Kakinada
-
వైజాగ్ -కాకినాడ ఛాలెంజ్ : 52 ఏళ్ల తెలుగు మహిళ సాహసం
ఆంధ్రప్రదేశ్‌లోని కాకినాడ జిల్లా సామర్లకోటకు చెందిన 52 ఏళ్ల గోలి శ్యామల అరుదైన ఘనతను సాధించారు. విశాఖపట్నం (వైజాగ్) నుండి కాకినాడ వరకు బంగాళాఖాతంలో 150 కిలోమీటర్లు ఈది చరిత్రకెక్కారు. ఐదు రోజుల పాటు సాగిన శ్యామల సాహస యాత్ర సాగింది. డిసెంబర్ 28న ఆర్.కె. వైజాగ్‌లోని బీచ్ నుంచి మొదలై కాకినాడలోని ఎన్టీఆర్ బీచ్‌లో జనవరి 1న ముగిసింది. ఇలాంటి విజయాలను అలవోకంగా అందుకోవడం ఆమెకు కొత్తేమీ కాదు. వైజాగ్-కాకినాడ ఛాలెంజ్ప్రస్తుతం హైదరాబాద్‌లో ఉంటున్న శ్యామలకు సముద్రాలను ఈదడం హాబీ. తాజాగా బంగాళాఖాతంలో విశాఖపట్నం నుంచి కాకినాడ వరకూ 150 కిలోమీటర్ల దూరాన్ని విజయవంతంగా ఈదారు. వారం రోజుల తరువాత సూర్యారావుపేట ఎన్టీఆర్ బీచ్‌కు చేరుకోవడంతో ఆమె సాహస యాత్ర ముగిసింది. ఆమె భద్రత, విజయాన్ని నిర్ధారించేందుకు ఒక డాక్టర్, ఫిజియోథెరపిస్ట్, ఫీడర్లు, స్కూబా డైవర్లు , కయాకర్లతో సహా 12 మంది సభ్యుల, రెండు పెద్ద పడవలు ఒక చిన్న నౌక ఆమె వెంట సాగాయి.52-Year-Old woman Goli Shyamala Swims 150 km from #Visakhapatnam to #Kakinada, Inspiring GenerationsGoli #Shyamala, a 52-year-old #WomanSwimmer from Samalkot in Kakinada district, #AndhraPradesh successfully completed an adventurous swim of 150 kilometers in the sea from… pic.twitter.com/DenfvFaHgr— Surya Reddy (@jsuryareddy) January 4, 2025 అంతకుముందు- తమిళనాడు- శ్రీలంక నార్త్ ప్రావిన్స్‌ను అనుసంధానించే పాల్క్ స్ట్రెయిట్‌ను 13 గంటల 43 నిమిషాల్లో అధిగమించి ఈ ఘనతను సాధించిన రెండో మహిళగా శ్యామలనిలిచారు. గతంలో రామసేతు సమీపంలో అలవోకగా ఈ సాహసాన్ని విజయవంతంగా పూర్తి చేశారు. అమెరికాలోని కాటలినా ఐలండ్ నుంచి లాస్ ఏంజిలిస్ వరకు ఇలాంటి సాహసాన్ని పూర్తి చేశారు. కాటలినా ఐలండ్ నుంచి లాస్ ఏంజిలిస్ వరకు గల 36 కిలోమీటర్ల దూరాన్ని 12 డిగ్రీల టెంపరేచర్లో 19 గంటల్లో అధిగమించారు. లక్షద్వీప్‌లో కీల్టన్ ఐలండ్- కడ్మట్ ఐలండ్, హుగ్లీ, గంగ, భాగీరథీ నదుల్లో రికార్డు సమయాల్లో ఈది రికార్డు సృష్టించిన చరిత్ర శ్యామలది. శ్యామల సృజనాత్మక దర్శకురాలు, రచయిత కూడా. అయితే తన యానిమేషన్ స్టూడియో సక్సెస్‌కాకపోవడంతో ఆమె స్విమ్మింగ్‌లోకి ఎంట్రీ ఇచ్చారు. వేసవి ఈత శిబిరాల్లో పాల్గొనడం ద్వారా మరింత ఆసక్తి పెరిగింది. ఓపెన్ వాటర్ స్విమ్మింగ్ గురించి అవగాహన కల్పించడం, ప్రజలను ప్రోత్సహించడం ఆమె లక్ష్యంగా మారింది. ఓపెన్ వాటర్ స్విమ్మింగ్‌లో విజయాలుపాక్ స్ట్రెయిట్: 13 గంటల 43 నిమిషాల్లో 30 కిలోమీటర్లు ఈదుతూ, ఈ ఘనత సాధించిన రెండో మహిళగా నిలిచింది.కాటాలినా ఛానల్: కాటాలినా ద్వీపం నుండి లాస్ ఏంజిల్స్ వరకు 36 కిలోమీటర్లు 19 గంటల్లో గడ్డకట్టే 12°C ఉష్ణోగ్రతల మద్య స్విమ్మింగ్ చేశారు.లక్షద్వీప్ : లక్షద్వీప్ టూరిజంను ప్రోత్సహించాలని ప్రధాని నరేంద్ర మోదీ ఇచ్చిన పిలుపుతో స్ఫూర్తి పొంది కిల్టన్ ద్వీపం నుండి కద్మత్ ద్వీపానికి 18 గంటల్లో 48 కిలోమీటర్లు ఈదారు.ఆమె స్విమ్మింగ్ చేసిన నదులు•కృష్ణా నది: 1.5 కి.మీ•హూగ్లీ నది: 14 కిలోమీటర్లు•గంగా నది: 13 కి.మీ•భాగీరథి నది: 81 కి.మీ -
జనసేన ఎమ్మెల్యే అనుచరుల దాష్టీకం.. షాపులు కూల్చివేత
సాక్షి, కాకినాడ: ఏపీలో కూటమి నేతల అరాచక పాలన పీక్ స్టేజ్‌కు చేరుకుంది. రాష్ట్రంలో వైఎస్సార్సీపీ నేతలనే కాకుండా సామాన్యులను కూడా కూటమి నేతలు టార్గెట్ చేస్తున్నారు. తాజాగా కాకినాడలో ఎమ్మెల్యే పంతం నానాజీ అనుచరులు రెచ్చిపోయారు. మత్య్సకారుల దుకాణాలు కొనసాగాలంటే తమకు రూ.10లక్షలు ఇవ్వాలని హుకుం జారీ చేశారు. దీంతో, బాధితులు ఇదెక్కడి న్యాయమంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.కాకినాడ రూరల్‌లో జనసేన ఎమ్మెల్యే పంతం నానాజీ అనుచరులు రెచ్చిపోయారు. ఉప్పలంకలో మత్స్యకారుల దుకాణాలను అన్యాయంగా నేలమట్టం చేశారు. అయితే, మత్స్యకారుల జీవనోపాధి కోసం నాలుగేళ్ళ క్రితం ఉప్పలంక వద్ద ఐదు షాపులను అప్పటి వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే కురసాల కన్నబాబు కట్టించారు. ఆ దుకాణాలపై నానాజీ అనుచరులు కన్ను పడింది. వెంటనే రంగంలోకి దిగిన జనసేన నాయకులు.. అక్కడ దుకాణాలు కొనసాగాలంటే తమకు రూ.10లక్షలు ఇవ్వాలని హుకుం జారీ చేశారు. లేనిపక్షంలో దుకాణాలను తొలగిస్తామని హెచ్చరించారు.అనంతరం, ఎమ్మెల్యే నానాజీని బాధితులు కలిసి జరిగిన విషయం చెప్పి తమకు న్యాయం జరగాలని కోరారు. అయినప్పటికీ బాధితులకు న్యాయం జరగకపోగా తీవ్ర అన్యాయమే జరిగింది. దుకాణదారులు మూముళ్లు ఇవ్వలేదన్న కారణంగా రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయనే నెపంతో ఆర్ అండ్ బీ అధికారులతో నానాజీ అనుచరులు కుమ్మకయ్యారు. అధికారులు, జనసేన నేతలు అక్కడికి చేరుకుని షాపులను నేలమట్టం చేశారు.తమ షాపులు కూల్చివేయడంతో ఆవేదనకు గురైన మత్స్యకారుడు మల్లాడి సింహాద్రి పురుగుల మంది తాగి ఆత్మహత్యాయత్నం చేశాడు. అపస్మారక స్థితిలో ఉన్న సింహాద్రిని వెంటనే ఆసుపత్రి తరలించారు కుటుంబ సభ్యులు. ప్రస్తుతం సింహాద్రికి చికిత్స కొనసాగుతోంది. అయితే, రోడ్డు ప్రమాదాలకు ఇన్ని రోజులు లేని ఆంక్షలు ఇప్పుడే వచ్చాయా? అని స్థానికులు ప్రశ్నిస్తున్నారు. -
కొడవలి.. బతుకు వారధి
కణకణ మండే అగ్ని కీలల నుంచి ఎగసిపడే నిప్పురవ్వలు.. పిడికిళ్లు బలంగా బిగించి మలాటు(పెద్ద సుత్తి వంటి సాధనం)లతో ఇనుప కమ్మెలపై కార్మికులు గట్టిగా కొడుతున్న శబ్దాలు ఆ ఊళ్లో సర్వసాధారణం. ముఖ్యంగా వ్యవసాయ సీజన్లో రైతన్నకు ఉపయోగపడే కొడవళ్లతో పాటు, ఇతర పనిముట్ల తయారీలో రేయింబవళ్లు శ్రమిస్తూంటుంది నడకుదురు గ్రామం. కాకినాడ సిటీ: వ్యవసాయ సీజన్ ప్రారంభమైందంటే ఎక్కువ మంది రైతుల అడుగులు నడకుదురు గ్రామం వైపే పడతాయి. కాకినాడ సిటీకి కూతవేటు దూరాన.. కరప మండలంలో ఉన్న ఈ ఊరు పంట కోతలకు అవసరమైన కొడవళ్ల తయారీకి పెట్టింది పేరు. వరి, మినుముతో పాటు, గడ్డి కోతలకు అవసరమైన కొడవళ్లను, ఇతర పనిముట్లను నడకుదురు గ్రామంలో తయారు చేస్తూంటారు. సుమారు 80 ఏళ్ల క్రితం ఈ గ్రామంలో కొడవళ్ల తయారీ ప్రారంభమైంది. ప్రస్తుతం నాణ్యమైన కొడవళ్లను నైపుణ్యంతో తయారు చేయడంలో మూడో తరం కార్మికులు నిమగ్నమై ఉన్నారు. ఈ గ్రామంలో 4 కుటుంబాలకు చెందిన వారు 46 మందికి పైగా ఐదుకు పైగా కొలుముల్లో పని చేస్తున్నారు. నడకుదురులో తయారైన కొడవళ్లు తెలుగు రాష్ట్రాల నలుమూలలకూ సరఫరా అవుతున్నాయి. అంతేకాకుండా మహారాష్ట్ర, కర్ణాటక, తమిళనాడు రాష్ట్రాల్లోని కొన్ని ప్రాంతాలకు సైతం ఇక్కడి కొడవళ్లు ఎగుమతి అవుతున్నాయి. గిట్టుబాటు కాక.. కొడవళ్ల తయారీకి ఉపయోగించే బేల్ బద్దలను రాజమహేంద్రవరం, మండపేట, విశాఖపట్నంతో పాటు విజయవాడ తదితర ప్రాంతాల నుంచి కిలోల లెక్కన కొనుగోలు చేసి, దిగుమతి చేసుకుంటారు. ఏటా ముడి సరకు ధరలు పెరుగుతున్నా కొడవళ్ల ధరలు పెరగడం లేదు. బేల్ బద్దల లోడు గత ఏడాది రూ.58 వేల నుంచి రూ.60 వేలు ఉండగా ఈ సంవత్సరం రూ.65 వేలకు పెరిగింది. దీంతో పాటు కొడవలి తయారీకి అవసరమైన బొగ్గులు, చెక్కతో పాటు రవాణా చార్జీలు కూడా పెరుగుతున్నాయి. తమ శ్రమ వృథా అవుతోందని, వస్తున్న డబ్బులు గిట్టుబాటు కావడం లేదని కార్మికులు ఆవేదన చెందుతున్నారు. తయారైన కొడవళ్లకు అమర్చేందుకు చెక్కతో చేసిన పిడులు అవసరమవుతాయి. ఈ పిడులు తయారు చేసేందుకు గతంలో గ్రామంలోనే ప్రత్యేకంగా కార్మికులుండేవారు. వేరే ఉపాధి అవకాశాలతో కొంత మంది, శ్రమకు తగిన ఫలితం దక్కక మరి కొంతమంది ఈ వృత్తికి దూరమయ్యారు. కొలిమిలో కాలి.. కొడవలిగా మారి.. కొడవళ్లు తయారు చేసే కార్మికులు రెక్కలు ముక్కలు చేసుకుంటూంటారు. తొలుత ముడి ఇనుప బద్దీలను కొలిమిలో ఎర్రగా కాలుస్తారు. అనంతరం, ఆ ఇనుప బద్దలను మలాటులతో బలంగా కొట్టి, కొడవలి ఆకృతిలోకి మలుస్తారు. ఆ తర్వాత దానికి సాన పట్టి, నొక్కులు కొట్టి, చెక్క పిడులు అమరుస్తారు. ఒక్కో కొలిమిలో రోజుకు సుమారు 200 కొడవళ్లు తయారు చేస్తూంటారు. వీటిని రూ.40, రూ.60, రూ.80, రూ.120 ధరల్లో నాణ్యతా ప్రమాణాలు పాటిస్తూ తయారు చేస్తారు. గతంలో నడకుదురు గ్రామంలో సీజన్లో 80 వేలకు పైగా కొడవళ్లు తయారు చేసేవారు. ప్రస్తుతం వ్యవసాయ రంగంలో యాంత్రీకరణ పెరగడంతో కొడవళ్లకు గిరాకీ తగ్గింది. దీంతో ఈ కార్మికులు వ్యవసాయ, ఇంటి పనులకు ఉపయోగించే గునపాలు, పారలు, కత్తిపీటల వంటి వాటితో పాటు పంచాయతీ కార్మికులు వినియోగించే వివిధ రకాల వస్తువులు తయారు చేస్తూ జీవనం సాగిస్తున్నారు. యాంత్రీకరణతో తగ్గిన డిమాండ్ వ్యవసాయంలో కొన్నేళ్లుగా పెరుగుతున్న యాంత్రీకరణ కొడవళ్ల తయారీపై కొంత మేర ప్రభావం చూపింది. గతంలో నడకుదురు నుంచి వేలాదిగా కొడవళ్ల అమ్మకాలు జరిగేవి. ప్రస్తుత్తం వీటికి డిమాండ్ బాగా తగ్గిందని, దీంతో పని వారు కూడా రావడం లేదని తయారీదార్లు చెబుతున్నారు. తమ కార్ఖానాల్లో ఏడాదంతా కొడవళ్లు తయారు చేసినా.. వ్యవసాయ సీజన్ ప్రారంభమైన నాలుగు నెలలూ పని ఒత్తిడి అధికంగా ఉండేదని అంటున్నారు. ఇప్పుడు ఆ పరిస్థితి తగ్గిందని, దీంతో ఉపాధి తగ్గి, తాము ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని చెబుతున్నారు. గత ప్రభుత్వ హయాంలో తమకు వివిధ రకాల సంక్షేమ పథకాలతో ఆర్థికంగా ఆదుకొనేవారని, ప్రస్తుత ప్రభుత్వం ఆవిధంగా ఆదుకోకపోవడంతో ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని పేర్కొంటున్నారు. సబ్సిడీపై రుణాలివ్వాలి గతంతో పోలిస్తే ప్రస్తుతం పరిస్థితులు ఎంతగానో మారిపోయాయి. నాటికి, నేటికి ముడి సరకుల ధరల్లో ఎంతో వ్యత్యాసం ఉంది. మేము చేసే కొడవళ్లకు గిరాకీ ఉన్నా.. గిట్టుబాటు ధర దక్కడం లేదు. ప్రభుత్వం మాపై దృష్టి సారించి, కుటీర పరిశ్రమగా అభివృద్ధి చేసేందుకు చర్యలు చేపట్టాలి. సబ్సిడీపై రుణాలు అందించడంతో పాటు ముడి వస్తువులకు సబ్సిడీ కూడా ఇవ్వాలి. – కణిత నాగేశ్వరరావు, కొడవళ్ల తయారీదారు, నడకుదురు నాణ్యత పాటిస్తాం నడకుదురులో మా మూడు కుటుంబాలకు చెందిన వారు కొడవళ్ల తయారీలో నిరంతరం శ్రమిస్తూంటారు. నాణ్యమైన ముడి ఇనుమును ఉపయోగించటంతో పాటు నాణ్యతా ప్రమాణాలను పాటిస్తూ కొడవళ్లు తయారు చేస్తాం. దీంతో అవి ఎక్కువ కాలం రైతులకు ఉపయోగపడతాయి. అందువల్లనే మా నడకుదురు కొడవళ్లకు మంచి పేరు ఉంది. పంట కోత యంత్రాలు రావడంతో కొన్నాళ్లుగా కొడవళ్లకు డిమాండ్ తగ్గింది. – కణితి రాంబాబు, కొడవళ్ల తయారీ కార్మికుడు, నడకుదురు -
AP: మద్యంపై మహిళల పోరు.. పునాదులు తొలగించి..
సాక్షి, కాకినాడ: ఏపీలో కూటమి సర్కార్ పాలన తీరుపై ప్రజల్లో వ్యతిరేకత మొదలైంది. ముఖ్యంగా మద్యం విషయంలో చాలా చోట్ల ప్రజల నుంచి నిరసన ఎదురవుతోంది. తాజాగా కాకినాడ జిల్లాలో మద్యంపై మహిళలు తిరుగుబాటు జెండా ఎగురవేశారు. సర్కార్ తీరుపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ షాపు నిర్మాణం చేపట్టిన చోట పునాదుల నుంచి రాళ్లను తొలగించారు.కాకినాడ జిల్లాలోని తునిలో మద్యం మహిళలు అసహనం వ్యక్తం చేశారు. గ్రామంలో మద్యం షాపులు ఏర్పాటు చేస్తామంటే ఊరుకునేది లేదని తేల్చి చెప్పారు. ఇదే క్రమంలో డి.పోలవరం గండిలో మద్యం షాపు నిర్మాణాన్ని మహిళలు అడ్డుకున్నారు. చంద్రబాబు సర్కార్‌పై ఆగ్రహంతో పునాదుల నుంచి రాళ్లను తొలగించారు. మళ్లీ నిర్మాణం చేపడితే ఊరుకునేది లేదని హెచ్చరించారు. -
కాకినాడలో మట్కా
వరుణ్ తేజ్ హీరోగా నటిస్తున్న తాజా పాన్ ఇండియా చిత్రం ‘మట్కా’. కరుణ కుమార్ దర్శకత్వంలో డా. విజయేందర్ రెడ్డి తీగల, రజనీ తాళ్లూరి నిర్మిస్తున్న ఈ సినిమాలో నోరా ఫతేహి, మీనాక్షి చౌదరి హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఈ మూవీ తాజా షెడ్యూల్ కాకినాడలో జరుగుతోంది.‘‘మాస్ యాక్షన్ ఎంటర్టైనర్గా రూపొందుతోన్న చిత్రం ‘మట్కా’. పీరియాడికల్ బ్యాక్‌డ్రాప్‌లో సాగే ఈ సినిమాలో వరుణ్ డిఫరెంట్ మేకోవర్లలో కనిపించనున్నారు. ప్రస్తుతం కాకినాడలో జరుగుతున్న షెడ్యూల్లో కీలక తారాగణంపై టాకీ పార్ట్‌తో పాటు యాక్షన్ సన్నివేశాలను చిత్రీకరిస్తున్నాం’’ అని చిత్రయూనిట్ పేర్కొంది. నవీన్ చంద్ర, సలోని, అజయ్ ఘోష్, కన్నడ కిశోర్, రవీంద్ర విజయ్, పి. రవి శంకర్ తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి సంగీతం: జీవీ ప్రకాశ్‌కుమార్, కెమెరా: ఎ. కిశోర్ కుమార్. -
షిర్డీ టూ కాకినాడ రైలులో భారీ చోరీ.. ప్రయాణీకుల ఆందోళన
సాక్షి, బీదర్: షిర్డీ టూ కాకినాడ పోర్టు ఎక్స్‌ప్రెస్ రైలులో దొంగలు రెచ్చిపోయారు. రైలులో ప్రయాణీకులు నిద్రిస్తున్న సమయాన్ని ఆసరాగా చేసుకుని మూడు బోగీల్లో బంగారం, నగదు, లగేజీని దొంగలించారు. దీంతో, బీదర్ వద్ద రైలును నిలిపివేసి ప్రయాణీకులు ఆందోళనకు దిగారు.వివరాల ప్రకారం.. సాయినగర్ షిర్డీ టూ కాకినాడ పోర్టు ఎక్స్‌ప్రెస్ రైలులో భారీ దోపిడీ జరిగింది. మహారాష్ట్రలోని వర్లీ సమీపంలో రైలులో ఎక్కిన దొంగలు దోపిడీకి పాల్పడ్డారు. ప్రయాణీకులు నిద్రిస్తున్న సమయంలో వారి వద్ద నుంచి బంగారం, నగదు, లగేజీని దొంగలించారు. ఈ క్రమంలో దోపిడీని గుర్తించిన ప్రయాణికులు ఆందోళనకు గురయ్యారు.అయితే, దోపిడీ అనంతరం దొంగలు బీదర్‌కు ముందున్న పర్లీ స్టేష్లన్‌లో దిగిపోయినట్టు ప్రయాణికులు గుర్తించారు. దీంతో, తమకు న్యాయం జరగాలని ప్రయాణికులు ఆందోళనలు చేస్తున్నారు. బీదర్‌లో రైలును నిలిపివేసి ఆందోళనకు దిగారు. -
జగన్ కు అరచేతిలో హారతి.. వద్దు తల్లి..!
-
ఎగిరేది మనజెండానే: బాబు నాలుగు జెండాలతో జత కట్టినా వారి జెండా ఎగరదన్న జగన్
-
హై వోల్టేజ్ స్పీచ్..దద్దరిల్లిన కాకినాడ...
-
Kakinada Memantha Siddham: మేమంతా సిద్ధం సభ: కాకినాడలో జన హోరు (ఫొటోలు)
-
దద్దరిల్లిన కాకినాడ..!
-
ఏపీలో మత్స్యకారులకు శుభవార్త
-
బీజేపీ వదినమ్మ.. టీడీపీ మరిది కోసం పురందేశ్వరి పై సీఎం జగన్ సెటైర్లు
-
నాకు ఈ రోజు కాకినాడలో ఉప్పొంగిన గోదావరి కనిపిస్తుంది
-
చంద్రబాబు తన సంకలోని పిల్లిని పిఠాపురంలో వదిలాడు: సీఎం జగన్
సాక్షి, కాకినాడ: వైఎస్సార్సీపీకీ ఓటేస్తే రాష్ట్రంలో అమలవుతున్న పథకాలన్నీ కొనసాగుతాయన్నారు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి. పొరపాటున చంద్రబాబుకు ఓటేస్తే పథకాలన్నీ రద్దవుతాయని అన్నారు. ఫ్యాన్‌కు ఓటేస్తే.. అవ్వతాతలకు రూ.3వేల పెన్షన్ వస్తుందని తెలిపారు. బాబుకు ఓటేస్తే జన్మభూమి కమిటీలతో దోచుకుంటారని విమర్శించారు. ఫ్యాన్‌కు ఓటేస్తే ఇంటింటికి పౌర సేవలు అందుతాయని పేర్కొన్నారు. బాబుకు ఓటేస్తే.. పసుపుపతి నిద్రలేచి వదలా బొమ్మాళి అంటాడని సీఎం జగన్ మండిపడ్డారు. ‘మేమంతా సిద్ధం’ బస్సు యాత్ర 18వ రోజు తూర్పు గోదావరి జిల్లాలో కొనసాగుతోంది. ఈ సందర్భంగా కాకినాడ అచ్చంపేట జంక్షన్ వద్ద ఏర్పాటు చేసిన భారీ బహిరంగ సభలో సీఎం జగన్ ప్రసంగించారు. కాకినాడలో ఉప్పొంగి ప్రవహిస్తన్న నిండు గోదావరి కనిపిస్తోందన్నారు. ఎన్నికలకు కేవలం 25 రోజులే ఉన్నాయని.. జైత్రయాత్రకు సిద్ధమని ప్రజలంతా సింహగర్జన చేస్తున్నారని తెలిపారు. మంచి చేసిన మీ బిడ్డకు తోడుగా ఉండేందుకు మీరంతా సిద్ధమా? అని ప్రశ్నించారు. వచ్చే ఎన్నికల్లో పేదల వ్యతిరేక వర్గాన్ని చిత్తుగా ఓడించాలని పిలుపునిచ్చారు. పెత్తందారుల అనుకూల వర్గానికి, పేదల అనుకూల వర్గానికి క్లాస్ వార్ జరుగుతోందన్నారు సీఎం జగన్. మీరేసే ఓటు.. రాబోయే ఐదేళ్ల భవిష్యత్తని అన్నారు. జగన్‌కు ఓటేస్తే పథకాలన్నీ కొనసాగుతాయని తెలిపారు. ఇప్పటి వరకు రూ. 2 లక్షల 70 వేల కోట్లు పేదల ఖాతాల్లో వేశామని పేర్కొన్నారు. దోచుకోవడం, దాచుకోవడం బాబు మార్క్ పాలన అని మండిపడ్డారు. రెండు ఓట్లు ఫ్యాన్ మీద వేస్తే జగన్ మార్క్ పాలన కొనసాగుతోందన్నారు. సీఎం జగన్ పూర్తి ప్రసంగం జగన్ ద్వారా అందుతున్న పథకాలు ఇక ముందుకూడా అందాలా.. లేదా? వైఎస్సార్సీపీకి ఓటేస్తే జగన్ మార్క్ సచివాలయాలు కొనసాగుతాయి లేకుంటే చంద్రబాబు మార్క్ జన్మభూమి కమిటీలు మళ్లీ వస్తాయి బాబుకు ఓటేస్తే జన్మభూమి కమిటీలతో దోచుకుంటారు. ఓటేయడంలో పొరపాటు చేస్తే చంద్రముఖి నిద్ర లేచి మీ పిల్లల భవిష్యత్తు నాశనం చేస్తుంది. మంచి చేసిన మీ బిడ్డ పాలనా కావాలా? ఫ్యాన్‌కు ఓటేస్తేనే రైతు భరోసా, ఉచిత పంటల భీమా ఫ్యాన్‌కు ఓటేస్తేనే.. పగటిపూట 9 గంటల ఉచిత విద్యుత్ వైఎస్సార్సీపీకి ఓటేస్తేనే.. సకాలంలో ఇన్పుట్ సబ్సిడీ ఫ్యాన్‌కు ఓటేస్తేనే..పిల్లల చదువులకు ఇబ్బంది లేకుండా అమ్మొడి, విద్యాదీవెన, వసతిదీవెన ఫ్యాన్‌కు ఓటేస్తేనే..కాపు నేస్తం కొనసాగింపు ఫ్యాన్‌కు ఓటేస్తేనే..నామినేటెడ్ పదవుల్లో మహిళలకు ప్రాధాన్యం మంచి చేసిన మీ బిడ్డ పాలనా కావాలా? పెత్తందారులతో కలిసి దోచుకునే కూటమి పాలన కావాలా? 14 ఏళ్లలో బాబు చేసిన మంచి పని కూడా లేదు. చంద్రబాబు పేరు చెప్తే ఒక్క పథకమైనా గుర్తుకొస్తుందా? దత్తపుత్రుడు టికెట్లు ఇస్తే ఏర్పడిన కూటమి కాదు బాబు ప్రయోజనం కోసం ఎక్కడ కావాలంటే అక్కడ నిలబడుతున్నాడు. దత్తపుత్రుడికి ఎక్కడ టికెట్ ఇవ్వాలో కూడా బాబే నిర్ణయిస్తాడు. జ్వరం వస్తే పిఠాపురం వదిలి హైదరాబాద్ పారిపోయాడు బాబు సిట్ అంటే పవన్ సిట్.. స్టాండ్ అంటే పవన్ స్టాండ్ ప్యాకేజీ స్టార్‌కు పెళ్లిళ్లే కాదు.. నియయోజకవర్గాలు కూడా నాలుగు అయ్యాయి. చంద్రబాబు తన సంకలోని పిల్లిని పిఠాపురంలో వదిలాడు జ్వరం వస్తే ప్యాకేజీ స్టార్ పిఠాపురం వదిలేసి హైదరాబాద్ పారిపోయే రకం బీఫామ్ బీజేపీ, కాంగ్రెస్, గాజుగ్లాస్‌దే అయినా..యూనిఫామ్ మాత్రం చంద్రబాబుదే రాష్ట్రాన్ని హోల్‌సేల్‌గా దోచుకునేందుకు చంద్రబాబు రాజకీయాలు చేస్తున్నారు. బాబు పొడవమంటే పురందేశ్వరి తన తండ్రినే వెన్నుపోటు పొడిచింది. బాబు ఎవరికి సీటు ఇమ్మంటే పురందేశ్వరి వారికే ఇస్తుంది. నక్కలు, తోడేళ్లు కూటమిగా వస్తున్నాయి. ఎవరు ఉంటే మీ ఇంటికి మంచి జరుగుతుందో ఆలోచించి ఓటేయండి ఫ్యాన్‌కు ఓటేస్తే పథకాలు అన్నీ కొనసాగుతాయి. కూటమికి ఓటేస్తే పథకాలన్నీ ముగిసిపోతాయి చంద్రబాబు సాధ్యం కాని హామీ ఇస్తున్నారు. మంచి చేసిన మీ బిడ్డ పాలన కావాలా? పెత్తందారులతో కలిసి దోచుకునే కూటమి కావాలా గత ఎన్నికల్లో మాకు ఓటు వేయని వారికి కూడా మంచి చేశాం మీరే నాస్టార్ క్యాంపెయినర్లు నా మీద వేయడానికి చంద్రబాబుకు గులకరాళ్లే మిగిలాయి మీరే నాస్టార్ క్యాంపెయినర్లు రైతు రుణమాఫీ చేస్తానన్నాడు.. చేశాడా? పొదుపు సంఘాల రుణాలు మాఫీ చేస్తా అన్నాడు.. చేశాడా? ఆడబిడ్డ పుడితే రూ. 25 వేలు డిపాజిట్ చేస్తానన్నాడు.. చేశాడా? ఇదే కూటమి మళ్లీ మోసం చేసేందుకు వస్తోంది. నమ్మొద్దు 10 వేల కోట్లతో బీసీ సబ్‌ప్లాన్ అన్నాడు.. చేశాడా? సింగపూర్‌ను మించి అభివృద్ధి చేస్తానన్నాడు.. చేశాడా? ప్రతి నగరంలో హైటెక్ సిటీ నిర్మిస్తానన్నాడు.. నిర్మించాడా? అర్హులకు మూడు సెంట్ల స్థలం ఇస్తానన్నాడు.. ఇచ్చాడా? ఇదే కూటమి మళ్లీ మోసం చేసేందుకు వస్తోంది. నమ్మొద్దు సూపర్ సిక్స్, సెవెన్ అంటున్నాడు. ఆ మోసగాళ్ల నుంచి రాష్ట్రాన్ని కాపాడేందుకు మీరంతా సిద్ధమా? Read this article in English : Click.. Package Star Has Got 4 Marriages & 4 Constituencies -
కాకినాడ సభకు చేరుకున్న సీఎం జగన్
-
Watch Live: ‘మేమంతా సిద్ధం’ కాకినాడ సభ
-
కాకినాడ బహిరంగ సభకు భారీగా తరలివస్తున్న జనం
-
జనసేన కోసం గొడ్డులా కష్ట పడ్డాం.. కానీ చివరికి..!
-
ఉమ్మడి ‘తూర్పు’లో అభివృద్ధి వికాసం
సాక్షి ప్రతినిధి, కాకినాడ:/సాక్షి, రాజమహేంద్రవరం/అమలాపురం: తూర్పు గోదావరికి రాష్ట్రంలో ఉన్న ప్రత్యేకతే వేరు. గడచిన ఐదేళ్ల ప్రగతితో ఆ జిల్లా స్వరూపమే మారిపోయింది. పట్టణాలతో పోటీపడేలా పల్లెల్లో సైతం పారిశ్రామికీకరణకు పునాదులు పడ్డాయి. రూ.299.40 కోట్లతో రోడ్లు, భవన నిర్మాణాలు చేపట్టారు. రూ.229.40తో పనులు మొదలయ్యాయి. మరో 33 రోడ్లను రూ.42.87 కోట్లతో మరమ్మతులు చేశారు. రెండో దశలో రూ.26.37 కోట్లతో పనులు చేపట్టారు. కత్తిపూడి–ఒంగోలు జాతీయ రహదారి విస్తరణ పనులు వేగంగా జరుగుతున్నాయి. వశిష్ఠ నదిపై వంతెన నిర్మాణానికి రూ.580.42 కోట్ల నిధులు మంజూరయ్యాయి. కోనసీమ రైల్వే లైన్ కల సాకారమవుతోంది. దీనికోసం ఈ ఏడాది రూ.300 కోట్లు నిధులు వచ్చాయి. అయినవిల్లి మండలంలో రూ.300 కోట్లతో 440/132 కేవీ మెగా విద్యుత్ స్టేషన్ పనులు జరుగుతున్నాయి. పి.గన్నవరం మండలం ఉడిమూడిలంక, గంటి పెదపూడిలంక, అరిగెలవారిపేట, బూరుగులంక ప్రజలు గోదావరిపాయ దాటాల్సిన అవసరం లేకుండా రూ.49.50 కోట్లతో వంతెన పనులు మొదలయ్యాయి. ముమ్మిడివరం– ఐ.పోలవరం సరిహద్దులో వృద్ధ గౌతమీ, గౌతమీ నదీ పాయల మధ్య పశువుల్లంక మొండి రేవు వద్ద రూ.49 కోట్లతో వంతెనను సీఎం జగన్న్పూర్తి చేయడంతో 16 గ్రామాల్లోని 8 వేల మందికి సౌకర్యం కలిగింది. 2023, 2024 సంవత్సరాల్లో ఖరీఫ్, రబీ సీజన్లలో రికార్డు స్థాయిలో దిగుబడి సాధించారు. గతేడాది ఎకరాకు 32 బస్తాలు దిగుబడి వస్తే ఈ ఏడాది 38 నుంచి 45 బస్తాలు పండించారు. ఏటా ఖరీఫ్ సీజ¯న్లో 3.20 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేస్తున్నారు. రాజమహేంద్రి రాత మారింది ♦ రూ.423 కోట్లతో నాలుగున్నరేళ్లలో నగర రూపురేఖలు మారిపోయాయి. ♦ నవరత్నాలుతో జిల్లా వ్యాప్తంగా 33 పథకాలతో ప్రజలకు మేలు జరిగింది. రికార్డు స్థాయిలో రూ.25,436 కోట్లు వెచ్చించారు. ♦ నాడు–నేడులో 1069 పాఠశాలల భవనాలకు రూ.369.89 కోట్లు వెచ్చించారు. ♦ గృహాల కోసం 68,518 మందికి రూ.1233.34 కోట్లు వెచ్చించారు. 336 గ్రామ సచివాలయాలకు రూ.108.47 కోట్లు విడుదలయ్యాయి. ♦ డిసెంబర్ నాటికి ప్రభుత్వం సంక్షేమ పథకాలకు రూ.25,436 కోట్లు వెచ్చించింది. ♦ రాజమహేంద్రవరంలో రూ.475 కోట్లతో ఏర్పాటైన మెడికల్ కళాశాలలో 150 ఎంబీబీఎస్ సీట్లు అందుబాటులోకి వచ్చాయి. ♦ 1.46 లక్షల మంది ఇంటి పట్టాలు అందుకున్నారు. తొలి దశలో రూ.113.48 కోట్లతో 63,000 ఇళ్ల నిర్మాణానికి శ్రీకారం చుట్టింది. ♦ అనపర్తి బలభద్రపురంలో రూ.2500 కోట్లతో గ్రాసిమ్ కాస్టిక్ సోడా పరిశ్రమతో 2500 మందికి ఉపాధి లభించింది. ♦ గోకవరం మండలం గుమళ్లదొడ్డి వద్ద రూ.260 కోట్లతో ఇథనాల్ ప్లాంట్ పనులు జరుగుతున్నాయి. 210 మంది నిరుద్యోగులకు ఉపాధి లభిస్తుంది. ♦ కొవ్వూరు మండలం ఇసుకపట్ల పంగిడి వద్ద రూ.1,350 కోట్లతో త్రివేణి రెన్యువబుల్స్ ఆధ్వర్యంలో సోలార్ గ్లాస్ తయారీ పరిశ్రమ ఏర్పాటైంది. దీని ద్వారా 2400 మందికి ఉద్యోగాలు దక్కాయి. ♦ నల్లజర్ల మండలం పోతవరంలో రూ.50 కోట్లతో జాగృతి బయోటెక్ ప్రైవేటు సంస్థ బయోటెక్నాలజీ కంపెనీ అందుబాటులోకి రానుంది. ♦ ఆరు ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలకు నాడు–నేడులో రూ.9.21 కోట్లు మంజూరు ♦ గడప గడపకు మన ప్రభుత్వంలో ఎదురైన సమస్యల్లో రూ.72.88 కోట్ల నిధులతో 1,102 పనులకు పరిష్కారం. ♦‘నాడు– నేడు’ మొదటి విడతలో రూ.104.96 కోట్లతో 436 పాఠశాలలు, రెండో విడతలో రూ.257 కోట్లతో 761 పాఠశాలలు, 10 ప్రభుత్వ జూనియర్ కళాశాలల అభివృద్ధి. ♦ పేదలందరికీ ఇళ్లు రెండు విడతల్లో 34,454 ఇళ్లకు రూ.62,017 కోట్లు కేటాయింపు. ♦ జల జీవన్ మిషన్‌లో రూ.515.93 కోట్లతో ఓవర్ హెడ్ ట్యాంకులు, పైప్లైన్ల నిర్మాణం. ♦ జగనన్న కాలనీల్లో 209 లే అవుట్లలో కుళాయిల కోసం రూ.45.75 కోట్లు కేటాయింపు. ♦ ఇంటింటికీ గోదావరి జలాలందించేందుకు రూ.1,650 కోట్లు కేటాయింపు ఫుడ్ ప్రాసెసింగ్, రొయ్యల ప్రాసెసింగ్ యూనిట్లు, హేచరీల్లో కల్పిస్తున్న ఉపాధి ఇలా 2019– 20లో 265 యూనిట్లతో 1707 మందికి 2020–21లో 119 యూనిట్లతో 978 మందికి 2021–22లో 720 యూనిట్లతో 4254 మందికి 2022–23లో 2412 యూనిట్లతో 9455 మందికి -
జగనన్న సభకు కాకినాడ సర్వం సిద్ధం
-
వాలంటీర్లపై జనసేన గూండాల అమానుషం.. గదిలో బంధించి!
సాక్షి, కాకినాడ: కాకినాడ జిల్లాలో వాలంటీర్లపై జనసేన గూండాల అమానుషంగా ప్రవర్తించారు. ఆరుగురు వాలంటీర్లను రెండు గంటల పాటు ఓ గదిలో నిర్భంధించి తాళం వేశారు. గదిలో ఫర్నిఛర్ ధ్వంసం చేసి వాలంటీర్లపై దౌర్జన్యం చేశారు. వాలంటీర్లలో ఏడు నెలల గర్భవతి ఉన్నా జనసేన గూండాలు కనికరించలేదు. తమ తోటి వాలంటీర్ పుట్టిన రోజు సందర్భంగా రమణయ్యపేట మోక్షిత ఫైనాన్స్ కంపెనీలో వీరంతా కలుసుకున్నారు. స్వీట్స్, కూల్ డ్రీంక్స్ తీసుకొని ఆనందంగా మాట్లాడుకున్నారు. అయితే ఓటర్లకు డబ్బులు పంచుతున్నారన్న నెపంతో లోపలికి చొరబడిన కాకినాడ రూరల్ జనసేన అభ్యర్ధి పంతం నానాజీ, తన కార్యకర్తలతో కలసి వాలంటీర్లపై దాడికి దిగారు. రెండు గంటల పాటు వాలంటీర్లను నిర్బంధించి నానా హంగామా చేశారు. జనసేన దౌర్జన్యానికి గర్భంతో ఉన్న వాలంటీర్ సొమ్మసిల్లి పడిపోయారు. సమాచారం అందుకున్న పోలీసులు, ఎన్నికల అధికారులు గదిలోకి వెళ్లి చూడగా అక్కడ కూల్ డ్రింక్స్, స్వీట్స్ గుర్తించారు. కాగా పంతం నానాజీ తీరుపై వాలంటీర్లు మండిపడుతున్నారు. జనసేన గుండాలపై పోలీసు ఫిర్యాదుకు భాధిత వాలంటీర్లు సిద్ధమవుతున్నారు. చదవండి: పవన్‌కు వీళ్లా స్టార్ క్యాంపెయినర్లు! -
కాకినాడలో జోరుగా ద్వారంపూడి ఎన్నికల ప్రచారం
-
పింఛన్ దారుడి మృతిపై చలించిన సీఎం జగన్
-
పింఛన్ దారుడి మృతిపై చలించిన సీఎం జగన్
సాక్షి, కాకినాడ: ప్రతీ నెలా ఒకటో తేదీన అందే ఫించన్‌తోనే నెలంతా గడిపే పేద కుటుంబాలు ఇప్పుడు ఆందోళనకు లోనవుతున్నాయి. ఒకటో తేదీన వలంటీర్లే అందించాల్సిన పెన్షన్‌ను.. ఈసీ కోడ్ మూలంగా తామే స్వయంగా తామే వెళ్లి తెచ్చుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఇందుకు చంద్రబాబు అండ్ కో చేసిన కుట్ర కారణమని ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అయితే మూడో తేదీన ఫించన్ అందుతుందని తెలిసినా.. వృద్ధులు, దివ్యాంగులు మాత్రం సచివాలయాల వద్ద పడిగాపులు పడుతున్న దృశ్యాలు కనిపిస్తున్నాయి. ఈ క్రమంలో.. విషాదాలు సైతం చోటు చేసుకుంటున్నాయి. కాకినాడ రూరల్ తూరంగిలో ఫించన్ అందలేదన్న బాధతో ఓ వృద్ధుడు గుండె ఆగి మరణించాడు. కే. వెంకట్రావ్(70) అనే వ్యక్తికి వలంటీర్ వ్యవస్థ మూగ బోయ్యిందన్న సమాచారం తెలియదు. దీంతో తీవ్ర ఆందోళనకు లోనయ్యాడు. ఈ క్రమంలో తానే స్వయంగా సచివాలయానికి వెళ్లి ఏం జరిగిందో తెలుసుకుందాం అనుకున్నాడు. మార్గం మధ్యలోనే గుండెపోటుకి గురై కన్నుమూశాడు. కూలీ పని చేసుకునే వెంకట్రావ్‌కు భార్య, ముగ్గురు పిల్లలు ఉన్నారు. వెంకట్రావ్ మృతి పట్ల కాకినాడ రూరల్ ఎమ్మెల్యే కురసాల కన్నబాబు సంతాపం వ్యక్తం చేశారు. ఆ కుటుంబాన్ని కలిసి ఓదార్చారు. అంతేకాదు.. వెంకట్రావ్ మృతి చెందిన విషయాన్ని సీఎం జగన్మోహన్రెడ్డి దృష్టికి తీసుకెళ్లారు. వెంకట్రావ్ మృతిపై చలించిపోయిన సీఎం జగన్.. వెంకట్రావ్ కుటుంబానికి ప్రభుత్వం తరఫున రూ. 5 లక్షల పరిహారం అందించాలని అధికారుల్ని ఆదేశించారు. చంద్రబాబు రాజకీయ లబ్ధికోసమే చేసిన కుట్రతో వలంటీర్లు ఫించన్ పంపిణీకి దూరమైయ్యారు. వలంటీర్ల ఫోన్ లు వెనక్కి ఇచ్చేయడంతో సమాచారం లేక వెంకట్రావు సచివాయాలనికి బయలు దేరాడు. మార్గ మధ్యలో గుండె ఆగి చనిపోవడం విషాదకరం. వెంకట్రావ్ కుటుంబాన్ని ఆదుకుంటాం అని కురసాల కన్నబాబు ఈ సందర్భంగా చెప్పారు. తిరుపతిలో మరో వృద్ధుడు.. తిరుపతిలో జిల్లా వెంకటగిరి బంగారుపేటలో 80 ఏళ్ల వృద్ధుడు వెంకటయ్య మృతి చెందాడు. వాలంటీర్లు ఇంటికి వెళ్లి పెన్షన్‌ను ఇవ్వరన్న మనస్తాపంతో గుండెపోటుతో అక్కడికక్కడే వెంకటయ్య కుప్పకూలిపోయాడు. మరోపక్క.. చంద్రబాబు, పవన్, బీజేపీ తీరుపై మనస్తాపానికి గురై పలువురు వలంటీర్లు ఇప్పటికే రాజీనామా చేసిన విషయం తెలిసిందే. పేదలకు ఇచ్చే పెన్షన్లను ఇవ్వకుండా అడ్డుకోవడం తమను బాధించిందన్నారు. ఒకటో తేదీ ఉదయం నుంచే తమకు పలువురు ఫించన్ కోసం ఫోన్లమీద ఫోన్లు చేస్తూ ఆరా తీస్తున్నారని, తకు ముందులా తాము బాధపడాల్సిన పరిస్థితులొచ్చాయని పెన్షనర్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారని వలంటీర్లు అంటున్నారు. -
కాకినాడ బీచ్‌లో భారత్, అమెరికా సేనలు (ఫోటోలు)
-
టైగర్ ట్రయంఫ్ 2024: కాకినాడ బీచ్‌లో ఫీల్డ్ హాస్పిటల్
టైగర్ ట్రయంఫ్ 2024లో భాగంగా శుక్రవారం (మార్చి 29) కాకినాడ బీచ్‌లో భారత్ & అమెరికా ద్వైపాక్షిక ట్రై-సర్వీస్ హ్యుమానిటేరియన్ అసిస్టెన్స్ అండ్ డిజాస్టర్ రిలీఫ్ (HADR) కార్యక్రమం జరిగింది. రెండు దేశాలకు చెందిన బృందాలు ఫీల్డ్ హాస్పిటల్ అనే ఒక ప్రత్యేక శిబిరాన్ని.. ఇల్లు వదిలిన లేదా స్థానభ్రంశం చెందిన వ్యక్తుల కోసం నిర్మించారు. టైగర్ ట్రయంఫ్ 2024లో భారత్ నుంచి హెలికాప్టర్లు, ల్యాండింగ్ క్రాఫ్ట్‌లతో కూడిన ఇండియన్ నేవీ షిప్‌లు, ఇండియన్ నేవీ ఎయిర్‌క్రాఫ్ట్, ఇండియన్ ఆర్మీ సిబ్బంది మాత్రమే కాకుండా వారికి చెందిన వాహనాలు, ఇండియన్ ఎయిర్ ఫోర్స్ ఎయిర్‌క్రాఫ్ట్.. హెలికాప్టర్లతో పాటు ర్యాపిడ్ యాక్షన్ మెడికల్ టీమ్‌లు పాల్గొన్నాయి. యునైటెడ్ స్టేట్స్ నుంచి మెరైన్ కార్ప్స్, ఆర్మీకి చెందిన దళాలు, నౌకాదళ నౌకలు మాత్రమే కాకుండా నేవీ నుంచి ల్యాండింగ్ క్రాఫ్ట్, హోవర్‌క్రాఫ్ట్, హెలికాప్టర్లు ఇందులో ప్రాతినిధ్యం వహించాయి. హ్యుమానిటేరియన్ అసిస్టెన్స్ ఎక్సర్సైజ్లో జెన్నిఫర్ లార్సన్, కాన్సుల్ జనరల్, యూఎస్ కాన్సులేట్ జనరల్ హైదరాబాద్, రియర్ అడ్మిరల్ జోక్విన్ జే. మార్టినెజ్ డి పినిలోస్, రిజర్వ్ వైస్ కమాండర్ యూఎస్ సెవెంత్ ఫ్లీట్, రియర్ అడ్మిరల్ రాజేష్ ధనకర్, ఫ్లాగ్ ఆఫీసర్ మొదలైనవారు పాల్గొన్నారు. భారతదేశం & యునైటెడ్ స్టేట్స్ మధ్య రక్షణ సంబంధాలు బాగా పెరిగాయి. ఇప్పుడు కాకినాడలో జరుగుతున్న మూడవ టైగర్ ట్రయంఫ్ ఎక్సర్సైజ్.. ఇంతకు ముందు జరిగిన వాటితో పోలిస్తే పెద్దదని రియర్ అడ్మిరల్ మార్టినెజ్ పేర్కొన్నారు. టైగర్ ట్రయంఫ్ వంటి కార్యకలాపాలు వాస్తవ ప్రపంచంలో సంక్షోభాన్ని ఎదుర్కోవటానికి కలిసి పనిచేయగల సామర్థ్యం, విశ్వాసాన్ని పెంపొందిస్తాయని ఆయన అన్నారు. -
ఉన్నట్టుండి రంగు మారిన కాకినాడ సముద్రం..
-
ఊపిరి తీసిన వివాహేతర సంబంధం
పిఠాపురం: వివాహేతర సంబంధం ఇద్దరి ప్రాణాలు తీసింది. మరొకరిని ప్రాణాపాయస్థితికి తీసుకెళ్లింది. గొల్లప్రోలు మండలం చేబ్రోలు ఈ ఘటన జరిగింది. గ్రామానికి చెందిన పోసిన శ్రీనివాసు (45), పెండ్యాల లోవమ్మ (35)లను అదే గ్రామానికి చెందిన లోకా నాగబాబు కత్తితో నరికి చంపాడు. లోవమ్మ తల్లి రామలక్షి్మపైనా దాడి చేయడంతో ఆమె కొన ఊపిరితో ఆస్పత్రిలో కొట్టుమిట్టాడుతోంది. వివరాల్లోకి వెళితే.. పెండ్యాల లోవమ్మ భర్తకు దూరంగా ఒంటరిగా ఉంటోంది. గ్రామానికి చెందిన లోకా నాగబాబుతో సహజీవనం చేస్తోంది. ఇటీవల పోసిన శ్రీనివాసుతో వివాహేతర సంబంధం కొనసాగిస్తోంది. దీంతో ఆమెను నాగబాబు పలుమార్లు హెచ్చరించాడు. తన మాట వినకపోతే చంపేస్తానని బెదిరించాడు. అయినా ఆమె వినకపోవడంతో కోపం పెంచుకున్నాడు. ఈ నేపథ్యంలో 20 రోజులుగా శ్రీనివాసు, లోవమ్మలను వెంబడిస్తున్నాడు. ప్రతి రోజూ శ్రీను తన మోటారు సైకిల్‌పై లోవమ్మను తన పొలంలోకి పనులకు తీసుకెళ్లడం గమనించాడు. ఎలాగైనా వారిద్దరినీ చంపాలని నిర్ణయించుకున్నాడు. మాటు వేసి దాడి లోకా నాగబాబు మంగళవారం అర్థరాత్రి చేబ్రోలు శివారు లక్ష్మీపురం పొలిమేరలో ఉన్న శ్రీనివాసు పొలానికి కత్తి తీసుకుని వెళ్లాడు. తన మోటారుసైకిల్‌ను దూరంగా పొదల్లో దాచాడు. అక్కడ బెండ తోట పక్కనే ఉన్న నువ్వుల చేనులో దాకున్నాడు. కాగా.. శ్రీనివాసు తన పొలంలో బెండకోత కోసం నలుగురు కూలీలను మాట్లాడుకుని బుధవారం ఉదయం 4.30 గంటలకు వారిని రమ్మని చెప్పాడు. ముందుగానే లోవమ్మను తీసుకుని పొలానికి వెళ్లిపోయాడు. అక్కడే నువ్వుల చేలో దాక్కున్న నాగబాబు వారిద్దరిపై కత్తితో దాడి చేసి దారుణంగా హత్య చేశాడు. అనంతరం లోవమ్మ ఇంటికి వెళ్లాడు. అక్కడ ఆమె తల్లి రామలక్షి్మపై కత్తితో దాడి చేశాడు. ఆమె కేకలు విని స్థానికులు అక్కడకు వచ్చేసరికీ నాగబాబు పరారయ్యాడు. కాగా.. బెండకాయల కోతకు వచ్చిన కూలీలు పొలంలో లోవమ్మ, శ్రీనివాసు మృతదేహాలను చూశారు. స్థానికుల ద్వారా పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోసిన శ్రీనివాసుకు భార్య, ఇద్దరు కుమారులు ఉన్నారు. లోవమ్మకు ఇద్దరు కుమారులు, ఒక కుమార్తె ఉన్నారు. నాగబాబు గత 20 రోజులుగా కత్తి తీసుకుని శ్రీనివాసు పొలంలో తిరగడాన్ని సమీపంలోని రైతులు గమనించారు. ఈ విషయాన్ని శ్రీనివాసుకు చెప్పినా అతడు పట్టించుకోలేదు. నాగబాబు గతంలో లోవమ్మ వెంటబడిన ఒక వ్యక్తి చెయ్యి నరికాడని, ఈ ఘటనపై పోలీసులు కేసు కూడా నమోదు చేశారని స్థానికులు తెలిపారు. అడిషనల్ ఎస్పీ భాస్కరరావు సంఘటనాస్థలాన్ని పరిశీలించారు. -
మత్స్యకారులకు అండగా..చంద్రబాబు చేయలేనిది చేసి చూపించిన సీఎం జగన్
-
YSRCP కాకినాడ జిల్లా అభ్యర్థులు వీరే
కాకినాడ జిల్లాలో అన్ని నియోజకవర్గాల గెలుపే లక్ష్యంగా.. సామాజిక సమీకరణాలు.. సర్వేల ఆధారంగా సేకరించిన అభ్యర్థుల గెలుపోటములను ప్రామాణికంగా తీసుకుని అభ్యర్థుల్ని ఎంపిక చేసింది వైఎస్సార్సీపీ -
ఏపీలో అరబిందో ప్లాంటు సిద్ధం
హైదరాబాద్: ఔషధ రంగ దిగ్గజం అరబిందో ఫార్మా ఆంధ్రప్రదేశ్‌లోని కాకినాడ వద్ద కొత్తగా నిర్మిస్తున్న పెన్–జి (పెన్సిలిన్) ప్లాంటు ఏప్రిల్‌లో ట్రయల్ రన్‌కు సిద్ధం అయింది. జూన్‌లోగా వాణిజ్యపరంగా తయారీ కార్యకలాపాలు మొదలవుతాయని అరబిందో ఫార్మా వైస్ చైర్మన్, ఎండీ కె.నిత్యానంద రెడ్డి వెల్లడించారు. పెన్సిలిన్–జి ధర విషయంలో చైనాతో పోటీపడాలన్నది తమ లక్ష్యం అని చెప్పారు. పూర్తిగా దేశీయంగా పెన్సిలిన్ ఉత్పత్తి చేస్తున్నట్టు వివరించారు. ఏటా 15,000 మెట్రిక్ టన్నుల సామర్థ్యం గల ఈ కేంద్రం కోసం సంస్థ రూ.2,400 కోట్లు వెచి్చస్తోంది. ఈ ప్లాంటు జూలై–సెపె్టంబర్ కాలంలో పూర్తి స్థాయి సామర్థ్యానికి చేరుకోనుంది. 80–90 శాతం పెన్సిలిన్‌ను కంపెనీ దేశీయంగా విక్రయించనుంది. కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన ఉత్పత్తి ఆధారిత ప్రోత్సాహకాల పథకం కింద పెన్సిలిన్ ప్లాంటు ఆమోదం పొందింది. మరో రూ.1,000 కోట్లు.. అరబిందో ఫార్మా 8–10 ప్లాంట్ల ఏర్పాటుకు గడిచిన మూడు నాలుగేళ్లలో రూ.5,000 కోట్లు ఖర్చు చేసింది. వచ్చే రెండేళ్లలో మరో రూ.1,000 కోట్ల పెట్టుబడి చేయనుంది. చైనాలో ఏర్పాటు చేస్తున్న ఓరల్ సాలిడ్స్ తయారీ ప్లాంటులో వచ్చే త్రైమాసికంలో ఉత్పత్తి ప్రారంభం అవుతుందని సంస్థ సీఎఫ్‌వో శాంతారామ్ సుబ్రమణియన్ తెలిపారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో అరబిందో టర్నోవర్ 3.4–3.5 బిలియన్ డాలర్లకు చేరుకుంటుందని అంచనాగా పేర్కొన్నారు. డిసెంబర్‌తో ముగిసిన 9 నెలల కాలంలో టర్నోవర్ 2.6 బిలియన్ డాలర్లు నమోదైంది. అరబిందో ప్రస్తుతం అంటువ్యాధుల విభాగంలో ఐదు వ్యాక్సిన్ల తయారీలో నిమగ్నమైంది. సంస్థ ఖాతాలో 25 తయారీ, ప్యాకింగ్ కేంద్రాలు ఉన్నాయి. నిర్మాణంలో ఉన్న 10 ప్లాంట్లు ఒకట్రెండేళ్లలో కార్యరూపం దాల్చనున్నాయి. -
అనపర్తి: ‘రామకృష్ణారెడ్డి అక్రమాలను ప్రజలకు వివరిస్తా’
సాక్షి,అనపర్తి: కాకినాడలోని అనపర్తిలో టెన్షన్ వాతావరణం కొనసాగుతోంది. వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే, టీడీపీ మాజీ ఎమ్మెల్యేల మధ్య సవాళ్ళ పర్వం సాగుతోంది. స్థానిక వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే సత్తి సూర్యనారాయణ రెడ్డి అవినీతి పరుడంటూ టీడీపీ మాజీ ఎమ్మెల్యే రామకృష్ణారెడ్డి కరపత్రాలు పంచాడు. దీంతో ఇద్దరూ బహిరంగ చర్చకు సిద్దమయ్యారు. ఇవాళ (శుక్రవారం) ముహూర్తం ఖరారు చేసుకున్న చేసుకునన్నారు. దీంతో అనపరర్తిలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఎమ్మెల్యే డా. సత్తి సూర్యనారాయణ రెడ్డి చర్చలకు వేదికను సిద్ధం చేశారు. అయితే అక్కడికి టీడీపీ మాజీ ఎమ్మెల్యే నల్లమిల్లి బయల్దేరగా.. బహిరంగ చర్చకు అనుమతి లేదని పోలీసులు అడ్డుకున్నారు. దీంతో నల్లమిల్లి పోలీసులతో వాగ్వాదానికి దిగారు. అనపర్తిలో టీడీపీ నేత రామకృష్ణారెడ్డి తనకు చేసిన సవాలును ఎదుర్కోవడానికి ఎమ్మెల్యే డాక్టర్ సూర్యనారాయణ రెడ్డి సిద్ధమైయ్యారు. రామకృష్ణారెడ్డి చేసిన అక్రమాలను స్క్రీన్ పెట్టి మరీ ప్రజలకు వివరిస్తానని ఎమ్మెల్యే సూర్యనారాయణ రెడ్డి అన్నారు. ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో బహిరంగ చర్చకు పోలీసులు అనుమతివ్వలేదు. ఇరుపక్షాల వద్ద పెద్ద ఎత్తున పోలీసులు మొహరించారు. -
కాకినాడ రూరల్ టీడీపీలో భగ్గుమన్న అసమ్మతి సెగ
-
కాకినాడ రూరల్ టీడీపీలో భగ్గుమన్న అసమ్మతి సెగ
-
కాకినాడ: ఘోర రోడ్డు ప్రమాదం.. నలుగురు మృతి
సాక్షి, కాకినాడ: జిల్లాలోని ప్రత్తిపాడు వద్ద ఘోర రోడ్డు ప్రమాద ఘటన చోటుచేసుకుంది. రోడ్డుపై ఉన్న వారిని ఆర్టీసీ బస్సు ఢీకొన్న ఘటనలో నలుగురు మృతి చెందారు. ఇక, మృతులను బాపట్ల జిల్లాలకు చెందిన వారిగా గుర్తించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేశారు. వివరాల ప్రకారం.. ప్రత్తిపాడు మండలంలోని పాదాలమ్మ గుడి వద్ద 16వ నెంబర్ జాతీయ రహదారిపై రోడ్డు ప్రమాద ఘటన చోటుచేసుకుంది. కాగా, లారీ పంక్చర్ కావడంతో నలుగురు వ్యక్తులు టైర్ మారుస్తున్నారు. ఈ క్రమంలో అతి వేగంతో అటుగా వస్తున్న ఆర్టీసీ సూపర్ లగ్జరీ బస్సు వారిని ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో నలుగురు వ్యక్తులు దాసరి ప్రసాద్, దాసరి కిషర్, క్లీనర్ నాగయ్య, స్థానికుడు రాజు మృతిచెందారు. మృతులను బాపట్ల జిల్లా నక్క బొక్కలపాలెంకు చెందిన వారిగా గుర్తించారు. సమాచారం అందిన వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్టు తెలిపారు. -
ఉత్పత్తికి సిద్ధమైన మరో భారీ ఫార్మా యూనిట్
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో మరో భారీ ఫార్మా సంస్థ ఉత్పత్తికి సిద్ధమైంది. చైనా నుంచి ఫార్మా దిగుమతులను తగ్గించడంలో భాగంగా కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఉత్పత్తి ఆధారిత ప్రోత్సాహకాలు (పీఎల్ఐ) స్కీం కింద లిఫియస్ పేరుతో అరబిందో గ్రూపు పెన్సులిన్ జి తయారీ కేంద్రాన్ని ఏర్పాటు చేసింది. పెన్సులిన్ తయారీలో కీలక ముడిపదార్థంగా పెన్సులిన్ జి వినియోగిస్తారు. కాకినాడ సమీపంలోని తొండంగి వద్ద 250 ఎకరాల్లో సుమారు రూ.2,205 కోట్లతో ఏర్పాటు చేసిన ఈ యూనిట్ శరవేగంగా నిర్మాణాన్ని పూర్తి చేసుకొని, ఉత్పత్తి ప్రారంభానికి సిద్ధమైంది. ఈ కర్మాగారంలో ఏటా 15,000 టన్నుల పెన్సులిన్ జి యూనిట్, 2,000 టన్నుల సామర్ధ్యంతో 7–ఏసీఏ యూనిట్‌ను అరబిందో గ్రూపు ఏర్పాటు చేసింది. ఈ యూనిట్లో 3,000 మందికి ప్రత్యక్షంగా ఉపాధి లభించనుంది. ఈ ప్లాంట్ వాణిజ్య ఉత్పత్తికి సిద్ధమవడంతో లిఫియస్ ఉద్యోగ నియామకాలు చేపట్టింది. బీఎస్సీ, ఎంఎస్సీ, బీటెక్ (బయోటెక్నాలజీ, మైక్రోబయాలజీ) కోర్సులు పూర్తి చేసిన వారిని వాక్ ఇన్ ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక చేయనున్నట్లు లిఫియస్ ప్రకటించింది. ఈ నెల 22న హైదరాబాద్ బేగంపేట ఎయిర్‌పోర్టు వద్ద ఉన్న మనోహర్ హోటల్లో ఉదయం 9 నుంచి సాయంత్రం 4 గంటల వరకు ఇంటర్వ్యూలు నిర్వహిస్తారు. ఫెర్మిటేషన్స్లో ప్రొడక్షన్, మైక్రోబయోలజీ రంగాల్లో నియామకాలకు తాజాగా కోర్సు పూర్తి చేసిన వారి (ఫ్రెషర్స్) దగ్గర నుంచి 10 ఏళ్ల అనుభవం ఉన్నవారికి అవకాశం కల్పిస్తోంది. వాటర్ ట్రీట్మెంట్ అసిస్టెంట్ పోస్టులకు కనీసం రెండేళ్ల అనుభవం నుంచి పదేళ్ల వారికి అవకాశం కల్పిస్తోంది. మరో రెండు ఫార్మా యూనిట్లు లిఫియస్కు సమీపంలోనే పీఎల్ఐ స్కీం కింద మరో రెండు ఫార్మా యూనిట్లు ఏర్పాటవుతున్నాయి. అరబిందో గ్రూపు క్యూలే పేరుతో సుమారు రూ.2,000 కోట్ల పెట్టుబడితో 159 ఎకరాల్లో ఎరిత్రోమైసిన్ థియోసేనేట్ యూనిట్‌ని ఏర్పాటు చేస్తోంది. దీని ఉత్పత్తి సామర్థ్యం 1,600 టన్నులు. దీనికి సమీపంలోనే దివీస్ సంస్థ ఓ ఫార్మా యూనిట్ ఏర్పాటు చేస్తోంది. దీని పనులు కూడా శరవేగంగా జరుగుతున్నాయి. ఈ మూడు యూనిట్లతో కాకినాడ మేజర్ ఫార్మా హబ్‌గా ఎదగనుంది. -
కాకినాడలో చంద్రబాబుకి షాక్...వైఎస్సార్సీపీలోకి టీడీపీ నేతలు
-
వచ్చే ఎన్నికల్లోనూ ఫ్యాన్ ప్రభంజనమే అంటున్న లబ్ధిదారులు
-
గంగపుత్రులపై పెద్ద మనస్సు చాటుకున్న సీఎం జగన్
సాక్షి, కాకినాడ: గంగపుత్రులపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి మరోసారి తన పెద్ద మనస్సు చాటుకున్నారు. గత డిసెంబర్ 1న బైరవపాలెం వద్ద నడి సముద్రంలో బోటు దగ్ధమవ్వగా, బోటులో చిక్కుకున్న ఆరుగురు మత్స్యకారులను కోస్ట్ గార్డ్ బృందం రక్షించింది. ఈ విషయాన్ని సీఎం జగన్ దృష్టికి ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి తీసుకెళ్లారు. వెంటనే స్పందించిన సీఎం జగన్.. బోటు యజమాని కాటాడి రామకృష్ణ పరమహంసకు సీఎం రిలీఫ్ ఫండ్ నుంచి రూ.25 లక్షల ఆర్థిక సహాయం అందించారు. ఇదీ చదవండి: షర్మిలను నిలదీసిన సామాన్యుడు -
రామోజీ.. దమ్ముంటే మా మధ్యకు రా: వలంటీర్ల ఆగ్రహం
సాక్షి, కాకినాడ: తమపై ఈనాడు దినపత్రిక రాసిన తప్పుడు కథనాలుపై వలంటీర్లు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈనాడు కథనాన్ని ఖండిస్తూ సామర్లకోటలో వలంటీర్లు ఈనాడు పత్రిక కాపీలను దగ్ధం చేశారు. ఈనాడుకు వ్యతిరేకంగా నిరసన తెలిపిన వలంటీర్లు అనంతరం మీడియాతో మాట్లాడారు. ఏసీ గదుల్లో కూర్చుని.. మాలాంటోళ్ళను రోడ్ల మీదకు తీసుకురావోద్దని మండిపడ్డారు. రామోజీరావుకు దమ్ముంటే ప్రజల మధ్యకు వచ్చి నిజాలు తెలుసుకోవాలన్నారు. మరోసారి తమపై తప్పుడు కథనాలు రాస్తే చెప్పులతో కొడతామని హెచ్చరించారు. కరోనా సమయంలో వాలంటీర్ సేవల ఈనాడుకు కనిపించలేదా? అని ప్రశ్నించారు. కేవలం ప్రజలకు సేవ చేసేందుకే వాలంటీర్‌గా పని చేస్తున్నామని తెలిపారు. ప్రజల దీవెనలు పొందే గొప్ప అవకాశం సీఎం జగన్ తమకు కల్పించారని అన్నారు. ఒకటవ తేది వస్తే చాలు వాలంటీర్ వచ్చి ఫించన్ ఇస్తుందన్న భరోసా లబ్దిదారుల్లో కలిగుతుందని తెలిపారు. తమ ఉద్యోగం చిన్నదైనా ఇది ఒక స్వచ్ఛంద సేవగా తాము భావిస్తామని తెలిపారు. రామోజీ రావు క్షమాపణ చెప్పాలి.. శ్రీకాకుళం: ఈనాడు తప్పుడు వార్తలపై వలంటీర్లు మండిపడ్డారు. ఇచ్చాపురంలో వలంటీర్స్ ఆందోళన చెప్పట్టారు. ఈనాడు పత్రికను దగ్ధం చేసి వలంటీర్లు తమ నిరసన తెలిపారు. తక్షణమే రామోజీ రావు క్షమాపణ చెప్పాలని వలంటీర్ల డిమాండ్ చేశారు. ఈనాడు పత్రికపై న్యాయపోరాటం చేస్తామన్నారు. -
సీఎం జగన్ కి జీవితాంతం రుణపడి ఉంటాం
-
కోరమాండల్ కాకినాడ ప్లాంట్ విస్తరణ
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: ఎరువుల తయారీలో ఉన్న కోరమాండల్ ఇంటర్నేషనల్ కాకినాడ యూనిట్లో ఫాస్ఫరిక్, సల్ఫరిక్ యాసిడ్ ప్లాంట్ల ఏర్పాటుకు బోర్డు ఆమోదం పొందింది. రోజుకు ఫాస్ఫరిక్ యాసిడ్ 750 టన్నులు, సల్ఫరిక్ యాసిడ్ 1,800 టన్నుల ఉత్పత్తి సామర్థ్యంతో నూతన కేంద్రాలను జోడించనున్నారు. ఇందుకోసం రూ.1,029 కోట్లు పెట్టుబడి చేయనున్నట్టు సంస్థ ప్రకటించింది. 24 నెలల్లో ఈ విస్తరణ పూర్తి కానున్నట్టు వెల్లడించింది. కాకినాడ యూనిట్ సామర్థ్యం రోజుకు ఫాస్ఫరిక్ యాసిడ్ 1,550 టన్నులు, సల్ఫరిక్ యాసిడ్ 4,200 టన్నులు ఉంది. ప్రస్తుతం పూర్తి సామర్థ్యాన్ని కంపెనీ వినియోగించుకుంటోంది. ఎరువుల తయారీలో ఈ యాసిడ్స్‌ను ఉపయోగిస్తారు. దిగుమతులపై ఆధారపడడాన్ని తగ్గించడం, తయారీ సామర్థ్యం పెంపొందించుకునేందుకు విస్తరణ చేపడుతున్నట్టు కంపెనీ వెల్లడించింది. పూర్తి స్థాయి ప్లాంటుగా.. పాస్ఫేటిక్ ఎరువుల తయారీ, విక్రయంలో భారత్‌లో కోరమాండల్ రెండవ స్థానంలో నిలిచింది. ముడిసరుకు, ఎరువుల తయారీలో పూర్తి స్థాయి ప్లాంటుగా కాకినాడ కేంద్రాన్ని తీర్చిదిద్దాలన్నదే లక్ష్యమని కోరమాండల్ ఇంటర్నేషనల్ తెలిపింది. ప్రతిపాదిత విస్తరణతో కంపెనీ వ్యయ సామర్థ్యాలను, ముడిసరుకు భద్రతను మరింత మెరుగుపరుస్తుందని సంస్థ ఎగ్జిక్యూటివ్ వైస్ చైర్మన్ అరుణ్ అలగప్పన్ వివరించారు. డ్రోన్స్ తయారీలో ఉన్న తమ అనుబంధ కంపెనీ ధక్ష బలమైన ఆర్డర్ బుక్ నమోదు చేసిందని చెప్పారు. రక్షణ రంగం, వ్యవసాయంతోపాటు వివిధ కంపెనీల నుంచి ఆర్డర్లు పొందామన్నారు. గ్రోమోర్ డ్రైవ్ కార్యక్రమం ద్వారా వ్యవసాయ రంగంలో డ్రోన్ల వినియోగాన్ని కంపెనీ ప్రోత్సహిస్తోంది. -
పవన్ ఎన్ని సీట్లు అయినా ప్రకటిస్తారు: బోండా ఉమ
కాకినాడ: ఆంధ్రప్రదేశ్‌లో అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న వేళ గత కొన్ని రోజులుగా పలు జిల్లాల్లో టీడీపీలో వర్గవిభేదాలు, అంతర్గత వివాదాలు బయట పడుతున్నాయి. తెలుగుదేశం తమ్ముళ్లు బహిరంగానే కుమ్ములాటకు దిగుతున్నారు. తాజాగా కాకినాడు జిల్లా పిఠాపురంలో జనసేన, టీడీపీ మధ్య విభేదాలు మరోసారి బయటపడ్డాయి. ఉప్పాడలో టీడీపీ మాజీ ఎమ్మెల్యే వర్మ ఆధ్వర్యంలో జయహో బీసీల సమావేశం జరిగింది. ఈ క్రమంలో తమకు ఎలాంటి సమాచారం ఇవ్వలేదంటూ జనసేన నేతల ఆందోళన దిగారు. ఇలా ఎందుకు జరిగిందని మాజీ ఎమ్మెల్యే వర్మను జనసేన నాయకులు నిలదీశారు. దీంతో ఇది టీడీపీ కార్యక్రమం అంటూ వర్మ సమాధానం చెప్పాడు. వర్మ సమాధానంపై జనసేన కార్యకర్తలు తీవ్రంగా మండిపడ్డారు. ఇక్కడ చోటు చేసుకున్న పరిణామాలు తమ నాయకుడు పవన్ కళ్యాణ్ దృష్టికి తీసుకెళ్తామని జనసేన నాయకులు తెగేసి చెప్పారు. పవన్ ఎన్ని సీట్లు అయినా ప్రకటిస్తారు: బోండా ఉమ టీడీపీ-జనసేన మధ్య సీట్ల సర్దుబాటు చాలావరకు ఫైనల్ అయిందని టీడీపీ నేత బోండా ఉమ మహేశ్వర రావు అన్నారు. పవన్‌కు కొన్ని సీట్లు ప్రకటించాలని ఉంది, అవే ప్రకటించారని అన్నారు. జనసేన పోటీ చేసే సీట్లనే పవన్ ప్రకటించారని అన్నారు. పవన్ ఎన్ని సీట్లు అయినా ప్రకటిస్తారని బోండా ఉమ ఎద్దేవా చేశారు. చదవండి: మాకు చెప్పకుండానే రెండు సీట్లు ప్రకటించారు -
కాకినాడలో శరవేగంగా ఈఎస్ఐ ఆసుపత్రి నిర్మాణం
-
కాకినాడ.. ఆధునిక జాడ..
దేశంలోని అగ్రగణ్య నగరాల్లో కాకినాడ ఒకటి. రెండో మద్రాస్‌గా పిలుచుకునే ఈ నగరం గత పాలనలో కునారిల్లి... నేడు ప్రగతి పథంలో పయనిస్తోంది. ఊహించని అభివృద్ధి పనులతో సర్వాంగ సుందరంగా రూపుదిద్దుకుంటోంది. విశాల రహదారులు... పచ్చదనం పరచుకున్న ఉద్యానవనాలు... ప్రతి రాత్రీ పట్టపగలుగా కనిపించేలా వెలుగులు విరజిమ్ముతున్న విద్యుద్దీపాలు... ఆధునికీకరించిన కూడళ్లతో సరికొత్తగా ఆవిష్కృతమవుతోంది. పక్కా ప్రణాళికతో ఊపందుకున్న ప్రగతి పనులతో నగర రూపురేఖలనే మార్చేసింది. చిరకాలంగా నగర ప్రజలు ఎదుర్కొంటున్న డంపింగ్ యార్డు సమస్యకు శాశ్వత పరిష్కారం లభించింది. నాలుగున్నరేళ్లలో సాధించిన అభివృద్ధికి గుర్తింపుగా టూటైర్ సిటీలలో దేశంలోనే మొదటి స్థానాన్ని... అత్యంత నివాసయోగ్యమైన నగరాల్లో దేశంలో నాలుగోస్థానాన్ని కైవశం చేసుకుంది. అధునాతనంగా రూపొందిన నగరాన్ని చూసి ఇక్కడి ప్రజలు ఉబ్బితబ్బిబ్బవుతున్నారు. లక్కింశెట్టి శ్రీనివాసరావు, సాక్షి ప్రతినిధి, కాకినాడ కాకినాడ నగరానికి రాష్ట్రంలోనే ప్రత్యేక గుర్తింపు ఉన్నప్పటికీ గత ప్రభుత్వం పూర్తిగా నిర్లక్ష్యం వహించింది. వైఎస్సార్సీపీ హయాంలోనే మళ్లీ దానికి సరైన ప్రాధాన్యం లభించి అభివృద్ధి పరుగులు తీసింది. ఇక్కడ ఫ్లైఓవర్ల నిర్మాణంతో ట్రాఫిక్ కష్టాలకు చెక్ పడింది. మహానేత వైఎస్ రాజశేఖరరెడ్డి చొరవతో పేర్రాజుపేట, సాంబమూర్తినగర్, కొండయ్యపాలెం ఫ్లై ఓవర్ల నిర్మాణానికి శ్రీకారం చుట్టారు. వీటిలో రెండింటిని ఆయన ఉండగానే పూర్తి చేశారు. ► చంద్రబాబు హయాంలో 14 ఏళ్లుగా నత్తనడకన సాగిన కొండయ్యపాలెం ఫ్లై ఓవర్‌ను వైఎస్సార్సీపీ అధికారంలోకి వచ్చాక రూ.65 కోట్లతో పూర్తిచేసి ఇటీవలే ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి ప్రజలకు అంకితమిచ్చారు. ► గత ప్రభుత్వ హయాంలో రహదారులన్నీ నిర్వహణపై నిరాసక్తత వల్ల గుంటలు, గతుకులమయమయ్యాయి. గడచిన నాలుగున్నరేళ్లలో వాటన్నింటికీ మహర్దశ పట్టింది. ఇరుకు రహదారులను విశాలంగా మార్చారు. ► చంద్రబాబు పాలనలో అధ్వానంగా ఉన్న గొడారిగుంట, ప్రతాప్‌నగర్, రేచెర్లపేట, దుమ్ములుపేట, ఏటిమొగ, రామకృష్ణారావు పేట, ప్రేజర్ పేట, జగన్నాథపురం ప్రాంతంలోని రహదారులకు ఇప్పుడు కొత్త సొగసులు అద్దారు. ప్రణాళికాబద్ధంగా విశాలమైన బీటీ, సిమెంట్ రోడ్లు వేయడంతో ప్రజల కష్టాలు తీరాయి. ► స్మార్ట్ సిటీ స్టేటస్‌కు తగ్గట్టుగా కాకినాడ నగర స్వరూపాన్నే మార్చేశారు. ప్రణాళికాబద్ధంగా చేసిన అభివృద్ధి, ప్రజలకు అందించిన అత్యుత్తమ సేవలకు అత్యంత నివాస యోగ్యమైన నగరాల్లో దేశంలోనే నాలుగో స్థానం, మెరుగైన పారిశుద్ధ్య సేవలకు ఇటీవలనే దేశంలోనే రెండో స్థానాన్ని దక్కించుకుంది. ► కార్పొరేషన్ కార్యాలయాన్ని రాగల 15 ఏళ్ల భవిష్యత్ అవసరాలను దృష్టిలో పెట్టుకుని లక్షా 50వేల చదరపు అడుగుల వైశాల్యంలో రూ.38 కోట్ల వ్యయంతో నాలుగు అంతస్తుల భవంతిని సకల సౌకర్యాలతో నిర్మాణ పనులు జరుగుతున్నాయి. ► నాలుగేళ్లలో పెద్ద సంఖ్యలో కమ్యూనిటీ భవనాలు నిరి్మంచారు. ఇంతవరకు నగరంలో రూ.17.75 కోట్ల వ్యయంతో 78 సామాజిక భవనాలు అందుబాటులోకి తెచ్చారు. నగరంలో రేచెర్లపేట, రెల్లిపేట, గొల్లపేట, దుమ్ములపేట, ప్రతాప్‌నగర్ తదితర ప్రాంతాల్లో కమ్యునిటీ హాళ్ల నిర్మాణం చురుగ్గా జరుగుతున్నాయి. సొంతింటి కల సాకారం గత ప్రభుత్వ హయాంలో కనీసం పేద వాడికి ఒక సెంటు భూమైనా ఇవ్వలేదు. వైఎస్సార్సీపీ అధికారంలోకి వచ్చాక పేదల సొంతింటి కలను సాకారం చేశారు. ►రాష్ట్రంలో అతి పెద్ద లే అవుట్లలో ఒకటిగా కొమరగిరిలో 350 ఎకరాల లే అవుట్‌కు శ్రీకారం చుట్టారు. ► మొత్తం 32,927 మందికి స్థలాలు మంజూరు చేసి ఇళ్ల నిర్మాణాలు ప్రారంభించగా ఇప్పుడవి వివిధ దశల్లో ఉన్నాయి. ► రూ. 20.59కోట్లతో చేపట్టిన 2056 టిడ్కో ఇళ్లను చంద్రబాబు పాలనలో అటకెక్కించగా అందులో 904 ఇళ్లు లబి్థదారులకు అందించారు. స్నాతకోత్సవ భవన నిర్మాణం రూ.19.3 కోట్లు రోడ్లు, డ్రైనేజీకి ఖర్చు రూ.20 కోట్లు హాస్టల్ భవన నిర్మాణానికి వ్యయం రూ.6 కోట్లు ఇతర అభివృద్ధి పనులకు వెచ్చించిన నిధులు రూ.97 కోట్లు సింథటిక్ కోర్టు నిర్మాణానికి ఖర్చు రూ. 9.50 కోట్లు కాకినాడ ముఖచిత్రం జీజీహెచ్‌లో కార్పొరేట్ వైద్యం ► కాకినాడ జీజీహెచ్‌లో గతంలో ఎన్నడూ జరగని రీతిలో గడచిన నాలుగున్నరేళ్లలో అభివృద్ధి కళ్లకు కట్టినట్టు కనిపిస్తోంది. ఇందుకు దాతల సహకారం కూడా తోడయింది. ► రూ.15కోట్లతో జీజీహెచ్‌లో క్యాథ్‌ల్యాబ్, ఐసీయూ సదుపాయాలతో, ఎంఆర్ఐ యూనిట్ కొత్తగా ఏర్పాటు చేశారు. ► ఎంసీహెచ్ బ్లాక్ నిర్మాణం జీజీహెచ్‌లో పూర్తి కావస్తోంది. మాతాశిశు వైద్య సేవలకు తలమానికం కానున్న ఈ ప్రాజెక్టు నిర్మాణ వ్యయం రూ.50 కోట్లు. ► త్వరలో మదర్ అండ్ ఛైల్డ్ బ్లాక్ భవంతి సేవలు అందుబాటులోకి రానున్నాయి. – కోరమండల్ సంస్థ కేవలం ఏడాదిలోనే చిన్నపిల్లల వైద్య విభాగానికి రూ.40 లక్షల విలువైన వైద్య ఉపకరణాలను అందించింది. ► కాకినాడ సీ పోర్టు సామాజిక బాధ్యతగా రూ.76 లక్షల విలువైన వైద్య ఉపకరణాలను జీజీహెచ్ మత్తు విభాగానికి అందించింది. ► ఆపన్న మహిళలు, ఆధారం లేని యువతులు, బాలలకు అండగా నిలిచేలా 1600 చదరపు గజాల విస్తీర్ణంలో రూ.50 లక్షల వ్యయంతో దిశ వన్‌స్టాప్ సెంటర్ సిద్దమవుతోంది. ► జిల్లా కేంద్రంలో అప్పటికే ఉన్న 5 పీహెచ్‌సీలకు అదనంగా తొమ్మిది యుపీహెచ్‌సీల నిర్మాణాన్ని చేపట్టారు. ► ప్రతి 25 వేల మంది జనాభాకు ఒక అర్బన్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ఉండాలనే సంకల్పంతో 14 డాక్టర్ వైఎస్సార్ పట్టణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు నిరి్మంచారు. సుమారు.రూ.9కోట్ల వ్యయంతో యుపీహెచ్‌సీలు నిర్మాణాన్ని పూర్తి చేసి అందుబాటులోకి తెచ్చారు. వైఎస్సార్ ఆరోగ్యకేంద్రాలు మొత్తం యూపీహెచ్‌సీలు 14 పాత పీహెచ్‌సీలు 5 కొత్తగా నిరి్మంచినవి 8 సీఎస్ఆర్తో నిర్మించినవి 1 నిర్మాణ వ్యయం రూ.10.40 కోట్లు ప్రగతికి చిరునామా ప్రగతికి చిరునామాగా కాకినాడ నగరం నిలిచింది. నగరంలో పక్కా ప్రణాళికతో అభివృద్ధి కార్యక్రమాలు దశలవారీగా చేపడుతుంటంతో ఇది సాధ్యమైంది. బ్రిటిష్ హయాం నుంచి కాకినాడ నగరానికి ఒక గుర్తింపు ఉంది. ఇప్పుడా గుర్తింపును మరింతగా పెంచేందుకు ప్రతి ఒక్కరు సమన్వయంతో పనిచేస్తున్నారు. శానిటేషన్–సాలిడ్‌వేస్ట్ మేనేజ్మెంట్లో కాకినాడ నగరం దేశంలో రెండో స్థానం సాధించడం... దానికి సంబంధించిన అవార్డును ఢిల్లీలో కేంద్ర పట్టణాభివృద్ధిశాఖ మంత్రి హరిదీప్‌సింగ్ పూరి నుంచి అందుకోవడం చాలా సంతోషాన్నిచ్చింది. – డాక్టర్ కృతికా శుక్లా, జిల్లా కలెక్టర్, కాకినాడ సమష్టి కృషితోనే అభివృద్ధి గడచిన నాలుగున్నరేళ్లుగా ప్రణాళికాబద్ధంగా పనులు చేపడుతున్నాం. అందరి సహకారంతో అన్ని రంగాల్లో నగరాన్ని అభివృద్ధి చేయగలిగాం. ప్రధానంగా ఇండియన్ స్మార్ట్ సిటీ అవార్డుల్లో దేశంలో కాకినాడకు రెండో ర్యాంక్ సాధించడం సమష్టి కృషికి నిదర్శనం. వచ్చే ఏడాది మొదటి స్థానం కోసం ప్రయతి్నస్తాం. – సీహెచ్ నాగనరసింహారావు, కమిషనర్, కాకినాడ నగరపాలక సంస్థ -
కాకినాడకు మరో కిరీటం
రామాయపట్నం.. మూలపేట.. మచిలీపట్నం పరంపరలో రాష్ట్రంలో మరో పోర్టు శరవేగంగా రూపుదిద్దుకుంటోంది. ఇప్పటికే మూడు పోర్టులు (కాకినాడ డీప్ వాటర్, కాకినాడ యాంకరేజ్, రవ్వ క్యాపిటివ్) ఉన్న కాకినాడ సిగలో త్వరలో మరో పోర్టు చేరనుంది. కాకినాడ సమీపంలోని తొండంగి మండలం పెరుమాళ్లపురం వద్ద సుమారు 1,944 ఎకారాల్లో కాకినాడ సెజ్ గేట్‌వే పోర్టు (కే–సెజ్ పోర్టు)ను అభివృద్ధి చేస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వం, ప్రైవేటు భాగస్వామ్యం (పీపీపీ) విధానంలో నిర్మిస్తున్న ఈ పోర్టు పనులు శరవేగంగా పూర్తవుతున్నాయి. తొలిదశలో సుమారు రూ.2,123.43 కోట్ల పెట్టుబడి వ్యయంతో ఏడాదికి 16 మిలియన్ టన్నుల సామర్థ్యం, నాలుగు బెర్తులతో అరబిందో గ్రూపు ఈ ప్రాజెక్టును అభివృద్ధి చేస్తోంది. 2023 ప్రారంభంలో మొదలైన ఈ పోర్టు నిర్మాణ పనులు పరుగులు పెడుతున్నాయి. పోర్టు నిర్మాణంలో కీలకమైన నార్త్ బ్రేక్ వాటర్, సౌత్ బ్రేక్ వాటర్‌ను నిర్మించడానికి 12 లక్షల టన్నుల రాయిని ఇప్పటివరకు వినియోగించారు. బ్రేక్ వాటర్ నిర్మాణం ఇప్పటికే 45 శాతం మేర పూర్తికాగా మొత్తం ప్రాజెక్టులో పనులు 18 శాతం వరకు పూర్తయినట్లు అధికారులు వెల్లడించారు. – సాక్షి, అమరావతి పర్యావరణ అనుమతులు మంజూరు.. 5,886 ఎకరాల విస్తీర్ణంలో విస్తరించి ఉన్న కాకినాడ సెజ్ మధ్యలో ఈ పోర్టు నిర్మాణం జరుగుతోంది. మల్టీ ప్రోడక్ట్ ఇండస్ట్రియల్ జోన్‌గా ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేయడానికి కేంద్ర పర్యావరణ మంత్రిత్వ శాఖ నుంచి ఈ మధ్యనే కీలక అనుమతులు లభించాయి. ఈ పోర్టు నిర్మాణాన్ని 2025 నాటికి పూర్తిచేసి అందుబాటులోకి తీసుకొచ్చే విధంగా పనులు వేగంగా జరుగుతున్నాయి. ఈ పోర్టులో వాణిజ్య కార్యకలాపాలు ప్రారంభమైనప్పటి నుంచి 30 ఏళ్ల వరకు ఆదాయంలో 2.70 శాతం ప్రభుత్వానికి రానుండగా.. 31–40 ఏళ్ల వరకు 5.40 శాతం, 41–50 ఏళ్ల వరకు 10.80 శాతం వాటా ఏపీ మారిటైమ్ బోర్డుకు సమకూరనుంది. ఈ పోర్టు ద్వారా ప్రత్యక్షంగా 3,000 మందికి పరోక్షంగా 10,000 మందికి చొప్పున మొత్తం 13,000 మందికి ఉపాధి లభిస్తుందని అంచనా. పోర్టు లావాదేవీలు, పరిశ్రమల రాకతో రాష్ట్ర జీడీపీ పెరగడంతో పాటు ఆదాయం, ప్రజల తలసరి ఆదాయం పెరుగుతుందని ఆర్థికవేత్తలు స్పష్టంచేస్తున్నారు. మౌలిక వసతులకు భారీ వ్యయం.. ► కే–సెజ్ గేట్‌వే పోర్టును ఇటు కాకినాడతో పాటు అటు అన్నవరం వద్ద జాతీయ రహదారికి రోడ్డు, రైల్వేలైన్ ద్వారా అనుసంధానించనున్నారు. ► సాగరమాల ప్రాజెక్టుకు కింద 40.కి.మీ మేర నాలుగులైన్ల రహదారిని రూ.1,480 కోట్లతో అభివృద్ధి చేయనున్నారు. ► అలాగే, ఈ పోర్టును అన్నవరానికి అనుసంధానిస్తూ రూ.300 కోట్లతో 25కి.మీ మేర రైల్వేలైన్‌ను ఏర్పాటుచేయనున్నారు. ► 24 నెలల్లో అందుబాటులోకి తీసుకొచ్చేందుకు వీలుగా 400/200 కేవీ సబ్‌స్టేషన్‌ను ఏర్పాటుచేయడానికి ట్రన్స్కోకు 64 ఎకరాలను కేటాయించారు. 2,000 ఎంవీఏ విద్యుత్‌ను ఉత్పత్తి సామర్థ్యాన్ని తట్టుకునే విధంగా ఈ సబ్‌స్టేషన్‌ను అనుసంధానిస్తున్నారు. ► ఈ సెజ్‌లోని పరిశ్రమల ద్వారా వచ్చే వ్యర్థాలను శుద్ధిచేయడానికి ఒక ఉమ్మడి ట్రీట్మెంట్ ప్లాంట్‌ను ఏర్పాటుచేయడమే కాకుండా ఈ వ్యర్థాలను గొట్టాల ద్వారా 35 కి.మీ దూరంలోని పాయకరావుపేటవరకు తరలించి అక్కడ నుంచి సుమారు రెండు కి.మీ లోతున సముద్రంలో కలపనున్నారు. ► ఇక్కడ యూనిట్లకు అవసరమైన నీటిని పోలవరం కాలువతో పాటు సుముద్రపు నీటిని శుద్ధిచేసుకుని వినియోగించుకునేందుకు డీశాలినేషన్ ప్లాంట్‌ను ఏర్పాటుచేస్తున్నారు. ► అన్నవరం నుంచి పోలవరం కాలువ ద్వారా 100 ఎంఎల్డీ నీటిని సరఫరా చేయడంతో పాటు రూ.100 కోట్లతో డీశాలినేషన్ ప్లాంట్‌ను ఏర్పాటుచేస్తున్నారు. రూ.50,000 కోట్ల పెట్టుబడుల ఆకర్షణే లక్ష్యం.. ఇలా అన్ని మౌలిక వసతులతో పోర్టు అభివృద్ధి చేస్తుండటంతో ఈ పోర్టు పక్కనే దివీస్ భారీ ఫార్మా యూనిట్, రూ.2,000 కోట్లతో లైఫియస్ ఫార్మా పేరుతో పెన్సులిన్ తయారీ యూనిట్‌ను.. రూ.2,000 కోట్లతో క్యూలే ఫార్మా యూనిట్‌ను అరబిందో ఫార్మా ఏర్పాటుచేస్తోంది. వచ్చే ఐదేళ్లలో రూ.50,000 కోట్లకు పైగా పెట్టుబడులను ఈ సెజ్ ఆకర్షిస్తుందని అంచనా వేస్తున్నారు. ఇప్పటికే రూ,5,000 కోట్ల పెట్టుబడులను ఆకర్షించింది. ఫార్మాస్యూటికల్స్, గ్రీన్ హైడ్రోజన్, టెక్స్టైల్స్, ఆక్వా, స్టీల్ వంటి రంగాల్లో పెట్టుబడులు పెట్టడానికి పలు సంస్థలు ముందుకొస్తున్నాయి. కాకినాడ సెజ్‌కు ఆనుకుని ఉన్న ఉప్పాడ వద్ద రాష్ట్ర ప్రభుత్వం మినీపోర్టు తరహాలో భారీ ఫిషింగ్ హార్బర్‌ను అభివృద్ధి చేస్తుండటంతో ఆక్వా రంగానికి చెందిన పలు సంస్థలు ఇక్కడ పెట్టుబడులు పెట్టడానికి ముందుకొస్తున్నాయి. ఇప్పటికే నెక్కంటి సీ ఫుడ్స్, దేవీ ఫిషరీస్, సంధ్య ఆక్వా, కాంటినెంటల్ ఫిషరీస్, ఆదివిష్ణు వంటి పలు సంస్థలు ఉత్పత్తిని ప్రారంభించి 8,000 మందికి పైగా ఉపాధి కల్పిస్తున్నాయి. ఇందులో అత్యధికమంది మహిళలు.. పైగా స్థానికులే కావడం గమనార్హం. 2025 నాటికి అందుబాటులోకి తెస్తాం.. ఇప్పటికే కీలకమైన బ్రేక్ వాటర్ పనులు వేగంగా జరుగుతున్నాయి. త్వరలోనే డ్రెడ్జింగ్ బెర్తుల నిర్మాణ పనులు ప్రారంభించనున్నాం. బ్యాంకులతో రుణాల ద్వారా నిధుల సమీకరణ పూర్తికావడంతో ఇక పనులు వేగవంతం కానున్నాయి. 2025 ద్వితీయ త్రైమాసికం నాటికి పోర్టును పూర్తిస్థాయిలో వాణిజ్య కార్యకలాపాలు ప్రారంభించే విధంగా చర్యలు తీసుకుంటున్నాం. – ఓం రామిరెడ్డి, ఎండీ, కాకినాడ గేట్‌వే పోర్ట్స్ లిమిటెడ్ మా వాళ్లకు ఉద్యోగాలొస్తాయన్న ఆశ.. నాకున్న నాలుగెకరాల భూమి సెజ్‌కు ఇచ్చాను. ఇక్కడి ప్రాంతం అభివృద్ధి చెందుతుంది. మాలాంటి వాళ్లకు ఉద్యోగాలు వస్తాయి. మా వాళ్లు బాగుపడతారనే నమ్మకంతో భూమి ఇచ్చాను. అందుకు తగ్గట్లుగానే సెజ్‌లో నాలుగేళ్లుగా పనిచేస్తున్నాను. పెద్దగా చదువుకోకున్నా భూమి ఇచ్చాననే కారణంతో ఉద్యోగం ఇచ్చారు. ఇప్పుడిప్పుడే ఫ్యాక్టరీలు వస్తున్నాయి. చాలా సంతోషంగా ఉంది. – యాదాల చంటిబాబు. ఆవులమంద, పెరుమాళ్లపురం, తొండంగి మండలం ఇప్పుడు పనులు వేగవంతమయ్యాయి.. గత ప్రభుత్వంలో కంటే ఇప్పుడు చాలా సమస్యలకు పరిష్కారం లభించింది. గతంలో పట్టించుకునే వారు కాదు. ఇప్పుడు సెజ్‌లో పనులు వేగంగా జరుగుతున్నాయి. ఈ సెజ్‌కు భూమి ఇచ్చిన వారిలో నేను ఒకడిని. గత పాలనలో కొంతమందిని బెదిరించి భూములు లాక్కున్నారు. అప్పట్లో నాపై అన్యాయంగా 15 కేసులు బనాయించారు. ఈ ప్రభుత్వం వచ్చాక గత డిసెంబరు 26న 12 కేసులు ఎత్తేశారు. మరో 3 కేసులు నాపై పెండింగ్‌లో ఉన్నాయి. – దూలం శ్రీను, గోర్సపాలెం, తొండంగి మండలం -
సంక్రాంతి తర్వాత టీడీపీ ఖాళీ: మంత్రి దాడిశెట్టి రాజా
సాక్షి, కాకినాడ: చంద్రబాబుకు సభలో జనం లేక పిచ్చి పట్టి మాట్లాడుతున్నారని రోడ్లు, భవనాలశాఖ మంత్రి దాడిశెట్టి రాజా ఎద్దేవా చేశారు. ఆయన బుధవారం మీడియాతో మాట్లాడుతూ.. చంద్రబాబు సభ అట్టర్ ఫ్లాప్ అయిందని అన్నారు. ప్రజలు చంద్రబాబు మాటలను నమ్మడం లేదని తెలిపారు. రెండు పంటలకు ఒక్కసారి కూడా చంద్రబాబు నీరు ఇవ్వలేదని మండిపడ్డారు. సీఎం జగన్ వచ్చాక రాష్ట్రం సస్యశ్యామలంగా ఉందని అన్నారు. చంద్రబాబు సభలకు జనం నుంచి స్పందన లేదని అన్నారు. కాపులను చంద్రబాబు మోసం చేసి అవమానపరిచారని దుయ్యబట్టారు. చంద్రబాబు దగా, మోసాన్ని ఎవ్వరూ మరచిపోలేదని రాజా తెలిపారు. ప్రజలు ప్రతి విషయాన్ని గుర్తు పెట్టుకుంటారని అన్నారు. సంక్రాంతి తర్వాత టీడీపీ ఖాళీ అవుతుందని, అభ్యర్ధులు కూడా దొరకరని అన్నారు. 2014 నుంచి 2019 వరకు ఈ రాష్ట్రంలో చంద్రబాబు దోపిడి పరిపాలనే సాగిందని మండిపడ్డారు. రాష్ట్రాన్ని చంద్రబాబు, చంద్రబాబు కుటుంబం అడ్డంగా దోచుకుందని రాజా మండిపడ్డారు. 2014-2019లో మరుగుదోడ్లు నిర్మాణం కోసం కేంద్రం ఇచ్చిన కోట్లాది రూపాయాలను యనమల అనుచరులు దోచేసుకున్నారని విమర్శించారు. చదవండి: టీడీపీకి కేశినేని నాని రాజీనామా -
యనమల ఇంట్లో టికెట్ లొల్లి
సాక్షి ప్రతినిధి, కాకినాడ: ఒకప్పుడు ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లా టీడీపీలో తెరవెనుక రాజకీయాలను శాసించిన యనమల రామకృష్ణుడికి ఇంటిపోరు పెద్ద తలనొప్పిలా మారింది. సార్వత్రిక ఎన్నికలు దగ్గరపడుతున్న సమయంలో ఆయన సొంత నియోజకవర్గం తునిలో తన రాజకీయ వారసురాలిగా కూతురిని తెరపైకి తీసుకొచ్చి.. తమ్ముడు యనమల కృష్ణుడికి మొండిచేయి చూపుతూ చక్రం తిప్పారు. ఈ ఇంటి పోరుతో తుని నియోజకవర్గంలో ఇప్పటికే తెలుగు తమ్ముళ్లు తలలు పట్టుకుంటున్నారు. నిన్న మొన్నటి వరకూ కాకినాడ జిల్లా తునిలో పార్టీ ఇన్చార్జిగా యనమల కృష్ణుడే అన్నీ తానై చూసుకున్నారు. కష్టకాలంలో పార్టీని నడిపించిన తమ నాయకుడిని కాదని రాజకీయ వారసత్వాన్ని కొనసాగించేలా ఎక్కడో ఉన్న రామకృష్ణుడి కుమార్తె దివ్యను రంగంలోకి దించడంతో కృష్ణుడి అనుచరవర్గం మండిపడుతోంది. ఇప్పుడు రామకృష్ణుడు తన చిన్నాన్న కుమారుడైన కృష్ణుడికి పూర్తిగా చెక్ పెట్టేందుకు.. సొంత సోదరుడి కుమారుడు రాజేష్‌ను రంగంలోకి దించడంతో తాడేపేడో తేల్చుకునేందుకు కృష్ణుడు సిద్ధమయ్యారు. పక్కా వ్యూహంతో తమ్ముడిని దెబ్బకొట్టిన యనమల యనమల కృష్ణుడి వల్లే టీడీపీ నష్టపోయిందనే సాకుతో అభ్యర్థి బరి నుంచి ఆయనను తప్పించడంలో రామకృష్ణుడి వ్యూహం ఫలించింది. ఇది కృష్ణుడి వర్గానికి ఏమాత్రం రుచించడం లేదు. అలాగని ఇప్పటికిప్పుడు బయటపడకుండా వేచిచూసే ధోరణి అవలంభిస్తున్నారు. మరోవైపు దివ్యకు పార్టీలో ప్రతికూల వాతావరణం ఎదురు కాకుండా కృష్ణుడిని పొమ్మనకుండానే పొగపెట్టే ప్రయత్నాలు చేస్తున్నారు. ఇందుకు రామకృష్ణుడు సోదరుడి కుమారుడు రాజేష్‌ను పావుగా వాడు కుంటున్నారనే వాదన వినిపిస్తోంది. దివ్యను టీడీపీ తుని నియోజకవర్గ ఇన్చార్జిగా నియమించిన సందర్భంలో తీవ్ర అసంతృప్తితో రగిలిపోయిన కృష్ణుడు.. పార్టీ మారే ఆలోచన కూడా చేశారనే ప్రచారం జరిగింది. దివ్య నియామకాన్ని పార్టీ విస్తృత స్థాయి సమావేశంలో కృష్ణుడి వర్గం బాహాటంగానే వ్యతిరేకించింది. పార్టీని ఇంతకాలం మోసిన కృష్ణుడిని పక్కన పెట్టిన రోజే యనమల కుటుంబంలో ఇంటి పోరుకు తెరలేచింది. అనంతర పరిణామాల్లో ఆయనను బుజ్జగించడంతో కృష్ణుడిని దారిలోకి తెచ్చుకున్నామని రామకృష్ణుడు సంబరపడ్డారు. లోలోన రగిలి పోతున్న కృష్ణుడు సమయం కోసం వేచిచూశారు. రాజేష్ రాకతో కాక రామకృష్ణుడి సోదరుడి కుమారుడు రాజేష్, కృష్ణుడి వర్గాలు రామకృష్ణుడి సమక్షంలోనే ఇటీవల పరస్పరం కొట్లాటకు దిగారు. దివ్యను ఇన్చార్జిగా నియమించిన సమయంలో కృష్ణుడు రాజకీయంగా అస్త్రసన్యాసం చేసి కొంతకాలం మౌనంగా ఉన్నారు. ఆ సమయంలో దివ్య వెంట రాజేష్ క్రియాశీలకంగా వ్యవహరించారు. నియోజకవర్గంలో తుని, కోటనందూరు, తొండంగి మండలాలు ఉండగా, రాజేష్ తొండంగి మండల పార్టీ బాధ్యతలు చూస్తున్నారు. ఇంతలోనే కృష్ణుడు ఇటీవల పార్టీలో క్రియాశీలకంగా వ్యవహరిస్తున్నారు. దీన్ని జీర్ణించుకోలేని రామకృష్ణుడి వర్గం కృష్ణుడికి పొమ్మనకుండానే పొగబెట్టేలా చేస్తున్నారని తెలుగు తమ్ముళ్ల మధ్య విస్తృత చర్చ సాగుతోంది. పార్టీ కార్యకలాపాలకు కృష్ణుడు దూరంగా ఉన్నంతసేపు ఖుషీగా ఉన్న ఆ వర్గానికి.. కృష్ణుడు తిరిగి పార్టీలో చురుగ్గా ఉండటం రుచించడం లేదంటున్నారు. ఇందుకు రాజేష్‌ను పావుగా వాడుకుంటూ కృష్ణుడిపైకి ఉసిగొల్పుతున్నారనే ప్రచారం పార్టీలో వినిపిస్తోంది. తాడోపేడో తేల్చుకునేందుకు యనమల కృష్ణుడు సిద్ధం రాష్ట్ర రాజకీయాల్లో రామకృష్ణుడు నాలుగు దశాబ్దాలుగా కొనసాగుతుండగా.. ఆయన తరఫున తునిలో అన్నీ తానై చూసుకున్న కృష్ణుడికి ఇచ్చే గౌరవం ఇదేనా అంటూ మండిపడుతున్నారు. రాజకీయాల్లో తనకంటే వెనకాల వచ్చిన రాజేష్‌కు టీడీపీలో ప్రాధాన్యం ఇవ్వడం కృష్ణుడికి పుండు మీద కారం చల్లినట్లయ్యింది. ఉంటే రాజేష్ అయినా ఉండాలి లేక తమ నాయకుడికైనా పూర్తిగా బాధ్యతలు అప్పగించాలని కృష్ణుడి వర్గం వాదన వైరి వర్గానికి మింగుడు పడటం లేదు. తునిలో బుధవారం జరగనున్న చంద్రబాబు సభలోపు ఈ విషయంపై తాడోపేడో తేల్చాలని పట్టుబడుతున్నారు. ఈ పరిస్థితులతో యనమల రామకృష్ణుడికి ఎటూ పాలుపోని పరిస్థితి ఉంది. ఈలోగా ఈ వ్యవహారం ఎటు దారి తీస్తుందోనని పార్టీ శ్రేణులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నాయి. -
కొండయ్య పాలెం వంతెనకు ముత్తా గోపాలకృష్ణ పేరు..
-
సంక్రాంతికి ప్రత్యేక రైళ్లు
రైల్వేస్టేషన్ (విజయవాడపశ్చిమ): సంక్రాంతి పండుగ సీజన్లో ప్రయాణికుల రద్దీ దృష్ట్యా సికింద్రాబాద్–కాకినాడ టౌన్–హైదరాబాద్ మధ్య ప్రత్యేక రైళ్లు నడపనున్నట్లు విజయవాడ డివిజన్ పీఆర్వో నుస్రత్ మండ్రుప్కర్ గురువారం ఓ ప్రకటనలో తెలిపారు. ♦ సికింద్రాబాద్–కాకినాడ టౌన్ (07021) రైలు ఈ నెల 11న గురువారం రాత్రి 9 గంటలకు సికింద్రాబాద్‌లో బయలుదేరి, మరుసటి రోజు ఉదయం 8 గంటలకు కాకినాడ టౌన్ చేరుకుంటుంది. తిరుగు ప్రయాణంలో ఈ రైలు (07022) ఈ నెల 12న శుక్రవారం సాయంత్రం 5.40 గంటలకు కాకినాడ టౌన్లో బయలుదేరి, మరుసటి రోజు ఉదయం 5.55 గంటలకు సికింద్రాబాద్ చేరుకుంటుంది. ♦ హైదరాబాద్–కాకినాడ టౌన్ (07023) రైలు ఈ నెల 12న శుక్రవారం సాయంత్రం 6.30 గంటలకు హైదరాబాద్‌లో బయలుదేరి, మరుసటి రోజు ఉదయం 7.10 గంటలకు కాకినాడ టౌన్ చేరుకుంటుంది. తిరుగు ప్రయాణంలో ఈ రైలు (07024) ఈ నెల 13న శనివారం రాత్రి 10 గంటలకు కాకినాడ టౌన్లో బయలుదేరి మరుసటి రోజు ఉదయం 8.30 గంటలకు హైదరాబాద్ చేరుకుంటుంది. -
కాకినాడ జిల్లా పర్యటనలో పలువురికి ఆర్థిక సాయం అందజేసిన సీఎం జగన్
-
పేదల జీవితంలో ఆనందమే లక్ష్యం...
-
కుటుంబాలను చీల్చే రాజకీయ కుట్రలు చేస్తున్నారని... అలాంటి రాజకీయాలపై ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి పిలుపు...ఇంకా ఇతర అప్డేట్స్
-
ఈ అవ్వ మాటలకు దద్దరిల్లిన కాకినాడ సభ
-
కాకినాడలో సీఎం వైఎస్ జగన్ విజువల్స్
-
కాకినాడలో వైఎస్సార్ పెన్షన్ కానుక కార్యక్రమంలో సీఎం జగన్ (ఫొటోలు)
-
ముసలవ్వ స్పీచ్ కు దద్దరిల్లిన కాకినాడ
-
సీఎం జగన్ పై పూల వర్షం
-
పొత్తుల కోసం కుటుంబాల్ని చీలుస్తారు: సీఎం జగన్
సాక్షి, కాకినాడ: చంద్రబాబు హయాంలో పెన్షన్ తీసుకోవాలంటే లంచం ఇస్తే తప్ప పని జరిగేది కాదని.. జన్మభూమి కమిటీల ద్వారా అర్హులను నిర్ణయించేవారని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి దుయ్యబట్టారు. కాకినాడలో రంగరాయ మెడికల్ కాలేజ్ గ్రౌండ్స్‌లో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో వైఎస్సార్ పెన్షన్ కానుక పెంపు కార్యక్రమాన్ని ప్రారంభించిన అనంతరం ఆయన మాట్లాడుతూ, చంద్రబాబు, పవన్ కలిసి 2014లో ఎన్నో హామీలు ఇచ్చారు పేదవారికి 3 సెంట్ల భూమి ఇస్తామని హామీ ఇచ్చి ఒక్క సెంటు కూడా ఇవ్వలేదని మండిపడ్డారు. ‘‘చంద్రబాబు అవినీతిపై దత్తపుత్రుడు ఎందుకు మాట్లాడరు?. పశ్నిస్తానన్న దత్త పుత్రుడు కనీసం లేఖ కూడా రాయలేదు. చంద్రబాబు అవినీతిలో పవన్ కూడా పార్ట్‌నరే. చంద్రబాబు అవినీతిపై ఈనాడు, ఆంధ్రజ్యోతి ఏమీ రాయవు. చంద్రబాబు అవినీతిని ఈటీవీ, ఏబీఎన్, టీవీ5 చూపించవు. అవినీతికి పాల్పడిన చంద్రబాబును జైలుకెళ్లి దత్తపుత్రుడు పరామర్శించాడు. ఇళ్ల నిర్మాణాన్ని ఆపాలనే దత్తపుత్రుడి దిక్కుమాలిన ఆలోచన. చంద్రబాబు అవినీతిలో పార్ట్నర్ కాబట్టే దత్తపుత్రుడు ప్రశ్నించడు’’ అంటూ సీఎం జగన్ ధ్వజమెత్తారు. ‘రాబోయే రోజుల్లో కుట్రలకు తెరతీస్తారు. రాబోయే రోజుల్లో పొత్తులు ఎక్కువగా పెట్టుకుంటారు. కుటుంబాలను చీల్చి రాజకీయాలు చేస్తారు. మీరందరూ అప్రమత్తంగా ఉండాలి. మీ బిడ్డకు వాళ్ల మాదిరి అబద్ధాలు చెప్పడం రాదు. మీ బిడ్డ నమ్ముకున్నది పైన దేవుడు, ఇక్కడ ప్రజలనే’’ అని సీఎం జగన్ పేర్కొన్నారు. సీఎం జగన్ ఇంకా ఏమన్నారంటే ఆయన మాటల్లోనే.. ►ఎప్పుడూ జరగని విధంగా, ఎప్పుడూ చూడని విధంగా అక్కచెల్లెమ్మల పేరు మీద రిజిస్ట్రేషన్ చేయించి మరీ లక్షాధికారులను చేయాలని గూడు ఉండాలని ప్రయత్నం జరుగుతోంది. ►22 లక్షల ఇళ్లు నిర్మాణంలో ఉన్నాయి ►ఒకాయన ఉన్నాడు. ఆయనకొక దత్తపుత్రుడూ ఉన్నాడు. ఆ దత్తపుత్రుడు, ఆ దత్తతండ్రి ఇద్దరూ కలిసి 2014లో ఎన్నికలప్పుడు వాళ్ల ఎన్నికల మేనిఫెస్టోలో వారు చెప్పిన మాట ప్రతి పేదవాడికీ 3 సెంట్ల స్థలం, ఇళ్లు కట్టిస్తామని వాగ్దానం చేసి చివరికి ఒక్క సెంటు భూమి కూడా ఇచ్చిన పాపాన పోలేదు ►ఆనాడు మాత్రం ఆ దత్తతండ్రి అక్కచెల్లెమ్మలను, పేదవాళ్లను అడ్డగోలుగా మోసం చేస్తే ఈ దత్తపుత్రుడు కనీసం ఏ ఒక్కరోజూ ప్రశ్నించకపోగా, కేంద్రానికి ఒక లేఖ కూడా రాయలేదు ►కానీ ఇదే దత్తపుత్రుడు, ఇవాళ మీ బిడ్డ 31 లక్షల ఇళ్ల పట్టాలు నా అక్కచెల్లెమ్మలకు ఇచ్చి 22 లక్షల ఇళ్లు కడుతుంటే కేంద్ర ప్రభుత్వానికి లేఖ రాస్తాడు ఈ దత్తపుత్రుడు పేదలకు కట్టే ఇళ్లలో, ఇంటి స్థలాల్లో అవినీతి జరిగిందట అని రాస్తాడు ►ఆ ఇళ్లు కట్టే కార్యక్రమం ఆపించాలని దిక్కుమాలిన ఆలోచన చేసిన వారు వీళ్లే ►అవినీతి పరుడు చంద్రబాబు అని సాక్షాత్తూ కేంద్రానికి సంబంధించిన ఇన్ కమ్ ట్యాక్స్ డిపార్ట్ మెంట్, ఈడీ కూడా బాబుకు సమన్లు ఇస్తే, కోర్టులు కూడా నిర్ధారించి పరిగణనలోకి తీసుకొని చంద్రబాబును జైల్లో పెడితే, జైలు దగ్గరికి వెళ్లి ఈ దత్తపుత్రుడు ఈ దత్తతండ్రిని పరామర్శిస్తాడు ►ఇంత అవినీతి పరుడు ప్రపంచంలో ఎక్కడా లేకపోయినా ఈ పెద్దమనిషి చాలా మంచోడని ఈయన సర్టిఫికెట్ ఇస్తాడు ►అక్కడేమో అవినీతి జరిగినా మాట్లాడడు. మన ప్రభుత్వం విషయానికొస్తే అవినీతి జరగక పోయినా అభాండాలు వేస్తాడు ►చంద్రబాబు అవినీతి చేసినా ఈ పెద్దమనిషి నోరు ఎందుకు మెదపడంటే ఆ అవినీతిలో ఈయన కూడా పార్టనర్ కాబట్టి ఎవడూ నోరుమెదపడు, ఈనాడు, ఆంధ్రజ్యోతి, టీవీ5, దత్తపుత్రుడు ప్రశ్నించడు, మాట్లాడరు ►గత ప్రభుత్వంలో చంద్రబాబు నొక్కిన బటన్లు ఎన్ని? సున్నా. పేదలకు ఇచ్చింది అరకొర ►అదే ఇప్పుడు మీ బిడ్డ ప్రభుత్వంలో ప్రతి పేదవాడికీ పెన్షన్ గానీ, ఇతర పథకాలుగానీ నేరుగా ఈరోజు మీ బిడ్డ బటన్ నొక్కడం, నా అక్కచెల్లెమ్మల కుటుంబాల ఖాతాల్లోకి నేరుగా 2.46 లక్షలు నేరుగా పోతోంది ►ఎక్కడా లంచాలు లేవు. వివక్ష లేదు ►ప్రతి పేదవాడికీ మంచి జరగాలని ఎందుకుమీ బిడ్డ చేయగలిగాడు. ఎందుకు చంద్రబాబు చేయలేకపోయాడు ఆలోచించాలి ►అదే రాష్ట్రం, అదే బడ్జెట్, అప్పులు కూడా అప్పటికన్నా మీ బిడ్డ ప్రభుత్వంలో అప్పుల గ్రోత్ రేటు తక్కువ ►కేవలం మారిందల్లా ఒక్క ముఖ్యమంత్రి స్థానంలో కూర్చున్న వ్యక్తి మారాడు ►అప్పట్లో ఎందుకు ఈ బటన్లు నొక్కే కార్యక్రమం జరగలేదు? ఎందుకు 2.46 లక్షల కోట్లు ఇవ్వలేకపోయారు? ►అప్పట్లో పాలన కేవలం దోచుకోవడం, దోచుకున్నది పంచుకున్నది తప్ప వేరే పాలన జరగలేదు ►గజదొంగల ముఠా రాజ్యాన్ని పాలన చేసేది, ఈనాడు, ఆంధ్రజ్యోతి, టీవీ5, చంద్రబాబు, వీరందరికీ తోడు ఒక దత్తపుత్రుడు. ►అప్పట్లో డీపీటీ పాలన జరిగితే, మీ బిడ్డ హయాంలో డీబీటీ పాలన జరుగుతోంది ►చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు అమ్మ ఒడి అనే స్కీమే లేదు ►ఈ ఒక్క స్కీమ్ ద్వారా ఈ ఐదేళ్లలో మీ బిడ్డ 44.49 లక్షల మంది అక్కచెల్లెమ్మలకు మేలు చేస్తూ 26 వేల కోట్లు ఖాతాల్లోకి పంపించడం జరిగింది ►చంద్రబాబు సీఎంగా ఉండగా రైతు భరోసా అనే స్కీమే లేదు ►ఇవాళ ప్రతి సంవత్సరం 53.52 లక్షల మంది రైతన్నలకు మీ బిడ్డ బటన్ నొక్కడం, నేరుగా రైతన్నల ఖాతాల్లోకి 13500 పడుతోంది. ఈ ఒక్క స్కీమ్ ద్వారా ఐదేళ్లలో రైతన్నలకు పంపిన మొత్తం 33,300 కోట్లు ►గతంలో చంద్రబాబు సీఎంగా ఉండగా వైయస్సార్ ఆసరా అనే స్కీమే లేదు ►ఈ వైఎస్సార్ ఆసరా పథకం ద్వారా అక్షరాలా 78.94 లక్షల మంది పొదుపు సంఘాల అక్కచెల్లెమ్మలకు 55 నెలల్లో ఈ ఒక్క స్కీమ్ ద్వారా నేరుగా మీ బిడ్డ బటన్ నొక్కి 19,178 కోట్లు ఖాతాల్లోకి పంపించడం జరిగింది. ►గతంలో చంద్రబాబు హయాంలో వైయస్సార్ చేయూత అనే స్కీమే లేదు ►45-60 సంవత్సరాల వయసులో ఉన్న అక్కచెల్లెమ్మలకు స్వావలంబన కోసం నా ఎస్సీ, నా ఎస్టీ, నా బీసీ, నా మైనార్టీ అని తాపత్రయపడి వరుసగా నాలుగు సంవత్సరాల పాటు తోడుగా ఉంటూ క్రమం తప్పకుండా రూ.18750 ఇస్తూ రూ.75 వేలు చేతిలో పెట్టే గొప్ప కార్యక్రమానికి అడుగులు పడింది మీ బిడ్డ పరిపాలనలో మాత్రమే. ►ఈ ఒక్క స్కీమ్ ద్వారా 22.40 లక్షల మంది అక్కచెల్లెమ్మలకు నేరుగా బటన్ నొక్కి పంపిన సొమ్ము రూ.14,129 కోట్లు ►వైఎస్సార్ కాపు నేస్తం ద్వారా రూ.2,028 కోట్లు కాపు అక్కచెల్లెమ్మల కోసం అందించాం ►వైఎస్సార్ నేతన్న నేస్తం ద్వారా 982 కోట్లు నేతన్నల కోసం అండగా నిలబడ్డాం ►వైఎస్సార్ వాహన మిత్ర ద్వారా 1302 కోట్లు నా డ్రైవర్ అన్నదమ్ములకు అండగా నిలిచాం. ►ఈబీసీ నేస్తం కింద రూ.1257 కోట్లు ఇచ్చాం ►అగ్రిగోల్డ్ బాధితులకు 905 కోట్లు, జగనన్న తోడు ద్వారా 2955 కోట్లు, జగనన్న చేదోడు ద్వారా 1253 కోట్లు ఇచ్చాం ►ఇలా చెప్పుకుంటూ పోతేలిస్టు చాంతాడంత కనిపిస్తుంది ►ఎక్కడా లంచాలు, వివక్ష లేవు. ప్రతిదీ గ్రామ సచివాలయంలో లిస్టులు పెడుతున్నాం. వాలంటీర్లు మీ ఇంటికి వస్తున్నారు ►రాష్ట్రంలో ఇవాళ ఏ గ్రామాన్నయినా తీసుకోండి. ఇచ్చాపురం నుంచి కుప్పం దాకా మీ ఇష్టం, ఏ గ్రామాన్నయినా తీసుకోండి. ఈరోజు ప్రతి గ్రామంలో మార్పు కనిపిస్తుంది ►అడుగు పెడుతూనే గతంలో లేని విధంగా మార్పు కనిపిస్తూ గ్రామ సచివాలయం కనిపిస్తుంది. 10 మంది శాశ్వత ఉద్యోగులు కనిపిస్తారు. వాలంటీర్ వ్యవస్థ కనిపిస్తుంది. ►ఇప్పటికే అందుతున్న పెన్షన్ ఇంటికే వచ్చి అందిస్తున్నారు, ఇంటి వద్దకే అందుతున్న రేషన్, గ్రామంలో ఆర్బీకే, విలేజ్ క్లినిక్, జగనన్న ఆరోగ్య సురక్ష కనిపిస్తుంది. ►గ్రామంలో మారిన స్కూళ్లు, మారిన ఆస్పత్రులు, నాడునేడుతో మన కళ్ల ఎదుటే మార్పు కనిపిస్తున్న పరిస్థితులు, మన పిల్లల చేతుల్లో ట్యాబులు, స్కూళ్లలో ఐఎఫ్ పీ క్లాసు రూములు కనిపిస్తాయి ►ఆలోచన చేయమని అడుగుతున్నా. ప్రతి గ్రామంలో ఈ మార్పులు కనిపిస్తున్నాయి ►వైఎస్సార్ రైతు భరోసా, మెరుగులు దిద్దిన 108, 104, కనిపిస్తాయి ►1050 రోగాలకు మాత్రమే పరిమితమైన ఆరోగ్యశ్రీని మారుస్తూ 3250 రోగాలకుతీసుకుపోయి పేదవాడికి అండగా నిలబడ్డాం ►రైతులకు పగటిపూటే ఉచిత కరెంటు 9 గంటలు ఇస్తున్న పరిస్థితులు, చదువుకుంటున్న పిల్లలకు పూర్తి ఫీజు రీయింబర్స్ మెంట్, పిల్లలకు వసతి దీవెనతో అండగా ఉన్న పరిస్థితులు కనిపిస్తున్నాయి ►కేవలం ఈ 55 నెలల కాలంలో మీ బిడ్డ పరిపాలనలో మాత్రమే జరుగుతున్నమార్పులు గమనించాలి ►ఇంగ్లీషు మీడియం అంటే మీ జగన్.. ట్యాబులంటే మీ జగన్ ►గవర్నమెంట్ బడుల్లో ఐఎఫ్ పీలు అంటే దానికి కారణం మీ జగన్ ►గత ప్రభుత్వం కంటే 3 రెట్లు పెన్షన్ పెంచింది ఎవరంటే మీ జగన్ ►ఇవన్నీ కూడా కేవలం ఈ 55 నెలల కాలంలోనే జరుగుతున్నాయి ►ఇవన్నీ మీరు ఆలోచన చేయమని కోరడానికి చెప్పాల్సి వస్తోంది. ►రాబోయే రోజుల్లో ఇంకా ఎక్కువ అబద్ధాలు చెబుతారు. మోసాలు చూడాల్సి వస్తుంది ►ప్రతి ఇంటికీ కేజీ బంగారం, బెంజ్ కారిస్తామని చెప్పే నాయకుల మీ దగ్గరికి వస్తారు ►కుట్రలు, కుతంత్రాలు, కుటుంబాలను అడ్డగోలుగా చీల్చే కార్యక్రమాలు కూడా జరుగుతాయి ►రాబోయే రోజుల్లో పొత్తులు ఎక్కువగా పెట్టుకుంటారు, కుటుంబాలను చీలుస్తారు, రాజకీయాలు చేస్తారు, అబద్ధాలు చెబుతారు, మోసాలు చేస్తారు. ఇవన్నీ జరుగుతాయి. ►అప్రమత్తంగా ఉండాలని మిమ్మల్నందరినీ కోరుతున్నా ►మీ బిడ్డకు వాళ్ల మాదిరిగా కుట్రలు చేయడం, అబద్ధాలు ఆడటం, రాజకీయాలు చేయడం చేతకాదు ►మీ బిడ్డకు తెలిసిన రాజకీయం మంచి చేయడం, పేదవాడికి అండగా నిలబడటం, మీ బిడ్డ పైన దేవుడిని నమ్ముకున్నాడు, కింద ఉన్న మిమ్మల్ని నమ్ముకున్నాడు తప్ప మధ్యలో దళారులను నమ్ముకోలేదు ►మీ బిడ్డకు ఈనాడు, ఆంధ్రజ్యోతి,టీవీ5, దత్తపుత్రుడి అండ లేకపోవచ్చు ►మీ బిడ్డ నమ్ముకున్నది పొత్తుల్ని, జిత్తుల్ని, కుయుక్తుల్ని, కుట్రలను కాదు. పైన దేవుడిని, కింద మిమ్మల్నిమాత్రమే నమ్ముకున్నాడు ►అప్రమత్తంగా ఉండండి అని మరోసారి విన్నవిస్తూ మీ అందరితోపాటు మీ సంతోషాల మధ్య ఈ కార్యక్రమాన్ని జరుపుకోవడం మీ బిడ్డగా ఇంతకన్నా సంతోషం ఏమైనా ఉంటుందా అని ఈ సందర్భంగా చెప్పడానికి గర్వపడుతున్నా. సంతోషపడుతున్నా. -
కాకినాడలో వైఎస్సార్ పెన్షన్ కానుక కార్యక్రమానికి భారీగా తరలివచ్చిన ప్రజలు (ఫొటోలు)
-
Live: వైఎస్ఆర్ పెన్షన్ కానుక..కాకినాడలో సీఎం జగన్ బహిరంగ సభ
-
పెన్షన్ పెంపు..కాకినాడలో పండగ వాతావరణం
-
సీఎం జగన్ కాకినాడ పర్యటన
-
నేడు కాకినాడలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి చేతుల మీదుగా పెన్షన్ల పంపిణీ...ఇంకా ఇతర అప్డేట్స్
-
చంద్రబాబు అవినీతిలో పవన్ కూడా భాగస్వామే: సీఎం జగన్
Updates: ►తాడేపల్లిలోని నివాసానికి చేరుకున్న సీఎం జగన్ ►కాకినాడలో ముగిసిన సీఎం జగన్ పర్యటన ►సీఎం జగన్ మాట్లాడుతూ.. ఇచ్చిన మాట ప్రకారం రూ.3వేలకు పెన్షన్ పెంచాం. పేదల జీవితాల్లో ఆనందం వెల్లివిరియాలి. తమను తాము పోషించుకోలేని పరిస్థితి ఎవరికీ రాకూడదు. 66.34 లక్షల మందికి మంచి జరిగేలా పెన్షన్ అందిస్తున్నాం. పెన్షన్ల కోసం దాదాపుగా నెలకు రూ.2వేల కోట్లు ఖర్చు చేస్తున్నాం. పండుగైనా, సెలవైనా ఒకటో తేదీనే పెన్షన్ అందిస్తున్నాం. నా జగనన్న సైన్యం వలంటీర్లు పెన్షన్ పంపిణీ చేస్తున్నారు. ►చంద్రబాబు పాలనలో పెన్షన్ కేవలం వెయ్యి రూపాయలు మాత్రమే. ఎన్నికల ముందు మీ జగన్ హామీ ఇవ్వకుండా ఉంటే చంద్రబాబు పెన్షన్ పెంచేవాడా?. అర్హత ఉంటే చాలు అందరికీ పెన్షన్ ఇస్తున్నాం. చంద్రబాబు ఐదేళ్ల పాలనలో పెన్షన్ రూ.58వేలు మాత్రమే ఇచ్చారు. గతానికి, మన ప్రభుత్వానికి తేడాను గమనించాలి. మన ప్రభుత్వంలో రూ.లక్షా 47వేలు అందిస్తున్నాం. గతంలో జన్మభూమి కమిటీల ద్వారా అర్హులను నిర్ణయించే వారు. చంద్రబాబు హయాంలో పెన్షన్ తీసుకోవాలంటే లంచం ఇస్తే తప్ప పని జరిగేది కాదు. ►గతంలో ఎన్నికలకు ఆరునెలల ముందు వరకు 39లక్షల మందికి మాత్రమే పెన్షన్ ఇచ్చారు. ఎన్నికల రెండు నెలల ముందు వరకు కేవలం రూ.1000 పెన్షన్ ఇచ్చారు. ఇచ్చిన మాట ప్రకారం మేము పెన్షన్‌ను పెంచుకూంటూ రూ.3వేలు అందిస్తున్నాం. బాబు నెలకు రూ.400కోట్లు ఇచ్చారు. ఇప్పుడు రూ.2వేల కోట్లు ఇస్తున్నాం. పార్టీలకు అతీతంగా అర్హులందరికీ పెన్షన్ అందజేస్తున్నాం. ►చంద్రబాబు, పవన్ కలిసి 2014లో ఎన్నో హామీలు ఇచ్చారు. పేదలకు మూడు సెంట్ల భూమి ఇస్తామని హామీ ఇచ్చి ఒక్క సెంటు కూడా ఇవ్వలేదు. ప్రశ్నిస్తానన్న దత్తపుత్రుడు కనీసం లేఖ కూడా రాయలేదు. అవినీతికి పాల్పడిన చంద్రబాబును జైలుకెళ్లి దత్తపుత్రుడు పరామర్శించారు. చంద్రబాబు అవినీతిపై దత్తపుత్రుడు ఎందుకు మాట్లాడరు. చంద్రబాబు అవినీతిలో పవన్ కల్యాణ్ కూడా పాట్నర్. చంద్రబాబు అవినీతిపై ఈనాడు, ఆంధ్రజ్యోతి ఏమీ రాయవు. చంద్రబాబు అవినీతిని ఈటీవీ, ఏబీఎన్, టీవీ-5 చూపించవు. ►2014 ఎన్నికల్లో దత్తతండ్రి, దత్తపుత్రుడు ప్రజలను అడ్డగోలుగా మోసం చేశారు. ప్రశ్నిస్తానన్న దత్తపుత్రుడు కనీసం కేంద్రానికి ఒక్క లేఖ కూడా రాయలేదు. ఈరోజు అదే దత్తపుత్రుడు పేదలకు ఇళ్లపై అవినీతి జరిగిందంటూ కేంద్రానికి లేఖ రాశారు. ఇళ్ల నిర్మాణాన్ని ఆపాలనేది దత్తపుత్రుడి దిక్కుమాలిన ఆలోచన. చంద్రబాబు అవినీతిని కేంద్ర దర్యాప్తు సంస్థలు నిర్ధారించి న్యాయస్థానం జైలుకు పంపింది. జైల్లో ఉన్న అవినీతిపరుడు చంద్రబాబును దత్తపుత్రుడు పరామర్శిస్తాడు. అవినీతికి తావులేకుండా పాలన చేస్తున్న మన ప్రభుత్వంపై విమర్శలు చేస్తాడు. చంద్రబాబు అవినీతిలో భాగస్వామి కాబట్టే దత్తపుత్రుడు ప్రశ్నించడు. ►53 లక్షల 52వేల మందికి రైతు భరోసా అందిస్తున్నాం. రైతన్నలకు ప్రతీ ఏటా రూ.13,500 అందిస్తున్నాం. రైతు భరోసా కింద ఐదేళ్లలో రూ.33,300 కోట్లు జమ చేశాం. వైఎస్సార్ ఆసరా ద్వారా రూ.19,179కోట్లు అక్కచెల్లెమ్మలకు అందించాం. 78 లక్షల 94వేల మంది అక్కచెల్లెమ్మలకు ఆసరా అందిజేస్తున్నాం. ►ప్రతీ గ్రామంలో సచివాలయం తెచ్చాం. ప్రతీ గ్రామంలోనూ వలంటీర్ వ్యవస్థను తీసుకొచ్చాం. ఇచ్చాపురం నుంచి కుప్పం వరకు ప్రతీ గ్రామంలో మార్పు తెచ్చాం. ►ఆర్బీకే, విలేజ్ క్లినిక్, జగనన్న ఆరోగ్య సురక్ష తీసుకొచ్చాం. నాడు-నేడుతో పాఠశాలలను ఆధునీకరించాం. అదే రాష్ట్రం, అదే బడ్జెట్. కేవలం మారిందల్లా ప్రభుత్వమే మాత్రమే. చంద్రబాబు హయాంలో ఇవ్వన్నీ ఎందుకు జరగలేదు. ►రాబోయే రోజుల్లో కుట్రలకు తెరతీస్తారు. కుటుంబాలను చీల్చి రాజకీయాలు చేస్తారు. మీ బిడ్డకు వాళ్ల మాదిరి అబద్ధాలు చెప్పడం రాదు. మీ బిడ్డ నమ్ముకున్నది పైన దేవుడు, ఇక్కడ ప్రజలనే. రాబోయే రోజుల్లో పొత్తులు ఎక్కువగా పెట్టుకుంటారు. ఎన్నికల వేళ కిలో బంగారం, బెంజ్ కారు ఇస్తామని నేతలు వస్తారు. అలాంటి వారితో జాగ్రత్త’ అంటూ కామెంట్స్ చేశారు. ►కాకినాడలో ఆర్వోబీని ప్రారంభించిన సీఎం జగన్ ►రూ.94కోట్లతో నిర్మించిన పలు అభివృద్ధి పనులను ప్రారంభించిన ముఖ్యమంత్రి జగన్ ►పింఛన్ల పెంపు ఉత్సవంలో పాల్గొన్న సీఎం జగన్ ►పింఛన్ల మొత్తం రూ.1,967.34కోట్ల మెగా చెక్ ఆవిష్కరణ ►సభా వేదికకు చేరుకున్న సీఎం జగన్ ►కాకినాడ చేరుకున్న సీఎం జగన్. ►ముఖ్యమంత్రి జగన్‌కు స్వాగతం పలికిన ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి, ఎంపీ వంగా గీతా పలువురు ప్రజా ప్రతినిధులు, అధికారులు ►మరికాసేపట్లో ఆర్ఎంసీ గ్రౌండ్స్‌కు చేరుకోనున్న సీఎం జగన్ ►అక్కడ జరిగే బహిరంగ సభలో వైఎస్ఆర్ ఫించన్ కానుక రూ.3 వేలకు పెంపు. ►అనంతరం నగరంలో రూ.94 కోట్లతో నిర్మించిన పలు అభివృద్ధి పనులను వర్చువల్ విధానం ద్వారా ప్రారంభించినున్న ముఖ్యమంత్రి జగన్ ►సీఎం జగన్ రాకతో జనసంద్రమైన కాకినాడ నగరం ►రోడ్ షోలో పూలు జల్లుతూ ఘనంగా స్వాగతం పలికిన ప్రజలు ►కాకినాడ బయలుదేరిన సీఎం వైఎస్ జగన్ ►వైఎస్సార్ పింఛన్ కానుక రూ.3వేలకు పెంపును ప్రారంభించనున్న సీఎం సాక్షి, తాడేపల్లి: విశ్వసనీయతకు అర్ధం చెబుతూ, మానవత్వానికి ప్రతిరూపంగా, పెన్షన్లను క్రమంగా రూ. 3000 వరకూ పెంచుకుంటూ పోతామని ఇచ్చిన హామీని నిలబెట్టుకుంటూ, అవ్వాతాతలు, అక్కచెల్లెమ్మలు, అన్నదమ్ములకు బాసటగా ప్రేమతో జగనన్న ప్రభుత్వం మరింత పెంచి ఇస్తున్న వైఎస్సార్ పెన్షన్ కానుక, ఠంఛన్‌గా పెన్షన్. పింఛన్ల పెంపు అవ్వాతాతల పింఛన్ రూ. 3,000 వరకు పెంచుకుంటూ పోతాం.. అని మేనిఫెస్టోలో చెప్పిన మాటను తూ.చ. తప్పకుండా నెరవేరుస్తూ!.. ప్రతీ నెలా రూ.3,000 రాష్ట్రవ్యాప్తంగా 1 జనవరి, 2024 నుండి 8 రోజులపాటు పండగ వాతావరణంలో పెన్షన్ల పెంపు ఉత్సవాలు.. నేడు కాకినాడ రంగరాయ మెడికల్ కాలేజ్ గ్రౌండ్స్ లో జరిగే కార్యక్రమంలో పాల్గొని పెంచిన పెన్షన్లను లబ్ధిదారులకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అందజేయనున్నారు. పర్యటన ఇలా.. ఈరోజు ఉదయం 9.30 గంటలకు తాడేపల్లి నివాసం నుంచి బయలుదేరి కాకినాడ చేరుకుంటారు. అక్కడ రంగరాయ మెడికల్ కాలేజ్ గ్రౌండ్స్‌లో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో వైఎస్సార్ పెన్షన్ కానుక పెంపు కార్యక్రమాన్ని ప్రారంభిస్తారు. అనంతరం తాడేపల్లి చేరుకుంటారు. వైఎస్సార్సీపీ రికార్డు.. ►గత ప్రభుత్వంలో ఎన్నికలకు 2 నెలల ముందు వరకు ఒక్కో లబ్దిదారుడికి నెలకు అందించిన పెన్షన్ కేవలం రూ. 1,000.. ►ఐతే జగనన్న ప్రభుత్వం పెంచి ఇస్తున్న పెన్షన్ ఒక్కో లబ్దిదారునికి రూ.3,000 ►గత ప్రభుత్వం ఎన్నికలకు ఆరు నెలల ముందు వరకు ఇచ్చిన పెన్షన్ల సంఖ్య కేవలం 39 లక్షలు ►జగనన్న ప్రభుత్వంలో పెన్షన్ల సంఖ్య 66.34 లక్షలు ►గత ప్రభుత్వంలో సగటున ఖర్చు చేసిన మొత్తం నెలకు రూ. 400 కోట్లు మాత్రమే ►జగనన్న ప్రభుత్వం పెన్షన్లపై చేస్తున్న ఖర్చు నెలకు రూ. 1,968 కోట్లు, ఇది గత ప్రభుత్వం చేసిన ఖర్చు కంటే దాదాపు ఐదు రెట్లు అధికం ►1 జనవరి, 2024 నుండి 66.34 లక్షల పెన్షన్లపై ఏటా చేయనున్న వ్యయం రూ.23,556 కోట్లు.. జగనన్న ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుండి ఇప్పటి వరకు పెన్షన్ల ద్వారా అందించిన మొత్తం లబ్ధి అక్షరాల రూ. 83,526 కోట్ల పైమాటే. ►గ్రామ/వార్డు వాలంటీర్ల ద్వారా ఠంఛన్‌గా ప్రతీ నెలా ఒకటో తేదీ ప్రొద్దున్నే తలుపు తట్టి, గుడ్ మార్నింగ్ చెప్పి మరీ చిరునవ్వుతో లబ్దిదారుల గడప వద్దనే పెన్షన్లు అందజేత.. అది ఆదివారమైనా, సెలవు రోజైనా సరే.. ►పెన్షన్ పెంపు ద్వారా అవ్వాతాతలు, వితంతువులు, ఒంటరి మహిళలు, చేనేత, కల్లుగీత కార్మికులు, మత్స్యకారులు, చర్మకారులు, ఎయిడ్స్ వ్యాధిగ్రస్తులకు లబ్ధి. ►పెన్షన్లు అందుకోవడంలో ఏమైనా ఇబ్బందులు ఉంటే జగనన్నకు చెబుదాం 1902 టోల్ ఫ్రీ నంబర్. పెన్షన్ పెంపు ఇలా.. జులై 2019 నుంచి పెన్షన్‌ను రూ.2,250లకు పెంపు. జనవరి 2022న రూ.2,500కు పెన్షన్ పెంపు. జనవరి 2023న రూ. 2,750కు పెంపు. జనవరి 2024న రూ.3వేలకు పెంపు. ►పెన్షన్లపై నెలవారీ సగటు వ్యయం రూ.400 కోట్ల నుంచి రూ.1968 కోట్లకు పెంపు. ►2014-19 మధ్య గత ప్రభుత్వంలో నెలకు పెన్షన్లపై సగటున వ్యయం రూ.400కోట్లు. ►జులై 2019 నుంచి నెలకు పెన్షన్లపై సగటు వ్యయం రూ.1384 కోట్లు. ►జనవరి 2022 నుంచి నెలకు పెన్షన్లపై సగటు వ్యయం రూ.1570 కోట్లు. ►జనవరి 2023 నుంచి నెలకు పెన్షన్లపై సగటు వ్యయం రూ.1,776 కోట్లు. ►జనవరి 2024 నుంచి నెలకు పెన్షన్లపై సగటు వ్యయం రూ.1,968 కోట్లు. ►గత ప్రభుత్వం ఎన్నికలకు 2 నెలల ముందు వరకు కేవలం నెలకు రూ.1000 చొప్పున, ఎన్నికలకు 6 నెలల ముందు వరకూ 39 లక్షల మందికి సగటున ఖర్చుచేసిన మొత్తం నెలకు రూ.400 కోట్లు మాత్రమే. అదే జగనన్న ప్రభుత్వంలో ఇస్తున్న పెన్షన్ల సంఖ్య 66.34 లక్షలు. గడిచిన ఐదేళ్లలో 55 నెలల్లో కొత్తగా మంజూరు చేసిన పెన్షన్లు 29,51,760. ►ఇచ్చిన మాట ప్రకారం ఈ ప్రభుత్వం నెలకు రూ.3000 చొప్పున 66.34 లక్షల మందికి నెలకు సగటున చేస్తున్న ఖర్చు రూ.1968 కోట్లు. గడచిన 55 నెలల్లో జగనన్న ప్రభుత్వం పెన్షన్లపై చేసిన ఖర్చు రూ.83,526 కోట్లు. ►పెన్షన్ లబ్ధిదారులు కూడా గత ప్రభుత్వ పాలనలో 39 లక్షలు ఉంటే, ఇప్పుడు 66.34లక్షలకు పెంపు: ►గత ప్రభుత్వంలో 2014-19 మధ్య లబ్ధిదారులు 39 లక్షలు. ►2019లో పెన్షన్ లబ్ధిదారులు రూ.52.17 లక్షలు. ►2022లో పెన్షన్ లబ్ధిదారులు రూ.62 లక్షలు. ►2023లో పెన్షన్ లబ్ధిదారులు రూ.64.45 లక్షలు. ►2024లో పెన్షన్ లబ్ధిదారులు రూ.66.34 లక్షలు. పెన్షన్ల విషయంలో గత ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి తేడాను చూసుకుంటే.. ►గత పాలనలో పింఛన్ కోసం వృద్ధులు, వికలాంగులు చాంతాడంత క్యూలో గంటలతరబడి వేచి ఉండే పరిస్థితి. ఈ ప్రభుత్వం రాష్ట్ర వ్యాప్తంగా 2.6లక్షల గ్రామ, వార్డు వాలంటీర్ల ద్వారా ఠంచన్‌గా ప్రతినెలా కొటో తేదీనే పొద్దుటే తలుపుతట్టి గుండ్ మార్నింగ్ చెప్పిమరీ చిరునవ్వుతో లబ్ధిదారుల గడపవద్దనే పెన్షన్లు అందిస్తున్నారు. సెలవు, పండుగ రోజులు అయినా పెన్షన్లను అందిస్తున్నారు. ►గత ప్రభుత్వ పాలనలో పింఛన్ల మంజూరులో లంచాలు, వివక్ష, వీలైనంతమందికి లబ్ధి ఎలా ఎగ్గొట్టాలా అన్ని కుతంత్రాలు, గ్రామానికి ఇంతమందికే లబ్ధి అనే కోటాలు, కోతలు చేసేవారు. ఎవరైనా చనిపోతేనే కొత్తవారికి అవకాశం వచ్చేది. తమ వర్గం, తమ పార్టీ, తమ వారికే పెన్షన్లు ఇచ్చే ధోరణి ఉండేది. అందులోనూ జన్మభూమి కమిటీలకు లంచాలు ఇస్తేనే వృద్ధులు, వికలాంగులు, అన్న కనికరం కూడా లేకుండా వారికిచ్చే పెన్షన్లలో వాటా కొట్టేసేలా గత పాలన ఉండేది. ►నేడు, కుల, మత వర్గ, పార్టీలకు అతీతంగా లంచాలు, వివక్ష, అశ్రిత పక్షపాతానికి తావులేకుండా అర్హులందరికీ సంతృప్త స్థాయిలో పింఛన్లు మంజూరు చేసేవారు. అర్హులైన ఉండి ఒకవేళ ఏ కారణంచేతైనా లబ్ధి అందని వారికి మరో అవకాశాన్ని ఇస్తూ ప్రతి ఏటా జూన్, డిసెంబర్లలో బైయాన్యువల్ శాంక్షన్ల ద్వారా లబ్ధి అందజేస్తున్నారు. ►పెన్షన్ల మంజూరుకోసం మధ్య దళారీలు, పైరవీకారుల చుట్టూ తిరగాల్సిన అవసరం లేదు. ఎవరికీ లంచాలు ఇవ్వాల్సిన అవసరం లేదు. గ్రామ, వార్డు సచివాలయాల్లో లబ్ధిదారుల జాబితాలు ప్రదర్శించి మరీ, సోషల్ ఆడిట్ ద్వారా పారదర్శకంగా లబ్ధిదారులు ఎంపిక చేస్తున్నారు. అర్జీ పెట్టుకున్న 21రోజుల్లో అర్హులకు పెన్షన్ కార్డుల మంజూరు చేస్తోంది ఈ ప్రభుత్వం. అవ్వాతాతలు, అన్నదమ్ములు, అక్క చెల్లెమ్మలకు చేదోడు వాదోడుగా వాలంటీర్, సచివాలయ సిబ్బంది సేవలు అందిస్తున్నారు. లబ్ధిదారు ఆత్మాభిమానం నిలబడేలా వారికి సేవలు అందిస్తోంది. ►2014-19 మధ్య వృద్ధాప్య, వితంతు, మహిళల పెన్షన్ కేటగిరీలో ఒక్కో లబ్ధిదారుడు పొందిన మొత్తం రూ.58,000 ►ఈ ప్రభుత్వంలో వృద్ధాప్య, వితంతు, ఒంటరి మహిళల పెన్షన్ కేటగిరీలో ఒక్కో లబ్ధిదారునికి అందించిన, అందిస్తున్న మొత్తం రూ.1,47,500. గత ప్రభుత్వంలో కంటే రూ.89,500 అదనం. ►గత ప్రభుత్వంలో వికలాంగుల పెన్షన్ అందుకున్న ఒక్కో లబ్ధిదారుడికీ 5 ఏళ్లలో అందిన లబ్ధి కేవలం రూ.58,500. వికలాంగుల పెన్షన్ అందుకున్న ఒక్కో లబ్ధిదారుడికీ అందించిన, అందిస్తున్న లబ్ధి రూ.1,82,000. గతం కంటే ఇది రూ.1,23,500 అదనం. -
సీఎం జగన్ కాకినాడ పర్యటనకు భారీ ఏర్పాట్లు
-
తునిలో తెలుగు తమ్ముళ్ల బాహాబాహీ
కాకినాడ: టీడీపీలో అంతర్గత కుమ్ములాటలు మరోసారి బయటపడ్డాయి. కాకినాడ జిల్లాలోని తునిలో తెలుగు తమ్ముళ్లు బాహాబాహీకి దిగారు. సాయి వేదిక ఫంక్షన్ హల్లో యనమల సోదరులు న్యూ ఇయర్ వేడుకలు ఏర్పాటు చేశారు. అయితే ఈ వేడుకల్లో యనమల సోదరుల వర్గాలకు చెందిన టీడీపీ కార్యకర్తలు వీరంగం సృష్టించారు. యనమల సోదరుడు కృష్ణుడు వర్గానికి, యనమల అన్న కుమారుడు రాజేష్ వర్గానికి మధ్య పరస్పర దూషణలతో బీభత్సం చేశారు. అయితే ఈ వివాదం ముదరడంతో ఇరువర్గాల టీడీపీ కార్యకర్తలు వేదికపైనే తన్నుకున్నారు. చదవండి: రెచ్చిపోయిన టీడీపీ, జనసేన కార్యకర్తలు.. మంత్రి విడదల రజిని ఆఫీసుపై దాడి -
ఎడతెగని మంత్రాంగంలో పవన్.. ‘తూర్పు’లో ఏం జరుగుతుందో?
సాక్షి, కాకినాడ: కాకినాడలో నిన్నటి నుంచి ఎడతెగని మంత్రాంగంలో మునిగిపోయారు పవన్ కళ్యాణ్. తన వైఫల్యాలను నియోజకవర్గ ఇంఛార్జ్‌లపై నెడుతూ జనసేన నియోజకవర్గ ఇన్ఛార్జ్లపై అసంతృప్తి వెళ్లగక్కారు. కాకినాడ పార్లమెంటు పరిధిలో నియోజకవర్గ ఇన్‌ఛార్జ్‌లతో ముఖాముఖి సమీక్షలో పవన్ మాట్లాడుతూ వార్డు స్థాయి కమిటీలను కూడా ఏర్పాటు చేసుకోలేరా? అంటూ మండిపడ్డారు. పవన్ తీరుపై జనసేన నేతల అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. వచ్చే ఎన్నికలకు త్యాగాలకు సిద్దం కావాలని స్పష్టత ఇచ్చిన పవన్ ముందు కొన్ని నియోజకవర్గాల్లో టీడీపీ సహకరించడం లేదంటూ నేతలు ఆవేదన వ్యక్తం చేశారు. జనసేన నేతల ఫిర్యాదులను కూడా పవన్ పట్టించుకోవడం లేదు. మరోవైపు, ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాలో టీడీపీ, జనసేన పార్టీల మధ్య పొత్తు మాట దేవుడెరుగు.. కనీసం సమన్వయం కూడా కుదరడం లేదు. రెండు పార్టీ నాయకులు పైకి పొత్తులు.. లోపల కత్తులు అన్నట్టుగా వ్యవహరిస్తున్నారు. శ్రేణులు సైతం ధృతరాష్ట్ర కౌగిలి తరహాలోనే వ్యవహరిస్తున్నాయి. సమన్వయం కోసం నిర్వహిస్తున్న సంయుక్త సమావేశాలు రచ్చరచ్చ అవుతున్నాయి. జగ్గంపేట సీటు టీడీపీకి ఇస్తే సహకరించేది లేదని పాఠంశెట్టి సూర్యచంద్ర తేల్చిచెప్పారు. పెద్దాపురం సీటు జనసేనకు ఇవ్వాలని తుమ్ముల బాబు పట్టుబడుతున్నారు. పిఠాపురం నుండి జనసేన పోటీ చేస్తే టీడీపీ నేత వర్మ స్వతంత్ర అభ్యర్ధిగా బరిలోకి దిగే అవకాశం ఉందని తంగెళ్ళ ఉదయ శ్రీనివాస్.. పవన్‌కు చెప్పారు. మిగతా సీట్లు సరే, భీమవరంలో పరిస్థితేంటని ప్రశ్నించిన పవన్ కళ్యాణ్.. భీమవరంలో జనసేన గెలిచే అవకాశాలపై ఆరా తీశారు. తెలుగుదేశం మద్ధతిస్తే జనసేన బయటపడుతుందా అన్న విషయంపై చర్చ జరిగింది. మరో సారి భీమవరం నుంచి అదృష్టం పరీక్షించుకునే యోచనలో ఉన్న పవన్ కళ్యాణ్.. ఈ సారి కూడా ఎమ్మెల్యేగా గెలవకపోతే.. పొలిటికల్ కెరియర్ ప్రమాదంలో పడుతుందన్న ఆందోళనలో ఉన్నారు. ఇదీ చదవండి: అందుకేనట బాబు రహస్య మంతనాలు! -
జనవరి 3న సిఎం జగన్ కాకినాడ పర్యటన
కాకినాడ: ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి వచ్చే నెల 3న జిల్లా కేంద్రం కాకినాడ రానున్నారు. కాకినాడ సిటీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్‌రెడ్డి ఈ విషయం చెప్పారు. వైఎస్సార్ పెన్షన్ కానుకను రూ.3 వేలకు పెంపుదల చేసే కార్యక్రమంతో పాటు వివిధ అభివృద్ధి పనులను ముఖ్యమంత్రి ప్రారంభిస్తారన్నారు. బుధవారం ఆయన కమిషనర్ నాగ నరసింహారావు ఇతర అధికారులతో కలిసి సీఎంతో ప్రారంభించనున్న రాగిరెడ్డి వెంకట జయరాంకుమార్ కళాక్షేత్రాన్ని, స్కేటింగ్ రింక్‌ను సందర్శించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ దశలవారీగా పింఛన్ సొమ్మును పెంచుతామని ఇచ్చిన హామీ మేరకు ప్రస్తుతం ఉన్న రూ.2750 నుంచి రూ.3,000కు పెంచే కార్యక్రమాన్ని కాకినాడలో ప్రారంభిస్తారన్నారు. ముత్తా గోపాలకృష్ణ వారధి ( కొండయ్యపాలెం ఫ్లైఓవర్ ), రూ 20 కోట్లతో నిర్మించిన రాగిరెడ్డి కళాక్షేత్రం, రూ.7 కోట్లతో అంతర్జాతీయ ప్రమాణాలతో నిర్మించిన స్కేటింగ్ రింక్‌ను కూడా సీఎం ప్రారంభిస్తారన్నారు. ఇందుకు సంబంధించిన ఏర్పాట్లను ఆయన అధికారులతో సమీక్షించారు. కార్యక్రమంలో ఆయన వెంట స్మార్ట్ సిటీ ఎస్ఈ ఎం.వెంకటరావు, కనస్ట్రక్షన్స్ మేనేజర్ కామేశ్వర్, ఇతర అధికారులు ఉన్నారు. ఏర్పాట్లపై కలెక్టర్ కృతికా శుక్లా సమీక్ష కాకినాడ సిటీ: ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి జనవరి 3న కాకినాడ పర్యటన ఖరారైన నేపథ్యంలో ఏర్పాట్లు పూర్తి చేయాలని కలెక్టర్ కృతికా శుక్లా అధికారులను ఆదేశించారు. ఈ మేరకు బుధవారం కలెక్టరేట్లో జాయింట్ కలెక్టర్ ఎస్ ఇలక్కియ, రెవెన్యూ, మున్సిపాలిటీ, పబ్లిక్‌హెల్త్, మెప్మా, డీఆర్డీఏ, పౌర సరఫరాలు, రోడ్డు, భవనాలు, విద్యుత్, ప్రజారవాణా, సమాచార పౌర సంబంధాలు, ట్రాన్స్‌పోర్టు తదితర శాఖల అధికారులతో ఆమె సమీక్ష నిర్వహించారు. -
బల్క్ డ్రగ్ పార్కు స్థలం మార్పునకు కేంద్రం ఆమోదం
సాక్షి, అమరావతి: బల్క్ డ్రగ్ పార్కును కాకినాడ నుంచి అనకాపల్లి జిల్లా నక్కపల్లికి మారుస్తూ రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయానికి కేంద్ర ప్రభుత్వం ఆమోదం తెలిపింది. ఈ పార్కును కేంద్రం, రాష్ట్ర ప్రభుత్వ సంయుక్త భాగస్వామ్యంతో 2 వేల ఎకరాల్లో ఏర్పాటు చేస్తున్నారు. ఇక్కడ రూ.2,190 కోట్లతో ఫార్మాస్యూటికల్ పరిశ్రమల ఏర్పాటుకు అవసరమైన మౌలిక సదుపాయాలు కల్పిస్తారు. ఇందు కోసం రూ.1,000 కోట్లను కేంద్ర ప్రభుత్వం మంజూరు చేస్తుంది. రాష్ట్ర ప్రభుత్వం భూమిని సమకూరుస్తోంది. అయితే, ప్రభుత్వ భూమి మాత్రమే ఉండాలని కేంద్రం మార్గదర్శకాల్లో స్పష్టం చేసింది. దీంతో కాకినాడ నుంచి నక్కపల్లి ప్రాంతానికి ఈ పార్కును మార్చారు. నక్కపల్లి వద్ద ఏపీఐఐసీ భూమి అందుబాటులో ఉండటం, అక్కడ ఇప్పటికే ఫార్మా రంగానికి చెందిన పలు పరిశ్రమలు ఉండటంతో రాష్ట్ర మంత్రివర్గం ఇటీవల ఈ నిర్ణయం తీసుకుంది. ఈ నిర్ణయానికి కేంద్ర ప్రభుత్వం ఆమోదం తెలిపిందని, త్వరలోనే టెండర్లను న్యాయ పరిశీలనకు (జ్యుడిíÙయల్ ప్రివ్యూకు) పంపుతామని ఏపీఐఐసీ వీసీ ఎండీ ప్రవీణ్‌కుమార్ తెలిపారు. న్యాయపరిశీలన అనంతరం ఆమోదం రాగానే టెండర్లు పిలుస్తామని చెప్పారు. చైనా నుంచి ఫార్మా దిగుమతులను అరికట్టాలన్న ఉద్దేశంతో దేశంలో మూడు బల్క్ డ్రగ్ పార్కులు ఏర్పాటు చేయాలని కేంద్రం నిర్ణయించింది. తెలంగాణ వంటి 16 రాష్ట్రాలతో పోటీ పడి రాష్ట్ర ప్రభుత్వం ఈ ప్రాజెక్టును దక్కించుకుంది. పూర్తిగా పర్యావరణహితమైన అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో ఈ పార్కును అభివృద్ధి చేస్తారు. దీని ద్వారా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఫార్మా హబ్‌గా తయారవుతుందని, రూ.14,340 కోట్లకు పైగా పెట్టుబడులను ఆకర్షిస్తుందని అంచనా. ఇక్కడ 30,000 మందికి ప్రత్యక్షంగా, 40,000 మందికి పరోక్షంగా ఉపాధి లభిస్తుందని భావిస్తున్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో 200కు పైగా ఫార్మా యూనిట్లు ఉన్నాయి. బల్క్ డ్రగ్ పార్కు ద్వారా అదనంగా 100కు పైగా యూనిట్లు వస్తాయని బల్క్ డ్రగ్ మాన్యుఫాక్చరర్స్ అసోసియేషన్ ప్రతినిధులు అంచనా వేస్తున్నారు. -
నడి సముద్రంలో తప్పిన పెనుముప్పు
కాకినాడ క్రైం: భారీ మత్స్య సంపదతో తీరానికి చేరుతున్నామని పట్టరాని ఆనందంలో ఉన్న 11 మంది మత్స్యకారుల తలరాత క్షణాల్లో మారిపోయింది. ఆనందపు అంచుల నుంచి ఒక్కసారిగా మృత్యు ఒడికి దాదాపుగా జారుకున్నారు. సంద్రపు అలని తలదన్నే ఎత్తులో అగ్నికీలలు ఆకాశాన్ని తాకుతుంటే నివ్వెరపోయారు. ఆ కీలలన్నీ తమ బోటు నుంచేనని తెలిసే లోపే మంటల్లో చిక్కుకున్నారు. తక్షణమే లైఫ్ జాకెట్లు వేసుకుని సముద్రంలోకి దూకేశారు. ఒకొక్కరూ గంటకు పైగా మృత్యువుతో పోరాడారు. చివరికి అటుగా వచ్చిన సహ మత్స్యకారులు, కార్పోరేట్ కార్యకలాపాలు నిర్వహిస్తున్న మరో బోటులోని సిబ్బంది.. వారి ప్రాణాలు కాపాడి తమ బోటులోకి చేర్చుకున్నారు. ఈ ఘటన కాకినాడ జిల్లాలోని ఓడలరేవు తీరం భైరవపాలెం సముద్ర ఉపరితలంలో శుక్రవారం జరిగింది. కాకినాడలోని జగన్నాథపురం, ఏటిమొగకు చెందిన 11 మంది కాకినాడ ఫిషింగ్ హార్బర్ నుంచి ఈ నెల 1న బోటులో చేపల వేటకు వెళ్లారు. ఈ బోటు యజమాని పరం రామకృష్ణ. నారాయణ అనే మత్స్యకారుడు బోటు మాస్టర్. ఈ 11 మంది కాకినాడ తీరం నుంచి సుదూరానికి వెళుతూ...వెళ్లే దారిలో తిరుగు ప్రయాణంలో భైరవపాలెం వద్ద ఒక భారీ వల వేశారు. సముద్ర తీరంలో 135 నాటికల్ మైళ్ల దూరంలో వేటలో ఉండగా గురువారం రాత్రి కోస్ట్‌గార్డ్ బృందం తుఫాను హెచ్చరికలు చేసి తీరానికి వెళ్లిపోవాలని వీరిని అప్రమత్తం చేసింది. వీరు శుక్రవారం తెల్లవారుజామున కాకినాడ తీరానికి బయల్దేరారు. భైరవపాలెంలో వేసిన వల తీసేందుకు వెళ్లి ఆ దారిలో కాకినాడ తీరం వైపుగా వెళ్లాలని అనుకున్నారు. భైరవపాలెంలో వల తీస్తుండగా అప్పటికే వేడెక్కి ఉన్న ఇంజన్ నుంచి ఇంధనం ట్యాంకులకు అనుసంధానం చేసిన పైపుల నుంచి డీజిల్ చిమ్మింది. గొట్టాల పరిసరాలన్నీ ఇంధనంతో తడిసి..ఇంధన ట్యాంక్‌పై చమురు చిమ్మి మంటలు అంటుకున్నాయి. ఈ మంటలు దావనలంలా వ్యాపించాయి. ఓడ పూర్తిగా దగ్ధమై నీట మునిగిపోతున్న చివరి క్రమంలో వీరు సముద్రంలోకి దూకేశారు. సరిగ్గా అటుగా వస్తు్తన్న మత్స్యకార బృంద ఈ11 మందిని చూశారు. రిలయన్స్ సిబ్బందితో కలిసి వారు 11 మందిని రక్షించారు. కోస్ట్‌గార్డ్ సిబ్బంది మత్స్యకారులను ఐసీజీఎస్ చార్లీ–438 ఫిప్ ద్వారా కాకినాడ తీరానికి చేర్చారు. కోస్ట్‌గార్డ్ అసిస్టెంట్ కమాండెంట్ విశ్వాస్ తాపా ఆధ్వర్యంలో 10 మంది కోస్ట్‌గార్డు సిబ్బంది మత్స్యకారుల్ని కాకినాడ తీరానికి చేర్చారు. మొత్తం రూ.70 లక్షలు ఆస్తి నష్టం జరిగింది. ఈ ఘటనపై ఓడలరేవు మెరైన్ పోలీస్‌స్టేషన్‌లో కేసు నమోదు చేశారు. మృత్యుంజయులు వీరే... బొమ్మిడి వీరబాబు, సంగాడి నారాయణ, పెమ్మాడి సత్యం, చెక్కా నాగూర్, పాలెపు నూకరాజు, పినపోతు తాతారావు, ఆదం ధనరాజు, కొప్పిడి సత్యనారాయణ, పంతాడి సతీష్, పినపోతు ధర్మరాజు, దోమ వీరబాబు -
సముద్రంలో వేటకు వెళ్తున్న బోటులో అగ్నిప్రమాదం
-
వైద్యుడి ఆత్మహత్యపై టీడీపీ రాజకీయం
సాక్షి ప్రతినిధి, కాకినాడ: రాష్ట్రంలో ఏ చిన్న సంఘటన జరిగినా దానిని వైఎస్సార్సీపీకి, ప్రభుత్వానికి ముడిపెట్టి రాజకీయం చేయడం విపక్షాలకు అలవాటుగా మారిపోయింది. జరిగిన ఘటన ఏది, దాని వెనుక కారణాలేమిటి అన్న విచక్షణ కూడా లేకుండా విపక్ష నేతలు వ్యవహరిస్తున్నారు. కాకినాడలో ఓ యువ వైద్యుడి ఆత్మహత్యనూ వివాదాస్పదం చేసి, రాజకీయం చేసేందుకు విపక్షాలు విఫలయత్నం చేశారు. ఆయన ఆత్మహత్యకు కాకినాడ రూరల్ ఎమ్మెల్యే కురసాల కన్నబాబు, ఆయన సోదరుడు కల్యాణ్ కారణమంటూ కొందరు సోషల్ మీడియాలో ప్రచారం చేశారు. టీడీపీ నేతలు కూడా రంగంలోకి దిగిపోయి అసత్య ఆరోపణలు చేశారు. అయితే, వైద్యుడి ఆత్మహత్యకు ఆర్థిక కారణాలే కారణమని ఆయన తల్లి చెప్పడంతో విపక్షాల వ్యూహం బెడిసికొట్టింది. జరిగిందిదీ.. కాకినాడ అశోక్ నగర్‌కు చెందిన డాక్టర్ నున్న శ్రీకిరణ్ రష్యాలో వైద్య విద్య చదివాడు. కాకినాడలో ఉంటున్నాడు. శనివారం రాత్రి ఆయన తన ఇంట్లోనే పురుగుల మందు తాగాడు. వెంటనే ఆయన్ని కాకినాడ జీజీహెచ్‌కు తరలించగా చికిత్స పొందుతూ ఆదివారం మృతి చెందాడు. వైఎస్సార్సీపీకి చెందిన కురసాల కన్నబాబు, కల్యాణ్‌తో భూవివాదం కారణంగానే వైద్యుడు శ్రీకిరణ్ ఆత్మహత్య చేసుకున్నాడని కొందరు సోషల్ మీడియాలో ప్రచారం చేశారు. ఆ వెంటనే టీడీపీ జాతీయ కార్యదర్శి నారా లోకేశ్ కూడా ప్రభుత్వంపై బురదజల్లే ప్రయత్నం చేశారు. వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో భూ దందాలు, హత్యలు పెరిగిపోయాయంటూ వెనుకాముందూ చూసుకోకుండా ట్వీట్ కూడా చేశారు. కుమారుడి ఆత్మహత్యతో విషాదంలో ఉన్న అతడి తల్లి శేషారత్నాన్ని అడ్డం పెట్టుకుని వైఎస్సార్సీపీ ప్రభుత్వంపై బురదజల్లి రాజకీయంగా లబ్ధి పొందేందుకు టీడీపీ, జనసేన నాయకులు కాకినాడ జీజీహెచ్‌కు వెళ్లి కొద్దిసేపు హంగామా చేశారు. ఈ ఉదంతాన్ని వివాదాస్పదం చేయాలని ప్రయత్నించారు. రాజకీయానికి వాడుకోవద్దు: తల్లి శేషారత్నం అయితే అసలు వాస్తవాన్ని మృతుడి తల్లి శేషారత్నం ఆదివారం మీడియాకు వెల్లడించారు. ‘మా బాబు నిన్న సాయంత్రం పురుగుల మందు తాగి ఆదివారం తెల్లవారుజామున చనిపోయాడు. అక్కడ పోలీసులు స్టేట్మెంట్ తీసుకునేటప్పుడు ఎవ్వరికీ ఏదీ సంబంధం లేదనే విషయాన్ని చెప్పాను. కన్నబాబుకు, కల్యాణ్‌కు నా కుమారుడి ఆత్మహత్యలో ప్రమేయం లేదు. బాబు చనిపోవడంతో పొలం మేటర్‌లో ఏదో గొడవ ఉండి ఉంటుందని వాళ్లు వీళ్లు అనడంతో డిప్రెషన్లో మాట్లాడాను. పొలం విషయంలో డిప్రెస్ అయ్యి, ఆర్థిక కారణాలతో సెన్సిటివ్‌గా ఉన్నాడు. అందువల్లే పురుగు మందు తాగాడు. మధ్యలో కొందరు రాజకీయంగా వాడుకుంటున్నట్టు కనిపిస్తోంది. దయచేసి ఈ సంఘటనను రాజకీయానికి వాడుకోవద్దు’ అని శేషారత్నం వేడుకొన్నారు. -
తునిలో జనహోరు
సాక్షి ప్రతినిధి, కాకినాడ: ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అండతో సాధికారత సాధించిన బడుగు, బలహీన వర్గాల ప్రజలు శనివారం కాకినాడ జిల్లా తునిలో విజయయాత్ర చేశారు. నియోజకవర్గం నలుమూలల నుంచి భారీ సంఖ్యలో తరలివచ్చిన ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాలు సామాజిక సాధికార బస్సు యాత్ర నిర్వహించాయి. పరిసర ప్రాంత గ్రామాలన్నీ తుని బాటపట్టాయి. కొట్టాం సెంటర్ వద్ద ప్రారంభమైన యాత్రకు దారిపొడవునా ప్రజలు బ్రహ్మరథం పట్టారు. మహిళల బైక్ ర్యాలీ ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ఆర్టీసీ కాంప్లెక్స్, శ్రీనివాససెంటర్, రైల్వే ఓవర్ బ్రిడ్జి, సినిమా రోడ్డు, శాంతినగర్ మీదుగా రాజా కళాశాల మైదానం వరకు భారీ ర్యాలీ జరిగింది. అనంతరం తుని ఎమ్మెల్యే, మంత్రి దాడిశెట్టి రాజా ఆధ్వర్యంలో రాజా కళాశాల మైదానంలో జరిగిన బహిరంగ సభలో వేలాదిగా ప్రజలు తరలి వచ్చారు. రాష్ట్రంలోని ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు సీఎం వైఎస్ జగన్ చేస్తున్న మేలు, సాధికారతకు చేస్తున్న కృషిని నేతలు వివరించారు. సభ ఆద్యంతం ‘జగనే రావాలి – జగనే కావాలి’ అంటూ ప్రజలు నినాదాలు చేశారు. సీఎం జగన్‌తోనే అణగారిన వర్గాల బతుకుల్లో మార్పు : మంత్రి ధర్మాన సీఎం వైఎస్ జగన్‌తోనే రాష్ట్రంలో అణగారిన వర్గాల బతుకుల్లో మార్పు వచ్చిందని రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి ధర్మాన ప్రసాదరావు చెప్పారు. దశాబ్దాలుగా నిస్పృహలో కొట్టుమిట్టాడుతున్న బడుగు, బలహీనవర్గాలకు సీఎం జగన్ అండగా నిలిచి, సాధికారత దిశగా నడిపించారని తెలిపారు. ఎవరికీ తలవంచకుండా, ఎవరికీ పైసా లంచం ఇవ్వాల్సిన అవసరం లేకుండా అన్ని సంక్షేమ పథకాలు అందరికీ అందించిన ఘనత సీఎం జగన్‌కే దక్కుతుందన్నారు. సంస్కరణలకు నాంది పలికిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మరో 30 ఏళ్ళు సీఎంగా కొనసాగాలని ఆకాంక్షించారు. అంతరాలను తగ్గించడానికి సాహసోపేతమైన నిర్ణయాలు తీసుకున్న దమ్మున్న ముఖ్యమంత్రి జగన్ అని చెప్పారు. చంద్రబాబును రాజకీయాలకు దూరం చేద్దాం: మంత్రి అప్పలరాజు గతంలో ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనార్టీ వర్గాలను గతంలో ఏ ప్రభుత్వం గుర్తించలేదని మంత్రి సీదిరి అప్పలరాజు అన్నారు. ఈ వర్గాలను అక్కున చేర్చుకొని, అభివృద్ధి పథంలో నడిపిస్తున్న ఏకైక సీఎం వైఎస్ జగన్ అని చెప్పారు. బీసీలు, ఎస్సీలు, ఎస్టీలు, మైనార్టీలను నీచంగా చూసి, హేళనగా మాట్లాడిన చంద్రబాబుకి మరోమారు గుణపాఠం చెప్పాలన్నారు. చంద్రబాబును శాశ్వతంగా రాజకీయాలకు దూరం చేయాలని పిలుపునిచ్చారు. సామాజిక విప్లవకారుల ఆశయాలను నిజం చేసిన జగన్: మంత్రి నాగార్జున మంత్రి మేరుగు నాగార్జున మాట్లాడుతూ అంబేడ్కర్, పూలే వంటి సామాజిక విప్లవకారుల ఆశయాలను నిజం చేసిన సీఎం దేశంలో జగన్ ఒక్కరేనని తెలిపారు. పేదలైన ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీల జీవన ప్రమాణాలను సీఎం జగన్ మెరుగు పరుస్తున్నారని చెప్పారు. రాష్ట్రంలో సంక్షేమం అందని ఇల్లు లేదంటే అది సీఎం జగన్ సుపరిపాలనే అని తెలిపారు. వంచనకు గురైన వర్గాలకు సీఎం జగన్ న్యాయం చేశారు: మంత్రి వేణుగోపాలకృష్ణ బీసీ సంక్షేమ శాఖ మంత్రి చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ మాట్లాడుతూ.. గత పాలనలో వంచనకు గురైన సామాజిక వర్గాలకు సీఎం జగన్ న్యాయం చేశారన్నారు. సామాజిక సాధికారత అంటే ఏమిటో దేశానికి చూపించారని తెలిపారు. బీసీల్లో మార్పు కోసం సీఎం జగన్ కుల గణన చేపడుతున్నారన్నారు. మోసం, అబద్దం, కుట్ర, కుతంత్రం అంటే చంద్రబాబేనన్నారు. ఆత్మగౌరవాన్ని నిలబెట్టిన సీఎం జగన్: మంత్రి అనిల్‌కుమార్ అన్ని పదవుల్లో అధిక శాతం ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకే ఇచ్చి, ఈ వర్గాల ఆత్మగౌరవాన్ని నిలబెట్టిన సీఎం జగన్ మాత్రమేనని ఎమ్మెల్యే అనిల్‌కుమార్ యాదవ్ చెప్పారు. సీఎం జగన్‌ను మనమంతా గుండెల్లో పెట్టుకోవాలన్నారు. జగన్ అందిస్తున్న సంక్షేమ పథకాలను విమర్శించిన చంద్రబాబు, పవన్ ఇప్పుడు అంతకు ఐదు రెట్లు పథకాలు అమలు చేస్తామని చెబుతున్నారని, మరోసారి మోసం చేసేందుకే ఈ రకమైన హామీలిస్తున్న ఆ ఇద్దరినీ ఎప్పటికీ నమ్మొద్దని చెప్పారు. ఎంపీ వంగా గీత, వైఎస్సార్సీపీ కాకినాడ జిల్లా అధ్యక్షుడు, ఎమ్మెల్యే కురసాల కన్నబాబు, ఎమ్మెల్యే పర్వత పూర్ణచంద్రప్రసాద్, ఎమ్మెల్సీ కర్రి పద్మశ్రీ, తదితరులు పాల్గొన్నారు. కాకినాడ జిల్లా తుని సామాజిక సాధికార సభలో మాట్లాడుతున్న మంత్రి సీదిరి, సభకు పోటెత్తిన అశేష జన సందోహంలో ఓ భాగం -
సామాజిక న్యాయానికి ఛాంపియన్ జగనన్న
సాక్షి, కాకినాడ: బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలు సాధించిన సామాజిక సాధికారత ప్రత్తిపాడు నియోజకవర్గంలో ప్రజ్వరిల్లింది. సామాజిక సాధికార బస్సు యాత్రలో వేలాది మంది జనం కదలివచ్చారు. మహిళలు, యువత పెద్ద సంఖ్యలో వచ్చి జై జగన్ నినాదాలతో హోరెత్తించారు. జగనన్న అందించిన చేయూతతో తాము సాధించిన సాధికారతను బహిరంగ సభలో బడుగు వర్గాలకు చెందిన నేతలు తెలియచేస్తుంటే ప్రజలు హర్షధ్వానాలు పలికారు. ఈ కార్యక్రమంలో మంత్రులు పినిపె విశ్వరూప్, మేరుగ నాగార్జున, ఎంపీలు వంగా గీత, నందిగం సురేష్, ఎమ్మెల్యేలు కొలుసు పార్థసారథి, కురసాల కన్నబాబు, పర్వత పూర్ణచంద్ర ప్రసాద్, పెండెం దొరబాబు, ఎమ్మెల్సీలు వరుదు కల్యాణి, కర్రి పద్మశ్రీ తదితరులు పాల్గొన్నారు. మంత్రి పినిపె విశ్వరూప్ మాట్లాడుతూ..... – 14 సంవత్సరాల చంద్రబాబు పాలనకు, నాలుగున్నరేళ్ల జగనన్న పాలనకు తేడా గమనించాలి. – ప్రతి అవ్వాతాత రూ.2,750 పింఛను తీసుకుంటున్నారు. వికలాంగులు రూ.3,500 అందుకుంటున్నారు. దానికి ప్రధాన కారణం గతంలో వైయస్సార్, నేడు జగనన్న. – చంద్రబాబు సీఎంగా పని చేసినప్పుడు 70 రూపాయలున్న పింఛన్ కనీసం 10 రూపాయలైనా పెంచాడా? – చంద్రబాబు 30 లక్షల మందికి వెయ్యి రూపాయల పింఛన్ ఇస్తే, ఈరోజు రూ.2,750 చొప్పున 64 లక్షల మందికి ఇస్తున్న జగనన్న. – ఫీజు రీయింబర్స్మెంట్ అంటే గుర్తుకొచ్చేది వైయస్సార్. – ఫీజు రీయింబర్స్‌మెంట్‌కు తూట్లు పొడిచిన చంద్రబాబు. 30 శాతం స్లాబ్ విధించి 70 శాతం తల్లిదండ్రులు కట్టుకోవాలని విద్యార్థులను గాలికొదిలేశాడు. – మళ్లీ జగనన్న రాగానే వైయస్సార్ హయాంలో మాదిరిగా పూర్తి ఫీజు ఇస్తున్నారు. – జగనన్న అధికారంలోకి వచ్చిన ఆర్నెల్లకే సచివాలయ వ్యవస్థ ద్వారా 1.40 లక్షల ప్రభుత్వ ఉద్యోగాలిచ్చారు. దేశానికే దిక్సూచిగా నిలిచిన జగనన్న. – రాజశేఖరరెడ్డి సంక్షేమంలో రెండడుగులు వేస్తే, జగనన్న నాలుగు అడుగులు ముందుకు వేస్తున్నారు. – రాజ్యసభకు ఎస్సీలు, ఎస్టీలు, బీసీలను 14 సంవత్సరాల్లో ఒక్కరినీ పంపని బాబు. – నలుగురు బీసీలను రాజ్యసభకు పంపిన జగన్మోహన్రెడ్డి. సామాజిక న్యాయానికి ఛాంపియన్ జగనన్న. – ఐదుగురు ఎస్సీలకు మంత్రి పదవులిచ్చిన జగనన్న. బాబు కేవలం ముగ్గురికే ఇచ్చి ఏడాదికోసారి మార్చేశారు. నలుగురు ఎస్సీ మంత్రుల్నీ కొనసాగిస్తున్న సీఎం జగన్. – ఎస్టీలు లేని మంత్రివర్గం చంద్రబాబుది, ఎస్టీని ఉపముఖ్యమంత్రి చేసిన జగన్. – మైనార్టీలకు మంత్రి పదవి ఇవ్వని చంద్రబాబు. మైనార్టీ వర్గానికి డిప్యూటీ సీఎం ఇచ్చిన జగనన్న. మంత్రి మేరుగ నాగార్జున మాట్లాడుతూ.... – అంబేద్కర్ దగ్గర నుంచి జ్యోతిరావు పూలే, సాహూ మహరాజ్, పెరియార్ రామస్వామి నాయకర్, జగ్జీవన్‌రామ్ లాంటి వారు సామాజిక సాధికారత కోసం విప్లవాలు చేశారు. – ఏపీలోగానీ, భారతదేశంలోగానీ ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ కులాలు వారి స్థితిగతుల కోసం ఆలోచించిన నాయకులు కరువయ్యారు. – ఏపీలో జగనన్న సీఎం అయిన తర్వాత ఎస్సీలు, ఎస్టీలు, బీసీలు, మైనార్టీలకు భరోసా, ధైర్యం వచ్చాయి. సమాజంలో అసమానతలు తొలిగాయి. – రాజ్యాధికారం వచ్చేలా రాజ్యాంగబద్ధంగా రావాల్సిన హక్కులు, డబ్బులు అందించి గుండెమీద చెయ్యి వేసుకొని పేదవారు బతకడానికి అవకాశాలు వచ్చాయి. – మన పిల్లలు ఇంగ్లీషు మీడియం, సీబీఎస్ఈ చదువుతున్నారు. – 31 లక్షల పట్టాలిస్తే ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనార్టీలకు అందుతున్నాయి. – రూ.2.40 లక్షల కోట్లు డైరెక్ట్‌గా పేదవారికి అందిస్తే అగ్రతాంబూలం ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకే దక్కింది. – ఎస్సీలుగా పుట్టాలని ఎవరైనా కోరుకుంటారా అన్నాడు చంద్రబాబు. బీసీ కులాల తోకలు కత్తిరిస్తాన్నాడు. బీసీలు జడ్జిలుగా పనికిరారన్నాడు. – మైనార్టీలకు మంత్రి పదవి ఇవ్వని బాబు. ఎస్టీ కమిషన్ ఇవ్వలేదు. దళితులపై దాడులు, అఘాయిత్యాలు చేయించాడు. – 2014లో మూడు పార్టీలు వచ్చాయి. 648 వాగ్దానాలిచ్చాయి. ఒక్కటీ నెరవేర్చలేదు. – చంద్రబాబు రైతు రుణమాఫీ, డ్వాక్రా రుణమాఫీ చేయలేదు. – పేదల కోసం, భావితరలాల భవిష్యత్ కోసం ఆలోచించే ముఖ్యమంత్రి జగనన్న. – 11.5 శాతం ఉండే పేదరికం 6 శాతానికి తగ్గిందంటే జగనన్న పేదల కోసం ఎంతగా పని చేస్తున్నారో అర్థమవుతోంది. – ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు జగనన్న సీఎం కావడం అవసరం. 2024 ఎన్నికల్లో మనం తప్పు చేస్తే మన గొయ్యి మనమే తవ్వుకుంటాం. ఎంపీ నందిగం సురేష్, మాట్లాడుతూ.... – జగనన్న తన పాదయాత్రలో మన కష్టాలు దగ్గర నుంచి చూశాడు. – నాలుగున్నరేళ్లలో జగనన్న ఇచ్చిన హామీలన్నీ నెరవేర్చారు. – జగనన్నకు పేదవాడి గుండె తెలుసు. వ్యవసాయ కూలీల చమటవాసన తెలుసు. – మన జీవితాల్లో చీకటి నింపిన వ్యక్తి చంద్రబాబు. రెండెకరాల నుంచి ఆరు లక్షల కోట్లు దోచుకున్నాడు. ఆ సంపద మనదే. – నాడు–నేడు కింద స్కూళ్లు గొప్పగా ఉన్నాయంటే, అవ్వాతాతలు పింఛన్ తీసుకుంటున్నారంటే, వ్యవసాయ రైతులు బాగున్నారంటే జగనన్న కారణం. – వాలంటీర్ వ్యవస్థ వచ్చిన తర్వాత మన ఇంటికి వచ్చి సమస్యలున్నాయా అని అడుగుతున్నారు. దేశం మొత్తం మీద ఎక్కడా ఇలాంటి వ్యవస్థ లేదు. – మన జీవితాలకు వెలుగునిచ్చే వ్యక్తి జగనన్న. 20–25 ఏళ్లు సీఎంగా ఉంచుకోగలిగితే మన పిల్లలు ఐఏఎస్‌లు, ఐపీఎస్‌లుగా అవుతారు. – చంద్రబాబు పేరు చెబితే ఏ పథకమూ గుర్తుకురాదు. వెన్నుపోటు ఒక్కటే గుర్తుకొస్తుంది. – 2014లో మద్దతు పలికి 2019లో బాబును తిట్టిన పవన్ 2024లో మళ్లీ బాబు మంచోడంటున్నాడు. – పేదవాళ్లు గొప్పవాళ్లు అవ్వాలని అసైన్డ్ భూములకు పట్టాలిచ్చిన జగనన్న. – అమరావతిలో అసైన్డ్ భూములు దోచుకుతిన్న చంద్రబాబు. – ఎస్సీలు, ఎస్టీలు, బీసీలు, మైనార్టీలకు నేనున్నానంటూ జగనన్న భరోసా ఇస్తున్నారు. – సామాన్యుడు పార్లమెంటులో కూర్చున్నాడంటే కారణం జగనన్న. ఎమ్మెల్యే కొలుసు పార్థసారధి మాట్లాడుతూ.... – 70 శాతం ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ మంత్రులు కేబినెట్లో ఉన్నారు. – నామినేటెడ్ పదవుల్లో 50 శాతం రిజర్వేషన్ ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు ఇచ్చిన జగనన్న. – డైరెక్టర్ పదవులు వెతికి వెతికి బీసీలకు, ఎస్సీలకు ఇచ్చారు. అలాంటి ఆలోచన చేసే ప్రభుత్వం ఎక్కడైనా ఉందా. – నాలుగేళ్లలో రూ.7 లక్షల కోట్లు రాష్ట్రానికి బడ్జెట్ ఉంటే రూ.4.15 లక్షల కోట్లు ఈ వర్గాలకే ఇచ్చారు. – లాంతరు పెట్టి వెతికినా గతంలో బడుగు వర్గాల్లో ఇంజనీరు, డాక్టరు కనిపించేవారు కాదు. ఈరోజు ప్రతి ఇంట్లో ఇంజనీరు,డాక్టర్ ఉన్నారంటే కారణం వైయస్సార్. – ఫీజు రీయింబర్స్మెంట్ తెచ్చి చదువుకొనే అవకాశం కల్పించారు. – ఇంటి స్థలాలు ఇస్తుంటే ప్రతిపక్షాలు ఎద్దేవా చేశారు. రాజధానిలో సోషల్ డెమోగ్రఫీ చెడిపోతుందన్నారు. – 30 లక్షల పట్టాలిచ్చి ఇళ్లు కట్టించేందుకు లక్షలాది రూపాయలు వెచ్చిస్తున్న జగనన్న. – మహిళలంటే పొలాల్లో కోతలకే, వంటింటికే పరిమితమయ్యేవారు. ఇప్పుడు ప్రతి పథకాన్నీ మహిళ పేరు మీద పట్టా, విద్యాదీవెన, వసతి దీవెన సొమ్ము తల్లి పేరుమీద ఖాతాలో వేస్తున్నారు. – గతంలో పార్టీ, కులం చూసేవారు. మనకు ఓటు వేస్తారా అని చూసేవారు. మన కులాలను బానిసలుగా భావించేవారు. – ఈరోజు ఎవరి దగ్గరకూ వెళ్లాల్సిన పని లేదు. అర్హతే ఆధారంగా సంక్షేమ పథకాలు ఇస్తున్నారు. ఎమ్మెల్యే కన్నబాబు మాట్లాడుతూ... – జనం గుండెచప్పుడు జగనన్న. కులాలకు, మతాలకు అతీతంగా ప్రతి పేద కుటుంబం గుండెల్లో జగనన్న ఉన్నారు. – వెనుకబడిన కులాలకు ఆత్మగౌరవాన్ని ఇచ్చిన జగనన్న. – దేశం మొత్తం ఆయనవైపు తిరిగి చూస్తోంది. రోల్‌మోడల్‌గా సామాజిక న్యాయాన్ని, సంస్కరణలను అమలు చేస్తున్నారు. – 2014–19 మధ్య ఏ విధమైన సామాజిక న్యాయం చంద్రబాబు చేశారు? ఈరోజు ఏ విధమైన సామాజిక న్యాయం జరుగుతోందో చర్చకు సిద్ధం. – రూ.2.40 లక్షల కోట్లు ప్రజల అకౌంట్లలో వేసి సామాజిక న్యాయానికి, సంక్షేమానికి బ్రాండ్ అంబాసిడర్‌గా జగనన్న ఉన్నారు. – ఏ ఎన్నికల్లో, ఏ పార్టీ మేనిఫెస్టోలో చూసినా జగనన్న పథకాలు కనిపిస్తాయి. – వాలంటీర్ వ్యవస్థ, సచివాలయ వ్యవస్థ, పెన్షన్ల విధానం ఇస్తామని రాష్ట్రాలు చెబుతున్నాయి. – బాబుకే గ్యారెంటీ లేదు. ఆయన ఇంకేం గ్యారెంటీ ఇస్తాడు. బాబు గ్యారెంటీల్లోనూ జగనన్న స్పూర్తి ఉంది. -
కాకినాడ తీరంలో తిరగబడ్డ తెప్ప.. ఇద్దరు మత్స్యకారుల మృతి
సాక్షి, కాకినాడ: కాకినాడ తీరంలో తెప్ప తిరగబడటంతో ఇద్దరు మత్స్యకారులు సముద్రంలో గల్లంతై మృతిచెందారు. సోమవారం రాత్రి సూర్యారావుపేట నుంచి హోప్ ఐల్యాండ్ వరకు అయిదుగురు మత్స్యకారులు వేటకు వెళ్లారు. వేటక ముగించుకొని తిరిగి వస్తుండగా కెరటాల ధాటికి తెప్ప తిరగడింది. ఈ ఘటనలో ముగ్గురు సురక్షితంగా బయటపడ్డారు. బాధితులు దుమ్మలపేటకు చెందిన మైలపల్లి కృపాదాస్, సూర్యరావుపేటకు చెందిన సత్తిరాజుగా గుర్తించారు. మృతుల కుటుంబాలకు ఏపీ ప్రభుత్వం రూ. 10 లక్షల చొప్పున పరిహారం ప్రకటించింది. తెప్ప తిరగబడి సముద్రంలో పడటంతో ఇద్దరు మత్స్యకారులు మృతి చెందిన విషయాన్ని కాకినాడ ఎమ్మెల్యే కురసాల కన్నబాబు.. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ దృష్టికి తీసుకెళ్లారు. మత్స్యకారుల మృతి విషయాన్ని తెలుసుకున్న సీఎం చలించిపోయి వెంటనే ఒక్కొక్కరికి తక్షణ సాయంగా రూ.5 లక్షల చొప్పున మొత్తం రూ.10 లక్షలు నష్టపరిహారం మంజూరు చేయాలని ఎమ్మెల్యేకు సూచించారు. -
ఒక బైక్‌పై ఓవర్‌స్పీడ్‌లో నలుగురు.. ముగ్గురి మృతి
సాక్షి, క్రైమ్: కాకినాడ జిల్లాలో నిర్లక్ష్యం ముగ్గురి జీవితాల్ని బలి తీసుకుంది. ఒకే బైక్‌పై నలుగురు యువకులు అతివేగంతో వెళ్లి ఓ ట్రాక్టర్‌ను ఢీ కొట్టారు. ఈ ప్రమాదంలో ముగ్గురు అక్కడికక్కడే మృతి చెందగా.. నాలుగో వ్యక్తి ప్రాణాపాయ స్థితిలో కొట్టుమిట్టాడుతున్నాడు. తాళ్లరేవు మండలం లచ్చిపాలెం బైపాస్ సెంటర్ వద్ద సోమవారం ఈ ప్రమాదం జరిగింది. ముగ్గురు స్పాట్లోనే చనిపోగా.. తీవ్రంగా గాయపడిన మరో వ్యక్తిని ఆస్పత్రిలో చేర్చారు. అతని పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు చెబుతున్నారు. వీళ్లంతా రత్తవారిపేట చెందిన పెయింటర్లుగా పోలీసులు గుర్తించారు. -
విద్యార్థులతో కబడ్డీ ఆడుతున్న మంత్రి ఆర్కే రోజా
-
స్టూడెంట్స్ తో మంత్రి రోజా అదిరిపోయే కామెడీ
-
టీడీపీ కుల అహంకారంపై మండిపడిన YSRCP బీసీ నేతలు
-
‘చంద్రబాబుకు దృష్టిలోపం.. అందుకే పేదల వైపు చూడలేకపోయాడు’
సాక్షి, కాకినాడ: చంద్రబాబు అవినీతి కేంద్ర సంస్థలే బయటపెట్టాయని మాజీ మంత్రి, వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే కురసాల కన్నబాబు మండిపడ్డారు. స్కీంల పేరుతో చంద్రబాబు అంతా దోచేశారని, ఆయన్ను కక్షపూరితంగా అరెస్ట్ చేయలేదని చెప్పారు. పక్కా ఆధారాలతోనే చంద్రబాబు జైలుకు వెళ్లారని పేర్కొన్నారు. బాబు మాటలు ప్రజలు నమ్మే స్థితిలో లేరని తెలిపారు. ‘ఏపీ శ్రీలకంలా మారుతుందంటూ చంద్రబాబు తప్పుడు ప్రచారం చేశారు. చెప్పాడంటే చేస్తాడంతే అనే నమ్మకాన్ని సీఎం జగన్ నిలబెట్టుకున్నారు. రాష్ట్రంలో అన్ని వర్గాలను సిఎం జగన్ కలుపుకుని వెళ్ళున్నారు. గురువారం నుంచి ‘ఆంధ్రప్రదేశ్‌కు జగన్ ఎందుకు కావాలి’ ప్రారంభం అవుతుంది. చంద్రబాబు కోసం అబద్దాలు చెప్పి ఎల్లో మీడియా ప్రజల్ని భమల్లోకి తీసుకువెళ్లాయి. ఆ భ్రమల్లో నుంచి ప్రజలు బయటకు వచ్చారు. జగనే ఎందుకు కావాలి అని చెప్పకపోతే.. అబద్దాల చంద్రబాబు నిజం అని ప్రజలు నమ్ముతారు. చంద్రబాబును అరెస్ట్ చేస్తే భూకంపం వస్తుందని టీడీపీ బిల్డప్ ఇచ్చింది. బాబు అరెస్ట్ అయితే చిన్న ప్రకంపనం కూడా రాలేదే. చంద్రబాబుకే గ్యారంటీ లేదు, వచ్చి వాయన ఎవరికి గ్యారంటీ ఇస్తారు. గవర్నర్‌కు కూడా అబద్దాలు చెబుతున్నారు. ఈఎస్ఐ స్కామ్‌లో వందల కోట్లు లాగేసినా అరెస్ట్ చేయ్యకుడదా?. తాగుబోతులకు మంచి బ్రాండ్లు దొరకడం లేదని టీడీపీ భాధపడుతుంది. చేసేదంతా చేసి.. ఆ బురదను టీడీపీ ఎదుట వాళ్ళ మీద చల్లుతుంది. చంద్రబాబుకు ఎప్పుడూ దృష్టి లోపం ఉంది. అందుకే పేదల పక్షం వైపు చూడలేకపోయాడు. తన మ్యానిపెస్టోను చదువుకోలేకపోయాడు. బాబుకు, వైఎస్ జగన్‌కు నక్కకి నాగలోకానికి ఉన్నంత తేడా ఉంది. ఒక బలవంతుడు, ధైర్యవంతుడిని ఢీ కొట్టాలంటే పదిమంది కలిసి వస్తారు. సీఎం జగన్ వచ్చే ఎన్నికలకు ఒంటరిగా దైర్యంగా వెళ్తున్నారు. చంద్రబాబు ఏనాడైన జర్నలిస్టులకు సెంటు స్ధలం ఇచ్చాడా?. చంద్రబాబు పత్రికా యాజమాన్యాలను చూస్తాడు.. కలం కార్మికులను గుర్తించి మూడు సెంట్లు స్ధలాలు ఇవ్వాలని సీఎం జగన్ నిర్ణయం తీసుకున్నారు. యాజమాన్యాల వైపు చంద్రబాబు ఉంటే.. జర్నలిస్టుల వైపు జగన్ ఉన్నారు’ అని కురసాల కన్నబాబు పేర్కొన్నారు. -
ఈ సంక్షేమం ఆగకూడదు
సాక్షి ప్రతినిధి, కాకినాడ: వైఎస్ జగన్మోహన్రెడ్డి ముఖ్యమంత్రి అయిన తరువాతే రాష్ట్రంలో అన్ని వర్గాలకు సంక్షేమం అందుతోందని, అట్టడుగు వర్గాల సామాజిక సాధికారత సాధ్యమైందని ఉప ముఖ్యమంత్రి బూడి ముత్యాలనాయుడు చెప్పారు. ఈ సంక్షేమం కొనసాగాలంటే మళ్లీ ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్‌ను ఎన్నుకోవాలని తెలిపారు. కాకినాడ రూరల్ సర్పవరం జంక్షన్లో సోమవారం సాయంత్రం ఎమ్మెల్యే కురసాల కన్నబాబు అధ్యక్షతన జరిగిన సామాజిక సాధికార సభలో ఆయన ప్రసంగించారు. వైఎస్ జగన్ సీఎం అయిన తర్వాతే ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీల ఆత్మగౌరవంతో బతకగలుగుతున్నారని మంత్రి తెలిపారు. వయో పరిమితిని 65 నుంచి 60 సంవత్సరాలకు తగ్గించి, అవ్వాతాతలకు పెన్షన్ ఇస్తున్న మనసున్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్ అని చెప్పారు. అక్కచెల్లెమ్మలకు ఏటా రూ.18,760 ఇస్తానని చెప్పి, ఇప్పటికే మూడు విడతలు అందించారని, జనవరిలో నాలుగో విడత కూడా ఇవ్వనున్నారని తెలిపారు. 2014 ఎన్నికలకు ముందు రుణ మాఫీ చేస్తానని చంద్రబాబు రైతులను, డ్వాక్రా అక్కచెల్లెమ్మలను మోసం చేశారన్నారు. అదే అక్కచెల్లెమ్మలకు 2019 ఏప్రిల్ వరకూ ఉన్న బకాయిలు చెల్లిస్తామన్న జగన్ దానిని అమలు చేసి చూపించారన్నారు. రైతులకు అన్ని విధాలుగా అండదండలు అందిస్తున్నారని తెలిపారు. రాష్ట్రంలోని ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు తొలిసారిగా గౌరవాన్ని కల్పించిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్ అని హోం మంత్రి తానేటి వనిత చెప్పారు. జగన్ సీఎం అయ్యాక బీసీ ఉప కులాలన్నింటినీ గుర్తించి, 57 కార్పొరేషన్లకు తొలిసారి చైర్మన్లను నియమించి, వారికి సరైన గుర్తింపు, గౌరవం కల్పించారని తెలిపారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాల వారికి ఉప ముఖ్యమంత్రి పదవులు, మంత్రి వర్గంలో, ఇతర నామినేటెడ్ పదవులన్నింటిలో పెద్ద పీట వేసిన సీఎం వైఎస్ జగన్ మాత్రమేనని రవాణా శాఖ మంత్రి పినిపే విశ్వరూప్ చెప్పారు. ఇన్నాళ్లూ మాటలకే పరిమితమైన సామాజిక సాధికారతను సీఎం జగన్ చేతల్లో చూపించారని అన్నారు. చంద్రబాబు మంత్రివర్గంలో ఎస్సీ, మైనార్టీలకు స్థానమే కల్పించలేదన్నారు. ఏ కార్యక్రమం చేపట్టినా చంద్రబాబుకు ఆయన కులమే కనిపిస్తుందని, సీఎం జగన్‌కు బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలు కనిపిస్తారని బీసీ సంక్షేమ శాఖ మంత్రి చెల్లుబోయిన శ్రీనివాస వేణుగోపాలకృష్ణ తెలిపారు. సీఎం జగన్ ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలను అభివృద్ధి దిశగా నడిపిస్తున్నారని అన్నారు. సీఎం వైఎస్ జగన్‌కు బడుగు, బలహీన వర్గాలే ప్రాధాన్యత అని రాజ్యసభ సభ్యుడు మోపిదేవి వెంకట రమణారావు చెప్పారు. రాజ్యసభకు తొమ్మిది మందికి అవకాశం వస్తే అందులో మత్స్యకార వర్గం నుంచి తనకు, శెట్టిబలిజల నుంచి పిల్లి సుభాష్ చంద్రబోస్, యాదవ నుంచి బీద మస్తాన్‌రావు, కురుబ నుంచి ఆర్. కృష్ణయ్యలకు ప్రాతినిధ్యం కల్పించి రాజకీయంగా అగ్రస్థానంలో కూర్చోబెట్టారన్నారు. అవే పదవులను కోట్లకు అమ్ముకున్న నైజం చంద్రబాబుదని చెప్పారు. బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలకు లభించిన గౌరవం 2024 తర్వాత ఆగిపోకూడదంటే సీఎం జగన్‌ను మరోసారి ముఖ్యమంత్రిని చేసుకోవాలని మాజీ మంత్రి, ఎమ్మెల్యే అనిల్‌కుమార్ యాదవ్ చెప్పారు. ఎవరైనా పార్టీ పెడితే సీఎం కావాలనుకుంటారని, కానీ పక్కవారు సీఎం కావాలని కోరుకునే నాయకులు మనకు అవసరమా అంటూ పవన్ కళ్యాణ్ తీరును ఎద్దేవా చేశారు. బలిసిన వారికి, బడుగులకు మధ్య జరుగుతున్న యుద్ధంలో బడుగుల పక్షాన నిలిచిన జగన్‌కు మద్దతుగా నిలిచి మరోసారి సీఎంను చేయాలని కోరారు. సామాజిక సాధికారతకు అర్థం చెప్పేలా సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి పాలన అందించారని కాకినాడ రూరల్ ఎమ్మెల్యే, మాజీ మంత్రి, వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు కురసాల కన్నబాబు చెప్పారు. కార్యక్రమంలో వైఎస్సార్సీపీ ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాల రీజినల్ కో ఆర్డినేటర్ పెద్దిరెడ్డి మిధున్‌రెడ్డి, మంత్రి దాడిశెట్టి రాజా, ఎంపీ వంగా గీత, పలువురు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఇతర నేతలు పాల్గొన్నారు. -
నేడు 9వ రోజు వైఎస్సాఆర్సీపీ బస్సు యాత్ర
-
సామాజిక సాధికార బస్సు యాత్ర.. తొమ్మిదోరోజు షెడ్యూల్ ఇదే
సాక్షి, తాడేపల్లి : వైఎస్సార్సీపీ చేపట్టిన సామాజిక సాధికార బస్సు యాత్ర జైత్రయాత్రలా కొనసాగుతోంది. నేటి(సోమవారం) సామాజిక సాధికారిత బస్సుయాత్ర గాజువాక, కాకినాడ రూరల్, మార్కాపురం నియోజకవర్గాల్లో కొనసాగనుంది. విశాఖపట్నం జిల్లా గాజువాకలో ఎమ్మెల్యే తిప్పల నాగిరెడ్డి ఆధ్వర్యంలో బస్సుయాత్ర జరుగనుంది. గాజువాక సెంటర్లో మధ్యాహ్నం గం. 12.30ని.లకు యాత్ర ప్రారంభం కానుంది. ఒంటి గంటకు టీఎన్ఆర్ కళ్యాణ మండపం వద్ద వైఎస్సార్సీపీ నేతల మీడియా సమావేశం ఉంటుంది. గం. 1.30 ని.లకు మింది గ్రామంలో నూతనంగా ఏర్పాటు చేసిన అర్బన్ ప్రైమరీ హెల్త్ సెంటర్ వైఎస్సార్సీపీ నాయకులు ప్రారంభించనున్నారు. మధ్యాహ్నం 3 గంటలకు టీఎన్ఆర్ కళ్యాణ మండపం నుంచి పాత గాజువాక వరకూ భారీ ర్యాలీ కొనసాగనుంది. సాయంత్రం 4 గంటలకు పాత గాజువాకలో భారీ బహిరంగ సభ జరుగనుంది. దీనికి మంత్రులు సీదిరి అప్పలరాజు, ధర్మాన ప్రసాదరావు, బొత్ససత్యనారాయణ తదితరులు హాజరుకానున్నారు. ఇక ప్రకాశం జిల్లా మార్కాపురంలో ఎమ్మెల్యే కుందూరు నాగార్జునరెడ్డి ఆధ్వర్యంలో బస్సుయాత్ర జరుగనుంది. మధ్యాహ్నం ఒంటి గంటకు యాత్ర ప్రారంభం కానుంది. రెండు గంటలకు వైఎస్సార్సీపీ నేతల మీడియా సమావేశం ఉండగా, మూడు గంటలకు కార్యకర్తలో కలిసి పార్టీ నేతల పాదయాత్ర ప్రారంభం కానుంది. పిల్లల పార్క్ మీదుగా కంభం సెంటర్‌వరకూ పాదయాత్ర జరుగనుంది. సాయంత్రం గం. 4.30ని.లకు వైఎస్సార్ విగ్రహం వద్ద భారీ బహిరంగ సభ జరుగనుంది. ఈ బహిరంగ సభలో ఎంపీ విజయసాయిరెడ్డి, మంత్రి ఆదిమూలపు సురేష్, మాజీ మంత్రి బాలినేని శ్రీనివాస్‌రెడ్డి, ఎమ్మెల్యే హఫీజ్‌ఖాన్ తదితరులు పాల్గొననున్నారు. కాకినాడ జిల్లా కాకినాడ రూరల్ నియోజకవర్గంలో సామాజిక సాధికార బస్సుయాత్ర జరుగనుంది. మధ్యాహ్నం రెండు గంటలకు కాకినాడ ఆర్ అండ్ బీ అతిథి గృహంలో వైఎస్సార్సీపీ నేతల మీడియా సమావేశం ఉంటుంది. మూడు గంటలకు బస్సు యాత్ర ప్రారంభం కానుంది. నాలుగు గంటలకు సర్పవరంలో భారీబహిరంగ సభ నిర్వహించనున్నారు. ఈ సభకు మంత్రులు బూడి ముత్యాల నాయుడు, తానేటి వనిత, చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ, పినిపే విశ్వరూప్, మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్, మిథున్‌రెడ్డి తదితరులు హాజరుకానున్నారు. -
36 ఏళ్లుగా ఒక్క సెలవూ లేదు.. హ్యాట్సాఫ్ ‘కడారి’
బాలాజీచెరువు (కాకినాడ సిటీ): ప్రభుత్వ ఉద్యోగమంటే ఏడాదిలో చాలా సెలవులుంటాయి. అతి తక్కువ మంది ఈ సెలవుల వినియోగంలో పొదుపుగా వ్యవహరిస్తారు. అత్యవసరానికి తప్ప మరే పనికీ సెలవు పెట్టారు. కానీ కడారి సుబ్బారావు తన 36 ఏళ్ల ఉద్యోగ ప్రస్థానంలో ఒక్కరోజూ సెలవు తీసుకోలేదంటే ఆశ్చర్యమే మరి. కాకినాడ జిల్లా విద్యాశాఖలో కడారి సుబ్బారావు అసిస్టెంట్ డైరెక్టర్‌గా పనిచేస్తున్నారు. గొల్లప్రోలుకు చెందిన ఈయన 1987లో గ్రూప్–4 ఏపీపీఎస్సీ ద్వారా జిల్లా విద్యాశాఖాధికారి కార్యాలయంలో జూనియర్ అసిస్టెంట్‌గా చేరారు. అంచెలంచెలుగా వివిధ హోదాల్లో పనిచేసి అసిస్టెంట్ డైరెక్టర్ స్థాయికి చేరుకున్నారు. ఉద్యోగ జీవితం 36 ఏళ్ల 8 నెలల కాలంలో ఒక్క సెలవు తీసుకోలేదు. ఈ నెల 30న రిటైర్ కానున్నారు. 2003 నుంచి ఇప్పటి వరకూ 6 సార్లు ఉత్తమ జిల్లా స్థాయి ఉద్యోగిగా, 2009లో తెలుగు అకాడమీ పురస్కారం సాధించారు. -
రెండు తెలుగు రాష్ట్రాల్లో తొలి హెచ్ఐవీ ఫిజీషియన్ ఆయన!
వైద్యులు రోగులకు వైద్యం చేస్తారు. పేషెంట్ వ్యాధిని అంచనా వేసి, పరీక్షలతో నిర్ధారణకు వచ్చి, సిలబస్‌లో చదివిన సమాధానాలతో వైద్యం చేస్తారు. మరి... అప్పటివరకు లేని కొత్త రోగం వస్తే? చికిత్స కోసం అప్పటికే చదివిన సిలబస్‌లో సమాధానం ఎలా వెతకాలి? వైద్యవిద్యలో చెప్పని పాఠాల కోసం అన్వేషణ ఎలా మొదలు పెట్టాలి? అందుకే... ‘పేషెంట్లు, పరిశోధనలే నా గురువులు’ అన్నారు డాక్టర్ మురళీకృష్ణ. ఆయన ‘సాక్షి’తో మాట్లాడుతూ... నిర్ధారిత ప్రయోగాలు, నిరూపిత సమీకరణలతో వైద్యం చేయడానికే పరిమితం కాకూడదు. రోగికి అవసరమైన కొత్త సమీకరణాలను వైద్యులు సృష్టించగలగాలన్నారు. బ్రాండ్స్ ఇంపాక్ట్ సంస్థ విశేషంగా వైద్యసేవలందించిన వైద్యులను ఇటీవల న్యూఢిల్లీలో గౌరవించింది. పేదవారికి తక్కువ ఖర్చుతో వైద్యం అందిస్తూ ‘హెల్త్ కేర్ ఎక్స్‌లెన్స్ అవార్డ్స్ 2023’ పురస్కారం అందుకున్నారు తెలుగు డాక్టర్ మురళీకృష్ణ. మైక్రో బయాలజీ నడిపించింది! ‘‘మాది అంబేద్కర్ కోనసీమ జిల్లా, రామచంద్రాపురం. కాకినాడలోని రంగరాయ మెడికల్ కాలేజ్‌లో ఎంబీబీఎస్, అదే కాలేజ్‌లో ఎం.డీ (మైక్రో బయాలజీ) కూడా చేసి, సాంక్రమిక వ్యాధుల నిపుణుడిగా ప్రాక్టీస్ చేస్తున్నాను. మైక్రో బయాలజీలో చేరడం ఇష్టంతో కాదని చెప్పడానికి ఏ మాత్రం మొహమాట పడను. సీటు వచ్చిన కోర్సుతో రాజీపడిపోయాను. కానీ కోర్సు మొదలైన తర్వాత ఏర్పడిన ఆసక్తిని మాటల్లో వర్ణించలేను. నేరుగా వైద్యం చేయడం కంటే వైద్యరంగానికి అవసరమైన తెర వెనుక కృషి చాలా సంతృప్తినిచ్చింది. గర్భిణులు, ఇతర వ్యాధిగ్రస్థులకు పరీక్షల కోసం సేకరించిన రక్త నమూనాలను తీసుకుని ఎయిడ్స్ వైరస్ గురించి ప్రభుత్వం చాలా గోప్యంగా పరీక్షలు నిర్వహించేది. మనదేశంలో వెయ్యిలో 15 మందిలో ఎయిడ్స్ వైరస్ ఉన్నట్లు, అది దక్షిణాది ఆఫ్రికా దేశాల నుంచి మనదేశంలోకి వస్తున్నట్లు తెలుసుకున్నాం. దేశంలో ప్రభుత్వ సంస్థల దగ్గర ఉన్న సమాచారమంతటినీ సేకరించాను. అన్ని సంస్థల దగ్గరున్న సమాచారం కంటే ఎక్కువ డాటా నా దగ్గరుంది. అప్పట్లో మనదగ్గర ఎయిడ్స్‌కి వైద్యం చేసే డాక్టర్లు లేరు. అనుబంధ సమస్యలకు వైద్యం చేసే నిపుణులే హెచ్ఐవీకి కూడా మందులిచ్చేవారు. ఆ ఖాళీని భర్తీ చేయాలనుకున్నాను. రెండు తెలుగు రాష్ట్రాల్లో తొలి హెచ్ఐవీ ఫిజీషియన్ని నేనే. వారానికి ఇద్దరు పేషెంట్లు! సొంతక్ట్రీస్ మొదలుపెట్టింది 2000లో. మొదట్లో వారానికి ఇద్దరు లేదా ముగ్గురు పేషెంట్లు వచ్చేవారు. దాంతో నా సమయాన్ని ఎయిడ్స్ అధ్యయనానికి ఉపయోగించాను. ప్రముఖ పరిశోధకులందరూ శాస్త్రం ఆధారంగా ఎయిడ్స్‌కు వైద్య శోధన మొదలు పెట్టారు. నా అధ్యయనం, పరిశోధనలను పేషెంట్ వైపు నుంచి మొదలు పెట్టాను. ఎయిడ్స్‌కి మాంటూక్స్ టెస్ట్ అలాంటిదే. ఎయిడ్స్ వ్యాధిగ్రస్థులు వ్యాధినిరోధక శక్తిని కోల్పోయి టీబీ సోకడం సర్వసాధారణంగా జరిగేది. ఎయిడ్స్ మరణాల్లో ఎక్కువ టీబీ మరణాలే ఉండేవి. ‘13వ ఇంటర్నేషనల్ ఎయిడ్స్ కాన్ఫరెన్స్’ సౌత్ ఆఫ్రికాలోని దర్బన్‌లో జరిగింది. ఆ సదస్సులో నేను ‘మాంటూక్స్ టెస్ట్’ ఎయిడ్స్ తీవ్రత పట్ల ఒక అంచనాకు రావచ్చని చెప్తూ నా పరిశోధన పత్రాన్ని సమర్పించాను. అది ఎయిడ్స్ చికిత్సలో కొత్త దృక్పథానికి దారి తీసింది. ఎయిడ్స్ చికిత్సలో వైద్యం మొదలు పెట్టిన వారం రోజుల నుంచి రికవరీ స్పష్టంగా తెలుస్తుంది. అయితే జీవితకాలం మందులు వాడాల్సిందే. పేషెంట్ తిరిగి తన పనులకు వెళ్లగలిగేటట్లు చేయడం నా వైద్యం ఉద్దేశం. ఈ వ్యాధి పేదవాళ్లలోనే ఎక్కువ. వారికి వైద్యం చేయడంలో టెస్ట్‌ల మీద ఆధారపడకుండా వ్యాధి లక్షణాలు, చిహ్నాలను బట్టి తీవ్రతను అంచనా వేసి చికిత్స చేస్తాను. అలాగే రెండంచెల ఔషధాలతో వైద్యం చేయడం కూడా నేను చేసిన మరో ప్రయోగం. ఫ్రాన్స్‌లో జరిగిన ‘ఇంటర్నేషనల్ సింపోజియమ్ హెచ్ఐవీ ఎమర్జింగ్ మెడిసిన్ ’ సదస్సులో పేపర్ సమర్పించాను. నేను ప్రతిపాదించిన పదేళ్ల తర్వాత 2019 నుంచి ఇప్పుడు అంతర్జాతీయంగా టూ డ్రగ్స్ చికిత్సనే అనుసరిస్తున్నారు. ఎయిడ్స్ అవగాహన వ్యాసాలు హెచ్ఐవీ గురించి మన సమాజంలో విపరీతమైన భయం రాజ్యమేలుతున్న రోజులవి. ఆ వ్యాధి పట్ల అవగాహన కల్పించడం కోసం నగరాలు, పట్టణాలు, చిన్న కాలనీలు, గ్రామాల్లో ఐదు వందలకు పైగా సమావేశాల్లో ప్రసంగించాను. వయోజనుల్లో అవగాహన కోసం ‘అక్షర గోదావరి’ పేరుతో క్లుప్తంగా, సరళంగా సామాన్యులకు అర్థమయ్యే రీతిలో రాశాను. మొదట మా జిల్లాలో ప్రయోగాత్మకంగా మొదలు పెట్టిన ఆప్రాజెక్టును తర్వాత అన్ని జిల్లాలకూ విస్తరించారు. ఆశ వర్కర్స్, రీసోర్స్ పర్సన్‌కి ప్రామాణిక గ్రంథంగా నా రచననే తీసుకున్నారు. హెచ్ఐవీ గురించిన అవగాహన వ్యాసాలతో ‘ఎయిడ్స్’ పేరుతో పుస్తకాన్ని ప్రచురించాను. ఆ పుస్తకం పునర్ముద్రణలతో పదేళ్లలో ఎనిమిది వేల కాపీలు అమ్ముడవుతుందని నేను కూడా ఊహించలేదు. ఎంబీబీఎస్‌లో కాలేజ్ మ్యాగజైన్‌కి ఎడిటర్‌గా పని చేసిన అనుభవమే ఇప్పటికీ నా అధ్యయనాలన్నింటినీ అక్షరబద్ధం చేయిస్తోంది. కోవిడ్‌కి ఇంట్లోనే వైద్యం కోవిడ్ వైద్యరంగానికి పెద్ద సవాల్ అనే చెప్పాలి. ఒక వ్యాధికి మందులు రావాలంటే దశాబ్దాల పరిశోధన తర్వాత మాత్రమే సాధ్యం. కొత్త వ్యాధి, పైగా ఒక్కసారిగా విజృంభించినప్పుడు రోగులందరికీ ఒకేసారి నాణ్యమైన వైద్యం అందించడం ఎవరికీ సాధ్యం కాదు. వ్యాధి విస్తరించినంత వేగంగా ప్రత్యామ్నాయాల అన్వేషణ కూడా జరగాలన్న ఆలోచనతో సులభంగా, చవగ్గా దొరికే మందులతో హోమ్‌కేర్ కిట్ రూపొందించాను. కోవిడ్ మీద అవగాహన కోసం వీడియోలు చేసి సోషల్ మీడియాలో ΄పోస్ట్ చేశాను. ఒక్కో పోస్ట్ వేలసార్లు షేర్ అయింది. వైద్యం కోసం పేషెంట్లు అప్పుల పాలు కాకూడదనేది నా పాలసీ. అందుకోసమే నా తాపత్రయమంతా. కోవిడ్ మీద కూడా అవగాహన పుస్తకం తెచ్చాను. కోవిడ్ తర్వాత వస్తున్న సమస్యల మీద అధ్యయనం ఇంకా కొనసాగుతోంది. నాలుగు ఇంటర్నేషనల్ సెమినార్లలో పేపర్లు ప్రెజెంట్ చేశాను. ఇంకా చేస్తాను కూడా. ఒక డాక్టర్‌గా వైద్యరంగం నేర్పించిన జ్ఞానంతో పేషెంట్లను ఆరోగ్యవంతులను చేయడానికి కృషి చేయడం అనేది నూటికి తొంబై తొమ్మిది మంది చేసే పని. నా కృషితో వైద్యరంగానికి తోడ్పాటు అందించడం నా విజయం. మొదట ఆరోగ్యపరంగా నన్ను నేను జయించాను. ఆ తర్వాత జీవితాన్ని జయించాను. మా ఇంట్లో తొలి వైద్యుడిని నేనే. నా పిల్లలిద్దరిలో ఎవరూ వైద్యరంగం పట్ల ఆసక్తి చూపకపోవడమే మనసుకు బాధ కలిగించే విషయం’’ అన్నారు ప్రజారోగ్య పరిరక్షణలో జీవన సాఫల్య పురస్కారం అందుకున్న డాక్టర్ మురళీకృష్ణ. – డాక్టర్ యనమదల మురళీకృష్ణ, ఎం.డి, కాకినాడ, ఆంధ్రప్రదేశ్ – వాకా మంజులారెడ్డి, సాక్షి ఫీచర్స్ ప్రతినిధి -
కాకినాడలో సీఎం జగన్ క్రేజ్ మాములుగా లేదు..
-
సీఎం జగన్ కాకినాడ పర్యటనకు ఏర్పాట్లు
-
అయ్యో.. ఏమైందమ్మా..!
కాకినాడ రూరల్: కుటుంబాన్ని ఆర్థిక కష్టాల నుంచి గట్టెక్కించడానికి ఆ యువతి తోడుగా నిలిచేది.. వలంటీర్‌గా తన పరిధిలోని ప్రజలతో ఆప్యాయంగా మసలుకునేది.. తన పరిధిలోని ప్రజలకు ప్రభుత్వ సంక్షేమ పథకాలు సక్రమంగా అందించేది.. ఇటీవలే పెళ్లి కూడా కుదిరింది.. ఇంతలోనే ఏమైందో ఏమో.. బలవన్మరణానికి పాల్పడింది.. కుటుంబ సభ్యులకు విషాదాన్ని మిగిల్చింది. తమ సేవా సారథి అర్ధాంతరంగా జీవితాన్ని ముగించిందని తెలిసి.. ఆమె పరిధిలోని ప్రజలు విచారంలో మునిగిపోయారు. పోలీసుల కథనం ప్రకారం.. కాకినాడ రూరల్ ఇంద్రపాలెం తారకరామ కాలనీకి చెందిన కొక్కరి మహిమ (26) సచివాలయం–3లో వలంటీరుగా పని చేస్తోంది. తండ్రి విజయ్‌కుమార్ ఆటో డ్రైవర్. తల్లి రత్నకుమారి గృహిణి. తమ్ముడు కాకినాడ మెయిన్ రోడ్డులోని వస్త్ర దుకాణంలో పని చేస్తున్నాడు. కాకినాడకు చెందిన యువకుడితో పెద్దల సమక్షంలో మహిమకు గత నెల 11న వివాహ నిశి్చతార్థం జరిగింది. త్వరలో వివాహం జరగాల్సి ఉంది. నిశి్చతార్ధం తరువాత ఆమె చాలా సంతోషంగా కనిపించేది. తల్లిదండ్రులు శుక్రవారం రాత్రి ప్రేయర్ కోసం చర్చికి వెళ్లారు. ఇంట్లో ఎవ్వరూ లేరు. ఏమైందో.. ఏమో కానీ.. రాత్రి సుమారు 9.45 గంటల సమయంలో మహిమ తమ ఇంట్లో ఫ్యాన్‌కు ఉరి వేసుకుంది. ప్రేయర్ అనంతరం ఇంటికి వచ్చిన తల్లిదండ్రులు ఫ్యాన్‌కు వేలాడుతున్న కుమార్తెను చూసి గొల్లుమన్నారు. స్థానికులు సహాయంతో కిందకు దించి, కాకినాడ ప్రభుత్వ ఆస్పత్రికి తీసుకు వెళ్లారు. అప్పటికే ఆమె మృతి చెందిందని వైద్యులు నిర్ధారించడంతో తల్లిదండ్రులు తీవ్ర విషాదంలో నిండిపోయారు. ఆస్పత్రి నుంచి వచ్చిన సమాచారం మేరకు ఇంద్రపాలెం ఎస్సై దేవ సుధ శనివారం కేసు నమోదు చేశారు. సంఘటన స్థలంలో లభించిన మహిమ సూసైడ్ నోట్‌ను పోలీసులు స్వాదీనం చేసుకున్నారు. తల్లిదండ్రుల ఆర్థిక ఇబ్బందుల కారణంగా వారికి భారం కాకూడదనే ఉద్దేశంతోనే మహిమ ఆత్మహత్యకు పాల్పడి ఉంటుందని భావిస్తున్నారు. జీజీహెచ్‌లో పోస్టుమార్టం అనంతరం మహిమ మృతదేహానికి మధ్యాహ్నం ఇంద్రపాలెంలో అంత్యక్రియలు నిర్వహించారు. గ్రామస్తులు పెద్ద ఎత్తున అంత్యక్రియల్లో పాల్గొన్నారు. వలంటీర్ మహిమ మృతి పట్ల కాకినాడ రూరల్ ఎమ్మెల్యే కురసాల కన్నబాబు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఆమె ఆత్మకు శాంతి చేకూరాలని, కుటుంబ సభ్యులను ఆదుకుంటామని తెలిపారు. నా చావుకు ఎవ్వరూ బాధ్యులు కారు నా చావుకు ఎవ్వరూ బాధ్యులు కారు. మానసిక స్థితి బాగో లేదు. మానసిక ఒత్తిడి భరించలేకపోతున్నాను. అమ్మా నాన్నా.. ఐ మిస్ యూ.. ఐ లవ్ యూ.. బతకాలని ఉంది. కానీ భరించలేకపోతున్నాను. (కాబోయే భర్త రాజేష్ ను ఉద్దేశించి) నా కంటే మంచి అమ్మాయి దొరుకుతుంది. – సూసైట్ నోట్లో మహిమ ముఖ్య గమనిక: ఆత్మహత్య మీ సమస్యలకు పరిష్కారం కాదు.. ఒక్క క్షణం ఆలోచించండి, రోషిణి కౌన్సెలింగ్ సెంటర్‌ను ఆశ్రయించి సాయం పొందండి. ఫోన్ నెంబర్లు: 040-66202000/040-66202001 మెయిల్: roshnihelp@gmail.com -
తనని చూసేందుకు గోడ దూకి వెళ్లేవాడిని! రెండేళ్లు ఓ మినీ యుద్ధమే.. ఇప్పుడిలా..
Hanuma Vihari About His Love Story: ప్రేమ ఎవరినైనా మార్చేస్తుంది.. ప్రొఫెషన్తోతో సంబంధం లేకుండా.. కోతి పనులైనా సరే చేయించే శక్తి ప్రేమకు మాత్రమే ఉంది.. టీమిండియా క్రికెటర్ హనుమ విహారి విషయంలో ఇదే జరిగింది.. కులాంతర ప్రేమ వివాహం కోసం విహారి పడిన పాట్లు వింటే ప్రేమ పెళ్లిళ్లు చేసుకున్న వాళ్లకు గత జ్ఞాపకాలు గుర్తుకురావాల్సిందే. తన నెచ్చెలి ప్రీతి ప్రేమ కోసం ఎదురుచూపులు.. ఆ తరువాత ఆమె తల్లిదండ్రులను ఒప్పించేక్రమంలో రెండేళ్ల ఎడబాటు.. ఆపై పెళ్లితో శుభం కార్డు.. విహారి వీర ప్రేమగాథను తెలుసుకోవాలంటే ఇటు వైపు ఓ లుక్ వెయ్యండి! ఘ ఐపీఎల్లో.. టీమిండియా టెస్టు క్రికెట్లో తనకంటూ ప్రత్యేక స్థానం సంపాదించుకున్న బ్యాటర్ హనుమ విహారి. ఐపీఎల్లో.. 2019లో ఢిల్లీ క్యాపిటల్స్‌కి ఆడిన ఈ అతడు.. ఆ తర్వాత సన్‌రైజర్స్ హైదరాబాద్‌కు ప్రాతినిథ్యం వహించాడు. క్యాష్ రిచ్ లీగ్‌లో ఇప్పటివరకు మొత్తంగా 23 ఇన్నింగ్స్ ఆడిన హనుమ విహారి.. 14.2 సగటు, 88.47 స్ట్రైక్ రేట్‌తో 284 పరుగులు చేశాడు. టీమిండియా తరఫున టెస్టుల్లో ఇక టీమిండియా తరఫున 16 టెస్టుల్లో 839 పరుగులు సాధించడంతో పాటు 5 వికెట్లు తన ఖాతాలో వేసుకున్నాడీ ఆఫ్‌బ్రేక్ స్పిన్నర్. అత్యధిక స్కోరు 111. ఇదిలా ఉంటే.. టెస్టుల్లో కీలక ఆటగాడైన విహారి అనేక మ్యాచ్‌లను ఒంటిచేత్తో గెలిపించిన సందర్భాలున్నాయి. జాతీయ జట్టుకు ఆడే అవకాశం వచ్చినపుడల్లా తనను తాను నిరూపించుకుంటున్న విహారి.. విమర్శకుల ప్రశంసలతో పాటు క్రికెట్ దేవుడు సచిన్ టెండుల్కర్ మెప్పు కూడా పొందాడు. ఇలా ఓవైపు క్రికెటర్‌గా కెరీర్ కొనసాగిస్తూనే.. మరోవైపు ప్రేమాయణాన్ని కూడా సాగించాడీ బ్యాటింగ్ ఆల్‌రౌండర్. తల్లే మొదటి గురువు కాకినాడలోని మధ్యతరగతి కుటుంబానికి చెందిన విహారి.. చిన్నతనంలోనే తన తండ్రిని కోల్పోయాడు. తల్లి ఇచ్చిన మనోధైర్యంతో ప్రోత్సాహంతో క్రికెటర్‌గా ఎదిగాడు. ఇప్పటికీ తన మొదటి గురువు తన తల్లి అని గర్వంగా విహారి చెబుతున్నాడు. ప్రీతి అంటే మహాప్రీతి.. ఇక విహారి ప్రేమ విషయానికొస్తే.. తన స్నేహితురాలు ద్వారా ప్రీతి అతడికి పరిచయమైంది. స్నేహం పెరిగి కాస్త ప్రేమగా మారింది.. ఎలాంటి లవ్ స్టోరీలో అయినా కొన్ని కష్టాలు తప్పవు.. విహారికి కూడా అలాంటి అనుభవమే ఎదురైంది. ప్రేమ కోసం మినీ యుద్ధమే విహారి, ప్రీతి సామాజిక వర్గాలు వేరు కావడంతో అమ్మాయి ఇంట్లో పెళ్ళికి నిరాకరించారు. దీంతో.. రెండేళ్ల పాటు కష్టపడి.. వారిని ఒప్పించి చివరికి 2019లో ఇద్దరూ ఒకటయ్యారు. అయితే.. ఈ రెండేళ్ల పాటు ఓ మినీ యుద్ధమే చేశానని ‘సాక్షి’తో చెప్పుకొచ్చాడు విహారి. ఎప్పుడైనా ప్రీతిని చూడాలనిపిస్తే గోడ దూకి మరి వెళ్లి చూసేవాడిని సిగ్గుపడుతూ అప్పటి జ్ఞాపకాల్ని గుర్తు తెచ్చుకున్నాడు. కాగా హనుమ విహారి- ప్రీతి ప్రేమకు గుర్తుగా వారికి కొడుకు జన్మించాడు. కాగా విహారి భార్య ప్రీతికి క్రికెట్ అంటే పెద్దగా ఆసక్తి లేనప్పటికీ భర్త కోపసం మ్యాచ్‌లు చూస్తుందట. ఏపీ ప్రభుత్వం సూపర్ ఇదిలా ఉంటే.. ఇటీవల విహారి ఆంధ్రప్రీమియర్ లీగ్‌లో ఆడిన విషయం తెలిసిందే. ఈ విషయం గురించి ప్రస్తావిస్తూ.. హైదరాబాద్ నుంచి తిరిగి మళ్ళీ సొంతరాష్ట్రంలో ఏపీఎల్ సీజన్-2లో ఆడటం ఎంతో ఆనందంగా ఉందని విహారి పేర్కొన్నాడు. ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ ఇప్పుడున్న కొత్త క్రీడాకారులకు ఎంతగానో సహాయపడుతోందని.. ఇండియన్ ప్రీమియర్ లీగ్ స్థాయిలో పోటీ పడేవిధంగా ఆంధ్ర ప్రీమియర్ లీగ్ రెండు సీజన్లను పూర్తి చేశారని ప్రశంసించాడు. మొదటి సీజన్లో తాను ఆడకపోయినా టీవీలో చూసి ఎంతో గర్వపడ్డానని తెలిపారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం క్రీడాకారులను ఎంతో గానో ప్రోత్సహిస్తున్నది అని హనుమ విహారి హర్షం వ్యక్తం చేశాడు. కాగా ఏపీఎల్ సీజన్-2లో రాయలసీమ కింగ్స్ కెప్టెన్‌గా వ్యవహరించిన హనుమ విహారి జట్టుకు టైటిల్ అందించిన విషయం తెలిసిందే. నరేష్, కరస్పాండెంట్, సాక్షి టీవీ, విశాఖపట్నం View this post on Instagram A post shared by Hanuma vihari (@viharigh) -
పారిశుద్ధ్య నిర్వహణలో కాకినాడకు జాతీయ స్థాయిలో రెండో స్థానం
-
ఏపీకి వర్షసూచన.. పలు జిల్లాలకు ఎల్లో అలర్ట్
సాక్షి, విశాఖపట్నం: ఏపీలోని పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో అల్పపీడనం కారణంగా రానున్న నాలుగు రోజుల పాటు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. ఈ క్రమంలో శ్రీకాకుళం, పార్వతీపురం, అల్లూరి, కాకినాడ, అనకాపల్లి జిల్లాలకు ఎల్లో అలర్ట్ కూడా జారీ చేసింది. ఇక, అల్పపీడనం కారణంగా గంటలకు 40 నుంచి 45 కిమీల వేగంతో గాలులు వీచే అవకాశం ఉన్నట్టు వాతావరణ శాఖ అధికారులు వెల్లడించారు. అల్ప పీడనం ప్రభావంతో కోస్తా, రాయలసీమ, తెలంగాణలోని పలు ప్రాంతాల్లో తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. అలాగే, ఈనెల 17వ తేదీ వరకు మృత్య్సకారుల చేపలవేటపై నిషేధం విధించింది వాతావరణశాఖ. మరోవైపు.. తెలంగాణలోని పలు జిల్లాల్లో బుధవారం రాత్రి నుంచి మోస్తరు వర్షం కురిసింది. ఉమ్మడి ఆదిలాబాద్, ఉమ్మడి కరీంనగర్‌లోని పలు ప్రాంతాల్లో వర్షం కురిసింది. ఇక, రాజధాని హైదరాబాద్‌లో కూడా ఆకాశం మోఘావృతమై ఉంది. ఇది కూడా చదవండి: ఐరాస సదస్సుకు ఏపీ విద్యార్థులు -
తేటగుంటలో గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమం
-
పిల్లితో చెలగాటం..
-
జగ్గంపేట : నూతన వధువరులకు సీఎం జగన్ ఆశీర్వాదం
సాక్షి, కాకినాడ: జగ్గంపేట నియోజకవర్గంలో బుధవారం ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి పర్యటించారు. వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే జ్యోతుల చంటిబాబు కుమార్తె వివాహ వేడుకలో పాల్గొన్నారు. ఇర్రిపాకలోని ఎమ్మెల్యే జ్యోతుల చంటిబాబు నివాసానికి వెళ్లిన సీఎం జగన్.. నూతన వధూవరులు అన్నపూర్ణ, సాయి ఆదర్శ్ లను ఆశీర్వదించారు. అంతకు ముందు ఇర్రిపాకలో ఏర్పాటు చేసిన హెలిప్యాడ్ వద్ద మంత్రులు,ఎమ్మెల్యేలు సీఎం జగన్‌కు సాదర స్వాగతం పలికారు. -
కాకినాడకు ‘నానొ’చ్చేస్తున్నా!
సాక్షి ప్రతినిధి, కాకినాడ: ఫెర్టిలైజర్స్ సిటీగా జాతీయ స్థాయిలో పేరొందిన కాకినాడ నగరం మరో కొత్త ఆవిష్కరణకు వేదిక కాబోతోంది. ఇకపై నానో ఎరువుల ఉత్పత్తికి సైతం కేంద్ర బిందువు కాబోతోంది. కోరమాండల్ ఎరువుల కర్మాగారం ఈ దిశగా అడుగులు వేస్తోంది. నాగార్జున ఫెర్టిలైజర్స్ కార్పొరేషన్ లిమిటెడ్ (ఎన్ఎఫ్సీఎల్) ఏర్పాటుతో దేశవ్యాప్తంగా ఫెర్టిలైజర్స్ సిటీగా కాకినాడ పేరొందింది. అనంతరం తమిళనాడుకు చెందిన మురుగప్ప గ్రూపు కాకినాడ జీఎఫ్సీఎల్ను టేకోవర్ చేసి కోరమాండల్ ఎరువుల కర్మాగారాన్ని ప్రారంభించింది. తాజాగా రాష్ట్ర ప్రభుత్వ తోడ్పాటుతో ప్లాంట్‌ను విస్తరించడంతోపాటు నానో ఎరువులను ఉత్పత్తి చేసేందుకు కోరమాండల్ ముందుకొచ్చింది. 3 లక్షల టన్నుల నుంచి 30 లక్షల టన్నులకు.. ఏటా 3 లక్షల టన్నుల డీఏపీ ఉత్పత్తి సామర్థ్యంతో 1988లో ఈ పరిశ్రమను కోరమాండల్ ప్రారంభించింది. దశలవారీగా పెంచుతూ ప్రస్తుతం ఏటా 20.50 లక్షల టన్నుల డీఏపీ, పొటా‹Ù, ఇతర ఎరువులను ఉత్పత్తి చేస్తోంది. ఇకపై ఏటా ఉత్పత్తిని 30 లక్షల టన్నులకు విస్తరించేందుకు కార్యాచరణ సిద్ధం చేసింది. నానో ద్రవ రూప ఎరువులను ఏటా 30 వేల కిలోలీటర్లు మేర ఉత్పత్తి చేయాలని ప్రతిపాదించింది. కేంద్ర ప్రభుత్వం విదేశాల నుంచి ఎరువుల దిగుమతిని తగ్గించి స్వయం సమృద్ధి సాధించడం ద్వారా ఆత్మనిర్భర్ భారత్ వైపు అడుగులు వేస్తోంది. ఈ నేపథ్యంలో కాకినాడ వాకలపూడిలోని కోరమాండల్ ప్లాంట్‌ను రూ.710 కోట్లతో విస్తరించేందుకు కోరమాండల్ ప్రతిపాదించింది. రాష్ట్ర కాలుష్య నియంత్రణ మండలి ప్రజాభిప్రాయ సేకరణ ఇప్పటికే పూర్తయ్యింది. నానో ఎరువులు, ప్రస్తుతం ఉత్పత్తి చేస్తున్న ఎరువుల సామర్థ్యం పెంపు తదితర అంశాలపై ప్రజల అభిప్రాయాలను కాలుష్య నియంత్రణ మండలి సేకరించింది. ఇప్పుడున్న 4.80 మెగావాట్ల క్యాప్టివ్ పవర్ ఉత్పత్తితో కలిపి 12 మెగావాట్ల క్యాప్టివ్ వపర్ ప్లాంట్‌ను కూడా ప్రతిపాదించారు. బొగ్గు ఆధారిత పవర్ ప్లాంట్‌పై భిన్నాభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. రాష్ట్ర ప్రభుత్వ విధానానికి అనుగుణంగా విస్తరణ ప్లాంట్‌లో ఉపాధి అవకాశాలలో స్థానికులకు ప్రాధాన్యం ఇవ్వనున్నట్టు కంపెనీ ప్రకటించింది. ప్లాంట్ విస్తరణకు అన్ని అనుమతులు వచ్చేసరికి నాలుగైదు నెలల సమయం పడుతుందని కంపెనీ అంచనా వేస్తోంది. అన్నీ అనుకున్నట్టు జరిగితే నానో డీఏపీ, ఇతర ఎరువుల ఉత్పత్తిని వచ్చే ఏడాది ప్రారంభించనున్నారు. నానో డీఏపీతో తగ్గనున్న ఖర్చు రైతులు గుళికల రూపంలో ఉండే ఎరువులను వ్యవసాయ క్షేత్రాల్లో చల్లుతున్నారు. ఆ ఎరువులు నీటిలో కరిగిపోయి భూమి ద్వారా మొక్కలకు పోషకాలను అందిస్తాయి. ఒక బస్తా డీఏపీ ఉత్పత్తికి సుమారు రూ.3,200 ఖర్చవుతోంది. డీఏపీపై కేంద్రం ఒక్కో బస్తాపై రూ.2 వేల సబ్సిడీ ఇస్తోంది. రైతు బస్తా రూ.1,200కు కొనుగోలు చేస్తున్నాడు. అదే బస్తా డీఏపీ బదులుగా ఒక లీటరు నానో డీఏపీ సరిపోతుంది. దీని ఉత్పత్తి వ్యయం రూ.700 నుంచి రూ.800 అవుతుంది. డ్రోన్ ద్వారా కూడా దీనిని పొలాల్లో నేరుగా పిచికారీ చేసుకోవచ్చు. నానో ఎరువులు పర్యావరణానికి పూర్తిగా అనుకూలం. ద్రావణం నేరుగా మొక్క కాండానికి చేరుతుంది. భూమిలోని వానపాములు చనిపోవు. రైతుకు భారం తగ్గుతుంది. నానో ఎరువు అద్భుతమైన అవకాశం నానో ఫెర్టిలైజర్ అనేది సుస్థిరమైన వ్యవసాయ విధానాలలో అద్భుతమైన అవకాశం. కోరమాండల్ ఇంటర్నేషనల్ పరిశోధన కేంద్రం, ఐఐటీ ముంబై సహకారంతో నానో సాంకేతికతను అభివృద్ధి చేస్తోంది. 2024 ప్రథమార్థంలో నానో డీఏపీ అందుబాటులోకి వస్తుంది. – సాయిభాస్కర్, సాంకేతిక సలహాదారు, కోరమాండల్ ఇంటర్నేషనల్ కేంద్రానికి నివేదిక పంపించాం కోరమాండల్ ఇంటర్నేషనల్ లిమిటెడ్ ఫ్యాక్టరీ విస్తరణకు ప్రతిపాదనలు వచ్చాయి. కాలుష్య నియంత్రణ మండలి ఆధ్వర్యంలో ఈ నెలలోనే ప్రజాభిప్రాయ సేకరణ నిర్వహించాం. ప్రజాప్రతినిధులు, ప్రజా సంఘాల నుంచి వచ్చి న విజ్ఞాపనలను పరిశీలించాం. ప్రజాభిప్రాయాలను క్రోడీకరించి కేంద్ర ప్రభుత్వానికి నివేదిక పంపించాం. – కృతికా శుక్లా, కలెక్టర్, కాకినాడ -
‘బాబుకు ఎన్టీఆర్ బొమ్మతో రాజకీయాలు మాత్రమే కావాలి’
సాక్షి, కాకినాడ: చంద్రబాబుపై తీవ్ర ఆరోపణలు చేశారు మంత్రి సీదిరి అప్పలరాజు. కుప్పంలో దొంగ ఓట్లతోనే చంద్రబాబు గెలుస్తున్నాడని అన్నారు. చంద్రబాబు.. ఎన్టీఆర్ పేరుమీద స్పాన్సర్డ్ కార్యక్రమం పెట్టి బీజేపీ నేతలతో లాబీయింగ్ చేశాడు అని కామెంట్స్ చేశారు. కాగా, మంత్రి సీదిరి అప్పలరాజు మంగళవారం మీడియాతో మాట్లాడుతూ.. ‘కుప్పంలోనే 30-40వేల బోగస్ ఓట్లు ఉన్నాయి. కుప్పంలో దొంగ ఓట్లు పోతాయనే బాబు మొసలికన్నీరు కారుస్తున్నాడు. చాలాసార్లు బీజేపీ అపాయింట్మెంట్ ఇవ్వకపోవడంతో ఎన్టీఆర్ పేరుమీద స్పాన్సర్డ్ కార్యక్రమం పెట్టి బీజేపీ నేతలతో లాబీయింగ్ చేశాడు. ఎన్టీఆర్‌కు భారతరత్న ఇవ్వాలని ఎందుకు అడగలేదు?. ఎన్టీఆర్ బొమ్మతో ఓట్లు లబ్ధి పొందాలనేదే చంద్రబాబు తాపత్రయం. ఎన్టీఆర్‌కు ప్రత్యేక గుర్తింపు కావాలనే ఆలోచన బాబుకు లేదు. ఎన్టీఆర్ బొమ్మతో చంద్రబాబుకు రాజకీయాలు మాత్రమే కావాలి. ఇదే సమయంలో విశాఖ మత్య్సకారుల సమస్యలపై కూడా మంత్రి సీదిరి అప్పలరాజు స్పందించారు. విశాఖలో మత్స్యకారుల సమస్య ఈనాటిది కాదు. గత ముప్పై ఏళ్ల కింద ఇచ్చిన హామీ అమలు కాలేదు. విశాఖ మత్స్యకారుల సమస్య పరిష్కారం కోసం కలెక్టర్‌తో మాట్లాడాను. మత్స్యకారులకు ఇళ్ల స్థలాలు నెరవేర్చేందుకు ప్రయత్నిస్తాం’ అని తెలిపారు. ఇది కూడా చదవండి: బీజేపీ చీఫ్ పురంధేశ్వరిపై పోసాని సీరియస్ కామెంట్స్ -
కచ్చిడి చేపలతో ఒక్కరోజులోనే మిలియనీర్.. ఎందుకింత విపరీతమైన క్రేజ్?
ఏపీ సెంట్రల్ డెస్క్: మహారాష్ట్రకు చెందిన ఓ జాలరికి దొరికిన కచ్చిడి చేపలతో ఒక్క రోజులోనే మిలియనీర్ అయిపోయాడు. యాభై కేజీల కచ్చిడి చేప కలకత్తాలో రూ.13 లక్షలకు అమ్ముడుబోయింది. కాకినాడ కుంభాభిషేకం రేవులో కచ్చిడి చేప 4 లక్షల రూపాయలు పలికింది. కోనసీమలోని అంతర్వేది తీరంలో కచ్చిడి దొరికిన మత్స్యకారుడిపై కాసుల వర్షం కురిసింది. ఇలాంటి వార్తలు తరచూ చూస్తున్నాం. అసలేంటీ కచ్చిడి చేప. పులసకే తాతలా ఉంది. కళ్లు బైర్లు కమ్మే రేటు ఎందుకు పలుకుతోంది. కేజీ రూ. 20 వేలకు పైగా ధర పలికేంత విషయం కచ్చిడిలో ఏముంది. సింగపూర్, మలేసియా, హాంగ్‌కాంగ్, థాయ్‌లాండ్, జపాన్, ఇదర ఆగ్నేయాసియా దేశాల్లో దీనికి అంత డిమాండ్ ఎందుకు.. అంటే ఇది ఔషధాల గని కాబట్టి. బురద ప్రాంతాల్లో నివాసం హిందూ మహా సముద్రం, దక్షిణ పసిఫిక్ మహా సముద్రంలో ఇవి నివసిస్తాయి. పర్షియన్ గల్ఫ్, భారత్ తీరం, జపాన్, పవువా న్యూగినియా, ఉత్తర ఆ్రస్టేలియా సముద్ర ప్రాంతంలో ఇవి ఎక్కువగా కనిపిస్తాయి. నదీ ముఖద్వారాలు సమీపంలో, అడుగున బురదగా, బండరాళ్లు ఉండే ప్రాంతాల్లో జీవిస్తాయి. సాధారణంగా ఇవి 60 మీటర్ల లోతులో సంచరిస్తూ ఉంటాయి. ఆహారం కోసం వలస వెళ్తూ ఉంటాయి. ఎన్నో పేర్లు.. ఆంధ్రప్రదేశ్ కోస్తా ప్రాంతంలో కచ్చిడిగా పిలుస్తున్న ఈ చేప శాస్త్రీయ నాయం ప్రొటోనిబియా డయాకాంథస్. దీనిని ఘోల్ ఫిష్ అని, సీ గోల్డ్ అని కూడా పిలుస్తారు. ఒడిశా, పశ్చిమ బెంగాల్ ప్రాంతాల్లో టెలియా భోలా, కచ్చర్ భోలా అని అంటారు. ప్రపంచ వ్యాప్తంగా దీనిని బ్లాక్స్పాటెడ్ క్రోకర్ అని, ఆ్రస్టేలియాలో బ్లాక్ జ్యూఫిష్ అని అంటారు. జీవితకాలం 15 ఏళ్లు.. వీటి నోరు పెద్దగా ఉంటుంది. పక్కన నాలుగు రెక్కలు (ఫిన్స్), వెన్నుముక పొడవునా మరో ఫిన్ ఉంటుంది. రెండు వెన్నుముకలతో పొట్ట తర్వాత నుంచి కిందకు వంగి.. తోకవరకు సన్నగా ఉంటుంది. ఇవి అవకాశాన్ని బట్టి అన్ని రకాల ఆహారాలను తింటాయి. ముఖ్యంగా పీతలు, రొయ్యలు, లాబ్స్టర్లను ఇష్టంగా లాగిస్తాయి. చిన్న చేపలను వేటాడతాయి. సముద్రంలో ఎక్కడెక్కడ తిరిగినా ఏటా గుడ్లు పెట్టే సమయానికి మాత్రం తమ ఆవాసాలకు గుంపులుగా చేరతాయి. మే నుంచి అక్టోబర్ మధ్య కాలంలో నదులు సముద్రంలో కలిసే చోట్లకు వచ్చి గుడ్లుపెడతాయి. వీటి జీవితకాలం 15 ఏళ్లు. అయితే పుట్టినప్పటి నుంచి చాలా వేగంగా ఎదుగుతాయి. నాలుగేళ్లలోనే మూడు అడుగుల సైజుకు పెరిగి సంతానోత్పత్తికి సిద్ధమవుతాయి. ఐదు అడుగుల వరకూ కూడా పెరిగే ఇవి.. 60 కేజీలకు పైగా బరువుతూగుతాయి. ఎన్నో ఉపయోగాలు కచ్చిడి చేపలోని ఔషధ గుణాల వల్లే దానికంత క్రేజ్ వచ్చింది. ఐయోడిన్, ఒమెగా–3, డీహెచ్ఏ, ఈపీఏ, ఐరన్, మెగ్నీషియం, సెలీనియం లాంటి మినరల్స్ గని ఈ చేప. దీని కడుపు క్రింది భాగంలో చిన్న సంచిలాంటి శరీర భాగం ఉంటుంది. ఆ సంచిలో లభించే ఔషధాల వల్ల మార్కెట్లో దీనికి విపరీతమైన డిమాండ్ ఉంటుంది. ఈ సంచి కారణంగానే దీనిని సీ గోల్డ్ అని పిలుస్తారు. ఈదడానికి ఉపయోగపడే వీటి రెక్కలతో సింగపూర్‌లో వైన్ తయారు చేస్తారు. కంటి చూపును మెరుగుపరిచే చాలా విటమిన్స్, మినరల్స్, ప్రొటీన్స్ ఈ చేపలో పుష్కలంగా లభిస్తాయి. ఈ చేపలో చర్మానికి అవసరమైన ప్రొటీన్లు, విటమిన్లు పుష్కలంగా ఉంటాయి. దీనితో చర్మంపై ముడతలు పడవు. ముదిమి ఛాయలు దరిదాపులకు రాకుండా నవయవ్వనంగా చర్మం మెరుస్తుంది. చిన్న పిల్లల్లో మొదడు సక్రమంగా ఎదుగుదలకు ఈ చేపలో పెద్దఎత్తున లభించే ఒమెగా–3 ఎంతో ఉపయోగపడుతుంది. క్రమం తప్పక తింటూ ఉంటే ఐక్యూ (ఇంటెలిజెన్స్ కొషెంట్) కూడా బాగా అభివృద్ధి చెందుతుంది. కచ్చిడిలోని విటమిన్స్, మినరల్స్ మన శరీరంలోని కండరాలు బలంగా మారడానికి ఎంతో దోహదపడతాయి. ప్రమాదంలో కచ్చిడి.. ప్రపంచ దేశాల్లో అతిగా వేటాడటం, తీర ప్రాంతం కాలుష్యంగా మారడం వల్ల దీని ఉనికికే ప్రమాదం ఏర్పడుతోంది. గుడ్లు పెట్టేందుకు తీర ప్రాంతాలకు వచ్చే సమయంలో వీటిని ఎక్కువగా వేటాటం వల్ల వాటి సంఖ్య విపరీతంగా తగ్గిపోతోంది. ఇటీవల కాలంలో దీనిని రక్షించడానికి ఆ్రస్టేలియా కొన్ని కఠిన నిబంధనలు తీసుకొచ్చింది. అలాగే భారత్ తీర ప్రాంతంలో మెకనైజ్డ్ బోట్లతో వేట నిషేధం, ఇవి గుడ్లు పెట్టే సీజన్లో వేటకు విశ్రాంతి ప్రకటించడం వల్ల వీటికి రక్షణ లభిస్తోంది. -
కాకినాడలో విషాదం..పందుల్ని కాల్చబోతే పాపకు తూటా తగిలి..
సాక్షి, కాకినాడ: కాకినాడ జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. నాటు తుపాకీ పేలి నాలుగేళ్ల చిన్నారి ప్రాణాలు కోల్పోయింది. ఈ విషాదం తుని మండలం వెలమకొత్తూరు గ్రామంలో మంగళవారం జరిగింది. నాలుగేళ్ల చిన్నారి ధన్యశ్రీ ఇంటి సమీపంలో స్నేహితులతో కలిసి ఆడుకుంటోంది. అక్కడే కొందరు వ్యక్తులు నాటు తుపాకులతో పందుల్ని కాలుస్తున్నారు. ఈ క్రమంలో నాటు తుపాకీతో పందులను కాల్చడానికి ప్రయత్నిస్తుండగా.. ఓ తుటా గురితప్పి చిన్నారికి తగిలింది. దీంతో ధన్య శ్రీ అక్కడికక్కడే కుప్పకూలింది. వెంటనే స్నేహితులు బాలిక కుటుంబ సభ్యులకు చేరవేయగా.. వారు వచ్చి చిన్నారిని చూసేసరికి అప్పటికే మృతిచెందింది. కూతురు మరణంతో తల్లిదండ్రులు తీవ్రంగా విలపిస్తున్నారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. చదవండి: ఒక్కగానొక్క కుమార్తె.. తిరుగు ప్రయాణంలో బైక్‌పై వస్తుంటే -
చిరంజీవిపై ఎమ్మెల్యే ద్వారంపూడి ఆసక్తికర వ్యాఖ్యలు
సాక్షి, కాకినాడ: చిరంజీవిపై వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్‌రెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ, చిరంజీవి మళ్లీ రాజకీయాల్లోకి వస్తారని అనుకోవడం లేదన్నారు. ‘‘రాజకీయాలకు సరిపోననుకునే మళ్లీ సినీ ఇండస్ట్రీ వైపు అడుగులు వేశారు. సినిమాల ద్వారా చిరంజీవి ప్రజల్ని అలరించడం మంచి పరిణామం. సినిమాల్లోనే చిరంజీవికి సౌకర్యంగా ఉంది’’ అంటూ ఎమ్మెల్యే ద్వారంపూడి చురకలు అంటించారు. చదవండి: చిరంజీవి ఎందుకు ఉలిక్కిపడ్డారు? అదన్న మాట అసలు సంగతి! మరోవైపు చిరంజీవిపై ఎంపీ విజయసాయిరెడ్డి కూడా కీలక వ్యాఖ్యలు చేశారు. చిరంజీవి వ్యాఖ్యలకు కౌంటరిచ్చారు. సినిమా స్టార్స్ అయినా పొలిటిషియన్స్ అయినా ప్రజలు ఆదరిస్తేనే వారికి మనుగడ అని చెప్పుకొచ్చారు. సినీ పరిశ్రమలోని పేదలు, కార్మికుల సంక్షేమం బాధ్యత కూడా ప్రభుత్వానిదే అంటూ ట్విట్టర్ వేదికగా స్పష్టం చేశారు. చదవండి: చిరంజీవి ఎందుకు ఉలిక్కిపడ్డారు? అదన్న మాట అసలు సంగతి! -
అరటి నార.. అందమైన చీర
పిఠాపురం: వస్త్ర ప్రపంచంలో కాకినాడ జిల్లా కొత్తపల్లి, గొల్లప్రోలు మండలంలోని చేనేత కార్మికులు చరిత్ర సృష్టించారు. వారు నేసిన జాంధానీ చీరలు మహిళా లోకం అందాన్ని మరింత ఇనుమడింపజేసి అంతర్జాతీయ ఖ్యాతిని అందుకుంటున్నాయి. రెండువైపులా ఒకే విధంగా కనిపించడమే జాంధానీ చీరల ప్రత్యేకత. చీర తయారయినప్పుడు ఎంత విలువుంటుందో.. అది కాస్త పాడయినపుడు కూడా ఎంతో కొంత ధర పలకడం దీని విశిష్టత. మిగిలిన ఏ రకం చీరలకూ ఈ అవకాశం లేకపోవడం గమనార్హం. కుటీర పరిశ్రమగా ప్రారంభమైన జాంధానీ చీరల తయారీ నేడు ప్రపంచస్థాయి గుర్తింపునకు నాంది పలుకుతున్నాయి. ప్రతీ ఏటా కోట్ల రూపాయల జాంధానీ చీరల క్రయవిక్రయాలు జరుగుతున్నాయి. ఇటీవల ఢిల్లీలో నిర్వహించిన అంతర్జాతీయ ఎగ్జిబిషన్లో స్థానం సంపాదించి విదేశీ ఆర్డర్లు సైతం సా«ధించింది. ఈ క్రమంలో జాంధానీకి నయా ట్రెండ్‌ను జోడించి మరింత సోయగాలు అద్దడానికి ప్రభుత్వం చర్యలు తీసుకుంది. దీంతో ‘జాంధాని’ పేటెంట్ హక్కుతో పాటు ఉప్పాడ కాటన్, సిల్క్ మాదిరిగా ఇండియన్ హేండులూమ్స్లోనూ స్థానం సంపాదించింది. ఈ క్రమంలో జాంధానీకి నయా ట్రెండ్‌ను జోడించి మరింత సోయగాలు అద్దేలా చేనేతలకు ప్రోత్సాహం కల్పించాలనే ఉద్దేశంతో ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది. పర్యావరణ పరిరక్షణను దృష్టిలో పెట్టుకుని సహజసిద్ధంగా లభించే అరటి, అవిసె మొక్కల నారతో మంచి మంచి డిజైన్లతో వ్రస్తాలను తయారు చేసేలా వారికి శిక్షణ ఇస్తుంది. బనానా సిల్క్ నేతపై శిక్షణ.. మారుతున్న ట్రెండ్‌కు అనుగుణంగా వృత్తిలో నైపుణ్యం సాధించే విధంగా భారత ప్రభుత్వ జౌళి మంత్రిత్వ శాఖ చేనేత అభివృద్ధి కమిషన్ ఆధ్వర్యంలో చేనేత కార్మికులకు శిక్షణ ఇస్తుంది. ఇందుకోసం కాకినాడ జిల్లాలోని తాటిపర్తి, ప్రత్తిపాడులో రెండు శిక్షణ కేంద్రాలను ఏర్పాటు చేశారు. ఒక్కో కేంద్రంలో 20 మందికి చొప్పున కొత్త కొత్త డిజైన్లతో బనానా, లినిన్ నేతపై అధికారులు శిక్షణ ఇస్తున్నారు. బనానా దారంతో నేత అరటి బెరడులో ఉండే పీచుతో తయారు చేసిన దారంతో జాంధానీ చీరలు తయారు చేస్తారు. ఈ చీరల్లో ఉపయోగించే రంగులు కెమికల్స్‌కు స్వస్తి పలికి ఆర్గానిక్ పద్ధతిలో ప్రకృతి సిద్ధమైన బనానా దారంను ఉపయోగించడానికి చర్యలు తీసుకుంటున్నారు. సిల్క్ దారం ఎక్కువ కాలం మట్టిలో కలవకుండా ఉండడం వల్ల కాలుష్యం పెరిగే అవకాశాలు ఉండడంతో బనానా దారానికి ప్రాధాన్యతనిస్తున్నారు. మూసా ఫైబర్‌గా పిలవబడే ఇది వేడి తట్టుకోవడంతో పాటు మంచి స్పిన్నింగ్ సామర్థ్యం కలిగి అత్యధిక నాణ్యతతో ఉంటుంది. ప్రస్తుతం దీనిని కేరళ నుంచి దిగుమతి చేసుకుంటున్నారు. రానున్న కాలంలో అరటి బెరడులకు గిరాకీ పెరగనుంది. బనానా దారం తయారీకి చర్యలు .. బనానా, లినిన్ దారాలను కేరళ, తమిళనాడు, చెన్నై నుంచి దిగుమతి చేసుకుంటున్నాం. త్వరలో తయారీకి చర్యలు తీసుకుంటాం. స్కీం ఫర్ కెపాసిటీ బిల్డింగ్ ఇన్ టెక్స్టైల్స్ సెక్టార్ ద్వారా విజయవాడలోని వీవర్స్ సర్విస్ సెంటర్ ద్వారా కార్మికులకు శిక్షణ ఇస్తున్నాం. – కె.పెద్దిరాజు, చేనేత జౌళి శాఖాధికారి, కాకినాడ -
పులస సీజన్ వచ్చేసింది.. రికార్డులు షురూ
సాక్షి, కాకినాడ: అత్యంత అరుదైన.. విలువైందిగా భావించే చేప ‘పులస’ సీజన్ మొదలైంది. యానాం గోదావరికి ఎర్ర నీరు పోటెత్తిన సమయంలోనే పులసలు లభ్యమవుతాయని తెలిసిందే. ఈ క్రమంలో మార్కెట్లోకి మొదటి చేప వచ్చి.. మాంచి రేటుకే అమ్ముడుపోయింది. తాజాగా కేంద్రపాలిత ప్రాంతమైన యానాంలో వేటకు వెళ్లిన మత్స్యకారులకు వారం తర్వాత మొట్టమొదటి పులస వలకి చిక్కిందట. రెండు కేజీల దాకా బరువు ఉన్న దీనిని రూ.15 వేల రూపాయలకు అమ్మినట్లు మహిళ చెబుతోంది. పులసల కోసం కాకినాడ, రాజమండ్రి నుంచే కాదు.. హైదరాబాద్ నుంచి కూడా జనం వస్తుంటారని సదరు మహిళ అంటోంది. దీంతో ఈ ఏడాది పులస గరిష్టంగా ఏ రేటుకు అమ్ముడుపోతుందో అనే ఆసక్తి నెలకొంది. గోదావరి జిల్లాల్లో ‘పుస్తెలు అమ్మినా సరే.. పులస తినాలి’ అని నానుడి. పులస చేప దొరకడమే చాలా అరుదు.. అందుకే జీవితంలో ఒక్కసారైనా పులస చేపను తినాలని భావిస్తుంటారు. నదీ ప్రవాహానికి అతివేగంగా ఎదురీదడం ఈ చేప ప్రత్యేకత. దీంతో ఎంత రేటైనా కొనుగోలు చేసేందుకు జనం వెనుకాడరు. పులసలు.. గోదావరి నదిలో మాత్రమే లభిస్తుంటాయి. ఇదే చేప సముద్రంలో దొరికితే దానిని ‘వలస చేప’ అంటారు. సంతానోత్పత్తి కోసం ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, టాంజానియా వంటి సుదూర ప్రాంతాల నుంచి ఖండాలను దాటి హిందూ మహాసముద్రం మీదుగా ప్రయాణించి అవి బంగాళాఖాతంలో ప్రవేశిస్తాయి. గోదావరి నుంచి వరద నీరు వచ్చి అంతర్వేది వద్ద సముద్రంలో కలిసే సమయంలో గుడ్లు పెట్టడం కోసం గోదావరిలోకి ఎదురీదుకుంటూ ప్రవేశిస్తాయి. ఇదంతా జూన్ నుంచి ఆగస్టు మాసాల మధ్య జరుగుతుంది. గుడ్లు పెట్టిన తరువాత మళ్లీ అక్టోబరు నాటికి సముద్రంలో ప్రవేశిస్తాయి. గోదావరి వరదనీటిలో సంతానోత్పత్తికి గుడ్లు పొదగడానికి వచ్చి వలలో పడతాయి. వలలో పడిన వెంటనే చనిపోవడం, రెండురోజులైనా పాడవకుండా ఉండడం కూడా పులసల విశిష్టత. గోదావరి తీపి నీటిలోకి వచ్చేసరికి ఈ చేప రంగు, రుచీ మారి పులసగా మారుతోంది. అలాగని గోదావరి అంతటా ఈ పులసలుండవు. కేవలం ధవళేశ్వరం బ్యారేజ్ నుంచి సముద్రంలో కలిసే మధ్యలోనే ఇవి దొరుకుతాయి. -
కాకినాడ జిల్లా తుని మండలం ఎర్రకోనేరులో దారుణహత్య
-
కాకినాడలో దారుణం: మహిళా చిరు వ్యాపారి హత్య
సాక్షి, కాకినాడ: తుని మండలం ఎర్రకోనేరు వద్ద దారుణం జరిగింది. ఓ మహిళా చిరు వ్యాపారిని నగదు కావాలంటూ బెదిరించి.. కత్తులతో దాడి చేశారు ఇద్దరు దుండగులు. తీవ్ర గాయాలపాలైన ఆమెను ఆస్పత్రికి తరలిస్తుండగా.. మార్గం మధ్యలోనే కన్నుమూసింది. తొలుత.. ఆ దారి వెంట వెళ్తున్న ఓ ఆటోను ఆపి డ్రైవర్‌ను కత్తితో దాడి చేశారు ఇద్దరు దుండగులు. దాడి అనంతరం అతని ఆటో తీసుకుని పరారయ్యారు. ఈ క్రమంలో.. కొద్ది దూరంలో చిన్న కొట్టు నడిపించుకుంటున్న మహిళను గమనించారు. ఆమె దగ్గరకు వెళ్లి కత్తి చూపించి నగదు కావాలంటూ బెదిరించారు. ఆమె భయంతో కేకలు వేయగా.. కత్తితో దాడి చేసి పరారయ్యారు. గాయపడిన మహిళను స్థానికులు తుని ప్రభుత్వ ఆస్పత్రికి తరలిస్తుండగా.. మార్గం మధ్యలోనే మృతి చెందింది. గాయపడిన ఆటో డ్రైవర్‌ను కాకినాడ ప్రభుత్వాసుపత్రికి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తుండగా.. క్లూస్ టీం ఘటనా స్థలి నుంచి వివరాలు సేకరించింది. మృతి చెందిన మహిళ పేరు, ఇతర వివరాలు తెలియాల్సి ఉంది. ఇదీ చదవండి: దిశ పోలీసుల ఎంట్రీతో నర్సింగ్ విద్యార్థినులు సేఫ్ -
కాకినాడలో ఏపీ బీసీల ఆత్మగౌరవ సభ
-
‘స్పృహ లేకుండా మాట్లాడటం..బురద చల్లేయడం పవన్‌కు అలవాటు’
సాక్షి, కాకినాడ : పవన్ కళ్యాణ్‌పై ఎమ్మెల్యే కురసాల కన్నబాబు మండిపడ్డారు. అవగాహనలేమితోనే వాలంటీర్లపై పవన్ కళ్యాణ్ మాట్లాడుతున్నాడని, ప్రజల్లో ఏం జరుగుతుందో పవన్‌కు తెలియడం లేదని విమర్శించారు. స్పృహ లేకుండా మాట్లాడటం, బురద చల్లేయడం పవన్‌కు అలవాటైందని, సీఎం జగన్‌పై కక్ష, ద్వేషం, అసూయతోనే పవన్ మాట్లాడుతున్నాడని ధ్వజమెత్తారు కురసాల కన్నబాబు. వాలంటీర్లతో మంగళవారం సమావేశమైన కురసాల.. అనంతరం మాట్లాడుతూ ‘ప్రజల్లో వాలంటీర్లకు, ప్రభుత్వానికి మంచి పేరు రావడంతో పవన్‌కు కడుపు మంట.పవన్ కు కొంచెమైన ఆలోచన.. సభ్యత ఉందా?, సభ్యత సంస్కారం లేకుండా ఎవరిని పడితే వాళ్ళను దూషిస్తున్నాడు. వాలంటీర్ల వ్యవస్ధను సిఎం జగన్ తీసుకువచ్చారాని తప్పుడుగా చిత్రికరించాలని కోరిక. 2021 నేషనల్ క్రైం రికార్డ్ బ్యూరో నివేధిక ప్రకారం మహిళల అదృశ్యంలో ఎపీ 11 వ స్ధానం లో ఉంది. రికవరీలో 2 వ స్ధానం లో ఉంది. మరీ మనకన్న ముందున్న 10 రాష్ట్రాల్లో వాలంటీర్ వ్యవస్ధ లేదు కదా?, ఆ రాష్ట్రాల్లో మహిళల అదృశ్యానికి కారణం ఎవరూ?, స్పృహ లేకుండా మాట్లాడడం.. బురద చల్లేయడం పవన్‌కు అలవాటు అయ్యింది. దీని మీద చర్చలు జరగాలి.. మనం వెళ్ళి షూటింగ్ లు చేసుకోవాలి అన్న తీరులో పవన్ ఉన్నాడు. 2.80 లక్షల మంది మనోభావాలు దెబ్బ తీశానన్న ఆలోచన పవన్‌కు లేదు’ అని కురసాల పేర్కొన్నారు. -
యనమల ఓ రాజకీయ శకుని: దాడిశెట్టి రాజా
సాక్షి, కాకినాడ: టీడీపీ నేత యనమల రామకృష్ణుడిపై మంత్రి దాడిశెట్టి రాజా సీరియస్ అయ్యారు. యనమల ఓ రాజకీయ శకుని అని ఘాటు వ్యాఖ్యలు చేశారు. అక్రమ కేసులు పెట్టించడం యనమల సోదరులకు పైశాచిక ఆనందం అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. కాగా, దాడిశెట్టి రాజా శుక్రవారం మీడియాతో మాట్లాడుతూ.. ఎవరిపై కేసులు పెడదామా అని యనమల ఆలోచిస్తాడు. ఎన్నికొలొస్తున్నాయనే తునిలో యనమల మోకాళ్ల యాత్ర చేస్తున్నాడు. వచ్చే ఎన్నికల్లోనూ యనమలకు ఓటమి ఖాయం. 1989లో తునిలో వంగవీటి విగ్రహం పెడితే యనమల సోదరులు పొడిపించేశారు. గత 40 ఏళ్ళుగా యనమలకు తుని ప్రజలు గుర్తుకు రాలేదు. బెంగళూరులో ఉండే యనమల కుమార్తె తుని వచ్చి రాజకీయం చేస్తానంటే కుదరదు అంటూ వ్యాఖ్యలు చేశారు. ఇది కూడా చదవండి: విశాఖలో నోట్ల మార్పిడి కలకలం.. జనసేన నాయకుడి అనుచరుడి అరెస్ట్ -
రూ.21 కోట్లు కొల్లగొట్టేశారు.. కుటుంబ సభ్యుల నిర్వాకం..
సాక్షి ప్రతినిధి, కాకినాడ: కుటుంబ సభ్యులనే డైరెక్టర్లుగా నియమించుకుని అధిక వడ్డీల ఆశ చూపి అమాయకులను బురిడీ కొట్టించి న కాకినాడ కార్తికేయ బిల్డింగ్ సొసైటీ గుట్టురట్టు అయ్యింది. సకాలంలో రాష్ట్ర ప్రభుత్వం స్పందించడంతో అక్రమార్కుల ఆస్తులను సీజ్‌చేసి వేలం వేసేందుకు మార్గం సుగమమైంది. తద్వారా సొసైటీ బాధితులకు ప్రభు త్వం నుంచి భరోసా లభించింది. కాకినాడ కేంద్రంగా ఏర్పాటైన కార్తికేయ బిల్డింగ్ సొసై టీ డిపాజిటర్లకు మెచ్యూరిటీ సొమ్ములు ఇవ్వకుండా బోర్డు తిప్పేసిన వ్యవహారాన్ని ‘కొంప ముంచిన కార్తికేయ’.. శీర్షికన ‘సాక్షి’ గత ఏప్రిల్ 2న వెలుగులోకి తీసుకొచ్చింది. దీంతో రాష్ట్ర ప్రభుత్వం స్పందించి ‘కార్తికేయ’లో జరిగిన రూ.కోట్ల కుంభకోణంపై ప్రత్యేక దృష్టిపెట్టి సహకార శాఖ ద్వారా విచారణ జరిపించింది. ఆ శాఖ కమిషనర్ అహ్మద్‌బాబు, కాకినాడ జిల్లా కలెక్టర్ కృతికా శుక్లా సహకార శాఖ ద్వారా వివిధ కోణాల్లో విచారణ జరిపించింది. కార్తికేయ బిల్డింగ్ సొసైటీ ఆర్థిక కుంభకోణం విలువ రూ.21.58 కోట్లుగా లెక్క తేల్చి ప్రభుత్వానికి నివేదిక సిద్ధంచేసింది. అధిక వడ్డీల ఆశచూపి.. అధిక వడ్డీలు ఇస్తామంటూ 300 మంది డిపాజిటర్లను నమ్మించి సుమారు రూ.19.40 కోట్ల వరకు సొసైటీ వారి నుంచి సేకరించింది. ఈ మొత్తానికి ఇవ్వాల్సిన వడ్డీయే రూ.2.05 కోట్లకు పైగా ఉంది. డిపాజిట్ల మొత్తంలో రూ.10 కోట్లను సొసైటీ ఖాతాలో ఎక్కడా నమోదు చేయకుండానే నొక్కేశారని తేలింది. అలాగే, అసలు రుణాలేమీ ఇవ్వకుండానే ఇచి్చనట్లుగా 361 మంది బినామీ పేర్లతో రూ.5.36 కోట్లు స్వాహా చేశారు. ఇందుకు వడ్డీ రూ.2 కోట్లు వచ్చినట్లుగా రికార్డుల్లో చూపించారు. అంతేకాక.. రుణాలివ్వగా వాటి నుంచి వచ్చిన వడ్డీ రూ.1.65 కోట్లు అసలు సొసైటీలో జమచేయకుండానే వాటినీ దారి మళ్లించేశారు. ఈ వడ్డీ సొమ్ములో ఒక్కపైసా కూడా సొసైటీ నగదు పుస్తకంలో లేకపోవడం చూసి సహకార శాఖ అధికారులు విస్తుపోయారు. పిల్లల పెళ్లిళ్లు, ఇల్లు కట్టుకోవడం వంటి భవిష్యత్ అవసరాలకు ఉపయోగపడుతుందనే ముందుచూపుతో రిటైరైన ఉద్యోగులు, చిరుద్యోగులు, సన్న, చిన్నకారు రైతులు ‘కార్తికేయ’లో ఫిక్స్డ్ డిపాజిట్ చేసిన రూ.2.56 కోట్లను కూడా మాయం చేసేసి డిపాజిటర్ల నోట మట్టికొట్టారు. కుటుంబ సభ్యులే డైరెక్టర్లుగా.. ఈ మొత్తం వ్యవహారంపై జిల్లా సహకార అ«ధికారి బొర్రా కనక దుర్గాప్రసాద్ ఆదేశాల మేరకు అసిస్టెంట్ రిజి్రస్టార్ ఎన్విఎస్ఎస్ దుర్గాప్రసాద్ విచారణ జరిపి కుంభకోణాన్ని నిర్థారించారు. బిల్డింగ్ సొసైటీ వ్యవస్థాపక అధ్యక్షుడు, అప్పటి ప్రెసిడెంట్ కోడి వీరవెంకట సత్యనారాయణ తన భార్య పద్మావతి, ఇద్దరు కుమారులు వెంకటేశ్, శంకర్‌ను డైరెక్టర్లుగా నియమించుకుని ప్రజల సొమ్మును దిగమింగారు. వీరితో పాటు చేపూరి గంగరాజు, బాలం విజయకుమార్, గ్రంథి వీరేంద్ర, టేకి త్రినా«థ్ పుష్పరాజ్యం, అంజుమ్ సుల్తానా, దొమరసింగు సింహాద్రిరావు, ఇరుసుమల్ల పార్వతి, ముసినాడ సాంబశివరావు, సొసైటీ మేనేజర్ మీర్ అమీర్‌హుస్సేన్, అకౌంటెంట్ కోన కనకమహాలక్ష్మి కుమ్మక్కై ఈ కుంభకోణానికి పాల్పడినట్లుగా తేలింది. ప్రభుత్వ చొరవతో ఆస్తులు సీజ్.. మరోవైపు.. రాష్ట్ర ప్రభుత్వం సకాలంలో స్పందించడంతో కోడి వీరవెంకట సత్యనారాయణ పేరుతో ఉన్న మూడు విలువైన ఆస్తులను సీజ్‌చేశారు. ఇందులో కాకినాడ వాకలపూడిలోని 1,400 చదర పు గజాలు ఖాళీ స్థలం, కాకినాడ నూకాలమ్మ గుడి వద్ద ఉన్న బిల్డింగ్ సొసైటీ భవనంతోపాటు మరో ఇల్లు సీజ్ చేశా రు. వీటి విలువ రూ.10 కోట్ల నుంచి రూ.12 కోట్ల వరకు ఉంటాయి. త్వరలో వీటిని వేలం వేసి ఆ సొమ్ముతో డిపాజిటర్లకు ప్రభుత్వం న్యాయం చేయనుంది. చదవండి: ఇదే నాకు మొదటి పెళ్లి... నాకు మందు, సిగరేట్లు కావాలి బాధ్యులపై క్రిమినల్ కేసులు.. కుంభకోణానికి పాల్పడ్డ కోడి వీరవెంకట సత్యనారాయణ సహా 14 మందిపై జిల్లా సహకార అధికారి బొర్రా దుర్గాప్రసాద్ ఫిర్యాదు ఆధారంగా పోలీసులు క్రిమినల్ కేసులు నమోదుచేశారు. కాకినాడ టూటౌన్ ఇన్స్పెక్టర్ బి. నాగేశ్వర్‌నాయక్ వీరిపై ఐపీసీ 120బి, 420, 406, 408, 109 సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. ప్రభుత్వం ఈ విషయాన్ని తీవ్రంగా పరిగణించి విచారణ కొనసాగిస్తోందని దుర్గాప్రసాద్ ‘సాక్షి’కి చెప్పారు. -
ఆగమేఘాలపై కిడ్నీ తరలింపు
కాకినాడ : కాకినాడ అపోలో ఆస్పత్రిలో బ్రెయిన్ డెడ్ అయిన 50 ఏళ్ల మహిళ కుటుంబం ఆదర్శంగా నిలిచింది. ఆమె మూత్రపిండాలను కుటుంబ సభ్యులు దానం చేసి మరో ఇద్దరి ప్రాణాలు నిలిపారు. వివరాల్లోకి వెళితే.. కాకినాడ అపోలో ఆస్పత్రిలో బ్రెయిన్ డెడ్ బాధితురాలి నుంచి గురువారం రెండు కిడ్నీలు సేకరించారు. ఓ కిడ్నీని అదే ఆస్పత్రిలో రోగికి అమర్చగా, మరో కిడ్నీని విశాఖలోని కిమ్స్ ఐకాన్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ప్రాణాపాయ స్థితిలో ఉన్న బాధితుడికి అమర్చే నిమిత్తం తీసుకెళ్లారు. కాకినాడ అపోలో యాజమాన్యం జిల్లా ఎస్పీ సతీ‹Ùకుమార్‌ను ఆశ్రయించగా.. ఆయన గ్రీన్ చానల్ ఏర్పాటు చేశారు. కట్టుదిట్టమైన ఏర్పాట్ల మధ్య కిడ్నీని అంబులెన్స్‌లో విశాఖ తరలించారు. కనీసం నాలుగు గంటల సమయం పట్టే ప్రయాణం కేవలం రెండు గంటల్లోనే పూర్తయి కిడ్నీ భద్రంగా చేరింది. -
పవన్ ను కాపు కులం నమ్మదు: ముద్రగడ
-
Andhra Pradesh: మినీ పోర్టులా ఉప్పాడ!
(ఉప్పాడ ఫిషింగ్ హార్బర్ నుంచి సాక్షి ప్రతినిధి చంద్రశేఖర్ మైలవరపు): ఉప్పాడ వద్ద రాష్ట్ర ప్రభుత్వం రూ.361 కోట్లతో భారీ ఫిషింగ్ హార్బర్‌ను వేగవంతంగా నిర్మిస్తుండటం పట్ల స్థానిక మత్స్యకారుల్లో హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి. సుదీర్ఘకాలంగా ఎదురు చూస్తున్న మంచి రోజులు కనుల ముందు కనిపిస్తున్నాయి. అన్ని పనులూ పూర్తి చేసుకుని డిసెంబర్ నాటికి అందుబాటులోకి రానుండటంతో మత్స్యకార కుటుంబాల్లో సంతోషం అంతా ఇంతా కాదు. ఇకపై తమ కష్టం వృథా కాదన్న ధీమా ఏర్పడిందని ఆత్మవిశ్వాసంతో చెబుతున్నారు. రాష్ట్రంలోని సముద్ర తీరాల్లో కాకినాడ వద్ద అత్యంత విలువైన ట్యూనా, సొర వంటి చేపలు ఉన్నా.. సరైన వసతులు లేకపోవడంతో మత్స్యకారులు ఆ అవకాశాన్ని వినియోగించుకోలేకపోతున్నారు. నడి సముద్రంలోకి వెళ్లి పది రోజుల వరకు ఉండి చేపలు పట్టుకునే భారీ స్థాయి బోట్లను నిలుపుకునే చోటు లేకపోవడమే ఇందుకు కారణం. ఇప్పుడు ఈ సమస్యకు రాష్ట్ర ప్రభుత్వం చక్కటి పరిష్కారాన్ని చూపిస్తూ రాష్ట్రంలోనే భారీ ఫిషింగ్ హర్బర్‌ను ఉప్పాడ వద్ద నిర్మిస్తోంది. మిగిలిన హార్బర్లలో సముద్రం నుంచి లోతైన కాలువను తవ్వి అక్కడ బోట్లు నిలుపుకోవడానికి జెట్టీలను నిర్మిస్తుంటే.. ఉప్పాడ వద్ద మాత్రం పోర్టు మాదిరిగానే సముద్ర ఒడ్డుకు ఆనుకునే బోట్లను నిలుపుకునే విధంగా హార్బర్‌ను నిర్మిస్తున్నారు. ఇప్పటికే 55 శాతం పనులు పూర్తి చేసుకున్న ఉప్పాడ ఫిషింగ్ హార్బర్‌ను ఈ సంవత్సరాంతానికి అందుబాటులోకి తీసుకురావాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. ఇప్పటికే ఉత్తర, దక్షిణ బ్రేక్ వాటర్ పనులు పూర్తి స్థాయిలో పూర్తవగా.. డ్రెడ్జింగ్ పనులు, ఒడ్డున బిల్డింగ్‌ల నిర్మాణ పనులు ప్రారంభమయ్యాయి. 2,500 బోట్లు నిలుపుకునేలా.. ♦ రెండ్రోజుల నుంచి 10 రోజుల వరకు ఏకబిగిన వేట కొనసాగించే విధంగా వివిధ పరిమాణాల బోట్లను నిలుపుకునేందుకు అనువుగా ఈ హార్బర్‌ను తీర్చిదిద్దుతున్నారు. ♦ సుమారు 2,500 బోట్లను నిలుపుకునేలా జెట్టీని నిర్మిస్తున్నారు. ♦ దాదాపు 58 ఎకరాల విస్తీర్ణంలో నిర్మిస్తున్న ఈ హార్బర్లో ఫిషింగ్ హ్యాండ్లింగ్, వేలం కేంద్రం, పది టన్నుల ఐస్ ప్లాంట్, 20 టన్నుల శీతల గిడ్డంగి, పరిపాలన కార్యాలయాలతో పాటు ట్యూనా చేపల కోసం ప్రత్యేకంగా ట్యూనా ఫిష్ హ్యాండ్లింగ్, ప్యాకింగ్ హాల్స్‌ను ఏర్పాటు చేస్తున్నారు. ♦ ట్యూనా చేపలు పట్టుకునేందుకు వీలుగా తొమ్మిది మీటర్ల నుంచి 24 మీటర్ల వరకు ఉండే లాంగ్‌లైన్ బోట్లను ఇక్కడ నిలుపుకునే అవకాశముంది. ♦ ఈ ఫిషింగ్ హార్బర్ ద్వారా ఏటా రూ.859 కోట్ల విలువైన 1,10,600 టన్నుల మత్స్య సంపద వస్తుందని అధికారుల అంచనా. 17,700 మందికి ఉపాధి లభించనుంది. పది ఫిషింగ్ హార్బర్ల నిర్మాణం రాష్ట్రంలోని మత్యకారులు వేట కోసం ఇతర రాష్ట్రాలు, దేశాలు వలస వెళ్లకుండా స్థానికంగానే చేపలు పట్టుకోవాలనే లక్ష్యంతో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఏక కాలంలో 10 ఫిషింగ్ హార్బర్ల నిర్మాణాన్ని చేపట్టారు. తొలి దశలో చేపట్టిన నాలుగు ఫిషింగ్ హార్బర్లయిన జువ్వలదిన్నె, నిజాంపట్నం, మచిలీపట్నం, ఉప్పాడలు ఈ సంవత్సరాంతానికి అందుబాటులోకి తీసుకొస్తున్నాం. సుమారు రూ.3,500 కోట్లకు పైగా నిధులతో 60,858 మత్యకార కుటుంబాలకు ప్రయోజనం కలిగేలా వీటిని నిర్మిస్తున్నాం. మినీ పోర్టు తరహాలో వీటి నిర్మాణం చేపట్టడమే కాక వీటిపక్కనే ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లను ఏర్పాటుచేసేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. – ప్రవీణ్‌కుమార్, సీఈఓ, ఏపీ మారిటైమ్ బోర్డు త్వరలో మంచి రోజులు ఇప్పటి వరకు బోట్లు నిలుపుకోవడానికే సరైన సదుపాయాల్లేక ఐదారుచోట్ల నిలుపుకునేందుకు నానా అవస్థలు పడుతుండేవాళ్లం. పాదయాత్ర సమయంలో మా పరిస్థితిని వైఎస్ జగన్ దృష్టికి తీసుకొస్తే మినీ ఫిషింగ్ హార్బర్ నిర్మిస్తామన్నారు. కానీ, ఇప్పుడు ఏకంగా రూ.361 కోట్లతో రాష్ట్రంలోనే అతిపెద్ద హార్బరును మినీపోర్టు స్థాయిలో నిర్మిస్తున్నారు. బోట్లు నిలుపుకోవడం దగ్గర నుంచి రిపేర్లు, డీజిల్, వేలంపాటలు, అమ్మకాలు అన్నీ ఒకేచోట ఉండేలా నిర్మిస్తుండటంతో వ్యయం తగ్గి లాభాలు పెరుగుతాయి. దీని ద్వారా తొండంగి, కొత్తపల్లి, కాకినాడ రూరల్ మండలాలకు చెందిన 50,000 మత్యకార ప్రజలకు ప్రయోజనం లభిస్తుంది. ఈ స్థాయిలో హార్బర్ నిర్మాణ పనులు ఇంత వేగంగా జరుగుతాయని ఎవ్వరూ ఊహించలేదు. మేమంతా సీఎం వైఎస్ జగన్‌కు రుణపడి ఉంటాం. – ఎన్. మణికంఠబాబు, సర్పంచ్, అమినాబాద్ గతంలో ఎంతటి భారీ చేప తీసుకొచ్చినా పొద్దున రూ.1,000 ధర ఉంటే సాయంత్రం రూ.500కు పడిపోయేది. దీంతో బాగా నష్టపోయే వాళ్లం. ఇప్పుడు ఈ హార్బర్ రావడం.. ఇక్కడ శీతల గిడ్డంగులు ఉండటంతో ఆ భయం ఉండదిక. నచ్చిన ధర వచ్చినప్పుడే అమ్ముకునే వెసులుబాటు కలుగుతుంది. గతంలో హార్బర్ లేకపోవడం వల్ల పోటు సమయంలో బోటు నిలుపుకోవడానికి కష్టంగా ఉండేది. సరుకు దింపే సమయంలో ప్రమాదాలు జరిగేవి. మనుషులు గల్లంతైన సందర్భాలూ ఉన్నాయి. ఇప్పుడా భయాలు మాకు ఉండవు. సునామీ వచ్చినా మా పడవలు భద్రంగా నిలుపుకోవచ్చు. – ఉమ్మడి యోహాను, మత్స్యకారుడు, ఉప్పాడ -
వైఎస్ఆర్ సీపీ హయాంలోనే మహిళలకు అధిక ప్రాధాన్యత దక్కింది
-
పవన్.. వాస్తవాలు తెలుసుకుని మాట్లాడు..: కాపు మహిళా నేతలు
సాక్షి, కాకినాడ జిల్లా: వైఎస్సార్సీపీ హయాంలోనే మహిళలకు అధిక ప్రాధాన్యత దక్కిందని కాపు మహిళా నేతలు అన్నారు. ఆదివారం వారు మీడియా సమావేశంలో మాట్లాడుతూ, కాకినాడలో కాపు మహిళలను ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్‌రెడ్డి రాజకీయంగా ప్రోత్సహిస్తున్నారన్నారు. పవన్ కల్యాణ్ రాజకీయాల కోసం తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని మండిపడ్డారు. వీర మహిళలపై దాడి అంటూ రెచ్చగొట్టేయత్నం చేస్తున్నారని దుయ్యబట్టారు. ఎమ్మెల్యే ద్వారంపూడిపై వపన్ చేసేవన్నీ తప్పుడు ఆరోపణలేనని కాపు మహిళా నేతలు అన్నారు. కాపులను గౌరవించేది ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్‌రెడ్డి. కాపుల కోసం ఆలోచించి ఉన్నత పదవులు ఇచ్చారు’’ అని పేర్కొన్నారు. నగర వైఎస్సార్సీపీ అధ్యక్షురాలు సుంకర శివ ప్రసన్న పవన్ ఎక్కడ మీటింగ్ పెట్టిన ద్వారంపూడి పేరు ప్రస్తావిస్తున్నారు. ద్వారంపూడి వల్ల పవన్‌కు ఎప్పుడో మంచి జరిగే ఉంటుంది. గతంలో ఎమ్మెల్యే ద్వారంపూడి ఇంటిని ముట్టడించడానికి వీరమహిళలు వచ్చారు. అప్పుడు మేమంతా ద్వారంపూడికి అండగా నిలబడ్డాం -కాకినాడ అర్బన్ డవలప్మెంట్ ఛైర్మన్ చంద్రకళా దీప్తి గత 30 ఏళ్లుగా నగరంలో ఉన్న 80 శాతం కాపులు ద్వారంపూడి కి అండగా ఉంటున్నాం. మాకు ద్వారంపూడితో ప్రయాణం ఆనందకరం. -రాజారపు కృష్ణ, కాపు నేత -
పవన్‌కు నాయకత్వ లక్షణాల్లేవ్!: ద్వారంపూడి
సాక్షి, కాకినాడ: రాజకీయాల్లో ఓడిపోతామని తెలిసి కూడా పోరాడేవాడే నిజమైన నాయకుడని, జనసేన చీఫ్ పవన్ కల్యాణ్‌లో అలాంటి లక్షణాలు మచ్చుకు కూడా లేవన్నారు కాకినాడ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి. నాయకత్వ లక్షణం అంటే వైఎస్ జగన్‌దేనని స్పష్టం చేశారు. బుధవారం కాకినాడలో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. రాజకీయాల్లో ఉన్నప్పుడు ఓడిపోతామని తెలిసినా నాయకుడు యుద్దం నుండి తప్పుకోకూడదు. యుద్దం నుండి ఎప్పుడైతే తప్పుకున్నామో మన వెనుక ఉన్న సైనికులు భయపడతారు. ‘‘ఓడిపోతాం.. ముఖ్యమంత్రి అవ్వం’’ అంటే అది యుద్దమా?. నాయకుడి లక్షణమా?. నాయకత్వం అంటే వైఎస్ జగన్‌దే. ఏనాడూ ఆయన కార్యకర్తలకు అధైర్యాన్ని పంచలేదు. ఆయన కష్టకాలంలో ఉన్నా కూడా మాకు ధైర్యం పంచాడు. సిసలైన నాయకత్వ లక్షణం అంటే ఇదే. రాజకీయాల్లో పవన్ కళ్యాణ్ కన్నా నేను సీనియర్ని. కాకినాడ నుండి పవన్ కల్యాణే కాదు..లోకేష్ పోటి చేసినా ప్రజలు ఘోరంగా ఓడిస్తారు. పవన్, లోకేష్ .. ఎవరు పోటీకి ముందుకు వచ్చినా .. నేను రెడీ అంటూ పేర్కొన్నారాయన. ఇదీ చదవండి: ఫన్నీ ఫన్నీగా లోకేష్ పాదయాత్ర -
వీళ్లకు వీర‘తాళ్లు’ వేయాల్సిందే
భారీ ఓడలు సముద్రంలో లంగరు వేయాలన్నా.. ఆలయ వీధుల్లో రథాలు పరుగులు తీయాలన్నా.. ఆ ఊళ్లో తయారయ్యే భారీ తాళ్లు, పగ్గాలను వాడాల్సిందే. తాళ్ల తయారీలో యంత్రాలు రంగప్రవేశం చేసినా.. ఆ ఊరి కార్మికుల పనితనం ముందు దిగదుడుపే. నౌకల్లో ఉపయోగించే భారీ మోకులు.. తాళ్లు.. పగ్గాల తయారీకి వందల ఏళ్ల నుంచీ తాళ్లరేవు గ్రామం ప్రసిద్ధి చెందింది. సాక్షి ప్రతినిధి, కాకినాడ: కాకినాడ–అమలాపురం మధ్య జాతీయ రహదారిపై వెళ్లే ప్రతి ఒక్కరి చూపు తాళ్లరేవు రాగానే టక్కున ఆగిపోతుంది. తాళ్లే కదా.. ఎక్కడైనా తయారవుతాయనుకుంటే పొరబడ్డట్టే. ఇక్కడ తయారయ్యే తాళ్లకు పెద్ద చరిత్రే ఉంది. పెద్ద, పెద్ద కర్మాగారాల్లో తయారయ్యే తాళ్లు ఇక్కడ చేతితో తయారుచేసే తాళ్ల ముందు నిలవలేవంటే ఆశ్చర్యమేస్తుంది. అత్యధిక నాణ్యత.. 50 శాతం తక్కువ ధరల్లో ఇక్కడ తాళ్లు లభిస్తాయి. పాత తాళ్లు కొత్తగా అలంకరించుకోవాలన్నా.. తక్కువ ధరకే అవి దొరకాలన్నా తాళ్లరేపు పేరును తలవాల్సిందే. సెకండ్ హ్యాండ్ (పాత తాళ్ల)ను రీ ప్రాసెసింగ్ చేసి కొత్తవిగా తయారు చేయడంలో చేయి తిరిగిన నైపుణ్యం అక్కడి వారి సొంతం. 200 ఏళ్ల క్రితం సంభవించిన జల ప్రళయంతో.. ఈస్ట్ ఇండియా కంపెనీ వ్యాపారం కోసం ఇక్కడకు వచ్చి స్థావరాలు ఏర్పాటు చేసుకోవడంతో ఇప్పుడున్న కోరంగి అభయారణ్య ప్రాంతం అప్పట్లో పట్టణంగా విరాజిల్లింది. అమెరికా, రష్యా, ఇరాన్, ఇరాక్ తదితర దేశాల నుంచి ఓడలు కోరంగి రేవు ద్వారానే ఎగుమతి, దిగుమతులు సాగించేవి. కోరంగి నుంచి కేంద్రపాలిత యానాం వరకు విస్తరించి ఉన్న సముద్ర తీరానికి ఓడలు, పెద్దపెద్ద బోట్లు రాకపోకలు సాగించేవి. 2 వేల నుంచి 20 వేల టన్నుల సామర్థ్యం గల ఓడలు సైతం ఇక్కడకు వచ్చేవి. సుమారు 200 ఏళ్ల క్రితం సంభవించిన జల ప్రళయంలో ఓడలు, ఓడరేవుతో సహా కొట్టుకుపోయాయి. అప్పట్లో వేటకు వెళ్లిన వందలాది మత్స్యకారులు మృత్యువాతపడ్డారు. ఇంటి యజమానులు మృత్యువాత పడటంతో జీవనోపాధి కోసం ఇక్కడి మహిళలు కొబ్బరి, తాటి నారతో తాళ్లు తయారుచేసి విక్రయించడం ప్రారంభించారు. అలా మొదలైన తాళ్ల తయారీ తాళ్లరేవులో కుటీర పరిశ్రమగా మారింది. ప్రస్తుతం మహిళలు, పురుషులు సైతం తాళ్లను తయారు చేస్తూ ఇతర రాష్ట్రాలకు ఎగుమతి చేసే స్థాయికి చేరుకుంది. తాళ్లరేవు ప్రాంతంలో కొబ్బరి, తాటి, నైలాన్, ప్లాస్టిక్ తాళ్లను తయారు చేస్తున్నారు. అర అంగుళం నుంచి అడుగున్నర మందంతో భారీ తాళ్లను సైతం ఇక్కడ తయారు చేస్తున్నారు. ఓడలకు, ఫైబర్ బోట్లకు వినియోగించే తాళ్లు కూడా ఇక్కడ తయారవుతున్నాయి. రథాలకు వినియోగించే పగ్గాలను సైతం ఇక్కడే తయారు చేస్తున్నారు. ఏటా 900 టన్నుల తాళ్ల ఎగుమతి ఏటా 900 టన్నుల వరకు తాళ్లు ఇక్కడ తయారవుతున్నాయి. తెలంగాణ, గుజరాత్, పశ్చిమ బెంగాల్ తదితర ప్రాంతాలకు ఇక్కడి తాళ్లను ఎగుమతి చేస్తున్నారు. ఈస్ట్ ఇండియా కంపెనీ వ్యాపార లావాదేవీలు ప్రారంభించిన సందర్భంలో కోరంగిలో ఓడలు రాకపోకలకు వీలుగా ఓడ రేవును ఏర్పాటు చేయడమే తాళ్ల పరిశ్రమలు ఏర్పాటుకు దోహదం చేసింది. మేడిది.. పెమ్మాడి వంశీకులతో మొదలై.. తొలుత ఈస్ట్ ఇండియా వ్యాపారులతో పెనవేసుకున్న తాళ్ల బంధం కాస్తా వారసత్వ సంపదగా మారింది. తొలినాళ్లలో తాళ్లరేవుకు చెందిన మేడిది, పెమ్మాడి వంశీయులు తాళ్లు తయారుచేసే వారు. తాళ్ల తయారీ వంశపారంపర్యంగా మారి నాలుగు తరాలుగా నేటికీ కొనసాగుతుండటం విశేషం. ఇక్కడ తయారయ్యే తాళ్లను టన్నుల కొద్దీ చెన్నై, కేరళ, ముంబై, కోల్‌కతా, గుజరాత్ తదితర రాష్ట్రాలకు ఎగుమతి చేస్తున్నారు. ఓడలు, బోట్లలో వినియోగించిన అనంతరం వృథాగా వదిలేసే పగ్గాలను తక్కువ ధరకు తాళ్లరేవు గ్రామస్తులు వేలంలో కొనుగోలు చేస్తుంటారు. రాష్ట్రంలోని పలు పోర్టులతోపాటు ఇతర రాష్ట్రాల్లోని పోర్టులలో వేలం వేసే పాత తాళ్లను కొనుగోలు చేస్తుంటారు. వాటిని గ్రేడింగ్ చేసి.. శుద్ధిచేసి కొత్త తాళ్లు తయారు చేసి విక్రయిస్తున్నారు. బ్రిటిష్ కాలం నుంచీ.. బ్రిటిష్ కాలం నుంచి తాళ్లరేవు, కోరంగిలలో తాళ్లు తయారు చేస్తున్నాం. నాలుగు తరాలుగా తాళ్ల తయారీలో నిపుణులు ఇక్కడ ఉన్నారు. కోరంగిలో ఓడరేవు ఉండడంతో ఓడలు భారీ స్థాయిలో ఇక్కడికి వచ్చేవి. ఈస్ట్ ఇండియా కంపెనీ ప్రతినిధులు, బ్రిటిషర్లు కోరంగిని వ్యాపార కేంద్రంగా ఎంచుకోవడంతో భారీ నౌకలు, బోట్లు, నావలను తాళ్లరేవులో తయారు చేసేవారు. అలా ఓడలకు అవసరమైన తాళ్లు, మేకులు తదితర పరిశ్రమలు అప్పట్లో కోరంగి పరిసర ప్రాంతాల్లో ఏర్పాటయ్యాయి. ఇప్పటికీ తాళ్ల తయారీని కొనసాగుతోంది. – పెమ్మాడి కాశీ విశ్వనాథం, బోట్ల తయారీ యూనిట్ ప్రతినిధి ప్రత్యేక ప్రావీణ్యత ఉంది మా తాత ముత్తాతల నుంచి తాళ్లు తయారు చేస్తున్నాం. తాళ్ల తయారీయే వృత్తిగా కొనసాగుతోంది. రోజుకు రూ.300 నుంచి రూ.600 వరకు సంపాదిస్తాం. తాళ్ల తయారీకి సంబంధించి మాకు ప్రత్యేక ప్రావీణ్యత ఉంది. మా దగ్గర తాడు తీసుకెళ్లిన వారు మళ్లీమళ్లీ కొనుగోలు చేస్తుంటారు. – మందపల్లి జ్యోతిబాబు, తాళ్ల తయారీ కార్మికుడు -
ప్రజా సమస్యల పరిష్కారానికి జగనన్నకు చెబుదాం 1902 హెల్ప్ డెస్క్
-
‘జయలక్ష్మి’ ఆస్తుల సీజ్‌కు రంగం సిద్ధం
సాక్షి ప్రతినిధి, కాకినాడ: డిపాజిటర్లను నిలువునా ముంచేసి కోట్లాది రూపాయలు కొల్లగొట్టేసిన జయలక్ష్మి మ్యూచువల్లీ ఎయిడెడ్ మల్టీపర్పస్ కోఆపరేటివ్ సొసైటీ గత పాలకవర్గ సభ్యుల ఆస్తులను సీజ్ చేసేందుకు రంగం సిద్ధమైంది. సీఐడీ ఆ దిశగా దూకుడు పెంచింది. నిన్న మొన్నటివరకు మార్గదర్శి కుంభకోణాన్ని ఛేదించడంలో నిమగ్నమైన సీఐడీ ఇప్పుడు తాజాగా ‘జయలక్ష్మి’పై దృష్టిపెట్టింది. కాకినాడ సర్పవరంలోని జయలక్ష్మి మెయిన్ బ్రాంచిలో రెండ్రోజులుగా సీఐడీ బృందం పాత పాలకవర్గ చైర్పర్సన్, వైస్ చైర్పర్సన్ సహా డైరెక్టర్లు వ్యూహాత్మకంగా ముందుగానే అమ్మేసిన ఆస్తుల సీజ్‌కు రికార్డులను సిద్ధంచేసింది. జామీను దొరక్కపోవడంతో జైలులోనే.. ఏప్రిల్‌లో కాకినాడ సర్పవరం కేంద్రంగా జయలక్ష్మి మ్యూచువల్లీ ఎయిడెడ్ మల్టీపర్పస్ కోఆపరేటివ్ సొసైటీ లిమిటెడ్ బోర్డు తిప్పేసి 19,911 మందికి చెందిన రూ.520 కోట్ల డిపాజిట్లు కొల్లగొట్టేసిన సంగతి తెలిసిందే. విశాఖపట్నం, తూర్పుగోదావరి, కాకినాడ, డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ, ఏలూరు తదితర జిల్లాల్లో 29 బ్రాంచీలను ఏర్పాటుచేసి ఈ మోసానికి తెగబడ్డారు. ఈ ఘటనపై స్పందించిన రాష్ట్ర ప్రభుత్వం.. చివరి డిపాజిటర్ వరకు న్యాయం చేసేందుకు ఏర్పాట్లుచేస్తోంది. ఇందులో భాగంగా సీఐడీని రంగంలోకి దించడంతో చైర్మన్ ఆర్ఎస్ఆర్ ఆంజనేయులు, వైస్ చైర్పర్సన్ విశాలాక్షి, 11 మంది సహా డైరెక్టర్లపై కేసులు నమోదుచేయడానికి, ముగ్గురు మినహా అందరినీ అరెస్టుచేయించడానికి వీలు చిక్కింది. ఆంజనేయులు, విశాలాక్షి, డైరెక్టర్లకు బెయిల్ మంజూరైనప్పటికీ జామీను ఇవ్వడానికి ఎవరు ముందుకురాకపోవడంతో వారంతా ప్రస్తుతం విశాఖ సెంట్రల్ జైలులోనే ఉన్నారు. ఆస్తులు సీజ్ చేస్తున్న సీఐడీ ఈ క్రమంలో.. గత పాలకవర్గ చైర్మన్, వైస్ చైర్పర్సన్ సహా డైరెక్టర్ల పేరుతో వివిధ జిల్లాల్లో ఉన్న ఆస్తులను సీజ్ చేస్తున్నారు. ఈ మేరకు కొత్త పాలకవర్గ చైర్మన్ గంగిరెడ్డి త్రినాథ్‌రావు సమక్షంలో సీఐడీ బృందం గురు, శుక్రవారాల్లో కాకినాడ మెయిన్ బ్రాంచిలో రికార్డులను పరిశీలించింది. ఒక్క కాకినాడ జిల్లాలోని ఎనిమిది బ్రాంచీల వివరాలు సేకరిస్తేనే కోట్ల విలువైన చర, స్థిరాస్తులకు సంబంధించిన డాక్యుమెంట్లు ఉన్నట్లు తేలింది. సీఐడీ అదనపు ఎస్పీ రవివర్మ పర్యవేక్షణలో సీఐడీ సీఐ పైడప్ప నాయుడు, ఆరుగురు పోలీసు అధికారులతో కూడిన ప్రత్యేక బృందం రికార్డులు, గత పాలకవర్గ సభ్యుల పేరుతో ఉన్న డాక్యుమెంట్లను సేకరించి ఆస్తులను సీజ్ చేసే పనిలో నిమగ్నమైంది. వీటిపై చట్టపరంగా ఆంజనేయులు, విశాలాక్షి సహా డైరెక్టర్లకు ఎటువంటి హక్కుల్లేవని సీఐడీ తేల్చింది. ఆర్నెల్ల ముందు నుంచే అమ్మకానికి ఆస్తులు.. ఇక విశాలాక్షి, భర్త, కుమారులు కలిసి బ్యాంకు బోర్డు తిప్పేయడానికి ఆర్నెల్ల ముందునుంచే తమ పేరుతో ఉన్న ఆస్తులను అమ్మకానికి పెట్టేశారు. కాకినాడలో ఒక మార్ట్.. రామారావుపేట, గాంధీనగర్ తదితర ప్రాంతాల్లో ఉన్న నాలుగు చర, స్థిరాస్తులతో పాటు ఎనిమిది ఎకరాల భూమిని కూడా ఆమె విక్రయించినట్లుగా గుర్తించారు. అలాగే, విశాలాక్షి పేరుతో వివిధ జిల్లాల్లో ఉన్న మొత్తం 64 ఆస్తులనూ సీజ్ చేసేందుకు సీఐడీ రంగంలోకి దిగింది. సుమారు రూ.120 కోట్ల విలువైన ఆస్తులు అమ్మేసినట్లు తేలింది. వాటిలో కాకినాడ ఎస్ఈజడ్లో 30 ఎకరాలు ఉంది. ఇలా కొనుగోలుచేసి తిరిగి అమ్మేసిన ఆస్తులను సీజ్ చేయడంపై సీఐడీ ప్రత్యేక దృష్టిపెట్టింది. ఈ ఆస్తులను కొనుగోలు చేసిన వారికి సీఐడీ నోటీసులు సిద్ధంచేస్తోంది. వారిపై చార్జిషీట్లు కూడా వేయనుంది. సీఐడీ దూకుడుతో వారంతా బయటకు.. బ్యాంకు నుంచి రూ.120 కోట్లు వరకు రుణాలు తీసుకుని గుట్టుచప్పుడు కాకుండా ఉన్న వారంతా ఇప్పుడు సీఐడీ దూకుడుతో బయటకొస్తున్నారు. నోటీసులు తీసుకుని 50 రోజులు దాటినా స్పందించని వారు సీఐడీ జోరుతో రుణాలు జమచేసేందుకు రుణగ్రహీతలు ముందుకొస్తున్నారు. డాక్యుమెంట్ల ఆధారంగా రుణగ్రస్తుల ఆస్తుల విలువ సుమారు రూ.200 కోట్లుగా లెక్కతేలింది. 30శాతం తిరిగి చెల్లింపు? ఇక డిపాజిటర్లకు తొలి విడతగా మొత్తం డిపాజిట్లలో 30 శాతం తిరిగి ఇచ్చేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. జూలై నెలాఖరుకల్లా బాధితులకు రూ.100 కోట్లు ఇవ్వడానికి ప్రయత్నిస్తున్నాం. ఇప్పటివరకు 3 కోట్లు వసూలయ్యాయి. డిపాజిటర్లలో 14వేల మంది రూ.లక్ష నుంచి రూ.4 లక్షలలోపు డిపాజిట్ చేసిన వారే. రూ.26 కోట్లు తిరిగి ఇచ్చేస్తే మూడొంతులు మంది బాధితులు జయలక్ష్మి కుంభకోణం నుంచి బయటపడతారు. మరోవైపు.. సివిల్, అండ్ క్రిమినల్ కేసుల ప్రకారం ముందుకెళ్లే అవకాశముండడంతో జూలై 10 నాటికి జమచేస్తామని రుణాలు తీసుకున్న వారు చెబుతున్నారు. – గంగిరెడ్డి త్రినాథ్‌రావు, చైర్మన్, కాకినాడ జయలక్ష్మి సొసైటీ -
కాకినాడ జిల్లాలో పెన్షన్ సొమ్ము దారి దోపిడీ
-
ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి ఆధ్వర్యంలో ర్యాలీ
-
వేగంగా బల్క్ డ్రగ్ పార్క్ పనులు
సాక్షి, అమరావతి: కాకినాడ సమీపంలోని తొండంగి మండలం కేపీ పురం–కోదండ గ్రామాల మధ్య బల్క్ డ్రగ్ పార్క్ పనులు వేగంగా జరుగుతున్నాయి. 16 రాష్ట్రాలతో పోటీపడి ఆంధ్రప్రదేశ్ దక్కించుకున్న ఈ పార్క్‌ను 2,000.23 ఎకరాల్లో నెలకొల్పేందుకు ఏపీఐఐసీ ఏపీ బల్క్ డ్రగ్ ఇన్ఫ్రా కార్పొరేషన్ పేరుతో అనుబంధ కంపెనీని ఏర్పాటు చేసింది. ఈ ప్రాజెక్ట్‌ను త్వరితగతిన పూర్తి చేసేందుకు ప్రాజెక్ట్ మేనేజ్మెంట్ కన్సల్టెంట్‌ను ఏర్పాటు చేస్తోంది. ఇందుకోసం ఆసక్తి గల సంస్థల నుంచి బిడ్లను ఆహ్వానిస్తూ టెండర్లు పిలిచింది. ఆసక్తి గల సంస్థలు జూన్ 8లోగా బిడ్లను దాఖలు చేయాల్సి ఉంటుంది. ముడిసరుకు దిగుమతుల్ని తగ్గించుకునే లక్ష్యంతో చైనా నుంచి ఫార్మా ముడి పదార్థాల దిగుమతులను తగ్గించుకోవాలన్న లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం మూడు బల్క్ డ్రగ్ పార్క్‌ల ఏర్పాటుకు ముందుకొచ్చింది. అందులో ఒకటి మన రాష్ట్రంలో ఏర్పాటవుతోంది. ఈ బల్క్ డ్రగ్ పార్క్ అభివృద్ధికి రూ.1,500 కోట్లు అవసరం అవుతాయని అంచనా వేస్తుండగా.. మౌలిక వసతుల కల్పనకు కేంద్ర ప్రభుత్వం గరిష్టంగా రూ.1,000 కోట్ల వరకు ఇవ్వనుంది. ఈ బల్క్ డ్రగ్ పార్క్ ద్వారా కాకినాడ ఫార్మా హబ్‌గా తయారు కావడమే కాకుండా సుమారు రూ.14,340 కోట్ల పెట్టుబడులను ఆకర్షిస్తుందని అంచనా. అలాగే ఈ పార్క్‌ద్వారా 30,000 మందికి ప్రత్యక్షంగా, 40,000 మందికి పరోక్షంగా ఉపాధి లభిస్తుందని అంచనా. ప్రస్తుతం రాష్ట్రంలోని 200కుపైగా ఫార్మా యూనిట్లు ఉంటే ఇప్పుడు ఈ ఒక్క పార్క్ ద్వారానే 100కు పైగా యూనిట్లు అదనంగా రావచ్చని బల్క్ డ్రగ్ మాన్యుఫాక్చరర్స్ అసోసియేషన్ (బీడీఎంఏ) ప్రతినిధులు అంచనా వేస్తున్నారు. -
ఘోర రోడ్డు ప్రమాదం.. ఆరుగురు మహిళా కార్మికుల మృతి
సాక్షి, కాకినాడ: తాళ్లరేవు బైపాస్ వద్ద ఆదివారం ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ప్రైవేటు బస్సు ఆటోను ఢీకొట్టింది. ఈ ఘటనలో ఆటోలో ప్రయాణిస్తున్న ఆరుగురు మహిళా కార్మికులు మృతిచెందారు. మరో ఏడుగురికి తీవ్రగాయాలయ్యాయి. మృతులను రొయ్యల కంపెనీలో పనిచేస్తున్న కూలీలుగా గుర్తించారు. తాళ్లరేవు నుంచి యానాం వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది,. -
పవన్ ‘టీ’కప్పులో ప్రకంపనలు.. జససేనాని ఇది ఊహించలేదేమో..
సాక్షి ప్రతినిధి, కాకినాడ: జనసేనాని పవన్‌కళ్యాణ్ పొత్తుల వ్యాఖ్యలు గోదావరి జిల్లాల్లో ఆ పార్టీ శ్రేణుల్లో పెను దుమారాన్ని రేపుతున్నాయి. పవన్‌ని నమ్ముకొని పదేళ్లుగా పార్టీనే అంటిబెట్టుకుని ఉన్న ఆశావహులు మొదలు ద్వితీయ శ్రేణి నేతలు సైతం పవన్ తీరుతో రగిలిపోతున్నారు. ఇన్నేళ్లుగా వెంట ఉన్నది చంద్రబాబు పల్లకీ మోయడానికా అంటూ అగ్గి మీద గుగ్గిలమవుతున్నారు. రాజకీయ భవిష్యత్‌పై తాము పెట్టుకున్న ఆశలపై నీళ్లు చల్లేశారని మండిపడుతున్నారు. పవన్ పొత్తులు, సీఎంపై ఆశలు లేవు వంటి వ్యాఖ్యలపై ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాల్లోని జనసేన నేతలు, కార్యకర్తలతోపాటు పవన్ సామాజికవర్గ యువత సామాజిక మాధ్యమాల్లో దుమ్మెత్తిపోస్తున్నారు. పదేళ్లుగా పార్టీని బలోపేతం చేయకుండా ఇంకా బలహీనంగానే ఉన్నామని చెప్పడం, వచ్చే ఎన్నికల్లో బీజేపీ, టీడీపీలతో కలిసే వెళదామనడాన్ని వారు జీర్ణించుకోలేకపోతున్నారు. గత ఎన్నికల్లో జనసేన పార్టీ తరపున పోటీ చేసి అన్ని రకాలుగా నష్టపోయిన నేతలు ఇప్పుడు పొత్తులు తప్పవని పవన్ చేసిన ప్రకటనతో ఒక్కసారిగా కుదేలైపోయారు. పార్టీలో కొనసాగడమా లేక ప్రత్యామ్నాయం ఆలోచించాలా అని జనసేన ముఖ్య నేతలు తర్జనభర్జన పడుతున్నారు. ఉన్నది ఉభయ గోదావరి జిల్లాల్లోనే.. జనసేన పార్టీకి కొద్దోగొప్పో ఆదరణ ఉన్నది ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాల్లోనే. ఈ విషయాన్ని ఆ పార్టీ నేతలే బాహాటంగా చెబుతుంటారు. పవన్ పొత్తులు తట్టుకోలేమంటూ ఈ జిల్లాల్లోని జనసేన అభిమానులు గురు, శుక్రవారాల్లో పెడుతున్న పోస్టింగ్‌లు ఆ పార్టీలో కాకపుట్టిస్తున్నాయి. చంద్రబాబుని నమ్మొద్దని వాటిలో నేరుగా కోరుతున్నారు. ‘మనల్ని ఎవడ్రా ఆపేది.. మనల్ని ఎవడ్రా ఆపేది అంటుంటే ఏమో అనుకున్నాం. అన్నయ్యా, మమ్మల్ని నువ్వే ఆపేది అని అర్థమైంది’, ‘ఎవరినో సీఎంను చేయడానికి మేము సిద్ధంగా లేం. పది సంవత్సరాలుగా జనసేన జెండా మోస్తున్నాం. కొత్తగా మరో జెండా మోయడం మావల్ల కాదు’ అంటూ పలు రకాలుగా జనసేన కార్యకర్తలు, పవన్ సామాజికవర్గ నేతలు, యువత నిప్పులు చెరుగుతున్నారు. ఆరేళ్ల కిందట కాపులపై చంద్రబాబు జరిపిన దమనకాండ మరిచిపోమ్మంటే ఎలా అని ప్రశి్నస్తున్నారు. చేగొండి సహా అనేకమంది మండిపాటు.. గోదావరి జిల్లాల్లో ఆ సామాజికవర్గానికి చెందిన వృద్థతరం నేత చేగొండి హరిరామజోగయ్య సామాజిక మాధ్యమాలలో ఇదే అంశాన్ని ప్రస్తావించడం గమనార్హం. ‘పవన్‌కళ్యాణ్ కాపులకు నాయకుడిగా ఉంటాడని ఆశించాను. కానీ ఆయన మరొక్కసారి వేరే వారి పల్లకీ మోస్తాననడం సమంజసం కాదు. ‘నా అనుభవం రీత్యా చెబుతున్నాను. మరొక్కసారి ఇతర పార్టీల జెండా, అజెండాలను మోసే స్థాయిలో కాపు సామాజికవర్గం లేదు. పవన్ సీఎం అవుతానంటేనే ఇంతకు ముందు సమర్థించాను’ అని జోగయ్య ప్రతిస్పందించారు. ఆయనతోపాటు కాపు సామాజికవర్గంలో పలువురు ఇదే విధంగా వ్యాఖ్యానిస్తున్నారు. రాజకీయాలతో సంబంధం లేని పవన్ సినీ అభిమానులు సైతం పవన్ వ్యాఖ్యలపై మండిపడుతున్నారు. ఈ దమనకాండ బాబు చేసిందే.. బీసీ రిజర్వేషన్ల కోసం కాపు సామాజికవర్గం రాష్ట్రవ్యాప్తంగా చేపట్టిన ఉద్యమం గోదావరి జిల్లాల్లో పెద్ద ఎత్తున జరిగింది. ఉద్యమ నేత, మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం, కుటుంబ సభ్యుల పైన, ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో ఆ సామాజికవర్గంపైన అధికారం ఉందనే ధీమాతో చంద్రబాబు కక్షకట్టి ఉక్కుపాదం మోపి ఉద్యమాన్ని అణగదొక్కేసిన విషయం, అక్రమంగా పెట్టిన కేసులు గుర్తు లేదా అని పవన్‌ను ప్రశి్నస్తున్నారు. చంద్రబాబు, పవన్ సామాజికవర్గాల మధ్య వైరం ఈనాటిది కాదు. కాపు ఉద్యమం సందర్భంగా కోనసీమ సహా పలు ప్రాంతాల్లో ఆ సామాజికవర్గీయులలో మహిళలపైన కూడా చంద్రబాబు అండ్ కో కేసులు పెట్టించి వేదించింది. అవన్నీ మరిచిపోయి ఇప్పుడు తెలుగుదేశం పారీ్టతో పొత్తు పెట్టుకుంటామంటే ఎందుకు ఆయన వెంట నిలబడాలని ఆ సామాజికవర్గ నేతలు నిలదీస్తున్నారు. ఇది కూడా చదవండి: జనసేన, టీడీపీ, బీజేపీ పొత్తు ఖాయం -
2023 ఏపీ SSC స్టేట్ ర్యాంకర్ జ్యోత్స్న
-
కాకినాడలో విషాదం.. కారులో ఊపిరాడక చిన్నారి మృతి
సాక్షి, కాకినాడ: కాకినాడ జిల్లా కాజులూరు మండలం కోలంకలో విషాదం చోటుచేసుకుంది. పార్క్ చేసి ఉంచిన కారులో ఆడుకునేందుకు వెళ్లిన పాప.. అందులోనే మృత్యువాతపడింది. కారు డోర్లు లాక్ అవడం.. ఎవరూ గమనించకపోవడంతో ఈ ఘోరం జరిగింది. ఇంటి సమీపంలో ఆడుకుంటున్న ఎనిమిదేళ్ల బాలిక అఖిలాండేశ్వరి.. దగ్గరల్లో పార్క్ చేసిన కారులోకి వెళ్లి డోర్ వేసుకుంది. మళ్లీ డోర్ లాక్ తీయరాకపోవడంతో ఊపిరి ఆడక ఇబ్బంది పడింది. ఈ క్రమంలో కారులో గాలి అందకపోవడంతో చిన్నారి స్పృహ కోల్పోయింది. మధ్యాహ్నం కారులోకి వెళ్లిన పాప సాయంత్రం వరకు అందులోనే ఉండిపోయింది. కూతురు ఎంతకీ ఇంటికి రాకపోవడంతో కంగారుపడిన కుటుంబ సభ్యులు చుట్టుపక్కలా మొత్తం గాలించారు. చివరికి ఇంటి పక్కన కారులో కొన ఊపిరితో బాలికను గుర్తించిన స్థానికులు హుటాహుటిన యానాం ఆసుపత్రికి తరలించారు. అయితే అప్పటికే చిన్నారి మృతిచెందినట్లు వైద్యులు ధృవీకరించారు. ఇదిలా ఉండగా ఏడాది క్రితమే బాలిక తండ్రి మరణించగా.. బాలికతో పాటు, పదేళ్ల కొడుకును పాచి పనులు చేసుకుంటూ తల్లి ఆదిలక్ష్మి పోషించుకుంటోంది. తాజాగా కూతురు ప్రాణాలు కోల్పోవడంతో ఆ తల్లి కన్నీరుమున్నీరుగా విలపిస్తోంది. ఈ ఘటన స్థానికంగా తీవ్ర విషాదాన్ని నింపింది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలాన్ని పరిశీలించారు. చదవండి: ప్రమాదవశాత్తు మరుగుతున్న రసంలో పడి యువకుడు మృతి -
పర్యాటక ద్వీపం.. హోప్ఐలాండ్
సాక్షి ప్రతినిధి, కాకినాడ: మనకు అండమాన్ నికోబార్, లక్షదీవుల గురించి తెలుసు. అక్కడ విహరించాలనుకునేవారూ ఎక్కువే. అయితే దూరాభారం, అధిక వ్యయం వల్ల వెనుకడుగు వేస్తుంటారు. ఈ నేపథ్యంలో మనకు సమీపంలోనే బంగాళాఖాతంలోనే ఉన్న హోప్ ఐలాండ్ పర్యాటకులను ఆకర్షిస్తోంది. కాకినాడ సముద్ర తీరానికి 30 నాటికల్ మైళ్ల దూరంలో ఉన్న ఈ ద్వీపం దాదాపు 150 ఏళ్ల క్రితం సహజసిద్ధంగా ఏర్పడింది. ఈ కాలంలో వచ్చిన ఎన్నో తుపాన్ల నుంచి పెట్టని కోటగా నిలిచి కాకినాడ నగరాన్ని, నౌకాశ్రయాన్ని హోప్ ఐలాండ్ రక్షించింది. 1996లో నవంబర్ 6న తుపాను విజృంభణతో తీరమంతా చిగురుటాకులా వణికిపోయి వందలాది మంది మత్స్యకారులు మృత్యువాతపడ్డారు. అంతటి విలయంలో సైతం హోప్ ఐలాండ్‌ను విడిచి ఒక్క కుటుంబం కూడా బయటకు రాకపోవడం విశేషం. వృద్ధ గౌతమి, తుల్యభాగ నదీ పాయలతో.. మన రాష్ట్రంలోని సముద్ర జలాల్లో ఉన్న ఏకైక ద్వీపం.. హోప్ ఐలాండ్. ధవళేశ్వరం ఆనకట్ట దిగువన వృద్ధ గౌతమి నదీ పాయ యానాం సమీపంలో సముద్రంలో కలుస్తోంది. అలాగే కోరింగ మడ అడవుల సమీపంలో తుల్యభాగ పాయ సముద్రంలో అంతర్భాగమవుతోంది. ఈ రెండు పాయల నుంచి వచ్చిన ఇసుక కారణంగానే హోప్ ఐలాండ్ ఏర్పడిందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. గోదావరి బంగాళాఖాతంలో కలిసే ప్రాంతానికి 50 కిలోమీటర్ల ఎగువన 1850లో కాటన్ ఆనకట్ట నిర్మాణం జరిగింది. ఈ బ్యారేజ్ నిర్మాణం తర్వాత ఈ హోప్ ఐలాండ్ వేగంగా విస్తరించిందని భూగర్భ శాస్త్రవేత్తలు నిర్ధారించారు. బ్యారేజ్‌తో గోదావరి సహజ ప్రవాహానికి అడ్డుకట్ట పడ్డాక నదీ ప్రవాహంలో వచ్చిన మార్పులతో ఇసుకమేటలు పేరుకుపోయాయి. ఈ మేటలతోనే ద్వీపం ఏర్పడిందని చెబుతున్నారు. 18 కిలోమీటర్లు పొడవు, 1.8 కిలోమీటర్ల వెడల్పు ఉన్న ఈ ద్వీపం కాకినాడ నగరానికి, పోర్టుకు ఆయువుపట్టుగా నిలుస్తోంది. వందేళ్ల క్రితమే జనసంచారం.. ఈ ద్వీపంలో జనసంచారం వందేళ్ల క్రితమే మొదలైంది. ఇప్పుడు అక్కడున్నది రెండో తరం. హోప్ ఐలాండ్‌లో నివసిస్తున్న వారి పూర్వీకులంతా సముద్రతీరంలోని వివిధ గ్రామాల నుంచి వలస వచ్చి స్థిరపడ్డవారే. సముద్రంలో వేటకు వెళ్లే సమయంలో ఈ ద్వీపాన్ని గుర్తించి వేటకు అనుకూలమని అక్కడే నివాసాలు ఏర్పాటు చేసుకున్నారు. ఐలాండ్‌లో తొలి నివాసం ఏర్పాటు చేసుకున్న పుత్రయ్య పేరుతో దాన్ని పుత్రయ్యపాకలుగా పిలుస్తున్నారు. మొదట్లో సీజన్ సమయంలో ఈ ఐలాండ్‌కి వచ్చి, చేపల వేట పూర్తి అయ్యాక తిరిగి స్వగ్రామాలకు వెళ్లిపోయే వారు. కాలక్రమంలో అక్కడే శాశ్వత నివాసాలు ఏర్పాటు చేసుకున్నారు. ఇక్కడ సోలార్ విద్యుత్ సదుపాయం ఉంది. చుట్టూ సముద్రం ఉన్నప్పటికీ ఎక్కడ బోరు వేసినా మంచినీరే లభిస్తుండటం విశేషం. సముద్రం నడిబొడ్డున ఉన్న ఆ పల్లెలో 118 కుటుంబాలు నివసిస్తున్నట్టు అధికారిక లెక్కలు చెబుతున్నాయి. మక్కువతో అక్కడే నివాసం.. హోప్ ఐలాండ్‌లో నివసించేవారు ఏ చిన్న సరకులు కావాల్సినా పడవపైన సముద్రం దాటి కాకినాడ రావాల్సిందే. ఐలాండ్‌లో ఉంటున్న పలువురికి కాకినాడ రూరల్ మండలం తూరంగి పంచాయతీ పరిధిలో ఇళ్ల స్థలాలు ఇచ్చారు. అయినా వారంతా అక్కడి వాతావరణంపై మక్కువతో తిరిగి ద్వీపానికి వెళ్లిపోయారు. వీరి ఓట్లు, పెన్షన్లు, రేషన్ కార్డులు డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లా ముమ్మిడివరం నియోజకవర్గం తాళ్లరేవు మండలం కోరంగిలో ఉన్నాయి. హోప్ ఐలాండ్‌కు ఇలా చేరుకోవాలి.. హోప్ ఐలాండ్ పర్యాటకులు ఆస్వాదించేందుకు ఎంతో అనువైన ప్రాంతం. ఇక్కడకు వెళ్లడానికి కాకినాడ నుంచి సూర్యోదయానికి ముందు బయలుదేరితే సముద్ర అలల ఉధృతి తక్కువగా ఉండి ప్రయాణం సాఫీగా సాగుతుంది. కాకినాడ నుంచి హోప్ ఐలాండ్ చేరుకోవాలంటే సాధారణ ఇంజిన్ బోటులో గంట ప్రయాణం. కాకినాడ హార్బర్ నుంచి లేదా నగరంలోని జగన్నాథపురం నుంచి బోటులో హోప్ ఐలాండ్‌కు చేరుకోవచ్చు. అయితే పర్యాటకులు ముందుగా హార్బర్లో అటవీ అధికారుల అనుమతులు తీసుకోవాలి. గతంలో ఏపీ టూరిజం అధికారులు ద్వీపానికి వెళ్లే పర్యాటకుల కోసం కాకినాడ జగన్నాథపురం బకింగ్‌హామ్ కెనాల్ నుంచి బోట్లు కూడా నడిపారు. ఇరుగు, పొరుగు రాష్ట్రాల నుంచి కూడా సముద్ర ప్రయాణం, హోప్ఐలాండ్ తీరం ఆస్వాదించేందుకు పర్యాటకులు వచ్చేవారు. ఈ నేపథ్యంలోనే దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి హయాంలో దీన్ని పర్యాటకంగా అభివృద్ధి చేయాలని ప్రయత్నాలు జరిగాయి. పర్యాటక అభివృద్ధికి ప్రతిపాదనలు హోప్ ఐలాండ్‌కు పర్యాటకులు రావడానికి ఎక్కువగా ఆసక్తి చూపుతున్నారు. ఈ నేపథ్యంలో దీన్ని పర్యాటక ప్రాంతంగా అభివృద్ధి చేసేందుకు ప్రతిపాదనలు తయారుచేస్తాం. అక్కడున్న కుటుంబాలకు సదుపాయాలు మెరుగుపరుస్తాం. –కృతికా శుక్లా, జిల్లా కలెక్టర్, కాకినాడ ఇక్కడే పుట్టాం.. ఇక్కడే ఉంటాం ఇక్కడే పుట్టాం.. ఇక్కడే ఉంటాం. మా పూర్వీకులు కూడా ఇక్కడే గంగమ్మతల్లి ఒడిలో జీవించారు. మాకు సముద్రమంటే భయం లేదు. తుపానులతో కూడా మాకేమీ కాదు. హోప్ ఐలాండ్‌లో పాఠశాల, అంగన్వాడీ కేంద్రం ఉన్నాయి. ఇంకా సౌకర్యాలు మెరుగుపరచాలని కోరుతున్నాం. ఇలా చేస్తే పర్యాటకంగానూ అభివృద్ధి చెందుతుంది.– మచ్చా బాగయ్య, స్థానికుడు, హోప్ ఐలాండ్ -
‘పెత్తందార్లకు కొమ్ము కాసే వ్యాధి చంద్రబాబుకు పట్టింది’
సాక్షి, కాకినాడ జిల్లా: చంద్రబాబు చాలా ఫ్రస్టేషన్లో ఉన్నారని మాజీ మంత్రి కురసాల కన్నబాబు అన్నారు. శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ, ఎల్లో మీడియాను చూసుకుని బలుపుతో ప్రవర్తిసున్నారని దుయ్యబట్టారు. తండ్రీకొడుకులు తిరుగుతున్నా ప్రజలు పట్టించుకోవడం లేదని ఎద్దేవా చేశారు. ‘‘జగన్ ప్రతి ఇంటి ముద్దు బిడ్డ అని ప్రజలు ఎప్పుడో నిర్ణయం తీసుకున్నారు. పెత్తందార్లకు కొమ్ము కాసే వ్యాధి చంద్రబాబుకు పట్టింది. బాబుకు తన సొంత మనుషులకు ఆస్తులు కట్టబెట్టాలనే వ్యాధి వచ్చింది. ఈ వ్యాధులతోనే అమరావతి రియల్ ఎస్టేట్ చేయాలనుకున్నాడు’’ అని చంద్రబాబుపై కన్నబాబు మండిపడ్డారు. చదవండి: చింతమనేని ప్రభాకర్ వింత ప్రవర్తన.. ఐసీయూలోకి తోపుడు బండ్లు.. -
కాకినాడలో ఏజెంట్ చిత్రబృందం సందడి (ఫొటోలు)
-
చంద్రబాబు పుట్టినరోజు వేడుకల్లో టీడీపీ కార్యకర్తల వాగ్వాదం
-
‘కోడి కత్తి తగిలి ఇద్దరు చనిపోయారని మీ ఈనాడు పత్రికే రాసింది కదా?’
సాక్షి, కాకినాడ: 2018 అక్టోబర్‌లో విశాఖ ఎయిర్ పోర్టులో అప్పటి ప్రతిపక్ష నేత వైఎస్ జగన్‌పై హత్యాయత్నం జరిగితే.. కోడి కత్తి కేసు అని చంద్రబాబు, ఎల్లో మీడియా ఎగతాళి చేశాయని మండిపడ్డారు వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షులు, మాజీ మంత్రి కురసాల కన్నబాబు. చంద్రబాబు ఎప్పుడైనా కోడి కత్తి చూశారా? అని ప్రశ్నించారు. ఎంత పదునుగా ఉంటుందో ఓసారి టచ్ చేసి చూడండి అని హెచ్చరించారు. ఈ మధ్య కోడి కత్తి తగిలి ఇద్దరు చనిపోయారని మీ ఈనాడు పత్రికే రాసింది చూసుకోండి అని చంద్రబాబుకు ఆయన హితవు పలికారు. 'వైఎస్ జగన్‌పై హత్యాయత్నం జరిగిందని ఛార్జిషీటు పేర్కొంది. దీనిపై లోతైన అధ్యయనం చేయాల్సి ఉంది. ఈనాడు కథనంలో దీనిపై తీర్పు కూడా ఇచ్చేశారు. తీర్పులు ఇవ్వడానికి మీరెవరూ? మీకు ఏం హక్కుఉంది. నిందితుని వాంగూల్మంతో తీర్పులు ఇచ్చేస్తున్నారు. చంద్రబాబు నోటికి వచ్చినట్లు మాట్లాడితే ఈనాడు అచ్చేస్తుంది. ఎన్ఐఎ ఈ కేసును లోతుగా దర్యాప్తు చేయమని కోరితే మీకు ఇబ్బంది ఏంటి? మీరెందుకు భుజాలు తడుముకుంటున్నారు. ఈ సంఘటనను చులకనగా తీసిపడేస్తే చంద్రబాబును కాపాడొచ్చు అని మీ దుర్బుద్ధి కాదా? చంద్రబాబు ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు ఆయనకు బాధ్యత లేదా? నిందితుడి కత్తి భుజానికి కాకుండా మెడకు తగిలి ఉంటే పరిస్ధితి ఏంటి?' అని కురసాల కన్నబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. చదవండి: ‘చంద్రబాబు, లోకేశ్‌ను తరిమికొడతాం’ -
‘కేసులే లేవని కథనాలు రాశారు.. నేర చరిత్ర ఉందని విచారణలో తేలింది’
సాక్షి, కాకినాడ: ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డిపై గతంలో జరిగిన హత్యాయత్నం ఘటనలో కుట్ర కోణం దాగి ఉందని తాము భావిస్తుంటే, ఎల్లో మీడియాకు బాధ ఎందుకో అర్థం కావడం లేదని మాజీ మంత్రి కురసాల కన్నబాబు నిలదీశారు. శనివారం మీడియాతో మాట్లాడిన కన్నబాబు.. ‘కుట్ర కోణం ఉందని మేం అంటుంటే మీరు భుజాలెందుకు తడుముకుంటున్నారు. ఎన్ఐఏ లోతుగా విచారించాలని మేం కోరితే తప్పేంటి?, కోర్టులు ఏం చెప్పకుండానే ఎల్లో మీడియా తీర్పులు ఇస్తోంది. దాడి చేసిన వ్యక్తిపై కేసులు లేవంటూ కథనాలు రాశారు. నిందితుడికి నేర చరిత్ర ఉందని విచారణలో తేలింది. ఘటన వెనుక నిజాలను తేల్చమంటుంటే మీకెందుకు బాధ?, సీఎం జగన్‌ను కించపరిచేలా మాట్లాడుతున్నారు. అప్పుడు ప్రతిపక్ష నేతగా ఉన్న జగన్‌పై హత్యాయత్నం జరిగితే ఎగతాళిగా మాట్లాడారు. ఘటన వెనుక కుట్న కోణం ఉందని మేం భావిస్తున్నాం. డీఎల్ రవీంద్రారెడ్డి పనికిమాలిన మాటలు మాట్లాడుతున్నారు. సీఎం సతీమణి గురించి ఇష్టమొచ్చినట్లు మాట్లాడుతున్నారు. కనీసం సంస్కారం కూడా లేకుండా మాట్లాడుతున్నారు. నోటికి ఎంతొస్తే అంత మాట్లాడటం సరికాదు’ అని మండిపడ్డారు. -
ఆన్‌షోర్..ఆఫ్‌షోర్..ఎనీవేర్‌తో చమురు దోపిడీలకు చెక్
కాకినాడ క్రైం: ఆన్‌షోర్, ఆఫ్‌షోర్, ఎనీవేర్... ఇదీ చమురు దోపిడీలను నిలువరించేందుకు భద్రతా వ్యవస్థలు అనుసరిస్తున్న తాజా విధానం. సముద్ర ఉపరితలంపై కోస్టుగార్డు, తీర ప్రాంతాల్లో పోలీస్, ఎస్పీఎఫ్, మైరెన్ పోలీస్ తమ భద్రతా వ్యూహాలకు పదునుపెడుతున్నాయి. సముద్ర భద్రత అంటే కోస్టుగార్డుకే పరిమితం అన్న స్థితిని దాటి తీర ప్రాంతాన్ని కూడా జల్లెడ పట్టి, జలాల్లో నేరాల నియంత్రణకు పోలీస్ శాఖ తన అనుబంధ శాఖలతో కలిసి సమాయత్తమైంది. సముద్ర దొంగతనాలంటే సాధారణంగా చమురు కేంద్రంగా ఎక్కువగా జరుగుతుంటాయి. ఈ నేపథ్యంలో ఆర్థిక వ్యవస్థనే శాసించే ప్రభావం ఉన్న చమురు ఉత్పత్తి నుంచి తరలింపు వరకు ప్రతి దశలోనూ పూర్తి స్థాయి భద్రత కల్పించేందుకు పేర్కొన్న వ్యవస్థలన్నీ ప్రత్యేక ప్రణాళికలతో శ్రమిస్తున్నాయి. ఆ వ్యూహాలను ప్రతిబింబించేలా కీలక సమావేశాలు, కార్యకలాపాలకు శ్రీకారం చుట్టాయి. ఈ ప్రక్రియలో భాగంగానే గురువారం వరకూ చేపట్టిన మాక్‌డ్రిల్ ప్రాధాన్యతను సంతరించుకుంది. ముగిసిన సముద్ర జలశుద్ధి ప్రక్రియ కాకినాడ తీరంలో అబ్బురపరిచే సముద్ర జల శుద్ది మూడు రోజుల ప్రక్రియ ముగిసింది. ఇండియన్ కోస్టు గార్డు ఆధ్వర్యంలో కాకినాడ స్టేషన్ పరిధిలో యుద్ద ప్రదర్శనను తలపించే రీతిలో రీజినల్ పొల్యూషన్ రెస్పాన్స్ ఎక్సర్సైజ్ పేరుతో భారీ మాక్ డ్రిల్ నిర్వహించారు. కాకినాడ కోస్టుగార్డు స్టేషన్ కమాండెంట్ ఆఫీసర్ జి.వేణుమాధవ్ సారథ్యంలో భారీ స్థాయిలో చేపట్టిన ఈ మాక్ డ్రిల్ సముద్ర జలాల్లో చమురు తెట్లను తొలగించే ప్రక్రియతో పాటు భద్రతా పరమైన అంశాలకు నిర్వహణకు ఓ ట్రయల్‌గా అధికారులు తెలిపారు. అటు పోలీస్‌శాఖ... కోస్ట్‌గార్డుతో సహా అటు పోలీస్‌శాఖ సముద్ర తీరప్రాంత అనుబంధంగా జరిగే చమురు దోపిడీలపై దృష్టి సారించింది. ఏకంగా రాష్ట్ర డీజీపీ కేవీ రాజేంద్రనాథ్ డీఐజీ పాలరాజు ఆధ్వర్యంలో సముద్ర తీర ప్రాంతాలు హద్దులుగా ఉన్న అన్ని జిల్లాల ఎస్పీలతో ఇటీవల రాజమహేంద్రవరంలో ఓ ప్రత్యేక సమావేశం నిర్వహించడం ప్రాధాన్యత సంతరించుకుంది. ఈ సమావేశంలో జిల్లాల వారీగా చమురు చోరీల గణాంకాలపై చర్చించారని కాకినాడ జిల్లా పోలీస్ వర్గాలు తెలిపాయి. దొంగిలించి, తరలించేందుకు దొంగలు అనుసరిస్తున్న విధానాలపై అవగాహన ఏర్పరుచుకున్నారు. పోలీస్ లేదా కోస్ట్‌గార్డు అడ్డుకుంటే ఎదుర్కోవడానికి వారు వినియోగించే ఆయుధాలు, అవి వారికి సమకూరుతున్న పరిస్థితులపై చర్చించారు. ఈ నేపథ్యంలో చమురు దొంగతనాలకు పాల్పడ్డ పాత నిందితుల కదలికలపై నిఘా ఉంచాలని డీజీపీ ఎస్పిలను ఆదేశించారు. ఆయన ఆదేశాలమేరకు ఎస్పిలు యంత్రాంగాన్ని సమాయత్తపరిచారు. చమురు లీకై తే... చమురు తరలించే రెండు ఓడలు ప్రమాదవశాత్తు లేదా దాడుల నేపథ్యంలో సముద్రంలో ఢీకొట్టుకుంటే లేదా లీకేజీలు ఏర్పడితే జరిగే నష్టం సముద్ర జీవుల పట్ల ప్రాణసంకటమని కమాండెంట్ వేణుమాధవ్ తెలిపారు. లీకై న చమురు ఆక్సిజన్‌ను నీటిలోకి వెళ్లకుండా అడ్డుకుంటుందని అన్నారు. తద్వారా జీవాలు ప్రాణాలు కోల్పోతాయని తెలిపారు. చమురు నీటి నుంచి వేరు చేసే ప్రక్రియకు భారీ జల, వాయు మార్గ సంపత్తితో పాటు అధునాతన పరికర సామర్థ్యాన్ని కోస్టుగార్డు వినియోగించింది. 97 మంది అధికారులు సిబ్బంది మాక్ డ్రిల్‌లో పాల్గొన్నారు. వీరిలో 85 మంది సైలర్లు, 12 మంది అధికారులు ఉన్నారు. రెండు విధాలుగా శుద్ది... చోరీలు జరిగినపుడు, ప్రమాదవశాత్తూ, ప్రకృతి వైపరీత్యాలు సంభవించినపుడు, లేదా మరే కారణం వల్లనైనా భారీ పడవల నుంచి సముద్రంలోకి నేరుగా చమురు విడుదలయ్యే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో చమురు తెట్లు ఏర్పడ్డ సముద్ర జలాల శుద్ది ప్రక్రియను రెండు విధాలుగా చేపడతారు. ఆ రెండు విధానాలను మాక్ డ్రిల్‌లో ప్రదర్శించారు. చమురు తెట్టుకట్టిన ప్రాంతాన్ని చుట్టుముట్టి టీసీ–3 రసాయనాన్ని చల్లడం, ఈ క్రమంలో జరిగే రసాయనిక చర్య వల్ల ఆ చమురు సముద్రగర్భంలోకి చేరుతుంది. ప్రత్యేక ప్రక్రియ ద్వారా ఆ వ్యర్థాన్ని తిరిగి సేకరిస్తారు. అంతకుముందు నీటిలో చమురు వ్యాప్తిని నిలువరించేందుకు ‘బూమ్’ను ప్రయోగించారు. రెండు లేదా అంతకంటే ఎక్కువ ఓడలు భారీ ట్యూబ్ వంటి ప్రత్యేక నిర్మాణంతో రూపొందించబడ్డ ఈ బూమ్‌ను చమురు తెట్టు చుట్టూ వృత్తాకారంగా ఏర్పాటు చేస్తాయి. అది దాటి తెట్టు వ్యాపించే ప్రసక్తే లేదు. ఇది కాక రెండవ విధానం భారీ బ్రష్ ద్వారా తెట్టును సేకరించడం. ఇది తక్కువ మొత్తంలో ఏర్పడ్డ చమురు తెట్లు తొలగించేందుకు అనుకూలం. ఈ రెండు ప్రక్రియలు జరుగుతున్నంత సేపూ నిశిత పరిశీలన, పర్యవేక్షణ కోసం ‘ఏరియల్ రెక్కీ’ నిర్వహించారు. అద్భుత పనితీరు... సముద్ర జలాల్లో అసాధారణ పరిస్థితులను ఎదుర్కోవడంతో నేర నియంత్రణను సాకారం చేసే క్రమంలో అన్ని వేళల్లోనూ అప్రమత్తంగా ఉంటాం. మాక్‌డ్రిల్ పర్యావరణంపై మా బాధ్యత, చర్యలను ప్రతిబింబించే విధుల సమాహారం. ఈ ప్రదర్శన భారీ స్థాయిలో చేపట్టడంలో భద్రతా అంశాలను ప్రతిబింబించడం కూడా ఓ ఉద్దేశం. ఆ లక్ష్యంతోనే మాక్‌డ్రిల్‌కు గతంలో ఏనాడు వినియోగించని భారీ సంపత్తిని తీసుకొచ్చాం. అత్యంత సమర్థత ఉన్న సాంకేతికతనూ వినియోగించి ఎక్సర్సైజ్ నిర్వహించాం. ముఖ్యంగా చమురు దొంగతనాలను నిలువరించేందుకు ప్రత్యేక కార్యాచరణను సిద్దం చేసి అమలు చేస్తున్నాం– జి.వేణుమాధవ్, కమాండెంట్ ఆఫీసర్, కాకినాడ కోస్టుగార్డు స్టేషన్ చమురు చోరీల నివారణకు కార్యాచరణ చమురు చోరీల నివారణకు ప్రత్యేక కార్యాచరణను రూపొందించాం. రాష్ట్ర డీజీపీ ఆదేశాలు, డీఐజీ దిశానిర్దేశంలో ఈ చర్యలు కొనసాగుతున్నాయి. తాజా సమావేశంలో చమురు చోరీల నివారణ, భద్రత దిశగా పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. చమురు, గ్యాస్ సంస్థలకు భద్రత కల్పించడం, పైప్లైన్ల నుంచి పెట్రోలు, డీజిల్ దొంగిలిస్తున్న దొంగలను పట్టుకోవడం సంబంధిత దోపిడీలను అరికట్టడం ఇందులో కీలక అంశాలు. మైరెన్, కోస్ట్‌గార్డు పరస్పర సహకారంతో చమురు చోరీల నివారణ చర్యలకు సిద్దమయ్యాం. త్వరలో ప్రత్యేక కార్యాచరణ, బృంద నియామకాన్ని ప్రకటిస్తాం. – ఎస్.సతీష్‌కుమార్, ఎస్పి, కాకినాడ జిల్లా ప్రత్యేక భద్రత ఏర్పాటు సముద్రంలో చోరీలు ముఖ్యంగా చమురు దొంగతనాలు నిలువరించేందుకు తగిన చర్యలు తీసుకుంటున్నాం. ఆ దిశగా తీర ప్రాంత వాసులతో మమేకమవుతూ దొంగల కార్యకలాపాలు నిలువరించే ప్రణాళికలు సిద్దం చేస్తున్నాం. ఓఎన్జీసీ, రిలయన్స్ ఆయిల్ రిగ్‌ల వద్ద ప్రత్యేక భద్రత ఏర్పాటు చేస్తున్నాం. ఫాస్ట్ ఇంటర్సెప్ట్ బోట్లు అందుబాటులో ఉన్నా నిపుపయోగంగా ఉండటం వల్ల మరిన్ని భద్రతా చర్యలు తీసుకోవడంలో చిన్నపాటి ఆటంకాలు ఏర్పడుతున్నాయి. వాటి మరమ్మతుల కోసం ఇప్పటికే విన్నవించాం. – సుమంత్, మైరెన్ సీఐ -
పుచ్చకాయఫై రాజ్యాంగ నిర్మాత ముఖచిత్రం
-
కాకినాడ తీరంలో కోస్ట్ గార్డ్ విన్యాసాలు
-
తూర్పు తీరం ఆడపడుచులు
సాక్షి ప్రతినిధి, కాకినాడ: పుట్టింటిపై మమకారం మగ పిల్లలతో పోలిస్తే ఆడ పిల్లలకు మరింత ఎక్కువే. పెళ్లి చేసుకుని అత్తారింటికి వెళ్లిపోయినా.. పుట్టింటిపై మమకారం వారిలో చెక్కు చెదరదు. నోరులేని మూగజీవాలకు కూడా జన్మస్థలంపై అంతటి మమకారం ఉంటుందంటే ఆశ్చర్యమే. సైబీరియా పక్షుల మాదిరిగా కేవలం సంతానోత్పత్తి కోసమే ఎన్ని వేల కిలోమీటర్ల దూరమైనా ప్రయాణించి పుట్టింటికి వస్తాయి ఆలివ్ రిడ్లే తాబేళ్లు. పుట్టిన కొద్ది రోజులకే సముద్రంలో ఎంతో దూరం వెళ్లిపోయే ఈ తాబేళ్లు పదేళ్ల తరువాత సంతానోత్పత్తి కోసం వేల కిలోమీటర్లు ఈదుకుంటూ.. తాము పుట్టిన ప్రాంతానికే చేరుకుంటాయి. ఇలా రాగలగటం వాటి జ్ఞాపక శక్తికి నిదర్శనమంటారు. ఆలివ్ రిడ్లే శాస్త్రీయ నామం‘లెపిడోచెలిస్ ఒలివేసియా’.గ్రీన్ టర్టిల్, లెదర్ బ్యాగ్, గ్రీన్సీ టర్టిల్, హాక్చిల్సీ వంటి జాతుల తాబేళ్లు ఉన్నప్పటికీ ఆలివ్ రిడ్లే రకం తాబేళ్లు తూర్పు తీరానికి ఎక్కువగా వస్తున్నాయి. ఆ మూల నుంచి.. ఈ మూల వరకు ఒడిశాలోని బీతర్కానిక తీరం నుంచి.. తమిళనాడు సరిహద్దులోని తడ వరకు విస్తరించి ఉన్న సముద్ర తీరం వరకు ఆలివ్ రిడ్లే తాబేళ్లు సంతానోత్పత్తి కోసం వస్తుంటాయి. అందులోనూ కాకినాడ తీరానికే వీటి రాక అధికం. ఇసుక, నీరు తేటగా ఉండటంతోపాటు 30 డిగ్రీల కంటే ఎక్కువ ఉష్ణోగ్రత ఉండే ప్రాంతాలపై ఆలివ్ రిడ్లే తాబేళ్లు ఆసక్తి చూపుతాయి. వివిధ సముద్రాల్లో ఉండే ఈ తాబేళ్లు సంపర్కం కోసం ఏటా నవంబర్, డిసెంబర్ నెలల్లో బంగాళాఖాతంలోకి చేరుతాయి. ఆ తరువాత ఆడ తాబేళ్లు మాత్రమే గుడ్లు పెట్టేందుకు తీరానికి వస్తాయి. జనవరి రెండోవారం నుంచి ఏప్రిల్ మొదటివారం వరకు ఇవి గుడ్లు పెట్టే సీజన్. ఈ తాబేళ్లు జీవితమంతా సముద్రంలోనే గడుపుతాయి.గుడ్లు పెట్టడానికి మాత్రం భూమి మీదకు వస్తాయి. నదులు సముద్రంలో కలిసే చోటు వీటి సంతానోత్పత్తికి అనువుగా ఉంటుంది. తీరంలోని ఇసుకలో బొరియలు తవ్వి ఒక్కో తాబేలు 100 నుంచి 150 వరకు గుడ్లు పెడుతున్నాయి. గుడ్లు పెట్టేశాక తల్లి సముద్రంలోకి వెళ్లిపోతుంది. ఆ గుడ్లలోంచి 45–55 రోజుల్లో పిల్లలు బయటకొస్తాయి. వీటిని ఏపీ ఆటవీ శాఖ సంరక్షిస్తోంది. కళ్లు తెరిచిన పిల్లలను సూర్యుడు ఉదయించే వేళ అధికారులు సముద్రంలోకి విడిచిపెడుతున్నారు. వెలుతురు అంటే ఇష్టపడే తాబేలు పిల్లలు సూర్యుడు ఉదయించేటప్పుడు ఆ కిరణాలవైపు పరుగులు తీస్తూ సముద్రంలో కలిసిపోతాయి. ఈ ప్రక్రియ నెల రోజులుగా కాకినాడ తీరంలో అటవీ రేంజర్ ఎస్.వరప్రసాద్ పర్యవేక్షణలో జరుగుతోంది. ఇప్పటికే 8వేల పిల్లలను సముద్రంలోకి విడిచి పెట్టారు. సమతుల్యతలో కీలకం కళ్లు తెరిచిన పిల్లలు సముద్రంలోకి వెళ్లిన పదేళ్లకు కౌమార దశకు వస్తాయి. సంపర్కం తరువాత తనకు జన్మనిచ్చిన తీరాన్ని గుర్తుంచుకుని గుడ్లుపెట్టేందుకు తిరిగి అక్కడికే వస్తాయి. సముద్రం జలాల్లో వాతావరణ సమతుల్యతను పరిరక్షించడంలో వీటి పాత్ర కీలకం. సముద్రంలో మత్స్య సంపదను మింగేస్తున్న జెల్లీ ఫిష్‌లను ఆలివ్ రిడ్లేలు ఆహారంగా తీసుకుంటాయి. మత్స్య సంపదకు రక్షణగా ఉండటం, సముద్ర జలాలలో కాలుష్యం నివారించి శుభ్రంగా ఉంచడంలో వీటి పాత్ర అమోఘం. – ఎస్.వరప్రసాద్, రేంజర్, కోరంగి అభయారణ్యం మేధస్సులో ఆడ తాబేళ్లు దిట్ట తెలివితేటల్లో ఆడ తాబేళ్లు దిట్ట. ఆడ తాబేళ్లు గుడ్లు పెట్టడానికి ముందు ఇసుక తేటగా.. చదునుగా.. అలికిడి లేని, సముద్ర అలలు తాకని ప్రాంతాన్ని ఎంపిక చేసుకుంటాయి. గుడ్లు పెట్టే ప్రాంతంలో 30 సెంటీమీటర్ల మేర గొయ్యి తవ్వి గుడ్లు పెట్టి.. ఇసుకతో కప్పేస్తాయి. తవ్విన గోతిలో అడుగు భాగం (పునాది) గట్టిగా ఉండాలని శరీర బరువు (సుమారు 50 కేజీలు)తో అరగంట పాటు పైకి, కిందకు పడుతూ లేస్తూ చదును చేసి గుడ్లు పెడతాయి. గుడ్లను శత్రుజీవులు గుర్తించకుండా చుట్టుపక్కల డమ్మీగా నాలుగైదు గోతుల్ని తవ్వి ఇసుకతో కప్పేస్తాయి. నక్కలు, కుక్కలు, కాకులకు గుడ్లు పెట్టిన ప్రాంతం తెలియకుండా జాగ్రత్తలు తీసుకోవడంలో ఆలివ్ రిడ్లే తెలివితేటలు అమోఘం. -
‘ఒక్క సినిమాతో ఆస్తులన్నీ పోయాయి.. అందరికీ అప్పులు తిరిగి చెల్లించింది’
కాకినాడ శ్యామల అంటే తెలుగు ప్రేక్షకులకు పరిచయం అక్కర్లేని పేరు. ఆమె దాదాపుగా 200 సినిమాల్లో నటించింది. ఆమె తెలుగు, తమిళ భాషల్లో ఎక్కువగా నటించింది. నటిగా, నిర్మాతగా, ఫైనాన్షియర్‌గా కాకినాడ శ్యామల గుర్తింపు దక్కించుకున్నారు. తాజాగా ఓ ఇంటర్వ్యూకు హాజరైన ఆమె పలు ఆసక్తకర విషయాలను పంచుకున్నారు. సిల్క్ స్మిత జీవితంపై శ్యామల మాట్లాడారు. కాకినాడ శ్యామల మాట్లాడుతూ..'నేను చాలా సినిమాలకు ఫైనాన్స్ చేశా. సిల్క్ స్మిత సొంత సినిమాకి కూడా డబ్బులిచ్చాను. అయితే ఆ సినిమా సరిగ్గా ఆడకపోవడం వల్ల సిల్క్ స్మిత అప్పులపాలైంది. ఒక్క సినిమాతోనే సిల్క్ స్మిత ఆస్తులన్నీ పొగొట్టుకుంది. ఆమె వ్యక్తిత్వం చాలా గొప్పది. తెరపై వేసే పాత్రలు వేరు .. బయట కనిపించే స్మిత వేరు. ఆమె నిజాయితీ ఉన్న మనిషి. ఆమెను హత్య చేశారని కొంతమంది అంటారు. ఆత్మహత్య చేసుకుందని మరికొందరు అంటారు. నిజానికి ఏం జరిగిందనేది ఆ పైవాడికి మాత్రమే తెలియాలి. కానీ ఆమె ఎందుకు చనిపోయిందో కారణాలు తెలియవు. అయినప్పటికీ సిల్క్‌స్మిత అందరికీ అప్పులు తిరిగి చెల్లించింది. ఆ తరువాత ఆమె కెరియర్ బాగానే సాగింది. అలాంటి సమయంలోనే ఆమె చనిపోయిందనే వార్త విన్నా. ' అని అన్నారు -
ఆధ్యాత్మిక కేంద్రంగా కాకినాడ.. సీఎం జగన్ కీలక నిర్ణయం
-
బాబు ఏం చెప్పారు?.. జ్యోతుల నెహ్రూ ఎందుకు రగిలిపోతున్నారు?
తమది క్రమశిక్షణ గల పార్టీ అని డబ్బా కొట్టుకుంటారు తెలుగుదేశం నాయకులు. కాని ఆ పార్టీలో ఉన్నన్ని గ్రూప్‌లు ఎక్కడా కనిపించవు. కాకినాడ జిల్లా టీడీపీలో తాజాగా జరుగుతున్న కొట్లాటలే ఇందుకు నిదర్శనంగా చెప్పవచ్చు. జిల్లాలోని సీనియర్ నేతల మధ్య నడుస్తున్న గ్రూప్ పాలిటిక్స్ కేడర్‌కు ఆందోళన కలిగిస్తున్నాయని టాక్. ఇంతకీ కాకినాడ దేశంలో ఏం జరుగుతోందో మీరే చదవండి. కాకినాడలో కస్సు బుస్సు కాకినాడ జిల్లా తెలుగు దేశం పార్టీలోని కొందరు మాజీ ఎమ్మెల్యేలకు కంటి మీద కునుకు లేకుండా పోయిందట. టీడీపీ నాయకుల ఈ కష్టానికి కారణం అధికార పక్షం అనుకుంటే పొరపాటే. సొంత పార్టీలో నడుస్తున్న గ్రుప్ రాజకీయాలతోనే ఈ పరిస్ధితి దాపురించిందని ఆ పార్టీ నాయకులే వాపోతున్నారు. కాకినాడ జిల్లా పార్లమెంటరీ నియోజకవర్గ టీడీపీ అధ్యక్షుడుగా మాజీ ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ తనయుడు నవీన్ వ్యవహరిస్తున్నారు. వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో కాకినాడ ఎంపీగా పోటీ చేయ్యాలని నవీన్ భావిస్తున్నారు. ఎప్పటి లానే జ్యోతుల నెహ్రూ జగ్గంపేట ఎమ్మెల్యే సీటుకు పోటీ చేయాలనుకుంటున్నారు. అయితే తండ్రీ, కొడుకులు పోటీ చేయాలనే ప్రతిపాదనలు పార్టీలోని కొందరు సీనియర్లకు రుచించడంలేదు. ఈ నేపథ్యంలో కొంతకాలం క్రిందట చంద్రబాబును కలిసిన పిఠాపురం, ప్రత్తిపాడు నియోజకవర్గాల నేతలు ఈ విషయం గురించి చర్చించారు. నవీన్ ఎంపీగా పోటీ చేస్తే.. తమ నియోజక వర్గాల్లో ఆ ఖర్చును తామే భరించాల్సి వస్తే కష్టంగా ఉంటుందని బాబుకు చెప్పారట. ఈ విషయం ఆ జ్యోతుల నెహ్రూకు తెలిసిందట. దీనిపై రగిలిపోతున్న జ్యోతుల నెహ్రూ తన వ్యతిరేకులకు సమయం చూసి ఝలక్ ఇవ్వాలని డిసైడ్ అయ్యారట. కోల్డ్ వార్ c/o హీట్ పాలిటిక్స్ జ్యోతుల నెహ్రూ ఎదురు చూసిన సందర్భం వచ్చింది. చంద్రబాబు జిల్లా పర్యటన నేపథ్యంలో తన గ్రూప్ పాలిటిక్స్ ను ప్రయోగించారు. ప్రత్తిపాడు, పిఠాపురం నియోజకవర్గాల్లో తనను, తన కుమారుడిని అడ్డుకునే నేతలకు వ్యతిరేకంగా తన మద్దుతదారులతో నెహ్రూ ఆందోళన చేయించారు. ప్రత్తిపాడు సీటు బీసీలకు ఇవ్వాలని.. పిఠాపురం సీటు జ్యోతుల నవీన్‌కు కేటాయించాలని ఆ నేతలు చంద్రబాబును కలిసి తమ డిమాండ్లు వినిపించారు. ఐతే కొద్ది రోజులకు ప్రత్తిపాడు ఇన్ఛార్జ్ వరుపుల రాజా అకాల మరణం చెందారు. ఇక నెహ్రూకు వ్యతిరేకంగా మిగిలింది పిఠాపురం మాజీ ఎమ్మెల్యే వర్మనే. దీంతో వర్మను టార్గెట్ చేసుకుని జ్యోతుల నెహ్రూ తన రాజకీయ చతురతను ప్రదర్శిస్తున్నారు. వర్మకు గాడ్ ఫాదర్ గా ఉండే టీడీపీ సీనియర్ నేత యనమల రామకృష్ణుడు పార్టీలో ఎలాంటి ఇబ్బంది ఉన్నా.. కాపాడుతూ వస్తున్నారు. జిల్లా పార్టీలో తొలి నుంచీ జ్యోతుల నెహ్రూ.. యనమల రామకృష్ణుడు మధ్య కోల్డ్ వార్ నడుస్తోంది. పార్టీలో ఎంతో పలుకుబడి ఉన్న యనమల రామకృష్ణుడి కుటుంబంలోనే ప్రస్తుతం టిక్కెట్ వార్ నడుస్తోంది. ఈ పరిస్థితుల్లో యనమల తనను కాపాడుతాడనే నమ్మకం వర్మకు కనిపించడంలేదు. దీంతో జ్యోతుల నెహ్రూ బారి నుంచి నెలా బయటపడాలో... భవిష్యత్‌లో జరిగే పరిణామాలు ఎలా తట్టుకోవాలో వర్మకు అర్థం కావడంలేదట. జ్యోతుల టెన్షన్‌తో వర్మకు కంటి మీద కునుకులేకుండా పోయిందనే టాక్ నడుస్తోంది. పొలిటికల్ ఎడిటర్, సాక్షి డిజిటల్ -
కాకినాడలో ప్రతిష్టాత్మక IIFT విద్యాసంస్థ ఏర్పాటు
-
చిట్టి చిల్లీ.. చాలా ఘాటు గురూ! ఒక్కసారి కొరికితే..
సాక్షి, కాకినాడ(పిఠాపురం): చిట్టి చిల్లీ... చూడటానికి చెర్రీ పండులా ఎర్రగా గుండ్రంగా ఉంటుంది. నోరూరిస్తుంది. కానీ ఒక్కసారి కొరికితే చెంబుడు నీళ్లు తాగినా మంట తగ్గదు. అంతటి ఘాటు ఉన్న ఈ చిట్టి మిరపకాయల ధర కూడా సాధారణ మిర్చి కన్నా మూడు రెట్లు అధికంగా ఉంటుంది. ఈ చిట్టి మిర్చికి పుట్టినిల్లు కాకినాడ జిల్లా గొల్లప్రోలు ప్రాంతమైనా... మరాఠా వాసులతోపాటు దుబాయ్, మలేషియా దేశాల ప్రజలకు దీనిపై మక్కువ ఎక్కువ. సొంతగా విత్తనం తయారీ... గొల్లప్రోలు మండలంలోని రేగడి భూములు పొట్టి మిరప సాగుకు అనుకూలం. గొల్లప్రోలు, చేబ్రోలు, దుర్గాడ, చెందుర్తి, తాటిపర్తి, ఎ.విజయనగరం గ్రామాలలో సుమారు 600 ఎకరాలలో పొట్టి మిరపను సాగు చేస్తున్నారు. రైతులే సొంతగా విత్తనాన్ని అభివృద్ధి చేసుకుంటున్నారు. తమకు పండిన పంటలో నాణ్యమైన కాయలను ఎంపిక చేసుకుని ఎండబెట్టి విత్తనాన్ని సిద్ధం చేసుకుంటారు. ఎకరాకు 70 నుంచి 80 బస్తాలు దిగుబడి వస్తుంది. వాతావరణం అనుకూలిస్తే పెట్టుబడి పోను ఎకరాకు రూ.70 వేల నుంచి రూ.90 వేల వరకు ఆదాయం వస్తుందని రైతులు చెబుతున్నారు. ఈ చిట్టి మిరపకు డిమాండ్ ఎక్కువగా ఉండటంతో వ్యాపారులు పొలం వద్దకే వచ్చి కొనుగోలు చేస్తున్నారు. ముంబై, పుణె ప్రాంతాలకు తరలించి అక్కడి నుంచి దుబాయ్, మలేషియా దేశాలకు ఎగుమతి చేస్తున్నారు. ప్రతి సంవత్సరం 250 నుంచి 350 టన్నుల వరకు ఎగుమతి చేస్తారు. ముంబై, ఢిల్లీ, హైదరాబాద్ నగరాల్లోని స్టార్ హోటళ్లకు విక్రయిస్తున్నారు. వ్యాపారులు టన్ను పొట్టి మిర్చిని విదేశాల్లో రూ.7లక్షల వరకు విక్రయిస్తున్నట్లు సమాచారం. పదేళ్లుగా సాగు చేస్తున్నా పదేళ్లుగా పొట్టి మిరప సాగు చేస్తున్నా. మొత్తం మీద మిరప సాగు లాభదాయకంగా ఉంది. ప్రస్తుతం ప్రకృతి వ్యవసాయం ద్వారా సాగు చేయడం వల్ల మంచి దిగుబడి వస్తోంది. ఆదాయం కూడా బాగుంది. – వెలుగుల బాబ్జి, మిరప రైతు, దుర్గాడ, గొల్లప్రోలు మండలం రైతులే మార్కెటింగ్ చేసుకునేలా చర్యలు ప్రస్తుతం రైతు దగ్గర వ్యాపారులు కేజీ రూ.300 వరకు కొంటున్నారు. దానిని రూ.1.200లకు అమ్ముకుంటున్నారు. రైతులే స్వయంగా విక్రయించుకునేలా మార్కెటింగ్ సౌకర్యం కల్పించేందుకు చర్యలు తీసుకుంటున్నాము. – ఎలియాజర్, డీపీఎం ప్రకృతి వ్యవసాయ శాఖ, కాకినాడ 410 ఎకరాల్లో పొట్టి మిర్చి సాగు గొల్లప్రోలు మండలంలో ఈ ఏడాది 410 ఎకరాల్లో పొట్టి మిర్చి సాగు చేశారు. ఉద్యానశాఖ ద్వారా ఎప్పటికప్పుడు రైతులకు సలహాలు అందిస్తున్నాము. మంచి డిమాండ్ ఉన్న పంట కావడంతో రైతులు ఎక్కువ శ్రద్ధ చూపిస్తున్నారు. – బీవీ రమణ, జిల్లా ఉద్యాన శాఖాధికారి, కాకినాడ -
టీడీపీ సీనియర్ నేత వరుపుల రాజా హఠాన్మరణం
సాక్షి ప్రతినిధి, కాకినాడ: కాకినాడ జిల్లా ప్రత్తిపాడు నియోజకవర్గ టీడీపీ ఇన్చార్జి వరుపుల రాజా (49) మృతి చెందారు. శనివారం ప్రత్తిపాడులో గుండెపోటుతో తీవ్ర అస్వస్థతకు గురైన రాజాను కాకినాడ అపోలో ఆస్పత్రికి తీసుకువచ్చారు. ఈ క్రమంలో వైద్యులు ఆయనను ప్రాణాపాయం నుంచి రక్షించేందుకు సీపీఆర్ చేసినా ఫలితం లేకపోయింది. దీంతో రాత్రి 11 గంటలకు రాజా మృతి చెందినట్టు వైద్యులు తెలిపారు. ఆయనకు భార్య, కుమారుడు, కుమార్తె ఉన్నారు. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి హయాంలో ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా డీసీసీబీ చైర్మన్‌గా వరుపుల రాజా పనిచేశారు. -
భారతమాలకు రహదారులు
సాక్షిప్రతినిధి, కాకినాడ: భారతమాల ప్రాజెక్టు వేగం పుంజుకుంది. గడువులోగా దీనిని పూర్తి చేయాలనే సంకల్పంతో అధికార యంత్రాంగం కసరత్తు చేస్తోంది. ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో పారిశ్రామిక ప్రగతికి దోహదపడేలా రూపొందించిన ఈ ప్రాజెక్టుల కోసం యుద్ధ ప్రాతిపదికన ఏర్పాట్లు జరుగుతున్నాయి. ప్రధానంగా కాకినాడ యాంకరేజ్ పోర్టు, తొండంగి సమీపాన గేట్‌వే ఆఫ్ పోర్టు కాకినాడను ఒకపక్క విశాఖపట్నం, మరోపక్క ఉమ్మడి ఉభయగోదావరి జిల్లాలను అనుసంధానించాలనేది రాష్ట్ర ప్రభుత్వ లక్ష్యం. ఇందుకు మూడు జాతీయ రహదారులను భారతమాల ప్రాజెక్టు కింద నాలుగు వరుసలుగా తీర్చిదిద్దుతున్నారు. రాష్ట్ర ప్రభుత్వ సహకారంతో ఒకటి లేదా, రెండేళ్లలో పనులను పూర్తి చేయాలని జాతీయ రహదారుల సంస్థ గట్టిగా అడుగులేస్తోంది. ఇందులో భాగంగా భూ సేకరణ, టెండర్ల ఖరారు పనులు యుద్ధ ప్రాతిపదికన జరుగుతున్నాయి. వడివడిగా.. కాకినాడ అచ్చంపేట జంక్షన్ నుంచి యాంకరేజ్ పోర్టు వరకు 13.20 కిలోమీటర్ల మేర నాలుగు వరుసల రహదారి అందుబాటులోకి రానుంది. ఏడాది వ్యవధిలో ప్రాజెక్టును పూర్తి చేయాలనే సంకల్పంతో పనుల వేగం పెంచారు. ఇక్కడ భూసేకరణ అవసరం లేకుండానే ఉన్న రోడ్డునే నాలుగు లేన్లుగా ఆధునీకరిస్తున్నారు. టెండర్లు ఖరారు కావడంతో రూ.90 కోట్ల అంచనాతో పనులు కూడా మొదలయ్యాయి. ప్రస్తుత రోడ్డును ఇరువైపులా వెడల్పు చేస్తూ నాలుగు వరుసలుగా చేపట్టడంలో అధికారులు నిమగ్నమయ్యారు. అవుటర్ రింగ్ రోడ్డు తరహాలో.. ♦ కాకినాడ వాకలపూడి లైట్‌హౌస్ నుంచి అన్నవరం మీదుగా కోల్‌కతా–చెన్నై జాతీయ రహదారితో అనుసంధానించనున్నారు. ♦ 40.32 కిలోమీటర్లు నిడివి కలిగిన ఈ నాలుగు వరుసల జాతీయ రహదారిని తొలుత రూ.776.82 కోట్ల అంచనా వ్యయంతో చేపట్టారు. ♦ కాకినాడ పోర్టు, కాకినాడ ప్రత్యేక ఆర్థిక మండలి, కాకినాడ గేట్‌వే పోర్టు, ఉప్పాడ ఫిష్షింగ్ హార్బర్ మీదుగా ఈ జాతీయ రహదారి వెళ్లనుంది. ♦ వాకలపూడి జంక్షన్లో ఒక ఫ్లై ఓవర్, అన్నవరం, కాకినాడ సెజ్, హార్బర్ల వద్ద అండర్‌పాస్‌లను నిర్మించాల్సి ఉంటుంది. ♦ హైదరాబాద్ అవుటర్ రింగ్ రోడ్డు తరహాలో ఈ జాతీయ రహదారి ఏర్పాటు కానుంది. ♦ ఇప్పుడు రహదారి అంచనా వ్యయం రూ.1400 కోట్లకు పెరిగింది. ♦ ఎక్కువగా భూ సేకరణ చేయాల్సి వస్తోంది. ఇందుకు రూ.160 కోట్లకుగాను ఇప్పటికే రూ.56 కోట్లు విడుదల చేశారు. ♦ రెండేళ్లలోపు అందుబాటులోకి తీసుకురావాలనేది లక్ష్యంగా పెట్టుకున్నారు. ♦ తొండంగి, శంఖవరం, యు కొత్తపల్లి, కాకినాడ రూరల్ మండలాల్లోని 21 గ్రామాల మీదుగా ఈ జాతీయ రహదారి సాగుతుంది. చకచకా భూసేకరణ ఉమ్మడి తూర్పులో పారిశ్రామికాభ్యున్నతికి సామర్లకోట–అచ్చంపేట జాతీయ రహదారి బాటలు వేయనుంది. రూ.395.60 కోట్ల అంచనాతో 12.25 కిలోమీటర్ల మేర ఈ జాతీయ రహదారి కోసం 33 ఎకరాల ప్రైవేటు భూమి, 21 ఎకరాల ప్రభుత్వ భూమి అవసరమవుతోంది. ఇందుకు నోటిఫికేషన్ కూడా విడుదలైంది. ఈ హైవేలో సగం గ్రీన్‌ఫీల్డ్ (పొలాల మధ్య) ఉంటుంది. కాకినాడ–పెద్దాపురం ఏడీబీ రోడ్డులోని రాక్ సిరామిక్స్ వద్ద ప్రారంభమై ఎఫ్‌సీఐ గోడౌన్స్, సుగర్ ఫ్యాక్టరీ, కెనాల్ రోడ్డు మీదుగా ఉండూరులో ఇది కలవనుంది. అచ్చంపేట జంక్షన్లో ఒక ఫ్లైఓవర్ నిర్మించాల్సి ఉంది. చురుగ్గా భూ సేకరణ చేపడుతున్నారు. 13 కిలోమీటర్ల మేర పనులు మొదలయ్యాయి. 33.92 హెక్టార్ల భూమి సేకరించి ఏడాదిలోపు ఈ హైవే పనులను పూర్తి చేయనున్నారు. ఈ రహదారి సామర్లకోట, కాకినాడ రూరల్ మండలాల్లో ఆరు గ్రామాల మీదుగా ప్రయాణిస్తుంది. నాలుగు వరుసల మూడు ప్రధాన జాతీయ రహదారులతో ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలతో తీరానికి అనుసంధానమవుతుంది. తద్వారా పారిశ్రామిక ప్రగతికి మార్గం సుగమమం అవుతుంది. -
విద్యార్థిని హత్య కేసులో 143 రోజుల్లోనే తీర్పు
కాకినాడ లీగల్: ఓ విద్యార్థిని పాశవికంగా హత్య చేసిన కేసులో ప్రేమోన్మాదికి కేవలం 143 రోజుల్లోనే శిక్ష పడింది. నిందితుడికి జీవిత ఖైదు విధిస్తూ కాకినాడ మూడో అదనపు జిల్లా సెషన్స్ జడ్జి పి.కమలాదేవి మంగళవారం తీర్పు చెప్పారు. రాష్ట్రంలో కేసులు త్వరితగతిన విచారణ జరిగి, నిందితులకు శిక్ష పడాలని, బాధితులకు సత్వర న్యాయం జరగాలన్న సంకల్పంతో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి తీసుకువచ్చిన కన్విక్షన్ బేస్డ్ ట్రయల్ కేసుల మానిటరింగ్ వ్యవస్థ ఇందుకు దోహదం చేసింది. గత ఏడాది జరిగిన హత్య కేసు విచారణ వేగంగా జరిగి, నిందితుడికి కఠిన శిక్ష పడింది. తూర్పు గోదావరి జిల్లా బిక్కవోలు మండలం బాలవరానికి చెందిన గుబ్బల వెంకట సూర్యనారాయణ కూరాడలో మేనమామ ఇంట్లో ఉండేవాడు. అదే గ్రామంలో కె.దేవిక తన అమ్మమ్మ ఇంట్లో ఉంటూ కాకినాడ పీఆర్ కళాశాలలో డిగ్రీ చదువుకునేది. దేవికను ప్రేమించానంటూ సూర్యనారాయణ వెంటపడేవాడు. సుమారు ఏడాది పాటు వెంట పడి వేధించాడు. పెళ్లి చేసుకోవాలని ఒత్తిడి చేసేవాడు. ఇతని వేధింపులు భరించలేక దేవిక విషయాన్ని బంధువులకు చెప్పింది. పెద్దలు యువకుడ్ని మందలించి పంపించేశారు. అయినా అతడు తన చేష్టలు ఆపలేదు. గతేడాది అక్టోబర్ 8న కాండ్రేగుల – కూరాడ మధ్య కాపు కాశాడు. యాక్టివా మోపెడ్‌పై వస్తున్న దేవికను ఆపి నడిరోడ్డుపై కత్తితో 18 సార్లు కిరాతకంగా పొడిచాడు. ఆమె అక్కడకక్కడే చనిపోయింది. దీనిపై పోలీసులు కేసు నమోదు చేశారు. కాకినాడ మూడో అదనపు జిల్లా సెషన్స్ కోర్టులో కేసు విచారణ జరిగింది. కాకినాడ రూరల్ సీఐ కె.శ్రీనివాసు త్వరితగతిన కేసు దర్యాప్తు చేశారు. సాక్ష్యాధారాలు సేకరించి 7 రోజులలోనే కోర్టులో చార్జిషీటు దాఖలు చేశారు. విచారణ త్వరితగతిన జరిగింది. నేరం రుజువు కావడంతో సూర్యనారాయణకు జీవిత ఖైదు విధిస్తూ జడ్జి పి.కమలాదేవి తీర్పు చెప్పారు. కన్విక్షన్ బేస్డ్ ట్రయల్ కేసుల మానిటరింగ్ వ్యవస్థతో సత్ఫలితాలు విద్యార్థిని పాశవిక హత్య ఘటనపై సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి చలించిపోయారు. వెంటనే మృతురాలి కుటుంబానికి సీఎం సహాయ నిధి నుంచి రూ.10 లక్షల ఆర్థిక సహాయం అందజేశారు. త్వరితగతిన విచారణ జరపాలని పోలీసు అధికారులను ఆదేశించారు. సీఎం వైఎస్ జగన్ ఆదేశాల మేరకు ఎస్పీ ఎం.రవీంధ్రనాథ్‌బాబు నిరంతరం దర్యాప్తును పర్యవేక్షించారు. ఇందుకు కన్విక్షన్ బేస్డ్ ట్రయల్ కేసుల మానిటరింగ్ వ్యవస్థ చక్కగా పనిచేసింది. కేసు నమోదు చేసిన 143 రోజుల్లో విచారణ చేసి నిందితుడికి శిక్ష పడేలా చేశారు. మహిళలపై అఘాయిత్యాలకు పాల్పడే వారికి ఈ తీర్పు చెంపపెట్టు అవుతుందని పోలీసు అధికారులు వ్యాఖ్యానించారు. కేసు విచారణ విషయంలో ప్రభుత్వం బాగా స్పందించిందని, నిందితుడికి కఠిన శిక్ష పడిందని మృతురాలి తల్లి నాగమణి అన్నారు. -
సత్ఫలితాలనిస్తున్న కన్విక్షన్ బేస్డ్ ట్రయల్ కేసుల మానిటరింగ్ వ్యవస్థ
సాక్షి, కాకినాడ జిల్లా: ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి, రాష్ట్ర డీజీపీ రాజేంద్రనాథ్ రెడ్డి ఆదేశాలతో ఏర్పాటు చేసిన కన్విక్షన్ బేస్డ్ ట్రయల్ కేసుల మానిటరింగ్ వ్యవస్థ సత్ఫలితాలను ఇస్తుంది. ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాలో ప్రేమించిన మహిళను దారి కాచి అత్యంత కిరాతకంగా హత్య చేసిన నిందితుడికి కాకినాడ 3వ అదనపు సెషన్స్ జడ్జి యావజ్జీవ కారాగార శిక్ష విధించారు. ఈ ఘటనపై దిశ పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేసిన కేవలం 144 రోజులు, (నాలుగున్నర నెలలలోనే)విచారణ జరిపి శిక్ష విధించిన కోర్టు. మహిళల భద్రత విషయంలో నిరంతర అప్రమత్తతతో వ్యవహరిస్తున్న జిల్లా పోలీసు యంత్రాంగం పనితీరుకు ఈ కేసు నిదర్శనం. మహిళలపై అఘాయిత్యాలకు పాల్పడే వారికి ఇది చెంపపెట్టుగా నిలిచింది. అసలేం జరిగిందంటే.. తనను ప్రేమించకుండా దూరం పెడుతుందనే అక్కసుతో కాకినాడ కరప మండలం కూరాడ గ్రామానికి చెందిన కాదా దేవిక(21) అనే యువతిని వెంకట సూర్యనారాయణ అనే యువకుడు కత్తితో పొడిచి అతి కిరాతకంగా హత్యచేశాడు. గతేడాది అక్టోబర్ 8న పెదపూడి మండలం కాండ్రేగుల వద్ద ఈ ఘోరం జరిగింది. జరిగిన ఘటనపై మృతురాలి చిన్నాన్న గుత్తుల బాలాజి ఇచ్చిన ఫిర్యాదుపై పెదపూడి పోలీసు స్టేషన్లో హత్య కేసు నమోదు చేసిన పోలీసులు.. 24 గంటల్లో అరెస్ఠ్ చేసి రిమాండ్‌కు తరలించారు. పోలీసుల దర్యాప్తులో భాగంగా పూర్తిస్థాయి ఆధారాలు సేకరించి 7 పని దినాలలోపే ఛార్జిషీట్‌ను కోర్టుకు సమర్పించారు. ఈ కేసులో నేరం జరిగిన నాటి నుండి జిల్లా ఎస్పీ ఎం రవీంద్రనాథ్ బాబు ప్రత్యేక శ్రద్ధ వహించి, విచారణలో భాగంగా దర్యాప్తు అధికారికి విలువైన సలహాలు, సూచనలు ఇచ్చారు. నిర్ణీత సమయంలో రిపోర్టులు (పోస్టుమార్టం, రసాయనిక పరీక్షల రిపోర్టులు) రావడానికి సంబంధిత అధికారులను సంప్రదించి, త్వరితగతిన దర్యాప్తు పూర్తి చేయించారు. దీంతో కాకినాడలోని గౌరవ 3వ అదనపు సెషన్స్ జడ్జ్ పి కమలాదేవి ఈ కేసు విచారణను జనవరి 9న ప్రారంభించారు. కోర్టు విచారణ సమయంలో అడిషనల్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ కె. ఆదిత్య కుమార్ ప్రాసిక్యూషన్ తరపున బలమైన వాదనలు వినిపించారు. సాక్షుల విచారణ, వాద ప్రతివాదనలు విన్న అనంతరం నిందితుడుపై నేరం రుజువైనందున ఐపీసీ సెక్షన్ 302 ప్రకారం యావజ్జీవ కారాగార శిక్ష, 5,000 రూపాయల జరిమానా విధిస్తూ మంగళవారం తేదీన తీర్పునిచ్చారు. -
కాకినాడ : ప్రేమోన్మాదికి జీవిత ఖైదు
-
3.15 లక్షల పశువులకు గాలికుంటు వ్యాక్సిన్
జగ్గంపేట: ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాలో 3.15 లక్షల పశువులకు గాలికుంటు వ్యాధి నివారణ వ్యాక్సిన్ వేయాలని లక్ష్యంగా పెట్టుకున్నట్టు జిల్లా పశు సంవర్ధక అధికారి సూర్యప్రకాశరావు తెలిపారు. వచ్చే నెల 1 నుంచి నెలాఖరు వరకూ ఈ వ్యాక్సినేషన్ చేపడతామని చెప్పారు. జగ్గంపేట పశువుల ఆసుపత్రికి శుక్రవారం వచ్చిన ఆయన విలేకర్లతో మాట్లాడారు. వ్యాకినేషన్ విజయవంతానికి మండలానికి 2 బృందాల చొప్పున ఏర్పాటు చేస్తున్నామన్నారు. పశువుల్లో ముద్ద చర్మ వ్యాధి అదుపులోకి వచ్చిందని, దీనికోసం 64,500 డోసుల వ్యాక్సిన్ పశువులకు వేశామని చెప్పారు. పందుల్లో స్వైన్ ఫీవర్ అరికట్టడానికి ఇప్పటికే 1,950 డోసుల వ్యాక్సిన్ వేశామని, మరో 2 వేల డోసులు ఆయా మండలాల్లోని ఆసుపత్రుల్లో అందుబాటులో ఉందని వివరించారు. రైతుభరోసా కేంద్రాల్లో పశువుల మేతను కేజీ రూ.6.50కు అందిస్తున్నామని చెప్పారు. కార్యక్రమంలో జగ్గంపేట పశు సంవర్ధక అధికారి సత్యనారాయణ కూడా పాల్గొన్నారు. రత్నగిరి కిటకిట అన్నవరం: వేలాదిగా తరలి వచ్చిన భక్తులతో సత్యదేవుని ఆలయం శుక్రవారం కిటకిటలాడింది. గురువారం రాత్రి, శుక్రవారం తెల్లవారుజామున రత్నగిరిపై 50కి పైగా వివాహాలు జరిగాయి. అలాగే రాష్ట్ర వ్యాప్తంగా వివిధ ప్రాంతాల్లో వివాహాలు చేసుకున్న వారు తమ బంధుమిత్రులతో కలసి స్వామివారి ఆలయానికి తరలి వచ్చారు. వీరు వ్రతాలాచరించి సత్యదేవుని దర్శించారు. సుమారు 40 వేల మంది భక్తులు స్వామివారిని దర్శించారని అధికారులు అంచనా వేశారు. ఆలయ ప్రాంగణంతో పాటు వ్రత, విశ్రాంతి మండపాలన్నీ భక్తులతో నిండిపోయాయి. వ్రతాలు 3 వేలు నిర్వహించారు. అన్ని విభాగాల ద్వారా దేవస్థానానికి రూ.50 లక్షల ఆదాయం వచ్చిందని అధికారులు తెలిపారు. సత్యదేవుని సాధారణ దర్శనానికి రెండు గంటలు, ప్రత్యేక దర్శనానికి గంట పట్టింది. నిత్యాన్న ప్రసాద పథకంలో 5 వేల మంది భక్తులకు భోజనం పెట్టారు. -
అక్షర విషంపై జనాగ్రహం
సాక్షి ప్రతినిధి, కాకినాడ: అనునిత్యం ప్రజాసంక్షేమాన్ని కాంక్షిస్తూ.. రాష్ట్ర అభివృద్ధికి ప్రణాళికాబద్ధంగా కృషి చేస్తున్న రాష్ట్ర ప్రభుత్వంపై.. ప్రతి అక్షరంతోనూ విషం చిమ్ముతున్న ఈనాడు పత్రిక తీరుపై జనాగ్రహం రెండో రోజూ కొనసాగింది. తప్పుడు రాతలకు ఇకనైనా స్వస్తి చెప్పాలంటూ ప్రజలు ఎక్కడికక్కడ ఆ పత్రిక ప్రతులను శుక్రవారం కూడా దహనం చేశారు. ‘రామోజీ డౌన్ డౌన్’ అంటూ పెద్ద పెట్టున నినదిస్తూ నిరసన ప్రదర్శనలు, మానవహారాలు నిర్వహించారు. టీడీపీ నాయకుడు పట్టాభిని కొట్టారంటూ రెండేళ్ల కిందటి ఫొటోలు పెట్టి ప్రచురించిన ‘ఈనాడు’ కఽథనాలకు నిరసనగా ఆ పత్రిక ప్రతులను రోడ్లపై గుట్టలుగా పోసి నిప్పంటించారు. పలు ప్రాంతాల్లో రామోజీరావు దిష్టిబొమ్మను ఊరేగించి, చెప్పులతో కొట్టి, కాళ్లతో తన్నుతూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈనాడు తప్పుడు రాతలు సోషల్ మీడియాలో ప్రచారం కావడంతో లోపలి పేజీల్లో సవరణలు వేసుకోవాల్సిన దౌర్భాగ్యం ఎందుకు వచ్చిందో ఇప్పటికై నా గుర్తించాలని పలువురు ఎమ్మెల్యేలు నిప్పులు చెరిగారు. డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లా ముమ్మిడివరం పోలీసు స్టేషన్ సెంటర్లో ఎమ్మెల్యే పొన్నాడ వెంకట సతీష్‌కుమార్ ఆధ్వర్యాన అమలాపురం – కాకినాడ 216 జాతీయ రహదారిపై ఈనాడు ప్రతులను దహనం చేశారు. రామోజీ డౌన్ డౌన్ అంటూ నినదించారు. నగర పంచాయతీ చైర్పర్సన్ కమిడి ప్రవీణ్‌కుమార్, పార్టీ రాష్ట్ర కార్యదర్శి పెన్మత్స చిట్టిరాజు తదితరులు పాల్గొన్నారు. పి.గన్నవరం ఎమ్మెల్యే కొండేటి చిట్టిబాబు ఆధ్వర్యాన ఈనాడు పత్రిక ప్రతులను అయినవిల్లి మండలం పోతుకుర్రులో దహనం చేశారు. కాకినాడ జిల్లా పిఠాపురం ఉప్పాడ సెంటర్లో ఎమ్మెల్యే పెండెం దొరబాబు పిలుపు మేరకు వైఎస్సార్ సీపీ నేతలు నిరసన ప్రదర్శన నిర్వహించి, ఈనాడు ప్రతులను దహనం చేశారు. గొల్లప్రోలు జెడ్పీటీసీ సభ్యుడు ఉలవకాయల లోవరాజు మాట్లాడుతూ, నిజాన్ని దాచిపెట్టి టీడీపీ నేతలకు వంత పాడుతూ, పత్రికా స్వేచ్ఛను దుర్వినియోగం చేస్తున్న ఈనాడు అధినేత రామోజీరావు బహిరంగ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో కో ఆప్షన్ సభ్యుడు గండేపల్లి బాబీ తదితరులు పాల్గొన్నారు. పెద్దాపురం మున్సిపల్ సెంటర్లో కో ఆర్డినేటర్, ఏపీ హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్ దవులూరి దొరబాబు ఆధ్వర్యాన నిరసన తెలిపారు. రాష్ట్ర మాల కార్పొరేషన్ చైర్పర్సన్ పెదపాటి అమ్మాజీ, మున్సిపల్ చైర్పర్సన్లు బొడ్డు తులసీ మంగతాయారు, గంగిరెడ్డి అరుణ, పార్టీ రాష్ట్ర కార్యదర్శులు ఆవాల లక్ష్మి, కంటే వీరరాఘవరావు తదితరులు ఈనాడుకు, రామోజీరావుకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఈనాడు ప్రతులను దహనం చేశారు. తుని గొల్ల అప్పారావు సెంటర్లో మంత్రి దాడిశెట్టి రాజా పిలుపుతో వైఎస్సార్ సీపీ నాయకులు, కార్యకర్తలు నిరసన ప్రదర్శన నిర్వహించారు. ఈనాడు ప్రతులను దహనం చేశారు. తొండంగి మండలం ఒంటిమామిడి గ్రామంలో కూడా ఈనాడు ప్రతులను దహనం చేసి, నిరసన తెలిపారు. కోటనందూరులో వైఎస్సార్ సీపీ నాయకులు నిరసన ప్రదర్శన, మానవహారం నిర్వహించి, ఈనాడు ప్రతులు దహనం చేశారు. -
ఎమ్మెల్సీగా కుడుపూడి ఎన్నిక లాంఛనమే..
కాకినాడ: స్థానిక సంస్థల ఎమ్మెల్సీగా వైఎస్సార్ సీపీ అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేసిన కుడుపూడి సూర్యనారాయణరావు ఎన్నిక లాంఛనమే కానుంది. శుక్రవారం జరిగిన నామినేషన్ల పరిశీలనలో టీడీపీ తరఫున దరఖాస్తు చేసిన కడలి శ్రీదుర్గ, స్వతంత్ర అభ్యర్థులు ఇంత సంతోషం, అంబటి కోటేశ్వరరావుల నామినేషన్లను అధికారులు సాంకేతిక కారణాలతో తిరస్కరించారు. వైఎస్సార్ సీపీ అభ్యర్థిగా కుడుపూడి సూర్యనారాయణ రెండు నామినేషన్లు వేశారు. ఆయన నామినేషన్‌ను ఆమోదించారు. బరిలో ఆయన నామినేషన్ మాత్రమే మిగలడంతో ఆయన ఎమ్మెల్సీగా ఎన్నిక కావడం లాంఛనమే కానుంది. అయితే నిబంధనల ప్రకారం అధికారులు దీనిని ప్రకటించాల్సి ఉంటుంది. రూ.3.36 లక్షల సరకు జప్తు కాకినాడ సిటీ: వివిధ కేసులలో స్వాధీనం చేసుకున్న రూ.3,36,800 విలువైన సరకును ప్రభుత్వానికి జప్తు చేస్తూ జాయింట్ కలెక్టర్ ఎస్.ఇలక్కియ శుక్రవారం ఉత్తర్వులు జారీ చేశారు. రేషన్ బియ్యం అక్రమ నిల్వ, రవాణాతో పాటు రైస్ మిల్లులు, పెట్రోల్ బంకుల్లో నిబంధనల ఉల్లంఘన వంటి వాటిపై ఈ కేసులు నమోదయ్యాయి. అక్రమ రవాణాకు సంబంధించి ఇద్దరు వాహన యజమానులకు రూ.27 వేల జరిమానా విధించామని జేసీ తెలిపారు. ఈ మొత్తం పౌర సరఫరాల శాఖకు జమ అవుతుందన్నారు. ప్రతివాదులను ఆమె విచారించి, తీసుకోవాల్సిన చర్యలు, సీజ్ చేసిన సరుకులను ప్రభుత్వానికి జప్తు చేయడంపై ఉత్తర్వులు ఇచ్చారు. ఎస్సీ, ఎస్టీ ప్రత్యేక స్పందనకు 10 అర్జీలు కాకినాడ సిటీ: కలెక్టరేట్లో శుక్రవారం నిర్వహించిన ఎస్సీ, ఎస్టీ ప్రత్యేక స్పందన కార్యక్రమానికి జిల్లావ్యాప్తంగా 10 మంది అర్జీలు అందజేశారు. జిల్లా రెవెన్యూ అధికారి కె.శ్రీధర్‌రెడ్డి, జెడ్పీ సీఈఓ ఎన్వీవీ సత్యనారాయణ, ఎస్సీ కార్పొరేషన్ ఈడీ డీఎస్ సునీత అర్జీలు స్వీకరించారు. వాటిని ఆయా శాఖల అధికారులకు అందజేసి, నిర్దిష్ట గడువులోగా పరిష్కరించాలని ఆదేశించారు. రెవెన్యూ, భూ సమస్యలు, ఉద్యోగ, ఉపాధి అవకాశాలు, పింఛన్ తదితర సమస్యలపై అర్జీలు వచ్చాయి. ముగిసిన డ్వామా అధికారుల శిక్షణ సామర్లకోట: స్థానిక విస్తరణ, శిక్షణ కేంద్రం(ఈటీసీ)లో డ్వామా అధికారులకు మూడు రోజుల పాటు ఇచ్చిన శిక్షణ శుక్రవారం ముగిసింది. అల్లూరి సీతారామరాజు, అనకాపల్లి, తూర్పు గోదావరి, కాకినాడ, కోనసీమ, పార్వతీపురం మన్యం, శ్రీకాకుళం, విశాఖపట్నం, విజయనగరం జిల్లాలకు చెందిన డ్వామా ఏపీడీలు, ఏపీఓలు, ఏసీలు, టెక్నికల్ అసిస్టెంట్లకు ఇక్కడ శిక్షణ ఇచ్చారు. డ్వామాలో రూపొందించిన కొత్త స్టాఫ్‌వేర్, పనుల్లో నాణ్యత, సాంకేతిక పరిజ్ఞానం, వ్యక్తిత్వ వికాసం, చేయాల్సిన పనులపై మూడో రోజు శిక్షణలో ఫ్యాకల్టీలు వివరించారు. రాజీవ్, రమేష్, శ్వేత, చంద్రశేఖర్ శిక్షణ ఇచ్చారు. శిక్షణ తీరును విశాఖ ఏపీడీ ఎల్.రామారావు, పంచాయతీరాజ్ రాష్ట్ర టెక్నికల్ రిసోర్స్‌పర్సన్ కె.స్వరూపరాణి పరిశీలించారు. ముగింపు కార్యక్రమంలో రాష్ట్ర పంచాయతీరాజ్, రూరల్ డెవలప్మెంట్ అసిస్టెంట్ కమిషనర్ ఇ.కృష్ణమోహన్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. శిక్షణ పూర్తి చేసుకున్న వారికి సర్టిఫికెట్లు అందజేశారు. కార్యక్రమంలో ఈటీసీ ఫ్యాకల్టీ ఎంఎస్ఎన్ రెడ్డి, స్వరూప, ఎస్కె మొహిద్దీన్ కూడా పాల్గొన్నారు. -
సత్యదేవునికి వెండి సామగ్రి సమర్పణ
అన్నవరం: సత్యదేవునికి పి.శ్రీనివాస్ దంపతులు (హైదరాబాద్) శుక్రవారం రూ.2 లక్షల విలువైన 1.50 కిలోల వెండితో పళ్లెం, నాలుగు కప్పుల పంచపాత్ర, చెంబు, రూ.2 లక్షల విరాళం సమర్పించారు. గడచిన నాలుగేళ్లుగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి నిరంతరాయంగా అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు చూసి ఓర్వలేకే ఈనాడు అధినేత రామోజీరావు తప్పుడు కథనాలు ప్రచురిస్తున్నారని కాకినాడ ఎంపీ వంగా గీత మండిపడ్డారు. కిర్లంపూడి మండలం జగపతినగరంలో ప్రధాన రహదారిపై ఎంపీ గీత, జగ్గంపేట ఎమ్మెల్యే జ్యోతుల చంటిబాబు, వైఎస్సారీ సీపీ నాయకులు కలిసి ఈనాడు ప్రతులను దహనం చేశారు. కాకినాడ సిటీలో వైఎస్సార్ సీపీ కార్యాలయం నుంచి సూర్యారావుపేట ఘంటసాల విగ్రహం సెంటర్ వరకూ రామోజీరావు దిష్టిబొమ్మతో భారీ ర్యాలీ నిర్వహించి, నిరసన తెలిపారు. అనంతరం రామోజీరావు దిష్టిబొమ్మను కాళ్లతో తొక్కి, చెప్పులతో కొట్టి, దహనం చేశారు. ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖరరెడ్డి, కాకినాడ నగరాభివృద్ధి సంస్థ (కౌడా) చైర్పర్సన్ రాగిరెడ్డి చంద్రకళాదీప్తి కుమార్, పార్టీ నగర అధ్యక్షురాలు సుంకర శివప్రసన్న, మాజీ కార్పొరేటర్లు, వైఎస్సార్ సీపీ నాయకులు, కార్యకర్తలు కలిసి ఈ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ద్వారంపూడి మాట్లాడుతూ, జర్నలిస్టు విలువలకు రామోజీరావు తిలోదకాలిచ్చి, ఇష్టానుసారం వార్తలను వక్రీకరించి రాయిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికై న ప్రభుత్వంపై అబద్ధాలు, అభూత కల్పనలతో అనునిత్యం విషం చిమ్ముతున్నారని మండిపడ్డారు. చంద్రబాబును వెనకేసుకు వచ్చేందుకు పత్రికా విలువలను కాలరాస్తున్నారని అన్నారు. -
జార్జిపేట మహాలక్ష్మి అమ్మవారికి భారీ సారె
తాళ్లరేవు: జార్జిపేట గ్రామదేవత మహాలక్ష్మి అమ్మవారికి సుమారు రెండు వేలమందికిపైగా గ్రామ ఆడపడుచులు సారెను సమర్పించారు. గ్రామంలో నూతనంగా నిర్మించిన ఆలయ ప్రతిష్ఠా మహోత్సవం శుక్రవారం కన్నుల పండువగా జరిగింది. వేద పండితులు వాడపల్లి గోపాలచార్యులు నేతృత్వంలో విశేష పూజలు నిర్వహించారు. ఉదయం 7.51 గంటలకు అమ్మవారి విగ్రహ ప్రతిష్ఠ, ఆలయ శిఖర ప్రతిష్ఠ వైభవంగా జరిగాయి. వివిధ ప్రాంతాలలో స్థిరపడిన గ్రామ ఆడపడుచులు అమ్మవారి ప్రతిష్టా మహోత్సవాలకు పెద్ద ఎత్తున తరలివచ్చి పసుపు, కుంకుమ, చీరలు, చలివిడి, పానకం, అరటిపండ్లు తదితర వస్తువులతో కూడిన సారెను సమర్పించారు. స్థానిక దుర్గా మల్లేశ్వర స్వామి ఆలయం నుంచి ఊరేగింపుగా వచ్చి సారెను సమర్పించి అమ్మవారి దర్శనం చేసుకున్నారు. జార్జీపేట గ్రామం నుంచే కాక పరిసర ప్రాంతాల నుంచి భక్తులు అధిక సంఖ్యలో తరలిరావడంతో గ్రామంలో సందడి నెలకొంది.