దివంగత ముఖ్యమంత్రి, మహానేత, రైతు బాంధవుడు డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి 70వ జయంతి వేడుకలు తెలుగు రాష్ట్రాల్లో ఘనంగా జరిగాయి. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మహానేత జయంతి(జూలై, 8)ని ‘వైఎస్సార్ రైతు దినోత్సవం’గా జరుపుతున్న సంగతి తెలిసిందే. రైతు దినోత్సవం ప్రధాన కార్యక్రమాన్ని జమ్మలమడుగులో నిర్వహిస్తున్నారు. ఈ సదస్సులో ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి పాల్గొన్నారు. సభా వేదికపైకి చేరుకున్న సీఎం అక్కడ ఏర్పాటు చేసిన వైఎస్సార్ విగ్రహానికి పూలమాలవేసి నివాళులర్పించారు.