Dwarampudi Chandrasekhar Reddy
-
కాకినాడలో మాజీ MLA ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి పూజలు
-
ఎమ్మెల్యే కొండబాబుకు ద్వారంపూడి బహిరంగ లేఖ
-
ఎమ్మెల్యే కొండబాబు అక్రమాలు బయటపెడతా: ద్వారంపూడి
సాక్షి, కాకినాడ జిల్లా: తనపై రాజకీయ కక్ష సాధింపులతో ఎమ్మెల్యే కొండబాబు అక్రమ కేసులు పెట్టాలని ప్రయత్నిస్తున్నాడని మాజీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్‌రెడ్డి మండిపడ్డారు. కొండబాబుకు బహిరంగ లేఖ రాసిన ఆయన ‘సాక్షి’ మీడియాతో మాట్లాడుతూ.. ‘‘ప్రభుత్వం వారిదే కనుక ఆరు నెలల సమయం ఇస్తున్నా నాపై చేసిన ఆరోపణలను రుజువు చేయాలి’’ అంటూ సవాల్ విసిరారు.‘‘కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన రెండున్నర నెలల కాలంలో కొండబాబు చేసిన అక్రమాలు, అవినీతి నా దృష్టికి వచ్చాయి. ఆయిల్ మాఫియా, పీడీఎస్ బియ్యం, అధికారుల బదిలీలలో కొండబాబు పాత్ర ఏంటో నాకు తెలుసు. త్వరలోనే వాటిని బయట పెడతాను. జగన్నాధపురం మూడో వంతెన తన స్వార్థం కోసం కాకుండా ప్రజల కోసం నిర్మించాలని కోరుతున్నాను. మత్స్యకార సామాజిక వర్గం నుంచి ఎమ్మెల్యేగా గెలిచిన కొండబాబు మత్స్యకార భరోసా, ఓఎన్జీసీ నష్టపరిహరం త్వరగా అందజేయాలి’’ అని ద్వారంపూడి చంద్రశేఖర్‌రెడ్డి డిమాండ్ చేశారు. -
కాకినాడ అభివృద్ధిపై దృష్టి పెట్టండి..
-
చంద్రబాబు లా గాలి మాటలు చెప్పడు..జగన్ చెప్పాడంటే అది జరుగుతుంది
-
టీడీపీ ఎన్ని కుట్రలు చేసినా విజయం వైఎస్ఆర్ సీపీదే: ద్వారంపూడి
-
ప్రజలు జాగ్రత్త.. బాబుపై ద్వారంపూడి సెటైర్లు
-
కాకినాడలో జోరుగా ద్వారంపూడి ఎన్నికల ప్రచారం
-
చంద్రబాబు చేసిన నీచ రాజకీయం వల్లే ప్రాణం పోయింది
-
ఈనాడు తప్పుడు కథనాలు...ద్వారంపూడి సవాల్
-
ఈనాడు తప్పుడు రాతలపై ఎమ్మెల్యే ద్వారంపూడి స్ట్రాంగ్ వార్నింగ్
-
2014లో టీడీపీ మేనిఫెస్టో ఒకసారి యూట్యూబ్ లో చూడండి
-
ఇంకోసారి పిచ్చి పిచ్చిగా వాగితే..పవన్ కు ద్వారంపూడి దిమ్మతిరిగే కౌంటర్
-
కొండబాబుపై ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి ఫైర్
-
సీఎం జగన్ దేనికైనా సిద్ధం: ఎమ్మెల్యే ద్వారంపూడి
-
కొండ బాబు టీడీపీ నుంచి టికెట్ తెచ్చుకోవాలి: ద్వారంపూడి
-
నా బొచ్చు కూడా పీకలేరు..ఎమ్మెల్యే ద్వారంపూడి మాస్ వార్నింగ్
-
నీ కుమారుడే నీకు వెన్నుపోటు పొడిచే పరిస్థితి వస్తుంది: ద్వారంపూడి
-
మాజీ ఎమ్మెల్యే కొండబాబుపై ఎమ్మెల్యే ద్వారం పూడి ఫైర్
-
ఎంతమంది బాబులు వచ్చినా నిన్ను గెలిపించుకుంటాం అన్నా..
-
సీఎం జగన్ కాకినాడ పర్యటనకు భారీ ఏర్పాట్లు
-
జనవరి 3న సిఎం జగన్ కాకినాడ పర్యటన
కాకినాడ: ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి వచ్చే నెల 3న జిల్లా కేంద్రం కాకినాడ రానున్నారు. కాకినాడ సిటీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్‌రెడ్డి ఈ విషయం చెప్పారు. వైఎస్సార్ పెన్షన్ కానుకను రూ.3 వేలకు పెంపుదల చేసే కార్యక్రమంతో పాటు వివిధ అభివృద్ధి పనులను ముఖ్యమంత్రి ప్రారంభిస్తారన్నారు. బుధవారం ఆయన కమిషనర్ నాగ నరసింహారావు ఇతర అధికారులతో కలిసి సీఎంతో ప్రారంభించనున్న రాగిరెడ్డి వెంకట జయరాంకుమార్ కళాక్షేత్రాన్ని, స్కేటింగ్ రింక్‌ను సందర్శించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ దశలవారీగా పింఛన్ సొమ్మును పెంచుతామని ఇచ్చిన హామీ మేరకు ప్రస్తుతం ఉన్న రూ.2750 నుంచి రూ.3,000కు పెంచే కార్యక్రమాన్ని కాకినాడలో ప్రారంభిస్తారన్నారు. ముత్తా గోపాలకృష్ణ వారధి ( కొండయ్యపాలెం ఫ్లైఓవర్ ), రూ 20 కోట్లతో నిర్మించిన రాగిరెడ్డి కళాక్షేత్రం, రూ.7 కోట్లతో అంతర్జాతీయ ప్రమాణాలతో నిర్మించిన స్కేటింగ్ రింక్‌ను కూడా సీఎం ప్రారంభిస్తారన్నారు. ఇందుకు సంబంధించిన ఏర్పాట్లను ఆయన అధికారులతో సమీక్షించారు. కార్యక్రమంలో ఆయన వెంట స్మార్ట్ సిటీ ఎస్ఈ ఎం.వెంకటరావు, కనస్ట్రక్షన్స్ మేనేజర్ కామేశ్వర్, ఇతర అధికారులు ఉన్నారు. ఏర్పాట్లపై కలెక్టర్ కృతికా శుక్లా సమీక్ష కాకినాడ సిటీ: ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి జనవరి 3న కాకినాడ పర్యటన ఖరారైన నేపథ్యంలో ఏర్పాట్లు పూర్తి చేయాలని కలెక్టర్ కృతికా శుక్లా అధికారులను ఆదేశించారు. ఈ మేరకు బుధవారం కలెక్టరేట్లో జాయింట్ కలెక్టర్ ఎస్ ఇలక్కియ, రెవెన్యూ, మున్సిపాలిటీ, పబ్లిక్‌హెల్త్, మెప్మా, డీఆర్డీఏ, పౌర సరఫరాలు, రోడ్డు, భవనాలు, విద్యుత్, ప్రజారవాణా, సమాచార పౌర సంబంధాలు, ట్రాన్స్‌పోర్టు తదితర శాఖల అధికారులతో ఆమె సమీక్ష నిర్వహించారు. -
ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి టీడీపీ నేతలను వైఎస్సార్సీపీలోకి ఆహ్వానించారు
-
రేవంత్ రెడ్డి సీఎంగా ఎక్కువ కాలం ఉండడు: ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి
-
నారా లోకేష్ పై ద్వారంపూడి ఫైర్
-
మోసం చేసేందుకు వస్తున్న పవన్, చంద్రబాబును నమ్మొద్దు
-
92 పేద కుటుంబాలకు ఇళ్ల పట్టాలు పంపిణీ చేసిన ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి
-
ఫిబ్రవరి 15 తర్వాత మీ దుకాణాలు మూసుకోవాల్సిందే: ఎమ్మెల్యే ద్వారంపూడి
సాక్షి, కాకినాడ జిల్లా: పొత్తులు ప్రకటించాక బాబు, పవన్ ఎక్కడికెళ్లారో తెలియదంటూ వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్‌రెడ్డి ఎద్దేవా చేశారు. కాకినాడలో ఆయన శుక్రవారం మీడియాతో మాట్లాడుతూ చంద్రబాబు అరెస్ట్ అయ్యాక ఎమోషనల్‌లో పవన్ పొత్తులు ప్రకటించాడు. ప్యాకేజీకి అమ్ముడు పోవద్దని.. కార్యకర్తల మనోభావాలు తాకట్టు పెట్టొదని పవన్ కల్యాణ్‌కు ముందు నుంచి చెబుతున్నా’’ అని పేర్కొన్నారు. ‘‘2024 ఫిబ్రవరి 15 తర్వాత సింగిల్‌గా వైఎస్సార్సీపీ మేనిఫెస్టోతో వస్తుంది. మా మేనిఫెస్టోతో బాబు, పవన్, లోకేష్‌కు చెమటలు పడతాయి. ఫిబ్రవరి 15 తర్వాత మీ దుకాణాలు మూసుకోవాలి’’ అంటూ ఎమ్మెల్యే ద్వారంపూడి వ్యాఖ్యానించారు. చదవండి: బెయిల్ కోసం ఇన్ని డ్రామాలెందుకు?: మంత్రి సీదిరి -
పవన్ ప్యాకేజీ రూ.1,400 కోట్లు పైనే..
సాక్షి ప్రతినిధి, కాకినాడ: జనసేన అధినేత పవన్‌కళ్యాణ్‌కు ఇంతవరకు వివిధ రూపాల్లో రూ.1,400 కోట్లకు పైగానే ప్యాకేజీ అందిందని కాకినాడ సిటీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖరరెడ్డి ఆరోపించారు. రాజకీయ పొత్తుల వ్యవహారంలో భాగంగానే ఆయన ఈ సొమ్ము అందుకున్నారని.. ఈ మొత్తాన్ని ఇప్పటికే హవాలా ద్వారా పవన్ బినామీలకు చేరిందన్నారు. కాకినాడలో శనివారం ద్వారంపూడి మీడియాతో మాట్లాడుతూ చంద్రబాబుతో పవన్‌కళ్యాణ్ ప్యాకేజీ మాట్లాడుకుని పెద్దఎత్తున సొమ్ములు తీసుకున్నారని తాను చేస్తున్న ఆరోపణలకు ఇప్పటికీ, ఎప్పటికీ కట్టుబడే ఉంటానన్నారు. అలా వచ్చిన రూ.1,400 కోట్లను రష్యా, దుబాయ్, సింగపూర్ వంటి దేశాలకు తరలించేశారన్నారు. ఇందుకు సంబంధించిన సమగ్ర సమాచారం కేంద్ర ప్రభుత్వం వద్ద ఉందన్నారు. వచ్చే ఎన్నికల్లో టీడీపీతో పొత్తు పెట్టుకుని బీజేపీని కూడా కలుపుకుని వెళ్తామని పవన్ పదేపదే చెబుతుండటం వెనుక పెద్ద కారణమే ఉందన్నారు. ఇక వచ్చే ఎన్నికల్లో తనపై కాకినాడ సిటీలో గ్లాస్ గుర్తుపై అభ్యర్థిని పోటీలో పెట్టలేకపోతే ఆ క్షణాన్నే పవన్ రాజకీయంగా ఓటమి చెందినట్లు భావిస్తానని ఎమ్మెల్యే ద్వారంపూడి స్పష్టంచేశారు. వచ్చే ఎన్నికల్లో సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి రెండోసారి ప్రమాణస్వీకారం చేయడం, ఆ తరువాత టీడీపీ శాశ్వతంగా మూతపడడం రెండూ ఒకేసారి జరుగుతాయని ద్వారంపూడి చెప్పారు. వ్యవస్థలను మేనేజ్ చేయడంలో చంద్రబాబును మించిన ఘనుడు దేశంలోనే మరొకరు లేరని.. అలాంటిది వైఎస్సార్సీపీ ప్రభుత్వం వ్యవస్థలను మేనేజ్ చేస్తోందంటూ లోకేశ్ విమర్శించడం దెయ్యాలు వేదాలు వల్లించినట్లుందని ఎద్దేవా చేశారు. చీకట్లో చిదంబరం వంటి నేతలను కలవడం, నిన్నమొన్నటి వరకు దేశ అత్యున్నత న్యాయస్థానంలో కీలకంగా వ్యవహరించిన వ్యక్తితో సంబంధాలు.. వెంకయ్యనాయుడు వంటి వ్యక్తులతో సాగించిన చీకటి రాజకీయాలు ప్రజలకు తెలియనివి కావన్నారు. ఇంతకాలం వ్యవస్థలను మేనేజ్ చేస్తూ వచ్చిన చంద్రబాబుకు ఇప్పుడు పరిస్థితులు కలిసి రాకపోవడంలేదనే అక్కసుతోనే లోకేశ్ ఈ రకమైన విమర్శలు చేస్తున్నారని ద్వారంపూడి మండిపడ్డారు. బాబుకు ఇక అధికారం దక్కదు మంత్రి గుడివాడ అమర్నాథ్ అనకాపల్లి టౌన్: చంద్రబాబు తన జీవితకాలంలో మళ్లీ అధికారంలోకి రాలేరని రాష్ట్ర పరిశ్రమలు, వాణిజ్య, ఐటీ శాఖ మంత్రి గుడివాడ అమర్నాథ్ చెప్పారు. మండలంలోని మార్టూరు గ్రామంలో ‘ఏపీకి జగన్ కావాలి’ కార్యక్రమ సన్నాహక సమావేశం వైఎస్సార్సీపీ మండల అధ్యక్షుడు పెదిశెట్టి గోవింద ఆధ్వర్యంలో శనివారం జరిగింది. మంత్రి మాట్లాడుతూ నవంబర్ 1 నుంచి ఈ కార్యక్రమాన్ని పెద్దఎత్తున నిర్వహిస్తున్నట్లు చెప్పారు. చంద్రబాబు 14ఏళ్లు సీఎంగా ఉండి రాష్ట్రానికి ఎలాంటి ప్రయోజం చేకూర్చలేదన్నారు. అదే సీఎం వైఎస్ జగన్ ఇచ్చిన హామీల్లో 98 శాతం అమలుచేశారన్నారు. చంద్రబాబు వివిధ నేరాల్లో ఇరుక్కుని జైలుకు వెళ్లాడని, ఈ విషయాన్ని న్యాయస్థానం కూడా నమ్ముతోంది కాబట్టే ఆయనకు బెయిల్ ఇవ్వటంలేదన్నారు. ఇక పవన్‌కళ్యాణ్‌కు పార్టీ నడిపే దమ్ములేదని, ఒంటరిగా పోటీచేసే సత్తాలేదని అందుకే టీడీపీతో పొత్తుకు వెంపర్లాడుతున్నారని అమర్నాథ్ విమర్శించారు. ప్రజలనే అవినీతిపరులంటావా? పవన్‌పై డిప్యూటీ సీఎం నారాయణస్వామి ఫైర్ కార్వేటినగరం(చిత్తూరు జిల్లా): స్కిల్ స్కాంలో అడ్డంగా దొరికి జైలుపాలైన చంద్రబాబు అవినీతిపరుడు కాదని, అమాయకులైన ప్రజలే అవినీతిపరులంటున్న పవన్‌కళ్యాణ్‌కు ప్రజాకోర్టులో పరాజయం తప్పదని ఉప ముఖ్యమంత్రి కె.నారాయణస్వామి అన్నారు. శనివారం ఆర్కేవీబీపేటలో మీడియాతో మాట్లాడుతూ చంద్రబాబు ఒక అవినీతి చక్రవర్తి అని, ప్రజాధనాన్ని దోచుకున్న ఆయన్ను అరెస్ట్ చేస్తే దత్తపుత్రుడు రోడ్లపై దొర్లాడుతున్నారని ఎద్దేవా చేశారు. చంద్రబాబు అరెస్టుపై ప్రపంచ వ్యాప్తంగా నిరసనలు చేస్తున్నారని చెప్పుకోవడం సిగ్గుచేటన్నారు. చంద్రబాబు అరెస్ట్‌కు, కాంగ్రెస్‌లో ఉన్న రేణుకాచౌదరికి సంబంధమేంటని ప్రశ్నించారు. తన తండ్రి ఎన్టీఆర్ మృతికి చంద్రబాబే కారణమన్న పురందేశ్వరి.. నేడు చంద్రబాబు అరెస్ట్‌తో మరిదిపై ప్రేమ వలకబోస్తున్నారని ధ్వజమెత్తారు. పురందేశ్వరి, తన భర్త వేంకటేశ్వరరావులు తెలుగుదేశాన్ని వదిలి బీజేపీలో ఎందుకు చేరారో చెప్పాలని ప్రశ్నించారు. తప్పు చేస్తే.. చట్టం ఎవరినీ వదలదు మంత్రి ధర్మాన ప్రసాదరావు శ్రీకాకుళం (పీఎన్ కాలనీ): తప్పు చేస్తే చట్టం ఎవరినీ వదలదని, కేంద్ర ప్రభుత్వ ఏజెన్సీల విచారణలోనే ముందుగా చంద్రబాబు బాగోతం బట్టబయలయిందని రెవెన్యూ శాఖ మంత్రి ధర్మాన ప్రసాదరావు స్పష్టం చేశారు. బాబుపై అక్రమంగా కేసు నమోదు చేశామని ఎల్లో మీడియా గగ్గోలు పెడుతుందని, కేంద్ర ప్రభుత్వ దర్యాప్తు సంస్థలే బాబు అవినీతిపరుడని తేల్చాయన్నారు. శ్రీకాకుళంలోని డీసీసీబీ కాలనీలో శనివారం వైఎస్సార్ అర్బన్ హెల్త్ సెంటర్ ప్రారంభోత్సవం సందర్భంగా మంత్రి మాట్లాడారు. చంద్రబాబు కొన్ని షెల్ కంపెనీలు సృష్టించి డబ్బులు దోచుకున్నాడని చెప్పారు. అవినీతిలో ముఖ్యపాత్ర పోషించిన చంద్రబాబు, లోకేశ్ పీఏలు ఇద్దరూ అమెరికాకు పారిపోయారని తెలిపారు. అవినీతి ఆరోపణలు ఎదుర్కొన్న మాజీ సీఎంలు జయలలిత, లాలూ ప్రసాద్‌యాదవ్ తదితరులంతా కోర్టుల ముందు నిలబడినవారేనని, బాబు ఏమైనా పైనుంచి దిగొచ్చారా.. అని ప్రశ్నించార‡ు. -
పవన్ కల్యాణ్ కు ఎమ్మెల్యే ద్వారంపూడి సవాల్
-
పవన్ కల్యాణ్ కు ఎమ్మెల్యే ద్వారంపూడి సవాల్
-
పవన్ ప్యాకేజీ సొమ్ములు బయటకు రావడం ఖాయం: ఎమ్మెల్యే ద్వారంపూడి
సాక్షి, కాకినాడ జిల్లా: పవన్ కళ్యాణ్ కచ్చితంగా ప్యాకేజీ కళ్యాణే అంటూ వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖరరెడ్డి మండిపడ్డారు. శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ, పవన్ కళ్యాణ్ బీజేపీని కాదని బయటకు రమ్మనండి అంటూ వ్యాఖ్యానించారు. ‘‘పవన్ ప్యాకేజీ సొమ్ములు ఏ రూట్ ద్వారా విదేశాలకు వెళ్లాయో బయటకు రావడం ఖాయం. నాకు తెలిసి రూ.1400 కోట్ల ప్యాకేజీ సొమ్ములు హవాలా ద్వారా దేశం దాటింది. అది దుబాయ్ కి వెళ్ళాయా? లేక రష్యాకు వెళ్ళాయా, సింగపూర్‌కు వెళ్లాయా తేలాలి. పవన్‌కు దమ్ముంటే నా మీద గ్లాస్ గుర్తును పోటీకి పెట్టాలి’’ అని ఎమ్మెల్యే ద్వారంపూడి సవాల్ విసిరారు. ‘‘లోకేష్, వ్యవస్ధలను మేనేజ్ చేసేది మీ నాన్న చంద్రబాబే. చీకట్లో చిదంబరంను కలిసింది.. కాళ్లు పట్టుకున్నది కూడా చంద్రబాబే. ఓటుకు కోట్లు ఇచ్చి అడ్డంగా దొరికిపోయింది చంద్రబాబే. వాట్ ఐయామ్ సేయింగ్, మనవాళ్లు బ్రీఫ్డ్ మీ అన్నది చంద్రబాబే. తెలంగాణలో కేసులు రాగానే కరకట్టకు పారిపోయింది చంద్రబాబే. ఇన్ని తప్పులు, ఇన్ని అక్రమాలు చేసి ఇప్పుడు ఎదురు ప్రశ్నిస్తున్నారా?’’ అంటూ ఎమ్మెల్యే చంద్రశేఖర్‌రెడ్డి దుయ్యబట్టారు. చదవండి: ఏపీ రాజకీయాల్లో అపరిచితుడు ఈయనే! -
పవన్ కళ్యాణ్ గురించి ఎవరికీ తెలియని విషయాలు బయటకు వచ్చాయి
-
ఆ విషయాలు కూడా త్వరలోనే బయటకొస్తాయి: ఎమ్మెల్యే ద్వారంపూడి
సాక్షి, కాకినాడ జిల్లా: పవన్ కళ్యాణ్ ఓ ప్యాకేజీ స్టార్ అంటూ వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్‌రెడ్డి ఎద్దేవా చేశారు. బుధవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ, నటుడిగా డబ్బు కోసం రాజకీయాల్లో నటిస్తున్నాడు. తిట్టాడానికి డబ్బు, జైలుకు వెళ్లి పరామర్శించానికి డబ్బు తీసుకుంటాడు. ఎక్కడికక్కడే ప్యాకేజ్...ప్యాకేజ్.. పవన్ కళ్యాణ్ ప్యాకేజీ విషయాలు కూడా కొన్ని రోజుల్లో బయటకు వస్తాయి’’ అని ఎమ్మెల్యే ద్వారంపూడి పేర్కొన్నారు. ‘‘హవాలా ద్వారా ఎంత డబ్బు ఈ దేశం దాటి వెళ్ళిది?. పవన్ ప్యాకేజీ సొమ్ములు రష్యా వెళ్లిందా? లేక సింగపూర్, దుబాయికీ వెళ్లాయా అనే విషయాలు బయటకు వస్తాయి. రాజకీయంగా పవన్‌ను ఒక జోకర్లా చూస్తున్నారు. కృష్టా జిల్లా వంగవీటి రంగా ప్రభావం ఉన్న జిల్లా. టీడీపీతో పొత్తు పెట్టుకున్న పవన్‌కు అక్కడ ప్రభావం ఎందుకు ఉంటుందన్న ఎమ్మెల్యే ద్వారంపూడి.. జనసేనకు టీడీపీ వాళ్లే శ్రతువులు.. టీడీపీకి జనసేన వాళ్లే శత్రువు. పైనా లీడర్ల కలవడం ఈజీనే.. కింద క్యాడర్ కలవదన్నారు. ప్రజల దగ్గర దోచుకున్న సొమ్ముతో లాయర్లకు ఖర్చు చేసి చంద్రబాబు జైలు నుంచి బయట పడాలనుకుంటున్నాడని ఎమ్మెల్యే చంద్రశేఖర్‌రెడ్డి విమర్శలు గుప్పించారు. చదవండి: ఏబీఎన్, టీవీ-5పై పొన్నవోలు తీవ్ర ఆగ్రహం -
ఐటీ ఉద్యోగుల ముసుగులో కులాభిమానులు..
-
చంద్రబాబుని నమ్ముకున్న వాళ్ళు నా దగ్గరకు వచ్చి.. ధర్నాలపై అసలు విషయాలు బయటపెట్టిన ఎమ్మెల్యే ద్వారంపూడి
-
పవన్ కల్యాణ్ పై ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి ఫైర్
-
చంద్రబాబుకు భగవంతుడు తగిన శిక్ష వేశారు: ద్వారంపూడి
-
చిరంజీవిపై ఎమ్మెల్యే ద్వారంపూడి ఆసక్తికర వ్యాఖ్యలు
సాక్షి, కాకినాడ: చిరంజీవిపై వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్‌రెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ, చిరంజీవి మళ్లీ రాజకీయాల్లోకి వస్తారని అనుకోవడం లేదన్నారు. ‘‘రాజకీయాలకు సరిపోననుకునే మళ్లీ సినీ ఇండస్ట్రీ వైపు అడుగులు వేశారు. సినిమాల ద్వారా చిరంజీవి ప్రజల్ని అలరించడం మంచి పరిణామం. సినిమాల్లోనే చిరంజీవికి సౌకర్యంగా ఉంది’’ అంటూ ఎమ్మెల్యే ద్వారంపూడి చురకలు అంటించారు. చదవండి: చిరంజీవి ఎందుకు ఉలిక్కిపడ్డారు? అదన్న మాట అసలు సంగతి! మరోవైపు చిరంజీవిపై ఎంపీ విజయసాయిరెడ్డి కూడా కీలక వ్యాఖ్యలు చేశారు. చిరంజీవి వ్యాఖ్యలకు కౌంటరిచ్చారు. సినిమా స్టార్స్ అయినా పొలిటిషియన్స్ అయినా ప్రజలు ఆదరిస్తేనే వారికి మనుగడ అని చెప్పుకొచ్చారు. సినీ పరిశ్రమలోని పేదలు, కార్మికుల సంక్షేమం బాధ్యత కూడా ప్రభుత్వానిదే అంటూ ట్విట్టర్ వేదికగా స్పష్టం చేశారు. చదవండి: చిరంజీవి ఎందుకు ఉలిక్కిపడ్డారు? అదన్న మాట అసలు సంగతి! -
గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్
-
వాలంటీర్ల గురించి ఏసీ రూమ్స్‌లో కూర్చునే మీకేం తెలుసు: ద్వారంపూడి
సాక్షి, కాకినాడ: ఏపీకి అమావాస్య, పున్నానికి వచ్చి మైకులు పట్టుకున్న వారికి వాలంటర్లీ గురించి ఏమాత్రం తెలుస్తుంది అంటూ పవన్‌కు చురకలు అంటించారు ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి. ఏసీ రూమ్స్‌లో కూర్చున్న చంద్రబాబు, పవన్‌కు వాలంటీర్ల గురించి ఏం తెలుసు అంటూ తీవ్ర విమర్శలు చేశారు. కాగా, కాకినాడలో వాలంటీర్ల ఆత్మగౌరవ సభకు ఎమ్మెల్యే ద్వారంపూడి సంఘీభావం తెలిపారు. ఈ సందర్బంగా ద్వారంపూడి మీడియాతో మాట్లాడుతూ.. మేము ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి రాజకీయ సైనికులం.. వాలంటీర్లు ప్రభుత్వ సైనికులు. గడపగడపకు వెళ్లినప్పుడు లబ్ధిదారులు వాలంటీర్ల పేర్లు చెబుతున్నారు. అమావాస్య, పున్నమికి వచ్చి మైకులు పట్టుకున్న వాళ్లకి వాలంటీర్ల గురించి ఏమాత్రం తెలుస్తుంది. సీఎం జగన్ సైన్యం మీకు గుర్తింపు ఉండేలా రాబోయే రోజుల్లో నిర్ణయం తీసుకుంటారు. వాలంటీర్ల సేవేంటో మాకు తెలుసు. ఏసీ రూమ్స్‌లో కూర్చున్న చంద్రబాబు, పవన్‌కు ఏం తెలుసు. వారాహి ఎక్కి ప్రజలకు ఏం చేస్తాడో పవన్ చెప్పడం లేదు. వాలంటీర్ల వల్లే ప్రజలకు ఇంటివద్దకే సంక్షేమ పథకాలు అందుతున్నాయని ప్రతిపక్ష నేతలకు కక్షగా ఉంది. వాలంటీర్ల మనోభావాలు కాపాడే బాధ్యత సీఎం జగన్ తీసుకుంటారు. ఎవరెన్ని మాట్లాడినా వాలంటీర్లు బాధపడవద్దు.. రాబోయే రోజులు మీవే. వాలంటీర్లు లేకపోతే ఇబ్బందిపడే పరిస్థితి ఉంది అని కామెంట్స్ చేశారు. ఇది కూడా చదవండి: మన పిల్లలు క్రియేటర్లు, లీడర్లుగా మారాలి: సీఎం జగన్ -
ఈనాడుపై ద్వారంపూడి ఫైర్
-
అతడొక ‘దుష్ట గురువు’
సాక్షి ప్రతినిధి, కాకినాడ: రాజకీయాల నుంచి చంద్రబాబు, ఈ భూమ్మీద నుంచి రామోజీరావు నిష్క్రమించినప్పుడే రాష్ట్రంలో కుల రాజకీయాలకు విముక్తి లభిస్తుందని కాకినాడ సిటీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖరరెడ్డి వ్యాఖ్యానించారు. ‘రామోజీకి ధైర్యం ఉంటే, ఆరోపణలకు ఆధారాలుంటే నా పేరు పెట్టి వార్త ప్రచురించాలి. భయం భయంగా ఊరు, పేరు లేకుండా దొంగరాతలు రాయడం కాదు. ఈనాడు టీమ్ లేదా మీ కుల టీమ్‌ను పంపించి నాపై ఆరోపణలను నిరూపిస్తే రాజకీయ సన్యాసం తీసుకోవడానికి సిద్ధంగా ఉన్నా’ అని ద్వారంపూడి సవాల్ చేశారు. రామోజీ తప్పుడు రాతలను ప్రజాక్షేత్రంలో ఉన్నందున ఖండించాల్సి వస్తోందన్నారు. తమ సామాజిక వర్గం మాత్రమే రాజకీయాలను శాసించాలనే కులపిచ్చితో రామోజీ, చంద్రబాబు వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. ‘అతడొక అరాచకం’ శీర్షికన గురువారం ఈనాడు ప్రచురించిన కథనంపై ఎమ్మెల్యే ద్వారంపూడి కాకినాడలో మీడియాతో మాట్లాడారు. వాస్తవాలు చెబుతున్నందువల్లే ఉక్రోషంతో రామోజీ తనపై అభూత కల్పనలతో కథనాలను ప్రచురించారని ధ్వజమెత్తారు. రామోజీకి నిజాయితీ, నిబద్ధత ఉంటే మార్గదర్శి చిట్‌ఫండ్స్ కుంభకోణంలో సీఐడీ విచారణకు హాజరు కాకుండా ఎందుకు ముఖం చాటేస్తున్నారని సూటిగా ప్రశ్నించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే ద్వారంపూడి ఏమన్నారంటే.. ♦ ఇటీవల రెడ్డి సామాజిక వర్గానికి చెందిన మాచర్ల ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని లక్ష్యంగా చేసుకున్నారు. ఇప్పుడు నాపై నిరాధార ఆరోపణలతో తప్పుడు కథనాలను వెలువరిస్తున్నారు. కులమతాలకు అతీతంగా పదిమందికి సాయపడే గుణం కలిగిన రెడ్డి సామాజికవర్గాన్ని అన్ని వర్గాలు ఆదరిస్తుండటంతో తెలుగురాష్ట్రాల్లో పలుచోట్ల ప్రజాప్రతినిధులుగా గెలుపొందుతున్నారు. ♦ ఎప్పుడూ మీ సామాజిక వర్గమే అధికారంలో ఉండాలా రామోజీ? ఎన్టీఆర్ మరణానంతరం చంద్రబాబుతో కలసి దుష్ట గురువులా రాజకీయాల్లో కులచిచ్చు రేపారు. మార్గదర్శి కుంభకోణాన్ని వెలికి తీయడంతో రామోజీ పతనం మొదలైంది. ఆయన అక్రమ సామ్రాజ్యం పేకమేడలా కూలిపోవడం ఖాయం. రామోజీకి వయసు అయిపోయింది. ఇప్పటితరం నీ ఆటలను సాగనివ్వదు. ♦ టీడీపీ పాలనలో గ్రావెల్ అక్రమ తవ్వకాలు ప్రారంభించి కోట్లు దిగమింగారు. 30 వేల మంది పేదల సొంతింటి కలను సాకారం చేసేందుకే నేను గ్రావెల్ తవ్వించా. అన్ని అనుమతులు తీసుకుని ప్రభుత్వానికి పన్నులు చెల్లించి 650 ఎకరాలను మెరక చేయించా. కోవిడ్ సమయంలో దగ్గరుండి పనులు చేయించా. పేదల ఇళ్ల స్థలాల కోసం దుమ్ములపేట, పర్లోపేట ప్రాంతాల్లో భూములను నా సొంత నిధులతో మెరక చేయిస్తే కబ్జా చేస్తున్నట్లు రామోజీ చిత్రీకరించారు. ♦ మా తాతల కాలం నుంచి 50 ఏళ్లుగా బియ్యం వ్యాపారంలో ఉన్నాం. రామోజీ సామాజిక వర్గానికి చెందిన సైరస్ కంపెనీ ప్రతినిధి వేల్పూరి శ్రీనివాస్ కూడా ఇదే వ్యాపారంలో ఉన్నారు. ♦ కోవిడ్ సమయంలో అధిక చార్జీలు వసూలు చేసిన ప్రైవేట్ ఆస్పత్రులపై జరిమానా విధించేలా నేను కృషి చేస్తే కమీషన్లు వసూలు చేశానంటూ రామోజీ తప్పుడు కథనం ప్రచురించారు. నా విజ్ఞప్తి మేరకు ఒక స్నేహితుడు ఉచితంగా మంచాలు అందచేశారు. రోగుల అవసరాలను తీర్చగా నిరుపయోగంగా ఉన్న మంచాలను సింహాచలం పాదయాత్రలో నా వెంట ఉన్నవారి కోసం వినియోగించడంలో తప్పు ఎక్కడుంది? ♦ కాకినాడలో గంజాయి జాడ లేకుండా ప్రభుత్వం ఉక్కుపాదం మోపుతుంటే నాకు అక్రమ రవాణా అంటగడతారా? ‘ఈనాడు’ ప్రతులు దగ్థం... ఎమ్మెల్యే ద్వారంపూడిపై తప్పుడు కథనాన్ని నిరసిస్తూ కాకినాడ రెవెన్యూ కాలనీ డంపింగ్ యార్డు వద్ద ‘ఈనాడు’ ప్రతులను దగ్ధం చేశారు. రామోజీ డౌన్‌డౌన్ అంటూ నినాదాలు చేశారు. రామోజీ దిష్టిబొమ్మను దగ్ధం చేశారు. కౌడా చైర్పర్సన్ రాగిరెడ్డి చంద్రకళాదీప్తి, సిటీ అ«ధ్యక్షురాలు శివప్రసన్న, మార్కెట్ కమిటీ చైర్పర్సన్ పసుపులేటి వెంకటలక్ష్మి, ఎమ్మెల్సీ అభ్యర్థి కర్రి పద్మశ్రీ తదితరుల ఆధ్వర్యంలో కాకినాడ నుంచి భారీ ర్యాలీగా తరలివచ్చారు. -
‘రామోజీ కులంవారు తప్ప వేరే వాళ్లు అధికారంలోకి రాకూడదా?’
సాక్షి, కాకినాడ: ఈనాడు రామోజీరావుపై ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్‌రెడ్డి మండిపడ్డారు. రామోజీరావు కుల కుట్రలు చేస్తున్నారని, రామోజీ కులంవారు తప్ప వేరే వాళ్లు అధికారంలోకి రాకూడదా? అని ప్రశ్నించారు. కాగా, ద్వారంపూడి గురువారం మీడియాతో మాట్లాడుతూ.. ఈనాడులో అవాస్తవ ప్రచారం చేస్తున్నారు. నేను ఎలాంటి అక్రమాలు చేయలేదు. కావాలంటే విచారణ చేయించుకోవచ్చు. ఇష్టం వచ్చినట్టు వార్తలు రాయడం సరికాదు. నాపై ఆరోపణలు నిజం చేస్తే రాజకీయాల నుంచి తప్పుకుంటాను. గతంలో పిన్నెల్లి మీద కూడా అసత్య కథనాలు రాశాడు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఇమేజ్ను దెబ్బ తీయాలనే ఇలాంటి వార్తలు రాస్తున్నారు. రాబోయే ఎన్నికల్లో చంద్రబాబు గెలవకూడదూ.. రామోజీ పోవాలి. రాష్ట్రానికి పట్టిన చీడపురులు చంద్రబాబు, రామోజీ. వీళ్ళ వల్లే రాష్ట్రంలో కులాల ఘర్షణలు జరిగాయి. అబద్దాన్ని నిజం చేసే దిట్ట రామోజీరావు. కాకినాడలో వాస్తవ పరిస్ధితులు ఏమిటో తెలుసుకో. కోవిడ్ సమయంలో అనేక మంది జర్నలిస్టులకు నేను ఫీజులు చెల్లించాను. కోవిడ్ నిబంధనలు ఉల్లంగించిన అధిక ఫీజులు వసూలు చేసిన ప్రైవేటు ఆసుపత్రులకు పెనాల్టీ వేయించాను అని కామెంట్స్ చేశారు. ఇది కూడా చదవండి: గట్టి సంకల్పంతో ఇళ్ల నిర్మాణం పూర్తిచేయాలి: సీఎం జగన్ -
కాకినాడకు చెడ్డ పేరు తెవాలని బాబు, పవన్ తో కుట్ర పన్నాడు: ద్వారంపూడి
-
పవన్ ది వారాహి యాత్ర కాదు..నారాహి యాత్ర
-
‘పవన్ కల్యాణ్ తోకముడిచి వెళ్లిపోయాడు’
సాక్షి, కాకినాడ: చంద్రబాబు నాయుడు, లోకేష్ ఆదేశాలతోనే పవన్ కల్యాణ్ మాట్లాడుతున్నారని ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్‌రెడ్డి మండిపడ్డారు. పవన్ చేస్తున్నది వారాహి యాత్ర కాదని, నారాహి యాత్ర అని ఎద్దేవా చేశారు ఎమ్మెల్యే ద్వారంపూడి. నారాహి వాహనం ఎక్కి పవన్ ద్వారంపూడి జపం చేస్తున్నాడని, తనపై నిందలు వేయడం పవన్‌కు టీడీపీకి అలవాటేనని చంద్రశేఖర్‌రెడ్డి విమర్శించారు. సీఎం జగన్ పాలనలో అన్ని వర్గాలు సంతోషంగా ఉంటే పవన్ మాత్రం చంద్రబాబు, లోకేష్ రాసిన స్క్రిప్ట్‌ను చదువుతున్నాడన్నారు. ‘సీఎం జగన్ పాలనలో అన్ని వర్గాలు సంతోషంగా ఉన్నారు. పవన్ ది వారాహి యాత్ర కాదు.. నారాహి యాత్ర. నా మీద నిందలు వేయడం పవన్, టీడీపీకి అలవాటే. కాకినాడకు చెడ్డపేరు తీసుకొచ్చే ప్రయత్నం చేయొద్దు. బెస్ట్ లివింగ్ సిటీల్లో నాలుగో స్థానంలో కాకినాడ ఉంది. కాకినాడకు ఉన్న మంచి పేరును పవన్ చెడగొట్టొద్దు. నారాహిపై పవన్ నిత్యం ద్వారంపూడి జపం చేస్తున్నాడు. చంద్రబాబు స్క్రిప్ట్ నే పవన్ చదువుతున్నాడు. కాకినాడలో పోటీపై సవాల్ చేస్తే పవన్ తోకముడిచి వెళ్లిపోయాడు. పవన్.. వ్యక్తిగతంగా ఏమైనా ఉంటే ఫేస్ టు ఫేస్ తేల్చుకుందాం. కాకినాడ పరువు ప్రతిష్టలను దెబ్బతీస్తే ఊరుకునేది లేదు’అని ఎమ్మెల్యే చంద్రశేఖర్‌రెడ్డి హెచ్చరించారు. -
వంగవీటి వీరాభిమాని ద్వారంపూడి.. రంగా బావమరిది కీలక వ్యాఖ్యలు
సాక్షి, ప్రత్యేక ప్రతినిధి: ‘కాకినాడ శాసనసభ్యుడు ద్వారంపూడి చంద్రశేఖరరెడ్డి రాజకీయ ప్రస్థానం దివంగత వంగవీటి మోహన్ రంగారావుతోనే మొదలైంది. ఆయన అభిమానం అప్పటి నుంచి ఇప్పటికీ ఏమాత్రం చెక్కుచెదరలేదు. చంద్రశేఖరరెడ్డి కాపు వ్యతిరేకి అనడం పచ్చి అబద్ధం. తప్పుడు ఆరోపణలు చేయడం ఏమాత్రం సరికాదు.’ అని వంగవీటి రంగా బావమరిది చెన్నుపాటి శ్రీనివాస్ స్పష్టంచేశారు. వారాహి యాత్రలో భాగంగా కాకినాడ బహిరంగ సభలో ద్వారంపూడిపై జనసేన అధినేత పవన్‌కళ్యాణ్ తీవ్ర ఆరోపణలు చేసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో చెన్నుపాటి శ్రీనివాస్ స్వచ్ఛందంగా స్పందించారు. ఆయన మంగళవారం ‘సాక్షి’తో మాట్లాడారు. ఆ వివరాలు ఆయన మాటల్లోనే.. కాకినాడలో రంగా తొలి సభ పెట్టింది ద్వారంపూడి నాకు 1985, 86ల నుంచే ద్వారంపూడి చంద్రశేఖరరెడ్డితో పరిచయం ఉంది. అప్పటికే వాళ్ల ఫ్యామిలీ చాలా రిచ్. రైస్ మిల్లులు, సినిమా థియేటర్స్ ఇవన్నీ ఉండేవి. అప్పటికే రంగాకు ఆయన స్ట్రాంగ్ ఫాలోయర్. రంగా అభిమానిగా తిరిగిన ద్వారంపూడి ఆయన ద్వారానే రాజకీయ ప్రస్థానం ప్రారంభించారు. 1988లో ఎవరూ ధైర్యం చేయని రోజున కాకినాడ ప్రాంతంలో భారీ స్థాయిలో ర్యాలీ పెట్టి వంగవీటిని తీసుకెళ్లి అతిపెద్ద బహిరంగ సభ నిర్వహించారు. బహుశా అప్పటి నుంచి ఇప్పటివరకు అంతపెద్ద బహిరంగ సభ ఎప్పుడూ జరిగి ఉండదు. అంతటి వీరాభిమాని చంద్రశేఖరరెడ్ది. వంగవీటి తదనంతరం వైఎస్ రాజశేఖరరెడ్డిని ఫాలో కావడం, రాజకీయంగా ఎదగడం జరిగింది. మూడున్నర దశాబ్దాలుగా పరిచయమున్న చంద్రశేఖరరెడ్డి గురించి, వాళ్ల కుటుంబం గురించి పూర్తిగా తెలుసు. ఆయనపై ఆరోపణలన్నీ రాజకీయపరమైనవి, పొంతనలేనివిగానే కనిపిస్తున్నాయి. వాటిలో ఏమాత్రం వాస్తవం లేదు. ఏదైనా తెలుసుకుని మాట్లాడితే మంచిదని నా అభిప్రాయం. ఎవరో చెబితే విని ఆరోపణలు చేయడం కరెక్ట్ కాదు. రాజకీయంగా పూర్తిగా దూరంగా ఉన్నాను కాబట్టి నేను రాజకీయంగా వాటి గురించి కామెంట్ చేయలేను. కానీ, చంద్రశేఖరరెడ్డి విషయం గురించి వస్తే మాత్రం నాకు ఆయన విషయాలు పూర్తిగా తెలుసు. కాబట్టి ఆ ఆరోపణలను తీవ్రంగా వ్యతిరేకిస్తున్నా. రంగా అభిమానిగా మొదలైన ద్వారంపూడి రాజకీయ ప్రస్థానంలో కాపు వ్యతిరేకి అనేది పూర్తిగా అవాస్తవం. అలాంటి ఉద్దేశాలు ఉన్న రాజకీయ నాయకుడు కూడా కాదు. వెరీ ఫెయిర్ పొలిటీషియన్ 1985 నుంచి ఈ రోజు వరకు వంగవీటి అభిమానిగానే కొనసాగుతున్నాడు. మా బావగారు చనిపోయి ఇప్పటికి 33 సంవత్సరాలు అవుతున్నా... ఇంకా మా ఫ్యామిలీతో సన్నిహితంగా ఉన్నాడు. ఇది కూడా చదవండి: గడప గడపకు.., జగనన్న సురక్షపై సీఎం జగన్ సమీక్ష -
పవన్ కళ్యాణ్ కి ఆ స్థాయి లేదు దమ్ముంటే ద్వారంపూడి మీద పోటీ చెయ్
-
పవన్ సీఎం కావాలంటే సినిమాల్లో మాత్రమే సాధ్యమవుతుంది
-
పవన్ నమ్ముకున్న వాళ్లను నట్టేట ముంచారు
-
నీకన్నా గట్టిగానే విమర్శించగలను.. పవన్‌పై ద్వారంపూడి ఫైర్
సాక్షి, కాకినాడ: వారాహి యాత్రలో జనసేన చీఫ్ పవన్ కల్యాణ్ తనపై చేసిన తీవ్ర విమర్శలకు కాకినాడ అర్బన్ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి అంతే ఘాటుగా స్పందించారు. సోమవారం మీడియా ముందుకు వచ్చిన ఆయన.. పవన్ ఓ రాజకీయ వ్యభిచారి అని ఏకిపాడేశారు. పార్టీ పెట్టినవాళ్లు ఎవరైనా ఇప్పుడు నీతో ఉన్నారా? అని పవన్‌ను నిలదీశారాయన. పవన్ నాపై చేసిన అసత్య ఆరోపణలు నిరూపించాలి. నేను రెండు సార్లు ఎమ్మెల్యేగా గెలిచా. మేం రౌడీలమైతే మమ్మల్ని జనం ఎందుకు గెలిపిస్తారు?. నువ్వు రెండు చోట్ల ఓడిపోయావ్. నన్ను విమర్శించే స్థాయి నీకు లేదు. నన్ను ఓడించడం నీ వల్ల కాదు అని మండిపడ్డారాయన. జనసేనను ఎవరిని ఉద్దరించేందుకు పెట్టావ్ అంటూ పవన్‌ను నిలదీశారాయన. పవన్ ఓ రాజకీయ వ్యభిచారి అని, చంద్రబాబుతో బేరం కుదరకే రోడ్డుపైకి వచ్చాడని తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారాయన. రాజకీయాల్లో సీఎం కావడం పవన్‌కు సాధ్యం కాదని తేల్చేసిన ద్వారంపూడి.. కావాలనుకుంటే అది సినిమాల్లోనే సాధ్యమవుతుందని ఎద్దేవా చేశారు. పవన్.. నోరు అదుపులో పెట్టుకో ప్యాకేజీలు, సీట్ల ఒప్పందం కుదరకుంటే పవన్ రోడ్డు మీదకు వస్తాడు. ఎవడో చెప్పిన మాటలు విని కోతి గంతులేయకు. తల్చుకుంటే కాకినాడలో పవన్ బ్యానర్లే ఉండేవి కావు. ఇష్టమొచ్చినట్లు మాట్లాడితే ఊరుకోం. 👊 పవన్ రాజకీయపరంగా జీరో. ఎమ్మెల్యే కావాలన్నా.. సీఎం కావాలన్నా అది సినిమాల్లోనే పవన్‌కు సాధ్యమయ్యేది. చంద్రబాబును ఉద్దరించడానికే పార్టీని నడిపిస్తున్నాడు. ప్యాకేజీ కుదరకే వారాహి ఎక్కి తిరుగుతున్నాడు. కాకినాడలో అన్ని సామాజిక వర్గాలు కలిసి నన్ను ఎమ్మెల్యేగా గెలిపించాయి. 👊 చంద్రబాబు, పవన్ కల్యాణ్‌లు కులాల మధ్య చిచ్చుపెడుతున్నారు. వచ్చే ఎన్నికల్లో చంద్రబాబును, పవన్‌ను తరిమేస్తే అసలు కులాల గొడవే ఉండదు. కులాల గురించి మాట్లాడను అంటూనే కులాల మధ్య పవన్ చిచ్చు పెట్టేలా ప్రసంగిస్తున్నాడు. 2024 ఎన్నికలే చంద్రబాబుకు చివరి ఎన్నికలు కానున్నాయి. 👊 నీ కన్నా పెద్ద నాలిక నాది.. నీకన్నా గట్టిగానే విమర్శించగలను. నువ్వు మాటల్లో చూపిస్తే.. నేను చేతల్లో చూపించగలను. కబ్జా కోరును, రౌడీని అయితే జనం నన్ను గెలిపిస్తారా?. నేను సీఎం కాలేనని మూడు నెలల కిందట ఓసారి అన్నావ్. ఇప్పుడే సీఎం చేయండని అడుగుతున్నావ్. నాది డీ బ్యాచ్ అయితే నీది ఏ బ్యాచ్?. నా దగ్గర 15వేల కోట్లు ఉంటే ముందు నిన్నే కొనేస్తా. 👊 కాకినాడ పోర్టులో తక్కువ ఛార్జీలు ఉండడం వల్లే బియ్యం ఎగుమతులు. వాస్తవాలు తెలుసుకుని విమర్శలు చేయాలని పవన్‌కు ద్వారంపూడి హితవు పలికారు. 👊 పార్టీ పెట్టినవాళ్లు ఎవరైనా ఇప్పుడు నీతో ఉన్నారా?. నన్ను నమ్మి వచ్చినవాళ్లు ఇప్పుడు నా వెంటే ఉన్నారు అని ద్వారంపూడి తెలిపారు. రంగాను చంపిన వ్యక్తితో దోస్తీనా? 👊 వంగవీటి రంగా నాకు ఆదర్శం. రంగాను చంపిన చంద్రబాబు కోసం పవన్ పని చేస్తున్నాడు. రెడ్డి సామాజిక వర్గానికి వ్యతిరేకంగానే చంద్రబాబుతో పవన్ చేతులు కలిపాడు. చంద్రబాబు హామీ ఇవ్వకపోతే నీ పార్టీ నేతలకు ఎక్కడ టికెట ఇస్తావో చెప్పలేని స్థితి నీది అని పవన్‌కు చురకలు అంటించారు ద్వారంపూడి. పవన్‌కు ద్వారంపూడి సవాల్ ఈరోజు నుంచి నీ పతనం ప్రారంభమైంది అని పవన్‌పై తీవ్రస్థాయిలో ద్వారంపూడి ధ్వజమెత్తారు. నన్ను ఓడిస్తానని పవన్ విసిరిన చాలెంజ్‌ను స్వీకరిస్తానని ద్వారంపూడి తెలిపారు. ‘‘నువ్వు జనసేన అధినేతవే అయితే.. నాపై పోటీ చేయు. నిన్ను తుక్కుతుక్కుగా ఓడించకపోతే నా పేరు చంద్రశేఖరే కాదు. నేను ఓడిపోతే రాజకీయాల నుంచి తప్పుకుంటా. నువ్వు ఓడిపోయానా అదే పని చేయాలి అని పవన్‌కు ప్రతిసవాల్ విసిరారు ఎమ్మెల్యే ద్వారంపూడి. -
పవన్‌కు నాయకత్వ లక్షణాల్లేవ్!: ద్వారంపూడి
సాక్షి, కాకినాడ: రాజకీయాల్లో ఓడిపోతామని తెలిసి కూడా పోరాడేవాడే నిజమైన నాయకుడని, జనసేన చీఫ్ పవన్ కల్యాణ్‌లో అలాంటి లక్షణాలు మచ్చుకు కూడా లేవన్నారు కాకినాడ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి. నాయకత్వ లక్షణం అంటే వైఎస్ జగన్‌దేనని స్పష్టం చేశారు. బుధవారం కాకినాడలో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. రాజకీయాల్లో ఉన్నప్పుడు ఓడిపోతామని తెలిసినా నాయకుడు యుద్దం నుండి తప్పుకోకూడదు. యుద్దం నుండి ఎప్పుడైతే తప్పుకున్నామో మన వెనుక ఉన్న సైనికులు భయపడతారు. ‘‘ఓడిపోతాం.. ముఖ్యమంత్రి అవ్వం’’ అంటే అది యుద్దమా?. నాయకుడి లక్షణమా?. నాయకత్వం అంటే వైఎస్ జగన్‌దే. ఏనాడూ ఆయన కార్యకర్తలకు అధైర్యాన్ని పంచలేదు. ఆయన కష్టకాలంలో ఉన్నా కూడా మాకు ధైర్యం పంచాడు. సిసలైన నాయకత్వ లక్షణం అంటే ఇదే. రాజకీయాల్లో పవన్ కళ్యాణ్ కన్నా నేను సీనియర్ని. కాకినాడ నుండి పవన్ కల్యాణే కాదు..లోకేష్ పోటి చేసినా ప్రజలు ఘోరంగా ఓడిస్తారు. పవన్, లోకేష్ .. ఎవరు పోటీకి ముందుకు వచ్చినా .. నేను రెడీ అంటూ పేర్కొన్నారాయన. ఇదీ చదవండి: ఫన్నీ ఫన్నీగా లోకేష్ పాదయాత్ర -
కాకినాడ: చంద్రబాబుకు ఎమ్మెల్యే ద్వారంపూడి సవాల్
-
కోడి పందేలను తిలకించిన రాంగోపాల్ వర్మ
-
‘ఓడిపోతే రాజకీయాలు వదిలేస్తాననే మాటపై బాబు నిలబడాలి’
కాకినాడ: 2024 ఎన్నికల్లో ఓడిపోతే రాజకీయాలు వదిలేస్తానని చంద్రబాబు నాయుడు ఇచ్చిన మాటపై నిలబడాలని ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్‌రెడ్డి చాలెంజ్ చేశారు. ఓడిపోతే రాజకీయాలు వదిలేస్తానని అన్నావు కదా.. ఆ మాటపైనే నిలబడాలని సవాల్ విసురుతున్నానన్నారు ద్వారంపూడి. ‘ 2019 ఎన్నికల్లో బైబై బాబు నినాదంతో ప్రజల ముందుకు వెళ్లాం.. 2024 ఎన్నికల్లో గుడ్ బై బాబు నినాదంతో వెళ్తాం’ అని ద్వారంపూడి స్పష్టం చేశారు. -
టీడీపీ నేత కొండబాబు కు ఎమ్మెల్యే ద్వారంపూడి సవాల్
-
గుడ్డి రాతల ఈనాడు.. పీక్స్‌కు చేరిన బరి‘తెగింపు’
సాక్షి ప్రతినిధి, కాకినాడ: తెలుగుదేశం పార్టీ తాన అంటే ఈనాడు తందాన అంటుంది. ఉన్నది లేనట్టు, లేనిది ఉన్నట్టు చూపించాలని ప్రయత్నించే చంద్రబాబు అండ్ కో ప్రయత్నాలను గుడ్డిగా అచ్చేస్తుంది. నిజానిజాల పట్టింపు లేదు. రాష్ట్ర ప్రభుత్వం, ముఖ్యమంత్రి పైనా తప్పుడు కథనాలను వండివార్చి ప్రజలను పక్కదారి పట్టించేందుకు ఎంతకైనా బరితెగిస్తుంది. తెలుగుదేశం పార్టీ ప్రభుత్వ హయాంలో జరిగిన అక్రమాలను వైఎస్సార్సీపీ ప్రభుత్వానికి ఆపాదించే ప్రయత్నం చేస్తోంది. పదుగురూ నవ్వుకుంటారన్న సోయే ఉండదు. ఇందుకు నిదర్శనమే ఈ ‘చిత్రం’. అచ్చేసిందిదీ.. ‘కొండలను కొల్లగొడుతున్నారు’ శీర్షికతో గురువారం ఈనాడు ప్రధాన సంచికలో అభూతకల్పనలతో కూడిన ఈ ‘వార్తా చిత్రం’ ప్రచురించింది. ఇందులోని ఫొటో బుధవారం మంగళగిరిలోని తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన ఫొటో ఎగ్జిబిషన్‌లోనిది. మైనింగ్‌లో కొండను తవ్వేయగా మిగిలిన పై భాగంలో ఉన్న చేతి పంపుతో కూడిన చిత్రం. కాకినాడ వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే చంద్రశేఖరరెడ్డి అక్రమ మైనింగ్‌కు నిలువెత్తు నిదర్శనమంటూ టీడీపీ ఈ ఫొటోను ప్రదర్శించింది. దానినే ఈనాడు యథాతథంగా అచ్చేసింది. వైఎస్సార్సీపీ కాకినాడ సిటీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖరరెడ్డి పెద్దాపురంలో కొండలను తవ్వేసి గ్రావెల్‌తో కోట్లు కొల్లగొడుతున్నారంటూ బురదజల్లే ప్రయత్నం చేసింది. వాస్తవం ఇదీ.. వాస్తవానికి 2018లో చంద్రబాబు ప్రభుత్వ హయాంలోనే పెద్దాపురంలోని కొండలను తవ్వేసి కోట్లు కొల్లగొట్టారు. బాబుకు అత్యంత సన్నిహితుడైన నాటి హోంమంత్రి చినరాజప్ప ప్రాతినిధ్యం వహిస్తున్న పెద్దాపురం నియోజకవర్గంలో కొండలను అడ్డగోలుగా తవ్వేశారు. చినరాజప్ప కనుసన్నల్లో కోనసీమకు చెందిన ఆయన అనుచరులు ఈ అక్రమ దందాకు పాల్పడి నాడు కొండలను తవ్వేశారు. అందులో రామేశ్వరంమెట్ట చిత్రమిది. ఇది 2018లోనే సోషల్ మీడియాలో విస్తృతంగా ప్రచారంలోకొచ్చింది. నాటి చంద్రబాబు ప్రభుత్వ హయాంలో కోట్లు కొల్లగొట్టేసిన వైనాన్ని తెలిపింది. దానిని ఇప్పుడు వైఎస్సార్సీపీ ప్రభుత్వానికి, కాకినాడ సిటీ ఎమ్మెల్యే చంద్రశేఖరరెడ్డికి ఆపాదించే యత్నానికి ఒడిగట్టారు. ఈనాడు గుడ్డిగా అచ్చేసింది. -
‘త్వరలో జన సైనికులు బాధపడే రోజు వస్తుంది’
సాక్షి, కాకినాడ(తూర్పుగోదావరి): పవన్‌కల్యాణ్ వాస్తవాలు తెలుసుకుని మాట్లాడాలని వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్‌రెడ్డి మండిపడ్డారు. శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ, జనసేన కార్యకర్తలకు పవన్.. అన్యాయం చేస్తున్నారన్నారు. జనసేన పార్టీని ప్యాకేజీ కోసం మళ్లీ తాకట్టు పెడుతున్నాడని.. త్వరలో జన సైనికులు బాధపడే రోజు వస్తుందన్నారు. ప్యాకేజీలకు అమ్ముడుపోయి నేతలు, కార్యకర్తలకు అన్యాయం చేయొద్దని ద్వారంపూడి హితవు పలికారు. ఎన్టీఆర్కే వెన్నుపొటు పొడిచిన చంద్రబాబు.. పవన్‌ను వెన్నుపోటు పొడవడం ఓ లెక్కా.. జిల్లాలో పవన్ కల్యాణ్ ఎక్కడ నుంచి పోటీ చేసిన ఓడిస్తానని ద్వారంపూడి చంద్రశేఖర్‌రెడ్డి సవాల్ విసిరారు. చదవండి: ‘అది నిజమేనని తేలిపోయింది’ -
లోకేశ్ ఒక డ్యాష్: ద్వారంపూడి చంద్రశేఖర్‌రెడ్డి
-
పొట్టి శ్రీరాములు విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించిన నాయకులు
-
పట్టాభికి చంద్రబాబు నుంచి ప్రాణహాని
కాకినాడ(తూర్పుగోదావరి): మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడి నుంచి ఆ పార్టీ నేత పట్టాభికి ప్రాణహాని పొంచి ఉందని కాకినాడ సిటీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖరరెడ్డి అన్నారు. రాజకీయ లబ్ధి కోసం పట్టాభి ప్రాణాలు తీసి, ఆ నేరాన్ని వైఎస్సార్ సీపీపై నెట్టి ప్రజల్లో సానుభూతి పొందాలనే కుట్రపూరిత తత్వం చంద్రబాబుదని ఆరోపించారు. ఈ విషయంలో పట్టాభి కుటుంబ సభ్యులు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. (చదవండి: రైతుల ఖాతాల్లో రూ.2,190 కోట్లు జమ చేసిన సీఎం జగన్) స్థానిక డి కన్వెన్షన్‌లో ద్వారంపూడి సోమవారం విలేకర్ల సమావేశంలో మాట్లాడారు. ప్రజల విశ్వాసం కోల్పోయిన చంద్రబాబు పార్టీ మనుగడ కోసం ఎంతకైనా దిగజారుతారని వ్యాఖ్యానించారు. ఆయన కేంద్ర హోం మంత్రి అమిత్‌షా అపాయిట్మెంట్ కోరడంపై స్పందిస్తూ.. ఒకప్పుడు అమిత్‌షా కాన్వాయ్‌పై రాళ్ల దాడి చేయించిన చంద్ర బాబు ఈవేళ ఆయన అపాయింట్మెంట్ కోరడానికి సిగ్గుండాలని అన్నారు. చదవండి: ఆంధ్రప్రదేశ్‌పై ‘ఈనాడు’ డ్రగ్స్ విషం -
కొండబాబు కాకినాడను భ్రష్టు పట్టించాడు: ద్వారంపూడి
సాక్షి, తూర్పుగోదావరి: భూ కబ్జాలు, పేకాట క్లబ్‌లు, గంజాయి వ్యాపారాలతో టీడీపీ మాజీ ఎమ్మెల్యే కొండబాబు, ఆయన కుటుంబ సభ్యులు కాకినాడ నగరాన్ని భ్రష్టు పట్టించారని వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి ఆరోపించారు. కొండబాబు చేసిన అవినీతి గురించి గత ఎన్నికల్లో చెప్పడం వల్లే ప్రజలు తనను ఎమ్మెల్యేగా గెలిపించారన్నారు. జగన్నాధపురం మూడవ వంతెన పేరుతో రూ.17 కోట్లు కొండబాబు కాజేయాలని చూస్తే తాను అడ్డుకున్నానని చంద్రశేఖర్ రెడ్డి గుర్తు చేశారు. గత ప్రభుత్వంలో కొండబాబు టీడీపీ కార్పోరేటర్లను పట్టించుకోలేదని.. అందుకే గత సాధారణ ఎన్నికల్లో వారంతా తనకు మద్దతు పలికారని చంద్రశేఖర్ రెడ్డి తెలిపారు. -
ప్రజల కోసం పరితపించే సీఎం వద్ద పని చేయడం సంతోషంగా ఉంది :ద్వారంపూడి
-
ఎమ్మెల్యే పేరుతో నకిలీ ఫేస్బుక్.. డబ్బులు పంపాలంటూ
సాక్షి, కాకినాడ : కాకినాడ సిటీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖరరెడ్డి పేరుతో ఓ నకిలీ ఫేస్బుక్ అకౌంట్ ఓపెన్ అయింది. ఎమ్మెల్యే పేరు, ఆయన ఫొటో వాడి సొమ్ములు గూగుల్‌పే చేయాలంటూ ఓ వ్యక్తి ద్వారంపూడి సన్నిహితులు, అభిమానులను మోసం చేసేందుకు ప్రయత్నించాడు. వివరాల్లోకి వెళితే ఎమ్మెల్యే ద్వారంపూడి పేరుతో సోమవారం ఓ ఫేస్బుక్ అకౌంట్ ఓపెన్ అయ్యింది. ఎమ్మెల్యే ఫొటో, ఆయన పేరుతోనే అకౌంట్‌ను గుర్తు తెలియని వ్యక్తి ఓపెన్ చేశాడు. మరికొద్ది సేపటికే తనకు డబ్బులు కావాలని గూగుల్‌పే ఉంటే చేయాలని పోస్టింగ్‌లు పెట్టాడు. సొమ్ము తిరిగి మరుసటి రోజు ఇచ్చేస్తానంటూ పోస్టులు కొనసాగించాడు. ఈ విషయాన్ని కొంతమంది ద్వారంపూడి అనుచరులు గుర్తించి ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖరరెడ్డి దృష్టికి తీసుకెళ్లారు. వెంటనే స్పందించిన ఎమ్మెల్యే ఈ సమాచారాన్ని ఎస్పీ నయీం అస్మి, ఇతర పోలీసు ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లారు. సదరు ఫేస్బుక్ అకౌంట్‌కు సంబంధించి అందుబాటులో ఉన్న సమాచారాన్ని స్క్రీన్ షాట్లను తీసి ఎమ్మెల్యే పేరుతో పార్టీ సోషల్ మీడియా కో ఆర్డినేటర్ ముమ్మిడి పవన్ టూ టౌన్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ప్రజలు మోసపోవద్దు నకిలీ ఫేస్బుక్ అకౌంట్లను చూసి ప్రజలు మోసపోవద్దని ఎమ్మెల్యే ద్వారంపూడి ప్రజలకు సూచించారు. అటువంటి వ్యక్తులపై ఇప్పటికే పోలీసులకు ఫిర్యాదు చేశానని, ఆన్లైన్ మోసాల పట్ల ప్రజలు జాగ్రత్తగా ఉండాలని కోరారు. ఇలాంటి మోసాలకు పాల్పడే వారిని ఏ మాత్రం ఉపేక్షించబోమని చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. సొమ్ములు పంపాలంటూ పెట్టిన పోస్టింగులు -
22ఏళ్లు జెండా మోస్తే.. పార్టీ ముఖం చాటేసింది
అతనో టీడీపీ వీరాభిమాని.. దాదాపు 22 ఏళ్లుగా ఆ పార్టీ జెండా మోశాడు. తెలుగుదేశం విజయం కోసం రక్తం ధారపోశాడు. తీరా కష్టం వచ్చేసరికి దన్నుగా నిలవాల్సిన సొంత పార్టీ ముఖం చాటేసింది. శత్రువుగా భావించిన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అక్కున చేర్చుకొని ప్రాణదానం చేసింది. సాక్షి, కాకినాడ: కాకినాడ జగన్నాథపురం గొల్లపేటకు చెందిన పుట్టా ఆదిబాబు (ఆదినారాయణ) రెండు దశాబ్దాలుగా తెలుగుదేశం పార్టీని వెన్నంటి ఉన్నాడు. మాజీ మంత్రి యనమల రామకృష్ణ, మాజీ ఎమ్మెల్యే వనమాడి కొండబాబుతో పయనిస్తూ పార్టీ పట్ల అంకితభావంతో పనిచేస్తూ వచ్చాడు. జిల్లా టీడీపీ కార్యదర్శిగా, మార్కెట్ కమిటీ డైరెక్టర్‌గా, తెలుగుయువత కార్యదర్శిగా టీడీపీలో అనేక పదవులు చేశాడు. ఇలా పార్టీ కోసం పాటుపడుతూ.. అకస్మాత్తుగా దాదాపు రెండున్నరేళ్ల క్రితం సొంత పార్టీ అధికారంలో ఉన్న సమయంలోనే తీవ్ర అనారోగ్యానికి గురయ్యాడు. వైద్యులను సంప్రదిస్తే రెండు కిడ్నీలూ పాడయ్యాయని, ఎంతోకాలం బతకడం కష్టం అన్నారు. ముఖం చాటేసిన టీడీపీ రెండు దశాబ్దాలకు పైగా పడ్డ కష్టానికి తనను తెలుగుదేశం పార్టీ తనను ఆదుకొంటుందని ఆశపడ్డ పుట్టి ఆదిబాబుకు నిరాశే ఎదురైంది. నమ్ముకొన్న నేతల చుట్టూ తిరిగినా ఫలితం లేకపోయింది. సదరు నేతలు ముఖం చాటేసి నిర్లక్ష్యం చేయడంతో జీవితంపై ఆదిబాబు ఆశలు వదులుకొన్నారు. ఎమ్మెల్యే ద్వారంపూడి దృష్టికి రాగానే.. ఆదిబాబు అనారోగ్య సమస్యను కుటుంబ సభ్యులు సుమారు ఏడాది క్రితం ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి ఆరోగ్య సమస్యను తీసుకొచ్చారు. గడచిన ప్రతి ఎన్నికలోనూ 20 ఏళ్లుగా తన ఓటమి కోసం పనిచేసిన ఆదిబాబు విషయంలో ఎమ్మెల్యే మాత్రం సానుకూలంగా స్పందించారు. అతడి ఇంటికి వెళ్లి యోగక్షేమాలు తెలుసుకొన్నారు. కార్పొరేటర్ ఎంజీకే కిశోర్‌కు అతడి ఆరోగ్యాన్ని మెరుగుపరిచే బాధ్యత అప్పగించారు. మూడు నెలలకు బతికే అవకాశం లేదన్న వైద్యుల సూచన నేపథ్యంలో వెంటనే కిడ్నీ మార్పిడి శస్త్రచికిత్స కోసం విశాఖ పంపించారు. దాతలతో కూడా ఎమ్మెల్యే సంప్రదించి ఓ కార్పొరేట్ ఆసుపత్రిలో ఆదిబాబు పూర్తిగా కోలుకొనే వరకు నిరంతరం పర్యవేక్షిస్తూ వచ్చారు. (ఉన్నతంగా మారుద్దాం) సీఎంఆర్ఎఫ్ ద్వారా రూ.6.75 లక్షలు ఆదిబాబు ఆర్థిక, ఆరోగ్య సమస్యను ఎమ్మెల్యే ద్వారంపూడి ముఖ్యమంత్రి జగన్ దృష్టికి తీసుకొచ్చారు. వెంటనే స్పందించిన ముఖ్యమంత్రి సీఎం రిలీఫ్ ఫండ్ ద్వారా ఆదిబాబుకు రూ.6.75 లక్షలు విడుదల చేశారు. ప్రభుత్వం నుంచి విడుదలైన ఆ చెక్కును ఎమ్మెల్యే చంద్రశేఖర్‌రెడ్డి బాధితుడు పుట్టా ఆదిబాబుకు తన నివాసం వద్ద అందజేశారు. మానవీయతకు దర్పణం అతను తెలుగుదేశం పార్టీకి చెందిన వ్యక్తి అయినా.. ఆరోగ్యం కుదుటపడేవరకు పర్యవేక్షించడంతో పాటు సీఎం రిలీఫ్ ఫండ్ ద్వారా నిధులు విడుదల చేయించిన తీరుపై హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి. సీఎం పారదర్శతకు నిదర్శనం ఎన్నికల తరువాత పారీ్టలకతీతంగా.. అర్హతే ప్రాతిపదికగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సాగిస్తున్న పారదర్శక పాలనకు ఈ సంఘటన నిదర్శనం. ఇదే తరహాలో ఇళ్ల స్థలాలు, పింఛన్లు సహా ప్రతి పథకాన్ని అర్హులకు అందజేయాలని సీఎం స్పష్టమైన ఆదేశాలిచ్చారు. ముఖ్యంగా ఆదిబాబు విషయంలో సీఎం ఎంతో సానుకూలంగా వ్యవహరించి నిధులు విడుదల చేయడం ఆనందదాయకం. – ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి, కాకినాడ సిటీ ఎమ్మెల్యే ఆజన్మాంతం రుణపడి ఉంటా.. ప్రాణభిక్ష పెట్టిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి, ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డిలకు జన్మజన్మలకు రుణపడి ఉంటా. నమ్ముకొన్న తెలుగుదేశం పార్టీ పూర్తిగా నిర్లక్ష్యం చేసింది. నేను పనిచేసిన పార్టీని చూడకుండా నా ఆరోగ్య సమస్యను మాత్రమే దృష్టిలో ఉంచుకొని ప్రాణదానం చేసిన ఈ ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నా. – పుట్టి ఆదిబాబు, బాధితుడు -
డెడ్లైన్లు విధించడానికి మీరెవ్వరూ..!
సాక్షి, కాకినాడ: అమరావతిని ఏక రాజధానిగా ప్రకటించాలని ప్రతిపక్ష నేత చంద్రబాబు చెప్పడం హాస్యాస్పదమని వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్‌రెడ్డి మండిపడ్డారు. తూర్పుగోదావరి జిల్లా కాకినాడలో గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ చంద్రబాబుపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. ‘‘పదవి లేదని పిచ్చి పట్టినట్లు మాట్లాడొద్దు. మీ వయస్సుకు, అనుభవానికి తగ్గట్టుగా హుందాగా ప్రవర్తించాలి. అమరావతిపై సెంటిమెంట్ ఉంటే.. వెంటనే మీ ఎమ్మెల్యేలతో సహా మీరు పదవులకు రాజీనామా చేసి ఎన్నికలకు వెళ్ళండి. గతంలో తెలంగాణ సెంటిమెంట్ ఉండబట్టే కేసీఆర్ తన ఎమ్మెల్యేలతో రాజీనామా చేసి ఎన్నికలకు వెళ్ళారని’’ ఆయన గుర్తు చేశారు. (రాజధాని నిర్ణయం రాష్ట్ర పరిధిలోనిదే: కేంద్ర హోంశాఖ) తమ మానిఫెస్టోలో ఇచ్చిన హామీలు అడగడానికి మాత్రమే అర్హులని, తమకు రెఫరెండం, డెడ్లైన్లు విధించడానికి మీరెవ్వరని చంద్రబాబును దుయ్యబట్టారు. మూడు రాజధానులు రాష్ట్రంలో మూడు ప్రాంతాల అభివృద్ధిలో భాగమని ఎమ్మెల్యే చంద్రశేఖర్‌రెడ్డి పేర్కొన్నారు. -
'సీఎం జగన్ మంచి విజన్ ఉన్న నాయకుడు'
సాక్షి, కాకినాడ: దేశంలో ప్రధాని మోదీ, ఏపీలో సీఎం వైఎస్ జగన్ కరోనా నియంత్రణ కోసం తీసుకుంటున్న చర్యల వల్లే మనం క్షేమంగా ఉంటున్నామని కాకినాడ ఎంపీ వంగా గీత అన్నారు. కరోనా వ్యాధి ఫేజ్-5 ఫీవర్ సర్వేలెన్స్ పోస్టర్ ఆవిష్కరణలో కాకినాడ సిటీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి, కలెక్టర్ మురళీధర్ రెడ్డితో కలిసి ఎంపీ గీత పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. కరోనా నియంత్రణ కోసం రాష్ట్ర ప్రభుత్వం చేయవలసిన దానికంటే చాలా ఎక్కువ ఏర్పాట్లు చేసింది. క్వారంటైన్ సెంటర్ ఏర్పాట్ల నుంచి కరోనా నిర్ధారణ పరీక్షల వరకు దేశంలో ఏపీ ప్రభుత్వం ఆదర్శంగా ఉండేలా సీఎం జగన్ పనిచేశారు. మన ఆరోగ్యం మన చేతుల్లోనే ఉంది. అనుమానాలు ఉంటే స్వచ్ఛందంగా వచ్చి పరీక్షలు చేయించుకోవాలని సూచించారు. చదవండి: ప్రభుత్వం మా పల్లెకొచ్చింది కార్యక్రమంలో కాకినాడ సిటీ ఎమ్మెల్యే ద్వారంపూడి మాట్లాడుతూ.. జిల్లాలో కరోనా నియంత్రణ కోసం అధికారులు శ్రమ, ప్రజల సహకారం ప్రశంసనీయం. కరోనా నియంత్రణ కోసం సీఎం జగన్ చేసిన వ్యాఖ్యలను కొందరు హేళన చేశారు. అయితే ఇప్పుడు సీఎంజగన్ చేసిన సూచనలను దేశం మొత్తం అనుసరిస్తోంది. సీఎం జగన్ మంచి విజన్ ఉన్న నాయకుడు అంటూ ఎమ్మెల్యే చంద్రశేఖర్‌రెడ్డి పేర్కొన్నారు. కరోనా లక్షణాలు కలిగిన వ్యక్తులు స్వచ్చందంగా ముందుకు వచ్చి పరీక్షలు చేయించుకోవాలని కలెక్టర్ మురళీధర్ రెడ్డి ప్రజలకు సూచించారు. పాజిటివ్ వస్తే కారంటైన్, ఐసోలేషన్‌లో ఉండాలి అనే అపోహలను విడనాడాలి. సదుపాయాలు ఉంటే ఇంట్లోనే ఉండి కరోనా చికిత్సను పొందవచ్చు. జి. మామిడాడలో కరోనా పాజిటివ్ వచ్చిన ఓ వ్యక్తి చేసిన నిర్లక్ష్యం వల్ల అక్కడ 50కి పైగా కరోనా కేసులు నమోదయ్యాయి. ఐదోసారి ఇంటింటికీ సర్వే కోసం వస్తున్న వాలంటీర్లకు ప్రజలు సహకరించాలని కలెక్టర్ కోరారు. చదవండి: ఏపీలో మరో 48 కరోనా కేసులు.. -
‘ఆ ఘనత వైఎస్సార్సీపీ ప్రభుత్వానిదే’
సాక్షి, కాకినాడ: అధికారంలోకి వచ్చిన ఏడాది కాలంలోనే మేనిఫెస్టోను పూర్తిగా అమలు చేసిన ఘనత వైఎస్సార్సీపీ ప్రభుత్వానికే దక్కుతుందని.. ప్రజాప్రతినిధులుగా తాము ఎంతో గర్వ పడుతున్నామని ఆ పార్టీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్‌రెడ్డి అన్నారు. వైఎస్సార్సీపీ విజయం సాధించి ఏడాది పూర్తయిన సందర్భంగా వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఆయనతో పాటు ఎంపీ వంగా గీత, పార్టీ నగర అధ్యక్షుడు ఫ్రూటీ కుమార్, మాజీ డిప్యూటీ మేయర్ వెంకటలక్ష్మీ కేక్ కట్ చేశారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి నాయకత్వంలో పనిచేయడం అదృష్టంగా భావిస్తున్నామన్నారు. మేనిఫెస్టోను పవిత్రంగా భావించి.. మంచి మనస్సుతో సిఎం జగన్ ప్రజలకు ఇచ్చిన హమీలను ఏడాది కాలంలోనే అమలు చేశారని పేర్కొన్నారు. (టీడీపీ కుట్రలు ఫలించవు: మల్లాది) చారిత్రాత్మక విజయం అందించిన రోజు: వంగా గీత రాష్ట్రంలో మొట్టమొదటి సారిగా 52 శాతం ఓట్లతో ప్రజలు వైఎస్సార్సీపీకి గొప్ప విజయం అందించిన రోజు అని కాకినాడ ఎంపీ వంగా గీత అన్నారు. వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రమాణ స్వీకారం చేసిన నాటి నుంచి ఇప్పటి దాకా తన పరిపాలనపై ప్రజలకు నమ్మకం కలిగించారని తెలిపారు. రాష్ట్రాభివృద్ధిని అడ్డుకోవడానికి ప్రతిపక్షాలు ఎన్ని రాద్ధాంతాలు చేసినా, కరోనా కష్టాలు వచ్చిన కూడా ప్రజలకు ఇచ్చిన హామీలను ఈ ఏడాదిలోనే సీఎం అమలు చేశారని కొనియాడారు. సీఎం జగన్‌కు భగవంతుని ఆశీస్సులతో పాటు ప్రజల దీవెనలు మెండుగా ఉండాలని ఆకాంక్షించారు ('ఏడాది కాలంలోనే మేమేంటో నిరూపించాం') -
'పర్యావరణం కాపాడేవారైతే అక్కడెందుకున్నారు'
సాక్షి, కాకినాడ : చంద్రబాబు లాంటి వ్యక్తి రాష్ట్రంలో పుట్టడం దౌర్బాగ్యమని ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్‌రెడ్డి ధ్వజమెత్తారు. బాబు పర్యావరణాన్ని కాపాడే వ్యక్తే అయితే కష్ణానది కరకట్టపై ఇన్నాళ్లు ఎందుకు నివాసం ఉన్నారో చెప్పాలంటూ ప్రశ్నించారు. కాకినాడలో పేదలకు ఇళ్ళ స్ధలాలు ఇవ్వకుండా టీడీపీ అడ్డుకుంటుందన్నారు. ఇండ్ల స్ధలాల కోసం సేకరించిన పోర్టు భూములను అడవులని సాకుగా చూపించి టీడీపీ నేతలు న్యాయస్ధానాలను ఆశ్రయిస్తున్నారని విమర్శించారు. కానీ ఆ భూముల్లో మడ అడవులు లేవని అటవీ శాఖ పేర్కొన్నట్లు గుర్తు చేశారు. ఇక్కడ మత్స్య సంపద పుట్టదని మత్స్య శాఖ కూడా స్పష్టంగా తేల్చి చెప్పిందన్నారు. (ఏపీలో 2205కు చేరిన కరోనా కేసులు) టీడీపీ బృందం శుక్రవారం పోర్టు భూముల్లో పర్యటించుంటే భూ లబ్ధిదారులు తగిన విధంగా వారికి సమాధానం చెప్పేవారని పేర్కొన్నారు. చినరాజప్ప మంత్రిగా ఉన్నప్పుడు పెద్దాపురంలో కొండల్ని తవ్వేశారు.. అప్పుడు పర్యావణం గుర్తుకు రాలేదా? అంటూ ప్రశ్నించారు. ఇండ్ల స్దలాల లబ్ధిదారులతో మాట్లాడి వారిని తాను ఒప్పిస్తానని టీడీపీ బృందంలో ఎవరు వస్తారో చెబితే వారిని తానే దగ్గరుండి పోర్టు భూములను చూపిస్తానంటూ ద్వారంపూడి తెలిపారు. లాక్ డౌన్ ఎత్తివేసిన తర్వాత టీడీపీ తీరుపై లబ్ధిదారులతో కలిసి పెద్ద ఎత్తున ఉద్యమిస్తామన్నారు. -
‘బ్యాంక్‌పేటలో రెడ్‌జోన్ ఎత్తివేత’
సాక్షి, తూర్పుగోదావరి: కాకినాడ బ్యాంక్‌పేటలో రెడ్‌జోన్ ఎత్తివేస్తూ.. నేటి నుంచి ఆరంజ్‌జోన్‌గా కొనసాగుతుందని కాకినాడ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖరర్‌రెడ్డి తెలిపారు. ఆయన గురువారం మీడియాతో మాట్లాడుతూ.. గ్రీన్ జోన్లోకి రావడానికి సహకరించిన ప్రజలకు, దాతలకు, కరోనా సేవల్లో పాల్గొన్న అధికారులు, సిబ్బందికి కృతజ్ఞతలు తెలిపారు. కాకినాడ సిటీలో 34 వేల మందికి ఇళ్ల స్థలాలు పంపిణీ చేస్తామని ఆయన చెప్పారు. ప్రజలకు ఇళ్ల స్థలాలు ఇవ్వకుండా మాజీ ఎమ్మెల్యే కొండబాబు, అతని అనుచరులు అడ్డుకోవడానికి కోర్టుకు వెళ్లారని ఆయన మండిపడ్డారు. దుమ్ములపేటలో పోర్టు భూముల నుంచి సేకరించిన స్థలాల్లో మడఅడవులు ఉన్నాయాని అసత్య ఆరోపణలు చేశారని తెలిపారు. అవి అటవీశాఖ భూములు కావని, మత్స్య సంపదకు నష్టం కలగదని అధికారులు ఇచ్చిన పత్రాలను ద్వారంపూడి మీడియాకు విడుదల చేశారు.(శ్రీశ్రీ రచనలు తరతరాలకూ స్ఫూర్తి: సీఎం జగన్) ఆటంకాలు సృష్టించాలని చూస్తే లబ్దిదారులతో కలిసి నిరాహార దీక్షకు దిగుతానని ఆయన వ్యాఖ్యానించారు. వక్రబుద్ధితో టీడీపీ నేతలు కోర్టును ఆశ్రయిస్తున్నారని ద్వారంపూడి దుయ్యబట్టారు. పేదలకు ఇళ్ల స్ధలాలు ఇవ్వడం టీడీపీ ఇష్టం ఉండదని ఆయన మండిపడ్డారు. కాకినాడలో 34 వేల మంది లబ్దిదారులకు జూన్ 8న దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వై ఎస్ రాజశేఖరరెడ్డి జయంతి సందర్భంగా కచ్చితంగా ఇళ్లు ఇచ్చి తీరుతామని స్పష్టం చేశారు. త్వరలోనే మాజీ ఎమ్మెల్యే కొండబాబు భూ కబ్జాలు, అక్రమాలు సాక్షాధారాలతో సహ బయటపెడతానని తెలిపారు. ఇప్పటికే 15 ఎకరాల కబ్జా భూములను ప్రభుత్వం వెనక్కి తీసుకుందని ఆయన గుర్తు చేశారు. అక్రమాలకు సహకరించిన అధికారిని కూడా సస్పెండ్ చేసిందని ఆయన అన్నారు. జగన్నాధపురంలో క్రైస్తవుల శ్మశానవాటికకు ఇచ్చిన 5 ఎకరాల భూమిపై కూడా కొండబాబు కోర్టుకు వెళ్లిఅడ్డుకుంటున్నారని ద్వారంపూడి మండిపడ్డారు. -
విదేశాల్లో సాఫ్ట్వేర్ ఉద్యోగి కానీ..
చేతికి అందివచ్చిన కుమారుడు విదేశాల్లో సాఫ్ట్వేర్ ఉద్యోగం చేస్తున్నాడన్న ఆనందం.. ఆ కుటుంబానికి ఎంతోకాలం నిలవలేదు. పట్టుమని ఆరు నెలలు గడవకముందే అకస్మాత్తుగా గుండెపోటుతో మరణించాడన్న సమాచారం అతడి తల్లిదండ్రులకు తీరని శోకాన్ని మిగిల్చింది. కరోనా వైరస్ ఎఫెక్ట్‌తో అతడి మృతదేహాన్ని కడసారి చూడలేని దుర్భర పరిస్థితిలో వారు ఉన్నారు. వారిని ఓదార్చడం సన్నిహితులు, కుటుంబ సభ్యుల వల్ల కావడం లేదు. ఆ యువకుడి మృతి.. అతడిలో తీవ్ర విషాదాన్ని తెచ్చింది. సాక్షి, కాకినాడ: స్థానిక శ్రీరామ్‌నగర్‌కు చెందిన చంద్రశేఖర్, మంగతాయార్ల కుమారుడు పీసపాటి కృష్ణ చైతన్య (35) సుమారు ఆరు నెలల క్రితం స్వీడన్ వెళ్లారు. అక్కడ క్యాప్ జెమినీ కంపెనీలో ఉద్యోగంలో చేరారు. ఇంకా వివాహం కూడా కాని కృష్ణచైతన్య ఇప్పుడిప్పుడే జీవితంలో స్థిరపడుతున్నాడు. నాలుగు రోజుల క్రితం ఆ కుటుంబానికి పిడుగు లాంటి వార్త చేరింది. స్వీడన్లో అతడు విధి నిర్వహణలో గుండెనొప్పితో కుప్పకూలిపోయాడని, తోటి ఉద్యోగులు ఆస్పత్రిలో చేర్చినా ప్రయోజనం లేకపోయింది. ఆస్పత్రికి వెళ్లిన కొద్దిసేపటికే అతడు మరణించినట్టు స్వీడన్లో వైద్యులు ధ్రువీకరించారు. మృతదేహం కోసం.. కరోనా ప్రభావంతో కృష్ణచైతన్య మృతదేహం ఇక్కడికి చేర్చేందుకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. కరోనా ప్రభావం వల్ల ఇరుదేశాల మధ్య అంతర్జాతీయ విమానాల రాకపోకలు ఈ నెల 29వ తేదీ వరకు రద్దు కావడంతో సమస్య జఠిలమైంది. అందరూ ఉండి ఎవరూ లేని అనాథలా కుమారుడి మృతదేహం స్వీడన్లో నిలిచిపోవడం ఆ కుటుంబానికి చెప్పలేనంత విషాదాన్ని నింపింది. అక్కడి కంపెనీ అధికారులు, ఇతర వర్గాలతో చర్చించినా ప్రయోజనం లేకపోయింది. స్పందించిన ఎంపీ, ఎమ్మెల్యేలు ఈ విషయం తెలుసుకున్న కాకినాడ ఎంపీ వంగా గీత, ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖరరెడ్డి చొరవ తీసుకున్నారు. లోక్‌సభ పక్ష నేత వి.విజయసాయిరెడ్డి ద్వారా కేంద్ర విదేశాంగశాఖ మంత్రి, స్వీడన్‌లోని ఎంబసీ అధికారులతో చర్చించారు. మృతదేహాన్ని ఎలాగైనా స్వదేశానికి రప్పించేందుకు ప్రయత్నిస్తున్నారు. అవసరమైతే ప్రత్యేక విమానం ద్వారా మృతదేహాన్ని తీసుకువచ్చేందుకు కృషి చేస్తున్నారు. ప్రపంచ వ్యాప్తంగా కరోనా ప్రభావం తీవ్రంగా ఉన్నందున వీరి కృషికి కూడా ప్రతిబంధకం ఏర్పడింది. ఈ నెల 29వ తేదీ వరకు విమానయానానికి అంక్షలు ఉన్నందున ఆ తరువాత కూడా కొనసాగితే పరిస్థితి ఏమిటని కుటుంబ సభ్యులు ఆందోళన చెందుతున్నారు. ప్రధానంగా ఈ నెల 30వ తేదీ దాటితే ఆ మృతదేహాన్ని స్థానికంగా ఉండే ఓ మత సంస్థకు అప్పగిస్తారనే సమాచారంతో వారిని మరింత ఆవేదనకు గురిచేస్తోంది. ఈ విషయంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు జోక్యం చేసుకుని తమ కుమారుడిని కడసారైనా చూసే అవకాశం కల్పించాలంటూ మృతుడి కుటుంబ సభ్యులు కోరుతున్నారు. ఓదార్చిన ఎంపీ, ఎమ్మెల్యేలు ఆండాళ్లమ్మ కళాశాలలో లెక్చరర్‌గా పదవీ విరమణ చేసిన కృష్ణచైతన్య తల్లిదండ్రులు చంద్రశేఖర్, మంగతాయారులను కాకినాడ ఎంపీ వంగా గీత, ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖరరెడ్డి శనివారం పరామర్శించారు. శ్రీరామ్‌నగర్‌లోని వారి ఇంటికి వెళ్లి కేంద్రం, ఎంబసీ అధికారులతో చర్చిస్తున్న విషయాన్ని వారికి చెప్పారు. మృతదేహాన్ని రప్పించేందుకు చేస్తున్న ప్రయత్నాలను వివరించారు. ప్రభుత్వపరంగా అన్ని విధాలా ప్రయత్నం చేస్తున్నామని, ఆందోళన చెందవద్దని వారిని ఓదార్చారు. పెద్ద సంఖ్యలో బంధువులు, సన్నిహితులు మృతుని ఇంటికి చేరుకుంటున్న నేపథ్యంలో, వారి ఆవేదన వర్ణనాతీతంగా ఉంది. ప్రభుత్వం తీసుకునే చొరవ వల్ల మృతదేహం కొంత జాప్యమైనా స్వదేశానికి వస్తుందన్న విశ్వాసాన్ని మృతుడి మేనమామ బ్రహ్మయ్య శాస్త్రి ఆశాభావం వ్యక్తం చేశారు. ప్రముఖ ప్రవచనకర్త చాగంటి కోటేశ్వరరావు దంపతులు ఆ కుటుంబాన్ని ఓదార్చారు. -
కరోనా: రాష్ట్రంలో పటిష్టమైన వాలంటరీ వ్యవస్థ ఉంది’
సాక్షి. తూర్పు గోదావరి: దేశంలో ఏ రాష్ట్రంలో లేని మంచి వాలంటరీ వ్యవస్థను మన రాష్ట్రంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఏర్పాటు చేశారని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే ద్వారంపుడి చంద్రశేఖర్‌రెడ్డి అన్నారు. శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. కరోనా వైరస్ వ్యాప్తి చెందకుండా సీఎం జగన్ ప్రభుత్వం పటిష్టమైన ముందస్తు నివారణ చర్యలు తీసుకుంటోందని తెలిపారు. ఇంట్లో ఏ కష్టమొచ్చిన వాలంటరీ వ్యవస్థ పరిష్కరిస్తుందన్నారు. అటువంటి వాలంటరీ వ్యవస్థను నిర్వీర్యం చేసేందుకు స్థానిక సంస్థల ఎన్నికలను వాయిదా వేయడం తప్పు అన్నారు. చంద్రబాబు ఒత్తిడితో కరోనా సాకు చూపించి ఎన్నికల కమిషనర్ ఎన్నికలను వాయిదా వేశారని పేర్కొన్నారు. ఎన్నికలు వాయిదా వేయడం వల్ల ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని ఆయన తెలిపారు. ‘బాబు అలా చేస్తే బాగుంటుంది: ఎమ్మెల్యే ద్వారంపూడి -
సీఎం వైఎస్ జగన్ మైనార్టీల మనోభావాలను కాపాడుతారు
-
చంద్రబాబు అవినీతిపై గతంలోనే చెప్పాం
-
‘బాబు అలా చేస్తే బాగుంటుంది: ఎమ్మెల్యే ద్వారంపూడి
సాక్షి, తూర్పు గోదావరి: టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు ఇప్పటికైన బుద్ది తెచ్చుకుని తాను సంపాదించిన అవినీతి సొమ్మును ప్రకటిస్తే బాగుంటుందని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్‌రెడ్డి అన్నారు. శుక్రవారం మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. చంద్రబాబు పెద్ద ఎత్తున అవినీతి చేస్తున్నారని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి గతంలో చెప్పారని.. నేడు ఆ అవినీతి బయటపడిందన్నారు. చంద్రబాబు దగ్గర పనిచేసిన వ్యక్తి వద్ద రూ. 2వేల కోట్లు బయటపడ్డాయంటే.. ఇక బాబును విచారిస్తే రూ. 2 లక్షల కోట్లకుపైగా అవినీతి సొమ్ము బయట పడుతుందని పేర్కొన్నారు. ఆయన పీఏ దగ్గర బయటపడిన సొమ్ము చంద్రబాబుదే తక్షణమే ఆయనను అరెస్టు చేసి తీహరు జైలుకు తరలించి అవినీతి ఆరోపణలపై విచారణ చేయాలని అన్నారు. మనీ లాండరింగ్‌లో బాబు దిట్ట: మంత్రి అవంతి కాగా.. ఐటీ దాడుల్లో పట్టుబడిన సొమ్మురాష్ట్రానిదే కాబట్టి.. ఆ సొమ్ము అధికార వికేంద్రీకరణకు ఖర్చు పెడితే మన రాజధానులు అభివృద్ధి చెందుతాయని తెలిపారు. చంద్రబాబును నాయకుడు అనడానికే సిగ్గేస్తుందని, అలాంటి వ్యక్తి మన రాష్ట్రంలో పుట్టడం ప్రజలు చేసుకున్న దౌర్భాగ్యం.. దురదృష్టమని విమర్శించారు. గతంలో కులాలను, రాష్ట్రాన్ని విడగొట్టారు.. ఇప్పుడు ప్రాంతాలను విడగొడుతున్నాడని మండిపడ్డారు. ఇక బాబు తల్లే బ్రతికి ఉంటే.. ఇలాంటి కొడుకును ఎందుకు కన్నాన అని బాధపడే పరిస్థతి వచ్చేదని అభిప్రాయపడ్డారు. ఇప్పటికైనా చంద్రబాబు ప్రజల కోసం ముందుకు వచ్చి.. తాను తప్పు చేశానని ఒప్పుకుని అవినీతి భాగోతం చెబితే రాబోయే తరాలకు మంచి జరుగుతుందని ఎమ్మెల్యే వ్యాఖ్యానించారు. -
‘ఆ ఆనందంలో ఉన్న తీపి ఎలాంటిదో తెలిసిన వాడ్ని’
సాక్షి, తూర్పుగోదావరి : దళారీ వ్యవస్థను తొలగించినప్పుడే రైతులకు విలువ పెరిగి.. వినియోగదారునికి మేలు జరుగుతుందని వ్యవసాయశాఖ మంత్రి కురసాల కన్నబాబు తెలిపారు. కాకినాడలో రూ.50 లక్షల నిధులు మార్కెట్ యార్డు అభివృద్ధికి కేటాయించామని పేర్కొన్నారు. అలాగే రైతు బజారును ఏర్పాటు చేస్తున్నామని వెల్లడించారు. గురువారం కాకినాడ అర్బన్ వ్యవసాయ మార్కెటింగ్ కమిటీ ప్రమాణ స్వీకార సభకు మంత్రి హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. నామినేటేడ్ పదవుల్లో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఒక విప్లవాన్ని సృష్టించరన్నారు. యాభై శాతం రిజర్వేషన్లు ఉండాలని చట్టం రూపంలో తీసుకు వచ్చారని, బహుశా దేశ చరిత్రలో ఇది ఎవ్వరూ చేయని సాహసమని కొనియాడారు. త్వరలోనే మొబైల్ రైతు బజార్లను మంజూరు చేస్తున్నామని తెలిపారు. రూ. 3వేల కోట్లతో ధరల స్ధిరీకరణ నిధిని ఏర్పాటు చేసి.. రైతులకు అండగా ఉంటామని సీఎం వైఎస్ జగన్ ఒక సందేశాన్ని ఇచ్చారని మంత్రి అన్నారు. (11 సాంకేతిక సంస్థలతో ఎంవోయూ: మంత్రి) పార్టీ కోసం అహర్నిశలు కష్టడిన వారికి గుర్తింపు వస్తే ఆ ఆనందంలో ఉన్న తీపి ఎటువంటిదో తెలిసిన వాడినని ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి తెలిపారు. పార్టీ కోసం కష్ట పడే వారికి ముఖ్యమంత్రి వైఎస్ జగన్ తగిన గుర్తింపు, హోదాను కల్పిస్తారన్నారు. దేవాలయ కమిటీలు కూడా త్వరలోనే ప్రకటిస్తామని పేర్కొన్నారు. ఎవ్వరికి పెన్షన్లు పోలేదని, గత ప్రభుత్వంలో జన్మభూమి కమిటీ ఇచ్చిన తప్పుడు పేర్లను పరిశీలించి తొలగించడమైనదని స్పష్టం చేశారు. నిజమైన లబ్ధిదారులకు పోతే వార్డు సెక్రటేరియట్‌కు వెళ్ళి మళ్ళీ దరఖాస్తూ చేసుకోవాలని సూచించారు. కాకినాడ నగరంలో పది వేల ఇళ్ళు ఇస్తామని హమీ ఇచ్చానని, ఆ హమీని వచ్చే మార్చి 25 న అమలు చేస్తానని తెలిపారు. ఇంటి కోసం 34 వేల దరఖాస్తులు వచ్చాయని, మార్చి 25న నవరత్నాల పథకంలోఅందిరికీ ఇళ్ళు పథకాన్ని ముఖ్యమంత్రి కాకినాడ నుండే ప్రారంభిస్తారని ఎమ్మెల్యే వెల్లడించారు. -
జనసేన కార్యకర్తల ఓవరాక్షన్.. విస్తుపోతున్న జనం!
సాక్షి, కాకినాడ: ప్రజల్లో సానుభూతి కోసం జనసేన కార్యకర్తలు ఓవరాక్షన్ చేశారా? కాకినాడలో ఆ పార్టీ అధినేత పవన్ కల్యాణ్ ముందు స్వయంగా జరిగిన ఈ సంఘటన చూస్తుంటే అవునని ఎవరైనా అంటారు. మొన్న ఆదివారం కాకినాడలో జనసేన కార్యకర్తలు వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్‌రెడ్డి ఇంటిపై ఆవేశంతో దాడికి దిగారు. ఈ సందర్భంగా వైఎస్ఆర్సీపీ-జనసేన కార్యకర్తలు బాహబాహికి దిగారు. రెండు వర్గాల వారికీ దెబ్బలు తగిలాయి. ఇప్పటి వరకూ బానే ఉంది. అంతా సద్దుమణిగింది. అయితే అసలు డ్రామా ఇక్కడే మొదలైంది. మా పార్టీ కార్యకర్తలను ప్రాణాలు పోయేలా కొట్టారంటూ పవన్ కళ్యాణ్‌కు కాకినాడ కార్యకర్తలు, నేతలు కంప్లయింట్ చేశారు. దీంతో పరామర్శ అంటూ ఓ ప్రోగ్రామ్ పెట్టుకుని జనసేన బాసు రెండు రోజుల తర్వాత ఢిల్లీ నుంచి నేరుగా విశాఖపట్ణం వచ్చి.. అక్కడి నుంచి కాకినాడకు కారులో వచ్చి మరీ దెబ్బలు తగిలిన కార్యకర్తలను ఓదార్చారు. దాడి జరిగింది ఆదివారం.. అయితే.. గాయపడ్డ జనసేన కార్యకర్తకు మాత్రం పవన్ పరామర్శ సమయంలో కూడా కాలి నుంచి తీవ్రంగా రక్తం కారిపోతోంది. ఘటన జరిగిన రెండ్రోజుల తర్వాత కూడా ఆ కార్యకర్త కాలు నుంచి రక్తం కారడం చూసి జనం నోరెళ్లబెడుతున్నారు. రెండ్రోజులు పాటు బ్లీడింగ్ అయితే ఇంకేమైనా ఉందా అంటూ ముక్కున వేలెసుకుంటున్నారు. జనసేన మరో డ్రామా పవన్ టూర్‌కు ముందు జనసేన ఆడిన మరో డ్రామా బయటపడింది. వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్‌రెడ్డిపై దుష్ప్రచారం చేసేలా ఓ వీడియో చిత్రీకరించేందుకు ప్రయత్నించి జనసేన బ్యాచ్ అడ్డంగా బుక్ అయ్యారు. వైఎస్సార్సీపీ నేతలు తమపై దాడి చేసి తీవ్రంగా కొట్టినట్లు వీడియో తీసి సోషల్ మీడియాలో వైరల్ చేసేందుకు సిద్ధమయ్యారు జనసేన మహిళా కార్యకర్తలు. ఈ క్రమంలో ఓ మహిళ మరో మహిళను ‘ఊ.... స్టార్ట్ చెయ్యి... మొదలు పెట్టు’ అనగానే ఆమె ఒక్కసారిగా బోరుమంటూ ఏడవటం వీడియోలో స్పష్టంగా కనిపిస్తోంది. వెంటనే మిగిలిన మహిళలు అందుకుని ముందుగా సిద్ధం చేసుకున్న కథనాన్ని చదివేశారు. ఎమ్మెల్యే ద్వారంపూడిని విమర్శించాలన్న పదాలు ఆ వీడియోలో కూడా రికార్డ్ అయ్యాయి. ఇప్పుడు ఈ వీడియో సోషల్ మీడియాలో హల్చల్ చేస్తోంది. -
జనసేన యాక్షన్ అట్టర్ ఫ్లాప్
కాకినాడ: ప్రజల్లో సానుభూతి కోసం జనసేన మహిళా కార్యకర్తలు చేసిన ఓవరాక్షన్ బెడిసికొట్టింది. ఈ ఘటన కాకినాడలో చోటుచేసుకుంది. వైఎస్సార్సీపీ నేతలు తమపై దాడి చేసి తీవ్రంగా కొట్టినట్టు వీడియో తీసి సోషల్ మీడియాలో వైరల్ చేసేందుకు సిద్ధమయ్యారు. ఆ క్రమంలో ఓ మహిళ రెండో మహిళను ‘ఊ.. స్టార్ట్ చెయ్యి.. మొదలుపెట్టు’ అనగా ఆమె ఒక్కసారిగా బోరుమంటూ ఆ మహిళ భుజాలపై వాలిపోయి ఏడవడం కనిపించింది. వెంటనే మిగిలిన మహిళలు అందుకుని ముందుగా సిద్ధం చేసుకున్న కథనాన్ని చదివేశారు. ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్‌రెడ్డిని విమర్శించాలని, వైఎస్సార్సీపీపై బురదజల్లాలనే ఉద్దేశంతో ఆ మహిళలు తయారు చేసుకున్న వీడియోలో ఆరంభంలో ఉన్న ఆ రెండు పదాలు కూడా రికార్డయ్యాయి. ఇప్పుడు ఆ వీడియాలో క్లిప్పింగ్ సోషల్ మీడియాలో హల్చల్ చేస్తోంది. ఓ పథకం ప్రకారం వీడియోలు తీసి, వైఎస్సార్సీపీపై దుష్ప్రచారం చేయాలన్న జనసేన నేతల దురాలోచన బట్టబయలైంది. ఈ వీడియోలో ఉన్న మహిళ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న వైఎస్సార్సీపీ కార్యకర్తపై తోటి జనసేన కార్యకర్తలతో కలిసి దాడి చేసి కొట్టిన వీడియో కూడా బయటకు వచ్చింది. అది జరిగిన 48 గంటల తర్వాత మంగళవారం సదరు మహిళ చేతికి కట్టు కట్టుకుని పవన్ కల్యాణ్ వద్దకు వచ్చి తన నటనా చాతుర్యాన్ని ప్రదర్శించడం, ఆయన పరామర్శించడాన్ని చూసిన జనం ముక్కున వేలేసుకుంటున్నారు. -
ఆ బాధ చంద్రబాబుకు తెలియాలనే..
కాకినాడ: ముఖ్యమంత్రిగా 14 ఏళ్లు పనిచేసిన చంద్రబాబు సీఎం జగన్మోహన్రెడ్డిపై చేస్తున్న విమర్శల్లో ఉపయోగిస్తున్న భాష ఇప్పటికైనా మార్చుకోవాలని కాకినాడ సిటీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్‌రెడ్డి హితవు పలికారు. తూర్పు గోదావరి జిల్లా కాకినాడలో మంగళవారం మీడియాతో మాట్లాడుతూ రెండు, మూడు వారాలుగా చంద్రబాబు రాజధాని రైతుల పేరుతో సీఎం జగన్‌పై చేస్తున్న వ్యాఖ్యలపై.. 35 ఏళ్లుగా వైఎస్ కుటుంబంతో తనకున్న అనుబంధంతోనే తాను అంతలా మాట్లాడాల్సి వచ్చిందన్నారు. ఒక సీఎంను పట్టుకుని ఉన్మాది, హిట్లర్, తుగ్లక్ అంటూ నోటికొచ్చినట్టు పరుష పదజాలంతో దూషిస్తుండటంతో ఆ బాధ చంద్రబాబుకు తెలియాలనే తాను కాస్త ఘాటైన పదాలు వాడాల్సి వచ్చిందన్నారు. తాను అలా మాట్లాడటం కాస్త బాధ అనిపించినా వైఎస్ కుటుంబంపై ఈగ వాలినా సహించలేనన్నారు. ఎదుటి వ్యక్తుల గౌరవాన్ని కించపరుస్తూ సోషల్ మీడియాలోను, ఎల్లో మీడియాలోను దుష్ప్రచారం చేస్తున్న నేపథ్యంలో విమర్శల బాధ ఎలా ఉంటుందో టీడీపీ నేతలకు తెలియజెప్పాలనుకున్నానన్నారు. ఇకనైనా చంద్రబాబు పద్ధతి మార్చుకోవాలని, లేనిపక్షంలో భవిష్యత్తులో కూడా తన ప్రతిస్పందన అలాగే ఉంటుందని స్పష్టం చేశారు. పవన్ కుమ్మక్కు రాజకీయాలు మానుకోవాలి 70 ఏళ్ల వయసు, 40 ఏళ్ల రాజకీయ అనుభవంలో కుట్రలు, కుతంత్రాలు, వెన్నుపోట్లకు మారుపేరుగా నిలిచిన చంద్రబాబుతో జనసేన అధినేత పవన్‌కల్యాణ్ కుమ్మక్కు రాజకీయాలు చేయడం మానుకోవాలని హితవు పలికారు. కాకినాడలో చోటుచేసుకున్న ఘటనకు దారితీసిన పరిస్థితులపై పవన్ కల్యాణ్ వాస్తవాలు తెలుసుకోవాలన్నారు. జనసేన శ్రేణులు ధర్నా ఎక్కడ చేశాయి? వివాదం ఎక్కడ జరిగిందో గుర్తించాలన్నారు. పథకం ప్రకారం తన ఇంటిపై దాడి చేసి విధ్వంసం సృష్టించాలని జనసేన శ్రేణులు చేసిన ప్రయత్నాన్ని తమ పార్టీ అభిమానులు, కార్యకర్తలు తిప్పికొట్టారే తప్ప, వైఎస్సార్సీపీ నేతలు, కార్యకర్తలు ఘర్షణకు దిగలేదన్నారు. -
‘ఆ విషయం పవన్ కల్యాణ్ తెలుసుకోవాలి’
సాక్షి, కాకినాడ : జనసేన పార్టీ కార్యకర్తలు కావాలనే ఒక ప్లాన్ ప్రకారం తన ఇంటిపై దాడి చేశారని వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే ద్వారంపుడి చంద్రశేఖర్‌రెడ్డి అన్నారు. తన ఇంటికి ధ్వంసం చేసేందుకు యత్నించారని ఆరోపించారు. మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. చంద్రబాబు నాయుడు, పవన్ కల్యాణ్ కలిసి రాష్ట్రంలో అశాంతి కలిగిస్తున్నారని మండిపడ్డారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అధికారంలోకి రాగానే ఇచ్చిన హామీలను నెరవేరుస్తుంటే.. రాజధాని సాకుతో చంద్రబాబు నాయుడు రాష్ట్రంలో అలజడి సృష్టించేందుకు యత్నింస్తున్నారని విమర్శించారు. జనసేన నాయకుడు నానాజీ రెచ్చగొట్టడంతో ఆ పార్టీ కార్యకర్తలు తన నివాసంపై దాడికి ప్రయత్నించారని ఆరోపించారు. అడ్డుకునేందుకు యత్నించిన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలపై జనసేన నాయకులు దాడికి పాల్పడ్డారని తెలిపారు. పవన్‌కు నానాజీ తప్పుడు సమాచారం ఇచ్చారని ధ్వజమెత్తారు. నేతలను తప్పుదారి పట్టించే మనస్తత్వం నానాజీది అని.. అ విషయం పవన్ కల్యాణ్ తెలుసుకోవాలని సూచించారు. ఈ దాడిపై పవన్ స్పందించిన తీరు సరికాదన్నారు. పవన్, చంద్రబాబు ఇద్దరూ భాష మార్చుకోవాలని.. వారి భాష బాగుంటే తామంతా బాగుంటామని ద్వారంపుడి పేర్కొన్నారు. (చదవండి: కాకినాడలో టెన్షన్.. టెన్షన్) కాగా, ఆదివారం ఉదయం కాకినాడ నగరంలో జనసేన కార్యకర్తలు విధ్వంసం సృష్టించిన సంగతి తెలిసిందే. ఆ పార్టీ నాయకులు రెచ్చగొట్టడంతో స్థానికేతరులు కాకినాడ వచ్చి సిటీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖరరెడ్డి నివాసంపై దాడికి ప్రయత్నించారు. వేర్వేరు వీధుల నుంచి గుంపులుగా చుట్టుముట్టి ఎమ్మెల్యే నివాసం వద్ద ఉన్న వైఎస్సార్ సీపీ శ్రేణులపై జనసేన కార్యకర్తలు రాళ్లు రువ్వారు. ఈ పరిణామాన్ని వైఎస్సార్ సీపీ శ్రేణులు ప్రతిఘటించడంతో వారు పరుగులు తీశారు. ఇంతలో పోలీసులు అల్లరిమూకలను చెదరగొట్టి పరిస్థితిని అదుపులోకి తెచ్చారు. -
కాకినాడలో టెన్షన్.. టెన్షన్
పెన్షనర్స్ పేరడైజ్‌గా పిలిచే ప్రశాంత కాకినాడ నగరంలో జనసేన కార్యకర్తలు విధ్వంసం సృష్టించేందుకు ప్రయత్నించారు. ఆ పార్టీ నాయకులు రెచ్చగొట్టడంతో స్థానికేతరులు కాకినాడ వచ్చి సిటీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖరరెడ్డి నివాసంపై దాడికి ప్రయత్నించారు. వైఎస్సార్ సీపీ కార్యకర్తలు జనసేన కార్యకర్తల దాడి ప్రయత్నాలను ప్రతిఘటించారు. ఆదివారం ఉదయం 8 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకూ కాకినాడలో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు చోటు చేసుకున్నాయి. అసలు నగరంలో ఏ మూల ఏం జరుగుతుందా అనే ఆందోళన సర్వత్రా నెలకొంది. సాక్షి, కాకినాడ: మూడు రాజధానుల ప్రతిపాదనపై శనివారం కాకినాడలో జరిగిన సంఘీభావ ర్యాలీలో పవన్‌కల్యాణ్ వ్యవహారశైలిని ఎమ్మెల్యే చంద్రశేఖరరెడ్డి ఎత్తిచూపారు. మొదటి నుంచి పవన్‌కల్యాణ్ చంద్రబాబుకు తొత్తుగా వ్యవహరిస్తున్నారని ఎమ్మెల్యే ద్వారంపూడి ఆక్షేపించారు. ఈ నేపథ్యంలో జనసే కార్యకర్తలు ఆదివారం తొలుత కాకినాడ భానుగుడి జంక్షన్లో రోడ్డుపై ఆందోళనకు దిగారు. ఆ పార్టీ నాయకులు పంతం నానాజీ, కందుల దుర్గే‹Ù, ముత్తా శశిధర్ తదితరులు భానుగుడి సెంటర్లో బైఠాయించారు. భానుగుడి సెంటర్ నుంచి టూటౌన్ ఫ్లై ఓవర్ పైకి వెళ్లేందుకు ప్రయత్నించగా పోలీసులు అడ్డుకున్నారు. అనంతరం వారంతా తిరిగి భానుగుడి సెంటర్‌కు చేరుకుని ఎమ్మెల్యే నివాసం ముట్టడిస్తామంటూ మూకుమ్మడిగా బయలుదేరారు. పోలీసులు ఆ సమయంలో జనసేన కార్యకర్తలను, నాయకులను అక్కడే కట్టడి చేసి ఉంటే వారు ఎమ్మెల్యే నివాసానికి సమీపం వరకూ వెళ్లే వారు కాదంటున్నారు. జనసేన కార్యకర్తల దాడిలో గాయపడి జీజీహెచ్‌లో చికిత్స పొందుతున్న టేకేటి సారధి జనసేన రాజకీయ వ్యవహారాల కమిటీ సభ్యుడు పంతం నానాజీ పిఠాపురం, పెద్దాపురం, రాజమహేంద్రవరం తదితర ప్రాంతాల నుంచి తీసుకొచ్చిన వారిని దాడికి రెచ్చగొట్టారు. జనసేన నాయకులు, కార్యకర్తలు భాస్కర్‌నగర్‌లోని ఎమ్మెల్యే చంద్రశేఖరరెడ్డి నివాసం సమీపాన ఉన్న వాటర్ ట్యాంక్ సెంటర్‌కు చేరుకున్నారు. వచ్చీ రాగానే కర్రలతో, రాళ్లతో ఎమ్మెల్యే నివాసంపై దాడికి ప్రయత్నించారు. వేర్వేరు వీధుల నుంచి గుంపులుగా చుట్టుముట్టి ఎమ్మెల్యే నివాసం వద్ద ఉన్న వైఎస్సార్ సీపీ శ్రేణులపై జనసేన కార్యకర్తలు రాళ్లు రువ్వారు. ఈ పరిణామాన్ని వైఎస్సార్ సీపీ శ్రేణులు ప్రతిఘటించడంతో వారు పరుగులు తీశారు. ఇంతలో పోలీసులు అల్లరిమూకలను చెదరగొట్టి పరిస్థితిని అదుపులోకి తెచ్చారు. ఈ వ్యవహారం కాకినాడలో ఏడు గంటల పాటు టెన్షన్ వాతావరణానికి కారణమైంది. జనసేన కార్యకర్తల దాడి నేపథ్యంలో గాయపడ్డ వైఎస్సార్ సీపీ కార్యకర్తలు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ద్వారంపూడితో కన్నబాబు చర్చలు జనసైనికుల దుందుడుకు చర్య నేపథ్యంలో వ్యవసాయ శాఖామంత్రి కురసాల కన్నబాబు ఎమ్మెల్యే చంద్రశేఖరరెడ్డి నివాసానికి చేరుకున్నారు. ఘటన వివరాలను అడిగి తెలుసుకున్నారు. జనసేన నేతలకు టీడీపీ తెరవెనుక మద్దతునిచ్చి ఈ వ్యవహారాన్ని నడిపిస్తోన్న అంశంపై చర్చించారు. జనసేన ఎన్ని కవ్వింపు చర్యలకు పాల్పడినా పార్టీ శ్రేణులు సంయమనంతో వ్యవహరించాలని నేతలు సూచించారు. జనసేన కార్యకర్తల దాడి దృశ్యాలను మంత్రి కన్నబాబుకు సెల్లో చూపిస్తున్న ఎమ్మెల్యే ద్వారంపూడి, ఫ్రూటీకుమార్ కాపు కార్పొరేషన్ చైర్మన్ జక్కంపూడి రాజా, వైఎస్సార్ సీపీ రాష్ట్ర కార్యదర్శి కర్రి పాపారాయుడు ఎమ్మెల్యే ద్వారంపూడి నివాసానికి చేరుకుని ఆయనతో ఘటనపై చర్చించారు. పోలీసులు సమయానుకూలంగా స్పందించకపోవడంతోనే ఈ పరిస్థితి తలెత్తింది. ఆందోళనకు దిగిన జనసేన నాయకులు, కార్యకర్తలను భానుగుడి సెంటర్లోనే కట్టడి చేసి ఉంటే ఎమ్మెల్యే ఇంటి సమీపం వరకూ జనసేన కార్యకర్తలు వచ్చి ఉండే వారే కాదు, ఇంతటి ఉద్రిక్తతకు దారితీసే పరిస్థితి ఎదురయ్యేది కాదంటున్నారు. కాకినాడ సిటీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖరరెడ్డితో మాట్లాడుతున్న రాష్ట్ర కాపు కార్పొరేషన్ చైర్మన్ జక్కంపూడి రాజా ఇటువంటి ఘటనలను ఖండించాలి సంఘటనపై ఎమ్మెల్యే ద్వారంపూడి స్పందిస్తూ ప్రశాంతమైన కాకినాడ నగరంలో బయట ప్రాంతాల నుంచి వచ్చిన వారు విధ్వంసం సృష్టించడం బాధ కలిగిస్తోందన్నారు. కాకినాడ చరిత్రలో ఇటువంటి పరిస్థితి ఎప్పుడూ తాను చూడలేదన్నారు. రాజకీయాల్లో విమర్శలు, ప్రతి విమర్శలు సహజమే అన్నారు. అంతమాత్రానికే విమర్శలు చేసిన వారిపై బయట ప్రాంతాల వారిని తీసుకువచ్చి దాడులకు తెగబడటం చూస్తుంటే మనం ఎక్కడికి పోతున్నామో అర్థం కావడం లేదన్నారు. పవన్‌పై తాను చేసిన విమర్శలకు కులం కలర్ తీసుకు రావడం చూస్తుంటే కాపు సామాజికవర్గంలో పట్టులేని పంతం నానాజీ వంటి వారే ఒక పథకం ప్రకారం ఇది చేస్తున్నట్టుగా కనిపిస్తోందన్నారు. ఇటువంటి సంఘటనలను ప్రతి ఒక్కరూ ఖండించాలని ఎమ్మెల్యే కోరారు. వైఎస్సార్ సీపీ కార్యకర్తలపై కర్రలతో దాడిచేస్తూ రాళ్ల వర్షం కురిపిస్తున్న జనసేన కార్యకర్తలు జీజీహెచ్‌లో బీభత్సం ►ఓ మహిళా రిపోర్టర్, ఇద్దరు డ్యూటీ నర్సులపై దాడి కాకినాడ క్రైం: కాకినాడ ప్రభుత్వ ఆసుపత్రిలో జనసేన కార్యకర్తలు వీరంగం సృష్టించడంతో ఆరుగురు వైఎస్సార్ సీపీకి చెందిన వ్యక్తులకు తీవ్ర గాయాలు కాగా, వారు చేస్తున్న అరాచకాన్ని సెల్లో చిత్రీకరిస్తున్న ఓ మహిళా రిపోర్టర్‌పై దాడి చేసి గాయపరిచారు. అంతేకాకుండా మరో ఇద్దరు నర్సులు కూడా వీరి దాడిలో గాయపడ్డారు. ఎమ్మెల్యే ద్వారంపూడి ఇంటిపై దాడికి దిగేందుకు ప్రయత్నించిన జనసేన కార్యకర్తలు అడ్డుకునేందుకు ప్రయత్నించిన వైఎస్సార్ సీపీ కార్యకర్తలను గాయపర్చారు. గాయపడిన వ్యక్తులు కాకినాడ జీజీహెచ్‌లో చికిత్స పొందేందుకు వచ్చారు. అదే సమయంలో జనసేన కార్యకర్తలు కాకినాడ జీజీహెచ్‌కు నాలుగు కారుల్లో వచ్చి చికిత్స పొందేందుకు అత్యవసర విభాగంలో మంచాలపై పడుకున్న వారిని ఇష్టానుసారంగా కొట్టారు. ఆ ఘటనను చిత్రీకరిస్తున్న ఓ మహిళా రిపోర్టర్ జుత్తుక జ్యోతిపైన జనసేన కార్యకర్తలు దాడికి పాల్పడ్డారు. అడ్డుకునే ప్రయత్నం చేసిన డ్యూటీ నర్సులను కొట్టారు. జనసేన కార్యకర్తలను అరెస్టుచేసి వ్యాన్‌లోకి ఎక్కిస్తున్న పోలీసులు ఈ సమయంలో వైఎస్సార్ సీపీకి చెందిన ముగ్గురు కార్యకర్తల సెల్ఫోన్లు తీసుకెళ్లిపోయారు. అదే సమయంలో జనసేనకు చెందిన ఓ మహిళ నాయకురాలు మహిళా రిపోర్టర్ చేతిని వెనక్కి వంచేసీ, తలను గోడకు ఢీకొట్టింది. దీంతో రిపోర్టర్ జ్యోతి కింద పడిపోయారు. దీంతో అక్కడే ఉన్న కొందరు ఆమెను ఎమర్జన్సీ వార్డులో చేర్చారు. జనసేన కార్యకర్తలు, నాయకులు చేసిన దాడిలో గాయపడిన వారిలో టేకేటి సారధి, వాసుపల్లి కృపానందం, పేర్ల విజయ్, అర్జల సింహాచలం, వాసుపల్లి ఏసుపాదం, పాడిశెట్టి గోపీలు ఉన్నారు. వీరందరూ కాకినాడ జీజీహెచ్ ఎమర్జన్సీ వార్డులో చికిత్స పొందుతున్నారు. అవుట్‌పోస్టు పోలీసులు వచ్చి వీరి వాంగ్మూలం తీసుకొని కేసు నమోదు చేశారు. జనసేన కార్యకర్తలు సుమారు 200 మందికి పైగా పాల్గొని ఎమర్జన్సీ వార్డులో వీరంగం సృష్టించారు. ఎవరు ప్రశ్నించినా వారు కొట్టేందుకు ప్రయత్నించారు. ఎమ్మెల్యే ద్వారంపూడి ఇంటి వద్ద పోలీసు బందోబస్తు విలేకరులు ఘటనా స్థలానికి చేరుకొని వారు చేస్తున్న వీరంగాన్ని చిత్రీకరించే ప్రయత్నం చేయగా, విలేకర్లపై దాడికి యత్నించారు. విషయం తెలిసిన వెంటనే వన్‌టౌన్, త్రీటౌన్, టూటౌన్లకు చెందిన పోలీసు సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకొని జనసేన నాయకులను ఆసుపత్రి ఎమర్జన్సీ వార్డు నుంచి బయటకు పంపించి గొడవను సర్దుబాటు చేశారు. ప్రభుత్వ సామాన్య ఆసుపత్రిలో రౌడీల్లా వ్యవహరించి వైఎస్సార్ సీపీ కార్యకర్తలనే కాకుండా డ్యూటీ నర్సులను, మహిళా రిపోర్టర్‌పై దాడికి దిగడాన్ని పలువురు తీవ్రంగా ఖండించారు. వీరంగం సృష్టించి పలువురిని గాయపర్చిన జనసేన పార్టీ నాయకులు, కార్యకర్తలపై కేసులు నమోదు చేయనున్నారు. ఈ దాడిలో పాల్గొన్న వ్యక్తులను గుర్తించేందుకు ఆసుపత్రిలోని సీసీ ఫుటేజ్‌లను పరిశీలించి, వాటి ఆధారంగా కేసులు నమోదు చేయనున్నారు. -
ద్వారంపూడి నివాసంపై జనసేన దాడి
కాకినాడ/కాకినాడ సిటీ: వైఎస్సార్ సీపీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖరరెడ్డి నివాసంపై ఆదివారం జనసేన కార్యకర్తలు దాడికి ప్రయత్నించారు. వారి దాడిని వైఎస్సార్ సీపీ శ్రేణులు ఎదుర్కోవడంతో ఇరు పక్షాల మధ్య తోపులాటలు జరిగాయి. తొలుత పలువురు జనసేన కార్యకర్తలు కర్రలతో, రాళ్లతో దాడికి దిగారు. దీంతో ఉదయం 10 గంటల నుంచి మూడు గంటల పాటు కాకినాడ నగరంలో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. జనసేన కార్యకర్తల దాడిలో పలువురు వైఎస్సార్ సీపీ కార్యకర్తలు గాయపడ్డారు. మూడు రాజధానులకు మద్దతుగా శనివారం కాకినాడలో జరిగిన సంఘీభావ ర్యాలీలో పవన్ కళ్యాణ్‌పై ఎమ్మెల్యే ద్వారంపూడి అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ జనసేన పార్టీ ఎమ్మెల్యే నివాసం ముట్టడికి పిలుపునిచ్చింది. మొదట జనసేన కార్యకర్తలు కాకినాడ భానుగుడి సెంటర్లో రోడ్డుపై బైఠాయించారు. ఇక్కడ నిరసనకు అనుమతి లేదంటూ పోలీసులు నివారించే ప్రయత్నం చేయగా వారిని లెక్క చేయకుండా గొడారిగుంట భాస్కర్‌నగర్‌లోని ఎమ్మెల్యే నివాసం వైపు మళ్లారు. వైఎస్సార్సీపీ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో ఎమ్మెల్యే నివాసానికి చేరుకోవడంతో తీవ్ర ఉత్కంఠ నెలకొంది. అటు భానుగుడి సెంటర్, ఇటు ఎమ్మెల్యే నివాసం వద్ద పోలీసులు మోహరించారు. ఈ ఘటనలపై జనసేన, వైఎస్సార్ సీపీ కార్యకర్తలు పరస్పరం పోలీసులకు ఫిర్యాదులు చేసుకున్నారు. తాటాకు చప్పుళ్లకు బెదిరేదిలేదు.. జనసేన వ్యవహారశైలిపై ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖరరెడ్డి తీవ్రస్థాయిలో మండిపడ్డారు. ప్రశాంతతకు మారుపేరుగా ఉండే కాకినాడలో అల్లరి మూకలను రెచ్చగొట్టి దాడికి పురిగొల్పిన తీరు అత్యంత హేయమన్నారు. పవన్ మొదటి నుంచి చంద్రబాబుకు వంతపాడుతున్నారన్న వాస్తవాన్ని జనసేన కార్యకర్తలు గుర్తించాలన్నారు. రాజకీయంగా పవన్ వ్యవహారశైలిని విమర్శిస్తే.. దానికి కులం రంగు పులిమి వివాదాలు సృష్టిస్తే సహించబోమని, తాటాకు చప్పుళ్లకు బెదిరేదిలేదని స్పష్టం చేశారు. కాగా, జనసేన కార్యకర్తల దాడి ప్రయత్నాన్ని తెలుసుకున్న మంత్రి కురసాల కన్నబాబు, ఎమ్మెల్యే జక్కంపూడి రాజా ఎమ్మెల్యే చంద్రశేఖరరెడ్డి నివాసానికి చేరుకుని పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. జీజీహెచ్‌లో జనసేన కార్యకర్తల బీభత్సం కాకినాడ జీజీహెచ్‌లో జనసేన నాయకులు, కార్యకర్తలు బీభత్సం సృష్టించారు. వీరి దాడిలో వైఎస్సార్ సీపీ కార్యకర్తలు, ఇద్దరు నర్సులు, ఓ మహిళా రిపోర్టర్ గాయపడ్డారు. ద్వారంపూడి ఇంటి వద్ద జనసేన కార్యకర్తల దాడిలో గాయపడ్డ వైఎస్సార్సీపీ కార్యకర్తలు జీజీహెచ్‌లో చికిత్స కోసం వచ్చారు. అక్కడ చికిత్స పొందుతున్న వైఎస్సార్సీపీ శ్రేణులపై జనసేన నేతలు దాడికి దిగారు. -
జీజీహెచ్‌లో జనసేన కార్యకర్తల బీభత్సం
-
జీజీహెచ్‌లో జనసేన కార్యకర్తల బీభత్సం
సాక్షి, కాకినాడ: జనసేన పార్టీ నాయకులు, కార్యకర్తలు ఆదివారం కాకినాడ జీజీహెచ్‌లో బీభత్సం సృష్టించారు. వివరాల్లోకి వెళితే.. వైఎస్సార్ సీపీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖరరెడ్డి నివాసంపై ఇవాళ ఉదయం జనసేన కార్యకర్తలు దాడికి ప్రయత్నించారు. వారి దాడిని వైఎస్సార్ సీపీ శ్రేణులు ఎదుర్కోవడంతో ఇరు పక్షాల మధ్య తోపులాటల జరిగాయి. తొలుత పలువురు జనసేన కార్యకర్తలు కర్రలతో, రాళ్లతో దాడికి దిగారు. జనసేన కార్యకర్తల దాడిలో పలువురు వైఎస్సార్ సీపీ కార్యకర్తలు వైఎస్సార్ సీపీ కార్యకర్తలు, ఇద్దరు నర్సులు, ఓ మహిళా రిపోర్టర్ గాయపడ్డారు. జనసేన కార్యకర్తల దాడిలో గాయపడ్డ వైఎస్సార్సీపీ కార్యకర్తలు జీజీహెచ్‌లో చికిత్స కోసం వచ్చారు. అదే సమయంలో జనసేన పార్టీ నాయకులు జీజీహెచ్‌కు వచ్చి ఎమర్జన్సీ వార్డులో చికిత్స పొందుతున్న వైఎస్సార్సీపీ శ్రేణులపై దాడికి దిగారు. ఈ వీరంగాన్ని సెల్లో చిత్రీకరిస్తున్న ఓ పత్రిక రిపోర్టర్ జుత్తుక జ్యోతిపై విరుచుకుపడి ఆమెను గొడకేసికొట్టారు. దీంతో స్పృహతప్పి పడిపోయింది. జ్యోతిపై దాడిని అడ్డుకున్న ఇద్దరు నర్సులను కూడా కొట్టారు. విషయం తెలుసుకున్న పోలీసులు జీజీహెచ్‌కు వచ్చి జనసేన కార్యకర్తల వీరంగాన్ని అడ్డుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. చదవండి: పవన్ టీడీపీ సొత్తు.. ఇంతకన్నా సాక్ష్యం కావాలా? కాకినాడలో జనసేన కార్యకర్తలు వీరంగం -
పవన్ టీడీపీ సొత్తు.. ఇంతకన్నా సాక్ష్యం కావాలా?
-
పవన్ టీడీపీ సొత్తు.. ఇంతకన్నా సాక్ష్యం కావాలా?
సాక్షి, కాకినాడ : తాను పవన్‌పై చేసిన వ్యాఖ్యలను జనసేనకు చెందిన కొందరు నేతలు పని గట్టుకొని కుల ముద్ర వేయడానికి ప్రయత్నిస్తున్నారని ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్‌రెడ్డి విమర్శించారు. ఈ రోజు ద్వారంపూడి చంద్రశేఖర్‌రెడ్డి నివాసం వద్ద ఉద్రిక్తత చోటుచేసుకుంది. జనసేన కార్యకర్తలు ద్వారంపూడి ఇంటిపై రాళ్లదాడి చేయటంతో పరిస్థితులు అదుపుతప్పిన సంగతి తెలిసిందే. ఈ ఘటన తర్వాత ద్వారంపూడి మీడియాతో మాట్లాడారు. 'మేం ప్రతిపక్షంలో ఉన్నప్పుడు వైఎస్ జగన్ అనేక ఉద్యమాలు చేశారు. ఒక్క ఉద్యమానికైనా పవన్ కల్యాణ్ మద్దతు తెలిపారా? దీనిని బట్టే పవన్ టీడీపీకి ఎంత మద్దతిస్తున్నాడనేది అర్థమవుతుంది. గత ఎన్నికల్లో పవన్ ప్రచారం చేసిన ప్రాంతాల్లో టీడీపీ ఎమ్మెల్యేలను కాకుండా కేవలం వైసీపీ అభ్యర్థులను మాత్రమే లక్ష్యంగా చేసుకొని విమర్శించారు. కాపు ఉద్యమ సమయంలో ముద్రగడ కుటుంబంపై లాఠీచార్జ్ చేస్తే పవన్ గానీ జనసేన నాయకులు కానీ ఖండించలేదు. ముద్రగడ బహిరంగ సభ పెడితే నా వెంట ఉన్న కాపులంతా 25 బస్సులతో వెళ్లి ఉద్యమానికి మద్దతిచ్చాం. కాపు ఉద్యమానికి చంద్రబాబు వ్యతిరేకం. అందుకే పవన్‌కళ్యాణ్ ఏమీ మాట్లాడలేకపోతున్నాడు. పవన్ టీడీపీకి మద్దతు అనడానికి ఇంతకన్నా సాక్ష్యం ఏం కావాలి' అంటూ ద్వారంపూడి ధ్వజమెత్తారు. పవన్ కల్యాణ్, చంద్రబాబు ఇద్దరు ఒకటేనని, వాళ్లిద్దరూ కుమ్మక్కయ్యారన్న విషయం తెలియని జనసేన నాయకులు ఇంకా భ్రమలోనే బతుకుతున్నారని ద్వారంపూడి ఎద్దేవా చేశారు. చంద్రబాబు గత పదిహేను రోజులుగా తన బినామీలతో సోషల్‌మీడియాలో ముఖ్యమంత్రి వైఎస్జగన్మోహన్రెడ్డిని తిట్టించారని మండిపడ్డారు. రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఒక వ్యక్తిని పట్టుకొని నియంత, తుగ్లక్ అంటూ దారుణమైన వ్యాఖ్యలు చేశారని విమర్శించారు. మేము ప్రతిపక్షంలో ఉన్నప్పుడు అసెంబ్లీలో బొండా ఉమతో వైఎస్ జగన్‌ను చంద్రబాబు తిట్టించిన సందర్భాలు చాలానే ఉన్నాయన్నారు. చంద్రబాబు లాంటి నాయకుడు మన రాష్ట్రంలో ఉండడం నిజంగా దౌర్భాగ్యమని దుయ్యబట్టారు. (ఢిల్లీలో పవన్ కల్యాణ్ నిరీక్షణ) -
కాకినాడలో జనసేన కార్యకర్తలు వీరంగం
సాక్షి, కాకినాడ : వైఎస్సార్ సీపీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్‌రెడ్డి నివాసం వద్ద ఉద్రిక్తత చోటుచేసుకుంది. జనసేన కార్యకర్తలు ద్వారంపూడి ఇంటిపై రాళ్లదాడి చేయటంతో పరిస్థితులు అదుపుతప్పాయి. దాడిని అడ్డుకున్న వైఎస్సార్ సీపీ శ్రేణులపై సైతం జనసేన కార్యకర్తలు దాడికి దిగారు. అంతేకాకుండా పరిస్థితులను చక్కబెట్టడానికి ప్రయత్నిస్తున్న పోలీసులతో సైతం వారు వాగ్వివాదానికి దిగారు. -
సుజనా... తొందరపడకు..
సాక్షి, విజయవాడ : రాజ్యసభ ఎంపీ సుజనా చౌదరిపై వ్యవసాయ మంత్రి కన్నబాబు మండిపడ్డారు. ఒక ఎంపీగా ఉంటూ దేశం వదిలి వెళ్లిపోతానని అనడం సిగ్గు చేటన్నారు. రాజధాని పేరుతో ఎన్ని వేల కోట్లు కుంభకోణం చేశారో సుజనా మాటలను చూస్తే అర్థమవుతుందన్నారు. శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. రాజధాని పేరుతో సుజనా వేల కోట్ల రూపాయలు దోచుకున్నారని ఆరోపించారు. అందుకే ఇప్పుడు మరో దేశానికి కాందిశీకుడిగా పోతానంటూ దేశాన్ని అవమానించేలా మాట్లాడుతున్నారని మండిపడ్డారు. (చదవండి : సుజనా చౌదరి సంచలన వ్యాఖ్యలు) దోపిడి చేసిన వాళ్లు చాలా మంది దేశం వదిలి వెళ్లారని.. సుజనా కూడా అలాగే పారిపోదామనుకుంటున్నారని విమర్శించారు. సుజనా చౌదరి తొందరపడవద్దని..త్వరలోనే ఆయన దోపిడీ అంతా బయటపెడతామన్నారు. కేసులకు భయపడే సుజనా బీజేపీలోకి వెళ్లాడని ఆరోపించారు. విశాఖ రాజధాని కావాలని ఎవరు అడిగారని చంద్రబాబు అంటూన్నారు.. మరి అమరావతి రాజధాని కావాలని ప్రజలు ఏమైనా ఉద్యమాలు చేశారా అని ప్రశ్నించారు. ఉత్తరాంధ్ర, రాయలసీమ అభివృద్ధి కావడం చంద్రబాబుకు ఇష్టం లేదా అని నిలదీశారు. చంద్రబాబు మాటలు విని అమరావతి రైతులు మోసపోవద్దని కోరారు. పవన్.. ఒక నాయకుడేనా? బినామీల కోసం చంద్రబాబు నాయుడు బస్సుయాత్ర చేస్తున్నారని కాకినాడ ఎమ్మెల్యే ద్వారంపుడి చంద్రశేఖర్‌రెడ్డి ఆరోపించారు. టీడీపీ నేతల మాటలు విని అమరావతి రైతులు మోసపోవద్దని కోరారు. చంద్రబాబు చెప్పు చేతుల్లో నడిచే పవన్ కల్యాణ్ ఒక నాయకుడేనా అని ఎద్దేవా చేశారు. రాజధానిని వెంటనే విశాఖకు తరలించాలన్నారు. అమరావతిలోని బినామీలను బయటకు తీసి.. చంద్రబాబు, లోకేష్, పవన్ కల్యాణ్‌లను జైల్లో వేయాలని ఎమ్మెల్యే ద్వారంపుడి డిమాండ్ చేశారు. -
పవన్, లోకేష్ శవ రాజకీయాలు మానండి
సాక్షి, కాకినాడ: జనసేన అధినేత పవన్ కల్యాణ్, చంద్రబాబు తనయుడు లోకేష్ శవ రాజకీయాలు చేస్తూ పబ్బం గడుపుకుంటున్నారని కాకినాడ సిటీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర రెడ్డి ఫైర్ అయ్యారు. ప్రజలు ఛీ కొట్టినా వీరి ధోరణిలో ఏ మాత్రం మార్పు రాలేదని విమర్శించారు. ప్రతీ అంశాన్నీ రాజకీయ లబ్ధికోసం వాడుకుంటూ జగన్మోహన్రెడ్డి ప్రభుత్వంపై బురదజల్లడమే లక్ష్యంగా పవన్, లోకేష్ ఉన్నారని ఎమ్మెల్యే ద్వారంపూడి తమ నివాసంలో మంగళవారం సాయంత్రం విలేకర్ల సమావేశంలో పేర్కొన్నారు. కాకినాడలో మూడు అంతస్తుల భవనంపై నుంచి పడి వీరబాబు అనే వ్యక్తి మృతి చెందితే ఆ అంశాన్ని కూడా స్వార్థ రాజకీయాల కోసం వాడుకునేందుకు లోకేష్ ప్రయతి్నంచారంటూ ధ్వజమెత్తారు. ఈ సంఘటన సోమవారం రాత్రి జరిగిన వెంటనే టీడీపీ నేతలు అక్కడకు వెళ్లి అతని కుటుంబ సభ్యులను మభ్యపెట్టి ఇసుక కొరత కారణంగా పని దొరక్క ఆత్మహత్య చేసుకున్నట్టుగా చెప్పాలని ఒత్తిడి చేశారన్నారు. పార్టీ తరఫున కొంత సొమ్ము ఇస్తామంటూ చెప్పినట్టు తమ దృష్టికి వచ్చిందన్నారు. ఆ వెంటనే రాత్రికి రాత్రే బయలుదేరి ఉదయాన్నే కాకినాడ చేరుకుని చేసిన హడావుడి చూస్తుంటే టీడీపీ నేతలు ఎంతగా దిగజారారో అర్థం అవుతుందన్నారు. ఓ వ్యక్తి ఆత్మహత్య చేసుకుంటే ఆ కుటుంబానికి కలిగే బాధ వర్ణనాతీతమని, చేతనైతే వారికి సహాయం చేసి ఆదుకోవాలే తప్ప శవరాజకీయాలు చేయడం ఏమిటని ఆయన ప్రశ్నిం చారు. పెదపూడి మండలం చింతపల్లి లాకులకు చెందిన మృతుడు వీరబాబు కొంతకాలంగా పనులకు వెళ్లడం లేదని, అతని భార్య రోజువారీ వేతనంపై ఓ ఆయిల్ కంపెనీలో పనిచేస్తున్నట్టు తమ దృష్టికి వచ్చిందన్నారు. ఆమె కూడా ఆరోగ్యం బాగోలేక కొద్దిరోజులుగా పనికి వెళ్లడం లేదన్నారు. వాస్తవాలను వక్రీకరించి భవన నిర్మాణ కార్మికుడు చనిపోయాడంటూ తప్పుడు ప్రచారం చేయడం ఏమిటని ద్వారంపూడి ప్రశ్నించారు. ఓ వైపు ఎన్నికలు, కొత్త ప్రభుత్వం ఏర్పాటు, కొద్దిరోజులకే వర్షాలు, వరదలతో ఇసుక కొరత ఏర్పడడం వాస్తవమేనన్నారు. అయితే సమస్యకు ముఖ్యమంత్రి జగన్ శాశ్వత పరిష్కారాన్ని చూశారని, పది, పదిహేను రోజుల తరువాత ఇసుక కొరత కనిపించదన్నారు. గత తెలుగుదేశం ప్రభుత్వం ఇసుక పేరుతో ఎంత దోపిడీ చేసిందో ప్రజలందరికీ తెలుసన్నారు. ఐదేళ్లూ ఏమయ్యావు పవన్? ప్యాకేజీలు తీసుకుని రాజకీయాలు చేసే జనసేన అధినేత పవన్‌కల్యాణ్ చంద్రబాబు పాలనలో ఎందుకు అడ్రస్ లేకుండా పోయారని ఎమ్మెల్యే ద్వారంపూడి నిలదీశారు. 2014లో చంద్రబాబు వద్ద డబ్బులు తీసుకుని టీడీపీ విజయానికి సహకరించిన పవన్... చంద్రబాబు ఏ ఒక్క హామీని అమలు చేయలేకపోయినప్పటికీ ఎందుకు ప్రశ్నించలేదన్నారు. మంత్రులు బొత్స, కన్నబాబులను విమర్శిస్తున్న పవన్ కల్యాణ్ తీరుపై ఎమ్మెల్యే ద్వారంపూడి మండిపడ్డారు. రాజకీయ విమర్శలు మాని వ్యక్తిగత విమర్శలకు దిగితే తాము కూడా అదే స్థాయిలో పవన్‌కు సమాధానం చెబుతామన్నారు. ఆయనకు ఉన్నన్ని లొసుగులు వేరెవ్వరికి లేవని, సినీ రంగంలో ఏ మహిళను అడిగినా పవన్‌కల్యాణ్ చరిత్రను బాహాటంగానే చెబుతారన్నారు. అన్న చిరంజీవి లేకపోతే నీ అడ్రస్ ఎక్కడ? అని ద్వారంపూడి ఎద్దేవా చేశారు. పవన్కల్యాణ్మాట తీరు, వ్యవహారశైలి, ప్రవర్తన రాజకీయాలకు పనికి రావన్నారు. తాము ప్రజల్లో నుంచి ఎదిగి ఎమ్మెల్యేలుగా ఎన్నికయ్యామని, ఆయనలా రెండు చోట్ల పోటీ చేసి ఘోరపరాజయాన్ని చవి చూడలేదన్నారు. రాజకీయాల్లో హుందాగా, సంస్కారవంతంగా వ్యవహరించాలని తమ నాయకుడు జగన్ సూచించినందున తాము వ్యక్తిగత విమర్శలకు వెళ్లడం లేదన్నారు. జనసేనలో అస్పష్టత విశాఖలో చేసిన మార్చ్‌పాస్ట్‌లో పవన్‌కల్యాణ్ ఇసుక కొరత కారణంగా 30 మంది చనిపోయారని చెప్పారని, ఆ తరువాత ఆ పార్టీకే చెందిన మరో నేత నాదెండ్ల మనోహర్ ఐదుగురు మృతి చెందారని చెప్పారన్నారు. దీన్ని బట్టి చూస్తే ఆ పార్టీలో అస్పష్టత నెలకొందన్న విషయం తేటతెల్లమవుతోందన్నారు. విలేకర్ల సమావేశంలో వైఎస్సార్ సీపీ కాకినాడ నగరాధ్యక్షుడు ఆర్‌వీజేఆర్ కుమార్, కార్పొరేషన్ ఫ్లోర్ లీడర్ ఆర్. చంద్రకళాదీప్తి, కాకినాడ పార్లమెంట్ జిల్లా బీసీ సెల్ అధ్యక్షుడు అల్లి రాజబాబు, కార్పొరేటర్లు, మాజీ కార్పొరేటర్లు, నాయకులు పాల్గొన్నారు. -
‘సినిమాలకే కాదు.. రాజకీయాలకూ పనికిరాడు’
సాక్షి, తూర్పుగోదావరి : ఇసుక కొరత పేరుతో టీడీపీ నేతలు శవ రాజకీయాలు చేస్తున్నారని కాకినాడ సిటీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్‌రెడ్డి ధ్వజమెత్తారు. ఎవరు చనిపోయినా భవన నిర్మాణ కార్మికులేనని టీడీపీ వాళ్లు దుష్ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. చంద్రబాబు పాలనలో బయటికి వచ్చి నోరు మెదపని పవన్.. ఇప్పుడు ప్యాకేజీకి అమ్ముడుపోయి రోడ్లపైకి వచ్చి డ్రామాలాడుతున్నాడని ఆగ్రహం వ్యక్తం చేశారు. తాము వ్యక్తిగత విమర్శలు చేస్తే తలెత్తుకోలేరని ఆయన పవన్‌ను హెచ్చరించారు. ఎమ్మెల్యే కూడా కాదనే విషయాన్ని పవన్ గుర్తు పెట్టుకోవాలని సూచించారు. పవన్ సినిమాలకే కాదు.. రాజకీయాలకు కూడా పనికిరాడని ఎద్దేవా చేశారు. చిరంజీవి లేకపోతే పవన్ హీరో కూడా కాలేకపోయేవాడని అన్నారు. -
ధర్మాడిని సత్కరించిన కాకినాడ సిటీ ఎమ్మెల్యే
సాక్షి, తూర్పుగోదావరి : గోదావరిలో మునిగిపోయిన రాయల్ వశిష్ట బోటును వెలికి తీసిన ధర్మాడి సత్యం బృందంపై అభినందనలు వెల్లువెత్తుతున్నాయి. ఈనేపథ్యంలో ధర్మాడి సత్యంను కాకినాడ సిటీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్‌రెడ్డి ప్రశంసించారు. శ్రీ బాలాత్రిపుర సుందరి అమ్మవారి ఆలయంలో ఆయన ధర్మాడి సత్యంనుఘనంగా సత్కరించారు. ఎమ్మెల్యే ద్వారంపూడి మాట్లాడుతూ.. సాహసోపేతంగా పనిచేసి ధర్మాడి సత్యం బృందం బోటును వెలికి తీసినందుకు గర్వంగా ఉందని అన్నారు. వైఎస్సార్సీపీ ఆవిర్భావం నుంచి సత్యం తన వార్డులో పార్టీకి మంచి సేవలందించారని ద్వారంపూడి గుర్తు చేశారు. ధర్మాడి సత్యం మాట్లాడుతూ.. ‘బోటును వెలికితీయడంలో నా కర్తవ్యాన్ని నిర్వర్తించాను. అందరూ చేతులెత్తేసినా.. పట్టుదలతో నావంతు ప్రయత్నం చేసి.. బోటును బయటపడేందుకు శ్రమించా. బోటు వెలికితీయడం ద్వారా చనిపోయిన వారి కుటుంబాల్లో కాస్తంత ఊరట కలిగించానన్న తృప్తి నాకు మిగిలింది’అన్నారు. -
‘చరిత్ర సృష్టించే దమ్మున్న ముఖ్యమంత్రి’
సాక్షి, తూర్పు గోదావరి: రాష్ట్రంలో నిశ్శబ్ధ విప్లవం ప్రారంభమైందనడానికి గ్రామ సచివాలయాల వ్యవస్థే నిదర్శనమని వ్యవసాయశాఖ మంత్రి కురసాల కన్నబాబు పేర్కొన్నారు. జిల్లాలో గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగాలకు ఎంపికైన అభ్యర్థులకు నియామక పత్రాలను మంత్రి అందజేశారు. ఈ సందర్భంగా సోమవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ గ్రామ సచివాలయాల ఉద్యోగాల భర్తీతో సీఎం జగన్ చరిత్ర సృష్టించారన్నారు. పైరవీలకు చోటు లేకుండా నిరుద్యోగులు ప్రతిభ ఆధారంగా ఉద్యోగాలు సంపాదించుకున్నారని తెలిపారు. ముఖ్యమంత్రి ప్రతినిధులుగా గ్రామ సచివాలయ ఉద్యోగులు క్షేత్ర స్థాయిలో ప్రజలతో మమేకం కావాలని పిలుపునిచ్చారు. చరిత్ర సృష్టించే దమ్మున్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అని ప్రశంసించారు. పాదయాత్రలో నిరుద్యోగులకు ఇచ్చిన హామీలో భాగంగానే గ్రామ సచివాలయ ఉద్యోగాలు అందించారని కాకినాడ సిటీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్‌రెడ్డి అన్నారు. అధికారంలోకి వచ్చిన నాలుగు నెలల కాలంలో నాలుగు లక్షల ఉద్యోగాలు ఇచ్చి జగన్ రికార్డు సృష్టించారన్నారు. -
టీటీడీ సభ్యుడి రేసులో నేను లేను
సాక్షి, కాకినాడ : తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) ట్రస్ట్ బోర్డు సభ్యుడి రేసులో తాను లేనని కాకినాడ సిటీ వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే ద్వారంపుడి చంద్రశేఖర్‌రెడ్డి తెలిపారు. పథకాలు అమలు చేయడంలో మాట తప్పని నాయకుడు సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి అని, ఆయన దగ్గర తాను పనిచేస్తుండటం అదృష్టంగా భావిస్తున్నానని చెప్పారు. సీఎం వైఎస్ జగన్ వంద రోజుల పాలన ప్రజామోదం పొందిందన్నారు. ఆర్థిక భారం ఉన్నప్పటికీ సంక్షేమ పథకాలు అమలు చేయడంలో సీఎం జగన్ మాట తప్పడం లేదని పేర్కొన్నారు. ఆంధ్రా బ్యాంక్ పేరు మార్చి తెలుగు ప్రజల మనోభావాలను దెబ్బతీయవద్దని ఆయన కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు. -
మహానేత ఆశయాలను కొనసాగిస్తాం : ద్వారంపూడి
సాక్షి, కాకినాడ : దివంగత మహానేత వైఎస్ రాజశేఖరరెడ్డి ఆశయాలను కొనసాగిస్తామని కాకినాడ సీటీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్‌రెడ్డి స్పష్టం చేశారు. ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ మహానేతతో తన అనుబంధాన్ని గుర్తుచేసుకున్నారు. మహానేత లేకపోవడం తమ కుటుంబానికి తీరని లోటు అని తెలిపారు. వైఎస్సార్ తనయుడు, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డితో మళ్లీ తమకు ప్రజలకు సేవ చేసుకునే అవకాశం కలిగిందన్నారు. వైఎస్సార్ వల్లే తాను రాజకీయాల్లోకి వచ్చానని గుర్తుచేశారు. మహానేత స్పూర్తితో ప్రజల కోసం శ్రమిస్తామని పేర్కొన్నారు. -
‘ఆయనవన్నీ సాహసోపేతమైన నిర్ణయాలు’
సాక్షి, కాకినాడ : పాదయాత్రలో చెప్పినట్లుగానే ‘జగన్ అనే నేను’ అన్నట్లుగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఈ నెల రోజులు రాష్ట్రాన్ని పరిపాలించారని కాకినాడ సిటీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్‌రెడ్డి అన్నారు. సీఎంగా ప్రమాణస్వీకారం చేసి మంత్రి వర్గ విస్తరణ నాటి నుంచి అక్రమ నిర్మాణమైన ప్రజావేదిక కూల్చివేత వరకు అన్నీ సాహసోపేతమైన నిర్ణయాలను తీసుకున్నారని పేర్కొన్నారు. మంత్రి వర్గ విస్తరణలో ఐదుగురికి ఉపముఖ్యమంత్రి పదవి ఇవ్వడం చాలా గొప్ప విషయమని కొనియాడారు. అవినీతి రహిత పరిపాలన అందించాలని సీఎం జగన్ తీసుకున్న నిర్ణయం మాలాంటి నాయకులకు ఎంతో సంతోషమని అన్నారు. సీఎం జగన్ విషయంలో మేమంత ధైర్యంగా ఉన్నామని అన్నారు. వైఎస్ జగన్ నోటి వెంట ఒక్కమాట వస్తే, హామీ ఇస్తే.. అదే ప్రభుత్వ జీవోతో సమానమని పేర్కొన్నారు. మరో ఆరు నెలల్లో ‘వాట్ ఈజ్ జగన్’ అనేది ప్రజలందరూ చూస్తారని తెలిపారు. -
ఆడపిల్లలు గల తల్లిదండ్రులు అదృష్టవంతులు
-
ఈ ఎన్నికల ఫలితాలు మాకు టెన్షన్ ఫ్రీ...
సాక్షి, కాకినాడ: ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో గెలుపుపై తూర్పుగోదావరి జిల్లా కాకినాడ నగర వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి ధీమా వ్యక్తం చేశారు. ఆయన బుధవారమిక్కడ మీడియాతో మాట్లాడుతూ... ఎన్నికల ఫలితాలు తమకు టెన్షన్ ఫ్రీ అని... ప్రజలు వైఎస్సార్ సీపీకే పట్టం కట్టారని గట్టిగా నమ్ముతున్నామన్నారు. ఉభయ గోదావరి జిల్లాలలో వైఎస్సార్ సీపీ ఎక్కువ స్థానాలు గెలుచుకుంటుందని ఆయన జోస్యం చెప్పారు. ఈ ఎన్నికల్లో పార్టీ ఘన విజయం సాధించి వైఎస్ జగన్మోహన్రెడ్డి ముఖ్యమంత్రి అవుతారని అన్నారు. అందుకే చంద్రబాబుకే తానూ.. తన కుమారుడు చేసిన అవినీతి మీద వైఎస్ జగన్ విచారణ జరిపిస్తారనే భయం పట్టుకుందన్నారు. కాగా కాకినాడ సిటీ నియోజకవర్గంలో త్రిముఖ పోరు నడిచింది. వైఎస్సార్ సీపీ తరపున ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి, టీడీపీ నుంచి వనమాడి వెంకటేశ్వరరావు, జనసేన తరపున ముత్తా శశిధర్ మధ్య పోటీ సాగింది. నియోజకవర్గంలో 2,55,716 ఓట్లకుగాను 1,69,754 ఓట్లు పోలయ్యాయి. 66.38 శాతం పోలింగ్ నమోదు అయింది. -
‘స్మార్ట్ సిటీ పనుల్లో ఎమ్మెల్యే అక్రమాలు’
సాక్షి, కాకినాడ: స్మార్ట్ సిటి పనుల్లో కాకినాడ అర్బన్ ఎమ్మెల్యే కొండబాబు భారీగా ముడుపులు దండుకున్నారని వైఎస్సార్సీపీ నాయకుడు ద్వారంపూడి చంద్రశేఖర్‌రెడ్డి విమర్శలు గుప్పించారు. వేసిన రోడ్ల మీదనే మళ్లీ రోడ్లు వేస్తున్నారని, పార్కుల్లో పాత గోడలకే రంగులేసి కొత్తగోడలు చూపిస్తున్నారని ఆయన ఆగ్రహం వ్యక్తంచేశారు. పనుల క్వాలీటి కంట్రోల్ పరిశీలించడం లేదని, ఎక్కడా నాణ్యత కానరావడం లేదని మండిపడ్డారు. వైఎస్సార్సీపీ అధికారంలోకి రాగానే స్మార్ట్ సిటీ పనుల మీద సమీక్ష చేస్తామని, పనుల నాణ్యత మీద విచారణ జరుపుతామని ద్వారంపూడి స్పష్టం చేశారు. అవినీతి జరిగిందని తేలితే ప్రజా ప్రతినిధులు, కాంట్రాక్టర్లు, అధికారుల మీద చర్యలు తప్పవని హెచ్చరించారు. కొన్ని పనులకు టెండర్లు లేకుండా నామినేషన్ల మీద పనులు అప్పగించారని విమర్శించారు. స్మార్ట్ సిటీ పనుల మీద విజిలెన్స్, మున్సిపల్ కమిషనర్, ప్రిన్సిపల్ సెక్రటరీకి ఫిర్యాదు చేస్తామని చెప్పారు. -
స్మార్ట్ సిటీ నిధులు దుర్వినియోగం అయ్యాయి
-
‘సినిమా చూస్తున్నంతసేపు గుండె బరువెక్కింది’
సాక్షి, అమరావతి: దివంగత మహానేత వైఎస్ రాజశేఖరెడ్డి జీవితంలో మహోజ్వల ఘట్టంగా నిలిచిన పాదయాత్ర ఆధారంగా తెరకెక్కిన ‘యాత్ర’ సినిమా ప్రజల హృదయాలను హత్తుకునేలా ఉందని వైఎస్సార్ సీపీ నాయకుడు పేర్ని నాని అన్నారు. సినిమా చూస్తున్నంతసేపు గుండె బరువెక్కిందని, భావోద్వేగానికి లోనయ్యానని చెప్పారు. కృష్ణాజిల్లా మచిలీపట్నంలోని సిరి వెంకట్ ధియేటర్లో వైఎస్సార్ సీపీ కార్యకర్తలు, అభిమానులతో కలిసి ఆయన సినిమా చూశారు. ఎమ్మెల్యే కొక్కిలిగడ్డ రక్షణనిధి.. తిరువూరు వెంకట్రామ ధియేటర్లో యాత్ర సినిమా వీక్షించారు. కన్నీరు పెట్టుకున్న ద్వారంపూడి వైఎస్సార్ సీపీ కాకినాడ నగర సమన్వయకర్త ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి కుటుంబ సమేతంగా యాత్ర సినిమాను చూశారు. ఈ చిత్రం తనను కదిలించిందని ఈ సందర్భంగా చెప్పారు. మహానేత వైఎస్ రాజశేఖర రెడ్డిని తలచుకుని మీడియా ముందు కన్నీరు పెట్టుకున్నారు. (‘యాత్ర’ మూవీ రివ్యూ) రాజన్నను కళ్లకు కట్టారు వైఎస్ రాజశేఖరెడ్డి పాత్రను కళ్లకు కట్టినట్టుగా చూపించారని వైఎస్సార్ సీపీ కొవ్వూరు నియోజకవర్గ కన్వీనర్ తానేటి వనిత వ్యాఖ్యానించారు. పశ్చిమ గోదావరి జిల్లా కొవ్వూరు అనన్య థియేటర్లో కార్యకర్తలతో కలిసి యాత్ర సినిమాను వీక్షించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ... రాజన్న రాజసం చక్కగా సినిమాలో చూపించారని ప్రశంసించారు. బైక్ ర్యాలీల జోరు యాత్ర సినిమా విడుదల సందర్భంగా పశ్చిమగోదావరి జిల్లాలో పలుచోట్ల వైఎస్సార్ సీపీ నాయకులు బైక్ ర్యాలీలు నిర్వహించారు. పార్టీ కార్యకర్తలు, అభిమానులు పెద్ద సంఖ్యలో ర్యాలీలో పాల్గొన్నారు. ఉండి నియోజకవర్గ సమన్వయకర్త పీవీఎల్ నరసింహరాజు, తణుకు నియోజకవర్గ కోఆర్డినేటర్ కారుమూరి నాగేశ్వరరావు బైక్ ర్యాలీలు నిర్వహించారు. జంగారెడ్డిగూడెంలో కేక్ కట్ చేసి నిర్వహించిన విజయోత్సవ ర్యాలీలో మండవల్లి సోంబాబు, బీవీఆర్ చౌదరి, పీపీఎన్ చందర్రావు, పార్టీ శ్రేణులు పాల్గొన్నాయి. అనకాపల్లిలో... విశాఖ జిల్లా అనకాపల్లి షిర్డీసాయి ధియేటర్లో యాత్ర సినిమాను వైఎస్సార్ సీపీ నాయకులు వీక్షించారు. కేక్ కట్ చేసి అభిమానులు సందడి చేశారు. మళ్ల బుల్లిబాబు, జానకిరామరాజు, జాజుల రమేష్, కొణతాల మురళి కృష్ణ, శ్రీధర్ రాజు, గొల్లవిల్లి శ్రీనివాసరావు తదితర నాయకులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. -
బహుశా రిటర్న్ గిఫ్ట్ అదే కాబోలు..!
-
బహుశా రిటర్న్ గిఫ్ట్ అదే కాబోలు..!
సాక్షి, కాకినాడ: ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు పచ్చి అవకాశవాదనీ, తన స్వార్థం కోసం ఏ పార్టీతో అయినా జతకాడతారని వైఎస్సార్సీపీ కో ఆర్డినేటర్ ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి విమర్శించారు. అధికారం కోసం నిన్నటి వరకు బీజేపీతో జతకట్టి.. ఇవాళ కాంగ్రెస్‌తో పొత్తుపెట్టుకుంటున్నారని మండిపడ్డారు. శుక్రవారం జరిగిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ... గతంలో వైఎస్సార్‌ను ఎదుర్కొంనేందుకు మహాకూటమి అంటూ కేసీఆర్‌తో చంద్రబాబు జట్టుకట్టిన విషయాన్ని గుర్తుచేశారు. ఇటీవల తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల సమయంలో కూడా టీఆర్ఎస్తో కలిసి పనిచేయాలని కేసీఆర్‌ను కోరింది నిజంకాదా అని ప్రశ్నించారు. కూకట్‌పల్లిలో లోధియా అపార్ట్మెంట్లో మంత్రి లోకేష్ చేసిన అక్రమాల వ్యవహారాల వీడియోలను కేసీఆర్ త్వరలోనే బయటపెట్టే అవకాశం ఉందని ఆయన పేర్కొన్నారు. బహుశా చంద్రబాబు నాయుడికి కేసీఆర్ ఇచ్చే రిటర్న్ గిఫ్ట్ అదే కాబోలు అంటూ వ్యాఖ్యానించారు. రాష్ట్ర ప్రయోజనాల కోసం వైఎస్ జగన్, కేసీఆర్‌తో కలిసి పనిచేయడాన్ని తప్పు పట్టాల్సిన అవసరం లేదన్నారు. -
మీ అసమర్థతను ప్రతిపక్షంపై నెడతారా?
తూర్పుగోదావరి, కాకినాడ: ఎమ్మెల్యే వనమాడి కొండబాబు తన అసమర్థతను ప్రతిపక్షంపై నెట్టేందుకు ప్రయత్నిస్తున్నారని, ఆయన చేసే తప్పులను ప్రశ్నించాల్సిన బాధ్యత తమపై ఉందని వైఎస్సార్సీపీ కాకినాడ సిటీ కో–ఆర్టినేటర్, మాజీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖరరెడ్డి పేర్కొన్నారు. తుపాను బాధితులకు పరిహారం పంపిణీ విషయంలో నిజంగా అధికారుల తప్పిదమే ఉంటే బాధితుల పక్షాన ఎమ్మెల్యేతోపాటు, కలెక్టరేట్ వద్ద ఆందోళనకు తాను సిద్ధమని ద్వారంపూడి ప్రకటించారు. బుధవారం తన కార్యాలయంలోని ఆయన విలేకర్ల సమావేశంలో మాట్లాడుతూ తుపాను బాధితులకు పరిహారం పంపిణీలోను అక్రమాలకు పాల్పడేందుకు వనమాడి ప్రయత్నిస్తున్నారని మండిపడ్డారు. కొండబాబు అవినీతి కార్యకలాపాలకు భయపడి అధికారులు సహితం అర్హులైన పేదలకు న్యాయం చేసే విషయంలో వెనుకడుగు వేస్తున్నారన్నారు. వేటకు వెళ్ళిన మత్స్యకారుల బోటు గల్లంతైతే కోస్టుగార్డు, ఓఎన్జీసీ సహకారంతో గుర్తించాల్సిందిపోయి కొండబాబు నిమ్మకు నీరెత్తినట్టు వ్యవహరించారని విమర్శించారు. సహాయం చేద్దామంటే ప్రతిపక్షం సహకరించడంలేదంటూ విమర్శలు చేయడం సమంజసం కాదన్నారు. నిజంగా ఆయనకు చిత్తశుద్ది ఉంటే ప్రభుత్వ పథకాలను ప్రజలకు చేరవేసే విషయంలోను, తుపాన్ బాధితులకు న్యాయం చేసే విషయంలోను కలెక్టరేట్ వద్ద ఆందోళనకు తాను సిద్ధమని ప్రకటించారు. మసీదు నిధుల పేరుతో మోసం... కాకినాడ పెద్దమసీదు అభివృద్ధికి రూ.కోటి నిధులు ఇస్తామంటూ ఎమ్మెల్యే వనమాడి ముస్లింల ను కూడా దగా చేశారని విమర్శించారు. రంజాన్ సందర్భంగా జరిగిన ఇఫ్తార్ విందులో కలెక్టర్ చేతుల మీదుగా రూ.కోటి అభివృద్ధి నిధులు ఇస్తున్నట్టుగా డమ్మీ చెక్కు పంపిణీ చేశారన్నారు. ఆరు నెలలు గడుస్తున్నా ఇంత వరకు నిధులు విడుదల కాలేదని చెప్పారు. వాస్తవాలను ఆరా తీస్తే జీవో విడుదలైందే తప్ప నిధులు మంజూరు కాలేదని తమ దృష్టికి వచ్చిందన్నారు. విలేకర్ల సమావేశంలో కాకినాడ పార్లమెంట్ జిల్లా మైనా ర్టీసెల్ అధ్యక్షుడు అబ్దుల్ బషీరుద్దీన్, నగర మైనార్టీ సెల్ అధ్యక్షుడు అక్బర్ అజామ్, రాష్ట్రవాణిజ్య విభాగం ప్రధాన కార్యదర్శి పెద్ది రత్నా జీ, కార్పొరేటర్లు మీసాల ఉదయ్‌కుమార్, ఎంజీ కే కిశోర్, బీసీ, యువజన విభాగాల అధ్యక్షులు పేర్ల రజనీకుమార్, బలగం ప్రసన్నకుమార్ తదితరులు పాల్గొన్నారు. -
'చంద్రబాబును కేసీఆర్ ఫుట్‌బాల్ ఆడారు'
సాక్షి, కాకినాడ : ఏపీ సీఎం చంద్రబాబు నాయుడుతో తెలంగాణ సీఎం కేసీఆర్ ఫుట్ బాల్ ఆడుకున్నారని మాజీ ఎమ్మెల్యే, కాకినాడ సిటీ వైఎస్సార్సీపీ కోఆర్డినేటర్ ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి అన్నారు. మనం చేసే రాజకీయాలు భావితరాలకు ఆదర్శంగా ఉండాలి, కానీ చంద్రబాబు చేసే దౌర్భాగ్య రాజకీయాలు ఎవరు చేయాలేరని మండిపడ్డారు. రాజకీయాలంటే ఆసక్తి ఉన్న వారు చంద్రబాబులా వ్యవహరించోద్దని సూచించారు. తెలంగాణలో పార్టీ మారిన ఎమ్మెల్యేలను ఓడించాలని చంద్రబాబు ప్రచారం చేశారు, మరి ఏపీలో 23మంది వైఎస్సార్సీపీ ఎమ్మెల్యేలను కొనుగోలు చేసి మంత్రి పదవులు కట్టబెట్టడానికి సిగ్గనిపించలేదా అని ధ్వజమెత్తారు. సమైక్యాంధ్ర, ప్రత్యేక హోదా కోసం చిత్తశుద్ధితో పోరాటం చేసిన నాయకుడు వైఎస్ జగన్ అన్నారు. చంద్రబాబు తీరును ప్రజలు గమనించాలన్నారు. రక్తం మరిగిన పులిలా.. డబ్బుకు రుచి మరిగిన కాకినాడ సిటీ ఎమ్మెల్యే కొండబాబు మళ్లీ పేకాట క్లబ్‌లను నడుపుతున్నారని నిప్పులు చెరిగారు. కాకినాడ మూడవ వంతెన నిర్మాణంలో రూ.50 కోట్ల అవినీతి జరుగుతోందని, ఆ అవినీతి సొమ్ము ఎమ్మెల్యే కొండబాబు జేబులో చేరబోతోందన్నారు. కాకినాడ మున్సిపాలిటీ ఇంజినీరింగ్ విభాగం తీవ్ర అవినీతికి పాల్పడుతోందని ధ్వజమెత్తారు. బాగున్న రోడ్ల మీదనే తక్కువ మందం కలిగిన రోడ్లు వేసి అవినీతికి పాల్పడుతున్నారన్నారు. మున్సిపల్ అధికారుల అవినీతిపై విచారణ జరిపించాలని విజిలెన్స్ అధికారులకు ఫిర్యాదు చేస్తున్నామని తెలిపారు. చంద్రబాబు మాదిరిగానే ఎమ్మెల్యే కొండబాబుకు శిలాఫలకాల పిచ్చి పట్టుకుందన్నారు. -
‘ఆ విషయంలో కొండబాబు బాబునే మించిపోయాడు’
సాక్షి, కాకినాడ: కాకినాడ సిటీ ఎమ్మెల్యే కొండబాబుపై వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కో-ఆర్డినేటర్, మాజీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి నిప్పులు చెరిగారు. అబద్ధాలు చెప్పడంలో కొండబాబు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడిని మించిపోయాడని అన్నారు. ఈ మధ్య కొండబాబు అబద్ధాలతోపాటు నటన కూడా నేర్చారని ఎద్దేవా చేశారు. అన్నపూర్ణ ట్రాన్స్పోర్ట్ పెట్టి ఎంతో చరిత్ర కలిగిన కాకినాడ లారీ యూనియన్ను కొండబాబు తొక్కిపెట్టారనీ, కాకినాడ చరిత్రలో ఇంతటి అవినీతి పరున్ని చూడలేదని అన్నారు. బుధవారం ద్వారంపూడి మీడియాతో మాట్లాడారు. పట్టుబడింది ఆయన అనుచరుడే ఆయిల్ మాఫీయాలో పోలీసులకు పట్టుబడింది టీడీపీ నేత కొండబాబు ప్రధాన అనుచరుడేనని ద్వారంపూడి ఆరోపించారు. 100 కోట్ల రూపాయల ఆయిల్ స్కామ్ జరిగితే అందులో రూ.50 కోట్లు కొండబాబు దండుకున్నాడని అన్నారు. ప్రభుత్వాధికారుల బదిలీల్లో కూడా కొండబాబు అవినీతికి పాల్పడుతున్నాడని అన్నారు. పోలీసు, మున్సిపల్ అధికారుల బదిలీలలో కొండబాబు ముడుపులు తీసుకుంటున్నారని ఆరోపించారు. పేకాట క్లబ్బులు, సింగిల్ నెంబర్ లాటరీ, గుట్కా వ్యాపారుల నుంచి కొండబాబు బంధువులకు మామూళ్ళు అందుతున్నాయని అన్నారు. -
పవన్ కల్యాణ్‌కు ద్వారంపూడి బహిరంగ లేఖ
సాక్షి, కాకినాడ : జనసేన అధినేత పవన్ కళ్యాణ్‌కు కాకినాడ మాజీ ఎమ్మెల్యే, వైఎస్సార్సీపీ నాయకుడు ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి సోమవారం బహిరంగ లేఖ రాశారు. జనసేన కవాతు సందర్భంగా ఇటీవల ధవళేశ్వరంలో జరిగిన సభలో పవన్ తనపై చేసిన ఆరోపణలను ఆయన ఈ లేఖలో ఖండించారు. తాను కొనుగోలు చేసిన స్థలం విషయంలో వాస్తవాలేమిటో మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్‌ను అడిగితే తెలుస్తోందని తెలిపారు. 2014 ఎన్నికల సమయంలోనూ పవన్ ఇవే ఆరోపణలు తనపై చేశారని గుర్తుచేశారు. నిర్దిష్టమైన ఆధారాలు లేకుండా తనపై విమర్శలు చేయడం ఆయనకు తగదని హితవు పలికారు. నాయకుడు అనేవాడు వాస్తవాలు తెలుసుకొని.. పూర్తి సమాచారాన్ని ఒకటికి రెండుసార్లు నిర్ధారించుకున్న తరువాతే మాట్లాడాలని సూచించారు. ‘గత ఎన్నికల్లో మీరు ప్రచారం చేసి గెలిపించిన కాకినాడ సిటీ ఎమ్మెల్యే కొండబాబు అవినీతిపై ప్రజాపోరాటయాత్రలో మీరు మాట్లాడాలి’ అని పవన్‌కు ద్వారంపుడి సూచించారు.