
సాక్షి, కాకినాడ జిల్లా: పవన్ కళ్యాణ్ కచ్చితంగా ప్యాకేజీ కళ్యాణే అంటూ వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖరరెడ్డి మండిపడ్డారు. శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ, పవన్ కళ్యాణ్ బీజేపీని కాదని బయటకు రమ్మనండి అంటూ వ్యాఖ్యానించారు.
‘‘పవన్ ప్యాకేజీ సొమ్ములు ఏ రూట్ ద్వారా విదేశాలకు వెళ్లాయో బయటకు రావడం ఖాయం. నాకు తెలిసి రూ.1400 కోట్ల ప్యాకేజీ సొమ్ములు హవాలా ద్వారా దేశం దాటింది. అది దుబాయ్ కి వెళ్ళాయా? లేక రష్యాకు వెళ్ళాయా, సింగపూర్‌కు వెళ్లాయా తేలాలి. పవన్‌కు దమ్ముంటే నా మీద గ్లాస్ గుర్తును పోటీకి పెట్టాలి’’ అని ఎమ్మెల్యే ద్వారంపూడి సవాల్ విసిరారు.
‘‘లోకేష్, వ్యవస్ధలను మేనేజ్ చేసేది మీ నాన్న చంద్రబాబే. చీకట్లో చిదంబరంను కలిసింది.. కాళ్లు పట్టుకున్నది కూడా చంద్రబాబే. ఓటుకు కోట్లు ఇచ్చి అడ్డంగా దొరికిపోయింది చంద్రబాబే. వాట్ ఐయామ్ సేయింగ్, మనవాళ్లు బ్రీఫ్‌డ్ మీ అన్నది చంద్రబాబే. తెలంగాణలో కేసులు రాగానే కరకట్టకు పారిపోయింది చంద్రబాబే. ఇన్ని తప్పులు, ఇన్ని అక్రమాలు చేసి ఇప్పుడు ఎదురు ప్రశ్నిస్తున్నారా?’’ అంటూ ఎమ్మెల్యే చంద్రశేఖర్‌రెడ్డి దుయ్యబట్టారు.
చదవండి: ఏపీ రాజకీయాల్లో అపరిచితుడు ఈయనే!
Comments
Please login to add a commentAdd a comment