ride
-
అడవుల్లో సైతం అవలీలగా వెళ్లే వెహికల్ ఇదే (ఫోటోలు)
-
ర్యాపిడోపై చెన్నై సీఈఓ ఫైర్: ఎందుకంటే..
ర్యాపిడో, ఉబర్ క్యాబ్స్, ఓలా రైడ్స్ వంటివి కస్టమర్ల నుంచి నిర్ణీత ధర కంటే ఎక్కువ డబ్బు వసూలు చేసిన సంఘటనలు గతంలో కోకొల్లలుగా వెలుగులోకి వచ్చాయి. అలాంటి ఘటనే మరొకటి తాజాగా వెలుగులోకి వచ్చింది.మద్రాస్ సెంట్రల్ రైల్వే స్టేషన్ నుంచి 21 కి.మీ దూరంలో ఉన్న తొరైపాక్కం వరకు వెళ్లడానికి ర్యాపిడో ఏకంగా రూ.1,000 వసూలు చేసినట్లు ఏజే స్కిల్ డెవలప్మెంట్ అకాడమీ ఫౌండర్ అండ్ సీఈఓ 'అశోక్ రాజ్ రాజేంద్రన్' వెల్లడించారు. 21 కిలోమీటర్లకు ఛార్జ్ రూ. 350 మాత్రమే. కానీ ర్యాపిడో మూడు రెట్లు డబ్బు వసూలు చేసిందని పేర్కొన్నారు. ఇలాంటి అనుభవం నాకు ఎప్పుడూ ఎదురవ్వలేదని అన్నాడు.ఈ సమస్య గురించి ర్యాపిడోకు తెలియజేసినప్పటికీ.. డ్రైవర్ చర్యల గురించి కూడా అడగకుండా చాట్‌ను ముగించారని, రాపిడో కస్టమర్ కేర్ సర్వీస్‌పై సీఈఓ నిరాశ వ్యక్తం చేశారు. ఇలాంటి నిర్లక్ష్యాలకు త్వరలోనే తగిన గుణపాఠం ఎదురవుతుందని వెల్లడించాడు.ఇదీ చదవండి: రూ.123 కోట్లు విరాళం: ఎవరీ షన్నా ఖాన్..ప్రస్తుతం ఈ సంఘటన సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇలాంటి అనుభవాలు ఎదురైనా పలువురు నెటిజన్లు కూడా దీనిపై స్పందిస్తున్నారు. ర్యాపిడోలో ఇలాంటివి చాలాసార్లు ఎదురయ్యాయని చెబుతున్నారు. ప్రస్తుతం చాలామంది డ్రైవర్లు.. కస్టమర్లను మోసం చేయడం ప్రారంభించారని మరికొందరు చెబుతున్నారు. -
ఓటీటీలో 'మ్యాడ్' ఫేమ్ అనంతిక థ్రిల్లర్ సినిమా
'మ్యాడ్' సినిమాతో గుర్తింపు తెచ్చుకున్న అనంతిక సనీల్‌కుమార్ తమిళ్ నటించిన రైడ్ సినిమా ఓటీటీలో విడుదల కానుంది. ఈ చిత్రం తెలుగులో కూడా స్ట్రీమింగ్ కానున్నడంతో ఆమె అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. యాక్షన్ థ్రిల్లర్ చిత్రంగా గతేడాదిలో థియేటర్లోకి వచ్చిన ఈ మూవీ అనుకున్నంత స్థాయిలో మెప్పించలేకపోయింది. ఈ సినిమాలో శ్రీదివ్య ప్రధాన హీరోయిన్గా నటించిగా.. విక్రమ్ ప్రభు హీరోగా మెప్పించారు.రైడ్ టైటిల్‌తో కోలీవుడ్‌లో విడుదలైన ఈ సినిమా ఆహా ఓటీటీలో అదే పేరుతో తెలుగులో స్ట్రీమింగ్ కానుంది. అక్టోబర్ 19 నుంచి ఈ మూవీ అందుబాటులో ఉండనుందని ఒక పోస్టర్‌ను విడుదల చేశారు. కన్నడలో శివరాజ్‌కుమార్ హీరోగా నటించిన సూపర్ హిట్ సినిమా 'తగారు'కు రీమేక్‌గా రైడ్ తెరకెక్కించారు.అనంతిక సనీల్‌కుమార్ కోసమే ఈ చిత్రాన్ని చూసేందుకు తెలుగు ప్రేక్షకుల ఆసక్తిచూపుతున్నారు. యంగ్ టైగర్ ఎన్టీఆర్ బావమరిది నార్నే నితిన్‌తో మ్యాడ్ సినిమాలో కనిపించిన ఈ బ్యూటీకి టాలీవుడ్లో మంచి ఆదరణే లభించింది. ఆమె చేతిలో మ్యాడ్ స్క్వేర్, 8 వసంతాలు మూవీస్ ఉన్నాయి. తక్కువ సమయంలోనే మైత్రీ మూవీ మేకర్స్ వంటి భారీ బ్యానర్లో ఆమె ప్రధాన పాత్రలో ఛాన్స్ దక్కించుకుంది. -
ఐదేళ్ల చిన్నారికి కార్డియాక్ అరెస్టు..20 సెకన్ల పాటు..!
యూఎస్‌లోని ఐదేళ్ల చిన్నారి కార్డియాక్ అరెస్టు గురై కుప్పకూలింది. దాదాపు 20 సెకన్లపాటు గుండె ఆగిపోయింది. అయితే ఆ బాలుడి బతుకుతాడో లేదో అన్న తీవ్ర ఉత్కంఠ రేగింది. ఈక్రమంలో అతడిని వైద్య పరీక్షల నిమిత్తం మూడు వేర్వేరు ఆస్పత్రలు తరలించారు. అయితే ఆ బాలుడి అదృష్టవశాత్తు మృత్యుంజయుడై బయటపటడి అందర్నీ ఆశ్చర్యపరిచాడు.ఈ ఉత్కంఠభరితమైన ఘటన యూఎస్‌లోని థీమ్ పార్క్ వాల్డ్ డిస్నీ వరల్డ్‌లో చోటు చేసుకుంది. ఐదేళ్ల ఎర్నెస్టో టాగ్లే అనే చిన్నారి రోలర్‌కోస్టర్‌ను రైడ్ చేస్తుండగా అకస్మాత్తుగా కుప్పకూలిపోయాడు. అతని వెనుక కూర్చొన్న ఆమెకు అతడి పల్స్‌లో ఏదో తేడా ఉన్నట్లు గమనించింది. వెంటనే ఛాతీపై తట్టడం వంటి సీఆర్పీ పనులు చేసింది అతడి తల్లి క్రిస్టీనా. ఆ రోలర్ కోస్టర్ రైడ్ ముగిసిన వెంటనే తన కొడుకుని హుటాహుటినా ఆస్పత్రికి తరలించింది. ఆమె వెంట ఒక నర్సు, ఈఎంటీ మెషిన్ని వెంటబెట్టుకుని వెళ్లింది. ఆ సమయంలో ఎర్నెస్టో దాదాపు 20 సెకన్ల పాటు శ్వాస పీలచ్చుకోవడం లేదు అంటే.. గుండె ఆగిపోయింది. దీంతో వాళ్లు గుండె మళ్లీ సక్రమంగా కొట్టుకునేలా ఆటోమేటెడ్ ఎక్స్టర్నల్ డీఫిబ్రిలేటర్(ఈఎంటీ)ను అందించి హెలికాప్టర్ ద్వారా ఆస్పత్రికి తరలించారు. అక్కడ నుంచి ఆ బాలుడిని మూడు వేర్వేరు ఆస్పత్రులకు తరలించి వివిధ వైద్య పరీక్షలు నిర్వహించారు. ఆ పరీక్షల్లో అతడు కాటెకోలమినెర్జిక్ పాలీమార్ఫిక్ వెంట్రిక్యులర్ టాచీకార్డియా (సీపీవీటీ)తో బాధపడుతున్నట్లు నిర్థారణ అయ్యింది. ఇది అరుదైన గుండె పరిస్థితి. దీని కారణంగా సదరు రోగికి తీవ్రమైన ఉత్సాహం లేదా కార్యకలాపాల సమయంలో అకస్మాత్తుగా గుండె ఆగిపోవడం లేదా లయ తప్పడం జరుగుతుంటుంది. ప్రాణాంతకమైన ఈ అరిథ్మియాలో వచ్చే ఆకస్మిక కార్డియాక్ అరెస్టుని నివారించేలా ఒక పరికరాన్ని అతడి ఛాతీలో ఉంచారు. అయితే అన్ని నిమిషాలపాటు శ్వాస ఆగిపోయిన టైంలో అతడి గుండె, మెదడు దెబ్బతినకుండా వైద్యులు రక్షించడం విశేషం. ఈ భయానక ఘటన నుంచి తన కొడుకు ఓ యోధుడిలా తిరిగొచ్చడాని ఇన్స్టాగ్రామ్ వేదికగా ఈ విషయాన్ని పంచుకుంది. అంతేగాదు తన కుమారుడిని కాపాడేందుకు సహకరించిన ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలిపింది. ప్రస్తుతం ఈ పోస్ట్ నెట్టింట తెగ వైరల్ అవుతోంది. "ఆ చిన్నారి శక్తి అజేయం, భయానక పరిస్థితిని నుంచి బయటపడ్డ అద్భుత వ్యక్తి". అని నెటిజన్లు ప్రశంసిస్తూ పోస్టులు పెట్టారు.(చదవండి: ఒత్తిడికి గురైతే ఆస్తమా అటాక్ అవుతుందా..? రెండింటికి సంబంధం ఏంటీ..?) -
ఢిల్లీ మెట్రోలో ప్రయాణించిన దేవెగౌడ
న్యూఢిల్లీ: మాజీ ప్రధాని దేవెగౌడ ఢిల్లీ వాసులను ఆశ్చర్యపరిచారు. ఆదివారం ఢిల్లీ మెట్రో రైలులో దేవెగౌడ ప్రయాణించారు. ప్రయాణం సందర్భంగా దేవెగౌడ మెట్రో ప్రయాణికులతో సరదాగా ముచ్చటించారు. ఢిల్లీ మెట్రో రైలులో ప్రయాణించిన వీడియోను దేవెగౌడ తన సోషల్ మీడియా ఖాతాలో షేర్ చేశారు. VIDEO | Former Prime Minister of India HD Devegowda (@H_D_Devegowda) travels in Delhi metro.(Full video available on PTI Videos - https://t.co/dv5TRARJn4) pic.twitter.com/Oa6WJSYcQT— Press Trust of India (@PTI_News) August 4, 2024 91 ఏళ్ల వయసున్న దేవెగౌడ ప్రస్తుతం రాజ్యసభ ఎంపీగా ఉన్నారు. ఈయన 1996 నుంచి 1997 దాకా దేశ ప్రధానిగా పనిచేశారు. దేవెగౌడ ప్రధానిగా ఉన్న సమయంలోనే ఢిల్లీ మెట్రోరైలు ప్రాజెక్టుకు బీజం పడింది. ప్రాజెక్టు డీపీఆర్‌ను అప్పుడే రూపొందించారు. దేవెగౌడ కుమారుడు జనతాదళ్ సెక్యులర్(జేడీఎస్) పార్టీ చీఫ్ కుమారస్వామి ప్రస్తుతం కేంద్రమంత్రివర్గంలో ఉక్కు, భారీ పరిశ్రమల మంత్రిగా ఉన్నారు. -
ఇక ఎంత దూరం తొక్కినా నొప్పి లేని సైక్లింగ్
‘వెబ్స్ రైడర్’.. ప్రపంచంలోని మొట్టమొదటి వర్చువల్ యాక్సిస్ సైకిల్ సీటు. ఇది మరింత సౌకర్యవంతమైన రైడ్ కోసం ఉపయోగపడుతుంది. సైకిల్‌కు గల ఈ సీటుపై కూర్చుని పెడల్ తొక్కుతున్నప్పుడు శరీర బరువును ఇరువైపులా సమానంగా పంపిణీ చేసి, దానిని తొక్కుతున్న వ్యక్తి శరీరంలోని సీటు దగ్గర ఏమాత్రం నొప్పి కలుగకుండా చూస్తుంది. ఆస్ట్రేలియన్ ఇంజనీర్ రాబిన్ మకాన్ మరింత సౌకర్యవంతమైన సైకిల్ సీటును రూపొందించేందుకు ప్రయత్నిస్తుండేవాడు. మానవ శరీరంలోని స్వాభావిక నొప్పి పాయింట్లను సైకిల్‌కు ఉన్న కుషనింగ్ సీటు భర్తీ చేయలేదనే విషయాన్ని గమనించిన ఆయన శరీర బరువును ఇరువైపులా సమానంగా పంపిణీ చేసే సైకిల్ సీటును రూపొందించే దిశగా ముందుకు సాగాడు.తాను రూపొందించిన నమూనాను ‘ఇన్వెంటర్స్ అసోసియేషన్ ఆఫ్ ఆస్ట్రేలియా’ అనే సంస్థకు తెలియజేశాడు. ఇది నూతన ఆవిష్కర్తలకు మద్దతును అందించే స్వచ్ఛంద సంస్థ. అక్కడ రాబిన్ మకాన్ పారిశ్రామిక డిజైనర్ ఫిలిప్ గుయిచార్డ్ను కలుసుకున్నాడు. వీరిద్దరూ ఈ రెండేళ్ల పాటు కష్టపడి ఈ డిజైన్‌ను మరింతగా మెరుగుపరిచారు. ప్రముఖ ఇంజినీరింగ్ సంస్థ విజిల్ సహకారంతో వారు రూపొందించిన ‘వెబ్స్ రైడర్’ మార్కెట్లోకి తీసుకువచ్చారు.ఈ వెబ్రైడర్ స్ప్లిట్ సైకిల్ సీటు వినియోగదారులకు అత్యంత సౌకర్యవంతమైన సైకిల్ రైడ్ అనుభవాన్ని అందిస్తుంది. ఈ సీటుపై కూర్చుని సైకిల్ తొక్కుతున్నప్పుడు రెండు కాళ్లు సమానంగా కలిలేందుకు వీలు కల్పిస్తుంది. సీటు ఎముకల నుండి తొడ ఎముకలకు ఒత్తిడిని బదిలీ చేసి, కాళ్లకు నొప్పి కలుగుకుండా చూస్తుందని రాబిన్ మకాన్ తెలిపారు. This revolutionaly bike seat design.[🎞️ AtaraxyBSC]pic.twitter.com/cLOV3MWmuw— Massimo (@Rainmaker1973) June 11, 2024 -
చిన్న పరికరం.. పెద్ద ప్రయోజనం - వీడియో
ప్రస్తుతం ఎలక్ట్రిక్ కార్లు, బైకులు మాత్రమే కాకుండా.. ఎలక్ట్రిక్ సైకిల్స్ కూడా విరివిగా అందుబాటులో ఉన్నాయి. బైకులు, కార్లలో మాదిరిగా కాకుండా.. సైకిల్స్‌లో చిన్న బ్యాటరీ లేదా ఈ-బైక్ కన్వర్షన్ కిట్లు ఉంటాయి. బ్యాటరీల గురించి విన్న చాలామందికి కన్వర్షన్ కిట్ల గురించి తెలియకపోవచ్చు. ఈ కథనంలో మరిన్ని వివరాలు వివరంగా తెలుసుకుందాం. ఈ-బైక్ కన్వర్షన్ కిట్లు సాధారణ సైకిల్‌కు అదనంగా యాడ్ చేయడానికి అనుగుణంగా ఉంటాయి. ఇది మౌంట్ చేసుకున్న తరువాత మంచి రైడింగ్ అనుభూతిని అందిస్తుంది. ఇక్కడ ఫోటోలలో గమనించినట్లయితే డిస్క్ బ్రేక్‌కు అమర్చిన కన్వర్షన్ కిట్ చూడవచ్చు. (Image credit: Skarper / Red Bull) ఇక్కడ కనిపించే కన్వర్షన్ కిట్‌ను స్కార్పర్ అనే స్టార్టప్ ఈ ఏడాది పరిచయం చేసింది. ఇది ఒక అధునాతన టూ-మోడ్ ఎలక్ట్రిక్ బైక్ మోటారు. కస్టమ్ డిజైన్ చేసిన డిస్క్ బ్రేక్‌కు క్లిప్ చేసుకోవచ్చు. ఇది పూర్తి గేర్‌బాక్స్‌గా పనిచేస్తుంది. బైక్‌పై కస్టమ్ డిస్క్‌ని ఇన్స్టాల్ చేసిన తర్వాత, మోటారును ఆన్ లేదా ఆఫ్ చేయడానికి కొన్ని సెకన్ల సమయం పడుతుంది. పవర్ అనేది వెంటనే మారుతుంది. కన్వర్షన్ కిట్ తయారీకి సంస్థకు ఏకంగా మూడు సంవత్సరాల సమయం పట్టినట్లు తెలుస్తోంది. ఇది సైకిల్లో డిస్క్ బ్రేక్ మాదిరిగా కూడా పనిచేస్తుంది. ఈ కిట్‌ను మౌంట్ చేయడం లేదా రిమూవ్ చేయడం చాలా సులభంగా ఉంటుంది. కాబట్టి వినియోగదారుని అవసరమైనప్పుడు మౌంట్ చేసుకోవచ్చు, మిగిలిన సమయంలో తీసి ఇంట్లో జాగ్రత చేసుకోవచ్చు. ఇదీ చదవండి: భారత్ నెలలో చేసేది అమెరికాకు మూడేళ్లు - కేంద్ర మంత్రి కీలక వ్యాఖ్యలు చేతిలో పట్టుకెళ్ళడానికి అనుకూలంగా ఉండే కన్వర్షన్ కిట్ ధర 1295 యూకే పౌండ్స్ (భారతీయ కరెన్సీ ప్రకారం రూ. 1.30 లక్షలకంటే ఎక్కువ) అని తెలుస్తోంది. అడ్వాన్స్డ్ టెక్నాలజీ కలిగిన ఈ కిట్ ధర ఎక్కువగా ఉన్నప్పటికీ భవిష్యత్తులో గొప్ప ఆదరణ పొందుతుందని తయారీదారులు భావిస్తున్నారు. -
గాల్లో తలకిందులుగా 30 నిమిషాలు.
టొరంటో: సరదాగా పార్కులో గడుపుదామనుకుని అక్కడికి విచ్చేసిన సందర్శకులకు చేదు అనుభవం ఎదురైంది. వారు ఎక్కిన లాంబర్‌జాక్ రైడ్ పైకి వెళ్లాక హఠాత్తుగా మధ్యలోనే ఆగిపోయింది. దీంతో అందులో చిక్కుకుపోయిన సందర్శకులు 30 నిమిషాలపాటు తలకిందులుగా వేలాడుతూ సాయంకోసం అరి్థంచారు. కెనడాలోని ఒంటారియా నగరంలోని వండర్ల్యాండ్ అమ్యూజ్మెంట్ పార్క్‌లో శనివారం రాత్రి ఈ ఘటన జరిగింది. రైడ్‌లో భాగంగా అందులో కూర్చున్న వారంతా అలా గాల్లో తలకిందులుగా వేలాడుతూ హాహాకారాలు చేస్తున్న వీడియో ప్రసుత్తం సామాజిక మాధ్యమాల్లో విస్తృతంగా షేర్ అవుతోంది. ఎట్టకేలకు 30 నిమిషాలకు అందరినీ ఎలాగోలా కిందకు సురక్షితంగా తీసుకొచ్చారు. అంతసేపు తలకిందులుగా వేలాడటంతో కొందరు స్వల్ప అస్వస్థతకు గురయ్యారు. -
ఇజ్రాయెల్ ప్రధానితో మస్క్: సైబర్‌ట్రక్ రైడ్ వీడియో వైరల్
ఇజ్రాయెల్ ప్రధాన మంత్రి బెంజమిన్ నెతన్యాహు సోమవారం తన అమెరికా పర్యటనలో టెస్లా సీఈవో బిలియనీర్ ఎలాన్ మస్క్‌ను కలిశారు. ఈ సందర్భంగా భార్య సారాతో కలిసి నెతన్యాహు నెతన్యాహుని కాలిఫోర్నియాలోని ఫ్రీమాంట్‌లోని టెస్లా ఫ్యాక్టరీ పర్యటనకు తీసుకువెళ్లారు. అక్కడ ఇద్దరూ కలిసి మస్క్ ఎలక్ట్రిక్ వాహన కంపెనీ టెస్లాకు చెందిన 'సైబర్‌ట్రక్' (ఇంకా లాంచ్ కాలేదు) లో సంచరించారు. ముగ్గురూ ఫ్యాక్టరీ చుట్టూ బ్యాటరీ-ఎలక్ట్రిక్ ఫుల్-సైజ్ పికప్ ట్రక్‌లో ప్రయాణించిన వీడియోను పీఎం ఆఫీసు అధికారిక (ఎక్స్)లో పోస్ట్ చేశారు. Prime Minister Benjamin Netanyahu and his wife Sara toured the @Tesla Motors plant in Fremont, California, together with Tesla CEO, entrepreneur @ElonMusk. pic.twitter.com/GPCx5tBSUm — Prime Minister of Israel (@IsraeliPM) September 18, 2023 ప్రధానమంత్రి, ఆయన భార్యకు టెస్లా అభివృద్ది చేస్తున్న వివిధ మోడళ్లపై ఎలోన్ మస్క్ వివరించారు.అలాగే అధునాతనఎలక్ట్రిక్ వాహనాల ఉత్పత్తి, అసెంబ్లింగ్ లైన్‌ను పరిశీలించారని ఆ ట్వీట్లో పేర్కొన్నారు.అంతేకాదు ఏఐ వినియోగం, దాని మంచిచెడులను, ఏఐ నష్టాలను ఎలా తగ్గించవచ్చు అనే దాని గురించిచర్చించామంటూ నెతన్యాహూ ట్వీట్ చేశారు. -
Delhi: బైక్ ట్యాక్సీ కంపెనీలకు సుప్రీం షాక్!
రైడ్ షేరింగ్ సంస్థలకు సుప్రీం కోర్ట్ భారీ షాకిచ్చింది. ఢిల్లీ ప్రభుత్వం కొత్త పాలసీని రూపొందించే వరకు ఢిల్లీలో ద్విచక్రవాహనాలు నడపకూడదంటూ ఆదేశాలు జారీ చేసింది. జూన్ 30 నాటికి టూవీలర్ నాన్ ట్రాన్స్పోర్ట్ వాహనాలను నడిపేలా నూతన విధానాన్ని తీసుకువస్తామని ఢిల్లీ ప్రభుత్వం తెలిపింది. అప్పటి వరకు దేశ రాజధానిలో టూవీలర్ ట్యాక్సీ సేవలకు తాత్కాలికంగా బ్రేక్ పడినట్లైంది. ఈ ఏడాది ప్రారంభంలో ఢిల్లీ ప్రభుత్వ రవాణా శాఖ రైడ్ షేరింగ్ సంస్థల్ని ఉద్దేశిస్తూ కీలక నోటీసులు జారీ చేసింది. అందులో వాణిజ్య అవసరాల కోసం ద్విచక్ర వాహనాలను ఉపయోగించడం మోటారు వాహనాల చట్టం 1988ని ఉల్లంఘించడమేనంటూ టూ వీలర్ ట్యాక్సీ సర్వీసులు అందించే సంస్థల్ని హెచ్చరించింది. [BREAKING] Supreme Court stays bike taxi operations of Rapido, Uber in DelhiRead more here: https://t.co/NdU2GfNFWI pic.twitter.com/FCcmpELJif— Bar & Bench (@barandbench) June 12, 2023 అంతేకాదు ప్రభుత్వ నిబంధనల్ని ఉల్లంఘించిన సంస్థలకు మొదటి నేరం కింద రూ. 5,000, రెండవసారి తప్పు చేస్తే రూ. 10,000 జరిమానా, ఏడాది పాటు జైలు శిక్ష విధిస్తామని రవాణా శాఖ విడుదల చేసిన నోటీసుల్లో పేర్కొంది. అంతేకాదు రైడింగ్ సర్వీసులు అందించే వాహన యజమాని (డ్రైవర్) డ్రైవింగ్ లైసెన్స్ 3 నెలల పాటు రద్దు అవుతుందని తెలిపింది. అదే సమయంలో ఢిల్లీ ప్రభుత్వం నిబంధనలు ఉల్లంఘించిన ఓ రైడ్ షేరింగ్ సంస్థకు షోకాజు నోటీసులు అందించింది. ఆ నోటీసులపై స్పందించిన సదరు సంస్థ తమకు అందిన నోటీసులు వివిధ ప్రాథమిక, రాజ్యాంగ హక్కులను కాలరాసేలా ఉందని పేర్కొంది. ఈ నేపథ్యంలో ఢిల్లీలో రైడ్ షేరింగ్ టూ వీలర్ వాహనాల కార్యకలాపాలపై ఆంక్షలు విధిస్తూ సుప్రీం తీర్పు ఇవ్వడం రైడ్ షేరింగ్ సంస్థలకు ఎదురు దెబ్బ తగిలినట్లైంది. చదవండి👉 యాపిల్ కంపెనీలో రూ. 138 కోట్ల ఘరానా మోసం.. భారతీయ ఉద్యోగికి 3 ఏళ్ల జైలు శిక్ష! -
రేయ్! మారండ్రా.. హెల్మట్ ధరించి మరీ రైడ్ చేస్తున్న కుక్క
ట్రాఫిక్ పోలీసుల మన రక్షణ కోసమే హెల్మట్‌ని ధరించమని చెబుతున్నా సరే చాలామంది వాహనదారులు అస్సలు లక్ష్యపెట్టరు. పోలీసులకు పట్టుబడిన తీరు మారకపోగా జరిమానాలు కట్టేందుకు రెడీ అయ్యిపోతుంటారు. ఎందుకు ధరించడం లేదని అధికారులు ప్రశ్నించినా ఏదో ఒక కారణం చెప్పి జారుకునేందుకే ట్రై చేస్తారే తప్ప బాధ్యతగా వ్యవహరించరు. నన్ను చూసి అయినా బుద్ధి తెచ్చుకోండి అన్నట్లుగా కుక్క హెల్మట్ ధరించి మరీ బైక్‌పై రైడ్ చేస్తోంది. అందుకు సంబంధించిన వీడియో నెట్టింట తెగ హల్చల్ చేస్తోంది. ఆ వీడియోలో ఒక వ్యక్తి వెనుకాల ఓ కుక్క హెల్మట్ ధరించి.. మనిషి మాదిరిగా కూర్చొని వెళ్తోంది. నిజానికి బైక్ నడిపేవాడు మాత్రమే గాక వెనుక కూర్చొన్న వ్యక్తి కూడా పిలియన్ రైడర్‌గా హెల్మట్ ధరించాల్సిందే. కానీ చాలామంది ప్రయాణకులు హెల్మట్‌ని ధరించకుండా నిర్లక్ష్యంగా వ్యవహరించి ప్రాణాలపైకి తెచ్చకుంటున్నారు. ఐతే ఆ వీడియోని ఓ ట్విట్టర్ వినియోగ దారుడు 'రూల్ ఇస్ రూల్' అనే క్యాప్షనతో ఓ కుక్క ప్రయాణికుడి మాదిరిగా బైక్‌పై హెల్మట్ ధరించి వెళ్తోందంటూ.. వీడియోని కూడా జత చేసి పోస్ట్ చేశాడు. ఈ వీడియోకి లక్షకు పైగా వ్యూస్ లైక్‌లు వచ్చాయి. మీరు కూడా ఓ లుక్కేయండి. Rule is rule..😜#WhatsApp #instagramdown #TamilNadu pic.twitter.com/g47mB5mEfY — Mohammed Nayeem (@PMN2463) May 23, 2023 (చదవండి: తల్లి కోసం భగీరథుడిలా.. ఆ 14 ఏళ్ల బాలుడు..) -
ఢిల్లీలోని ఆటో రిక్షాలో యూఎస్ సెక్రటరీ: వీడియో వైరల్
న్యూఢిల్లీ మార్చి1న జీ20 విదేశాంగ మంత్రుల సదస్సు జరిగిన సంగతి తెలిసింది. ఆ సదస్సు కోసం అని భారత పర్యటనకు వచ్చిన యూఎస్ సెక్రటరీ ఆంటోని బ్లింకెన్ ఆటో రైడ్ చేశారు. ఈ మేరకు న్యూఢిల్లీలోని అమెరికా రాయబారి కార్యాలయంలో సుదీర్ఘ కాలం పనిచేస్తున్న స్థానిక సిబ్బంది సాయంతో సమీపంలోని ఓ స్థానిక ఆటోలో సరదాగా కాసేపు చక్కెర్లు కొట్టారు. అందుకు సంబంధించని వీడియోని అమెరికా రాయబారి కార్యాలయం ఇది మా ప్రసిద్ధ ఆటోగ్యాంగ్ అనే క్యాప్షన్‌ని జోడించి మరీ ట్వీట్టర్లో పోస్ట్ చేసింది. ప్రస్తుతం అందుకు సంబంధించిన వీడియో నెట్టింట తెగ సందడి చేస్తోంది. Who says official motorcades have to be boring? Watch @SecBlinken cruise in style with the longest-serving locally employed staff at the U.S. Embassy in New Delhi. Our famous #AutoGang 🛺 and their signature "autocade" followed close behind. What an entrance! pic.twitter.com/KbhZPybLy8 — U.S. Embassy India (@USAndIndia) March 3, 2023 (చదవండి: చైనా బెదిరింపులు విదేశాంగ మంత్రికి అర్థం కావడం లేదు:: రాహుల్) -
Viral Video: రైడ్ చేస్తూ చాట్ చేస్తే ఇలానే అవుతుంది
-
ఉబర్‌లో ప్రయాణిస్తుంటారా? అయితే ఇది మీకోసమే
ప్రముఖ క్యాబ్ సేవల సంస్థ ఉబర్ ప్రయాణికులకోసం సరికొత్త ఫీచర్లను అందుబాటులోకి తెచ్చింది.ముఖ్యంగా ప్రయాణికుల భద్రతే లక్ష్యంగా ఈ ఫీచర్లను యూజర్లకు పరిచయం చేస్తున్నట్లు ఆ సంస్థ ప్రతినిధులు వెల్లడించారు. బుక్ చేసుకున్న ప్రయాణికులు ఉబర్ క్యాబ్ ఎక్కిన వెంటనే డ్రైవర్ ఫోన్ నుంచి వారికి సీటు బెల్టు పెట్టుకోండి అంటూ ఓ పుష్ నోటిఫికేషన్ వస్తుంది. అలాగే, మీరు ఎక్కడ ఉన్నారనేది తెలిపిలా లైవ్ లొకేషన్ సమాచారాన్ని స్థానిక పోలీసులకు అందేలా ఎస్ఓఎస్ ఇంటిగ్రేషన్‌ను ప్రారంభించింది. ఇప్పటికే హైదరాబాద్‌లో ఈ సదుపాయం అందుబాటులో ఉంది. ఇక డ్రైవర్‌తో ఏదైనా సమస్య, వెహికల్స్‌లో అసౌకర్యంగా ఉంటే వెంటనే కస్టమర్‌కేర్‌తో మాట్లాడేందుకు సేఫ్టీలైన్ వినియోగంలోకి తెచ్చింది. దీంతో పాటు భద్రతాపరంగా ఎలాంటి ఇబ్బందులు ఎదురైనా ఉబర్ యాప్ ద్వారా 88006 88666 నంబర్‌కు డయల్ చేయొచ్చని కంపెనీ తెలిపింది. 30 సెకన్లలోపే కంపెనీ ప్రతినిధి అందుబాటులోకి వస్తారని పేర్కొంది. -
ముంబై వీధుల్లో స్కూటీపై షికార్లు
-
బెంగళూరు యువతులతో హైటెక్ వ్యభిచారం
మహబూబ్‌నగర్ (గద్వాల క్రైం): జిల్లా కేంద్రంలోని ఓ వ్యభిచార గృహంపై ఆదివారం పోలీసులు దాడులు చేశారు. మొత్తం ఆరుగురిని అదుపులోకి తీసుకున్నామని తెలిపారు. పట్టణ ఎస్ఐ హరిప్రసాద్‌రెడ్డి, టాస్క్‌ఫోర్స్ ఎస్ఐ శేఖర్‌రెడ్డి కథనం ప్రకారం.. ఆంధ్రప్రదేశ్‌కు చెందిన యొన్నబత్తిని రమాదేవి(ఒంగోలు), సాంబశివరావు(విజయవాడ) కొంతకాలంగా గద్వాల పట్టణ శివారులో ఓ ఇంటిని అద్దెకు తీసుకుని ఉంటున్నారు. బెంగళూరు, ఒంగోలు నుంచి అమ్మాయిలను తీసుకువచ్చి వ్యభిచారం నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలోనే ఆదివారం సమాచారం అందడంతో పట్టణంలోని బీరోలు రోడ్డు(తాయమ్మ దేవాలయం) సమీపంలోని ఇంటిపై దాడులు చేశారు. నిర్వాహకులతోపాటు చెనుగోనిపల్లికి చెందిన యువకులు ఎం.డి ఫాయాజ్, ఎండి సోహెల్, మరో ఇద్దరిని అదుపులోకి తీసుకున్నారు. ఆ గదిలోని సెల్ఫోన్లు స్వాదీనం చేసుకున్నారు. వారిని పట్టణ పోలీసు స్టేషన్‌కు తరలించారు. మరొకరు పరారయ్యారని స్థానికులు తెలిపారు. -
బుల్డోజర్ని నడుపతూ వచ్చిన వరుడు! ఫోటో వైరల్
ఇటీవలకాలంలో యువత పెళ్లితంతును చాలా వెరైటీగా చేసుకుంటున్నారు. ఎవరూ చేసుకోని విధంగా, ఊహించని విధంగా ఉండాలనుకుంటున్నారు. అందుకోసం యువత కొత్తట్రెండ్ సృష్టిస్తున్నారనే చెప్పాలి. ఇటీవలే ఒక వధువు కళ్యాణ మండపానికి ట్రాక్టర్ పై వచ్చి షాకిచ్చింది. ఆ ఘటన మరువుక మునుపే ఇక్కడో పెళ్లికొడుకు బుల్డోజర్ పై వచ్చి సందడి చేశాడు. వివరాల్లోకెళ్తే...పెళ్లి చేసుకునేందుకు వరుడు పెళ్లి కూతురు ఇంటికి మంచి కారులోనో లేదంటే మంచి ఖరీదైన బైక్‌లోనో రావడం జరుగుతుంది. కానీ ఉత్తరప్రదేశ్‌లోని ఒక యవకుడు తన పెళ్లిని అందరూ గుర్తించుకునేలా ప్రత్యేకంగా ఉండాలని ఏకంగా బుల్డోజర్ పై డ్రైవ్ చేసుకుంటూ వచ్చాడు. దీంతో పెళ్లికూతురి గ్రామంలోని వాళ్లంతో ఒక్కసారిగా షాక్ అయ్యారు. ఆ తర్వాత అందరూ ఆ వరుడితో సెల్ఫీలు దిగేందుకు ఎగబడ్డారు. ఈ మేరకు వరుడు మాట్లాడుతూ...తాను తన పెళ్లిని గుర్తుండిపోయే ఈవెంట్‌గా మార్చుకోవాలనే ఇలా చేశానని అన్నాడు. పైగా గ్రామమంతా పండుగా వాతావరణం చోటు చేసుకుందంటూ తెగ సంబరపడిపోయాడు. ప్రస్తుతం పెళ్లికొడుకు బుల్డోజర్పై వచ్చిన ఫోటో ఆన్లైన్లో తెగ వైరల్ అవుతోంది (చదవండి: సినిమాలో హీరో మాదిరి కింద పడేశాడు!) -
సైకిల్ తొక్కుతూ జారిపడ్డ అమెరికా అధ్యక్షుడు: వీడియో వైరల్
అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ తన భార్య జిల్ బైడెన్‌తో కలిసి డెలావేర్‌లోని తమ ఇంటికి సమీపంలోని రెహోబోత్ బీచ్‌లో ఎంజాయ్ చేస్తున్నాడు. ఐతే అధ్యక్షుడు బైడెన్ శనివారం సైకిల్ పై సరదాగా రైడింగ్‌కి వెళ్లారు. అనుకోకుండా హఠాత్తుగా సైకిల్ మీద నుంచి దిగుతూ బ్యాలెన్స్ చేసుకోలేక పోవడంతో దొర్లుకుంటూ కింద పడిపోయాడు. ఆ తదుపరి తనంతట తానే లేచిన బైడెన్.. బాగానే ఉన్నానని, తనకేం కాలేదని చెప్పారు. ఈ మేరకు ఈ విషయాన్ని అమెరికా శ్వేత సౌధం వెల్లడించింది. ప్రస్తుతం ఈ ఘటనకు సంబంధించిన వీడియో నెట్టింత తెగ వైరల్ అవుతోంది. Biden just beefed it on his bike in Delaware pic.twitter.com/eYj2oG0tHJ — Quoth the Raven (@QTRResearch) June 18, 2022 (చదవండి: పార్క్ చేసిని కారులో ఏకంగా 47 పిల్లులు ! ఫోటో వైరల్) -
మహిళకు దిమ్మతిరిగే కౌంటర్ ఇచ్చిన క్యాబ్ డ్రైవర్.. వీడియో వైరల్
Woman Racist Comments.. అమెరికాలో జాత్యహంకార కామెంట్స్ కామన్. నల్లజాతీయుల పట్ల తెల్లజాతీయులకు చిన్నచూపు ఉంటుంది. పలు సందర్భాల్లో నల్లజాతీయులపై దాడులు జరిగిన ఘటనలు సైతం చాలానే చూశాము. తాజాగా జాత్యహంకార కామెంట్లు చేస్తున్న ఓ మహిళకు క్యాబ్ డ్రైవర్ రైడ్ నిరాకరించాడు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో ట్రెండింగ్ అవుతుండటంతో నెటిజన్లు.. క్యాబ్ డ్రైవర్‌ను మెచ్చుకుంటున్నారు. ఇంతకీ ఏం జరిగిందంటే..పెన్సిల్వేనియాలోని ఫాసిల్స్ లాస్ట్ స్టాండ్ బార్ బయట జాకీ అనే మహిళ.. బోడే అనే వ్యక్తి క్యాబ్‌లో ఎక్కింది. డ్రైవర్‌ను విష్ చేసిన తర్వాత, “వావ్, నువ్వు తెల్లవాడిలా ఉన్నావే” అని కామెంట్ చేయగా.. బోడే ‘‘ఎక్స్క్యూజ్ మీ’’ అని అనడంతో.. మళ్లీ ఆమె.. “నువ్వు సాధారణ వ్యక్తివా?.. ఇంగ్లీష్ మాట్లాడతారా?” అంటూ బోడే భుజం మీద తడుముతూ కనిపించింది. దీంతో, సీరియస్ అయిన బోడే.. ఇది కరెక్ట్ కాదు. ఎవరో వ్యక్తి తెల్లవాడు కాకపోయినా ఆ సీటులో కూర్చుంటే వచ్చే తేడా ఏంటి అని ప్రశ్నించే సరికి ఆమె షాకైంది. అనంతరం బోడే.. ఆ మహిళను మీరు కారు దిగి వదిలివెళ్లిపోవచ్చు. రైడ్‌ను క్యాన్సిల్ చేస్తున్నానని చెప్పేశాడు. ఈ ఘటనకు సంబంధిన వీడియో మొత్తాన్ని డ్రైవర్ బోడే.. తన హ్యాండ్ కామ్‌లో రికార్డ్ చేసి సోషల్ మీడియాలో పోస్టు చేశాడు. A @lyft driver, James W. Bode exemplified what it is to be a White Ally. He lost money. Risked his rating. All in the name of doing what he believed is right. Be more like James! I owe you a beer, Jimmy. pic.twitter.com/WrdA2AxntD — Kenny Nwankwo (@KennyNwankw0) May 16, 2022 వీడియో సోషల్ మీడియాలో ట్రెండింగ్ నిలిచింది. దీనిపై నెటిజన్లు స్పందిస్తూ.. రేసిస్ట్ కస్టమర్లను తిరస్కరించడం కరెక్ట్ అని కామెంట్స్ చేస్తూనే దీనిని చూసి ప్రతిఒక్కరూ నేర్చుకోవాలంటున్నారు. కానీ, అది అంత ఈజీ కాదంటూ డ్రైవర్ బోడేకు అభినందనలు తెలుపుతున్నారు. అంతకు ముందు.. అమెరికన్ పొలిటికల్ యాక్టివిస్ట్, రైటర్ ఏంజెలా డేవిస్ ఒకానొక సమయంలో.. "జాత్యంహకార సమాజంలో జాత్యంహకారం చేయకుండా ఉంటే సరిపోదు. జాత్యంహకార వ్యతిరేకి అయి కూడా ఉండాలి" అని అన్నారు. ఈ ఘటన ఆయన కామెంట్స్‌కు సూట్ అయ్యేలా ఉందంటూ నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. ఇది కూడా చదవండి: ముప్పై ఏళ్ల బంధానికి ముగింపు.. రష్యా నుంచి దిగ్గజ కంపెనీ నిష్క్రమణ -
Viral Video: ఏంటా దూకుడు!... బ్రేక్ వేసుండకపోతే పరిస్థితి....
అతి వేగం అనర్థం అని ట్రాఫిక్ పోలీసులు ఎంత మొత్తుకుంటున్న యువతలో మాత్రం మార్పు రావడం లేదు. స్పీడ్ బ్రేకర్లు, జీపీఎస్ అంటూ వేగాన్ని నియంత్రించేందుకు పోలీసులు నానా తంటాలు పడుతున్నారు. అయినా మితి మీరిన వేగంతో వేళ్తేనే మజా అంటోంది యువత. ఎంత భయంకరమైన ప్రమాదాలు జరిగిన తగ్గేదేలే అంటూ రయ్ రయ్ మంటూ వెళ్లిపోతున్నారు. అచ్చం అలాంటి ఘటన గురించే ఇప్పుడు మనం చెప్పుకోబోతున్నాం. ఎందుకంటే ఇక్కడొక వ్యక్తి కూడా యూ టర్న్ తీసుకుంటున్న బస్సుని లక్ష్య పెట్టకుండా తనదైన స్పీడులో దూసుకుపోతున్న వీడియో ఒకటి నెట్టింట తెగ వైరల్ అవుతోంది. కర్ణాటకలోని మంగళూరులో బస్సును వేగంగా దాటిన వ్యక్తి త్రుటిలో ప్రాణాపాయం నుంచి బయటపడ్డాడు. బస్సు డ్రైవర్ యూ టర్న్తీసుకోవడానికి బస్సుని ఒక పక్కకు ఆపి తిప్పడానికి ప్రయత్నిస్తున్నాడు. ఇంతలో అకస్మాత్తుగా స్కూటర్ పై దూసుకుంటూ వస్తున్న ఒక వ్యక్తిని చూసి బస్సు డ్రైవర్ వెంటనే బ్రేక్ వేశాడు. అదృష్టవశాత్తు అతనికి ఏం కాలేదు. అయితే ఆ వ్యక్తి మాత్రం చేపల ప్రాసెసింగ్ యూనిట్ గేట్‌ని రాసుకుంటూ ..ఒక దుకాణం, చెట్టు మధ్యలో ఉన్న చిన్న గ్యాప్ నుంచి వెళ్లిపోయాడు. అతను రైడ్ చేసిన విధానం చూస్తేనే వొళ్లు గగ్గర్పాటుకు గురవుతుంది. అయితే ఈ ఘటనకు సంబంధించిన వీడియో ఒకటి నెట్టింట తెగ వైరల్ అవుతోంది. దీంతో నెటిజన్లు లక్కీ గై అని ఒకరు, మరోకరేమో ఏమి జరగనట్టుగా వెళ్లిపోతున్నాడు అంటూ విమర్శిస్తూ ట్వీట్ చేశారు. Viral video of a young man who was speeding on a scooter and miraculously avoided colliding with a bus that was taking a U-turn near Elyarpadavu, Mangalore. 🚌💨🛵 The scooter then hits the door of the fish processing unit and passed in between a shop and a tree. 😱 pic.twitter.com/c4vAvbbikj — Mangalore City (@MangaloreCity) January 11, 2022 -
ఓలా, ఉబెర్ క్యాబ్‌లు సాగిస్తున్న నయా దందా!...భరోసా లేని ప్రయాణం!!
సాక్షి, హైదరాబాద్: హిమాయత్‌నగర్‌కు చెందిన రాజేశ్ కుటుంబ సభ్యులతో కలిసి శంషాబాద్ సమీపంలోని ఓ ఫంక్షన్ హాల్లో పెళ్లి వేడుకలకు హాజరయ్యాడు. మధ్యాహ్నం ఏ ఇబ్బంది లేకుండా క్షణాల్లోనే క్యాబ్ బుక్ అయింది. భార్యా పిల్లలతో కలిసి సంతోషంగా బయలుదేరాడు. సాయంత్రం 6 గంటలకు శంషాబాద్ నుంచి తిరిగి బయలు దేరేందుకు క్యాబ్ కోసం ప్రయత్నించాడు. రద్దీ సమయం కావడంతో క్యాబ్ బుకింగ్‌కు పది నిమిషాలు పట్టింది. ‘హమ్మయ్య ఏదో ఒక విధంగా క్యాబ్ బుక్ అయింది. ఇక వెళ్లిపోవచ్చు’ అనుకుంటుండగా క్యాబ్ డ్రైవర్ ఫోన్ చేశాడు. ఎక్కడెళ్లాలి అని అడిగాడు. హిమాయత్‌నగర్‌కు అని చెప్పడంతో ఫోన్ పెట్టేశాడు. గంట గడిచినా క్యాబ్ రాలేదు. బుకింగ్ రద్దు కాలేదు. మరో క్యాబ్ కోసం ప్రయత్నించాడు. క్యాబ్ డ్రైవర్ రూ.1000 డిమాండ్ చేశాడు. బుకింగ్ రద్దు చేసుకొంటే వస్తానన్నాడు.మరో గత్యంతరం లేకపోవడంతో డ్రైవర్ డిమాండ్‌కు అంగీకరించవలసి వచ్చింది. ఇది ఒక్క రాజేశ్ కు ఎదురైన అనుభవం మాత్రమే కాదు. ఓలా, ఉబెర్ క్యాబ్‌లు సా గిస్తున్న నయా దందా ఇది. ప్రయాణికులను ఠారెత్తిస్తున్నారు. చివరినిమిషంలో రైడ్లను రద్దు చేసుకొనే విధంగా ఒత్తిడి తెస్తున్నారు. అడిగినంతా ఇస్తే ఓకే అంటున్నారు. దీంతో క్యాబ్ ఉందనే భరోసాతో భార్యా పిల్లలతో కలిసి ఇంటి నుంచి బయటకు వస్తున్న వారు ఆ తరువాత తీవ్ర ఇబ్బందులకు గురి కావలసి వస్తుంది. ఒక్క శంషాబాద్ రూట్లోనే కాకుండా నగరంలోని అన్ని ప్రాంతాల్లోనూ కొంతకాలంగా ఇదే పరిస్థితి నెలకొంది. భరోసాలేని క్యాబ్ జర్నీ... సాధారణంగా ఉదయం,సాయంత్రం వేళల్లో రద్దీ ఎక్కువగా ఉంటుంది. ఆ సమయంలో క్యాబ్ బుకింగ్‌లకు కొంత సమయం పట్టవచ్చు. ఏదో ఒకవిధంగా క్యాబ్ బుక్ చేసుకొని వెళ్లొచ్చని భావించే ఉద్యోగులు, వ్యాపారులు, వివిధ వర్గాల ప్రయాణికులకు ఇలా చివరి నిమిషంలో రైడ్స్ రద్దు కావడంతో తీవ్రంగా నష్టపోవలసి వస్తుంది. ‘క్యాబ్‌ల వల్ల ప్రయాణానికి భరోసా లభించడం లేదని, డ్రైవర్లకు గిట్టుబాటయితేనే వస్తారని’ అంబర్‌పేట్‌కు చెందిన రాజు విస్మయం వ్యక్తం చేశారు. కొంతమంది డ్రైవర్లు తాము రావడం లేదని స్పష్టంగా చెప్పేస్తున్నారు. మరి కొందరు రైడ్ రద్దు చేసుకొని తాము అడిగినంతా నగదు రూపంలోనే చెల్లిస్తే వస్తామని పేచీ పెడుతున్నారు. దీంతో తప్పనిసరి పరిస్థితుల్లో డ్రైవర్లు డిమాండ్ చేసినంత చెల్లించవలసి వస్తుంది. ‘ఇలాంటి క్యాబ్ డ్రైవర్లపైన ఎవరికి ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదని’ మల్కాజిగిరికి చెందిన సతీష్ అభిప్రాయపడ్డారు. కమిషన్లు తగ్గినందుకే ఇలా... ఓలా, ఉబెర్ సంస్థలు డ్రైవర్లకు కమిషన్ల రూపంలో చెల్లిస్తాయి. ప్రతి కిలోమీటర్‌కు కొంత మొత్తాన్ని డ్రైవర్ల ఖాతాలో జమ చేస్తారు. కానీ ఇలా కమిషన్ రూపంలో వచ్చే ఆదాయం తమకు ఏ మాత్రం చాలడం లేదంటూ డ్రైవర్లు నేరుగా ప్రయాణికులతో బేరాలకు దిగుతున్నారు. ఓలా, ఉబెర్ల నుంచి రైడ్ బుకింగ్‌లు వచ్చే వరకు ఎదురు చూసి ఆ తరువాత ఈ తరహా బేరసారాలను కొనసాగిస్తున్నారు. డిజిటల్ అయితే నో... సదరు ఓలా, ఉబెర్ క్యాబ్ సంస్థలతో తమ కమిషన్లపైన ఒప్పందం చేసుకోవలసిన డ్రైవర్లు ప్రయాణికులను ఇబ్బందులకు గురి చేస్తున్నారు. సాయంత్రం 6 దాటితే చాలు. రద్దీ ఉండే రూట్ల లో క్యాబ్‌లు బుక్ కావడం లేదు. ఒకవేళ అయినా ‘డిజిటల్ పేమెంట్స్’ అనగానే నిరాకరిస్తున్నారు. ఓలా, ఉబెర్ యాప్‌లలో రెంటల్ బుకింగ్స్ సదుపాయం ఉన్నట్లు కనిపిస్తుంది. కానీ ఆన్లైన్లో రెంటల్ బుకింగ్స్‌కు డ్రైవర్లు నిరాకరించడం గమనార్హం. శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయానికి రాకపోకలు సాగించే ప్రయాణికులను కూడా క్యాబ్‌లు తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తున్నాయి. చివరి నిమిషంలో రైడ్ల రద్దు వల్ల దిక్కుతోచని పరిస్థితుల్లో పడాల్సి వస్తుందని ప్రయాణికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఓలా, ఉబెర్ ఇబ్బందుల దృష్ట్యా కొద్ది రోజుల క్రితం ఎయిర్‌పోర్టు అధికారులు ప్రత్యామ్నాయ క్యాబ్‌లను అందుబాటులోకి తెచ్చారు. -
వైరల్: మొసలిపై కొంగ సవారీ .. నోరెళ్లబెట్టిన నెటిజన్లు
మొసలిని చూస్తే ఎవరైనా భయపడతారు. ఇక అదే మొసలి నీటిలో ఉంటే.. దానికి వెయ్యి ఏనుగుల బలం ఉన్నట్లేనని ప్రతీ ఒక్కరికీ తెలిసిన విషయమే. ఆ ప్రాంతంలో ఏ జంతువు అయినా దానికి ఆహారం కావాల్సిందే. అంతెందుకు ఆకారంలో పెద్దగా ఉండే ఏనుగు కూడా నీళ్లలో మొసలికి చిక్కితే దాని పరిస్థితి దబిడిదిబిడే మరి. కానీ నాకివన్నీ తెలియదు భయానికి మీనింగ్ తెలియని బ్లడ్ నాది అన్నట్లు ప్రవర్తించింది ఓ కొంగ. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్‌గా మారి హల్ చల్ చేస్తోంది. ఓ కొంగ మొసలిని చూసి భయపడటం కాదు కదా ఏకంగా దాని మీద ఎక్కి మరీ సవారీ చేసింది. అంతేనా, ఆ కొంగ ఎంచక్కా రైడ్ చేస్తున్నట్లు ఫోజులిస్తూ మనకు కనిపిస్తుంది. ఇంతలో అనుకోకుండా అక్కడికి మరో రెండు మొసళ్ళు వచ్చాయి. అవి ఈ కొంగ పని పడతాయని అనుకున్నారు ఈ వీడియో చూసిన వాళ్లంతా కానీ, ఆ మొసళ్ళు కూడా కొంగను చూసి సైలెంట్‌గా వెళ్లిపోయాయి. అలానే కొంగ నిల్చున్న మొసలి కూడా ఏమీ ఆ పక్షిని గాయపరచకుండా జాగ్రత్తగా ఒడ్డుకు తీసుకువెళ్లడం మరో వింత. మామూలుగా అయితే ఇలాంటి సంఘటనలు జరగడం అరుదు. అందుకే ఈ వీడియో చూసిన నెటిజన్లు నోరెళ్లబెడుతున్నారు. కొందరు ఆ కొంగ ధైర్యాన్ని మెచ్చుకోగా, మరికొందరు ఆ మొసలి, కొంగ స్నేహితులేమో అని కామెంట్స్ పెడుతున్నారు. చదవండి: వామ్మో.. గాల్లో బంతిలా ఎగిరి కిందపడ్డ ‘సివంగి’ -
వ్యభిచార గృహంపై టాస్క్‌ఫోర్స్ దాడులు
ఆదిలాబాద్/ఎదులాపురం: పట్టణంలో గుట్టుచప్పుడు కాకుండా సాగుతున్న వ్యభిచార గృహంపై గురువారం టాస్క్‌ఫోర్స్ సీఐ ఇ.చంద్రమౌళి ఆధ్వర్యంలో వన్‌టౌన్ సీఐ రామకృష్ణతో కలిసి సంయుక్తంగా దాడి చేశారు. నలుగురు మహిళలతో పాటు ఏడుగురు విటులను అదుపులోకి తీసుకున్నారు. పట్టణంలోని కైలాస్‌నగర్ కాలనీకి చెందిన ఓ మహిళతో కలిసి ప్రధాన నిర్వాహకుడు జర్నలిస్టు కాలనీలోని ఓ ఇంటిని అద్దెకు తీసుకుని నిస్సహాయులైన మహిళలచే వ్యభిచారం చేయిస్తున్నట్లు వన్‌టౌన్ సీఐ ఎస్.రామకృష్ణ తెలిపారు. గత కొంత కాలంగా నిఘా పెట్టిన టాస్క్‌ఫోర్స్ పోలీసులు మాటు వేసి పట్టణ పోలీసులతో కలిసి దాడి చేసినట్లు పేర్కొన్నారు. 11 మందిని అరెస్టు చేసినట్లు తెలిపారు. ఇందులో ప్రధాన నిర్వాహకురాలితో పాటు ముగ్గురు మహిళలు, ఏడుగురు విటులు ఉన్నట్లు వివరించారు. (పది పెళ్లిళ్లు చేసుకున్నాడు.. ఆస్తి కోసం అతడ్ని..) ఇందులో వడ్డెర కాలనీకి చెందిన షేక్ ఆసిఫ్, శాంతినగర్‌కు చెందిన బరిగెళ్ల శ్రీకాంత్, మహారాష్ట్రలోని పిప్పల్‌కోటికి చెందిన పర్షా అక్షయ్, జైనథ్ మండలం పెండల్వాడకు చెందిన ఠాకూర్ దశరథ్, మహారాష్ట్రలోని పాఠన్‌బోరికి చెందిన గోదావరి నరేష్, భుక్తాపూర్‌కు చెందిన కాంబ్లే బాబా సాహెబ్, జైనథ్ మండలం పెడల్‌వాడకు చెందిన చుక్కలవార్ ఆకాశ్‌లను అదుపులోకి తీసుకున్నట్లు పేర్కొన్నారు. వీరి నుంచి ఒక ఆటో, ఒక ద్విచక్ర వాహనం, 12 సెల్ఫోన్లను స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. వ్యభిచారానికి పాల్పడిన ఇద్దరు నిర్వాహకులతో పాటు 11 మందిపై కేసు నమోదు చేసినట్లు పేర్కొన్నారు. దాడుల్లో వన్‌టౌన్ ఎస్సైలు జి.అప్పారావు, జాదవ్ గుణవంత్‌రావు, టాస్క్‌ఫోర్స్ పోలీసు అధికారులు షేక్ తాజొద్దీన్, ఎం.రమేష్‌కుమార్, సయ్యద్ రాహత్, హనుమంత్‌రావు, ఎంఏ కరీమ్, మంగళ్‌సింగ్, ఠాకూర్ జగన్‌సింగ్, ఎన్.నగేష్, మహిళ కానిస్టేబుళ్లు మమత, సోనీ తదితరులు ఉన్నారు. (భార్యకు రెండు పెళ్లిళ్లు.. అనుమానంతో హత్య ) -
ఆ దేశంలో ఇక పై ‘ నో మాస్క్, నో రైడ్’ పాలసీ
సియోల్: కరోనా మహమ్మారి కారణంగా ప్రపంచంలో ఉన్నఅన్ని దేశాలు సమస్యలను ఎదుర్కొంటున్నాయి. ఈ వైరస్ వ్యాప్తిని అరికట్టడానికి దేశాలన్ని లాక్‌డౌన్‌ను ప్రకటించాయి. ఇంకా చాలా దేశాలు మాస్క్‌లు ధరించే బయటకు రావాలన్న నిబంధనను అమలు చేస్తున్నాయి. మాస్క్‌లు ధరించకపోతే కొన్ని చోట్ల ఫైన్లు కూడా వేస్తున్నారు. ఇక తాజాగా సౌత్‌కొరియా కూడా బస్సులు, టాక్సీలలో ప్రయాణించాలంటే మాస్క్‌లు తప్పనిసరి చేస్తూ ‘నో మాస్క్, నో రైడ్’ పాలసీని తీసుకువచ్చింది. దేశ రాజధాని సియోల్, చుట్టుపక్కల ప్రాంతాల్లో కరోనా కేసులు రోజురోజుకు పెరుగుతుండటంతో అక్కడి వారు ఎవరైనా బస్సులు, టాక్సీలలో ప్రయాణించాలంటే కచ్ఛితంగా మాస్క్ ధరించాల్సిందేనని అక్కడి ప్రభుత్వం ‘నో మాస్క్ నోరైడ్ పాలసీ’ని మంగళవారం తీసుకుచ్చింది. (అత్యాచారం కేసులో చిలుక సాక్ష్యం) మాస్క్‌లేకుండా ఎవరైనా బస్సులు, టాక్సీలలో ప్రయాణించాలనుకుంటే వారిని అనుమతించవద్దని బస్సు, టాక్సీ డ్రైవర్లకు మార్గదర్శకాలు జారీ చేసింది. దీంతో అక్కడి వారందరూ మొదటిరోజు మాస్క్‌లు ధరించి ప్రభుత్వం విధించిన మార్గదర్శకాలను అనుసరించారు. చాలా మంది ప్రభుత్వం సూచించిన మాస్క్‌లను కాకుండా గుడ్డతో తయారు చేసిన కాటన్ మాస్క్‌లను కూడా ధరించి రోడ్లపైకి వచ్చారు. సౌత్‌కొరియాలో మంగళవారం కొత్తగా 19 కరోనా కేసులు నమోదు కావడంతో అక్కడ మొత్తం కరోనా కేసుల సంఖ్య 11,225 కి చేరాయి. (కరోనా ఆరంభం మాత్రమే: ‘బ్యాట్ ఉమెన్’) -
ఎక్సైజ్ అధికారులపై దాడి
జడ్చర్ల: తనిఖీలకు వెళ్లిన ఎక్సై జ్ అధికారులు, సిబ్బందిపై గుడుంబా తయారీదారులు ఒక్కసారిగా కర్రలతో దాడికి పాల్పడ్డారు. దీంతో ఎక్సైజ్ సీఐ, హెడ్‌కానిస్టేబుల్, ఇద్దరు కానిస్టేబుళ్లకు తీవ్ర గాయాలయ్యాయి. ఈ సంఘటన శనివారం అర్ధరాత్రి జడ్చర్ల మం డలం కిష్టారం సమీపంలోని ఒంటిగుడిసె తండాలో చోటు చేసుకుంది. గుడుంబా నియంత్రణలో భాగంగా మహబూబ్‌నగర్ జిల్లా జడ్చర్ల ఎక్సైజ్ సీఐ బాలాజీ, ట్రెయినీ ఎస్ఐ ఉమామహేశ్వ ర్, హెచ్‌సీ రమేశ్, కానిస్టేబుళ్లు సిద్ధార్థ, వెంకటేశ్ తమ వాహనం లో కిష్టారం సమీపంలో తనిఖీలు చేపట్టారు. ఈ సందర్భంగా ఓ బైక్, లూనాపై నలుగురు వ్యక్తులు 20 లీటర్ల గుడుంబాను తరలి స్తుండగా పట్టుకుని విచారించారు. తాము ఒంటిగుడిసె తండా సమీపంలో రాజు నుంచి గుడుంబాను కొనుగోలు చేసినట్లు వారు సమాచారం ఇవ్వడంతో ఎక్సైజ్ పోలీసులు అక్కడికి చేరుకున్నారు. వీరి రాకను పసిగట్టిన నలుగురు తయారీదారులు విచక్షణారహితంగా కర్రల తో దాడి చేశారు. దీంతో సీఐ, హెచ్‌సీ, ఇద్దరు కానిస్టేబుళ్ల తలలు పగిలి తీవ్ర రక్తస్రావమైంది. బాధితులు బాదేపల్లి ప్రభుత్వ ఆస్పత్రిలో చికిత్స పొందారు. అనంతరం జడ్చర్ల పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయగా సీఐ వీరస్వామి కేసు దర్యాప్తు చేపట్టా రు. నిందితుల కోసం పోలీసులు గాలిస్తున్నారు. మంత్రి శ్రీనివాస్‌గౌడ్ ఆదివారం జడ్చర్ల ఎక్సైజ్ కార్యాలయానికి చేరుకుని బాధితులను పరామర్శించారు. దాడులకు వెళ్లే సమయంలో ఆత్మరక్షణ చర్యలు తీసుకోవాలని సూచించారు. నిందితులు ఎంతటి వారైనా కఠిన చర్యలు తీసుకుంటామని చెప్పారు. గాయపడిన ఎక్సైజ్ సీఐ బాలాజీ, కానిస్టేబుల్ సిద్ధార్థ -
రెండో రైడ్‌కు రెడీ
అజయ్ దేవగన్ హీరోగా రాజ్‌కుమార్ గుప్తా దర్శకత్వంలో తెరకెక్కిన ‘రైడ్’ (2018) చిత్రానికి ప్రేక్షకుల నుంచి మంచి స్పందన లభించింది. బాక్సాఫీసు వద్ద చెప్పుకోదగ్గ వసూళ్లను కూడా రాబట్టిందీ చిత్రం. తాజాగా ఈ సినిమాకు సీక్వెల్‌గా ‘రైడ్ 2’ను సెట్స్‌పైకి తీసుకువెళ్లే ఆలోచనలో ఉన్నట్లు ‘రైడ్’ చిత్రనిర్మాతల్లో ఒకరైన భూషణ్‌కుమార్ తెలిపారు. ‘‘ప్రస్తుతం ‘రైడ్ 2’ స్క్రిప్ట్ వర్క్ జరుగుతోంది. తొలి పార్ట్ సక్సెస్ సాధించింది. దీంతో సీక్వెల్‌పై ప్రేక్షకులకు భారీ అంచనాలు ఉంటాయి. ఆ అంచనాలను చేరుకునేలా సీక్వెల్‌ను ప్లాన్ చేస్తున్నాం’’ అని పేర్కొన్నారు భూషణ్‌కుమార్. -
మళ్లీ రైడ్
గత ఏడాది హీరో అజయ్ దేవగన్ బాలీవుడ్ వెండితెరపై చేసిన ‘రైడ్’ బాక్సాఫీస్ వద్ద వంద కోట్లకుపైగా వసూళ్లను రాబట్టింది. దీంతో మళ్లీ ‘రైడ్’ చేయడానికి ప్రణాళిక సిద్ధం చేస్తున్నారు అజయ్. తొలి రైడ్‌లో అజయ్ సరసన హీరోయిన్గా నటించిన ఇలియానాయే మలి రైడ్‌లోనూ నటించబోతున్నారని బాలీవుడ్ సమాచారం. 1980 నేపథ్యంలో అప్పటి వాస్తవ సంఘటనల ఆధారంగా రాజ్‌కుమార్ గుప్తా దర్శకత్వంలో ‘రైడ్’ చిత్రం తెరకెక్కింది. తాజాగా మరో భారీ ఐటీ రైడ్ నేపథ్యంలో ‘రైడ్’కు సీక్వెల్ తీయాలనే ఆలోచనలో ఉన్నారట అజయ్ దేవగన్. ఇందుకు తగిన కథాచర్చలు కూడా జరుగుతున్నాయని బాలీవుడ్ వర్గాలు చెబుతున్నాయి. మరి.. రెండో ‘రైడ్’కు కూడా రాజ్‌కుమార్ గుప్తాయే దర్శకత్వం వహిస్తారా? అనే విషయంపై స్పష్టత రావాల్సి ఉంది. -
వికలాంగుల వసతి గృహమా.. లేక పశువుల కొట్టమా..?
సాక్షి, ఒంగోలు సిటీ: అసలే దివ్యాంగులు..పైగా ఎముకలు,కీళ్ల సంబంధమైన బాధలతో నరకం చూస్తున్నారు. వీరిలో కొందరికి చేతులు,కాళ్లు ఉన్నట్లుగా కన్పిస్తున్నా అవి వంగే పరిస్థితిలో ఉండవు. ఇలాంటి శారీక బాధలతో బంగారు భవిష్యత్తు కోసం ప్రభుత్వ వసతి గృహానికి వస్తే అక్కడా వారికి న్యాయం జరగడం లేదు. వీరి కోసం ప్రభుత్వం చేస్తున్న దుర్వినియోగం జరుగుతోంది. ఒంగోలు సంతపేటలోని ప్రభుత్వ దివ్యాంగుల వసతి గృహంలో దివ్యాంగులకు అందుతున్న సౌకర్యాలపై విజిలెన్స్ ఎన్ఫోర్స్మెంట్ అదనపు ఎస్పీ ఎం.రజిని ఆధ్వర్యంలో పరిశీలన చేస్తే వాస్తవాలు వెలుగు చూశాయి. మంగళవారం రాత్రి విజిలెన్సు అధికారులు ఆకస్మికంగా తనిఖీలు జరిపారు. జిల్లా కేంద్రం ఒంగోలు సంతపేటలో దివ్యాంగులకు వసతి గృహం ప్రభుత్వ ఆధీనంలో నడుస్తుంది. ఎక్కడ లబ్ధిపొందే వారికి ఇబ్బంది వచ్చినా, కష్టం వచ్చినా వారు ఎవ్వరికి చెబుకొనే పరిస్థితి లేదు. విజిలెన్స్ అధికారులు ఇటీవల జిల్లాలోని పర్చూరు, కందుకూరు తదితర కేంద్రాలలోని దివ్యాంగుల, బుద్ధిమాంద్యంతో ఇబ్బందిపడుతున్న వారి వసతి గృహాలను తనిఖీ చేసినప్పుడు వారికి అందుతున్న సౌకర్యాలు దీనావస్థలో ఉన్నట్లుగా గుర్తించారు. వీటిపై ప్రభుత్వానికి నివేదిక పంపారు. ఈ నేపథ్యంలోనే జిల్లా కేంద్రం ఒంగోలులో నడుస్తున్న దివ్యాంగుల (ఆర్ధో) వసతి గృహంలోని వసతులను పరిశీలించినప్పుడు దారుణమైన విషయాలు బయటపడ్డాయి. సరైన వసతి కరువు దివ్యాంగుల వసతి గృహంలో వసతి సరిగ్గా లేదు. రాత్రి వేళ దోమల బెడద. ఉదయం ఎటూ తప్పని కీటకాల సమస్యలు. ఈ బాధలను వీరు నిత్యం అనుభవించి అలవాటు పడ్డారు. వారిని వసతుల విషయమై ప్రశ్నించినప్పుడు దోమలు ఎడతెరిపి లేకుండా కుడుతున్నా అలాగే భరించి అలవాటైందని అంటున్నారు. వీరు అనుభవిస్తున్న ఎముకలు, కీళ్ల సంబంధమైన బాధల కన్నా కీటకాలు పెడుతున్న ఇబ్బంది అంతగా భరించలేనిది కాదు. పరిశుభ్రత అంతంత మాత్రంగానే ఉంటుంది. ఎక్కడ చూసినా మురుగు, అపరిశుభ్రత. ఎప్పుడో గానీ శుభ్రం చేయరు. దీంతో వసతి గృహంలో అనుభవిస్తున్న వసతి వీరికి ఆశించిన సౌకర్యాన్ని ఇవ్వలేకపోతున్నాయి. విజిలెన్స్ అధికారుల ఎదుట దివ్యాంగులు తమ బాధలు తెలుపుకొని వాపోయారు. వసతి గృహంలో శుభ్రత లేని మరుగుదొడ్లు మరుగుదొడ్డికి వెళ్లాలంటే ఇక మరుగుదొడ్డికి వెళ్లాలంటే నానా పాట్లు పడాల్సిందే. ప్రస్తుత పరిస్థితుల్లో అతి చిన్న వయస్సులోనే మోకీళ్లు వ్యాధులు, నొప్పులతో బాధపడ్తున్న వారు అధికమయ్యారు. అన్నీ బాగున్నా, ఆరోగ్యం సరిగ్గా ఉన్న వారే మరుగుదొడ్డి విషయంలో ఎత్తైన వెస్ట్రన్ సీటును వాడుతున్నారు. ఇక వీరు దివ్యాంగులు. పైగా వీరిలో అధిక భాగం కాళ్లు వంగే పరిస్థితిలో లేవు. చేతులు పని చేయవు. అలాంటి వారికి నేల బారు సీటుతో ఉండిన మరుగుదొడ్లే వసతి గృహంలో ఉన్నాయి. అవి కూడా సీటు పగిలిపోయి ఎందుకు పనికిరాని విధంగా ఉన్నా వాటితోనే నెట్టుకొస్తున్నారు. దివ్యాంగులు మరుగుదొడ్డికి వెళ్లాలంటే నానా పాట్లు పడ్తున్నారు. హాజరులో మతలబు దివ్యాంగుల వసతి గృహంలో పిల్లల హాజరులో మతలబు చేస్తున్నారు. మొత్తం 25 పిల్లలను హాజరుపట్టీలో చూపిస్తున్నారు. వీరికి తగినట్లుగా ఆహారం డ్రా చేస్తున్నారు. వాస్తవానికి 13 మందే గృహంలో అందుబాటులో ఉన్నారు. మిగిలిన వారికి ఇస్తున్న బియ్యం,ఇతర వస్తువులు దుర్వినియోగం జరుగుతున్నట్లుగా అధికారులు గుర్తించారు. రికార్డులను పరిశీలించారు. వీటి ఆధారంగా సరుకులు పెద్ద ఎత్తున దుర్వినియోగం జరిగినట్లుగా ప్రాథమికంగా గుర్తించారు. బియ్యం నిల్వలను పరిశీలిస్తే అక్కడిక్కడే 250 కిలోల బియ్యం అదనంగా ఉన్నాయి. అలాగే సరుకులు ఉన్నాయి. వీటిపై నిశితంగా విజిలెన్స్ అధికారులు పరిశీలన చేస్తున్నారు. పాడుపడిన మిద్దెకు రూ.50వేలు వసతి గృహం ప్రైవేటు గృహంలో నడుస్తుంది. మిద్దె బాగా పాడుపడింది. దీనికి నెలకు రూ.50 వేలు అద్దె చెల్లిస్తున్నారు. నెలకు ఇంత పెద్ద మొత్తం వెచ్చిస్తే మంచి సౌకర్యాలు, వసతులు ఉన్న బిల్డింగే వస్తుందని అభిప్రాయపడ్తున్నారు. ఎందు వల్ల ఇంత పెద్ద మొత్తం వెచ్చించి పాడుపడిన మిద్దెలో వసతి గృహాన్ని నడుపుతున్నారని అనుమానాలను వ్యక్తం చేశారు. వీటికి సంబంధించిన రికార్డులను విజిలెన్స్ తనిఖీ చేసింది. వసతి గృహంలో తాగేందుకు సరిగా నీరు లేదు. రిసోర్సు పర్సన్ లేరు వసతిగృహంలోని విద్యార్థులు తొమ్మిది,పది, ఇంటర్,డిగ్రి చదువుతున్న వారున్నారు. వీరికి ఏవైనా డౌట్లు వస్తే సంబంధిత సమస్యను నివృత్తి చేయడానికి అవసరమైన రిసోర్స్ పర్సన్ ఉండాలి. ఇక్కడ ట్యూటర్ కూడా లేరు. వారికి వివిధ సబ్జెక్టుల్లో వచ్చే అనుమానాలను నివృత్తి చేయలేకపోతున్నారు. వీరు చదువుల్లో వెనుకబడి ఉన్నారు.అలాగే ఆహారం కూడా సరిగ్గా లేదు. కనీసం జంతువులు తినేందుకు కూడా పనికిరాకుండా ఆహారం ఉన్నట్లుగా అధికారులు గుర్తించారు. బాత్రూంలు సరిగ్గా లేవు. విద్యుత్ సౌకర్యం సక్రమంగా లేదు. దివ్యాంగుల వసతి గృహం సమస్యలకు నెలవుగా ఉంది. దివ్యాంగుల పట్ల అధికారులు, ప్రభుత్వం ఇంత నిర్దయగా ఉందా అన్న వాస్తవాలు అధికారుల ఆకస్మిక దాడుల్లో వెలుగు చూశాయి. అదనపు ఎస్పీ రజిని సాక్షితో మాట్లాడుతూ దివ్యాంగుల వసతి గృహంలో గుర్తించిన అంశాలపై ప్రభుత్వానికి నివేదిక పంపనున్నట్లుగా తెలిపారు. ఇలాగే జిల్లాలో ఎక్కడైనా వసతి గృహాల సమస్యలు ఉంటే విజిలెన్స్ అధికారుల దృష్టికి తీసుకురావాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. -
తల్లి కాబోతున్న ఇలియానా?
ప్రముఖ నటి ఇలియానా తల్లి కాబోతోందా..? అంటూ బీటౌన్ వర్గాలు గుసగుసలాడుతున్నాయి. గత కొంత కాలంగా ఆస్ట్రేలియన్ ఫొటోగ్రాఫర్ ఆండ్రూ నీబోన్ తో ఇలియానా సహజీవనం చేస్తున్న సంగతి తెలిసిందే. అయితే వివాహం గురించి ఎలాంటి క్లారిటీ ఇవ్వని ఇలియానా సోషల్ మీడియాలో ఫోటోలు పోస్టు చేస్తూ, ‘హబ్బీ’ (భర్త) అని కామెంట్ చేస్తూ ఉంటుంది. అయితే ఇపుడు ఇలియానా తల్లి కాబోతున్నారని తాజా రూమర్. అజయ్ దేవగణ్‌తో కలిసి రైడ్ చిత్రంలో కథానాయికగా నటించింది ఇలియానా. ఇటీవలే ఈ మూవీ ప్రేక్షకుల ముందుకు వచ్చి మంచి విజయం సాధించింది. దీంతో సినిమా ప్రచార కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఈ ప్రమోషన్స్‌లో పాల్గొంటున్న ఇలియానా, తాను గర్భం దాల్చిన సంగతి బయటపడకుండా ఉండేందుకు లూజు, తేలికైన డ్రస్సుల్లో కనిపిస్తున్నారని బాలీవుడ్లో ప్రచారం జరుగుతోంది. అంతేకాకుండా ఆండ్రూ తన ఇన్ స్టాగ్రామ్‌లో ఇలియానా ఫొటోను షేర్ చేశాడు. బాత్ టబ్ లో కాఫీ తాగుతూ ఉన్న ఇలియానా ఫోటోకు ఆండ్రూ ‘ఇలియానా ఒంటరిగా మధురమైన సమయాన్ని గడుపుతున్నారు’ అంటూ క్యాప్షన్ పెట్టాడు. దీంతో ఆమె నిజంగానే గర్భం దాల్చినట్లు నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. అయితే పెళ్లి గురించే ఇప్పటివరకూ స్పందించని ఇలియానా తాజా ప్రచారంపై ఏమంటారో చూడాలి. -
అవును.. నిజమే!
‘‘అవును... నిజమే. ‘రైడ్’ మూవీకి అజయ్ నన్ను రిఫర్ చేశాడు. ‘ముబారక్’ సినిమాలో నా కో–స్టార్ అర్జున్ కపూర్ కూడా ఓ సినిమా స్క్రిప్ట్‌ను పరిశీలించమన్నాడు. ఏదైనా నాకు నచ్చితేనే చేస్తా. అయినా వరుసగా రెండు సినిమాలు ఒక హీరో పక్కన చేస్తే చాలు.. ఏవేవో పుకార్లు పుట్టిస్తుంటారు. అవన్నీ నిజం కావు’’ అంటున్నారు ఇలియానా. ఇంతకీ మేటర్ ఏంటంటే... బాలీవుడ్ హీరో అజయ్ దేవగణ్ సరసన 2016లో ‘బాద్షాహో’, ఈ ఏడాది ఈ నెలలో రిలీజ్ కానున్న ‘రైడ్’ చిత్రాల్లో కథానాయిక నటించారు ఇలియానా. ప్రస్తుతం ఇంద్రకుమార్ దర్శకత్వంలో ‘ధమాల్’ ఫ్రాంచైజీ ‘టోటల్ ధమాల్ 3’లో నటిస్తున్నారు అజయ్. ఈ సినిమాలో ఇలియానా ఓ ముఖ్య పాత్ర షోషించేలా అజయ్ పావులు కదుపుతున్నారని వార్తలు గుప్పుమన్నాయి. ఈ విషయంపై ఇలియానా స్పందిస్తూ– ‘‘టోటల్ ధమాల్’ చిత్రంలో నటించమని నన్నెవరూ సంప్రదించలేదు. ఈ సినిమాకి అజయ్ నన్ను రికమండ్ చేశాడని వస్తున్న వార్తలు నిజం కావు. ఇలాంటివి విన్నప్పుడు ఫన్నీగా ఉంటుంది. ప్రచారంలో ఉన్నట్లుగా అజయ్‌తో నాకెలాంటి సంబంధం లేదు. ఒకరి గురించి ఇలాంటి మాటలు ఎలా మాట్లాడతారో అర్థం కావడం లేదు’’ అని పేర్కొన్నారు. -
లోయిటర్ గాళ్స్
వాళ్లు మున్సిపల్ పార్కు పచ్చిక బయిళ్లపై హాయిగా కబుర్లు చెప్పుకుంటారు. నవ్వుకుంటారు. చాయ్ తాగుతారు. సైకిళ్లు అద్దెకు తీసుకుని పొద్దున్నే నగరంలో లాంగ్ రైడ్‌కు పోతారు. ఇవన్నీ సరదా కోసం కాదు.. పబ్లిక్ స్పేస్‌పై స్త్రీలకూ సమాన హక్కులున్నాయనే విషయం చాటి చెప్పడానికి. వీళ్లనే ‘లోయిటర్ గాళ్స్’ అంటున్నారు. ‘లోయిటర్’ అంటే – పనితో నిమిత్తం లేకుండా విశ్రాంతపూర్వకంగా నడవటం, తారట్లాడటం అన్నమాట.‘వై లోయిటర్? విమెన్ అండ్ రిస్క్ ఆన్ ముంబయ్ స్ట్రీట్స్’ పుస్తకాన్ని చదివారు పై మహిళలు. ఆ పుస్తకం స్ఫూర్తితోనే నేహాసింగ్, దేవినా కపూర్ కలసి ముంబయిలో వై లోయిటర్ మూమెంట్‌కి శ్రీకారం చుట్టారు. జైపూర్, అలీఘర్, పుణే మహిళలు కూడా ఈ ఉద్యమంలో భాగమయ్యారు. పుణే గాళ్స్ స్వాగత్ బస్ స్టాండ్‌లో కబుర్లాడుకుంటారు. అలీఘర్ అమ్మాయిలు మెన్స్ కాలేజీలోని కాఫీ హౌస్‌లో కలుసుకుంటారు. పబ్లిక్ స్పేస్‌లో మరింత మంది స్త్రీలు కనబడటమనేది ఒక చక్కటి మార్పుకు దోహదపడుతుందని ‘లోయిటర్ గాళ్స్’ సహా ఇలాంటి కార్యక్రమాలు నిర్వహిస్తున్న కార్యకర్తలు చెబుతున్నారు. ‘గాళ్స్ అట్ దాబాస్’ మూమెంట్ కూడా ఇలాంటిదే. 2015లో కరాచీ యూనివర్సిటీకి చెందిన సారా నిసార్ సహా ముగ్గురు యూనివర్సిటీ విద్యార్థులు ఈ ఉద్యమానికి నాంది పలికారు. -
ఏడేళ్లు.. 49 ట్రాన్స్ఫర్లు!
రైడ్‌కు వెళ్లారు హీరో అజయ్ దేవగన్. నెచ్చలితో సరదాగా సాగే రైడ్ కాదిది. పోనీ సోలోగా ఎంజాయ్ చేయడానికి చేసే రైడ్ కాదు. ఈ ప్రయాణానికి ఓ పర్పస్ ఉంది. నీతి, న్యాయం, ధర్మం లేకుండా దొడ్డిదారిన మూడు బ్రీఫ్‌కేస్‌లు, ఆరు స్కామ్‌లు చేసి డబ్బు దాచుకున్న వారిని రొడ్డున పడేసే రైడ్ ఇది. కాంప్రమైజ్ అవ్వడానికి, కామ్‌గా వెళ్లడానికి రైడ్ చేసేవాడు మాములోడు కాదు. ఏడేళ్లలో 49 సార్లు బదిలీ అయిన సిన్సియర్ ఇన్కమ్ టాక్స్ ఆఫీసర్. పేరు అమీ పట్నాయక్. ‘రైడ్’లో అజయ్ దేవగన్ చేస్తున్న పాత్ర పేరిది. అజయ్ దేవగన్, ఇలియానా, సౌరభ్ శుక్లా ముఖ్య తారలుగా రాజ్‌కుమార్ గుప్తా దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమా ఫస్ట్ లుక్తోపాటుగా ట్రైలర్‌ను రిలీజ్ చేశారు. ‘హీరోలు ఎప్పుడూ యూనిఫార్మ్స్‌లో రారు’ అనే ట్యాగ్ ఇచ్చి, ట్రైలర్‌ను షేర్ చేశారు అజయ్. ఈ సినిమాను మార్చి 16న విడుదల చేయాలనుకుంటున్నారు. 1980 బ్యాక్‌డ్రాప్‌లో లక్నోలో జరిగిన ట్రూ ఇన్సిడెంట్స్ ఆధారంగా సినిమాను రూపొందించారని బాలీవుడ్ టాక్. ‘‘అజయ్ దేవగన్ వర్క్ పట్ల చాలా డేడికేషన్‌గా ఉంటాడు. అంత ఈజీగా ఇంప్రెస్ అవ్వడు. స్ట్రాంగ్ స్క్రిప్ట్‌ను అజయ్‌కు వినిపించాను. అప్పుడు ఒప్పుకున్నాడు. అజయ్‌తో వర్క్ చేయాలంటే ఎక్స్ట్రా ఎఫర్ట్స్ పెట్టాల్సిందే’’ అన్నారు రాజ్‌కుమార్ గుప్తా. -
రైడ్ విత్ మిస్టర్ సి!
హూ ఈజ్ మిస్టర్ సి? మిస్టర్ సి ఎవరు? రామ్‌చరణ్! ఆయన సతీమణి ఉపాసన ముద్దుగా పిలుచుకునే పేరు అది. ఇద్దరూ కలసి రైడ్‌కి వెళ్లారు. ఎక్కడ? ఓ హిల్ స్టేషన్లో (పేరు వద్దు. మళ్లీ అభిమానులందరూ అక్కడికి క్యూ కట్టేస్తారు!). రైడ్ అంటే ఏదో రేసింగ్ కార్స్ ఎక్స్పెక్ట్ చెయ్యొద్దు. ఫొటోలో చూస్తున్నారుగా... ఆ యాక్ (జడల బర్రె) పైన చరణ్ రైడ్‌కి వెళ్లారు. ఉపాసన యాక్ని తాడుతో తీసుకెళ్లారు. ఈ ఫొటోని సోషల్ మీడియాలో షేర్ చేసిన ఉపాసన ‘టేకింగ్ మిస్టర్ సి ఫర్ ఏ రైడ్’ అని పేర్కొన్నారు. నెట్టింట్లో ఈ ఫొటోకి సూపర్ రెస్పాన్స్ వస్తోంది. ఎందుకు రాదు? అంత పెద్ద స్టార్ హీరో ఇటువంటి రైడ్‌కి వెళ్లడం సో స్పెషల్ కదా!! -
గాజువాక పోలీస్‌స్టేషన్‌పై ఏసీబీ దాడులు
విశాఖపట్టణం: గాజువాక పోలీస్ స్టేషన్‌పై శుక్రవారం సాయంత్రం ఏసీబీ అధికారులు దాడులు చేపట్టారు. స్టేషన్ రికార్డులను పరిశీలించిన అధికారులు.. గాజువాక ఏసీపీ, సీఐ, ఎస్సైలను సస్పెండ్ చేస్తున్నట్లు ప్రకటించారు. ఇంకా స్టేషన్లోనే ఉన్న అధికారులు లోపలికి ఎవరినీ అనుమతించటం లేదు. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది. -
ఫైలు కదలాలంటే చేయి తడపాల్సిందే
రూ.3లక్షలు లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన సీనియర్ అసిస్టెంట్ లంచంతో పాటు అదనంగా 10 శాతం కమీషన్ రాజమహేంద్రవరం క్రైం : పోలవరం ప్రాజెక్టులో భూములు కోల్పోయిన నిర్వాసితులకు నష్టపరిహారం చెల్లించేందుకు అధికారులు చుక్కలు చూపిస్తున్నారు. భూములు , ఇళ్లు కోల్పోయి బాధలో ఉన్న రైతుల నుంచి రెవెన్యూ అధికారులు అందిన కాడికి దోచుకుంటున్నారు. అమాయక గిరిజనులు చేసేది లేక బాధను దిగమింగుకొని లంచాలు ఇస్తున్నారు. చింతలపూడి లిఫ్ట్ ఇరిగేషన్ పథకంలో స్పెషల్ డిఫ్యూటీ కలెక్టర్‌గా పనిచేస్తున్న డి.పుష్పమణి బ్రోకర్ల ద్వారా భూములు కోల్పోయిన రైతులకు నష్టపరిహారం చెల్లించేందుకు లంచం డిమాండ్ చేస్తున్నారన్న ఆరోపణలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఆమె పై దృష్టి సారించిన ఏసీబీ అధికారులు మంగళవారం జీలుగు మిల్లి మండలం జిల్లెల గూడెం గ్రామానికి చెందిన గుజ్జు వీరమ్మకు చెందిన 8.18 ఎకరాలకు, రెండున్నర ఎకరాలకు భూమికి భూమి ఇస్తు, మిగిలిన 5.18 ఏకరాల భూమికి నష్టపరిహారం చెల్లించేందుకు రూ.11 లక్షలకు బేరం కుదుర్చుకున్నారు. ఈ లంచాన్ని మంగళవారం బ్రోకర్ ద్వారా డి.పుష్పమణి వద్ద డిఫ్యూటేషన్‌పై చేసిన ఒక అధికారి ప్రస్తుతం రాజమహేంద్రవరం పోలవరం ప్రాజెక్టు కార్యాలయంలో సీనియర్ అసిస్టెంట్‌గా పనిచేస్తున్న మణికొండ వెంకటరమణప్రసాద్ ద్వారా రూ 3 లక్షలు తీసుకుంటుండగా ఏలూరు రేంజ్ ఏసీబీ డీఎస్పీ వి.గోపాలకృష్ణ, రాజమహేంద్రవరం రేంజ్ డీఎస్పీ ఎం.సుధాకర్, ఇన్స్పెక్టర్ విల్సన్, ఎస్సై నరేష్‌లు ఆకస్మిక దాడులు చేసి రెడ్ హేండెడ్‌గా పట్టుకున్నారు. లంచం తీసుకున్న అనంతరం ఫోన్లో సంభాషణ మంగళవారం మధ్యహానం లంచం తీసుకున్న మణికొండ వెంకట రమణ ప్రసాద్ రూ 3 లక్షలు లంచం తీసుకొని తన పై అధికారి అయిన డిఫ్యూటీ కలెక్టర్ గి. పుష్పమణికి ఫోన్ ద్వారా సమాచారం అందించారు. ఏసీబీ అధికారులు రమణ ప్రసాద్ ఫోన్‌ను స్వాధీనం చేసుకున్నారు. ఈ కేసులో ఎంత మందికి సంబంధాలు ఉన్నాయి అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నారు. సమగ్రమంగా దర్యాప్తు చేసి దోషుల పై కేసులు నమోదు చేస్తాని ఏలూరు రేంజ్ డీఎస్పీ వి.గోపాలకృష్ణ తెలిపారు. లంచంతో పాటు పరిహారంలో 10 శాతం కమీషన్ పోలవరం ప్రాజెక్టులో భూములు కోల్పోయిన రైతుల నుంచి అందిన కాడికి దోచుకుంటున్నారు. నష్టపరిహారం మంజూరు అయి మూడేళ్లు కావస్తున్నా గిరిజన రైతులను కార్యాలయాల చుట్టూ కాళ్లరిగేలా తిప్పుకుంటూ లంచాలు గుంజుతున్నారు. ట్రైబుల్ వెల్ఫేర్ డిఫ్యూటీ కలెక్టర్‌గా కేఆర్ పురంలో పనిచేస్తున్న డి.పుష్పమణి, పోలవరం ఇరిగేషన్ ప్రాజెక్టు కుడి ప్రధాన కాలువ1కు ఇన్చార్జి కలెక్టర్ గాను, తాడిపూడి ఎత్తిపోతల పథకం (నల్లజర్ల)ఇన్‌చార్జ్‌గాను వ్యవహరిస్తున్నారు. 16 నెలలుగా విధులు నిర్వహిస్తున్న డి.పుష్పమణి, బ్రోకర్లు ద్వారా లంచాల దందా నిర్వస్తున్నారన్న ఆరోపణలు ఉన్నాయి. ఇందుకూరి పేట, లోతుపాలెం శరభవరం, తదితర ప్రాంతాలలో భూములు కోల్పోయిన రైతులకు నష్టపరిహారం చెల్లించేందుకు ముందుగా లంచం ఎంత ఇవ్వాలి అనేది బేరం కుదుర్చుకుంటారు. ఇన్స్టాల్ మెంట్లో లంచం చెల్లించే వారి పేరున చెక్కులు ఇస్తుంటారు. నష్టపరిహారం చెల్లించకుండానే రైతుల నుంచి ఖాళీ చెక్కులు తీసుకున్నారని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దేవీపట్నం మండలంలో ఎకరానికి రూ 7.50 లక్షలు నష్టపరిహారం చెల్లిస్తున్నారు. నష్టపరిహారం అందాలంటే ముందుగా లంచం సొమ్ము ముట్టాల్సిందే. అనంతరం నష్టపరిహారంలో భూములకు 10 శాతం, ఇళ్ళకు 5 శాతం చొప్పున సొమ్ము గుంజుతున్నారని ఆరోపిస్తున్నారు. ఈ అవినీతి పరులపై లోతుగా దర్యాప్తు చేసి గిరిజనుల సొమ్మును దోచుకుంటున్న వారి పై కఠిన చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. -
దారి తప్పుతున్న హోటల్స్ తనిఖీలు
-
జిల్లా రిజిస్ట్రార్‌పై ఆదాయానికి మించిన ఆస్తుల కేసు
పత్రాలు, బంగారం, వెండి ఆభరణాలు స్వాధీనం రూ.3 కోట్ల విలువైన ఆస్తుల గుర్తింపు కాకినాడ లీగల్: కాకినాడ జిల్లా రిజిస్ట్రార్ ఎం.బాలప్రకాష్ ఇటీవల రూ.40 వేలు లంచం తీసుకుంటూ ఏసీబీకి పట్టుబడిన సంగతి తెలిసిందే. దీంతోపాటు ఆయన ఆదాయానికి మించిన ఆస్తులు ఉన్నట్టు గుర్తించి కేసు నమోదు చేసినట్టు రాజమహేంద్రవరం ఏసీబీ డీఎస్పీ ఎం.సుధాకర్ తెలిపారు. కాకినాడలోని ప్రతాప్‌నగర్‌లోని బాలప్రకాష్ ఇంట్లో శుక్రవారం తనిఖీ చేసి పలు పత్రాలు స్వాధీనం చేసుకున్నారు. కాకినాడ రిజిస్ట్రార్ కార్యాలయంలోని ఉద్యోగులను కూడా విచారించారు. హైదరాబాద్‌లో ఆయన కుమార్తె, కుమారుడు ఇళ్లపై ఏసీబీ దాడులు నిర్వహిస్తున్నట్టు సుధాకర్ తెలిపారు. కాకినాడలో మూడు ఇళ్లు, ఒక ప్లాట్, 250 గజాల స్థలం, తాడేపల్లి గూడెంలో 400 గజాల స్థలం, గుంటూరులో డాబా ఇల్లు బాలప్రకాష్కు ఉన్నట్టు గుర్తించారు. అలాగే బ్యాంక్ అకౌంట్లలో కుటుంబ సభ్యులు, ఆయన పేరుమీద రూ.30 లక్షలు ఉన్నట్టు తెలుసుకున్నారు. రూ.కోటి 51 లక్షల విలువైన ఫిక్సిడ్ డిపాజిట్లు, బంగారం, వెండిని గుర్తించారు. బాలప్రకాష్ ఉద్యోగంలో చేరినప్పటి నుంచి ఇప్పటి వరకు లెక్కలు వేస్తే ఆయన ఆదాయానికి మించి రూ.3 కోట్లు అధికంగా ఉన్నట్టు తెలిపారు. ప్రస్తుత మార్కెట్ విలువ ప్రకారం సుమారు రూ. 20 కోట్లు ఉంటుందని తెలియవచ్చింది. ఈ దాడుల్లో ఏసీబీ సీఐ డి.రమేష్, ఎస్సై టి.నరసింహం, హైదరాబాద్‌లో పి.మోహన్‌రావు పాల్గొన్నారు. -
ఏసీబీకి చిక్కిన జిల్లా రిజిస్ట్రార్
భూమి రిజిస్ర్టేషన్‌కు రూ.40 వేలు డిమాండ్ బ్రోకర్ ద్వారా అందజేస్తుండగా పట్టుకున్న అధికారులు కాకినాడ క్రైం: ఓ భూమి రిజిస్ట్రేషన్ నిమిత్తం మధ్యవర్తి ద్వారా రూ. 40 వేలు లంచం తీసుకుంటుండగా బుధవారం ఏసీబీ అధికారులు దాడి చేసి జిల్లా రిజిస్ట్రార్ ఎం.బాలప్రకాశ్ను పట్టుకున్నారు. కాకినాడ అశోక్‌నగర్‌కు చెందిన గుండా శ్రీరామచంద్రమూర్తికి సూర్యారావుపేట అశోక్‌నగర్ సమీపంలో 191/4,195/5, 190/1 సర్వే నంబర్లలో ఉన్న 1.10 ఎకరం భూమిని అభివృద్ధి చేసేందుకు ఆయన కుమారుడు గుండా ప్రసాద్ (కిషోర్) డెవలెపర్స్కి విక్రయించేందుకు రిజిస్ట్రేషన్ కోసం 2016 డిసెంబర్ 30న కాకినాడ జిల్లా రిజిస్ట్రార్ కార్యాలయంలో దరఖాస్తు చేసుకున్నారు. ఆ భూమి ప్రభుత్వ నిషేధిత జాబితాలో ఉందని, రిజిస్ట్రేషన్ చేయడం కుదరదని, జిల్లా రిజిస్ట్రార్‌ను సంప్రదించాలని జాయింట్ సబ్ రిజిస్ట్రార్ సూచించారు. ఈ విషయమై జిల్లా రిజిస్ట్రార్ బాలప్రకాశ్ను సంప్రదించగా ఆయన కూడా అదే విషయం స్పష్టం చేశారు. దీంతో 1964 సంవత్సరం నుంచి ఉన్న సదరు భూ రికార్డులను రెవెన్యూ అధికారులకు చూపగా వారు వాటిని పరిశీలించి ఈ భూమి అసైన్డు భూమి కాదని, యాజమాని గుండా శ్రీరామచంద్రమూర్తికి చెందినదేనని నిర్థారిస్తూ ఆర్డీవో ఎన్వోసీ జారీ చేశారు. ఈ సర్టిఫికెట్ తీసుకెళ్లి రిజిస్ట్రార్‌కు అందించినా రిజిస్ట్రేషన్‌కు ససేమిరా అనడంతో రియల్ ఎస్టేట్ మధ్యవర్తి, రిజిస్ట్రేషన్‌శాఖకు బ్రోకర్‌గా వ్యవహరిస్తున్న ఎం.సురేష్‌ను గుండా ప్రసాద్ సంప్రదించగా, రిజిస్ట్రేషన్ చేయిస్తానని, ఇందుకు రిజిస్ట్రార్‌కి రూ.50 వేలు లంచం ఇవ్వాలని మ«ధ్యవర్తి కోరాడు. అంత డబ్బు ఇచ్చుకోలేని రూ. 40 వేలు ఇస్తానని చెప్పడంతో ఇందుకు మధ్యవర్తి అంగీకరించాడు. అదే సమయంలో ప్రసాద్ ఏసీబీ అధికారులను ఆశ్రయించగా, వారి సూచన మేరకు బుధవారం రూ.40 వేలను కాకినాడ జెడ్పీ సెంటర్లోని రిజిస్ట్రార్ కార్యాలయంలో ఉన్న సురేష్‌కు అందించాడు. నగదు కవర్‌ను తీసుకువెళ్లి రిజిస్ట్రార్ బాలప్రకాశ్కు అందజేస్తుండగా ఏసీబీ డీఎస్పీ ఎం.సుధాకర్ ఆధ్వర్యంలో అధికారులు ఆయనను రెడ్‌హేండెడ్‌గా పట్టుకుని 20 రెండు వేల రూపాయల నోట్లను స్వాధీనం చేసుకున్నారు. అలాగే ప్రతాప్‌నగర్‌లో రిజిస్ట్రార్ ఇంటిలో కూడా ఏసీబీ అధికారులు సోదాలు చేస్తున్నారు. నిందితుడ్ని గురువారం విజయవాడలోని ఏసీబీ కోర్టులో హాజరుపరుస్తామని డీఎస్పీ సుధాకర్ తెలిపారు. ఈ దాడిలో ఏసీబీ సీఐలు మోహన్, పశ్చిమగోదావరి జిల్లా సీఐ విల్సన్, సిబ్బంది పాల్గొన్నారు. బాలప్రకాశ్ ఇక్కడకు రాక ముందు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో రిజిస్ట్రేషన్‌శాఖలో డీఐజీగా పని చేశారు. రాష్ట్ర విభజన తర్వాత డీఐజీ పోస్టు అందుబాటులో లేకపోవడంతో జిల్లా రిజిస్ట్రార్‌గా కాకినాడ వచ్చాడు. ఈయన పదవీ విరమణ చేసేందుకు మరో ఏడాది ఉండడం గమనార్హం. -
పాన్ సెంటర్లలో హుక్కా కిక్కు
-
పర్యావరణ పరిరక్షణ అందరి బాధ్యత
కలెక్టర్ అరుణ్‌కుమార్ వెలుగుబంద (రాజానగరం) : పర్యావరణ పరిరక్షణను అంతా బాధ్యతగా తీసుకుంటేనే సరైన ఫలితాలను అందుకోగలుగుతామని కలెక్టర్ హెచ్.అరుణ్‌కుమార్ అన్నారు. స్థానిక గైట్ కళాశాలలో 'స్వచ్చ భారత్ – స్వచ్చ ఆంధ్రప్రదేశ్'లో భాగంగా బుధవారం నిర్వహించిన 'మై బైక్' కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. నేడు ప్రపంచమంతా పచ్చని వాతావరణంతో కోరుకుంటుందని, మన దేశానికి ఎంతో అవసరమన్నారు. రాజమహేంద్రవరంలో సుమారు 15 వేల ఆటోలు తిరుగుతున్నాయని, వాటితోపాటు ఇతర వాహానాల నుంచి వెలువడే కాలుష్యంతో ప్రజలు అనారోగ్యం పాలయ్యే ప్రమాదం ఉందన్నారు. సైకిలు వాడకంతో వాతావరణ కాలుష్యం తగ్గి పర్యావరణాన్ని పరిరక్షించుకోవచ్చన్నారు. ప్రజలు సైకిలు వినియోగంపై మరింతగా చైతన్యవంతులు కావలన్నారు. ఇందులో గైట్ కళాశాల ముందుండం అభినందనీయమన్నారు. సైకిలు తొక్కడం వలన కాలుష్య రహిత సమాజం ఏర్పడుతుందని ప్రజలు విశ్వసిస్తున్నారని ఎమ్మెల్యేలు పెందుర్తి వెంకటేష్, డాక్టర్ ఆకుల సత్యనారాయణ, గోరంట్ల బుచ్చియ్యచౌదరి, జ్యోతుల నెహ్రు, ఎమ్మెల్సీలు ఆదిరెడ్డి అప్పారావు, కె.కిరణ్‌వర్మ అన్నారు. తమ కళాశాల ప్రాంగణాన్ని పర్యవరణ హితంగా చేసేందుకు ఏడేళ్లుగా ప్రణాళికాబద్దంగా కృషి చేస్తున్నామని చైతన్య విద్యా సంస్థల చైర్మన్ కేవీవీ సత్యనారాయణరాజు అన్నారు. ఇప్పటికే ప్రాంగణంలో బ్యాటరీ కార్లు వినియోగిస్తున్నామని, సంప్రదాయేతర ఇందన వనరులైన సౌర్యశక్తి, పవన విద్యుత్‌తో ట్రాన్సమిషన్ కష్టాలు లేకుండా ఒక మోగావాట్టు సామర్థ్యంతో రెండు యూనిట్లు విద్యుత్‌ను ఉత్పత్తి చేయనున్నామన్నారు. కళాశాల విద్యార్థుల కోసం 200 సైకిళ్లను అందుబాటులో ఉంచడంలోపాటు గైట్ కళాశాల ద్వారా మూడు గ్రామాలను దత్తత తీసుకుంటామన్నారు. కార్యక్రమంలో నగర పాలక సంస్థ కమిషనర్ విజయరాజు, కళాశాల ఎండి కె. శశికిరణ్‌వర్మ, టీడీపీ రాష్ట్ర కార్యదర్శి గన్ని కృష్ణ, చైతన్య విద్యా సంస్థల సీఈఓ డాక్టర్ డీఎల్ ఎన్ రాజు, డీవైఎం ఎ. నరేష్‌రాజు, ప్రిన్సిపాల్స్ డాక్టర్ డివి రామ్మూర్తి, డాక్టర్ ఎస్. సత్యనారాయణరాజు, డాక్టర్ ధనరాజ్, జీఎం డాక్టర్ పి. సుబ్బరాజు, డైరెక్టర్ పివి రామరాజు, తదితరులు పాల్గొన్నారు. -
బల్దియా అధికారులకు ఏసీబీ ఫోబియా
-
లేడీ సింగమ్ సవారీ!
అది చెన్నైలోని ఓ రోడ్. తెల్లవారుజాము కావడంతో పెద్దగా రద్దీగా లేదు. స్టార్ కపుల్ సూర్య, జ్యోతికలు ఆ రోడ్ మీదున్నారు. వచ్చే పోయేవాళ్లు ఈ జంటను ఆసక్తిగా చూడటం మొదలుపెట్టారు. బ్రాండ్ న్యూ రాయల్ ఎన్ఫీల్డ్ మీద లేడీ సింగమ్లా జ్యోతిక సవారీ చేస్తున్నారు. జ్యోతికకు బండి నడపడం వచ్చా.. వంటి సందేహాలు అవసరం లేదు. పక్కనున్న దర్శకుడు ఎవరనుకున్నారు? సింగమ్ సూర్య. బండి ఎలా నడపాలో దగ్గరుండి మరీ శ్రీమతికి ట్రైనింగ్ ఇస్తున్నారు. జ్యోతిక ఇంటిలిజెంట్ స్టూడెంట్ అనుకోవచ్చు. ఎందుకంటే సునాయాసంగానే నేర్చేసుకున్నారు. రయ్.. రయ్.. మంటూ జ్యోతిక సవారీ చేస్తుంటే, ఆమెను గమనిస్తూ సూర్య వెనకాలే నడుచుకుంటూ వెళ్లారు. శ్రీమతి ముచ్చటపడిందని సూర్య బైక్ రైడింగ్ నేర్పారో? లేదా ఏదైనా కొత్త సినిమా కోసం జ్యోతిక ట్రైనింగ్ తీసుకున్నారో? త్వరలోనే తెలుస్తుంది. ఆ విషయం పక్కన పెడితే.. సూర్య, జ్యోతికలు ఎంత హ్యాపీ కపుల్ అనేది ఈ ఫొటోలు చూస్తే అర్థమవుతోంది. -
కల్తీలపై టాస్క్‌ఫోర్స్ కన్నెర్ర
కారం పొడి తయారీ గోదాముపై దాడులు లక్షల విలువైన సరుకు స్వాధీనం పోలీసుల అందుపులో నిందితుడు విజయవాడ(చిట్టినగర్) : కల్తీలపై టాస్క్‌ఫోర్స్ అధికారులు కన్నెర్ర చేశారు. అనుమతులు లేకుండా యథేచ్ఛగా కల్తీ సరుకు తయారీ చేసి విక్రయిస్తున్న గోదాముపై దాడి చేశారు. రెండు లక్షలపైగా విలువైన సరుకు, యంత్రాలను స్వాధీనం చేసుకున్నారు. నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. వివరాలు.. చిట్టినగర్ ప్రాంతానికి చెందిన వనమా జనార్దన్ రెండేళ్లుగా పాముల కాలువ సమీపంలోని పొలాల్లో ఓ రేకులషెడ్డును అద్దెకు తీసుకుని నీలిమ బ్రాండ్ పేరిట వివిధ రకాల కారం పొడులను తయారు చేసే యూనిట్ ఏర్పాటు చేశాడు. 15 రకాల పొడులు తయారు చేయిస్తూ విక్రయిస్తున్నాడు. సరుకులో నాణ్యత లేకపోవడంతో టాస్క్‌ఫోర్స్‌కు వినియోగదారులు సమాచారం అందించారు. దీంతో టాస్క్‌ఫోర్స్ ఏసీపీ ప్రసాద్ ఆధ్వర్యంలో ఎస్ఐ శ్రీనివాస్ యూనిట్‌ను బుధవారం తనిఖీ చేశారు. కల్లీ వ్యవహారం బయటపడింది. వ్యర్థాలతోనూ.. ఇడ్లీ కారం పొడిలో మిరపకాయల తొడేలతో పాటు తెల్ల మిరపకాయలు, వాటి కొమ్మలను కూడా పొడి చేసి తయారీలో వినియోగిస్తున్నట్లు నిందితుడు అంగీకరించాడు. కాకర కాయ, కరివేపాకు ఇలాంటి వాటిలో చెట్టు కొమ్మలను పొడిగా చేసి కలిపేస్తున్నట్లు చెప్పుకొచ్చాడు. కొమ్మల నుంచి వాసన రాకుండా చింతపండు పులుసు, రుచి కోసం టేస్టింగ్ సాల్ట్‌లను కలుపుతున్నట్లు పేర్కొన్నాడు. కొత్తపేట ఎస్ఐ సుబ్బారావు నిందితుడి నుంచి పూర్తి వివరాలు నమోదు చేశారు. -
శ్రీకాకుళం రోడ్డు రైల్వేస్టేషన్లో తనిఖీలు
బాలికలను అక్రమంగా తరలిస్తున్నారనే వార్తలతో కదిలిన యంత్రాంగం డీఆర్డీఏ అనుమతి పొంది ఉద్యోగం కోసం పంపుతున్నట్టు వెల్లడి వెనుదిరిగిన పోలీసులు, చైల్డ్‌లైన్ అధికారులు ఆమదాలవలస : శ్రీకాకుళం రోడ్డు( ఆమదాలవలస) రైల్వేస్టేషన్ నుంచి బాలికలను అక్రమంగా ర వాణా చేస్తున్నట్లు 1098కు వచ్చిన సమాచారంతో చైల్డ్ లైన్, మానవ అక్రమ రవాణా నిరోధక శాఖ పోలీసులు, జీఆర్పీ, ఆర్పీఎఫ్ పోలీసులు శనివారం రైల్లేస్టేషన్‌లో తనిఖీలు చేశారు. మూడో నంబర్ ప్లాట్‌ఫాంపై ఉన్న డీఆర్డీఏ జిల్లా ప్లేస్మెంట్ కో ఆర్డినేటర్ అశోక్‌కుమార్‌తో పాటు మరో 15మంది బాలికలను గుర్తించారు. బాలికల అక్రమ తరలింపు విషయమై అశోక్‌కుమార్‌ను ప్రశ్నించగా బాలికలను డీఆర్డీఏ పీడీ ఇచ్చిన అనుమతి ఉత్తర్వులతో నెల్లూరు జిల్లా తడ మండలంలోని శ్రీసిటీ సెల్ కంపెనీలో నెలకు రూ.12వేలు జీతం ఇచ్చేందుకు ఒప్పందం కుదుర్చుకొని పంపిస్తున్నామని చెప్పారు. వీరంతా ఎచ్చెర్లలోని శిక్షణ పొందిన వారని చెప్పారు. దీంతో అధికారులు చేసేది ఏమి లేక వెనుదిరిగారు. సుమారు రెండు గంటల పాటు రైల్వేస్టేషన్లో అలజడి నెలకొంది. కార్యక్రమంలో ఏహెచ్‌టీయూ ఎస్.ఐ. ఎం.లక్ష్మయ్య, హెచ్.సీ. బి.జగదీశ్వరరావు, పీసీలు ఆర్.బాస్కరరావు, బి.జగదీష్‌కుమార్, జీఆర్పీ హె^Œ సీ ప్రకాశరావు, చైల్డ్‌లైన్ కో–ఆర్డినేటర్ సంతోష్‌కుమార్, ఫీల్డ్ అధికారిణి మాధవి తదితరులు పాల్గొన్నారు. -
హైదరాబాద్‌లో చక్ దే ఇండియా-2 రైడ్
-
దళితుల సమస్యలపై పోరాటం
దళిత ఆత్మగౌరవ ఉద్యమం కేవీపీఎస్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు జి.నాగయ్య కరీంనగర్ : దళితులు ఎదుర్కొంటున్న సమస్యలపై పోరాడేందుకు ‘దళిత ఆత్మగౌరవ ఉద్యమం’ చేపడుతున్నట్లు కులవివక్ష వ్యతిరేక పోరాట సంఘం(కేవీపీఎస్) రాష్ట్ర ఉపాధ్యక్షుడు జి.నాగయ్య తెలిపారు. భగత్‌నగర్‌లోని మెడికల్ రిప్స్ భవనంలో ఆదివారం నిర్వహించిన సమావేశంలో మాట్లాడారు. ఇంకా దళితులను అస్పృశ్యత, అంటరానితనం వెంటాడుతుందన్నారు. దళిత వాడలో అభివృద్ధి చెందడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. కార్పొరేషన్ రుణాల మంజూరులో జాప్యమవుతుందన్నారు. ప్రజాసాంస్కృతిక వేదిక రాష్ట్ర కన్వీనర్ జి.రాములు మాట్లాడుతూ ప్రజలను ప్రజాసాంస్కృతిక విప్లవం వైపు మళ్లించాలన్నారు. కేవీపీఎస్ జిల్లా కార్యదర్శి టి.సురేష్, అధ్యక్షుడు కె.అశోక్, ఉపాధ్యక్షులు మర్రి వెంకటస్వామి, సంపత్, నరేందర్, కృష్ణ, నాయకులు కరుణాకర్, జిట్టు లింగామూర్తి పాల్గొన్నారు. -
ఎడ్ల బళ్లపై టూర్
-
ఇరిగేషన్ అధికారి ఇంట్లో ఎసిబి సోదాలు
-
ఓ బాతు సాహసం
చెరువులో పిల్లలతో పాటు ఈదుతున్న ఓ బాతు.. తల్లి ప్రేమకు తార్కాణంగా నిలిచింది. భుజాలపై పిల్లల బాధ్యతను మోస్తూ.. ప్రత్యక్షంగా సాక్షాత్కరించింది. తన పిల్లలన్నింటినీ తీసుకుని చెరువులో రయ్యిన ఈదుతూ పోవడం చూపరులను ఆకట్టుకుంది. ఓ ఫొటో గ్రాఫర్ కెమెరాను క్లిక్మనిపించేలా చేసింది. ఇంగ్లాండ్ రోచ్ డాలె.. లాంక్షైర్లో 16 పిల్లలతో ఓ బాతు.. చెరువును దాటడం సందర్శకులను ఆశ్చర్యపరచింది. అతి పెద్ద కుంటుంబాన్ని సాకడం అత్యంత కష్టమైన విషయం. అయితేనేం ఆ బాతు మాత్రం తల్లి ప్రేమకు హద్దులుండవని నిరూపించింది. తన 16 పిల్లలతో లక్ష్యాన్ని చేరేందుకు ప్రయత్నించింది. ఆరు పిల్లలను వీపుపైన, మిగిలిన వాటిని ఒకదాని వెనుక ఒకటి ఉండేలా చూసుకుని.. కుటుంబంతో పాటు.. సునాయాసంగా చెరువు దాటింది. బాతు ప్రయత్నం సందర్శకులకు కనువిందు చేసింది. క్వీన్స్ పార్క్ హేవుడ్ లోని చెరువులో కనిపించిన ఈ దృశ్యాన్ని చూసిన... 49 ఏళ్ళ మార్క్ క్రైమ్స్ తన కెమెరాలో బంధించాడు. ''బాతు వీపుపై మోస్తున్న పిల్లల సంఖ్య లెక్క పెట్టిన నేను నిజంగా నమ్మలేకపోయాను. అంత చిన్న ప్రాణానికి అది ఎలా సాధ్యమయ్యింది అని ఆశ్చర్యపోయాను. నిజానికి బాతులు కెమెరాను చూస్తే పక్కకు వెళ్లిపోతాయి. ఫొటో తీసేవరకూ ఆగవు. అలాంటిది నా కెమెరాకు ఈ దృశ్యం చిక్కడం ఎంతో ఆనందంగా ఉంది'' అంటున్నాడు ఫొటోగ్రాఫర్ మార్క్ క్రైమ్స్. బాతులు సాధారణంగా 12 గుడ్లను పెడతాయని, ఈ బాతు 16 పిల్లలతో చాలా పెద్ద కుటుంబాన్ని సాకడం ఎంతో ప్రత్యేకతను సంతరించుకుందని మార్క్ అంటున్నాడు. -
ఏసీబీకి చిక్కిన కానిస్టేబుల్
హైదరాబాద్ : నగరంలోని పహడీషరీప్ పోలీస్ స్టేషన్ లో పనిచేస్తున్న కానిస్టేబుల్ లంచం తీసుకుంటూ సోమవారం ఏసీబీ అధికారులకు చిక్కాడు. వివరాలు..కానిస్టేబుల్ జనార్థన్, అలీ అనే వ్యక్తిని రూ. 4 వేలు లంచం డిమాండ్ చేశాడు. ఈ మేరకు అలీ ఏసీబీ అధికారులను అశ్రయించాడు. దీంతో కానిస్టేబుల్ పై నిఘా వేశారు. కాగా సోమవారం అలీ నుంచి కానిస్టేబుల్ లంచం తీసుకుంటుండగా పథకం ప్రకారం పట్టుకున్నారు. (పహడీషరీప్) -
కేజీహెచ్‌లో ఏసీబీ అధికారుల దాడులు
-
ప్రకాశంలో టీడీపీ నేతల దౌర్జన్యం
ఒంగోలు: మండల, జిల్లా పరిషత్ ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మద్దతుగా ప్రచారం చేశారనే అక్కసుతో ప్రకాశం జిల్లాలో తెలుగుదేశం పార్టీ నాయకులు దౌర్జన్యం చేశారు. టంగుటూరులో ఆదివారం అర్ధరాత్రి టీడీపీ నేతలు ముస్లింల ఇళ్లపై దాడులుకు దిగి విధ్వంసం సృష్టించారు. ఫర్నీచర్, బైక్‌లు ధ్వంసం చేశారు. దీంతో మహిళలు, పిల్లలు భయంతో వణికిపోయారు. ఆదివారం తొలివిడత స్థానిక సంస్థల ఎన్నికలు జరిగిన సంగతి తెలిసిందే. -
దళితులపై ఎమ్మెల్యే పయ్యావుల అనుచరుల దాడి
-
దళితులపై పయ్యావుల అనుచరుల దాడి
-
దళితులపై ఎమ్మెల్యే పయ్యావుల అనుచరుల దాడి
అనంతపురం: మంచి నీటి సమస్య ఎందుకు తీర్చలేదంటూ గ్రామస్థులు ప్రశ్నించిన పాపానికి తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే పయ్యావుల కేశవ్ అనుచరులు దళితులపై దాడికి పాల్పడ్డారు. మంగళవారం అనంతపురం జిల్లా ఉరవకొండ నియోజవర్గం శూలసముద్రం గ్రామంలో ఈ సంఘటన జరిగింది. శూలసముద్రం గ్రామానికి కేశవ్ ఎన్నికల ప్రచారం కోసం వెళ్లారు. ఆ సమయంలో మంచి నీటి సమస్య గురించి ప్రశ్నించడంతో ఎమ్మెల్యే అనుచరులు రెచ్చిపోయారు. కేశవ్ సమక్షంలోనే దళితులపై దాడికి పాల్పడ్డారు. ఈ ఘటనలో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. బాధితులను చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. -
మిడ్నైట్ రైడ్ వివాదం
మరికొంత సమయం కావాలి న్యూఢిల్లీ: మిడ్నైట్ రైడ్ వివాదంపై శుక్రవారం స్థాయీ నివేదికను ఇవ్వడంలో దర్యాప్తు అధికారులు విఫలమయ్యారు. ఉగాండా మహిళలపట్ల అనుచితంగా ప్రవర్తించారన్న కేసులో గుర్తుతెలియని వ్యక్తులపై ఢిల్లీ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నారు. ఈ వివాదానికి సంబంధించి న్యాయశాఖ మంత్రి సోమ్‌నాథ్ భారతి పేరు బయటకు వచ్చిన విషయం తెలిసిందే. తమపై దాడిచేసిన వారికి సోమ్‌నాథ్ భారతి నేతృత్వం వహించినట్లు బాధితురాలైన ఉగాండా మహిళ స్పష్టం చేసిన నేపథ్యంలో కేసు దర్యాప్తు సులభతరమవుతందని భావించారు. అయినప్పటికీ దర్యాప్తు అధికారులు ఇప్పటిదాకా తమ పని ఎందాకా వచ్చిందో కోర్టుకు తెలపడంలో విఫలమయ్యారు. కేసుకు సంబంధించి సాక్షుల పేర్లతో కూడిన ఓ సీల్డ్ కవర్‌ను న్యాయమూర్తి చేత్నాసింగ్‌కు అందజేశారు. పూర్తిస్థాయి నివేదికను ఇచ్చేందుకు మరికొంత సమయం ఇవ్వాలని కోర్టును కోరారు. కనీసం నెలరోజులైనా గడువు ఇవ్వాలని న్యాయమూర్తిని కోరారు. కోర్టువర్గాలు అందించిన వివరాల ప్రకారం... న్యాయమూర్తికి అందజేసిన కవర్లో దాదాపు 40 మంది సాక్షుల పేర్లున్నాయి. అందులో 12 మంది ఆఫ్రికన్ మహిళలు ఉండగా మిగతావారు స్థానికులు. ఈ 12 మంది వాంగ్మూలాలను న్యాయమూర్తి సమక్షంలో రికార్డు చేశారు. ఇదిలాఉండగా దర్యాప్తు ప్రాథమిక స్థాయిలోనే ఉందని, పూర్తిస్థాయి నివేదికకు నెలరోజుల సమయం పడుతుందని దర్యాప్తు అధికారి ఒకరు తెలిపారు. జనవరి 19న ఈ కేసుకు సంబంధించి గుర్తుతెలియని వ్యక్తులపై భారత శిక్షాస్మృతి, సెక్షన్ 153ఏ, 323, 354, 509, 506, 147 ప్రకారం మాలవీయనగర్ పోలీసులు కేసు నమోదు చేశారన్నారు. ఉగాండా మహిళ ఫిర్యాదు మేరకు కోర్టు జారీ చేసిన మార్గదర్శకాల ప్రకారం అభియోగాలు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారని చెప్పారు. బాధితుల్లో రెండో మహిళ కూడా కోర్టును ఆశ్రయించి, ప్రత్యేక కేసు నమోదు చేయాలని కోరిందని, అయితే ఈ ఘటనను కూడా ఒకే కేసుగా పరిగణించి దర్యాప్తు చేయాలని కోర్టు సూచిందన్నారు. -
వైఎస్ఆర్ సీపీ కార్యకర్తలపై జేసీ వర్గీయుల దాడి
అనంతపురం: అనంతపురం జిల్లా యాడికి మండలం కోనుప్పలపాడులో ఉద్రికత్త పరిస్థితులు ఏర్పడ్డాయి. కాంగ్రెస్ నేత, తాడిపత్రి ఎమ్మెల్యే జేసీ దివాకర రెడ్డి వర్గీయులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్యలపై దాడికి పాల్పడ్డారు. ఆదివారం జరిగిన ఈ ఘటనలో ఇద్దరు వైఎస్ఆర్ సీపీ కార్యకర్యలు తీవ్రంగా గాయపడ్డారు. ఈ విషయంపై వైఎస్ఆర్ సీపీ నాయకులు ఫిర్యాదు చేసినా పోలీసులు పట్టించుకోలేదు. దాడి చేసిన వారు అధికార పార్టీకి చెందిన వారు కావడంతో మౌనం వహించినట్టు విమర్శలు వినిపిస్తున్నాయి.