ఆ విషయాలు కూడా త్వరలోనే బయటకొస్తాయి: ఎమ్మెల్యే ద్వారంపూడి | YSRCP MLA Dwarampudi Chandrasekhar Reddy Comments On Janasena Chief Pawan Kalyan - Sakshi
Sakshi News home page

ఆ విషయాలు కూడా త్వరలోనే బయటకొస్తాయి: ఎమ్మెల్యే ద్వారంపూడి

Published Wed, Oct 4 2023 7:07 PM | Last Updated on Wed, Oct 4 2023 9:30 PM

Dwarampudi Chandrasekhar Reddy Comments On Pawan Kalyan - Sakshi

సాక్షి, కాకినాడ జిల్లా​: పవన్ కళ్యాణ్ ఓ ప్యాకేజీ స్టార్ అంటూ వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్‌రెడ్డి ఎద్దేవా చేశారు. బుధవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ, నటుడిగా డబ్బు కోసం రాజకీయాల్లో నటిస్తున్నాడు. తిట్టాడానికి డబ్బు, జైలుకు వెళ్లి పరామర్శించానికి డబ్బు తీసుకుంటాడు. ఎక్కడికక్కడే ప్యాకేజ్...ప్యాకేజ్‌.. పవన్ కళ్యాణ్ ప్యాకేజీ విషయాలు కూడా కొన్ని రోజుల్లో బయటకు వస్తాయి’’ అని ఎమ్మెల్యే ద్వారంపూడి పేర్కొన్నారు.

‘‘హవాలా ద్వారా ఎంత డబ్బు ఈ దేశం దాటి వెళ్ళిది?. పవన్ ప్యాకేజీ సొమ్ములు రష్యా వెళ్లిందా? లేక సింగపూర్, దుబాయికీ వెళ్లాయా అనే విషయాలు బయటకు వస్తాయి. రాజకీయంగా పవన్‌ను ఒక జోకర్‌లా చూస్తున్నారు. కృష్టా జిల్లా వంగవీటి రంగా ప్రభావం ఉన్న జిల్లా. టీడీపీతో పొత్తు పెట్టుకున్న పవన్‌కు అక్కడ ప్రభావం ఎందుకు ఉంటుందన్న ఎమ్మెల్యే ద్వారంపూడి.. జనసేనకు టీడీపీ వాళ్లే శ్రతువులు.. టీడీపీకి జనసేన వాళ్లే శత్రువు. పైనా లీడర్ల కలవడం ఈజీనే.. కింద క్యాడర్ కలవదన్నారు. ప్రజల దగ్గర దోచుకున్న సొమ్ముతో లాయర్లకు ఖర్చు చేసి చంద్రబాబు జైలు నుంచి బయట పడాలనుకుంటున్నాడని ఎమ్మెల్యే చంద్రశేఖర్‌రెడ్డి విమర్శలు గుప్పించారు.
చదవండి: ఏబీఎన్‌, టీవీ-5పై పొన్నవోలు తీవ్ర ఆగ్రహం 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement