
పొత్తులు ప్రకటించాక బాబు, పవన్ ఎక్కడికెళ్లారో తెలియదంటూ వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్‌రెడ్డి ఎద్దేవా చేశారు.
సాక్షి, కాకినాడ జిల్లా: పొత్తులు ప్రకటించాక బాబు, పవన్ ఎక్కడికెళ్లారో తెలియదంటూ వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్‌రెడ్డి ఎద్దేవా చేశారు. కాకినాడలో ఆయన శుక్రవారం మీడియాతో మాట్లాడుతూ చంద్రబాబు అరెస్ట్ అయ్యాక ఎమోషనల్‌లో పవన్ పొత్తులు ప్రకటించాడు. ప్యాకేజీకి అమ్ముడు పోవద్దని.. కార్యకర్తల మనోభావాలు తాకట్టు పెట్టొదని పవన్ కల్యాణ్‌కు ముందు నుంచి చెబుతున్నా’’ అని పేర్కొన్నారు.
‘‘2024 ఫిబ్రవరి 15 తర్వాత సింగిల్‌గా వైఎస్సార్‌సీపీ మేనిఫెస్టోతో వస్తుంది. మా మేనిఫెస్టోతో బాబు, పవన్, లోకేష్‌కు చెమటలు పడతాయి. ఫిబ్రవరి 15 తర్వాత మీ దుకాణాలు మూసుకోవాలి’’ అంటూ ఎమ్మెల్యే ద్వారంపూడి వ్యాఖ్యానించారు.
చదవండి: బెయిల్ కోసం ఇన్ని డ్రామాలెందుకు?: మంత్రి సీదిరి