
చిరంజీవిపై వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్‌రెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ, చిరంజీవి మళ్లీ రాజకీయాల్లోకి వస్తారని అనుకోవడం లేదన్నారు.
సాక్షి, కాకినాడ: చిరంజీవిపై వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్‌రెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ, చిరంజీవి మళ్లీ రాజకీయాల్లోకి వస్తారని అనుకోవడం లేదన్నారు.
‘‘రాజకీయాలకు సరిపోననుకునే మళ్లీ సినీ ఇండస్ట్రీ వైపు అడుగులు వేశారు. సినిమాల ద్వారా చిరంజీవి ప్రజల్ని అలరించడం మంచి పరిణామం. సినిమాల్లోనే చిరంజీవికి సౌకర్యంగా ఉంది’’ అంటూ ఎమ్మెల్యే ద్వారంపూడి చురకలు అంటించారు.
చదవండి: చిరంజీవి ఎందుకు ఉలిక్కిపడ్డారు? అదన్న మాట అసలు సంగతి!
మరోవైపు చిరంజీవిపై ఎంపీ విజయసాయిరెడ్డి కూడా కీలక వ్యాఖ్యలు చేశారు. చిరంజీవి వ్యాఖ్యలకు కౌంటరిచ్చారు. సినిమా స్టార్స్ అయినా పొలిటిషియన్స్ అయినా ప్రజలు ఆదరిస్తేనే వారికి మనుగడ అని చెప్పుకొచ్చారు. సినీ పరిశ్రమలోని పేదలు, కార్మికుల సంక్షేమం బాధ్యత కూడా ప్రభుత్వానిదే అంటూ ట్విట్టర్ వేదికగా స్పష్టం చేశారు.
చదవండి: చిరంజీవి ఎందుకు ఉలిక్కిపడ్డారు? అదన్న మాట అసలు సంగతి!