
సాక్షి, తూర్పుగోదావరి : ఇసుక కొరత పేరుతో టీడీపీ నేతలు శవ రాజకీయాలు చేస్తున్నారని కాకినాడ సిటీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్‌రెడ్డి ధ్వజమెత్తారు. ఎవరు చనిపోయినా భవన నిర్మాణ కార్మికులేనని టీడీపీ వాళ్లు దుష్ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. చంద్రబాబు పాలనలో బయటికి వచ్చి నోరు మెదపని పవన్.. ఇప్పుడు ప్యాకేజీకి అమ్ముడుపోయి రోడ్లపైకి వచ్చి డ్రామాలాడుతున్నాడని ఆగ్రహం వ్యక్తం చేశారు. తాము వ్యక్తిగత విమర్శలు చేస్తే తలెత్తుకోలేరని ఆయన పవన్‌ను హెచ్చరించారు. ఎమ్మెల్యే కూడా కాదనే విషయాన్ని పవన్ గుర్తు పెట్టుకోవాలని సూచించారు. పవన్ సినిమాలకే కాదు.. రాజకీయాలకు కూడా పనికిరాడని ఎద్దేవా చేశారు. చిరంజీవి లేకపోతే పవన్ హీరో కూడా కాలేకపోయేవాడని అన్నారు.