ఎక్కడా ఎరువుల కొరతలేదు: మంత్రి కన్నబాబు | Minister Kurasala Kannababu Comments On Yellow Media | Sakshi
Sakshi News home page

ఎక్కడా ఎరువుల కొరతలేదు: మంత్రి కన్నబాబు

Oct 8 2021 2:40 PM | Updated on Oct 9 2021 7:44 AM

Minister Kurasala Kannababu Comments On Yellow Media - Sakshi

ప్రభుత్వ పనితీరుపై పచ్చ పత్రికలు తప్పుడు ప్రచారం చేస్తున్నాయని మంత్రి కురసాల కన్నబాబు మండిపడ్డారు.

సాక్షి, అమరావతి: వ్యవసాయ మౌలిక సదుపాయాలపై ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి సమీక్షించారని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కురసాల కన్నబాబు తెలిపారు. శుక్రవారం ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ, రైతు భరోసా కేంద్రాల బలోపేతంపై సీఎం పలు ఆదేశాలిచ్చారన్నారు. ప్రభుత్వ పనితీరుపై పచ్చ పత్రికలు తప్పుడు ప్రచారం చేస్తున్నాయని మంత్రి మండిపడ్డారు. (చదవండి: భారత్‌లో రెండో ముంబై ఎక్కడుందో తెలుసా..!!)

రైతు భరోసా కేంద్రాల ఏర్పాటుపై దేశవ్యాప్తంగా ప్రశంసలు వస్తున్నాయన్నారు. దళారీలను అరికట్టడానికే భరోసా కేంద్రాలు తీసుకొచ్చామన్నారు. నాణ్యమైన విత్తనాలు, ఎరువులు అందించడం ప్రథమ లక్ష్యమని తెలిపారు. ఎక్కడా ఎరువుల కొరత లేదని మంత్రి స్పష్టం చేశారు. ప్రతి రైతు భరోసా కేంద్రం.. సబ్‌ డీలర్‌గా ఉంటుందన్నారు. రైతులను ఆదుకునేందుకు అన్ని విధాలుగా కృషి చేస్తున్నామన్నారు.
చదవండి:
ధూళిపాళ్ల నరేంద్రకు నోటీసులిచ్చిన కాకినాడ పోలీసులు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement