Raithu bharosha
-
సీఎం జగన్ సభ.. కదిలొచ్చిన జనసంద్రం
అది సీఎం జగన్ పుట్టపర్తికి వచ్చిన సందర్భం. రైతు భరోసా నిధులను విడుదల చేయడానికి సీఎం జగన్ పుట్టపర్తికి బయల్దేరివెళ్లిన వేళ. అయితే ఆ సభకు జనసంద్రం పోటెత్తింది. సీఎం జగన్ పుటపర్తికి వస్తున్నానరి తెలిసి అక్కడకు అశేష జనసందోహం తరలివచ్చింది. సీఎం జగన్ అక్కడకు వచ్చే సరికే సభా ప్రాంగణం కిక్కిరిసిపోయింది. ఇసుకేసినా రాలనంతగా ‘జనసంద్రం’ పోటెత్తింది. సీఎం జగన్‌కు సంఘీభావం తెలపడానికి ప్రజలు ఇలా భారీగా తరలివచ్చారు. దీనికి సంబంధించిన డ్రోన్ విజువల్స్ ఇప్పుడు వైరల్‌గా మారాయి. ఇవి కూడా చదవండి: చంద్రబాబు, ఎల్లో మీడియాకు సీఎం జగన్ స్ట్రాంగ్ కౌంటర్ ప్రతీ విషయంలో అన్నదాతకు అండగా నిలబడ్డాం: సీఎం జగన్ -
అన్నదాతకు అడుగడుగునా అండగా నిలుస్తున్న జగనన్న ప్రభుత్వం
-
మినీ బ్యాంక్‌లు ఆర్బీకేలు.. రైతుల చెంతకే బ్యాంకింగ్ సేవలు
ప్రభుత్వ పథకాలను ప్రజలకు చేరవేయడంతో పాటు ఇప్పటికే ఎన్నో సేవలు అందిస్తున్న ఆర్బీకేలు.. మరో సేవకు సిద్ధమయ్యాయి. ఇకపై పల్లెల్లో అత్యవసర సమయంలో ఆర్థిక అవసరాలనూ తీర్చనున్నాయి. అందులో భాగంగా బ్యాంక్‌లు, ఏటీఎంల పాత్రలను పోషించనున్నాయి. తక్షణ అవసరం నిమిత్తం రూ.20 వేల వరకు సమకూర్చేందుకు జగనన్న ప్రభుత్వం చర్యలు తీసుకుంది. ఈ ఏర్పాటు ప్రధానంగా రైతుల కోసం చేసినా ప్రజలు కూడా సద్వినియోగం చేసుకునే వెసులు బాటూ కల్పించడంతో అన్ని వర్గాల నుంచి హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి. సాక్షి,నంద్యాల: అన్నదాతకు వెన్నుదన్నుగా నిలుస్తున్న రాష్ట్ర ప్రభుత్వం.. మరో అడుగు ముందుకేసి ఆర్థిక సేవలనూ వారి ముంగిట్లోకే తెచ్చింది. రైతు భరోసా కేంద్రాల్లో ఇప్పటి వరకు అందుతున్న సేవలతో పాటు బ్యాంకు సేవలనూ ప్రవేశపెట్టింది. పల్లె రైతులు, ప్రజలు మండల కేంద్రాలకు వెళ్లకుండా అవసరమైనప్పుడు ఆర్థిక లావాదేవీలు నిర్వహించుకునే విధంగా ఏర్పాట్లు చేసింది. అందుకు ఉమ్మడి జిల్లాల్లో ఉన్న 874 రైతు భరోసా కేంద్రాల్లో బ్యాంక్‌ల సాయంతో 587 మంది బిజినెస్ కరస్పాండెంట్లను నియమించింది. వీరి ద్వారా రైతులకు అవసరమైన చిన్నచిన్న లావాదేవీలను బ్యాంకుల వద్దకు వెళ్లకుండా పూర్తి చేస్తోంది. సాధారణంగా రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఆర్బీఐ) నిబంధనల ప్రకారం 5 వేల జనాభా ఉన్న ప్రతి గ్రామంలో బ్యాంకు బ్రాంచ్ ఏర్పాటు చేయాలి. కానీ బ్యాంకుల విలీనంతో కొత్త బ్రాంచ్‌లు ఏర్పాటు చేసే అవకాశాలు లేకపోయినా బిజినెస్ కరస్పాండెంట్ల ద్వారా రైతులు, పల్లె ప్రజల అవసరాలను తీర్చనుంది. 587 మంది బిజినెస్ కరస్పాండెంట్లు నంద్యాల, కర్నూలు ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా 874 రైతు భరోసా కేంద్రాలు ఉన్నాయి. వాటిలో రైతులు ఆర్థిక లావాదేవీలు నిర్వహించుకునేందుకు వివిధ బ్యాంకులకు చెందిన 587 మంది బిజినెస్ కరస్పాండెంట్లను ఏర్పాటు చేశారు. వీరు జిల్లా వ్యాప్తంగా ఉన్న 2.47 లక్షల మంది రైతులతోపాటు ప్రజలకు కూడా ఈ సేవలు అందిస్తారు. ప్రభుత్వ పథకాలను ప్రజలకు చేరవేయడంతో పాటు ఇప్పటికే ఎన్నో సేవలు అందిస్తున్న ఆర్బీకేలు.. మరో సేవకు సిద్ధమయ్యాయి. ఇకపై పల్లెల్లో అత్యవసర సమయంలో ఆర్థిక అవసరాలనూ తీర్చనున్నాయి. అందులో భాగంగా బ్యాంక్‌లు, ఏటీఎంల పాత్రలను పోషించనున్నాయి. తక్షణ అవసరం నిమిత్తం రూ.20 వేల వరకు సమకూర్చేందుకు జగనన్న ప్రభుత్వం చర్యలు తీసుకుంది. ఈ ఏర్పాటు ప్రధానంగా రైతుల కోసం చేసినా ప్రజలు కూడా సద్వినియోగం చేసుకునే వెసులు బాటూ కల్పించడంతో అన్ని వర్గాల నుంచి హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి. సమయం వృథా అయ్యేది ప్రభుత్వం రైతు భరోసా కేంద్రాల ద్వారా ఆర్థిక లావాదేవీలు నిర్వహించడం సంతోషకరం. మా గ్రామంలో బ్యాంకు కానీ, ఏటీఎం కానీ లేకపోవడంతో నగదు తీసుకోవాలన్నా, ఖాతాలోకి వేయాలన్నా నంద్యాలకు వెళ్లాల్సి ఉండేది. దీని వల్ల సమయం వృథా అయ్యేది. జగనన్న ప్రభుత్వం ఆర్బీకేల్లోనే బ్యాంకింగ్ సేవలు పెట్టడంతో ఆ బాధలు తప్పాయి. బ్యాంకుల వద్ద గంటల తరబడి వేచి ఉండాల్సిన అవసరం లేదు. 4 కి.మీ వెళ్లాల్సిన అవసరం లేకుండా గ్రామంలోనే డబ్బులు తీసుకుంటున్నాం. జమ చేస్తున్నాం. – బంగారురెడ్డి, రైతు, చాబోలు సేవలకు రుసుమేమీ లేదు ప్రతిరోజూ బిజినెస్ కరస్పాండెంట్లు గంట నుంచి 2 గంటల పాటు ఆర్బీకేల్లో వేచి ఉంటారు. ఆయా గ్రామాల్లో రైతుల వెసులుబాటును బట్టి సమయాన్ని సర్దుబాటు చేసుకునే విధంగా బిజినెస్ కరస్పాండెంట్లకు ఆదేశాలు జారీ చేశాం. 2 వేల జనాభా కలిగిన గ్రామాల్లో ఈ ఆర్థిక లావాదేవీలు నిర్వహించేందుకు చర్యలు చేపట్టినప్పటికీ ఆర్బీకే ఉన్న ప్రతి గ్రామంలో రైతులు సద్వినియోగం చేసుకోవచ్చు. ఏ ఒక్కరు కూడా బిజినెస్ కరస్పాండెంట్లకు రూపాయి కూడా చెల్లించాల్సిన అవసరం లేదు. -వెంకటనారాయణ, లీడ్ బ్యాంక్ మేనేజర్, కర్నూలు -
100% హామీల అమలు
-
ఎక్కడా ఎరువుల కొరతలేదు: మంత్రి కన్నబాబు
సాక్షి, అమరావతి: వ్యవసాయ మౌలిక సదుపాయాలపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి సమీక్షించారని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కురసాల కన్నబాబు తెలిపారు. శుక్రవారం ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ, రైతు భరోసా కేంద్రాల బలోపేతంపై సీఎం పలు ఆదేశాలిచ్చారన్నారు. ప్రభుత్వ పనితీరుపై పచ్చ పత్రికలు తప్పుడు ప్రచారం చేస్తున్నాయని మంత్రి మండిపడ్డారు. (చదవండి: భారత్‌లో రెండో ముంబై ఎక్కడుందో తెలుసా..!!) రైతు భరోసా కేంద్రాల ఏర్పాటుపై దేశవ్యాప్తంగా ప్రశంసలు వస్తున్నాయన్నారు. దళారీలను అరికట్టడానికే భరోసా కేంద్రాలు తీసుకొచ్చామన్నారు. నాణ్యమైన విత్తనాలు, ఎరువులు అందించడం ప్రథమ లక్ష్యమని తెలిపారు. ఎక్కడా ఎరువుల కొరత లేదని మంత్రి స్పష్టం చేశారు. ప్రతి రైతు భరోసా కేంద్రం.. సబ్ డీలర్‌గా ఉంటుందన్నారు. రైతులను ఆదుకునేందుకు అన్ని విధాలుగా కృషి చేస్తున్నామన్నారు. చదవండి: ధూళిపాళ్ల నరేంద్రకు నోటీసులిచ్చిన కాకినాడ పోలీసులు -
ఆంధ్రప్రదేశ్ లో రైతురాజ్య స్థాపనకు వడివడి గా అడుగులు
-
రైతు నాయకుడు అంటే గుర్తు వచ్చేది YSR గారు : కన్నబాబు
-
‘రైతు భరోసా’ను ప్రారంభించిన సీఎం జగన్
సాక్షి, అమరావతి : ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఎంతో ప్రతిష్టాత్మంగా ప్రవేశపెట్టిన ‘వైఎస్సార్ రైతు భరోసా– పీఎం కిసాన్’ పథకం ప్రారంభమైంది. శుక్రవారం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఈ కార్యక్రమాన్ని సీఎం జగన్ ప్రారంభించారు. ఈ పథకం ద్వారా ప్రతి రైతు కుటుంబానికి తొలి విడతగా రూ.7,500 ఖాతాలో జమ కానున్నాయి. పథకం ప్రారంభం సందర్భంగా సీఎం మాట్లాడుతూ.. వీడియో కాన్ఫరెన్స్ ద్వారా పథకానికి శ్రీకారం చుట్టడం బాధగా ఉందన్నారు. కరోనా పరిస్థితుల కారణంగా వీడియో కాన్ఫరెన్స్ ద్వారా రైతు భరోసాను ప్రారంభిస్తున్నాం అని చెప్పారు. రాష్ట్రంలోని 49 లక్షల మంది రైతులకు లబ్ధి చేకూరేలా ఈ పథకాన్ని రూపొందించామని తెలిపారు. సాధారణ పరిస్థితులు ఉంటే రైతులతో కలిసి భారీ సభలో ఈ కార్యక్రమం నిర్వహించేవాళ్లమని సీఎం అన్నారు. రైతులు, రైతు కూలీలు బాగుంటేనే రాష్ట్రం బాగుంటుందని, దేశానికి అన్నం పెట్టే రైతన్నలకు ఎంత చేసినా తక్కువే అని అభిప్రాయపడ్డారు. వ్యవసాయానికి పెట్టుబడి కోసం రైతులు ఇబ్బంది పడకూడదని, పెట్టుబడి సాయం అందించేందుకే రైతు భరోసా కింద రూ.13500 ఏటా అందిస్తున్నాని స్పష్టం చేశారు. ఎన్నికల మేనిఫెస్టోలో రూ. 12500 చొప్పున నాలుగేళ్లు ఇస్తామని చెప్పినా.. రూ.13,500 చొప్పున ఐదేళ్లపాటు ఇస్తామని ప్రకటించారు. నగదు బదిలీ కాకుంటే 1902 కాల్ ‘గతేడాది రూ.6350 కోట్లు రైతు భరోసా కింద చెల్లించాం. రైతు భరోసా కింద రూ.5500 నగదు రైతుల అకౌంట్లో జమ అవుతాయి. ఏప్రిల్‌లో 2వేలు ఇచ్చాం.. ఇప్పుడు రూ.5500 ఇస్తున్నాం. కౌలు రైతులు, అటవీ భూములు, అసైన్డ్ భూములు సాగు చేస్తున్నవారికి రూ.7500 అందజేస్తాం. అక్టోబర్‌లో 4వేలు, వచ్చే సంక్రాంతికి మరో 2వేలు అందజేస్తాం. రైతు భరోసా కింద మొత్తం రూ.13,500 రైతులకు అందిస్తాం. పార్టీలకతీతంగా రైతులందరికీ పెట్టుబడి సాయం అందిస్తున్నాం. గ్రామ సచివాలయాల్లో లబ్ధిదారుల జాబితా ఉంచుతున్నాం. ఎవరైనా పేరు లేకపోతే నమోదు చేయించుకునే అవకాశం కల్పించాం. రైతులకు మేలు చేయాలన్నదే మా ప్రభుత్వ లక్ష్యం. నగదు బదిలీ కాకుంటే 1902 కాల్ సెంటర్‌కు రైతులు ఫోన్ చేయొచ్చు’ అని తెలిపారు. రైతుల ఖాతాల్లో రూ.2,800 కోట్లు జమ సీఎం వైఎస్ జగన్ ప్రభుత్వం ఈ పథకం ద్వారా రైతులు, అర్హులైన కౌలుదార్లు, సాగుదార్లకు నగదు జమ చేయడం ఇది రెండోసారి. ఎన్నికల ప్రణాళికలో ఇచ్చిన హామీ మేరకు ఏటా రూ.13,500 చొప్పున వరుసగా రైతులకు రెండో ఏడాది అందిస్తున్నారు. ఈసారి దాదాపు 49,43,590కిపైగా రైతు కుటుంబాలకు తొలివిడతగా నేడు రూ.2,800 కోట్ల మొత్తం వారి ఖాతాల్లో జమ కానుంది. కాగా, తొలివిడత కిందే గత నెలలో రూ.2 వేల చొప్పున రూ. 875 కోట్లు జమ చేసింది. గత ఏడాది కన్నా ఈసారి లబ్ధి పొందే రైతు కుటుంబాల సంఖ్య 2.74 లక్షలు అధికం. మే 30న రైతు భరోసా కేంద్రాలు ప్రారంభం.. రాష్ట్రంలో 10,641 రైతు భరోసా కేంద్రాలు ఏర్పాటు చేస్తున్నాం. మే 30న రైతు భరోసా కేంద్రాలను ప్రారంభిస్తాం. ఈ కేంద్రాల్లో నాణ్యమైన విత్తనాలు, ఎరువులు అందుబాటులో ఉంటాయి. రైతు భరోసా కేంద్రాల్లో వ్యవసాయ శాఖ సిబ్బంది అందుబాటులో ఉంటారు. వ్యవసాయానికి సంబంధించిన సలహాలను ఆర్బీకే ద్వారా అందిస్తాం. భూసార పరీక్షలు కూడా రైతు భరోసా కేంద్రాల నుంచే చేస్తాం. రైతు భరోసా కేంద్రంలో 3 రకాల ల్యాబ్‌లను కూడా అందుబాటులోకి తెస్తాం. జిల్లా, నియోజకవర్గ, రైతు భరోసా కేంద్రాల్లో ల్యాబ్‌లు ఉంటాయి. ఈ-క్రాపింగ్ ద్వారా పంట రుణాలను ఇప్పించేలా చర్యలు తీసుకుంటాం. గిట్టుబాటు ధర కల్పించడంలో కూడా ఆర్బీకేలు కీలక పాత్ర పోషిస్తాయి. వ్యవసాయం, రైతు భరోసా కేంద్రాలకు ప్రత్యేకంగా జాయింట్ కలెక్టర్ వ్యవస్థను ఏర్పాటు చేస్తాం. రైతులకు నష్టం లేకుండా కౌలు చట్టాన్ని తీసుకొచ్చాం. వైఎస్ఆర్ పంటల బీమా పథకాన్ని కూడా ఇదివరకే ప్రారంభించాం. మా కష్టాలు తీరాయి: రైతులు సీఎం జగన్‌తో వీడియో కాన్ఫరెన్స్ సందర్భంగా పలువురు రైతులు మాట్లాడారు. ‘వైఎస్ఆర్ ఎప్పుడూ రైతుల కోసమే తపించే వారు. రైతుల కోసం వైఎస్ఆర్ ఎన్నో సంక్షేమ పథకాలు తెచ్చారు. గతంలో పెట్టుబడి సాయంలేక అప్పులు చేసేవాళ్లం. ఇప్పుడు రైతు భరోసాతో మా కష్టాలు తీరాయి. అమ్మ ఒడి ద్వారా మా పిల్లలు మంచి చదువులు చదువుతున్నారు. పేదల కోసం ఇన్ని పథకాలు ఇచ్చిన మీకు ధన్యవాదాలు. కరోనా సమయంలో కూడా రైతులకు ప్రభుత్వం అండగా నిలిచింది. పంటలు దళారుల పాలు కాకుండా ప్రభుత్వమే కొనుగోలు చేస్తోంది. రైతు భరోసా కేంద్రాలతో మాకు ఎంతో మేలు చేస్తాయి’ అని రైతులు ఆనందాన్ని వ్యక్తం చేశారు. -
‘రైతు భరోసా’ నగదు జమ నేడే
సాక్షి, అమరావతి: ‘వైఎస్సార్ రైతు భరోసా– పీఎం కిసాన్’ పథకం ద్వారా అన్నదాతల ఖాతాలకు నగదు జమ కార్యక్రమం శుక్రవారం ప్రారంభమవుతుంది. నగదు బదిలీకి అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. తాడేపల్లిలోని తన క్యాంప్ కార్యాలయంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి నగదు బదిలీ కార్యక్రమాన్ని ప్రారంభిస్తారు. దీనికి సంబంధించి ముఖ్యమంత్రి జగన్ ఇప్పటికే రైతన్నలకు లేఖ రాసిన విషయం తెలిసిందే. నేడు రైతుల ఖాతాల్లో రూ.2,800 కోట్లు జమ సీఎం వైఎస్ జగన్ ప్రభుత్వం ఈ పథకం ద్వారా రైతులు, అర్హులైన కౌలుదార్లు, సాగుదార్లకు నగదు జమ చేయడం ఇది రెండోసారి. ఎన్నికల ప్రణాళికలో ఇచ్చిన హామీ మేరకు ఏటా రూ.13,500 చొప్పున వరుసగా రైతులకు రెండో ఏడాది అందిస్తున్నారు. ఈసారి దాదాపు 49,43,590కిపైగా రైతు కుటుంబాలకు తొలివిడతగా నేడు రూ.2,800 కోట్ల మొత్తం వారి ఖాతాల్లో జమ కానుంది. కాగా, తొలివిడత కిందే గత నెలలో రూ.2 వేల చొప్పున రూ. 875 కోట్లు జమ చేసింది. గత ఏడాది కన్నా ఈసారి లబ్ధి పొందే రైతు కుటుంబాల సంఖ్య 2.74 లక్షలు అధికం. సీజన్ ఆరంభంలో అన్నదాతకు ఆర్థిక సాయం.. ► 2019–20 రబీ సీజన్ నుంచి ‘వైఎస్సార్ రైతు భరోసా– పీఎం కిసాన్’ పథకం అమల్లోకి తెచ్చింది. ► గత ఏడాది రబీలో ఈ పథకం ద్వారా 46.69 లక్షల రైతు కుటుంబాలకు సాయం అందింది. ► ప్రస్తుత ఖరీఫ్‌లో లబ్ధి పొందే రైతు కుటుంబాల సంఖ్య 49,43,590కి పెరిగింది. ఇందులో రైతు భరోసా జనరల్ ఖాతాలు 46,28,767 కాగా చనిపోయిన కుటుంబాల నామినీలు 61,555 మంది, అన్ సీడెడ్ వెబ్‌ల్యాండ్ ఖాతాలు 1,58,949, అన్‌సీడెడ్ నాన్ వెబ్ ల్యాండ్ ఖాతాలు 53,076, ఎండోమెంట్ భూముల సాగుదారులు 623 మంది, అటవీ భూములను సాగు చేసుకుంటున్న కౌలుదారులు 40,620 మంది ఉన్నారు. ► డేటా బేస్ ఆధారంగా అర్హులకు పెట్టుబడి సాయాన్ని అందిస్తున్నారు. ఈ పథకం కింద రైతు కుటుంబాలకు రూ.13,500 మూడు విడతలుగా అందిస్తారు. మొత్తంగా ఈ ఏడాదికి ప్రస్తుతం తొలి విడతలో రూ.7,500 చొప్పున రూ.3,675 కోట్లు రైతుల ఖాతాలో జమ అవుతుంది. ► భూమిలేని ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ కౌలు రైతుల కుటుంబాలకు కూడా రూ.13,500 సాయం అందుతుంది. ఈ వర్గాలకు చెందిన కౌలు రైతులకు రాష్ట్ర ప్రభుత్వమే పూర్తి మొత్తాన్ని చెల్లిస్తుంది. 18వ తేదీ నుంచి విత్తనాల విక్రయం మొదలవుతున్న నేపథ్యంలో రైతులు కరోనా విపత్తుతో ఇబ్బంది పడకుండా 15 నుంచే నగదు జమను ప్రారంభిస్తున్నారు. రైతు భరోసాకు మరో రూ.96 కోట్లు విడుదల వైఎస్సార్ రైతు భరోసా పథకం కింద అర్హులైన రైతు కుటుంబాలకు ఈ ఏడాదిలో తొలి విడత సాయం అందించేందుకుగాను ప్రస్తుత ఓటాన్ అకౌంట్ బడ్జెట్ నుంచి అదనంగా మరో రూ.96 కోట్లను ప్రభుత్వం విడుదల చేసింది. ఈ మేరకు పాలనపరమైన అనుమతులు మంజూరు చేస్తూ గురువారం ఉత్తర్వులిచ్చింది. కాగా, బుధవారం రూ.409.47కోట్లను విడుదల చేసిన సంగతి తెలసిందే. అలాగే, వర్షాధారిత ప్రాంత అభివృద్ధికి కూడా నిధులు విడుదల చేస్తూ మరో ఉత్తర్వు జారీ చేసింది. (నోట్: ఇతరులలో చనిపోయిన కుటుంబాల నామినీలు, అన్ సీడెడ్ వెబ్‌ల్యాండ్ ఖాతాలు, అన్‌సీడెడ్ నాన్ వెబ్ ల్యాండ్ ఖాతాలు, దేవాదాయ, అటవీ భూములను సాగు చేసుకుంటున్న కౌలుదారులు ఉన్నారు.) -
స్పందన కార్యక్రమంపై సీఎం జగన్ సమీక్ష
సాక్షి, అమరావతి: అర్హత ఉన్నా పెన్షన్ రాలేదన్న మాట ఎక్కడా వినిపించకూడదని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అన్నారు. వెరిఫికేషన్ చేసి అర్హత ఉందని తేలితే... రెండు నెలలకు కలిపి ఒకేసారి పెన్షన్ ఇస్తామని స్పష్టం చేశారు. అదే విధంగా అర్హత ఉండి దరఖాస్తు చేసుకుంటే.. ఐదు రోజుల్లో పెన్షన్‌కార్డు ఇస్తామని పేర్కొన్నారు. ‘స్పందన’ కార్యక్రమంపై జిల్లా కలెక్టర్లు, ఎస్పీలతో మంగళవారం సీఎం జగన్ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... కొత్తగా 6,14,244 పెన్షన్లు ఇచ్చామనీ.. అయినప్పటికీ పథకం అందలేదన్న మాటలు వినిపిస్తున్నాయన్నారు. పెన్షన్ దరఖాస్తులను ఫిబ్రవరి 17 నాటికి కలెక్టర్లు రీ వెరిఫికేషన్ చేయాలని, 18కల్లా అప్లోడ్ చేసి, 19, 20 తేదీల్లో సోషల్ ఆడిట్ నిర్వహించాలని ఆదేశించారు. తుది జాబితా 20న ప్రకటించాలని సూచించారు. మార్చి 1న కార్డుతో పాటు, పెన్షన్ ఇవ్వాలని ఆదేశించారు. ఈ విషయంలో ఎలాంటి వివక్ష చూపకూడదని పునరుద్ఘాటించారు. బియ్యం కార్డుల విషయంలోనూ రీ వెరిఫికేషన్ పూర్తిచేయాలని ఆదేశించారు. అదే విధంగా అర్హులు ఎవ్వరికీ బియ్యం కార్డు రాలేదనే మాట వినిపించకూడదని సీఎం జగన్ స్పష్టం చేశారు. ‘‘ఫిబ్రవరి 18 కల్లా రీ వెరిఫికేషన్ పూర్తి కావాలి. ఫిబ్రవరి 15 నుంచి బియ్యంకార్డుల పంపిణీ. ఎవరికైనా రాకపోతే ఆందోళన చెందవద్దని చెప్పండి. దరఖాస్తు చేసుకున్న 5 రోజుల్లోగా కార్డు వస్తుంది. అలాగే ఆరోగ్యశ్రీ కార్డులు కూడా ఫిబ్రవరి 15 నుంచి పంపిణీ చేస్తారు. మార్చి 31 నాటికి అన్ని జిల్లాల్లో ఆరోగ్యశ్రీ కార్డులు పంపిణీ. కర్నూలు, వైఎస్సార్ కడప, విశాఖపట్నం, శ్రీకాకుళంలో ఫిబ్రవరి 15 నుంచి... అనంతపురం, ఉభయగోదావరి, నెల్లూరు, చిత్తూరు జిల్లాల్లో మార్చి 7 నుంచి... కృష్ణా, గుంటూరు, ప్రకాశం, విజయనగరం జిల్లాల్లో మార్చి 25 నుంచి... ఆరోగ్యశ్రీ కార్డులు పంపిణీ .1.41 కోట్ల మందికి క్యూఆర్ కోడ్‌తో ఆరోగ్యశ్రీ కార్డులు ఇవ్వాలి. కాబట్టి కొంత సమయం పడుతుంది. రూ. 5లక్షల లోపు ఆదాయం ఉన్నవారికి కూడా ఆరోగ్యశ్రీ కార్డులు ఇస్తున్నాం’’అని పేర్కొన్నారు. చంద్రబాబు అడ్డుకోవాలని ప్రయత్నిస్తున్నారు.. ‘‘ఇళ్ల పట్టాలకు సంబంధించి కూడా కొన్ని అంశాలు నా దృష్టికి వచ్చాయి. స్పందన ద్వారా 2 లక్షల పైచిలుకు వినతులు వస్తే 1 లక్షా 3 వేల వినతులకు శాంక్షన్ ఇచ్చాం. కరెంటు బిల్లులు ఎక్కువగా రావడం వల్ల దాదాపు 40 వేల వినతులను పెండింగులో ఉన్నట్టు చూస్తున్నాం. పూరిగుడిసెలో ఉన్నవాళ్లకు కరెంటు బిల్లు ఎక్కువగా వచ్చిందని ఆపేయడం కరెక్టు కాదు. గ్రామ వాలంటీర్ ద్వారా లబ్ధిదారులను గుర్తించి.. ఇళ్లపట్టా పొందడానికి అర్హుడు అని అనిపిస్తే.. వెంటనే ఇళ్లపట్టా ఇవ్వండి. నేను గ్రామాల్లో తిరిగే సరికి... ఇంటి పట్టా మాకు లేదన్న మాట ఎక్కడా వినిపించకూడదు. ఇళ్లపట్టాల విషయంలో కలెక్టర్లు చురుగ్గా పనిచేయాల్సి ఉంది. లక్షలమంది మనపై ఆశలు పెట్టుకున్నారు. వచ్చే 2 వారాలు అధికారులు ఇళ్లపట్టాలపై దృష్టిపెట్టాలి. ప్లాటింగ్, మార్కింగ్ పనులు త్వరితగతిన పూర్తికావాలి. ఇళ్లపట్టాలకు అవసరమైన భూమిని మార్చి 1 కల్లా సిద్ధం చేయాలి. 25 లక్షలమంది పట్టాలు ఇవ్వాలన్న మంచి కార్యక్రమం దిశగా మనం అడుగులు వేస్తుంటే... దీన్ని అడ్డుకోవాలని చంద్రబాబు ప్రయత్నిస్తున్నారు. కేసులు పెట్టి.. అడ్డుకోమని టెలికాన్ఫరెన్స్‌ల్లో తన నాయకులకు చెప్తున్నాడు. భూములు కొనుగోలు విషయంలో చురుగ్గా ముందుకు సాగాలి. అనుకున్నచోట భూములు దొరకని పక్షంలో ప్లాన్- బీ కూడా కలెక్టర్లు సిద్ధంచేసుకోవాలి. ఇంటి స్థలం లేని నిరుపేద రాష్ట్రంలో ఉండకూడదు. కావాల్సిన నిధులు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాను. ఉగాది రోజు ఆ కుటుంబాల్లో కచ్చితంగా పండుగ వాతావరణం ఉండాలి. వచ్చే ఏడాది నుంచి ఏడాదికి 6 లక్షల ఇళ్లు చొప్పున నిర్మించుకుంటూ పోతాం’’ అని సీఎం జగన్ అధికారులతో పేర్కొన్నారు. కంటి వెలుగు పథకం మూడో విడతలో భాగంగా... పిల్లలకు చేయాల్సిన సర్జరీలను వేసవి సెలవులు నాటికి వాయిదా వేసినట్లు అధికారులు ముఖ్యమంత్రి దృష్టికి తీసుకువచ్చారు. ‘‘25 రోజుల విశ్రాంతి అవసరం ఉన్న దృష్ట్యా తల్లిదండ్రుల కోరిక మేరకు కంటి శస్త్రచికిత్సలు వాయిదా వేశాం. కళ్లజోళ్లు కూడా అవసరమైన విద్యార్థులకు పంపిణీచేస్తున్నాం. మూడోవిడత కంటి వెలుగు కింద 56 లక్షలమంది అవ్వాతాతలకు స్క్రీనింగ్. అవ్వాతాతలకు పెన్షన్ల పంపిణీతో పాటు వాలంటీర్లచే కళ్లజోళ్లు పంపిణీ. మార్చి నుంచి అవసరమైన వారికి కంటి శస్త్రచికిత్సలు. గ్రామ సచివాలయాల్లోనే స్క్రీనింగ్. ప్రతి మండలానికి 2 నుంచి 3 టీంలు. దీనికోసం రూట్‌మ్యాప్‌లు సిద్ధంచేస్తున్నాం’ అని పేర్కొన్నారు. ఈ క్రమంలో సీఎం జగన్ మాట్లాడుతూ.. ‘‘కలెక్టర్లంతా ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలి. నియోజకవర్గాల వారీగా బృందాలను ఏర్పాటు చేయాలి. కంటివెలుగు మూడోవిడత ‘‘అవ్వా-తాత’’ కార్యక్రమం 18న కర్నూలులో ప్రారంభం. ఈ కార్యక్రమంలో నేను పాల్గొంటాను. ఆస్పత్రుల్లో నాడు-నేడు పనులకూ అదే రోజు శంకుస్థాపన. 4906 సబ్ సెంటర్లను నిర్మిస్తున్నాం. 4472 సబ్ సెంటర్లకు స్థలాలు గుర్తించారు. మిగిలిన వాటికి వెంటనే స్థలాలను గుర్తించాలి. ఈ నెలాఖరుకల్లా పనులు ప్రారంభం అవుతాయి’’అని తెలిపారు. జగనన్న వసతి దీవెన ఫిబ్రవరి 24న ప్రారంభం ‘‘ఉన్నత చదువులు చదువుతున్నవారికి అండగా వసతి దీవెన కార్యక్రమం. విజయనగరంలో ఈ కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్నాం. సంవత్సరానికి రూ.20వేల రూపాయలు రెండు దఫాల్లో ఇస్తాం.11,87,904 మందికి లబ్ధి. 53720 ఐటీఐ చదువుతున్న వారికి మొదటి దఫా రూ.5వేలు, ఏడాదికి రూ.10వేలు. పాలిటెక్నిక్ చదువుతున్న వారికి మొదటి దఫా రూ. 7,500వేలు, ఏడాదికి రూ.15వేలు. డిగ్రీ ఆపై చదువులు చదువుతున్న వారికి మొదటి దఫా రూ.10వేల రూపాయలు. ఏడాదికి రూ.20వేలు. విద్యార్థుల తల్లుల అకౌంట్లోకి డబ్బు జమ చేస్తాం’’అని సీఎం జగన్ పేర్కొన్నారు. సీఎం వైఎస్ జగన్ ఇంకా ఏమన్నారంటే.. షాపులు నడుపుకుంటున్న రజకులు, నాయీబ్రాహ్మణులు, టైలర్లకు వచ్చే మార్చిలో ఏడాదికి రూ.10వేలు కాపు నేస్తంలో భాగంగా మహిళలను ఆదుకునే కార్యక్రమం కూడా మార్చిలో ప్రారంభం మార్గదర్శకాలు తయారుచేసి వాలంటీర్ల సహాయంతో లబ్ధిదారులను ఎంపిక చేయాలి చిరునామాల మ్యాపింగ్ అనేది గ్రామ, వార్డు సచివాలయాల్లో ముఖ్యమైన కార్యక్రమం గ్రామ వాలంటీర్ల చేతిలో మొబైల్ ఫోన్లు ఉన్నాయి అడ్రస్ మ్యాపింగ్ సరిగ్గా చేయని కారణంగా.. పెన్షన్లు ఇవ్వడానికి కొన్నిచోట్ల సమయం పడుతుంది మ్యాపింగ్ జరిగితే.. వేగవంతంగా పెన్షన్లు ఇవ్వగలుగుతాం వచ్చే నెల పెన్షన్లు మొదటి 2 రోజుల్లోనే పూర్తికావాలి గ్రామ, వార్డు సచివాలయాలను కలెక్టర్లు ఓన్ చేసుకోవాలి ఎక్కడా గ్యాప్ లేకుండా చూసుకోవాలి వాలంటీర్లు అందుబాటులో ఉన్నారా? లేదా? అన్న కనీస సమాచారం మనవద్ద ఉండాలి లేకపోతే ఆ యాభై కుటుంబాలకు సంబంధించిన సేవలు పెండింగులో ఉంటాయి ఇక వార్డు, గ్రామ సచివాలయాల్లోని ఉద్యోగులు కూడా సమయానికి వస్తున్నారా? లేదా? చూసుకోవాలి గ్రామ, వార్డు సచివాలయాల్లో మనం అందిస్తామన్న 541 సేవలు అనుకున్న సమయానికి అందుతున్నాయా? లేదా? చూసుకోవాలి ఈ పరిశీలనలవల్ల లోపాలు ఎక్కడున్నాయో తెలుస్తాయి, వాటిని సరిదిద్దుకునే అవకాశం ఉంటుంది గ్రామ సచివాలయాలనుంచే వినతులు, దరఖాస్తులు నిర్దేశిత సమయంలోగా పరిష్కరించాలి రైతు భరోసా కేంద్రాల గురించి.. ఈ ఏడాది ఖరీఫ్ కల్లా రైతుభరోసా కేంద్రాలు ప్రారంభం ప్రతి 2వేల జనాభాకు సంబంధించి పూర్తి వ్యవసాయ అవసరాలను ఈ రైతు భరోసా కేంద్రాలు తీరుస్తాయి ఇ-క్రాపింగ్ తప్పనిసరిగా అమలు చేయాలి గ్రామీణ ఆర్థిక వ్యవస్థను పూర్తిగా మారుస్తాయి రైతు భరోసా కేంద్రాల నిర్మాణాలకు అవసరమైన స్థలాలను గుర్తించాలి ఎక్కడైనా రైతు ఆత్మహత్యచేసుకుంటే... కలెక్టర్ కచ్చితంగా వెళ్లాలని చెప్పాం పరిహారం అందని రైతు కుటుంబాలకు వెంటనే చెల్లింపులు చేయాలి ఎలాంటి ఆలస్యం లేకండా ఆత్మహత్య చేసుకున్న రైతుల కుటుంబాలకు చెల్లింపులు చేయాలి 2014 నుంచి 2019లో మనం అధికారంలోకి వచ్చేంత వరకూ ఆత్మహత్య చేసుకున్న రైతుకుటుంబాల్లో పరిహారం అందని 422 మంది కుటుంబాలకు ఈనెల 24న పరిహారం అందించాలి స్థానిక ప్రజాప్రతినిధులతో కలిసి ఆయా కుటుంబాల దగ్గరికి వెళ్లి వారికి పరిహారం ఇవ్వాలి -
రైతుభరోసాలో కుమార్తె పేరు చేర్చనందుకు బరితెగింపు
దాచేపల్లి (గురజాల) : రైతుభరోసా పథకంలో కౌలురైతు కింద తన కుమార్తె పేరును చేర్చడానికి నిబంధనలు అంగీకరించవని చెప్పిన పాపానికి విధి నిర్వహణలో ఉన్న వ్యవసాయ శాఖ మహిళా ఎంపీఈఓపై టీడీపీ సానుభూతిపరుడు విచక్షణారహితంగా దాడిచేశాడు. ఒకే రేషన్ కార్డులో ఇద్దరి పేర్లు ఉంటే పథకం వర్తించదని చెబుతున్నా వినకుండా ఎంపీఈఓ జుట్టు పట్టుకుని లాగి చెంపపై కొట్టి కిందపడేశాడు. అడ్డుకోబోయిన ఆమె తండ్రిని సైతం కొట్టాడు. ఇతర రైతులనూ బెదిరించాడు. గుంటూరు జిల్లా దాచేపల్లి మండలం మాదినపాడు గ్రామంలో శనివారం సంచలనం సృష్టించిన ఈ ఘటనకు సంబంధించి బాధితురాలి తెలిపిన వివరాలివీ.. వైఎస్సార్ రైతు భరోసా పథకానికి అర్హులైన రైతుల జాబితాను తయారుచేసేందుకు గ్రామ పంచాయతీ కార్యాలయంలో సంబంధిత అధికారులు శనివారం రైతుల నుంచి వివరాలు సేకరిస్తున్నారు. షేక్ మస్తాన్ అనే రైతు తనకున్న రెండెకరాలతో పథకానికి అర్హత సాధించాడు. ఇదే భూమిని తన కుమార్తె కౌలుకు తీసుకుని సాగు చేస్తున్నట్లుగా గుర్తించి ఆమెకూ పథకం ద్వారా లబ్ధి చేకూర్చాలని ఎంపీఈఓ వెన్నా దివ్యను కోరాడు. రేషన్‌కార్డులో మస్తాన్, అతని కుమార్తె ఉండడంవల్ల ఈ పథకం వర్తించదని దివ్య తేల్చి చెప్పారు. దీంతో మస్తాన్ ఆగ్రహంతో దివ్యను జుట్టుపట్టి లాగి చెంపపై కొట్టి కిందపడేశాడు. అడ్డువచ్చిన దివ్య తండ్రి రామకృష్ణారెడ్డిని కూడా మస్తాన్ కొట్టాడు. ఇతనికి మరో ఇద్దరు వ్యక్తులు నబీ సాహెబ్, సైదులు కూడా సహకరించారు. కాగా, దాడిని అడ్డుకునేందుకు ప్రయత్నించిన ఇతర రైతులనూ వీరు బెదిరించారు. దీంతో తనపై దాడిచేసిన మస్తాన్, అతని అనుచరులపై చర్యలు తీసుకోవాలని కోరుతూ బాధిత ఎంపీఈఓ దాచేపల్లి పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. నిందితులను ఎస్ఐ అద్దంకి మధుపవన్ అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు. మాజీ జెడ్పీటీసీ మూలగొండ్ల ప్రకాష్‌రెడ్డి, వైఎస్సార్సీపీ మండల కన్వీనర్ షేక్ జాకీర్‌హుస్సేన్ తదితరులు ఎంపీఈఓను పరామర్శించి ధైర్యం చెప్పారు. ఉద్యోగులపై దాడిచేస్తే కఠిన చర్యలు విధుల్లో ఉన్న ప్రభుత్వోద్యోగులపై దాడులు చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని తహసీల్దార్ గర్నెపూడి లెవీ హెచ్చరించారు. బాధితురాల్ని ఆయనతోపాటు మండల వ్యవసాయశాఖ అధికారి ఎం.సంధ్యారాణి పరామర్శించారు. ఈ ఘటనపై కలెక్టర్‌కు నివేదిక పంపినట్లు లెవీ చెప్పారు. ప్రభుత్వం అమలుచేస్తున్న పథకాలను నిష్పక్షపాతంగా అమలుచేసే ఉద్యోగులపై దాడులు చేయడం మంచిది కాదని వారిద్దరూ అన్నారు. -
రైతు భరోసా ప్రారంభానికి ప్రధాని మోదీకి ఆహ్వానం
సాక్షి, అమరావతి : ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి రాష్ట్ర ప్రజల సంక్షేమం కోసం అమలు చేయనున్న పథకాల యాక్షన్ ప్లాన్‌ను ప్రభుత్వం సిద్ధం చేసింది. ఈ మేరకు అన్ని జిల్లాల కలెక్టర్లకు పథకాల అమలుకు సంబంధించిన షెడ్యూల్‌ను వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సీఎం వివరించారు. ఇక ఈ షెడ్యూల్ ప్రకారం.. అక్టోబరు 15న రైతు భరోసా కార్యక్రమాన్ని ప్రారంభిస్తామని సీఎం జగన్ చెప్పారు. ఈ కార్యక్రమ ప్రారంభానికి ప్రధానమంత్రి నరేంద్ర మోదీని ఆహ్వానించామని అన్నారు. దేశంమొత్తం ఈ కార్యక్రమాల వైపు చూడాలని సీఎం ఆకాక్షించారు. ఎక్కడా పొరపాట్లు లేకుండా చూసుకోవాల్సిన బాధ్యత కలెక్టర్లపై ఉందని స్పష్టం చేశారు. (చదవండి : పథకాల అమలుకు యాక్షన్ ప్లాన్ సిద్ధం) గ్రామ సచివాలయమే కౌలు రైతులకు కార్డులు ఇస్తుందని వెల్లడించారు. 11 నెలల కాలానికి ఇది వర్తిస్తుందని అన్నారు. రైతులకు ఎలాంటి నష్టం రాకుండా, భూమిపై తమకున్న హక్కులకు భంగం వాటిల్లకుండా కేవలం పంటపైన మాత్రమే 11 నెలలపాటు కౌలు రైతుకు హక్కు లభిస్తుందని తెలిపారు. కౌలు రైతులకు కార్డులు అందగానే వాళ్లు రైతు భరోసాకు అర్హులవుతారని చెప్పారు. ఈ ఒక్కసారికి మాత్రమే రైతు భరోసా రబీకి ఇస్తున్నామని.. వచ్చే ఏడాది నుంచి మేలో ఇస్తామన్నారు. తద్వారా ఖరీఫ్‌లో రైతులకు బాసటగా ఉంటామని అన్నారు. -
‘సాగుదారుల చుట్టం’..!
సాక్షి, అమరావతి : రాష్ట్రంలోని లక్షల మంది కౌలు రైతులకు మేలు చేకూర్చే చరిత్రాత్మక బిల్లును శాసనసభ గురువారం సభ్యుల హర్షధ్వానాల మధ్య ఆమోదించింది. ‘ఆంధ్రప్రదేశ్ పంట సాగుదారు హక్కుల బిల్లు–2019’పై సుదీర్ఘ చర్చ అనంతరం రెండు సవరణలతో అసెంబ్లీ ఆమోదం తెలిపింది. దీనివల్ల రాష్ట్రంలోని 15.36 లక్షల మంది కౌలు రైతులకు మేలు జరుగుతుంది. భూ యజమానితోపాటు ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ వర్గాలకు చెందిన కౌలు రైతులకు కూడా రైతు భరోసా కింద ఇచ్చే రూ.12,500 పెట్టుబడి సాయం అందుతుంది. భూ యజమానులకు ఈ బిల్లుతో ఎటువంటి నష్టం ఉండదు. అడ్డుకోవడం సరికాదన్న సభాపతి టీ విరామం అనంతరం సభ ప్రారంభమయ్యాక ఉపముఖ్యమంత్రి, రెవెన్యూ శాఖ మంత్రి పిల్లి సుభాష్ చంద్రబోస్ పంట సాగుదారు హక్కుల బిల్లు–2019ని సభలో చర్చకు ప్రవేశపెట్టారు. అయితే కౌలు రైతుల కోసం అద్వితీయమైన బిల్లును తెస్తున్న సమయంలో విపక్ష సభ్యుల తీరు సరిగా లేదని స్పీకర్ తమ్మినేని సీతారాం పేర్కొన్నారు. పదేపదే విజ్ఞప్తి చేసినా వినకపోవడం, వాదోపవాదాలతో అడ్డుతగలడంతో విపక్ష సభ్యులను సస్పెండ్ చేయక తప్పడం లేదన్నారు. ఎవరి కోసమో సభను తాకట్టు పెట్టడానికి సిద్ధంగా లేనన్నారు. శాసనసభను అడ్డుకునే అధికారం ఎవరికీ లేదని స్పష్టం చేశారు. కౌలు రైతులకు ప్రయోజనం కలిగించే అంశాన్ని అడ్డుకోవడం మంచిది కాదని సూచించారు. చరిత్ర పుటల్లో నిలిచిపోయేలా బిల్లుల్ని ఆమోదిస్తున్నారని ఇతర రాష్ట్రాలు కూడా ప్రశంసిస్తుంటే చర్చ జరగకుండా అడ్డుపడటం మంచి సంప్రదాయం కాదన్నారు. కౌలురైతుకు పంట రుణం, బీమా, పెట్టుబడి సాయం, పరిహారం.. అనంతరం మంత్రి పిల్లి సుభాష్ చంద్రబోస్ మాట్లాడుతూ వ్యవసాయ రంగం తీవ్ర నిరాశ, నిస్పృహలతో మునిగి ఉన్న తరుణంలో ఈ బిల్లును ప్రవేశపెట్టడం ముదావహమన్నారు. వాస్తవ సాగుదారులైన కౌలు రైతులు ఆర్థికంగా నష్టపోయి ఆత్మహత్యలకు పాల్పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్రంలో ఇప్పటివరకు కేవలం 5 లక్షల మంది కౌలు రైతులకు మాత్రమే అరకొరగా సాయం అందుతోందన్నారు. భూ యజమానుల హక్కులకు ఎటువంటి భంగం కలుగకుండా కౌలు రైతులకు కేవలం 11 నెలల కాలానికి పంట మీద మాత్రమే హక్కు కల్పించేలా ఈ బిల్లును తెచ్చినట్లు వివరించారు. భూ యజమానులకు ఎలాంటి అనుమానాలు ఉండాల్సిన అవసరం లేదన్నారు. పాత కౌల్దారి చట్టం విఫలమైన నేపథ్యంలో కొత్త చట్టం అవసరమైందని వివరించారు. ప్రజా సంకల్ప పాదయాత్రలో వైఎస్ జగన్మోహన్రెడ్డి కౌలు రైతుల కష్టాలను స్వయంగా తెలుసుకుని వారిని ఆదుకుంటామని భరోసా ఇచ్చారని చెప్పారు. ఈ బిల్లుతో కౌలు రైతులకు కూడా పంట రుణం, పంటల బీమా, పెట్టుబడి సాయం, ఒప్పంద కాలంలో పంట నష్టపోతే పరిహారం తదితరాలు అందుతాయన్నారు. తమకు మేలు చేసిన ముఖ్యమంత్రి జగన్‌కు కౌలురైతులు కృతజ్ఞతలు చెబుతున్నారని తెలిపారు. సభ్యుల ప్రసంగాల అనంతరం ఈ బిల్లు ఆవశక్యత, ముఖ్యాంశాలను ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి సభకు వివరించారు. అనంతరం రెండు సవరణలతో బిల్లును సభ ఆమోదించింది. సభలో స్పందనలు... ‘పొరుగు రాష్ట్రంలో మాదిరిగా కాకుండా ఆచరణాత్మక దృక్పథంతో రూపొందించిన ఈ బిల్లు చరిత్రాత్మకం. వ్యవసాయం మళ్లీ నిలదొక్కుకునేందుకు, రైతులను అప్పులు ఊబి నుంచి తప్పించేందుకు ఈ బిల్లు తోడ్పడుతుంది. 1977 ప్రొహిబిషన్ ఆఫ్ టాన్స్‌ఫర్ (పీవోటీ) యాక్ట్ ప్రకారం భూములు ఇచ్చిన వారికి కూడా ప్రభుత్వ రాయితీలు అందేలా చట్టాన్ని మార్చాలి’ – సీనియర్ ఎమ్మెల్యే ధర్మాన ప్రసాదరావు ‘సాగుదార్లలో 70 శాతం మంది కౌలు రైతులే. వారికి సాయం అందేలా ఈ బిల్లు ఉపయోగపడుతుంది. రైతుల్లో నైపుణ్యాభివృద్ధికి కృషి చేయాలి. రైతు నికరాదాయం పెరిగినప్పుడే వృద్ధి రేటు పెరుగుతుంది. అగ్రిమిషన్ వైస్ చైర్మన్‌గా అనుభవజ్ఞుడైన రైతు నాయకుడు ఎంవీఎస్ నాగిరెడ్డిని నియమించడాన్ని స్వాగతిస్తున్నాం’ – జగ్గయ్యపేట ఎమ్మెల్యే సామినేని ఉదయభాను ‘వ్యవసాయానికి నూతన జవసత్వాలు కల్పించేందుకు ఈ బిల్లు తోడ్పడుతుంది. నకిలీ కౌలు ఒప్పందాలను నిరోధించాలి. 1977 పీవోటీ యాక్ట్‌ను సవరిస్తే అనేక నష్టాలుంటాయి’ – కందుకూరు ఎమ్మెల్యే మహీధర్‌రెడ్డి ‘ఈ బిల్లు చట్టమైతే పంటసాగుదార్లకు చుట్టం అవుతుంది’ – పీడిక రాజన్న దొర ‘కౌలు రైతులకు ఈ బిల్లు ఎంతో ఉపయోగపడుతుందనడంలో సందేహం లేదు’ –పామర్రు ఎమ్మెల్యే అనిల్‌కుమార్ ‘ఏ ముఖ్యమంత్రికీ రాని ఆలోచన మా నాయకుడు వైఎస్ జగన్మోహన్రెడ్డికి వచ్చింది. కౌలు రైతులకు మేలు చేసే ఈ బిల్లును ఆమోదించడం ద్వారా రాష్ట్ర వ్యవసాయ రంగంలో నూతనాధ్యాయం మొదలవుతుంది. భూ యజమానులు పెద్ద మనసుతో అర్థం చేసుకుని కౌలురైతులకు అండగా నిలవాలి’ – ఎమ్మెల్యే జగ్గిరెడ్డి, కొత్తపేట -
రైతు కళ్లలో ఆనందమే లక్ష్యం
సాక్షి, ఒంగోలు సబర్బన్: రైతు కళ్లలో ఆనందం చూడడమే ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి లక్ష్యమని రాష్ట్ర విద్యుత్, అటవీ, పర్యావరణ, శాస్త్ర సాంకేతిక శాఖ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి అన్నారు. స్థానిక దక్షణ బైపాస్‌లోని పాత జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో సోమవారం రైతు దినోత్సవం నిర్వహించారు. ఈ సందర్భంగా బాలినేని మాట్లాడుతూ రాష్ట్రంలో 60 శాతంగా ఉన్న రైతులకు ఎంత చేసినా తక్కువేనన్నారు. ఎన్నికల సందర్భంగా మేనిఫెస్టోలో పొందుపరిచిన రైతు భరోసా పథకాన్ని ఈ ఏడాది అక్టోబర్ 15 నుంచి రైతులకు ఏడాదికి రూ.12,500 చొప్పున అందిస్తామన్నారు. రైతుల కష్టాలను పాదయాత్రలో స్వయంగా తెలుసుకున్న జగన్మోహన్నెడ్డి వడ్డీ లేని రుణాలు ఇచ్చేందుకు నిర్ణయించారన్నారు. వ్యవసాయానికి పగటి పూట నిరంతరాయంగా 9 గంటల విద్యుత్ ఇవ్వాలని నిర్ణయించామని, కానీ విద్యుత్ లైన్లు సక్రమంగా లేకపోవటంతో మొదటి విడతగా 60 శాతం రైతులకు ఇస్తున్నామని, మిగిలిన 40 శాతం మంది రైతులకు వచ్చే ఏడాది మార్చికల్లా లైన్లు మరమ్మత్తులు చేసి పూర్తి స్థాయిలో అందిస్తామన్నారు. విద్యుత్ లైన్ల మరమ్మత్తులకు మొత్తం రూ.1,500 కోట్లు ఖర్చు అవుతుందన్నారు. అయినా ముఖ్యమంత్రి వెనకాడకుండా ముందుకు సాగుతున్నారని పేర్కొన్నారు. ఆక్వా రైతులను ఆదుకునేందుకు యూనిట్‌ను రూ.1.50 ఇచ్చేందుకు నిర్ణయించి ప్రకటించారన్నారు. దీంతో ప్రభుత్వంపై రూ.720 కోట్ల అదనపు భారం పడుతుందన్నారు. కలెక్టర్ పోలా భాస్కర్ మాట్లాడుతూ రైతులను ఆదుకోవటంలో ప్రభుత్వం కృత నిశ్చయంతో ఉందన్నారు. రైతులు పండించిన పంటను నిల్వ చేసుకోవటానికి కోల్డ్ స్టోరేజీలు, గోదాముల నిర్మాణానికి కార్యాచరణ రూపొందిస్తున్నట్లు వివరించారు. జిల్లాలో ఫుడ్ ప్రాసెసింగ్ ప్లాంట్ నెలకొల్పేందుకు ప్లాన్ ఆఫ్ యాక్షన్ రూపొందిస్తున్నామన్నారు. మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి పోలవరం ప్రాజెక్టుపై ప్రత్యేకంగా దృష్టి సారించమని చెప్పారని, అది త్వరగా పూర్తయితే జిల్లాలో సాగు, తాగు నీటికి ఇబ్బందులు తొలుగుతాయన్నారు. 2020 జూన్ నాటికి మొదటి టన్నెల్ పూర్తి చేసి నీటి విడుదలకు రంగం సిద్ధం చేస్తున్నట్లు పేర్కొన్నారు. వ్యవసాయ శాఖ జాయింట్ డైరెక్టర్ డాక్టర్ పీవీ రామమూర్తి మాట్లాడుతూ సాధారణ పంటల్లో అంతర పంటల సాగు ఎంతో మేలు చేస్తుందన్నారు. కార్యక్రమానికి జిల్లా పరిశ్రమల శాఖ జీఎం జి.గోపాల్ అధ్యక్షత వహించారు. సమావేశంలో జిల్లా అధికారులు వి.రవీంద్రనాథ్ ఠాగూర్, ఏఎంసీఝేడీ రాఘవేంద్ర కుమార్, ఏపీఎంఐపీ పీడీ రవీంద్రబాబు, ఇతర అధికారులు పాల్గొన్నారు. రైతులను సన్మానిస్తున్న మంత్రి, కలెక్టర్ తదితరులు ఉత్తమ రైతులకు సన్మానం ఉత్తమ రైతులను మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి ఘనంగా సన్మానించారు. వ్యవసాయ అనుబంధ విభాగాల్లో అత్యుత్తమ ప్రతిభ కనబరిచిన నలుగురు రైతులను మెమోంటో, ప్రసంశాపత్రంతో పాటు శాలువాతో సత్కరించారు. పశుసంవర్ధక శాఖ తరుఫున పశుపోషణలో, పాడి అభివృద్ధిలో ప్రతిభ కనబరిచిన పశుపోషకుడు కోటా వెంకట్రామిరెడ్డి, వ్యవసాయంలో ప్రతిభ కనబరిచిన బత్తుల చంద్రశేఖర రెడ్డి, ఉద్యాన పంటల్లో ప్రతిభ కనబరిచిన బలగాని బ్రహ్మయ్య, రొయ్యలు, చేపల పెంపకంలో ప్రతిభ కనబరిచిన మున్నంగి రాజశేఖర్‌లు ఉన్నారు. అనంతరం వైఎస్ఆర్ పింఛన్ల కానుక సందర్భంగా పింఛన్లు పంపిణీ చేశారు. రైతులకు భూసార పరీక్షల కార్డులను పంపిణీ చేశారు. ఉన్నత పాఠశాలల విద్యార్థినులకు సైకిళ్లు అందజేశారు. అనంతరం ఆక్వా రైతులు మంత్రి బాలినేని సన్మానించారు. ఆక్వా రైతులకు ప్రభుత్వం యూనిట్ ధరను తగ్గించినందుకుగాను కృతజ్ఞతగా శాలువా కప్పి సన్మానించారు. కలెక్టర్ పోలా భాస్కర్‌ను కూడా ఆక్వా రైతులు సన్మానించారు. -
జమ్మలమడుగులో వైఎస్సార్ రైతు దినోత్సవం
-
కడప నుంచే నవరత్నాలకు శ్రీకారం
-
కడప గడపనుంచే నవరత్నాలకు శ్రీకారం
సాక్షి, కడప : దివంగత ముఖ్యమంత్రి, మహానేత, రైతు బాంధవుడు డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి 70వ జయంతి వేడుకలు తెలుగు రాష్ట్రాల్లో ఘనంగా జరిగాయి. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మహానేత జయంతి(జూలై, 8)ని ‘వైఎస్సార్ రైతు దినోత్సవం’గా జరుపుతున్న సంగతి తెలిసిందే. రైతు దినోత్సవం ప్రధాన కార్యక్రమాన్ని జమ్మలమడుగులో నిర్వహిస్తున్నారు. ఈ సదస్సులో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి పాల్గొన్నారు. సభా వేదికపైకి చేరుకున్న సీఎం జగన్ అక్కడ ఏర్పాటు చేసిన వైఎస్సార్ విగ్రహానికి పూలమాలవేసి నివాళులర్పించారు. జ్యోతిప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. కార్యక్రమంలో వ్యవసాయ మంత్రి కురసాల కన్నబాబు, పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, ఎంపీ అవినాష్‌రెడ్డి, జమ్మలమడుగు ఎమ్మెల్యే సుధీర్‌రెడ్డి, ఇతర మంత్రులు, ఎమ్మెల్యేలు, వేలాదిమంది రైతులు, పార్టీ కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు. రైతులను ఆదుకుంటామనే హామీలో భాగంగా రామసుబ్బమ్మ అనే మహిళకు ముఖ్యమంత్రి జగన్ రూ.7 లక్షల చెక్కు అందజేశారు. అప్పుల బాధ తట్టుకోలేక 2015లో రామసుబ్బమ్మ భర్త బలవన్మరణానికి పాల్పడ్డారు. ‘వైఎస్సార్ పెన్షన్ కానుక’ పథకాన్ని ప్రారంభించిన అనంతరం సీఎం జగన్ మాట్లాడుతూ.. కడప నుంచే శ్రీకారం.. రైతులు, పేదలు, వృద్ధులు, విద్యార్థులకు చేయూతనిచ్చే నవరత్నాలకు కడప గడపనుంచే శ్రీకారం చుడుతున్నట్టు సీఎం జగన్ చెప్పారు. వైఎస్సార్ పెన్షన్ పథకం కింద అవ్వాతాతలకు రూ.2,250, దివ్యాంగులకు రూ.3వేలు, డయాలసిస్ పేషంట్లకు రూ.10 వేలు మంజూరు చేస్తున్నామని అన్నారు. వైఎస్సార్ జిల్లాకు గతంలో కంటే రెట్టింపుగా రూ.70 కోట్లు పెన్షన్‌గా ఇస్తున్నామని చెప్పారు. పెన్షన్ పథకానికి రూ.15,676 కోట్లు కేటాయించామన్నారు. అధికారంలోకి వచ్చిన నెలరోజుల్లోనే సంక్షేమ పథకాల అమలుకు చర్యలు తీసుకున్నామని అన్నారు. పెన్షన్ రాని అర్హులు నేరుగా సీఎం కార్యాలయానికి ఫిర్యాదు చేయొచ్చని సూచించారు. ఫిర్యాదు కోసం ప్రత్యేక నెంబర్‌ను ఏర్పాటు చేస్తామని అన్నారు. తప్పులు చేసినవారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. సంక్షేమ పథకాల అమలులో కులాలు, మతాలు, వర్గాలు పరిగణించమని సీఎం పునరుద్ఘాటించారు. రుణాలన్నీ సున్నావడ్డీకే.. రైతులందరికీ సున్నా వడ్డీకే రుణాలందిస్తామని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు. రైతులకు ఉచితంగా పగటిపూట 9 గంటల కరెంట్ ఇస్తామని వెల్లడించారు. రైతుల బాధల్ని గత ప్రభుత్వం ఏమాత్రం పట్టించుకోలేదని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. తమ ప్రభుత్వం రైతుల సంక్షేమం కోసం పనిచేస్తుందని ఉద్ఘాటించారు. ఆక్వా రైతులకు రూ.1.50కే విద్యుత్ సరఫరా చేస్తామని చెప్పారు. వైఎస్సార్ పంటలబీమా పథకానికి శ్రీకారం చుట్టామని తెలిపారు. ఖరీఫ్, రబీలలో సాగు చేసే 27 రకాల పంటలకు రైతులు చెల్లించాల్సిన ప్రీమియం వాటాను రాష్ట్ర ప్రభుత్వమే చెల్లిస్తుందన్నారు. రైతు బాగుంటేనే రాష్ట్రం బాగుంటుంది రైతు బాగుంటేనే ఏ రాష్ట్రమైనా బాగుంటుందని ముఖ్యమంత్రి అన్నారు. రైతుల కోసం వైఎస్సార్ రైతు భరోసా పథకం ప్రవేశ పెడుతున్నామని చెప్పారు. అక్టోబర్ 15నుంచి వైఎస్సార్ రైతు భరోసా కింద రూ. 12,500 ఇస్తామని తెలిపారు. రైతుల పంట రుణాల కింద రూ. 8,750 కోట్లు ఇస్తామన్నారు. భూ యాజమానుల హక్కులను పూర్తిగా కాపాడుతామని, అదే సమయంలో రైతులకు అండగా ఉంటామని స్పష్టం చేశారు. కౌలు రైతు చట్టంలో మార్పులు తీసుకొస్తామని చెప్పారు. అసెంబ్లీ సమావేశాల్లో కౌలు రైతులకు కొత్త చట్టం తీసుకొస్తామన్నారు. చెన్నూరు షుగర్ ఫ్యాక్టరీని త్వరలో తెరుస్తామని హామీ ఇచ్చారు. ప్రతి నియోజకవర్గంలో కోల్డ్ స్టోరేజ్, ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లు, వ్యవసాయ ల్యాబోరేటరీలు ఏర్పాటు చేసి.. రైతులకు నాణ్యమైన పురుగు మందులు, ఎరువు, విత్తనాలు ఇస్తామని వెల్లడించారు. వ్యవసాయ మిషన్ ఏర్పాటు చేసి ప్రతినెలా రైతు సమస్యలపై సమీక్ష చేస్తున్నామని తెలిపారు. ప్రతి రైతన్నకు ఎలా తోడుగా ఉండాలనేది ఆలోచిస్తున్నామన్నారు. పులివెందులలో అరటి పరిశోధనా కేంద్రాన్ని ఏర్పాటు చేశామని వెల్లడించారు. ప్రమాదవశాత్తు రైతు మరణించినా.. ఆత్మహత్య చేసుకున్నా ఆ కుటుంబానికి రూ. 7లక్షల చెక్ ఇవ్వాలని ఆదేశించినట్లు తెలిపారు. ఇవన్నీ అధికారంలోకి వచ్చిన నెలలోపే చేశామన్నారు. అధికారంలోకి రాగానే గిట్టుబాటు ధరలు కల్పించాం పామాయిల్ రైతులను చంద్రబాబునాయుడు సర్కార్ పట్టించుకోలేదని, వైఎస్సార్ సీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే గిట్టుబాటు ధరలు కల్పించామని సీఎం జగన్ తెలిపారు. ఏ ప్రభుత్వమైనా ఖరీఫ్ సీజన్ వచ్చిన వెంటనే విత్తనాలు అందుబాటులోకి తేవాలని, నవంబర్ నుంచి కొనుగోలు చేసి మే నాటికి అందుబాటులోకి తేవాలని చెప్పారు. గత ప్రభుత్వమే విత్తనాలు కొనుగోలు చేయాలి.. కానీ, చంద్రబాబు ప్రభుత్వం పట్టించుకోలేదంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. విత్తనాలకు సంబంధించిన బకాయిలు కూడా చెల్లించలేదని వెల్లడించారు. వ్యవసాయశాఖ అధికారులు చంద్రబాబుకు లేఖలు రాశారని తెలిపారు. దారుణమైన పరిస్థితుల్లో కూడా రైతులకు అండగా నిలిచామన్నారు. అధికారంలోకి వచ్చిన వెంటనే విత్తన బకాయిలు చెల్లించామని చెప్పారు. రూ. 2వేలకోట్ల కరువు బకాయిలు చెల్లించడంలో గత సర్కార్ విఫలమైందన్నారు. ఆ బకాయిలను అధికారంలోకి రాగానే చెల్లించామని తెలిపారు. -
రైతులకు భరోసాకే రాహుల్ యాత్ర
హైదరాబాద్: రైతులకు భరోసా ఇవ్వడానికే రాహుల్ గాంధీ ఈ పర్యటన చేపట్టారని, రైతు ఆత్మహత్యలపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నాయని టీపీసీసీ వర్కింగ్ ప్రసిడెంట్ మల్లు బట్టి విక్రమార్క ఆరోపించారు. రాహుల్ రైతు భరోసా యాత్ర సందర్భంగా శంషాబాద్ విమానాశ్రయంలో ఆయనకు స్వాగత ఏర్పాట్లను బుధవారం ఆయన మాజీ మంత్రి సబితారెడ్డి, ఎమ్మెల్సీ సుధాకర్‌రెడ్డి, కాంగ్రెస్ సీనియర్ నాయకులు మల్లు రవి, నర్సింహారెడ్డి, మాజీ ఎమ్మెల్యే ప్రతాప్‌రెడ్డితో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ముఖ్యమంత్రి, మంత్రులు రాష్ట్రంలో రైతులు, ప్రజల సమస్యలపై బాధ్యత లేకుండా వ్యవహరిస్తున్నారని విమర్శించారు. ముఖ్యమంత్రి టీఆర్ఎస్ నాయకులకు మంత్రి పదవులు ఇచ్చి భరోసా కల్పించారని ఎద్దేవా చేశారు. స్వాగత ఏర్పాట్లలో బిజీ బిజీ.. శంషాబాద్ విమానాశ్రయానికి గురువారం చేరుకోనున్న రాహుల్‌గాంధీకి ఘన స్వాగతం పలకడానికి కాంగ్రెస్ శ్రేణులు ఏర్పాట్లు చేస్తున్నాయి. విమానాశ్రయంలోని హజ్‌హౌజ్ వద్ద రాహుల్‌కు స్వాగతం పలకనున్నారు. పీసీసీ ప్రతినిధులు, సీనియర్ నాయకులు, పార్టీ జెడ్పీటీసీ, ఎంపీటీసీ సభ్యులు, నాయకులు, కార్యకర్తలతో విడివిడిగా రాహుల్‌గాంధీ కలవడానికి తగు ఏర్పాట్లు చేస్తున్నారు. హజ్‌హౌజ్ భవనం ఎదుట కార్యకర్తలను కలవడానికి బారికేడ్లు, టెంట్‌ను ఏర్పాటు చేశారు. కార్యక్రమంలో డీసీఎంఎస్ చైర్మన్ కె.శ్రవణ్‌కుమార్‌గౌడ్, ఎంపీపీ చెక్కల ఎల్లయ్య, సర్పంచ్ సిద్దేశ్వర్, కాంగ్రెస్ మండల అధ్యక్షుడు వేణుగౌడ్, మాజీ ఎంపీపీ మురళీధర్‌రెడ్డి, నాయకులు రమణారెడ్డి, శ్రీనివాస్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.