కల్తీలపై టాస్క్‌ఫోర్స్ కన్నెర్ర
కల్తీలపై టాస్క్‌ఫోర్స్ కన్నెర్ర
Published Wed, Aug 31 2016 10:05 PM | Last Updated on Tue, Aug 21 2018 5:54 PM
కారం పొడి తయారీ గోదాముపై దాడులు
లక్షల విలువైన సరుకు స్వాధీనం
పోలీసుల అందుపులో నిందితుడు
విజయవాడ(చిట్టినగర్) :
కల్తీలపై టాస్క్‌ఫోర్స్ అధికారులు కన్నెర్ర చేశారు. అనుమతులు లేకుండా యథేచ్ఛగా కల్తీ సరుకు తయారీ చేసి విక్రయిస్తున్న గోదాముపై దాడి చేశారు. రెండు లక్షలపైగా విలువైన సరుకు, యంత్రాలను స్వాధీనం చేసుకున్నారు. నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు.
వివరాలు..
చిట్టినగర్ ప్రాంతానికి చెందిన వనమా జనార్దన్ రెండేళ్లుగా పాముల కాలువ సమీపంలోని పొలాల్లో ఓ రేకులషెడ్డును అద్దెకు తీసుకుని నీలిమ బ్రాండ్ పేరిట వివిధ రకాల కారం పొడులను తయారు చేసే యూనిట్ ఏర్పాటు చేశాడు. 15 రకాల పొడులు తయారు చేయిస్తూ విక్రయిస్తున్నాడు. సరుకులో నాణ్యత లేకపోవడంతో టాస్క్‌ఫోర్స్‌కు వినియోగదారులు సమాచారం అందించారు. దీంతో టాస్క్‌ఫోర్స్ ఏసీపీ ప్రసాద్ ఆధ్వర్యంలో ఎస్‌ఐ శ్రీనివాస్ యూనిట్‌ను బుధవారం తనిఖీ చేశారు. కల్లీ వ్యవహారం బయటపడింది.
వ్యర్థాలతోనూ..
ఇడ్లీ కారం పొడిలో మిరపకాయల తొడేలతో పాటు తెల్ల మిరపకాయలు, వాటి కొమ్మలను కూడా పొడి చేసి తయారీలో వినియోగిస్తున్నట్లు నిందితుడు అంగీకరించాడు. కాకర కాయ, కరివేపాకు ఇలాంటి వాటిలో చెట్టు కొమ్మలను పొడిగా చేసి కలిపేస్తున్నట్లు చెప్పుకొచ్చాడు. కొమ్మల నుంచి వాసన రాకుండా చింతపండు పులుసు, రుచి కోసం టేస్టింగ్ సాల్ట్‌లను కలుపుతున్నట్లు పేర్కొన్నాడు. కొత్తపేట ఎస్‌ఐ సుబ్బారావు నిందితుడి నుంచి పూర్తి వివరాలు నమోదు చేశారు.
Advertisement
Advertisement