Pension beneficiaries
-
పెన్షన్ కోసం మా ప్రాణాలతో చెలగాటం ఆడుతున్నారు...
-
టీడీపీ అరాచకాలు.. పెన్షన్ దారులపై చంద్రబాబు పైత్యం
-
పింఛన్ దారుడి మృతిపై చలించిన సీఎం జగన్
సాక్షి, కాకినాడ: ప్రతీ నెలా ఒకటో తేదీన అందే ఫించన్‌తోనే నెలంతా గడిపే పేద కుటుంబాలు ఇప్పుడు ఆందోళనకు లోనవుతున్నాయి. ఒకటో తేదీన వలంటీర్లే అందించాల్సిన పెన్షన్‌ను.. ఈసీ కోడ్ మూలంగా తామే స్వయంగా తామే వెళ్లి తెచ్చుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఇందుకు చంద్రబాబు అండ్ కో చేసిన కుట్ర కారణమని ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అయితే మూడో తేదీన ఫించన్ అందుతుందని తెలిసినా.. వృద్ధులు, దివ్యాంగులు మాత్రం సచివాలయాల వద్ద పడిగాపులు పడుతున్న దృశ్యాలు కనిపిస్తున్నాయి. ఈ క్రమంలో.. విషాదాలు సైతం చోటు చేసుకుంటున్నాయి. కాకినాడ రూరల్ తూరంగిలో ఫించన్ అందలేదన్న బాధతో ఓ వృద్ధుడు గుండె ఆగి మరణించాడు. కే. వెంకట్రావ్(70) అనే వ్యక్తికి వలంటీర్ వ్యవస్థ మూగ బోయ్యిందన్న సమాచారం తెలియదు. దీంతో తీవ్ర ఆందోళనకు లోనయ్యాడు. ఈ క్రమంలో తానే స్వయంగా సచివాలయానికి వెళ్లి ఏం జరిగిందో తెలుసుకుందాం అనుకున్నాడు. మార్గం మధ్యలోనే గుండెపోటుకి గురై కన్నుమూశాడు. కూలీ పని చేసుకునే వెంకట్రావ్‌కు భార్య, ముగ్గురు పిల్లలు ఉన్నారు. వెంకట్రావ్ మృతి పట్ల కాకినాడ రూరల్ ఎమ్మెల్యే కురసాల కన్నబాబు సంతాపం వ్యక్తం చేశారు. ఆ కుటుంబాన్ని కలిసి ఓదార్చారు. అంతేకాదు.. వెంకట్రావ్ మృతి చెందిన విషయాన్ని సీఎం జగన్మోహన్రెడ్డి దృష్టికి తీసుకెళ్లారు. వెంకట్రావ్ మృతిపై చలించిపోయిన సీఎం జగన్.. వెంకట్రావ్ కుటుంబానికి ప్రభుత్వం తరఫున రూ. 5 లక్షల పరిహారం అందించాలని అధికారుల్ని ఆదేశించారు. చంద్రబాబు రాజకీయ లబ్ధికోసమే చేసిన కుట్రతో వలంటీర్లు ఫించన్ పంపిణీకి దూరమైయ్యారు. వలంటీర్ల ఫోన్ లు వెనక్కి ఇచ్చేయడంతో సమాచారం లేక వెంకట్రావు సచివాయాలనికి బయలు దేరాడు. మార్గ మధ్యలో గుండె ఆగి చనిపోవడం విషాదకరం. వెంకట్రావ్ కుటుంబాన్ని ఆదుకుంటాం అని కురసాల కన్నబాబు ఈ సందర్భంగా చెప్పారు. తిరుపతిలో మరో వృద్ధుడు.. తిరుపతిలో జిల్లా వెంకటగిరి బంగారుపేటలో 80 ఏళ్ల వృద్ధుడు వెంకటయ్య మృతి చెందాడు. వాలంటీర్లు ఇంటికి వెళ్లి పెన్షన్‌ను ఇవ్వరన్న మనస్తాపంతో గుండెపోటుతో అక్కడికక్కడే వెంకటయ్య కుప్పకూలిపోయాడు. మరోపక్క.. చంద్రబాబు, పవన్, బీజేపీ తీరుపై మనస్తాపానికి గురై పలువురు వలంటీర్లు ఇప్పటికే రాజీనామా చేసిన విషయం తెలిసిందే. పేదలకు ఇచ్చే పెన్షన్లను ఇవ్వకుండా అడ్డుకోవడం తమను బాధించిందన్నారు. ఒకటో తేదీ ఉదయం నుంచే తమకు పలువురు ఫించన్ కోసం ఫోన్లమీద ఫోన్లు చేస్తూ ఆరా తీస్తున్నారని, తకు ముందులా తాము బాధపడాల్సిన పరిస్థితులొచ్చాయని పెన్షనర్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారని వలంటీర్లు అంటున్నారు. -
‘ఏడాది తిరిగినా రాని పెన్షన్.. నెల రోజులకే వచ్చింది’
సాక్షి, రాజమహేంద్రవరం: రాష్ట్ర ప్రభుత్వం పెన్షన్ రూ.2750కు పెంచి పంపిణీ చేస్తోంది. దీంతో గత మూడ్రోజులుగా కోలాహలంగా పెన్షన్ వారోత్సవాలు జరుగుతున్నాయి. పెన్షన్ వారోత్సవాల్లో భాగంగా రాజమహేంద్రవరంలో నిర్వహించిన కార్యక్రమంలో లబ్దిదారులతో సీఎం వైఎస్ జగన్ మాట్లాడారు. ఈ సందర్భంగా వితంతు పింఛన్ అందుకుంటున్న రాజమండ్రిలోని మున్సిపల్ కాలనీకి చెందిన కోటా సామ్రాజ్యం అనే మహిళ మాట్లాడారు. తనకు ఈ ప్రభుత్వం నుంచి అందిన పథకాలను గుర్తు చేసుకుంటూ సీఎం వైఎస్ జగన్‌కు కృతజ్ఞతలు తెలిపారు. ‘గత ప్రభుత్వం హయాంలో నా భర్త చనిపోయాడు. నాకు ఇద్దరు పిల్లలు. భర్త చనిపోవడంతో రోడ్డుమీద పడ్డ నన్ను ఎవరూ పట్టించుకోలేదు. గత ప్రభుత్వం హయాంలో జన్మభూమి కమిటీలో నేను తిరగని రోజే లేదు. రోజూ వెళ్లి చెట్లకింద కూర్చుని పెన్షన్ దరఖాస్తు చేశాను. ఎవరూ మమ్మల్నీ పట్టించుకోలేదు. తిరిగి తిరిగి విసుగొచ్చి మేమే మానుకున్నాం. ఎప్పుడైతే మీరు సీఎం అయ్యారో, ఎప్పుడైతే మన ప్రభుత్వం వచ్చిందే.. వాలంటీరు నేరుగా మా ఇంటికే వచ్చారు. వితంతు పెన్షన్‌కు నేను దరఖాస్తు చేసుకున్నాను. ఏడాదిన్నర తిరిగితే రాని పెన్షన్ ఒక్క నెలకే వచ్చింది. ప్రతి నెల 1వ తేదీన వాలంటీరు వచ్చి మా చేతిలే పెన్షన్ డబ్బులు పెడుతుంటే పండగలాగా అనిపిస్తోంది.’అంటూ తన కుటుంబం లబ్ధిపొందిన వివరాలను చెబుతూ సీఎం వైఎస్ జగన్‌కు కృతజ్ఞతలు తెలిపారు సామ్రాజ్యం. వేదికపై మాట్లాడుతూ సీఎం వైఎస్ జగన్‌పై ఓ పాట పాడారు కోటా సామ్రాజ్యం. తన ఇంట్లో ఎప్పుడూ సీఎంను తలుచుకుంటూ ఓ పాట పాడుకుంటానని చెప్పారు. ‘దేవుడెలా ఉంటాడని ఎవరైనా అడిగితే..నా అన్నలా ఉంటాడని అంటాను నేను.’అని పాట అందుకున్నారు. సీఎం జగన్ అంటే తమకు దేవుడని, జై జగనన్న, జైజై జగనన్న అంటూ ముగించారు. ఇదీ చదవండి: అమితానందం..పండుగలా ఫించన్ల పంపిణీ -
పెన్షన్ లబ్ధిదారులతో ఇవాళ సీఎం జగన్ ముఖాముఖీ
-
మీ పీఎఫ్ ఖాతాకు ఈ-నామినేషన్ కంపల్సరీ.. సులభమైన అప్డేట్ కోసం 10 స్టెప్స్ ఇవే!
మీకు ఈపీఎఫ్ అకౌంట్ ఉందా? ఈపీఎఫ్ అకౌంట్లో నామినీ వివరాలు అప్డేట్ చేసి ఉన్నాయా? లేదంటే ఇప్పుడు చేయండి. ఎందుకంటే పీఎఫ్ క్లెయిమ్ సమయంలో సమస్యలు రాకుండా ఉండాలంటే నామినీ పేరు తప్పనిసరి చేయాలని కేంద్రం ప్రభుత్వం ఆదేశాలు కూడా జారీ చేసింది. దీని వల్ల ఉద్యోగులు తమ ప్రయోజనాలు పొందడంతో పాటు ఉద్యోగుల భవిష్య నిధి (EPF) ఉద్యోగుల పెన్షన్ పథకం (EPS) లాంటివి బెనిఫిట్స్‌తో పాటు అనేక ఇతర ప్రయోజనాలపై ఆన్లైన్ క్లెయిమ్ సెటిల్మెంట్లు కూడా ఉంటాయి. కనుక ఇప్పుడే ఆలస్యం కాకుండా త్వరగా మీ ఈపీఎఫ్ ఈ- నామినేషన్ చేయండి. ఈ నామినేషన్ సులభంగా చేసేయండి ఇలా... ►ఈపీఎఫ్ఓ( EPFO ) వెబ్సైట్లోకి వెళ్లి, ‘సర్వీసెస్’ విభాగంలోకి వెళ్లండి. ►‘ఫర్ ఎంప్లాయిస్’ విభాగంలో ‘మెంబర్ UAN/ఆన్లైన్ సర్వీస్’ ఆఫ్షన్ వస్తుంది. దానిపై క్లిక్ చేయండి. ►మీ UAN, పాస్‌వర్డ్‌తో లాగిన్ అవ్వండి. ►లాగిన్ అయ్యాక 'మేనేజ్' ట్యాబ్ కింద, 'ఇ-నామినేషన్' ఎంచుకోండి. ►ఇప్పుడు అందులో మీ 'వివరాలను నింపి' ట్యాబ్ కింద ఉన్న 'సేవ్' క్లిక్ చేయండి. ►తర్వాత మీ కుటుంబ డిక్లరేషన్‌ను అప్డేట్ చేసేందకు మీ కుటుంబ సభ్యుల ఆధార్, పేరు, పుట్టిన తేదీ, జెండర్,రిలేషన్, చిరునామా, బ్యాంక్ ఖాతా వివరాలు (ఆఫ్షనల్), గార్డియన్, పాస్‌పోర్ట్ సైజు ఫోటో వంటి అవసరమైన వివరాలను నింపిన తర్వాత ‘ఎస్’పై క్లిక్ చేయండి. ►ఇక ఒకరు లేదా అంతకంటే ఎక్కువ మంది కుటుంబ సభ్యులను వివరాలను నింపే ఆఫ్షన్ ఉంటుంది. అక్కడ ఉన్న 'యాడ్ ఫ్యామిలీ డీటెయిల్స్'పై క్లిక్ చేయండి. ►ఇందులో మీ కుటుంబ సభ్యుల వివరాలు నింపిన తర్వాత వారి నగదు వాటాను నిర్ణయించుకుని ఆ మొత్తాన్ని అందులో నింపాలి. ఆపై ‘సేవ్ ఈపీఎఫ్ నామినేషన్’పై క్లిక్ చేయండి. ►ఇప్పుడు 'ఈ-సైన్' ఆఫ్షన్‌పై క్లిక్ చేయడం ద్వారా ఆధార్‌తో లింక్ చేసిన మీ మొబైల్ నంబర్‌కు ఓటీపీ వస్తుంది. దాన్ని(otp) సబ్మిట్ చేయండి. ►అయితే ఈ-నామినేషన్‌ను దాఖలు చేసేందుకు, ఈపీఎఫ్ సభ్యలు ముందుగా యూఏఎన్( UAN )మెంబర్ పోర్టల్‌లో వారి యూఏఎన్ ఖాతాను యాక్టివేట్ చేయాల్సి ఉంటుంది. దీంతో పాటు వారి మెంబర్ ఐడీ, ఎస్టాబ్లిష్మెంట్ ఐడీ, పేరు, పుట్టిన తేదీ, తండ్రి/భార్య పేరు, సంబంధం, ఉద్యోగంలో చేరిన తేదీని నిర్ధారించుకోవాలి. వీటితో పాటు ప్రతి నామినీకి కేవైసీ( KYC) వివరాలను సమర్పించడంతో పాటు వారి PF/ EDL మొత్తం వాటాను కూడా తెలిపాల్సి ఉంటుంది. చదవండి: షావోమీ భారీ షాక్, లాభాలు రాలేదని వందల మంది ఉద్యోగులపై వేటు! -
పెన్షన్ లబ్ధిదారులకు సీఎం వైఎస్ జగన్ వ్యక్తిగతంగా లేఖలు
-
Andhra Pradesh: పింఛన్ రూ.2,500
స్పందన అర్జీల పరిష్కారంలో నాణ్యత కీలకం. ఒకే సమస్యపై తిరిగి రెండోసారి అర్జీ వస్తే గతంలో ఆ దరఖాస్తును పరిశీలించిన వారే మళ్లీ వెరిఫికేషన్ చేయకూడదు. ఆ అర్జీని పై అధికారి కచ్చితంగా పరిశీలించాలి. ఈ కీలక అంశాలు నిర్దిష్ట నిర్వహణ ప్రణాళిక (ఎస్వోపీ)లో ప్రధానం కావాలి. సమస్యలు చెప్పుకునేందుకు వచ్చిన ప్రజల పట్ల మానవతా థృక్పథంతో ఉండాలి. స్పందనపై కలెక్టర్లు పూర్తిగా మనసు పెట్టాలి. కార్యక్రమం మరింత మెరుగుపడాలి. – సీఎం వైఎస్ జగన్ సాక్షి, అమరావతి: రాష్ట్రంలో లక్షల మంది అవ్వాతాతల మోముల్లో చిరునవ్వులు విరబూసేలా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి కొత్త ఏడాది కానుక ప్రకటించారు. వైఎస్సార్ పెన్షన్ కానుక కింద పెద్ద వయసువారు ప్రస్తుతం అందుకుంటున్న మొత్తాన్ని మాట ప్రకారం ముఖ్యమంత్రి మరింత పెంచారు. ప్రస్తుతం ప్రతినెలా మొదటి రోజే రూ.2,250 చొప్పున ఇస్తున్న వైఎస్సార్ పెన్షన్ కానుకను జనవరి 1వతేదీన రూ.2,500కు పెంచి అవ్వా తాతల చేతిలో పెడతామని తెలిపారు. ‘స్పందన’లో భాగంగా కలెక్టర్లు, ఎస్పీలు, జేసీలు, ఉన్నతాధికారులతో మంగళవారం తన క్యాంపు కార్యాలయం నుంచి నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో సీఎం జగన్ ఈ విషయాన్ని వెల్లడించారు. ఇచ్చిన హామీ మేరకు పెన్షన్ కానుకను పెంచుతున్నామని, ఇది చాలా పెద్ద కార్యక్రమం అని తెలిపారు. ఈ సందర్భంగా డిసెంబర్, జనవరిలో అమలు చేసే పలు పథకాలు, కార్యక్రమాల వివరాలను సీఎం ప్రకటించారు. సుస్థిర అభివృద్ధి లక్ష్యాల సాధన, స్పందన సమస్యల పరిష్కారంపై ఉన్నతాధికారులకు మార్గనిర్దేశం చేశారు. ఆ వివరాలివీ... మనస్ఫూర్తిగా ‘స్పందన’ స్పందన కార్యక్రమంలో కలెక్టర్లు మనస్ఫూర్తిగా నిమగ్నం కావాలి. స్పందన అమలు యంత్రాంగాన్ని మరోసారి పరిశీలించాలి. రోజూ మధ్యాహ్నం 3 నుంచి సాయంత్రం 5 గంటల వరకు ప్రతి సచివాలయంలో స్పందన ద్వారా అర్జీలు స్వీకరిస్తున్నాం. దీంతోపాటు వారానికి ఒక రోజు అర్జీలు తీసుకుంటున్నాం. ఒక సచివాలయం స్థాయిలో ప్రతి రోజూ వస్తున్న అర్జీలను ఎలా పరిష్కరిస్తున్నారనే అంశంపై అధికారుల సమీక్ష అవసరం. మండల స్థాయిలో కూడా అధికారులు పరిశీలించాలి. వారంలో ఒకరోజు మండల అధికారులతో కలెక్టర్ సమీక్ష చేయాలి. మరింత మెరుగ్గా మన లక్ష్యాలు ఏ ఒక్కరినీ విడిచిపెట్టకుండా అర్హులందరికీ సంతృప్త స్థాయిలో, పారదర్శక పద్ధతిలో ప్రయోజనాలను అందించడం ఎస్డీజీ లక్ష్యాల వెనుక ప్రధాన ఉద్దేశం. నవరత్నాల ద్వారా అందరినీ మ్యాపింగ్ చేశాం. ఆశించిన లక్ష్యాలను సాధించాలి. దేశంతో పోలిస్తే మన లక్ష్యాలు మెరుగ్గా ఉండాలి. ఎస్డీజీ లక్ష్యాల సాధనపై కలెక్టర్లు దృష్టిపెట్టి పర్యవేక్షణ యంత్రాంగాన్ని ఏర్పాటు చేసుకోవాలి. ప్రతి జిల్లా ఎస్డీజీ లక్ష్యాల సాధనలో ముందుకు సాగాలి. ఉగాది నాటికి పూర్తి కావాలి సచివాలయాలు, ఆర్బీకేలు, హెల్త్ క్లినిక్‌ల భవన నిర్మాణాలన్నీ ఉగాది నాటికి పూర్తి చేసేలా అధికారులు చర్యలు చేపట్టాలి. డిజిటల్ లైబ్రరీలు కూడా త్వరలో అందుబాటులోకి రావాలి. నాడు –నేడు ద్వారా ప్రభుత్వ పాఠశాలలు పునరుజ్జీవం పొందాయి. మరోవైపు విలేజ్ క్లినిక్‌లు పూర్తి స్థాయిలో అందుబాటులోకి వస్తున్నాయి. వీటన్నింటి ద్వారా మొత్తం గ్రామాల ముఖచిత్రం మారిపోతోంది. డిసెంబర్, జనవరిలో కార్యక్రమాలు ఇవీ.. పేదలకు ఎంతో మేలు చేకూర్చే జగనన్న సంపూర్ణ గృహ హక్కు పథకాన్ని డిసెంబర్ 21న ప్రారంభించనున్నట్లు ముఖ్యమంత్రి తెలిపారు. ఇందుకు అవసరమైన చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. ► ఈ ఏడాది ఏప్రిల్ తర్వాత చేపట్టిన వివిధ పథకాలు, కార్యక్రమాలకు సంబంధించి వివిధ కారణాల వల్ల మిగిలిపోయిన అర్హులకు డిసెంబర్ 28న ప్రయోజనాలను అందచేస్తామని తెలిపారు. గతంలో చెప్పిన మాట ప్రకారం ప్రభుత్వం అందిస్తున్న పథకాలకు ఇంకా అర్హులెవరైనా మిగిలిపోతే దరఖాస్తు చేసుకునేందుకు సమయం ఇచ్చామని, ఇప్పుడు వారికి ప్రయోజనాలు పంపిణీ చేస్తామన్నారు. సామాజిక తనిఖీ కోసం లబ్ధిదారుల జాబితాను ప్రదర్శించాలని అధికారులకు సీఎం సూచించారు. జనవరి 9న ఈబీసీ నేస్తం... అగ్రవర్ణ నిరుపేద మహిళలకు (45 – 60 ఏళ్లు) ఏడాదికి రూ.15 వేలు చొప్పున మూడేళ్లలో రూ.45 వేలు చొప్పున ఆర్థిక సాయం అందచేసే ఈబీసీ నేస్తం పథకాన్ని జనవరి 9వతేదీన ప్రారంభించనున్నారు. ► జనవరిలోనే వైఎస్సార్ రైతు భరోసా మూడో విడత చెల్లింపులు చేస్తామని, త్వరలోనే తేదీని ప్రకటిస్తామని సీఎం తెలిపారు. అర్హులందరికీ పథకాలు అందాలి.. అనర్హులకు అందకూడదన్నదే ప్రభుత్వ ఉద్దేశమని స్పష్టం చేశారు. ► ఈ కార్యక్రమంలో సీఎస్ సమీర్ శర్మ, వ్యవసాయశాఖ స్పెషల్ సీఎస్ పూనం మాలకొండయ్య, గృహ నిర్మాణశాఖ స్పెషల్ సీఎస్ అజయ్‌జైన్, పురపాలక, పట్టణాభివృద్ధిశాఖ స్పెషల్ సీఎస్ వై.శ్రీలక్ష్మి, వైద్య ఆరోగ్యశాఖ ముఖ్య కార్యదర్శి అనిల్ కుమార్ సింఘాల్, వ్యవసాయ మార్కెటింగ్, సహకార శాఖ ముఖ్య కార్యదర్శి వై. మధుసూదన్‌రెడ్డి, రెవెన్యూశాఖ ముఖ్య కార్యదర్శి వి.ఉషారాణి, మహిళా శిశు సంక్షేమశాఖ ముఖ్య కార్యదర్శి ఏఆర్ అనురాధ తదితరులు పాల్గొన్నారు. -
ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం: 6 నెలలు ఎక్కడ ఉంటే అక్కడే పింఛన్
సాక్షి, అమరావతి: పింఛన్ల పంపిణీలో అర్హులకు ఏ చిన్న ఇబ్బందీ కలగకుండా ఉండేందుకు రాష్ట్ర ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. లబ్ధిదారులు సొంత ఊరిలో కాకుండా గత ఆరు నెలలుగా మన రాష్ట్రంలోనే మరో చోట నివాసం ఉంటుంటే.. తాము ఉన్న చోటనే పింఛన్ పొందేందుకు వీలు కల్పించింది. ఇందుకోసం తాము నివాసం ఉంటున్న పరిధిలోని గ్రామ, వార్డు సచివాలయంలో పేర్లు నమోదు చేసుకోవాల్సి ఉంటుంది. ఈ మేరకు గ్రామీణ పేదరిక నిర్మూలన సంస్థ(సెర్ప్) సీఈవో ఇంతియాజ్ అన్ని జిల్లా డీఆర్డీఏ పీడీలకు బుధవారం ఆదేశాలిచ్చారు. సొంత ఊరు వదిలి కనీసం ఆరు నెలలు అయితేనే ఇలా ఉపయోగించుకునేందుకు అవకాశం ఉంటుందని పేర్కొన్నారు. (చదవండి: ఇక సోలార్ వాటర్ ఏటీఎంలు) -
‘రేపు వైఎస్సార్ పెన్షన్ కానుక పంపిణీకి సర్వం సిద్ధం’
సాక్షి, అమరావతి: వైఎస్సార్ పెన్షన్ కానుక పంపిణీకి ప్రభుత్వం సర్వం సిద్దం చేసినట్లు రాష్ట్ర గ్రామీణాభివృద్ధి, పంచాయతీరాజ్ శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అన్నారు. దీని ద్వారా రాష్ట్రంలో 61.46 లక్షల మంది లబ్ధి పొందనున్నట్లు తెలిపారు. ఈ నెలలో కొత్తగా 29,961 మంది అర్హులకు కొత్త పెన్షన్లు మంజూరు చేసినట్లు తెలిపారు. మే నెల పెన్షన్ మొత్తాలను జూన్ 1వ తేదీన నేరుగా లబ్ధిదారుల ఇంటి వద్దే, వారి చేతికి అందించాలన్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి సంకల్పంలో భాగంగా అధికార యంత్రాంగం అన్ని ఏర్పాట్లు చేసినట్లు వెల్లడించారు. మంగళవారం (జూన్ 1వ తేదీ) తెల్లవారుజాము నుంచే వలంటీర్లు పెన్షన్ల పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభిస్తారని అన్నారు. ఈ మేరకు పెన్షన్ల కోసం ప్రభుత్వం రూ.1497.62 కోట్ల రూపాయలను ఇప్పటికే విడుదల చేసిందని తెలిపారు. ఈ మొత్తాలను గ్రామ, వార్డు సచివాలయాలకు పంపిణీ చేశామని, సచివాలయాల ద్వారా వలంటీర్లు పెన్షనర్లకు వారి ఇంటి వద్ద, నేరుగా పెన్షనర్ల చేతికే పెన్షన్ మొత్తాలను అందచేస్తామని అన్నారు. ఇందుకోసం 2.66 లక్షల మంది వలంటీర్లు సిద్ధంగా ఉన్నట్లు తెలిపారు. లబ్ధిదారులకు పెన్షన్ అందచేసే సందర్భంలో గుర్తింపు కోసం బయోమెట్రిక్, ఐరిస్ విధానాలను అమలు చేస్తున్నామని, అలాగే ఆర్బిఐఎస్ విధానంను కూడా అందుబాటులోకి తీసుకువచ్చామని తెలిపారు. ఈ రెండు విధానాల్లో పెన్షనర్ల గుర్తింపు సాధ్యం కాకపోతే అంతకు ముందే వారి కుటుంబసభ్యులు నమోదు చేయించుకున్న ఆథరైజ్డ్ బయోమెట్రిక్‌ను కూడా పరిగణలోకి తీసుకుంటామని, సాంకేతిక కారణాల వల్ల ఏ ఒక్కరికీ పెన్షన్ అందలేదనే ఫిర్యాదు రాకుండా అన్ని జాగ్రత్తలు తీసుకున్నామని తెలిపారు. పెన్షన్ మొత్తాలను మూడు రోజుల్లో నూరుశాతం పంపిణీ పూర్తి అయ్యేలా వలంటీర్లను ఆదేశించామని అన్నారు. పెన్షన్ల పంపిణీ ప్రక్రియలో 15వేల మంది వెల్ఫేర్ ఎడ్యుకేషన్ అసిస్టెంట్స్, వార్డు వెల్ఫేర్ డెవలప్మెంట్ సెక్రటరీలు భాగస్వాములు అవుతారని పేర్కొన్నారు. రాష్ట్రంలోని 13 జిల్లాల డిఆర్డిఎ కార్యాలయాల్లోని కాల్ సెంటర్ల ద్వారా పెన్షన్ల పంపిణీని పర్యవేక్షిస్తామని తెలిపారు. చదవండి: కోవిడ్, బ్లాక్ ఫంగస్, ఆక్సిజన్ సరఫరాపై సీఎం జగన్ సమీక్ష -
‘ఐదు రోజుల్లోనే పింఛన్లు మంజూరు చేస్తాం’
సాక్షి, అమరావతి : అర్హులైన వారందరికీ పెన్షన్లు ఇస్తున్నామని మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అన్నారు. అనర్హులను మాత్రమే తొలగించామని, సమగ్ర విచారణ అనంతరం ఇంకా అనర్హులుంటే తొలగిస్తామని స్పష్టం చేశారు. అర్హతలు ఉన్నవారి నుంచి దరఖాస్తులు స్వీకరించి ఐదు రోజుల్లోనే పెన్షన్లు మంజూరు చేస్తామని పేర్కొన్నారు. నిరంతరం ఈ ప్రక్రియ చేపడతామని తెలిపారు. చంద్రబాబు హయాంలో అడ్డగోలుగా పెన్షన్లను తొలగించారని మంత్రి గుర్తు చేశారు. రికార్డు స్థాయిలో 50 లక్షల 50 వేల మందికి పింఛన్లు పంపిణీ చేశామని చెప్పారు. సచివాలయంలో మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడారు. దీర్ఘకాలిక వ్యాధులతో బాధ పడుతున్న వారికి కూడా పెన్షన్లు ఇస్తున్న ప్రభుత్వం వైఎస్సార్‌సీపీదేనని రామచంద్రారెడ్డి అన్నారు. ప్రతి గ్రామ సచివాలయంలో అర్హులు, అనర్హులు జాబితాలను పెట్టామని ఆయన వెల్లడించారు. రూ.15 వేల కోట్లు పెన్షన్లకు కేటాయించిన ఘనత సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డిదని అన్నారు. చంద్రబాబు హయాంలో భర్త ఉన్న మహిళలకు కూడా వితంతు పెన్షన్ల ఇచ్చారని ఆరోపించారు. ఇప్పటికే 4 లక్షల మంది అనర్హుల పింఛన్లు తొలగించామని తెలిపారు. బాబు సొంత గ్రామమైన నారావారి పల్లెలో కూడా పారదర్శకంగా పెన్షన్ల జాబితా పెట్టామని, కానీ ఆయన తమపై బురద చల్లుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. -
‘ఐదు రోజుల్లోనే పెన్షన్లు మంజూరు చేస్తాం’
-
‘డబ్బు’ల్ ధమాకా!
సాక్షి, హైదరాబాద్: ఆసరా పింఛన్ల లబ్ధిదారులకు ఈ నెల ‘డబ్బు’ల్ ధమాకా లభించనుంది. రాష్ట్ర ప్రభు త్వం ఆసరా లబ్ధిదారులకు రెట్టింపు చేసిన పింఛన్లు ఈ నెలలోనే వారి ఖాతాల్లో చేరనున్నాయి. ఈ నెల 22 నుంచి బ్యాంక్, పోస్టాఫీస్ ఖాతాల్లోకి ఈ పింఛన్లు బదిలీ కానున్నాయి. ఇప్పటికే మే నెలకు సంబంధించిన పాత పింఛన్లు వారికి అందజేయగా, ప్రభుత్వం తీసుకున్న తాజా నిర్ణయంతో జూన్ నుంచి చెల్లించాల్సిన రెట్టింపైన పింఛన్ల మొత్తాన్ని కూడా ఈ నెల 22 నుంచి లబ్ధిదారుల ఖాతాల్లో జమ చేయనున్నారు. దీంతో మే నెలకు సంబంధించిన పాత పింఛన్‌తో పాటు జూన్ నెలకు పెంచిన మొత్తాన్ని లబ్ధిదారులు అందుకోనున్నారు. ఇలా ఒకే నెలలో రెండు పింఛన్లు వారికి అందనున్నాయి. ఇప్పటివరకు ఒక నెల అంతరంతో పింఛన్లు ఇస్తుండటంతో జూన్‌కు సంబంధిం చిన మొత్తం ఆగస్టులో అందుతుందని లబ్ధిదారులు భావించారు. అయితే పెరిగిన పింఛన్లు జూన్ నుంచి అమల్లోకి వస్తాయని, జూలై 1న లబ్ధిదారులకు పంపి ణీ చేయనున్నట్లు గతంలో పంచాయతీ రాజ్ శాఖ ఉత్తర్వులు కూడా జారీ చేసింది. దీంతో ఈ నెలలోనే పెంచిన పింఛన్లు చెల్లించాలని సీఎం కేసీఆర్ ఆదేశించారు. రెండురోజుల పాటు సాగిన శాసనసభ, మం డలి సమావేశాలు ముగియడంతో శనివారం మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఇతర ప్రజాప్రతినిధులు రెట్టింపు చేసిన పింఛన్లకు సంబంధించిన ధ్రువీకరణ పత్రాలను లబ్ధిదారులకు అందజేశారు. దివ్యాంగులకు రూ. 1,500 నుంచి రూ.3,016, ఇతర లబ్ధిదారులకు రూ.వెయ్యి నుంచి రూ.2,016 చొప్పు న పింఛన్ పెంచిన విషయం తెలిసిందే. టీఆర్ఎస్ అధికారంలోకి వచ్చాక సామాజిక భద్రత పింఛన్ల మొత్తాన్ని పెంచి 2014, నవంబర్ నుంచి ఆసరా పెన్షన్ల పథకాన్ని అమలు చేస్తోంది. దివ్యాంగులకు ప్రతి నెలా రూ.1,500, వితంతువులు, వృద్ధులు, బీడీ కార్మికులు, ఒంటరి మహిళలు, కల్లు గీత కార్మికులు, చేనేత కార్మికులు, హెచ్ఐవీ, బోదకాలు బాధితులకు రూ.వెయ్యి చొప్పున చెల్లిస్తున్నారు. కాగా, రాష్ట్రవ్యాప్తంగా వివిధ కేటగిరీల కింద మొత్తం 38,99,044 మందికి పెంచిన ఆసరా పింఛన్లు అందనున్నాయి. అంతేకాకుండా వృద్ధాప్య పింఛన్లు పొందే అర్హత వయస్సును 65 ఏళ్ల నుంచి 57 ఏళ్లకు కుదించారు. ప్రస్తుతం రాష్ట్రంలో దాదాపు 39 లక్షల మందికి వివిధ పింఛన్లు పంపిణీ చేస్తుండగా, ప్రస్తుత వయస్సు తగ్గింపుతో మరో 8 లక్షల మంది వరకు అదనంగా చేరతారని అధికారుల అంచనా. -
కడప నుంచే నవరత్నాలకు శ్రీకారం
-
కడప గడపనుంచే నవరత్నాలకు శ్రీకారం
సాక్షి, కడప : దివంగత ముఖ్యమంత్రి, మహానేత, రైతు బాంధవుడు డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి 70వ జయంతి వేడుకలు తెలుగు రాష్ట్రాల్లో ఘనంగా జరిగాయి. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మహానేత జయంతి(జూలై, 8)ని ‘వైఎస్సార్ రైతు దినోత్సవం’గా జరుపుతున్న సంగతి తెలిసిందే. రైతు దినోత్సవం ప్రధాన కార్యక్రమాన్ని జమ్మలమడుగులో నిర్వహిస్తున్నారు. ఈ సదస్సులో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి పాల్గొన్నారు. సభా వేదికపైకి చేరుకున్న సీఎం జగన్ అక్కడ ఏర్పాటు చేసిన వైఎస్సార్ విగ్రహానికి పూలమాలవేసి నివాళులర్పించారు. జ్యోతిప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. కార్యక్రమంలో వ్యవసాయ మంత్రి కురసాల కన్నబాబు, పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, ఎంపీ అవినాష్‌రెడ్డి, జమ్మలమడుగు ఎమ్మెల్యే సుధీర్‌రెడ్డి, ఇతర మంత్రులు, ఎమ్మెల్యేలు, వేలాదిమంది రైతులు, పార్టీ కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు. రైతులను ఆదుకుంటామనే హామీలో భాగంగా రామసుబ్బమ్మ అనే మహిళకు ముఖ్యమంత్రి జగన్ రూ.7 లక్షల చెక్కు అందజేశారు. అప్పుల బాధ తట్టుకోలేక 2015లో రామసుబ్బమ్మ భర్త బలవన్మరణానికి పాల్పడ్డారు. ‘వైఎస్సార్ పెన్షన్ కానుక’ పథకాన్ని ప్రారంభించిన అనంతరం సీఎం జగన్ మాట్లాడుతూ.. కడప నుంచే శ్రీకారం.. రైతులు, పేదలు, వృద్ధులు, విద్యార్థులకు చేయూతనిచ్చే నవరత్నాలకు కడప గడపనుంచే శ్రీకారం చుడుతున్నట్టు సీఎం జగన్ చెప్పారు. వైఎస్సార్ పెన్షన్ పథకం కింద అవ్వాతాతలకు రూ.2,250, దివ్యాంగులకు రూ.3వేలు, డయాలసిస్ పేషంట్లకు రూ.10 వేలు మంజూరు చేస్తున్నామని అన్నారు. వైఎస్సార్ జిల్లాకు గతంలో కంటే రెట్టింపుగా రూ.70 కోట్లు పెన్షన్‌గా ఇస్తున్నామని చెప్పారు. పెన్షన్ పథకానికి రూ.15,676 కోట్లు కేటాయించామన్నారు. అధికారంలోకి వచ్చిన నెలరోజుల్లోనే సంక్షేమ పథకాల అమలుకు చర్యలు తీసుకున్నామని అన్నారు. పెన్షన్ రాని అర్హులు నేరుగా సీఎం కార్యాలయానికి ఫిర్యాదు చేయొచ్చని సూచించారు. ఫిర్యాదు కోసం ప్రత్యేక నెంబర్‌ను ఏర్పాటు చేస్తామని అన్నారు. తప్పులు చేసినవారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. సంక్షేమ పథకాల అమలులో కులాలు, మతాలు, వర్గాలు పరిగణించమని సీఎం పునరుద్ఘాటించారు. రుణాలన్నీ సున్నావడ్డీకే.. రైతులందరికీ సున్నా వడ్డీకే రుణాలందిస్తామని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు. రైతులకు ఉచితంగా పగటిపూట 9 గంటల కరెంట్ ఇస్తామని వెల్లడించారు. రైతుల బాధల్ని గత ప్రభుత్వం ఏమాత్రం పట్టించుకోలేదని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. తమ ప్రభుత్వం రైతుల సంక్షేమం కోసం పనిచేస్తుందని ఉద్ఘాటించారు. ఆక్వా రైతులకు రూ.1.50కే విద్యుత్ సరఫరా చేస్తామని చెప్పారు. వైఎస్సార్ పంటలబీమా పథకానికి శ్రీకారం చుట్టామని తెలిపారు. ఖరీఫ్, రబీలలో సాగు చేసే 27 రకాల పంటలకు రైతులు చెల్లించాల్సిన ప్రీమియం వాటాను రాష్ట్ర ప్రభుత్వమే చెల్లిస్తుందన్నారు. రైతు బాగుంటేనే రాష్ట్రం బాగుంటుంది రైతు బాగుంటేనే ఏ రాష్ట్రమైనా బాగుంటుందని ముఖ్యమంత్రి అన్నారు. రైతుల కోసం వైఎస్సార్ రైతు భరోసా పథకం ప్రవేశ పెడుతున్నామని చెప్పారు. అక్టోబర్ 15నుంచి వైఎస్సార్ రైతు భరోసా కింద రూ. 12,500 ఇస్తామని తెలిపారు. రైతుల పంట రుణాల కింద రూ. 8,750 కోట్లు ఇస్తామన్నారు. భూ యాజమానుల హక్కులను పూర్తిగా కాపాడుతామని, అదే సమయంలో రైతులకు అండగా ఉంటామని స్పష్టం చేశారు. కౌలు రైతు చట్టంలో మార్పులు తీసుకొస్తామని చెప్పారు. అసెంబ్లీ సమావేశాల్లో కౌలు రైతులకు కొత్త చట్టం తీసుకొస్తామన్నారు. చెన్నూరు షుగర్ ఫ్యాక్టరీని త్వరలో తెరుస్తామని హామీ ఇచ్చారు. ప్రతి నియోజకవర్గంలో కోల్డ్ స్టోరేజ్, ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లు, వ్యవసాయ ల్యాబోరేటరీలు ఏర్పాటు చేసి.. రైతులకు నాణ్యమైన పురుగు మందులు, ఎరువు, విత్తనాలు ఇస్తామని వెల్లడించారు. వ్యవసాయ మిషన్ ఏర్పాటు చేసి ప్రతినెలా రైతు సమస్యలపై సమీక్ష చేస్తున్నామని తెలిపారు. ప్రతి రైతన్నకు ఎలా తోడుగా ఉండాలనేది ఆలోచిస్తున్నామన్నారు. పులివెందులలో అరటి పరిశోధనా కేంద్రాన్ని ఏర్పాటు చేశామని వెల్లడించారు. ప్రమాదవశాత్తు రైతు మరణించినా.. ఆత్మహత్య చేసుకున్నా ఆ కుటుంబానికి రూ. 7లక్షల చెక్ ఇవ్వాలని ఆదేశించినట్లు తెలిపారు. ఇవన్నీ అధికారంలోకి వచ్చిన నెలలోపే చేశామన్నారు. అధికారంలోకి రాగానే గిట్టుబాటు ధరలు కల్పించాం పామాయిల్ రైతులను చంద్రబాబునాయుడు సర్కార్ పట్టించుకోలేదని, వైఎస్సార్ సీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే గిట్టుబాటు ధరలు కల్పించామని సీఎం జగన్ తెలిపారు. ఏ ప్రభుత్వమైనా ఖరీఫ్ సీజన్ వచ్చిన వెంటనే విత్తనాలు అందుబాటులోకి తేవాలని, నవంబర్ నుంచి కొనుగోలు చేసి మే నాటికి అందుబాటులోకి తేవాలని చెప్పారు. గత ప్రభుత్వమే విత్తనాలు కొనుగోలు చేయాలి.. కానీ, చంద్రబాబు ప్రభుత్వం పట్టించుకోలేదంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. విత్తనాలకు సంబంధించిన బకాయిలు కూడా చెల్లించలేదని వెల్లడించారు. వ్యవసాయశాఖ అధికారులు చంద్రబాబుకు లేఖలు రాశారని తెలిపారు. దారుణమైన పరిస్థితుల్లో కూడా రైతులకు అండగా నిలిచామన్నారు. అధికారంలోకి వచ్చిన వెంటనే విత్తన బకాయిలు చెల్లించామని చెప్పారు. రూ. 2వేలకోట్ల కరువు బకాయిలు చెల్లించడంలో గత సర్కార్ విఫలమైందన్నారు. ఆ బకాయిలను అధికారంలోకి రాగానే చెల్లించామని తెలిపారు. -
నేటి నుంచి పింఛన్ల పండగ
సాక్షి, కాకినాడ,(తూర్పుగోదావరి) : రాజన్న సంక్షేమ రాజ్యాన్ని తలపిస్తూ, పాలన సాగిస్తున్న వైఎస్సార్ సీపీ అధినేత, ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి పెంచిన సామాజిక పింఛన్లను లబ్ధిదారులకు అందజేసేందుకు విస్తృతంగా ఏర్పాట్లు జరుగుతున్నాయి. రాష్ట్ర ప్రభుత్వం ప్రతి నెలా ఒకటో తేదీ నుంచి పంపిణీ చేస్తున్న సామాజిక పింఛన్లను ఈ నెలలో సోమవారం నుంచి అందించనున్నారు. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి జయంతి రోజైన జూలై 8 నుంచి, పెంచిన మొత్తం కలిపి ‘వైఎస్సార్ పింఛను కానుక’ పేరుతో లబ్ధిదారులకు రూ.2,250 చొప్పున అందించనున్నారు. మూడు రోజుల పాటు ఈ కార్యక్రమం నిర్వహించనున్నారు. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ కార్యక్రమాన్ని పండగ వాతావరణంలో చేపట్టాలని ప్రభుత్వం ఆదేశించింది. ప్రజాప్రతినిధుల చేతుల మీదుగా లబ్ధిదారులకు పెంచిన పింఛన్లను అందజేయనున్నారు. 12 కేటగిరీలుగా.. ‘వైఎస్సార్ పింఛన్ కానుక’లో 12 కేటగిరీలు ఉన్నాయి. వీటిలో హిజ్రాలు, డప్పు కార్మికులకు గతంలో మాదిరిగానే నెలకు రూ.3 వేల చొప్పున ఇవ్వనున్నారు. దివ్యాంగులకు గతంలో రెండు రకాల పింఛన్లు ఇచ్చేవారు. 80 శాతం పైగా వైకల్యం ఉన్నవారికి రూ.3 వేలు, అంతకులోపు వారికి రూ.2 వేల చొప్పున ఇచ్చేవారు. ప్రస్తుతం దీంతో సంబంధం లేకుండా దివ్యాంగులందరికీ రూ.3 వేలు ఇవ్వాలని నిర్ణయించారు. అభయహస్తం పింఛన్ల కింద రూ.500 మాత్రమే ఇవ్వనున్నారు. దీనిని కూడా రూ.2,250కి పెంచుతామని ప్రభుత్వం ప్రకటించినా ఈ నెలకు మాత్రం రూ.500 చొప్పునే ఇస్తారు. ఈ మేరకు జిల్లా గ్రామీణాభివృద్ధి సంస్థ(డీఆర్డీఏ)కు ఉత్తర్వులు జారీ చేశారు. వృద్ధులు, వితంతువులు, ఒంటరి మహిళలు, కల్లుగీత కార్మికులు, చేనేత కార్మికులు, మత్స్యకారులు, హెచ్ఐవీ బాధితులు, చర్మకారులకు రూ.2,250 చొప్పున ఇవ్వనున్నారు. డయాలసిస్ చేయించుకుంటున్న వారికి రూ.10 వేల చొప్పున పంపిణీ చేస్తారు. అన్ని కేటగిరీలూ కలిపి జిల్లావ్యాప్తంగా మొత్తం 5,81,033 మంది లబ్ధిదారులు ఉండగా.. వీరికోసం తాజాగా పెంచిన మొత్తం కలిపి ప్రభుత్వం రూ.139.97 కోట్లు విడుదల చేసింది. ఎనిమిది కేటగిరీలకు సంబంధించి ఒక్కొక్కరికి రూ.2,250 చొప్పున ఇస్తారు. ఇలా వృద్ధులు, చేనేత, ఒంటరి మహిళ, వితంతువులు, గీతకార్మికులు, మత్స్యకార్మికులు, చర్మకారులు, హెచ్ఐవీ బాధితులకు పంపిణీ చేస్తారు. డప్పు కార్మికులు, హిజ్రాలకు పెరగదు. వీరికి ఇప్పటికే రూ.3 వేలు ఇస్తున్నారు. డయాలసిస్ రోగులకు రూ.ఏకంగా రూ.3,500 నుంచి రూ.10 వేలకు పెరిగింది. అర్హత వయస్సు తగ్గింపు సామాజిక పింఛనుకు 65 ఏళ్లు నిండాలనే నిబంధన ఉండేది. దీనిని 60కి తగ్గిస్తూ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి నిర్ణయం తీసుకున్నారు. దీని ప్రకారం జిల్లా వ్యాప్తంగా వివిధ రకాల పింఛన్లకు మరో 84 వేల మంది అర్హులు ఉన్నట్లు సాధికార సర్వేలో వెల్లడైంది. ఇందులో 60 ఏళ్లు ఉన్నవారు సుమారు 24 వేల మంది ఉన్నట్లు అధికారులు అంచనా వేస్తున్నారు. వీరికి కూడా త్వరలో పింఛన్లు ఇచ్చే అవకాశాలు ఉన్నాయి. కొత్త పింఛన్ పుస్తకాల సరఫరా వైఎస్సార్ పింఛన్ కానుకకు సంబంధించి జిల్లాకు కొత్త పుస్తకాలు సరఫరా అయ్యాయి. టీడీపీ ప్రభుత్వ హయాంలో లబ్ధిదారులకు అందజేసిన పుస్తకాల స్థానంలో కొత్తవాటిని లబ్ధిదారులకు ఇవ్వనున్నారు. ప్రతి నెలా పంపిణీ చేసిన పింఛను వివరాలను ఈ పుస్తకాల్లో నమోదు చేస్తారు. పండగ వాతావరణంలో.. జిల్లావ్యాప్తంగా ‘వైఎస్సార్ పింఛన్ కానుక’ పంపిణీ కార్యక్రమాన్ని పండగ వాతావరణంలో నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నాం. లబ్ధిదారుల జాబితాలను అన్ని పంచాయతీ కార్యాలయాల్లోనూ ప్రచురించాలని ఆదేశించాం. సోమవారం నుంచి పింఛన్లు మూడు రోజుల పాటు పంపిణీ చేస్తాం. – ఎన్.మధుసూదనరావు, డీఆర్డీఏ పీడీ -
‘ఆసరా’.. ఆలస్యం!
సాక్షి, రంగారెడ్డి జిల్లా ప్రతినిధి: ఏ ఆధారమూ లేనివారికి సకాలంలో దక్కాల్సిన ‘ఆసరా’ ఆలస్యమవుతోంది. ఒకటికాదు.. రెండుకాదు, ప్రతినెలా పింఛన్ల పంపిణీలో తీవ్ర జాప్యం జరుగుతుండడంతో పింఛన్‌దారులు ఆవేదన చెందుతున్నారు. గతంలోనూ వరుసగా మూడు నాలుగు నెలలపాటు లబ్ధిదారులు పింఛన్ సొమ్ముకు నోచుకోని పరిస్థితులు ఉన్నాయి. ఒక నిర్ధిష్ట సమయమంటూ లేకపోవడంతో పింఛర్దారులు అయోమయంలో పడ్డారు. ఎప్పుడు ఇస్తారో తెలియని సంకట స్థితిలో చిక్కుకున్నారు. జనవరి నెలకు సంబంధించిన పింఛన్ సొమ్ము ఇంకా అందలేదు. నిధులు విడుదల కావడానికి ఇంకా ఎన్ని రోజులు పడుతుందో అధికారులు కూడా చెప్పలేకపోతున్నారు. ప్రధానంగా వృద్ధులు, వితంతువులు, ఒంటరి మహిళలు కేవలం పింఛన్సొమ్ముపై ఆధారపడి జీవిస్తున్నారు. ఇంతటి కీలకమైన పింఛన్ సొమ్ము సకాలంలో అందితేనే వారు తమ అవసరాలు తీర్చుకుంటారు. ఇది జరగపోవడంతే అప్పు తెచ్చుకుని పూట గడిపే దుస్థితి నెలకొంది. అవసరానికి అందవు.. జిల్లాలో 1.24 లక్షల మంది ఆసరా పింఛన్‌దారులు ఉన్నారు. ఇందులో వృద్ధాప్య, వికలాంగ, వితంతువులు, గీత, చేనేత కార్మికులు ఉన్నారు. గతేడాది ఏప్రిల్ నుంచి 4,038 మంది ఒంటరి మహిళలకు ఆర్థిక భృతి పంపిణీ చేస్తున్నారు. నగర పంచాయతీలు, మున్సిపాలిటీలో బ్యాంకు ద్వారా నేరుగా పింఛన్‌దారుల ఖాతాల్లో సొమ్ము జమచేస్తున్నారు. గ్రామీణ ప్రాంతాల్లోని లబ్ధిదారులకు పోస్టాఫీసుల ద్వారా బయోమెట్రిక్ విధానంలో పంపిణీ చేస్తున్నారు. వైఎస్ రాజశేఖరరెడ్డి సీఎంగా ఉన్న సమయంలో ప్రతినెలా ఒకటి నుంచి ఐదో తేదీలోపు లబ్ధిదారులకు పించన్సొమ్ము అందేది. ఆయన మరణానంతరం నిధుల విడుదలతో జాప్యం జరుగుతోంది. ఆ తర్వాత టీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక కూడా సకాలంలో పింఛన్లు అందిన దాఖలాలు లేవు. తొలుత ప్రతినెలా 11 నుంచి 14వ తేదీలోగా పింఛన్ ఇచ్చేవారు. ఇది క్రమంగా 14 నుంచి 20 తేదీకి మారింది. కొంతకాలం నుంచి ఈ తేదీలకు కూడా చరమగీతం పాడారు. ప్రస్తుతం ఫిబ్రవరిలోకి అడుగు పెట్టినా జనవరి నెల పింఛను ఇంతవరకు అందలేదు. సకాలంలో పింఛన్లు అందజేయాలని లబ్ధిదారులు కోరుతున్నారు. నిర్లక్ష్యం తగదు ఆసరా పింఛన్లు అందజేయడంలో నిర్లక్ష్యం తగదు. ప్రతిసారీ ఇదే పరిస్థితి. ఎందుకు ఆలస్యం చేస్తున్నారని అడిగితే పట్టించుకునే వారు లేరు. సకాలంలో ఇస్తే మా అవసరాలు తీర్చుకుంటాం. లేకుంటే అప్పు చేయక తప్పడం లేదు. టైం ప్రకారం పింఛను అందించాలని ప్రభుత్వాన్ని కోరుతున్నాం. – కట్టెల కిష్టయ్య, వికలాంగుడు ఎప్పుడూ ఆలస్యమే సర్కారు పెన్షన్ల సొమ్ము పెంచింది కానీ.. మాకు ఆ తృప్తి లేకుండా చేస్తోంది. గతంలో పింఛన్ సొమ్ముకు ఎన్నడూ లేటు కాలేదు. ఇప్పుడు సొమ్మును పెంచినా అవసరానికి మాత్రం ఇవ్వడం లేదు. వయసు పైబడ్డాక పిల్లలను అడగాలంటే ఇబ్బంది పడుతున్నాం. పింఛనైనా వస్తుందని అనుకుంటే.. అదీ లేదు. డబ్బులు ఎప్పుడు వస్తాయో తెలవదు. – అంజమ్మ, వితంతు పెన్షన్‌దారు అప్పు జేయాల్సి వచ్చింది ప్రతినెలా సకాలంలో ఇవ్వకపోవడం వల్ల అవసరాల నిమిత్తం అప్పు చేస్తున్నాం. రూ.వెయ్యి కోసం కళ్లలో ఒత్తులు వేసుకుని ఎదురుచూస్తున్నాం. దవాఖానకు పోదామంటే నా దగ్గర చిల్లిగవ్వ కూడా లేదు. ఎవరినైనా అడుగుదామంటే.. ఎవరిస్తరు బిడ్డా. ప్రభుత్వం లేటు చేయకుండా పింఛన్లు ఇస్తే మాలాంటి ముసలోల్లకు ఇబ్బంది ఉండదు. – చెర్కూరి లక్ష్మయ్య, వృద్ధుడు -
బాధపెడుతున్న ‘బయోమెట్రిక్’!
తాళ్లూరు, న్యూస్‌లైన్ : సామాజిక పింఛన్ల పంపిణీలో పారదర్శకత కోసం ప్రవేశ పెట్టిన బయోమెట్రిక్ విధానం లబ్ధిదారుల పాలిట శాపంగా మారింది. కొందరు వృద్ధ లబ్ధిదారుల వేలి ముద్రలు సరిపోలక వారు నానా ఇబ్బందులు పడుతున్నారు. చేతివేలి ముద్రలు అరిగిపోయిన వృద్ధుల అవస్థ వర్ణనాతీతంగా ఉంది. ఇప్పటికే మూడు నెలల నుంచి పింఛన్లు అందుకోలేక పోవడంతో ఇకపై పింఛన్ వస్తుందో రాదో అన్న ఆందోళన వారిలో నెలకొంది. దర్శి నియోజకవర్గంలో దర్శి, దొనకొండ, కురిచేడు, ముండ్లమూరు, తాళ్లూరు మండలాల్లో మొత్తం 21,222 మంది సామాజిక పింఛన్ లబ్ధిదారులు ఉన్నారు. అందులో 1805 మంది లబ్ధిదారులకు పింఛన్ నగదు అందక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. గతంలో ఒక్కొక్క పంచాయతీకిఒక్కొక్క ఫినో సంస్థ కో-ఆర్డినేటర్ ఉండి పింఛన్ల నగదును పంచేవారు. ప్రస్తుతం పోస్టాఫీసులకు అనుసంధానం చేయడంతో పింఛనుదారులు ఇబ్బందులు పడుతున్నారు. ముండ్లమూరు మండలం వేములలోని పోస్టాఫీసు నుంచి పింఛన్ సొమ్ము తీసుకోవాలంటే వేముల బండకు చెందిన వృద్ధులు 4 కిలోమీటర్ల మేర నడిచివెళ్లలేక నరకయాతన పడుతున్నారు. వరుసగా మూడు నెలలు పింఛన్ తీసుకోక పోతే రద్దయ్యే అవకాశం ఉంది. దీంతో పింఛనుదారులు ఎంపీడీఓ కార్యాలయాల వద్ద అర్జీలు పెట్టుకునేందుకు వెళుతున్నారు. అక్కడ కూడా సిబ్బంది అందుబాటులో లేకపోవటంతో తీవ్ర నిరాశతో వెనుదిరుగుతున్నారు.