200 స్కిల్ డెవలప్‌మెంట్ సెంటర్ల ఏర్పాటు!
Published Sat, Aug 27 2016 1:04 AM | Last Updated on Tue, Nov 6 2018 5:08 PM
ఘంటా సుబ్బారావు వెల్లడి
మచిలీపట్నం టౌన్ :
విద్యార్థుల్లో కమ్యూనికేషన్ స్కిల్స్‌ను పెంపొందించేందుకు కళాశాలల యాజమాన్యాలు చొరవ చూపాలని ఏపీ స్కిల్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ కమిషనర్ ఘంటా సుబ్బారావు అన్నారు. కార్పొరేషన్ ఆధ్వర్యంలో శుక్రవారం స్థానిక సిరి కళ్యాణ మండపంలో జిల్లాలోని డిగ్రీ కళాశాలల కరస్పాండెంట్లు, సెక్రటరీలు, ప్రిన్సిపల్స్‌కు అవగాహనా సదస్సును నిర్వహించారు. రాష్ట్రంలోని 13 జిల్లాల్లోనూ 200 స్కిల్ డెవలప్‌మెంట్ సెంటర్‌లను ఏర్పాటు చేసి వాటి ద్వారా విద్యార్థులకు అవగాహనా కార్యక్రమాలను నిర్వహించనున్నామన్నారు. గ్రామీణ ప్రాంత విద్యార్థుల్లో కమ్యూనికేషన్ స్కిల్స్ తక్కువగా ఉంటున్నాయని అన్నారు. రాష్ట్రంలో ఈ యేడాది 2.5 లక్షల మందికి నైపుణ్య వృద్ధి చేయాలని నిర్ణయించామన్నారు. కృష్ణా యూనివర్శిటీ వైస్‌ఛాన్స్‌లర్ సుంకరి రామకృష్ణారావు మాట్లాడుతూ మంచి కమ్యూనికేషన్ స్కిల్స్ ఉంటే ఏ కంపెనీలోనైనా ఉద్యోగం సంపాదించవచ్చన్నారు. రిజిష్ట్రార్ డి సూర్యచంద్రరావు పాల్గొన్నారు.
Advertisement
Advertisement