్ట్రాలు, బిహార్, ఇతర ప్రాంతాల ప్రజలు తాము తమ స్వస్థలాల్లో పనిచేసుకుంటామని, అందుకోసం ఏదో ఒకటి చేయాలని అడిగారని రవిశంకర్ ప్రసాద్ తెలిపారు. బీపీవోలు చిన్న పట్టణాల్లో ఏర్పాటు చేయడం పట్ల తనకు సంతోషంగా ఉందని, స్థానికులు తమ ప్రాంతాలను విడిచిపెట్టే అవసరం లేకుండా అక్కడే పనిచేసుకోగలుగుతారని పేర్కొన్నారు. బీపీవో కేంద్రాల ప్రోత్సాహక పథకం కింద కేంద్రం దేశవ్యాప్తంగా మొత్తం 48,300 సీట్ల సామర్థ్యం వరకు కాల్ సెంటర్ల ఏర్పాటుకు అవసరమైన ఆర్థిక సహకారం అందించనుంది. ఒక్కో సీటుపై రూ.ఒక లక్ష వరకు వ్యయం చేస్తే అందులో సగాన్ని కేంద్రం భరిస్తుంది. -
కాల్ సెంటర్లపై విచారణ
కడప అగ్రికల్చర్: జిల్లాలోని విద్యుత్ కాల్ సెంటర్లలో చోటుచేసుకున్న అవినీతి, అక్రమాలపై జిల్లా విద్యుత్‌శాఖ సూపరింటెండెంట్ ఇంజనీరు సుబ్బరాజు విచారణకు ఆదేశించారు. ‘సాక్షి’ టాబ్లాయిడ్లో గురువారం ప్రచురితమైన ‘విద్యుత్సంస్థలో వసూల్‌రాజాలు’ శీర్షికన ప్రచురితమైన కథనానికి ఆయన స్పందించారు. ఆ మేరకు గురువారం జిల్లాలోని కాల్సెంటర్లపై విచారణను ఆ శాఖ డివిజనల్ అధికారులు చేపట్టారు. ఎవరెవరు కాల్ సెంటర్లలో దరఖాస్తులు స్వీకరిస్తున్నది, రిజిష్టర్లలో నమోదు, ఆయా ఫోన్నంబర్ల ఆధారంగా వినియోగదారురులకు ఫోన్లు చేసి ఆరాతీస్తున్నారు. -
విద్యుత్ సంస్థలో వసూల్‌రాజాలు
కడప అగ్రికల్చర్: విద్యుత్ సంస్థలో వినియోగదారులకు సేవలు అందించేందుకు కాల్ సెంటర్లు ఉంటున్నాయి. వీటిల్లో కొన్ని సెంటర్లు అక్రమాలకు, అవినీతికి కేరాఫ్ అడ్రస్‌గా మారాయి. సేవలు పొందవచ్చని ఆశతో వెళ్లే వినియోగదారులను కాల్ సెంటర్ల నిర్వాహకులు దోచుకుంటున్నారు. కాల్ సెంటర్లలో జరిగే విషయాలను ఆలోచిస్తే ఇది చిల్లర వ్యవహారం అనిపించినా అది పెద్ద మొత్తంగా ఉంటోంది. జిల్లాలో వినియోగదారులకు సేవలు అందించడానికి ప్రతి ఏడీఈ పరిధిలో ఒక కాల్‌సెంటర్ ఉంటుంది. ఈ లెక్కన జిల్లాలో మొత్తం 18 కాల్ సెంటర్లు ఉన్నాయి. ఇవి ఏమేం సేవ చేస్తాయంటే.. ఈ కాల్‌సెంటర్లు విద్యుత్‌తో పని ఉండే ప్రతి ఒక్కరికి సేవలు అందించాలి. కొత్త సర్వీసు కావాలన్నా, మీటర్లు మార్చుకోవాలన్నా, విద్యుత్ సర్వీసు కావాలన్నా, ఇతర విద్యుత్ సమస్యలను పరిష్కరించాలన్నా ఈ కాల్‌సెంటర్లు పరిష్కరించాల్సి ఉంటుంది. దరఖాస్తు చేసుకునే వారి పేరు మీద రిజిస్ట్రేషన్ చేయడం, వారి సమస్యలను నిర్ణయించిన సమయంలోపు పరిష్కరించడం తదితర పనులు చేయడం ఈ కాల్‌సెంటర్ల విధి. కాగా నిర్వాహకులు ఆయా సమస్యల పరిష్కారం కోసం కాల్ సెంటర్లను ఆశ్రయించే వినియోగదారుల జేబులకు చిల్లులు పెడుతున్నారు. దరఖాస్తు చేసుకునే సమయంలో దరఖాస్తులు ఇచ్చి ఆయా దరఖాస్తులకు, ఆయా పనులకు కేటాయించిన ఫీజును చెల్లించే సమయంలో తమ చేతి వాటం ప్రదర్శిస్తున్నారు. ఎలాగంటే.. ఒక వినియోగదారుడు ఒక సర్వీసు కోసం దరఖాస్తుతో పాటు నిర్ణీత ఫీజు రూ. 200 చెల్లించాల్సి ఉంది. అయితే ఆ వినియోగదారుడు రూ. 500 నోటు ఇచ్చి మిగతా చిల్లర ఇమ్మని అడిగితే, కొందరు కాల్ సెంటర్ల నిర్వహకులు రూ. 200 తీసుకుంటూ అదే సందర్భంలో ‘అయ్యా...! మిగిలిన చిల్లర రాదు, ఎందుకంటే ఖర్చులు ఉంటాయి, పై అధికారులకు ఇవ్వాలి, మీ పని తొందరగా కావాలంటే ఈ మొత్తం మరచిపోవాల్సిం§ó’lనని చెబుతున్నారని వినియోగదారులు వాపోతున్నారు. ఇలాంటి తతంగం జిల్లాలోని ఒంటిమిట్ట, రాంజపేట, ప్రొద్దుటూరు, రాయచోటి పట్టణాల్లోని కాల్సెంటర్లలో అధికంగా ఉందని వినియోగదారులు చెబుతున్నారు. సర్వీసును బట్టి రూ. 100 నుంచి 1000ల వరకు లాగుతున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ కాల్సెంటర్లలలోని కాంట్రాక్టు కార్మికులు చేతివాటం ప్రదర్శిస్తున్నట్లు ఆ శాఖ అధికారులు, ఉద్యోగులే పెదవి విరుస్తున్నారు. ఇది ప్రతి రోజూ జరుగుతున్న వ్యవహారమేనని విద్యుత్ సంస్థలోని ఓ అ«ధికారి ఆధారాలతో సహా ‘సాక్షి’కి అందించారు. బద్వేలు నియోజకవర్గంలోని ఓ సెంటర్లో ఓ రెగ్యులర్ ఉద్యోగి ప్రతి సర్వీసుకు రూ. 100 నుంచి రూ. 500లు ఇవ్వనిదే పని చేయడం లేదని వినియోగదారులు ఆరోపిస్తున్నారు. ఇంటి సర్వీసు కోసం దరఖాస్తు చేసుకున్న బద్వేలు నియోజక వర్గానికి చెందిన రామసుబ్బయ్య అనే వ్యక్తి నుంచి రూ.1000లు తీసుకుని మిగతా చిల్లర అడిగిౖతే పై విధంగా సమాధానం చెప్పారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఇందులో ఓ అధికారికి బాగస్వామ్యం కూడా ఉంటోందని తెలిపారు. మెజార్టీ కాల్‌సెంటర్ల నుంచి నెలనెలా మామూళ్ల రూపంలో ఉన్నతాధికారులకు రూ. లక్షల్లోనే అందుతోందని ఆ శాఖ ఉద్యోగులే చర్చించుకుంటున్నారు. ఫిర్యాదు చేస్తే చర్యలు తీసుకుంటాం.... కాల్ సెంటర్లలో అక్రమాలు, చిల్లర వ్యవహారాలు నా దృష్టికి రాలేదు. గతంలో ఇలాంటి సమస్యలు దృష్టికి వచ్చినప్పుడు నిర్వహకులను తొలగించాం. ఇప్పుడు కూడా ఎవరైనా సరే వినియోగదారులు ఇలా ఫలానా కాల్ సెంటర్లో డబ్బులు అదనంగా తీసుకుంటున్నారని పిర్యాదు చేస్తే తప్పకుండా ఉద్యోగులపైన చర్యలు తీసుకుంటాం. –ఎన్విఎస్ సుబ్బరాజు, ఎస్ఈ, జిల్లా విద్యుత్‌శాఖ. -
ఎన్నారైల కోసం కాల్ సెంటర్లు: కేటీఆర్
హైదరాబాద్: ఎన్నారైల సమస్యల పరిష్కారం కోసం ప్రత్యేక కమిటీలతోపాటు కాల్ సెంటర్లను ఏర్పాటు చేస్తున్నామని మంత్రి కేటీఆర్ చెప్పారు. విదేశాలకు వెళ్లే వారి డేటా బేస్ తో పాటు వన్ టైమ్ రిజిస్ట్రేషన్‌ను రూపొందిస్తున్నామని అన్నారు. ఎన్నారైల కోసం ప్రత్యేక కార్పస్ ఫండ్ ను ఏర్పాటుచేస్తామని కేటీఆర్ చెప్పారు. తెలంగాణ నాన్ రెసిడెంట్ వారికోసం సెంటర్ ఫర్ నాన్ తెలంగాణ అఫైర్స్ కమిటీని, జిల్లాలో కూడా ప్రత్యేక కమిటీలు ఏర్పాటుచేస్తామని ఆయన అన్నారు. -
భారత యాసను వెక్కిరించిన ట్రంప్
అమెరికా ఉద్యోగాల్ని లాక్కుంటున్నారని ఆక్రోశం వాషింగ్టన్: వివాదాస్పద వ్యాఖ్యలతో వార్తల్లోకెక్కుతూ అమెరికా రిపబ్లికన్ పార్టీ అధ్యక్ష అభ్యర్థిగా పోటీపడుతున్న డొనాల్డ్ ట్రంప్ ఈ సారి భారతీయ ఉద్యోగులపై అక్కసు వెళ్లగక్కారు. నకిలీ భారతీయ ఇంగ్లిష్ యాసలో మన దేశానికి చెందిన కాల్‌సెంటర్ ఉద్యోగిని వెక్కిరిస్తూ డెలావేర్ సభలో ట్రంప్ మాట్లాడారు. తన క్రెడిట్ కార్డ్ కంపెనీకి చెందిన కస్టమర్ కేర్ విభాగం అమెరికాలో ఉందా..? విదేశంలో పనిచేస్తుందో తెలుసుకునేందుకు గతంలో చేసిన ఫోన్‌కాల్ వివరాల్ని ప్రస్తావించారు. కార్డు వివరాలు తెలుసుకునే కారణంతో ఫోన్ చేసి కస్టమర్ కేర్ ప్రతినిధిని ‘నువ్వు ఎక్కడి వాడివి’ అని ప్రశ్నించానని చెప్పారు. ఉద్యోగి సమాధానాన్ని భారతీయ యాసలో వెకిలిగా ఉచ్చరిస్తూ... ‘నేను భారత్ నుంచి’ అని సమాధానం వచ్చిందని ట్రంప్ చెప్పారు. ‘చాలా మంచిది, అద్భుతం’ అంటూ ఫోన్ పెట్టేశానన్నారు. భారత్ తదితర దేశాలు అమెరికా ఉద్యోగాలు లాక్కుంటున్నాయన్నారు. దీన్ని ప్రోత్సహించొద్దన్నారు. ‘భారత్ అద్భుత దేశం. ఆ దేశ నేతల గురించి బాధపడడం లేదు. మన నేతల విధానాలతోనే ఆందోళన చెందుతున్నా. నాకు చైనా, ఇండియాలపై కోపం లేదు’ అని చెప్పారు. అమెరికా బ్యాంకింగ్, క్రెడిట్ కార్డ్ పరిశ్రమకు డెలావేర్ కేంద్రం. -
ఫేక్ కాల్ సెంటర్ల ద్వారా ఆన్లైన్ చోరీలు..
ఇన్సూరెన్స్ ఏజెంట్లు, టెలికాలర్ల వద్దనుంచి కాల్స్ వస్తున్నాయా? అయితే జర జాగ్రత్త! దొంగల ముఠాలు రోజురోజుకూ హైటెక్ చోరీలకు పాల్పడుతూ పోలీసులకు సవాల్ గా మారుతున్నాయి. సిమ్ కార్డులనుంచి, బ్యాంకు ఖాతాల దాకా అంతా నకిలీ రాజ్యం ఏర్పాటు చేసుకుంటున్న ముఠాలు... ఇప్పుడు ఏకంగా నకిలీ డాక్యుమెంట్లతో ఫేక్ కాల్ సెంటర్లను, ఆన్ లైన్ బిజినెస్ హౌస్ లనే తెరిచేస్తున్నారు. తాజాగా భారత రాజధాని ఢిల్లీ కేంద్రంగా లెక్కల్లో నేర్పును ప్రదర్శిస్తూ కోట్లను కొల్లగొట్టేస్తున్న ఓ ముఠా గుట్టు రట్టయింది. ఢిల్లీ ఎన్సీఆర్ ప్రాంతాన్ని కేంద్రంగా చేసుకున్నదొంగల ముఠాలు ఓ ప్రీమియం ధర వద్ద అక్రమ లాజిస్టిక్స్ అందిస్తూ వ్యాపారాన్ని హాయిగా కొనసాగించడంలో క్రియాశీలకంగా వ్యవహరిస్తున్నారు. ఈ నేపథ్యంలో సుమారు వంద వరకూ నకిలీ కాల్ సెంటర్లు, బిజినెస్ హౌస్ లు భారత దేశం అంతటా వ్యాపించి, ఎన్సీఆర్ కేంద్రంగా పనిచేస్తున్నాయని పోలీసులు దర్యాప్తులో తేలింది. మార్కెటింగ్ అధికారులుగా తమను తాము పరిచయం చేసుకుని, నకిలీ కంపెనీలకు మౌలిక సదుపాయాల ఏర్పాటు చేసేందుకు ఏజెంట్లుగా వ్యవహరిస్తూ, ప్రీమియం కమిషన్ వసూలు చేస్తున్నారని UP STF అదనపు సూపరింటిండెంట్ త్రివేణి సింగ్ చెప్తున్నారు. ఈ మేరకు ఢిల్లీ పోలీసులతోపాటు, UP STF బృదం స్థానిక కృష్ణానగర్, నోయిడాల్లో ఉన్న రెండు కార్యాలయాలపై దాడులు నిర్వహించి సుమారు వందమందిని అరెస్టు చేశారు. ఈ గ్యాంగ్ మొత్తం పదకొండు కంపెనీలను నిర్వహిస్తూ.. దేశంలో అనేకమంది ఏజెంట్ల ద్వారా జనానికి వారి ఇన్సూరెన్స్ పాలసీలపై అధిక బోనస్ ఆశ చూపి ఎరవేస్తున్నట్లు తెలిసింది. నకిలీ ఇన్సూరెన్స్ కాల్ సెంటర్లలో వినియోగిస్తున్న సుమారు 50 సిమ్ కార్డులు, ఫేక్ ఐడీ కార్డులను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. నకిలీ బిజినెస్ హౌస్ ల ద్వారా కస్టమర్ల డేటాను సేకరించి 35 పైసలు మొదలు, ఐదు రూపాయల వరకూ అమ్మకాలు కూడ జరుపుతున్నట్లు ఓ సీనియర్ అధికారి తెలిపారు. అలాగే పోలీసులకు తెలియకుండా ఉండేట్టు నకిలీ గుర్తింపు కార్డులతో ఉన్న సిమ్ లను ఆరు వందల నుంచి వెయ్యి రూపాయల వరకు అమ్ముతున్నారు. ఈ సిమ్ కార్డులను డూప్ కస్టమర్లకు కాల్ చేసేందుకు వినియోగిస్తున్నారని, టెలికాం కంపెనీ ఉద్యోగుల సహాయంతో వారం రోజుల వ్యవధిని తీసుకొని నకిలీ డాక్యుమెంట్లతో ఫోన్ కాల్స్ కూడ అందుబాటులోకి తెస్తున్నారని పోలీసులు చెప్తున్నారు. అలాగే నకిలీ డాక్యుమెంట్లతో బ్యాంక్ ఖాతాలను కూడ తెరిపించి 15 శాతం కమిషన్ తీసుకుంటున్నట్లు పోలీసులు తెలిపారు. ఇటువంటి ముఠాలు ఎవరికీ అనుమానం రాకుండా అందమైన ఖరీదైన ఇళ్ళలో తమ కార్యాలయాలను స్థాపించి జోరుగా దందా కొనిసాగిస్తున్నారు. అయితే పోలీసులకు అనుమానం రాకుండా కేవలం మూడు నాలుగు నెలల లోపే అక్కడినుంచి దుకాణం ఎత్తేస్తున్నారు. తాజాగా దేశ వ్యాప్తంగా వేలమందిని మోసగించి పదికోట్ల రూపాయలకు పైగా వ్యాపారం చేసిన ఓ వ్యక్తిని పోలీసులు అరెస్టు చేశారు. మనీకేర్ వ్యాల్యూ ప్రైవేట్ లిమిటిడె పేరున జనకపురిలో రిజిస్టర్డ్ కార్యాలయాన్ని ప్రారంభించిన ఈ ముఠా.. కాల్ సెంటర్ ను మాత్రం హరినగర్ లో కొనసాగిస్తున్నారని, ఈ సంస్థలో సుమారు 70 నుంచి 80 మంది ఉద్యోగులు టెలికాలర్లుగా పనిచేస్తున్నట్లు పోలీసుల విచారణలో తెలిసింది. సో ప్రస్తుత తరుణంలో డబ్బు ఎరవేసే ఏజెంట్లకు లొంగిపోకుండా జర జాగ్రత్త పడాల్సిన అవసరం ఎంతైనా ఉంది. -
‘కాల్’నాగులున్నాయ్!
యూఎస్, యూకే అప్రమత్తం అమెరికాలో వెలుగులోకి ‘సోషల్’ స్కామ్ ఈ ముఠాతో సంబంధాలపై అనుమానాలు సాక్షి, సిటీబ్యూరో: హైదరాబాద్‌లో వెలుగులోకి వచ్చిన కాల్ సెంటర్ క్రైమ్ సమాచారం తెలుసుకున్న అమెరికా, లండన్ కాన్సులేట్ కార్యాలయాలు తమ దేశాలను అప్రమత్తం చేశాయి. ఈ తరహా ముఠాలు మరికొన్ని ఉండొచ్చనే అనుమానంతో యూఎస్‌కు చెందిన సోషల్ సెక్యూరిటీ అడ్మిస్ట్రేషన్‌తో పాటు ఆఫీస్ ఆఫ్ ఇన్స్పెక్టర్ జనరల్ (ఓఐజీ) కార్యాలయాలు తమ వెబ్సైట్ల ద్వారా పెద్ద ఎత్తున ప్రచారం ప్రారంభించాయి. మరోపక్క అమెరికాలోని కనెక్టికట్ రాష్ట్రంలో బుధవారం ‘సోషల్ సెక్యూరిటీ’ స్కామ్ వెలుగులోకి వచ్చింది. దీనికి భారతీయుడే ఆద్యుడని అనుమానిస్తున్న ఆ రాష్ట్ర పోలీసులు... హైదరాబాద్‌లో చిక్కిన ముఠాతో సంబంధాలపై ఆరా తీస్తున్నారు. కనెక్టికట్ రాష్ట్రంలోని ఈస్ట్ హార్ట్ఫోర్డ్ టౌన్లో ఉన్న సౌత్ విండర్స్‌లో నివసించే ఇద్దరికిబుధవారం డిపార్ట్మెంట్ ఆఫ్ సోషల్ సెక్యూరిటీ నుంచి వచ్చినట్లుగా ఫోన్లు వ చ్చాయి. అక్కడి పౌరులకు సోషల్ సెక్యూరిటీ కార్డు, నెంబర్ అత్యంత కీలకం కావడంతో ఫోన్ చేసిన వ్యక్తి వాటి పేర్లతోనే బెదిరించాడు. సోషల్ సెక్యూరిటీ నెంబర్, ఇతర వివరాలు చెప్పి... అవి రద్దయ్యే ప్రతిపాదన ఉందన్నాడు. తనకు మనీగ్రామ్ ద్వారా నిర్ణీత మొత్తం పంపిచకపోతే ఆ ప్రతిపాదన కార్యరూపంలోకి వ చ్చి... అరెస్టవుతారని హెచ్చరించాడు. దీంతో వీరిద్దరూ అక్కడి పోలీసులకు ఫిర్యా దు చేశారు.ఫోనులో బెదిరించిన వ్యక్తి భాష, వాడిన పదజాలం ఆధారంగా అతడు భారతీయుడుగా అనుమానిస్తున్నట్లు ఫిర్యాదులో పేర్కొన్నారు. అప్పటికే ఓ బాధితుడు సౌత్ విడ్సర్లోని వాల్‌మార్ట్ ద్వారా ఫోన్ చేసిన వ్యక్తికి 500 అమెరికన్ డాలర్లు చెల్లించేశాడు. ఈ లావాదేవీని ఆపడానికి అక్కడి పోలీసులు ప్రయత్నించినప్పటికీ... దుండగుడు ‘ఈజీ క్యాష్’ పద్ధతితో డబ్బు డ్రా చేసుకోవడంతో సాధ్యం కాలేదు. ఈ నేర విధానం... హైదరాబాద్‌లో చిక్కిన కాల్ సెంటర్ ముఠా నేరాల తీరు...ఒకేలా ఉండటంతో పాటు సౌత్ విండర్స్ వాసులను బెదిరించిన వ్యక్తి భారతీయుడిగా అనుమానాలు వ్యక్తం కావడంతో ఈస్ట్ హోర్ట్ఫోర్డ్ టౌన్ పోలీసులు అప్రమత్తమయ్యారు. కాల్ సెంటర్ క్రైమ్‌కు సూత్రధారిగా ఉన్న గుజరాత్‌లోని భావ్‌నగర్‌కు చెందిన ఇషాన్ పాఠక్ అమెరికా, లండన్లలోనూ ఏజెంట్లను ఏర్పాటు చేసుకున్న విషయం కాన్సులేట్ ద్వారా తెలియడంతో దర్యాప్తు ముమ్మరం చేశారు. ‘ఈజీ క్యాష్’ ద్వారా డబ్బు డ్రా చేసుకున్న వ్యక్తి వివరాలు తెలుసుకోవడానికి వాల్‌మార్ట్‌ను సంప్రదిస్తున్నారు. బ్యాంకు రుణాలు, సోషల్ సెక్యూరిటీ కార్డుల పేర్లతో ఫోన్లు వస్తే వెంటనే తమకు ఫిర్యాదు చేయాలని ఓఐజీ అమెరికా పౌరులకు సూచించింది. గాలింపు ముమ్మరం... మరో పక్క హైదరాబాద్‌లో చిక్కిన ముఠా సభ్యులైన 14 మందినీ పోలీసులు శుక్రవారం జ్యుడీషియల్ రిమాండ్‌కు తరలించారు. ఈ ముఠాకు సంబంధించి పరారీలో ఉన్న ఇషాన్, రాహుల్ బజాజ్, అలీమ్, ముబీన్లతో పాటు మరో ఐదుగురి కోసం హైదరాబాద్ పోలీసులు గాలింపు ముమ్మరం చేశారు. రెండు ప్రత్యేక బృందాలను రంగంలోకి దింపారు. అరెస్టయిన నిందితులను తదుపరి విచారణ నిమిత్తం తమ కస్టడీకి అప్పగించాల్సిందిగా కోరుతూ న్యాయ స్థా నంలో పిటిషన్ దాఖలు చేయాలని నిర్ణయించారు. -
ముఠా హైదరాబాద్‌లో.. లూటీ అమెరికాలో!
* కాల్ సెంటర్ ద్వారా విదేశీయులకు కుచ్చుటోపీ * అమెరికా, బ్రిటన్ ముఠా ఏజెంట్ల ద్వారా సమాచారం సేకరణ * బ్యాంకు రుణం మంజూరు చేస్తామని ఇక్కడ్నుంచి ఫోన్లు * మొదటి వాయిదా ముందే చెల్లించాలంటూ ముగ్గులోకి * సొమ్ము చేతికందగానే ‘హవాలా’ ద్వారా లావాదేవీలు * సూత్రధారి గుజరాత్‌వాసి.. పాత్రధారులు నగర యువకులు * 14 మందిని అరెస్టు చేసిన పోలీసులు సాక్షి, హైదరాబాద్: లాటరీలు, బహుమతుల పేరుతో మోసాలు చూశాం.. ఎస్సెమ్మెస్, ఈ-మెయిల్స్‌తో అందినకాడికి దండుకునే నైజీరియన్ ముఠాల చీటింగ్లూ చూశాం..! ఇప్పుడు ఈ గ్యాంగ్‌లే డంగైపోయే ఘరానా కాల్ సెంటర్ క్రైమ్ హైదరాబాద్‌లో వెలుగుచూసింది. అమెరికా, బ్రిటన్‌లోని లండన్‌లో బ్యాంకు రుణాలకు దరఖాస్తు చేసి తిరస్కరణకు గురైనవారే లక్ష్యంగా ఈ భారీ మోసానికి తెరదీశారు. రుణం దక్కని వారి వివరాలు సేకరించి ఇక్కడ్నుంచి కథ నడిపించారు. అచ్చంగా అమెరికన్ల తరహాలో ఫోన్లలో మాట్లాడుతూ బురిడీ కొట్టించారు. ‘మీ లోన్ ఓకే అయింది.. అయితే మొదటి వాయిదా ముందే చెల్లించాలి..’ అని అడగడం.. ఆ వాయిదా సొమ్ము చేతికందగానే వాటాలు పంచుకొని మరో కస్టమర్‌ను వెతుక్కోవడం.. ఇదీ ఈ గ్యాంగ్ చేస్తున్న మోసం! అమెరికా, లండన్‌కు చెందిన వారిని ఇలా సుమారు రూ.1.5 కోట్లకుపైగా మోసం చేసినట్లు పోలీసులు గుర్తించారు. ఈ ముఠాకు చెందిన 14 మంది నిందితులను దక్షిణ మండల పోలీసులు గురువారం అరెస్టు చేశారు. కమిషనరేట్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో పోలీస్ కమిషనర్ ఎం.మహేందర్‌రెడ్డి కేసు వివరాలను తెలిపారు. గుజరాత్ టు హైదరాబాద్ వయా పుణె గుజరాత్‌లోని భావ్‌నగర్‌కు చెందిన ఇషాన్ పాఠక్ ఈ మోసానికి సూత్రధారి. మహారాష్ట్రలోని పుణే వాసి రాహుల్ బజాజ్ ద్వారా కొన్నాళ్ల క్రితం నగరానికి చెందిన ఖాదర్‌ను పరిచయం చేసుకున్నాడు. వీరంతా కలిసి అప్పట్లో కొన్ని ఆన్లైన్ నేరాలు చేశారు. ఇందుకు హైదరాబాద్‌కు చెందిన కొందరు యువకులను వినియోగించుకున్నారు. ఆ నేరాలు వెలుగులోకి రావడంతో జైలుకు వెళ్లి బయటకు వచ్చిన ఖాదర్ ప్రస్తుతం దుబాయ్‌లో స్థిరపడ్డాడు. అప్పట్లో ఖాదర్ దగ్గర సహాయకులుగా పని చేసిన నగర యువకులు ఎంఏ ఖరీద్, నోమన్, సయ్యద్ అబ్దుల్లా, మహ్మద్ అబ్దుల్లతో ఇషాన్ పరిచయాలు కొనసాగించాడు. వారి ద్వారా కాల్ సెంటర్ చీటింగ్‌కు తెరదీశాడు. బురిడీ కొట్టించారిలా.. ఇషాన్‌కు అమెరికా, లండన్‌లో అనుచరులు ఉండటంతో వారి సాయంతో అక్కడి బ్యాంకులకు సంబంధించిన డేటాను హ్యాకింగ్ ద్వారా సేకరించేవాడు. ‘లీడ్స్’గా పిలిచే ఈ వివరాలను అక్కడి ఏజెంట్ల ద్వారా బ్యాంకు సర్వర్లు హ్యాక్ చేయించి ఈ-మెయిల్ రూపంలో తెప్పించుకునేవాడు. 1,000 నుంచి 5 వేల డాలర్ల మధ్యలో రుణానికి దరఖాస్తు చేసుకున్నవారిని గుర్తించేవాడు. ఈ లీడ్స్‌లో దరఖాస్తుదారుడి పేరు, చిరునామా, సోషల్ సెక్యూరిటీ నంబర్ సహా మొత్తం 40 రకాలైన సమాచారం ఉంటుంది. దీన్ని హైదరాబాద్‌లో ఏర్పాటు చేసుకున్న నలుగురు ఏజెంట్లకూ పంపేవాడు. వారికి కార్యాలయాలు కూడా ఏర్పాటు చేయించాడు. రెయిన్‌బజార్‌లో పర్వేజ్ కాలింగ్ సొల్యూషన్స్, టోలీచౌకిలో క్విక్ క్యాష్ లోన్స్, క్యాష్ సేమ్ డే, పంజగుట్టలో ఏబీ కాలింగ్ సొల్యూషన్స్ పేరిట వీటిని ఏర్పాటు చేశాడు. వీటిలో కొందరు ఉద్యోగుల్ని సైతం నియమించుకున్నారు. వారికి అమెరికా, లండన్ వాసులతో ఎలా మాట్లాడాలనే అంశంపై 15 రోజులపాటు శిక్షణ ఇచ్చేవాడు. గ్యాంగ్ సభ్యులందరికీ ఆయా దేశాల్లోని పేర్లను మారుపేర్లుగా పెట్టారు. ఆయా దేశాల్లో బ్యాంకులు పనిచేసే సమయాల్లోనే ‘కస్టమర్ల’కు కాల్స్ చేసే వారు. హైదరాబాద్‌కు చెందిన నంబర్ల నుంచి కాల్ చేస్తే అనుమానించే అవకాశం ఉండడంతో.. ఆన్లైన్లో అందుబాటులో ఉన్న ఐబీమ్, ఎక్స్-లైట్, సాఫ్ట్ఫోన్ అనే సాఫ్ట్వేర్లను వినియోగించారు. వీటి ద్వారా కాల్ చేస్తే దాన్ని రీసీవ్ చేసుకునే వ్యక్తి ఏ దేశానికి చెందిన వాడైతే అక్కడి లోకల్ నంబర్ అతడికి డిస్ప్లే అయ్యేలా చేయవచ్చు. వెయ్యి డాలర్లకు 110 డాలర్ల వాయిదా ముఠా సభ్యులు ఆంగ్ల పేర్లతో అక్కడి కస్టమర్లను పరిచయం చేసుకునేవారు. ‘లీడ్స్’లో ఉన్న వివరాలను చెప్పేవారు. దీంతో తాము దరఖాస్తు చేసిన బ్యాంకు నుంచే ఫోన్ వచ్చినట్లు అవతలి వారు భ్రమపడే వారు. బ్యాంకు ఉద్యోగిగా పరిచయం చేసుకుని రుణం మంజూరైందని, నెలసరి వాయిదా ఎంతో చెప్పి, చెల్లించగలరా అని అడిగేవాడు. వారు అంగీకరించగానే.. కస్టమర్ కాల్‌ను అధికారికి కనెక్ట్ చేస్తున్నట్లు చెప్పి మరో ముఠా సభ్యుడికి ఇచ్చేవాడు. ‘మీకు ముందు రుణం మంజూరు చేసేస్తాం. రెండ్రోజుల్లో సంతకాలు తీసుకుంటాం. అయితే మీ చెల్లింపు సామర్థ్యం తెలుసుకోవాలి. ఇందుకు మొదటి విడత వాయిదా ముందే చెల్లించండి’ అంటూ ముగ్గులోకి దింపేవాడు. వెయ్యి డాలర్ల రుణానికి నెలకు 110 డాలర్ల చొప్పున ఇన్స్టాల్మెంట్ చెల్లించాలని కోరేవాడు. వాయిదాను ఈజీ క్యాష్ రూపంలోనే చెల్లించాలని చెప్పేవారు. ఈజీ క్యాష్ ద్వారా లావాదేవీలు అమెరికా, బ్రిటన్‌లో యూ-క్యాష్, గ్రీన్డాట్ కార్డ్ వంటి ఈజీ క్యాష్ లావాదేవీలు నడుస్తాయి. వీటికి సంబంధించిన ఔట్‌లెట్స్‌లో వినియోగదారులు నగదు చెల్లిస్తారు. కొంత కమీషన్ తీసుకుని నిర్వాహకులు 14 నుంచి 16 సంఖ్యలతో ఉండే కార్డు నంబర్, సీవీవీ నంబర్ ఇస్తారు. వీటిని ఆ కస్టమర్లు ముఠా సభ్యులతో ఫోన్లో చెప్పేవారు. ఈ వివరాలన్నీ ఇషాన్‌కు చేరేవి. అతడు వీటిని అమెరికాలో ఉండే ఏజెంట్లకు పంపి తక్షణం నగదు డ్రా చేయించేవాడు. వాళ్లు కమీషన్ మినహాయించుకొని మిగిలిన మొత్తాన్ని హవాలా రూపంలో ఇషాన్‌కు చేరవేసేవారు. అతడు హైదరాబాద్‌లోని ఏజెంట్లకు 40 శాతం కమీషన్‌ను హవాలా ద్వారానే పంపేవాడు. నగదు పంపిన కస్టమర్ నంబర్‌ను బ్లాక్ చేసి సంప్రదింపులు నిలిపివేసేవారు. బాధితులంతా అక్కడివారు కావడంతో ఇక్కడ ఎలాంటి ఫిర్యాదులు ఉండేవి కాదు. డొంక కదిలిందిలా..: బుధవారం పాతబస్తీ లో వాహనాలు తనిఖీ చేస్తున్న పోలీసులకు ఇద్దరు యువకులు అనుమానాస్పదంగా చిక్కా రు. పేర్లు చెప్పమని అడగ్గా.. వారు బిన్ హాప్కి న్స్, జాసన్ స్మిత్‌గా చెప్పారు. అయితే స్థానికులుగా ఉన్న వీరు విదేశీయుల పేర్లు చెప్పడంతో అదుపులోకి తీసుకొని విచారించ గా.. మొత్తం వ్యవహారం బయటపడింది. పోలీసులు 4 కాల్ సెంటర్లపై దాడులు చేసి 14 మందిని అరెస్టు చేశారు. పరారీలో ఉన్న ఇషాన్, రాహుల్ సహా నిందితుల్ని పట్టుకోవడానికి కేసును సీసీఎస్‌కు అప్పగించనున్నారు. పోలీసులకు చిక్కిన నిందితులు, వారి మారు పేర్లు 1. మహ్మద్ అబ్దుల్ పర్వేజ్-జాసన్ స్మిత్ 2. బాసిత్ అలీ అలియాస్ అర్షద్-బిన్ హాప్కిన్స్ 3. సయ్యద్ అఫ్సాన్ ఉల్ ఇస్లాముద్దీన్ అలియాస్ నౌమన్-కీత్ బ్రౌన్ 4. సయ్యద్ ముదసర్ మోయినుద్దీన్ అలియాస్ నౌషాద్-డేవిడ్ హోమ్స్ 5. ఎంకే ఖదీర్-రోగర్ బ్యాంక్స్ 6. వాసిర్ ఆసిఫ్-సామ్ విల్సన్ 7. వసీమ్ అహ్మద్-జాక్ స్మిత్ 8. సౌద్ అహ్మద్-అస్టిన్ మార్క్ 9. మహ్మద్ ఖయూమ్-కెవిన్ కూపర్ 10. షేక్ జునైద్-జేమ్స్ స్మిత్ 11. సయ్యద్ అబ్దుల్లా-స్టౌర్ట్ బ్రౌన్, ఫ్రాంక్ జోర్డాన్ 12. మహ్మద్ ఇంతియాజ్-స్టీవ్ జోనిస్ 13. సయ్యద్ సల్మాన్-డేవిడ్ వైట్ 14. రవితేజ-బీన్ హాకిన్స్ -
కాల్ సెంటర్ ఉద్యోగినిపై గ్యాంగ్ రేప్: నిందితులు అరెస్ట్
బెంగుళూరు: కాల్ సెంటర్ ఉద్యోగిపై సామూహిక అత్యాచారం కేసులో బెంగుళూరు పోలీసులు పురోగతి సాధించారు. ఈ కేసులో ఇద్దరు వ్యక్తులను అరెస్ట్ చేశారు. ఈ మేరకు నగర పోలీసు కమిషనర్ ఎన్ ఎస్ మేగారిక్ మంగళవారం వెల్లడించారు. అక్టోబర్ 3వ తేదీన కాల్ సెంటర్ ఉద్యోగిని(23) విధులు ముగించుకుని... ఇంటికి వెళ్లేందుకు రహదారిపై ప్రైవేట్ ట్యాక్సీ కోసం వేచి చూస్తుంది. ఆ క్రమంలో మినీ బస్సు వచ్చింది. దీంతో ఆమె ఆ వాహనం ఎక్కింది. బస్సును నిర్మానుష్య ప్రాంతానికి తీసుకు వెళ్లారు. అనంతరం ఆమెను కత్తితో బెదిరించి డ్రైవర్, క్లీనర్ అత్యాచారం చేశారు. తర్వాత ఆమెను నిర్మానుష్యంగా ఉన్న ప్రదేశంలో పడేశారు. దాంతో ఆమె తన సోదరితోపాటు స్నేహితులకు సమాచారం అందించింది. బాధితురాలిని సెయింట్ జోన్స్ ఆసుపత్రికి తరలించారు. అనంతరం పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోలీసులు బాధితురాలి వద్దకు వచ్చి ఫిర్యాదు స్వీకరించారు. -
కత్తితో బెదిరిస్తూ సామూహిక లైంగిక దాడి
-
కత్తితో బెదిరిస్తూ సామూహిక లైంగిక దాడి
బెంగళూరు: ఇది గతంలో దేశ రాజధాని ఢిల్లీలో జరిగిన సామూహిక లైంగిక దాడిని తలపించే మరో ఘటన. అయితే ఈసారి మాత్రం బెంగళూరులో. తన విధులు ముగించుకొని తిరిగొస్తున్న యువతిపై ముగ్గురు వ్యక్తులు కత్తితో బెదిరించి లైంగికదాడికి పాల్పడ్డారు. ఈ ఘటన కాస్త ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. మధ్యప్రదేశ్‌లోని గ్వాలియర్‌కు చెందిన 20 ఏళ్ల యువతి బెంగళూరులోని ఓ కాల్ సెంటర్ సంస్థలో ఉద్యోగం చేస్తూ తన అక్కతో ఉంటోంది. ఉద్యోగంలో భాగంగా రాత్రి తన విధులు ముగించుకొని ఇంటికి తిరిగొస్తూ మధ్యలో ఓ మినీ బస్సు ఎక్కింది. బస్సు కొంత దూరం వెళ్లాక అందులోని ఇద్దరు వ్యక్తులు ఆమెను కత్తితో బెదిరించారు. అనంతరం వారికి ఆ బస్సు డ్రైవర్ కూడా తోడవడంతో అంతాకలిసి బస్సులో ఆమెను నిర్మానుష్య ప్రాంతానికి తీసుకెళ్లి సామూహిక లైంగిక దాడికి పాల్పడ్డారు. అనంతరం ఆమెను మదివాలా అనే ప్రాంతంలోని ఓ గుడి వద్ద వదిలేసి వెళ్లిపోయారు. ఈ విషయం బాధితురాలు తన సోదరితో చెప్పడంతో ఆమె వచ్చి సమీపంలోని ఆస్పత్రిలో చేర్పించింది. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు ప్రారంభించారు. -
దరికి చేర్చే దారి కాల్ సెంటర్
పుష్కరఘాట్ (రాజమండ్రి): పుష్కర స్నానాలకు వచ్చి తప్పిపోయిన యాత్రికులను తిరిగి బంధువుల వద్దకు చేర్చడంలో కాల్‌సెంటర్లు చేస్తున్న సేవలు వెలకట్టలేనివి. పుష్కరఘాట్‌లో ఏర్పాటు చేసిన సెంట్రల్ కంట్రోల్ రూమ్ కాల్‌సెంటర్ నగరంలోని అన్ని ప్రాంతాల్లో తప్పిపోయిన వారి వివరాలను టోల్‌ఫ్రీ నంబర్ 12890 ద్వారా నమోదు చేసుకుని ఆ సమాచారాన్ని పోలీసులకు చేరవేస్తోంది. బీఎస్ఎన్ఎల్ ఆధ్వర్యంలో పది లైన్లతో కూడిన కాల్‌సెంటర్‌ను ఏర్పాటు చేశారు. శుక్రవారం వరకు సుమారు రెండు వేల మంది తప్పిపోయిన వారి వివరాలు నమోదు చేశారు. 1,930 మందిని గుర్తించి వారి బంధువుల వద్దకు చేర్చారు. మిగిలిన వారి వివరాల లభ్యం కాలేదు. రెవెన్యూ శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కాల్సెంటర్లో వివిధ కళాశాలల విద్యార్థులు సేవలందిస్తున్నారు. పుష్కర యాత్రికులకు సేవలు అందించే భాగ్యం కలిగినందుకు వీరు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. పుష్కర సేవ చేస్తానని ఊహించలేదు పుష్కరాల్లో సేవలందించే భాగ్యం లభిస్తుందని ఊహించలేదు. రాజమండ్రి ఆర్ట్స్ కళాశాలలో డిగ్రీ ఫైనల్ ఇయర్ చదువుతున్నాను. రెవెన్యూ శాఖ పిలిచిన ఇంటర్వ్యూలో కాల్‌సెంటర్ ఆపరేటర్‌గా ఎంపికై 12 రోజులు సేవలందించడం జీవితంలో మర్చిపోలేనిది. - పి.సాయికుమార్, కాకినాడ ఈ అనుభవం మర్చిపోలేనిది పుష్కరాల్లో విధులు నిర్వహించడం గొప్ప విష యం. కాల్సెంటర్లో పని చేసే అవకాశం లభించినప్పుడు చాలా సంతోషించాను. ఈ అనుభవం జీవితంలో మర్చిపోలేనిది. - వి.హర్షిత, సీఏ విద్యార్థిని -
చిన్న పట్టణాల్లో బీపీవో సెంటర్లు
న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా చిన్న పట్టణాల్లో బిజినెస్ ప్రాసెస్ అవుట్సోర్సింగ్ కేంద్రాలను ఏర్పాటు చేసేలా కంపెనీలను ప్రోత్సహించేందుకు ఉద్దేశించిన బీపీవో విధానాన్ని ఖరారు చేసినట్లు టెలికం మంత్రి రవి శంకర్ ప్రసాద్ తెలిపారు. దీని ప్రకారం దేశవ్యాప్తంగా 48,000 సీట్ల ఏర్పాటుకు అనుమతించినట్లు వివరించారు. జనాభా ఆధారంగా కాల్ సెంటర్లలో సీట్లను వివిధ రాష్ట్రాలకు కేటాయించనున్నట్లు పేర్కొన్నారు. ఇందులో భాగంగా కాల్ సెంటర్ల ఏర్పాటు కోసం ఆసక్తి వ్యక్తీకరణ పత్రాలను ఆహ్వానించనున్నట్లు ఆయన వివరించారు. నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ (ఎన్ఐఈఎల్ఐటీ) ప్రధాన కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో పాల్గొన్న సందర్భంగా మంత్రి ఈ విషయాలు తెలిపారు. చిన్న పట్టణాల్లో కూడా కాల్ సెంటర్ల కార్యకలాపాలు ప్రారంభమైతే ఐటీ నిపుణులకు డిమాండ్ పెరుగుతుందని వివరించారు. -
విద్యుత్‌కు అంతరాయం
♦ ఈదురు గాలితో కూడిన వర్షం ఎఫెక్ట్... ♦ పలు ప్రాంతాల్లో రోజంతా నిలిచిపోయిన విద్యుత్ సరఫరా ♦ మూగబోయిన కాల్‌సెంటర్, లైన్మెన్, ఏఈ,డీఈల ఫోన్లు స్విచ్ ఆఫ్ సాక్షి, సిటీబ్యూరో : వర్షాల కారణంగా నగరంలో పలు ప్రాంతాల్లో విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. ఈదురుగాలలతో కూడిన వర్షం వల్ల గుడిమల్కాపూర్ పరిధిలోని తాళ్లగడ్డ, అశోక్విహార్కాలనీ, భగవాన్‌దాస్ కాలనీల్లో శనివారం అర్థరాత్రి నుంచి ఆదివారం రాత్రి 8 గంటల వరకు విద్యుత్ సరఫరా లేదు. అదేవిధంగా కూకట్పల్లి పరిధిలోని బాగ్అమీర్ ప్రాంతంలో ఆదివారం ఉదయం 9.30 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు, మోతీనగర్ పరిధిలోని పాండురంగారావు కాలనీలో ఉదయం నుంచి రాత్రి ఏడు గంటల వరకు కరెంట్ లేదు. సుమారు వంద ఫీడర్ల పరిధిలో విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడింది. వినియోగదారులు రోజంతా అంధకారంలో మగ్గాల్సి వచ్చింది. ముఖ్యంగా లిఫ్ట్‌లు పనిచేయక పోవడంతో అపార్ట్మెంట్ వాసులు తీవ్ర ఇబ్బంది పడ్డారు. బస్తీల్లో మంచినీటి సరఫరా నిలిచి పోయింది. అత్యవసర సమయంలో మూగబోతున్న ఫోన్లు విద్యుత్ ప్రమాదాలు, కోతలు, ఇతర సమస్యలపై వినియోగదాల నుంచి ఫిర్యాదులు స్వీకరించేందుకు డిస్కం 1912 సర్వీసు నెంబ ర్ను, ప్రతి సర్కిల్‌కు ప్రత్యేకంగా ఫ్యూజ్ ఆఫ్ కాల్‌ను ఏర్పాటు చేసింది. అత్యవసర పరిస్థితుల్లో వాటికి ఫోన్ చేస్తే ఎవరూ ఎత్తడం లేదు. ఫిర్యాదుల సత్వర పరిష్కారం కోసం ఎస్ఇ నుంచి కిందిస్థాయి లైన్మెన్ వరకు ఉచిత ఫోన్ సౌకర్యం కల్పించింది. వీటిని సొంత అవసరాల కోసం ఉపయోగించుకుంటూ, అత్యవసర పరిస్థితుల్లో ఫోన్లను స్విచ్ ఆఫ్ చేస్తున్నారు. శనివారం సాయంత్రం వీచిన భారీ ఈదురు గాలులకు చాలా చోట్ల విద్యుత్ సరఫరా నిలిచి పోయింది. ఈ సమయంలో వేలాది మంది కాల్ సెంటర్‌కు ఫోన్ చేశారు. ఇది మూగబోవడంతో స్థానిక లైన్మెన్లకు, ఫ్యూజ్ ఆఫ్ కాల్‌సెంటర్ సిబ్బంది కి ఫోన్ చేస్తే, ఏ ఒక్కరూ ఫోన్ ఎత్త లేదు. -
మేడిన్ ఇండియా!
భారత్ ప్రపంచానికి కార్మికులను అందించే కర్మాగారం... ఇండియా అంటే ఒక కాల్‌సెంటర్! ఔట్సోర్సింగ్ తో పొరుగు దేశాలకు సేవలనందిస్తూ పొట్టనింపుకొనే దేశం.. ఇది నాణేనికి ఒక వైపు!అతి తక్కువ ఖర్చుతో అంగారక గ్రహ కక్ష్యలోకి ఉపగ్రహాన్ని పంపిన దేశం. ఒక హాలీవుడ్ సినిమా బడ్జెట్ కన్నా తక్కువ ఖర్చు తోనే ఆ అద్భుతాన్ని సృష్టించగలిగారు భారత శాస్త్రవేత్తలు. ఈ విషయంలో నాసా, ఇసాలు కూడా ఇండియాని చూసి ఔరా అనుకొన్నాయి. ఇదీ ప్రపంచానికి ఇప్పుడిప్పుడే అర్థం అవుతున్న ఇండియా రెండో కోణం! అంతేనా... తరచి చూడాలి కానీ ఇంకా ఎంతో ఉంది. కేవలం ఇస్రో చేస్తున్నవి మాత్రమే కాదు ఇంకా ఎన్నో అద్భుతాలు జరుగుతున్నాయి. గత దశాబ్దాల్లో మేధోవలసతో సతమతమైన దేశంలో ఇప్పుడు స్టార్టప్‌ల మోతమోగుతోంది. గ్లోబలైజేషన్ పుణ్యమా అని మన మేధావులు వారి వీధుల నుంచే విశ్వవ్యాప్త గుర్తింపు పొందుతున్నారు. అనేక మందికి ఉపాధి చూపగల, మానవ జీవితాన్ని సౌకర్యవంతం చేయగల వారి ఆవిష్కరణల ద్వారా అబ్బురపరచడానికి సన్నద్ధం అవుతున్నారు. అలాంటి వారిలో కొందరి గురించి.. వారి ఆవిష్కరణల గురించి... తవుడు నుంచి విద్యుత్! విద్యుత్ కోతల గురించి భారతీయులకు ఉన్నంత విజ్ఞానం ఎవరికీ ఉండదు. మరి అందరికీ అవగాహన ఉన్న ఈ అంశంపై ఒక పరిష్కారమార్గాన్ని కనుగొని వార్తల్లోకి వచ్చాడు జ్ఞానేష్పాండే అనే బిహారీ. ఇతడి ఆలోచన ఇప్పుడు బీహార్, జార్ఖండ్ రాష్ట్రాల్లో సరికొత్త పవర్ ప్లాంట్లను ఆవిష్కరించింది. 250 గ్రామాల్లోని 20,000 గృహాల్లో కరెంటు దీపాన్ని వెలిగించింది. తవుడుతో విద్యుత్‌ను ఉత్పత్తి చేసే ప్లాంట్‌ను ఆవిష్కరించాడు పాండే. గ్రామీణప్రాంతాల్లో వరి తవుడు విస్తృతంగా అందుబాటులో ఉంటుంది. పశువుల దాణాకు ఉపయోగించే ఈ తవుడుతోనే ఇప్పుడు అక్కడ విద్యుత్ ఉత్పత్తి అవుతోంది. మన సమాజాలను ప్రభావితం చేయడానికి ఇంతకన్నా గొప్ప ఆలోచన ఏముంది! వ్యవ‘సాయం’ చేస్తుంది! పంటలకు పురుగుమందులను స్ప్రే చేయడానికి తగిన డ్రోన్‌ను రూపొందించాడు దులాల్ అధికారి అనే బెంగాల్ విద్యార్థి. సాధారణంగా మోటార్స్ప్రేయర్లతో రసాయనాలను స్ప్రే చేస్తారు. ఇది కష్టంతో కూడుకొన్న పని.. ఎక్కువ సమయం తీసుకొనే పని. కొన్ని రకాల పంటలకు మోటార్స్ప్రేతో మందులు చల్లడం కూడా సాధ్యం కాదు. ఈ అవాంతరాలను నివారిస్తుంది ఈ డ్రోన్. గాల్లో విహరిస్తూ పెస్టిసైడ్లను స్ప్రే చేస్తుంది. పూర్తిస్థాయి దేశీయ యంత్రసామగ్రితో దీన్ని రూపొందించారు. దీనికి 40 వేల రూపాయలు ఖర్చు అవుతుంది. ఉపయోగం మాత్రం అమూల్యమైనది. ఒక మోటార్ స్ప్రేయర్ మూడుగంటల్లో చేయగల పనిని రిమోట్ కంట్రోల్ ద్వారా పనిచేసే ఈ డ్రోన్ స్ప్రేయర్ కేవలం పది నుంచి పన్నెండు నిమిషాల్లో పూర్తి చేస్తుందంటే దీని గొప్పతనాన్ని సులభంగా అర్థం చేసుకోవచ్చు. పిజ్జా ఇక చల్లారదు! పిజ్జా మన ఆహారం కాదు.. అయితే ప్రపంచ వ్యాప్తంగా ప్రజలు ఇష్టంగా తినే పిజ్జా ప్యాకింగ్ విషయంలో ఒక భారతీయుడి ఆవిష్కరణకు గొప్ప గుర్తింపు దక్కింది. మంచి ఆదరణ లభిస్తోంది. ముంబైకి చెందిన వినయ్ మెహతా అనే ప్యాకేజర్ ‘వెన్టిట్’ అనే పిజ్జా ప్యాకింగ్బాక్స్ను రూపొందించాడు. పిజ్జాను వేడి వేడిగా ఉంచడటమే దీని ప్రత్యేకత. ప్యాక్ చేసిన పిజ్జాను డెలివరీ అయ్యేంత వరకూ హాట్ హాట్ ఉంచే విన్టిట్ బాక్స్ పిజ్జామేకింగ్సంస్థలకు బాగా నచ్చేసింది. దీంతో మెహతాకు ప్రపంచవ్యాప్త గుర్తింపు వచ్చింది. వెన్టిట్ బాక్స్‌కు వందదేశాల్లో పేటెంట్ దక్కిందంటే.. మెహతా సాధించిన విజయం ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు. త్రినేత్రంతో చూడొచ్చు... దృష్టి సంబంధ సమస్యల పరిశీలనలో త్రినేత్ర ఆవిష్కరణ గొప్ప అభివృద్ధి అని అంటున్నారు నిపుణులు. బెంగళూరు పరిశోధకులు కే చంద్రశేఖర్, శ్యామ్ వాసుదేవరావులు అభివృద్ధి పరిచిన ఈ వైద్యశాస్త్ర పరికరం కంటి పరీక్షలకు ఉపయోగపడుతుంది. దీనితో కళ్లను పరీక్షించడం ద్వారా ఐదు రకాల దృష్టిదోషాలను ముందుగానే కనుగొనవచ్చు. కాటరాక్ట్, డయాబెటిక్ రెటీనా, కార్నియా వంటి దృష్టి సంబంధ సమస్యలను ముందుగానే గుర్తించవచ్చు. ముందస్తు చికిత్సకు వెళ్లవచ్చు. ముందుగానే సమస్యలను గుర్తించగల శక్తి ఉన్న ఈ పరికరానికి ’త్రినేత్ర’ అనే పేరు పెట్టారు ఆవిష్కర్తలు. ఇప్పటికే ఈ తరహా పరికరాలు కొన్ని అందుబాటులో ఉన్నప్పటికీ ధర విషయంలో త్రినేత్ర వాటిలో ఐదోవంతు మాత్రమే ఉంటుంది. శ్వాసతోనే సౌకర్యం! కేవలం శ్వాసతోనే ఎలక్ట్రిక్ వీల్ చైర్ దిశను మార్చగల అధునాతన ఆలోచనను ఆవిష్కరింపజేసి చూపాడు సుశాంత్ పత్నిక్. శారీరక వైకల్యంతో బాధపడుతూ వీల్ చైర్‌కే పరిమితం అయిన వారి అవస్థ ఈ కుర్రాడిని కదిలింపజేశాయి. వారు వీల్చెయిర్మీద అయినా తమకు నచ్చినట్టుగా కదలడానికి తగిన విధంగా ఏర్పాటు చేయాలన్న లక్ష్యంతో ఇతడు ‘బ్రీతింగ్ సెన్సర్ ఆపరేటస్’ను రూపొందించాడు. వీల్‌చెయిర్‌కు పరిమితమైన వ్యక్తులు చెయ్యి, కాలు కదల్చాన అవసరం లేకుండా శ్వాసను బట్టే వారి చక్రాల కుర్చీ కదిలే ఏర్పాటు చేశాడు సుశాంత్. తన ఆవిష్కరణకు ద్వారా వీల్ చెయిర్‌ను కదిలించలేని శారీరక వికలాంగులకు గొప్పవరాన్ని ప్రసాదించిన సుశాంత్‌కు నేషనల్ ఇన్నోవేషన్ ఫౌండేషన్ వారి అవార్డు కూడా దక్కింది. పల్లెటూరి ఫ్రిడ్జ్ గ్రామీణ ప్రాంత ప్రజలకు సౌకర్యం కోసం కాదు కానీ.. పండించిన కూరగాయల, ఆకుకూరల కోసం రిఫ్రిజిరేటర్ అవసరం. కాయగూరలు, ఆకుకూరలు, పళ్లు వంటివి సాధారణ వాతావరణంలో తొందరగా పాడైపోతాయి. వాటిని శీతలవాతావరణంలో నిల్వ ఉంచితే మార్కెటింగ్‌కు అవకాశం ఉంటుంది. ఇలాంటి నేపథ్యంలో జోధ్‌పూర్ లోని సెంట్రల్ అరిడ్ జోన్ పరిశోధక కేంద్రం వారు కొత్తరకమైన రిఫ్రిజిరేటర్‌ను రూపొందించారు. విద్యుత్ అవసరం లేకుండా పనిచేయడం దీని ప్రత్యేకత. ఇసుక, సిమెంటు, ఇటుకల సాయంతో నిర్మించే ఇది బాష్పీభవనం సూత్రం మీద పనిచేస్తుంది. ఇళ్ల వద్దే నిర్మించుకోగల ఇది మండువేసవిలో కూడా 12 డిగ్రీల సెంటీగ్రేడ్ ఉష్ణోగ్రతతో ఉంటుంది. దీంట్లో ముప్పైనుంచి యాభై కిలోగ్రాముల కాయగూరలను నాలుగైదు రోజుల వరకూ నిల్వ ఉంచుకోవడానికి అవకాశం ఉంటుంది. -
ప్రాణాలు రక్షించిన 'కాల్ సెంటర్'
వేళాపాళా లేకుండా వ్యాపార సంస్థల కాల్ సెంటర్ల నుంచి వచ్చే ఫోన్ కాల్స్‌కు చిర్రెత్తుకొస్తుంది. కొన్నిసార్లు ఫోన్ చేసిన వాళ్లను చెడామడా తిట్టేస్తాం కూడా. అయితే లాస్ వేగస్ నుంచి 1448 కిలోమీటర్ల దూరంలోని ఓరగాన్ (లెబనాన్) పట్టణానికి అలా వెళ్లిన ఓ కాల్ ఆపదలో ఉన్న ఓ యువతి ప్రాణాలను కాపాడింది. దాంతో ఎప్పుడూ తిట్లు తినే ఆ కాల్ సెంటర్ ఉద్యోగులను ప్రశంసల జల్లు ముంచెత్తింది. ఓరేగాన్ పోలీసులు మీడియాకు వెల్లడించిన వివరాల ప్రకారం.....అమెరికేర్ హెల్త్ అండ్ న్యూట్రిషన్ కాల్ సెంటర్ నుంచి చమెల్లీ మ్యాక్ ఎలోరి అనే ఉద్యోగిని తన విధి నిర్వహణలో భాగంగా ఇటీవల లెబనాన్‌లోని ఓరెగాన్ పట్టణంలోని ఓ సెల్‌ఫోన్‌కు ఫోన్ చేసింది. అవతలి వైపు నుంచి 'హలో' అని వినిపించకుండా రక్షించండంటూ ప్రాణభీతితో ఓ యువతి చేసిన ఆర్తనాదాలు వినిపించాయి. ఎలోరి ఫోన్ పెట్టేయకుండా తన సూపర్వైజర్ టినా గ్రేషియాకు ఈ విషయం తెలియజేసింది. అతను వెంటనే విషయాన్ని కంపెనీ సీఈవో మారియో గోంజాలెజ్ దృష్టికి తీసుకెళ్లారు. ఆయన కూడా ఫోన్లో వినిపిస్తున్న ఓ యువతి ఆర్తనాదాలు విన్నారు. వెంటనే ఈ విషయాన్ని లాస్ వేగస్ పోలీసులకు తెలియజేయాలనుకున్నారు. దీనికి బదులుగా ఓరేగాన్‌లోని స్థానిక పోలీసులకు తెలియజేయడమె మంచిదని భావించి అప్పటికప్పుడు సమాచారాన్ని అక్కడికి చేరవేశారు. మారియో ఫోన్‌కాల్‌ను రిసీవ్ చేసుకున్న ఓరెగాన్ పోలీసులు తక్షణమే స్పందించి ఫోన్ సిగ్నల్ ఆధారంగా ఆపదలో ఉన్న యువతి చిరునామాను కనుక్కొని ఆగమేఘాలపై అక్కడికి చేరుకున్నారు. పోలీసులు ఇంట్లోకి వెళ్లగానే 33 ఏళ్ల వాల్టర్ వారెన్ జాన్రుక్ తన భార్యను వెనక నుంచి గట్టిగా పట్టుకొని హింసిస్తుండడం కనిపించింది. పోలీసులు అతన్ని రివాల్వర్లతో బెదిరించి అదుపులోకి తీసుకున్నారు. దిండ్లతో, బ్లాంకెట్లతో తనను ఊపిరాడకుండా చేసి చంపేందుకు ప్రయత్నించాడని, ఆ ప్రయత్నం నుంచి తప్పించుకుంటే గుండెకు రివాల్వర్‌ను ఎక్కుపెట్టి చంపేస్తానని బెదిరించాడని, అదే సమయంలో తన వెనుక జేబులో ఉన్న సెల్‌ఫోన్ మోగిందని, దాన్ని జాన్రుక్కు తెలియకుండా ఆన్ చేశానని బాధితురాలు జరిగిన విషయాన్ని వివరించారు. నిందితుడిని లిన్ కౌంటీ జైలుకు తరలించిన ఫోలీసులు అమెరికేర్ హెల్త్ కాల్ సెంటర్‌కు ఫోన్‌చేసి సకాలంలో స్పందించిన కెంపెనీ సీఈవో, ఉద్యోగులను ప్రశంసించారు. -
స్వైన్‌ఫ్లూ ఫిర్యాదుల కోసం కాల్ సెంటర్ (104)
-
స్వైన్‌ఫ్లూ వ్యాక్సిన్‌తో ప్రయోజనం లేదు: నరేంద్రనాథ్
స్వైన్‌ఫ్లూ నివారణకు వ్యాక్సిన్‌తో ప్రయోజనం ఉండదని, పరిసరాల పరిశుభ్రతే ఉత్తమ మార్గమని నిమ్స్ డైరెక్టర్ డాక్టర్ నరేంద్రనాథ్ అన్నారు. స్వైన్‌ఫ్లూ సంబంధిత ఫిర్యాదుల కోసం కాల్ సెంటర్ (104) ఏర్పాటు చేశామని నిమ్స్ డైరెక్టర్ చెప్పారు. స్వైన్‌ఫ్లూ వ్యాధిపై వైద్యులకు, సిబ్బందికి కౌన్సెలింగ్ ఇచ్చామని, అన్ని జిల్లా ఏరియా ఆస్పత్రులకు స్వైన్‌ఫ్లూ మందులు చేరాయని నరేంద్రనాథ్ తెలిపారు. స్వైన్‌ఫ్లూతో ఇప్పటివరకూ 20 మృతిచెందారని ఆయన తెలిపారు. 754 మందికి పరీక్షలు చేయించగా, 249 మందికి స్వైన్‌ఫ్లూ ఉన్నట్లు తేలిందని నరేంద్రనాథ్ చెప్పారు. -
తొలి రోజే 2,534 ఫిర్యాదులు
-
కాల్‌సెంటర్ క్యాబ్‌లలో జీపీఎస్ వ్యవస్థ
సాక్షి, ముంబై: కాల్‌సెంటర్ ఉద్యోగులను తరలించే అన్ని వాహనాలలో ఠాణే ట్రాఫిక్ పోలీసులు ట్రాకింగ్ పరికరాన్ని అమర్చనున్నారు. ఈ పరికరాన్ని అమర్చిన వాహనాన్ని ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ గోడ్బందర్ రోడ్ వద్ద సోమవారం ప్రారంభించనున్నారు. రోడ్డు భద్రత వారోత్సవాలలో భాగంగా ‘సురక్షితంగా ప్రయాణించు’ అన్న నినాదంతో ఠాణే ట్రాఫిక్ పోలీసులు ఈ ప్రయత్నానికి శ్రీకారం చుట్టారు. కాల్‌సెంటర్ క్యాబ్‌లలో జీపీఎస్ వ్యవస్థను అమర్చడం ద్వారా అందులే ప్రయాణించే మహిళలు వాహనం ఎక్కినప్పటి నుంచి గమ్యస్థానం చేరే వరకు ఈ వ్యవస్థ ట్రాకింగ్ చేస్తుంది. ఈ వ్యవస్థ మహిళా ఉద్యోగుల తల్లిదండ్రులకు ఎంతో సహాయకరంగా ఉంటుందని ఠాణే ట్రాఫిక్ డిప్యూటి కమిషనర్ ఆఫ్ పోలీస్ రష్మీ కరాండీకర్ అన్నారు. కాల్ సెంటర్ ఉద్యోగులను తరలించే అన్ని వాహనాలలో ఈ పరికరాన్ని అమర్చుతామన్నారు. ఈ విధానంలో మహిళా ఉద్యోగులకు ఓ చిప్‌ను అందజేస్తారు. ఆ చిప్‌లో సదరు ప్రయాణికురాలి వివరాలు, ఆమె ఐదుగురి బంధువుల ఫోన్ నెంబర్లు ఉంటాయి. వాహనంలో ప్రయాణం చేసే సమయంలో సదరు మహిళా ప్రయాణికురాలు ఆ చిప్‌ను పరికరంలో ఉంచాలి. దీంతో కుటుంటు సభ్యులు ఆమె ఎక్కడ ఉందన్న సమాచారం తెలుసుకోవచ్చు. -
వెలుగు అక్రమార్కులపై జేసీ వేటు
కర్నూలు అగ్రికల్చర్ : డీఆర్డీఏ - వెలుగులో అక్రమార్జనే లక్ష్యంగా పని చేస్తున్న నలుగురిపై జాయింట్ కలెక్టర్, ఇన్చార్జి పీడీ కన్నబాబు వేటు వేశారు. ఒకరిని ఉద్యోగం నుంచి పూర్తిగా తొలగించగా, మరో ముగ్గురిని సస్పెండ్ చేస్తూ శుక్రవారం ఉత్తర్వులు జారీ చేశారు. డీఆర్డీఏ-వెలుగు అవినీతి, అక్రమాలకు పెట్టింది పేరుగా మారింది. త్వరలో మరో 36 మందిపై వేటు వేయడానికి జేసీ రంగం సిద్ధం చేశారు. జిల్లా మహిళా సమాఖ్య ఆధ్వర్యంలో పని చేస్తున్న బీమా కాల్ సెంటర్లో జరిగిన అక్రమాలపై సమగ్ర విచారణ బాధ్యతలను సీఐడీకి అప్పగించేందుకు ప్రయత్నిస్తున్నారు. ఎమ్మిగనూరు క్లస్టర్లో సీసీగా పని చేస్తున్న ఎం.జయరాముడు(డీఎంజీ) మహిళా సమాఖ్య నుంచి గ్రామైక్య సంఘాలకు వెళ్లే నిధులను, స్త్రీనిధి నిధులను తన భార్య ఖాతాకు మళ్లించి స్వాహా చేసినట్లు ఆరోపణలు ఉన్నాయి. స్వాహా మొత్తం లక్షల్లో ఉన్నట్లు తెలుస్తోంది. జేసీ దీనిపై సమగ్రంగా విచారణ జరిపించగా వాస్తవాలు వెల్లడయ్యాయి. తిన్న మొత్తంలో రూ.3 లక్షల వరకు రికవరీ చేసినట్లు సమాచారం. అక్రమాలకు సీసీ జయరాముడిని బాధ్యుడిని చేస్తూ సర్వీస్ నుంచి తొలగించారు. ఆత్మకూరు మండల ఏపీఎం కె.సుబ్బయ్యపై సస్పెన్షన్ వేటు వేశారు. గ్రామైక్య సంఘం సమావేశం గ్రామంలో జరగాల్సి ఉండగా అందుకు విరుద్ధంగా మండల సమాఖ్యలో నిర్వహించడం వివాదాస్పదం అయింది. ఇది పోలీస్ కేసు వరకు వెళ్లింది. వడ్ల రామాపురం, నల్ల కాల్వ గ్రామాల్లో ఎస్సీ, ఎస్టీ సబ్ ప్లాన్ నిధుల పంపిణీలో అక్రమాలకు పాల్పడ్డారు. దీనిపై ఆత్మకూరు ఏపీఎంను సస్పెండ్ చేశారు. మద్దికెర ఏపీఎం మహేశ్వరయ్యను సస్పెండ్ చేశారు. బ్యాంకుల నుంచి తీసుకున్న రుణాల రికవరీ నిమిత్తం వసూలు చేసి బ్యాంకులకు జమ చేయకుండా రూ.14 లక్షలు స్వాహా చేయడంతో ఈ చర్య తీసుకున్నారు. పత్తికొండ క్లస్టర్ డీఎంజీ రవికుమార్ రూ.13.50 లక్షలు స్వాహా చేశారనే ఆరోపణలు ఉన్నాయి. ఈయనను సస్పెండ్ చేస్తూ సమగ్ర విచారణ జరపాలని అదనపు పీడీ లలితాబాయిని ఆదేశించారు. -
పౌరసేవలపై త్వరలో కాల్‌సెంటర్
ఎస్డీఎంసీ స్థాయీసంఘం చైర్మన్ సుభాష్ ఆర్య న్యూఢిల్లీ: పౌర సేవలకు సంబంధించిన సమాచారం ఇక అడిగిన వెంటనే అందనుంది. దీంతోపాటు ఫిర్యాదుచేసేందుకు కూడా ఓ అవకాశం లభించనుంది. ఇందుకు సంబంధించి త్వరలో కాల్‌సెంటర్‌ను ఏర్పాటు చేయాలని దక్షిణ ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్ (ఎస్డీఎంసీ) నిర్ణయించింది. ఈ విషయాన్ని ఎస్డీఎంసీ స్థాయీసంఘం నూతన చైర్మన్ సుభాష్ ఆర్య వెల్లడించారు. శుక్రవారం ఆయన ఇక్కడ మీడియాతో మాట్లాడుతూ కార్పొరేషన్‌కు సంబంధించిన సమాచారం ఈ సెంటర్లో అందుబాటులో ఉంటుందన్నారు. దీంతోపాటు తమ సమస్యలను నగరపౌరులు ఈ సెంటర్లో నమోదు చేయవచ్చన్నారు. అంకితభావంతో పనిచేస్తా అధిష్టానం తనకు కీలక బాధ్యతలను అప్పగించిందని బీజేపీ నాయకుడు, ఎస్డీఎంసీ స్థాయీసంఘం నూతన చైర్మన్ అయిన సుభాష్ ఆర్య పేర్కొన్నారు. అంకితభావంతో తన విధులను నిర్వర్తిస్తానన్నారు. ప్రధానమంత్రి నరేంద్రమోడీ చేపట్టిన స్వచ్ఛ్ భారత్ అభియాన్‌ను కొనసాగించడమే తన లక్ష్యమన్నారు. ఎస్డీఎంసీ పరిధిలో పారిశుధ్య వ్యవస్థను మరింత పటిష్టం చేస్తాన న్నారు. అవినీతిని అంతమొందించేందుకు శాయశక్తులా కృషి చేస్తానన్నారు. ఎస్‌డీఎంసీలో ఇన్స్పెక్టర్ రాజ్ లేకుండా చేస్తానని, పనితీరును మెరుగుపరుస్తానని ఆయన పేర్కొన్నారు. -
మూగబోయిన కాల్ సెంటర్లు
శ్రీకాకుళం: హుదూద్ తుపాన్ నేపథ్యంలో జిల్లాలో గత రాత్రి 11.00 గంటల నుంచి విద్యా సరఫరాను అధికారులు నిలిపివేశారు. దీంతో జిల్లాలో సమాచార వ్యవస్థ పూర్తిగా స్తంభించింపోయింది. జిల్లాలోని పలు ఎమ్మార్వో కార్యాలయాల్లో కాల్ సెంటర్లు పని చేయలేదు. దాంతో ఉన్నతాధికారులు... పోలీసులు వద్ద ఉన్న యూహెచ్ఎఫ్ సెట్లపైనే అధారపడి పని చేస్తున్నారు. సహాయక చర్యలు ఎక్కడికక్కడ నిలిచిపోయాయి. భారీ వర్షాలు... ఈదురు గాలులతో శ్రీకాకుళం పట్టణంలో పలు కాలనీల్లో చెట్లు కూలిపోయాయి. అలాగే శ్రీకాకుళం - పాలకొండ, శ్రీకాకుళం - కళింగపట్నం, శ్రీకాకుళం - రాజాం రహదారులపై భారీ వృక్షాలు కుప్ప కూలిపోయాయి. దీంతో ఎక్కడికక్కడ వావానాలు నిలిచిపోయాయి. -
అనాథలున్నారు...చందాలివ్వండి!
అనాథల పేరుతో ‘గివ్ లైఫ్ ట్రస్టు’ వ్యాపారం దాతల నుంచి విరాళాల సేకరణ స్థానిక పిల్లలనే అనాథలుగా చిత్రీకరణ సాక్షి, సిటీబ్యూరో: ‘అనాథ పిల్లలను ఆదరిస్తున్నామ’ంటూ ‘సేవ’ ముసుగులో కొన్ని స్వచ్ఛం ద సంస్థలు ప్రజలను మోసగిస్తున్నాయి. దాతలు ఇస్తున్న విరాళాలను పక్కదోవ పట్టిస్తున్నాయి. ఈ కోవకు చెందినదే చందానగర్‌లోని పాపిరెడ్డి కాలనీలో గల ‘గివ్ లైఫ్ ట్రస్టు’. అనాథ పిల్లల సేవ పేరిట రూ.లక్షల్లో దోచుకుంటోందంటూ ఈ సంస్థపై ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. కాల్ సెంటర్ నుంచే విజ్ఞప్తులు అమీర్‌పేటలోని సారథి స్టూడియో పక్క గల్లీలోని శ్రీసాయి రెసిడెన్సీలో ‘గివ్ లైఫ్ ట్రస్టు’కు చెందిన కాల్‌సెంటర్ నడుస్తోం ది. ఇందులో 22 మంది సిబ్బంది ఉన్నా రు. ఉదయం 9 నుంచి సాయంత్రం 6 గంటల వరకు నిరంతరాయంగా వీరు ప్రజలకు ఫోన్లు చేస్తుంటారు. ‘మేము అనాథాశ్రమం నుంచి మాట్లాడుతున్నాం. మా వద్ద 30 మంది పిల్లలు ఉన్నారు. సార్ మీరు ఏమైనా సాయం చేయండి’ అంటూ కాల్‌సెంటర్ నుంచి ఫోన్ వస్తుంది. ఆశ్రమం ఎక్కడని అడిగితే చందానగర్ రైల్వే స్టేషన్ సమీపంలోని పాపిరెడ్డి కాలనీలోనని చెబుతారు. దాతలు వస్తే..స్థానికంగా ఉండే నిరుపేదల పిల్లలను పోగుచేసి అనాథలుగా చూపించి, సాయం పొందుతున్నారు. ఈ డబ్బును నిర్వాహకులు పక్కదారి పట్టిస్తున్నారనేవిమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఇక్కడే ఎందుకంటే... పాపిరెడ్డి కాలనీలో నిరుపేద కుటుంబా లు ఎక్కువ. ఇది గ్రహించిన గివ్ లైఫ్ చారిటబుల్ ట్రస్ట్ నిర్వాహకులు చుట్టుపక్కల కుటుంబాల పిల్లలను తమ వద్దకు పంపితే ఉచితంగా భోజనం పెడతామని ప్రచారం చేశారు. వారి తల్లిదండ్రులు సైతం అంగీకరించారు. దీన్ని ఆసరాగా చేసుకుని నిర్వాహకులు తమ వద్ద అనాథలు ఉన్నారని ప్రచారం చేస్తూ అక్రమంగా సొమ్ము చేసుకుంటున్నారు. ఇది గుర్తించిన అడిగిన పిల్లల తల్లిదండ్రులపై బెదిరింపులకు దిగుతున్నారు. శని, ఆదివారాల్లో సందడి.. ‘గివ్ లైఫ్ చారిటబుల్ ట్రస్ట్’ నుంచి ఎక్కువగా సాఫ్ట్వేర్ ఉద్యోగులకు ఫోన్లు వెళుతుంటాయి. శని, ఆదివారాలు సెల వు ఉండటంతో ఆ రోజుల్లో వారు అనాథశ్రమానికి వెళుతుంటారు. కొంత మంది తమ పుట్టిన రోజు వేడుకలను జరుపుకునేందుకు, మరికొంత మంది అనాథ పిల్లలతో సరదాగా గడిపేందుకు వెళుతుంటా రు. వీళ్లను నమ్మించి సంస్థ సభ్యులు విరాళాలు సేకరిస్తుంటారు. అలా వీరికి ఏటా రూ.లక్షల్లో అందుతున్నాయి. వీరి ఫోన్ కాల్స్‌ను నమ్మిన అనేక మంది ఉద్యోగులు నేరుగా సంస్థ ఖాతాలోకి భారీగానే డబ్బు వేశారని తెలుస్తోంది. సంస్థ చూపుతున్న 30 మంది పిల్లల్లో ఐదుగురు మాత్రమే అనాథలని, మిగతా పిల్లలు చుట్టుపక్కల వారేనని స్థానికులుచెబుతున్నారు. తక్కువ ధరకే అమ్మకం దాతలు విరాళాలుగా ఇచ్చిన 25 కేజీల బియ్యాన్ని రూ.700కు, ఇతర సరుకులను తక్కువ ధరకు అమ్ముతున్నారని సమీపంలోని వారు చెబుతున్నారు. ప్రభుత్వ అధికారులు స్పందించి ఈ అనాథాశ్రమం అక్రమమా.. సక్రమమా అని తేల్చాల్సి ఉంది. ఈ విషయంపై సంస్థ ప్రతినిథులతో మాట్లాడేందుకు ‘సాక్షి’ పలుమార్లు ఫోన్లో సంప్రదించగా, స్పందన కరువైంది. -
ప్రేమ పురాణం బయటపడుతుందని...
వివాహిత ఘాతుకం బీరులో విషం కలిపి.... కారుతో ఢీకొట్టి ప్రియుడిని చంపేసిన వైనం గతనెల 31న రామనగర వద్ద హత్య నిందితురాలిని అరెస్ట్ చేసిన పోలీసులు బెంగళూరు : ప్రేమ ముసుగులో ప్రియుడి ని మోసగిస్తూ చివరి వరకు తనకు పెళ్లి కాలేదని మభ్య పెడుతూ అతనితో తిరుగుతూ జల్సాలు చేస్తూ చివరికి అతడినే సినిమా ఫక్కిలో దారుణంగా హత్య చేసిన వివాహితను పోలీసులు అరెస్టు చేశారు. ఇక్కడి సదాశివనగరలో నివాసం ఉంటున్న నఫీజా (40)ను అరెస్టు చేశామని ఆదివారం పోలీసులు చెప్పారు. గతనెల 31న విజయనగరకు చెందిన హేమంత్ కుమార్ (47) దారుణ హత్యకు గురైన విషయం తెల్సిందే. వివరాలు... నఫీజా, ఉదయ్ కుమార్‌లకు పదేళ్ల క్రితం వివాహం జరిగింది. నఫీజా కాల్ సెంటర్ ఉద్యోగి. అక్కడే హేమంత్ కుమార్ అనే వ్యక్తి నఫీజాకు పరిచయమయ్యాడు. ఇద్దరూ ప్రేమించుకున్నారు. విలాసాల కోసం నఫీజా హేమంత్‌తో భారీగా ఖర్చు చేయించేది. ఇదే సమయంలో తాను వివాహితనని ఎక్కడ కూడా బయటపెట్టలేదు. హేమంత్ కుమార్ పెళ్లి చేసుకుందామని ఒత్తిడి తెచ్చాడు. అదిగో ఇదిగో అంటూ నఫీజా కాలం వెళ్లదీస్తూ వచ్చింది. దీంతో విసిగిపోయిన హేమంత్ నిలదీయడంతో తనకు అంతకు ముందే పెళ్లి అయిందని చెప్పడంతో అతను నిర్ఘంతపోయాడు. అప్పటి నుంచి నఫీజాపై పగ పెంచుకున్నాడు. కొన్ని సందర్భాల్లో నఫీజాను హెచ్చరించాడు. దీంతో భయపడిపోయిన నఫీజా హేమంత్‌ను హతమార్చాలని పథకం వేసింది. తన వివాహేతర సంబంధాన్ని ఇంటిలో భర్తకు తెలియకుండా జాగ్రత్తలు తీసుకుంది. ఇదిలా ఉంటే ఒకరోజు హేమంత్‌ను కలిసి ఎక్కడైన విహార యాత్రకు వెళ్దామని కోరింది. ప్రియురాలు కోరడంతో జులై 31న ఇద్దరు కారులో మైసూరు బయలుదేరారు. మధ్యాహ్నం రామనగర ప్రాంతంలో రెస్టారెంట్ వద్ద హేమంత్ కారు నిలిపి బీరు తెచ్చుకున్నాడు. ఇదే సమయంలో మూత్ర విసర్జన కోసం బయటకు వెళ్లిన సమయంలో అంతకు ముందే తెచ్చుకున్న విషం బీరులో కలిపింది. రాత్రి 11 గంటల సమయయంలో నాగరహోలె చేరుకున్న తరువాత హేమంత్ బీరు తాగాడు. కొద్దిసేపు అనంతరం కారు దిగి మూత్ర విసర్జకు వెళ్లిన సమయంలో నఫీజా కారు స్టార్ట్ చేసి హేమంత్‌ను ఢీకొట్టింది. కిందపడిన అతనిపై పలుమార్లు ముందుకు వెనక్కు వచ్చిన ఆనవాళ్లు పోలీసులు గుర్తించారు. అక్కడి నుంచి బెంగళూరు చేరుకుంది. స్థానిక పోలీసులు సంఘటన స్థలాన్ని పరిశీలించి మృతుడి వివరాలు సేకరించారు. సంఘటన స్థలంలో నఫీజా మొబైల్‌తో పాటు కొన్ని విజిటింగ్ కార్డులు కనిపించాయి. కేసు దర్యాప్తు చేసిన పోలీసులు నఫీజాను అరెస్ట్ చేశారు. -
ఫోన్ చేస్తే.. బెల్టు తీస్తారు
బెల్టుషాపుల నివారణకు కాల్ సెంటర్ జిల్లా వ్యాప్తంగా కమిటీల ఏర్పాటు చిత్తూరు(అర్బన్): జిల్లాలో బెల్టు షాపుల నివారణకు ఎట్టకేలకు కమిటీలు ఏర్పాటు చేసి, వాటి విధి విధానాలను రూపొందిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. ఈ మేరకు ప్రభుత్వం నుంచి జిల్లా ఎక్సైజ్ అండ్ ప్రొహిబిషన్ ఎన్ఫోర్సుమెంటు శాఖకు గురువారం ఉత్తర్వులు అందాయి. బెల్టు షాపుల నివారణకు ఫిర్యాదులు స్వీకరించి చర్యలు తీసుకోవడానికి కాల్ సెంటర్‌ను కూడా ఏర్పాటు చేయడం గమనార్హం. కమిటీలు ఏర్పాటు... బెల్టు షాపుల నివారణ, మద్యం అధిక ధరలకు విక్రయిస్తే అరికట్టడానికి గ్రామాల నుంచి జిల్లా స్థాయి వరకు కమిటీలను ఏర్పాటు చేస్తూ కలెక్టర్ ఆదేశాలు జారీ చేశారు. తొలుత గ్రామ స్థాయిలో స్థానిక సర్పంచ్ అధ్యక్షుడిగా, అక్కడే ఉన్న మహిళా సంఘాల నుంచి అధ్యక్ష, కార్యదర్శులు, పంచాయతీ కార్యదర్శి, స్థానిక ప్రభుత్వ పాఠశాల ప్రధానోపాధ్యాయులు సభ్యులుగా, వీఆర్వో కన్వీనర్‌గా జిల్లాలో మొత్తం 1564 గ్రామ స్థాయి కమిటీలు ఏర్పాటు చేశారు. ఈ కమిటీ ప్రతి 15 రోజులకు ఒకసారి ప్రత్యేక సమావేశం నిర్వహించి బెల్టు షాపులపై వచ్చిన ఫిర్యాదులు, తీసుకున్న చర్యలపై సమీక్షిస్తుంది. అలాగే మండల స్థాయిలో మండలాధ్యక్షుడు అధ్యక్షుడిగా కమిటీ ఏర్పాటు చేశారు. ఇందులో మండల సమాఖ్య అధ్యక్ష, కార్యదర్శులు, స్థానిక పోలీసు స్టేషన్ ఎస్ఐ, ఎంపీడీవో, తహసీల్దారు సభ్యులుగా ఉండి, ఎక్సైజ్ ఎస్ఐ కన్వీనర్‌గా వ్యవహరిస్తారు. జిల్లా స్థాయిలో కలెక్టర్ అధ్యక్షుడుగా, ఎస్పీ, ఆర్డీవో, ఎక్సైజ్ సూపరింటెండెంట్, డీఎస్పీ, ఎక్సైజ్ అసిస్టెంట్ కమిషనర్, జిల్లా సమాఖ్య అధ్యక్ష, కార్యదర్శులు, రాస్ సంస్థ సభ్యులు, జిల్లా సామాజిక సంస్థల కమిటీ అధ్యక్షులు, న్యాయవాది సురేంద్రబాబును సభ్యులుగా నియమించారు. కమిటీ కన్వీనర్‌గా ఎక్సైజ్ ప్రొహిబిషన్ సంస్థ డెప్యూటీ కమిషనర్ వ్యవహరిస్తారు. మండల, జిల్లా కమిటీలు తప్పనిసరిగా నెలకు ఒకసారి సమావేశమై బెల్టుషాపులపై ఫిర్యాదులు, తీసుకున్న చర్యలు, నమోదు చేసిన కేసులపై చర్చిస్తారు. కాల్ సెంటర్ ఏర్పాటు... తొలిసారిగా జిల్లాలో బెల్టుషాపుల నివారణకు కాల్ సెంటర్ ఏర్పాటు చేశారు. జిల్లాలో ఎక్కడైనా బెల్టుషాపు ఉంటే ఫోన్ నెంబరు : 040-24612222కు ఫోన్ చేసి వివరాలు చెబితే అక్కడ ఎక్సైజ్ అధికారులు దాడులు చేసి కేసులు నమోదు చేస్తారు. ఈ ఫోన్ ప్రతిరోజూ 24 గంటల పాటు అందుబాటులో ఉంటుంది. ఫిర్యాదు వచ్చిన వెంటనే ఎక్సైజ్ అధికారులు దాడులు చేస్తారు. మద్యం దుకాణాల్లో ఎమ్మార్పీ కంటే ఎక్కువగా విక్రయించినా, బెల్టుషాపులకు మద్యం బాటిళ్లు సరఫరా చేసినా దుకాణాల లెసైన్సుల రద్దు చేయడంతో పాటు క్రిమినల్ కేసులు కూడా నమోదు చేసే అవకాశం ఉంది. -
కాల్ సెంటర్‌ను సద్వినియోగం చేసుకోండి
కాకినాడ కలెక్టరేట్ : వివిధ శాఖల సమాచారం తెలుసుకునేందుకు, ప్రజా సమస్యలు, ఫిర్యాదులకు కలెక్టరేట్లో 18004253077 టోల్ ఫ్రీ నంబర్‌తో ఏర్పాటు చేసిన ఈ- పరిష్కారం కాల్ సెంటర్‌ను ప్రజలు సద్వినియోగించుకోవాలని కలెక్టర్ నీతూ ప్రసాద్ కోరారు. ఈ- పరిష్కారం కాల్ సెంటర్ ద్వారా సోమవారం ఉదయం 9.30 గంటల నుంచి 10.30 గంటల వరకూ కలెక్టరేట్ నుంచి డయల్ యువర్ కలెక్టర్ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా వ్యాప్తంగా వివిధ ప్రాంతాల నుంచి 31 మంది ఫోన్ చేసి తమ సమస్యలను తెలియజేయగా వాటిలో కొన్నింటికి అక్కడికక్కడే కలెక్టర్ సమాధానం ఇచ్చారు. మరికొన్ని ఫిర్యాదులను సంబంధిత శాఖలకు బదిలీ చేసి పరిష్కారానికి ఆదేశాలు జారీ చేశారు. ‘గ్రీవెన్స్’కు 120 వినతులు డయల్ యువర్ కలెక్టర్ అనంతరం 10.30 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటిగంట వరకు డ్వామా సమావేశ హాలులో జిల్లాస్థాయి గ్రీవెన్స్‌సెల్ నిర్వహించారు. కలెక్టర్ నీతూ ప్రసాద్‌తో పాటు జాయింట్ కలెక్టర్ ముత్యాలరాజు, అదనపు జాయింట్ కలెక్టర్ మార్కండేయులు అర్జీదారుల నుంచి వినతులను స్వీకరించారు. ఈ గ్రీవెన్స్ సెల్‌కు 120 మంది వివిధ సమస్యలపై అధికారులకు అర్జీలు అందజేశారు. కార్యక్రమంలో డ్వామా పీడీ సంపత్‌కుమార్, డీఈఓ శ్రీనివాసులు రెడ్డి, డీఎస్ఓ రవికిరణ్, పౌరసరఫరాల కార్పొరేషన్ డీఎం కుమార్, సాంఘిక సంక్షేమ శాఖ డీడీ మధుసూదనరావు, డీఆర్డీఏ పీడీ చంద్రశేఖరరాజు, డీపీఓ శ్రీధర్‌రెడి, ఎస్సీ కార్పొరేషన్ ఈడీ సిరి, ఎస్ఎస్ఏ పీడీ చక్రధరరావు వివిధ శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు. -
బజ్జున్న బంగారు తల్లి
విజయనగరం కంటోన్మెంట్, న్యూస్‌లైన్: ప్రభుత్వం ఏదైనా సంక్షేమ పథకాన్ని ప్రవేశపెడితే దాన్ని సమర్థంగా నడిపించగలగాలి. చట్టం చేస్తే దాన్ని ఎటువంటి విపత్కర పరిస్థితుల్లోనూ ఆపరాదు. కానీ బంగారు తల్లి పథకాన్ని మాత్రం ఎటువంటి లక్ష్యాలూ లేకుండానే ప్రవేశపెట్టారు. ఏడాది తిరక్కముందే ఆపేశారు. బంగారు తల్లి పథకం గురించి పెద్దఎత్తున ప్రచారం చేసిన ప్రభుత్వ యంత్రాంగం తరువాత పట్టించుకోవడం మానేసింది. మార్చి నెలనుంచి నిధులు జమచేయకపోవడంతో లబ్ధిదారులు ఇక్కట్లు పడుతున్నారు. ఇద్దరు ఆడపిల్లలున్న కుటుంబానికి ఆర్థిక సహా యంగా పలుమార్లు నిధులు వచ్చేలా చట్టం చేసినప్పటికీ నిధులు మాత్రం విడుదల కావడం లేదు. ఇంతకీ ఈ పథకానికి కొత్త ప్రభుత్వ యంత్రాంగం నిధులు విడుదల చేస్తుందా లేదా అన్నది ప్రశ్నార్థకంగా మారింది. గత ఏడాది మే 1న అప్పటి ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి బంగారు తల్లి పథకాన్ని ప్రారంభిం చారు. మే1వ తేదీ తరువాత జన్మించిన ఆడపిల్లలందరికీ ఈ పథకం వర్తిస్తుందనడంతో పిల్లల తల్లిదండ్రులు బ్యాంకుల్లో అకౌంట్లు ప్రారంభించి, పేర్లు రిజిస్టర్ చేసుకున్నారు. పథకం ప్రారంభంలో దరఖాస్తు చేసుకున్న వారి బ్యాంకు అకౌంట్లలో కొద్ది మొత్తంలో డబ్బులు వేశారు. దీంతో మిగతా వారిలో కూడా నమ్మ కం పెరిగింది. కానీ అన్ని పథకాల్లాగే ఇది కూడా నిధుల లేమితో నిలిచిపోరుుంది. ఈ సంవత్సరం జూన్ 6 నాటి కి జిల్లాలో వెబ్సైట్ ప్రకారం 9,600 మంది రిజిస్టర్ చేసుకోగా, వారిలో కేవలం 4,875 మందికే పథకాన్ని వర్తింపజేశారు. నిధుల్లేక మిగతా వారికి వర్తింపచేయలే దు. అయితే పథకాన్ని పర్యవేక్షిస్తున్న డీఆర్డీఏ అధికారుల వివరణ ప్రకారం...7,828 మంది దరఖాస్తుచేసుకోగా 4,875 మందికి నిధులు విడుదల చేశామని, ఇంకా 2953 మందికి పథకాన్ని వర్తింపజేయాల్సి ఉందని చెబుతున్నారు. వ్యయప్రయాసలతో రిజిస్ట్రేషన్ ఈ పథకం కోసం రిజిస్ట్రేషన్ చేయించుకునేందుకు వ్యయప్రయాసలకు గురవుతున్నా ఫలితం లభించడం లేదు. దీనికి దరఖాస్తు చేసుకోడానికి ఆరురకాల ధ్రువీ కరణ పత్రాలు ఉండాలి. అలాగే పాస్పోర్ట్సైజ్ ఫొటో లు, తల్లి పేరుమీద బ్యాంకు ఖాతా తెరిచినట్లు ధ్రువీకరణ పత్రాల జిరాక్స్, తదితర వాటి కోసం దరఖాస్తుదారులు ఖర్చు చేసి, అధికారుల చుట్టూ తిరిగినా...నిధులు మాత్రం రావడం లేదు. ఎప్పుడెప్పుడు ఎంతెంత మంజూరు అంటే... ఆడపిల్ల పుట్టగానే రూ.2,500 తల్లి బ్యాంక్ అకౌంట్లో జమ చేస్తారు. రెండేళ్ల వరకూ టీకాల కోసం రూ.2000 (ఏడాదికి వేయి చొప్పున) పాపకు ఐదేళ్లు వచ్చే వరకూ సంవత్సరానికి రూ.1500 చొప్పున రూ.4,500 పదేళ్లవరకూ సంవత్సరానికి రూ.2,500 చొప్పున రూ.పదివేలు 13 ఏళ్ల వరకూ రూ.7,500 (ఏడాదికి రూ.2,500 చొప్పున) 15 ఏళ్ల వరకూ రూ.3 వేల చొప్పున రూ.6,000 17ఏళ్ల వ రకూ రూ.3,500 చొప్పున రూ.7,000 21 ఏళ్ల వరకూ రూ.4వేల చొప్పున రూ.16000 జమ చేస్తూ 21 ఏళ్ల తరువాత అప్పటికి ఇంటర్ పాసయితే రూ.50 వేలు, గ్రాడ్యుయేషన్ పాసయితే రూ.లక్ష. మొత్తంగా రూ.1,55,500 ప్రోత్సాహకాలు అందిస్తామ ని ప్రకటించారు. కానీ దీనికోసం ఇప్పటివరకూ నిధులు మాత్రం మంజూరు కాలేదు. జిల్లాలో పీడీ ప్రత్యేక చొరవ తీసుకుని ఓ కాల్‌సెంటర్‌ను కూడా (800834 2244)ఏర్పాటు చేశారు. దీంతో మరిన్ని రిజిస్ట్రేషన్లు జరిగాయి, కానీ నిధుల వద్దకు వచ్చేసరికి ఈ పథకం నిద్రపోతోంది. -
గజిని
జీహెచ్ఎంసీకి మతిమరుపు చమత్కరించిన కమిషనర్ ఖాళీ ప్రదేశాల రక్షణకు ‘గ్రేటర్’ చర్యలు ఇప్పటికి 385 స్థలాల గుర్తింపు సాక్షి, సిటీబ్యూరో: ‘జీహెచ్ఎంసీకి మతిమరుపు’... ఈ విషయం అన్నది ఎవరో కాదు సాక్షాత్తు ‘గ్రేటర్’ కమిషనర్ సోమేశ్‌కుమారే. నగరంలో అధిక డిమాండ్ ఉన్న భూములను ఇప్పటివరకూ గాలికొదిలేసిన జీహెచ్ఎంసీ.. అవి కబ్జాల పాలవుతుండటంతో వాటిని కాపాడుకునేందుకు సిద్ధమైంది. ఈ నేపథ్యంలో కమిషనర్ ఈ విషయాన్ని చెబుతూ జీహెచ్ఎంసీకి ఎన్ని ఖాళీ స్థలాలున్నాయో లెక్కలేదని అన్నారు. ఈ సందర్భంగా జీహెచ్ఎంసీకి మతిమరుపు అని చమత్కరించారు. సర్కిళ్ల వారీగా బహిరంగ ప్రదేశాల్లో ఉన్న జీహెచ్ఎంసీ భూముల్ని గుర్తించే చర్యలు చేపట్టామని తెలిపారు. గత నెలాఖరు వరకు ఎలాంటి రక్షణ ఏర్పాట్లు లేని 320 జీహెచ్ఎంసీ భూముల్ని గుర్తించామని.. ప్రస్తుతం వీటి సంఖ్య 385కి చేరిందని వివరించారు. ఇలాంటివి ఇంకా ఎన్ని ఉన్నాయో తెలియదని.. గుర్తించిన ఈ 385 బహిరంగ ప్రదేశాలకు రూ. 49 కోట్లతో 70 కి.మీ.ల మేర ప్రహరీలు నిర్మించనున్నట్లు వెల్లడించారు. ఇప్పటికే ప్రహరీలున్న వెయ్యి బహిరంగ ప్రదేశాలతోపాటు ఈ 385 ప్రదేశాల్లోనూ పార్కుల్ని ఏర్పాటు చేయనున్నామన్నారు. వేసవి ముగిసేలోగా వీటన్నింటికీ ప్రహరీలు నిర్మించి, వచ్చే వర్షాకాలంలోగా మొక్కలు నాటే ఏర్పాట్లు చేయనున్నట్లు తెలిపారు. స్థానికంగా ఖాళీ ప్రదేశాలు కనిపిస్తే ప్రజలు వాటిని జీహెచ్ఎంసీ కాల్‌సెంటర్‌కు తెలియజేయాల్సిందిగా సూచించారు. గత నెలాఖరు వరకు గుర్తించిన ఖాళీస్థలాలు (సర్కిళ్ల వారీగా).. కాప్రా- 27, ఉప్పల్- 13, ఎల్బీనగర్-18, చార్మినార్-6, సర్కిల్ 5 - 3, రాజేంద్రనగర్-45, సర్కిల్ 7- 2, సర్కిల్8- లేవు, సర్కిల్9- 6, సర్కిల్ 10-31, సర్కిల్ 11- 15, సర్కిల్ 12-20, సర్కిల్ 13-7, కూకట్పల్లి-27, కుత్బుల్లాపూర్-22 అల్వాల్-45, మల్కాజిగిరి-27, సికింద్రాబాద్-6. వెరసి మొత్తం 320. అన్ని సర్కిళ్లలో మరో 65 పెరగడతో ఇప్పుడవి 385కు చేరాయి. -
ఇది కాల్ సెంటర్ ప్రభుత్వమా?
న్యూఢిల్లీ: ఆమ్ ఆద్మీ పార్టీ(ఆప్) ప్రభుత్వం కాల్ సెంటర్, హెల్ప్‌లైన్‌గా మారిందని ఢిల్లీ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు ముకేశ్ శర్మ విమర్శించారు. శనివారం నగరంలో నిర్వహించిన జనతా దర్బార్‌లో ప్రజల రద్దీ ఎక్కువగా ఉంద న్న సాకుతో మధ్యలోనే బయటకు వెళ్లిన ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్‌పై విమర్శలు చేశారు. కేజ్రీవాల్ సామాన్యుడికి ఏమీ చేయలేరని అన్నారు. విద్యుత్ కోతలు, అవినీతి, నర్సరీ అడ్మిషన్ల ఫిర్యాదుల స్వీకరణకు ప్రత్యేక హెల్ప్లైన్లు ప్రారంభించడంపై ఆయన మండిపడ్డారు. ఈ ప్రభుత్వం కాల్ సెంట ర్, హెల్ప్‌లైన్‌గా మారిందన్నారు. ప్రజలకు సేవ చేస్తామని అధికారంలోకి వచ్చిన ఆప్ ఇప్పుడు వారి సమస్యలను గాలికొదిలేస్తుందని ఆరోపించారు. కేజ్రీవాల్ వల్ల తమ సమస్యలు తీరుతాయని భావించిన సామాన్యుడికి చుక్కెదురైందని విమర్శించారు. -
సమస్యల పరిష్కారానికి కాల్ సెంటర్
నంద్యాల, న్యూస్‌లైన్: సమస్యల పరిష్కారం కోసం వైఎస్సార్సీపీ కేంద్రపాలక మండలి సభ్యుడు భూమానాగిరెడ్డి మరో కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. నంద్యాల నియోజకవర్గంలోని ప్రజలు ఏ సమస్య తలెత్తినా తక్షణం వివరించడానికి ఒక కాల్ సెంటర్‌ను ఏర్పాటు చేశారు. ఇది 24గంటల పాటు పనిచేయనుంది. కాల్ సెంటర్‌కు ఫిర్యాదు చేసినా సమస్యను పరిష్కరించడానికి కొన్ని బృందాలను నంద్యాల పట్టణంలోని వార్డుల వారీగా, గ్రామాల వారీగా ఏర్పాటు చేస్తున్నారు. ఫిర్యాదు అందిన వెంటనే దాని అవసరాన్ని బట్టి స్పందిస్తారు. ఇందు కోసం కాల్‌సెంటర్ నం: 7660888881ను ప్రజలకు అందుబాటులోకి తెచ్చారు. ఇది శాశ్వతంగా పని చేసే విధంగా నంద్యాల పట్టణంలోని పద్మావతినగర్‌లోని వైఎస్సార్సీపీ కార్యాలయంలో ఏర్పాటు చేస్తున్నారు. ఈ కార్యక్రమాన్ని స్థానిక రామకృష్ణ డిగ్రీ కళాశాలలో శుక్రవారం శ్రీకారం చుట్టారు. ఏపీ మీడియా సహకారంతో చేపడుతున్న ఈ కాల్ సెంటర్ కార్యక్రమానికి రామకృష్ణ డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్ రామకృష్ణారెడ్డి, వైఎస్సార్సీపీ నాయకులు ఏవీ సుబ్బారెడ్డి, ఏవీఆర్ ప్రసాద్, డాక్టర్ బాబన్, ఏపీ మీడియా ప్రతినిధి రమేష్ తదితరులు పాల్గొన్నారు. మీ అన్నగా.. తమ్ముడిగా.. సేవలందిస్తా.. ‘‘ మీ అన్నగా.. మీ తమ్ముడిగా సేవలు అందిస్తాను.. నిర్మొహమాటంగా మీ కున్న సమస్యలను తెలపండి’ అని నం ద్యాల నియోజకవర్గ ప్రజలకు భూమా భరోసాను ఇచ్చారు. తన ఇమేజిని తట్టుకోలేక ప్రత్యర్థులు జీతాలు, కూలీలు ఇ చ్చి విమర్శలు చేయిస్తున్నారని.. అయితే వాటిని ప్రజలు నమ్మడం లేదన్నారు. ప్రజలకు మేలు జరిగే విషయంలో తాను ఎలాంటి సాహసానికైనా సిద్ధమని చెప్పారు. ఇటువంటి విషయాల్లో విమర్శలను లెక్కచేయనని పేర్కొన్నారు. అందుకే తాను నంద్యాల పట్టణంలో ఎన్నో కార్యక్రమాలను చేపడుతున్నానని వివరించారు. అధికార పార్టీకి చెందిన నాయకులు ఎన్నో అడ్డంకులు సృష్టిస్తున్నారని, వాటన్నింటిని ప్రాణం ఇచ్చే వైఎస్సార్సీపీ కార్యకర్తల ద్వారా, ప్రజల ద్వారా అధిగమిస్తున్నట్లు భూమా తెలిపారు. నంద్యాల పట్టణంలో అర్ధరాత్రి సైతం ఎలాంటి సంఘటనలు ఎదుర్కొన్నా కాల్ సెంటర్‌కు ఫిర్యాదు చేయవచ్చన్నారు. చట్టపరిధిలో అధికారులు విధులు నిర్వహిస్తారన్నారు. కాల్ సెంటర్ పరిధిలోకి వచ్చే నెట్‌వర్క్‌లో సభ్యత్వం తీసుకుంటే నెలకు రూ.99తో ఎన్నో సమాచారాలను పొందవచ్చన్నారు. భారీఎత్తున సెల్‌పోన్ బిల్లులో ఆదా అవుతుందన్నారు. రైతులు ఎప్పటికప్పుడు గిట్టుబాటు ధరలను, నిరుద్యోగులు ఉద్యోగ సమాచారాన్ని తెలుసుకోవచ్చన్నారు. ఎన్నో రకాలుగా ప్రయోజనం కలిగించే ఈ నెట్‌వర్క్‌లో సభ్యత్వం తీసుకోవాలన్నారు. తన వంతు సహకారం కార్యకర్తలకు అందిస్తానన్నారు. నంద్యాలతో పాటు ఆళ్లగడ్డ, అసెంబ్లీ నియోజకవర్గాల్లోని వైఎస్సార్సీపీ కార్యకర్తలందరికీ గ్రూప్ సిమ్‌లను ఏర్పాటు చేశారు. తాను క్లీన్‌సిటీ ఉద్యమం చేపట్టిన సమయంలో ఎన్నో విమర్శలు వచ్చాయని వాటిని లెక్కచేయకుండా ముందుకు సాగడం వల్లే ఎన్నో కుటుంబాలు బాగుపడ్డాయన్నారు. అలాగే కాల్ సెంటర్ వల్ల సమస్యల పరిష్కారం మరింత వేగంగా జరుగుతుందన్నారు. -
ప్రజా సమస్యల పరిష్కారానికి ఎన్డీఎంసీ కాల్ సెంటర్
న్యూఢిల్లీ: ప్రజా సమస్యల పరిష్కారానికి న్యూఢిల్లీ మున్సిపల్ కౌన్సిల్(ఎన్డీఎంసీ) త్వరలో ఓ కాల్ సెంటర్‌ను ఏర్పాటు చేయనుంది. నాలుగంకెలుగల ఈ కాల్‌సెంటర్ నంబర్‌కు ఫోన్ చేసి తమ సమస్యలను నమోదు చేసుకోవాలని, నిర్ణీత సమయంలో వాటిని పరిష్కరిస్తామని ఎన్డీఎంసీ చైర్మన్ జల్‌రాజ్ శ్రీవాస్తవ తెలిపారు. ఇందుకు అవసరమైన అధికారులను కూడా నియమించినట్లు చెప్పారు. ప్రజల నుంచి సమస్యలు తెలుసుకొని, వాటిని సంబంధిత అధికారుల వద్దకు పరిష్కారం కోసం పంపుతారన్నారు. ఏదైనా సమస్యకు సంబంధించి రెండురోజుల్లో ఎటువంటి కదలిక లేనిపక్షంలో సదరు ఫిర్యాదు దానంతటదే ఉన్నతాధికారుల వద్దకు వెళ్లిపోయేలా ఏర్పాట్లు కూడా చేశామన్నారు. అప్పటికీ పరిష్కారం కాకపోతే నాలుగురోజుల తర్వాత సదరు ఫిర్యాదు ఎన్డీఎంసీ చైర్మన్ వద్దకు వెళ్తుందని శ్రీవాస్తవ తెలిపారు. ఈ నాలుగంకెల నంబర్ కోసం నమోదు ప్రక్రియ పూర్తయిందని, లాంఛనంగా ప్రారంభించాల్సింది మాత్రమే మిగిలిందన్నారు. మరో రెండు వారాల్లో ఈ కాల్‌సెంటర్‌ను ప్రారంభించే అవకాశముందని చెప్పారు. ఫిక్కీ లేడీస్ ఆర్గనైజేషన్ ‘ఫేస్ టు ఫేస్’ పేరిట శనివారం నిర్వహించిన ఓ కార్యక్రమంలో పాల్గొన్న ఆయన ఈ విషయాన్ని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఫిక్కీ సభ్యులతోపాటు ఉత్తర ఢిల్లీ మున్సిపల్ కమిషనర్ పీకే గుప్తా, దక్షిణ ఢిల్లీ మున్సిపల్ కమిషనర్ మనీశ్ గుప్తా తదితరులు పాల్గొన్నారు. నగరంలో చెత్త నిర్మూలన, మురుగునీటి పారుదల, మురుగునీటి కాల్వల పరిస్థితి, రహదారుల దుస్థితి తదితర విషయాలపై చర్చించారు. -
కాల్‌సెంటర్ ఉద్యోగినిపై సామూహిక అత్యాచారం
న్యూఢిల్లీ నిర్భయ' అత్యాచార సంఘటన అనంతరం కఠిన చట్టం రూపొందించినా మహిళలపై దారుణాలు జరుగుతూనే ఉన్నాయి. దేశరాజధాని శివారు ప్రాంతం గుర్గావ్లో మరో మహిళపై దుండగులు సామూహిక అత్యాచారానికి ఒడిగట్టారు. కాల్సెంటర్లో పనిచేసే 19 ఏళ్ల ఉద్యోగినిపై బుధవారం తెల్లవారు జామున ముగ్గురు వ్యక్తులు దారుణానికి పాల్పడ్డారు. తన స్నేహితురాలి బర్త్ డే పార్టీలో పాల్గొని తిరిగొస్తుండగా, గుర్గావ్ 46వ సెక్టార్ వద్ద ఈ సంఘటన జరిగినట్టు పోలీసులు వెల్లడించారు. మెట్రో స్టేషన్ వద్ద దింపుతానని ప్రధాన నిందితుడు దినేశ్ అనే వ్యక్తి బాధితురాలిని తన బైక్‌పై తీసుకెళ్లాడు. మరో ఇద్దరితో కలసి అత్యాచారానికి పాల్పడ్డాడు. దినేశ్ ఢిల్లీ-గుర్గావ్ ఎక్స్‌ప్రెస్ హైవేలో గల ఝార్సా గ్రామానికి చెందిన వ్యక్తని జాయింట్ పోలీస్ కమిషనర్ మహేశ్వర్ దయాల్ తెలిపారు. మిగిలిన ఇద్దరు నిందితుల్ని నవీన్, సత్యదేవ్‌గా గుర్తించినట్టు వెల్లడించారు. వీరు ముగ్గురి వయసు దాదాపు 20 ఏళ్లు ఉంటుందని తెలిపారు. -
కాల్‌సెంటర్‌పై దాడిలో ఇద్దరు మృతి
గుర్గావ్: హర్యానా రాష్ట్రం గుర్గావ్లో శనివారం కాల్‌సెంటర్‌పై జరిగిన ఒక దాడిలో ఇద్దరు మృతిచెందగా, మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. వివరాలిలా.. స్థానిక ఉద్యోగ్ విహార్ కాల్ సెంటర్లో పనిచేస్తున్న సునీల్‌కుమార్ (25), తన కుమారుడి పుట్టిన రోజు సందర్భంగా సహోద్యోగులను పార్టీకి పిలిచేందుకు కాల్‌సెంటర్‌కు వచ్చాడు. అదే సమయంలో సునీల్‌తో పాతకక్షలున్న ముఖేష్ అనే వ్యక్తి తన అనుచరులతో వచ్చి పదునైన ఆయుధాలతో దాడిచేశాడు. ఈ ఘటనలో రామ్ అవతార్(32) అనే మెడికల్ రిప్రజెంటెటివ్, సునీల్ సోదరుడు దేవేందర్(30) అక్కడికక్కడే మరణించగా, సునీల్, సంజయ్ తీవ్రంగా గాయపడ్డారు. వారిద్దరి పరిస్థితి విషమంగా ఉంది. దాడి అనంతరం నిందితులు పారిపోయారు. కాగా, నిందితుల విషయమై ఆరా తీస్తున్నామని, సీసీటీవీ పుటేజీలను సేకరించామని పోలీసులు తెలిపారు. -
విరుచుకుపడ్డ మృత్యువు...
కుత్బుల్లాపూర్, న్యూస్‌లైన్: ఇద్దరూ కాబోయే భార్యాభర్తలు.. స్కూటీపై వెళ్తున్న వారిపై మృత్యువు చెట్టు రూపంలో విరుచుకుపడింది. ఇద్దరికీ తీవ్రగాయాలయ్యాయి. చికిత్సపొందుతూ యువకుడు మృతి చెందగా.. యువతి ఆసుపత్రిలో మృత్యువుతో పోరాడుతోంది. ఈ ఘటన స్థానికులను తీవ్రంగా కలచి వేసింది. పేట్ బషీరాబాద్ పోలీసులు, స్థానికుల కథనం ప్రకారం.. యాప్రాల్ టీచర్స్ కాలనీకి చెందిన విజయ్‌కుమార్ కుమారుడు పి.రోహిత్ (27) ఫాస్టర్ శిక్షణ పొందుతున్నాడు. సైనిక్ పురికి చెందిన ఎల్రెడ్ జోసెఫ్ కెర్నాన్ కుమార్తె రితిక లూసీ కెర్నాన్ హైటెక్ సిటీలో కాల్‌సెంటర్ ఉద్యోగి. వీరిద్దరికి ఇటీవల నిశ్చితార్థమైంది. మరో రెండు నెలల్లో పెళ్లి ఉండడంతో చర్చిని బుక్ చేసుకునేందుకు సోమవారం ఉదయం ఇద్దరు స్కూటీపై బయలుదేరారు. 11 గంటల సమయంలో సుచిత్ర నుంచి జీడిమెట్ల ఓం బుక్స్ వైపు సర్వీసు రోడ్డులో వెళ్తుండగా ఒక్కసారిగా చెట్టు విరిగి వీరి వాహనంపై పడింది. ఇద్దరి తలలకు తీవ్రగాయాలు కావడంతో రక్తస్రావమైంది. అదే సమయంలో అటుగా వెళ్తున్న పోలీస్ పెట్రోల్ మొబైల్ టీమ్-15 సిబ్బంది ఇద్దరినీ ఆటోలో స్థానిక ఆస్పత్రికి తరలించారు. రోహిత్ అపస్మారక స్థితికి చేరుకోవడంతో డాక్టర్ల సూచన మేరకు అతడిని వెంటనే సికింద్రాబాద్ యశోదకు తరలిస్తుండగా చనిపోయాడు. రితికను నగరంలోని మరో ఆస్పత్రికి తరలించారు. చావు బతుకుల మధ్య కొట్టుమిట్టాడుతున్న ఆమె పరిస్థితి విషమంగా ఉన్నట్టు వైద్యులు తెలిపారు. -
చీకట్లు!
విశాఖపట్నం, న్యూస్‌లైన్: విద్యుత్ ఉద్యోగుల సమ్మె ప్రభావం జిల్లాపై పడింది. గురువారం చాలా ప్రాంతాల్లో ట్రాన్స్ఫార్మర్లు పని చేయకపోవడంతో వినియోగదారులు ఇబ్బంది పడ్డారు. కాల్ సెంటర్‌కు ఫోన్ చేస్తే విద్యుత్ కార్యాలయంలో సంప్రదించాలని సమాధానం రావడంతో అయోమయానికి గురయ్యారు. అక్కడికి వెళ్తే సిబ్బంది సమ్మెలో ఉన్నారని తెలిసి ఆవేదన చెందారు. విశాఖ అర్బన్‌తో పాటు జిల్లా వ్యాప్తంగా పలు ప్రాంతాల్లో విద్యుత్ సరఫరా సమస్యలు తలెత్తాయి. నర్సీపట్నం, రోలుగుంట, గొలుగొండ, అచ్యుతాపురం, నాతవరం, వడ్డాది మాడుగుల, పాములవలస, అనకాపల్లి, భీమిలి, చిట్టివలస సబ్ స్టేషన్ల పరిధిలో విద్యుత్ బ్రేక్ డౌన్లు అయ్యాయని ఫిర్యాదులందాయి. వీటి సమస్యలను పరిష్కరించి విద్యుత్ పునరుద్ధరించేందుకు అధికారులు ప్రయత్నాలు చేస్తున్నారు. కానీ క్షేత్ర స్థాయి సిబ్బంది సహకరించకపోవడంతో విద్యుత్ సరఫరా ఎప్పటికి పునరుద్ధరిస్తారో అధికారులే చెప్పలేకపోతున్నారు. -
కాల్ సెంటర్ ఉద్యోగి దుర్మరణం
ఘజియాబాద్: వేగంగా వెళుతున్న ట్యాంకర్ ఢీకొనడంతో కాల్‌సెంటర్ ఉద్యోగి చనిపోయాడు. ఈ ఘటన విజయ్‌నగర్ ప్రాంతంలో శుక్రవారం రాత్రి జరిగింది. మృతుడిని దమన్‌కుమార్ (24)గా గుర్తిం చారు. జిల్లాలోని భరత్‌నగర్‌లో నివసించే దమన్‌కుమార్ నోయిడా సెక్టార్ 62లోని కాల్సెంటర్లో ఉద్యోగం చేస్తున్నాడు. శుక్రవారం రాత్రి విధులు ముగించుకుని మోటార్‌సైకిల్‌పై ఇంటికి తిరిగివెళుతుండగా ఎదురుగా వేగంగా వస్తున్న ట్యాంకర్ ఢీకొట్టింది. తీవ్రగాయాలపాలైన దమన్‌ను ఆస్పత్రికి తరలించగా అప్పటికే చనిపోయినట్టు వైద్యులు తెలిపారు. మోటార్‌సైకిల్‌ను ఢీకొన్న ఘటన వెంటనే ట్యాంకర్ డ్రైవర్ అక్కడి నుంచి పారిపోయాడు. ట్యాంకర్ నంబర్‌ను గుర్తించామని, నింది తుడిని త్వరలో పట్టుకుంటామని పోలీసు ఉన్నతాధికారి ఒకరు చెప్పారు. కేసు విచారణలో ఉంది. -
హైదరాబాద్ లో తొలి మహిళా స్నాచర్
సాక్షి, సిటీబ్యూరో: ముంబైకి చెందిన ఓ యువతి తల్లితో కలిసి నగరానికి వచ్చింది... కాల్ సెంటర్లో ఉద్యోగంలో చేరింది... తన ఇంటి పక్కనే ఉండే యువకుడితో పరిచయమైంది... ఇద్దరూ కలిసి జల్సాలకు అలవాటుపడి చైన్‌స్నాచింగ్స్ ప్రారంభించారు... యువకుడు బైక్ నడుపుతుండగా ఆమె వెనుక కూర్చుని మహిళల మెడలోని బంగారు గొలుసులు స్నాచింగ్ చేస్తోంది. వీరికి మరో ముగ్గురు బాల్య స్నేహితులు తోడు కావడంతో మరింత రెచ్చిపోయారు. ఈ ముఠాను బోయిన్పల్లి పోలీసులు అరెస్టు చేయడంతో నగర కమిషనరేట్‌లో తొలి మహిళా స్నాచర్‌ను అరెస్టు చేసినట్లైంది. 19 నుంచి 20 ఏళ్ల మధ్య వయస్కులైన నిందితుల్లో ఇద్దరు ఇంజినీరింగ్ విద్యార్థులు కూడా ఉన్నారు. శుక్రవారం సిటీ పోలీసు కమిషనర్ అనురాగ్ శర్మ శుక్రవారం తెలిపిన వివరాల ప్రకారం... ముంబైకి చెందిన సనాఖాన్ అక్కడే విద్యాభ్యాసం పూర్తి చేసింది. ఆ తర్వాత తల్లితో కలిసి నగరానికి వచ్చి సికింద్రాబాద్‌లో స్థిరపడింది. ఓ కాల్సెంటర్లో ఉద్యోగం చేస్తున్న సమయంలో ఇంటి పక్కన ఉండే మహ్మద్ షోయబ్ అహ్మద్‌తో పరిచయం ఏర్పడింది. జల్సాలకు బానిసైన వీరిద్దరూ తేలిగ్గా డబ్బు సంపాదించడం కోసం స్నాచర్లుగా మారారు. అనుమానం రాదనే యువతితో కలిసి... చోరీల కోసం జెట్‌స్పీడ్‌లో వెళ్లై ఖరీదైన బైక్‌ను కొన్నారు. దానిపై ఇద్దరూ నగరంలో తిరిగేవారు. నిర్మానుష్య ప్రాంతాల్లో బంగారు వస్తువులు ధరించి వస్తున్న యువతులకు సమీపంగా వాహనంపై వెళ్లేవారు. వెనుక యువతి ఉండటంతో ఎవ్వరూ వీరిని స్నాచర్లుగా అనుమానించేవారు కాదు. దీన్నే క్యాష్ చేసుకున్న ఈ ద్వయం వరుసపెట్టి స్నాచింగ్స్‌కు పాల్పడింది. షోయబ్ వాహనం నడుపుతుండగా సనా గొలుసులు తెంచేది. ఇలా సంపాదించిన డబ్బుతో జల్సాలు చేసేవారు. వీరి జీవనశైలికి బాల్య స్నేహితులైన ముఫదుల్ (తిరుమలగిరి), ఇంజినీరింగ్ విద్యార్థులైన వీకేఎస్ రాఘవ (శ్రీ నగర్‌కాలనీ), జేఎస్ భార్గవ (యూసుఫ్‌గూడ)లు ఆకర్షితులై మరో వాహనంపై తిరుగుతూ గొలుసు చోరీలు మొదలెట్టారు. ఈ రకంగా జంట కమిషనరేట్ల పరిధిలో 23 స్నాచింగ్స్ చేశారు. చోరీ సొత్తును తమకు పరిచయస్తులైన నరేష్, అష్వద్లకు విక్రయించేవారు. ఇలా వచ్చిన సొమ్ముతో జూదం, మద్యం, మాదకద్రవ్యాలు వంటి వ్యసనాలకు ఖర్చు చేయడంతో పాటు ఒక కారు, ఎవరికి వారు సొంత బైక్‌లు కొనుగోలు చేశారు. వాహన తనిఖీల్లో చిక్కిన వైనం... జంట కమిషనరేట్ల పలువురు చేసిన ఫిర్యాదులతో పాటు గతనెల్లో తిరుమలగిరి ఠాణా పరిధిలో జరిగిన గొలుసు చోరీలో సిటీలో ఓ మహిళా స్నాచర్ ఉన్నట్లు పోలీసులు నిర్థారించుకున్నారు. బోయిన్పల్లి పోలీసులు గురువారం సాయంత్రం ఓల్డ్ బోయిన్పల్లి చెక్‌పోస్ట్ వద్ద వాహనాలు తనిఖీ చేపట్టారు. స్విఫ్ట్ కారులో ఓ యువతి, యువకుడు వెళ్తుండగా పోలీసులు ఆపబోగా పారిపోయేందుకు ప్రయత్నించారు. దీంతో అనుమానం వచ్చి అదుపులోకి తీసుకుని వాహనంలో తనిఖీ చేయగా మూడు గొలుసులతో పాటు బంగారం తూకం వేసే త్రాసు కనిపించింది. తదుపరి విచారణలో తన పేర్లు షోయబ్, సనా అని చెప్పడంతో పాటు నేరాలనూ అంగీకరించారు. వీరిచ్చిన సమాచారంతో పోలీసులు మిగిలిన ముగ్గురితో పాటు ఇద్దరు రిసీవర్లనూ అరెస్టు చేశారు. నిందితుల నుంచి 70 తులాల బంగారం, కారు, మూడు ద్విచక్ర వాహనాల సహా మొత్తం రూ.30 లక్షల విలువైన సొత్తు స్వాధీనం చేసుకున్నారు. ప్రత్యేక బృందాలు: సీపీ గొలుసు దొంగతనాలతో పాటు దృష్టి మళ్లించి చోరీలు చేస్తున్న నేరగాళ్లకు చెక్ చెప్పేందుకు ప్రత్యేక బృందాల్ని ఏర్పాటు చేసినట్లు నగర పోలీసు కమిషనర్ అనురాగ్ శర్మ తెలిపారు. ఇటీవల కాలంలో ఈ నేరాలు పెరిగిపోవడంతో జోనల్, డివిజన్ స్థాయిలో ప్రత్యేక టీమ్స్‌ను నియమించామన్నారు. నగరంలో శాంతిభద్రతల పరిరక్షణతో పాటు నేరాల నియంత్రణ, కేసులు కొలిక్కితేవడానికి సమప్రాధాన్యం ఇస్తున్నామన్నారు. ప్రజలు కూడా కాస్త అప్రమత్తంగా వ్యవహరించి తమకు సహకరిస్తేనే పూర్తిస్థాయిలో ఫలితాలుంటాయన్నారు. ముఖ్యంగా సూడో పోలీ సులు అంశానికి సంబంధించి నగర పోలీసులు ఎవ్వరూ మఫ్టీల్లో ఉండి తనిఖీలు చేయరని, బృం దంలో కనీసం ఒక్కరైనా ఖాకీ దుస్తుల్లో ఉంటారన్నది గుర్తుంచుకోవాలని కమిషనర్ కోరారు.