ఊరూరా పశుగ్రాస క్షేత్రాలు | pasture centers in every village | Sakshi
Sakshi News home page

ఊరూరా పశుగ్రాస క్షేత్రాలు

Published Sat, Oct 8 2016 12:57 AM | Last Updated on Mon, Oct 1 2018 2:09 PM

pasture centers in every village

–పశుసంవర్ధక శాఖ జేడీ సుదర్శన్‌ కుమార్‌
కర్నూలు(అగ్రికల్చర్‌): ఊరూరా పశుగ్రాస క్షేత్రాలు ఏర్పాటుకు ప్రత్యేక చర్యలు తీసుకోవాలని పశువైద్యులు, ఏడీలను ఆ శాఖ జాయింట్‌ డైరెక్టర్‌ డాక్టర్‌ సుదర్శన్‌కుమార్‌ ఆదేశించారు. శుక్రవారం బహుళార్ద పశువైద్యశాలలో జిల్లాలోని పశువైద్యులు, సహాయ సంచాలకులతో సమావేశం నిర్వహించారు. విజయ దశిమి తర్వాత పశుగ్రాస క్షేత్రాలు ప్రారంభం కావాలన్నారు. ఎంత మంది రైతులు పచ్చి మేత తీసుకుంటారో గుర్తించాలని తెలిపారు. దాణామృతం ప్రాధాన్యతను రైతులకు వివరించాలని, ఏ మండలానికి ఎంత కావాలో నివేదిక ఇవ్వాలన్నారు. పశు సంవర్ధకశాఖ కార్యక్రమాలను ఆన్‌లైన్‌లో నమోదు చేయాలన్నారు. సమావేశంలో డీడీ చిన్నయ్య, కర్నూలు ఏడీ సీవీ రమణయ్య, ఆదోని ఏడీ పి.రమణయ్య, నంద్యాల ఏడీ రమణ, ఆళ్లగడ్డ ఏడీ వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement