arrange
-
ఏపీ ప్రభుత్వం ఆధ్వర్యంలో రేపు ముస్లింలకు ఇఫ్తార్ విందు
-
ఫ్యాన్స్ కోసం మహేష్ బాబు ఎన్నిరకాల ఫుడ్ వండించాడో చూడండి
-
ప్రధాని మోదీ పర్యటన సందర్బంగా రామగుండంలో భారీ ఏర్పాట్లు
-
తూచ్..తూచ్ తొండి ‘ఆట’
* ఆడకుండానే ఆడించినట్లుగా కాగితాలపై నమోదు * క్రీడాకారులు రాకుండానే టీమ్‌లు రెడీ * ఇదీ మండలస్థాయి ఆటల పోటీల తీరు ఆడకుండానే ఆడినట్లుగా.. కూత పెట్టకుండానే పెట్టినట్లుగా.. ఎగరకుండానే ఎగిరినట్లుగా.. ఆటల పోటీలు జరిగాయి. కాదు కాదు.. జరిగాయని మనం అనుకోవాలి. అదేమిటనుకుంటున్నారా.. అవును మరి. మన పీడీలు, అధికారులు అలా చక్రం తిప్పేశారు. పోటీలను నిర్వహించకుండానే కాగితాలపైనే టీంలను ఎంపిక చేసి ఆడించినట్లుగా బొమ్మ చూపిస్తూ తొండి ‘ఆట’ ఆడారు. క్రీడా పోటీల పరువు తీశారు. ప్రత్తిపాడు: డాక్టర్ బాబాసాహెబ్ అంబేడ్కర్ 125వ జయంతి ఉత్సవాల్లో భాగంగా మండల స్థాయిలో అండర్ –19 క్రీడా పోటీలను నిర్వహించాలని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. ఇందులో భాగంగా అండర్–19 విభాగంలో అథ్లెటిక్స్, వాలీబాల్, ఫుట్‌బాల్, హ్యాండ్‌బాల్, కబడ్డీ పోటీలు బాలుర, బాలికల విభాగాల్లో నిర్వహించాల్సి ఉంది. పోటీల్లో విజేతలుగా నిలిచిన టీమ్‌లను ఈ నెల 21, 22 తేదీల్లో జిల్లా స్థాయిలో జరగనున్న పోటీలకు పంపాలి. కానీ ఇవేమీ చేయకుండా అసలు ఆటల పోటీలే నిర్వహించకుండా మండలంలో పీఈటీలు కాగితాలపై టీమ్‌లను నింపేశారు. స్థానిక జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ఈ పోటీలు జరగాల్సి ఉంది. పోటీలకు మండలంలోని అన్ని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలల నుంచి క్రీడాకారులు హాజరవుతారన్న ఉద్దేశంతో ముందుగానే భోజనాన్ని సైతం ఏర్పాటు చేయించారు. తీరా ఏ ఒక్క పాఠశాల నుంచీ క్రీడాకారులు రాకపోవడంతో పోటీలు జరగలేదు. కానీ పీడీలు మాత్రం పోటీలు జరిగినట్లుగా చెబుతున్నారు. మండలంలోని ఎనిమిది పాఠశాలలకుగాను నాలుగు పాఠశాలల నుంచి టీమ్‌లు వచ్చాయని వాలీబాల్, కబడ్డీ, షాట్‌పుట్, డిస్కస్‌త్రో, లాంగ్‌జంప్, హైజంప్ పోటీలను నిర్వహించామని కట్టుకథను అల్లారు. పచ్చి అబద్ధాలు చెబుతూ అధికారులు, పీడీలు అటు ప్రజలను ఇటు మీడియాను తప్పుదో పట్టించేందుకు విశ్వ ప్రయత్నాలు చేశారు. అసలు ఇసుకే లేని మైదానంలో హైజంప్, లాంగ్ జంప్ ఎలా ఆడగలుగుతారు..? అన్న ధర్మ సందేహాలను పీడీ మరిచినట్లున్నారు. పోటీల నిర్వహణకు నిధులు.. పోటీల నిర్వహణకుగాను ప్రభుత్వం ఒక్కో మండలానికి ఐదు వేల రూపాయల నిధులను కేటాయించింది. వీటితో క్రీడాకారులను మండల స్థాయి, జిల్లా స్థాయి పోటీలకు తీసుకువెళ్లడం వంటి వాటికి నిధులను వెచ్చించాల్సి ఉన్నప్పటికీ ఈ తతంగమంతా జరగనే లేదు. కానీ పేపర్లలో మాత్రం వచ్చినట్లు, ఆడినట్లు చూపించి ఉన్నతాధికారులకు టోకరా వేస్తున్నారు. వచ్చారు ఆడించాం.. పోటీలకు క్రీడాకారులు వచ్చారు. ఎనిమిది పాఠశాలలకుగాను నాలుగు పాఠశాలల నుంచి క్రీడాకారులు పోటీలకు హాజరయ్యారు. కబడ్డీకి నాలుగు, వాలీబాల్‌కు నాలుగు టీమ్‌లు వచ్చాయి. వారితో ఆటలాడించాం. అథ్లెటిక్స్ నిర్వహించాం. - భాస్కరరావు పీడీ, ప్రత్తిపాడు హైస్కూల్ ఒక్క పాఠశాల వాళ్లు కూడా రాలేదు: మండల స్థాయి పోటీలు కావడంతో మిగిలిన పాఠశాలల నుంచి కూడా క్రీడాకారులు వస్తారన్న ఉద్దేశంతో అందరికీ భోజనాలను కూడా ఏర్పాటు చేశాం. కానీ ఒక్క పాఠశాల నుంచి కూడా విద్యార్థులు రాలేదు. పీడీ ప్రమోషన్లు, పీఈటీల బదిలీల్లో హడావిడిగా ఉండటం వలన రాలేదంట. - రమాదేవి, హెచ్ఎం, ప్రత్తిపాడు హైస్కూల్ -
200 స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ల ఏర్పాటు!
ఘంటా సుబ్బారావు వెల్లడి మచిలీపట్నం టౌన్ : విద్యార్థుల్లో కమ్యూనికేషన్ స్కిల్స్‌ను పెంపొందించేందుకు కళాశాలల యాజమాన్యాలు చొరవ చూపాలని ఏపీ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ కమిషనర్ ఘంటా సుబ్బారావు అన్నారు. కార్పొరేషన్ ఆధ్వర్యంలో శుక్రవారం స్థానిక సిరి కళ్యాణ మండపంలో జిల్లాలోని డిగ్రీ కళాశాలల కరస్పాండెంట్లు, సెక్రటరీలు, ప్రిన్సిపల్స్‌కు అవగాహనా సదస్సును నిర్వహించారు. రాష్ట్రంలోని 13 జిల్లాల్లోనూ 200 స్కిల్ డెవలప్మెంట్ సెంటర్లను ఏర్పాటు చేసి వాటి ద్వారా విద్యార్థులకు అవగాహనా కార్యక్రమాలను నిర్వహించనున్నామన్నారు. గ్రామీణ ప్రాంత విద్యార్థుల్లో కమ్యూనికేషన్ స్కిల్స్ తక్కువగా ఉంటున్నాయని అన్నారు. రాష్ట్రంలో ఈ యేడాది 2.5 లక్షల మందికి నైపుణ్య వృద్ధి చేయాలని నిర్ణయించామన్నారు. కృష్ణా యూనివర్శిటీ వైస్‌ఛాన్స్‌లర్ సుంకరి రామకృష్ణారావు మాట్లాడుతూ మంచి కమ్యూనికేషన్ స్కిల్స్ ఉంటే ఏ కంపెనీలోనైనా ఉద్యోగం సంపాదించవచ్చన్నారు. రిజిష్ట్రార్ డి సూర్యచంద్రరావు పాల్గొన్నారు. -
కోటి 40 లక్షల మందికి ఏర్పాట్లు
మట్టపల్లి (మఠంపల్లి) : కృష్ణా పుష్కరాల్లో జిల్లా వ్యాప్తంగా కోటి 40 లక్షల మంది భక్తులు పుణ్య స్నానాలు ఆచరించేందుకు వీలుగా స్నాన ఘాట్లు నిర్మిస్తున్న ఐబీ చీఫ్ ఇంజినీర్ సిరివోలు సునీల్ తెలిపారు. మంగళవారం ఆయన మట్టపల్లి వద్ద కృష్ణానదిలో రూ.4 కోట్లతో నిర్మిస్తున్న బాలాజీ, ప్రహ్లాద హైలెవల్ వంతెన కుడి, ఎడమ ఘాట్ల నిర్మాణ పనులను ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా విలేకరులతో మాట్లాడుతూ 2004 పుష్కరాల్లో జిల్లా వ్యాప్తంగా 0.55 కిలో మీటర్ల పొడవునా ఘాట్లు నిర్మించగా సుమారు 40 లక్షల మంది భక్తులు పుణ్య స్నానాలు చేశారన్నారు. అయితే ఈ సారి ప్రత్యేక తెలంగాణ రాష్ట్రంలో కృష్ణా పుష్కరాలను ఘనంగా నిర్వహిస్తున్నందున సుమారు కోటి 40 లక్షల మంది పుణ్య స్నానాలు చేసేందుకు వీలుగా ఏర్పాటు చేస్తున్నట్లు చెప్పారు. జిల్లాలోని మట్టపల్లి, మేళ్లచెరువు, వాడపల్లి, సాగర్, చందంపేట మండలాల పరిధిలో 2.6 కిలోమీటర్ల పొడవున 28 ఘాట్లను నిర్మిస్తున్నట్లు తెలిపారు. పుష్కర ఘాట్ల నిర్మాణం ఇప్పటి వరకు 95 శాతం పూర్తయిందని, వచ్చే నెల 5వ తేదీ నాటికి పూర్తిస్థాయిలో నిర్మాణాలు పూర్తి రంగులు వేసి ప్రారంభానికి సిద్ధం చేస్తామన్నారు. ఆయన వెంట ఆలయ అనువంశిక ధర్మకర్త చెన్నూరు మట్టపల్లి రావు, ఐబీ ఎస్ఈ ధర్మానాయక్, ఈఈ సంజీవరెడ్డి, డీఈ స్వామి, ఏఈలు పిచ్చయ్య, భిక్షం, ఈఓ ఎం.పి లక్ష్మణరావు పాల్గొన్నారు. -
అమెరికా రాయితీ ఇవ్వకపోతే కొనుగోలు కష్టమేః పాకిస్తాన్
వాషింగ్టన్ః ఎఫ్-16 యుద్ధవిమానాలు కొనుగోలు చేయడానికి పాకిస్తాన్ మొత్తం డబ్బు చెల్లించాల్సిందేనని, ఎటువంటి రాయితీలు ఇవ్వబోమని అమెరికా స్పష్టం చేసింది. అవసరమైతే పాకిస్తాన్ తన జాతీయ నిధులనుంచి విమానాలు కొనుగోలు చేయొచ్చని సలహా కూడ ఇచ్చింది. దీంతో పాకిస్తాన్ కూడ తన నిర్ణయం మార్చుకునేట్లు కనిపిస్తోంది. ముందు కుదుర్చుకున్న ఒప్పందం ప్రకారం అమెరికా రాయితీలు ఇవ్వని పక్షంలో అంత పెద్దమొత్తంలో డబ్బు చెల్లించి విమానాలను కొనుగోలు చేయడం కష్టమేనని పాకిస్తాన్ విదేశీ వ్యవహారల సలహాదారు సర్తాజ్ అజీజ్ ఓ ప్రకటనలో స్పష్టం చేశారు. అయితే తీవ్రవాద వ్యతిరేక ప్రచారంలో తాము వాడే ఎఫ్-17 థండర్ జెట్స్ స్థానంలో ప్రభావవంతమైన ఎఫ్-16 కు ప్రాధాన్యతనిచ్చామని అజీజ్ తెలిపినట్లు ఓ పాకిస్తానీ వార్తా పత్రిక తెలిపింది. చైనా ఏవియేషన్ ఇండస్ట్రీ కార్పొరేషన్ భాగస్వామ్యంతో పాకిస్తాన్ ఏరోనాటికల్ కాంప్లెక్స్ ద్వారా అభివృద్ధి చేసిన జెఎఫ్-17 పాకిస్తాన్ ఎయిర్ ఫోర్స్ కు ఇకపై వెన్నెముకగా మారుతుందని కూడ ఆయన అభిప్రాయపడ్డట్టు వెల్లడించింది. అమెరికానుంచి ఎనిమిది ఎఫ్-16 యుద్ధ విమానాలను కొనేందుకు ఇంతకు ముందు పాకిస్తాన్ ఒప్పందం చేసుకున్న సంగతి తెలిసిందే. అయితే అనుకున్న ప్రకారం అమెరికా రాయితీని కల్పించి ఉంటే... ఎనిమిది విమానాలకు పాకిస్తాన్ తన జాతీయ నిధులనుంచి అమెరికాకు 270 మిలియన్ డాలర్లు చెల్లించాల్సి ఉంది. అయితే కొనుగోలుకు కాంగ్రెస్ ఆమోదించినప్పటికీ, విదేశీ మిలటరీ ఫైనాన్సింగ్ నిధులను వినియోగించడంపై అమెరికా సెనేటర్లు కొందరు అభ్యంతరాలు వ్యక్తం చేయడంతో పరిస్థితి తారుమారైంది. -
ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేస్తున్న ఆర్టీసీ