పాకిస్థాన్‌లో అంతే.. ‘లూటీ చేయడానికి ఏమన్నా మిగిలాయా?’ | Locals Looting Laptops After Raid At Fake Chinese Call Centre In Islamabad | Sakshi
Sakshi News home page

పాకిస్థాన్‌లో అంతే.. ‘లూటీ చేయడానికి ఏమన్నా మిగిలాయా?’

Published Tue, Mar 18 2025 6:54 PM | Last Updated on Tue, Mar 18 2025 7:20 PM

Locals Looting Laptops After Raid At Fake Chinese Call Centre In Islamabad

ఇస్లామాబాద్‌ : పదుల సంఖ్యలో కార్పొరేట్‌ కంపెనీల కార్యకలాపాలతో రద్దీగా ఉండే ఏరియా. ఆ ప్రాంతానికి చెందిన కంపెనీల్లో ఉద్యోగులు కంప్యూటర్లతో కుస్తీలు పడుతుంటారు. అయితే, ఎప్పటిలాగే విధులు నిర్వహించేందుకు ఉద్యోగులు వచ్చారు.

ఉద్యోగులు వచ్చిన రెండు గంటల తర్వాత పోలీసులు, దర్యాప్తు అధికారులు దాడులు చేశారు. పలువురిని అదుపులోకి తీసుకొని వెళ్లిపోయారు. ఈ దాడులపై సమాచారం అందుకున్న స్థానికులు ఆఫీసుల్లో చొరబడి లూఠీ చేశారు. చేతికి ఏది అందితే దాన్ని పట్టుకొని వెళ్లిపోయారు. దొంగిలిచ్చేందుకు వచ్చిన స్థానికులు సైతం లూటీ చేసేందుకు ఇంకా ఏమైనా దొరుకుతుందేమోనని ఆరా తీసిన దృశ్యాలు ప్రస్తుతం సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారాయి.

పాకిస్థాన్‌(Pakistan)లోని ఇస్లామాబాద్‌  సెక్టార్ ఎఫ్‌-11లో  ఉన్న ఓ నకిలీ కాల్ సెంట‌ర్‌పై ఫెడరల్‌ ఇన్వెస్టిగేషన్‌ ఏజెన్సీ (FIA) అధికారులు దాడులు చేశారు. 24 మందిని అదుపులోకి తీసుకుని వెళ్లిపోయారు. అయితే, చైనీయులు నడుపుతున్న కాల్‌ సెంటర్‌పై దాడులు జరిగాయన్న సమాచారం ఆ నోటా ఈనోటా పాకింది. అంతే సమాచారం అందుకున్న స్థానికులు ఆ కాల్ సెంట‌ర్‌లో చొరబడ్డారు. చేతికి అందిన ల్యాప్‌టాప్‌లు, డెస్క్‌టాప్‌లు, మానిట‌ర్లు, కీబోర్డులు, ఎక్స్‌టెన్స‌న్లు.. ఏదిప‌డితే అది ఎత్తుకెళ్లారు. ఫ‌ర్నీచ‌ర్‌, క‌ట్ల‌రీ సెట్ల‌ను కూడా లూటీ చేశారు. 

ఈ లూటీపై సమాచారం అందుకున్న మరి కొంతమంది ఫేక్‌ కాల్‌ సెంటర్‌కు వచ్చారు. తమకూ ఏదైనా దొరుకుతుందేమోనని  ల్యాప్‌ట్యాప్స్‌ను చోరీ చేసిన వారిని ఆరా తీసిన దృశ్యాలు నెట్టింట్లో తెగ వైరల్‌ అవుతున్నాయి. ఇంకెందుకు ఆలస్యం మీరు కూడా ఈ వైరల్ అవుతున్న వీడియోల్ని చూసేయండి.

 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement