పింఛన్‌ దారుడి మృతిపై చలించిన సీఎం జగన్ | Old Man Deceased over Stopping of pension with volunteers | Sakshi
Sakshi News home page

పింఛన్‌ దారుడి మృతిపై చలించిన సీఎం జగన్

Published Tue, Apr 2 2024 1:26 PM | Last Updated on Tue, Apr 2 2024 6:13 PM

Old Man Deceased over Stopping of pension with volunteers - Sakshi

ప్రతీ నెలా ఒకటో తేదీన అందే ఫించన్‌తోనే నెలంతా గడిపే పేద కుటుంబాలు ఇప్పుడు ఆందోళనకు లోనవుతున్నాయి. ఒకటో తేదీన వలంటీర్లే అందించాల్సిన పెన్షన్‌ను.. ఈసీ కోడ్‌ మూలంగా తామే స్వయంగా తామే వెళ్లి తెచ్చుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. 

సాక్షి, కాకినాడ: ప్రతీ నెలా ఒకటో తేదీన అందే ఫించన్‌తోనే నెలంతా గడిపే పేద కుటుంబాలు ఇప్పుడు ఆందోళనకు లోనవుతున్నాయి. ఒకటో తేదీన వలంటీర్లే అందించాల్సిన పెన్షన్‌ను.. ఈసీ కోడ్‌ మూలంగా తామే స్వయంగా తామే వెళ్లి తెచ్చుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఇందుకు చంద్రబాబు అండ్‌ కో చేసిన కుట్ర కారణమని ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అయితే మూడో తేదీన ఫించన్‌ అందుతుందని తెలిసినా.. వృద్ధులు, దివ్యాంగులు మాత్రం సచివాలయాల వద్ద పడిగాపులు పడుతున్న దృశ్యాలు కనిపిస్తున్నాయి. ఈ క్రమంలో.. విషాదాలు సైతం చోటు చేసుకుంటున్నాయి.

కాకినాడ రూరల్ తూరంగిలో ఫించన్ అందలేదన్న బాధతో ఓ వృద్ధుడు గుండె ఆగి మరణించాడు. కే. వెంకట్రావ్(70) అనే వ్యక్తికి వలంటీర్‌ వ్యవస్థ మూగ బోయ్యిందన్న సమాచారం తెలియదు. దీంతో తీవ్ర ఆందోళనకు లోనయ్యాడు. ఈ క్రమంలో తానే స్వయంగా సచివాలయానికి వెళ్లి ఏం జరిగిందో తెలుసుకుందాం అనుకున్నాడు. మార్గం మధ్యలోనే గుండెపోటుకి గురై కన్నుమూశాడు. 

కూలీ పని చేసుకునే వెంకట్రావ్‌కు భార్య, ముగ్గురు పిల్లలు ఉన్నారు. వెంకట్రావ్ మృతి పట్ల కాకినాడ రూరల్ ఎమ్మెల్యే కురసాల కన్నబాబు సంతాపం వ్యక్తం చేశారు. ఆ కుటుంబాన్ని కలిసి ఓదార్చారు. అంతేకాదు.. వెంకట్రావ్ మృతి చెందిన విషయాన్ని సీఎం జగన్‌మోహన్‌రెడ్డి దృష్టికి తీసుకెళ్లారు.  వెంకట్రావ్‌ మృతిపై చలించిపోయిన సీఎం జగన్‌.. వెంకట్రావ్‌ కుటుంబానికి ప్రభుత్వం తరఫున రూ. 5 లక్షల పరిహారం అందించాలని అధికారుల్ని ఆదేశించారు.

చంద్రబాబు రాజకీయ లబ్ధికోసమే చేసిన కుట్రతో వలంటీర్లు ఫించన్ పంపిణీకి దూరమైయ్యారు. వలంటీర్ల ఫోన్ లు వెనక్కి ఇచ్చేయడంతో సమాచారం లేక వెంకట్రావు సచివాయాలనికి బయలు దేరాడు. మార్గ మధ్యలో గుండె ఆగి చనిపోవడం విషాదకరం. వెంకట్రావ్ కుటుంబాన్ని ఆదుకుంటాం అని కురసాల కన్నబాబు ఈ సందర్భంగా చెప్పారు. 

తిరుపతిలో మరో వృద్ధుడు..

తిరుపతిలో జిల్లా వెంకటగిరి బంగారుపేటలో 80 ఏళ్ల వృద్ధుడు వెంకటయ్య మృతి చెందాడు. వాలంటీర్లు ఇంటికి వెళ్లి పెన్షన్‌ను ఇవ్వరన్న మనస్తాపంతో గుండెపోటుతో అక్కడికక్కడే వెంకటయ్య కుప్పకూలిపోయాడు.

మరోపక్క.. చంద్రబాబు, పవన్, బీజేపీ తీరుపై మనస్తాపానికి గురై పలువురు వలంటీర్లు ఇప్పటికే రాజీనామా చేసిన విషయం తెలిసిందే. పేదలకు ఇచ్చే పెన్షన్లను ఇవ్వకుండా అడ్డుకోవడం తమను బాధించిందన్నారు. ఒకటో తేదీ ఉదయం నుంచే తమకు పలువురు ఫించన్‌ కోసం ఫోన్లమీద ఫోన్లు చేస్తూ ఆరా తీస్తున్నారని, తకు ముందులా తాము బాధపడాల్సిన పరిస్థితులొచ్చాయని పెన్షనర్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారని వలంటీర్లు అంటున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement