centers
-
అమ్మల కోసం రూ.10 లక్షల వ్యయంతో ‘ఆణిముత్యాలు’
దాదర్: బహిరంగ ప్రదేశాల్లో పసిబిడ్డలకు పాలిచ్చేందుకు బాలింతలు ఎదుర్కొనే ఇబ్బందులను దృష్టిలో ఉంచుకుని జిల్లా ప్లానింగ్ కమిటీ ఉపనగరాల్లో 50 చోట్ల ఆణిముత్యం (పసిబిడ్డలకు పాలిచ్చే) కేంద్రాలను ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. ఇందుకు ఉపనగర జిల్లా ప్లానింగ్ కమిటీ రూ.5 కోట్లు నిధులు మంజూరు చేసింది. అవసరమైన స్ధల సేకరణ, అనుమతుల ప్రక్రియ పూర్తి కావడంతో పనులు త్వరలోనే ప్రారంభం కానున్నాయి. ప్రస్తుతం నగరం, ఉప పనగరాల్లో పాలిచ్చే కేంద్రాలు ఎక్కడ లేవు దీంతో బాలింతలు, పసిపిల్లల తల్లులు చాలా అసౌకర్యానికి గురవుతున్నారు. ఈ కేంద్రాలు వినియోగంలోకి వస్తే పసిపిల్లల తల్లులు, బాలింతలకు ఊరట లభించనుంది. ఆణిముత్యం కేంద్రాల నిర్వాహణ మహారాష్ట్ర హౌసింగ్ ఏరియా డెవలప్మెంట్ అథారిటీ (మాడా)కు చెందిన సుధార్ సమితి పర్యవేక్షించనుంది. 50 చోట్ల ఆణిముత్యం కేంద్రాలు నేటి ఆధునిక సాంకేతిక యుగంలో పురుషులతోపాటు మహిళలు అన్ని రంగాల్లో దూసుకుపోతున్నారు. ప్రభుత్వ, ప్రైవేటు సంస్ధలు, ఆస్పత్రులు, ఇతర వాణిజ్య, వ్యాపార సంస్ధల్లో పనిచేస్తున్నారు. వివాహానికి పూర్వమే కాక ఆ తరువాత కూడా ఎన్నో సమస్యలను, సవాళ్లను అధిగమించి ఉద్యోగ జీవితాన్ని కొనసాగిస్తున్న మహిళల సంఖ్య భారీగానే ఉంటుంది. ఇలా విధులకు లేదా రొటీన్ చెకప్‌ల కోసం ఆసుపత్రులు, లేదా ఇతర పనులు నిమిత్తం వివిధ పనుల నిమిత్తం ఇంటి నుంచి బయటకు వచ్చిన బాలింతలు, పసిపిల్లల తల్లులకు మార్గమధ్యంలో పాలిచ్చేందుకు చాటు దొరకడంలేదు. రోడ్డు పక్కన లేదా బహిరంగ ప్రదేశాల్లో పాలివ్వాలంటే ఎవరైన ఆకతాయిలు దొంగచాటుగా తమ మొబైల్ ఫోన్లలో ఈ దృశ్యాలను రికార్డు చేస్తారని భయం. దీంతో గత్యంతరం లేక కొందరు బస్టాపుల్లో లేదా దుకాణాల వెనక, నివాస సొసైటీ కాంపౌండ్లలో చాటు వెతుక్కుని తమ బిడ్డలకు పాలిస్తున్నారు. ఇది వారికెంతో ఇబ్బందికరంగా, అసౌకర్యవంతంగా ఉన్నప్పటికీ తప్పడం లేదు. వీటన్నింటినీ దృష్టిలో ఉంచుకుని జిల్లా ప్లానింగ్ కమిటీ ఆణిముత్యం కేంద్రాలను నెలకొల్పాలని నిర్ణయించింది. 125 చదరపుటడుగుల ఒక్కో ఆణిముత్యం కేంద్రానికి రూ.10 లక్షలు ఖర్చు చేయనుంది. అందులో తాగునీరు, విద్యుత్ దీపాలు, ఫ్యాన్, వాష్ బేసిన్, ఒక బెడ్డు, మూడు కుర్చీలలు, శానిటరీ ప్యాడ్ మెషీన్, గాలి, వెలుతురు ఆడేందుకు వీలుగా విశాలమైన కిటికీలను ఏర్పాటు చేయనుంది. అలాగే ఈ కేంద్రాల బయట సీసీ టీవీ కెమరాలుంటాయి. దీంతో సౌకర్యంతో పాటు భద్రత కూడా లభిస్తుందని జిల్లా ప్లానింగ్ కమిటీ స్పష్టం చేసింది. -
ఆరోగ్య యోగం ఎప్పుడో ?
సాక్షి, సిద్దిపేట: ఆయుష్ ఆస్పత్రులకు అనుబంధంగా యోగా కేంద్రాల నిర్మాణం జరిగినా, అవి ప్రారంభానికి నోచుకోలేదు. కేంద్ర వైద్య, ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో ఆయుష్ మిషన్ ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా 421 ఆయుర్వేద, యునాని, హోమి యోపతి వైద్య,ఆరోగ్య కేంద్రాలకు యోగా కేంద్రాలను మంజూరు చేశారు.పలు చోట్ల నిర్మా ణాలు పూర్తయినా, శిక్షకులను నియమించకపోవడంతో అవి స్టోర్ రూంలను తలపిస్తున్నాయి. ఇప్పటికైనా అధికారులు స్పందించి యోగా శిక్షకులను నియమించాలని ప్రజలు కోరుతున్నారు. ఒక్కో కేంద్రానికి రూ.6 లక్షలు ప్రస్తుత సమాజంలో మనుషులు ఉరుకులు.. పరుగుల జీవితం గడుపుతున్నారు. ఉదయం లేచింది మొదలు రాత్రి నిద్రించే వరకు తీరిక లేకుండా బిజీగా ఉంటున్నారు. ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించడం లేదు. దీంతో అనారోగ్యం పాలై ఆస్పత్రి చుట్టూ తిరగాల్సిన పరిస్థితి ఏర్పడుతోంది. శారీరక శ్రమ లేకపోవడంతో చాలామంది షుగర్, బీపీలతో బాధపడుతున్నారు. ఈ విషయాలను దృష్టిలో పెట్టుకొని పట్టణాలు, పల్లెల ప్రజలకు సంపూర్ణ ఆరోగ్యం అందించేందుకు వీలుగా యోగాను ఉచితంగా అందించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఒక్కో యోగా కేంద్రం షెడ్ నిర్మాణానికి రూ.6 లక్షల చొప్పున రూ 25.26 కోట్ల నిధులు విడుదల చేశారు.ఆయా జిల్లాల కలెక్టర్ల ఆధ్వర్యంలో నిర్మాణ బాధ్యతలను ఆర్అండ్బీ, పీఆర్, టీఎస్ఎంఐడీసీలకు అప్పగించారు. తెలంగాణవ్యాప్తంగా 421 కేంద్రాలు మంజూరు కాగా, ఇప్పటివరకు 289 నిర్మాణాలు పూర్తయ్యాయి. ఇంకా 42 కేంద్రాల నిర్మాణం జరుగుతుండగా, మరో 90 కేంద్రాలకు స్థల కొరత ఏర్పడింది. నిర్మాణాలు పూర్తయినా.. యోగా శిక్షణకు షెడ్ల నిర్మాణాలు పలు చోట్ల పూర్తయినా, అవి ప్రారంభానికి నోచుకోలేదు. కొన్ని జిల్లాల్లో ఏడాదిన్నర క్రితం నిర్మాణాలు పూర్తయినప్పటికీ యోగా శిక్షకులను నియమించకపోవడంతో అవి తెరుచుకోలేదు. ఈ షెడ్లు వినియోగంలో లేకపోవడంతో పలు చోట్ల స్టోర్ రూంలుగా, మరికొన్ని చోట్ల అపరిశుభ్రంగా తయారవుతున్నాయి. శిక్షకుల నియామకం ఎప్పుడు? రాష్ట్రవ్యాప్తంగా ఒక్కో యోగా శిక్షణ కేంద్రానికి ఇద్దరు శిక్షకుల చొప్పున నియమించాలని నిర్ణయించారు. అందులో ఒక పురుషుడు, ఒక స్త్రీ ఉండే వి«ధంగా ప్రణాళిక రూపొందించారు. గత నెలలో యోగా శిక్షకుల కోసం ఉమ్మడి జిల్లాల వారీగా దరఖాస్తులు ఆహా్వనించి ఇంటర్వ్యూలు నిర్వహించారు. కానీ ఇప్పటి వరకు నియామకాలు చేపట్టలేదు. పురుషులకు నెలకు రూ.8 వేలు, మహిళకు రూ.5 వేలు వేతనం ఇవ్వాలని నిర్ణయించారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి యోగా శిక్షణ కేంద్రాలను అందుబాటులోకి తీసుకురావాలని స్థానికులు కోరుతున్నారు. త్వరలో ప్రారంభిస్తాం త్వరలో యోగా కేంద్రాలను ప్రారంభిస్తాం. కమిషనర్ ఆదేశాల మేరకు శిక్షకుల ఎంపికకు గత నెలలో ఆయా జిల్లాల వారీగా ఇంటర్వ్యూలు నిర్వహించాం. త్వరలో శిక్షకులకు అపాయింట్మెంట్ ఆర్డర్లు ఇస్తాం. – రవినాయక్, ఆర్డీడీ, హైదరాబాద్, ఆయుష్ -
కొత్తగా 60 అడ్వాన్స్డ్ టెక్నాలజీ సెంటర్లు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర ప్రభుత్వం నైపుణ్యం భివృద్ధికి అత్యంత ప్రాధాన్యం ఇస్తున్న విషయం తెలిసిందే. అందులో భాగంగానే ప్రతి అసెంబ్లీ నియోజకవర్గంలోని యువతకు స్కిల్‌కోర్సులు అందించి ఉపాధి అవకాశాలను మెరుగుపర్చాలని నిర్ణయించింది. ఇప్పటికే రాష్ట్రవ్యాప్తంగా ఉన్న ప్రభుత్వ ఐటీఐ (పారిశ్రామిక శిక్షణ సంస్థ)లను ఏటీసీ(అడ్వాన్స్డ్ టెక్నాలజీ సెంటర్)లుగా అప్‌గ్రేడ్ చేసింది. ప్రస్తుతం ఈ ఏటీసీలు పరిమిత సంఖ్యలో ఉండగా, ప్రతి అసెంబ్లీ నియోజకవర్గాల్లో కనీసం ఒకటి చొప్పున ఉండేలా చర్యలు చేపట్టింది. ఇందులో భాగంగా ఏటీసీలు లేని సెగ్మెంట్లను గుర్తిస్తూ... అక్కడ కొత్తగా వాటి ఏర్పాటుకు సంబంధించిన కార్యాచరణ వేగవంతం చేసింది. ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా 59 నియోజకవర్గాల్లో 65 ఏటీసీలున్నాయి.ఒకట్రెండు చోట్ల రెండేసి ఏటీసీలు ఉండగా, 60 నియోజకవర్గాల్లో మాత్రం వీటి ఊసే లేదు. ఈ నేపథ్యంలో ఏటీసీలు లేని చోట కొత్తగా నెలకొల్పేందుకు కారి్మక ఉపాధి కల్పన శాఖ కార్యాచరణ సిద్ధం చేసింది. ఇప్పటికే జిల్లా కలెక్టర్లకు స్థల లభ్యత, ఇతర వసతులను పరిగణనలోకి తీసుకొని ప్రతిపాదనలు పంపాలని కోరింది. ప్రస్తుతం వరంగల్ రీజియన్ పరిధిలో 35, హైదరాబాద్ రీజియన్ పరిధిలో 30 ఏటీసీలు ఉన్నాయి. హైదరాబాద్ రీజియన్‌లో ఉన్న వాటిల్లో అత్యాధునిక ట్రేడ్లను ఇప్పటికే అందుబాటులోకి తెచ్చారు. హైదరాబాద్ జిల్లాలోని ఆరు ఏటీసీలను ఇప్పటికే మారుతి, హ్యుందాయ్, ఏషియన్ పెయింట్స్ లాంటి సంస్థలు దత్తత తీసుకున్నాయి. దీంతో ఆయా సంస్థల్లోని ట్రేడ్లలో చేరేందుకు అభ్యర్థులు ఎక్కువగా ఆసక్తి చూపిస్తున్నారు.తాజాగా అన్ని చోట్ల అడ్వాన్స్డ్ టెక్నాలజీ ట్రేడ్లను అందుబాటులోకి తేస్తామని రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించడం... 2వేల కోట్లకు పైగా బడ్జెట్‌తో ఆధునీకరణ పనులు చేపట్టడంతో ఐటీఐ ట్రేడ్లకు ఇప్పుడిప్పుడే డిమాండ్ పెరుగుతోంది. ఈ క్రమంలో అన్ని నియోజకవర్గాల్లో ఏర్పాటు చేయాలని సీఎం రేవంత్‌రెడ్డి ఆదేశాలు జారీ చేయడంతో క్షేత్రస్థాయి నుంచి జిల్లా కలెక్టర్లు ప్రతిపాదనలు పంపుతున్నారు. ఇప్పటికే 20కి పైగా కొత్త ఏటీసీల ఏర్పాటు కోసం ఆయా జిల్లాల కలెక్టర్లు ప్రతిపాదనలు రూపొందించగా, అవి కార్మిక ఉపాధి కల్పన, శిక్షణ విభాగానికి చేరాయి. అతి త్వరలో పూర్తిస్థాయిలో ప్రతిపాదనలు వస్తాయని అధికారులు చెబుతున్నారు. -
‘టెట్’కు అభ్యర్థులు ఎంచుకున్న కేంద్రాలే
సాక్షి, అమరావతి: ఉపాధ్యాయ అభ్యర్థులకు ఈ నెల 27 నుంచి మార్చి 9వ తేదీ వరకు నిర్వహించే ఉపాధ్యాయ అర్హత పరీక్ష (టెట్)–2024కు పరీక్షా కేంద్రాలను అభ్యర్థులు ఎంచుకున్న ప్రాధాన్యత క్రమంలో మాత్రమే కేటాయిస్తారని పాఠశాల విద్యాశాఖ ప్రకటించింది. ఆదివారం ‘ఈనాడు’ పత్రికలో ‘టెట్ అభ్యర్థులు కేంద్రానికి వెళ్లడమే పెద్ద పరీక్ష’ పేరిట ప్రచురించిన కథనం పూర్తిగా అవాస్తమని కమిషనరేట్ ఓ ప్రకటనలో ఖండించింది. అభ్యర్థులకు పరీక్ష కేంద్రాల ఎంపికలో ఆరు కేంద్రాలను ప్రాధాన్యతా క్రమంలో ఎంచుకోవాలన్నారు. అలా మొత్తం దరఖాస్తు చేసుకున్న వారిలో 82 శాతం మందికి మొదటి ప్రాధాన్య కేంద్రాన్నే కేటాయించినట్టు పాఠశాల విద్యా శాఖ కమిషనర్ పేర్కొన్నారు. కేటాయింపు ఇలా.. మ్యాథ్స్, సైన్స్ విభాగంలో దరఖాస్తు చేసుకున్న 58,631 మందిలో 90.97 శాతం మందికి మొదటి ప్రాధాన్య కేంద్రాన్ని కేటాయించగా, కేవలం 37 మందికి మాత్రమే ఆరో ప్రాధాన్య కేంద్రాన్ని కేటాయించారన్నారు. మరో 3,389 మందికి (5.78 శాతం) రెండో ప్రాధాన్య కేంద్రాన్ని, 1,406 మందికి మూడో ప్రాధాన్య కేంద్రాన్ని, 373 మందికి నాలుగో ప్రాధాన్య కేంద్రాన్ని, 93 మందికి ఐదో ప్రాధాన్య కేంద్రాన్ని కేటాయించినట్టు విద్యా శాఖ కమిషనర్ వివరించారు. ► సోషల్ విభాగంలో 36,776 మందిలో 31051 మంది (84.43శాతం)కి మొదటి ప్రాధాన్య కేంద్రాన్ని కేటాయించగా, కేవలం ముగ్గురికి మాత్రమే ఆరో కేంద్రాన్ని కేటాయించారన్నారు. ► తెలుగు విభాగంలో వచ్చిన దరఖాస్తుల్లో 149 మందికి మాత్రమే ఆరో ప్రాధాన్య కేంద్రాన్ని కేటాయించగా, మిగిలిన వారికి మొదటి కేంద్రాన్నే ఇచ్చామన్నారు. ► ఇంగ్లిష్ విభాగంలో 17 మందికి మాత్రమే ఐదో ప్రాధాన్య కేంద్రాన్ని కేటాయించారన్నారు. ఈ విభాగంలో ఆరో ప్రాధాన్య కేంద్రాన్ని ఎవరికీ ఇవ్వలేదన్నారు. ► హిందీ విభాగంలో 8,752 మందికి (80.43 శాతం) మొదటి ప్రాధాన్య కేంద్రం, మరో ఇద్దరికి ఆరో ప్రాధాన్య కేంద్రం ఇచి్చనట్టు పేర్కొన్నారు. ఉర్దూ విభాగంలో అందరికీ మొదటి ప్రాధాన్య కేంద్రాన్ని కేటాయించినట్టు తెలిపారు. -
ఏటా 2 లక్షల మంది యువతకు ఉపాధి శిక్షణ
మాదాపూర్ (హైదరాబాద్): రాష్ట్రవ్యాప్తంగా స్కిల్‌డెవలప్‌మెంట్ సెంటర్లను అభివృద్ధి చేయనున్నట్టు రోడ్లు, భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి తెలిపారు. మాదాపూర్‌లోని నేషనల్ అకాడమీ ఆఫ్ కన్స్ట్రక్షన్ (న్యాక్)లో శుక్రవారం ఎగ్జిక్యూటివ్ కమిటీ సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి న్యాక్ ప్రతినిధులతో కలసి సంస్థలో కార్యకలాపాలను పరిశీలించారు. అనంతరం మాట్లాడుతూ హైదరాబాద్‌లో స్కిల్ డెవలప్మెంట్ కార్యక్రమాలపై ప్రత్యేక దృష్టి పెట్టనున్నట్టు తెలిపారు. ప్రతి సంవత్సరం 2 లక్షల మంది యువతకు శిక్షణ ఇచ్చి ఉద్యోగ, ఉపాధి అవకాశాలను కల్పించే కార్యక్రమాలను చేపట్టనున్నట్టు వివరించారు. మండల, జిల్లా స్థాయిలో ఒక్కో స్కిల్ డెవలప్మెంట్ సెంటర్‌ను ఏర్పాటు చేస్తామని చెప్పారు. మహబూబ్‌నగర్, నల్లగొండ జిల్లాలలో స్కిల్ డెవలప్మెంట్ సెంటర్లను ప్రయోగాత్మకంగా మొదలుపెట్టి అనంతరం వాటిని విస్తరిస్తామని వివరించారు. ఈ సందర్భంగా నూతన సంవత్సరానికి సంబంధించిన న్యాక్ డైరీని ఆవిష్కరించారు. కార్యక్రమంలో న్యాక్ డైరెక్టర్ జనరల్ కె.భిక్షపతి, న్యాక్ వైస్ చైర్మన్ శాంతికుమారి తదితరులు పాల్గొన్నారు. -
వావ్..విశాఖ!
సాక్షి, అమరావతి : పాలనా రాజధానిగా సర్వ హంగులూ సమకూర్చుకుంటున్న విశాఖ ముఖచిత్రం మారుతోంది. ఐటీ రంగంలో ఇప్పటివరకూ బిజినెస్ ప్రాసెసింగ్ ఔట్సోర్సింగ్(బీపీవో) కార్యకలాపాలకు ప్రధాన వేదికగా నిలిచిన ఈ నగరం.. ఇప్పుడు సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ సెంటర్స్(డీసీ)ను ఆకర్షిస్తోంది. ఐటీ దిగ్గజ సంస్థ ఇన్ఫోసిస్ రాష్ట్రంలో తొలి డెవలప్మెంట్ సెంటర్‌ను విశాఖలో ఏర్పాటుచేయడంతో.. అదే బాటలో మరికొన్ని సంస్థలు ఆసక్తిచూపుతున్నాయి. ఇన్ఫోసిస్ డెవలప్మెంట్ సెంటర్ ఏర్పాటు చేశాక ఎప్పటి నుంచో విశాఖ కేంద్రంగా బీపీవో సర్వీసులు నడిపిస్తున్న విప్రో కూడా డెవలప్మెంట్ సెంటర్ ఏర్పాటుకు ముందుకొచ్చింది. లావండర్ పేరుతో ఏర్పాటు చేస్తున్న ఈ డెవలప్మెంట్ సెంటర్లో విశాఖ కేంద్రంగా పనిచేయడానికి ఆసక్తి ఉన్న ఉద్యోగుల నుంచి వివరాలు సేకరిస్తోంది. ఇంతకాలం విశాఖ అనగానే పల్సస్ గ్రూపు, డబ్ల్యూఎన్ఎస్, టెక్ మహీంద్రా, విప్రో వంటి బీపీవో కార్యకలాపాలే కనిపించేవి. ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం బీచ్ ఐటీ డెస్టినీ పేరుతో విశాఖకు సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ సెంటర్లను ఆకర్షించేందుకు చేపడుతున్న చర్యలు సత్ఫలితాలిస్తున్నాయి. అదానీ డేటా సెంటర్‌తో పాటు మరికొన్ని.. ఇప్పటివరకు బీపీవోల కేంద్రంగా ముద్ర ఉన్న విశాఖకు ఇన్ఫోసిస్ రాకతో ఆ ముద్ర చెరిగి.. డెవలప్మెంట్ సెంటర్ల ఏర్పాటుకు మార్గం సుగమం అవుతోందని ఏపీ ఎలక్ట్రానిక్స్ అండ్ ఐటీ ఏజెన్సీ(అపిటా) గ్రూప్ సీఈవో ఎస్.కిరణ్‌కుమార్‌రెడ్డి ఆశాభావం వ్యక్తం చేశారు. ఇప్పటికే అమెజాన్, భారత్ ఎలక్ట్రికల్ లిమిటెడ్ సంస్థలు డెవలప్మెంట్ సెంటర్లను నెలకొల్పగా, తాజాగా ఇన్ఫోసిస్ 1,000 సీటింగ్ సామర్థ్యంతో క్యాంపస్‌ను ఏర్పాటుచేసింది. రానున్న కాలంలో దీన్ని మరింత విస్తరిస్తున్నట్టు ప్రకటించింది. తాజాగా విప్రో కూడా అదే బాటలో అడుగులు వేస్తోంది. అలాగే, అదానీ డేటా సెంటర్ కూడా ఏర్పాటుకానుండటం.. సింగపూర్ నుంచి సముద్రమార్గం ద్వారా ఫైబర్‌నెట్ కనెక్షన్ ఏర్పాటవుతుండటం.. పారిశ్రామిక రంగంలో నాలుగో తరం ఆవిష్కరణలను ప్రోత్సహించేలా దేశంలోనే తొలి సెంటర్ ఆఫ్ ఎక్స్‌లెన్సీ.. కల్పతరువు పేరిట విశాఖలో ఏర్పాటుచేయడం.. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, రొబోటెక్స్, డేటా ఎనలిటిక్స్ వంటి వాటిపై పరిశోధనలను ప్రోత్సహించేలా ఆంధ్రా వర్సిటీలో మరో సెంటర్ ఆఫ్ ఎక్స్‌లెన్సీ ఏర్పాటుకావడంతో పలు ఐటీ కంపెనీలు తమ కార్యకలాపాలను విశాఖలో ప్రారంభించేందుకు ఆసక్తిచూపుతున్నాయి. అతి తక్కువ వ్యయంతో పుష్కలమైన మానవ వనరులున్న నగరాల్లో విశాఖ ముందంజలో ఉందని తాజాగా నాస్కామ్–డెలాయిట్ విడుదల చేసిన నివేదికలో పేర్కొనడం కూడా విశాఖకు కలిసివస్తోంది. నైపుణ్యం కలిగిన మానవ వనరులు పుష్కలంగా ఉండటంతో విశాఖలో డెవలప్మెంట్ సెంటర్ల ఏర్పాటుకు పలు సంస్థలు చర్చలు జరుపుతున్నాయని, వీటిలో చాలా సంస్థలు స్టాక్ఎక్సే్ఛంజ్లలో నమోదు కావడం వల్ల వాటి వివరాలను అప్పుడే చెప్పలేమని ఎస్టీపీఐ విశాఖ అడిషనల్ డైరెక్టర్ సురేష్ చెప్పారు. భోగాపురంలో అంతర్జాతీయ విమానాశ్రయం, త్వరలో మెట్రో రైలు పనులు ప్రారంభం కానుండటం, రహేజా గ్రూపు ఇన్ఆర్బిట్ మాల్‌ను ఏర్పాటుచేస్తుండటంతో విశాఖ త్వరలోనే పూర్తిస్థాయి కాస్మోపాలిటన్ నగరంగా మారనుంది. దీంతో ఐటీ నిపుణులు పనిచేసేందుకు విశాఖను ఎంచుకునే అవకాశాలు పెరుగుతాయని పల్సస్ గ్రూపు సీఈవో గేదెల శ్రీనుబాబు వివరించారు. బీచ్ ఐటీ డెస్టినీగా విశాఖ.. విశాఖను బీచ్ ఐటీ డెస్టినీగా తీర్చిదిద్దేందుకు రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటున్న చర్యల నేపథ్యంలో.. ఇన్ఫోసిస్ వంటి ఐటీ దిగ్గజ సంస్థ విశాఖ రావడం వలన మరిన్ని ఐటీ పరిశ్రమలు ఇక్కడకు వచ్చే అవకాశముందని పరిశ్రమలు ఐటీ శాఖ మంత్రి గుడివాడ అమరనాథ్ ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. యాక్సెంచర్, సీడాక్, మైక్రోసాఫ్ట్, గూగుల్ వంటి సంస్థలు రాష్ట్రంలో కార్యాలయాల ఏర్పాటుకు ఆసక్తి చూపుతున్నాయని ఐటీ శాఖ కార్యదర్శి కోన శశిధర్ తెలిపారు. గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్‌లో పలు ఐటీ సంస్థలు రాష్ట్రంలో శాఖల ఏర్పాటుకు ముందుకొచ్చాయని, ఈ పెట్టుబడులను వాస్తవ రూపంలోకి తేవడంతో పాటు, ప్రస్తుత ఐటీ కంపెనీల అవసరాలు తీర్చడంపై దృష్టిసారించినట్టు శశిధర్ వెల్లడించారు. -
హైదరాబాద్‌లో రోజుకు ఇన్ని వీధి కుక్కలు చనిపోతున్నాయా?
సాక్షి, హైదరాబాద్: సిటీలోని యానిమల్ కేర్ సెంటర్లలో వీధి కుక్కల మృత్యువాత కలకలం రేపుతోంది. జీహెచ్ఎంసీ కుటుంబ నియంత్రణ వికటించి కుక్కలు మరణిస్తున్నాయి. వెటర్నరీ వైద్యులకు బదులు ఔట్సోర్సింగ్ కార్మికులతో సర్జరీలు చేసినట్లు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. రోజుల తరబడి ఆహారం పెట్టకపోవడంతో మరికొన్ని శునకాలు మృత్యువాత పడుతున్నాయి. గత వారం రోజులుగా ఎల్బీ నగర్ జోన్‌లోని నాగోల్ యానిమల్ కేర్‌లోనే రోజుకు 30కి పైగా కుక్కలు మరణిస్తున్నట్లు సమాచారం. నిర్వాకం బయటికి పొక్కకుండా వెటర్నరీ అధికారులు జాగ్రత్త పడుతున్నారు. బల్దియా వెటర్నరీ అధికారుల తీరుపై జంతు ప్రేమికులు మండిపడుతున్నారు. ఘటనపై సమగ్ర దర్యాప్తు చేయాలంటూ డిమాండ్ చేస్తున్నారు. చదవండి: మ్యాట్రిమోనీలో పరిచయం.. యువతి నుంచి రూ.6 లక్షలు తీసుకొని -
వృద్ధులకు ఏడు ఫిజియోథెరపీ కేంద్రాలు
సాక్షి, అమరావతి: వృద్ధాప్యం కారణంగా కీళ్లు, కండరాల నొప్పులతో బాధపడేవారికి సేవలు అందించేందుకు రాష్ట్రంలో ఏడు ఫిజియోథెరపీ కేంద్రాలను ప్రభుత్వం నిర్వహిస్తోంది. వాటి పరిధిలో వృద్ధులకు మరింతగా సేవలు అందించేందుకు ప్రస్తుత బడ్జెట్లో ప్రభుత్వం రూ.కోటి నిధులను కేటాయించింది. రాష్ట్రంలోని విశాఖపట్నం కింగ్ జార్జ్ ఆస్పత్రి(కేజీహెచ్), విజయవాడ, తిరుపతి, కర్నూలు, కడప, రాజమహేంద్రవరం, శ్రీకాకుళం ప్రభుత్వ జనరల్ ఆస్పత్రుల్లో ఫిజియోథెరపీ కేంద్రాలను నిర్వహిస్తున్నారు. ఈ ఏడు కేంద్రాల్లో నిపుణులైన ఫిజియోథెరపిస్టులు, వైద్యులు సేవలు అందిస్తున్నారు. గడిచిన ఏడాదికాలంలో వీటి ద్వారా 12వేల మందికిపైగా వృద్ధులు ఫిజియోథెరపీ సేవలు పొందారు. వీటితోపాటు వృద్ధాప్యంలో వచ్చే సమస్యలు తెలుసుకుని వారికి తక్షణ వైద్యసేవలు అందించేలా ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ఈ నేపథ్యంలో వయోవృద్ధులు ఎదుర్కొంటున్న ఆరోగ్య, మానసిక, వ్యక్తిగత సమస్యలు తెలుసుకుని వారికి తక్షణ సహాయం అందించేలా ఎల్డర్ లైన్–14567 టోల్ ఫ్రీ నంబర్‌తో జాతీయస్థాయిలో హెల్ప్‌లైన్‌ను నిర్వహిస్తోంది. రాష్ట్రంలోని 26 జిల్లాల్లోనూ ప్రత్యేక ఫీల్డ్ రెస్పాన్స్ టీమ్స్‌తో ఎల్డర్‌లైన్ హెల్ప్‌లైన్ విభాగం సమర్థంగా పనిచేస్తోంది. మరోవైపు వయోవృద్ధులకు చేతికర్రలు, వినికిడి యంత్రాలు, మూడుచక్రాల కుర్చీలు వంటి పరికరాలు అందిస్తోంది. రాష్ట్రంలో స్వచ్ఛంద సంస్థలు(ఎన్జీఓ) నిర్వహిస్తున్న 70 వృద్ధాశ్రమాలకు ప్రభుత్వం గ్రాంట్‌ను నేరుగా అందిస్తోంది. వైఎస్సార్సీపీ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత 2019, జూన్ నుంచి వృద్ధాప్య పింఛనుకు వయోపరిమితిని 65 ఏళ్ల నుంచి 60 ఏళ్లకు తగ్గించింది. ఫలితంగా వైఎస్సార్ పింఛను పథకం కింద సుమారు 35లక్షల మంది వృద్ధులు ప్రతి నెల పింఛను పొందుతున్నారు. (చదవండి: ఇంకెన్నాళ్లీ ‘కలం’ కూట విషం?) -
శాంసంగ్ గుడ్ న్యూస్: భారీ ఉద్యోగాలు
సాక్షి,ముంబై: దక్షిణకొరియా దిగ్గజం శాంసంగ్ ఇండియా శుభవార్త అందించింది.టాప్ కంపెనీల్లో లక్షల కొద్దీ ఉద్యోగాలు కోల్పోతున్న సమయంలో శాంసంగ్ ఇండియా ఉద్యోగ నియామకాలను ప్రకటించి ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్లకు భారీ ఊరట నిచ్చింది. దాదాపు వెయ్యి మంది ఇంజనీర్లను నియమించుకోనుంది. (ఎన్డీటీవీ: ప్రణయ్ రాయ్, రాధిక గుడ్‌బై, కేటీఆర్ ఏం చేశారంటే?) కంప్యూటర్ సైన్స్, అనుబంధ శాఖలు (AI/ML/కంప్యూటర్ విజన్/VLSI), ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, ఎలక్ట్రానిక్స్, ఇన్స్ట్రుమెంటేషన్, ఎంబెడెడ్ సిస్టమ్స్ కమ్యూనికేషన్ నెట్‌వర్క్‌లలో ఇంజనీర్లను రిక్రూట్ చేయనున్నట్లు శాంసంగ్ వెల్లడించింది. భారతదేశ కేంద్రీకృత ఆవిష్కరణలతో సహా, ప్రజల జీవితాలను సుసంపన్నం చేసే ఆవిష్కరణలు, సాంకేతికతలు, ఉత్పత్తుల, డిజైన్లపై వీరు పనిచేస్తారని, డిజిటల్ ఇండియాను శక్తివంతం చేయాలనే తమ విజన్‌ను మరింత మెరుగుపరుస్తుందని శాంసంగ్ ఇండియా హ్యూమన్ రిసోర్సెస్ హెడ్ సమీర్ వాధావన్ అన్నారు. బెంగళూరు, నోయిడా, ఢిల్లీ, బెంగళూరులోని రీసెర్చ్, అండ్ డెవలప్మెంట్ కేంద్రాల కోసం సుమారు 1000 మందిని నియమించుకోనుంది. దీనికి అదనంగా మేథ్స్, కంప్యూటింగ్ లేదా సాఫ్ట్వేర్ ఇంజనీర్లను నియమించుకుంటుంది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, మెషిన్ లెర్నింగ్, డీప్ లెర్నింగ్, ఇమేజ్ ప్రాసెసింగ్, ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ (IoT), కనెక్టివిటీ, క్లౌడ్, బిగ్ డేటా, బిజినెస్ ఇంటెలిజెన్స్, ప్రిడిక్టివ్ అనాలిసిస్, కమ్యూనికేషన్ నెట్‌వర్క్‌లు, సిస్టమ్ ఆన్‌లో పనిచేసేలా ఈ ఇంజనీర్లను 2023లో కంపెనీలో చేర్చుకుంటామని శాంసంగ్ తెలిపింది. పరిశోధనా కేంద్రాలు మల్టీ-కెమెరా సొల్యూషన్లు, టెలివిజన్లు, డిజిటల్ అప్లికేషన్లు, 5G, 6G అల్ట్రా-వైడ్‌బ్యాండ్ వైర్లెస్ కమ్యూనికేషన్ ప్రోటోకాల్ లాంటి రంగాలలో 7,500కి పైగా పేటెంట్లను దాఖలు చేశాయి. ఈ పేటెంట్లలో చాలా వరకు శాంసంగ్ ఫ్లాగ్షిప్ గెలాక్సీ స్మార్ట్ఫోన్లు, స్మార్ట్‌వాచ్‌లు,డిజిటల్ అప్లికేషన్లున్నాయి. అలాగే ఇండియాలో తయారైన ఆవిష్కరణలతో నంబర్ పేటెంట్ ఫైలర్గా నిలిచిందినీ, నేషనల్ IP అవార్డు 2021, 2022ని కూడా గెలుచుకుందని కంపెనీ తెలిపింది. -
ఎక్కడా ఎరువుల కొరతలేదు: మంత్రి కన్నబాబు
సాక్షి, అమరావతి: వ్యవసాయ మౌలిక సదుపాయాలపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి సమీక్షించారని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కురసాల కన్నబాబు తెలిపారు. శుక్రవారం ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ, రైతు భరోసా కేంద్రాల బలోపేతంపై సీఎం పలు ఆదేశాలిచ్చారన్నారు. ప్రభుత్వ పనితీరుపై పచ్చ పత్రికలు తప్పుడు ప్రచారం చేస్తున్నాయని మంత్రి మండిపడ్డారు. (చదవండి: భారత్‌లో రెండో ముంబై ఎక్కడుందో తెలుసా..!!) రైతు భరోసా కేంద్రాల ఏర్పాటుపై దేశవ్యాప్తంగా ప్రశంసలు వస్తున్నాయన్నారు. దళారీలను అరికట్టడానికే భరోసా కేంద్రాలు తీసుకొచ్చామన్నారు. నాణ్యమైన విత్తనాలు, ఎరువులు అందించడం ప్రథమ లక్ష్యమని తెలిపారు. ఎక్కడా ఎరువుల కొరత లేదని మంత్రి స్పష్టం చేశారు. ప్రతి రైతు భరోసా కేంద్రం.. సబ్ డీలర్‌గా ఉంటుందన్నారు. రైతులను ఆదుకునేందుకు అన్ని విధాలుగా కృషి చేస్తున్నామన్నారు. చదవండి: ధూళిపాళ్ల నరేంద్రకు నోటీసులిచ్చిన కాకినాడ పోలీసులు -
థర్డ్ వేవ్ కోసం సంసిద్ధం
సాక్షి, ముంబై: కరోనా మూడో వేవ్ ఆగస్టు తరువాత వస్తుందని వైద్య నిపుణులు హెచ్చరిస్తుండటంతో బృహన్ముంబై మున్సిపల్ కార్పొరేషన్ (బీఎంసీ) పరిపాలనా విభాగం అప్రమత్తమైంది. ముందు జాగ్రత్త చర్యగా ఇప్పటి నుంచే ఏర్పాట్లు చేయడంలో నిమగ్నమైంది. మూడో వేవ్‌లోనూ కరోనాను నియంత్రించేందుకు అవసరమైన సామగ్రి, వైద్య సిబ్బందిని సమకూర్చుకుని సిద్ధంగా ఉంచే పనిలో పడింది. ఈ క్రమంలోనే దహిసర్, మలాడ్, నేస్కో, వర్లీలోని ఎన్ఎస్సీఐ–డోమ్, భైకళలోని రిచర్డ్సన్ అండ్ కృడ్డాస్, ములుండ్ తదితర జంబో కోవిడ్ సెంటర్లలో సమారు 20 వేల పడకలు ఏర్పాటు చేయాలని సంకల్పించింది. వీటితోపాటు మహాలక్ష్మిలోని రేస్ కోర్స్, కాంజూర్గ్ మార్గ్, సోమయ్య మైదానంలో కొత్త జంబో కోవిడ్ సెంటర్లు నిర్మించాలని నిర్ణయం తీసుకుంది. అదేవిధంగా నాయర్, కస్తూర్భా, కేం, సైన్, కూపర్ తదితర ప్రధాన ఆస్పత్రులతో పాటు ఉప నగరాల్లో ఉన్న 16 ఆస్పత్రులు, నర్సింగ్ హోమ్‌లలో కూడా పడకలు సమకూర్చి సిద్ధంగా ఉంచాలని నిర్ణయం తీసుకున్నట్లు బీఎంసీ అదనపు కమిషనర్ సురేశ్ కాకాని తెలిపారు. ఇదిలావుండగా కరోనా వైరస్‌ను నియంత్రించేందుకు బీఎంసీ ద్వారా చేపడుతున్న చర్యలు, ప్రభుత్వం జారీ చేసిన లాక్డౌన్, కఠిన ఆంక్షల వల్ల ముంబైలో రెండో దఫా కరోనా చాలా శాతం వరకు నియంత్రణలోకి వచ్చింది. దీంతో కరోనా రికవరీ శాతం కూడా 97 శాతం వరకు చేరుకుంది. అయినప్పటికీ మూడో దఫా కరోనా ప్రమాదం ఇంకా పొంచి ఉందని వైద్య నిపుణులు హెచ్చరిస్తుండటంతో ముందు జాగ్రత్త చర్యగా బీఎంసీ జంబో కోవిడ్ సెంటర్లు నెలకొల్పడం ప్రారంభించింది. బీఎంసీ, ప్రభుత్వ ఆస్పత్రులతో పాటు ప్రైవేటు ఆస్పత్రులు, నర్సింగ్ హోమ్‌లలో కూడా అవసరాన్ని బట్టి పడకలను సమకూర్చి సిద్ధంగా ఉంచనున్నట్లు సురేష్ తెలిపారు. సోమయ్య మైదానంలో 1,200 బెడ్ల సామర్థ్యం గల కోవిడ్ సెంటర్‌ను నిర్మించడం వల్ల చెంబూర్, మాహుల్, ట్రాంబే, దేవ్నార్, గోవండీ, కుర్లా, చునాబట్టి, సైన్ ప్రాంతాల ప్రజలకు లబ్ధి చేకూరనుంది. అదేవిధంగా చిన్న పిల్లల కోసం నిర్మించనున్న 1,500 బెడ్లతో కూడిన సెంటర్లో 70 శాతం ఆక్సిజన్ బెడ్లు, 10–15 శాతం ఐసీయూ బెడ్లు అందుబాటులో ఉండనున్నాయి. దీంతోపాటు పాత, కొత్త జంబో కోవిడ్ సెంటర్లలో పీడియాట్రిక్ వార్డు కూడా ఉండనుంది. దీంతో కోవిడ్ బారిన పడిన పిల్లలకు వెంటనే వైద్యం అందుతుందని బృహన్ముంబై మున్సిపల్ కార్పొరేషన్ (బీఎంసీ) ఆశిస్తోంది. -
క్వారంటైన్ సెంటర్లుగా క్లబ్బులు, పాఠశాలలు
సాక్షి, హైదరాబాద్: సింగరేణి వ్యాప్తంగా కరోనా కేసుల సంఖ్య క్రమంగా పెరుగుతున్న నేపథ్యంలో సింగరేణి సంస్థ సీఎండీ ఎన్.శ్రీధర్ ఆదేశం మేరకు పలు ముందస్తు జాగ్రత్త చర్యలను యాజమాన్యం తీసుకుంది. 11 ఏరియాల్లో గల కంపెనీ ఆసుపత్రుల్లో ప్రత్యేక కరోనా వార్డుల ఏర్పాటుతో పాటు, క్వారంటైన్ సెంటర్లుగా అన్ని ఏరియాల్లో గల సీఈఆర్ క్లబ్బులు, కమ్యూనిటీ హాళ్లు, సింగరేణి పాఠశాలలు తదితర భవనాలను సిద్ధం చేయాలని నిర్ణయించిందని సంస్థ డైరెక్టర్ ఎస్.చంద్రశేఖర్ మంగళవారం వెల్లడించారు. సింగరేణి వ్యాప్తంగా కేసులు పెరుగుతున్నందున క్వారంటైన్ సెంటర్లు ఏర్పాటు చేసి, వ్యాధి మరింత విస్తరించకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నామని తెలిపారు. ప్రతి క్వారంటైన్ సెంటర్లో ఒక డాక్టరు, అవసరమైన వైద్య సిబ్బంది ఉండి 24 గంటలు వైద్య సేవలు అందిస్తారని తెలిపారు. క్వారంటైన్లో ఎవరికైనా వ్యాధి ముదిరితే వారికి హైదరాబాద్‌లో అత్యవసర సేవలందించడానికి కంపెనీ 3 సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రులతో ఒప్పందం కుదుర్చుకుందని తెలిపారు. సింగరేణి వ్యాప్తంగా కరోనా వ్యాధి సోకిన వారికి వైద్యం కోసం ఖరీదైన మందుల్ని అందుబాటులో ఉంచుతున్నామని, ఒక్కొక్కటి రూ.14 వేలు ఖరీదైన యాంటీ వైరల్ డోసులను కూడా కంపెనీ సమకూర్చుకుంటోందని తెలిపారు. కరోనా సంక్రమించకుండా కార్మికులు, వారి కుటుంబ సభ్యులు అప్రమత్తంగా ఉండాలని కోరారు. వ్యాధి బారిన పడిన అందరికీ పూర్తి స్థాయి వైద్య సేవలందించడానికి కంపెనీ సిద్ధంగా ఉందని ఆయన వెల్లడించారు. వైద్య సిబ్బందికి బీమా, 10% అలవెన్సు సింగరేణిలో కరోనా వైద్య సేవల్లో ప్రత్యక్షంగా పనిచేసే డాక్టర్లు, ఇతర వైద్య సిబ్బంది అందరికి, రాష్ట్ర ప్రభుత్వం మాదిరిగానే ప్రతీ నెల వారి బేసిక్ జీతంపై 10 శాతం ప్రత్యేక ప్రోత్సాహక అలవెన్స్ ఇక నుంచి సంస్థ చెల్లిస్తుందనీ, ప్రభుత్వం కల్పించిన 50 లక్షల రూపాయల బీమా సౌకర్యం కోవిడ్ సేవల్లో పనిచేస్తున్న వారికి వర్తిస్తుందని చెప్పారు. కేసుల సంఖ్య పెరిగితే మూసివేత ఏదైనా గనిలో కేసుల సంఖ్య పెరుగుతున్నట్లయితే అక్కడ పనిచేసే కార్మికుల రక్షణ, ఆరోగ్యం దృష్ట్యా ఆ గనిని కొద్దికాలం పాటు మూసివేయడం జరుగుతుందని డైరెక్టర్ చంద్రశేఖర్ వెల్లడించారు. అలాగే గనుల మీద ఇప్పటినుండి రాబోయే రెండు నెలల కాలంపాటు ఏ కార్మిక సంఘం వారికి కూడా సమావేశాలకు అనుమతించబోమని స్పష్టం చేశారు. కరోనా వ్యాధి సోకిన వారికి ప్రత్యేక క్వారంటైన్ సెలవులను యాజమాన్యం మంజూరు చేస్తుందని ఆయన తెలిపారు. ఇన్ని చర్యలు యాజమాన్యం తీసుకుంటున్నందున కరోనాపై ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని ఆయన ధైర్యం చెప్పారు. -
కరోనా మేనేజ్మెంట్ కమిటీల ఏర్పాటు
సాక్షి, గుంటూరు: జిల్లాలో కరోనా పాజిటివ్ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో అధికారు లు ఆంక్షలను కఠినతరం చేస్తున్నారు. అడుగడుగునా నిబంధనలు విధిస్తూ గుంటూరు నగరంతో పాటు అన్ని ప్రాంతాలను అష్టదిగ్బంధం చేశారు. రెడ్‌జోన్ ఏరియాల్లో రాకపోకలను నియంత్రించా రు. ప్రజలకు అవసరమైన నిత్యావసరాలు, కూర గాయలు, పండ్లను ఇంటి ముంగిటకే చేర్చే ఏర్పా ట్లు చేస్తున్నారు. ఏప్రిల్ 14 తర్వాత లాక్డౌన్ ని బంధనలు సడలించినా రెడ్‌జోన్ ప్రాంతాల్లో మా త్రం కఠిన ఆంక్షలు కొనసాగించేలా చర్యలు తీసుకుంటున్నారు. మొబైల్ టీమ్‌ల ద్వారా శాంపిళ్ల సేకరణ ఢిల్లీకి వెళ్లి వచ్చిన వారితో పాటు, విదేశాల నుంచి వచ్చిన వారు స్వచ్ఛందంగా కరోనా నిర్ధారణ పరీక్షలు చేయించుకోవాలని, హోం క్వారంటైన్‌లోనే ఉండాలని, అవసరమైన వైద్య సేవలు అందిస్తామని అధికారులు చెబుతున్నారు. కరోనా అనుమానితులను క్వారంటైన్ సెంటర్లకు తరలించి మొబైల్ టీమ్‌ల ద్వారా శాంపిళ్లు సేకరిస్తున్నారు. గుంటూరు నగరంలో అణువణువునా రెండు ఫైర్ ఇంజిన్లు, ప్రత్యేక యంత్రాల ద్వారా సోడియం హైపో క్లోరైడ్ ద్రావణాన్ని పిచికారీ చేస్తున్నారు. గుంటూరులో కేసులు పెరుగుతున్న దృష్ట్యా నగరంలోకి రాకపోకలను నిలిపి వేస్తూ ఆదివారం జిల్లా కలెక్టర్ ఐ.శామ్యూల్ ఆనంద్‌కుమార్, అడిషనల్ డీజీ కృపానంద త్రిపాఠి, ఐజీ ప్రభాకరరావు, అర్బన్, రూరల్ ఎస్పీ విజయరావులు నిర్ణయం తీసుకున్నారు. కరోనా మేనేజ్మెంట్ కమిటీల ఏర్పాటు జిల్లాలో ఇప్పటికే 30 కరోనా కేసులు నమోదైన నేపథ్యంలో కరోనా ప్రభావిత ప్రాంతాల్లో ప్రత్యేకంగా కరోనా మేనేజ్మెంట్ కమిటీలు ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. ఇందులో ఆప్రాంతంలో ఉన్న పెద్దలు, పోలీసు, రెవెన్యూ, మున్సిపల్ అధికారులతో ప్రత్యేక కమిటీలు ఏర్పాటు చేసి ప్రజలను చైతన్యం చేయనున్నారు. కరోనా వ్యాప్తి జరుగకుండా నిరోధానికి తీసుకోవాల్సిన చర్యలను కమిటీల ద్వారా వివరించి ఆ ప్రాంతాల ప్రజల్లో చైతన్యం తీసుకొచ్చే దిశగా అడుగులు వేస్తున్నారు. జిల్లా వ్యాప్తంగా ఇప్పటికి 471 శాంపిళ్లను సేకరించి ల్యాబ్‌లకు పంపగా అందులో 30 పాజిటివ్‌గా వచ్చాయి. 377 నెగిటివ్ వచ్చాయి. మిగిలిన ఫలితాలు రావాల్సి ఉంది. ప్రైవేటు వైద్యులు, నర్సులు సహకరించాలి ప్రభుత్వం ప్రైవేటు ఆస్పత్రులు, అందులో పనిచేసే నర్సులు, పారామెడికల్ సిబ్బందిని అత్యవసర సరీ్వసుల కిందకు తెచ్చింది. ప్రైవేటు వైద్యులు, నర్సులు విధులకు గైర్హాజరైతే వారి లైసెన్సులు రద్దు చేస్తాం. ఎస్మాను ప్రయోగిస్తాం. దీంతో వారు ప్రాక్టీస్ చేసుకోవడంతోపాటు, ఉద్యోగం చేసుకునే అవకాశం కోల్పోతారు. కాబట్టి ప్రైవేటు వైద్యులు, నర్సులు, సిబ్బంది ప్రభుత్వానికి సహకరించాలి. దీంతో పాటు కరోనా వ్యాప్తి నివారణకు అన్ని చర్యలు తీసుకుంటున్నాం. కంటోన్మెంట్ ప్రాంతాల్లో ప్రజలను చైతన్యవంతం చేయడంతోపాటు, అక్కడ మెరుగైన చర్యలు తీసుకునే దిశగా అధికార యంత్రాంగాన్ని సన్నద్ధం చేస్తున్నాం. లాక్డౌన్ నిబంధనలు మరింత కఠినతరం చేస్తున్నాం. – ఐ.శామ్యూల్ ఆనంద్‌కుమార్, జిల్లా కలెక్టర్, గుంటూరు నేడు గుంటూరులో సంపూర్ణ లాక్డౌన్ సాక్షి, గుంటూరు: గుంటూరు నగరంలో సోమవారం సంపూర్ణ లాక్‌డౌన్‌ను విధిస్తున్నట్టు గుంటూరు రేండ్ ఐజీ ప్రభాకర్‌రావు చెప్పారు. బ్యాంకులు, రైల్వే, ఇతర కార్యాలయాలకు వెళ్లే వారిని ఉదయం 10 గంటలు, సాయంత్రం 4 నుంచి 6 గంటల మధ్యలోనే అనుమతిస్తామన్నారు. జిల్లాలో రెడ్ జోన్ ప్రాంతాల్లో లాక్‌డౌన్‌ను మరింత కఠినతరం చేసినట్టు సాక్షికి చెప్పారు. కరోనా పాజిటివ్ నమోదైన వారి నుంచి లోకల్ కాంటాక్ట్ కేసులు పెరుగుతున్నాయన్నారు. ఈ నేపథ్యంలో భద్రత మరింత పెంచామన్నారు. నగరానికి నాలుగు ఏపీఎస్పీ బెటాలియన్లు కేటాయించామన్నారు. ఢిల్లీ వెళ్లి వచ్చిన వారిలో ఎక్కువ మందికి కరోనా పాజిటివ్ వచ్చిందని, గతనెల 17వ తేదీ దురంతో, 20వ తేదీ ఏపీ ఎక్స్‌ప్రెస్‌లో ప్రయాణించిన వారు ఉంటే హోం ఐసోలేషన్‌లో ఉండాలని విజ్ఞప్తి చేశారు. ఆనారోగ్య సమస్యలు ఉంటే వెంటనే వైద్యులను సంప్రదించాలన్నారు. -
లాక్డౌన్: వలస కూలీలకు ‘రిలీఫ్’
కర్నూలు(సెంట్రల్): బతుకుదెరువు కోసం జిల్లాకు వలస వచ్చిన వివిధ రాష్ట్రాలకు చెందిన కూలీలకు విశ్రాంతి కేంద్రాలు ఊరట ఇస్తున్నాయి. లాక్డౌన్ నేపథ్యంలో పనుల్లేక, సొంతూళ్లకు వెళ్లే వీల్లేకపోవడంతో దిక్కుతోచని స్థితిలో పడ్డారు. ఈ తరుణంలో సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి వలస కూలీల కోసం రిలీఫ్ (నిరాశ్రయ) కేంద్రాలను ఏర్పాటు చేయాలని ఆదేశించారు. అందులో భాగంగా జిల్లాలో 63 కేంద్రాలను ఏర్పాటు చేశారు. వీటిలో 3,328 మంది ఆశ్రయం పొందుతున్నారు. రిలీఫ్ కేంద్రాల్లో వలస కూలీలు ఉండేందుకు అన్ని ఏర్పాట్లను అధికార యంత్రాంగం కలి్పంచింది. అంతేకాక జగనన్న గోరుముద్ద పథకంలో విద్యార్థులకు వడ్డించే మెనూ ప్రకారం భోజన వసతి కలి్పంచారు. జిల్లాలోని రిలీఫ్ కేంద్రాల్లో జార్ఖండ్‌కు చెందిన 817 మంది, బీహార్ 561, ఉత్తరప్రదేశ్ 259, మధ్యప్రదేశ్ 118, కర్ణాటక 74, రాజస్థాన్ 58, అస్సాం 34, తమిళనాడు 34, ఢిల్లీ 31, తెలంగాణ 24, చత్తీస్ఘడ్ 17, గుజరాత్ 9, పంజాబ్ 8, కేరళ 5, అరుణాచల్ ప్రదేశ్ 3, ఉత్తరాఖండ్‌కు చెందిన ఒక్కరు ఆశ్రయం పొందుతున్నారు. -
రికార్డు స్థాయిలో ధాన్యం దిగుబడులు
సాక్షి, హైదరాబాద్ : తెలంగాణ ఏర్పడ్డాక ఐదేళ్లలో ధాన్యం కొనుగోళ్లు 318 శాతం పెరిగాయని పౌరసరఫరాల సంస్థ చైర్మన్ మారెడ్డి శ్రీనివాస్‌రెడ్డి వెల్లడించారు. ఆయన బుధవారం వరి ధాన్యం విక్రయంపై రైతుల అవగాహన కోసం రూపొందించిన కరపత్రాన్ని కమిషనర్ అకున్ సబర్వాల్‌తో కలిసి విడుదల చేశారు. అనంతరం శ్రీనివాస్‌రెడ్డి మాట్లాడుతూ.. ఈ ఏడాది ధాన్యం కొనుగోళ్లు కోటి మెట్రిక్ టన్నులు దాటనుందని అంచనా వేశారు. ఖరీఫ్‌లో 60 లక్షలు, రబీలో 40 లక్షల టన్నుల ధాన్యం దిగుబడి వస్తుందని ఆశిస్తున్నామన్నారు. ప్రస్తుత ఖరీఫ్ సీజన్లో అధిక విస్తీర్ణంలో వరిసాగైనందున అందకు తగ్గట్టుగా రాష్ట్ర వ్యాప్తంగా 3327 కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. ప్రతీ కేంద్రానికి ఒక ఏఈఓను ఇన్చార్జిగా నియమించి, కొనుగోళ్లను పర్యవేక్షించేందుకు పౌరసరఫరాల శాఖలో మానిటరింగ్ సెల్‌ను ఏర్పాటు చేస్తున్నట్లు పేర్కొన్నారు. అంతేకాక, వ్యవసాయ శాఖ భాగస్వామ్యంతో తొలిసారి సమన్వయ కమిటీని నియమించినట్లు వెల్లడించారు. రైతులకు ఏమైనా ఫిర్యాదులుంటే టోల్‌ఫ్రీ నంబర్లకు ఫోన్ చేసి విషయాలు తెలుసుకోవచ్చని సూచించారు. -
పోలింగ్ కేంద్రాల్లో నో సెల్ఫీ
సాక్షి, కాజీపేట: సాంకేతికత పెరుగుతున్నా కొద్దీ వయస్సు తారతమ్యం లేకుండా సమయం, సందర్భం లేకుండా ప్రతిఒక్కరిలో సెల్ఫీల పిచ్చి నానాటికీ పెరుగుతుంది. పోలింగ్‌కేంద్రంలోకి వెళ్లిన తర్వాత ఎవరైనా ఓటు వేస్తూ సెల్ఫీ దిగడానికి ప్రయత్నించడం కుదరదు. ఒకవేళ ఎవరూ చూడడం లేదు కదా అని సెల్ఫీ దిగడానికి ప్రయత్నిస్తే ఎన్నికల కమిషన్ సీరియస్‌గా తీసుకుంటుంది. పోలింగ్ కేంద్రాల్లో సెల్ఫీలు పూర్తిగా నిషేధం. ఓటరు నిబంధనలకు విరుద్ధంగా చూపిస్తూ ఓటు వేసినట్లుగా గుర్తిస్తే అధికారులు వెంటనే 49ఎం (ఓటు రహస్యం) బహిర్గతం నియమం కింద బయటకు పంపిస్తారు. వేసిన ఓటును 17–ఏలో నమోదు చేస్తారు. ఓట్ల లెక్కింపు సమయంలో ఆ ఓటును పరిగణలోకి తీసుకోరు. రూల్‌నంబర్ 49 ఎన్ ప్రకారం అంధులైన ఓటర్లు తాము ఓటు వేయడానికి 18 ఏళ్లు దాటిన సహాయకున్ని Ððవెంట తీసుకొని వెళ్లవచ్చు. సహాయకుడు అతడి ఓటును బహిరంగపర్చనని నిబంధన 10లో ధ్రువీకరించాల్సి ఉంటుంది. -
పరీక్ష కేంద్రం మార్పుతో గందరగోళం
అనంతపురం ఎడ్యుకేషన్ : ముందస్తు సమాచారం లేకుండా గురుకుల పాఠశాలలో ఐదో తరగతి ప్రవేశాలకు ఏర్పాటు చేసిన పరీక్ష కేంద్రం మార్పు చేయడం గందరగోళానికి దారి తీసింది. వివరాల్లోకి వెళ్తే... గురుకుల పాఠశాలల్లో 2018–19 విద్యా సంవత్సరంలో ఐదో తరగతి ప్రవేశాలకు ఆదివారం పరీక్షలు నిర్వహించారు. అనంతపురం, తాడిపత్రి, గుత్తి, గుంతకల్లు, ఉరవకొండ, కదిరి తదితర ప్రాంతాలకు చెందిన 200 మంది విద్యార్థులను గుడిబండ బీసీ గురుకుల బాలికల పాఠశాల కేంద్రంలో పరీక్ష రాసేందుకు హాల్‌టికెట్లను జారీ చేశారు. దీంతో విద్యార్థులు ఆదివారం ఉదయం గుడిబండకు చేరుకున్నారు. ఉదయం 10.30 గంటలకు పరీక్ష ప్రారంభం కావాల్సి ఉంది. అయితే అక్కడ గురుకుల పాఠశాల లేదనే విషయం తెలుసుకున్న వారంతా గందరగోళానికి గురయ్యారు. గత ఏడాది ఇక్కడి గురుకుల పాఠశాలను మడకశిరకు మార్చినా.. అధికారులు పాత చిరునామాతోనే హాల్‌టికెట్లు జారీచేశారు. విషయం తెలుసుకున్న తల్లిదండ్రులు పిల్లలతో మడకశిరకు చేరుకున్నారు. అప్పటికే 11.15 గంటలుకాగా, పరీక్ష రాసేందుకు సిబ్బంది నిరాకరించారు. సర్దిచెప్పేందుకు ప్రయత్నించినా వారు వినకపోవడంతో తల్లిదండ్రులు ఆగ్రహంతో తిరగబడ్డారు. దీంతో ఆలస్యంగా విద్యార్థులను పరీక్షలకు అనుమతించారు. -
కార్యకర్తలు క్రమశిక్షణతో మెలగాలి
చింతలపాలెం (హుజూర్నగర్) : జనసేవాదళ్ కార్యకర్తలు క్రమశిక్షణ, నిబద్ధతో మెలగాలని సీపీఐ జిల్లా కార్యదర్శి గన్నా చంద్రశేఖర్ అన్నారు. మంగళవారం చింతలపాలెంలో సూర్యాపేట జిల్లా సీపీఐ జనసేవాదళ్, రెడ్ షర్ట్ వలంటీర్స్ శిక్షణ శిబిరాన్ని ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఏప్రిల్ 1 నుంచి 4వ తేదీ వరకు హైదరాబాద్‌లో నిర్వహించే సీపీఐ రాష్ట్ర 2వ మహాసభల్లో భాగంగా 1వ తేదీన బహిరంగ సభ నిర్వహిస్తున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో సీపీఐ జిల్లా కార్యవర్గ సభ్యులు ఉస్తేల నారాయణరెడ్డి, మేకల శ్రీనివాస్, పాలకూరి బాబు, కంబాల శ్రీనివాస్, రామలు, కొండా కోటయ్య, నాయకులు అబ్దుల్‌భాషా, మల్లయ్య, ఎల్లావుల రమేష్, జియాలుద్దీన్, భూకర్ణ, వీరబాబు, వెంకట్‌రెడ్డి, సైదులు, కోటిరెడ్డి, వెంకటేశ్వర్లు, భద్రారెడ్డి, కోటయ్య, రజాక్, శేఖర్, మణికంఠ, విక్రమ్ పాల్గొన్నారు. -
64 వేల ఎకరాల్లో పశుగ్రాస క్షేత్రాలు
కరప (కాకినాడ సిటీ) : జిల్లాలో పాల దిగుబడులు పెంచేందుకు 64 వేల ఎకరాల్లో గ్రామ గ్రామానా పశుక్షేత్రాలు ఏర్పాటు చేసేందుకు చర్యలు తీసుకుంటున్నామని పశు సంవర్ధక శాఖ జేడీ డాక్టర్ వి.వెంకటేశ్వరరావు తెలిపారు. స్థానిక పశు వైద్యశాలను శనివారం ఆయన ఆకస్మిక తనిఖీ చేసి కరప ఏడీ డాక్టర్ ఎస్.రూపకళ పనితీరుపై సంతృప్తి వ్యక్తం చేశారు. అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడుతూ జిల్లాలో మూడున్నర లక్షల పాడి పశువులుంటే 35 శాతమే పశుగ్రాసం లభ్యమవుతోందన్నారు. మిగిలిన 65 శాతం పశువుల మేత సమకూర్చేందుకు ఊరూరా పశుగ్రాస క్షేత్రాల ఏర్పాటుకు చర్యలు తీసుకుంటున్నామన్నారు. రైతులు, డ్వాక్రా మహిళలతో సొంత, కౌలుభూమిలో పచ్చిమేత పశుగ్రాసం పెంచి, రైతులకు కిలో రూపాయి చొప్పున పచ్చిమేత అమ్ముకునేలా చూస్తామన్నారు. ఇందుకు ఎకరాకు రూ.15,680 ఏడాదికి అందజేస్తామన్నారు. 15 టన్నుల సుగర్ గ్రేజ్ విత్తనాలు అన్ని పశువుల ఆస్పత్రులలో అందుబాటులో ఉన్నాయన్నారు. వీటిని రాయితీపై కిలో రూ.82లకే ఇస్తామన్నారు. ఎకరానికి 5 కిలోల విత్తనాలు సరిపోతాయన్నారు. అజోలా రకం కిట్టు 90 శాతం రాయితీపై రూ.325లకు ఇస్తామన్నారు. ఈ నాచురకం మేతలో 32 శాతం ప్రోటీసులు ఉంటాయన్నారు. రంపచోడవరం, రాజానగరం, రాజోలు, శంఖవరం మండలాలకు 4 సంచార పశు వైద్యశాలలు మంజూరైనట్టు ఆయన చెప్పారు. -
నేటి నుంచి ఇంటర్ సప్లమెంటరీ పరీక్షలు
– జిల్లాలో 80 పరీక్ష కేంద్రాల ఏర్పాటు - సెంటర్ల వద్ద 144 సెక్షన్ అమలు కర్నూలు సిటీ: ఇంటర్మీడియట్ సçప్లమెంటరీ పరీక్షలు సోమవారం నుంచి ప్రారంభం కానున్నాయి. ఇందుకు సంబంధించి ఇంటర్ బోర్డు ప్రాంతీయ కార్యాలయ అధికారులు ఏర్పాట్లు చేశారు. నేటి నుంచి 23వ తేది వరకు జరగనున్న పరీక్షలకు జిల్లాలో మొత్తం 80 కేంద్రాలను ఏర్పాటు చేశారు. ఉదయం 9 గంటల నుంచి 12 గంటల వరకు, మధ్యాహ్నం 2.30 గంటల నుంచి 5 గంటల వరకు పరీక్షలు జరుగుతాయి. పరీక్ష కేంద్రాల దగ్గర 144 సెక్షన్ అమలులో ఉంటుంది. జిల్లాలో మొదటి సంవత్సర పరీక్షలకు 29,272 మంది, రెండో సంవత్సర పరీక్షలకు 9549 మంది విద్యార్థులు హాజరుకానున్నారు. సెంటర్ల సమీపంలోని జిరాక్స్ కేంద్రాలను మూసి వేయించాలని ఇప్పటీకే అధికారులు ఆదేశాలు ఇచ్చారు. జిల్లాలో 12 సమస్యాత్మకమైన కేంద్రాలు ఉన్నట్లు గుర్తించారు. 11 కేంద్రాలకు సకాలంలో బస్సుల సౌకర్యం కల్పించేందుకు ఆర్టీసీ అధికారులతో మాట్లాడి బోర్డు అధికారులు చర్యలు తీసుకున్నారు. పరీక్ష సమయంలో కరెంట్ కట్ కాకుండా చర్యలు తీసుకోవాలని విద్యుత్ శాఖ అధికారులను కోరారు. ప్రతి కేంద్రంలో చీఫ్ సూపరింటెండెంట్ ఒకరు, డిపార్ట్మెంటల్ అధికారి ఒకరు ఉంటారు. ఆయా కేంద్రాల్లో విద్యార్థుల సంఖ్య ఆధారంగా ఇన్విజిలేటర్లను ఆ కేంద్ర పర్యవేక్షకులు నియమించుకుంటారు. -
మొగ్గ దశలో మగ్గుతూ ...
అంగన్వాడీ కేంద్రాల్లో ఫ్యాన్లు కరువు భయపెడుతున్న వేసవి ఎండలు ఇప్పటికే జిల్లాలో 42 డిగ్రీలకు చేరిన ఉష్ణోగ్రత జిల్లాలోఅంగన్‌వాడీ కేంద్రాలు 5,546 ఫ్యాన్ సౌకర్యం ఉన్న కేంద్రాలు 2,541 అంగ¯ŒSవాడీ కేంద్రాల్లో ఆటపాటలతో వికసించాలి్సన బాల్యం ఇరుకు గదుల్లో మగ్గిపోతోంది. కనీస వసతులు కరువై, గాలి, వెలుతురు లేని కేంద్రాల్లో ఇక్కట్ల పాలవ్వాల్సి వస్తోంది. ఒకే గదిలో ఆట వస్తువులు, సరుకులు నిల్వ చేయడం, అక్కడే విద్యాబుద్ధులు నేర్పాల్సి రావడం మధ్య దయనీయ స్థితిలో జిల్లాలోని అధికశాతం అంగ¯ŒSవాడీ కేంద్రాల నిర్వహణ సాగుతోంది. వేసవి ఎండలు పెరుగుతున్న నేపథ్యంలో చాలా కేంద్రాల్లో ఫ్యా¯ŒSలు లేకపోవడంతో చిన్నారులు కొద్ది సమయానికే నీరసించిపోతున్నారు. సాక్షి, రాజమహేంద్రవరం : ఎండల దెబ్బకు పెద్దలు, యువకులు బయట తిరగాలంటేనే ఒకటికి రెండుసార్లు ఆలోచిస్తున్నారు. అలాంటిది రెండు నుంచి నాలుగేళ్ల చిన్నారులు ఫ్యా¯ŒS గాలి లేకుండా అంగ¯ŒSవాడీ కేంద్రాల్లో ఉంటుండడంతో ఆరోగ్యరీత్యా ఇబ్బందులు పడుతున్నారు. జిల్లాలో 5,546 అంగ¯ŒSవాడీ కేంద్రాలు ఉన్నాయి. ఇందులో 1,602 కేంద్రాలు సొంత భవనాల్లో కొనసాగుతుండగా 3,446 కేంద్రాలు ప్రైవేటు భవనాల్లో నిర్వహిస్తున్నారు. మరో 498 కేంద్రాలు ప్రైవేటు భవనాల్లో నిర్వహిస్తున్నా వాటికి భవన యజమానులు అద్దెను మినహాయించారు. మొత్తం కేంద్రాలు 5,546లో సొంత భవనం ఉన్నవి 755, అద్దె కేంద్రాలు 1549, అద్దె మినహాయింపు ఉన్న ప్రైవేటు భవనాలు 137 కలిపి మొత్తం 2,541 అంగ¯ŒSవాడీ కేంద్రాల్లో ఫ్యాన్లు ఉన్నాయి. ఇంకా 3,005 అంగ¯ŒSవాడీ కేంద్రాల్లో ఫ్యాన్లు లేవు. రంపచోడవరం, చింతూరు ఐటీడీఏ పరిధిలో 905 కేంద్రాలు ఉండగా వీటిలో కనీసం ఒక్క కేంద్రంలోనూ ఫ్యాను సౌకర్యం లేదు. వేసవిలో మైదాన ప్రాంతాలే కాకుండా కొండలు అధికంగా ఉన్న ఏజెన్సీ ప్రాంతంలో అధిక ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. దీంతో గిరిజన పిల్లలు ఉక్కపోతతో అల్లాడిపోతున్నారు. భయపెడుతున్న మే నెల ఎండలు ప్రస్తుతం జిల్లాలో ఉష్ణోగ్రత 42 డిగ్రీలు నమోదవుతోంది. గత ఏడాది మే నెలలో జిల్లాలో 47 డిగ్రీల గరిష్ట ఉష్ణోగ్రత నమోదైంది. వడదెబ్బ వల్ల పలువురు మృత్యువాత పడ్డారు. ఈ ఏడాది ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలకు ఈ నెల 24 నుంచి వేసవి సెలవులు ఇచ్చారు. అయితే అంగ¯ŒSవాడీ కేంద్రాలు మాత్రం 365 రోజులు నిర్వహించాల్సి ఉంటుంది. టీచర్, ఆయాలకు ప్రభుత్వం ఈ ఏడాది సెలవులు మంజూరు చేసింది. మే నెల 1 నుంచి 15 వరకు టీచర్లకు, మే 16 నుంచి 31 వరకు ఆయాలకు పదిహేను రోజుల చొప్పున సెలవులు ఇచ్చేలా నిర్ణయం తీసుకుంది. మే నెల మొత్తం టీచర్, లేదా ఆయాతోనే కేంద్రం నిర్వహించాల్సి ఉంటుంది. ఉదయం 8 నుంచి 11 గంటల వరకు పిల్లలు కేంద్రాలలో ఉంటున్నారు. తర్వాత మధ్యాహ్నం మూడు గంటల వరకు పని ఉన్నా లేకపోయినా టీచరు, ఆయా కేంద్రంలో ఉండాలనే నిబంధన ప్రభుత్వం పెట్టింది. అత్యధిక ఎండలు ఆపై ఉక్కపోత, కేంద్రాలలో ఫ్యాను సౌకర్యం కూడా లేకపోవడంతో పిల్లలకు ఏమైనా అవుతుందేమోనన్న ఆందోళనలో టీచర్లు ఉన్నారు. చిన్నారులు వేసవిలో ఇబ్బందులు పడకుండా ఉండేందుకు అంగ¯ŒSవాడీ కేంద్రాలలో ఫ్యాన్లు ఏర్పాటు చేయాలని తల్లిదండ్రులు కోరుతున్నారు. స్థానిక సంస్థల నిధుల ద్వారా ఏర్పాటుకు చర్యలు స్థానిక సంస్థల 14వ ఆర్థిక సంఘం నిధుల ద్వారా వాటి పరిధిలోని అంగ¯ŒSవాడీ కేంద్రాల్లో ఫ్యాను, విద్యుత్, లైటు సౌకర్యం ఏర్పాటు చేయాలని ప్రభుత్వం ఆదేశించింది. కొన్ని పంచాయతీలు, మండల పరిషత్‌లలో నిధులు లేవని చెబుతున్నారు. 14వ ఆర్థిక సంఘం నిధులు లేవని చెబుతున్న స్థానిక సంస్థలను వాటి జనరల్ ఫండ్ నుంచి నిధులు ఇవ్వాలని అడుగుతున్నాం. వారు సహకరిస్తే త్వరలో అన్ని కేంద్రాలలో ఫ్యాను సౌకర్యం ఏర్పాటు చేస్తాం. సొంత భవనాలు నిర్మించేందుకు చర్యలు తీసుకుంటున్నాం. గత ఆర్థిక సంవత్సరంలో 536 భవనాలు మంజూరయ్యాయి. ఈ ఏడాది నూతన భవనాలు మంజూరుకానున్నాయి. – టి. శారదాదేవి, ఇ¯ŒSచార్జి పీడీ, ఐసీడీఎస్ -
రాజకీయ పునరావాస కేంద్రాలుగా ఆలయాలు
–శ్రీ విద్యాగణేశానంద మహాసంస్థానం పీఠాధిపతి విద్యాగణేశానంద భారతి రాజమహేంద్రవరం కల్చరల్ : రాజకీయ నిరుద్యోగులకు పునరావాస కేంద్రాలుగా ఆలయాలు మారుతున్నాయని హైదరాబాద్‌కు చెందిన శ్రీవిద్యాగణేశానంద మహాసంస్థానం పీఠాధిపతి విద్యాగణేశానందభారతి పేర్కొన్నారు. శుక్రవారం ఆయన గౌతమఘాట్‌లోని అయ్యప్పస్వామి ఆలయాన్ని దర్శించారు. ఆలయ కమిటీ గౌరవాధ్యక్షురాలు, వైఎస్సార్ సీపీ కేంద్రపాలకమండలి సభ్యురాలు జక్కంపూడి విజయలక్ష్మి ఆయనకు సాదరంగా ఆహ్వానం పలికారు. ఈ సందర్భంగా విద్యాగణేశానందభారతి మాట్లాడుతూ ఆలయాల నిర్వహణ ధార్మిక సంస్థలు, పీఠాల ఆధ్వర్యంలో ఉన్నప్పుడే సక్రమంగా నడుస్తుందన్నారు. ధర్మశాస్త్ర పరిజ్ఞానం లేనివారు, వేదవేదాంగాలను అధ్యయనం చేయనివారు, ఆచార సంప్రదాయాలు తెలియనివారు ఆలయ కమిటీలకు చైర్మన్లు, కార్యవర్గసభ్యులు అవుతున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ‘ఈ రంగాల్లో నిష్ణాతులు ప్రభుత్వం నియమించే ఆలయ కమిటీలలో ఒక్కరయినా ఉంటున్నారా? రాజరాజు, శ్రీకృష్ణదేవరాయలు, శివాజీ, చోళులు ఆలయాలను నిర్మించినా, నిర్వహణలో జోక్యం చేసుకోలేదు. బ్రాహ్మీముహూర్తంలో వచ్చి తొలిపూజ చేసుకుని వెళ్లిపోయేవారు. ఇప్పుడు అంతా అపసవ్యంగా ఉంది.’ అని విద్యాగణేశానంద భారతి తెలిపారు. అయ్యప్పస్వామి ఆలయం నగరానికే తలమానికంగా వెలుగొందుతోందని ఆయన హర్షం వ్యక్తం చేశారు. కోరుకొండ రెవిన్యూ డివిజనులో అధికారులు రిజిస్ట్రేషన్లు నిలిపివేసి, రైతుల జీవితాలతో ఎలా ఆడుకుంటున్నారో జక్కంపూడి విజయలక్ష్మి స్వామీజీకి వివరించారు. ప్రభుత్వ చర్యలను ఖండిస్తున్నానని విద్యాగణేశానంద భారతి అన్నారు. ఆదిశంకరుల షణ్మత పూజల్లో, గణేశ ఆరాధన అంతరించిపోతున్నదని, దీనిని పునరుద్ధరించడమే తన లక్ష్యమని ఆయన అన్నారు. ఆంధ్రపత్రిక సంపాదకుడు దివంగత శివలెంక శంభుప్రసాద్‌కు మూడో తరానికి చెందిన వ్యక్తినని ఆయన తెలిపారు. ధర్మశాస్తాసభ్యులు పాల్గొన్నారు. -
పల్స్ సర్వేకు ప్రత్యేక కేంద్రాలు
కర్నూలు(అగ్రికల్చర్): ప్రజాసాధికార సర్వే (పల్స్ సర్వే) కోసం ప్రత్యేక కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నట్లు జాయింట్ కలెక్టర్ హరికిరణ్ తెలిపారు. శనివారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ..కుటుంబంలోని ప్రతి ఒక్కరు తప్పని సరిగా సర్వే చేయించుకోవాలని సూచించారు. ప్రజాసాధికార సర్వే చేయించుకోని వారి కోసం తహసీల్దార్, మున్సిపల్ కార్యాలయాల్లో నమోదు కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు వివరించారు. సర్వేలో నమోదు కాని ప్రజలు ఆన్లైన్ ద్వారా సర్వే కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. -
‘పది’ పరీక్షలకు పకడ్బందీ ఏర్పాట్లు
- జిల్లా కలెక్టర్ విజయమోహన్ కర్నూలు సిటీ: పదో తరగతి పరీక్షలు ప్రశాంతంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేయాలని అధికారులను జిల్లా కలెక్టర్ చల్లా విజయమోహన్ ఆదేశించారు. శుక్రవారం పది పరీక్షల ఏర్పాట్లపై సమీక్ష నిర్వహించారు. మాస్ కాపీయింగ్‌కు ఆస్కారం లేకుండా చూడాలన్నారు. విద్యార్థులు.. పరీక్ష కేంద్రాలకు సరైన సమయానికి చేరుకునేందుకు అవసరమైన బస్సులు నడపాలన్నారు. పరీక్ష కేంద్రాల్లో మెడికల్ కిట్లు ఏర్పాటు చేయాలని సూచించారు. 144 సెక్షన్‌ను పకడ్బందీగా అమలు చేయాలన్నారు. తాగు నీరు, విద్యుత్ సౌకర్యం కల్పించాలన్నారు. ఈ నెల 17 నుంచి ఏప్రిల్ 1వ తేదీ వరకు జరుగనున్న పరీక్షలకు జిల్లాలో 240 కేంద్రాలను ఎంపిక చేశామని, మొత్తం 51,462 మంది విద్యార్థులు హాజరుకానున్నారని ఇన్చార్జీ డీఈఓ తాహెరా సుల్తానా.. కలెక్టర్‌కు వివరించారు. ఉత్తమ ఫలితాలు సాధించకుంటే సంబంధిత స్కూల్ ప్రధానోపాధ్యాయులపై చర్యలు తీసుకుంటామని కలెక్టర్ హెచ్చరించారు. ఏమైనా ఇబ్బందులు ఉంటే ఫిర్యాదులు చేసేందుకు కలెక్టరేట్లో హెల్ప్‌లైన్ ఏర్పాటు చేశామన్నారు. 08518–277309కు ఫోన్ చేయవచ్చన్నారు. సమావేశంలో చీఫ్ సూపరెండెంట్స్, ఆయా శాఖల అధికారులు పాల్గొన్నారు. -
ప్రశాంతంగా ఏపీపీఎస్సీ.. గ్రూప్–2 స్క్రీనింగ్ పరీక్ష
-
ప్రశాంతంగా గ్రూపు–2 పరీక్ష
–హాల్ టికెట్లు తీసుకున్న అభ్యర్థులు 56,200 –హాజరైన వారు 41,568 – 14,632 మంది గైర్హాజరు – దివ్యాంగులకు ప్రత్యేక ఏర్పాట్లు నిల్ -దూరంగా పరీక్షా కేంద్రాలు.. అభ్యర్థులకు తప్పని తిప్పలు –పరీక్ష కేంద్రాలను తనిఖీ చేసిన అధికారులు ఆదోని మండలానికి చెందిన వారికి ఆళ్లగడ్డ, ఆళ్లగడ్డకు చెందిన వారికి ఎమ్మిగనూరులో సెంటర్లు ఏర్పాటు చేయడంతో ఆయా పట్టణాల్లో పరీక్ష రాసేందుకు అభ్యర్థుల తలప్రాణం తోకకు వచ్చింది. కర్నూలు(అగ్రికల్చర్): గ్రూపు–2 ప్రిలిమ్స్(స్కీనింగ్ టెస్ట్) పరీక్ష ఆదివారం ప్రశాంతంగా జరిగింది. కర్నూలు(కల్లూరుతో సహా), నంద్యాల, డోన్, నందికొట్కూరు, ఆళ్లగడ్డ, బనగానపల్లె, కోవెలకుంట్ల, పాణ్యం, ఆదోని, ఎమ్మిగనూరుల్లో పరీక్ష కేంద్రాలు(152) ఏర్పాటు చేశారు. పరీక్షకు 56,200 మంది హాల్ టికెట్లు డౌన్లోడ్ చేసుకోగా 41,568 మంది హాజరయ్యారు. 14,632 మంది గైర్హాజరయ్యారు. పరీక్షకు 73.96 శాతం మంది హాజరయ్యారని జిల్లా రెవెన్యూ అధికారి గంగాధర్‌గౌడు తెలిపారు. సరిగ్గా 10 గంటలకు సెంటర్ల మెయిన్ గేట్లను మూసివేశారు. ఆలస్యంగా వచ్చారనే కారణంతో జిల్లా వ్యాప్తంగా 10 మందిని పరీక్ష కేంద్రంలోకి అనుమతించలేదు. రవీంద్ర విద్యానికేతన్, పాతబస్తీలోని కస్తూరి పాఠశాల కేంద్రాన్ని ఏపీపీఎస్సీ అసిస్టెంటు సెక్రటరీ అలివేలుమంగమ్మ, సెక్షన్ ఆఫీసర్ కృష్ణవేణి తనిఖీ చేశారు. పరీక్ష కేంద్రాలను 11 మంది కో ఆర్డినేషన్ అధికారులుగా నియమితులైన జిల్లా అధికారులు, లైజన్ అఫీసర్లు, అసిస్టెంటు లైజన్ ఆఫీసర్లు తనిఖీలు నిర్వహించారు. అన్ని పరీక్ష కేంద్రాల దగ్గర పోలీసు బందోబస్తు కల్పించారు. ప్రశ్నపత్రం సులభంగా వచ్చిందని అభ్యర్థులు అభిప్రాయపడుతున్నారు. రెవెన్యూ సిబ్బంది జాగరణ... పరీక్షను ఎక్కువ మంది రాస్తుండటం వల్ల ఈ సారి జిల్లా వ్యాప్తంగా పరీక్ష కేంద్రాలు ఏర్పాటు చేశారు. ప్రశ్నపత్రాలు, ఓఎంఆర్ షీట్లను కలెక్టరేట్లోని జిల్లా ట్రెజరీ కార్యాలయంలోనే భద్రపరిచారు. వీటిని పరీక్ష కేంద్రాలకు ఉదయం 8 గంటలకే చేర్చాల్సి ఉండటంతో రెవెన్యూ సిబ్బంది శనివారం రాత్రంతా విధులు నిర్వర్తించారు. ముందుగా అళ్లగడ్డ, తర్వాత కోవెలకుంట్ల, ఆదోని తదితర దూర ప్రాంతాలకు ప్రశ్నపత్రాలు, ఓఎంఆర్ షీట్లను పంపారు. డీఆర్ఓ గంగాధర్‌గౌడు, ఏపీపీఎస్సీ అధికారులు కలెక్టరేట్లోని ఉండి పర్యవేక్షించారు. పరీక్ష కేంద్రాలకు వెళ్లడానికి ఎన్ని ఇబ్బందులో.. పరీక్ష కేంద్రాలకు వెళ్లడానికి అభ్యర్థులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. ఆర్టీసీ బస్సులు శివరాత్రి వేడుకులకు వినియోగించడంతో సకాలంలో బస్సులు అందుబాటులోకి రాలేదు. దీంతో అభ్యర్థులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. దూరంగా సెంటర్లు ఉండడంతో అభ్యర్థులకు ఇక్కట్లు తప్పలేదు. చాలామంది ఆటోల్లో పరీక్షా కేంద్రాలకు చేరుకున్నారు. ప్రత్యేక ఏర్పాట్లుంటే ఒట్టు... దివ్యాంగులు, గర్భిణులకు కిందనే ప్రత్యేక రూముల్లో సీట్లు వేసి పరీక్ష రాయించాల్సి ఉంది. మొదటి, రెండవ అంతస్తుల్లో వెళ్లడానికి ఇబ్బందులు పడకుండా ఉండేందుకు ఏపీపీఎస్సీ ఈ మేరకు నిర్ణయం తీసుకుంది. అయితే ఎక్కడా ఈ సదుపాయం కలిపించలేదు. దీంతో దివ్యాంగులు, గర్భిణులు అవస్థలు పడ్డారు. పరీక్ష సజావుగా జరిగింది... గ్రూపు–2 ప్రిలిమ్స్ పరీక్ష ప్రశాంతంగా జరిగింది. నాలుగు రోజులుగా చేసిన కృషి ఫలించింది. పరీక్ష పకడ్బందీగా నిర్వహించేందుకు జిల్లా కలెక్టర్ సీహెచ్ విజయమోహన్, డీఆర్ఓ, కలెక్టరేట్ ఏఓ వెంకటనారాయణ సహకరించారు. అధికారుల సమష్టి కృషితో పరీక్ష సజావుగా ముగిసింది. -అలివేలుమంగమ్మ అసిస్టెంటు సెక్రటరీ, ఏపీపీఎస్సీ -
10 లోగా ధాన్యం కొనుగోలు కేంద్రాల ఏర్పాటు
జేసీ సత్యనారాయణ ఆదేశం కాకినాడ సిటీ : జిల్లాలో ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఈ నెల 10లోగా ఏర్పాటు చేయాలని జాయింట్ కలెక్టర్ ఎస్.సత్యనారాయణ ఆదేశించారు. కలెక్టరేట్ నుంచి శనివారం నిర్వహించిన వీడియో కాన్ఫరెన్సులో వివిధ అంశాలపై తహసీల్దార్లు, కొనుగోలు కేంద్రాల నిర్వాహకులతో సమీక్షించారు. గత సీజ¯ŒSలో వచ్చిన అభియోగాలు, అసంతృప్తులు పునరావృతం కాకూడదన్నారు. చౌకధరల దుకాణాల్లో నిత్యావసర వస్తువుల పంపిణీలో అవకతవకలు నిరోధించేందుకు ప్రతీరోజు రెవెన్యూ, పౌరసరఫరాల అధికారులు తనిఖీలు నిర్వహించి, ప్రభుత్వం నిర్దేశించిన నమూనాలో నివేదికలు అందజేయాలని సూచించారు. ప్రజాసాధికార సర్వే ప్రక్రియను త్వరిత గతిన పూర్తి చేయాలని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో డీఎస్ఓ ఉమామహేశ్వరరావు, పౌరసరఫరాల శాఖ డీఎం కృష్ణారావు, డీఆర్డీఏ పీడీ మల్లిబాబు, డీసీఓ ప్రవీణ, మార్కెటింగ్ శాఖ ఏడీ కిషోర్ తదితరులు పాల్గొన్నారు. -
ఉన్నతి’ని ఆశిస్తే.. ఉన్న కొలువుకే ఎసరు
ఉద్యోగభద్రతపై యూహెచ్‌సీల సిబ్బంది కలవరం నిర్వహణను ప్రైవేటు ఆస్పత్రులకు అప్పగించిన ప్రభుత్వం 16 ఏళ్ల సేవలకు గుర్తింపు ఇవ్వాలంటున్న ఉద్యోగులు సాక్షి, రాజమహేంద్రవరం : పట్టణ ఆరోగ్య కేంద్రాల్లో (యూహెచ్‌సీ) 16 ఏళ్లుగా కాంట్రాక్టు, అవుట్ సోర్సింగ్ పద్ధతిలో పని చేస్తూ, ఇన్నేళ్ల సర్వీసు కారణంగా కొలువు ఎన్నటికైనా ప్రభుత్వ ఉద్యోగం అవుతుందని, బతుక్కి భరోసా దక్కుతుందని ఆశిస్తున్న వారికి ఉన్న ఉద్యోగమైనా ఉంటుందా, ఊడుతుందా అన్న ఆందోళన పట్టుకుంది. పట్టణాల్లో మురికివాడల్లో నివసించే పేదలకు మెరుగైన వైద్యసేవలు అందించేందుకు 2000లో ఏర్పాటు చేసిన యూహెచ్‌సీల నిర్వహణను రాష్ట్ర ప్రభుత్వం అపోలో, ధనుష్ ఆస్పత్రులకు అప్పగించింది. ఆ కేంద్రాల్లో పని చేస్తున్న వారి ఉద్యోగాలకు ఎలాంటి భంగమూ ఉండదని ప్రభుత్వం చెబుతున్నా వారిలో అనేక అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. కార్పొరేట్ ఆస్పత్రుల నిర్వహణలోకి వచ్చిన తమను భవిష్యత్‌లో నిబంధనల మేరకు అర్హతలు, నైపుణ్యం లేవంటూ తొలగిస్తారేమోనన్న ఆందోళనలో ఆక్జిలరీ నర్స్ మిడ్వైఫ్ (ఏఎన్ఎం)లు, సీవోలు, వైద్య సహాయకులు ఉన్నారు. 19 కేంద్రాల్లో 95 మంది సిబ్బంది జిల్లాలో 19 యూహెచ్‌సీలు ఉండగా ఒక్కో కేంద్రంలో ఒక వైద్యుడు, ఇద్దరు ఏఎన్ఎంలు, ఒక సీవో, వైద్య సహాయకులు ఉన్నారు. జిల్లాలోని ఏడు పురపాలక సంఘాలు, కాకినాడ, రాజమహేంద్రరం కార్పొరేషన్ల పరిధిలోని మెుత్తం 19 కేంద్రాల్లో 95 మంది సిబ్బంది పని చేస్తున్నారు. వీటి నిర్వహణను చేపడుతున్న అపోలో, ధనుష్ సంస్థలు.. ‘ఇ–యూపీహెచ్సీ’ల పేరుతో పట్టణ పేదలకు వైద్య సేవలు అందించనున్నాయి. జిల్లాతో పాటు ఉత్తరాంధ్ర ప్రాంతంలోని యూహెచ్‌సీలను ధనుష్, మిగతా జిల్లాల్లో ఉన్న వాటిని అపోలో నిర్వహించనున్నాయి. ఆ రెండు సంస్థలూ మూడేళ్లపాటు ఈ సేవలు అందించనున్నాయి. ఇ–యూపీహెచ్సీల నిర్వహణకు అవసరమయ్యే నిధులు జాతీయ పట్టణ ఆరోగ్యమిషన్ (ఎన్యూహెచ్ఎం) ద్వారా కేటాయిస్తారు. ప్రస్తుతమున్న సేవలతోపాటు ప్రాథమిక ఆరోగ్య రక్షణ, టెలీ మెడిసిన్ సదుపాయాలు పట్టణ పేదలకు అందుబాటులోకి రానున్నాయి. ప్రయోగశాల, జనరల్ ప్రాక్టీషనర్, నర్సింగ్ సేవలను అదనంగా కల్పించనున్నారు. కొందరిని తొలగించిన ‘అపోలో’ అయితే ధనుష్ సంస్థ అప్పటికే ఉన్న సిబ్బందిని కొనసాగిస్తుండగా, అపోలో మాత్రం తమ పరిధిలోని యూహెచ్‌సీల్లో కొంత మందిని తొలగించింది. సిబ్బంది ఆందోళన చేయడంతో తొలగించిన వారిలో కొందరిని తిరిగి తీసుకుంది. ఇలాంటి పరిస్థితి భవిష్యత్‌లో ఉత్పన్నమైతే తమ బతుకులు అగమ్యగోచరంగా తయారవుతాయని సిబ్బంది వాపోతున్నారు. ఇప్పటి వరకూ ఈ కేంద్రాల్లో పని చేస్తూ వచ్చిన సిబ్బంది సగటు వయస్సు 40కి పైగా ఉందని, తమకు మరో ఉద్యోగం వచ్చే అవకాశం ఉండదని కలవరపడుతున్నారు. 2006లో 90 శాతం ప్రభుత్వోద్యోగాలు యూహెచ్‌సీలను 2000లో ప్రభుత్వ ప్రైవేటు భాగస్వామ్యంలో ప్రవేశపెట్టిన ప్రభుత్వం వీటి నిర్వహణను స్థానిక ఎన్జీవోలకు అప్పగించింది. సిబ్బందిని కాంట్రాక్ట్, అవుట్ సోర్సింగ్ విధానంలో నియమించింది. ఇక్కడ పని చేస్తున్న సిబ్బందికి ప్రతిభ, పని చే సిన కాలం ఆధారంగా ప్రభుత్వోద్యోగాల భర్తీలో రిజర్వేషన్ లభించింది. 2006లో దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, ఏరియా ఆస్పత్రులు, జిల్లా ఆస్పత్రుల్లో ఏఎన్ఎం పోస్టులను భర్తీ చేశారు. ఆ సమయంలో యూహెచ్‌సీల్లో పని చేస్తున్న ఏఎన్‌ఎంలలో దాదాపు 90 శాతం మందికి ప్రభుత్వోద్యోగాలు వచ్చాయి. ఇదే ఆశతో ప్రతి నెలా అరకొర జీతాలు కూడా రాకున్నా 16 ఏళ్లుగా పని చేస్తున్నారు. ఇప్పుడు కేంద్రాల నిర్వహణ ప్రైవేటు సంస్థల పరిధిలోకి వెళితే ఇన్నేళ్లూ తాము చేసిన సేవలకు గుర్తింపు లేకుండా పోతుందని సిబ్బంది ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటి వరకూ తాము చేసిన సేవలకు ప్రత్యేక గుర్తింపు ఇవ్వాలని, భవిష్యత్తులో భర్తీ చేయబోయే పోస్టుల్లో గతంలో లాగే తమకు ప్రాధాన్యం ఇవ్వాలని కోరుతున్నారు. -
ఉన్నతి’ని ఆశిస్తే.. ఉన్న కొలువుకే ఎసరు!
ఉద్యోగభద్రతపై యూహెచ్‌సీల సిబ్బంది కలవరం నిర్వహణను ప్రైవేటు ఆస్పత్రులకు అప్పగించిన ప్రభుత్వం 16 ఏళ్ల సేవలకు గుర్తింపు ఇవ్వాలంటున్న ఉద్యోగులు సాక్షి, రాజమహేంద్రవరం : పట్టణ ఆరోగ్య కేంద్రాల్లో (యూహెచ్‌సీ) 16 ఏళ్లుగా కాంట్రాక్టు, అవుట్ సోర్సింగ్ పద్ధతిలో పని చేస్తూ, ఇన్నేళ్ల సర్వీసు కారణంగా కొలువు ఎన్నటికైనా ప్రభుత్వ ఉద్యోగం అవుతుందని, బతుక్కి భరోసా దక్కుతుందని ఆశిస్తున్న వారికి ఉన్న ఉద్యోగమైనా ఉంటుందా, ఊడుతుందా అన్న ఆందోళన పట్టుకుంది. పట్టణాల్లో మురికివాడల్లో నివసించే పేదలకు మెరుగైన వైద్యసేవలు అందించేందుకు 2000లో ఏర్పాటు చేసిన యూహెచ్‌సీల నిర్వహణను రాష్ట్ర ప్రభుత్వం అపోలో, ధనుష్ ఆస్పత్రులకు అప్పగించింది. ఆ కేంద్రాల్లో పని చేస్తున్న వారి ఉద్యోగాలకు ఎలాంటి భంగమూ ఉండదని ప్రభుత్వం చెబుతున్నా వారిలో అనేక అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. కార్పొరేట్ ఆస్పత్రుల నిర్వహణలోకి వచ్చిన తమను భవిష్యత్‌లో నిబంధనల మేరకు అర్హతలు, నైపుణ్యం లేవంటూ తొలగిస్తారేమోనన్న ఆందోళనలో ఆక్జిలరీ నర్స్ మిడ్వైఫ్ (ఏఎన్ఎం)లు, సీవోలు, వైద్య సహాయకులు ఉన్నారు. 19 కేంద్రాల్లో 95 మంది సిబ్బంది జిల్లాలో 19 యూహెచ్‌సీలు ఉండగా ఒక్కో కేంద్రంలో ఒక వైద్యుడు, ఇద్దరు ఏఎన్ఎంలు, ఒక సీవో, వైద్య సహాయకులు ఉన్నారు. జిల్లాలోని ఏడు పురపాలక సంఘాలు, కాకినాడ, రాజమహేంద్రరం కార్పొరేషన్ల పరిధిలోని మెుత్తం 19 కేంద్రాల్లో 95 మంది సిబ్బంది పని చేస్తున్నారు. వీటి నిర్వహణను చేపడుతున్న అపోలో, ధనుష్ సంస్థలు.. ‘ఇ–యూపీహెచ్సీ’ల పేరుతో పట్టణ పేదలకు వైద్య సేవలు అందించనున్నాయి. జిల్లాతో పాటు ఉత్తరాంధ్ర ప్రాంతంలోని యూహెచ్‌సీలను ధనుష్, మిగతా జిల్లాల్లో ఉన్న వాటిని అపోలో నిర్వహించనున్నాయి. ఆ రెండు సంస్థలూ మూడేళ్లపాటు ఈ సేవలు అందించనున్నాయి. ఇ–యూపీహెచ్సీల నిర్వహణకు అవసరమయ్యే నిధులు జాతీయ పట్టణ ఆరోగ్యమిషన్ (ఎన్యూహెచ్ఎం) ద్వారా కేటాయిస్తారు. ప్రస్తుతమున్న సేవలతోపాటు ప్రాథమిక ఆరోగ్య రక్షణ, టెలీ మెడిసిన్ సదుపాయాలు పట్టణ పేదలకు అందుబాటులోకి రానున్నాయి. ప్రయోగశాల, జనరల్ ప్రాక్టీషనర్, నర్సింగ్ సేవలను అదనంగా కల్పించనున్నారు. కొందరిని తొలగించిన ‘అపోలో’ అయితే ధనుష్ సంస్థ అప్పటికే ఉన్న సిబ్బందిని కొనసాగిస్తుండగా, అపోలో మాత్రం తమ పరిధిలోని యూహెచ్‌సీల్లో కొంత మందిని తొలగించింది. సిబ్బంది ఆందోళన చేయడంతో తొలగించిన వారిలో కొందరిని తిరిగి తీసుకుంది. ఇలాంటి పరిస్థితి భవిష్యత్‌లో ఉత్పన్నమైతే తమ బతుకులు అగమ్యగోచరంగా తయారవుతాయని సిబ్బంది వాపోతున్నారు. ఇప్పటి వరకూ ఈ కేంద్రాల్లో పని చేస్తూ వచ్చిన సిబ్బంది సగటు వయస్సు 40కి పైగా ఉందని, తమకు మరో ఉద్యోగం వచ్చే అవకాశం ఉండదని కలవరపడుతున్నారు. 2006లో 90 శాతం ప్రభుత్వోద్యోగాలు యూహెచ్‌సీలను 2000లో ప్రభుత్వ ప్రైవేటు భాగస్వామ్యంలో ప్రవేశపెట్టిన ప్రభుత్వం వీటి నిర్వహణను స్థానిక ఎన్జీవోలకు అప్పగించింది. సిబ్బందిని కాంట్రాక్ట్, అవుట్ సోర్సింగ్ విధానంలో నియమించింది. ఇక్కడ పని చేస్తున్న సిబ్బందికి ప్రతిభ, పని చే సిన కాలం ఆధారంగా ప్రభుత్వోద్యోగాల భర్తీలో రిజర్వేషన్ లభించింది. 2006లో దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, ఏరియా ఆస్పత్రులు, జిల్లా ఆస్పత్రుల్లో ఏఎన్ఎం పోస్టులను భర్తీ చేశారు. ఆ సమయంలో యూహెచ్‌సీల్లో పని చేస్తున్న ఏఎన్‌ఎంలలో దాదాపు 90 శాతం మందికి ప్రభుత్వోద్యోగాలు వచ్చాయి. ఇదే ఆశతో ప్రతి నెలా అరకొర జీతాలు కూడా రాకున్నా 16 ఏళ్లుగా పని చేస్తున్నారు. ఇప్పుడు కేంద్రాల నిర్వహణ ప్రైవేటు సంస్థల పరిధిలోకి వెళితే ఇన్నేళ్లూ తాము చేసిన సేవలకు గుర్తింపు లేకుండా పోతుందని సిబ్బంది ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటి వరకూ తాము చేసిన సేవలకు ప్రత్యేక గుర్తింపు ఇవ్వాలని, భవిష్యత్తులో భర్తీ చేయబోయే పోస్టుల్లో గతంలో లాగే తమకు ప్రాధాన్యం ఇవ్వాలని కోరుతున్నారు. -
రూ.250 కోట్లతో దేశీయ ఆవుల పునరుత్పత్తి కేంద్రం
పశుగణాభివృద్ధి సంస్థ చైర్మన్ దొరబాబు చెల్లూరు(రాయవరం) : దేశీయ ఆవుల పరిరక్షణ కు నెల్లూరు జిల్లాలోని చింతలదీవిలో రూ.250 కోట్లతో పునరుత్పత్తి కేంద్రాన్ని ఏర్పాటు చేసినట్లు రాష్ట్ర పశుగణాభివృద్ధి సంస్థ చైర్మన్ యాళ్ల దొరబాబు తెలిపారు. మండలంలోని చెల్లూరులో బీజేపీ నేత ముత్యాల పుల్లయ్యచౌదరి ఇంట్లో శనివారం జరిగిన బీజేపీ నేతల సమావేశంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన విలేకరులతో మాట్లాడుతూ 2,400 ఎకరాల్లో ఏర్పాటు చేస్తున్న ఈ కేంద్రానికి ఇప్పటికే రూ.25 కోట్లు మంజూరైందని, ఈ కేంద్రంలో ఒంగోలు, పుంగనూరు, సాహివాల్, గిర్, తదితర దేశీయ ఆవుల పరిరక్షణకు కృషి చేస్తున్నట్లు చెప్పారు. గుంటూరు జిల్లా నకిరేకల్ వద్ద పిండమార్పిడి విధానం అభివృద్ధికి, మేలుజాతి దూడల ఉత్పత్తికి కర్నూలు జిల్లా బన్వాసి, నంధ్యాల, విశాఖపట్నంలోని హనుమంతవాకలో సెమన్ బ్యాంక్స్ ఏర్పాటు చేశామన్నారు. ఏటా 40 లక్షల ఏఐ(ఆర్టిఫిషియల్ ఇనుస్ట్రుమెంట్) ఉత్పత్తి చేస్తున్నట్లు చెప్పారు. రాష్ట్రంలో ఉన్న 2,400 మంది గోపాలమిత్రలకు అందజేసే గౌరవ వేతనం పెంచేందుకు కృషిచేస్తున్నట్లు దొరబాబు తెలిపారు. పశువుల పాల, అందాల ఈ పోటీల నిర్వహణకు జిల్లా స్థాయిలో రూ.3 లక్షలు, రాష్ట్ర స్థాయిలో రూ.6 లక్షలు మంజూరు చేస్తున్నట్లు పేర్కొన్నారు. గత నెల పశ్చిమగోదావరి జిల్లా ద్వారకాతిరుమలలో పశువుల పాల, అందాల పోటీలు నిర్వహించామన్నారు. -
ఊరూరా పశుగ్రాస క్షేత్రాలు
–పశుసంవర్ధక శాఖ జేడీ సుదర్శన్ కుమార్ కర్నూలు(అగ్రికల్చర్): ఊరూరా పశుగ్రాస క్షేత్రాలు ఏర్పాటుకు ప్రత్యేక చర్యలు తీసుకోవాలని పశువైద్యులు, ఏడీలను ఆ శాఖ జాయింట్ డైరెక్టర్ డాక్టర్ సుదర్శన్‌కుమార్ ఆదేశించారు. శుక్రవారం బహుళార్ద పశువైద్యశాలలో జిల్లాలోని పశువైద్యులు, సహాయ సంచాలకులతో సమావేశం నిర్వహించారు. విజయ దశిమి తర్వాత పశుగ్రాస క్షేత్రాలు ప్రారంభం కావాలన్నారు. ఎంత మంది రైతులు పచ్చి మేత తీసుకుంటారో గుర్తించాలని తెలిపారు. దాణామృతం ప్రాధాన్యతను రైతులకు వివరించాలని, ఏ మండలానికి ఎంత కావాలో నివేదిక ఇవ్వాలన్నారు. పశు సంవర్ధకశాఖ కార్యక్రమాలను ఆన్లైన్లో నమోదు చేయాలన్నారు. సమావేశంలో డీడీ చిన్నయ్య, కర్నూలు ఏడీ సీవీ రమణయ్య, ఆదోని ఏడీ పి.రమణయ్య, నంద్యాల ఏడీ రమణ, ఆళ్లగడ్డ ఏడీ వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు. -
సాంకేతికతో భూసార పరీక్షా కేంద్రాలు బలోపేతం
నేషనల్ ప్రొడక్టివిటీ కౌన్సిల్ డీడీ రజిత్ శర్మ తుని రూరల్ : భూసార పరీక్షా కేంద్రాల బలోపేతానికి సాంకేతిక పరిజ్ఞానంతో ఆధునికీకరించాల్సిన అవసరం ఉందని నేషనల్ ప్రొడక్టివిటీ కౌన్సిల్ డిప్యూటీ డైరెక్టర్ రజిత్ శర్మ అన్నారు. రెండో రోజు జిల్లా పర్యటనలో భాగంగా శుక్రవారం తుని మార్కెట్ యార్డులో భూసార పరీక్ష కేంద్రాన్ని ఆయన పరిశీలించారు. వసతులు, సిబ్బంది, పరికరాల సమాచారం తెలుసుకున్నారు. ఈ సందర్భంగా విలేకరులతో మాట్లాడుతూ సిబ్బంది కొరత, అరకొర వసతులు, పరీక్షలకు అవసరమైన ముడి సరుకు ఇబ్బందులున్నాయన్నారు. ఇందుకు అవసరమైన, భూసార పరీక్ష కేంద్రాలు బలోపేతానికి ప్రతిపాదనలను ప్రభుత్వానికి నివేదిస్తామన్నారు. జిల్లాలో ఉన్న ఆరు భూసార పరీక్ష కేంద్రాలను పరిశీలించి, నివేదికలను అందజేస్తామన్నారు. భూసార పరీక్షలపై కోటనందూరు మండలం బొద్దవరం రైతులతో చర్చించినట్టు ఆయన తెలిపారు. వివిధ ప్రాజెక్టుల ద్వారా అందుతున్న సాగునీటి పరీక్షలు చేసి భూసారానికి అనుగుణంగా ఎరువులను సిపార్సు చేయాలని రైతులు కోరినట్టు రజిత్ శర్మ తెలిపారు. జిల్లాలో 62 మండలాల్లో 53,648 మట్టి నమూనాలు సేకరించి భూసార పరీక్షలు చేసినట్టు వ్యవసాయశాఖ జిల్లా డీడీ కె.లక్ష్మణరావు తెలిపారు. ఏడీఏ మల్లికార్జునరావు, ఏఓలు వాణీ, సౌజన్య పాల్గొన్నారు. -
సాక్షరభారత్ కేంద్రాలకు కొత్త ఫర్నిచర్
నర్వ : మండల పరిధిలోని గ్రామాల్లో కొనసాగుతున్న సాక్షరభారత్ కేంద్రాలకు ప్రభుత్వం నుంచి నూతన ఫర్నిచర్ మంజూరైందని ఎంపీడీఓ రాఘవ తెలిపారు. సోమవారం మండల కేంద్రానికి చేరుకున్న ఫర్నీచర్‌ను మండల మహిళా సమాఖ్య భవనంలో భద్ర పరిచారు. ఎంపీడీఓ మాట్లాడుతూ ఒక్కో సాక్షరభారత్ కేంద్రానికి ఒక్క కుర్చీ, ఒక్క టేబుల్, బ్లాక్ బోర్డు, సాక్షరభారత్ కేంద్రానికి సంబంధించిన సూచికబోర్డులు వచ్చాయన్నారు. వీటితో పాటు టార్చిలైటును కూడా అందిస్తున్నామన్నారు. వయోజనులకు విద్యనందించాలన్న లక్ష్యంతో ప్రభుత్వం సాక్షరభారత్ కేంద్రాలకు నిధులు మంజూరుచేసి అవసరమైన ఫర్నిచర్‌ను ఇస్తున్నామన్నారు. ఫర్నిచర్ సాక్షరభారత్ కేంద్రాలలో లేదా గ్రామపంచాయతీ ఆధీనంలో ఉండేవిధంగా చర్యలు తీసుకుంటున్నామని అన్నారు. ఎంపీడీఓ వెంట సాక్షరభారత్ మండల కోఆర్డినేటర్ అనురాధ ఉన్నారు. -
కల్తీలపై టాస్క్‌ఫోర్స్ కన్నెర్ర
కారం పొడి తయారీ గోదాముపై దాడులు లక్షల విలువైన సరుకు స్వాధీనం పోలీసుల అందుపులో నిందితుడు విజయవాడ(చిట్టినగర్) : కల్తీలపై టాస్క్‌ఫోర్స్ అధికారులు కన్నెర్ర చేశారు. అనుమతులు లేకుండా యథేచ్ఛగా కల్తీ సరుకు తయారీ చేసి విక్రయిస్తున్న గోదాముపై దాడి చేశారు. రెండు లక్షలపైగా విలువైన సరుకు, యంత్రాలను స్వాధీనం చేసుకున్నారు. నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. వివరాలు.. చిట్టినగర్ ప్రాంతానికి చెందిన వనమా జనార్దన్ రెండేళ్లుగా పాముల కాలువ సమీపంలోని పొలాల్లో ఓ రేకులషెడ్డును అద్దెకు తీసుకుని నీలిమ బ్రాండ్ పేరిట వివిధ రకాల కారం పొడులను తయారు చేసే యూనిట్ ఏర్పాటు చేశాడు. 15 రకాల పొడులు తయారు చేయిస్తూ విక్రయిస్తున్నాడు. సరుకులో నాణ్యత లేకపోవడంతో టాస్క్‌ఫోర్స్‌కు వినియోగదారులు సమాచారం అందించారు. దీంతో టాస్క్‌ఫోర్స్ ఏసీపీ ప్రసాద్ ఆధ్వర్యంలో ఎస్ఐ శ్రీనివాస్ యూనిట్‌ను బుధవారం తనిఖీ చేశారు. కల్లీ వ్యవహారం బయటపడింది. వ్యర్థాలతోనూ.. ఇడ్లీ కారం పొడిలో మిరపకాయల తొడేలతో పాటు తెల్ల మిరపకాయలు, వాటి కొమ్మలను కూడా పొడి చేసి తయారీలో వినియోగిస్తున్నట్లు నిందితుడు అంగీకరించాడు. కాకర కాయ, కరివేపాకు ఇలాంటి వాటిలో చెట్టు కొమ్మలను పొడిగా చేసి కలిపేస్తున్నట్లు చెప్పుకొచ్చాడు. కొమ్మల నుంచి వాసన రాకుండా చింతపండు పులుసు, రుచి కోసం టేస్టింగ్ సాల్ట్‌లను కలుపుతున్నట్లు పేర్కొన్నాడు. కొత్తపేట ఎస్ఐ సుబ్బారావు నిందితుడి నుంచి పూర్తి వివరాలు నమోదు చేశారు. -
200 స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ల ఏర్పాటు!
ఘంటా సుబ్బారావు వెల్లడి మచిలీపట్నం టౌన్ : విద్యార్థుల్లో కమ్యూనికేషన్ స్కిల్స్‌ను పెంపొందించేందుకు కళాశాలల యాజమాన్యాలు చొరవ చూపాలని ఏపీ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ కమిషనర్ ఘంటా సుబ్బారావు అన్నారు. కార్పొరేషన్ ఆధ్వర్యంలో శుక్రవారం స్థానిక సిరి కళ్యాణ మండపంలో జిల్లాలోని డిగ్రీ కళాశాలల కరస్పాండెంట్లు, సెక్రటరీలు, ప్రిన్సిపల్స్‌కు అవగాహనా సదస్సును నిర్వహించారు. రాష్ట్రంలోని 13 జిల్లాల్లోనూ 200 స్కిల్ డెవలప్మెంట్ సెంటర్లను ఏర్పాటు చేసి వాటి ద్వారా విద్యార్థులకు అవగాహనా కార్యక్రమాలను నిర్వహించనున్నామన్నారు. గ్రామీణ ప్రాంత విద్యార్థుల్లో కమ్యూనికేషన్ స్కిల్స్ తక్కువగా ఉంటున్నాయని అన్నారు. రాష్ట్రంలో ఈ యేడాది 2.5 లక్షల మందికి నైపుణ్య వృద్ధి చేయాలని నిర్ణయించామన్నారు. కృష్ణా యూనివర్శిటీ వైస్‌ఛాన్స్‌లర్ సుంకరి రామకృష్ణారావు మాట్లాడుతూ మంచి కమ్యూనికేషన్ స్కిల్స్ ఉంటే ఏ కంపెనీలోనైనా ఉద్యోగం సంపాదించవచ్చన్నారు. రిజిష్ట్రార్ డి సూర్యచంద్రరావు పాల్గొన్నారు. -
అద్దె ఇళ్లల్లో అంగన్వాడీ కేంద్రాలు
–మునగాలలో 50కేంద్రాలకు 15మాత్రమే పక్కాభవనాలే –ఇబ్బందులు పడుతున్న సిబ్బంది, చిన్నారులు మునగాల: మండలంలో ఐసీడీఎస్ ప్రాజెక్ట్ పరిధిలో నిర్వహిస్తున్న పలు అంగన్వాడీ కేంద్రాలు అద్దె భవనాలల్లోనే కొనసాగుతున్నాయి. సరిౖయెన వసతి సౌకర్యాలు లేకపోవడంతో చిన్నారులు, గర్భిణీలు, సిబ్బంది నిత్యం ఇబ్బందులు పడుతున్నారు. మండలంలో 50అంగన్వాడీ కేంద్రాలుండగా వీటిలో కేవలం 15 కేంద్రాలకు మాత్రమే సొంత భవనాలున్నాయి. మండలంలోని ఆకుపామల, ముకుందాపురం, బరాఖత్‌గూడెం–1,2, గణపవరం, తిమ్మారెడ్డిగూడెం, కొక్కిరేణి, నారాయణగూడెం, మునగాల–1,3,4, తాడువాయి, వెంకట్రాంపురం, నేలమర్రి, విజయరాఘవపురం గ్రామాల్లోమాత్రమే పక్కా భవనాలు ఉన్నాయి. మిగిలిన కేంద్రాలు అద్దె ఇళ్లల్లో నడుస్తున్నాయి. ఇళ్లను అద్దెకు తీసుకోవడంతో సదరు ఇళ్లల్లో వసతి సౌకర్యాలు అంతంత మాత్రమే ఉంటున్నాయి. ఇదిలా ఉండగా మండల కేంద్రంలో బొడ్రాయి వద్ద 2014లో దాదాపు రూ.4లక్షల నిధులతో నిర్మించిన అంగన్వాడీ కేంద్రం భవనం నేటికి ప్రారంభం కాకపోడంతో నిరూపయోగంగా ఉంది. దీంతో పక్కనే ఉన్న ఓ వ్యాపారి ఈ భవనాన్ని స్టోర్‌రూంగా వాడుకుంటున్నాడు. ఈ ప్రాంతంలో అంగన్వాడీ కేంద్రానికి సంబంధించిన చిన్నారులు లేకపోవడంతో ఈ భవనం నేటికి నిరూపయోగంగా ఉంది. ప్రస్తుతం ప్రైవేటు వ్యక్తుల ఆధీనంలో ఉన్న ఈ భవనాన్ని గ్రామ పంచాయతీ స్వాధీనం చేసుకొని పలువురికి ఉపయోగపడేలా చర్యలు తీసుకోవాలని, ప్రతి అంగన్ వాడీ కేంద్రానికి సొంత భవన నిర్మాణం చేపట్టాలని ఆయా గ్రామాల ప్రజలు కోరుతున్నారు. -
గ్రంథాలయాలు విజ్ఞాన బాండగారాలు
కొమరబండ(కోదాడరూరల్): గ్రంథాలయాలు విజ్ఞాన బాండగారాలని విశాఖపట్టణం జాయింట్ కలెక్టర్ లోతెట్టి శివశంకర్ అన్నారు. బుధవారం మండల పరిధిలోని కొమరబండలో యువశక్తి యువజన సంఘం ఆధ్వర్యంలో నూతనంగా నిర్మించిన గ్రంథాలయాన్ని ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ యువజన సంఘం ఆధ్వర్యంలో గ్రంథాలయాన్ని నిర్మించడం అభినందనీయమన్నారు . విద్యార్థులు, యువకులు, విద్యావంతులు ఇలాంటి గ్రంథలయాలను సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ కల్యాణ్‌చక్రవర్తి, డాక్టర్ పెంటయ్య, ఎసీటీఓ రవీందర్, యువజనసంఘ సభ్యులు పాల్గొన్నారు. -
158 పంచాయతీల్లో మీ– సేవ కేంద్రాలు
అనంతపురం అర్బన్ : జిల్లాలోని అన్ని గ్రామ పంచాయతీల్లో మీ– సేవ కేంద్రాల ఏర్పాటు చేసేందుకు ప్రభుత్వం నిర్ణయించదని జాయింట్ కలెక్టర్ బి.లక్ష్మికాంతం తెలిపారు. ఇందుకు సంబంధించిన వివరాలను సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. ప్రస్తుతం మీ–సేవ∙కేంద్రాలు ఉన్న గ్రామ పంచాయతీలను మినహాయించి 158 పంచాయతీల్లో ఏర్పాటు చేసేందుకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నామన్నారు. ఆసక్తి ఉన్న వారు ఈ నెల 10వ తేదీలోగా దరఖాస్తు చేసుకోవాలని పేర్కొన్నారు. -
నిర్మించారు..వదిలేశారు
–లక్షలు వెచ్చించి నిర్మించిన భవనాలు నిరుపయోగం –అధికారుల నిర్లక్ష్యానికి నిలువెత్తు నిరద్శనం అంగన్వాడీ కేంద్రాల నిర్వహణ అస్తవ్యస్తం చిలుకూరు : అధికారుల నిర్లక్ష్యం కారణంగా మండలంలోని చిలుకూరు, సీతరాంపురం, ఆచార్యులగూడెం గ్రామాల్లో లక్షల రూపాయాలు వెచ్చించి నిర్మించిన అంగన్వాడీ భవనాలు నిరుపయోగంగా మారాయి. దాదాపుగా నాలుగేళ్ల క్రితం నిర్మించిన భవనాలు నేటి వరకు ప్రారంభానికి నోచుకోలేదు. మండలంలోని అంగన్వాడీ కేంద్రాల నిర్వహృణ అçస్తవ్యస్తంగా తయారైంది. అంVృSన్వాడీ కేంద్రాలు కొన్ని అద్దెభవనాల్లో, కమ్యూనిటీ హాల్లో ఏర్పాటు చేశారు. అంగన్వాడీ కేంద్రాలను గ్రామంలో ఎక్కడ నిర్మిస్తే సౌకర్యంగా ఉంటుందో తెలుసుకోకుండా మండలస్థాయి అధికారులు ఇష్టానుసారంగా వ్యవహరించడంతో అంగన్వాడీ కేంద్రాలు అధ్వానస్థితికి చేరుకున్నాయి. ఎనిమిది కేంద్రాలకే పక్క భవనాలు మండలంలో మొత్తం 38 అంగన్వాడీ కేంద్రాలు ఉండగా వాటిల్లో ఎనిమిది కేంద్రాలకు మాత్రమే పక్కా భవనాలున్నాయి. మరో తొమ్మిది కేంద్రాలు పాఠశాలల్లో, కమ్యూనిటీ హాళ్లలో సాగుతుండగా 21 కేంద్రాలను అద్దె గదుల్లో నిర్వహిస్తున్నారు. సీతారాంపురం, సీతారాంపురం చిలుకూరు గ్రామాల్లో ఒక్కొక్క భవనానికి రూ.3 లక్షలు వెచ్చించి పక్కాభవనాలు నిర్మించారు. ఈ భవనాలు నిర్మించి మూడు సంవత్సరాలు దాటినా ప్రారంభానికి నోచుకోలేదు. చిలుకూరులో గ్రామ శివారులో శివాలయంకు వెళ్లే రోడ్డులో కంపచెట్ల మధ్య నిర్మించారు. దీంతో అ భవనంలో ఏకంగా కొందరు రైతులు గడ్డివాములు వేసుకున్నారు. ఈ భవనం కూడ మరెక్కడో లేదు. స్వయానా చిలుకూరు గ్రామ సర్పంచ్ ఇంటి దగ్గరే ఉన్నది. అలాగే సీతరాంపురం గ్రామంలో చెరువు పక్కన భవనం నిర్మించడంతో విద్యార్థుల తల్లిదండ్రులు భయపడి బడికి పంపించరని అ భవనంను నేటి వరకు ప్రారంభించలేదు. ఆచార్యులగూడెంలో కేంద్రాంకు పక్కాభవనం ఉన్నా అ భవనం గ్రామ శివారులో ఉండడంతో విద్యార్థులు రాక పోవడంతో ఆ అంగన్వాడీ కేంద్రం నిర్వహణ స్థానిక ప్రాథమిక పాఠశాలలోనే నిర్వహిస్తున్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి వెంటనే అభవనాలను ప్రారంభించాలని పలువురు గ్రామస్తులు కోరుతున్నారు. గడ్డివాము తీయిస్తాం–సుల్తాన్ వెంకటేశ్వర్లు, సర్పంచ్, చిలుకూరు అంగన్ వాడీ భవనంలో వేసిన గడ్డిని తీయిస్తాము. అధికారులతో మాట్లాడి భవనంకు నూతన ఏర్పాట్లు చేసి మరమ్మతులు చేసి భవనంను ఉపయోగంలోకి తీసుకొని వచ్చే విధంగా చర్యలు తీసుకుంటాం. తక్షణమే భవనంకు పూర్తి స్థాయిలో ప్రహరి ఏర్పాటు చేసి ఉపయోగంలోని తీసుకొని వస్తాం. మాకు అప్పగించలేదు– వెంకటరమణ, అంగన్ వాడీ సూపర్వైజర్‡ చిలుకూరు, సీతరాంపురం గ్రామాల్లో నిర్మించిన∙భవనాలు మాకు అధికారికంగా మాకు అప్పగించలేదు. అందుకే అ భవనాల్లో నిర్వాహాణ కొనసాగించడం లేదు. అలాగే ఆచార్యులగూడెం అంగన్ వాడీ భవనం గ్రామానికిు చివర ఉండడంతో విద్యార్థులు రాకపోవడంతో అ భవనం నిరుపయోగంగా ఉంది. పాఠశాల నిర్వాహాణ ప్రాథమిక పాఠశాలలో కొనసాగిస్తున్నాం. -
మసాజ్ సెంటర్ల ముసుగులో వ్యభిచారం
-
బిడ్డ తల్లులు పాలిచ్చే కేంద్రాలు ప్రారంభం
చంటి బిడ్డ తల్లులు తమ పిల్లలకు పాలు ఇచ్చేందుకు వీలుగా ప్రతి బస్టాండ్లలో ప్రత్యేక గదులు ఏర్పాటు కానున్నాయి. తొలి విడతగా రాష్ట్రంలో 352 బస్టాండ్లలో ఈ గదులు ఏర్పాటు చేశారు. అలాగే, ఏడు ఆసుపత్రుల్లో తల్లి పాల బ్యాంక్‌లను కొలువు దీర్చారు. ఈ మేరకు సోమవారం సచివాలయం నుంచి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సీఎం జయలలిత ప్రారంభించారు. సాక్షి, చెన్నై : సుదూర ప్రయాణం నిమిత్తం బస్టాండ్లకు వచ్చే బిడ్డ తల్లులు తమ పిల్లలకు పాలు ఇవ్వడానికి కష్టపడాల్సి ఉంది. దీన్ని పరిగణించిన సీఎం జయలలిత చంటి బిడ్డ తల్లుల కోసం ప్రత్యేకంగా గదులను బస్టాండ్ల ఆవరణలో ఏర్పాటు చేయడానికి ఆదేశాలు జారీ చేశారు. ప్రత్యేక ఫర్నీచర్స్, బాత్రూం సౌకర్యంతో ఈ గదులను ఏర్పాటు చేయడానికి చర్యలు తీసుకున్నారు. ఆమేరకు చెన్నై కోయంబేడుతో పాటుగా రాష్ట్రంలోని ప్రధాన నగరాలు, పట్టణాల్లోని 532 అతి పెద్ద బస్టాండ్లలో ఈ గదులను ఏర్పాటు చేశారు. వీటిని ఉదయం సచివాలయం నుంచి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సీఎం జయలలిత ప్రారంభించారు. అలాగే, తల్లి పాల బ్యాంక్‌లను సైతం ప్రారంభించారు. తక్కువ బరువుతో, నెలలు తక్కువగా జన్మించే పిల్లలు, తల్లికి అత్యవసర చికిత్స అందించాల్సి ఉండి పిల్లలకు దూరంగా ఉన్న సమయాల్లో, తల్లిదండ్రులు వదిలి పెట్టి వెళ్లిన పిల్లలకు తదితర వారికి పాలను అందించేందుకు వీలుగా తల్లి పాల బ్యాంక్‌లను ఏర్పాటు చేశారు. చెన్నై ఎగ్మూర్ చిన్న పిల్లల ఆసుపత్రి, మదురై ప్రభుత్వ రాజాజీ ఆసుపత్రి, తిరుచ్చి, కోయంబత్తూరు, సేలం, తేని, తంజావూరుల్లోని ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఈ తల్లి పాల బ్యాంక్‌లను ఏర్పాటు చేశారు. వీటన్నింటినీ సీఎం జయలలిత వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ప్రారంభించారు. -
అధ్వానంగా సాక్షరభారత్ సెంటర్ల పనితీరు
మెదక్:ఇల్లాలి చదువు ఇంటికి వెలుగు. ప్రతి ఒక్కరి చదువు దేశానికి వెలుగు అన్నది మేధావుల నినాదం. దీన్ని స్ఫూర్తిగా తీసుకున్న ప్రభుత్వం రాష్ట్ర వ్యాప్తంగా అన్ని గ్రామాల్లో సాక్షరభారత్ కేంద్రాలను ఏర్పాటు చేసింది. నిరక్షరాస్యులను అక్షరాస్యులుగా తీర్చిదిద్దడానికి కోట్ల రూపాయలు ఖర్చు చేస్తోంది. అయితే గ్రామ సమన్వయ కర్తలు సక్రమంగా పని చేయకపోవడంతో ప్రభుత్వం లక్ష్యం నెరవేరడం లేదు. రికార్డుల్లో మాత్రం వేల సంఖ్యలో అక్షరాస్యులుగా మారుతున్నారని అధికారులు చూపుతున్నా వాస్తవ పరిస్థితులు అందుకు భిన్నంగా ఉన్నాయి. వందల సంఖ్యలో కూడా అక్షరాలు నేర్చుకున్న వారు లేరన్నది సత్యం. కొత్తగా కొలువుదీరనున్న ప్రభుత్వం దీనిపై దృష్టి సారించాలని ప్రజలు కోరుతున్నారు. తల్లి ఒడే పిల్లలకు మొదటి పాఠశాల కాబట్టి మహిళలు అక్షరాస్యులుగా మారితే వారి పిల్లలకు ఉజ్వల భవిష్యత్తు ఉంటుం దని భావించిన ప్రభుత్వం సాక్షరభారత్ పథకాన్ని ప్రారంభించింది. అంతర్జాతీయ అక్షరాస్యత దినోత్సవం సందర్భంగా 2010 సెప్టెంబర్ 8న దేశ వ్యాప్తంగా సాక్షరభారత్ కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. రెండు సంవత్సరాల లోపు పిల్లలను ఈ కేంద్రాల్లో చేరుకొని వారికి అక్షరాస్యులుగా నేర్పాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు భావించాయి. ఇందులో భాగంగా మండలంలోని 23 గ్రామ పంచాయతీలకు గానూ 46 మంది గ్రామ కోఆర్డినేటర్లను నియమించారు. వీరి విధుల పర్యవేక్షణకు మండల కోఆర్డినేటర్ ను కూడా నియమించారు. అన్ని గ్రామాల్లో కేంద్రాలను ప్రారంభించారు. ప్రస్తుతం కొన్ని సెంటర్లలో మినహా ఎక్కడా వలంటీర్లు పనిచేయడం లేదు. మండలంలో 7,500 మంది నిరక్షరాస్యులు ఉన్నట్లు అధికారులు గుర్తించారు. వీరి కోసం 750 సెంటర్లు ప్రారంభించారు. మండల వ్యాప్తంగా ఒక్క సెంటర్ కూడా సక్రమంగా నడవడం లేదన్నది సత్యం. గ్రామ సమన్వయ కర్తకు నెలకు రూ. రెండు వేల గౌరవ వేతనం ఇస్తున్నారు. ఒక్కో అభ్యాసకుడికి నోట్‌బుక్, పెన్సిల్, మెండర్, రబ్బరు, ప్రైమరీ, బ్రిడ్జి బుక్స్ అందిస్తున్నట్టు అధికారులు లెక్కలు చూపుతున్నా అవి సమన్వయ కర్తల వద్దే ఉంటాయన్నది వాస్తవం. మండలంలోని 23 సెంటర్లకు ప్రతి రోజూ రెండు దినపత్రికలు, ఒక మాస పత్రిక, కరంటు బిల్లుకు నెలకు రూ. వంద చొప్పున చెల్లిస్తున్నారు. సెంటర్లలో వసతులు కల్పించేందుకు అల్మారా, ఒక కార్పెట్, పది కుర్చీలను అందజేశారు. అభ్యాసకులు ఆడుకోవడానికి ఆటవస్తువులను సమకూర్చారు. ఇవి కూడా ఆయా సెంటర్లలో కనబడడం లేదు. పథకం లక్ష్యం బాగున్నా పాలకులు, అధికారుల పర్యవేక్షణ లోపం వల్ల ప్రజా ధనం వృథా అవుతోంది. కొత్త ప్రభుత్వమైనా ఈ పథకంపై దృష్టి పెట్టాలని మండల ప్రజలు కోరుతున్నారు. -
తీరనున్న ఆధార్ కష్టాలు
విజయనగరం కలెక్టరేట్, న్యూస్‌లైన్: ఆధార్ ఎన్రోల్ మెంట్ నంబర్ల కోసం నిరీక్షిస్తున్న జిల్లా ప్రజల కష్టాలు తీరనున్నాయి. జనవరి 1నుంచి 140 ఆధార్ నమోదు కేంద్రాలు జిల్లావ్యాప్తంగా ప్రారంభం కానున్నాయి. ప్రతి విషయానికీ వజ్రాయుధంలా మారిన ఆధార్ నంబర్ కోసం ప్రధానంగా ఉద్యోగుల కుటుంబాలు విశాఖ వరకూ పరుగులు పెడుతున్నారు. తక్షణమే ప్రత్యేక ఆధార్ కేంద్రాలు ప్రారంభించి కనీసం ఎన్రోల్ మెంట్ నం బర్లు అయినా జారీ చేయాలన్న విజ్ఞప్తులు అధికమయ్యాయి. దీంతో స్పందించిన యంత్రాంగం ఆధార్ కేంద్రాల కోసం ప్రభుత్వానికి నివేదించారు. ఎట్టకేలకు జిల్లాలో ఆధార్ కేం ద్రాలు ప్రారంభించడానికి రెండు ఏజెన్సీలకు అనుమతులు మంజూరయ్యాయి. దీంతో ఆ ఏజెన్సీలకు చెందిన ప్రతినిధు ల బృందం గురువారం కలెక్టరేట్‌కు వచ్చారు. ప్రస్తుతం కలెక్టర్ కాంతిలాల్ దండే సెలవులో ఉండడంతో ఈ నెల 31న రావాలని అధికారులు వారికి సూచించారు. జనవరి1 నుంచి కేంద్రాల ప్రారంభానికి సన్నాహాలు.. జిల్లాలో ఆధార్ కేంద్రాల ప్రారంభానికి గ్రీన్‌సిగ్నల్ లభించింది. యూనియన్‌బ్యాంకు ఆధ్వర్యంలో రెండు ఏజెన్సీలు, దేనా బ్యాంకు ఆధ్వర్యంలో ఒక ఏజెన్సీ ఆధార్ నమోదు కేంద్రాలను ప్రారంభించనున్నాయి. యూనియన్ బ్యాంకు ఆధ్వర్యంలో ఫినో సంస్థ 40 కేంద్రాలు,స్మార్ట్‌చిప్ లిమిటెడ్ 50, దేనా బ్యాంకు ఆధ్వర్యంలోని బ్లూమ్స్సొల్యూషన్స్ 50 కేంద్రాలు జిల్లాలో ప్రారంభించనున్నాయి. మొత్తం మీద ఈ కేంద్రాలు ప్రారంభమైతే జిల్లాలోని అన్ని వర్గాల ప్రజల కష్టాలు తీరనున్నాయి. -
20 ధాన్యం కొనుగోలు కేంద్రాల ఏర్పాటు
సీతంపేట, న్యూస్‌లైన్: గిరిజన సహకార సంస్థ(జీసీసీ)ఆధ్వర్యంలో 20 ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయాలని ఐటీడీఏ పీవో కె.సునీల్ రాజ్‌కుమార్ ఆదేశిం చారు. జీసీసీ సేల్స్‌మెన్‌తో శనివారం సమావేశాన్ని ఏర్పాటు చేసి, ఆయన మాట్లాడారు. సీతంపేట, భామిని, హిరమండలం, పాతపట్నం తదితర ప్రాంతాల్లో ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయాలని సూచించారు. ప్రతి డీఆర్‌డిపో పరిధిలో నెలకు రూ.లక్ష వ్యాపారం చేయాలన్నారు. ఈ ఏడాది మూడున్నర కోట్ల వ్యాపార లక్ష్యాన్ని పూర్తి చేయాలని, సంతల్లో కౌంటర్లు ఏర్పాటు చేయాలని సూచించారు. కుశిమి, సీతంపేట, దోనుబాయి, పొల్ల, మర్రిపాడు సంతల్లో మూడు కౌంటర్లు ఏర్పాటు చేయాలన్నారు. వీరఘట్టం సంతకు ఇద్దరు సేల్స్మేన్లను కేటాయించాలని ఆదేశించారు. అమ్మహస్తం పథకం ద్వారా 9 రకాల సరుకులను డీఆర్‌డిపోల్లో ఉండాలన్నారు. రానున్న క్రిస్మస్, సంక్రాంతి సీజన్లలో వీటికి బాగా డిమాండ్ ఉంటుందన్నారు. సంతల్లో నాసిరకం వస్తువులు విక్రయిస్తున్నట్లు తన దృష్టికి వచ్చిందని, ఇందుకు జిల్లా ఫుడ్ ఇన్స్పెక్టర్తో పాటు జీసీసీ అధికారులు కూడా దాడులు చేయాలని సూచించారు. అలాగే కొండచీపుర్లు కొనుగోలు చేయాలన్నారు. సీతంపేటలో ఉన్న కోల్డ్‌స్టోరేజీని తీసుకుని, అటవీ ఫలసాయాలు అందులో నిల్వ ఉంచాలన్నారు. ఈ కార్యక్రమంలో జీసీసీ డివిజినల్ మేనేజర్ ఎన్.విజయ్‌కుమార్, సీతంపేట బ్రాంచి మేనేజర్ శాంతారాం తదితరులు పాల్గొన్నారు. -
తప్పుడు రిపోర్టులతో ప్రజలను భయపెట్టొద్దు
దేవునిపల్లి, న్యూస్‌లైన్ :చాలామంది డయాగ్నోస్టిక్ సెంటర్ల నిర్వాహకులు ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్నారని, వ్యాధులు లేకున్నా పాజిటివ్ రిపోర్టులు ఇస్తున్నారని కామారెడ్డి ఆర్డీఓ వెంకటేశ్వర్లు, ఎస్పీహెచ్ఓ సురేశ్‌బాబు ఆగ్రహం వ్యక్తంచేశారు. సీజనల్ వ్యాధుల రక్త పరీక్షలను తప్పుడుగా చేస్తున్నారని, నిర్ధారించుకోకుండానే రిపోర్టులు ఇవ్వడమేంటని ప్రశ్నించారు. పట్టణంలోని ల్యాబ్స్, డయాగ్నోస్టిక్స్ నిర్వాహకులతో సోమవారం ఆర్డీఓ చాంబర్లో సమావేశం నిర్వహించారు. డెంగ్యూ రక్త పరీక్షలు చేయడానికి ఇక్కడ సౌకర్యాలు లేవని, అలాంటప్పుడు ఎలా పాజిటివ్‌గా రిపోర్ట్లు ఇస్తున్నారని ఆగ్రహం వ్యక్తంచేశారు. ఇలా తప్పుడు రిపోర్ట్‌లతో ప్రజలను భయభ్రాంతులకు గురిచేయవద్దని హెచ్చరించారు. డెంగ్యూకు సంబంధించినా ఎలిజా మెథడ్ రక్తపరీక్షల కోసం రక్తం నమూనాలను జిల్లా కేంద్రానికి పంపించి, పరీక్ష అనంతరం నిర్ధారణ చేసుకుని రిపోర్ట్‌లను రోగులకు అందజేయాలని స్పష్టంచేశారు. పరీక్షలు సరిగా నిర్వహించకుండా తప్పుడు రిపోర్టులు అందించే ల్యాబ్‌లను సీజ్ చేస్తామని వారు హెచ్చరించారు. సమావేశంలో సబ్యూనిట్ ఆఫీసర్ బాల్‌చంద్రం, సూపర్వైజర్ చలపతి, ల్యాబ్‌ల నిర్వాహకులు పాల్గొన్నారు.