సాక్షి, హైదరాబాద్: తెలుగు రాష్ట్రాల్లో సంక్రాంతి పండుగ నేపథ్యంలో రద్దీని దృష్టిలో పెట్టుకుని దక్షిణ మధ్య రైల్వే స్పెషల్ రైళ్లను నడుపుతోంది. ఇప్పటికే పలు మార్గాల్లో స్పెషల్ ట్రైన్స్‌ను అనౌన్స్ చేయగా తాజాగా మరో ఐదు స్పెషల్ రైళ్లను ప్రకటించింది. తిరుపతి-సికింద్రాబాద్, కాకినాడ-సికింద్రాబాద్, కాకినాడ-తిరుపతి మధ్య నడవనున్నాయి.
వివరాల ప్రకారం.. సంక్రాంతి సందర్భంగా దక్షిణ మధ్య రైల్వే ప్రత్యేక రైళ్లను నడుపుతోంది. పండుగ నేపథ్యంలో ఈనెల 10, 11, 12, 13 తేదీల్లో స్పెషల్ ట్రైన్ ప్రయాణించనున్నాయి.
ఐదు స్పెషల్ ట్రైన్స్ ఇవే..
జనవరి 10: 07065.. తిరుపతి-సికింద్రాబాద్.
జనవరి 11: 07066.. సికింద్రాబాద్-కాకినాడ టౌన్
జనవరి 12: 07067.. కాకినాడ టౌన్-సికింద్రాబాద్
జనవరి 12: 07250.. సికింద్రాబాద్-కాకినాడ టౌన్
జనవరి 13: 07249.. కాకినాడ టౌన్-తిరుపతి.
SCR to run 05 #Sankranti Special Trains pic.twitter.com/T1NfM0ZpTE
— South Central Railway (@SCRailwayIndia) January 5, 2024
Comments
Please login to add a commentAdd a comment